
ఇస్రో మాజీ చైర్మన్ కె.రాధాకృష్ణన్ నేతృత్వం
ఢిల్లీ: నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) పరీక్షలు పారదర్శకంగా, న్యాయంగా, సాఫీగా నిర్వహించేందుకు ఏడుగురు సభ్యులతో ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసినట్లు కేంద్ర విద్యా శాఖ శనివారం ప్రకటించింది. ఈ నిపుణుల కమిటీకి ఇస్రో మాజీ చైర్మన్ కె.రాధాకృష్ణన్ నేతృత్వం వహిస్తారు.
పరీక్షల నిర్వహణ ప్రక్రియ, డాటా భద్రతకు చేపట్టాల్సిన చర్యలు, ఎన్‌టీఏ నిర్మాణం, పనితీరుకు సంబంధించి చేపట్టాల్సిన సంస్కరణలను ఈ కమిటీ సిఫారసు చేస్తుంది. రెండు నెలల్లో ఈ కమిటీ తమ నివేదికకు విద్యాశాఖకు సమర్పిస్తుంది. నీట్, యూజీసీ– నెట్ పరీక్షల్లో అవకతవకలపై ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో కేంద్రం ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేయడం గమనార్హం.
కమిటీ సభ్యులు:
1. కె.రాధాకృష్ణన్ (ఇస్రో మాజీ చైర్మన్)
2. డాక్టర్ రణదీప్ గులేరియా (ఎయిమ్స్ మాజీ డైరెక్టర్)
3. ప్రొఫెసర్ బీజే రావు (వైస్ చాన్సలర్, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్)
4. ప్రొఫెసర్ రామమూర్తి కె. (ఐఐటీ మద్రాస్)
5. పంకజ్ బన్సల్ (పీపుల్స్ స్ట్రాంగ్ సహా వ్యవస్థాపకుడు)
6. ఆదిత్య మిట్టల్ (డీన్ ఆఫ్ స్టూడెంట్ అఫైర్స్, ఐఐటీ ఢిల్లీ)
7. గోవింద్ జైస్వాల్ (జాయింట్ సెక్రటరీ, కేంద్ర విద్యాశాఖ)