న్యూఢిల్లీ: అదానీ గ్రూప్‌లోని డొల్ల కంపెనీలు, అవకతవకలపై దర్యాప్తు ఎంతదాకా వచ్చిందని కేంద్రాన్ని ప్రభుత్వాన్ని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ ప్రశ్నించారు. ‘‘అదానీ గ్రూప్‌తోపాలు పలు సంస్థలకు ఈ వ్యవహారంలో సంబంధముంది. ఇది అంతర్జాతీయ నెట్‌వర్క్. పలువురు నేతలకూ భాగస్వామ్యముంది. రష్యా, భారత ప్రభుత్వ కంపెనీలు కూడా ఈ అక్రమాల్లో పాలుపంచుకున్నాయి’’ అన్నారు.
ఈడీ బూచి చూపి మా గొంతు నొక్కలేరు
ఛత్తీస్‌గఢ్ కాంగ్రెస్ నేతలపై ఈడీ దాడులను కాంగ్రెస్ తీవ్రంగా ఖండించింది. ఇలా తమ గొంతు నొక్కలేరని పేర్కొంది. మంగళవారం పార్టీ నేతలు, కార్యకర్తలు రాయ్‌పూర్‌లోని ఈడీ కార్యాలయం ఎదుట బైఠాయించి ధర్నా చేశారు. కార్యాలయంలోకి వెళ్లేందుకు ప్రయతి్నంచగా భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు. ‘‘ఈ రాజకీయ కుట్రను ముందుగానే ఊహించాం. కాంగ్రెస్ ప్లీనరీ దాకా ఇవి కొనసాగుతూనే ఉంటాయి. మేం భయపడేది లేదు’ అని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ చెప్పారు. వచ్చే 24–26 తేదీల మధ్య రాయ్‌పూర్‌లో జరిగే ప్లీనరీకి ఏర్పాట్లను పరిశీలించేందుకు వచ్చిన ఆయన ధర్నాలో పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment