అమిత్‌ షాపై కాంగ్రెస్‌ ప్రివిలేజ్‌ మోషన్‌ | Congress Moves Privilege Motion Against Amit Shah | Sakshi
Sakshi News home page

అమిత్‌ షాపై కాంగ్రెస్‌ ప్రివిలేజ్‌ మోషన్‌

Published Fri, Aug 2 2024 7:56 PM | Last Updated on Fri, Aug 2 2024 8:20 PM

Congress Moves Privilege Motion Against Amit Shah

ఢిల్లీ : కేరళ వయనాడ్‌ విషాదంపై ప్రతిపక్ష కాంగ్రెస్‌ కీలక నిర్ణయం తీసుకుంది. రాజ్యసభలో హోం మంత్రి అమిత్‌ షాపై పార్టీ తరుఫున కాంగ్రెస్‌ ఎంపీ జయరామ్‌ రమేష్‌  ప్రివిలేజ్ మోషన్‌ను ప్రవేశపెట్టారు.

వయనాడ్‌ విలయంపై బుధవారం రాజ్యసభలో అమిత్‌ షా మాట్లాడారు. జులై 23నే వయనాడ్ విలయంపై కేరళ సీఎం పినరయ్ విజయన్‌కి కేంద్ర బలగాలు హెచ్చరించాయని, అయితే ఆ హెచ్చరికలను పట్టించుకోలేదని అన్నారు. 

అమిత్‌షా వ్యాఖ్యాల్ని జైరామ్‌ రమేష్‌ ఖండించారు.‘ వయనాడ్‌ విపత్తు గురించి కేంద్రం ముందే కేరళ రాష్ట్రానికి హెచ్చరికలు జారీ చేసిందంటూ అమిత్‌ షా చేసిన వ్యాఖ్యలు రాజ్యసభను, సభ సభ్యుల్ని తప్పుదోవ పట్టించేలా ఉన్నాయని స్పష్టమైంది.’ అని జైరామ్‌ జారీ చేసిన ప్రివిలేజ్ మోషన్‌ నోటీసుల్లో పేర్కొన్నారు.

 అమిత్‌షా వ్యాఖ్యలు 
 బుధవారం (జూలై 31న) రాజ్యసభలో అమిత్‌ షా మాట్లాడుతూ జూలై 23న కేరళ ప్రభుత్వానికి కొండచరియలు విరిగిపడతాయనే ముందస్తు హెచ్చరిక జారీ చేసినట్లు  పేర్కొన్నారు . జూలై 23న, ఘటన జరగడానికి ఏడు రోజుల ముందు కేరళ ప్రభుత్వానికి కేంద్రం ముందస్తు హెచ్చరికలు చేసిందని, ఆ తర్వాత జూలై 24, 25 తేదీల్లో మరోసారి హెచ్చరించామని, జూలై 26న సైతం మరోసారి అప్రమత్తం చేశామని  పునరుద్ఘాటించారు.  20 సెంటీమీటర్ల కంటే ఎక్కువ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, కొండచరియలు విరిగిపడే అవకాశం ఉందని సమాచారం ఇచ్చినట్లు పేర్కొన్నారు.  

 

 

సహాయక చర్యలకు ఆటంకం
వాయనాడ్‌లో కొండచరియలు విరిగిపడటంతో 300 మందికి పైగా మరణించారు. 200 మందికి పైగా గాయపడ్డారు. ఇప్పటికీ కూలిపోయిన భవనాలలో, శిధిలాల కింద చిక్కుకున్న వారి కోసం అన్వేషణ కొనసాగుతోంది. ఇటువంటి పరిస్థితులు ఇళ్లు, ఇతర భవనాలపై పడిన మట్టి, నేలకూలిన చెట్లను తొలగించడం అత్యవసర సిబ్బందికి కష్టతరం చేసింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement