Jai ram ramesh
-
తెరపైకి ‘హమ్ అదానీ కె హై’.. మళ్లీ జేపీసీ డిమాండ్
ఢిల్లీ: అదానీ గ్రూప్ సంస్థ గౌతమ్ అదానీపై అమెరికాలో కేసు నమోదు కావడంపై కాంగ్రెస్ పార్టీ స్పందించింది. ఆయన వ్యవహారాలపై దర్యాప్తునకు సంయుక్త పార్లమెంటరీ కమిటీ(జేపీసీ) ఏర్పాటు చేయాలనే డిమాండ్‌ను మరోసారి తెరపైకి తీసుకొచ్చింది.లంచం, మోసం చేశారనే అభియోగాలపై అదానీతో పాటు మరో ఏడుగురిపై కేసులు నమోదు చేసినట్లు న్యూయార్క్ ఫెడరల్ ప్రాసిక్యూటర్లు వెల్లడించడం తెలిసిందే. ఈ ఆరోపణలతో స్టాక్‌మార్కెట్ సైతం కుదేలైంది. మరోపక్క.. రాజకీయంగానూ ఈ వ్యవహారం దుమారం రేపుతోంది.‘మోదాని’ స్కామ్స్‌పై జేపీసీ ఏర్పాటు చేయాలని 2023 జనవరి నుంచి డిమాండ్ చేస్తున్నాం. అయితే.. ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీపై అమెరికాలో కేసు నమోదైన నేపథ్యంలో సంయుక్త పార్లమెంటరీ కమిటీ ఏర్పాటు చేయాలనే డిమాండ్‌కు బలం చేకూరుతోంది అని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జైరాం రమేష్ ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. అలాగే.. The indictment of Gautam Adani and others by the Securities and Exchanges Commission (SEC) of the US vindicates the demand that the Indian National Congress has been making since Jan 2023 for a Joint Parliamentary Committee (JPC) investigation into the various Modani scams. The…— Jairam Ramesh (@Jairam_Ramesh) November 21, 2024न्यूयॉर्क के पूर्वी ज़िले के अमेरिकी अटॉर्नी कार्यालय द्वारा गौतम अडानी और उनसे जुड़े अन्य लोगों पर गंभीर आरोप लगाना उस मांग को सही ठहराता है जो भारतीय राष्ट्रीय कांग्रेस जनवरी 2023 से विभिन्न मोदानी घोटालों की संयुक्त संसदीय समिति (JPC) जांच के लिए कर रही है। कांग्रेस ने हम…— Jairam Ramesh (@Jairam_Ramesh) November 21, 2024 ‘హమ్ అదానీ కె హై’ సిరీస్‌లో ఇప్పటివరకు వందలాది ప్రశ్నలు సంధించామని, మోదీ, అదానీ బంధంపై వేసిన ప్రశ్నలకు ఇంతవరకు సమాధానం రాలేదని జైరాం రమేష్ విమర్శ గుప్పించారు.గతంలో.. అదానీ సంస్థ తన షేర్లలో అవకతవకలకు పాల్పడుతోందని, ఖాతాల్లో మోసాలు చేస్తోందంటూ అమెరికాకు చెందిన పెట్టుబడుల పరిశోధనా సంస్థ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ ఇచ్చిన నివేదిక మార్కెట్ వర్గాల్లో తీవ్ర దుమారానికి దారితీసింది. ఈ ఆరోపణలను అదానీ గ్రూప్ తీవ్రంగా ఖండించింది. అయినప్పటికీ ఈ మొత్తం వ్యవహారంపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ లేదంటే సుప్రీంకోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు జరిపించాలని కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలు ఆ సమయంలో పార్లమెంట్ సమావేశాల్లోనూ డిమాండ్ చేశాయి.అదానీపై తాజా అభియోగాలివే..ఇదిలా ఉంటే.. అదానీ, దాని అనుబంధ సంస్థలు 20 ఏళ్లలో 2 బిలియన్ డాలర్ల లాభం పొందగల సౌరశక్తి సరఫరా ఒప్పందాలను పొందేందుకు భారత ప్రభుత్వ అధికారులకు సుమారు 265 మిలియన్ డాలర్లు లంచాలు చెల్లించినట్లు ప్రాసిక్యూటర్లు ఆరోపిస్తున్నారు. ఆపై.. అమెరికా, అంతర్జాతీయ మదుపర్లకు తప్పుడు సమాచారం తెలియజేసి నిధులు సమీకరించేందుకు కంపెనీ ప్రయత్నించినట్లు వాళ్లు పేర్కొన్నారు. అలాగే..తద్వారా.. అదానీ గ్రీన్ ఎనర్జీలో అక్రమ మార్గాల ద్వారా.. ఆ కంపెనీ రుణ దాతలు, పెట్టుబడిదారుల నుంచి 3 బిలియన్ డాలర్లకు పైగా రుణాలు, బాండ్లను సేకరించిందని ఆరోపించారు. న్యూయార్క్ ప్రాసిక్యూటర్లు అభియోగాలు మోపారు. దీంతో గౌతమ్ అదానీ, ఆయన బంధువు సాగర్ అదానీ సహా మరో ఏడుగురిపై కేసులు నమోదు చేసినట్లు అధికారులు పేర్కొన్నారు.ఇదే సమయంలో సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్(SEC) మరో సివిల్ కేసు నమోదు చేసింది. యూఎస్ సెక్యూరిటీ చట్టాలను ఉల్లంఘించి అదానీ గ్రీన్ ఎనర్జీ అమెరికా ఇన్వెస్టర్ల నుంచి 175 మిలియన్ డాలర్లకు పైగా సమీకరించిందని అందులో ఆరోపించింది. దీనిపై దర్యాప్తు జరిపి జరిమానాతో పాటు కంపెనీపై ఆంక్షలు విధించాలని రెగ్యులేటర్ కోరింది. ఈ వార్తలపై అదానీ గ్రూప్ స్పందించాల్సి ఉంది. -
ఎన్టీఏ ఛైర్మన్ రికార్డుపై సందేహాలు: కాంగ్రెస్
ఢిల్లీ: నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ఒక అవుట్ సోర్సింగ్ ఏజెన్సీగా వ్యవహరిస్తోందని కాంగ్రెస్ పార్టీ విమర్శలు గుప్పించింది. ఎన్టీఏ అధికారిక వెబ్సైట్లో ఏజెన్సీకి సబంధించి సమాచారం చాలా తక్కవగా ఉందని టీఎంసీ ఎంపీ సాగరికా ఘోష్ ప్రశ్నించిన నేపథ్యంలో కాంగ్రెస్ ఎన్టీఏపై ఆరోపణలు చేసింది.‘‘ఎన్టీఏ ఏకైక పని అవుట్సోర్స్ చేయడం మాత్రమే. దీని ఛైర్మన్ ప్రదీప్ కుమార్ జోషీ.. మధ్యప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఛైర్మన్‌గా పనిచేసిన సమయంలో చాలా సందేహాస్పదమైన రికార్డును కలిగి ఉన్నారు’’ అని కాంగ్రెస్ నేత జైరాం రమేస్ ‘ఎక్స్’వేదికగా విమర్శలు చేశారు.The only job of NTA appears to be to outsource. Its Chairman has a very dubious record as Chairman of the Madhya Pradesh Public Service Commission. https://t.co/DhBa5KDSos— Jairam Ramesh (@Jairam_Ramesh) August 3, 2024ఇక.. నీట్‌తో సహా 17 ప్రధాన పరీక్షలకు బాధ్యత వహించే ఎన్టీఏ తన వెబ్సైట్లో ఏజెన్సీ గురించి చాలా తక్కువ సమాచారం అందుబాటులో ఉంచిందని.. ఇలా ఎందుకు పరిమితమైన సమాచారం ఇస్తోందని అడుగుతూ శుక్రవారం టీఎంసీ ఎంపీ సాగరికా ఘోష్ విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌కు లేఖ రాశారు. ‘అధికారులు ఎవరు? ఏజెన్సీ వార్షిక నివేదికలు ఎక్కడ ఉన్నాయి? భవిష్యత్ పరీక్షల కోసం ప్రజల విశ్వాసాన్ని పెంచుకోవడానికి ఎన్టీఏ తన వెబ్సైట్లో ఏజెన్సీకి సంబంధించి మరింత సమాచారాన్ని అందించాలి’ అని లేఖలో పేర్కొన్నారు. -
అమిత్ షాపై కాంగ్రెస్ ప్రివిలేజ్ మోషన్
ఢిల్లీ : కేరళ వయనాడ్ విషాదంపై ప్రతిపక్ష కాంగ్రెస్ కీలక నిర్ణయం తీసుకుంది. రాజ్యసభలో హోం మంత్రి అమిత్ షాపై పార్టీ తరుఫున కాంగ్రెస్ ఎంపీ జయరామ్ రమేష్ ప్రివిలేజ్ మోషన్‌ను ప్రవేశపెట్టారు.వయనాడ్ విలయంపై బుధవారం రాజ్యసభలో అమిత్ షా మాట్లాడారు. జులై 23నే వయనాడ్ విలయంపై కేరళ సీఎం పినరయ్ విజయన్‌కి కేంద్ర బలగాలు హెచ్చరించాయని, అయితే ఆ హెచ్చరికలను పట్టించుకోలేదని అన్నారు. Jairam Ramesh moves Privilege Motion notice in RS against Amit Shah for his "Early Warning" claims on Wayanad landslidesRead @ANI Story | https://t.co/CxdeAeJx55#AmitShah #Congress #Wayanad #Kerala #landslides pic.twitter.com/fL7FrNmIKj— ANI Digital (@ani_digital) August 2, 2024అమిత్‌షా వ్యాఖ్యాల్ని జైరామ్ రమేష్ ఖండించారు.‘ వయనాడ్ విపత్తు గురించి కేంద్రం ముందే కేరళ రాష్ట్రానికి హెచ్చరికలు జారీ చేసిందంటూ అమిత్ షా చేసిన వ్యాఖ్యలు రాజ్యసభను, సభ సభ్యుల్ని తప్పుదోవ పట్టించేలా ఉన్నాయని స్పష్టమైంది.’ అని జైరామ్ జారీ చేసిన ప్రివిలేజ్ మోషన్ నోటీసుల్లో పేర్కొన్నారు. అమిత్‌షా వ్యాఖ్యలు బుధవారం (జూలై 31న) రాజ్యసభలో అమిత్ షా మాట్లాడుతూ జూలై 23న కేరళ ప్రభుత్వానికి కొండచరియలు విరిగిపడతాయనే ముందస్తు హెచ్చరిక జారీ చేసినట్లు పేర్కొన్నారు . జూలై 23న, ఘటన జరగడానికి ఏడు రోజుల ముందు కేరళ ప్రభుత్వానికి కేంద్రం ముందస్తు హెచ్చరికలు చేసిందని, ఆ తర్వాత జూలై 24, 25 తేదీల్లో మరోసారి హెచ్చరించామని, జూలై 26న సైతం మరోసారి అప్రమత్తం చేశామని పునరుద్ఘాటించారు. 20 సెంటీమీటర్ల కంటే ఎక్కువ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, కొండచరియలు విరిగిపడే అవకాశం ఉందని సమాచారం ఇచ్చినట్లు పేర్కొన్నారు. #WATCH। केरल में हुई घटना में जितने भी लोग हताहत हुए हैं, उनके परिवार के प्रति मैं संवेदना प्रकट करता हूं। @AmitShah #Budget2024 #WayanadLandslide #RajyaSabha @mygovindia @AmitShahOffice pic.twitter.com/4Hfrrk335E— SansadTV (@sansad_tv) July 31, 2024 సహాయక చర్యలకు ఆటంకంవాయనాడ్లో కొండచరియలు విరిగిపడటంతో 300 మందికి పైగా మరణించారు. 200 మందికి పైగా గాయపడ్డారు. ఇప్పటికీ కూలిపోయిన భవనాలలో, శిధిలాల కింద చిక్కుకున్న వారి కోసం అన్వేషణ కొనసాగుతోంది. ఇటువంటి పరిస్థితులు ఇళ్లు, ఇతర భవనాలపై పడిన మట్టి, నేలకూలిన చెట్లను తొలగించడం అత్యవసర సిబ్బందికి కష్టతరం చేసింది. #WATCH | Search and rescue operations continue in landslide-affected areas in Kerala's Wayanad. Drone visuals from the Chooralmala area.The death toll stands at 308. pic.twitter.com/cCuYjVpE9A— ANI (@ANI) August 2, 2024 -
ఆరోజు ‘మోదీ ముక్తీ దివస్’.. బీజేపీకి జైరాం రమేష్ కౌంటర్
ఢిల్లీ: దేశంలో రాజకీయం మరోసారి హీటెక్కింది. దివంగత ప్రధాని ఇందిరా గాంధీ 1975 జూన్ 25వ తేదీన ఎమర్జెన్సీ విధించిన రోజును సంవిధాన్ హత్యా దివస్(రాజ్యాంగ హత్యా దినం)గా కేంద్రం ప్రకటించడంతో కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ టార్గెట్ చేశారు.కేంద్రం ప్రకటనపై జైరాం రమేష్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఈ క్రమంలో ఆయన..‘ఈ ఏడాది జూన్ 4న దేశ ప్రజలు మోదీకి నైతిక, వ్యక్తిగీత, రాజకీయ ఓటమిని కట్టబెట్టి చరిత్రలో ‘మోదీ ముక్తీ దివస్’ను లిఖించారు. రాజ్యాంగ విలువలు, సిద్ధాంతాలపై ఓ పద్ధతి ప్రకారం మోదీ దాడికి తెగబడ్డారు.మనుస్మృతి ఆధారంగా రాజ్యాంగాన్ని రూపొందించలేదని పేర్కొంటూ భారత రాజ్యాంగాన్ని సంఘ్ పరివార్ వ్యతిరేకించిందని గుర్తుచేశారు’ దీంతో, ఆయన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.Yet another headline grabbing exercise in hypocrisy by the non-biological PM who had imposed an undeclared Emergency for ten long years before the people of India handed him a decisive personal, political, and moral defeat on June 4, 2024 - which will go down in history as…— Jairam Ramesh (@Jairam_Ramesh) July 12, 2024ఇదిలా ఉండగా.. జూన్ 25ను సంవిధాన్ హత్యా దివస్‌గా ప్రకటిస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని అమిత్ షా ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేశారు. మరోవైపు.. ఎమర్జెన్సీ చీకటి రోజుల్లో లక్షలాది మందిని కటకటాల్లోకి నెట్టారని బీజేపీ ఆరోపిస్తోంది. ఎమర్జెన్సీ రోజులకు నిరసనగా సంవిధాన్ హత్యా దివస్‌ను పాటించాలని కేంద్రం నిర్ణయించింది. ఇందిరా గాంధీ ఎమర్జెన్సీ విధించి దేశంలో చీకటి అధ్యాయానికి తెరలేపారని ప్రధాని నరేంద్ర మోదీ సహా బీజేపీ అగ్రనేతలు వీలుచిక్కినప్పుడల్లా కాంగ్రెస్‌పై విరుచుకుపడుతున్న సంగతి తెలిసిందే. -
‘ మోదీ అంతరిక్షంలోకి వెళ్లే ముందు.. మణిపూర్ వెళ్లాలి’
ఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్రమోదీపై కాంగ్రెస్ సీనియర్‌నేత జైరాం రమేష్ విమర్శలు గుప్పించారు. అంతరిక్షంలో వెళ్లే ముందు ప్రధాని మోదీ మణిపూర్ వెళ్లిరావాలని అన్నారు. 2025లో భారత్ ప్రయోగించనున్న తొలి మానవసహిత అంతరిక్ష యాత్ర ‘గగన్ యాన్’లో ప్రధాని మోదీని పంపిస్తామని ఇస్రో ఛైర్మన్ ఎస్. సోమనాథ్ తెలిపినట్లు ఓ మీడియా సంస్థ నివేదికను వెల్లడించింది.'Before he goes into space, the non-biological PM should go to Manipur': Jairam RameshRead @ANI Story | https://t.co/TSJfrNXiVO#JairamRamesh #PMModi #ManipurViolence pic.twitter.com/H8cumSd55V— ANI Digital (@ani_digital) July 4, 2024 దీనిపై జైరాం రమేష్ గురువారం ‘ఎక్స్’ వేదికగా విమర్శించారు. ‘ప్రధాని మోదీ అంతరిక్షంలోకి వెళ్లేముందు. ఆయన మణిపూర్ రాష్ట్రానికి వెళ్లిరావాలి’ అని అన్నారు.‘ప్రధాని మోదీకి అనేక బాధ్యతలు ఉన్నప్పటికీ మానవ అంతరిక్ష యాత్ర కార్యక్రమం గగన్‌యాన్ అభివృద్ధిలో ఆయన్ను భాగస్వామిని చేయటంలో ఆసక్తిగా ఉన్నాం. ముఖ్యంగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ISS) వ్యోమగామి శిక్షణ అందించటంలో సహకరిస్తాం. అంతరిక్షంలోకి ప్రధానిని పంపించే సత్తా సాధిస్తే.. మనందరికీ చాలా గర్వంగా ఉంటుంది’ అని సోమనాథ్ తెలిపినట్లు మీడియా నివేదికలో పేర్కొంది. -
‘మోదీ 1/3 పీఎం మాత్రమే’.. కాంగ్రెస్ నేత జైరాం రమేష్ విమర్శలు
ఢిల్లీ: కాంగ్రెస్ అగ్రనేత జైరాం రమేష్ నరేంద్ర మోదీపై తీవ్ర విమర్శలు చేశారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ పార్టీ భారీ నష్టాన్ని మూటగట్టుకుందని అన్నారు. నరేంద్ర మోదీ ఇక నుంచి ఒకటిలో మూడో వంతు ప్రధాని (1/3 పీఎం)గా కొనసాగుతారని ఎద్దేవా చేశారు. కూటమిలో భాగంగా జేడీ(యూ) చీఫ్ నితీష్కుమారు, టీడీపీ చీఫ్ చంద్రబాబుతో కలిసి మోదీ ‘1/3 పీఎం’ అవుతారని అన్నారు.బీజేపీ ప్రజాస్వామ్యం కంటే పదవుల కుర్చినే ఎక్కువగా నమ్ముతుందని మండిపడ్డారు. ఎన్డీయే కూటమి ఎక్కువ కాలం ఉండలేదని అన్నారు. చంద్రబాబు, నితీష్ కుమార్ ఇద్దరూ.. ఎప్పటికైనా ఎన్డీయే కూటమి నుంచి బయటకువెళ్లే వ్యక్తులేనని అన్నారు.లోక్‌సభ ఎన్నికలలో బీజేపీ సొంతంగా పూర్తి మెజార్టీ స్థానాలు గెలుచుకోలేకపోయింది. దీంతో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటంకోసం ఎన్డీయే కూటమి పార్టీల మద్దతు తీసుకుంది. అందులో భాగంగానే ఎన్డీయే కూటమిలో జేడీ(యూ) నితీష్ కుమార్, టీడీపీ చంద్రబాబు కీలకంగా మారారు. బీజేపీ సొంతంగా 240 సీట్లు మత్రామే గెలుచుకుంది. మ్యాజిక్ ఫిగర్ 272. ప్రస్తుతం ఎన్డీయే కూటమిలో మొత్తం ఎంపీల సంఖ్య 293గా ఉంది. -
సుశీల్ మోదీ మృతి: కాంగ్రెస్ నేతల సంతాపం
పాట్నా: బీజేపీ సీనియర్ నేత సుశీల్ కుమార్ మోదీ మృతికి ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ నేతలు సంతాపం తెలిపారు. వీరితో పాటు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ కూడా సంతాపం తెలిపారు.''బీహార్ మాజీ ఉప ముఖ్యమంత్రి, సీనియర్ నాయకుడు సుశీల్ మోదీ జీ మృతి పట్ల ఆయన కుటుంబ సభ్యులకు, మద్దతుదారులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. మన సిద్ధాంతాలు వేరు, కానీ ప్రజాస్వామ్యంలో దేశ ప్రయోజనాలే ప్రధానం. జీఎస్టీ కౌన్సిల్లో ఆయన గణనీయమైన కృషి చేశారు. భగవంతుడు ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను'' అంటూ మల్లికార్జున్ ఖర్గే తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో ట్వీట్ చేశారు.बिहार के पूर्व उपमुख्यमंत्री व वरिष्ठ नेता, श्री सुशील मोदी जी के निधन पर उनके परिवारजनों व समर्थकों के प्रति गहरी संवेदनाएँ। हमारी विचारधारा अलग थी, पर लोकतंत्र में देश हित सर्वोपरि होता है। उन्होंने GST कॉउंसिल में अपना महत्वपूर्ण योगदान दिया था। ईश्वर दिवंगत आत्मा को शांति…— Mallikarjun Kharge (@kharge) May 14, 2024కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ ట్వీట్ చేస్తూ.. ఈ రోజు తెల్లవారుజామున బీహార్ మాజీ డిప్యూటీ సీఎం, మాజీ రాజ్యసభ ఎంపీ సుశీల్ మోదీ మరణం గురించి చదివాను. అతను, నేను పూర్తిగా వ్యతిరేఖ రాజకీయాలకు చెందినవారము. ఐడియాలజీలు మాత్రం ఒకేలా దేఅభివృద్దే ప్రధానంగా ఉండేది. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు కొంతకాలం బీహార్ ఆర్థిక మంత్రిగా ఉన్నారు. ఆ తరువాత రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో ఆయన నాతో కొద్ది రోజులు గడిపారు. ముఖ్యంగా రాష్ట్ర ఆర్థిక వ్యవహారాలపై ఆయనకు చాలా అవగాహన ఉందని పేర్కొన్నారు.Early this morning, I read about the sad demise of Sushil Modi, the former Deputy CM of Bihar, a former Rajya Sabha MP, and a distinguished product of the JP Movement in Bihar during the mid-70s He and I belonged to diametrically opposed political ideologies, but that had not…— Jairam Ramesh (@Jairam_Ramesh) May 14, 2024 -
అక్కడ రాష్ట్రపతి పాలనకు సరైన సమయం: జైరాం రమేష్
చండీఘర్: దేశంలో లోక్‌సభ ఎన్నికల ప్రచార హోరు జోరుగా సాగుతోంది. ఈ తరుణంలో కాంగ్రెస్ కమ్యూనికేషన్స్ ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీ జైరాం రమేష్ అక్కడి బీజేపీ ప్రభుత్వాన్ని ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు.హర్యానాలో రాజకీయ సంక్షోభం తలెత్తింది. బీజేపీ మెజారిటీని కోల్పోయింది, రాష్ట్రపతి పాలనకు ఇది సరైన సమయం అని జైరాం రమేష్ అన్నారు. ఇటీవల ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేలు తమ మద్దతును ఉపసంహరించుకోవడంతో హర్యానా ప్రభుత్వం స్పష్టంగా మెజారిటీని కోల్పోయిందని అన్నారు. ఢిల్లీలో బీజేపీ రోజులు పోయినట్లే.. హర్యానాలో కూడా బీజేపీ ప్రభుత్వం కనుమరుగయ్యే రోజులు దగ్గర పడుతున్నట్లు జైరాం రమేష్ అన్నారు.రాష్ట్రంలో తీవ్ర రాజకీయ సంక్షోభం నెలకొన్న నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైనీ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ.. ప్రతిపక్షాలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని అన్నారు. ఇదే విషయాన్ని గవర్నర్‌కు లిఖితపూర్వకంగా రాసిన లేఖలో ప్రస్తావించారు.మే7న ఎమ్మెల్యేలు సోంబీర్ సంగ్వాన్, రణధీర్ గొల్లెన్, ధరంపాల్ గొండర్ ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌కు మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకోవడం వల్ల.. బీజేపీకి తమ మద్దతు ఇవ్వబోమని పేర్కొన్నారు. లోక్‌సభ ఎన్నికల మధ్య, ఖట్టర్ స్థానంలో నయాబ్ సైనీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన రెండు నెలల్లోనే ఈ పరిణామం చోటుచేసుకుంది.#WATCH | On political developments in Haryana, Congress General Secretary in-charge Communications, Jairam Ramesh says, "I think the Haryana Government has clearly lost its majority when the 3 independent MLAs withdrew their support. It's the right case for President's Rule. This… pic.twitter.com/Zsta46WdE9— ANI (@ANI) May 10, 2024 -
శ్యామ్ పిట్రోడా వ్యాఖ్యలపై స్పందించిన కాంగ్రెస్
ఢిల్లీ: భారత దేశంలోని భిన్నత్వంపై శ్యామ్ పిట్రోడా చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ స్పందించింది. ఆయిన చేసిన వ్యాఖ్యలు ఇప్పటికే దుమారం రేపాయి. ‘భారత దేశంలోని భిన్నత్వం గురించి శ్యామ్ పిట్రోడా అటువంటి వ్యాఖ్యలు చేయటం చాలా దృరదృష్టం. ఆమోదించదగినవి కావు. ఆయన చేసిన వ్యాఖ్యలతో కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి సంబంధం లేదు’అని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జైరాం రమేష్ ఎక్స్ వేదికగా వివరణ ఇచ్చారు.The analogies drawn by Mr. Sam Pitroda in a podcast to illustrate India's diversity are most unfortunate and unacceptable. The Indian National Congress completely dissociates itself from these analogies.— Jairam Ramesh (@Jairam_Ramesh) May 8, 2024 ‘భారత్‌లో భిన్నత్వంలో ఏకత్వం ఉంటుంది. తూర్పు వైపు ఉన్న ప్రజలు చైనా వారిని పోలి ఉంటారు. దక్షిణం వైపు ఉన్న ప్రజలు అరబ్ వారిలా ఉంటారు. ఉత్తర దిక్కు వాళ్లు అయితే నల్లగా లేదా తెల్లగా ఉంటారు. దక్షిణ భారతంలోని ప్రజలు అఫ్రికా వారిలా కనిపిస్తారు’అని శ్యామ్ పిట్రోడా ఓ ఇంటర్వ్యూలో భారత్‌లో భిన్నత్వం గురించి మాట్లాడారు. ఆయన చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేతలు తీవ్రంగా ఖండించారు. శ్యామ్ పిట్రోడా చేసిన వ్యాఖ్యలు జాత్యహంకారంతో కూడినవి బీజేపీ నేతలు మండిపడ్డారు.ఈ వ్యవహారంపై ప్రధాని మోదీ సైతం స్పందించారు. తెలంగాణలోని వరంగల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మోదీ మాట్లాడారు. ‘ శ్యామ్ పిట్రోడా వ్యాఖ్యలపై రాహుల్ గాంధీ సమాధానం చెప్పాలి. శరీర వర్ణం పేరుతో దేశ ప్రజలను ఎవరైనా అగౌరవ పరిస్తే.. ఎట్టిపరిస్థితుల్లో సహించబోము. మోదీ ఇలాంటి వాటిని అస్సలు సహించరు’అని మోదీ మండిపడ్డారు. -
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ప్రధాని నరేంద్ర మోదీ జర్మన్ నియంత హిట్లర్ మంత్రి జోసెఫ్ గోబెల్స్‌ను స్ఫూర్తిగా తీసుకున్నారని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ ఆరోపించారు.లోక్‌సభ ఎన్నికలపై ఓ ఛానల్ ఇంటర్వ్యూ జైరాం రమేష్ మాట్లాడూత.. రాజకీయ శాస్త్రంలో ఎంఏ పూర్తి చేసిన మోదీ ప్రచార విలువల గురించి జోసెఫ్ గోబెల్స్ గురించి చదివి, ఆయన నుండి ప్రేరణ పొంది ఉండి ఉంటారని ఎద్దేవా చేశారు.‘మీరు ఒక అబద్ధాన్ని పదే పదే చెప్పి, దానిని పునరావృతం చేస్తూ ఉంటే, చివరికి ప్రజలు దానిని విశ్వసిస్తారు’ అని గోబెల్స్ పేర్కొన్నారని జైరాం గుర్తు చేశారు.ప్రైవేటు ఆస్తులను సర్వే చేసి, స్వాధీనం చేసుకుంటామని కాంగ్రెస్ తన మ్యానిఫెస్టోలో బెదిరిస్తున్నదని మోదీ చేసిన వ్యాఖ్యలపై జైరాం మాట్లాడుతూ.. మోదీ కాంగ్రెస్ మేనిఫెస్టో గురించి అసత్యాలు ప్రచారం చేస్తున్నారని, ఆయన అసత్యాలు ప్రచారం చేసినంత కాలం సత్యం నశించి పోతుందని అన్నారు.ఈ సందర్భంగా కాంగ్రెస్ న్యాయ పత్రంలో వారసత్వపు పన్ను గురించి ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఎలాంటి ప్రస్తావన లేదు. కానీ బీజేపీ మాత్రం వారసత్వపు పన్ను గురించి మరోలా ప్రచారం చేస్తోందని జైరాం రమేష్ ధ్వజమెత్తారు. -
‘వన్ నేషన్.. నో ఎలక్షన్’..ఇదే ప్రధాని మోదీ ఆలోచన
సాక్షి,న్యూఢిల్లీ : ఇండియా కూటమిని చూసి బీజేపీ బయపడుతోందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జైరామ్ రమేష్ అన్నారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్‌పై ఆయన మాట్లాడారు. త్వరలో జరగబోయే లోక్‌సభ ఎన్నికల్లో ఇండియా కూటమిని చూసి బీజేపీ బయపడుతుందోని చెప్పారు. కాబట్టే జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేసి ప్రజాస్వామ్యం, రాజ్యాంగంపై దాడులకు పాల్పడిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఇవి రివెంజ్ పాలిటిక్స్. బీజేపీ ఇండియా అలయన్స్‌కు బయపడుతుంది. వరుస అరెస్ట్‌లతో ప్రజాస్వామ్యంపై దాడులు చేస్తోందని పేర్కొన్నారు. మోదీ ఆలోచన వన్ నేషన్ .. నో ఎలక్షన్. దేశం మొత్తం ఓపీడీ... వన్ పర్సన్ డిక్టేటర్ షిప్ అంటూ కాంగ్రెస్ నేత జైరామ్ రమేష్ విమర్శలు చేశారు. -
‘తెలంగాణ’ను మోదీ వద్దన్నారు
రాష్ట్రం బిల్లు పార్లమెంటులో పెట్టడం ఆయనకిష్టం లేదు. సుష్మా, రాజ్‌నాథ్, వెంకయ్య, అరుణ్‌జైట్లీలకు ఫోన్ చేసి ఒప్పుకోవద్దని ఒత్తిడి తెచ్చారు. ఈ విషయం ఇప్పటివరకు చాలామందికి తెలియదు. ఐదు రాష్ట్రాల ఫలితాలతో దేశ రాజకీయాల్లో పెద్ద మార్పు వస్తుంది. తెలంగాణలో రెండు రేసుగుర్రాల మధ్య పోటీ జరుగుతోంది జోడోయాత్ర తర్వాత ఇక్కడ బీజేపీ కనుమరుగు కావడం ప్రారంభమైంది. గెలుపు మాదే... బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎం టీంను ఓడిస్తాం -కేంద్ర మాజీ మంత్రి జైరాం రమేశ్ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రధాని మోదీకి ససేమిరా ఇష్టం లేదని, పార్లమెంటులో ఆ బిల్లు పెట్టేందుకు అంగీకరించవద్దని నాటి గుజరాత్ సీఎం హోదాలో ఆయన బీజేపీ అగ్రనేతలు సుష్మాస్వరాజ్, రాజ్‌నాథ్‌సింగ్, వెంకయ్యనాయుడు, అరుణ్జైట్లీలపై ఒత్తిడి తెచ్చారని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, కేంద్ర మాజీ మంత్రి జైరాం రమేశ్ సంచలన ఆరోపణలు చేశారు. ఈ విషయం ఇప్పటివరకు చాలా మందికి తెలియదని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణలో జాతీయ స్థాయి కలలు కంటూ పార్టీ పేరు మార్చుకున్న బీఆర్ఎస్తో పోరాడుతున్నామని, ఇక్కడ రెండు రేసుగుర్రాల మధ్య పోటీ జరుగుతోందన్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కచ్చితంగా విజయం సాధిస్తుందని, ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలతో దేశంలో రాజకీయంగా పెద్ద మార్పు వస్తుందని దీమా వ్యక్తం చేశారు. హైదరాబాద్‌కు వచ్చిన జైరాం రమేశ్ గాందీభవన్‌లో ‘సాక్షి’కి ఇంటర్వ్యూ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షలు, తొమ్మిదిన్నరేళ్ల బీఆర్ఎస్ పాలన, భారత్ జోడో యాత్ర ప్రభావం, రానున్న లోక్‌సభ ఎన్నికల్లో ఇండియా కూటమి వ్యూహం తదితర అంశాలపై ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూ విశేషాలివి! ఇవి సెమీ ఫైనల్స్ కావు... అవి ఫైనల్స్ కావు ‘ఐదు రాష్ట్రాల ఎన్నికలు సెమీఫైనల్స్ అని, సెమీఫైనల్స్‌లో గెలిచి ఫైనల్స్‌లో కూడా గెలుస్తామని నేను చెప్పను. కానీ ఈ ఫలితాల తర్వాత దేశ రాజకీయాల్లో పెద్ద మార్పు వస్తుంది. రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్‌లలో మళ్లీ మా ప్రభుత్వాలకు ప్రజామోదం వస్తుంది. మధ్యప్రదేశ్, తెలంగాణలోని ప్రభుత్వాలపై ఉన్న వ్యతిరేకత మమ్మల్ని గెలిపిస్తుంది. మిజోరంలో ఏం జరుగుతుందో ఊహించడం కష్టం. మిగిలిన వాటిలో మాత్రం 4–0తో గెలుస్తున్నాం. ఆ మూడు రాష్ట్రాల్లో మేం బీజేపీతో మాత్రమే కాదు.. ఈడీ, సీబీఐలతో పాటు ప్రధాని మోదీ దాడులు, తిట్లు, నిందారోపణలతో పోరాడుతున్నాం. అయినా గెలుస్తాం. తెలంగాణలో జాతీయస్థాయి కలలు కంటున్న బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం కూటమితో పోరాడుతున్నాం. ఆ మూడు పార్టీల టీంను ఓడించి కచ్చితంగా గెలుస్తాం. జోడేగా భారత్.. జీతేగా ఇండియా ప్రస్తుతం మా దృష్టంతా ఐదు రాష్ట్రాల ఎన్నికలపైనే ఉంది. ఈ ఎన్నికలైన తర్వాత ఇండియా కూటమి మళ్లీ సమావేశమవుతుంది. కనీస ఉమ్మడి కార్యాచరణను రూపొందించుకుంటుంది. సీట్ల పంపకాలతో పాటు సమష్టి వ్యూహాన్ని రూపొందించుకుంటాం. ఇండియా కూటమికి కావాల్సింది బలహీన కాంగ్రెస్ కాదు. బలమైన కాంగ్రెస్ ఉంటేనే కూటమి ముందుకెళుతుంది. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత దేశ రాజకీయాల్లో పెద్ద మార్పు వస్తుంది. గత 15 నెలలుగా పుంజుకున్నాం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ 15 నెలలుగా పుంజుకుంటోంది. భారత్‌జోడో యాత్రకు ముందు తెలంగాణలో భిన్న రాజకీయ వాతావరణం ఉంది. బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అన్నట్టు అప్పుడు ఉండేది. రాష్ట్రంలోని 8 జిల్లాలు, 12 రోజులు, 405 కిలోమీటర్ల పాటు రాహుల్‌గాందీ తిరిగిన తర్వాత పరిస్థితిలో మార్పు వచ్చింది. దీంతో తెలంగాణలో బీజేపీ కనుమరుగు కావడం ప్రారంభమైంది. ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్ అనే రెండు రేసు గుర్రాల మధ్య పోటీ జరుగుతోంది. ఆ నాలుగు నెరవేరలేదు తెలంగాణ ఏర్పాటుకు ముందు సంపదనంతా హైదరాబాద్‌లోనే కేంద్రీకరించారని అనేవారు. కానీ రాష్ట్రం ఏర్పాటయిన తొమ్మిది, పదేళ్ల తర్వాత కూడా అదే పరిస్థితి ఉంది. రాజకీయ అధికార పంపిణీ కోసం తెలంగాణ కావాలని అడిగారు. కానీ ఇప్పుడు తెలంగాణలో సీఎం, ఆయన కుమారుడు, కుమార్తె, అల్లుడి చేతిలోనే రాజకీయ అధికారం ఉంది. ఉద్యోగాలు రావడం లేదని తెలంగాణ అడిగారు. ముల్కీలకు ఉపాధి కోసం ఉద్యమం నడిపారు. కానీ ఇప్పుడు తొమ్మిదేళ్ల తర్వాత నిరుద్యోగంలో తెలంగాణ దేశంలోనే నెంబర్‌వన్‌గా నిలిచింది. సామాజిక న్యాయం కోసం తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయాలనే డిమాండ్ వచ్చింది. కానీ, ఫామ్‌హౌస్ పాలనలో దళితులు, ఆదివాసీలు, మైనార్టీలు, బీసీల ఆకాంక్షలకు స్థానం లేకుండా పోయింది. తెలంగాణ ఏర్పాటయిన తర్వాత కూడా ఆ నాలుగు ఆకాంక్షలు నెరవేరలేదు. పదేళ్లు చాలా ఎక్కువ సమయం తెలంగాణ అభివృద్ధి విషయంలో పదేళ్లు అంటే చాలా ఎక్కువ సమయం. బీఆర్ఎస్ నిరంకుశ వైఖరి కారణంగా రాష్ట్రం అలాగే ఉండిపోయింది. ఎనిమిదో నిజాంలాగా కేసీఆర్ పాలిస్తున్నాడు. కేటీఆర్ తొమ్మిదో నిజాం అవుతాడు. కవిత తొలి మహిళా నిజాం అయినా ఆశ్చర్యం లేదు. సామాజిక, ఆర్థికాభివృద్ధి పునాదులపై జరిగిన తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలకు ఈ పరిణామం అసలు మంచిది కాదు. అనివార్యత ఏమీ లేదు మేం తెలంగాణ ఇస్తామని చెప్పినప్పుడు అనివార్య పరిస్థితులేమీ లేవు. శ్రీకృష్ణ కమిషన్ తెలంగాణ ఇవ్వొద్దని చెప్పింది. ఇవ్వాలని, ఇవ్వొద్దని రెండు బలమైన డిమాండ్లు ఉండేవి. కానీ మేం రాజకీయ నిర్ణయం తీసుకున్నాం. తెలంగాణ ఇవ్వాలనే అభిప్రాయానికి వచ్చాం. తెలంగాణ ఏర్పాటు చరిత్రలో చాలా కీలకమైన రోజు 2013, జూలై31. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఆ రోజున రాష్ట్ర ఏర్పాటుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. అప్పుడు ఉద్యమం వేడి మీద లేదు. తెలంగాణ ఇవ్వాలన్నది చాలా సంక్లిష్ట నిర్ణయం. అందుకు రాజకీయంగా భారీ మూల్యం కూడా చెల్లించుకున్నాం. ఆ రహస్యం చాలా మందికి తెలియదు ‘తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లుపై 2014, ఫిబ్రవరి 18న లోక్‌సభలో, 20న రాజ్యసభలో చర్చ జరిగింది. అంతకు రెండు రోజుల ముందు ఫిబ్రవరి 16న కాంగ్రెస్, బీజేపీ నేతల సమావేశం జరిగింది. వెంకయ్య, సుష్మాస్వరాజ్, అరుణ్‌జైట్లీ, రాజ్‌నాథ్‌సింగ్‌లు తెలంగాణ ఏర్పాటుకు ఒప్పుకున్న వారే. కానీ వీరిపై ఒక వ్యక్తి తీవ్ర ఒత్తిడి తెచ్చారు. తెలంగాణ బిల్లును పార్లమెంటులో బిల్లు పెట్టేందుకు అంగీకరించవద్దని వారికి ఫోన్లు చేశాడు. ఆయన ఎవరో కాదు... మోదీ. ఆయన అధికారంలోకి వచ్చాక తానే చేయాలని అనుకున్నాడో, అసలు తెలంగాణే వద్దనుకున్నాడో తెలియదు కానీ, మీటింగ్‌కు వచ్చిన వారిని మాత్రం ఒత్తిడి చేశాడు.’ అని చెప్పిన జైరాం రమేశ్ ఈ విషయం చాలా మందికి తెలియదని, ఇప్పుడు ‘సాక్షి’ ద్వారానే చెబుతున్నానని వెల్లడించారు. -
బాలీవుడ్ హీరో విల్లా వేలానికి నోటీసులు.. అంతలోనే ట్విస్ట్
బీజేపీ ఎంపీ, సినీ నటుడు సన్నీడియోల్‌కు చెందిన బంగ్లా వేలం నోటీసును ఉపసంహరించుకోవడం కలకలం రేపుతోంది. ఈ మేరకు ప్రభుత్వ యాజమాన్యంలోని బ్యాంక్ ఆఫ్ బరోడా సోమవారం ఒక ప్రకటన విడుదల చేసింది."అజయ్ సింగ్ డియోల్ అలియాస్ సన్నీ డియోల్‌కు సంబంధించి అమ్మకపు వేలం నోటీసుకు సంబంధించి ఇ-వేలంకు సంబంధించిన కొరిజెండం సాంకేతిక కారణాల వల్ల ఉపసంహరించబడింది" అని బ్యాంక్ ఆఫ్ బరోడా వెల్లడించింది. (అప్పుడు ఆఫీసు బోయ్..ఇపుడు ఎవ్వరూ ఊహించని శిఖరాలకు!) తాజా పరిణామంపై విమర్శలకు తావిచ్చింది. దీనిపై కాంగ్రెస్ నేత జైరాం రమేష్ ఎక్స్ (ట్విటర్)లో విస్మయాన్ని వ్యక్తం చేశారు. వేలం నోటీసు జారీ చేసిన 24 గంటలలోపు దాన్ని విత్‌డ్రా చేసుకోవడంపై ఆయన మండిపడ్డారు. బీవోబీ ప్రకటించిన టెక్నికల్ కారణాలను ఎవరు లేవనెత్తారు అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. (ఎస్‌డబ్ల్యూపీ అంటే? నెక్ట్స్ మంత్ నుంచే ఆదాయం పొందొచ్చా? ) Yesterday afternoon the nation got to know that Bank of Baroda had put up the Juhu residence of BJP MP Sunny Deol for e-auction since he has not paid up Rs 56 crore owed to the Bank. This morning, in less than 24 hours, the nation has got to know that the Bank of Baroda has… — Jairam Ramesh (@Jairam_Ramesh) August 21, 2023 బ్యాంకును సంప్రదించారంటున్న బీవోబీ జుహు బంగ్లాను వేలనోటీసుల నేపథ్యంలో రుణగ్రహీత (సన్నీ డియోల్), బకాయలను చెల్లించేందుకు తమను సంప్రదించినట్లు బరోడాకు చెందిన బీవోబీ బ్యాంకు తన ప్రకటనలో వెల్లడించింది. నోటీసులోని మొత్తం బకాయిలు రికవరీ చేయాల్సిన బకాయిల ఖచ్చితమైన పరిమాణాన్ని పేర్కొనలేదని బ్యాంక్ తెలిపింది.అలాగే ప్రాపర్టీ సంకేత స్వాధీనత ఆధారంగా నోటీసు లిచ్చామని, "...సెక్యూరిటీ ఇంటరెస్ట్ (ఎన్ఫోర్స్మెంట్) రూల్స్ 2002లోని రూల్ 8(6) ప్రకారం ఆస్తిని స్వాధీనం చేసుకోవడం ఆధారంగా విక్రయ నోటీసు అందించినట్టు వివరణ ఇచ్చింది. pic.twitter.com/L4BdXxeuyN — Bank of Baroda (@bankofbaroda) August 21, 2023 కాగా మధ్యప్రదేశ్‌లో గురుదాస్ ఎంపీ సన్నీడియోల్. 2016లో ఒక సినిమా కోసం రుణం తీసుకున్నాడు. చెల్లింపులు చేయకపోవడంతో ఈ బకాయి రూ. 56 కోట్లుకు చేరింది. గత ఏడాది డిసెంబర్ నుంచి మొండి బకాయిల జాబితాలో చేరింది. ఈ నేపథ్యంలో ఆయన ఇంటిని సెప్టెంబరు 25న ఈ-వేలం వేయనున్నట్టు, ఈ వేలంలో పాల్గొనేందుకు సెప్టెంబరు 22 లోపు దరఖాస్తు చేయాల్సిందిగా బ్యాంకు అధికారులు తొలుత ప్రకటించారు. ఈ ఆస్తికి బ్యాంకు 51.43 కోట్లు రిజర్వ్ ప్రైస్‌గా నిర్ణయించారు. జుహులోని గాంధీగ్రామ్ రోడ్లో సన్నీ విల్లా, సినీ పోస్ట్ ప్రొడక్షన్ స్టూడియో ‘సన్నీ సూపర్ సౌండ్’ కూడా ఉన్న 599.44 చదరపు మీటర్ల ఆస్తిని కూడా వేలం వేయడానికి బ్యాంకు సిద్ధపడింది. సన్నీ సౌండ్స్ డియోల్స్ యాజమాన్యంలోని కంపెనీ, లోన్‌కు సంబంధించిన కార్పొరేట్ గ్యారెంటర్. సన్నీ డియోల్ తండ్రి, బాలీవుడ్ హీరో నటుడు, బీజేపీ మాజీ ఎంపీ, తండ్రి ధర్మేంద్ర వ్యక్తిగత హామీదారు. ధర్మేంద్ర భార్య, నటి హేమామాలిని కూడా బీజేపీ ఎంపీ కావడం గమనార్హం. -
CEC Bill: అద్వానీ లేఖ తెరపైకి..
ఢిల్లీ: ఎన్నికల సంఘం నియామకాలకు సంబంధించి కేంద్రం తీసుకొచ్చిన బిల్లు ప్రతిపాదనపై ప్రతిపక్ష కాంగ్రెస్ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. బీజేపీకి కౌంటర్ ఇచ్చే క్రమంలో.. కాంగ్రెస్ కమలం పార్టీ సీనియర్, రాజకీయ కురువృద్ధుడు ఎల్కే అద్వానీ రాసిన ఓ లేఖను తెరపైకి తెచ్చింది. ఎన్నికల అధికారులను నియమించే ప్యానెల్ నుంచి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాని (CJI) తప్పించే ప్రతిపాదిత బిల్లుకు కౌంటర్ ఇచ్చే క్రమంలో అద్వానీ లేఖను కాంగ్రెస్ తెరపైకి తెచ్చింది. ఆ పార్టీ జైరాం రమేష్ ఈ మేరకు లేఖను షేర్ చేశారు. 2012లోనే.. ఇలాంటి నియామకాలను పర్యవేక్షించేందుకు విస్తృత స్థాయి కొలీజియం ఏర్పాటు చేయాలని అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్‌కు ప్రతిపక్ష నేతగా ఉన్న అద్వానీ లేఖ ద్వారా సూచించారు. రాజ్యాంగబద్ధమైన సంస్థగా ఎన్నికల కమిషన్ పనితీరులో స్వతంత్రతను అనుమతించాలంటే.. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ల కార్యాలయం, అలాగే ఎన్నికల కమిషనర్లు కార్యనిర్వాహక జోక్యానికి దూరంగా ఉండాలి అని అద్వానీ ఆ లేఖ స్పష్టంగా అభిప్రాయపడ్డారు. “There is a rapidly growing opinion in the country which holds that appointments to Constitutional bodies such the Election Commission should be done on a bipartisan basis in order to remove any impression of bias or lack of transparency and fairness.” No, this isn’t a Modi… pic.twitter.com/NDXAHLQ6DZ — Jairam Ramesh (@Jairam_Ramesh) August 11, 2023 ఇదిలా ఉంటే.. రాజ్యసభలో ఈ బిల్లును గురువారం ప్రవేశపెట్టారు. ప్రధానమంత్రి, లోక్‌సభలో ప్రతిపక్ష నేత, ప్రధానమంత్రి నామినేట్ చేసే ఓ కేంద్ర క్యాబినెట్ మంత్రితో కూడిన ప్యానెల్ సిఫారసుల ఆధారంగా.. రాష్ట్రపతి ఎన్నికల సంఘం ఉన్నతాధికారులను నియమించాలన్నది ప్రతిపాదిత బిల్లు సారాంశం. అయితే.. ప్యానెల్లో ప్రధానమంత్రి, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు, భారత ప్రధాన న్యాయమూర్తి సభ్యులుగా ఉండాలని సుప్రీంకోర్టు మార్చిలో తీర్పు ఇచ్చింది. అయినా కేంద్రం ఆ తీర్పును పట్టించుకోకుండా తమ పని చేసుకుంటూ పోయింది. చీఫ్ జస్టిస్ ప్లేస్‌లో కేబినెట్ మంత్రిని చేర్చింది. CEC బిల్లు విషయంలో కేంద్రం చర్య.. అద్వానీ ప్రతిపాదనకు వ్యతిరేకంగా ఉండడమే కాదు.. మార్చి 2వ తేదీన సుప్రీం రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పునకు విరుద్ధంగా ఉందని జైరామ్ రమేశ్ తన ట్వీట్లో విమర్శించారు. అయితే ఈ బిల్లు, ఎన్నికల వేళ ఎన్నికల సంఘాన్ని కేంద్రం తన చేతుల్లోకి తీసుకునే యత్నంగా కనిపిస్తోందని జైరామ్ రమేశ్ ఆరోపించారు. ఇదిలా ఉంటే.. ఎన్నికల కమిషనర్ అనూప్‌చంద్ర పాండే 2024, ఫిబ్రవరి 14వ తేదీతో రిటైర్ కానున్నారు. అదే సమయంలో ఎన్నికలూ జరగాల్సి ఉంది. దీంతో పోల్ ప్యానెల్ ఖాళీని భర్తీ చేయాల్సి ఉంటుంది. సుప్రీం కోర్టు తీర్పునకు ముందు.. చీఫ్ ఎలక్షన్ కమిషనర్, ఎలక్షన్ కమిషనర్లను ప్రభుత్వ సిఫార్సుల మీద రాష్ట్రపతి నియమించేవారు. ఇదీ చదవండి: మన్మోహన్సింగ్ విషయంలో మరీ ఇంత దుర్మార్గమా? -
పార్లమెంట్ అంతరాయాలు.. మధ్యే మార్గం ద్వారా పరిష్కారం?
ఢిల్లీ: మణిపూర్ అంశంతో పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ముందుకు సాగటం లేదు. ఈ తరుణంలో అంతరాయాలు లేకుండా సభలు సజావుగా సాగేందుకు విపక్ష కూటమి ‘ఇండియా’ ఓ ప్రతిపాదన చేసినట్లు తెలుస్తోంది. మధ్యే మార్గ పరిష్కారంతో కేంద్రాన్ని సంప్రదించినట్లు కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ తన ట్విటర్ అకౌంట్ ద్వారా తెలియజేశారు. అంతరాయాన్ని ఛేదించడానికి, రాజ్యసభలో మణిపూర్‌పై చర్చ జరగడానికి ఇండియా కూటమి పార్టీలు ఆ సభా నాయకుడికి మధ్యే మార్గం పరిష్కారాన్ని అందించాయి. మోదీ ప్రభుత్వం అందుకు అంగీకరిస్తుందని ఆశిస్తున్నా అంటూ ట్వీట్ చేశారాయన. దీంతో ఆ ప్రతిపాదన ఏమై ఉంటుందా? అనే ఆసక్తి నెలకొంది. INDIA parties have offered a middle path solution to the Leader of the House to break the logjam and get a discussion on Manipur going in an uninterrupted manner in the Rajya Sabha. Hope the Modi government agrees. — Jairam Ramesh (@Jairam_Ramesh) August 3, 2023 పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమై రెండు వారాలు గడుస్తున్నా.. సభలు పట్టుమని పూట సరిగ్గా నడిచిన దాఖలాలు లేవు. మణిపూర్ అంశంపై రూల్ నెంబర్ 267 ద్వారా సుదీర్ఘ చర్చకు పట్టుబడుతూ.. ప్రధాని మోదీ మణిపూర్ శాంతిభద్రతలపై ప్రసంగించాలంటూ విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. అయితే.. కేంద్రం మాత్రం కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షా ప్రసంగిస్తారని, అదీ రూల్ నెంబర్ 176 ప్రకారం స్వల్ప కాలిక చర్చకే సిద్ధమని కరాకండిగా చెబుతోంది. దీంతో పార్లమెంట్ ఉభయ సభల్లో విపక్షాల నిరసనల హోరు కొనసాగుతుంది. అధికార పార్టీ తరపు నుంచి ఫ్లోర్ లీడర్లు.. విపక్ష నేతలతో చర్చలు జరుపుతూ వస్తున్నారు. ఈ క్రమంలో ఇండియా కూటమి ఒక అడుగు వెనక్కి వేసి మధ్యే మార్గ పరిష్కారంతో ముందుకు రావడం గమనార్హం. -
గీతా ప్రెస్‌కు గాంధీ శాంతి బహుమతి.. కాంగ్రెస్ ఫైర్.. రూ కోటి నిరాకరణ
ఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో ఉన్న ప్రఖ్యాత గీతా ప్రెస్‌కు ప్రతిష్టాత్మక గాంధీ శాంతి బహుమతి ఇవ్వడంపై కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జైరాం రమేశ్ మండిపడ్డారు. ప్రధాని మోదీ నేతృత్వంలోని జ్యూరీ తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఆయన హిందుత్వ భావాజాలానికి ముడిపెట్టారు. వినాయక్ దామోదర్ సావర్కర్, గాడ్సే వారసత్వానికి అవార్డు ఇస్తున్నారని ఆరోపించారు. 2015లో గీతా ప్రెస్‌లో రిలీజ్ అయిన, జర్నలిస్టు అక్షయ ముకుల్ రాసిన వివాదాస్పద పుస్తకాన్ని కూడా ఆయన గుర్తు చేశారు. కాగా.. రాజకీయంగా వివాదం రేగడంతో రూ.కోటి రూపాయల నగదును గీతా ప్రెస్ నిరాకరించింది. The Gandhi Peace Prize for 2021 has been conferred on the Gita Press at Gorakhpur which is celebrating its centenary this year. There is a very fine biography from 2015 of this organisation by Akshaya Mukul in which he unearths the stormy relations it had with the Mahatma and the… pic.twitter.com/PqoOXa90e6 — Jairam Ramesh (@Jairam_Ramesh) June 18, 2023 గీతా ప్రెస్‌కు అవార్డు.. అహింస, ఇతర గాంధేయ మార్గాల్లో సమాజంలో సామాజిక, ఆర్థిక, రాజకీయ పరివర్తన కోసం చేసిన కృషికి గాను గీతా ప్రెస్‌కు గాంధీ శాంతి బహుమతిని కేటాయించారు. ప్రధాని మోదీ నేతృత్వంలోని జ్యూరీ ఈ మేరకు ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర సాంస్కృతి శాఖ తెలిపింది. గాంధీ శాంతి బహుమతి విజేతకు రూ.కోటి నగదు, జ్ఞాపిక, సంప్రదాయ హస్తకళ లేదా చేనేత వస్త్రం అందజేస్తారు. I congratulate Gita Press, Gorakhpur on being conferred the Gandhi Peace Prize 2021. They have done commendable work over the last 100 years towards furthering social and cultural transformations among the people. @GitaPress https://t.co/B9DmkE9AvS — Narendra Modi (@narendramodi) June 18, 2023 ఇదీ చదవండి:గీతా ప్రెస్‌కు గాంధీ శాంతి బహుమతి భారత వారసత్వంపై దాడి.. గీతా ప్రెస్‌కు శాంతి బహుమతి కేటాయింపును కాంగ్రెస్ వ్యతిరేకించడంపై అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ విమర్శించారు. కర్ణాటకాలో గెలుపు అనంతరం భారత వారసత్వంపై కాంగ్రెస్ బహిరంగంగానే దాడి చేస్తోందని ఆరోపించారు. కర్ణాటకాలో మత మార్పిడి వ్యతిరేక చట్టాలు తొలగించడం, గీతా ప్రెస్‌కు గాంధీ శాంతి బహుమతిని వ్యతిరేకించడం ఇందుకు నిదర్శనాలని దుయ్యబట్టారు. ప్రజలు ఇందుకు తగిన బుద్ధి చెబుతారని అన్నారు. With the win in Karnataka, Congress has now openly unleashed a war against India's civilisational values and rich legacy, be it in the form of repeal of anti-conversion law or criticism against Geeta Press.people of India will resist this aggression and reassert our… — Himanta Biswa Sarma (@himantabiswa) June 19, 2023 భారతదేశంలో హిందు సనాతన ధర్మానికి చెందిన జ్ఞానాన్ని గీతా ప్రెస్ అందిస్తోంది కాబట్టే కాంగ్రెస్ వ్యతిరేకిస్తోందని బీజేపీ నాయకులు ఆరోపించారు. ముస్లీం లీగ్‌లో లౌకికత్వాన్ని చూడగలిగిన కాంగ్రెస్ పార్టీకి గీతా ప్రెస్‌లో మాత్రం మతపరమైన అంశం కనిపిస్తోందని దుయ్యబట్టారు. అమెరికా పర్యటనలో భాగంగా రాహుల్ గాంధీ ముస్లీం లీగ్ లౌకిక పార్టీ అని ఓ విలేఖరి అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చారు. ఈ అంశాన్ని దృష్టిలో ఉంచుకుని బీజేపీ నాయకులు ఈ సందర్భంగా విమర్శించారు. ఇదీ చదవండి: మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రేకు దెబ్బ మీద దెబ్బ.. వరుసగా వలసలు -
‘అదానీ’ అవకతవకలపై దర్యాప్తు ఏమైంది?: కాంగ్రెస్
న్యూఢిల్లీ: అదానీ గ్రూప్‌లోని డొల్ల కంపెనీలు, అవకతవకలపై దర్యాప్తు ఎంతదాకా వచ్చిందని కేంద్రాన్ని ప్రభుత్వాన్ని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ ప్రశ్నించారు. ‘‘అదానీ గ్రూప్తోపాలు పలు సంస్థలకు ఈ వ్యవహారంలో సంబంధముంది. ఇది అంతర్జాతీయ నెట్వర్క్. పలువురు నేతలకూ భాగస్వామ్యముంది. రష్యా, భారత ప్రభుత్వ కంపెనీలు కూడా ఈ అక్రమాల్లో పాలుపంచుకున్నాయి’’ అన్నారు. ఈడీ బూచి చూపి మా గొంతు నొక్కలేరు ఛత్తీస్‌గఢ్ కాంగ్రెస్ నేతలపై ఈడీ దాడులను కాంగ్రెస్ తీవ్రంగా ఖండించింది. ఇలా తమ గొంతు నొక్కలేరని పేర్కొంది. మంగళవారం పార్టీ నేతలు, కార్యకర్తలు రాయ్‌పూర్‌లోని ఈడీ కార్యాలయం ఎదుట బైఠాయించి ధర్నా చేశారు. కార్యాలయంలోకి వెళ్లేందుకు ప్రయతి్నంచగా భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు. ‘‘ఈ రాజకీయ కుట్రను ముందుగానే ఊహించాం. కాంగ్రెస్ ప్లీనరీ దాకా ఇవి కొనసాగుతూనే ఉంటాయి. మేం భయపడేది లేదు’ అని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ చెప్పారు. వచ్చే 24–26 తేదీల మధ్య రాయ్‌పూర్‌లో జరిగే ప్లీనరీకి ఏర్పాట్లను పరిశీలించేందుకు వచ్చిన ఆయన ధర్నాలో పాల్గొన్నారు. చదవండి ఇంతకూ శివసేన ఆస్తులు ఎవరివో!? లెక్క తేలుతుందో? -
అదానీ వ్యవహారంపై జేపీసీ తప్ప మరేదైనా వృథాయే: కాంగ్రెస్
న్యూఢిల్లీ : పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ వ్యవహారంలో సమగ్ర విచారణ అత్యంత అవసరమని కాంగ్రెస్ పార్టీ పేర్కొంది. ఈ విషయంలో సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) తప్ప మరే కమిటీ వేసినా వృథా ప్రయాసేనని అభిప్రాయపడింది. కేంద్ర ప్రభుత్వం కమిటీ ఏర్పాటుపై సుప్రీం కోర్టు దగ్గర ప్రతిపాదనలు చేస్తే , ఈ అంశంలో పారదర్శకంగా వ్యవహరిస్తున్నట్టు అవుతుందని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేష్ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అదానీ ఆస్తులకు సంబంధించి హిండెన్‌బర్గ్ నివేదికలో వచ్చిన ఆరోపణలపై నిపుణులతో కమిటీ వేయాలని సుప్రీం కోర్టు ఈ నెల 13న జరిపిన విచారణలో అభిప్రాయపడిందని, దీనిపై కేంద్రం 17లోగా స్పందించాల్సి ఉందని జైరామ్ రమేష్ గుర్తు చేశారు. జేపీసీ మినహాయించి ఎలాంటి చట్టబద్ధ కమిటీలు వేసినా ఈ విషయంలో ఉపయోగం ఉండదని అన్నారు. చదవండి: మహారాష్ట్ర సంక్షోభంపై సుప్రీం తీర్పు రిజర్వ్.. -
కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఇంట విషాదం
సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఇంట విషాదం నెలకొంది. సోనియా గాంధీ తల్లి పోలా మైనో.. ఇటలీలో ఈ నెల 27వ తేదీన కన్నుమూశారు. కాగా, ఆమె అంత్యక్రియలను మంగళవారం(ఆగస్టు 30న) జరిపినట్టు కాంగ్రెస్ సీనియర్ నేత జైరామ్ రమేష్ ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. కాగా, తల్లి అంత్యక్రియలకు సోనియా గాంధీ.. ఇటలీ వెళ్లినట్టుగా తెలుస్తోంది. Smt. Sonia Gandhi’s mother, Mrs. Paola Maino passed away at her home in Italy on Saturday the 27th August, 2022. The funeral took place yesterday. — Jairam Ramesh (@Jairam_Ramesh) August 31, 2022 -
పార్టీకి గుడ్‌బై! గులాం నబీ ఆజాద్‌పై కాంగ్రెస్ సీనియర్ నేతల సెటైర్లు
సాక్షి, న్యూఢిల్లీ: సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ పార్టీని వీడటం దురదృష్టకరం, బాధాకరం అని కాంగ్రెస్ తెలిపింది. నిరుద్యోగం, ద్రవ్యోల్బణం వంటి కీలక అంశాలపై కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి వ్యతిరేకంగా పార్టీ పోరాడుతున్న సమయంలో ఆయన రాజీనామా చేయడంపై విచారం వ్యక్తం చేసింది. ఆజాద్ రాజీనామా అనంతరం కాంగ్రెస్ సీనియర్ నేతలు అజయ్ మాకెన్, జైరాం రమేశ్ మీడియా సమావేశం నిర్వహించి ఈ విషయంపై స్పందించారు. ఆజాద్ రాజీనామా లేఖలో చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదని జైరాం రమేశ్ అన్నారు. అనంతరం ట్విట్టర్ వేదికగా ఆజాద్‌పై విమర్శలు గుప్పించారు జైరాం రమేశ్. గులాం నబీ ఆజాద్ డీఎన్ఏ 'మోడీ-ఫై' అయిందని సెటైర్లు వేశారు. కాంగ్రెస్ నాయకత్వం ఆయనను ఎంతో గౌరవించిందని అన్నారు. కానీ అతను మాత్రం ద్రోహం చేశారని మండిపడ్డారు. రాజీనామా లేఖలో ఆజాద్ చేసిన వ్యక్తిగత విమర్శలు ఆయన అసలు రంగుకు నిదర్శనమన్నారు. 50 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న గులాం నబీ ఆజాద్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఇందుకు సంబంధించి ఐదు పేజీల లేఖను పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి పంపారు. 2013లో రాహుల్ గాంధీ ఉపాధ్యక్ష బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి పార్టీ నాశనమైందని ఆరోపించారు. సీనియర్లకు సముచిత స్థానం కల్పించడం లేదని పేర్కొన్నారు. అంతేకాదు రాహుల్ త్వరలో చేపట్టబోయే 'భారత్ జోడో యాత్ర'పైనా విమర్శలు గుప్పించారు. భారత్ జోడో యాత్రకు ముందు 'కాంగ్రెస్ జోడో యాత్ర' చేపట్టాల్సిందని సైటెర్లు వేశారు. పార్టీలో సంస్కరణలు తీసుకురావాలని లేఖ రాసిన జీ-23 నేతలను అవమానాలకు గురి చేశారని ఆరోపించారు. గౌరవం ఉండదు.. మరోవైపు ఆజాజ్‌కు ఇకపై గౌరవం దక్కకపోవచ్చని నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫరూఖ్ అబ్దుల్లా అన్నారు. ఆయనపై గతంలో ఎంతో ప్రేమ చూపించామన్నారు. కాంగ్రెస్‌కు గతంలోనూ ఇలా జరిగిందని, ఆ తర్వాత మళ్లీ పుంజుకుందని గుర్తు చేశారు. ప్రస్తుతం దేశంలో బలమైన ప్రతిపక్షం అవసరమని పేర్కొన్నారు. బీజేపీ ఆహ్వానం.. కాంగ్రెస్ తనను తానే నాశనం చేసుకుంటోందని ఆజాద్ అన్నదాంట్లో తప్పేంలేదని బీజేపీ నేత కుల్దీప్ బిష్ణోయ్ అన్నారు. ఆయనను కమలం పార్టీలోకి ఆహ్వానిస్తున్నట్లు చెప్పారు. పార్టీ ఆదేశిస్తే తానే ఆజాద్‌తో సంప్రదింపులు జరిపి తీసుకొస్తానని చెప్పుకొచ్చారు. చదవండి: కాంగ్రెస్‌కు బిగ్ షాక్.. పార్టీకి ఆజాద్ రాజీనామా.. రాహుల్‌పై ఫైర్ -
సోనియా గాంధీకి మళ్లీ కరోనా
ఢిల్లీ: కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ(75) మళ్లీ కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ ఎంపీ, కాంగ్రెస్ కమ్యూనికేషన్స్ ఇంచార్జ్ జైరామ్ రమేశ్ ట్విటర్ ద్వారా వెల్లడించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి బాగానే ఉందని, ప్రొటోకాల్ ప్రకారం హోం ఐసోలేషన్‌లో ఉన్నారని జైరామ్ వెల్లడించారు. మరోవైపు కాంగ్రెస్ అధికారిక ట్విటర్ పేజీ సైతం ఈ విషయాన్ని తెలియజేస్తూ.. ఆమె త్వరగా కోలుకోవాలని ట్వీట్ చేసింది. Congress President Smt.Sonia Gandhi has tested positive for Covid-19 today. She will remain in isolation as per Govt. protocol. आज कांग्रेस अध्यक्ष श्रीमती सोनिया गांधी का कोविड-19 टेस्ट रिपोर्ट पॉजिटिव आया है। वह सरकार द्वारा जारी प्रोटोकॉल का पालन करते हुए आइसोलेशन में रहेंगी। — Jairam Ramesh (@Jairam_Ramesh) August 13, 2022 ఇదిలా ఉంటే జూన్‌లో ఆమె కరోనా బారినపడిన సంగతి తెలిసే ఉంటుంది. ఆ సమయంలో కరోనా కారణంగా నేషనల్ హెరాల్డ్ కేసులో ఆమె ఈడీ ఎదుట హాజరు అయ్యేందుకు గడువు సైతం కోరారు. ఈలోపు కరోనాతో ఇబ్బందిపడ్డ ఆమెను గంగారాం ఆస్పత్రిలో చేర్పించారు కూడా. ఇదిలా ఉంటే.. ఈ మధ్యకాలంలో కాంగ్రెస్ కీలక, అగ్రనేతలు వరుసగా కొవిడ్-19 బారినపడుతున్నారు. కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్ హెడ్ పవన్ ఖేరా, పార్టీ ఎంపీ అభిషేక్ మను సింఘ్వీ, మల్లికార్జున ఖర్గే.. ఈ వారం మొదట్లో సోనియా గాంధీ తనయ ప్రియాంక గాంధీ వాద్రా సైతం కరోనా బారినపడడం విశేషం. ఇదీ చదవండి: కోవిడ్ కేసులు పెరుగుతున్నాయ్.. జాగ్రత్తలు పాటించండి -
కేంద్రమంత్రి స్మృతి ఇరాని పరువు నష్టం దావా
-
స్మృతి ఇరానీ కూతురు బార్ కేసులో ట్విస్ట్.. కాంగ్రెస్ నేతలకు షాక్
Smriti Irani Defamation Case.. గోవాలో బార్ వ్యవహారంలో దేశంలో హాట్ టాపిక్‌గా మారింది. కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ కూతురు గోవాలో అక్రమంగా బార్ నిర్వహిస్తోందని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. ఈ మేరకు దీనికి సంబంధించిన వివరాలను ట్విట్టర్ వేదికగా పోస్టు చేశారు. అయితే, కాంగ్రెస్ నేతల ఆరోపణలు నిరాధారమైనవని స్మృతి ఇరానీ తెలిపారు. ఈ క్రమంలో కాంగ్రెస్ నేతలపై కేంద్ర మంత్రి పరువు నష్టం దావా వేశారు. కాగా, శుక్రవారం ఈ కేసు విచారణలో భాగంగా ఢిల్లీ హైకోర్టు కాంగ్రెస్ నేతలకు భారీ షాకిచ్చింది. ముగ్గురు హస్తం నేతలు జైరాం రమేశ్, పవన్ ఖేరా, నెత్తా డిసౌజాలకు నోటీసులు జారీ చేసింది. పరువునష్టం కేసులో ముగ్గురు కాంగ్రెస్ నేతలు ఆగస్టు 18వ తేదీన కోర్టు ముందు హాజరుకావాలని కోర్టు ఆదేశించింది. అలాగే, గోవాలో బార్ సంబంధించి చేసిన ట్వీట్లను 24 గంటల్లోగా డిలీట్ చేయాలని కోర్టు తెలిపింది. ఈ క్రమంలో కోర్టు ఆదేశాలపై కాంగ్రెస్ నేతలు స్పందించారు. జైరాం రమేష్ మీడియాతో మాట్లాడుతూ.. స్మృతి ఇరానీ వేసిన దావాను కోర్టులోనే ఛాలెంజ్ చేస్తామని కౌంటర్ ఇచ్చారు. అసలు వాస్తవాలను కోర్టుకు దృష్టికి తీసుకువెళ్తామని అన్నారు. ఇదిలా ఉండగా.. గోవాలో బార్ల విషయంలో తన కూతురుపై ఆరోపణలను వెనక్కి తీసుకుని క్షమాపణలు చెప్పాలని స్మృతి ఇరానీ తెలిపారు. ఈ విషయాన్ని లీగల్ నోటీసుల్లో కూడా పేర్కొన్నారు. అలాగే, రెండు కోట్ల నష్టపరిహారం చెల్లించాలని మంత్రి స్మృతి ఇరానీ తన పరువు నష్టం దావాలో డిమాండ్ చేశారు. Smriti Irani defamation case: Delhi HC directs three Congress leaders to remove social media posts #SmritiIrani #DelhiHighCourt #Congress https://t.co/2YnwX7jPHD — Lagatar English (@LagatarEnglish) July 29, 2022 ఇది కూడా చదవండి: బెంగాల్ స్కామ్.. నటి అర్పితా ముఖర్జీ కేసులో ఊహించని పరిణామం -
‘రిజర్వ్’ నిధులు
‘రిజర్వ్’ నిధులు ‘‘నరేంద్ర మోదీ ప్రభుత్వం మళ్లీ రిజర్వ్‌బ్యాంక్ మూలధనంపై కన్నేసింది. దేశ ఆర్థిక వ్యవస్థ విశ్వసనీయతకు, మన కరెన్సీకి సుస్థిరతకు ఆర్బీఐ దగ్గర ఈ నిల్వ అవసరం. ఈ విషయంలో ప్రభుత్వ ఒత్తిళ్లతో ఇప్పటికే అసాధారణ రీతిలో ఇద్దరు గవర్నర్లు నిష్క్రమించారు. అయినా కేంద్ర ప్రభుత్వం దీన్నుంచి ఏమీ నేర్చుకోలేదని అర్ధమవుతోంది’’ – సీతారాం ఏచూరి, సీపీఎం ప్రధాన కార్యదర్శి (‘రిజర్వ్’ నిధులపై కేంద్ర ప్రభుత్వం మరోసారి కన్నేసిందన్న కథనం చూశాక) వివేకం కలగాలి ‘‘ఈ ఏడాది రిపబ్లిక్ డే సందర్భంగా అన్ని విధాలా అర్హులైన వారికి విశిష్ట పురస్కారాలు ప్రకటిస్తే కొందరు దీన్ని రాజకీయం చేయడానికి పూనుకోవడం బాధాకరం. ఆ బాపతు వారికి ఆ భగవంతుడే వివేకం కలిగించాలి. అందుకు వారిని అనుగ్రహించాలి’’ – జీవీఎల్ నరసింహారావు బీజేపీ అధికార ప్రతినిధి ద్వంద్వ ప్రమాణాలు ‘‘బ్లాగ్ మంత్రి’ అరుణ్ జైట్లీ త్వరితంగా కోలు కోవాలని ఆకాంక్షి స్తూనే చందా కొచ్చ ర్‌పై ఆయన చేసిన ప్రకటనను తప్పుబట్టక తప్పడం లేదు. అది అసాధారణమైనది. మరోరకంగా ఐసీఐ సీఐ కేసులో అడుగు ముందుకేయొద్దని సీబీఐని కోరడమే. ఇలాంటి ద్వంద్వ ప్రమా ణాలు సరికాదని ఆయన గుర్తించాలి’’ – జైరాం రమేష్, కాంగ్రెస్ నాయకుడు అత్యున్నత విలువ ‘‘మీకు రిపబ్లిక్ డే శుభాకాంక్షలు. సరిగ్గా ఇదే రోజు ఆవిష్కృత మైన మన రాజ్యాంగం మీ తల్లిగారికి, ఆమె లాంటి అనేకులకు ఒక నిరర్థక హామీ పత్రంగా మిగిలి ఉండొచ్చు. కానీ ఇప్పటికీ మనం నిలబెట్టుకునేందుకు పోరాడి తీరవ లసిన ఏకైక ఆదర్శం అదొక్కటేనని మీరు గుర్తించండి’’ – సంజయ్ హెగ్డే సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది పతాక విలువలు ‘‘సమాజంలో చీలికలు విస్తరిస్తుంటే, విద్వేషాలు భయంకరంగా రేగుతుంటే మన త్రివర్ణ పతాకం వినువీధిలో రెపరెపలాడుతూ మనలో విశ్వాసాన్ని, నమ్మకాన్ని కలిగిస్తోంది. తన అత్యున్నత విలువలు స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వాలను అందుకోమని మనందరికీ పిలుపునిస్తోంది’’ – సాగరికా ఘోష్, సీనియర్ జర్నలిస్టు (గణతంత్ర దినోత్సవం సందర్భంగా) -
35 ఏళ్ల తర్వాత గెలవబోతున్నాం : జైరాం రమేష్
సాక్షి, యాదాద్రి భువనగిరి : నాలుగున్నరేళ్ల టీఆర్ఎస్ పాలనలో రాష్ట్రాన్ని దివాలా తెలంగాణగా మార్చారని కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్, కేంద్ర మాజీ మంత్రి జైరాం రమేష్ మండిపడ్డారు. కేవలం ప్రజల సంక్షేమం కోసమే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిందని, కేసీఆర్ కుటుంబం కోసం కాదని ఎద్దేవా చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన భువనగిరిలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ లేకుండా తెలంగాణ ఏర్పడలేదని జైరాం రమేష్ వ్యాఖ్యానించారు. విభజన హామీలను అమలు చేయడంలో, చేయించుకోవడంలో ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం కేసీఆర్ పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు. మొట్టమొదటిసారిగా ఏర్పడిన తెలంగాణ ప్రభుత్వంలో ఒక్క మహిళా మంత్రి లేకపోవడం సిగ్గుచేటన్నారు. కాంగ్రెస్ పార్టీ మహిళలకు సముచిత స్థానం కల్పిస్తుందని, వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో తెలంగాణ మహిళను హోం మంత్రి చేశామని గుర్తు చేశారు. తెలంగాణలో ఇకపై టీఆర్ఎస్ పాత అంబాసిడర్ కారుకు చోటు లేదని ఎద్దేవా చేశారు. సంజీవని దొరికింది కాబట్టి.. 35 ఏళ్ల తర్వాత భువనగిరిలో కాంగ్రెస్ పార్టీ గెలవబోతుందని ఆయన జోస్యం చెప్పారు. -
ఇందిర ఆత్మ, జాతి వాణి హక్సర్
కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి జైరాం రమేష్ రచించిన ‘ఇంటర్‌ట్వైన్డ్ లివ్స్: పీఎన్ హక్సర్ అండ్ ఇందిరాగాంధీ, ఎ బయాగ్రఫీ ఆఫ్ హక్సర్‘ పుస్తకాన్ని జూన్ 19న ఆవిష్కరించనున్నారు. ఈ సందర్భంగా ఆయన సాక్షి ప్రతినిధి కృష్ణమోహన్రావుకి ఇంటర్వ్యూ ఇచ్చారు. భారతీయ దౌత్యం, విదేశీ విధానాలపై విస్తృతానుభవం కలిగిన పీఎన్ హక్సర్‌ని 1950లో తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ ఎంపిక చేసుకున్నారని, పదిహేనేళ్లపాటు నెహ్రూ ఆధ్వర్యంలో పనిచేసిన హక్సర్‌ని 1967లో ఇందిరాగాంధీ మళ్లీ ఎంపిక చేసుకున్నారని జైరాం చెబుతున్నారు. హక్సర్.. భారతీయ రాజకీయ చరిత్రలోని సంక్లిష్ట దశలో, అత్యంత సంక్షుభిత సంవత్సరాల్లో చాణక్యుడి పాత్రను పోషించారు. ప్రధానమంత్రి ప్రధాన కార్యదర్శిగా.. జాతి వాస్తవ చైతన్య ప్రదాతగా, ఇందిరాగాంధీకి విశ్వసనీయ వ్యక్తిగా చరి త్రకెక్కారు. సంజయ్ గాంధీ కలల ప్రాజెక్టు అయిన మారుతి కారు తయారీపై విభేదించిన హక్సర్, ఇంది రకు దూరం జరిగారు. జైరాం రమేష్ ఇంటర్వ్యూ సంక్షిప్తపాఠం సాక్షి పాఠకులకు అందిస్తున్నాం. హక్సర్‌పై పుస్తకం రాయడానికి కారణం? ఇందిరాగాంధీ హయాంలో 1967–73 మధ్యకాలంలో పీఎన్ హక్సర్ అత్యంత ప్రభావశీలుడైన, శక్తిమంతుడైన ప్రభుత్వ ఉన్నతాధికారిగా వ్యవహరించారు. బ్యాంకుల జాతీయీకరణ, రాజభరణాల రద్దు, బంగ్లాదేశ్ ఆవిర్భావం, పాకిస్తాన్‌పై విజయం, 1971 లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలలో గెలుపు, 1972లో సిమ్లా ఒప్పందం, పాకిస్తాన్, న్యూ ఢిల్లీ మధ్య 1973 నాటి ఒప్పందం వంటి ఇందిర సాటిలేని విజయాలన్నింటికీ సూత్రధారి హక్సర్. ఈ అన్నింటిలో హక్సర్దే ప్రధాన పాత్రా? ఇందిరాగాంధీ రాజకీయనేత. కానీ ఈ పరిణామాలన్నింటిలో కీలకపాత్ర వహించింది మాత్రం పీఎన్ హక్సర్. ఇద్దరి భాగస్వామ్యమే ఈ విజయాలకు మూలం. సుదీర్ఘకాలంగా నెహ్రూ, ఇందిర కుటుం బంతో హక్సర్ సన్నిహిత సంబంధాలు నెరిపారు. జీవితాంతం మార్క్సిస్టుగానే ఉండిన హక్సర్ 1970లలో భారత ఆర్థిక వ్యవస్థ వామపక్షవిధానాల వైపు మొగ్గు చూపడానికి తానే బాధ్యుడు. 1969లో బెంగళూరులో జరిగిన జాతీయ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నిలువునా చీలిపోవడం, తదుపరి పరి ణామాలన్నింట్లో హక్సర్ ఇందిర వెన్నంటే ఉన్నారు. ఇందిరకు భావజాలపరంగా, నైతికంగా మూలస్తంభంగా హక్సర్ వ్యవహరించారు. ఇందిర కుమారుడు సంజయ్ గాంధీతో విభేదాల కారణంగా 1973 జనవరి 15న హక్సర్ ఇందిరకు దూరం జరిగారు. ఇందిరకు హక్సర్ పంపిన చివరి సూచన పీవీ నరసింహారావుకు సంబంధించింది కావడం విశేషం. మొదట జై తెలంగాణ ఉద్యమాన్ని, తర్వాత జై ఆంధ్రా ఉద్యమాన్ని బలపర్చిన పీవీ తన్ను తాను పూర్తి అసమర్థుడిగా నిరూపించుకున్నారని, ఆనాటి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై దృఢవైఖరి అవలంబించాలని ఇందిరకు హక్సర్ సలహా ఇచ్చారు. హక్సర్ అంత శక్తివంతుడైన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆధునిక భారత చరిత్రలో కానరారు. ఇందిర నియంతృత్వానికి హక్సరే కారణమా? లేదు.. లేదు. 1973 జనవరిలో ఇందిరకు హక్సర్ దూరం జరిగారు. కానీ ఆమె ఆయన్ని మళ్లీ ప్రణాళికా సంఘం డిప్యూటీ చైర్మన్‌గా నియమించారు. ఈ స్థానంలో హక్సర్ 1975 మార్చి వరకు ఇందిరతో పనిచేశారు. 1975లో ఇందిర విధించిన ఆంతరంగిక అత్యయిక పరిస్థితిని హక్సర్ వ్యతిరేకించారు. ఎమర్జెన్సీ కాలంలో ఆయన సంజయ్ గాంధీ బాధితుడైనప్పటికీ, ఇందిరకు విధేయుడిగానే ఉండేవారు. ఎమర్జెన్సీని తీవ్రంగా వ్యతిరేకించినప్పటికీ బహిరంగంగా దాని గురించి వ్యాఖ్యానించలేదు. జరుగుతున్న పరిణామాల గురించి హక్సర్ ఇందిరను వ్యక్తిగతంగా కలిసి చెప్పేవారు. బ్యూరోక్రాట్‌గా హక్సర్ ఔన్నత్యం ఏమిటి? పాలనా వ్యవహారాల్లో హక్సర్ అత్యంత నిజాయితీపరుడు. అందుకే 1987లో రాజీవ్ గాంధీ చైనాతో సంబంధాలను సాధారణ స్థాయికి తీసుకురావడం కోసం హక్సర్‌ను చైనాకు పంపారు. ఆ తర్వాతే రాజీవ్ 1988లో చైనా పర్యటించారు. పాలనపై హక్సర్ ప్రభావం స్థాయి ఏమిటి? పాలనలో సరైన వ్యక్తులను ఎంచుకోవడమే హక్సర్ గొప్పదనం. ఆయన ఎంపిక చేసినవారే ఆధునిక భారత వ్యవస్థ నిర్మాతలయ్యారు. ఆయన తీసుకొచ్చిన ఎంఎస్ స్వామినాథన్ అత్యున్నత వ్యవసాయ శాస్త్రజ్ఞుడై హరిత విప్లవానికి ఆద్యుడయ్యారు. ఇక ఆయన ఎంపిక చేసిన డాక్టర్ మన్మోహన్ సింగ్ 1970లో ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారు అయ్యారు. ఇస్రో చైర్మన్‌గా హక్సర్ ఎంపిక చేసిన సతీష్ ధావన్ భారత అంతరిక్ష కార్యక్రమాలకు పితామహుడయ్యారు. ఇక హోమీ సేత్నా పొఖ్రాన్ అణుపరీక్షల్లో కీలక పాత్ర పోషించారు. హక్సర్ సలహమేరకే సోనియా గాంధీ పీవీ నరసింహారావును కాంగ్రెస్ అధ్యక్షుడిగా నియమించారు. అలా పీవీ ప్రధాని కావడానికి కూడా హక్సరే ఆద్యుడు. 1973లో పీవీ అసమర్థుడని పేర్కొన్న హక్సర్ 1991లో కాంగ్రెస్‌లో లుకలుకలు లేకుండా వీవీ చేయగలడని నిర్ధారించుకోవడం విశేషం. సంజయ్‌గాంధీతో విభేదాలకు కారణం? భారత్‌కు ప్రజా రవాణా ముఖ్యం కానీ కార్లు కావని హక్సర్ అభిప్రాయం. రెండోది ప్రధానమంత్రి నివాసంలో ఉంటూ ఆమె కుమారుడు కారు తయారీలో పాలుపంచుకోవడంతో హక్సర్ విభేదించారు. అయితే మారుతి కార్ ప్రాజెక్టు వాస్తవరూపం దాల్చనుందని గుర్తించగానే హక్సర్ ప్రధాని కార్యాలయం నుంచి బయటకు వచ్చేశారు. జైరాం రమేష్ -
ఆప్‌తో పొత్తుకి కాంగ్రెస్ సై?
సాక్షి, న్యూఢిల్లీ: రానున్న లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ పార్టీ మరో ప్రాంతీయ పార్టీతో పొత్తుకి ప్రయత్నాలు మొదలుపెట్టింది. 2019లో లోక్‌సభ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీతో కలిసి ఎన్నికల్లో పోటీచేసేందుకు మంతనాలు చేస్తోంది. దానిలో భాగంగా కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్ర జైరామ్ రమేష్, మరో సీనియర్ నేత అజయ్ మాకేన్‌లు ఆప్ కన్వీనర్ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌తో చర్చలు జరిపినట్టు సమాచారం. ఏడు లోకసభ స్థానాల్లో ఆప్ ఐదు సీట్లలో పోటీ చేసి కాంగ్రెస్‌కి రెండు సీట్లు ఇవ్వడానికి అంగీకరించినట్లు, కాంగ్రెస్ మాత్రం మూడు సీట్లలో పోటీ చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రెండు పార్టీల మధ్య పొత్తు ఏవిధంగా ఉంటుందో వేచి చూడాలి. ఇటీవల కేజ్రీవాల్ ఓ సమావేశంలో మాట్లాడుతూ మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌పై ప్రసంశల జల్లు కురిపించిన విషయం తెలిసిందే. మన్మోహన్ లాంటి విద్యావేత్తని దేశ ప్రధానిగా కోల్పోయామని, ప్రధానమంత్రి అయనలా చదవుకున్న వ్యక్తి అయ్యి ఉండాలని కేజ్రీవాల్ వ్యాఖ్యానించించారు. కాంగ్రెస్‌కు దగ్గర కావడానికే కేజ్రీవాల్ ఇలా మాట్లాడారని రాజకీయ వర్గాల అభిప్రాయం. ఇదిలా ఉండగా కాంగ్రెస్- ఆప్ కలిసి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తాయి అన్న వార్తలను అజమ్ మాకేనే తీవ్రంగా ఖండించారు. ఆ వార్తల్లో నిజంలేదని, తాము ఎన్నికల పొత్తుపై కేజ్రీవాల్‌తో చర్చలు జరపలేదని తెలిపారు. -
వెంకయ్యనాయుడు జీవితం తెరచిన పుస్తకం
హైదరాబాద్‌సిటీ: కాంగ్రెస్ నేత జైరాం రమేష్‌పై తెలంగాణ బీజేపీ నేతలు మండిపడ్డారు. వెంకయ్య నాయుడుపై జైరాం రమేష్ చేసిన ఆరోపణలు నిరాధారమైనవని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కె. లక్ష్మణ్ అన్నారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. రాజకీయ ఆరోపణలు చేయడం చూస్తే కాంగ్రెస్ దివాళా కోరుతనానికి నిదర్శనంగా ఉన్నాయని విమర్శించారు. వెంకయ్య నాయుడు జీవితం తెరిచిన పుస్తకమని, సాధారణ స్థాయి నుంచి ఉప రాష్ట్రపతిగా ఎదిగిన తెలుగు వారి ఆత్మస్తైర్యం దెబ్బ తీయడం కోసం ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. స్వచ్చంద సంస్థలకు ప్రత్యేక రాయితీలు ఇవ్వడం పరిపాటిగా ఉన్నదని, జైరాం రమేష్ ఇలాంటి ఆరోపణలు చేయడం దొంగే దొంగ అని అరిచినట్లుందని ఎద్దేవా చేశారు. పంచ భూతాలను సైతం దోచుకున్న చరిత్ర కాంగ్రెస్‌దేనన్నారు. అవినీతి కుంభకోణాలలో కూరుకుపోయిన కాంగ్రెస్ మాట్లాడడం దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందన్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఉండి తెలుగు ప్రజలకు మేలు చేయక పోగా నష్టం చేసిన వ్యక్తి జైరాం రమేష్ అని తూర్పారబట్టారు. ప్రతిపక్ష పార్టీగా కూడా ప్రజలు అవకాశం ఇవ్వక పోయినా కాంగ్రెస్‌కు బుద్ది రాలేదని విమర్శించారు. ఎక్కడ ఎన్నికలు జరిగినా కాంగ్రెస్‌ను ప్రజలు తరిమి కొడుతున్నారని వ్యాఖ్యానించారు. -
మా విమానం మోదీ ఫ్రీ గా వాడుకోలేదు..
న్యూఢిల్లీ: ప్రముఖ పారిశ్రామిక వేత్త, అదాని గ్రూపు ఛైర్మన్ గౌతం అదానీ కాంగ్రెస్ నేత జై రాం రమేష్ తాజా విమర్శలపై స్పందించారు. భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తనకు అనుకూలంగా నిర్ణయం తీసుకోలేదని, తమకు స్పెషల్ ట్రీట్ మెంటే ఏమీ లేదని వివరణ ఇచ్చారు. తమ విమానాన్ని ప్రధాని ఉచితంగా వాడుకోలేదని వెల్లడించిన ఆయన కాంగ్రెస్ నేతలు జీఎంఆర్ విమానాలను వాడుకోలేదా అని ప్రశ్నించారు. నెహ్రూ గాంధీ కుటుంబం పాలిస్తున్న కాంగ్రెస్ విమర్శల వెనుక పెద్ద రాజకీయమే ఉందని ఆరోపించారు. వాస్తవాలకు దూరంగా జై రాం రమేష్ ఆరోపణలు గుప్పించారన్నారు. కావాలనే రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు. అదానీ గ్రూపుపై విధించిన 200 కోట్ల జరిమానాను ఉపసంహరించుకోలేదని ప్రభుత్వం స్పష్టం చేసిందని గౌతం వివరించారు. సునీతా నరైన్ నివేదిక తర్వాత యూపీఏ ప్రభుత్వం తమ సంస్థకు షోకాజ్ నోటీసు జారీ చేసిందని అయితే దానికి తాము సమాధానమిచ్చామని తర్వాత ప్రభుత్వం (యూపీఏ) ఏమీ చేయాలో నిర్ణయించలేకపోయిందని విమర్శించారు. జైం రాం రమేష్ ఆరోపించినట్టుగా చత్తీస్ ఘడ్ లోని అటవీ ప్రాంతాన్ని మైనింగ్ కోసం ఇచ్చిన కంపెనీ తమకు సంబంధించింది కాదని స్పష్టం చేశారు. అది రాజస్తాన్ ప్రభుత్వానికి చెందిన కంపెనీ అనీ, మైనింగ్ కాంట్రాక్టర్ గా తమను ప్రభుత్వం ఎంచుకుందని వివరించారు. అలాగే కాంగ్రెస్ ప్రబుత్వం హయాంలోనే ఈ ఒప్పందం జరిగిందనీ, దీనికి అనుమతి ఇచ్చిందని జై రాం రమేషే నని చెప్పుకొచ్చారు. ఇపుడు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారో తనకు అర్థం కావడంలేదన్నారు. పిటిషనర్ వరుసగా నాలుగు పిల్స్ వేశాడని.. కానీ ఒకటి కూడా ఆ ప్రాంతంలో కమ్యూనిటీ కానీ, దీని వల్ల నష్టపోతున్న వారుగానీ వేయలేదన్నారు. ఈ విషయంలో ప్రతిపక్షాలు రాజకీయంగా మోటివేట్ చేశాయని ఆరోపించారు. అయినా అక్కడ అభివృద్ధిజరగడం తమకు చాలా గర్వంగా ఉందని తెలిపారు. ఎన్డీయే ప్రభుత్వం దీనిపై విచారణ జరుపుతోందన్నారు. తాము ఎలాంటి నిబంధనల అతిక్రమణకు పాల్పడలేదని వివరించారు. ఇది చాలా దురదృష్టకరమైన సంఘటన అని గౌతం అదాని వ్యాఖ్యానించారు. రాజకీయ వివాదాలలోకి రావడం తమకు ఇష్టంలేదనీ, కార్పొరేట్ సంస్థలు రాజకీయాలకు దూరంగా ఉండాలన్నారు. రాజకీయ పార్టీలు అనవసరంగా కార్పొరేట్లను రాజకీయాల్లోకి లాగొద్దని కోరారు. ఇది దేశానికి మంచి కాదని వ్యాఖ్యానించారు. తాము రాజకీయ చదరంగంలో పావులు కాదలుచుకోలేదని ఆయన చెప్పారు. తాము రాజకీయ పార్టీతో కలిసి పనిచేస్తున్నామనీ, గుజరాత్,మహారాష్ట్ర, రాజస్థాన్ లాంటి కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో సైతం నిబద్ధతతో పనిచేస్తున్నామని తెలిపారు. ఆయా రాష్ట్ర ప్రభుత్వాల మద్దతు లేకుండా మౌలిక సదుపాయాల కల్పన సాధ్యం కాదని గౌతం ఆదాని, పేర్కొన్నారు. -
పచ్చ మీద ప్రమాణం !
జయశ్రీకి మొక్కలంటే ప్రాణం. ఇద్దరం పక్కపక్కనే లోఢీ గార్డెన్స్‌లో నడుస్తున్నాం. ఎక్కడా పచ్చదనం లేదు. ఎటువైపు నుంచీ ఒక్క శీతల పవనమూ లేదు. లోఢీ మార్గ్‌లో క్రమంగా మొక్కలు తగ్గిపోయి, వాకింగ్‌కి వచ్చే మనుషులు ఎక్కువైపోతున్నట్లున్నారు! పీల్చే గాలి తగ్గి, వదిలే వాయువులతో లోకం ఏదో ఐపోయేలా ఉంది. ‘‘కాంగ్రెస్‌తోనే పోయింది... ఆ పచ్చదనమంతా’’ అంటున్నాను. జయశ్రీ వినడం లేదు. మొక్కల్ని వెదుక్కుంటోంది. ఆమె అంతే! అవసరం లేని దానిని వినవలసి వచ్చినప్పుడు.. అవసరమైన దేనినో వెదుక్కుంటున్నట్లుగా ఉండిపోతుంది. కాంగ్రెస్ పవర్లో ఉన్నప్పుడు తులసికోట పచ్చగా ఉండి, కాంగ్రెస్ పవర్లో లేనప్పుడు తులసికోట పచ్చగా లేకపోవడం ఏమిటి అనే సందేహం గానీ ఆమెకు వచ్చిందా అన్న అనుమానం నాకు ఆమె మౌనం వల్ల కలిగింది. కాంగ్రెస్‌లో నేను నీళ్ల మినిస్టర్‌గా, ఊళ్ల మినిస్టర్‌గా, మొక్కల మినిస్టర్‌గా, అడవుల మినిస్టర్‌గా ఉన్నప్పుడు కూడా ఆమె నీళ్లను, ఊళ్లను, మొక్కల్ని, అడవుల్ని చూసింది తప్ప వాటి మినిస్ట్రీలను చూడలేదు. నన్ను మినిస్టర్‌గానూ చూడలేదు. మొక్కలకు పాదులు తియ్యడం, మొక్కలకు నీళ్లు పొయ్యడం, మొక్కలకు దడులు కట్టడం.. బేసిక్‌గా మనుషుల పని కదా అన్నట్లు చూస్తుంది ఆమె.. ఒకవేళ నేను ప్రభుత్వాలను, పార్టీలను.. నిందించడం, విమర్శించడం మొదలుపెడితే. ఇవాళ వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే. కాంగ్రెస్ పచ్చగా ఉన్న రోజుల్లో ఇది నా మినిస్ట్రీ. జూన్ ఐదు అనగానే ఎన్డీయేకి బహుశా గ్రీనరీ కన్నా కూడా, బ్లూ స్టారే గుర్తొస్తుందేమో. ఆపరేషన్ బ్లూ స్టార్! మోదీ ఈ రోజు లోఢీ గార్డెన్స్ గురించి మాట్లాడతారో, స్వర్ణాలయంపై సైన్యం దాడి గురించి మాట్లాడతారో చూడాలి. మోదీ మాట్లాడినా, జైట్లీ మాట్లాడినా.. చెట్లను పడగొడుతుంటే తరిగిపోతున్న పచ్చదనమో, రాష్ట్రాలను విడగొడితే చిగురిస్తుందనుకున్న పచ్చదనమో తప్ప వేరే ముఖ్యాంశం లేదు మాట్లాడుకోడానికి ఇప్పుడీ సందర్భంలో. విడిపోతే తెలంగాణ, వదిలించుకుంటే సీమాంధ్ర రెండూ పచ్చగా కళకళలాడతాయని కాంగ్రెస్‌పై ఒత్తిడి తెచ్చిన ప్రతి నాయకుడూ ఆ పచ్చదనం ఏమైపోయిందో కూడా ఇవాళ మాట్లాడాలి. ఓల్డ్ హిస్టరీకి, న్యూ జాగ్రఫీకి మధ్య.. చివరి ఐదు నెలల్లో ఏపీని ఎవరు విడగొట్టిందీ, ఎలా విడగొట్టిందీ జూన్ 15న నా పుస్తకం బయటికొచ్చి మాట్లాడుతుంది. ఏపీకి ఐదేళ్లు హోదా ఇస్తాం అని కాంగ్రెస్ అన్నప్పుడు.. ‘మేమైతే పదేళ్లు ఇస్తాం’ అంటూ వెంకయ్యనాయుడు రాజ్యసభలో ఎలా జంప్ చేసిందీ, ఇప్పుడా మాటను ఎలా జంప్ చేయించిందీ నా పుస్తకం చెబుతుంది. సామాజిక న్యాయం కోసం రాష్ట్రాన్ని కాంగ్రెస్ విడగొడితే, కుటుంబ పాలన కోసం రాష్ట్రాల నాయకులు కాంగ్రెస్‌ను ఎలా పడగొట్టిందీ నా పుస్తకం చెబుతుంది. పచ్చ మీద ప్రమాణం ! -మాధవ్ శింగరాజు -
'జైరాం... ప్రత్యేక హోదాపై సమాధానం చెప్పు'
హైదరాబాద్: దేశం అభివృద్ధి చెందకూడదు... ప్రధాని నరేంద్రమోదీకి పేరు రాకుడదన్నది కాంగ్రెస్ విధానమని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం. వెంకయ్యనాయుడు ఆదివారం హైదరాబాద్‌లో ఆరోపించారు. రాజకీయం కోసమే భూసేకరణ చట్టాన్ని కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తుందని విమర్శించారు. అవసరమైతే ప్రజలల్లోకి వెళ్లి భూసేకరణ చట్టాన్ని వివరిస్తామని ఆయన తెలిపారు. ఎన్నికల తర్వాత మోదీ ఆకర్షణ మరింత పెరిగిందన్నారు. ప్రతిపక్షాలు ప్రభుత్వం మీద కావాలనే ఆరోపణలు చేస్తున్నాయని వెంకయ్య అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా అంశాన్ని విభజన చట్టంలో ఎందుకు చేర్చలేదని ఆయన కాంగ్రెస్ పార్టీని ఈ సందర్భంగా ప్రశ్నించారు. ముందు ఈ విషయంపై వెంటనే సమాధానం ఇవ్వాలని మాజీ కేంద్ర మంత్రి, ఎంపీ జైరాం రమేష్‌ను సవాల్ విసిరారు. ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక విభజన నేపథ్యంలో రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంలో కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నారని ఇటీవల హైదరాబాద్‌లో జైరాం రమేష్ ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వెంకయ్యనాయుడు... జైరాంకు సవాల్ విసిరారు. తాము అధికారంలోకి వచ్చిన 9 నెలల్లోనే 46 బిల్లులు పాస్ చేసిన సంగతి గుర్తు చేశారు. -
ఇప్పుడున్నది మోడీ టీడీపీ: జైరాం రమేశ్
అమలాపురం/ఏలూరు, ‘నిజమైన తెలుగుదేశం పార్టీ అంటే ఎన్టీ రామారావు స్థాపించిన పార్టీయే. ఇప్పుడున్నది నరేంద్ర మోడీ టీడీపీ. చంద్రబాబు తన పార్టీని మోడీమయం చేశారు’ అని కేంద్రమంత్రి జైరాం రమేశ్ అన్నారు. బీజేపీ-టీడీపీ కూటమిలో చంద్రబాబుది బి-టీమ్ అని ఎద్దేవా చేశారు. బీజేపీతో పొత్తు పెట్టుకున్న చంద్రబాబు.. నరేంద్రమోడీని రాజకీయాల్లో నిచ్చెనలా వాడుకుంటున్నారని కేంద్రమంత్రి జైరాం రమేశ్ ఎద్దేవా చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా జైరాం రమేశ్ కాంగ్రెస్ శ్రేణులతో కలసి ఆదివారం తూర్పు గోదావరి జిల్లా రావులపాలెం, అమలాపురం, పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర విభజనకు చంద్రబాబు రెండు లేఖలు ఇచ్చారని, విభజన అంశాన్ని పూర్తిగా కాంగ్రెస్ పైనే రుద్దటం సరికాదన్నారు. విభజన సమయంలో అప్పటి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి బాధ్యతారహితంగా వ్యవహరించారన్నారు. -
హైదరాబాద్ బిర్యానీ.. కేసీఆర్ నాలుక!: జైరాం
రుచికి ఇది.. వివాదాలకు అది చాలా ఫేమస్: జైరాం హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి వివాదాలకు ఉత్పత్తి కేంద్రంగా మారిందని కేంద్ర మంత్రి జైరాం రమేశ్ వ్యాఖ్యానించారు. హైదరాబాద్ బిర్యానీకి దేశవ్యాప్తంగా ఎంత ఆదరణ ఉందో రెచ్చగొట్టడంలో కేసీఆర్ నాలుకకు కూడా అంత పేరుందని పేర్కొన్నారు. రాష్ట్ర విభజనకు సంబంధించి ఉద్యోగుల విభజన సమస్యే కాదని... అయినప్పటికీ కేసీఆర్ ఈ అంశాన్ని వివాదం చేస్తూ రాజకీయంగా లబ్ధి పొందాలని చూస్తున్నారని విమర్శించారు. గాంధీభవన్‌లో ఏఐసీసీ ఎస్సీ సెల్ చైర్మన్ కొప్పుల రాజు, టీ పీసీసీ ముఖ్య అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్‌తో కలిసి జైరాం మీడియాతో మాట్లాడారు. దళితుల భూమిని పొన్నాల లక్ష్మయ్య ఆక్రమించారంటూ కేసీఆర్ చేసిన ఆరోపణలు తన దృష్టికి రాలేదన్న జైరాం.. తెలంగాణలో అతిపెద్ద భూస్వామి కేసీఆరేనని, ఫాంహౌస్ కూడా ఏర్పాటు చేసుకున్నారని విమర్శించారు. రాహుల్‌గాంధీ ‘మేడ్ ఇన్ తెలంగాణ’ కోసం ప్రయత్నిస్తుంటే.. కేసీఆర్ టీఆర్ఎస్ను వివాదాల ఉత్పత్తి కేంద్రంగా మారుస్తున్నారని విమర్శించారు. జూన్ 2లోపు ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలకు ఉద్యోగుల తాత్కాలిక (ప్రొవిజనల్) కేటాయింపు జరుగుతుందని చెప్పారు. -
మోసానికి మరో రూపం కేసీఆర్:జైరాం రమేశ్
30 తర్వాత ఆయన ఫామ్‌హౌస్‌కే పరిమితం 25 ఏళ్ల కిందటి డొక్కు కారు అంబాసిడర్ సైకిల్‌కు పంక్చర్ చేయడం ఖాయం కేంద్ర మంత్రి జైరాం రమేశ్ గజ్వేల్, న్యూస్‌లైన్: తెలంగాణలో ఏర్పడేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని, అధికారం కోసం కలలుగంటున్న టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఈనెల 30వ తేదీ తర్వాత ఫామ్‌హౌస్‌కే పరిమితం కాకతప్పదని కేంద్రమంత్రి జైరాం రమేశ్ ఎద్దేవా చేశారు. బుధవారం మెదక్ జిల్లా గజ్వేల్‌లో కాంగ్రెస్ అభ్యర్థి తూంకుంట నర్సారెడ్డి నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో జైరాంరమేశ్ మాట్లాడుతూ కేసీఆర్ తీరుపై నిప్పులు చెరిగారు. మోసానికి, ద్రోహానికి, వెన్నుపోటుకు కేసీఆర్ మారుపేరుగా నిలిచారని మండిపడ్డారు. తెలంగాణ ప్రకటించిన తర్వాత టీఆర్ఎస్ను విలీనం చేస్తానని చెప్పిన మాట ఏమైందని ప్రశ్నించారు. టీఆర్ఎస్ ఆవిర్భావానికి ముందే 2000లో కాంగ్రెస్ నేతలు ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాటం చేశారని గుర్తుచేశారు. చంద్రబాబు మంత్రి పదవి ఇవ్వనందువల్లే కేసీఆర్‌కు తెలంగాణ విషయం గుర్తుకు వచ్చిందని విమర్శించారు. 2000లకు ముందు జరిగిన ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాల్లో కేసీఆర్ పాత్ర లేదని చెప్పారు. మాయమాటలతో ప్రజలను ఇంకా ఎంతో కాలం నమ్మించలేరని చెప్పారు. అవకాశం వస్తే.. ఎన్డీఏతో జతకట్టడానికి కూడా కేసీఆర్ వెనుకాడరని ఆరోపించారు. ‘అంబాసిడర్ కారు 25 ఏళ్ల కిందటి మోడల్, ఇప్పుడు మార్కెట్లోకి ఎన్నో కొత్త మోడళ్లు వచ్చాయి.. ప్రజలు డొక్కు అంబాసిడర్ కారు గుర్తును తిరస్కరించమే కాకుండా, సైకిల్‌కు పంక్చర్ చేయడం ఖాయమని చెప్పారు. టీడీపీ అధినేత చంద్రబాబుకు ఓటేస్తే నరేంద్ర మోడీకి వేసినట్లేనని పేర్కొన్నారు. ఆయన నారా చంద్రబాబు నాయుడు కాదని, నరేంద్ర చంద్రబాబు నాయుడన్నారు. టీడీపీ-బీజేపీలు రెండు మోసాల పార్టీలేనన్నారు. ఈ సందర్భంగా జైరాం రమేశ్ ‘తెలంగాణ ఇచ్చింది..తెచ్చింది కాంగ్రెస్’, నర్సారెడ్డి గారూ తదితర పదాలను తెలుగులోకి మాట్లాడి కార్యకర్తలను ఉత్సాహపరిచారు. ఏఐసీసీ ఎస్సీ సెల్ అధ్యక్షులు కొప్పుల రాజు మాట్లాడుతూ గజ్వేల్‌లో జరుగుతున్న ఎన్నికలను విశ్వాసానికి, విశ్వాస ఘాతుకానికి మధ్య జరుగుతున్నవిగా అభివర్ణించారు. -
కేసీఆర్‌ది హిట్లర్ పాలసీ: జైరాం రమేష్
తెలంగాణలో సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేది మేమే: జైరాం రమేష్ చంద్రబాబుది చిన్న గడ్డం.. మోడీది పెద్ద గడ్డం తెలంగాణకు హైదరాబాద్ ఎలాగో.. సీమాంధ్రకు పోలవరం అలాంటిది సాక్షి ప్రతినిధి, ఖమ్మం: ‘‘కేసీఆర్‌ది హిట్లర్ పాలసీ.. ఓ నియంత.. ఆయన చేసే రాజకీయం అబద్దాలతో కూడుకున్నది. బెదిరింపు రాజకీయం. ఆయన గాలిలో విషాన్ని వ్యాపింపజేస్తున్నాడు’’ అని కేంద్రమంత్రి జైరాం రమేష్ నిప్పులు చెరిగారు. డీసీసీ కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఉద్యోగుల పంపిణీ ఎలా చేయాలన్నది రాజ్యాంగంలో ఉన్నట్లుగానే ముందుకెళుతున్నామని చెప్పారు. దొరల తెలంగాణ కాదని, సామాజిక న్యాయంతో కూడిన తెలంగాణ ఏర్పాటు కావాలన్నదే కాంగ్రెస్ విధానమన్నారు. ‘తండ్రి, కొడుకు, కూతురు, అల్లుడు.. ఇప్పుడు నలుగురున్నారు. తర్వాత ఎంతమంది అవుతారో? ఆయన కుటుంబం కోసం తెలంగాణ ఏర్పడలేదు.’ అని జైరాం పేర్కొన్నారు. టీఆర్ఎస్ కేవలం నాలుగు జిల్లాలకే పరిమితం అయిన పార్టీ అని, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవసరం అయిన 60 స్థానాలు ఆ పార్టీకి రావని ఆయన జోస్యం చెప్పారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మాత్రమే సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని, 60 స్థానాలకు పైగా సీట్లు గెలిచే శక్తి కాంగ్రెస్‌కు మాత్రమే ఉందన్నారు. తెలుగుదేశం, బీజేపీల మధ్య ఎలాంటి తేడా లేదని, చంద్రబాబును చూస్తే తనకు మోడీనే కనిపిస్తాడని చెప్పారు. కాకపోతే బాబుకు చిన్నగడ్డం ఉంటుందని, మోడీకి మొహం నిండా పెద్ద గడ్డం ఉంటుందని ఎద్దేవాచేశారు. అవి రెండుపార్టీలు కావని, ఒకటే పార్టీ అని, బాబుకు ఓటేస్తే మోడీకి వేసినట్టేనని అన్నారు. టీడీపీ నిజమైన రూపమే బీజేపీ అన్న జైరాం.. అవకాశం వస్తే కేసీఆర్ కూడా బీజేపీతో కలసి పోతాడని అన్నారు. కేంద్రంలో మళ్లీ వచ్చేది సంకీర్ణ ప్రభుత్వమేనని, దానికి కాంగ్రెస్ పార్టీనే నేతృత్వం వహిస్తుందని ఆయన జోస్యం చెప్పారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం వల్ల అటు సీమాంధ్ర, ఇటు తెలంగాణ రెండు ప్రాంతాలకు ఉపయోగం కలుగుతుందని చెప్పారు. తెలంగాణ ఏర్పాటుతో పాటు సీమాంధ్రుల రక్షణ కూడా తమకు ముఖ్యమని ఆయన అన్నారు. తెలంగాణకు హైదరాబాద్ ఎలాంటిదో, సీమాం ధ్రకు పోలవరం ప్రాజెక్టు అలాంటిదని వ్యాఖ్యానించారు. నిర్వాసితులకు అన్యాయం జరగనీయబోమని హామీ ఇచ్చారు. ‘ఇక్కడ టీడీపీ తరఫున ఎంపీ అభ్యర్థిగా నామా నాగేశ్వరరావు పోటీచేస్తున్నారు. ఆయన స్థాపించిన ‘మధుకాన్’ కంపెనీలో మధు లేదు.. కాన్ మాత్రమే ఉంది.. కాన్ అంటే మోసం.. మధుకాన్ అంటేనే మోసం.’ అని జైరాం రమేష్ వ్యాఖ్యానించారు. అస్సాం, జార్ఖండ్ లాంటి చాలా రాష్ట్రాల్లో నామాప్రాజెక్టులు కట్టకుండా పారిపోయాడని ఎద్దేవా చేశారు. తాము అధికారంలోకి వస్తే తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడున్న పదిజిల్లాలను 20 జిల్లాలుగా చేస్తామన్నారు. కాంగ్రెస్, సీపీఐల పొత్తు విషయంలో అసంతృప్తి ఉన్నా.. సమష్టిగా పనిచేస్తామన్నారు. రెండు పార్టీల నడుమ రేణుకాచౌదరి వారధిగా ఉన్నారని జైరాం అన్నారు. -
బీజేపీపై నోరుపారేసుకోవద్దు
కేసీఆర్‌కు కిషన్‌రెడ్డి హెచ్చరిక తెలంగాణ సాధనలో మా పార్టీ పాత్ర మరవద్దు జైరామ్ రమేశ్ నోట్లో ఉన్నది నాలుకనేనా..? జై తెలంగాణ అనే హక్కు కాంగ్రెస్‌కు లేదు సాక్షి, హైదరాబాద్: ‘కేసీఆర్... మీ పార్టీ ఇప్పుడు ఉద్యమ పార్టీ కాదు. సాధారణ పార్టీ. ఇంతకాలం ఉద్యమపార్టీగా మీరేమన్నా చెల్లిందేమో. ఇప్పుడు కుదరదు. తెలంగాణ కోసం చిత్తశుద్ధితో ప్రయత్నించిన బీజేపీని విమర్శించే నైతిక హక్కు మీకు లేదు. ఇక మాటకు మాట సమాధానం చెప్తాం’ అని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి హెచ్చరించారు. శనివారం సాయంత్రం ఆయన బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బీజేపీ-టీడీపీది అపవిత్ర పొత్తు అంటున్న కేసీఆర్ గతంలో తెలంగాణ వ్యతిరేకి సీపీఎంతో రెండుమార్లు పొత్తు పెట్టుకున్నప్పుడు ఈ సంగతి గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు. అలాగే తెలుగుదేశంతో పొత్తు పెట్టుకున్న విషయం మరిచిపోతే ఎలా అని పేర్కొన్నారు. టీడీపీని విమర్శిస్తే తమకు సంబంధం లేదని, కానీ బీజేపీపై నోరుపారేసుకుంటే ఊరుకోమన్నారు. తెలంగాణ కోసం చిత్తశుద్ధితో ప్రయత్నించిన బీజేపీపై కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ కూడా అబద్ధాలు చెబుతున్నారని ఆరోపించారు. తెలంగాణను బీజేపీ అడ్డుకునే ప్రయత్నం చేసిందని జైరాం వ్యాఖ్యానిస్తే అయన నోట్లో ఉన్నది నాలుకోకాదో అర్థంకావడం లేదన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ మూడో స్థానానికి దిగజారినట్టు కనిపిస్తుండడంతో ఆ పార్టీ నేతలు ఇలా మాట్లాడుతున్నారనిపిస్తోందని ఎద్దేవా చేశారు. కరీంనగర్లో సోనియా సభ విఫలమైన తీరు చూస్తే కాంగ్రెస్ పరిస్థితి అర్థమవుతోందన్నారు. *తెలంగాణకు జై అన్న పాపానికి రేణుక అనే బాలిక పై కాల్పులు జరిపించిన కాంగ్రెస్ పార్టీకి జై తెలంగాణ అనే హక్కులేదన్నారు. *తెలంగాణ యువకుల మృతికి కారణమైన కాంగ్రెస్‌కు ఆ పాపం తగిలి తగిన శాస్తే జరుగుతుందని, ఇది తన శాపమని కిషన్‌రెడ్డి అన్నారు. *మోడీ వస్తే మతకలహాలు జరుగుతాయంటున్న కాంగ్రెస్ నేతలు, మర్రి చెన్నారెడ్డిని గద్దె దింపేందుకు పాతబస్తీలో మతకలహాలు సృష్టించింది కాంగ్రెస్ కాదని చెప్పగలరా అని ప్రశ్నించారు. అవి కాంగ్రెస్ నేతలు చేయించినవేనని అప్పట్లో చెన్నారెడ్డి చెప్పారని గుర్తు చేశారు. *బీజేపీ అధికారంలో ఉంటేనే ప్రశాంత వాతావరణం నెలకొంటుందని చెప్పారు. *ప్రాణహిత - చేవెళ్ల పథకానికి అనుమతులు లేనందున జాతీయహోదా రాలేదని పొన్నాల చెప్పడం హాస్యాస్పదమన్నారు. *అనుమతులు లేనప్పుడు రూ.నాలుగైదువేల కోట్లు ఎలా ఖర్చు చేశారో పొన్నాల ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. *ఖర్చు చేసిన నిధుల్లో 60 శాతం కాంగ్రెస్ నేతల జేబుల్లోకి చేరాయని ఆరోపించారు. *నిత్యం విమర్శలు సంధించుకుంటున్న టీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు భాష విషయంలో సంయమనం పాటించాలన్నారు. *జాతి విస్తృత ప్రయోజనాల దృష్ట్యా టీడీపీతో పొత్తు పెట్టుకున్నామన్నారు. అయినప్పటికీ తెలంగాణ విషయంలో తాము ఆ పార్టీని వెనకేసుకురావడం లేదన్నారు. -
టీఆర్ఎస్ కుటుంబ పార్టీ
వికారాబాద్, పూడూరు, న్యూస్‌లైన్: టీఆర్ఎస్ కుటుంబ పార్టీ అని, కేసీఆర్‌ను ఎవరూ విశ్వసించొద్దని కేంద్ర మంత్రి జైరాంరమేష్ పిలుపునిచ్చారు. గురువారం ఆయన వికారాబాద్‌లోని గౌలీకర్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో, అనంతరం పూడూరు మండలంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ ప్రాంతంలో విద్యార్థుల బలిదానాలకు ప్రధాన కారణం కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులేనని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధేనని ఆయన స్పష్టంచేశారు. కాంగ్రెస్‌తోనే సామాజిక న్యాయం సాధ్యమని పేర్కొన్నారు. టీఆర్ఎస్ ఆవిర్భావానికి ముందు తెలంగాణ కోసం ఎంతోమంది మహానుభావులు పోరాటాలు చేశారన్నారు. టీడీపీ హయాంలో మంత్రి పదవి దక్కలేదనే కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీని స్థాపించారన్నారు. 60 ఏళ్ల ప్రజా పోరాటాలను దృష్టిలో ఉంచుకొనే సోనియాగాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చారని ఆయన కొనియాడారు. టీఆర్ఎస్ పార్టీలో ఉన్నవారంతా చుట్టాలేనని అందులో ప్రజలు, కార్యకర్తలు, నాయకులు ఎక్కడున్నారని ఆయన దుయ్యబట్టారు. ‘కారు’కు కాలం చెల్లింది ‘దే శంలో ప్రస్తుతం ఎక్కడైనా.. ఎవరైనా అంబాసిడర్ కారును వాడుతున్నారా.. కాలం చెల్లిన కారును స్టార్ట్ చేయాలంటే తాళం చెవిని ఇరవైసార్లు ఉపయోగించినా ఫలితం ఉండదు. ఈ నేపథ్యంలో కారును ఎవైరె నా తోసి స్టార్ట్ చేసినా అది ఎక్కడో ఒక చోట ఆగిపోతుంది.. ఆ కారులాగే కేసీఆర్ కూడా ఎక్కడో ఓ చోట ఆగిపోయి.. ఏదో ఓ పార్టీలో తన పార్టీని కలిపే పరిస్థితి వస్తుంది.. అలాంటి పార్టీకి ప్రజలు ఓటేస్తే నక్కతోకను పట్టుకొని నదిని ఈదినట్లే అవుతుంద’ని కేంద్రమంత్రి తనదైన శైలిలో వ్యంగ్యంగా అన్నారు. టీఆర్ఎస్ పార్టీ ఇన్నాళ్లూ అదిగో తెలంగాణ.. ఇదిగో తెలంగాణ అని కల్లబొల్లి మాటలు చెప్పి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడిందని.. దీంతో ప్రజలు తమ విలువైన ప్రాణాలను త్యాగం చేశార న్నారు. కేసీఆర్ అనే ఒక్క వ్యక్తితో సామాజిక తెలంగాణ ఎలా సాధ్యమవుతుందో ప్రజలే గుర్తించాలని కోరారు. తెలంగాణ అభివృద్ధి జరగాలంటే అది హైదరాబాద్‌పై వచ్చే ఆదాయంతో సాధ్యమవుతుందన్నారు. వికారాబాద్‌లో ప్రసాద్‌కుమార్ గెలిస్తే ఢిల్లీలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన్నట్లేనని ఆయన జోస్యం చెప్పారు. కార్యక్రమంలో మాజీ మంత్రులు ప్రసాద్‌కుమార్, చంద్రశేఖర్, ఎమ్మెల్సీ యాదవరెడ్డి, చేవెళ్ల పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి కార్తీక్‌రెడ్డి, జిల్లా గ్రంథాలయ చైర్మన్ హఫీజ్, న్యాయవాది గోవర్ధన్‌రెడ్డి, కొప్పుల రాజు పాల్గొన్నారు. పలు గ్రామాల్లో ప్రచారం.. పూడూరు మండలం పెద్ద ఉమ్మెంతాల, కంకల్ గ్రామాల్లో కేంద్ర మంత్రి జైరాంరమేష్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సీమాంధ్రలో కాంగ్రెస్ దెబ్బతింటుందని తెలిసినా సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రం ఇచ్చారన్నారు. దళితుడిని సీఎం చేస్తానని చెప్పి ఇప్పుడు మాటమారుస్తున్నాడని అన్నారు. కాంగ్రెస్ పార్టీ పరిగి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి టీఆర్‌ఆర్‌ను, చేవెళ్ల లోక్‌సభ అభ్యర్థి కార్తీక్‌రెడ్డిని భారీ మెజార్టీలో గెలిపించాలని పిలుపునిచ్చారు. అనంతరం ఏఐసీసీ ఎస్సీ, ఎస్టీ కమిటీ విభాగం ప్రతినిధి కొప్పుల రాజు మాట్లాడుతూ టీఆర్‌ఆర్‌ను గెలిపిస్తే నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందుతుందన్నారు. కాంగ్రెస్ పార్టీ పూడూరు మండల అధ్యక్షుడు సుభానయ్య, డీసీసీ ఉపాధ్యక్షుడు నర్సింహారెడ్డి, సునంద బుగ్గన్నయాదవ్, శ్రీనివాస్‌రెడ్డి, రఘునాథ్‌రెడ్డి, కంకల్ వెంకటేశం, సర్పంచ్‌లు రాజు, మధుసూదన్‌రెడ్డి, షకీల్, మాజీ ఎంపీపీ భగవాన్దాన్, కంకల్ ప్రభాక్గుప్త, బాదం శ్రీనివాస్‌గుప్త, శ్యాం, మేఘమాల, సురేఖ తదితరులు పాల్గొన్నారు. -
అయితే ఓకేనా...!
రాష్ట్ర విభజన అనంతరం ఇక్కడి రాజకీయాల్లో కీలక భూమిక పోషిస్తున్న కేంద్రమంద్రి జైరాం రమేష్ జిల్లాలో ఎన్నికల వేళ పర్యటించడం పట్ల రాజకీయ పరిశీలకులు పలు ఊహాగానాలు చేస్తున్నారు. వర్గాలతో ఇక్కట్లు పడుతున్న ‘పెద్దలను’ ఒకే బాటన నడిపించడం, ఎల‘క్షణాలకు’ అవసరమైన ‘ఇంధనాన్ని’ సమకూర్చడం అసలు ఆంతర్యమని తెలుస్తోంది. ‘సార్వత్రిక’ బరిలో కాంగ్రెస్ అభ్యర్థులకు గెలుపు బాట దిశగా పథనిర్దేశం చేసినట్లు సమాచారం. సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్ : అభ్యర్థులు ప్రచార బాట వేళ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు కేంద్ర మంత్రి జైరాం రమేశ్, ఏఐసీసీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు కొప్పుల రాజు మంగళవారం జిల్లాలో పర్యటించడం చర్చనీయాంశమైంది. నామినేషన్ల పర్వం ముగిసినా జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ప్ర చారం పట్టాలకెక్కక పోవడంతో స్వయంగా ఏఐసీసీ రంగంలోకి దిగినట్లు సమాచారం. తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ నేతలెవరూ ప్రచారం, పార్టీలో అంతర్గత విషయాలపై దృష్టి సారించే పరిస్థితి కని పించడం లేదు. పీసీసీ ముఖ్యులు పొన్నాల లక్ష్మ య్య, ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర రాజనర్సింహ సొంత నియోజకవర్గాలకే పరిమితమవడంతో జిల్లా వైపు తొంగి చూసే పరిస్థితి కనిపించడం లేదు. పార్టీ నేతలను అంతర్గతంగా సమన్వయం చేసే నాథుడు లేకపోవడంతో అసంతృప్తులు ఒక్కరొక్కరుగా పా ర్టీని వీడుతున్నారు. మరికొందరు అలక వహించి అధికారిక అభ్యర్థులకు సహకరించడం లేదు. టికెట్ దక్కించుకునేందుకు ఉత్సాహం చూపిన నేతలు ద్వితీయ శ్రేణి నాయకులు, కేడర్‌ను ఏకతాటిపై నడిపేందుకు తంటాలు పడుతున్నారు. నామినేషన్ల పర్వం ముగిసి నాలుగు రోజులైనా ఎన్నికల ప్రచారం ఊపందుకోవడం లేదు. నిధుల సమీకరణ పేరిట టికెట్ దక్కించుకున్న అభ్యర్థులు పార్టీ నేతలకు, కేడర్‌కు అందుబాటులో ఉండటం లేదు. దీంతో పార్టీ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న కార్యకర్తలకు సమాధానం చెప్పేవారు కూడా కరువయ్యారు. జిల్లాలో పార్టీ పరిస్థితిపై అధిష్టానానికి సంకేతాలు అందడంతో దిద్దుబాటు చర్యల్లో భాగంగా జైరాం రమేశ్, కొప్పుల రాజు రంగంలోకి దిగినట్లు సమాచారం.పార్టీ టికెట్ దక్కించుకున్న అభ్యర్థులు సొంతంగా నిధులు సమకూర్చుకోవడంతో పాటు పార్టీ అందించే సాయం కోసం ఎదురుచూస్తున్నారు. మం గళవారం జిల్లాలో పర్యటించిన జైరాం రమే శ్, కొప్పుల రాజు పార్టీ అభ్యర్థుల ఆర్దిక పరిస్థితి, ఎంపీ అభ్యర్థులతో సమన్వయం వంటి అంశాలపైఆరా తీసినట్లు సమాచారం. -
'నా కూతురు నా మాట వినడం లేదు మహాప్రభో'
కరవ మంటే కప్పకు కోపం విడవమంటే పాముకు కోపం అన్నట్లుంది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్థన్ రెడ్డి పరిస్థితి. కాంగ్రెస్ అధిష్టానం ఆదేశాల మేరకు ఎమ్మెల్యే నామినేషన్ పత్రాలు ఉపసంహరించుకోవాలని పాల్వాయి ... తన కుమార్తె స్రవంతికి సూచించారు. అందుకు ఆమె ససేమిరా అంది. ఇంకే చేస్తాంమంటూ పాపం పాల్వాయి దగ్గరుండి తన కుమార్తె చేత శనివారం నామినేషన్ దాఖలు చేయించారు. ఆ విషయం కాస్తా కేంద్రమంత్రి, జీవోఎం సభ్యుడు జైరాం రమేష్‌కు తెలిసింది. అంతే పాల్వాయి గోవర్థన్పై జైరాం రమేష్ నిప్పులు తొక్కారు. నామినేషన్ ఉపసహంరింప చేయాలంటూ ఇంటికెళ్లి మరీ ఆదేశించారు. తన కుమార్తె తన మాట వినడం లేదు మహాప్రభో అంటూ పాల్వాయి గోవర్ధన్ కన్నీటీ పర్యంతమైయ్యారు. దాంతో జైరాం తిక్క రేగింది. కాంగ్రెస్ పార్టీ నిన్ను రాజ్యసభకు పంపిస్తే ఇంత పని చేస్తావా అంటూ పాల్వాయికి జైరాం తలంటాడు. అంతేకాకుండా కన్న కూతురుకు వ్యతిరేకంగా ప్రచారం చేయాలని పాల్వాయిని జైరాం రమేష్ ఆదేశించారు. మునగొడు ఎమ్మెల్యే టికెట్ పాల్వాయి గోవర్థన్ రెడ్డి ... తన కుమార్తె స్రవంతికి కాంగ్రెస్ అధిష్టానం కేటాయిస్తుందని ఆశించారు. అయితే కాంగ్రెస్ అధిష్టానం పాల్వాయి ఆశలుపై నీళ్లు చల్లింది. ఇంకేముంది స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల బరిలో దిగుతానని స్రవంతి తన తండ్రికి బల్లగుద్ది చెప్పింది. దాంతో పాల్వాయి తన కుమార్తె నామినేషన్ దగ్గరుండి మరీ వేయించారు. -
హైదరాబాద్ ఆదాయమంతా తెలంగాణకే
కేంద్రమంత్రి జైరాం రమేష్ కోదాడ , న్యూస్‌లైన్: హైదరాబాద్ నుంచి వచ్చే ఆదాయాన్ని తెలంగాణకే కేటాయిస్తామని కేంద్ర మంత్రి జైరాం రమేష్ అన్నారు. నల్లగొండ జిల్లా కోదాడలో ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం రోడ్‌షో నిర్వహించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. హైదరాబాద్ నుంచి 20నుంచి 30వేల కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని, ఈ నిధులతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవచ్చని తెలిపారు. తెలంగాణలో విద్యుత్ కొరతను తీర్చేందుకు కేంద్రం నాలుగువేల మెగావాట్లతో నూతన విద్యుత్ కేంద్రాన్ని మంజూరు చేయనున్నట్లు చెప్పారు. సింగరేణిలో తెలంగాణకు 51శాతం, కేంద్ర ప్రభుత్వానికి 49 శాతం వాటా ఉండే విధంగా పంపకాలు జరుగుతున్నాయని తెలిపారు. తెలంగాణలో వెనుకబడిన ప్రాంతాల్లో పరిశ్రమలు పెట్టాలనుకునే వారికి సీమాంధ్రతో సమానంగా రాయితీలు ఇస్తామని హామీ ఇచ్చారు. 50ఏళ్ల క్రితమే కాంగ్రెస్ ప్రభుత్వం దళితుడైన దామోదర సంజీవయ్యను ముఖ్యమంత్రిని చేసిందని ఆయన గుర్తుచేశారు. తెలంగాణ, సీమాంధ్రలో కాంగ్రెస్ ప్రభుత్వాలే ఉండే విధంగా ప్రజలు పట్టం కట్టాలని ఆయన పిలుపునిచ్చారు. విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి, నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
అన్నా.. కలిసిపోదామే!
హైకమాండ్ ఆదేశాలతో శ్రీధర్‌బాబు ఇంటికెళ్లిన వివేక్ విభేదాలు పక్కనబెట్టి ఐక్యంగా వెళదామని విజ్ఞప్తి హైదరాబాద్: మాజీ మంత్రి శ్రీధర్‌బాబు, పెద్దపల్లి పార్లమెంట్ సభ్యుడు జి.వివేక్ ఒక్కటయ్యారు. తమ మధ్యనున్న రాజకీయ విభేదాలను ప్రస్తుతానికి పక్కనబెట్టారు. ఈ విషయంలో కాంగ్రెస్ రాష్ర్ట వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్‌సింగ్ చూపిన చొరవ ఫలించింది. నిజానికి వివేక్ టీఆర్ఎస్ని వీడి మళ్లీ కాంగ్రెస్‌లో చేరడాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన శ్రీధర్‌బాబు తన మనసులోని మాటను హైకమాండ్ పెద్దలకు తెలిపి నిరసన వ్యక్తం చేశారు. హైకమాండ్ పెద్దలు దిగ్విజయ్, జైరాం రమేశ్‌లకు ఫోన్ చేసి పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు అండగా ఉన్న నేతలను పక్కనబెట్టి మరో పార్టీ నుంచి వచ్చిన వివేక్ సూచించిన వారికి టికెట్లు ఎలా ఇస్తారని నిలదీశారు. దీంతో దిద్దుబాటు చర్యలకు దిగిన దిగ్విజయ్ ఆదివారం శ్రీధర్‌బాబుకు ఫోన్ చేసి బుజ్జగించారు. ఎన్నికల్లో కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు. అదే సమయంలో వివేక్‌కు ఫోన్‌చేసి శ్రీధర్‌బాబుతో సఖ్యతగా ఉండాలని ఉపదేశించారు. ఈ నేపథ్యంలో వెంటనే శ్రీధర్‌బాబు నివాసానికి వెళ్లిన వివేక్ పాత విబేధాలను పక్కనబెట్టాలని కోరారు. శ్రీధర్‌బాబు తన పట్ల ఆగ్రహంగా ఉన్నారని గ్రహించిన వివేక్ తన తండ్రి వెంకటస్వామిని రంగంలోకి దించారు. ఆదివారం రాత్రి శ్రీధర్‌బాబుకు ఫోన్ చేసిన కాకా.. కొన్ని తప్పులు జరిగిన మాట వాస్తవమేనని, కలిసిమెలిసి ఎన్నికల్లోకి వెళ్లాలని సర్దిచెప్పారు. దీనిపై మాట్లాడేందుకు ఇంటికి రావాలని కోరారు. తొలుత శ్రీధర్‌బాబు నిరాకరించినా.. కాకా పట్టుబట్టడంతో వచ్చారు. ఈ నేపథ్యంలో సోమవారం పలువురు టీ-కాంగ్రెస్ నేతలను కూడా వివేక్ అల్పాహారానికి ఆహ్వానించారు. అనంతరం వారితో మీడియా సమావేశాన్ని నిర్వహించి, తామందరం ఐక్యంగా ఉన్నామనే సంకేతాలను పంపేందుకు యత్నించారు -
పాలమూరులో జైరాం పర్యటన..రచ్చ..రచ్చ
మహబూబ్‌నగర్, న్యూస్‌లైన్: తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చిన విషయాన్ని జనంలోకి తీసుకెళ్లడానికి, ఎన్నికల వేళ పార్టీ శ్రేణులను సమాయత్తం చేసేందుకు బుధవారం పాలమూరుకు వచ్చిన కేంద్రమంత్రి జైరాంరమేశ్, రాహుల్ దూత కొప్పుల రాజు ఎదుట కాంగ్రెస్ శ్రేణుల ఆగ్రహ జ్వాలలు భగ్గుమన్నాయి. ఆ పార్టీ నాయకులు, కార్యకర్తల నిరసనలు..నిలదీతల మధ్య పర్యటన రసాభాసగా మారింది. మునిసిపాలిటీ ఎన్నికల్లో తమకు టికెట్లు ఇవ్వలేదని మహబూబ్‌నగర్ పట్టణంలోని 31, 37వార్డుల అభ్యర్థులు, వారి మద్దతుదారులు గొడవ సృష్టించారు. మహబూబ్‌నగర్ మునిసిపాలిటీ 31 వార్డు నుంచి తమ కుటుంబానికి టికెట్ ఇప్పిస్తామని నాయకులు చెప్పడంతో తన చిన్న కూతురు రేణుకను నామినేషన్ వేయిస్తే బీఫామ్ ఇవ్వకుండా మొండి చెయ్యి చూపారని డీసీసీ కార్యదర్శి నాగమణి స్థానిక డీసీసీ కార్యాలయం వద్ద కన్నీటిపర్యంతమైంది. ఆమె కూతుళ్లు ఉమ, టికెట్ ఆశించిన రేణుక కేంద్రమంత్రి జైరాం రమేశ్ ప్రెస్‌మీట్ జరుగుతున్న సమయంలో హాలు బయటపార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ హంగామా చేశారు. తమకు టికెట్ రాకుండా ఎమ్మెల్సీ జగదీశ్వర్‌రెడ్డి, ఒబేదుల్లా కొత్వాల్ ముత్యాల ప్రకాశ్ కుట్ర చేశారని, డబ్బులకు టికెట్లు అమ్ముకున్నారని ఆరోపించారు. తమ ఉసురు తగులుతుందని శాపనార్థాలు పెట్టారు. జైరాంరమేశ్, ఉత్తమ్‌కుమార్ రెడ్డి, కొప్పుల రాజును అడ్డగించారు. ఎమ్మెల్యే అబ్రహాం అనుచరుల వీరంగం: జైరాంరమేశ్ హైదరాబాద్‌లో వేరే సమావేశంలో పాల్గొనాల్సి ఉన్నందున ఎమ్మెల్యే అబ్రహాంతో మాట్లాడం కుదరదని డీసీసీ అధ్యక్షుడు ఒబేదుల్లా కొత్వాల్ చెప్పడంతో ఆ నియోజకవర్గానికి చెందిన ఆయన అనుయాయులు గొడవకు దిగారు. పరిస్థితి చేయి దాటిపోతుందని ఎమ్మెల్యే అబ్రహాంకు అవకాశమివ్వగా కాంగ్రెస్ పార్టీలో లేని మాజీ ఎమ్మెల్యే చల్లా వెంకట్రాంరెడ్డి ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల బీఫామ్స్ తెచ్చి తన వర్గం వారికి పంచుతానని చెప్పుకుంటూ ప్రచారం చేస్తున్నాడని, దీనివెనక పార్టీ జిల్లా నాయకత్వం హస్తం ఉందని వారు ఆరోపించారు. అయినా సంతృప్తి చెందని ఆయన అనుచరులు వేదిక పక్కన ఉన్న కుర్చీలను ఎత్తివేసి నిరసన ప్రదర్శించారు. -
చింతా ‘పోర్టు’ రాజకీయం
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: ‘‘దుగ్గరాజపట్నం చూడ రో. ఓడరేవు చూడరో’’ అంటూ కొన్ని నెలలుగా ప్రచారం చేయించిన తిరుపతి ఎంపీ డాక్టర్ చింతామోహన్ ఇప్పుడు పోర్టు కావాలంటే చేతికే ఓటేయాలనే నినాదంతో ఎన్నికల రాజకీయానికి తెరలేపారు. వెయ్యి రాకెట్లు అడ్డొచ్చినా పోర్టు నిర్మాణాన్ని ఆపలేవని చెప్పిన ఆయన ఈసారి తనను గెలిపిస్తే పోర్టు తెప్పించి తీరుతానని జనానికి ఎర వేసే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఆయన బుధవారం వాకాడు మండలం దుగరాజపట్నం ప్రాంతానికి కేంద్ర మంత్రి జైరాం రమేష్‌ను రప్పించే ఏర్పాట్లు చేశారు. దేశంలో నిర్మించనున్న రెండు అతిపెద్ద నౌకాశ్రయాల్లో ఒకదానిని నెల్లూరు జిల్లా దుగరాజపట్నంకు మంజూరు చేయించడానికిఎంపీ చింతామోహన్ ప్రయత్నించారు. నౌకాశ్రయం వస్తే నెల్లూరు నుంచి తిరుపతి దాకా భారీ అభివృద్ధి జరుగుతుందనే నినాదంతో జనంలోకి వెళ్లే ప్రయత్నం చేశారు. నౌకాశ్రయం వల్ల ఈ ప్రాంతంలో భూముల ధరలు అమాంతం పెరిగి జనం కోటీశ్వరులవుతారని అరచేతిలో వైకుంఠం చూపించే రాజకీయం నెరిపారు. నౌకాశ్రయం ప్రతిపాదిత ప్రాంతం పులికాట్ పక్షుల సంరక్షణ ప్రాంతంగా ఉండటంతో వన్యప్రాణి సంరక్షణ విభాగం, శ్రీహరి కోట రాకెట్ ప్రయోగ కేంద్రానికి సమీపంలోనే ఉండటంతో షార్ అధికారులు అభ్యంతరం పెట్టారు. పులికాట్ సరస్సులోని 10 కిలోమీటర్ల ప్రాంతం పక్షుల రక్షిత ప్రాంతంగా ఉండటం వల్ల నౌకాశ్రయం నిర్మాణానికి చట్టం అంగీకరించదని అధికారులు తేల్చారు. రాకెట్ ప్రయోగాలకు భద్రతా కారణాల రీత్యా ఇక్కడ పోర్టు నిర్మాణం మంచిది కాదని షార్ అధికారులు కేంద్రప్రభుత్వానికి వారు లేఖ రాశారు. రాష్ర్టప్రభుత్వం సైతం దుగరాజపట్నంలో కాకుండా ప్రకాశం జిల్లా రామాయపట్నంలో పోర్టు నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది. ఓడరేవు నిర్మాణ ప్రాంతం మార్పు దుగరాజపట్నంలో పోర్టు నిర్మాణానికి చట్టపరంగా అనేక అవాంతరాలు ఎదురయ్యాయి. దీంతో ఇక్కడ వేలాది ఎకరాల భూములు కొనుగోలు చేసిన వ్యాపారులు, రాజకీయ నేతలు ఓడరేవు నిర్మాణ ప్రాంతాన్ని మార్చడానికి స్కెచ్ వేశారు. ఆరు నూరైనా దుగరాజపట్నంలోనే పోర్టు నిర్మించేలా చేస్తానని చెబుతూ వచ్చిన చింతా మోహన్ ఓడరేవు నిర్మాణాన్ని దుగరాజపట్నంలో కాకుండా ఇక్కడికి ఐదారు కిలోమీటర్ల దూరంలో ఉన్న తూపిలిపాలెంకు మార్చడానికి ప్రతిపాదించారు. ఈ మేరకు అప్పటి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి సన్నిహితుడైన ఒక పత్రికాధిపతిని సైతం ఆయన రంగంలోకి దించినట్లు ఆరోపణలు వున్నాయి. పత్రికాధిపతికి బినామీ పేర్ల మీద వందలాది ఎకరాల భూములను కొనుగోలు చేయించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ పరిణామం తర్వాతే రాష్ట్ర ప్రభుత్వం తూపిలిపాలెంలో పోర్టు నిర్మాణానికి అభ్యంతరం చెప్పకుండా వ్యవహరించిందనే ప్రచారం ఉంది. కేంద్ర పర్యావరణ చట్టాన్నే సవరించి పులికాట్ సరస్సులో పక్షుల సంరక్షిత ప్రాంతాన్ని 10 నుంచి 2 కిలోమీటర్లకు తగ్గిస్తూ కేంద్రప్రభుత్వం ప్రత్యేకంగా గెజిట్ విడుదల చేసింది. అభివృద్ధి చాటున జరుగుతున్న రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం కేంద్రప్రభుత్వం ఈ గెజిట్‌ను విడుదల చేయడం పర్యావరణ, జంతుప్రేమికులకు విస్మయం కలిగించింది. ఇంతే కాకుండా తమకు గల అధికార బలంతో శ్రీహరికోట రాకెట్ ప్రయోగ కేంద్రం ఉన్నతాధికారులను కూడా నోరెత్తకుండా చేయగలిగారు. ఈ పరిణామం తర్వాత దుగరాజపట్నం, తూపిలిపాలెం, వాకాడు, కోట, సూళ్లూరుపేట, గూడూరు ప్రాంతాల్లో భూముల ధరలకు మరింత రెక్కలు వచ్చాయి. వివిధ ప్రాంతాలకు చెందిన రాజకీయ నేతలు, సినిమా రంగానికి చెందిన వారు, వ్యాపారవేత్తలు ఈ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున భూములు కొనుగోలు చేశారు. హడావుడి శంకుస్థాపనకు ఒత్తిడి కేంద్ర ప్రభుత్వంలో పలుకుబడి వున్న ఎంపీ చింతామోహన్ తూపిలిపాలెం వద్ద పోర్టు నిర్మాణానికి ఏదో ఒకరకంగా శంకుస్థాపన చేయించడానికి గత నెలలో హడావుడి చేశారు. పోర్టు నిర్మాణం బాధ్యతలు చూస్తున్న విశాఖపట్నం పోర్టు అధికారులు, భూసేకరణ చేయాల్సిన జిల్లా కలెక్టర్, రెవెన్యూ అధికారులు, అనుమతులు మంజూరుచేయాల్సిన అటవీ అధికారులను తూపిలిపాలెంకు రప్పించారు. ఫిబ్రవరి 28 లేదా మార్చి 3వ తేదీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్సింగ్ వచ్చి పోర్టు నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారని అధికారులతో సైతం హడావుడి చేయించారు. పధాని చేతుల మీదుగా పోర్టు నిర్మాణానికి పునాది రాయి వేయిస్తే ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీకి లాభిస్తుందని కేంద్ర ప్రభుత్వం మీద తీవ్ర ఒత్తిడి తెచ్చినట్లు తెలిసింది. అయితే రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, ఎన్నికల షెడ్యూల్ విడుదలకు సమయం ముంచుకొస్తుండటంతో గత నెల 28వ తేదీ నాటికి ప్రధాని తూపిలిపాలెం రావడం కుదరదని ప్రధాని కార్యాలయం తేల్చిచెప్పింది. ఈ లోపే ఎన్నికల షెడ్యూల్ రావటంతో శంకుస్థాపనకు అవకాశం లేకుండా పోయింది. ఈ విషయం పక్కకు పెట్టి చింతామోహన్ అధికారులు భూసేకరణలో నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే పోర్టు నిర్మాణానికి శంకుస్థాపన చేయించలేక పోయామనే వాదన అందుకున్నారు. ఎన్నికల ఎత్తు తనను మళ్లీ ఎంపీగా గెలిపిస్తేనే తూపిలిపాలెం వద్ద పోర్టు నిర్మాణం సాధ్యమవుతుందనే నినాదంతో ఎంపీ డాక్టర్ చింతామోహన్ జనానికి ఎర వేసే ప్రయత్నాలు ప్రారంభించారు. ఇందులో భాగంగానే ఆయన గత నాలుగైదు రోజులుగా గూడూరు, సూళ్లూరుపేట నియోజకవర్గాల్లో తిరుగుతూ అభివృద్ధి కోసం తనను గెలిపించాలని చెబుతున్నారు. ఇందులో భాగంగానే కేంద్ర మంత్రి జైరాం రమేష్‌ను రప్పించి ఆయన ద్వారా ఇదే విషయం చెప్పించే రాజకీయానికి తెర లేపబోతున్నారు. -
ప్యాకేజీపైనా రాజకీయాలా? : వెంకయ్య
కాంగ్రెస్ తీరుపై వెంకయ్య ధ్వజం సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన సందర్భంగా సీమాంధ్ర కు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించడంపైనా కాంగ్రెస్ రాజకీయాలు చేస్తోందని బీజేపీ సీనియర్ నాయకుడు ఎం.వెంకయ్యనాయుడు ధ్వజమెత్తారు. కేంద్ర మంత్రి జైరాం రమేష్ సీమాంధ్రలో పర్యటిస్తూ ప్యాకేజీ కాంగ్రెస్ గొప్పతనంగా చెప్పుకోవడాన్ని ఆయన తీవ్రంగా తప్పుపట్టారు. మంగళవారం హైదరాబాద్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. బండారు దత్తాత్రేయ వ్యక్తిగత సమాచారంతో రూపొందించిన ప్రత్యేక వెబ్‌సెట్‌ను ఈ సందర్భంగా ఆవిష్కరించారు. లోక్‌సభలో బిల్లుపై చర్చ పూర్తయిన తర్వాత రాజ్యసభలో ఈ అంశాలపై బీజేపీ పట్టుబట్టిన తరువాతనే కాంగ్రెస్ ప్యాకేజీ ఇవ్వడానికి ముందుకొచ్చిందని విడమరచి చెప్పారు. మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డిని ‘హూ ఈజ్ కిరణ్’ అంటూ జైరాం చేసిన వ్యాఖ్యలను వెంకయ్య తప్పుపట్టారు. జూన్ తరువాత సోనియా గాంధీని కూడా ‘హూ ఈజ్ సోనియా’అంటారేమోనని ఎద్దేవా చేశారు. తెలుగు ప్రజలంటే కాంగ్రెస్‌కు ఎప్పుడూ చిన్న చూపని.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పదవి తెలుగువారికి దక్కే అవకాశం ఉన్నప్పటికీ, వేరే రాష్ట్రం అధికారికి పొడిగింపు ఇవ్వడాన్ని తప్పుబట్టారు. ఖమ్మం జిల్లాలో ఏడు మండలాలను సీమాంధ్రలో కలపడంపై అడిగిన ప్రశ్నకు.. ‘విభజన జరుగుతున్నప్పడు సమస్యలు వస్తాయని, చర్చించుకొని పరిష్కరించుకోవాలి’ అని బదులిచ్చారు. పొత్తు కోసం టీఆర్ఎస్ను సంప్రదించే అవకాశాలు ఉన్నాయా అన్న ప్రశ్నకు ఆ పార్టీ ఎంఐఎం, సీపీఐలతో పొత్తుకు ప్రయత్నిస్తోందన్న వార్తలు వచ్చాయన్నారు. -
సిమాంధ్రకు ప్రత్యేక హోదాలో బీజేపీ పాత్రలేదు
కేంద్రమంత్రి జైరాంరమేష్ వెంకయ్యనాయుడు, అరుణ్‌జైట్లీ ప్రత్యేక ప్యాకేజీ అడగలేదు సోనియా చెబితేనే ప్రధాని ప్రకటించారు పదేళ్ల పాటు అన్ని పన్నులు మినహాయింపు సాక్షి, తిరుపతి: ఐదేళ్లపాటు సీమాంధ్రకు ప్రత్యేక హోదా కల్పించడం వెనుక భారతీయ జనతాపార్టీ పాత్ర ఏమీ లేదని కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి జైరాంరమేష్ పేర్కొన్నారు. బీజేపీ నాయకులు వెంకయ్యనాయుడు, అరుణ్‌జైట్లీ ఈ ప్యాకేజీల గురించి ప్రధానిని అడగలేదన్నారు. తిరుపతిలో రూ.77 కోట్లతో నిర్మించిన 300 పడకల కాన్పుల ఆస్పత్రిని బుధవారం జైరాం రమేష్ ప్రారంభించారు. రాష్ట్ర విభజన అనంతరం తొలిసారి తిరుపతికి వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు సోనియాను ఫిబ్రవరి 17న కలిసి అభ్యర్థిస్తే మరుసటి రోజు సోనియాల సూచన మేరకు ప్రధాని రాజ్యసభలో ప్రకటన చేశారన్నారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు రాత్రికి రాత్రి రాలేదని, అనేక సుదీర్ఘ సంప్రదింపులు, సమాలోచనలు, రాజకీయ పార్టీల డిమాండ్ల తరువాతే సీడబ్ల్యూసీ నిర్ణయం తీసుకుందన్నారు. 1973లో ఇందిరాగాంధీ చేసిన ఆరు సూత్రాల ప్రాతిపదికనే ప్రధాని పార్లమెంట్లో సీమాంధ్ర అభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించారన్నారు. స్వయం ప్రతిపత్తి కింద సీమాంధ్రకు రూ.50 వేల కోట్లు కేటాయిస్తామన్నారు. తిరుపతిని రాజధానిగా చేయాలనే డిమాండ్‌ను కూడా తాను నిపుణుల కమిటీ దృష్టికి తీసుకెళ్తానని మంత్రి తెలిపారు. రాష్ట్రపతి నోటిఫికేషన్ జారీ చేసిన మూడు నెలలలోపు పునర్వ్యవస్థీకరణ ప్రక్రియ పూర్తవుతుందన్నారు. మొత్తం 84 వేల మంది ఉద్యోగులను రెండు రాష్ట్రాలకు విభజించాలన్నారు. రాష్ట్ర విభజన విషయంలో తాను కీలకంగా వ్యవహరించలేదని, గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్లో ఒక భాగంగా తనకు అప్పగించిన బాధ్యతలు నెరవేర్చాన ని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. రాష్ట్రాన్ని పునర్వ్యవస్థీకరించడం వల్ల సీమాంధ్రా యువత ఆందోళన చెందాల్సిన అవసరంలేదని హైదరాబాద్‌లో ఉన్న అన్ని విద్యాసంస్థల్లో పదేళ్ల వరకు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న అడ్మిషన్ కోటాలే వర్తిస్తాయని, దీనిని బిల్‌లోనే పొందుపరిచినందున ఎవరూ మార్చలేరన్నారు. అలాగే సీమాంధ్రలో పదేళ్లపాటు అన్ని రకాల కేంద్ర పన్నులను మినహాయిస్తామన్నారు. -
మహారాష్ట్ర పై కాంగ్రెస్ కన్ను పడిందా...?
-
తెలంగాణ బిల్లుకు సవరణ సంకటం!
-
తెలంగాణ బిల్లుకు సవరణ సంకటం!
* 25 సవరణలకు పట్టుబట్టిన బీజేపీ * రాజ్యసభకు రాని విభజన బిల్లు * వెంకయ్య, జైట్లీలతో ప్రధాని మన్మోహన్ చర్చలు * సీమాంధ్రకు ‘ప్రత్యేక ప్రతిపత్తి’కి సోనియా సూచన * దీనిపై సభలో ప్రధానమంత్రి ప్రకటన చేసే అవకాశం * బిల్లుకు సవరణలు లేకుండా మధ్యే మార్గం యోచన * ఎటూ తేలని పరిస్థితి.. నేడు రాజ్యసభకు టీ-బిల్లు సాక్షి, న్యూఢిల్లీ: ఆరంభమైనప్పటి నుంచీ రోజుకో మలుపు తిరుగుతూ తీవ్ర ఉత్కంఠ రేపుతున్న ఆంధ్రప్రదేశ్ విభజన బిల్లు.. బుధవారం లోక్‌సభలో ఆమోదం పొందటంతో ఇక ఓ కొలిక్కి వచ్చినట్లేనని అంతా భావిస్తుండగా.. గురువారం అనూహ్య మలుపు తిరిగింది. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లుకు లోక్‌సభలో బేషరతు మద్దతు ప్రకటించిన ప్రధాన ప్రతిపక్షం బీజేపీ.. అదే బిల్లుకు రాజ్యసభలో సవరణలు ప్రతిపాదిస్తామంటూ కొత్త మెలిక పెట్టింది. బీజేపీ ఇవే సవరణలను లోక్‌సభలో ఎందుకు తేలేదు? రాజ్యసభలో సవరణలకు పట్టుబట్టడం వెనుక ఆ పార్టీ ఉద్దేశం ఏమిటి? బీజేపీ కోరిన సవరణలను రాజ్యసభలో ఆమోదిస్తే.. ఆ బిల్లును తిరిగి లోక్‌సభకు తెచ్చి ఆమోదించుకోవాలి కాబట్టి.. మరి అప్పుడు బీజేపీ మళ్లీ మద్దతిస్తుందా? లేక బిల్లును ఓడిస్తుందా? అసలు బీజేపీ స్వరం మార్చటంలో ఉద్దేశం ఏమిటి? అనేవి అర్థంకాక కాంగ్రెస్ పార్టీ, కేంద్ర ప్రభుత్వం సతమతమవుతున్నాయి. దీంతో.. ఎజెండాలో ఉన్నప్పటికీ కేంద్రం బుధవారం రాజ్యసభలో విభజన బిల్లును ప్రవేశపెట్టకుండా ఆపేసింది. ప్రతిపక్ష నేతలతో మంతనాలు జరుపుతున్న ప్రభుత్వ పెద్దలు బిల్లును గురువారం రాజ్యసభలో పెట్టనున్నారు. చర్చలు ఒక కొలిక్కి వచ్చిన దాఖలాలు కనిపించకపోవటంతో.. బిల్లు మళ్లీ ఎటు తిరుగుతుందన్నది ఉత్కంఠ కలిగిస్తోంది. జైట్లీ, వెంకయ్యలతో ప్రధాని భేటీ... రాజ్యసభలో బిల్లు బుధవారమే ఆమోదం పొందితే రాష్ట్రంలో (ముఖ్యమంత్రి పదవికి కిరణ్‌కుమార్‌రెడ్డి రాజీనామా నేపథ్యంలో) రాష్ట్రపతి పాలన కాకుండా.. ఇతరత్రా ఏర్పాట్లు చేసుకోవచ్చని కేంద్ర ప్రభుత్వం బుధవారం మధ్యాహ్నం వరకూ భావించింది. కానీ బీజేపీ లోక్‌సభకు.. రాజ్యసభకు మధ్య భిన్నవైఖరి ప్రదర్శించటంతో కేంద్రం ఖంగుతిన్నది. దీంతో స్వయంగా ప్రధానమంత్రి మన్మోహన్సింగ్ రంగంలోకి దిగారు. రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు అరుణ్‌జైట్లీ, బీజేపీ సీనియర్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు వెంకయ్యనాయుడులతో పార్లమెంటులోనే భేటీ అయ్యారు. అదే సమావేశంలో హోంమంత్రి సుశీల్‌కుమార్ షిండే, కమల్‌నాథ్, జైరాంరమేశ్, అహ్మద్‌పటేల్ కూడా ఉన్నారు. ఈ భేటీలో గంటపాటు సుదీర్ఘంగా చర్చించారు. ప్రధానితో భేటీ సందర్భంగా.. పార్టీ తరఫున 25 సవరణలు ప్రతిపాదించినట్లు, వీటిలో తాను 20, జైట్లీ 3, ప్రకాశ్ జవదేకర్ 2 సవరణలు ప్రతిపాదించినట్లు వెంకయ్యనాయుడు ఆ తర్వాత మీడియాకు తెలిపారు. సోనియా ‘స్వయం ప్రతిపత్తి’ సూచన! అయితే.. రాజ్యసభలో ఇప్పుడు ఏ సవరణ ఆమోదించుకున్నా.. దాన్ని తిరిగి లోక్‌సభలో ఆమోదించుకోవాల్సి ఉంటుందని, అప్పుడు ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడతాయని ప్రధాని బీజేపీ నేతలతో భేటీలో సందేహం వ్యక్తంచేసినట్లు సమాచారం. బిల్లు మళ్లీ లోక్‌సభకు వెళ్లినా మద్దతిచ్చేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, అనుమానాలు అక్కర్లేదని వెంకయ్యనాయుడు వివరించినట్లు తెలిసింది. అయితే.. ఇదే సందర్భంలో సోనియాగాంధీ సీమాంధ్రకు ప్రత్యేక ప్రతిపత్తి ఇవ్వాలన్న యోచనను ప్రధానమంత్రికి ప్రతిపాదించినట్లు సమాచారం. బీజేపీ సవరణల ప్రతిపాదనలతో కేంద్రం దిక్కుతోచని స్థితిలో పడ్డట్లు కనిపిస్తోంది. మరోవైపు ప్రధానమంత్రితో భేటీ అనంతరం బీజేపీ నేతలు పార్టీ సీనియర్ నాయకుడు ఎల్.కె.అద్వానీతో ఆయన నివాసంలో సమావేశమయ్యారు. ప్రధానితో చర్చల సారాంశాన్ని వివరించారు. క్రెడిట్ దక్కించుకునే ప్రయత్నాలా? ‘పార్టీపరంగా మేం కోరిన సవరణలన్నీ మీరు అధికారికంగా ప్రవేశపెడతారని భావించాం. అందుకే మేం లోక్‌సభలో ఇవ్వలేదు. కానీ మీరు అధికారిక సవరణల్లో ఇవ్వలేదు. అందుకే రాజ్యసభలో ప్రతిపాదించబోతున్నాం...’ అని బీజేపీ నేతలు చెప్తున్నారు. ప్రధాని వద్ద తాము చేసిన ప్రతిపాదనలపై కేంద్రం నుంచి ఇప్పటివరకూ ఎలాంటి స్పష్టతా రాలేదని వెంకయ్యనాయుడు విమర్శించారు. అయితే.. అసలు బీజేపీ అగ్రనేతల్లోనే అయోమయం ఉందని.. అందుకే సభను గందరగోళపరిచేందుకు ప్రయత్నిస్తున్నారని సీనియర్ కేంద్రమంత్రి ఒకరు విమర్శించారు. మొత్తంగా అటు బీజేపీ కానీ, ఇటు కాంగ్రెస్ కానీ ఎవరికి వారుగా క్రెడిట్ దక్కించుకునే ప్రయత్నాల్లో ఉన్నట్లు స్పష్టమవుతోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ప్రధాని ప్రత్యేక ప్రకటన అవకాశం? మరోవైపు.. ఇంతగా సహకరిస్తున్నందున ప్రతిపక్షం కూడా భంగపడరాదని, ఆ పార్టీకి కూడా ఇబ్బంది కలగకుండా ఏదైనా ఉపశమనంగా ప్రధానమంత్రి ద్వారా ప్రత్యేక ప్రకటన చేయించాలని కేంద్రం భావిస్తున్నట్లు చెప్తున్నారు. ఇందుకు బీజేపీ కూడా సానుకూలంగా స్పందిస్తే గురువారం రాజ్యసభలో బిల్లు ఆమోదం పొందుతుంది. లేదంటే రాజ్యసభలో సవరణలు ఆమోదం పొంది.. తిరిగి లోక్‌సభకు వచ్చి ఆమోదం పొందాలంటే ప్రస్తుత పార్లమెంటు సమావేశాలను మరికొంత కాలం పొడిగించాల్సి ఉంటుంది. కానీ కేంద్రం వద్ద అంత సమయం కనిపించడంలేదు. అందువల్ల సాధ్యమైనంత వరకు బీజేపీని ఒప్పించే ప్రయత్నాలు చేస్తోంది. వెంకయ్య ప్రతిపాదించిన సవరణల్లో ముఖ్యమైనవి - మొదట చెప్పినట్లుగా కుకునూరు, వేల్పేరుపాడు, బూర్గుంపాడు (పాల్వంచ రెవెన్యూ డివిజన్), చింతూరు, కూనవరం, వరరామచంద్రాపురం, భద్రాచలం (భద్రాచలం రెవెన్యూ గ్రామం మినహా) మండలాలను సీమాంధ్రలో కలపాలి. (నిజానికి కేబినెట్ సవరణలను ఆమోదించినపుడు ఈ ఏడు మండలాలను సీమాంధ్రకే కలిపింది. అయితే ఖమ్మం జిల్లా నాయకుల అభ్యంతరాలతో నిర్ణయం మార్చుకొని పోలవరం కింద ముంపుకు గురయ్యే గ్రామాలను మాత్రమే సీమాంధ్రకు కలుపుతామని ప్రకటించింది. వెంకయ్యనాయుడు మాత్రం భద్రాచలం పట్టణం మినహా మొదట చెప్పినట్లుగా ఈ ఏడు మండలాలను పూర్తికే సీమాంధ్రకే ఇవ్వాలని కోరారు) - ఉమ్మడి రాజధానిలో నివసించే ప్రజలందరి భద్రత, స్వేచ్ఛ, ఆస్తి హక్కులను పరిరక్షించేందుకు వీలుగా గవర్నర్‌కు అధికారాలను కల్పిస్తూ 121వ రాజ్యాంగ సవరణ చేయాలి. పేర్కొన్న కాలానికి (పదేళ్లు) హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉండటానికి ఇది రాజ్యాంగబద్ధతను ఇస్తుంది. ‘371కె’గా దీన్ని రాజ్యాంగంలో చేర్చాలి. - విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్‌కు ఉండే రెవెన్యూ లోటును అంచనా వేయడానికి స్వతంత్ర నిపుణుల కమిటీని నియమించడం కేంద్రం బాధ్యత. ఈ లోటును పూడ్చడానికి భారత సంచిత నిధి నుంచి కనీసం పదేళ్ల వరకు దశలవారీగా నిధులు విడుదల చేయాలి. విభజన జరిగిన తొలి ఏడాదిలోనే కేంద్రం 10 వేల కోట్లు ఇవ్వాలి. - పోలవరం నిర్మాణానికయ్యే ఖర్చును, రాయలసీమ, ఉత్తరాంధ్రలకు ఇచ్చే ప్యాకేజీల వ్యయాన్ని భారత సంచిత నిధి నుంచి భరించాలి. - పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటిస్తూ... బిల్లులో ‘సాగునీటి ప్రాజెక్టు’ అనే స్థానంలో ‘బహుళార్థ సాధక ప్రాజెక్టు’గా మార్చాలి. - ‘ప్రభుత్వ విద్యాసంస్థల ఏర్పాటుకు కేంద్రం చర్యలు తీసుకుంటుంది’ అని బిల్లులో ఉంది. ఇక్కడ తీసుకుంటుందనే పదాన్ని తొలగించాలి. నిర్దిష్టంగా విద్యాసంస్థలను ఏర్పాటు చేస్తుందని ఉండాలి. - సీమాంధ్రకు పన్నుల మినహాయింపు ఇవ్వటం - నీటిపారుదలలో ఇబ్బందులు లేకుండా స్పష్టమైన హామీలు ఇవ్వటం మాట నిలబెట్టుకోలేనందుకే సవరణలు ‘‘విభజన బిల్లుకు మేం ప్రతిపాదించిన సవరణలపై కేంద్రం ఇప్పటికీ స్పష్టత ఇవ్వలేదు. లోక్ సభలోనే మేం ఈ సవరణలను ప్రతిపాదించేవాళ్లం.. కానీ అంతకుముందు మా నాయకురాలు (లోక్‌సభలో ప్రతిపక్ష నాయకురాలు సుష్మాస్వరాజ్) అసలు బిల్లును సభలో పెట్టినట్టే కాదని అన్నందున.. మేం సవరణ లు ప్రతిపాదించదలుచుకోలేదు. పైగా.. మాతో అంతకుముందు కేంద్రమంత్రి జైరాంరమేశ్ తదితరులు చర్చలు జరిపినప్పుడు బీజేపీ చేస్తున్న ప్రతిపాదనలన్నీ అధికారిక సవరణలుగా తెస్తామని చెప్పారు. కానీ వారు మాట నిలబెట్టుకోలేదు. అందుకే రాజ్యసభలో సవరణలు ప్రతిపాదించబోతున్నాం. ఒక్క చెన్నై - విశాఖ కారిడార్ ఏర్పాటుకు మాత్రమే కేంద్రం సుముఖంగా ఉంది...’’ - వెంకయ్యనాయుడు, బీజేపీ ఉపాధ్యక్షుడు (ప్రధానితో భేటీ తర్వాత మీడియాతో మాట్లాడుతూ) బీజేపీ 24 గంటల్లో మాట మార్చింది ‘‘బీజేపీ 24 గంటల్లో మాట మార్చింది. లోక్‌సభలో మద్దతిచ్చి.. ఇప్పుడు సవరణలు అంటోంది..’’ - కమల్‌నాథ్, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి -
మూజువాణి ఓటుతో ఆమోదించవద్దు: బీజేపీ
ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లుపై సభలో పూర్తి స్థాయి చర్చ జరగాలని భారతీయ జనతా పార్టీ అగ్రనేతలు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మూజువాణి ఓటుతో బిల్లును ఆమోదించరాదని స్పష్టం చేశారు. కేంద్ర మంత్రి జైరాం రమేష్ బీజేపీ అగ్రనేతలతో మంగళవారం ఉదయం ఇక్కడ సమావేశమైయ్యారు. బీజేపీ అగ్రనేతలు కొన్ని డిమాండ్లను ఈ సందర్భంగా కేంద్ర మంత్రి ముందు ఉంచారు. కొత్త రాజధాని నిర్మాణానికి నిధులతోపాటు సీమాంధ్ర కోల్పోయే ఆదాయాన్ని ఏ విధంగా భర్తీ చేస్తారో సభా ముఖంగా ప్రకటించాలని వారు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. పోలవరం ముంపుకు గురయ్యే భద్రచలం డివిజన్లోని ఏడు మండలాలు సీమాంధ్రకు బదలాయించాలని కరాకండిగా చెప్పారు. సీమాంధ్రలో అత్యంత వెనకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని బీజేపీ అగ్రనేతలు తమ డిమాండ్లలో పేర్కొన్నారు. -
గందరగోళం మధ్య బిల్లు వద్దు: జైరాం రమేశ్
-
బిల్లొస్తుందని నెల ముందే ఎలా తెలిసింది: నాగం
సాక్షి, న్యూఢిల్లీ: ఈనెల 17, 18 తేదీల్లోనే పార్లమెంటుకు బిల్లు వస్తుందని సీమాంధ్ర నేతలకు ముందే ఎలా తెలిసిందని బీజేపీ నేత నాగం జనార్దన్‌రెడ్డి ప్రశ్నించారు. ఆదివారం ఇక్కడ విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘‘ఇంతమంది రావాల్సిన అవసరం ఏముంది? బిల్లు ఈ తేదీల్లోనే వస్తోందని నెల కిందటే సీమాంధ్ర నేతలకు ఎలా తెలిసింది? రైళ్ల బుకింగ్ ఎలా చేయగలిగారు? ఇవన్నీ చూస్తుంటే కాంగ్రెస్ పార్టీ సీమాంధ్ర నేతలతో కుమ్మక్కయ్యిందని అర్థమవుతోంది’’ అని నాగం ఆరోపించారు. హింస ప్రేరేపించేందుకే సీమాంధ్రులు ఢిల్లీ వస్తున్నారని, అవాంఛిత సంఘటన ఏమి జరిగినా కేంద్రమే బాధ్యత వహించాలని హెచ్చరించారు. సీమాంధ్రుల ధర్నాలకు కాంగ్రెస్సే ఏర్పాట్లు చేస్తోందని ఆరోపించారు. సొంతంగా పాస్ చేయించుకునే శక్తి లేని కాంగ్రెస్.. బీజేపీపైన నమ్మకంతోనే బిల్లు తెచ్చిందని, అయితే ప్రవేశ పెట్టిన తీరే జుగుప్సాకరంగా ఉందని వ్యాఖ్యానించారు. బిల్లుకు వ్యతిరేకమని బీజేపీ ఎప్పుడూ చెప్పలేదని గుర్తుచేశారు. మంత్రి జైరాం రమేశ్ ఓ జాతీయ చానెల్ ఇంటర్వ్యూలో గందరగోళం మధ్య బిల్లు పాస్ కాకూడదన్నారని, చర్చ జరిగితీరాలన్నారని, దీన్నిబట్టే కేంద్రం ఏదో కుట్ర పన్నుతున్నట్టు కనిపిస్తోందని నాగం అనుమానం వ్యక్తం చేశారు. లోక్‌సభలో మంత్రులు వెల్‌లోకి వస్తే తక్షణం సస్పెండ్ చేయాలన్నారు. ఇక ముఖ్యమంత్రి చివరి రోజుల్లో అప్పనంగా భూములు ధారాదత్తం చేస్తున్నారని, తెలంగాణ వచ్చాక అవి తిరిగివస్తాయన్నారు. -
గందరగోళం మధ్య బిల్లు వద్దు: జైరాం రమేశ్
బిల్లు ఆమోదానికి తొందర పడొద్దు.. కాంగ్రెస్‌కు కేంద్ర మంత్రి సలహా న్యూఢిల్లీ: తెలంగాణ బిల్లుకు గందరగోళం మధ్య పార్లమెంటు ఆమోదం పొందే ప్రయత్నం చేయరాదని కేంద్ర మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ అభిప్రాయపడ్డారు. బిల్లును వ్యతిరేకిస్తూ సభల్లో హింసాత్మక నిరసనలు కూడా జరుగుతున్న విషయాన్ని ప్రస్తావించారు. దీర్ఘకాలిక పర్యవసానాలుండే ఇలాంటి బిల్లుపై పార్లమెంటులో లోతుగా చర్చ జరగాల్సిన అవసరముందన్నారు. ఆదివారం సీఎన్ఎన్-ఐబీఎన్ చానల్లో కరణ్ థాపర్ నిర్వహించిన డెవిల్స్ అడ్వకేట్ కార్యక్రమంలో జైరాం పాల్గొన్నారు. ఇంత ముఖ్యమైన బిల్లుపై కూలంకషంగా చర్చ జరగాలే తప్ప దాన్ని గందరగోళం మధ్య ఆమోదించరాదని వాదించే వారిలో తానే ముందుంటానన్నారు. ఈ విషయమై తాము (కాంగ్రెస్) పార్లమెంటులో ఎలాంటి ఏకపక్ష ధోరణీ ప్రదర్శించరాదని కూడా అభిప్రాయపడ్డారు. తమ పార్టీ వేదికలపై కూడా తాను ఇదే అభిప్రాయం వ్యక్తపరిచినట్టు చెప్పారు. రాష్ట్ర విభజన విధివిధానాల ఖరారుకు ఏర్పాటైన కేంద్ర మంత్రుల బృందంలోని కీలక సభ్యుడైన ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. బిల్లుపై బీజేపీతో పాటు ఇతర పార్టీలన్నింటి ఏకాభిప్రాయాన్ని సాధించేందుకు ప్రయత్నించాలని జైరాం అన్నారు. పార్లమెంటులో మరో నాలుగు రోజుల సమయమున్నందున బిల్లుకు ఆమోదం పొందగలమని ధీమా వెలిబుచ్చారు. లక్ష్మణ రేఖ దాటిన కిరణ్: విభజన విషయంలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి వైఖరిని జైరాం తీవ్రంగా దుయ్యబట్టారు. ఆయన కాంగ్రెస్ అధిష్టానానికి విధేయునిగా లేరంటూ ఆక్షేపించారు. ‘‘దురదృష్టం కొద్దీ ఆయన కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. పార్టీపరమైన క్రమశిక్షణకు సంబంధించి ఆయన లక్ష్మణ రేఖను దాటారు’’ అని విమర్శించారు. -
టీ సవరణలపై జైరాం-కేసీఆర్ చర్చలు
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ బిల్లుకు మరిన్ని సవరణలు చేసే అంశాన్ని కేంద్రం చురుగ్గా పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగా కేంద్ర మంత్రుల బృందంలోని కీలక సభ్యుడు జైరాం రమేశ్ శనివారం రాత్రి టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌తో సమావేశమయ్యారని సమాచారం. హైదరాబాద్‌లో గవర్నర్ పాలన సహా బిల్లుకు చేయాల్సిన పలు సవరణల గురించి ఈ సందర్భంగా వారి మధ్య చర్చ జరిగినట్టు చెబుతున్నారు. -
హైదరాబాద్ పై గవర్నర్ పాలన అవసరం: జైరాం రమేష్
ఢిల్లీ: హైదరాబాద్ నగరంపై గవర్నర్ పాలన అవసరమని, దీనిపై అనవసర రాద్దాంతం చేయొద్దని టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ కు కేంద్ర మంత్రి జైరాం రమేష్ సూచించారు. కేసీఆర్ తో భేటీలో జైరాం రమేష్ పలు విషయాలను చర్చించారు. హైదరాబాద్ కు గవర్నర్ పాలన అవసరమవుతుందని, దీనిపై ఎటువంటి గందరగోళం సృష్టించవద్దని కేసీఆర్ కు జైరాం రమేష్ విజ్ఞప్తి చేశారు. ఏపీ భవన్ ఆంధ్రప్రదేశ్ కే చెందుతుందని, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రానికి మరో కేంద్రాన్ని కేటాయిస్తామని కేసీఆర్ కు హామీ ఇచ్చారు. ఈ భేటీలో బిల్లులో సవరణలపై కేసీఆర్ చర్చించారు. సాధ్యమైనంత త్వరగా రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను పూర్తి చేయాలని కేసీఆర్ విజ్ఞప్తి చేయగా.. బిల్లు ఆమోదం పొందాలంటే పట్టువిడుపులుండాలని జైరాం రమేష్ తెలిపారు. జనాభా ప్రాతిపదికనే పింఛన్లు, జీతాలుంటాయని ఆయన పేర్కొన్నారు. -
‘ఉపాధి’ పురస్కారం
కలెక్టరేట్, న్యూస్‌లైన్ : మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలులో జిల్లా దేశంలోనే మొదటిస్థానంలో నిలవడంతో కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జైరాం రమేష్ చేతుల మీదుగా ఆదివారం కలెక్టర్ అహ్మద్‌బాబు పురస్కారాన్ని అందుకున్నారు. న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవనంలో జరిగిన తొమ్మిదో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం దివస్ సందర్భంగా జాతీయ అవార్డు అందుకున్నారు. ఈ కార్యక్రమంలో దేశంలోని ఐదుగురు ఉపాధి కూలీలకు అవకాశం కల్పించగా, జిల్లాలోని నార్నూర్ మండలం గుంజాల గ్రామానికి చెందిన పెందూర్ జంగు మాట్లాడారు. రోజుకు రూ.150 సంపాదిస్తున్నానని, రూ.60 వేలతో తన చెల్లి పెళ్లి చేశానని, 10 మేకలు కొనుగోలు చేసి ఇప్పుడు 15 మేలకు ఎదిగాయన్నారు. ఈ కార్యక్రమంలో డ్వామా పీడీ వినయ్‌కృష్ణారెడ్డి, అదనపు పీడీ గణేష్ రాథోడ్, ఏపీవో పాల్గొన్నారు. -
అసలు.. నకలు.. అనేదేమీ లేదు: జైరాం రమేశ్
-
అసలు.. నకలు.. అనేదేమీ లేదు: జైరాం రమేశ్
ఉన్నది ఒక్కటే బిల్లు ఢిల్లీలో మీడియాతో కేంద్ర మంత్రి జైరాం రమేశ్ వ్యాఖ్యలు శాసనసభ చర్చలో విభజన బిల్లుకు సవరణలు కోరవచ్చు ‘సవరణల’పై 30 తరువాత మరోమారు జీవోఎం సమావేశం వచ్చే పార్లమెంటు సమావేశాల్లో విభజన బిల్లును పెడతాం అది ఆమోదం పొందుతుందా? లేదా? అనేది నేనేమీ చెప్పలేను బిల్లు రాజ్యాంగబద్ధంగా లేదని అనడం సబబుకాదు. అయితే నేనేమీ కిరణ్‌లాగా న్యాయ, పరిపాలనా అంశాల్లో నిపుణుడిని కాదు. అన్ని అంశాలను చర్చించిన తర్వాతే న్యాయశాఖ, కేబినెట్ ఆమోదించిన బిల్లు ఇది. జీవోఎం తయారుచేసిన బిల్లును కేబినెట్ ఆమోదించింది. కేబినెట్ ఆమోదించాక బిల్లు అవుతుంది తప్ప ఇక్కడ మరో బిల్లు లేదు. అసలు.. నకలు అంటూ ఏదీ ఉండదు. దీనిపై చర్చ అవసరం లేదు. సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర విభజనకు ఉద్దేశించిన ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు కేంద్ర కేబినెట్ ఆమోదించిన బిల్లు అని.. అసలు బిల్లు, నకలు (ముసాయిదా) బిల్లు అని ఏదీలేదని.. మరో బిల్లు ఏదీ ఉండదని.. కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జైరాంరమేశ్ స్పష్టంచేశారు. ఈ బిల్లును కేంద్ర న్యాయశాఖ, మంత్రివర్గం ఆమోదం పొందాకే రాష్ట్రపతికి పంపామని చెప్పారు. రాష్ట్రపతి ద్వారా అసెంబ్లీకి పంపిన ఈ బిల్లు రాజ్యాంగబద్ధంగా లేదని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి వ్యాఖ్యానించటం సబబు కాదన్నారు. అయితే.. ఈ బిల్లు అసెంబ్లీ నుంచి తిరిగి రాష్ట్రపతికి అటునుంచి పార్లమెంటుకు వచ్చే వరకూ ఎలాంటి మార్పులు జరుగుతాయో తెలియదని వ్యాఖ్యానించారు. సోమవారం రాష్ట్రానికి చెందిన గ్రామపంచాయతీలతో గ్రామీణాభివృద్ధి శాఖ ఒప్పందం కార్యక్రమం అనంతరం జైరాం మీడియా ప్రతినిధులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా విభజన బిల్లుపై అడిగిన పలు ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. ఠ అసెంబ్లీ చర్చలో బిల్లుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం కావచ్చని.. సవరణలు కూడా కోరవచ్చని జైరాం పేర్కొన్నారు. బిల్లుకు ఎలాంటి సవరణల ప్రతిపాదనలు వచ్చినా.. తెలంగాణపై ఏర్పాటైన కేంద్ర మంత్రుల బృందం (జీవోఎం) ఈ నెల 30వ తేదీ తరువాత మరోమారు సమావేశమై వాటిని పరిశీలిస్తుందని జీవోఎం సభ్యుడైన ఆయన చెప్పారు. ఠ ‘అసెంబ్లీలో మెజారిటీ అభిప్రాయం విభజనకు వ్యతిరేకంగా వస్తే ఎలా వ్యవహరిస్తారు?’ అని ప్రశ్నించగా.. బిల్లుపై అసెంబ్లీ నుంచి వచ్చే అన్ని అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుంటామని ఆయన బదులిచ్చారు. ‘‘విభజన విషయంలో రాజ్యాంగంలోని 3, 4 అధికరణల ప్రకారమే ముందుకు వెళుతున్నాం. ఎక్కడా వాటిని దుర్వినియోగం చేయటం లేదు. ఈ అధికరణల ప్రకారం రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చేసే సర్వహక్కులు కేంద్రానికి ఉన్నాయి. దీనికి సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన మూడు తీర్పులు కూడా మావద్ద ఉన్నాయి’’ అని వివరించారు. ఠ సీమాంధ్ర ప్రయోజనాలను పట్టించుకోలేదనే విమర్శలపై జైరాం స్పందిస్తూ.. ‘‘తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమలకు ప్రత్యేక ప్యాకేజీల అంశాలను ప్రస్తావించాం. వారికి ఎలాంటి ప్రయోజనం చేకూర్చాలో పొందుపరిచాం. ఒకవేళ ఇంకా ఏవైనా సవరణలు ఉంటే చెప్పవచ్చు. వాటిని పరిశీలిస్తాం’’ అని చెప్పారు. ఠ రానున్న పార్లమెంటు సమావేశాల్లో బిల్లును ప్రవేశపెడతామని జైరాం స్పష్టం చేశారు. అయితే.. బిల్లు ఆమోదం పొందుతుందా? లేదా? అనేది తాను చెప్పలేనని మరో ప్రశ్నకు సమాధానంగా వ్యాఖ్యానించారు.