ఢిల్లీ: నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) ఒక అవుట్ సోర్సింగ్ ఏజెన్సీగా వ్యవహరిస్తోందని కాంగ్రెస్ పార్టీ విమర్శలు గుప్పించింది. ఎన్‌టీఏ అధికారిక వెబ్‌సైట్‌లో ఏజెన్సీకి సబంధించి సమాచారం చాలా తక్కవగా ఉందని టీఎంసీ ఎంపీ సాగరికా ఘోష్ ప్రశ్నించిన నేపథ్యంలో కాంగ్రెస్ ఎన్‌టీఏపై ఆరోపణలు చేసింది.
‘‘ఎన్‌టీఏ ఏకైక పని అవుట్‌సోర్స్ చేయడం మాత్రమే. దీని ఛైర్మన్ ప్రదీప్ కుమార్ జోషీ.. మధ్యప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఛైర్మన్‌గా పనిచేసిన సమయంలో చాలా సందేహాస్పదమైన రికార్డును కలిగి ఉన్నారు’’ అని కాంగ్రెస్ నేత జైరాం రమేస్ ‘ఎక్స్’వేదికగా విమర్శలు చేశారు.
The only job of NTA appears to be to outsource. Its Chairman has a very dubious record as Chairman of the Madhya Pradesh Public Service Commission. https://t.co/DhBa5KDSos
— Jairam Ramesh (@Jairam_Ramesh) August 3, 2024
ఇక.. నీట్‌తో సహా 17 ప్రధాన పరీక్షలకు బాధ్యత వహించే ఎన్‌టీఏ తన వెబ్‌సైట్‌లో ఏజెన్సీ గురించి చాలా తక్కువ సమాచారం అందుబాటులో ఉంచిందని.. ఇలా ఎందుకు పరిమితమైన సమాచారం ఇస్తోందని అడుగుతూ శుక్రవారం టీఎంసీ ఎంపీ సాగరికా ఘోష్ విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌కు లేఖ రాశారు. ‘అధికారులు ఎవరు? ఏజెన్సీ వార్షిక నివేదికలు ఎక్కడ ఉన్నాయి? భవిష్యత్ పరీక్షల కోసం ప్రజల విశ్వాసాన్ని పెంచుకోవడానికి ఎన్‌టీఏ తన వెబ్‌సైట్‌లో ఏజెన్సీకి సంబంధించి మరింత సమాచారాన్ని అందించాలి’ అని లేఖలో పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment