
సాక్షి, న్యూఢిల్లీ: ఎంబీబీఎస్, బీడీఎస్, బీఏఎంఎస్, బీఎస్‌ఎంఎస్, బీయూఎంఎస్, బీహెచ్‌ఎంఎస్ తదితర మెడికల్ అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశానికి నీట్(యూజీ)–2021ను ఈ ఏడాది ఆగస్టు 1న నిర్వహించనున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్‌టీఏ) ప్రకటించింది. హిందీ, ఇంగ్లీష్‌తో సహా మొత్తం 11 భాషల్లో ఈ ప్రవేశ పరీక్షను నిర్వహించనున్నట్లు వెల్లడించింది. నీట్–2021ను విద్యార్థులు పెన్ అండ్ పేపర్ విధానంలో రాయాల్సి ఉంటుంది. సిలబస్, వయస్సు, రిజర్వేషన్లు, సీట్ల వర్గీకరణ, పరీక్ష ఫీజు, పరీక్షా నగరాలు, స్టేట్ కోడ్ తదితర పూర్తి వివరాలతో త్వరలో బుటెటిన్‌ను వెబ్‌సైట్‌లో విద్యార్థులకు అందుబాటులోకి తీసుకొస్తామని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఒక ప్రకటనలో పేర్కొంది.