National Testing Agency
-
ఉన్నత విద్య ఎంట్రన్స్లకే ఎన్టీఏ పరిమితం
న్యూఢిల్లీ: 2025 నుంచి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ)ని ఉద్యోగ ఎంపిక పరీక్షల నిర్వహణ బాధ్య తల నుంచి తప్పిస్తున్నట్లు కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెల్లడించారు. కేవలం ఉన్నత విద్యా ప్రవేశ పరీక్షలను మాత్రమే ఎన్టీఏ ఇకపై నిర్వహిస్తుందన్నారు. వచ్చే ఏడాదిలో ఈ మేరకు ఎన్టీఏను పునర్వ్యవస్థీకరించి, అవసరమైన కొత్త పోస్టులను సృష్టిస్తామని చెప్పారు. అంతేకాకుండా, నీట్‌ను సంప్రదాయ పెన్, పేపర్ విధానం బదులుగా కంప్యూటర్ ఆధారిత పరీక్ష(సీబీటీ)గా చేపట్టేందుకు ఆరోగ్య శాఖతో సంప్రదింపులు జరుపుతున్నామని మంత్రి ప్రధాన్ మంగళవారం మీడియాకు చెప్పారు. వైద్య కళాశాలల్లో ప్రవేశాలకు నిర్వహించే నీట్ సహా పలు పరీక్షా పత్రాల లీకేజీలు, రద్దు వంటి పరిణామాల నేపథ్యంలో ప్రభుత్వం ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిషన్ ఇచ్చిన సిఫారసుల ఆధారంగా పునర్వ్యవస్థీకరణకు పలు చర్యలు తీసుకుంటోంది. కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ (క్యూయెట్– యూజీ)ను ఇకపైనా ఏడాదిలో ఒక్క పర్యాయం మాత్రమే నిర్వహిస్తామని స్పష్టం చేశారు. ప్రస్తుతానికి ఎన్టీఏను ప్రవేశ పరీక్షల బాధ్యతలను మాత్రమే అప్పగించాలి. దాని సామర్థాన్ని పెంచిన తర్వాత ఇతర పరీక్షల బాధ్యతలను అప్పగించే విషయం ఆలోచించాలి’అని ఇస్రో మాజీ చీఫ్ ఆర్. రాధాకృష్ణన్ సారథ్యంలోని కమిటీ సిఫారసు చేసింది. సంబంధిత కోర్సులో జాయినయ్యే విద్యార్థి మాత్రమే ఆన్లైన్ పరీక్ష రాసేలా డిజి–యాత్ర మాదిరిగానే డిజి–ఎగ్జామ్ విధానాన్ని తీసుకురావాలని కమిటీ పేర్కొంది. ఇందుకోసం, ఆధార్, బయో మెట్రిక్‌తోపాటు ఏఐ ఆధారిత డేటా అనలిటిక్స్‌ను వినియోగించుకోవాలని సూచించింది. పరీక్షల నిర్వహణ, భద్రత, నిఘా, సాంకేతికత వంటి అంశాలకు సంబంధించి డైరెక్టర్ స్థాయిలో 10 సిఫారసులను చేసిందిఎన్సీఈఆర్టీ పాఠ్య పుస్తకాల ధర తగ్గింపు2025 నుంచి ఎన్సీఈఆర్టీ పాఠ్య పుస్తకాల ధరలను తగ్గించనున్నట్లు మంత్రి ప్రధాన్ వివరించారు. ప్రస్తుతం ఏడాదికి 5 కోట్ల టెక్ట్స్ బుక్స్‌ను మాత్రమే ప్రచురిస్తున్నారన్నారు. 2025 నుంచి ముద్రణ సామర్థ్యాన్ని 15 కోట్లకు పెంచుతామని, నాణ్యమైన పుస్తకాలను అందిస్తామని ప్రక టించారు. పాఠ్య పుస్తకాల ధరలను పెంచి, విద్యా ర్థుల తల్లిదండ్రులపై భారం పెంచబోమన్నారు. మారిన సిలబస్ ప్రకారం 2026–27 నుంచి 9 నుంచి 12వ తరగతి వరకు కొత్త పాఠ్య పుస్తకాలను అందుబాటులోకి తెస్తామని మంత్రి వెల్లడించారు. -
జేఈఈ మెయిన్‌కు దరఖాస్తుల జోరు
సాక్షి, అమరావతి: దేశంలోని ఐఐటీ, ఎన్ఐటీ వంటి జాతీయ స్థాయి విద్యాసంస్థల్లో ప్రవేశాలకు నిర్వహించే జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) మెయిన్ పరీక్షకు ఈ ఏడాది కూడా దరఖాస్తుల జోరు కొనసాగింది. జేఈఈ మెయిన్–2025 జవనరి సెషన్ కోసం సుమారు 12 లక్షల మందికి పైగా దరఖాస్తు చేసుకున్నట్లు తెలుస్తోంది. జవనరి 22 నుంచి 31వరకు తొలి సెషన్, ఏప్రిల్ 1 నుంచి 8 వరకు రెండో సెషన్ పరీక్షలకు షెడ్యూల్‌ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ప్రకటించింది. విద్యార్థులు జనవరి 19 నుంచి అడ్మిట్ కార్డులు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ప్రస్తుతం జనవరి సెషన్‌కు అక్టోబర్ 28 దరఖాస్తుల విండో ప్రారంభమైనా... మొదటి రెండు వారాల్లో కేవలం 5.10లక్షల మంది మాత్రమే నమోదు చేసుకున్నారు. కొత్త విధానాలు, అర్హత ప్రమాణాల మార్పులు విద్యార్థులను గందరగోళానికి గురిచేసినట్లు నిపుణులు చెబుతున్నారు. దరఖాస్తు సమయంలో కొన్ని పత్రాలు ప్రత్యేకంగా అప్లోడ్ చేయాల్సి రావడంతో విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు. అయినా చివరికి ఈ నెల 22వ తేదీన గడువు ముగిసే నాటికి 12లక్షల మందికి పైగా దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం. గత ఏడాది కంటే దరఖాస్తులు స్వల్పంగా తగ్గినట్లు తెలుస్తున్నప్పటికీ ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను ఎన్టీఏ ప్రకటించాల్సి ఉంది.ఐచ్ఛిక ప్రశ్నలు, వయసు పరిమితి తొలగింపు..కోవిడ్ సమయంలో తీసుకొచ్చిన జేఈఈ మెయిన్ పరీక్షల్లో సెక్షన్–బీలోని ఐచ్ఛిక ప్రశ్నల విధానాన్ని ఎన్టీఏ తొలగించింది. ఇప్పుడు సెక్షన్–బీలోని ప్రతి సబ్జెక్టులో పది ప్రశ్నలకు బదులు ఐదు ప్రశ్నలు మాత్రమే ఉంటాయి. మరోవైపు న్యూమరికల్ వాల్యూ ప్రశ్నలకు నెగెటివ్ మార్కింగ్ పద్ధతిని తీసుకొచ్చింది. అంటే మల్టిపుల్ చాయిస్ ప్రశ్నల మాదిరిగానే ప్రతి తప్పు సమాధానానికి మార్కులు కోల్పోవాల్సి ఉంటుంది. ఎన్టీఏ కొత్తగా వయోపరిమితిని సైతం సడలించింది. 12వ తరగతి విద్యా అర్హత కలిగిన ఎవరైనా ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా పరీక్షకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది.టై బ్రేక్ రూల్స్ మార్పు...– జేఈఈ మెయిన్–2025లో ఒకే మార్కులు వచ్చినప్పుడు అభ్యర్థుల ర్యాంకుల టై బ్రేక్ రూల్స్‌ను ఎన్టీఏ సవరించింది. కొత్త మార్గదర్శకాల ప్రకారం పరీక్ష రాసేవారి వయసు, దరఖాస్తు సంఖ్యను ర్యాంకింగ్ ప్రక్రియలో పరిగణనలోకి తీసుకోరు.– విద్యార్థులు ఒకే మొత్తం స్కోర్‌ను సాధిస్తే సబ్జెక్టులలో వచ్చిన మార్కుల ఆధారంగా ర్యాంకులు ప్రకటిస్తారు. – గణితంలో ఎక్కువ స్కోరు సాధించిన అభ్యర్థులు టై సమయంలో ఉన్నత ర్యాంక్ పొందుతారు.– గణితంలోను ఒకే మార్కులు వచ్చినప్పుడు ఫిజిక్స్‌లో ఎక్కువ స్కోర్ ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యం ఇస్తారు. అక్కడ కూడా ఒకే మార్కులు సాధిస్తే కెమిస్ట్రీ స్కోర్‌ను పరిగణనలోకి తీసుకుంటారు.– వీటి ద్వారా టై సమస్య కొలిక్కి రాకపోతే అన్ని సబ్జెక్ట్‌లలో సరైన సమాధానాలకు, సరికాని సమాధానాల నిష్పత్తి తక్కువగా ఉన్న అభ్యర్థులకు ఉన్నత ర్యాంక్ కేటాయిస్తారు. వీటిల్లోను నిష్పత్తి టై అయితే గణితం, తర్వాత ఫిజిక్స్, కెమిస్ట్రీల్లో వరుసగా సరికాని సమాధానాల నిష్పత్తులను గుర్తిస్తారు. – ఈ అన్ని దశల తర్వాత కూడా టై మిగిలి ఉంటే అభ్యర్థులకు అదే ర్యాంక్ కేటాయిస్తారు. దేశ, విదేశాల్లో తగ్గిన పరీక్ష కేంద్రాల నగరాలు..దేశంలో జేఈఈ మెయిన్ పరీక్షలు నిర్వహించే నగరాలను 300 నుంచి 284కి తగ్గించారు. ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ పరీక్షను నిర్వహించే నగరాలను 24 నుంచి 14 కుదించారు. ఆస్ట్రేలియా, బ్రెజిల్, కెనడా, హాంకాంగ్ వంటి దేశాల్లో ఎన్టీఏ పరీక్ష కేంద్రాలను తొలగించింది. కొత్తగా బహ్రెయిన్, జర్మనీ, ఇండోనేషియా, ఏయూఈలలో పరీక్ష కేంద్రాలను ఏర్పాటుచేసింది. ఆంధ్రప్రదేశ్‌లో 11 పట్టణాల్లో పరీక్ష కేంద్రాలను తొలగించడంతోపాటు మరికొన్ని నగరాల్లో సెంటర్లను తగ్గించారు. తెలంగాణాలో రెండు కొత్తగా రెండు నగరాల్లో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు.ఏపీలో పరీక్షా కేంద్రాలు ఇవే...అనంతపురం, భీమవరం, చిత్తూరు, ఏలూరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమహేంద్రవరం, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం, నరసరావుపేట, ప్రొద్దుటూరు, సూరంపాలెం, మచిలీపట్నం, నంద్యాల, తాడేపల్లిగూడెం.ఏపీలో పరీక్ష కేంద్రాలు తొలగించిన పట్టణాలుఅమలాపురం, బొబ్బిలి, చీరాల, గుత్తి, గుడ్లవల్లేరు, మదనపల్లె, మార్కాపురం, పుట్టపర్తి, పుత్తూరు, తాడిపత్రి, తిరువూరు. -
విద్యార్థులకు ఆధార్.. బాధార్..
ప్రభుత్వం నుంచి పొందే సేవలన్నింటినీ ఆధార్‌తో ముడిపెట్టడంతో అడుగడుగునా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఉన్నత విద్య, ఉద్యోగ పోటీ పరీక్షలకు దరఖాస్తు చేసే సమయంలోను ఆధార్ కార్డునే పరిగణనలోకి తీసుకుంటుండడం అభ్యర్థులకు తలనొప్పిగా మారింది. ఆధార్ కార్డును గుర్తింపు ధ్రువీకరణగా మాత్రమే చూడాలని కేంద్రం స్పష్టం చేసినా అధికారులు పట్టించుకోవడం లేదు. తాజాగా జేఈఈ మెయిన్ ప్రవేశ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులను ఆధార్ సమస్య వేధిస్తోంది. జనవరిలో జరగనున్న జేఈఈ మెయిన్–2025 మొదటి సెషన్‌కు ఆన్లైన్లో దరఖాస్తు చేసేందుకు గడువు ఈనెల 22న ముగియనుంది. దరఖాస్తు చేసేందుకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) నిబంధనలు విద్యార్థులకు చెమటలు పట్టిస్తున్నాయి. ప్రధానంగా ఆధార్ కార్డులోను, టెన్త్ సర్టిఫికెట్లోను విద్యార్థి, తల్లిదండ్రుల పేర్లు, చిరునామా ఒకే విధంగా ఉండాలనే నిబంధన చాలా ఇబ్బందిగా మారింది. ఉమ్మడి గుంటూరు జిల్లా నుంచి 20 వేలమందికిపైగా జేఈఈ మెయిన్‌కు దరఖాస్తు చేసుకుంటారు. ఆధార్‌కార్డు, టెన్త్ సర్టిఫికెట్ అప్లోడ్ చేయగానే నేమ్స్ మిస్ మ్యాచ్ అని చూపిస్తోందని ఎక్కువశాతం మంది విద్యార్థులు ఆవేదన చెందుతున్నారు. –గుంటూరు ఎడ్యుకేషన్ఆధార్ కేంద్రాల వద్ద ఆలస్యం దీంతో జేఈఈ మెయిన్‌కు సిద్ధమయ్యే విద్యార్థులు ఆధార్ కేంద్రాల వద్ద క్యూ కడుతున్నారు. ఒక్క గుంటూరు నగరంలోనే వందలమంది విద్యార్థులు నెలరోజులుగా ఆధార్ కేంద్రాల చుట్టూ తిరుగుతున్నారు. పేర్ల సవరణల కోసం ప్రయత్నిస్తున్నారు. పేరులో తప్పుల సవరణ, బయోమెట్రిక్ నమోదు, చిరునామా మార్పు ఒకేసారి చేయడం కుదరదని, మరోసారి రావాలని ఆయా కేంద్రాల సిబ్బంది చెబుతుండడంతో విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. దరఖాస్తుకు గడువు సమీపిస్తుండటం వారిని కలవరపరుస్తోంది. ఆధార్‌కార్డులో సవరణలకు 15 రోజుల నుంచి నెలరోజుల సమయం పట్టడం కూడా ఇబ్బందిగా మారింది. తగినన్నిఆధార్ కేంద్రాలేవి?జేఈఈ మెయిన్‌తోపాటు ఇంటర్మీడియెట్, అపార్ నమోదు కోసం ఆధార్‌లో సవరణలు విద్యార్థులను వేధిస్తున్నాయి. ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా తగినన్ని ఆధార్ కేంద్రాలు అందుబాటులో లేకపోవడం సమస్యగా మారింది. ఎంపిక చేసిన బ్యాంకులు, పోస్టాఫీసుల్లోనే ఉన్న ఆధార్ కేంద్రాలు ప్రస్తుతం కిటకిటలాడుతున్నాయి. వివిధ జిల్లాల నుంచి వచ్చి గుంటూరులోని ప్రైవేటు జూనియర్ కళాశాలల హాస్టళ్లలో ఉండి చదువుకుంటున్న విద్యార్థుల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఆధార్ కార్డులో సవరణలు కోసం ఎక్కడో మారుమూల ఉన్న ఊర్ల నుంచి తల్లిదండ్రులు వచి్చ, పిల్లలను వెంటబెట్టుకుని ఆ«ధార్ కేంద్రాల చుట్టూ తిరుగుతున్నారు. రోజుల తరబడి ఇక్కడే ఉండాలంటే వారికి కష్టంగా ఉంటోంది. పరీక్షలకు సన్నద్ధమవ్వాల్సిన విద్యార్థుల సమయం ఆధార్ కేంద్రాల వద్దే గడిచిపోతోంది. దీనికితోడు గుంటూరులో చంద్రమౌళీనగర్‌లోని పోస్టాఫీసులో ఉన్న ఆధార్ కేంద్రాన్ని ఇటీవల మూసేశారు. విద్యార్థుల కోసం ఆధార్ సవరణలకు ప్రత్యేకంగా కేంద్రాలు ఏర్పాటు చేస్తామని ప్రకటించిన జిల్లా అధికారులు తరువాత పట్టించుకోలేదు. -
నెలాఖరుకు జేఈఈ నోటిఫికేషన్!
సాక్షి, హైదరాబాద్: జేఈఈ–2025 నోటిఫికేషన్ ఈ నెలాఖరులో వెలువడనుంది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఈ దిశగా తన ప్రయత్నాలను ముమ్మరం చేసింది. నవంబర్ మొదటి వారంలో ఆన్లైన్ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభించే వీలుందని అధికార వర్గాల ద్వారా తెలిసింది. జనవరిలో మొదటి విడత జేఈఈ మెయిన్స్ నిర్వహిస్తారు. ఆ తర్వాత ఏప్రిల్ లేదా మే నెలలో రెండో విడత మెయిన్స్‌ను ఆన్లైన్ పద్ధతిలో చేపట్టనున్నారు. దేశంలోని ప్రతిష్టాత్మక ఐఐటీలు, ఎన్ఐటీలు, ట్రిపుల్ ఐటీలు, కేంద్ర ప్రభుత్వ నిధులతో నడిచే ఇంజనీరింగ్ సంస్థల్లో ప్రవేశానికి ఈ ఉమ్మడి ప్రవేశ పరీక్ష (జేఈఈ)ను నిర్వహిస్తారు. మెయిన్స్‌లో అర్హత సాధించిన వారిలో 2.5 లక్షల మందిని అడ్వాన్స్‌డ్‌కు పంపుతారు. అడ్వాన్స్‌డ్‌లో పొందిన ర్యాంకుల ఆధారంగా ఐఐటీల్లో సీట్లు కేటాయిస్తారు. జేఈఈ మెయిన్స్ ర్యాంకు ద్వారా ఎన్ఐటీలు, ట్రిపుల్ ఐటీలు, కేంద్ర ప్రభుత్వ నిధులతో నడిచే సంస్థల్లో ఇంజనీరింగ్ సీట్లు పొందే వీలుంది. ఈ పరీక్షను దృష్టిలో ఉంచుకుని తెలంగాణ వ్యాప్తంగా పరీక్ష కేంద్రాలపై దృష్టి పెట్టారు. ఏయే కేంద్రాలను ఎంపిక చేయాలనే సమాచారాన్ని ఎన్టీఏ సేకరించినట్టు అధికార వర్గాలు తెలిపాయి. మొదటినుంచీ తెలంగాణ వ్యాప్తంగా 21 పట్టణాల్లో జేఈఈ మెయిన్స్ నిర్వహిస్తున్నారు. అయితే గత ఏడాది నుంచి పరీక్ష కేంద్రాలను కుదించారు. కరోనా నేపథ్యంలో విద్యార్థుల సంఖ్య తగ్గడంతో పరీక్ష కేంద్రాలను 17 పట్టణాలకే పరిమితం చేశారు. కాగా, గత ఏడాది జేఈఈ రాసే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. ఈ కారణంగా ఈ సంవత్సరం పరీక్ష కేంద్రాలను పెంచే అంశాన్ని పరిశీలిస్తున్నారు.సిలబస్‌పై కసరత్తు.. గత సంవత్సరం జేఈఈ మెయిన్స్, అడ్వాన్స్‌డ్‌కు కూడా పరీక్ష సిలబస్‌ను తగ్గించారు. 2020లో కరోనా కారణంగా 8 నుంచి 12వ తరగతి వరకూ కెమిస్ట్రీ, మ్యాథ్స్, ఫిజిక్స్‌లో కొన్ని చాప్టర్లను తీసివేశారు. దీనిని దృష్టిలో ఉంచుకుని సీబీఎస్ఈతో పాటు ఇతర జాతీయ సిలబస్ ఉండే విద్యార్థులకు జేఈఈలో ఆయా చాప్టర్లను తొలగించాలనే డిమాండ్ వచ్చింది. ఈ కారణంగా గత సంవత్సరం కొన్ని చాప్టర్లను ఇవ్వలేదు. అయితే, ఈ ఏడాది ఆ సమస్య లేదని అధికారులు భావిస్తున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని పాత సిలబస్‌ను మళ్లీ కలపడమా? లేదా ఈ సంవత్సరం కూడా గత ఏడాది మాదిరిగానే నిర్వహించడమా? అనే దానిపై ఎన్టీఏ, ఇతర కేంద్ర సంస్థలు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. -
ఎన్టీఏ ఛైర్మన్ రికార్డుపై సందేహాలు: కాంగ్రెస్
ఢిల్లీ: నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ఒక అవుట్ సోర్సింగ్ ఏజెన్సీగా వ్యవహరిస్తోందని కాంగ్రెస్ పార్టీ విమర్శలు గుప్పించింది. ఎన్టీఏ అధికారిక వెబ్సైట్లో ఏజెన్సీకి సబంధించి సమాచారం చాలా తక్కవగా ఉందని టీఎంసీ ఎంపీ సాగరికా ఘోష్ ప్రశ్నించిన నేపథ్యంలో కాంగ్రెస్ ఎన్టీఏపై ఆరోపణలు చేసింది.‘‘ఎన్టీఏ ఏకైక పని అవుట్సోర్స్ చేయడం మాత్రమే. దీని ఛైర్మన్ ప్రదీప్ కుమార్ జోషీ.. మధ్యప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఛైర్మన్‌గా పనిచేసిన సమయంలో చాలా సందేహాస్పదమైన రికార్డును కలిగి ఉన్నారు’’ అని కాంగ్రెస్ నేత జైరాం రమేస్ ‘ఎక్స్’వేదికగా విమర్శలు చేశారు.The only job of NTA appears to be to outsource. Its Chairman has a very dubious record as Chairman of the Madhya Pradesh Public Service Commission. https://t.co/DhBa5KDSos— Jairam Ramesh (@Jairam_Ramesh) August 3, 2024ఇక.. నీట్‌తో సహా 17 ప్రధాన పరీక్షలకు బాధ్యత వహించే ఎన్టీఏ తన వెబ్సైట్లో ఏజెన్సీ గురించి చాలా తక్కువ సమాచారం అందుబాటులో ఉంచిందని.. ఇలా ఎందుకు పరిమితమైన సమాచారం ఇస్తోందని అడుగుతూ శుక్రవారం టీఎంసీ ఎంపీ సాగరికా ఘోష్ విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌కు లేఖ రాశారు. ‘అధికారులు ఎవరు? ఏజెన్సీ వార్షిక నివేదికలు ఎక్కడ ఉన్నాయి? భవిష్యత్ పరీక్షల కోసం ప్రజల విశ్వాసాన్ని పెంచుకోవడానికి ఎన్టీఏ తన వెబ్సైట్లో ఏజెన్సీకి సంబంధించి మరింత సమాచారాన్ని అందించాలి’ అని లేఖలో పేర్కొన్నారు. -
లోపాల్ని సరిదిద్దుకోవాల్సిందే.. ఎన్టీఏకు సుప్రీం అక్షింతలు
న్యూఢిల్లీ: నీట్ యూజీ పరీక్ష విధానానికి సంబంధించిన లోపాలను (సరిదిద్దాలని) నివారించాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ)ను సుప్రీంకోర్టు శుక్రవారం హెచ్చరించింది. మున్ముందు ఇలాంటి లీకేజీలు జరగకుండా చర్యలు తీసుకోవాలని అటు కేంద్రంతోపాటు ఎన్టీఏను మందలించింది. ఈ మేరకు నీట్ యూజీ పేపర్‌లీక్‌పై దాఖలైన వివిధ పిటిషన్లను విచారించిన సుప్రీంకోర్టు.. శుక్రవారం తుది తీర్పు వెలువరించింది.పేపర్‌లీకేజీలో వ్యవస్థీకృత ఉల్లంఘన జరగలేదని, కేవలం పాట్నా, హజారీబాగ్‌కే పరిమితమని సుప్రీం వ్యాఖ్యానించింది. అందుకే నీట్ పరీక్షను రద్దు చేసి, మళ్లీ నిర్వహించేందుకు నిరాకరిస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు సీజేఐ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని త్రిసభ ధర్మాసంన సమగ్ర తీర్పు వెల్లడించింది.నీట్ వంటి జాతీయ పరీక్షలో ఇలాంటి 'ఫ్లిప్ ఫ్లాప్స్'ను నివారించాలని, ఇవి విద్యార్థుల ప్రయోజనాలను దెబ్బతిస్తాయని అత్యున్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. నీట్ యూజీ పేపర్ లీక్‌పై ఆరోపణలు, ఇతర అవకతవకలపై వివాదం చెలరేగినప్పటికీ పరీక్షను రద్దు చేయకపోవడానికి గల కారణాలను వెలువరిస్తూ, అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేసిందిపరీక్షా విధానంలో లోపాలను నిపుణుల కమిటీ సరిచేయాలని పేర్కొంది. ఎన్టీఏ స్ట్రక్చరల్ ప్రాసెస్‌లోని లోపాలన్నింటినీ తమ తీర్పులో ఎత్తిచూపినట్లు అత్యున్నత న్యాయస్థానం తెలిపింది. విద్యార్థుల శ్రేయస్సు కోసం లోపాలను భరించలేమని స్పష్టం పేర్కొంది. తాజాగా తలెత్తిన సమస్యలు పునరావృతం కాకుండా ఈ ఏడాదే కేంద్రం పరిష్కరించాలని సుప్రీంకోర్టు సూచించింది.ఈసందర్భంగా ఎన్టీఏ పనితీరు, పరీక్షల్లో సంస్కరణల కోసం కేంద్రం నియమించిన ఇస్రో మాజీ చీఫ్ కె.రాధాకృష్ణన్ నేతృత్వంలోని ఏడుగురు సభ్యుల కమిటీకి సుప్రీంకోర్టు పలు ఆదేశాలు జారీ చేసింది.కేంద్రం నియమించిన కమిటీ తన నివేదికను సెప్టెంబర్ 30 లోపు కోర్టుకు సమర్పించాలి. ఈ కమిటీ మొత్తం పరీక్ష ప్రక్రియను విశ్లేషించి, పరీక్ష విధానంలో లోపాలను సరిచేసి, ఎన్టీఏ మరింత సమర్థవంతంగా చేయడానికి అవసరమయ్యే మార్పులను సూచించాలి. పరీక్షా వ్యవస్థను బలోపేతం చేసేందుకు అంతర్జాతీయ సాంకేతిక సంస్థల సాయం తీసుకోవాలని సూచించింది. ఈ నివేదిక అందిన తర్వాత అందులోని అంశాలను అమలుచేసే విషయంపై కేంద్రం, విద్యాశాఖ రెండు వారాల్లోగా నిర్ణయం తీసుకోవాలి.అర్హత పరీక్షల నిర్వహణకు ప్రామాణిక ఆపరేటింగ్ విధానం లేదా ప్రోటోకాల్‌ను రూపొందించడం,పరీక్షా కేంద్రాల కేటాయింపు, మార్పు ప్రక్రియను సమీక్షించాలి.అభ్యర్థుల గుర్తింపును ధృవీకరించడానికి కఠినమైన విధానాలను సిఫార్సు చేయాలి.అన్ని పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు సాధ్యాసాధ్యాలను అంచనా వేయాలి.ట్యాంపరింగ్ ప్రూఫ్ ప్రశ్నపత్రాల కోసం యంత్రాంగాలను సమీక్షించాలి. సూచనలు ఇవ్వాలి.పరీక్షా కేంద్రాల్లో క్రమం తప్పకుండా ఆడిట్లు, తనిఖీలు నిర్వహించాలి. -
నీట్ యూజీ తుది ఫలితాల్లో గందరగోళం
న్యూఢిల్లీ: నీట్ యూజీ 2024 తుది ఫలితాల విడుదలో గందరగోళం నెలకొంది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు తుది ఫలితాలను ప్రకటించినట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) వెల్లడించగా.. కేంద్ర విద్యామంత్రిత్వశాఖ మాత్రం సవరించిన మర్కులకు సంబంధించిన ఫలితాలను తాము ఇంకా విడుదల చేయలేదని పేర్కొంది.విద్యార్ధులు ఫలితాలను ఇప్పుడే చూసుకోలేరని, తాము త్వరలో విడుదల చేస్తామని తెలిపింది. ఇప్పుడు వైరల్ అవుతున్న లింక్ పాతదని స్పష్టం చేసింది. కాగా నీట్ యూజీ-2024 తుది ఫలితాలు విడుదలయ్యాయి. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సవరించిన ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) విడుదల చేసినట్లు వార్తలు వస్తున్నాయి.ఫిజిక్స్ విభాగంలో ఓ ప్రశ్నకు తప్పుడు సమాధానం ఎంచుకున్న కొంత మంది విద్యార్ధులకు కలిసిన గ్రేస్ మార్కులను తొలగించి.. తాజా ఫలితాలను విడుదల చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే నేడు తుది ఫలితాలను విడుదల చేసింది. దీని ఆధారంగా 4 లక్షల మంది అభ్యర్థులు 5 మార్కులను కోల్పోయారు. కాగా ఫిజిక్స్‌లోని ఓ ప్రశ్నకు 12వ తరగతి ఎన్సీఈఆర్టీ పాత సిలబస్ ప్రకారం తప్పుగా సమాధానం ఇచ్చిన కొంతమంది విద్యార్ధులకు ఎన్టీఏ అదనంగా మార్కులను కలిపింది. అయితే, కచ్చితమైన ఒక సమాధానాన్ని మాత్రమే అంగీకరించాలని, ఇతర సమాధానాలకు మార్కులు ఇవ్వరాదని సుప్రీంకోర్టు మంగళవారం తేల్చి చెప్పింది. ఇప్పటికే ఇచ్చిన మార్కులను ఉపసంహరించుకోవాలని తెలిపింది.అయితే సుప్రీంకోర్టులో నీట్ వ్యవహారంపై విచారణ సందర్బంగా ఫిజిక్స్ విభాగంలో 29వ ప్రశ్నకు ఒకటి మాత్రమే సరైన సమాధానం అయినప్పుడు.. రెండు ఆప్షన్లు ఎంచుకున్న విద్యార్ధులకు ఎన్టీయే అదనపు మార్కులు కలిపిందని ఓ పిటిషనర్ లేవనెత్తాురు.దీనిపై స్పందించిన సుప్రీం దర్మాసనం.. ముగ్గురు నిపుణులతో కూడిన బృందాన్ని ఏర్పాటు చేసి మరుసటి రోజు మధ్యాహ్నానికి ఫిజిక్స్ ప్రశ్నకు సరైన సమాధానానికి సంబంధించిన నివేదికను సమర్పించాలని ఐఐటీ ఢిల్లీ డైరెక్టర్‌ను ఆదేశించింది. అనంతరం ఐటీ ఢిల్లీ యొక్క నివేదిక ఆధారంగా ఆప్షన్ 4 మాత్రమే సరైన సమాధానం అని తెలిపింది. దీంతో ఆప్షన్ 4 ఎంపిక ేసిన విద్యార్ధులకు మాత్రమే మార్కులు ఇవ్వాలని కోర్టు స్పష్టం చేసింది.ఇక ఈ ఏడాది మే నెలలో దేశవ్యాప్తంగా జరిగిన నీట్-యూజీ పరీక్షలో అవకతవకలు జరిగినట్టు ఆరోపణలు వచ్చాయి. ఈ అంశంపై సీబీఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తోంది. మరోవైపు ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టు విచారణ జరుపుతోంది. ఈ పరీక్షను మళ్లీ నిర్వహించాల్సిన అవసరం లేదని పేర్కొంది. -
2018 నుంచి 16 పరీక్షలను వాయిదా వేసిన ఎన్టీఏ
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు 16 పరీక్షలను వాయిదా వేసినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. 2018లో ఎన్టీఏ ఏర్పాటు కాగా.. వివిధ కారణాల వల్ల 16 పరీక్షలను వాయిదా వేసినట్లు విద్యా మంత్రిత్వ శాఖ సోమవారం లోక్‌సభలో పేర్కొంది. అయితే పరీక్షలను వాయిదా వేయడానికి కోవిడ్ 19 మహమ్మారి,సాంకేతిక, రవాణా, పరిపాలనా పరమైన సమస్యలను కారణాలుగా తెలిపింది. ఈ మేరకు డీఎంకే ఎంపీ కనిమొళి లోక్‌సభలో అడిగిన ప్రశ్నకు. విద్యాశాఖ సహాయ మంత్రి సుకాంత మజుందార్ లిఖితపూర్వక సమాధానమిచ్చారు.‘2018లో ఎన్టీఏ ఏర్పాటయ్యింది. 240 పరీక్షలను విజయవంతంగా నిర్వహించింది. 5.4 కోట్ల మందికి పైగా విద్యార్ధులు ఇందులో పాల్గొన్నారు. ఎన్టీఏ నిర్వహించే చాలా పరీక్షలు అనేక సబ్జెక్టులు, బహుళ-షిఫ్ట్‌లు, ఎక్కువ రోజుల వ్యవధిలో జరుగుతాయి. కాబట్టి కరోనా, లాజిస్టికల్, సాంకేతిక సమస్యలు, పరిపాలనాపరమైన సమస్యలు, చట్టపరమైన సమస్యలు వంటి కారణాల వల్ల పలు పరీక్షలు వాయిదా పడ్డాయి. ముందు చెప్పిన తేదీలు, సమయాలకు పరీక్షలు నిర్వహించలేకపోయింది.’ అని పేర్కొన్నారు.కరోనా కారణంగా జేఈఈ-మెయిన్ (2020), నీట్-యూజీ (2020), JEE-మెయిన్ (2021) నీట్-యూజీ(2021) పరీక్షలు వాయిదా పడ్డాయి. వాయిదా పడిన మరిన్ని పరీక్షలు.. CSIR UGC-NET (2020), UGC-NET (డిసెంబర్ 2020),UGC-NET (మే 2021)ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ (ICAR) AIEEA (2020).. ఢిల్లీ విశ్వవిద్యాలయ ప్రవేశ పరీక్ష (DUET) 2020, GNOU PhDకామన్ మేనేజ్మెంట్ అడ్మిషన్ టెస్ట్ (CMAT)-2021ఆల్ ఇండియా ఆయుష్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంట్రన్స్ టెస్ట్ (AIAPGET)-2021 జాయింట్ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ ఇన్ మేనేజ్మెంట్ అడ్మిషన్ టెస్ట్ (జిప్‌మ్యాట్)- 2021, GNOU PhD ఎంట్రన్స్ పరీక్షగ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ బయోటెక్నాలజీ (GAT-B), 2023నేషనల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (NCET), 2024, CSIR-NET, 2024 -
ఒకే సెంటర్లో 85 శాతం మందికి అర్హత
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) నీట్–యూజీ ఫలితాలను పరీక్షా కేంద్రాలు, నగరాల వారీగా శనివారం విడుదల చేసింది. ఫలితాలను వెబ్సైట్లో అందుబాటులో తీసుకొచి్చంది. ఈ ఫలితాలను పరిశీలిస్తే విస్మయకరమైన అంశాలు బయటపడుతున్నాయి. గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో ఒకే పరీక్షా కేంద్రంలో నీట్ రాసిన అభ్యర్థుల్లో ఏకంగా 85 శాతం మంది అర్హత సాధించినట్లు తెలుస్తోంది. రాజ్‌కోట్‌లోని యూనిట్ స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ ఎగ్జామ్ సెంటర్లో 22,701 మంది నీట్ రాశారు. వీరిలో 85 శాతం అర్హత సాధించారు. ఈ సెంటర్లో 12 మంది 700కు పైగా, 115 మంది 650కిపైగా, 259 మంది 600కు పైగా, 403 మంది 550కిపైగా స్కోర్ సాధించారు. అలాగే రాజస్తాన్‌లోని విద్యాభారతి శిఖర్ సెంటర్లో పరీక్ష రాసినవారిలో కూడా చాలామందికి మెరుగైన స్కోర్ లభించింది. అక్కడ 8 మంది 700కు పైగా, 69 మంది 650కిపైగా, 155 మంది 600కుపైగా, 241 మంది 500కు పైగా స్కోర్ సాధించారు.హరియాణాలోని రోహ్తక్లో మోడల్ స్కూల్ సెంటర్లో పరీక్ష రాసిన వారిలో 45 మంది అభ్యర్థులకు 600కుపైగా స్కోర్ లభించింది. హరియాణాలోని ఝాజ్జర్‌లో హర్ద యాల్ పబ్లిక్ స్కూల్ సెంటర్లో ఇంతకముందు ఆరుగురు అభ్యర్థులకు 720కి 720 స్కోర్ దక్కింది. గ్రేసు మార్కులను తొలగించి, ఫలితాలను సవరించిన తర్వాత ఈ సెంటర్లో 13 మంది అభ్యర్థులు 600కుపైగా స్కోర్ సాధించారు. 682 స్కోర్ ఎవరికీ దాటలేదు. నీట్ కేసులో మరో ముగ్గురి అరెస్టు నీట్ పేపర్ లీక్ కేసులో సూత్రధారుల్లో ఒకరిగా భావిస్తున్న వ్యక్తిని సీబీఐ అధికారులు శనివారం అరెస్టు చేశారు. అతడిని ఎన్ఐటీ–జంòÙడ్పూర్ బీటెక్ గ్రాడ్యుయేట్ శశికాంత్ పాశ్వాన్ అలియాస్ శశిగా గుర్తించారు. అలాగే ఇదే కేసులో ఇద్దరు ఎంబీబీఎస్ విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఇప్పటిదాకా అరెస్టయిన వారి సంఖ్య 21కి చేరుకుంది. -
అప్పుడేమో నీట్ టాపర్లు, రీఎగ్జామ్ ఫలితాల్లో మాత్రం..
న్యూఢిల్లీ: ఆ సెంటర్లో నీట్ యూజీ రాసిన ఆరుగురికి 720కి 720 మార్కులు వచ్చాయి. అది ఫలితాలపై, మొత్తం పరీక్ష నిర్వహణపై అనుమానాలు రేకెత్తిస్తూ .. దేశవ్యాప్తంగా పెద్ద దుమారమే రేపింది. అయితే గ్రేసు మార్కులు కలపవడం వల్లే అలా జరిగిందని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వివరణ ఇచ్చుకుంది. సుప్రీం కోర్టు ఆదేశాలతో.. గ్రేస్ మార్కులు కలిపిన 1,563 మందికి రీటెస్ట్ నిర్వహించారు. ఇవాళ మధ్యాహ్నాం సెంటర్ల వారీగా ఫలితాలు విడుదల చేశారు. అయితే.. హర్యానాలో 720కి 720 ఆరుగురికి వచ్చిన సెంటర్లో ఈసారి ఆసక్తికరమైన ఫలితాలు వచ్చాయి. బహాదుర్‌ఘడ్‌లోని హర్దయాల్ పబ్లిక్ స్కూల్ సెంటర్లో మొత్తం 494 మంది పరీక్ష రాశారు. కానీ, ఆ సెంటర్లో రీఎగ్జామ్ రాసిన వాళ్లలో ఎవరికీ 700 దాటలేదు. ఆ సెంటర్లో హయ్యెస్ట్ మార్కులు 682 మాత్రమే. మరో పదమూడు మందికి 600కి పైగా మార్కులు వచ్చాయి. తొలుత వెల్లడైన ఫలితాలకు వీటికి మధ్య భారీ వ్యత్యాసం కనిపించింది.మే 5వ తేదీన దేశవ్యాప్తంగా జరిగిన నీట్ యూజీ పరీక్షలో.. హర్యానా సెంటర్లో రాసిన ఆరుగురికి ఫుల్‌స్కోర్, మరో ఇద్దరికి 719, 718 మార్కులు వచ్చాయి. అయితే.. రీటెస్ట్ తర్వాత నీట్ యూజీ పరీక్ష రాసిన అందరి ర్యాంకులు మారినట్లు ఫలితాల తర్వాత ఎన్టీఏ వెల్లడించడం తెలిసిందే. గతంలో జరిగిన నీట్ యూజీ పరీక్షలో 571 నగరాల్లోని 4,750 సెంటర్లలో 24 లక్షల మంది పరీక్ష రాశారు. అయితే షెడ్యూల్ కంటే ముందుగా జూన్ 4న ఫలితాలు ఇవ్వడం, అందులోనూ 67 మందికి ఫస్ట్ ర్యాంక్ రావడం అభ్యర్థుల్లో అనుమానాల్ని రేకెత్తించింది. రోడ్డెక్కి ఆందోళన బాట పట్టారు. ఈ అంశంపై రాజకీయ దుమారం సైతం చెలరేగడం, ఆపై వివాదం సుప్రీం కోర్టుకు చేరడంతో తీవ్ర చర్చనీయాంశమైంది. చివరకు గ్రేస్ మార్కుల్ని రద్దు చేస్తూ రీటెస్ట్‌కు సుప్రీం కోర్టు ఆదేశించింది. జూన్ 24వ తేదీన నీట్ యూజీ రీటెస్ట్ నిర్వహించగా.. గ్రేస్ మార్కులు కలిపిన 1,563 మందికి 813 మంది మాత్రమే మళ్లీ పరీక్ష రాశారు.ఇక.. నీట్ పరీక్షలో పేపర్ లీక్ జరిగిన ఆరోపణలపై సీబీఐ దర్యాప్తు జరుగుతోంది. మరోపక్క ఈ అవకతవకలపై సుప్రీంలో విచారణ జరుగుతోంది. ఈ క్రమంలోనే విచారణలో భాగంగా మిగతా కేంద్రాలతో పోలిస్తే అనుమానిత పరీక్ష కేంద్రాల్లో రాసిన వారికి ఎక్కువ మార్కులు వచ్చాయా.. లేదా అని తెలుసుకోవడానికి కేంద్రాల వారీగా ఫలితాలు అందించాలని కోర్టు ఎన్టీఏను ఆదేశించింది. ఆ ఆదేశాల ప్రకారమే ఇవాళ ఎన్టీఏ తన వెబ్సైట్లో ఫలితాలు ఉంచింది. అయితే.. ఫలితాల వెల్లడి టైంలో విద్యార్థుల గుర్తింపు బయటపడకుండా చూడాలని సుప్రీం సూచనను టెస్టింగ్ ఏజెన్సీ పాటించింది. -
నీట్ యూజీ ఫలితాలు: సెంటర్ల వారీగా విడుదల
ఢిల్లీ: సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు నీట్-యూజీ ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి (NTA) విడుదల చేసింది. నగరాలు, కేంద్రాల వారీగా అందరి ఫలితాలను ఎన్టీఏ నీట్ అధికారిక వెబ్సైట్లో శనివారం ఈ ఫలితాలను అప్లోడ్ చేసింది. అభ్యర్థులు nta.ac.in/NEET/ లేదా neet.ntaonline.in. వెబ్సైట్లో తమ ఫలితాలను నగరాలు, కేంద్రాల వారిగా చూసుకోవచ్చని ఎన్టీఏ పేర్కొంది.నీట్-యూజీ పరీక్షలో అవకతవకలు జరిగాయంటూ దాఖలైన పిటిషన్లపై భారత ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్, జడ్జిలు జేబీ పార్థివాలా, మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం గురువారం విచారణ చేట్టిన విషయం తెలిసిందే. ఈ మేరకు నగరాల వారీగా, కేంద్రాల వారీగా అందరి ఫలితాలను విడుదల చేయాలని ఆదేశించింది. మరోవైపు.. అభ్యర్థుల వివరాలు బహిర్గతం కాకుండా గుర్తింపుపై మాస్క్ వేసి ప్రచురించాలని సుప్రీంకోర్టు నీట్ కమిటీకి స్పష్టం చేసింది. ఇక.. ఇలా ఫలితాలను విడుదల చేస్తే విద్యార్థుల వ్యక్తిగత వివరాలు బయటపడతాయని సొలిసిటర్ జనరల్ వాదించగా.. సీజేఐ చంద్రచూడ్ స్పందిస్తూ పరీక్ష కేంద్రాల వారీగా డమ్మీ రోల్ నంబర్లతో ఎందుకు ప్రకటించకూడదని ప్రశ్నించారు. -
Supreme Court: సెంటర్లవారీగా ఫలితాలు
సాక్షి, న్యూఢిల్లీ: పరీక్ష కేంద్రాలు, నగరాల వారీగా నీట్–యూజీ, 2024 ఫలితాలను ప్రకటించాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ)ను సుప్రీంకోర్టు ఆదేశించింది. సమగ్ర ఫలితాలను శనివారం మధ్యాహ్నం 12 గంటలలోపు ఎన్టీఏ వెబ్సైట్లో పొందుపరచాలని తెలిపింది. నీట్–యూజీ పేపర్ లీక్, నిర్వహణలో అవకతవకలపై దాఖలైన వేర్వేరు పిటిషన్లను గురువారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రల ధర్మాసనం విచారించింది. పరీక్షను రద్దుచేసి కొత్తగా నిర్వహించాలని, కోర్టు పర్యవేక్షణలో లీకేజీ ఉదంతంపై దర్యాప్తు జరగాలని వేర్వేరు పిటిషన్లు దాఖలైన విషయం తెల్సిందే. ‘‘ పరీక్షలో సెంటర్లవారీగా విద్యార్థులు పొందిన మార్కుల వివరాలను బహిర్గతంచేయండిగానీ అభ్యర్థుల ఐడెంటిటీ కనిపించకూడదు. గోప్యత పాటించండి. డమ్మీ రోల్ నంబర్లు వేసి అభ్యర్థుల మార్కుల వివరాలు ఇవ్వండి. ప్రశ్నాపత్రం సోషల్‌మీడియా ద్వారా ఎక్కువ మందికి షేర్ అయి, విస్తృతస్థాయిలో పరీక్ష పవిత్రత దెబ్బతింటేనే పరీక్షను మరోమారు నిర్వహించేందుకు అనుమతిస్తాం. అంతేగానీ ఒకటి రెండు కేంద్రాలకు మాత్రమే లీకేజీ పరిమితమైతే రీటెస్ట్‌కు ఒప్పుకోం. కేసు సీబీఐ చేతికి వెళ్లకముందు బిహార్ పోలీసులు సేకరించిన ఆధారాలు, సమర్పించిన ఆర్థికనేరాల విభాగ నివేదికను రేపు సాయంత్రం ఐదింటికల్లా మాకు అందజేయండి’ అని కోర్టు ఆదేశించింది. తర్వాత కొందరు పిటిషనర్ల తరఫు సీనియర్ న్యాయవాది నరేందర్‌హూడా వాదించారు. ‘‘ పరీక్షను రద్దుచేయాల్సిందే. ఎందుకంటే లీకేజీ వ్యవస్థీకృతంగా జరిగింది. హజారీబాగ్‌లో ప్రశ్నపత్రాలు ఆరురోజులపాటు ఒక ప్రైవేట్ కొరియర్ కంపెనీ అ«దీనంలో ఉండిపోయాయి. ఎగ్జామ్ సెంటర్‌కు ఒక సాధారణ ఈ–రిక్షాలో తరలించారు. ఈ ఉదంతంలో ఆ సెంటర్ ప్రిన్సిపల్‌ను ఇప్పటికే అరెస్ట్‌చేశారు’ అని అన్నారు. అయితే ప్రశ్నపత్రం లీక్ కాలేదని కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా అన్నారు. ‘ కేవలం 1.08 లక్షల మంది అడ్మిషన్ పొందే ఈ పరీక్ష కోసం 23.33 లక్షల మంది భవిష్యత్తును పణంగా పెట్టలేం. పటా్న, హజారీబాగ్ సెంటర్లలో మాత్రమే లీకేజీ అయినట్లు ప్రాథమిక సాక్ష్యాలను బట్టి తెలుస్తోంది. గుజరాత్‌లోని గోధ్రాలోనూ ఇది జరిగి ఉండొచ్చు. అయితే దేశవ్యాప్తంగా పేపర్ లీకేజీ అయిందనే బలమైన ఆధారాలు, సాక్ష్యాలు ఉంటేనే రీ టెస్ట్‌కు ఆదేశాలిస్తాం. అయినా పేపర్ లీకేజీకి, పరీక్ష ప్రారంభానికి మధ్య ఎంత సమయం ఉంది? ఎంత మందికి పేపర్ చేరవేశారు? అనేవి కీలక అంశాలపై స్పష్టత రావాలి’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. తదుపరి విచారణ 22వ తేదీకి వాయిదా వేసింది. -
‘సెంటర్లవారీగా ఫలితాలు వెల్లడించండి’.. సుప్రీంకోర్టులో నీట్ విచారణ వాయిదా
న్యూఢిల్లీ, సాక్షి: నీట్ పేపర్ లీక్‌పై సుప్రీం కోర్టులో విచారణ సోమవారానికి(జులై 22కి) వాయిదా పడింది. ఇవాళ్టి విచారణ ముగించే ముందు.. సెంటర్ల వారీగా ఫలితాలు విడుదల చేయాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ ధర్మాసనం ఆదేశించింది. శనివారం మధ్యాహ్నాం కల్లా ఫలితాల్ని వెబ్సైట్లో ఉంచాలన్న ధర్మాసనం.. విద్యార్థుల పేర్లు మాత్రం బయటపెట్టకూడదని స్పష్టం చేసింది. అలాగే తదుపరి విచారణలో ఇరుపక్షాలు రాతపూర్వక వాదనలు సమర్పించాలని ఆదేశించింది. ఇక ఇవాళ్టి విచారణ టైంలోనూ సీజేఐ త్రిసభ్య న్యాయమూర్తుల బెంచ్.. విస్తృత స్థాయిలో పరీక్ష పవిత్రత దెబ్బతిన్నదని గుర్తిస్తేనే రీటెస్ట్‌కు ఆదేశించగలమని మరోసారి స్పష్టం చేసింది. ‘‘సామాజిక పరిణామాల దృష్ట్యా నీట్ పరీక్షకు సంబంధించిన పిటిషన్ల విచారణకు మేం ప్రాముఖ్యత ఇస్తాం. ఈ వ్యవహారంలో కోర్టు నుంచి చివరకు ఎలాంటి తీర్పు వస్తుందోనని లక్షలాది మంది విద్యార్థులు ఎదురుచూస్తున్నారు. అలాగే పిటిషనర్లు, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నుంచి మరింత సమాచారాన్ని అడిగారు. అలాగే.. మెడికల్ సీట్లు ఎన్ని ఉన్నాయి? పిటిషన్లు వేసిన విద్యార్థులు పొందిన కనీస మార్కులు ఎన్ని? అసలు ఎంతమంది విద్యార్థులు కోర్టును ఆశ్రయించారు?అని న్యాయవాదుల్ని చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ ప్రశ్నించారు.‘‘పరీక్ష రాసిన 23 లక్షల మందిలో లక్ష మంది మాత్రమే వైద్య కళాశాలల్లో ప్రవేశం పొందుతారు. విస్తృతస్థాయిలో పేపర్ లీక్ జరిగిందని తేలితే.. రీ టెస్ట్ నిర్వహించాల్సి ఉంటుంది. ప్రస్తుతం సీబీఐ విచారణ జరుగుతోంది. మాకు దర్యాప్తు సంస్థ వెల్లడించిన వివరాలు బయటపెడితే.. దర్యాప్తుపై ప్రభావం పడుతుంది’’ అని ఆయన వ్యాఖ్యానించారు. ఈ ఏడాది మే 5వ తేదీన దేశవ్యాప్తంగా నీట్ యూజీ 2024 పరీక్ష నిర్వహించారు. అయితే పరీక్ష పేపర్ లీక్ అవడంతో పాటు పరీక్ష నిర్వహణలో అవకతవకలు చోటుచేసుకున్నట్లు వార్తలు రావడంతో దేశవ్యాప్తంగా ఆందోళనలు జరిగాయి. ఫలితాల్లో ఏకంగా 67 మందికి జాతీయస్థాయిలో మొదటి ర్యాంకు రావడంపైనా పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. నీట్ అభ్యర్థుల్లో 1563 మందికి గ్రేస్ మార్కులు కలపడం, ఓఎంఆర్ షీట్లు అందకపోవడం, న్యాయస్థానం పర్యవేక్షణలో దర్యాప్తు సహా నీట్‌ను రద్దు చేయాలన్న డిమాండ్లతో సుప్రీం కోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. ఇక.. నీట్ ప్రశ్నపత్రం లీకైనమాట వాస్తవమని తేలడంతో ఇందులో అవకతవకలు జరిగాయనడంలో ఎటువంటి సందేహం లేదని సుప్రీంకోర్టు ఇటీవల పేర్కొన్న తెలిసిందే.ల -
పిల్లల భవితకు పెద్ద పరీక్ష!
సంస్కరణ అనుకొని తెచ్చినది తీరా సమస్యగా మారడమంటే ఇదే. వైద్యవిద్యా కోర్సుల్లో ప్రవేశం కోసం పదకొండేళ్ళ క్రితం అప్పటి యూపీఏ సర్కార్ తెచ్చిన జాతీయస్థాయి ప్రవేశపరీక్ష ‘నీట్’ వ్యవహారం చూస్తుంటే అదే అనిపిస్తోంది. పేపర్ లీకులు, ఇతర అక్రమాలు సహా అనేక వివాదాలు ముసురుకున్న తాజా ‘నీట్ – యూజీ 2024’ వ్యవహారమే అందుకు ప్రత్యక్ష సాక్ష్యం. అవకతవకలకు ఆలవాలమైన జాతీయ పరీక్షా ఏజెన్సీ (ఎన్టీఏ) – కొత్తగా పరీక్ష నిర్వహించాలని కోరుతున్న అభ్యర్థులు – అందుకు ససేమిరా అంటున్న కేంద్రం – సత్వర నిర్ణయానికి బదులు సన్నాయి నొక్కులు నొక్కుతున్న సుప్రీమ్ కోర్ట్... వీటన్నిటి మధ్య నీట్ ఓ అంతులేని కథ. మళ్ళీ పరీక్ష జరపాలని డిమాండ్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై తదుపరి విచారణను జూలై 18కి వాయిదా వేస్తున్నట్టు సుప్రీమ్ గురువారం ప్రకటించడంతో ఈ సీరియల్‌కు సశేషం కార్డు పడింది. ఈసారి వైద్యవిద్యలో ప్రవేశాలు ఆశించిన 24 లక్షలమందితో పాటు అర్హత సంపాదించిన 13 లక్షలమంది పరిస్థితి అగమ్య గోచరమైంది. లీక్ కథ బయటకొచ్చి ఇన్ని వారాలైనా, పునఃపరీక్ష మినహా మరో మార్గం కనబడట్లేదు. ఒకపక్క కోర్ట్ నిర్ణయం జాప్యమవుతుండగా... మరోపక్క రీ–టెస్ట్‌పై సంబంధిత పక్షాల్లో భిన్నాభిప్రాయాలున్నాయి. నిజానికి, ఉత్తరాదిన కొన్ని కేంద్రాల్లో ప్రశ్నపత్రం లీక్ సహా అనేక అక్రమాలు జరిగినట్టు ఇప్పటికే మీడియాలో బాహాటంగా వెల్లడైంది. సాక్షాత్తూ సుప్రీమ్ సైతం లీకేజీ నిజమేనని అభిప్రాయపడింది. కాకపోతే, వ్యవస్థీకృతంగా లీక్ జరిగిందా, ఏ మేరకు ఎలా జరిగింది, భవిష్యత్తులో కట్టుదిట్టంగా పరీక్షల నిర్వహణకు ఎలాంటి చర్యలు తీసుకోనున్నారన్న వివరాలు ఇవ్వాలంటూ కేంద్రాన్నీ, ఎన్టీఏనూ జూలై 8న ఆదేశించింది. అందుకు జవాబిచ్చే క్రమంలో కేంద్ర సర్కార్ పాత పరీక్ష రద్దు చేసి కొత్త పరీక్ష పెట్టడం హేతుబద్ధం కాదు పొమ్మంటోంది. అదేమంటే, విస్తృత స్థాయిలో అవకతవకలు జరిగాయనడానికి ఆధారాలు లేవంటూ ఐఐటీ – మద్రాస్ తాజాగా ఇచ్చిన సమగ్ర నివేదికను వత్తాసు తెచ్చుకుంటోంది. సహజంగానే ఎన్టీఏ సైతం కేంద్ర సర్కార్ వాదననే సమర్థిస్తోంది. పైగా, నీట్ ప్రశ్నపత్రం సామాజిక మాధ్యమాల్లో లీకైనట్టు వచ్చిన వీడియోనే ఫేక్ అనేసింది.ఏ విషయంలోనైనా అనుమానాలు రాకూడదు. వస్తే సమూలంగా నివృత్తి చేయాలి. అంతేకానీ అనుమానం పెనుభూతమైన వేళ... పాలకులు, ప్రభుత్వ సంస్థలు భీష్మించుకు కూర్చుంటే ఎలా? పైగా, లక్షలాది విద్యార్థుల భవితతో, వారి కుటుంబాల మానసిక ఆరోగ్యంతో ముడిపడిన అంశాన్ని వారి దృక్కోణం నుంచి సానుభూతితో చూడకపోవడం మరీ ఘోరం. నీట్ ఫలితాల్లో ఏవైనా నగరాల్లో, కేంద్రాల్లో పెద్దయెత్తున విద్యార్థులకు అనుచిత లబ్ధి చేకూరిందా అని తేల్చడం కోసం ఉన్నత విద్యాశాఖ అభ్యర్థన మేరకు ఐఐటీ– మద్రాస్ డేటా ఎనాలసిస్ చేసింది. మంచిదే! 2023, 2024ల్లోని టాప్ లక్షా నలభై వేల ర్యాంకులను ఈ ఎనాలసిస్‌లో భాగంగా విశ్లేషించారట. ఎక్కడా ఏ అక్రమం జరగలేదనీ, టాప్ ర్యాంకులు అన్ని నగరాలకూ విస్తరించాయనీ ఐఐటీ మాట. ఇక్కడే తిరకాసుంది. ప్రత్యేకించి ఈ ఏటి పరీక్షలో కొన్ని కేంద్రాల్లో చేతులు మారిన డబ్బులు, ముందస్తు లీకులు, డబ్బులిచ్చిన పిల్లలకు జవాబుల ప్రత్యేక శిక్షణ జరిగినట్టు ఆరోపణలున్నాయి. ఆ నిర్ణీత కేసులు వదిలేసి సర్వసాధారణంగా నీట్ నిర్వహణలో అక్రమాలే లేవంటూ క్లీన్చిట్ ఇస్తే సరిపోతుందా? గోధ్రా, పాట్నా లాంటి కొన్ని కేంద్రాలకే లీక్ పరిమితమైందన్న ఎన్టీఏ వాదన సరైనది కాదు. భౌగోళిక సరిహద్దుల్ని చెరిపేసిన సోషల్ మీడియా శకంలో ఒకచోట లీకైన పేపర్ అక్కడికే ఆగుతుందనుకోవడం అజ్ఞానం. పైగా రాజస్థాన్, ఢిల్లీ, జార్ఖండ్, బెంగాల్లోనూ లీకువీరుల అరెస్టులే నిదర్శనం. సీబీఐ దర్యాప్తును బట్టి దోషులైన అభ్యర్థులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎన్టీఏ హామీ ఇస్తోంది. అక్రమ ర్యాంకర్లపై చర్యలు సరే... వాళ్ళ నేరం వల్ల దేశవ్యాప్తంగా ఇబ్బంది పడి, ర్యాంకుల్లో వెనకబడ్డ లక్షలాది విద్యార్థుల మాటేమిటి? వారికి న్యాయం చేసేదెట్లా? ఇకపై పేపర్, పెన్ను వాడే ఓఎంఆర్ విధానం వదిలి కంప్యూటర్ ఆధారిత పరీక్షకు మారతారట. ప్రైవేట్ ఏజెన్సీలపై అతిగా ఆధారపడే ఆ పరీక్షలూ అంత నిర్దుష్టమేమీ కాదని ఎన్టీఏనే నిర్వహించే యూజీసీ నెట్ పరీక్ష రద్దుతో ఇటీవలే తేలిపోయింది. ఈ పరిస్థితుల్లో పరీక్షా విధానమే కాదు, ఎన్టీఏ సహా వ్యవస్థనే సమూలంగా ప్రక్షాళించడం అవసరం. రీ–టెస్ట్ పెట్టాలా వద్దా అన్న చర్చ కన్నా అది ఇంకా కీలకం. నిజానికి, ప్రతిభకు పెద్ద పీట వేయడానికి ఉద్దేశించిన పరీక్షా వ్యవస్థలు లోపభూయిష్ఠంగా మారుతున్న తీరు విచారకరం. చదువులు, ప్రవేశ పరీక్షల మొదలు ఉద్యోగాల పోటీ పరీక్షల దాకా అన్నిటి మీదా నీలినీడలే. ప్రశ్నపత్రాల లీకుల దగ్గర నుంచి జవాబు పత్రాల మూల్యాంకనంలో లోటుపాట్ల దాకా ప్రతి స్థాయిలోనూ నిత్యం వివాదమే. గత 7 ఏళ్ళలో, 15 రాష్ట్రాల్లో 70 లీకులతో 1.4 కోట్లమంది బాధితులే. వెరసి పరీక్షల ప్రాథమిక లక్ష్యమే దెబ్బతింటోంది. ఆగి, ఆలోచించాల్సిన తరుణమిది. మన పరీక్షల విధానం, వాటి ప్రాథమిక లక్ష్యం, ప్రయోజనాలపైన మథనం జరపాల్సి ఉంది. జ్ఞాపకశక్తిని పరీక్షించే పద్ధతుల నుంచి పక్కకు వచ్చి, జ్ఞానాన్ని పరిశీలించే మార్గాల వైపు ఇప్పటికైనా మన పరీక్షా వ్యవస్థలు మళ్ళాల్సి ఉంది. ప్రతి పరీక్షనూ వ్యాపారంగా మారుస్తూ, తప్పుడు మార్గాలు వెతుకుతున్న చీడపురుగుల్ని ఏరివేసేందుకు ప్రభుత్వాలు ఉపక్రమించాలి. రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ల నుంచి పాఠశాల బోర్డ్ దాకా పబ్లిక్ పరీక్షల్లో అక్రమాల నిరోధానికి జూన్ 21 నుంచి పార్లమెంట్ ఓ కొత్త చట్టం తెచ్చింది. అది ఏ మేరకు అవతవకల్ని అరికడుతుందో చూడాలి. ఏమైనా, పరీక్ష జ్ఞానానికి గీటురాయిగా ఉండాలే కానీ, ప్రతిసారీ పిల్లలకు శిక్షగా మారితేనే కష్టం. -
నీట్ పేపర్ లీక్ అయ్యింది, కానీ.. : NTA
ఢిల్లీ: నీట్-యూజీ 2024 పరీక్ష పేపర్ లీకేజీపై నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. నీట్ ప్రశ్నాపత్రం లీక్ అయిన మాట వాస్తవమేనని.. కానీ, లీకేజీ ప్రభావం పెద్దగా లేదని అందులో పేర్కొంది. పాట్నా(బీహార్) సెంటర్లలో, గోద్రా(గుజరాత్) కొందరి ద్వారా మాత్రమే నీట్ పేపర్ లీక్ అయ్యింది. కానీ, పేపర్ లీక్ వ్యవహారం దేశం మొత్తం మీద పరీక్ష నిర్వహణ, ఫలితాలపై ఎలాంటి ప్రభావం చూపించలేదని ఎన్టీఏ ఆ అఫిడవిట్లో పేర్కొంది. ఇదిలా ఉంటే.. రేపు నీట్ రద్దు పిటిషన్లపై సుప్రీం కోర్టులో విచారణ జరగనుంది.నీట్ యూజీ పరీక్షలో అవకతవకలు జరిగాయంటూ కొందరు అభ్యర్థులు ఆందోళనకు దిగడం.. దేశవ్యాప్తంగా దుమారం రేపిన విషయం తెలిసిందే. మరోవైపు ఈ పరీక్షను రద్దు చేయాలని పెద్ద ఎత్తున డిమాండ్ వినిపిస్తోంది. నీట్ పరీక్ష రద్దు చేసి చేసి తిరిగి నిర్వహించాలన్న 38 పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ జరుపుతోంది. నీట్ యూజీ పరీక్షకు సంబంధించిన పేపర్ లీక్ అయ్యిందనేది స్పష్టమైందని, అయితే రీ ఎగ్జామ్ నిర్వహణ చివరి ఆప్షన్‌గానే ఉండాలని.. పేపర్ లీకేజీతో నష్టం విస్తృత స్థాయిలో జరిగిందని విచారణలో తేలితే కచ్చితంగా మళ్లీ పరీక్ష నిర్వహించాలని ఎన్టీఏను ఆదేశిస్తామని సీజేఐ బెంచ్ అభిప్రాయపడింది.National Testing Agency (NTA) files affidavit in the Supreme Court in relation to the NEET-UG 2024 exam. The NTA, having come to know about the malpractice by individuals at Godhra and few centers at Patna, has made an assessment of the performance of all the appeared… pic.twitter.com/PyHfzzC0Ih— ANI (@ANI) July 10, 2024 -
NEET(UG) రీ-టెస్ట్ ఫలితాలు విడుదల
ఢిల్లీ: నీట్ యూజీ రీ-టెస్ట్ ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాలతో పాటు రివైజ్డ్ స్కోర్ కార్డులను కూడా వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రకటించింది.నీట్ ఆందోళన నడుమ.. ఆపై సుప్రీంకోర్టు జోక్యంతో 1,563 మందికి గ్రేస్ మార్కుల్ని రద్దు చేసిన ఎన్టీఏ వాళ్లకు మళ్లీ పరీక్ష నిర్వహించింది. అయితే.. జూన్ 23వ తేదీన పరీక్ష నిర్వహించగా.. 813 మంది అభ్యర్థులు మాత్రం తిరిగి పరీక్ష రాశారు. వివాదాల నేపథ్యంలో ఈసారి ఫలితాల్ని పక్కాగా విడుదల చేసింది ఎన్టీఏ. పరీక్ష అనంతరం ఆన్సర్ కీ, ఓఎంఆర్ ఆన్షర్ షీట్లను పబ్లిక్ నోటీస్ ద్వారా అందుబాటులో ఉంచిన ఎన్టీఏ.. అభ్యర్థుల నుంచి అభ్యంతరాల్ని స్వీకరించింది. ఆ అభ్యంతరాలను నిపుణులు పరిశీలించిన అనంతరం.. తుది కీని విడుదల చేసింది. ఇప్పుడు ఆ అభ్యర్థుల ఫలితాల్ని వెబ్సైట్లో ఉంచింది. -
పరీక్షలు నీటుగా నిర్వహించాలంటే...
ఏ పరీక్ష అయినా వందలాది మంది వ్యక్తులు నిజాయితీగా ఉన్నప్పుడే లీకులు లేకుండా నిర్వహించడం సాధ్యమవుతుంది. వచ్చే ఆర్థిక లాభం ముందు తీసుకునే రిస్క్ తక్కువనిపించినప్పుడు, లీకులకు అవకాశం మరీ ఎక్కువ. పైగా ఏదోలా అడ్మిషన్ పొందితే కోర్సు దానికదే పూర్తవుతుంది అనే ధోరణి ఉన్నప్పుడు అడ్డదారులు తొక్కడం ఇంకా పెరుగుతుంది. అందుకే ‘నీట్’ ప్రశ్నపత్రం లీకేజీ నేపథ్యంలో అసలు దేశంలో పరీక్షల నిర్వహణ తీరును మార్చడమే దీనికి పరిష్కారం. దేశంలో ప్రస్తుతం కాగితం, పెన్నులతో నిర్వహిస్తున్న అన్ని పరీక్షలను కంప్యూటర్ ఆధారిత పరీక్షలుగా మార్చడంతో పాటు, ప్రశ్నపత్రాల కూర్పు తీరు కూడా మారాలి.భారతదేశంలో ఐఐటీలు లేదా ప్రతిష్ఠాత్మక వైద్య కళాశాలల్లో ప్రవేశించడం, వాటి కోర్సులు పూర్తి చేయడం కంటే కష్టం. నాతోపాటు ఐఐటీ మద్రాస్‌లో చేరిన 200 మందిలో నాలుగేళ్ల కోర్సు పూర్తిచేయనివాళ్లు దాదాపుగా లేరు. అందుకే ప్రవేశ పరీక్ష పాసయ్యేందుకు అవసరమైతే అడ్డదారులు తొక్కేందుకూ వెనుకాడరు. అర్హత లేని వారు ఒకవేళ అడ్మిషన్ పొందినప్పటికీ సకాలంలో కోర్సు పూర్తి చేయడం అసాధ్యంగా మారేలా ఉంటే... వాళ్లు ప్రవేశ పరీక్ష గట్టెక్కితే అదే పదివేలనుకునే పరిస్థితి తప్పుతుంది.కాగితం, పెన్ను ఆధారంగా పరీక్షలు జరిగినప్పుడు కూడా పేపర్లు లీక్‌చేసే గ్యాంగ్‌లు ఉండేవి. అప్పటికి అత్యాధునిక టెక్నాలజీలతో వాళ్లు ప్రశ్న పత్రాల లీక్ చేసే వాళ్లు. అవసరమైన వాళ్లకు చేరవేసే వాళ్లు కూడా. పరీక్ష కేంద్రాల్లో లేదా ప్రశ్న పత్రాల ప్రింటింగ్ కేంద్రాల్లో కొందరితో కుమ్మక్కైతే చాలు. ఏ పరీక్ష అయినాసరే... లీకుల్లేకుండా నిర్వహించడం అనేది వందలాది మంది వ్యక్తులు నిజాయితీగా ఉన్నప్పుడు, అది కూడా భారీ మొత్తాలు ఆశచూపినా తట్టుకునే సామర్థ్యం ఉన్నప్పుడే సాధ్యమవుతుంది. అందుకే కాగితం పెన్నుతోనైనా సరే... లీకుల్లేకుండా ఐఐటీ, నీట్ వంటి ప్రవేశ పరీక్షలను నిర్వహించడం అసాధ్యమే. వచ్చే ఆర్థిక లాభం ముందు తీసుకునే రిస్క్ తక్కువనిపిస్తుంది. మరి ఏమిటి చేయడం? దానికోసం నాలుగు సూచనలు:1. దేశంలో ప్రస్తుతం కాగితం, పెన్నులతో నిర్వహిస్తున్న అన్ని పరీక్షలను కంప్యూటర్ ఆధారిత పరీక్షలుగా మార్చాలి. జేఈఈ (మెయిన్స్), ఇంకా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మూల్యాంకన పరీక్షలు ఇలాగే జరుగుతున్నాయి. హ్యాకర్లు కంప్యూటర్ ఆధారిత పరీక్షలపై దాడి చేసే అవకాశం ఉంది. అందుకని కంప్యూటర్లలో అనధికార సాఫ్ట్వేర్లను నియంత్రించాలి. ఎన్ క్రిప్షన్తో కూడిన ప్రశ్న పత్రాన్ని డౌన్ లోడ్ చేసుకునేందుకు తొలి పది నిమిషాలు, పరీక్ష పూర్తయిన తరువాత సమాధానాలను సింక్ చేసేందుకు మరో పది నిమిషాలు మాత్రమే ఇంటర్నెట్ ఇవ్వాలి. రోజురోజుకూ మెరుగవుతున్న కృత్రిమ మేధ సాయంతోనూ హ్యాకింగ్ సమస్యను అధిగమించే అవకాశముంది. 2. ప్రవేశ పరీక్షల్లో అక్రమాలను నిరోధించేందుకు ప్రశ్న పత్రాలను నాణ్యంగా కూర్చడమూ ఎంతో కీలకం. ఎక్కువమందికి టాప్ స్కోర్లు వచ్చే అవకాశాలు తగ్గుతాయి. మోసం చేసినా పాసవలేమన్న స్థాయిలో ప్రశ్న పత్రాలు ఉండాలి. భారత్‌లోని యూజీసీ లాంటి అత్యున్నత విద్యా వ్యవస్థల నాయకులతో సహా చాలామంది, పరీక్ష కఠినమైతే కోచింగ్ వంటివి మరింత విçస్తృత స్థాయికి చేరుకుంటాయన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూంటారు. పరీక్ష ఎంత కఠినమైనా... ఐఐటీ, ఎంబీబీఎస్ వంటి వాటికి కోచింగ్ ఎప్పటికప్పుడు పెరిగేదే కానీ తగ్గదు. ప్రశ్న పత్రాలను తేలికగా కూర్చడం లేదా తక్కువ పరిమితి ఉన్న సిలబస్ ఆధారంగా సిద్ధం చేయడం వల్ల మాత్రమే కోచింగ్‌కు తక్కువ ప్రాధాన్యం ఏర్పడుతుంది. కానీ అప్పుడు నాణ్యత తగ్గిపోతుంది. పరీక్ష స్థాయి ఆధారంగా ప్రశ్న పత్రం కఠినత్వం ఉండాలి. బోర్డు పరీక్షలైతే సగటు విద్యార్థులను వేరు చేయడమన్నది 50 పర్సంటైల్ వద్ద ఉండటం మంచిది. నీట్, జేఈఈ వంటి పరీక్షలైతే ఈ పర్సంటైల్ 90 – 95 మధ్య ఉంటే మంచిది. ఇందుకు పరీక్ష కఠినంగా ఉండటం అవసరం. అదే సమయంలో ప్రతిభావంతుడైన ఒక విద్యార్థి, ఆయా బోధనాంశాల్లో నైపుణ్యమున్నవారు ఇద్దరూ సరిగ్గా సమాధానాలు చెప్పేలా ఉండాలి. ఫ్యాక్చువల్ తప్పులపై ఆధారపడి ప్రశ్నలు రూపొందిస్తే (ఈ ఏడాది నీట్లో ఇలాగే జరిగింది) అది నాణ్యమైన ప్రశ్నపత్రం కాదు. 3. అర్థవంతమైన బహుళార్థక ప్రశ్నలు ఇవ్వాలి. ప్రవేశ పరీక్షల్లో మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలకు సమాధానాలు అంచనా కట్టవచ్చుననీ, సమాధానం కచ్చితంగా తెలియకపోయినా కొన్ని మోసపు పద్ధతుల ద్వారా సరైన సమాధానం రాబట్టవచ్చుననీ అనుకుంటారు. ఇది వాస్తవం కాదు. మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలకు సరైన సమాధానాలు ఇవ్వాలంటే విషయంపై లోతైన అవగాహన అవసరం. విద్యార్థుల మేధకు పరీక్ష పెట్టేలా కొన్ని తప్పుడు సమాధానాలు కూడా ఉంటాయి. కాబట్టి నీట్, జేఈఈ వంటి పరీక్షలకు ఈ మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు సరిగ్గా సరిపోతాయి. వివరణాత్మకమైన సమాధానాలు రాస్తే... ప్రశ్న పత్రాలు దిద్దేవారి తీరునుబట్టి మార్కుల్లో హెచ్చుతగ్గులు వచ్చే అవకాశం ఉంది. మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు విద్యార్థికి సంక్లిష్టమైన సమస్యలను పరిష్కరించే తత్వం ఉందా, లేదా అనేది తేల్చవు. కాబట్టి కొన్ని వివరణాత్మక ప్రశ్నలూ జోడించడం మేలు. వీటిని సెకెండ్ పేపర్లో పెట్టి తులన అనేది టాప్ 20 శాతం విద్యార్థులకే పరిమితం (టాప్ 10 శాతం విద్యార్థులను ఎంపిక చేయడం మన లక్ష్యమైనప్పుడు) చేస్తే దిద్దడంలో తేడాలు గణనీయంగా తగ్గుతాయి. 4. నీట్, జేఈఈ వంటి పరీక్షల నిర్వహణకు అత్యంత కీలకమైన మరో అంశం పారదర్శకత. అన్ని ప్రశ్నలను బహిరంగ పరచకపోయినా నమూనా లేదా మాదిరి ప్రశ్నలు కొన్నింటినైనా జన సామాన్యానికి అందుబాటులో ఉంచాలి. ఎంత శాతం మంది విద్యార్థులు ఏ ఆప్షన్ ఎంచుకున్నారు వంటి సమాచారం అందివ్వాలి. ఈ ఆప్షన్స్కూ, విద్యార్థి పరీక్షలో సాధించిన మార్కులకూ మధ్య సంబంధాలను వివరించాలి. ఈ ఏర్పాట్ల వల్ల ప్రధానంగా రెండు లాభాలు ఉంటాయి. ప్రశ్న పత్రాలు కూర్చేవారు ఏకాగ్రతతో ఆ పని చేస్తారు. రెండోది పరీక్ష, నిర్వహణ... రెండింటిపై నమ్మకం పెరుగుతుంది. ర్యాంకుల నిర్ధారణకు పర్సంటైల్స్, స్కేల్డ్ స్కోర్లను జాగ్రత్తగా వినియోగించడం అవసరం. కంప్యూటర్ ఆధారిత ప్రవేశ పరీక్షల్లో ఒక్కో విద్యార్థికి ఒక్కో రకమైన ప్రశ్న పత్రం వస్తుంది కాబట్టి సమాధానాల ద్వారా వచ్చిన మార్కులు అర్థం లేనివిగా మారిపోతాయి. అందుకే వీటికి బదులుగా అందరికీ తెలిసిన సైకోమెట్రిక్ టెక్నిక్‌ల సాయంతో స్కేల్డ్ స్కోర్లను నిర్ధారించాల్సిన అవసరముంది. ఈ స్కేల్డ్ స్కోర్స్ ఆధారంగా పర్సంటైల్ మార్కులు సిద్ధమవుతాయి. మోసాలను పసిగట్టేందుకు నిరర్థక ప్రశ్నలు, సైకోమెట్రిక్ అనాలసిస్, స్టాటిస్టిక్స్ వంటివి ఎంతో ఉపయోగపడతాయి. ఒకవేళ ఏదైనా నిరర్థక ప్రశ్న వస్తే వాటిని పక్కనపెట్టాలి. తప్పుడు మార్గాల్లో సమాధానాలు చెప్పే ప్రయత్నం చేసిన వారిని డిస్క్వాలిఫై చేయాలి. జేఈఈ మెయిన్ ్స పరీక్ష నిర్వహణకు ప్రస్తుతం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ప్రేవేట్ ఏజెన్సీలపై ఆధారపడుతోంది. నీట్‌ను మాత్రం స్వయంగా నిర్వహిస్తోంది. నాణ్యమైన, అందరికీ ఆమోదయోగ్యమైన ప్రశ్న పత్రం తయారీ ఎన్టీఏకు కష్టమేమీ కాబోదు. అయితే ఈ రకమైన ప్రశ్న పత్రం తయారీని చాలా శ్రద్ధతో, సాంకేతిక పరిజ్ఞానం సాయంతో తయారు చేయాల్సి ఉంటుంది. బోధనాంశాలపై పట్టున్నవారు, ప్రత్యేకమైన ఏజెన్సీలు, ప్రశ్నల రూపకల్పన, సమాధానాల విశ్లేషణలకు అత్యాధునిక సైకోమెట్రిక్ పద్ధతులను ఉపయోగించడం అవసరమవుతుంది. ఎందుకంటే ఇటీవలి పరిణామాల నేపథ్యంలో ఎన్ టీఏ విశ్వసనీయతపై, అది నిర్వహించే పరీక్షలపై పెద్ద ప్రశ్న చిహ్నం పడింది కాబట్టి! సమాజం మొత్తం ఈ రకమైన స్థితికి చేరడం భవిష్యత్తులో వృత్తినిపుణులుగా ఎదగాల్సిన విద్యార్థులకు ఏమంత మంచిది కాదు.శ్రీధర్ రాజగోపాలన్ వ్యాసకర్త ‘ఎడ్యుకేషనల్ ఇనిషియేటివ్స్ ప్రైవేట్ లిమిటెడ్’ సహ–వ్యవస్థాపకుడు (‘ద హిందుస్థాన్ టైమ్స్’ సౌజన్యంతో) -
లోతైన దర్యాప్తు అవసరం
తవ్వుతున్నకొద్దీ బయటపడుతున్న జాతీయ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) నిర్వాకాలు చూస్తుంటే దాని వాలకం ‘అయ్యవారిని చేయబోతే కోతి అయింద’న్న చందంగా మారిందని అందరికీ అర్థమైంది. జేఈఈ మెయిన్ మొదలుకొని నీట్, యూజీసీ నెట్ సహా తొమ్మిది ప్రవేశ పరీక్షలవరకూ నిర్వహిస్తున్న ఈ సంస్థ విడుదల చేసే ప్రశ్నపత్రాలు, వాటి జవాబులు గుజరాత్, హరియాణా, బిహార్, జార్ఖండ్, మహారాష్ట్ర వంటిచోట్ల ‘కావలసినవారికి’ బజారులో దొరికాయని సీబీఐ రంగ ప్రవేశం చేశాక తేటతెల్లమైంది. బిహార్ పోలీసులు అరెస్టు చేసిన 20 మంది నిందితులను విచారిస్తే మే 5న నిర్వహించిన నీట్–యూజీ ప్రశ్నపత్రం ఒకరోజు ముందే పీడీఎఫ్ రూపంలో వారికి వచ్చిందని తేలింది. ఎందుకో ఈ ప్రశ్నపత్రాల మాఫియా దక్షిణాది రాష్ట్రాలవైపు దృష్టి సారించినట్టు లేదు. గత పదిరోజుల వ్యవధిలో ఎన్టీఏ నిర్వహించాల్సిన నాలుగు పరీక్షలు రద్దుకావటం అసాధారణం. రెండు లక్షలమంది విద్యార్థులు రాయాల్సిన ఆదివారంనాటి నీట్ పీజీ పరీక్షను కేవలం 12 గంటల ముందు రద్దుచేశారు. ఎన్టీఏ చీఫ్ సుబోద్ కుమార్ సింగ్ దీనంతటికీ బాధ్యుడని తేలుస్తూ ఆయన్ను తొలగించారు. అంతేనా... దీంతో పాపప్రక్షాళన పూర్తయినట్టేనా? ‘ఒకే దేశం–ఒకే పరీక్ష’ పేరిట ఏమాత్రం పారదర్శకతలేని ఈ వ్యవస్థను సృష్టించిన పాలకుల మాటేమిటి? గత ఏడేళ్లలో దేశవ్యాప్తంగా ఉత్తరప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్, బెంగాల్, పంజాబ్, హరియాణాల్లో భిన్న సంస్థలు నిర్వహించిన 70కి పైగా పరీక్ష పత్రాలు లీకయ్యాయని మీడియా కథనాలు చెబుతున్నాయి. నిరుడు తెలంగాణలో పరీక్షపత్రాలు లీకవటంతో నిరుద్యోగులు భగ్గుమన్నారు. నిజాయితీగా అహోరాత్రాలూ చదివిన కోటిన్నరమంది విద్యార్థుల భవితవ్యం ఈ లీకుల పర్యవసానంగా దెబ్బతిన్నదని అంటున్నాయి. ఈ లీకుల బెడద లేకుండా అన్ని సంస్థలనూ తలదన్నేలా నెలకొల్పామని చెప్పిన ఎన్టీఏ తీరు సైతం సక్రమంగా లేదంటే ఇక ఏమనాలి?నిజమే... వైద్య విద్యలో దేశమంతా వర్తించే ఒకే పరీక్ష నిర్వహిస్తే వేలకు వేలు ఖర్చుపెట్టడం, వేర్వేరు పరీక్షలకు సంసిద్ధం కావటంవంటి విద్యార్థుల వెతలు తీరుతాయని సర్వోన్నత న్యాయస్థానం 2011లో భావించింది. లీకులను సమర్థవంతంగా అరికట్టడం సాధ్యమవుతుందనుకున్నది. కానీ ఆచరణలో ఇందుకు విరుద్ధంగా జరిగింది. వైద్య విద్యకు ఒకే ప్రవేశ పరీక్ష ఉండేలా చర్యలు తీసుకోవాలని అప్పటి భారత వైద్య మండలి(ఎంసీఐ)కి చేసిన సూచన కాస్తా అనేక మలుపులు తిరిగి చివరకు ఇలాంటి ఉమ్మడి పరీక్ష నిర్వహణ రాజ్యాంగ విరుద్ధమని 2013లో సుప్రీంకోర్టే 2–1 మెజారిటీ తీర్పునిచ్చింది. కానీ తీర్పు ఇచ్చే ముందు ముగ్గురు న్యాయమూర్తుల మధ్యా ఎలాంటి చర్చా జరగలేదన్న కారణంతో 2016లో అయిదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం మళ్లీ విచారించి నీట్‌ను అనుమతించింది. దేశంలో ఫెడరల్ వ్యవస్థ ఉన్నదని, ఉమ్మడి జాబితాలోని విద్యారంగంలో మార్పులు తీసుకొచ్చేముందు రాష్ట్రాలతో, విద్యారంగ నిపుణులతో, ఇతర వర్గాలతో చర్చించాలని ఎవరూ అనుకోలేదు. ఒకపక్క హిందీ భాషాప్రాంత విద్యార్థులకు వారి భాషలో ప్రశ్నపత్రం ఇవ్వాలని నిర్ణయించిన ఎంసీఐ దక్షిణాది రాష్ట్రాల విద్యార్థులకు స్థానిక భాషల్లో ఇవ్వటం కుదరదని మొరాయించింది. ఆ తర్వాత 2017లో ఎన్టీఏ ఆవిర్భవించాక 13 భాషల్లో ప్రశ్నపత్రాలు ఇస్తోంది. లీకులకు ఆస్కారంలేదని పెట్టిన వ్యవస్థ అందుకు తగ్గట్టుగా ఉందా అనేది ఉన్నతస్థాయిలో గమనించేవారే లేకపోయారు. కేంద్ర సిలబస్‌లు, ముఖ్యంగా సీబీఎస్ఈ సిలబస్ ఆధారంగా నిర్వహించే ఈ పరీక్షల్లో రాష్ట్ర సిలబస్‌తో చదివినవారు రాణించగలరా అన్న సందేహమూ రాలేదు. ఫలితంగా దక్షిణాది రాష్ట్రాల్లో దశాబ్దాలుగా వర్ధిల్లుతున్న విద్యా మాఫియా జాతీయ స్థాయికి విస్తరించింది. తమిళనాడు ప్రభుత్వం నియమించిన 2021లో నియమించిన జస్టిస్ రాజన్ కమిటీ అధ్యయనం ప్రకారం నీట్‌కు ముందు ఇంగ్లిష్ మాధ్యమంలో చదివిన విద్యార్థులు ఎంబీబీఎస్ కోర్సులకు 80.2 శాతం నుంచి 85.12 శాతంవరకూ ఎంపికయ్యేవారు. తమిళ మాధ్యమంలో చదివిన వారి శాతం 14.88 శాతం ఉండేది. కానీ నీట్ మొదలైనాక ఇంగ్లిష్ మాధ్యమం విద్యార్థులు 97 శాతంవరకూ సీట్లు తెచ్చుకుంటుండగా, తమిళ మాధ్యమం విద్యార్థుల వాటా దాదాపు 3 శాతానికి పడిపోయింది. నీట్ సాధించేవారిలో అధికాదాయ కుటుంబాల పిల్లల సంఖ్య అంతక్రితంకన్నా పెరగ్గా, నిరుపేద వర్గాల పిల్లల సంఖ్య తగ్గిందని ఆ నివేదిక వివరించింది. నీట్‌వల్ల ప్రతిభావంతులకు సీట్లు వస్తున్నాయన్న వాదనను ఆ కమిటీ ఎండగట్టింది. నీట్‌కు ముందు హెచ్ఎస్సీ విద్యార్థుల సగటు స్కోరు 98.1 శాతం వుండగా, ఇప్పుడది 89.05 శాతం మాత్రమే.ఈసారి వివిధ రాష్ట్రాల్లో సార్వత్రిక ఎన్నికల నిర్వహణ ఒకపక్క, ఎన్టీఏ ప్రశ్నపత్రాల లీకు మరోపక్క మన వ్యవస్థలకున్న విశ్వసనీయతను తీవ్రంగా దెబ్బతీశాయి. ఇందులో మొదటిది దేశ ప్రజానీకం ఆకాంక్షల్నీ, రెండోది లక్షలాదిమంది విద్యార్థుల ఆశలనూ తలకిందులు చేసింది. ఇందువల్ల ప్రపంచంలో మనం నగుబాటుపాలయ్యామని ఇప్పటికీ ఎన్డీఏ సర్కారు గ్రహించకపోవటం, దొంగను తేలుకుట్టినట్టు వ్యవహరించటం ఆశ్చర్యకరం. ఈ ప్రపంచంలో విద్యాధనాన్ని మాత్రమే ఎవరూ కొల్లగొట్టలేరని చిన్నప్పుడు అందరం చదువుకున్నాం. కళ్లు మూసుకున్న పాలకుల నిర్వాకం కారణంగా దాన్ని సైతం ఎగరేసుకుపోవచ్చని ప్రశ్నపత్రాల మాఫియా నిరూపించింది. అందుకే ఎన్టీఏ చీఫ్‌ను సాగనంపితే సరిపోదు. ఈ మొత్తం వ్యవహారంపై న్యాయవిచారణ జరిపించి, ఇలాంటి లీకులకు ఆస్కారం లేకుండా పకడ్బందీ వ్యవస్థను ఏర్పాటుచేయాలి. -
‘నీట్’ నిందితులకు నార్కో బ్రెయిన్ మ్యాపింగ్ టెస్టులు!
పాట్నా/దేవగఢ్: నీట్–యూజీ ప్రశ్నపత్రం లీకేజీ కేసులో బిహార్ పోలీసు శాఖ ఆర్థిక నేరాల విభాగం అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. నీట్ అసలైన ప్రశ్నపత్రాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎనీ్టఏ) నుంచి సేకరించారు. పేపర్ లీకేజీకి సంబంధించి గత నెలలో పాటా్నలోని ఓ ఇంట్లో సోదాల్లో స్వాధీనం చేసుకున్న ప్రశ్నపత్రాలతో ఈ ప్రశ్నపత్రాలను సరిపోల్చనున్నారు. ఫోరెన్సిక్ టెస్టు తర్వాత సరిపోల్చే ప్రక్రియ చేపట్టనున్నట్లు అధికారులు చెప్పారు. మరోవైపు ఈ కేసులో అరెస్టయిన నిందితులకు నార్కో అనాలిసిస్, బ్రెయిన్ మ్యాపింగ్ టెస్టులు నిర్వహించేందుకు సన్నద్ధమవుతున్నారు. నీట్ పరీక్షలో చోటుచేసుకున్న అక్రమాల్లో మనీ లాండరింగ్ కోణం కూడా ఉండడంతో ఈడీ సైతం దర్యాప్తు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. -
‘పరీక్ష’ల సంస్కరణలపై కమిటీ
ఢిల్లీ: నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) పరీక్షలు పారదర్శకంగా, న్యాయంగా, సాఫీగా నిర్వహించేందుకు ఏడుగురు సభ్యులతో ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసినట్లు కేంద్ర విద్యా శాఖ శనివారం ప్రకటించింది. ఈ నిపుణుల కమిటీకి ఇస్రో మాజీ చైర్మన్ కె.రాధాకృష్ణన్ నేతృత్వం వహిస్తారు. పరీక్షల నిర్వహణ ప్రక్రియ, డాటా భద్రతకు చేపట్టాల్సిన చర్యలు, ఎన్టీఏ నిర్మాణం, పనితీరుకు సంబంధించి చేపట్టాల్సిన సంస్కరణలను ఈ కమిటీ సిఫారసు చేస్తుంది. రెండు నెలల్లో ఈ కమిటీ తమ నివేదికకు విద్యాశాఖకు సమర్పిస్తుంది. నీట్, యూజీసీ– నెట్ పరీక్షల్లో అవకతవకలపై ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో కేంద్రం ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేయడం గమనార్హం. కమిటీ సభ్యులు: 1. కె.రాధాకృష్ణన్ (ఇస్రో మాజీ చైర్మన్) 2. డాక్టర్ రణదీప్ గులేరియా (ఎయిమ్స్ మాజీ డైరెక్టర్) 3. ప్రొఫెసర్ బీజే రావు (వైస్ చాన్సలర్, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్)4. ప్రొఫెసర్ రామమూర్తి కె. (ఐఐటీ మద్రాస్) 5. పంకజ్ బన్సల్ (పీపుల్స్ స్ట్రాంగ్ సహా వ్యవస్థాపకుడు)6. ఆదిత్య మిట్టల్ (డీన్ ఆఫ్ స్టూడెంట్ అఫైర్స్, ఐఐటీ ఢిల్లీ) 7. గోవింద్ జైస్వాల్ (జాయింట్ సెక్రటరీ, కేంద్ర విద్యాశాఖ) -
ఎన్టీఏ డీజీ సుబోద్‌పై వేటు
న్యూఢిల్లీ: కీలకమైన నీట్, నెట్ పరీక్షల్లో పేపర్ లీకేజీ ఆరోపణలు దుమారం రేపుతున్నాయి. ఆరోపణలు వెల్లువెత్తుతుండటంతో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. నీట్, నెట్ పరీక్షలను నిర్వహించే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) డైరెక్టర్ జనరల్ సుబోధ్ సింగ్‌పై శనివారం వేటు వేసింది. ఇండియా ట్రేడ్ ప్రమోషన్ చైర్మన్, ఎండీ ప్రదీప్‌సింగ్ ఖరోలాకు ఎన్టీఏ డీజీగా అదనపు బాధ్యతలు అప్పగించింది. యూజీసీ–నెట్ పరీక్ష నిర్వహించిన మరుసటి రోజే, ఈనెల 19న కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. పరీక్షల సమగ్రతకు భంగం వాటిల్లిందని హోంశాఖ తెలుపడంతో యూజీసీ– నెట్‌ను రద్దు చేశారు. అసిస్టెంట్ ప్రొఫెసర్, జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్, పీహెచ్‌డీల ప్రవేశానికి నెట్ పరీక్షను ఏడాదికి రెండుసార్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహిస్తుంది. -
సీఎస్ఐఆర్–యూజీసీ నెట్ పరీక్ష వాయిదా
న్యూఢిల్లీ: సీఎస్ఐఆర్–యూజీసీ–నెట్ ఉమ్మడి పరీక్ష వాయిదా పడింది. వచ్చే వారం జరగాల్సిన ఈ పరీక్షను అనివార్య పరిస్థితులు, రవాణాపరమైన ఇబ్బందుల దృష్ట్యా వాయిదా వేస్తున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) శుక్రవారం తెలిపింది. పరీక్ష తదుపరి తేదీని వెబ్సైట్లో ప్రకటిస్తామని వివరించింది. అయితే, పేపర్ లీకైందంటూ వస్తున్న ఆరోపణల నేపథ్యంలోనే పరీక్షను వాయిదా వేసినట్లు తెలుస్తోంది. సీఎస్ఐఆర్–యూజీసీ–నీట్ పరీక్షను జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్, లెక్చరర్íÙప్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి నిర్వహిస్తారు. మంగళవారం నిర్వహించిన యూజీసీ నెట్‌ను కూడా అవకతవకల ఆరోపణల నేపథ్యంలో రద్దు చేయడం తెల్సిందే. -
సుప్రీం కోర్టులో NTAకు ఊరట
న్యూఢిల్లీ, సాక్షి: సుప్రీం కోర్టులో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి మళ్లీ ఊరట లభించింది. నీట్ కౌన్సెలింగ్‌ను రద్దు చేయలేమని స్పష్టం చేసిన సర్వోన్నత న్యాయస్థానం.. నీట్ వ్యవహారంపై వివిధ రాష్ట్రాల హైకోర్టులో దాఖలైన పిటిషన్ల బదిలీ పిటిషన్‌పై సానుకూలంగా స్పందించింది. గురువారం నీట్-యూజీ 2024 పరీక్షలకు సంబంధించిన 14 పిటిషన్లపై జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ ఎస్వీఎన్ భట్టి ధర్మాసనం విచారణ చేపట్టింది. ఇందులో 49 మంది విద్యార్థులు 10 పిటిషన్లను.. అలాగే ఎన్టీఏ నాలుగు పిటిషన్లు ఉన్నాయి. దేశవ్యాప్తంగా నీట్ అవకతవకలపై పలు హైకోర్టులలో పిటిషన్లు దాఖలు అయ్యాయి. అయితే వాటన్నింటినీ సుప్రీం కోర్టుకు బదిలీ చేసేలా ఆదేశాలివ్వాలని ఎన్టీఏ కోరింది. దీనికి సుప్రీం బెంచ్ సానుకూలంగా స్పందించింది. ప్రతివాదులకు గురువారం నోటీసులు జారీ చేసింది. అలాగే.. కేసులకు సంబంధించి హైకోర్టులో జరిగే విచారణలపై స్టే విధించింది. మరోవైపు వివిధ విద్యార్థులు ఎన్టీయే కౌన్సెలింగ్ రద్దు చేయాలని చేసిన విజ్ఞప్తికి సుప్రీం నిరాకరించింది. అయితే వాళ్లు వేసిన పిటిషన్‌పై విచారణకు మాత్రం అంగీకరించింది. ఈ క్రమంలో పిటిషన్లపై స్పందన తెలియజేయాలని కేంద్రానికి, ఎన్టీఏకు మరోసారి నోటీసులు జారీ చేసింది. ఈ పిటిషన్లపై జులై 8న విచారణ జరపనుంది. అదే రోజు గతంలో నీట్ పై దాఖలైన పలు పిటిషన్ల విచారణ జరగాల్సి ఉంది. -
NEET UG Result 2024: నీట్లో ఆరుగురి ఫస్ట్ ర్యాంకు గల్లంతు!
న్యూఢిల్లీ: జాతీయ అర్హత, ప్రవేశ పరీక్ష–అండర్ గ్రాడ్యుయేట్(నీట్–యూజీ)లో కొందరు అభ్యర్థులకు కేటాయించిన గ్రేసు మార్కులను రద్దు చేస్తున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) సుప్రీంకోర్టుకు తెలియజేసిన నేపథ్యంలో టాప్ ర్యాంకర్లపై ప్రభావం పడబోతోంది. టాపర్లలో కొందరు 60 నుంచి 70 శాతం పాయింట్లు కోల్పోతారని అంచనా. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈసారి ఏకంగా 67 మంది ఫస్ట్ ర్యాంకు సాధించిన సంగతి తెలిసిందే. వీరిలో గ్రేసు మార్కులతో ఫస్ట్ ర్యాంకు పొందినవారు ఆరుగురు ఉన్నారు. గ్రేసు మార్కులను రద్దు చేస్తుండడంతో వీరు ఫస్టు ర్యాంకును కోల్పోనున్నట్లు సమాచారం. అంటే టాపర్ల సంఖ్య 61కి పరిమితం కానుందని అంచనా వేస్తున్నట్లు ఎన్టీఏ వర్గాలు వెల్లడించాయి. నీట్–యూజీలో అక్రమాలు జరిగాయని, 1,563 మందికి ఉద్దేశపూర్వకంగా గ్రేసు మార్కులు కేటాయించారని ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో అభ్యర్థుల మార్కులను ఎన్టీఏ పునర్ మూల్యాంకనం చేస్తోంది. గ్రేసు మార్కులను రద్దు చేసి, మళ్లీ ర్యాంకులు కేటాయించబోతున్నారు. గ్రేసు మార్కులు రద్దయిన వారికి ఈ నెల 23న మళ్లీ పరీక్ష నిర్వహిస్తారు. ఇదిలా ఉండగా, నీట్ పరీక్షలో ఎలాంటి అవకతవకలు జరగలేదని ఎన్ఏటీ స్పష్టంచేసింది. యథాతథంగా కౌన్సెలింగ్! నీట్ కౌన్సెలింగ్‌ను నిలిపివేయాలని, అక్రమాలపై సీబీఐ దర్యాప్తు జరిపించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు బుధవారం విచారణ చేపట్టింది. షెడ్యూల్ ప్రకారం వచ్చేనెల 6వ తేదీ నుంచి జరగాల్సిన కౌన్సిలింగ్ నిలిపివేసేందుకు నిరాకరించింది. -
యూజీసీ–నెట్ రద్దు
న్యూఢిల్లీ: వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాలకు చేపట్టిన నీట్ పరీక్షలో బయల్పడిన అవకతవకల నీలినీడలు యూజీసీ–నెట్ పరీక్ష పైనా పడ్డాయి. దీంతో మంగళవారం నిర్వహించిన యూజీసీ–నెట్ పరీక్షను రద్దుచేస్తున్నట్లు కేంద్ర విద్యా శాఖ బుధవారం అనూహ్య నిర్ణయం తీసుకుంది. గతానికి భిన్నంగా ఈసారి ఒక్కరోజులోనే ఆఫ్‌లైన్‌లో పెన్, పేపర్(ఓఎంఆర్) విధానంలో దేశవ్యాప్తంగా 317 నగరాలు, పట్టణాల్లోని 1,205 పరీక్షా కేంద్రాల్లో యూజీసీ–నెట్ పరీక్ష మంగళవారం జరిగిన విషయం తెల్సిందే. త్వరలో మళ్లీ నెట్ పరీక్షను నిర్వహిస్తారని, త్వరలోనే సంబంధిత వివరాలు వెల్లడిస్తామని కేంద్ర విద్యా శాఖ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. ‘‘ నెట్ పరీక్ష విధానంలో అత్యంత పారదర్శకత, సమగ్రత, గౌరవానికి ఎలాంటి భంగం వాటిల్లకూడదు. పరీక్షలో అక్రమాలు జరిగి ఉండొచ్చన్న విశ్వసనీయ సమాచారం మేరకు ‘యూజీసీ–నెట్ జూన్ 2024’ను రద్దుచేస్తున్నాం’’ అని ఆ అధికారి వివరించారు. ఈ ఏడాది నెట్ పరీక్షకు 11,21,225 మంది దరఖాస్తు చేసుకోగా మంగళవారం పూర్తయిన ఈ పరీక్షను 9,08,580 మంది అభ్యర్థులు రాశారు. నెట్ పరీక్షలో అక్రమాలపై సమగ్ర దర్యాప్తు కోసం ఈ అంశాన్ని సీబీఐకి అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు ఎన్టీఏ తెలిపింది. నెట్ పరీక్షలో అక్రమాలు జరిగి ఉంటాయని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ)కు ప్రభుత్వ సైబర్ నిఘా సంస్థల సమాచారం అందడంతో ఆ మేరకు పరీక్షకు రద్దుచేస్తున్నట్లు తెలిపింది. ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్(ఐ4సీ) ఈ వివరాలను యూజీసీకి పంపింది. ఐ4సీలోని నేషనల్ సైబర్ క్రైమ్ థ్రెట్ అనలైటిక్స్ విభాగం సంబంధిత సమాచారాన్ని క్రోడీకరించి యూజీసీకి అందజేసింది. ఈ విభాగం దేశవ్యాప్తంగా జరుగుతున్న సైబర్ నేరాల దాడులపై సమాచారం ఇవ్వడంతోపాటు అప్రమత్తంగా ఉండాలని ముందస్తుగా హెచ్చరిస్తుంది. ఐ4సీ అనేది కేంద్ర హోం శాఖ పరిధిలో పనిచేస్తుంది. ఇది పరీక్షల సంబంధ వ్యవహారాలను చూస్తుంది. నీట్‌ను నిర్వహించిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీయే ఈ నెట్ పరీక్షనూ చేపట్టింది. యూజీసీ–నెట్ ఎందుకు రాస్తారు? యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్– నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్( యూజీసీ–నెట్) పరీక్షలో ఉత్తీర్ణులైతే సైన్స్ సబ్జెక్టుల్లో పరిశోధనకు అవకాశం లభిస్తుంది. పరిశోధన వైపు వెళ్లొచ్చు లేదంటే అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా బోధనారంగం వైపూ వెళ్లొచ్చు. దేశంలోని ప్రఖ్యాత విశ్వవిద్యాలయాలు, కళాశాలలు, ఐఐటీ, ట్రిపుల్ ఐటీ కాలేజీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా చేరొచ్చు. శాస్త్రీయ, పారిశ్రామిక పరిశోధనా మండలి(సీఎస్ఐఆర్) ఆధ్వర్యంలో నడిచే ప్రయోగ, పరిశోధనాశాలల్లో జూనియర్ రీసెర్చ్ ఫెలోగా చేరొచ్చు. జూనియర్ రీసెర్చ్ ఫెలోగా, ఆ తర్వాత సీనియర్ రీసెర్చ్ ఫెలోగా అవకాశం లభిస్తుంది. ఇలా శాస్త్రవేత్తగా ఎదగొచ్చు. పీహెచ్డీ చేసేందుకు అర్హత లభిస్తుంది. ప్రభుత్వరంగ ఓఎన్జీసీ వంటి సంస్థల్లోనూ ఉద్యోగాలు పొందొచ్చు. నెట్‌కు క్వాలిఫై అయిన వారికి విదేశాల్లోనూ చక్కటి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయి. నెట్ పరీక్షను ఏటా రెండు సార్లు నిర్వహిస్తారు. 80కిపైగా సబ్జెక్టుల్లో పరీక్ష రాసుకోవచ్చు.