Former Chairman
-
‘పరీక్ష’ల సంస్కరణలపై కమిటీ
ఢిల్లీ: నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) పరీక్షలు పారదర్శకంగా, న్యాయంగా, సాఫీగా నిర్వహించేందుకు ఏడుగురు సభ్యులతో ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసినట్లు కేంద్ర విద్యా శాఖ శనివారం ప్రకటించింది. ఈ నిపుణుల కమిటీకి ఇస్రో మాజీ చైర్మన్ కె.రాధాకృష్ణన్ నేతృత్వం వహిస్తారు. పరీక్షల నిర్వహణ ప్రక్రియ, డాటా భద్రతకు చేపట్టాల్సిన చర్యలు, ఎన్టీఏ నిర్మాణం, పనితీరుకు సంబంధించి చేపట్టాల్సిన సంస్కరణలను ఈ కమిటీ సిఫారసు చేస్తుంది. రెండు నెలల్లో ఈ కమిటీ తమ నివేదికకు విద్యాశాఖకు సమర్పిస్తుంది. నీట్, యూజీసీ– నెట్ పరీక్షల్లో అవకతవకలపై ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో కేంద్రం ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేయడం గమనార్హం. కమిటీ సభ్యులు: 1. కె.రాధాకృష్ణన్ (ఇస్రో మాజీ చైర్మన్) 2. డాక్టర్ రణదీప్ గులేరియా (ఎయిమ్స్ మాజీ డైరెక్టర్) 3. ప్రొఫెసర్ బీజే రావు (వైస్ చాన్సలర్, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్)4. ప్రొఫెసర్ రామమూర్తి కె. (ఐఐటీ మద్రాస్) 5. పంకజ్ బన్సల్ (పీపుల్స్ స్ట్రాంగ్ సహా వ్యవస్థాపకుడు)6. ఆదిత్య మిట్టల్ (డీన్ ఆఫ్ స్టూడెంట్ అఫైర్స్, ఐఐటీ ఢిల్లీ) 7. గోవింద్ జైస్వాల్ (జాయింట్ సెక్రటరీ, కేంద్ర విద్యాశాఖ) -
IPL: వేల కోట్లకు వారసురాలు.. ఇంతకీ ఎవరీ బ్యూటీ? (ఫొటోలు)
-
తాన్లా బోర్డులోకి ట్రాయ్ మాజీ చైర్మన్ ఆర్ఎస్ శర్మ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ట్రాయ్ మాజీ చైర్మన్ ఆర్ఎస్ శర్మను డైరెక్టర్ల బోర్డులో నియమించినట్లు తాన్లా ప్లాట్‌ఫామ్స్ సోమవారం ప్రకటించింది. దీంతో సంస్థ బోర్డ్ డైరెక్టర్ల సంఖ్య ఏడుకు చేరుకుంది. 2015–20 మధ్య ట్రాయ్ చైర్మన్‌గా ఆయన విధులు నిర్వర్తించారు. ఎంపవర్డ్ గ్రూప్ ఆఫ్ కోవిడ్ వ్యాక్సిన్ అడ్మిని్రస్టేషన్ ఛైర్మన్‌గా.. భారత్‌లో కోవిడ్–19 టీకా కార్యక్రమానికి డిజిటల్ వెన్నెముక అయిన కో–విన్ రూపకల్పన, అమలుకు నాయకత్వం వహించారు. నేషనల్ హెల్త్ అథారిటీ సీఈవోగా కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య కార్యక్రమాలైన ఆయుష్మాన్ భారత్ జన్ ఆరోగ్య యోజన, ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ అమలులో కీలకపాత్ర పోషించారు. 2009–13 మధ్య ఆధార్ కార్డుల జారీ సంస్థ యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా డైరెక్టర్ జనరల్, మిషన్ డైరెక్టర్‌గా పని చేశారు. -
మ్యూచువల్ ఫండ్స్‌లో ఎన్నో అవకాశాలు
ముంబై: మ్యూచువల్ ఫండ్స్ పరిశ్రమలో మరిన్ని అవకాశాలు ఉన్నాయని హెచ్డీఎఫ్సీ మాజీ చైర్మన్ దీపక్ పరేఖ్ అన్నారు. మ్యూచువల్ ఫండ్–జీడీపీ రేషియో 16గానే ఉందంటూ, అంతర్జాతీయంగా ఇది 80గా ఉన్నట్టు చెప్పారు. కనుక మ్యూచువల్ ఫండ్స్ రంగంలో మరిన్ని సంస్థలకు చోటు ఉన్నట్టు అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ఫండ్స్ పరిశ్రమలో 43 సంస్థలు ఉండగా, వీటి నిర్వహణలోని ఆస్తులు రూ.47.6 లక్షల కోట్ల మేర ఉన్నాయి. ఇందులో సింహ భాగం ఆస్తులు టాప్–5 సంస్థల చేతుల్లోనే ఉన్నాయి. ‘‘50 కోట్ల పాన్లు, 11 కోట్ల డీమ్యాట్ ఖాతాలు ఉన్నాయి. కానీ, మ్యూచువల్ ఫండ్స్ పరిశ్రమ 4 కోట్ల మందినే చేరుకుంది. కనుక మ్యూచువల్ ఫండ్స్ పరిశ్రమ వృద్ధికి అసాధారణ అవకాశాలు ఉన్నాయి’’ అని పరేఖ్ వివరించారు. మ్యూచువల్ ఫండ్ ఇప్పటికీ బలవంతంగా విక్రయించే ఉత్పత్తిగానే ఉందన్న పరేఖ్.. మరింత మంది పంపిణీదారులను కలిగి ఉండాల్సిన అవసరాన్ని ప్రస్తావించారు. యూనిట్ హోల్డర్లు, ఫండ్స్ సంస్థలకు మధ్య వారు కీలక అనుసంధానమని పేర్కొన్నారు. -
ఎస్బీఐ మాజీ చైర్మన్‌కు అంతర్జాతీయ సంస్థలో కీలక పదవి
బ్యాంకింగ్ రంగ ప్రముఖుడు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) మాజీ ఛైర్మన్ రజనీష్ కుమార్ (Rajnish Kumar) ప్రముఖ పేమెంట్స్ టెక్నాలజీ కంపెనీ మాస్టర్ కార్డ్ ఇండియా (Mastercard India) ఛైర్మన్‌గా నియమితులయ్యారు. ఈ మేరకు మాస్టర్ కార్డ్ ఇండియా తాజాగా ప్రకటించింది. కంపెనీలో ఆయన అత్యంత కీలకమైన నాన్-ఎగ్జిక్యూటివ్ సలహాదారుగా సేవలందిస్తారని మాస్టర్ కార్డ్ ఇండియా కంపెనీ తెలిపింది. మాస్టర్ కార్డ్ దక్షిణాసియా , కంట్రీ కార్పొరేట్ ఆఫీసర్, ఇండియా డివిజన్ ప్రెసిడెంట్ గౌతమ్ అగర్వాల్ నేతృత్వంలోని సౌత్ ఆసియా ఎగ్జిక్యూటివ్ నాయకత్వ బృందానికి రజనీష్ కుమార్ మార్గనిర్దేశం చేస్తారు. మాస్టర్ కార్డ్ 210కి పైగా దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. రజనీష్ కుమార్‌కు ఎస్బీఐలో దాదాపు నాలుగు దశాబ్దాల అనుభవం ఉంది. భారత్‌తోపాటు యూకే, కెనడా దేశాల్లో బ్యాంక్ కార్యకలాపాలకు ఆయన నాయకత్వం వహించారు. తన హయాంలో బ్యాంక్ మొబైల్ అప్లికేషన్ ‘యోనో’ను తీసుకొచ్చి విస్తృత ప్రచారం కల్పించారు. ఎస్బీఐ చైర్మన్‌గా తన మూడేళ్ల పదవీకాలాన్ని 2020 అక్టోబర్‌లో ముగించారు. కార్పొరేట్ క్రెడిట్, ప్రాజెక్ట్ ఫైనాన్స్‌లో విశేష నైపుణ్యం ఉన్న రజనీష్ కుమార్ హెచ్ఎస్బీసీ ఆసియా పసిఫిక్, ఎల్అండ్టీ, బ్రూక్‌ఫీల్డ్ ప్రాపర్టీ మేనేజ్మెంట్ వంటి కార్పొరేట్ దిగ్గజాల బోర్డులలో డైరెక్టర్‌గా పనిచేశారు. భారత్‌పే బోర్డుకు, గుర్గావ్లోని ప్రముఖ మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్ ఎండీఐ బోర్డ్ ఆఫ్ గవర్నర్లకు కూడా అధ్యక్షుడిగా వ్యవహరించారు. -
మహీంద్రా అండ్ మహీంద్రా మాజీ చైర్మన్ కేషుబ్ మహీంద్రా కన్నుమూత
సాక్షి,ముంబై: మహీంద్రా అండ్ మహీంద్రా ఎమెరిటస్ చైర్మన్ కేషుబ్ మహీంద్రా (99)బుధవారం కన్నుమూశారు. ఇన్‌స్పేస్ చైర్మన్ పవన్ కె గోయెంకా తన ట్విటర్ ద్వారా ఈ విషయాన్ని ధృవీకరించారు. పారిశ్రామిక ప్రపంచం నేడు అత్యంత ఉన్నతమైన వ్యక్తిని కోల్పోయింది. వ్యాపారం, ఆర్థిక శాస్త్రం, సామాజిక విషయాల్లో స్ఫూర్తిదాయకమైన వ్యక్తి అంటూ సంతాపాన్ని ప్రకటించారు. 1947లో మహీంద్రా గ్రూప్‌లో చేరిన కేషుబ్ 48 సంవత్సరాల పాటు కంపెనీకి చైర్మన్‌గా నాయకత్వం వహించారు. ప్రస్తుత ఎంఅండ్ ఎం చైర్మన్ ఆనంద్ మహీద్రకి మేనమామ కేషుబ్. తనతండ్రి స్థాపించిన మహీంద్రా గ్రూపులో 1963 నుండి 2012 వరకు ఛైర్మన్‌గా విశేష సేవలందించారు. ఆయన పదవీ విమరణ తరువాత, వారసుడిగా మేనల్లుడు ఆనంద్ మహీంద్రాను గ్రూపు చైర్మన్‌గా ఎంపికయ్యారు. (ఫోర్బ్స్ బిలియనీర్ కేషుబ్ మహీంద్రా గురించి తెలుసా? ఆనంద్ మహీంద్రకి ఏమవుతారు?) The industrial world has lost one of the tallest personalities today. Shri Keshub Mahindra had no match; the nicest person I had the privilege of knowing. I always looked forward to mtgs with him and inspired by how he connected business, economics and social matters. Om Shanti. — Pawan K Goenka (@GoenkaPk) April 12, 2023 -
రిస్క్‌ను ఎదుర్కొనడం కంపెనీ డీఎన్ఏలోనే ఉండాలి
న్యూఢిల్లీ: రిస్కులను ఎదుర్కోవడమనేది కంపెనీల రోజువారీ డిఎన్ఏలోనే ఉండాలని క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ మాజీ చైర్మన్ ఎం.దామోదరన్ పేర్కొన్నారు. రిస్కులనేవి పెద్ద కంపెనీలకే కాదని, చిన్న సంస్థలూ వీటిని ఎదుర్కోవలసి ఉంటుందని వ్యాఖ్యానించారు. మోడల్ రిస్క్ కోడ్‌ను ఆవిష్కరించిన సందర్భంగా ఆయన ఈ విషయాలు తెలిపారు. రిస్క్‌ల నిర్వహణలో ఈ కోడ్ ఆచరణాత్మక సాధనం (టూల్ కిట్) వంటిదని దామోదరన్ పేర్కొన్నారు. దేశీ పరిశ్రమల పరిస్థితులకు అనుగుణంగా పరిశ్రమల సమాఖ్య ఫిక్కీ, గ్లోబల్ రిస్క్ మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్ (జీఆర్ఎంఈ) కలిసి దీనికి రూపకల్పన చేశాయి. దామోదరన్ సారథ్యంలోని ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ ఈ కోడ్‌ను తీర్చిదిద్దింది. కోడ్ ప్రధానంగా రిస్క్ మేనేజ్మెంట్కు సంబంధించిన కీలక మూలసూత్రాలు, రిస్క్ నిర్వహణను అమలు చేయడం అనే రెండు కీలక అంశాల ఆధారంగా రూపొందింది. ఇది వ్యాపారాల నిర్వహణలో మార్గదర్శిగా నిలవడంతోపాటు.. అన్ని విభాగాలలో ఎదురయ్యే సవాళ్లను సమర్థవంతంగా అధిగమించడంలో తోడ్పాటునిస్తుంది. కోడ్ ప్రధానంగా లిస్టెడ్, పబ్లిక్ అన్‌లిస్టెడ్, ప్రయివేట్ కంపెనీలు, స్టార్టప్‌లు, లాభాపేక్షలేని సంస్థలు, సొసైటీలు, ట్రస్ట్‌లను ఉద్ధేశించి రూపొందించారు. -
మితిమీరిన వేగం వల్లే... మిస్త్రీ మృతి
ముంబై: రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలైన టాటా గ్రూప్ మాజీ చైర్మన్ సైరస్ మిస్త్రీ (54) అంత్యక్రియలు మంగళవారం ముంబైలో జరగనున్నాయి. మృతదేహానికి సోమవారం అటాప్సీ పూర్తయింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ డాక్టర్ అనాహిత పండోలే, ఆమె భర్త డేరియస్ పండోలే ముంబైలోని రిలయన్స్ ఫౌండేషన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వారు ప్రయాణిస్తున్న బెంజ్ కారు ఆదివారం మధ్యాహ్నం ముంబైకి 120 కిలోమీటర్ల దూరంలో ప్రమాదానికి గురవడం తెలిసిందే. వెనక సీట్లో ఉన్న మిస్త్రీ, ఆయన మిత్రుడు జహంగీర్ పండోలే అక్కడికక్కడే మరణించారు. వాళ్లిద్దరూ సీటు బెల్టు పెట్టుకోలేదని పోలీసులు తెలిపారు. మితిమీరిన వేగం, మరో వాహనాన్ని రాంగ్ సైడ్ నుంచి ఓవర్టేక్ చేసే ప్రయత్నంలో కారు అదుపు తప్పడమే ప్రమాదానికి కారణమన్నారు. చరోటీ చెక్ పోస్టు నుంచి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రమాద స్థలానికి కారు 9 నిమిషాల్లో చేరుకుందని వివరించారు. జర్మనీ నుంచి వచ్చిన బెంజ్ సంస్థ బృందం ఘటనా స్థలిని పరిశీలించింది. -
Cyrus Mistry: గౌరవం కోసం పోరాటం..
ముంబై: పారిశ్రామిక దిగ్గజం, టాటా గ్రూప్ మాజీ చైర్మన్ సైరస్ మిస్త్రీ ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో కన్నుమూశారు. దీనితో, కొన్నాళ్ల క్రితమే టాటా గ్రూప్ నుంచి అర్ధాంతరంగా ఉద్వాసనకు గురైన మిస్త్రీ తాజాగా జీవితం నుంచి కూడా అర్ధాంతరంగా నిష్క్రమించినట్లయింది. టాటా సన్స్‌లో అత్యధికంగా 18 శాతం పైగా వాటాలున్న షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ తరఫున 2012లో టాటా గ్రూప్ చైర్మన్‌గా పగ్గాలు చేపట్టే వరకూ.. కుటుంబ వ్యాపార వర్గాల్లో తప్ప సైరస్ మిస్త్రీ పేరు పెద్దగా బైట వినిపించేది కాదు. 1991లో మిస్త్రీ తమ కుటుంబ వ్యాపార సంస్థ షాపూర్జీ పల్లోంజీ గ్రూప్‌లో (ఎస్పీ) డైరెక్టరుగా చేరారు. 1994లో ఎండీగా నియమితులయ్యారు. ఎస్పీ గ్రూప్ కార్యకలాపాలు మెరైన్, ఆయిల్, గ్యాస్, రైల్వే తదితర రంగాల్లోకి విస్తరించడంలో ప్రధాన పాత్ర పోషించారు. 2006లో కీలకమైన టాటా సన్స్ బోర్డులో చేరారు. అప్పటివరకూ ఆయన పలు టాటా కంపెనీల బోర్డుల్లో సభ్యుడిగా కొనసాగారు. సాధారణంగా నలుగురిలో ఎక్కువగా కలవకపోయినా.. తెలిసినంత వరకూ వ్యాపార దక్షత విషయంలో ఆయనకు మంచి పేరు ఉండేది. ఇదే టాటా గ్రూప్ చీఫ్ రతన్ టాటా తన వారసుడిగా మిస్త్రీని ఎంచుకునేలా చేసింది. వాస్తవానికి టాటా పగ్గాలు చేపట్టడానికి మిస్త్రీకి ఇష్టం లేకపోయినప్పటికీ రతన్ టాటా స్వయంగా నచ్చచెప్పడంతో ఆయన అంగీకరించినట్లు సన్నిహిత వర్గాలు చెబుతాయి. అలా 44 ఏళ్ల వయస్సులో, దేశంలోనే అతి పెద్ద దిగ్గజాల్లో ఒకటైన టాటా గ్రూప్ చీఫ్‌గా బాధ్యతలు తీసుకున్న మిస్త్రీ సంస్థను కొత్త బాటలో నడిపించే ప్రయత్నం చేశారు. టాటాల కుటుంబానికి చెందిన వారు కాకుండా వేరొకరు టాటా గ్రూప్‌నకు సారథ్యం వహించడం అదే ప్రథమం. కార్పొరేట్ గవర్నెన్స్ ప్రమాణాలను మెరుగుపర్చడంపై ఆయన దృష్టి పెట్టారు. నష్టాల్లో ఉన్న సంస్థలను, ఉత్పత్తులను నిలిపివేసి.. లాభదాయక ప్రాజెక్టులను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. అప్పటివరకూ ఎక్కువగా బిజినెస్ టు బిజినెస్ (బీ2బీ)కి పరిమితంగా ఉంటున్న సంస్థ .. మరింతగా వినియోగదారులకు సంబంధించిన ఉత్పత్తులు, సేవలవైపు మళ్లే విధంగా ప్రణాళికలను రూపొందించేందుకు కృషి చేశారు. ఇందుకోసం తగు సిఫార్సులు చేసేందుకు టాటా గ్రూప్‌లోని సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లు, పరిశ్రమ నిపుణులు, విద్యావేత్తలతో ఒక గ్రూప్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్‌ను (జీఈసీ) ఏర్పాటు చేశారు. టాటాతో విభేదాలు.. ఉద్వాసన .. అయితే, ఈ క్రమంలో వ్యాపార వ్యవహార శైలి విషయంలో మిస్త్రీ, రతన్ టాటాల మధ్య విభేదాలు తలెత్తాయి. చివరికి 2016 అక్టోబర్‌లో ఆయన అర్ధాంతరంగా చైర్మన్ పదవి నుంచి ఉద్వాసనకు గురయ్యారు. ఆ తర్వాత టాటా సన్స్ డైరెక్టరుగా కూడా ఆయన్ను తప్పించారు. మిస్త్రీ కుటుంబం అతి పెద్ద వాటాదారే అయినప్పటికీ సైరస్ తన పదవిని కాపాడుకోలేని పరిస్థితి ఏర్పడింది. ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాల్లో ఎన్ చంద్రశేఖర్ (టీసీఎస్ చీఫ్) .. గ్రూప్ పగ్గాలు అందుకున్నారు. న్యాయస్థానాల్లో చుక్కెదురు.. అవమానకరంగా తనను పంపించిన తీరుపై మిస్త్రీ న్యాయపోరుకు దిగారు. స్వయంగా టాటాపైనే విమర్శలు ఎక్కుపెట్టారు. ‘‘అహంభావంతో ఒక్కరు’’ తీసుకుంటున్న తప్పుడు నిర్ణయాలతో గ్రూప్ వ్యాపారానికి నష్టం జరుగుతోందని, టాటా వాస్తవాలు మాట్లాడటం లేదని ఆరోపించారు. తనను తొలగించడంపై నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్‌ను (ఎన్సీఎల్టీ) ఆశ్రయించారు. అంతకు కొన్నాళ్ల క్రితమే తన పనితీరు అద్భుతమని ప్రశంసించి, అంతలోనే అలా ఎలా తొలగిస్తారని ప్రశ్నించారు. ఈ క్రమంలో బాంబే డయింగ్ చీఫ్ నుస్లీ వాడియా, ఆయన చిన్ననాటి స్నేహితురాలు.. ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ కుమార్తె సుప్రియా సూలే తదితరులు ఆయన పక్షాన నిల్చారు. అయితే, బోర్డు, మెజారిటీ వాటాదారులు ఆయనపై విశ్వాసం కోల్పోయారంటూ ఎన్సీఎల్టీ 2018లో మిస్త్రీ పిటీషన్‌ను తోసిపుచ్చింది. దీనిపై ఆయన నేషనల్ కంపెనీ లా అప్పిలేట్ ట్రిబ్యునల్ (ఎన్సీఎల్ఏటీ)ని ఆశ్రయించగా ఆయనకు అనుకూలంగా ఉత్తర్వులు వచ్చాయి. కానీ దీనిపై టాటాలు సుప్రీం కోర్టులో అప్పీలు చేయగా 2021 మార్చిలో ఇచ్చిన తుది తీర్పులో.. అత్యున్నత న్యాయస్థానం టాటాల పక్షం వహించింది. అయితే, అంతకు ముందు తీర్పులో ఆయనపై చేసిన కొన్ని ప్రతికూల వ్యాఖ్యలను తొలగించడం ద్వారా కొంత ఊరటనిచ్చింది. -
రాహుల్ బజాజ్ ఇక లేరు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రముఖ పారిశ్రామికవేత్త, స్వాతంత్య్ర సమరయోధుడు, బజాజ్ గ్రూప్ మాజీ చైర్మన్ రాహుల్ బజాజ్ కన్నుమూశారు. ఆయన వయస్సు 83 సంవత్సరాలు. వృద్ధాప్య సంబంధిత, గుండె, ఊపిరితిత్తుల వ్యాధులతో నెల క్రితం పుణేలోని రూబీ హాల్ క్లినిక్ హాస్పిటల్లో చేరిన ఆయన శనివారం మధ్యాహ్నం 2.30 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఆయన లోటు పూడ్చలేనిదంటూ రాజకీయ, పారిశ్రామిక ప్రముఖులు సంతాపం తెలిపారు. ఆదివారం ప్రభుత్వ లాంఛనాలతో అంతిమ సంస్కారాలు జరుగనున్నాయి. ఆయనకు ఇద్దరు కుమారులు రాజీవ్, సంజీవ్, కుమార్తె సునైనా కేజ్రివాల్ ఉన్నారు. భారత్‌ను ప్రపంచ పటంలో నిలిపారు రాహుల్‌బజాజ్ 1938 జూన్ 10న జన్మించారు. ఢిల్లీ వర్సిటీ నుంచి ఆర్థిక శాస్త్రంలో బీఏ (ఆనర్స్), ముంబై వర్సిటీ నుంచి న్యాయ శాస్త్రంలో డిగ్రీ, హార్వర్డ్ బిజినెస్ స్కూల్ నుంచి ఎంబీఏ చేశారు. బజాజ్ గ్రూప్ 1926లో ప్రారంభమైంది. జమ్నాలా ల్ బజాజ్ ఈ సంస్థను స్థాపించారు. తన తండ్రి కమల్‌నయన్ బజాజ్ బృందంలో రాహుల్ డిప్యూటీ జనరల్ మేనేజర్‌గా చేరారు. 30 ఏళ్ల వయసులో 1968లో బజాజ్ ఆటో సీఈవో అయ్యారు. రాహుల్ నేతృత్వంలో సంస్థ వృద్ధిబాటన పయనించింది. జపాన్ మోటార్‌సైకిల్ కంపెనీల పోటీని తట్టుకుని బజాజ్ స్కూటర్లను విదేశీ గడ్డపైనా పరుగెత్తించా రు. విభిన్న ఉత్పత్తులతో అంతర్జాతీయ మార్కెట్లో బజాజ్ బ్రాండ్‌ను మెరిపించారు. ఆటోమొబైల్‌తో పాటు సాధారణ, వాహన బీమా, ఇన్వెస్ట్మెంట్స్, కన్సూమర్ ఫైనాన్స్, గృహోపకరణాలు, ఎలక్ట్రిక్ పరికరాలు, పవన విద్యుత్, అలాయ్, స్టెయిన్లెస్ స్టీల్ తదితర రంగాలకు గ్రూప్ అంచెలంచెలుగా విస్తరించింది. రాహుల్ సారథ్యంలో బజాజ్ ఆటో టర్నోవర్ రూ.7.2 కోట్ల నుంచి రూ.12,000 కోట్లకు పెరిగింది. ప్రస్తుతం గ్రూప్‌లో 60 వేల పైచిలుకు ఉద్యోగులున్నట్టు చెబుతారు. 2005లో బజాజ్ ఆటో బాధ్యతలను కుమారుడు రాజీవ్‌కు అప్పగించారు. వరల్డ్ ఎకనమిక్ ఫోరం, ఇంటర్నేషనల్ బిజినెస్ కౌన్సిల్, ఇండియన్ ఎయిర్‌లైన్స్ చైర్మన్‌గా చేశారు. 2021 ఏప్రిల్ 30 దాకా బజాజ్ ఆటో నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, చైర్మన్‌గా ఉన్నారు. 2001లో ప్రతిష్టాత్మక పద్మభూషణ్ అవార్డు అందుకున్నారు. 2006లో రాజ్యసభకు ఎంపికయ్యారు. ముక్కుసూటి మనిషి.. రాహుల్‌కు నిక్కచ్చిగా, ముక్కుసూటిగా మాట్లాడతారన్న పేరుంది. ప్రభుత్వంపై విమర్శలకూ వెనకాడేవారు కాదు. సొంత కొడుకుతోనూ తలపడ్డ చరిత్ర ఆయనది. విమర్శలను ప్రభుత్వం అణచివేస్తోందంటూ ముంబైలో 2019లో కేంద్ర మంత్రులు అమిత్ షా, నిర్మల సమక్షంలోనే సంచలనాత్మక వ్యాఖ్యలు చేశారు. ‘భయంతో కూడిన ఈ వాతావరణం కచ్చితంగా మా మనస్సుల్లో ఉంటుంది. విమర్శలను మీరు స్వీకరిస్తారన్న నమ్మకం మాకు లేదు’ అంటూ కుండబద్దలు కొట్టారు. స్కూటర్లకు స్వస్తి చెప్పి మోటార్‌సైకిళ్లపై దృష్టి పెట్టాలని కుమారుడు రాజీవ్ నిర్ణయించుకున్నప్పుడు తన నిరాశను బహిరంగంగా వెల్లడించారు. హమారా బజాజ్ బజాజ్ గ్రూప్ అనగానే టక్కున గుర్తొచ్చేది బజాజ్ చేతక్ స్కూటరే. 1972లో బజాజ్ స్కూటర్ మార్కెట్లోకి వచ్చింది. ‘హమారా బజాజ్..’ అంటూ మధ్యతరగతి కుటుంబాలకు చేరువైంది. చేతక్ స్కూటర్ భారతీయ కుటుంబాలకు ఒక ఆకాంక్షగా మారిందంటే అతిశయోక్తి కాదు. బజాజ్ ప్రియ స్కూటర్లు సైతం ఆదరణ పొందాయి. 2006లో బజాజ్ స్కూటర్ల ఉత్పత్తి ఆగిపోయింది. బజాజ్ చేతక్ అర్బనైట్ ఈవీ సబ్‌బ్రాండ్ పేరుతో 2019 అక్టోబర్‌లో ఎలక్ట్రిక్ స్కూటర్లతో రీ–ఎంట్రీ ఇచ్చింది. రాహుల్ కెరీర్ దేశ కార్పొరేట్ రంగం పెరుగుదలకు సమాంతరంగా సాగింది. ఆయన మరణం పారిశ్రామిక ప్రపంచంలో శూన్యాన్ని మిగిల్చింది. – రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ వాణిజ్య, పారిశ్రామిక ప్రపంచానికి చేసిన విశేషమైన కృషికి ఆయన ఎప్పటికీ గుర్తుండిపోతారు. గొప్ప సంభాషణకర్త. సమాజ సేవపైనా మక్కువ చూపారు. – ప్రధాని నరేంద్ర మోదీ భారతీయ వ్యాపార ప్రపంచంపై ఆయన పాదముద్రలు ఎప్పటికీ చెరిగిపోవు – మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా నేను చెప్పలేనంత షాక్‌కు గురయ్యాను. దేశం ఒక గొప్ప పుత్రున్ని, నిర్మాతను కోల్పోయింది. – బయోకాన్ ఎగ్జిక్యూటివ్ చైర్పర్సన్ కిరణ్ మజుందార్ షా -
కార్పొరేట్ల చేతుల్లో బ్యాంకులు వద్దు: రజనీష్‌కుమార్
ముంబై: బ్యాంకింగ్ రంగంలోకి కార్పొరేట్లను అనుమతించాల్సిన అవసరం లేదని ఎస్బీఐ మాజీ చైర్మన్ రజనీష్ కుమార్ అన్నారు. రిలేటెడ్ పార్టీ (బ్యాంకు యాజమాన్యాలతో సంబంధం కలిగిన వారితో లావాదేవీలు) లావాదేవీలు పరంగా ఉండే రిస్క్ నేపథ్యంలో ఆయన ఈ అభిప్రాయం వ్యక్తం చేశారు ‘‘నా వరకు భారత్ వంటి దేశంలో బ్యాంకులను కలిగి ఉండేందుకు కార్పొరేట్లను అనుమతిస్తే పెద్ద రిస్క్‌లను ఎదుర్కోవాల్సి వస్తుంది. సరైన యాజమాన్యాలతో, నిపుణుల ఆధ్వర్యంలో నడిచే బ్యాంకులే మనకు కావాలి’’ అని సెంటర్ ఫర్ ఫైనాన్షియల్ స్టడీస్ నిర్వహించిన ఒక వెబినార్‌లో భాగంగా రజనీష్‌కుమార్ పేర్కొన్నారు. -
పురోగమనంలో యస్ బ్యాంకు
న్యూఢిల్లీ: యస్ బ్యాంకు యాజమాన్య బాధ్యతలను ఎస్బీఐ సహా ఇతర ఇన్వెస్టర్లు తీసుకున్న తర్వాత.. పనితీరు మెరుగుపడుతోందని ఎస్బీఐ మాజీ చైర్మన్ రజనీష్‌కుమార్ అన్నారు. నిధుల సంక్షోభంలో పడిపోయిన యస్ బ్యాంకును ఆదుకున్న సమయంలో ఎస్బీఐ సారథిగా రజనీ‹Ùకుమార్ ఉన్న విషయం గమనార్హం. యస్ బ్యాంకుపై ఓ వార్తా సంస్థతో రజనీష్‌కుమార్ తాజాగా మాట్లాడారు. ‘‘యస్ బ్యాంకు ఉన్న పరిస్థితుల నేపథ్యంలో స్థిరపడేందుకు కనీసం మూడేళ్ల సమయం అయినా ఇచ్చి చూడాలి. ఎస్బీఐ ఆదుకున్న సమయంలో యస్ బ్యాంకు పరిస్థితి చాలా దారుణంగా ఉంది. అప్పటి నుంచి మంచి పురోగతే చూపించింది’’ అని రజనీష్ కుమార్ వివరించారు. ‘ద కస్టోడియన్ ఆఫ్ ట్రస్ట్’ పేరుతో రజనీష్‌కుమార్ తాను రచించిన పుస్తకంలోనూ యస్ బ్యాంకుకు సంబంధించి నాటి జ్ఞాపకాలను ప్రస్తావించారు. యస్ బ్యాంకును చివరి క్షణంలో ఆదుకునేందుకు ఎస్బీఐ విముఖంగా ఉన్నప్పటికీ.. నాటి పరిస్థితుల్లో తప్పలేదని పేర్కొన్నారు. ‘‘ఆరు బ్యాంకులను (ఐదు అనుబంధ బ్యాంకులు సహా) ఎస్బీఐలో విలీనం చేసుకున్న అనంతరం మరో బ్యాంకును ఆదుకునే పరిస్థితి ఎస్బీఐకి రాదనుకున్నాను. ఎస్బీఐ అంతకుముందు చివరిగా 1995లో కాశినాథ్ సేత్ బ్యాంకును ఆదుకుంది’’ అని రజనీష్ తెలిపారు. ఆ విషయంలో ఒత్తిడి వచ్చింది.. ‘‘యస్ బ్యాంకులో పెట్టుబడులకు సంబంధించి ఇతర ఇన్వెస్టర్లను 2020 మార్చి 13 నాటికి గుర్తించే విషయమై నాడు నాపై ఒత్తిడి ఉంది. దేశంలో నాలుగో అతిపెద్ద ప్రైవేటు బ్యాంకు విఫలమైతే అది దేశ ఆరి్థక వ్యవస్థపై ప్రభావానికి దారితీయకుండా ఆర్బీఐ నుంచి ఒత్తిడి వచి్చంది’’ అని రజనీష్ నాటి సంక్షోభానికి సంబంధించి తాను ఎదుర్కొన్న అనుభవాలను తన పుస్తకంలో బయటపెట్టారు. 2020 మార్చి 5న యస్ బ్యాంకుపై ఆర్బీఐ మారటోరియం విధించడం తెలిసిందే. మొదట ఒక్కో ఖాతాదారు రూ.50,000 వరకు ఉపసంహరించుకునేందుకు అనుమతించింది. మార్చి 13 నాటికి యస్ బ్యాంకు పునరుద్ధరణ ప్రణాళికను ఆర్బీఐ ప్రకటించి, 18 నుంచి మారటోరియంను ఎత్తివేసింది. నాటి ప్రణాళిక ప్రకారం యస్ బ్యాంకులో ఎస్బీఐ తన పెట్టుబడులను మొదటి మూడేళ్లలో 26 శాతానికంటే దిగువకు తగ్గించుకోకూడదు. ఇతర ఇన్వెస్టర్లు, అప్పటికే వాటాలు కలిగి ఉన్న వారు తమ వాటాల్లో 75 శాతాన్ని మూడేళ్లపాటు విక్రయించుకోకుండా లాకిన్ విధించారు. 100 షేర్లలోపు ఉన్న వారికి మాత్రం మినహాయింపునిచ్చారు. ‘‘నాడు ఐసీఐసీఐ బ్యాంకు, కోటక్ మహీంద్రా బ్యాంకు, హెచ్డీఎఫ్సీ, ఫెడరల్ బ్యాంకులు సైతం పెట్టుబడులతో ముందుకు వచ్చాయి. చివర్లో ఐడీఎఫ్సీ ఫస్ట్‌బ్యాంకు తరఫున వీ వైద్యనాథన్ సైతం రూ.150 కోట్ల పెట్టుబడులతో ముందుకు రావడం ఆశ్చర్యపరిచింది. కానీ, అప్పటికీ నిర్దేశిత లక్ష్యానికి మరో రూ.10,000 కోట్ల పెట్టుబడులు కావాల్సి ఉంది. దాంతో బంధన్ బ్యాంకు ఘోష్‌కు కాల్ చేయగా.. మరో రూ.250కోట్లను ఇన్వెస్ట్ చేసేందుకు అంగీకరించారు. చాలా స్వల్ప వ్యవధిలోనే యస్‌బ్యాంకును విజయవంతంగా ఒడ్డెక్కించడం అన్నది ప్రభుత్వం, ఆర్బీఐ చక్కని సమన్వయానికి నిదర్శనం’’ అన్నారు. -
ఆయన హయాంలో ఓ వ్యూహమంటూ లేదు
న్యూఢిల్లీ: టాటా గ్రూప్, ఉద్వాసనకు గురైన మాజీ చైర్మన్ సైరస్ మిస్త్రీల మధ్య న్యాయ పోరు కొనసాగుతోంది. తాజాగా గ్రూప్ గౌరవ చైర్మన్ రతన్ టాటాపై మిస్త్రీ మరిన్ని ఆరోపణలు చేశారు. టాటా హయాంలో పెట్టుబడులకంటూ ఓ వ్యూహమంటూ ఉండేది కాదని మిస్త్రీ పేర్కొన్నారు. టెలికం టెక్నాలజీ ప్లాట్‌ఫామ్స్, ఇతరత్రా వ్యాపారాలకు సంబంధించి తీసుకున్న తప్పుడు నిర్ణయాలతో దేశీ కార్పొరేట్ చరిత్రలోనే ఎన్నడూ చూడనంత స్థాయిలో గ్రూప్ విలువ నాశనమైందని మిస్త్రీ ఆరోపించారు. 2012 డిసెంబర్లో టాటా సన్స్ చైర్మన్ హోదా నుంచి వైదొలిగినప్పట్నుంచీ రతన్ టాటాపై పెట్టిన వ్యయాలన్నీ ఆయన కంపెనీకి తిరిగివ్వాలని డిమాండ్ చేశారు. టాటా గ్రూప్ అఫిడవిట్లకు ప్రతిగా మిస్త్రీ కుటుంబ సంస్థలు ఈ మేరకు సుప్రీం కోర్టుకు అఫిడవిట్లు దాఖలు చేశాయి. 2016 అక్టోబర్ 24న మిస్త్రీని చైర్మన్‌గా టాటా సన్స్ తొలగించడం, అటుపైన సుదీర్ఘ న్యాయపోరాటం తర్వాత అది చెల్లదంటూ నేషనల్ కంపెనీ లా అప్పి లేట్ ట్రిబ్యునల్ (ఎన్సీఎల్ఏటీ) ఉత్తర్వులివ్వడం తెలిసిందే. దీన్ని సవాల్ చేస్తూ టాటా గ్రూప్ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. దీనిపైనే మే 29న విచారణ ప్రారంభించిన సుప్రీం కోర్టు నాలుగు వారాల్లోగా తమ వాదనలు తెలియజేయాలంటూ ఇరు వర్గాలను ఆదేశించింది. మిస్త్రీ పనితీరు సరిగ్గా లేకపోవడం వల్ల కంపెనీకి నష్టాలు వాటిల్లాయని, అందుకే ఆయన్ను తొలగించాల్సి వచ్చిందని టాటా గ్రూప్ పేర్కొనడాన్ని మిస్త్రీ తప్పు పట్టారు. -
చిత్తూరు టౌన్ బ్యాంక్ మాజీ ఛైర్మన్ టీడీపీ నేత అరెస్ట్
-
బయటపడ్డ మరో బ్యాంకింగ్ మోసం
న్యూఢిల్లీ : మరో బ్యాంకింగ్ మోసం శనివారం బయటపడింది. సుమారు రూ.621 కోట్ల మోసానికి పాల్పడ్డారనే ఆరోపణలపై యూకో బ్యాంక్ మాజీ చైర్మన్ అరుణ్ కౌల్‌తో పాటు మరి కొంత మంది బిజినెస్ ఎక్జిక్యూటివ్‌లపై సీబీఐ శనివారం కేసు నమోదు చేసింది. ప్రేవేటు ఇన్ఫ్రా స్ట్రక్చర్ సంస్థ ఎరా ఇంజనీరింగ్ ఇఫ్రా లిమిటెడ్, ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ సంస్థ అల్టియస్ ఫిన్సర్వ్ ప్రైవేటు లిమిటెడ్‌లకు రుణాల చెల్లింపు విషయంలో అరుణ్ కౌల్ అవతవకలకు పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. అరుణ్ కౌల్ 2010 నుంచి 2015 మధ్యంలో యూకో బ్యాంకుకు చైర్మన్‌గా వ్యవహరించారని, ఈ సంస్థలకు రుణాలు మంజూరు చేయడంలో అరుణ్ కౌల్‌దే ప్రధాన భూమిక అని సీబీఐ అధికారులు తెలిపారు. బ్యాంకింగ్ రంగంలో ఫిబ్రవరి తర్వాత బయట పడిన మరో పెద్ద మోసం ఇదే అని చెప్పుకోవచ్చు. గతంలో ఇద్దరు వజ్రాల వ్యాపారులు బ్యాంకులకు సుమారు రెండు బిలియన్ డాలర్లు కుచ్చు టోపీ పెట్టి విదేశాలకు పారిపోయిన సంగతి తెల్సిందే. ఈ మోసం కేసు బ్యాంకింగ్ రంగాన్నే ఓ కుదుపు కుదుపేసింది. ఈ నెల1న యూకో బ్యాంక్ మాజీ మేనేజర్‌తో పాటు మరో నలుగురిపై రూ.19 కోట్ల మోసానికి సంబంధించి సీబీఐ కేసు నమోదు చేశారు. తాజాగా ఈ మోసం వెలుగులోకి రావడంతో యూకో బ్యాంకు ఉద్యోగులు ఆశ్చర్యపోయే పరిస్థితి తలెత్తింది. యూకో బ్యాంకు కేసుకు సంబంధించి అరుణ్ కౌల్‌తో పాటు కొంత మందిబ్యాంకు అధికారులు, రెండు ప్రైవేటు కంపెనీలకు చెందిన అకౌంటెంట్లపై సీబీఐ కేసు నమోదు చేసింది. బ్యాంకు మంజూరు చేసిన రుణాలు దేనికి సంబంధించి మంజూరు చేశారో దానికి వినియోగించలేదని, చార్టడ్ అకౌంటంట్ తప్పుడు ధృవీకరణ పత్రాలు సృష్టించి రుణాలను అటువైపు మళ్లించి మోసానికి పాల్పడ్డారని సీబీఐ పేర్కొంది. దీనికి సంబంధించి రెండు కంపెనీలు, అకౌంటంట్లు, నిందితుల ఇళ్లలో సీబీఐ సోదాలు నిర్వహిస్తోంది. -
మాజీ ఉద్యోగుల మోసపూరిత క్లెయిమ్‌లపై దర్యాప్తు
మిస్త్రీ ప్రకటన నేపథ్యంలో ఎయిర్ ఏషియా వెల్లడి న్యూఢిల్లీ: మాజీ ఉద్యోగులు కొందరు అక్రమంగా వ్యక్తిగత ఖర్చులను, కొన్ని రకాల చార్జీలను క్లెయిమ్ చేసుకోవడంపై దర్యాప్తు కొనసాగుతున్నట్టు విమానయాన సంస్థ ఎయిర్ ఏషియా (ఇండియా) లిమిటెడ్ ప్రకటించింది. ఈ విషయాన్ని ఇప్పటికే కంపెనీ బోర్డ్‌కు నివేదించినట్టు, గత సమావేశంలో చర్చిం చినట్టు తెలిపింది. విచారణ జరుగుతున్నందున ఈ వ్యవహారానికి సంబంధించి ఈ దశలో ఎటువంటి ప్రత్యేక వివరాలను ప్రస్తావించదలచుకోలేదని, అలా చేస్తే అది విచారణకు ప్రతికూలంగా మారవచ్చని అభిప్రాయం వ్యక్తం చేసింది.అనైతిక విధానాలను సహించేది లేదని, కుట్రదారులపై కఠిన చర్యలు ఉంటాయని స్పష్టం చేసింది. ఎయిర్ ఏసియాలో రూ.22 కోట్ల మేర మోసపూరిత లావాదేవీలు జరిగినట్టు టాటా సన్స్ చైర్మన్ పదవి నుంచి ఇటీవల తొలగింపునకు గురైన తర్వాత సైరస్ మిస్త్రీ బోర్డు సభ్యులకు రాసిన లేఖలో పేర్కొనటం తెలిసిందే.