ఈ-కార్‌ రేస్‌ కేసులో అధికారులకు ఈడీ మళ్లీ సమన్లు | Ed Summons Officials Again In E Car Race Case | Sakshi
Sakshi News home page

ఈ-కార్‌ రేస్‌ కేసులో అధికారులకు ఈడీ మళ్లీ సమన్లు

Published Thu, Jan 2 2025 6:30 PM | Last Updated on Thu, Jan 2 2025 7:23 PM

Ed Summons Officials Again In E Car Race Case

సాక్షి, హైదరాబాద్‌: ఈ-కార్‌ రేస్‌ కేసులో అధికారులకు ఈడీ మళ్లీ సమన్లు జారీ చేసింది. 8, 9 తేదీల్లో తప్పకుండా హాజరుకావాలని హెచ్‌ఎండీఏ మాజీ చీఫ్‌ ఇంజినీర్‌ బీఎల్‌ఎన్‌రెడ్డి, అరవింద్‌కుమార్‌లకు ఈడీ నోటీసులు ఇచ్చింది. అయితే, నేడు ఈడీ విచారణకు వారు హాజరు కావాల్సి ఉండగా.. విచారణకు మరింత సమయం కావాలని ఈడీ అధికారులను కోరారు. దీంతో 8, 9 తేదీల్లో హాజరుకావాల్సిందేనని ఈడీ స్పష్టం చేసింది.

తెలంగాణలో ఫార్ములా ఈ-కారు రేసు కేసు ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ కేసు విచారణలో ఈడీ అధికారులు స్పీడ్‌ పెంచారు. రేపు ఈడీ విచారణకు ఐఏఎస్‌ అరవింద్‌ కుమార్‌ విచారణకు హాజరవనున్నారు. ఈనెల ఏడో తేదీన కేటీఆర్‌.. ఈడీ ఎదుట హాజరు కానున్నారు.

ఈ కేసులో కేటీఆర్‌ను ఈడీ అధికారులు విచారించనున్నారు. ఇక, ఫార్ములా ఈ-కారు రేసు కేసులో కేటీఆర్‌-ఏ1, ఐఏఎస్‌ అరవింద్‌ కుమార్‌-ఏ2, బీఎల్‌ఎన్‌ రెడ్డి-ఏ3గా ఉన్నారు. అయితే, కారు కేసులో ఫెమా నిబంధనలు ఉల్లఘించినట్టు ఈడీ పేర్కొంది. ఇందులో భాగంగానే ఈడీ.. ఈసీఐఆర్‌ నమోదు చేసినట్టు అధికారులు తెలిపారు. రూ.55కోట్ల విదేశీ కంపెనీ ఎఫ్‌ఈవోకు సంబంధించిన బదిలీలపై ఈడీ విచారించనుంది.

ఇదీ చదవండి: రెండు రోజుల్లో సర్కార్‌ అవినీతి స్కాం బయటపెడతా: ఏలేటి మహేశ్వర్‌రెడ్డి

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement