Keshub Mahindra, Mahindra & Mahindra former chairman passes away - Sakshi
Sakshi News home page

మహీంద్రా అండ్ మహీంద్రా మాజీ చైర్మన్ కేషుబ్ మహీంద్రా కన్నుమూత

Published Wed, Apr 12 2023 11:42 AM | Last Updated on Wed, Apr 12 2023 11:53 AM

Keshub Mahindra Mahindra and Mahindra former chairman passes away - Sakshi

సాక్షి,ముంబై: మహీంద్రా అండ్ మహీంద్రా ఎమెరిటస్ చైర్మన్ కేషుబ్ మహీంద్రా (99)బుధవారం కన్నుమూశారు.  ఇన్‌స్పేస్ చైర్మన్ పవన్ కె గోయెంకా తన ట్విటర్‌ ద్వారా ఈ విషయాన్ని ధృవీకరించారు. పారిశ్రామిక ప్రపంచం నేడు అత్యంత ఉన్నతమైన వ్యక్తిని కోల్పోయింది. వ్యాపారం, ఆర్థిక శాస్త్రం, సామాజిక విషయాల్లో స్ఫూర్తిదాయకమైన వ్య‍క్తి అంటూ  సంతాపాన్ని ప్రకటించారు. 

1947లో  మహీంద్రా గ్రూప్‌లో చేరిన  కేషుబ్ 48 సంవత్సరాల పాటు కంపెనీకి చైర్మన్‌గా నాయకత్వం వహించారు. ప్రస్తుత ఎంఅండ్‌ ఎం చైర్మన్‌ ఆనంద్‌ మహీద్రకి మేనమామ కేషుబ్. తనతండ్రి స్థాపించిన మహీంద్రా గ్రూపులో 1963 నుండి 2012 వరకు  ఛైర్మన్‌గా విశేష సేవలందించారు. ఆయన  పదవీ విమరణ  తరువాత,  వారసుడిగా మేనల్లుడు ఆనంద్ మహీంద్రాను గ్రూపు చైర్మన్‌గా  ఎంపికయ్యారు.  (ఫోర్బ్స్ బిలియనీర్‌ కేషుబ్ మహీంద్రా గురించి తెలుసా? ఆనంద్‌ మహీంద్రకి ఏమవుతారు?)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement