uncle
-
‘అంకుల్ ప్రైజ్’: అతడేం పనిచేస్తాడో తెలుసా..!
పొగడ్తలను ఇష్టపడని వారు చాలా అరుదు. పూర్వం రాజులు కూడా కేవలం తమని పొగడటానికి ప్రత్యేకంగా కొంతమందిని నియమించుకునేవారు. తాజాగా ఇదే తరహాలో జపాన్(Japan)లోని ఒక వ్యక్తి ‘అంకుల్ ప్రైజ్(Uncle Praise)’ పేరుతో తన సొంత స్ట్రీట్ జాబ్‌ను ప్రారంభించాడు. ప్రతిరోజూ టోక్యో నగర వీథుల్లో నిల్చొని, అతని దగ్గరకు వచ్చిన అపరిచితులను పొగుడుతూ డబ్బు సంపాదిస్తున్నాడు. ఒకానొక సమయంలో జూదానికి బానిసగా మారి, తన ఉద్యోగం, కుటుంబం రెండింటినీ కోల్పోయి, చాలాకాలం పాటు ఖాళీగా ఉండేవాడు. ఆ సమయంలో తిరిగి ఎవరూ తనని పనిలో చేర్చుకోకపోవడంతో చాలా ఇబ్బందులు పడ్డాడు. అప్పుడే కొంతమంది స్ట్రీట్ ఆర్టిస్ట్‌లను చూసి, ‘అంకుల్ ప్రైౖజ్’ పేరుతో సొంత ఆలోచనతో ఇతరులను పొగిడే పనిని ప్రారంభించాడు. ఇతని కథనాన్ని ఈ మధ్యనే ఒక టీవీ షో ప్రసారం చేయటంతో ఫేమస్ అయ్యాడు. రోజుకు దాదాపు 150 యెన్ల నుంచి 10 వేల యెన్ల వరకు (రూ.82 నుంచి రూ. 5,500 వరకు) సంపాదించేవాడు. టీవీ షో ద్వారా ఫేమస్ అయిన తర్వాత ఇప్పుడు, విస్తృతంగా వ్యాపార పర్యటనలు చేస్తూ భారీగా సంపాదిస్తున్నాడు. (చదవండి: సర్వ ఆహార సమ్మేళనం -
సంక్రాంతి అల్లుడు మిస్సింగ్
సాక్షి, వరంగల్: పాలకుర్తి మండలం బొమ్మర గ్రామంలో సంక్రాంతి పండుగకు అత్తారింటికి వచ్చిన అల్లుడు అదృశ్యమయ్యారు. అత్తారింట్లో నుంచి బుధవారం రాత్రి స్నేహితులు ఫోన్ చేస్తున్నారని, వారితో మాట్లాడి వస్తానంటూ భార్యకు చెప్పి వెళ్లాడు. రాత్రి 8:30 గంటలకు భార్య ఫోన్ చేయగా ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది.ఇంట్లో నుంచి వెళ్లి 42 గంటలవుతున్నా కానీ యువకుడి ఆచూకీ లభించలేదు. గత ఏడాది డిసెంబర్ 26న వివాహం జరగ్గా, యువకుడి భార్య, బంధువులు ఆందోళనకు గురవుతున్నారు. గురువారం మధ్యాహ్నం పాలకుర్తి పోలీస్ స్టేషన్లో భార్య ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.కొడుకుపై తండ్రి ఫిర్యాదు వరంగల్: ఆస్తులు పంచుకొని తన బాగోగులు చూసుకోవడం లేదని కొడుకుపై ఓ తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేసిన ఘటన వరంగల్ జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. వర్ధన్నపేట మండలం దమ్మన్నపేట దొడ్లకుంటకు చెందిన గుజ్జల రాజిరెడ్డికి చెందిన 15 ఎకరాల భూమిలో కుమారుడు వినయ్ రెడ్డి ఏడెకరాల భూమి రాయించుకున్నాడు. ఇటీవల తల్లి అనారోగ్యంతో మరణించగా తండ్రి రాజిరెడ్డి జీవనం ప్రశ్నార్ధకంగా మారింది.ఇదీ చదవండి: మంగళూరు బ్యాంకులో దోపిడీ.. ఉద్యోగులను గన్‌తో బెదిరించి..ఆలనా పాలనా చూసుకునే కొడుకే తనను ఇబ్బందులకు గురి చేస్తున్నాడని.. అలాంటి వాడికి తాను కష్టపడి సంపాదించిన భూమిని తనకు అప్ప చెప్పాలని పోలీసు, రెవెన్యూ శాఖ అధికారులకు తండ్రి రాజిరెడ్డి ఫిర్యాదు చేశాడు. కుమారుడు వినయ్ రెడ్డి నుండి తనను కాపాడాలని తన వల్ల ప్రాణహాని ఉందని రాజిరెడ్డి పోలీసుల వద్ద వాపోయాడు. వృద్ధాప్యంలో ఉన్న తనకు న్యాయం చేసి ఆదుకోవాలని పోలీసుల వద్ద రాజిరెడ్డి అని 63 ఏళ్ల వృద్ధుడు కన్నీటి పర్యంతమయ్యాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
మేనమామ సారె అదుర్స్
సేలం: తూత్తుకుడి సమీపం శంకరరాజపురం గ్రామానికి చెందిన ఆనంది కుమార్తె సబీష్టా (14)కు పుష్పవతి వేడుకలను గురువారం రాత్రి నిర్వహించారు. ఈ సందర్భంగా సబీష్టా మేనమామలు భవిత్కుమార్, సూర్య మేళతాళాల హోరు, బాణాసంచాల మోత, వెలుగుల మధ్య 350 పళ్లాలలో బంగారు నగలతోపాటు పూలు. పండ్లు, పలు రకాల స్వీట్లు, దుస్తులు, అలంకరణ సామగ్రి మొదలైనవి సారెగా ఇచ్చేందుకు కంటైనర్ లారీలో తీసుకురావడం స్థానికులకు ఆశ్చర్యాన్ని కలిగించింది. -
భార్య ముందు అంకుల్ అన్నందుకు చితక బాదాడు
భోపాల్: మధ్యప్రదేశ్ రాజధాని నగరం భోపాల్‌లో రెండు రోజుల క్రితం విచిత్ర సంఘటన జరిగింది. భార్యకు చీరలు కొనడానికి వెళ్లిన రోహిత్ అనే వ్యక్తి షాపు యజమానిని చితకబాదాడు. ఇంతకీ కారణమేంటంటే భార్యతో కలిసి చీరలు కొంటున్న రోహిత్‌కు షాపు యజమాని విశాల్ చాలా చీరలు చూపించాడు. ఎన్ని చీరలు చూసినా రోహిత్ దంపతులు ఒక్కటీ సెలెక్ట్ చేయలేదు. దీంతో విసుగెత్తిన విశాల్ మీకు వెయ్యి రూపాయల రేంజ్లో చీరలు కావాలా అని అడిగాడు. ‘మేం అంతకంటే ఎక్కువ రేంజ్ చీరలే కొనగలం, మమ్మల్ని తక్కువ అంచనా వేయకు’అని రోహిత్ షాపు యజమాని విశాల్‌పై అగ్రహం వ్యక్తం చేశాడు. దీంతో విశాల్ స్పందిస్తూ ‘అంకుల్ మీకు అన్ని రేంజ్‌ల చీరలు చూపిస్తాను’అని వ్యంగ్యంగా సమాధానమిచ్చాడు. భార్య ముందు అంకుల్ అనడంతో రోహిత్ కోపం కట్టలు తెంచుకుంది. షాపు నుంచి వెళ్లిపోయి కొద్ది సేపటికి స్నేహితులను వెంటేసుకొచ్చి షాపు యజమాని విశాల్‌ను కర్రలు, బెల్టులతో చితకబాది అక్కడి నుంచి పారిపోయారు. ఇదీ చదవండి: బలవంతంగా ఉమ్మి నాకించారు -
శ్రీనగర్ లాల్‌చౌక్ కోసం మామ- మేనల్లుడు పోటీ
శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్లో ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. 90 అసెంబ్లీ స్థానాల్లో శ్రీనగర్‌లోని లాల్ చౌక్ సీటు కీలకమైన సీటుగా పేరొందింది. సెప్టెంబర్ 25న లాల్ చౌక్ స్థానానికి రెండో దశలో పోలింగ్ జరగనుంది. ఈ సీటు నుంచి ఇతర అభ్యర్థులతో పాటు మామ, మేనల్లుడు కూడా తలపడుతున్నారు.లాల్ చౌక్ నుంచి అప్నీ పార్టీ సీనియర్ నేత అష్రఫ్ మీర్, పీడీపీ యువ అభ్యర్థి జుహైబ్ యూసుఫ్ మీర్ తలపడుతున్నారు. వీరిద్దరూ వరుసకు మామా- మేనల్లుడు. గతంలో అష్రఫ్ మీర్ పీడీపీ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో సోనావర్ స్థానం నుండి పోటీచేసి, జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లాను ఓడించారు. అయితే 2018లో బీజేపీ, పీడీపీ కూటమి తెగిపోవడంతో అష్రఫ్ మీర్ పీడీపీని వీడి అల్తాఫ్ బుఖారీ సొంత పార్టీ అయిన అప్నీలో చేరారు. కాగా జుహైబ్ బ్రిటన్ నుంచి ఆర్థికశాస్త్రంలో పీజీ పట్టా పొందారు. మెహబూబా ముఫ్తీ అతనికి లాల్ చౌక్ నుండి పోటీ చేసేందుకు టిక్కెట్ ఇచ్చారు. దీంతో లాల్ చౌక్‌లో మామ- మేనల్లుడు పోరు ఆసక్తికరంగా మారింది.మరోవైపు జమ్ము కశ్మీర్ చరిత్రలో ఏనాడూ ఒక్క సీటు కూడా గెలవని బీజేపీ ఈసారి లాల్ చౌక్ అసెంబ్లీ నియోజకవర్గంలో తన బలాన్ని చాటే ప్రయత్నం చేస్తోంది. బీజేపీ అభ్యర్థి అజాజ్ హుస్సేన్ ఇక్కడి నుంచి తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధం అయ్యారు. ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా శ్రీనగర్‌లో ర్యాలీ నిర్వహించి, ఇక్కడి ప్రజలను ఆకట్టుకునేందుకు ప్రయత్నించారు. ఆర్టికల్ 370ని రద్దు చేసిన తర్వాత బీజేపీ ఇక్కడ పలు అభివృద్ధి పనులు చేసిందని మోదీ పేర్కొన్నారు. ఇది కూడా చదవండి: జపాన్‌లో భూకంపం.. సునామీ హెచ్చరిక జారీ -
వారికి శ్రీరాముడు ‘మామ’? బంధుత్వం ఎలా కలిసింది?
ఆ గ్రామంలోనివారికి శ్రీరాముడు మామ అవుతాడు. దీని వెనుక ఒక పురాణ కథనం కూడా ఉంది. ఆగ్రాలోని రుంకటా పరిధిలోని సింగనా గ్రామంలో శృంగి మహర్షి ఆశ్రమం ఉంది. అయోధ్యలో 22న శ్రీరాముని ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం జరగనున్న సందర్భంగా శృంగి మహర్షి ఆశ్రమంలోనూ వేడుకలు నిర్వహిస్తున్నారు. శృంగి మహర్షి అలనాడు దశరథ మహారాజు ఆహ్వానం మేరకు అయోధ్యకు వెళ్లి పుత్రకామేష్టి యాగం చేశాడు. సింగనా గ్రామ ప్రజలు శ్రీరాముడిని ముద్దుగా మామ అని పిలుచుకుంటారు. శ్రీరాముడిని వారు మామగా పిలవడానికి కారణం ఉంది. దశరథ మహారాజు కుమార్తె శాంతకుమారికి శృంగిమహర్షితో వివాహం జరిగింది. శ్రీరాముని సోదరి శాంతకుమారి వివాహానంతరం ఈ ప్రాంతానికి వచ్చినందున వారు శ్రీరామునితో బంధుత్వం ఏర్పరుచుకుని, మామా అని సంబోధిస్తుంటారు. సింగన గ్రామంలో యమునా నది ఒడ్డున శృంగి మహర్షి ఆశ్రమం ఉంది. కుమారుడు పుట్టాలనే కోరికతో శృంగి ఋషి ఆశ్రమానికి ఎవరైనా వస్తే వారి కోరిక నెరవేరుతుందని స్థానికులు చెబుతుంటారు. శృంగి మహర్షి అయోధ్యకు వెళ్లి, పుత్రకామేష్టి కోసం యాగం చేసిన దరిమిలా రామలక్షణ భరత శత్రుఘ్నలు జన్మించారు. శృంగి మహర్షి ఆశ్రమానికి చెందిన మహంత్ నిరంజన్ దాస్ మాట్లాడుతూ, ఈ ఆశ్రమంలో శృంగి మహర్షి తపస్సు చేశారని, ఈ శృంగి మహర్షి తపోభూమి ఎంతో శక్తివంతమైనదని అన్నారు. అయోధ్యలో జనవరి 22న శ్రీరామ విగ్రహ ప్రతిష్ఠాపన వేడుకలు జరగనున్న సందర్భంగా శృంగి మహర్షి ఆశ్రమంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. గ్రామంలోనివారంతా తమ ఇళ్లలో దీపాలు వెలిగించనున్నారు. -
‘మామయ్యా’ అనే పిలుపు కోసం..
చాలామంది అన్నదమ్ములు తమ సోదరికి జన్మించిన సంతానాన్ని అమితంగా ప్రేమిస్తుంటారు. వారి చేత ‘మామయ్యా..’ అని పిలిపించుకోవాలని తపన పడిపోతుంటారు. అయితే ఈ మెట్లనన్నింటినీ దాటేసిన ఒక మేనమామ తన మేనకోడలికి పెళ్లిలో ఘనమైన కానుకను సమర్పించుకున్నాడు. హర్యానాలోని రేవాడీలో ఓ వ్యక్తి తన మేనకోడలి పెళ్లిలో ఆమెకు ఇచ్చిన కానుక సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. తన వితంతు సోదరి కుమార్తెకు కానుకగా ఇచ్చేందుకు అతను సోదరి ఇంట్లో రూ.500 నోట్ల కట్టలను కుప్పలుగా పోశాడు. మేనకోడలికి ఖరీదైన కానుకను అందించిన ఆ వ్యక్తి పేరు సత్బీర్. అతను క్రేన్ వ్యాపారి. సత్బీర్ తన మేనకోడలి పెళ్లిలో ఆమెకు విలువైన నగలు కూడా బహూకరించాడు. సత్బీర్ మొత్తంగా ఒక కోటి, ఒక లక్షా పదకొండు వేల నూటొక్క రూపాయలను పెళ్లి కుమార్తెకు కానుగా ఇచ్చాడు. ఈ ఘటనలో నోట్ల కట్టలకు సంబంధించిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిని చూసిన యూజర్లు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. అసల్వాస్ రేవారి.. ఇది జైపూర్-ఢిల్లీ హైవేకి ఆనుకుని ఉన్న ఒక గ్రామం. ఈ ప్రాంతానికి చెందిన సత్బీర్ సోదరి వివాహం సిందర్‌పూర్‌లో జరిగింది. పెళ్లయిన కొంతకాలానికి ఆమె భర్త మృతి చెందాడు. సత్బీర్ సోదరికి ఒక కుమార్తె ఉంది. తన మేనకోడలి పెళ్లి సందర్భంగా సత్బీర్ తన ఊరి ప్రజలతోపాటు తన సోదరి ఇంటికి చేరుకున్నాడు. పెళ్లిలో సత్బీర్ తన మేనకోడలికి ఇచ్చిన కానుకను చూసి స్థానికులు ఆశ్యర్యపోయారు. ఈ సంద్భంగా సోదరి ఇంటిని సత్బీర్ రూ.500 నోట్ల కట్టలతో నింపేశాడు. కోటి రూపాయలకుపైగా మొత్తాన్ని తన మేనకోడలికి బహూకరించాడు. ఇది కూడా చదవండి: ఆ గనిలో మహిళలకే పని.. కారణమిదే! भाई ने विधवा बहन के घर लगा दिया रुपयों का ढेर, करोड़ों का भात बना चर्चा का विषय#rewari #haryana #bhaat pic.twitter.com/SYi95UEREl — Punjab Kesari Haryana (@HaryanaKesari) November 27, 2023 -
అల్లుడితో షూట్ చేయించుకున్న మామ..ఎందుకంటే..?
న్యూఢిల్లీ : అప్పులోళ్లను ఇరికించేదుకు ఓ వ్యక్తి తన అల్లుడితో కలిసి పెద్ద కుట్రే పన్నాడు. కానీ పోలీసులకు దొరికిపోయి ఊచలు లెక్కించే పరిస్థితి తెచ్చుకున్నాడు. దేశ రాజధాని ఢిల్లీలో ఓ వ్యక్తి తన అల్లుడికి తుపాకీ ఇచ్చి చేతిపై ఘూట్ చేయించుకున్నాడు. వెంటనే పోలీసులకు ఫోన్ చేసి అప్పు కోసంవేధిస్తూ అప్పులోళ్లే తనను కాల్చారని చెప్పాడు. ఈ ఘటన ఢిల్లీలోని నంద్ నగ్రీ తాహీర్‌పూర్‌లో జరిగింది. కాల్పులు జరిగాయని ఫోన్ వచ్చిన వెంటనే పోలీసులు స్పాట్‌కు వెళ్లి చూశారు. చేతికి గాయంతో ఉన్నసుందర్ కనిపించాడు. 315 బోర్ తుపాకీకి చెందిన ఖాళీ షెల్ అక్కడే పడి ఉంది. గాయపడిన సుందర్‌తో పాటు అతడి అల్లుడు హిమాన్షు కూడా అక్కడే ఉన్నాడు. ఏం జరిగందని అడగ్గా మేమిక్కడ చేపలకు ఆహారం వేస్తుంటే ఒక వ్యక్తి వచ్చి తనను తిడుతూ తుపాకీతో కాల్చాడని చెప్పాడని డీసీపీ తెలిపారు. సుందర్‌ను వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలిచినట్లు చెప్పారు. ఘటనపై విచారణ ప్రారంభించిన పోలీసులకు విస్తుపోయే నిజాలు తెలిశాయి. గాయపడ్డ సుందర్‌కు కొన్ని అప్పులున్నాయని, అప్పులు ఇచ్చిన వారిని కేసులో ఇరికించేందుకే అల్లుడితో కాల్పులు జరిపించుకుని డ్రామా ఆడాడని తేలింది. సుందర్ అల్లుడు హిమాన్షు ఇంటరాగేషన్‌లో పోలీసులకు అన్ని విషయాలు చెప్పాడు. కాల్చిన తర్వాత తుపాకీని అక్కడే ఉన్న చెరువులో పడేసినట్లు వెల్లడించాడు. అక్కడికి వెళ్లి వెతికిన పోలీసులకు తుపాకీ దొరికింది. దీంతో పోలీసులు సుందర్‌తో పాటు హిమాన్షుపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. ఇదీచదవండి..జర్నలిస్టు సౌమ్య హత్య కేసులో కోర్టు సంచలన తీర్పు -
అల్లుడు పక్కా స్కెచ్.. భార్యను ఇంటికి పంపకపోవడంతో..
రంగారెడ్డినగర్(మేడ్చల్ జిల్లా): భార్యను ఇంటికి పంపేందుకు అత్తమామలు నిరాకరించడంతో కక్ష పెంచుకున్న అల్లుడు తన స్నేహితులతో కలిసి మామను హత్య చేసి తప్పించుకుని తిరుగుతున్న నిందితులను దుండిగల్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.. పోలీసులు తెలిపిన మేరకు.. దుండిగల్ మున్సిపాలిటీ చర్చిగాగిల్లాపూర్‌కు చెందిన షేక్ నాసిర్ (31) అదే ప్రాంతానికి చెందిన రమేష్(37) కుమార్తె మహాలక్ష్మిని కిడ్నాప్ చేసి ముంబయ్‌కు తీసుకువెళ్లాడు. అనంతరం తన బంధువుల ఇంట్లో ఆమెపై లైంగిక దాడికి పాల్పడటంతో అప్పట్లో దుండిగల్ పోలీసులు అతన్ని అరెస్టు చేసి రిమాండ్‌కు పంపారు. ఈ క్రమంలో బెయిల్‌పై విడుదలైన నాసిర్ శిక్ష పడటం ఖాయమని భయపడి బాధితురాలు మహాలక్ష్మిని వివాహం చేసుకున్నాడు. అనంతరం ఇరువురు చర్చిగాగిల్లాపూర్‌లోని సర్వే నెంబరు 214లో కాపురం పెట్టారు. అయితే పెళ్లైన రెండు నెలల పాటు వీరి సంసారం సజావుగా కొనసాగింది. అనంతరం భార్యపై అనుమానం పెంచుకున్న నాసిర్ తరచూ ఆమెను హింసించడం మొదలు పెట్టాడు. దీంతో మహాలక్ష్మి తండ్రి వద్దకు వెళ్లిపోయింది. ఈ క్రమంలో భార్యను ఇంటికి పంపేందుకు నిరాకరించిన మామ రమేష్‌పై కక్షపెంచుకున్న నాసిర్ భార్యతో పాటు మామను సైతం చంపేందుకు పథకం పన్నాడు. తన స్నేహితులు కోటేశ్వరరావు(24), కంచేరి మహేందర్(22)లు మెదక్ జిల్లా గడ్డపోతారం నుండి నాలుగు కత్తులను తెచ్చుకుని హత్య చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. 2022 డిసెంబరు 16న రమేష్ ఇంటికి వచ్చిన నాసిర్ భార్య మహాలక్ష్మిని ఇంటికి పంపాలని అడగగా నిరాకరించడంతో గొడవ పడ్డాడు. చదవండి: హైదరాబాద్‌లో మహిళా టీచర్ మిస్సింగ్.. అసలేం జరిగింది? ఈ క్రమంలో చర్చిగాగిల్లాపూర్‌లోని నిర్మానుష్య ప్రాంతం నుండి వెళ్తున్న రమేష్‌పై దాడి చేసి ఛాతి, వీపు భాగాల్లో కత్తులతో దాడి చేసి పరారయ్యారు. తీవ్రంగా గాయపడిన రమేష్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్న దుండిగల్ పోలీసులకు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు శనివారం నాసిర్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతనిచ్చిన సమాచారం మేరకు మిగతా నిందితులు కోటేశ్వరరావు, కంచేరి మహేందర్లను సైతం అరెస్టు చేశారు. వారి వద్ద నుండి మూడు కత్తులు, మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు నేరాన్ని అంగీకరించడంతో రిమాండ్‌కు పంపారు. -
మహీంద్రా అండ్ మహీంద్రా మాజీ చైర్మన్ కేషుబ్ మహీంద్రా కన్నుమూత
సాక్షి,ముంబై: మహీంద్రా అండ్ మహీంద్రా ఎమెరిటస్ చైర్మన్ కేషుబ్ మహీంద్రా (99)బుధవారం కన్నుమూశారు. ఇన్‌స్పేస్ చైర్మన్ పవన్ కె గోయెంకా తన ట్విటర్ ద్వారా ఈ విషయాన్ని ధృవీకరించారు. పారిశ్రామిక ప్రపంచం నేడు అత్యంత ఉన్నతమైన వ్యక్తిని కోల్పోయింది. వ్యాపారం, ఆర్థిక శాస్త్రం, సామాజిక విషయాల్లో స్ఫూర్తిదాయకమైన వ్యక్తి అంటూ సంతాపాన్ని ప్రకటించారు. 1947లో మహీంద్రా గ్రూప్‌లో చేరిన కేషుబ్ 48 సంవత్సరాల పాటు కంపెనీకి చైర్మన్‌గా నాయకత్వం వహించారు. ప్రస్తుత ఎంఅండ్ ఎం చైర్మన్ ఆనంద్ మహీద్రకి మేనమామ కేషుబ్. తనతండ్రి స్థాపించిన మహీంద్రా గ్రూపులో 1963 నుండి 2012 వరకు ఛైర్మన్‌గా విశేష సేవలందించారు. ఆయన పదవీ విమరణ తరువాత, వారసుడిగా మేనల్లుడు ఆనంద్ మహీంద్రాను గ్రూపు చైర్మన్‌గా ఎంపికయ్యారు. (ఫోర్బ్స్ బిలియనీర్ కేషుబ్ మహీంద్రా గురించి తెలుసా? ఆనంద్ మహీంద్రకి ఏమవుతారు?) The industrial world has lost one of the tallest personalities today. Shri Keshub Mahindra had no match; the nicest person I had the privilege of knowing. I always looked forward to mtgs with him and inspired by how he connected business, economics and social matters. Om Shanti. — Pawan K Goenka (@GoenkaPk) April 12, 2023 -
వియ్యంపుడి మృతి.. కోడలిని ఓదార్చిన కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: మంత్రి కేటీఆర్ మామ హరినాథ్‌రావు గుండెపోటుతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. హరినాథ్‌రావు పార్థివదేహానికి సీఎం కేసీఆర్ నివాళులర్పించారు. తండ్రి మరణంతో శోకసంద్రంలో మునిగిపోయిన కోడలు శైలిమను కేసీఆర్ ఓదార్చారు. అనంతరం హరినాథ్‌రావు కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఎమ్మెల్సీ కవిత, ఎంపీ సంతోష్ కుమార్, మంత్రి మహముద్ అలీ, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి కూడా హరినాథ్ పార్థివదేహానికి నివాళులర్పించి, కుటుంబ సభ్యులకు సంతాపం ప్రకటించారు. కేటీఆర్‌కు పిల్లనిచ్చిన మామ పాకాల హరినాథ్‌రావు(72). గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న హరినాథ్.. గచ్చిబౌలిలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గుండెపోటుతో కన్నుమూశారు. విషయం తెలుసుకున్న కేటీఆర్, ఆయన భార్య శైలిమ, ఇతర కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆస్పత్రికి వెళ్లారు. అనంతరం హరినాథ్‌రావు మృతదేహాన్ని రాయదుర్గంలోని ఓరియన్ విల్లాస్‌లో ఉన్న ఆయన నివాసానికి తరలించారు. గురువారం సాయంత్రం హరినాథ్ అంత్యక్రియలు జరగనున్నాయి. -
కనిపెంచిన తండ్రి.. ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త.. దేవుడా ఎంత శిక్ష వేసావయ్యా
రాయవరం(కోనసీమ జిల్లా): ఒక రోడ్డు ప్రమాదం రెండు కుటుంబాల్లో తీరని శోకాన్ని మిగిల్చింది. తండ్రిని, భర్తను పోగొట్టుకున్న కుమార్తె ఒక వైపు, భర్తను, అల్లుడిని పోగొట్టుకున్న తల్లి మరొకవైపు చేస్తున్న ఆర్తనాదాలు చూపరులను కంట తడి పెట్టించాయి. రాయవరం మండలం పసలపూడి వద్ద బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో జంధ్యం సుబ్రహ్మణ్యం మృతి చెందిన విషయం పాఠకులకు విదితమే. అదే ప్రమాదంలో గాయపడిన సుబ్రహ్మణ్యం అల్లుడు మాచవరం గ్రామ వలంటీర్ విడియాల మోహన్‌గాంధీ(26) గురువారం కాకినాడ జీజీహెచ్‌లో చికిత్స పొందుతూ మృతి చెందాడు. చదవండి: స్కూల్ బస్ మిస్.. బైక్‌లో తీసుకెళ్తుండగా కనిపెంచిన తండ్రిని, ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తను దూరం చేసి దేవుడా.. ఎంత శిక్ష వేసావయ్యా అంటూ మోహన్‌గాం«ధీ భార్య విజయదుర్గా భవాని బోరున విలపిస్తుంది. ఇక తనకు దిక్కెవరు అంటూ ఆమె విలపించిన తీరు ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టించింది. ఆస్పత్రి నుంచి భర్త క్షేమంగా వస్తాడనుకున్నంతలోనే చావు కబురు వినాల్సి వచ్చిందంటూ ఆమె ఆవేదన చెందింది. ఇదిలా ఉంటే వారం రోజుల క్రితమే శస్త్ర చికిత్స చేయించుకుని ఒక పక్క భర్త సుబ్రహ్మణ్యం, మరో పక్క అల్లుడు మోహన్‌గాం«దీని కోల్పోయిన సుబ్రహ్మణ్యం భార్య వెంకటలక్ష్మి మౌనంగా రోదిస్తుంది. మృతుడు మోహన్‌గాంధీకి నిత్య, చైతన్య వర్షిణి చిన్నారులున్నారు. మోహన్‌గాంధీ తండ్రి శ్రీనివాస్ తాపీ మే్రస్తిగా పనిచేస్తూ గతేడాది భవనంపై నుంచి పడి పోవడంతో మంచానికే పరిమితమయ్యాడు. గత నెలలో శస్త్ర చికిత్స చేయించుకున్న మృతుడు మోహన్‌గాంధీ తల్లి అరుణ నడవలేని స్థితిలో ఉంది. సౌమ్యుడిగా ఉంటూ అందరితో కలుపుగోలుగా ఉండే మోహన్‌గాంధీ మరణం గ్రామంలో ప్రతి ఒక్కరినీ కలచివేసింది. రోజు వ్యవధిలో మామాఅల్లుడు మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. -
పుట్టినరోజు వేడుకలకొచ్చిన మామ ఇంట్లో అల్లుడు చోరీ
సాక్షి, సిటీబ్యూరో: పుట్టినరోజు వేడుకల కోసమని వచ్చిన మామ ఇంట్లో చోరీకి స్కెచ్ వేశాడో వ్యక్తి. స్నేహితులను ఉసిగొల్పి.. వారితో దోపిడీ చేయించాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న మీర్‌పేట పోలీసులు.. ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. డీసీపీ క్రైమ్స్ యాదగిరితో కలిసి ఎల్బీనగర్ డీసీపీ సన్‌ప్రీత్‌సింగ్ శనివారం వివరాలు వెల్లడించారు. సైదాబాద్, కుర్మగూడకు చెందిన యాసిర్ ఉల్లిఖాన్ గత నెల 31న పుట్టిన రోజు వేడుకలను నిర్వహించాడు. ఈ కార్యక్రమానికి అతడి మామ హాజరయ్యాడు. అతను ధరించిన ఖరీదైన గడియారాలు, ఆభరణాలను చూసిన యాసిర్‌కు దుర్బుద్ధి పుట్టింది. మామ ఇంట్లో దొంగతనం చేయాలని ప్లాన్ వేశాడు. ఇదే విషయాన్ని అతని స్నేహితులైన మహ్మద్ అయ్యాజ్ ఖాన్, హమ్దాన్ అశ్వాక్లకు సూచించాడు. ముగ్గురు కలిసి పథకం పన్నారు. గత నెల 31న అశ్వాక్ బురఖా ధరించి అయాజ్ ఖాన్ బైక్‌పై మీర్‌పేటలోని షరీఫ్‌నగర్‌లోని ఉల్లిఖాన్ మామ ఇంటి పరిసర ప్రాంతాల్లో రెక్కీ నిర్వహించారు. ఇంటి బయట అయాజ్ కాపు కాస్తుండగా.. అశ్వాక్ ఇంటి అద్దాలు పగలగొట్టి ఇంట్లోకి ప్రవేశించాడు. వెంట తెచ్చుకున్న స్క్రూడ్రైవర్‌తో మొదటి, రెండో అంతస్తులోని అల్వారాలను తెరిచి, అందులోని సొత్తును చోరీ చేసి పరారయ్యారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న మీర్‌పేట పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మీర్‌పేట ఠాణా పరిధిలో శనివారం తెల్లవారుజామున అనుమానాస్పదంగా సంచరిస్తున్న అశ్వాక్, అయాజ్, ఉల్లిఖాన్లను పట్టుకున్నారు. వీరి నుంచి రూ.33.02 లక్షల విలువ చేసే 36 తులాల బంగారం ఆభరణాలు, 9 ఖరీదైన చేతి గడియారాలు, 405 అమెరికన్ డాలర్లు, బైక్, సెల్‌ఫోన్, డిజిటల్ కెమెరాలను స్వా«దీనం చేసుకున్నారు. చదవండి: తెలుగు రాష్ట్రాల్లో వరుస చోరీలు.. ఘరానా దొంగ రమేష్ అరెస్టు -
విషాదం: అల్లుడి మృతి.. ఆగిన మామ గుండె
కృష్ణగిరి(కర్నూలు జిల్లా): కొంత కాలంగా అనారోగ్యంతో ఉన్న అల్లుడు మృతి చెందిన వార్త వినగానే మామ గుండె ఆగిపోయింది. ఈ విషాద ఘటన మండల కేంద్రమైన కృష్ణగిరిలో శనివారం రాత్రి చోటుచేసుకుంది. గ్రామస్తులు, కుటుంబసభ్యులు తెలిపిన వివరాల మేరకు.. వెల్దుర్తి మండలం చెరుకులపాడు గ్రామానికి చెందిన వడ్డే రాజు (40)కు కృష్ణగిరి చెందిన వడ్డే అంజినప్ప కుమార్తె అనసూయతో 20 ఏళ్ల క్రితం పెళ్లయ్యింది. పెళ్లయిన కొద్ది రోజులకే కృష్ణగిరి చేరుకుని అక్కడే పనులు చేసుకుంటూ స్థిరపడ్డారు. చదవండి: వారిద్దరి పరిచయం, ప్రేమగా మారింది.. యువతికి ఐదో నెల అని తెలియడంతో.. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న రాజు కోలుకోలేక శనివారం రాత్రి ఇంటి వద్దనే మృతి చెందాడు. పక్క వీధిలో నివాసముంటున్న రాజు మామ వడ్డే అంజినప్ప ఈ విషయం తెలుసుకున్న వెంటనే గుండెపోటుతో ప్రాణం విడిచాడు. గంట వ్యవధిలో మామ, అల్లుడు మృతి చెందడంతో ఆ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతులిద్దరూ వైఎస్సార్సీపీ కార్యకర్తలు కావడంతో విషయం తెలుసుకున్న ఎంపీపీ డాక్టర్ కంగాటి వెంకటరామిరెడ్డి ఆదివారం గ్రామానికి చెందిన మృతదేహాలపై పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఆయన వెంట నాయకులు జయరామిరెడ్డి, జింకల చిన్నన్న, అంకాలి సుంకన్న, ఎరుకలి బాల మద్దిలేటి, వడ్డే సత్యం తదితరులు ఉన్నారు. -
Hyderabad: మరో మహిళతో ఆర్ఎంపీ సహజీవనం, భార్యకు విషయం తెలియడంతో..
పెదకూరపాడు(అచ్చంపేట)పల్నాడు జిల్లా: కోడలిపై మామ, భర్త దాడిచేయగా, విషయం తెలియడంతో కోడలి బంధువులు ప్రతిదాడి చేసిన ఘటన అచ్చంపేట మండల పరిధిలోని క్రోసూరు నాలుగు రోడ్ల సెంటర్లో శనివారం ఉదయం చోటుచేసుకుంది. పోలీసులు, కుటుంబ సభ్యుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. క్రోసూరు నాలుగు రోడ్ల సెంటర్లో నివాసం ఉంటున్న రిటైర్డ్ కానిస్టేబుల్ హసన్ తన కుమారుడు జానీబాషాకు నాలుగేళ్ల క్రితం మేనకోడలు షేక్ హసీనాను ఇచ్చి వివాహం చేశారు. రెండేళ్ల పాటు వీరి కాపురం సాఫీగా సాగింది. ఈ దంపతులకు ఓ కుమారుడు ఉన్నాడు. భార్యాభర్తల మధ్య మనస్పర్థలతో హసీనా పుట్టింట్లో ఉంటోంది. ఆర్ఎంపీగా పనిచేసే భర్త జానీబాషా హైదరాబాద్‌లో మరో మహిళతో సహజీవనం సాగిస్తున్నాడు. చదవండి: ప్రేమ పేరుతో ఎస్ఐ వంచన ఈ విషయం తెలిసిన హసీనా తల్లిదండ్రులతో కలిసి భర్త ఇంటికి రావడంతో మామ హసన్ ఇంటికి తాళం వేసి వెళ్లిపోయాడు. దీంతో హసీనా అచ్చంపేట పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేయడంతో దిశ చట్టం కింద కేసు నమోదు చేసి అత్తమామలను పిలిచి కౌన్సెలింగ్ ఇచ్చారు. ఈ క్రమంలో హైదరాబాద్ నుంచి వచ్చిన జానీబాషా ఇంట్లో ఉన్న భార్యపై తండ్రి సహాయంతో దాడికి పాల్పడ్డాడు. ఈ విషయం తెలుసుకున్న హసీనా కుటుంబ సభ్యులు హసన్ ఇంటికి వచ్చి భర్త జానీబాషా, హసన్‌పై కర్రలతో దాడి చేశారు. ఈ సంఘటనలపై ఇరువర్గాల ఫిర్యాదుల మేరకు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సీహెచ్ మణికృష్ణ తెలిపారు. -
రోడ్డుపై అంకుల్ స్టెప్పులు.. మధ్యలో ట్రాఫిక్ పోలీస్ వచ్చి..
ఇంటర్నెట్ వాడకం పెరగడంతో సోషల్ మీడియా వచ్చే కొన్ని వీడియోలోని వారు రాత్రికి రాత్రే సెలబ్రిటీలు కావడం ఇటీవల షరా మామూలుగా మారింది. ఈ క్రమంలో ఎక్కడ ఏం జరిగినా అది క్షణాల్లో నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. అందులోని కొన్ని నెటిజన్లుకు వినోదాన్ని పంచుతూ వైరల్‌గా మారుతున్నాయి కూడా. సరిగ్గా అలాంటి ఓ ఫన్నీ వీడియో తాజాగా వైరల్ అవుతోంది. ఓ అంకుల్ రోడ్డుపై ట్రాఫిక్ పోలీస్తో కలసి స్టెప్పులు ఇరగదేశాడు. ఈ వీడియోను చూసి నెటిజన్లు చాలా ఎంజాయ్ చేస్తున్నారు. అందులో.. ఓ అంకుల్ రోడ్డు పైకి వచ్చి బిగ్ బీ అమితాబ్ బచ్చన్ పాపులర్ సాంగ్ అయిన ‘జాను మేరీ జాన్’పై అదిరిపోయే స్టెప్పులు వేసి అందరినీ ఆకట్టుకున్నాడు. అంతలో అక్కడే విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ పోలీసు సదరు వ్యక్తితో కాలు కదిపాడు. దీంతో అటుగా వెళ్తున్న జనం వారిద్దరి డ్యాన్స్‌ని చూస్తూ అక్కడే ఉండిపోయారు. ఈ వీడియోను ఐపీఎస్ అధికారి దీపాంశు కబ్రా తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఆ వీడియోకి క్యాప్షన్‌గా.. ‘ఫ్రెండ్లీ పోలీసింగ్‌కు అద్భుతమైన ఉదాహరణ ఇదేనంటూ రాశారు. ఈ వీడియోను చూసిన నెటిజన్లు డ్యాన్స్ షోలకి పంపిస్తే ఫైనల్స్ గ్యారెంటీ అని ఒకరు కామెంట్ చేయగా, సూపర్ డ్యాన్స్ అంకుల్ అంటూ మరోకరు కామెంట్ పెట్టారు. ऐसे पल #PublicPoliceFriendship के खूबसूरत उदहारण हैं! #DancingCop #DancingWithCop. pic.twitter.com/8Y11Nf5sOO — Dipanshu Kabra (@ipskabra) April 25, 2022 చదవండి: ఛీ ఛీ! 30 ఏళ్లుగా టాయిలెట్లో సమోసా, వాష్‌రూమ్‌లో భోజనాల తయారీ -
అల్లుడిపై కోపంతో అతడి స్నేహితుడి బైక్ దహనం
సాక్షి, బంజారాహిల్స్: అత్తమీద కోపం దుత్తమీద చూపించిందనే సామెతను తలపించిందీ ఘటన. అల్లుడి మీద కోపంతో ఆయన స్నేహితుడి బైక్‌ను దహనం చేసిన మామపై జూబ్లీహిల్స్ పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. యూసుఫ్‌గూడ సమీపంలోని ఫస్ట్ బెటాలియన్ ప్లాట్ నంబర్ 522 వద్దకు జగద్గిరిగుట్టలో ఎలక్ట్రీషియన్‌గా పనిచేసే ఎం.పాండు తన స్నేహితుడు శ్రీనివాస్‌ను కలిసేందుకు శుక్రవారం రాత్రి వచ్చాడు. ఇద్దరూ కలిసి మద్యం తాగి ఇంటి బయట ఇసుకలోనే నిద్రించారు. అదే సమయంలో శ్రీనివాస్ మామ నాగయ్య తన అల్లుడి మీద కోపంతో స్నేహితుడు పాండు అక్కడ పార్కింగ్ చేసిన బైక్‌ను పెట్రోల్ పోసి దహనం చేశాడు. ఒక్కసారిగా మంటలు అంటుకొని శబ్దాలు రావడంతో మెలకువ వచ్చిన పాండు అక్కడికి వెళ్లి చూడగా బైక్ మంటలో కాలిపోతోంది. అక్కడి నుంచి నాగయ్య వస్తూ కనిపించాడు. తన బైక్‌ను కాల్చివేసిన నాగయ్యపై చర్యలు తీసుకోవాలంటూ బాధితుడు శనివారం రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. (చదవండి: ఢిల్లీ జేఎన్‌యూలో విద్యార్థి సంఘాల ఘర్షణ) -
బంధువుతో వివాహేతర సంబంధం.. బాలుడు చూశాడని..
కలికిరి(చిత్తూరు జిల్లా): వివాహేతర సంబంధం చూడడంతో ఓ బాలుడిని సొంత చిన్నాన్నే ఉరేసి చంపిన ఘటన అద్దవారిపల్లిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలివీ.. మండలంలోని అద్దవారిపల్లికి చెందిన కె.రవి, తులసి దంపతుల కుమారుడు ఉదయ్ కిరణ్ (8) ఈ నెల 11న శుక్రవారం సాయంత్రం 4 గంటల నుంచి కనిపించకపోవడంతో 12వ తేదీన తల్లి కలికిరి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే అదేరోజు సాయంత్రం బాలుడు అద్దవారిపల్లి సమీపంలో చెట్టుకు వేలాడుతూ కనిపించాడు. జిల్లా ఎస్పీ, ఇన్చార్జ్ డీఐజీ సెంథిల్‌కుమార్, జిల్లా సెబ్ జాయింట్ డైరెక్టర్ విద్యాసాగర్‌నాయుడు ఘటనా స్థలాన్ని పరిశీలించి మిస్టరీగా మారిన బాలుడి హత్య కేసును త్వరితగతిన ఛేదించాలని ఆదేశించారు. చదవండి: అమ్మాయిలను రప్పించి.. లాడ్జీ రూంలో గుట్టుగా వ్యభిచారం.. మదనపల్లి డీఎస్పీ రవిమనోహరాచారి ఆదేశాల మేరకు సీఐ నాగార్జున రెడ్డి మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ఎట్టకేలకు హత్యకేసు చిక్కుముడి విప్పారు. 11న సాయంత్రం బాలుడు ఉదయ్‌కిరణ్ తనకు స్వయానా చిన్నాన్న కె.సహదేవ, సమీప బంధువు రాజేశ్వరితో వివాహేతర సంబంధం కొనసాగించడాన్ని చూశాడు. విషయం బయటకు చెప్తాడనే భయంతో ఇద్దరూ కలిసి ఉదయ్‌కిరణ్ మర్మాంగాలపై కొట్టి చంపేశారు. ఉరేసుకుని చనిపోయినట్లుగా నమ్మించడానికి అర్ధరాత్రి శవాన్ని గ్రామ సమీపంలోని చెట్టుకు టవల్‌తో వేలాడదీశారు. ఈ మేరకు నిందితులు సహదేవ, రాజేశ్వరిలను అరెస్టు చేశారు. కేసు వివరాలను మదనపల్లి డీఎస్పీ మీడియాకు వెల్లడించారు. కేసును ఛేదించడంలో ప్రతిభ చూపిన కలకడ ఎస్ఐ రవిప్రకా‹Ùరెడ్డి, వాయల్పాడు ఎస్ఐ బిందుమాధవి, కేవీపల్లి ఎస్ఐ బాలక్రిష్ణ, కలికిరి ఏఎస్ఐ మధుసూదనాచారిని జిల్లా ఎస్పీ అభినందించారు. -
కోరిక తీర్చడం లేదని కోడలిని చంపిన మామ
కురవి: లైంగిక కోరిక తీర్చాలని మూడేళ్లుగా వెంటపడుతున్నా ఆమె తిరస్కరిస్తుండటంతో కక్ష పెంచుకుని కోడలి గొంతు కోసి దారుణంగా హత్య చేశాడు ఓ మామ. ఆ తరువాత నేరుగా వెళ్లి పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయాడు. మహబూబాబాద్ జిల్లా కురవి మండల కేంద్రం శివారులోని సోమ్లాతండాలో బుధవారం ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. కురవి మండలంలోని జుజూర్ తండాకు చెందిన బోడ చంద్రు కుమార్తె రజిత (30)ను 12 సంవత్సరాల క్రితం సోమ్లాతండాకు చెందిన భూక్యా హచ్చ కుమారుడైన సంతోష్‌కు ఇచ్చి పెళ్లి చేశారు. వీరికి ఇద్దరు కుమార్తెలు. ఇద్దరూ ముత్యాలమ్మగూడెంలోని గురుకులంలో చదువు కుంటున్నారు. ఈ క్రమంలోనే 63 ఏళ్ల వయసు ఉన్న మామ భూక్యా హచ్చా.. కోడలు రజితను తన కోరిక తీర్చాలని మూడేళ్లుగా వెంట పడుతున్నాడు. ఈ విషయాన్ని రజిత తన తల్లి దండ్రులతో చెప్పగా వారు పలుమార్లు హచ్చను మందలించారు. ఈ నేపథ్యంలో రజితపై కక్ష పెంచుకున్న హచ్చ, ఉదయం 10.30 గంటల ప్రాంతంలో ఇంట్లో ఒంటరిగా ఉన్న రజిత తలపై రేంజ్స్పానర్(అడ్జస్ట్మెంట్స్పానర్)తో గట్టిగా బాదాడు. ఆ తరువాత కత్తితో గొంతు కోసి, కడుపులో పొడిచి తీవ్రంగా గాయపరిచాడు. ఆమె చనిపోయిందని నిర్ధారిం చుకున్న తరువాత నేరుగా పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. కోడలిని తనే చంపినట్లు హచ్చ పోలీసులకు చెప్పి నట్లు తెలిసింది. మృతు రాలి తండ్రి చంద్రు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ రాణా ప్రతాప్ తెలిపారు. కాగా, హత్య సమయంలో రజిత భర్త కూలి పనికి వెళ్లినట్లు తండా వాసులు తెలిపారు. తండాలో తీవ్ర ఉద్రిక్తత.. రజిత హత్య విషయం తెలుసుకున్న బంధువులు ఆగ్రహంతో సోమ్లాతండాకు వచ్చారు. ఇంటి వద్ద నిందితుడు హచ్చ లేకపోవడం, అల్లుడు కూడా లేకపోవడంతో కోపోద్రిక్తులై ఇంటిని ధ్వంసం చేసేందుకు ప్రయత్నించారు. కురవి ఎస్సై రాణాప్రతాప్, రూరల్ సీఐ రవికుమార్‌లు వారిని శాంతింపజేసే ప్రయత్నం చేశారు. మృతదేహాన్ని తరలించడానికి వారు అంగీకరించలేదు. భూక్యా హచ్చ, మృతురాలి భర్తను తీసుకొస్తేనే మృతదేహాన్ని తీసుకెళ్లనిస్తామని పోలీసులతో వాదనకు దిగారు. ఈ క్రమంలో పోలీసులు మృతదేహాన్ని బలవం తంగా ట్రాక్టర్లో వేసి పోస్టుమార్టం నిమిత్తం మానుకోటకు తరలించారు. గడ్డివాములు దహనం.. పోలీసులు బలవంతంగా రజిత మృతదేహాన్ని తీసుకెళ్లడంతో ఆమె బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో మృతురాలి సోదరి ఒకరు హచ్చకు చెందిన గడ్డివాములకు నిప్పుపెట్టింది. మంటలు చెలరేగడంతో సీరోలు ఎస్సై సంతోష్‌రావు మంటలను ఆర్పేయత్నం చేసినా ఫలితంలేకుండా పోయింది. అగ్నిమాపక వాహనం వచ్చేసరికి మొత్తం కాలిపోయింది. పరిస్థితి ఉద్రిక్తంగా ఉండడంతో తండాలో పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు. -
చిన్నారిని కిడ్నాప్ చేయించిన మేనమామ
సాక్షి, రాయచూరు (కర్ణాటక): డబ్బు కోసం ఏడేళ్ల వయసున్న మేనకోడలిని కిడ్నాప్ చేయించిన మామ కటకటాల పాలయ్యాడు. వివరాలు..బాగల్కోటె నవనగరలో సునీత అనే మహిళ నివాసం ఉంటోంది. ఆమెకు ఓం అనే కుమారుడు, కృతికా బాడగండి(7) అనే కుమార్తె ఉంది. అన్నతో కలిసి బుధవారం రాత్రి ట్యూషన్ నుంచి ఇంటికి కాలినడకన వస్తుండగా కారులో వచ్చిన మేనమామ గద్దెనగిరి, మరో ముగ్గురు దుండగులు అడ్డుకున్నారు. బాలికను కారులోకి ఎక్కిస్తుండగా తన చెల్లిని వదిలేయాలని అన్న ఓం దుండగుల కాళ్లు పట్టుకొని వేడుకున్నాడు. దుండగులు బాలుడిని తోసేసి బాలికను వెంట తీసుకెళ్లి రూ.50 లక్షలు ఇవ్వాలని బాధితురాలి తల్లి సునీతకు ఫోన్ చేశారు. ఆమె నవనగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు గాలిస్తున్నట్లు తెలియడంతో దుండగులు ఆ బాలికను ఇంటి వద్ద వదిలేసి ఉడాయించారు. పోలీసులు బాలిక మేనమామను అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టగా జూదం కోసం అవసరమైన డబ్బు కోసం కిడ్నాప్ చేయించినట్లు అంగీకరించడంతో అరెస్ట్ చేశారు. చదవండి: నటుడి పేరుతో ఫేస్బుక్లో నగదు మోసం -
కొత్తగూడెం: మేనకోడళ్లపై మామ లైంగిక దాడి..
సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం: మేనకోడళ్లపై మామ లైంగిక దాడికి పాల్పడిన ఘటన తాజాగా జిల్లాలో వెలుగు చూసింది. వివారల్లోకి వెళితే.. 12 ఏళ్ల క్రితం తల్లిదండ్రులను కోల్పోయిన ఇద్దరు కవల బాలికలకు అండగా ఉంటానని మేనమామ మల్రెడ్డి కృష్ణారెడ్డి చేరదీశాడు. అయితే చిన్నారులను చేరదీసిన మేనమామ కామాంధుడిగా మారి వారిపై లైంగిక దాడికి పాల్పడుతున్నాడు. చిన్నతనం నుంచి ఈ ఘోరం జరుగుతుండటంతో ఏం చేయాలో తోచక బాధను దిగమింగుకొని భరిస్తూ వచ్చారు. ప్రస్తుతం ఈ ఇద్దరు అక్కాచెల్లెలు.. కొత్తగూడెం పట్టణంలోని ఓ కళాశాలలో విద్యానభ్యసిస్తున్నారు. అయితే ఇటీవల మేనమామ వేధింపులు భరించలేక అక్కాచెల్లెళ్లిద్దరూ ఎదురు తిరిగారు. దీంతో తనపై ఎదురుతిరిగిన కవలలపై మేనమామ కృష్ణారెడ్డి చేయి చేసుకున్నాడు. విషయం బయటకు చెప్తే ఆస్తి మొత్తం తీసుకుని చంపేస్తానని బెదిరింపులకు గురిచేశాడు. దీంతో తమను కామాంధుడి చెర నుంచి రక్షించాలని అక్కాచెల్లెళ్లు కొత్తగూడెం ఎస్పీకి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. చదవండి: జంట హత్యల కలకలం: చెల్లిని చంపిందని తల్లిని హత్య చేసిన కొడుకు.. -
మామను నరికిచంపిన అల్లుడు
మైలవరం(కృష్టా జిల్లా): మామను హత్య చేసి, భార్య, అత్త, మరదలిపై హత్యాయత్నం చేసిన నిందితుడు వీర్ల రాంబాబును అరెస్టు చేసినట్లు నూజివీడు డీఎస్పీ బి. శ్రీనివాసులు తెలిపారు. మైలవరం పోలీస్ స్టేషన్లో మంగళవారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో డీఎస్పీ శ్రీనివాసులు మాట్లాడుతూ వీర్ల రాంబాబు నాలుగేళ్ల క్రితం మైలవరం మండలం వెదురుబీడెం గ్రామానికి చెందిన కొలుసు కొండలరావు రెండో కుమార్తె ధనలక్ష్మిని వివాహం చేసుకున్నాడు. వివాహ సమయంలో కట్నంగా రూ.2.50లక్షలు నగదు, కుంట మామిడి తోట, ఒక కాసు బంగారపు ఉంగరం ఇచ్చారు. ఈ దంపతులకు ఒక పాప, బాబు ఉన్నారు. నిందితుడు రాంబాబు తాగుడు, ఇతర చెడు వ్యసనాలకు బానిసై తరచూ కట్నంగా ఇచ్చిన మామిడి తోట అమ్మి డబ్బు తేవాలని, లేకుంటే చంపి వేరే పెళ్లి చేసుకుంటానని తన భార్యను పలుసార్లు తీవ్రంగా కొట్టాడు. పిల్లల కోసం భార్య ధనలక్ష్మి మామిడి తోట అమ్మేందుకు వ్యతిరేకించింది. రెండు రోజుల క్రితం నిందితుడు తన భార్యను తీవ్రంగా కొట్టి పొలం అమ్మకపోతే అందర్నీ చంపుతానని బెదిరించాడు. దీంతో బాధితురాలు పిల్లల్ని తీసుకుని పుట్టింటికి వెదురుబీడెం వచ్చి విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పడంతో వారు పెద్దలతో మాట్లాడి సెటిల్ చేద్దామన్నారు. అందరూ నిద్రపోతున్న సమయంలో.. సోమవారం రాత్రి అందరూ పడుకున్న తర్వాత నిందితుడు గొట్టం కత్తితో మామ కొండలరావును విచక్షణా రహితంగా నరకడంతో అతను మృతి చెందాడు. అనంతరం భార్య, అత్త, మరదలిపై కూడా దాడి చేయడంతో వారు గాయాలపాలయ్యారు. భయంతో వారు కేకలు వేయడంతో ఇరుగుపొరుగు వారు రావడం గమనించి పరారయ్యాడు. స్థానికులు క్షతగాత్రులను స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి వైద్య చికిత్సలందించారు. వెదురుబీడెంలో జరిగిన సంఘటనపై జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ ఆరా తీసి, మైలవరం సీఐ పి.శ్రీను ఆధ్వర్యంలో మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నిందితుడి ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. రంగంలోకి దిగిన ప్రత్యేక బృందాలు మంగళవారం నిందితుడిని గన్నవరం మండలం తెంపల్లి గ్రామంలోని పోలవరం కాలువ వద్ద అరెస్టు చేశారు. నిందితుని నుంచి గొట్టం కత్తి, రక్తం అంటిన దుస్తులు సేకరించినట్లు తెలిపారు. నిందితుని అరెస్టు చేసిన సీఐ, ఎస్ఐలు, సిబ్బందిని ఎస్పీ అభినందించి రివార్డుకు సిఫారసు చేసినట్లు నూజివీడు డీఎస్పీ శ్రీనివాసులు తెలిపారు. -
మిస్టరీ వీడింది.. మద్యం మత్తులో సొంత మేనల్లుడే..
సాక్షి, వీరఘట్టం(శ్రీకాకుళం): మద్యం మత్తు నిండు ప్రాణాన్ని బలికొంది. సొంత మేనమామను హత్య చేసేలా మేనల్లుడిని ఉసిగొల్పింది. ఇద్దరి మధ్య జరిగిన చిన్న తగాదా ప్రాణం తీసేస్థాయికి చేరింది. కర్రతో కొట్టి ఆపై పంట పొలంలోకి ఈడ్చుకువెళ్లి తలను బురదలోకి తొక్కేసి హత్య చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. వీరఘట్టం మండలంలోని సీఎస్పీ రహదారిలో చిట్టపులివలస జంక్షన్–విక్రమపురం గ్రామాల మధ్య పొలాల్లో ఈ నెల 23న దొరికిన గుర్తు తెలి యని వ్యక్తి మృతదేహం వెనుక మిస్టరీ వీడింది. బుధవారం పాలకొండ డీఎస్పీ ఎం.శ్రావణి, సీఐ జి.శంకరరావులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు అనంతరం కేసు వివరాలను వెల్లడించారు. విజయనగరం జిల్లా సీతానగరం మండలం ల చ్చయ్యపేట గ్రామానికి చెందిన ఎలక్ట్రీషియన్ బత్తు ల పోలినాయుడు(38), వీరఘట్టం మండలం విక్ర మపురం గ్రామానికి చెందిన అతని మేనల్లుడు(మైనర్) రేగిడి మండలం ఉంగరాడమెట్ట వద్ద బంధు వుల ఇంటిలో జరిగిన పెళ్లికి ఈ నెల 22న వెళ్లారు. అక్కడి నుంచి అదే రోజు రాత్రి బయల్దేరి వీరఘట్టంలో దిగి మందు తాగారు. అర్ధరాత్రి 12 గంటల సమయంలో నడుచుకుంటూ విక్రమపురం గ్రామానికి బయల్దేరారు. దారిలో ఇద్దరి మధ్య జరిగిన చి న్న గొడవ కొట్లాటకు దారి తీసింది. దీంతో మేన ల్లుడు అతడి మామ పోలినాయుడును కర్రతో బ లంగా కొట్టి, ఆపై పక్కనే ఉన్న పంట పొలంలో తలను తొక్కేయడంతో చనిపోయాడని పోలీసులు తెలిపారు. మద్యం మత్తులోనే ఈ హత్య జరిగింద ని, వీరిద్దరి మధ్య పాత కక్షలు లాంటివి ఏవీ లేవని పేర్కొన్నారు. హంతకుడిని అదుపులోకి తీసుకున్నామని, విశాఖపట్నం బాల నేరస్తుల కేంద్రానికి అప్ప గిస్తామని డీఎస్పీ శ్రావణి తెలిపారు. ] చదవండి: Work From Home: తెగ నవ్వులు తెప్పిస్తున్న వర్క్ ఫ్రమ్ హోమ్ ఫొటో -
బావా బావమరుదుల కొట్లాట.. మధ్యలో వచ్చిన మామ హతం
చిలకలూరిపేట(గుంటూరు జిల్లా): స్థల వివాదం నేపథ్యంలో అల్లుడి చేతిలో మామ హతమైన ఘటన సోమవారం రాత్రి జరిగింది. అర్బన్ సీఐ షేక్ బిలాలుద్దీన్ కథనం ప్రకారం పట్టణంలోని వైఎస్సార్ కాలనీకి చెందిన షేక్ సుభాని బైక్ మెకానిక్. అతను తనకు పిల్లనిచ్చిన మామ షేక్ సుభాని(68) ఇంటి సమీపంలో ఖాళీ స్థలం కొన్నాడు. సెంట్‌మెంటు ప్రకారం ఇది సరికాదని సుభాని బావమరిది షేక్ జానీబాషా వ్యతిరేకించాడు. ఈ క్రమంలో సోమవారం సుభాని స్థలాన్ని శుభ్రం చేయించాడు. దీంతో రాత్రి 11 గంటల సమయంలో బావా బావమరుదులు కొట్లాటకు దిగారు. వీరిద్దరినీ విడదీసే క్రమంలో మామ సుభాని అడ్డువెళ్లాడు. దీంతో మామపై అల్లుడు కత్తితో దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన మామ సుభాని అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనలో బావా బావమరుదులైన సుభాని, జానీబాషా కూడా గాయపడ్డారు. సమాచారం అందుకున్న 108 సిబ్బంది క్షతగాత్రులకు స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స చేయించి మెరుగైన చికిత్స కోసం గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు. సుభాని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చిలకలూరిపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
అత్తామామల చేతిలో అల్లుడు హతం
తాడేపల్లి రూరల్(గుంటూరు జిల్లా): మండల పరిధిలోని నులకపేటలో బుధవారం అర్ధరాత్రి దారుణం చోటుచేసుకుంది. మద్యానికి బానిసైన ఓ భర్త భార్యను చితకబాది, రోడ్డుమీదకు లాక్కొచ్చి వివస్త్రను చేసి కిలోమీటరు దూరంలో ఉన్న అత్తమామ ఇంటివరకు లాక్కెళ్లాడు. అది తట్టుకోలేని అత్త మామలు అల్లుడిపై దాడి చేయడంతో మృతి చెందాడు. ఈ ఘటనపై తాడేపల్లి పోలీసులు గురువారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. విజయవాడ రామవరప్పాడుకు చెందిన కృష్ణ–రోహిణి దంపతుల పెద్ద కుమారుడైన కడలూరి నరేష్ (31)కు నులకపేటకు చెందిన దుర్గారావు–కమల దంపతుల పెద్దకుమార్తె లావణ్యతో వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు. నరేష్ పెళ్లయిన రెండేళ్ల తర్వాత లావణ్య తల్లితో అసహ్యంగా ప్రవర్తించాడు. దీంతో బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నరేష్‌ను అరెస్ట్ చేశారు. ఆ కేసులో మూడేళ్లు జైలు శిక్ష పడింది. అనంతరం 2017లో మరోసారి అదేవిధంగా ప్రవర్తించడంతో తాడేపల్లి పోలీస్‌స్టేషన్‌లో రెండవ కేసు నమోదై కోర్టులో విచారణ కొనసాగుతోంది. ఈ క్రమంలోనే భార్యను హింసిస్తూ అత్తమామల చేతిలో హతమయ్యాడు. సీఐ శేషగిరిరావు ఘటనా స్థలానికి వచ్చి పరిశీలించారు. నరేష్‌కు విజయవాడలోని బ్లేడ్‌బ్యాచ్‌తో సంబంధాలు ఉన్నట్లు సమాచారం. నగర బహిష్కరణకు గురైన సందీప్ అలియాస్ పెద్ద బాండ్ అనుచరుడిగా తిరుగుతున్నాడు. పెద్దబాండ్‌ను నగర బహిష్కరణ చేసిన తరువాత నులకపేట ప్రాంతంలోకి తీసుకువచ్చి ఇల్లు ఇప్పించింది కూడా నరేషే అని స్థానికులు చెబుతున్నారు. చదవండి: ఏపీ: కర్ఫ్యూ వేళల సడలింపు మావోయిస్టుల మృతదేహాలను14 కి.మీ. మోసుకుంటూ.. -
దారుణం: మూడేళ్ల చిన్నారి గొంతు కోసిన మేనమామ
సాక్షి, విజయనగరం: గుమ్మలక్ష్మీపురం మండలం పెంగవలో దారుణం చోటుచేసుకుంది. మూడేళ్ల చిన్నారిని మేనమామ గొంతు కోసి హత్య చేశాడు. గత అర్ధరాత్రి మూడేళ్ల చిన్నారి కిల్లక భవ్యశ్రీ నిద్రిస్తున్న సమయంలో మేనమామ వినోద్ కత్తితో గొంతుకోసి పరారయ్యాడు. మతి స్థిమితం సరిగా లేకపోవడంతో ఈ దారుణానికి పాల్పడినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. నిందితుడు వినోద్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. చదవండి: మాయమాటలతో బాలికను లొంగదీసుకుని.. స్థల వివాదం; వెంటాడి.. వివస్త్రను చేసి.. -
వివాహేతర సంబంధమే ప్రాణం తీసింది..
ఉరవకొండ(అనంతపురం జిల్లా): కళ్యాణదుర్గం మండలం గోళ్ల గ్రామానికి చెందిన వన్నూరుస్వామి(27) హత్య కేసు మిస్టరీని పోలీసులు 24 గంటల్లోనే ఛేదించారు. వివాహేతర సంబంధం నేపథ్యంలో అతని మామే తలపై కట్టెతో బాది హతమార్చినట్లు పోలీసులు తెలిపారు. శుక్రవారం ఉరవకొండ పోలీసు సర్కిల్ కార్యాలయంలో సీఐ వెంకటేశ్వర్లు, ఎస్ఐ రమేష్‌రెడ్డి హత్య కేసు వివరాలను మీడియాకు వెల్లడించారు. ఉరవకొండ మండలం రాకెట్ల గ్రామానికి చెందిన ఎర్రిస్వామి తన కుమార్తెను కళ్యాణదుర్గం మండలం గొళ్ల గ్రామానికి చెందిన వన్నూర్‌స్వామికిచ్చి పెళ్లిచేశాడు. కొన్నిరోజుల్లోనే వన్నూర్‌స్వామి ఓ మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. విషయం తెలుసుకున్న మామ ఎర్రిస్వామి పద్ధతి మార్చుకోవాలని ఎన్నో సార్లు అల్లుడిని మందలించాడు. అయినా అతని ప్రవర్తనలో మార్పు రాలేదు. ఈ క్రమంలోనే ఎర్రిస్వామి తన అల్లుడు వన్నూరుస్వామిని వెంటబెట్టుకుని ఈనెల 28న బెళుగుప్ప మండలం దుద్దేకుంట గ్రామంలో జరిగిన ఓ వివాహానికి వెళ్లాడు. అయితే తన స్వగ్రామం వెళ్తానని చెప్పిన వన్నూర్‌స్వామి నేరుగా రాకెట్లకు వెళ్లాడు. విషయం తెలుసుకున్న ఎర్రిస్వామి అల్లుడిని ఎలాగైనా హతమార్చాలనుకున్నాడు. 29వ తేదీ తెల్లవారుజామున వై.రాంపురం గ్రామ సమీపంలో కాపుకాశాడు. రాకెట్ల నుంచి ద్విచక్రవాహనంలో వస్తున్న అల్లుడి తలమీద కట్టెతో తీవ్రంగా కొట్టి హతమార్చి పరారయ్యాడు. దీనిపై వన్నూర్‌స్వామి తండ్రి దుర్గన్న ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. మృతుని తండ్రి అనుమానం మేరకు ఎర్రిస్వామిని అదుపులోనికి తీసుకుని విచారించగా వన్నూర్‌స్వామిని తానే హత్య చేసినట్లు ఒప్పుకోగా అతన్ని అరెస్ట్ చేశామని సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు. చదవండి: కష్టాల కడలి: రాత మార్చిన ‘గీత’ నకిలీ సాబ్! -
మామ చేతిలో మేనల్లుడి హతం
పెందుర్తి(విశాఖపట్నం): తాగిన మత్తులో కుమారుడితో కలిసి మేనల్లుడినే (వరసకు అల్లుడు) మట్టుబెట్టాడు ఓ వ్యక్తి. పెందుర్తి సమీపం చినముషిడివాడలో గురువారం అర్ధరాత్రి చోటుచేసుకున్న ఈ ఘటన ఈ ప్రాంతంలో కలకలం రేపింది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. కంచరపాలెం ప్రాంతానికి చెందిన కొత్తపల్లి చిన్నా(25) చినముషిడివాడ పాతూరులో నివాసం ఉంటున్న యమునని ఐదేళ్ల కిందట వివాహం చేసుకున్నాడు. వృత్తిరీత్యా పెయింటర్ అయిన చిన్నా పనుల కోసం చినముషిడివాడ అత్తవారింటికి వచ్చేశాడు. కాగా.. గురువారం చిన్నా భార్య యమున పుట్టిన రోజు కావడంతో రాత్రి ఇంటి వద్ద వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకల్లో చిన్నాతో పాటు మామ కొల్లిపత్తి శంకర్, బావమరిది అశోక్ పూటుగా మద్యం సేవించారు. వీరి మధ్య పాత గొడవలు ఉండడంతో మాటామాటా పెరిగింది. ఈ క్రమంలో శంకర్, అశోక్ కలిసి చిన్నా తలపై ఇనుపరాడ్‌తో బలంగా కొట్టారు. దీంతో చిన్నా కుప్పుకూలిపోయి అక్కడిడిక్కడే ప్రాణాలు కోల్పోయాడు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు నిందితులను అదుపులోనికి తీసుకున్నారు. చిన్నా మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. సీఐ అశోక్‌కుమార్ ఆధ్వర్యంలో కేసు దర్యాప్తు జరుగుతోంది. హత్యకు కారణం అదేనా.? అశోక్, యమున మధ్య అసహజ బంధం ఉన్నట్లు చిన్నా అనుమానించడమే హత్యకు కారణంగా తెలుస్తోంది. మృతుడు చిన్నా భార్య యమున తల్లి తులసి 18 ఏళ్ల కిందట భర్తతో విడిపోయింది. అప్పటి నుంచి శంకర్‌తో సహజీవనం చేస్తోంది. ఈ నేపథ్యంలో శంకర్ తన మేనల్లుడు అయిన చిన్నాకు తులసి కుమార్తె యమునకు పెళ్లి జరిపించాడు. వీరితో పాటే శంకర్ మొదటి భార్య కుమారుడు అశోక్ ఒకే ఇంట్లోని వేర్వేరు పోర్షన్లో ఉంటున్నాడు. శంకర్ మొదటి భార్య అతన్ని విడిచిపెట్టి వెళ్లిపోయింది. ఈ క్రమంలో వరసకు సోదరి అయ్యే యమునతో అశోక్‌కు అసహజ బంధం ఉన్నట్లు చిన్నా తరచూ అనుమానించేవాడని పోలీసుల విచారణలో తేలింది. దీంతో నిత్యం గొడవలు జరిగేవి. అలా గురువారం రాత్రి కూడా మద్యం మత్తులో మాటామాటా పెరిగి చిన్నా హత్యకు దారితీసిందని పోలీసులు భావిస్తున్నారు. దీంతోపాటు ఇతరత్రా కోణాల్లో కేసును విచారిస్తున్నారు. చదవండి: భర్త చేష్టలతో విసుగుచెంది... బిడ్డల గొంతునులిమి చంపేశా.. నన్నెందుకు బతికించారు -
నిండు గర్భిణిని కాళ్లతో తొక్కి చంపేశారు..
దర్శి టౌన్(ప్రకాశం జిల్లా): పిల్లనిచ్చే వారు లేక కులాంతర వివాహం చేసుకున్నాడు. భార్యపై అనుమానం పెంచుకొని గొంతు నులిమి హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించాడు. ముండ్లమూరు మండలం ఉల్లగల్లులో ఈ నెల 21న గర్భిణి అనుమానాస్పద కేసులో భర్త, మామలను నిందితులుగా తేల్చి పోలీసులు అరెస్టు చేసి కటకటాల వెనక్కి పంపారు. కేసు పూర్వాపరాలను దర్శి డీఎస్పీ ప్రకాశరావు గురువారం విలేకరుల సమావేశంలో వివరించారు. ఉల్లగల్లు గ్రామానికి చెందిన కొండవీటి గురులింగం కుమారుడు శ్రీనివాసరావు..చిలకలూరి పేటకు చెందిన తన్నీరు వెంకాయమ్మ కుమార్తె శైలజను నాలుగేళ్ల క్రితం కులాంతర వివాహం చేసుకున్నాడు. వారికి మూడేళ్ల బాబు ఉన్నాడు. ప్రస్తుతం శైలజ మూడు నెలల గర్భిణి. ఈ క్రమంలో నెల రోజులు క్రితం శ్రీనివాసరావు పొలం నుంచి ఇంటికి వచ్చే సమయంలో అదే గ్రామానికి చెందిన ఒక యువకుడు శ్రీనివాసరావు నివాసంలో నుంచి పారిపోవడం గమనించాడు. నాటి నుంచి భార్యపై అనుమానం పెంచుకున్న భర్త ఆమెను చిత్ర హింసలకు గురిచేస్తూ ఉండటంతో ఈ నెల 16న పెద్దల సమక్షంలో భార్య భర్తలకు సర్ది చెప్పారు. అయితే అకస్మాత్తుగా ఈనెల 21న శైలజ పశువుల పాకలో శవమై కనిపించింది. తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి ఆమె శరీరంపై ఉన్న గాయాలు, పోస్టుమార్టం రిపోర్టు ఆధారంగా విచారించారు. భర్త శ్రీనివాసరావు తహసీల్దార్ ఎదుట లొంగిపోయి నేరాన్ని ఒప్పుకున్నట్లు డీఎస్పీ తెలిపారు. తన భార్య అక్రమ సంబంధం కారణంగా గ్రామంలో తమ పరువు పోతుందని భావించి నిద్రపోతున్న సమయంలో కాలుతో తొక్కి చంపి ఆత్మహత్యగా చిత్రీకరించినట్లు నిందితుడు నేరాన్ని అంగీకరించినట్లు డీఎస్పీ వివరించారు. కేసు దర్యాప్తులో ప్రతిభ చాటిన వారిని డీఎస్పీ అభినందించారు. చదవండి: ఎందుకిలా చేశావు తల్లీ... ! దారుణం: అమ్మానాన్నలే అమ్మేశారు.. -
దారుణం: మామ గొంతు కోసిన అల్లుడు
చిట్టినగర్ (విజయవాడ పశ్చిమ): కుటుంబ కలహాల నేపథ్యంలో మామ గొంతు కోసి హత్య చేసిన ఘటన విజయవాడ నగరంలోని కొత్తపేట పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న వెస్ట్ ఏసీపీ హనుమంతరావు, కొత్తపేట సీఐ ఎండీ ఉమర్ హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతుడి భార్య, కుమార్తెల నుంచి వివరాలను అడిగి తెలుసుకుని కేసు నమోదు చేశారు. సేకరించిన వివరాల ప్రకారం.. కొత్తపేట గున్నాబత్తుల అచ్చయ్యవీధిలో చింతపల్లి సాంబశివరావు(70), పార్వతి దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి కుమార్తె, ఇద్దరు మగ సంతానం. కుమార్తె సావిత్రి, అల్లుడు కేళ్ల ప్రభాకర్‌లు ఊర్మిళానగర్‌లో నివాసం ఉంటున్నారు. ప్రభాకర్ పెళ్లికి ముందు రైల్వేలో ఉద్యోగం చేసేవాడు. మద్యం తాగి డ్యూటీ చేస్తుండటంతో ఉద్యోగం నుంచి తొలగించారు. పెళ్లి తర్వాత ఓ ఏడాది దుబాయ్ కూడా వెళ్లి వచ్చాడు. అయితే ప్రస్తుతం ఇంటి వద్దే ఖాళీగా ఉంటున్నాడు. ప్రభాకర్ భార్య సావిత్రితో తరుచూ గొడవ పడుతూ ఉండేవాడు. రెండు నెలల కిందట ఇదే రీతిలో గొడవ పడటంతో సావిత్రి కొత్తపేటలోని తల్లిదండ్రుల దగ్గరకు వచ్చేసింది. భార్యను తనతోపాటు పంపాలని ప్రభాకర్ అత్తమామలతో తరుచూ గొడవ పడుతూ ఉంటాడు. భర్త ప్రవర్తన సరిగా లేకపోవడంతో తాను కాపురానికి వెళ్లనని సావిత్రి తెగేసి చెప్పింది. కొద్ది రోజుల కిందట సావిత్రికి రోడ్డు ప్రమాదం జరగడంతో కాలికి గాయమైంది. బుధవారం కాలికి ఉన్న కట్టు విప్పించుకునేందుకు ఆస్పత్రికి వెళ్లడంతో ఇంట్లో అత్తమామలిద్దరే ఉన్నారు. అదే సమయంలో ఇంటికి వచ్చిన ప్రభాకర్ అత్తమామలతో గొడవ పడ్డాడు. ఈ క్రమంలో ప్రభాకర్ తనతోపాటు తెచ్చుకున్న చాకుతో మామ గొంతు కోయడంతో తీవ్ర రక్తస్రావం అయ్యింది. సాంబశివరావు ఇంటి గుమ్మం వద్ద పెద్ద శబ్దంతో పడటంతో లోపల ఉన్న అత్త పార్వతి బయటకు వచ్చి చూసే సరికి ప్రాణాలను వదిలేశాడు. ఆమె గట్టిగా కేకలు వేయడంతో చుట్టు పక్కల వారు చేరుకుని నిందితుడిని పట్టుకునే ప్రయత్నం చేయగా వారి నుంచి తప్పించుకుని పరారయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు వివరాలను నమోదు చేసుకున్నారు. కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. చదవండి: ఇవేం పాడు పనులు.. కానిస్టేబుల్‌కు దేహశుద్ధి అనంతలో అమానుషం: టీడీపీకి ఓటు వేయలేదని.. -
రసవత్తర పోరు: మామా అల్లుళ్ల సవాల్
కర్నూలు జిల్లా: పల్లె పోరు ఆసక్తికరంగా మారుతోంది. కొన్ని గ్రామాల్లో సొంత కుటుంబీకులే బరిలో నిలుస్తుండటంతో రసవత్తరంగా ఉంది. ఎం.అగ్రహారం గ్రామంలో సర్పంచ్ స్థానానికి మేనమామ (భార్య తండ్రి)తో అల్లుడు తలపడుతున్నాడు. బీసీ జనరల్‌కు రిజర్వేషన్ కావడంతో ఇరువర్గాలు ప్రతిష్టాత్మకంగా తీసుకుని మామాఅల్లుడు శివశంకర్, విజయుడిని బరిలో నిలిపాయి. వీరు సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. (చదవండి: పోలింగ్ సమయంలో సెల్ఫీ దిగితే..) -
కిరాతకం: వివాహం కావడం లేదని..
చిక్కబళ్లాపురం(కర్ణాటక): ఇంట్లో దివ్యాంగురాలైన చిన్నారి ఉండటం వల్లనే తనకు పిల్లను ఇచ్చేందుకు ఎవరూ ముందుకు రావడం లేదని ఓ వ్యక్తి ఐదేళ్ల వయసున్న తన అన్న కుమార్తెను కర్కశంగా గొంతుకోసి హతమార్చాడు. హృదయవిదారకమైన ఈ అమానుష ఘటన తాలూకా పరిధిలోని అంగరేకనహళ్లిలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన కృష్ణమూర్తి, శంకర్లు అన్నదమ్ములు. వీరిది ఉమ్మడి కుటుంబం. కృష్ణమూర్తికి ఐదేళ్ల వయసున్న చర్విత అనే కుమార్తె ఉంది. బాలిక పుట్టుకతోనే దివ్యాంగురాలు. ఇక శంకర్‌కు ఎన్ని పెళ్లి సంబంధాలు చూసినా కుదరలేదు. తన అన్న కుమార్తె దివ్యాంగురాలైనందున తనకు సంబంధాలు కుదరడం లేదని గొడవపడేవాడు. ఈక్రమంలో మంగళవారం సాయంత్రం చిన్నారి ఇంటిముందు ఆడుకుంటుండగా తన వదిన ఎదురుగానే బాలిక గొంతుకోసి ఉడాయించాడు. తీవ్ర గాయాలతో చిన్నారి అక్కడకక్కడే ప్రాణాలు వదిలింది. రూరల్ పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి నిందితుడు శంకర్ కోసం గాలింపు చేపట్టారు. -
దారుణం: వర్షంలో 11 నెలల బాబుతో..
సాక్షి, జే.పంగులూరు: తన భర్త పిల్లలతో కలిసి కాపురం చేసుకుంటానని అత్తారింటికి వెళ్లిన కోడలిని, ‘‘నీవు మాకు పనికిరావు, మా ఇంట్లో ఉండటానికి వీల్లేదు, ఇక్కడ ఉంటే చంపేస్తామంటూ’’అత్త, మామ, బావలు కలసి కొట్టి బలవంతంగా బయటకు నెట్టేసిన సంఘటన మండలంలోని నూజిళ్లపల్లి గ్రామంలో ఆదివారం జరిగింది. 11 నెలల బిడ్డను పట్టుకొని వర్షంలో ఎటు వెళ్లాలో తెలియక, ఇరుగు పొరుగు వారు ఎవ్వరూ రానివ్వక, వర్షంలోనే తడుస్తూ తన భర్త తనకు కావాలని, కాపురం నిలబెట్టాలని వేడుకుంది. అయినా భర్తతో మాట్లాడేందుకు కూడా అవకాశం ఇవ్వకపోవడంతో పుట్టింటికి చేరింది. బాధితురాలు మద్దినేని హరిణి అందించిన వివరాలు ప్రకారం మండలంలోని రావినూతల గ్రామానికి చెందిన నాగుబోయిన ఆంజనేయులు కుమార్తె హరిణిని నూజిళ్లపల్లి గ్రామానికి చెందిన మద్దినేని శ్రీనివాసరావు కుమారుడు సుధీర్‌కి ఇచ్చి ఏడు సంవత్సరాలు క్రితం వివాహం చేశారు. వారికి ఆరేళ్ల వయసున్న కుమారుడు చరణ్ శ్రేదీప్, మరో 11 నెలల వయసున్న బాబు ఉన్నారు. ప్రస్తుతం బాధితురాలు గ్రామంలోనే వలంటీరుగా విధులు నిర్వర్తిస్తోంది. ఏడాది క్రితం అత్తమామలకు రెండు లక్షలు అప్పు కావాలంటే తన తండ్రితో మాట్లాడి వడ్డీకి రెండు లక్షలు తెచ్చి ఇచ్చింది. రెండు మూడు నెలల్లో తీసుకున్న డబ్బులు ఇస్తామని చెప్పి సంవత్సరం అవుతున్నా ఇవ్వక పోవటంతో మా అత్తమామలను డబ్బులు అడిగింది. దీంతో ఆగస్టు 25 వ తేదీ మా అత్తమామ, బావలు భర్తతో కొట్టించి ఇంటిలో నుంచి బయటకు నెట్టేశారు. నెల రోజుల క్రితం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీసులు, గ్రామ పెద్దలు నచ్చచెప్పి 15 రోజులు ఓపిక పడితే అత్తగారింటికి తీసుకెళ్తామని హామీ ఇవ్వటంతో బాధితురాలు వెనక్కు వచ్చింది. నెల రోజులైనా అత్తగారి ఇంటికి తీసుకొని వెళతామని చెప్పిన పెద్ద మనుషులు రాలేదు. దీంతో బాధితురాలు తల్లిదండ్రులకు భారంగా ఉండలేక ఆదివారం 11 నెలల బాబుతో అత్తగారి ఇంటికి వచ్చింది. దీంతో అత్త అంజమ్మ, మామ శ్రీనివాసరావు, బావ గురుస్వామి దుర్భాషలు ఆడి ఇంటి నుంచి బయటకు నెట్టేసి, ఆస్తిలో నీకు చిల్లి గవ్వ కూడా రాదని నీ దిక్కున్న చోటకు వెళ్లి చెప్పుకోమంటూ తన్ని బయటకు నెట్టేశారు. వర్షంలో చేసేది లేక బాధితురాలు 11 నెలలు బాబును ఎత్తుకొని తన పుట్టింటికి వెళ్లిపోయింది. తనకు భర్త కావాలని చెప్తున్నా ఎవ్వరూ వినటంలేదని, పోలీస్ స్టేషన్లో గాని, ఊరి పెద్ద మనుషులతో గానీ న్యాయం జరగలేదని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేస్తోంది. -
విదేశాల్లో కొడుకు కోడలిపై మామ..
కామారెడ్డిక్రైం: తండ్రిలా చూసుకోవాల్సిన మామ కోడలిపై కన్నేశాడు. అతని వేధింపులు భరించలేక కోడలు ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. వివరాలు.. కామారెడ్డి మండలం లింగాపూర్‌కు చెందిన 60 ఏళ్ల మల్లేశంకు కుమారుడు ఉన్నాడు. అతడు విదేశాల్లో ఉండడంతో కోడలు ఇంటి వద్దే ఉంటుంది. ఇదే అదనుగా కోడలిపై కన్నేశాడు మల్లేశం. లైంగిక వేధింపులకు యత్నించడంతో ఇటీవలే ఆమె ఆత్మహత్య యత్నానికి సైతం ఒడిగట్టినట్లు తెలిసింది. మామ బుద్ధి మారక పోవడంతో సమీప బంధువులకు చెప్పుకుని అంతా కలిసి ఆదివారం నిలదీశారు. అనంతరం దేవునిపల్లి ఠాణాలో ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు మల్లేశంపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. (చిన్నారులను అందంగా అలంకరించి..) -
మేనకోడలితో సంబంధం.. ప్రైవేట్ వీడియో లీక్
సూరత్ : మాయమాటలు చెప్పి మేనకోడలును లొంగదీసుకున్నాడు. కొంతకాలం ఆమెతో ఏకాంతంగా గడిపాడు. పెళ్లి తర్వాత కూడా తనతో లైంగిక సంబంధాన్ని కొనసాగించాలని కోరాడు. దీనికి మేనకోడలు నిరాకరించడంతో ఏకాంతంగా గడిపిన వీడియోలు కుటుంబ సభ్యులకు పంపి బ్లాక్ మెయిల్‌కు దిగాడు ఓ కీచక మేనమామ. ఈ ఘటన గుజరాత్‌లోని సూరల్లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సౌరాష్ట్రకు చెందిన ఓ యువతి సూరత్‌లోని పూనా ప్రాంతంలో చీరలపై లేస్ వర్క్ చేస్తూ జీవినం గడుపుతోంది. ఈ పనిని ఆమె మేనమామ(30) నేర్పించాడు. ప్రతి రోజు యువతి ఇంటికి ఆయన వచ్చిపోతుండేవాడు. ఈ క్రమంలో వారిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. అతని నమ్మి అతనితో రహస్యంగా గడిపింది. అయితే ఆమెతో ఏకాంతంగా గడిపిన సందర్భాలను అతగాడు వీడియో తీశాడు. ( చదవండి : నగ్నచిత్రాలు పంపించాలని బ్లాక్మెయిల్) నో చెప్పి, దూరం పెట్టిందని.. ఇదిలా ఉంటే యువతి తల్లిదండ్రులు ఆమెకు పెళ్లి సంబంధాలు వెతకడం ప్రారంభించారు. ఈ విషయం తెలుసుకున్న మేనమామ.. యువతి దగ్గరికి వచ్చి పెళ్లి తర్వాత కూడా తనతో లైంగిక సంబంధాన్ని కొనసాగించాలని కోరాడు. దీనికి ఆమె నిరాకరించడంతో పాటు అతన్ని దూరంగా పెట్టింది. దీంతో ఆగ్రహం పెంచుకున్న అతడు.. వారిద్దరు ఏకాంతంగా గడిపిన వీడియోను యువతి తండ్రితో పాటు, వారి బంధువులకు పంపాడు. అనంతరం యువతిని మానసికంగా వేధించడం మొదలు పెట్టాడు. దీంతో యువతి తండ్రి సూరత్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకొని, నిందితుడి కోసం గాలిస్తున్నామని పోలీసులు పేర్కొన్నారు. (చదవండి : భార్యను హత్య చేసిన కొద్దిసేపటికే..) -
కీచక మామ కోడలిపై..
కర్ణాటక,కృష్ణరాజపురం : కూతురిలా చూసుకోవాల్సిన కోడలిపై కీచకమామ లైంగిక వేధింపులకు పాల్పడుతున్న ఘటన కోణనకుంటెలో వెలుగు చూసింది. 2014లో ఓ యువతి మ్యాట్రిమొనీ ద్వారా పరిచయమైన కుమార్ అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. ఎన్నో ఆశలతో అత్తింట్లో అడుగుపెట్టిన ఆమెకు కొద్ది రోజులకే భర్త కుమార్ తండ్రి పళని నుంచి లైంగిక వేధింపులు మొదలయ్యాయి. ఈ విషయాన్ని భర్త కుమార్ చెప్పుకొని కన్నీటి పర్యంతమైంది. దీంతో దంపతులు కోణనకుంటెలో వేరు కాపురం పెట్టారు. అయితే రెండు నెలల క్రితం ఆ దంపతుల మధ్య మనస్పర్ధలు రావడంతో కుమార్ ఇంటికి రావడం మానేశాడు. ఈ తరుణంలో పళని భార్య సరస్వతి గురువారం ఆ యువతి నివాసం ఉంటున్న ఇంటికి వెళ్లి గొడవ పడింది. ఆమెను ఇంటి బయటకు లాక్కొచ్చి దుస్తులు చింపి అవమానించారు. లత ఫిర్యాదు మేరకు కోణనకుంటె పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. -
మరోసారి దుమ్మరేపిన డాన్సింగ్ అంకుల్
సాక్షి, న్యూఢిల్లీ : మీకు డ్యాన్సింగ్ అంకుల్ గుర్తున్నారా? అదేనండి గతేడాదిలొ గోవిందా హిట్ సాంగ్ అయిన 'ఆప్కే ఆ జానేసే' పాటకు డ్యాన్స్ చేసి ఒక్కసారిగా దేశం మొత్తాన్ని తనవైపు తిప్పుకున్నాడు. అదిరిపోయే స్టెప్పులేసి రాత్రికి రాత్రే ఫేమస్ అయ్యారు సంజీవ్ శ్రీవాస్తవ. ఆయన డ్యాన్స్ వైరల్‌గా మారి.. సెలబ్రిటీని చేసింది. తాజాగా ఆయన మళ్లీ వార్తల్లోకి వచ్చారు. మరోసారి తనదైన స్టైల్లో డ్యాన్స్ చేసి అందరిని అదరగొట్టాడు. అయితే ఈ సారి ఆయన ఒక మ్యూజిక్ ఆల్బంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ వీడియోకి ‘ చాచా నాచ్’ అనే పేరు పెట్టారు. దీనిని ఇటీవలే యూట్యూబ్‌లో అప్లోడ్ చేయగా లక్ష మందికి పైగా వీక్షించారు.(అంకుల్... ఇరగదీశావ్ పో!) -
హస్తం గుర్తుకు ఓటెయ్యండి..
సాక్షి, కామారెడ్డి: ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ మేనమామ ఆర్గొండ కమలాకర్‌రావును ఓటు అభ్యర్థించారు కాంగ్రెస్ కార్యకర్తలు. కామారెడ్డి పట్టణానికి సమీపంలోని దేవి విహార్‌లో కమలాకర్‌రావు నివసిస్తుంటారు. ఆదివారం దేవునిపల్లి గ్రామ కాంగ్రెస్ నాయకులు నీలం వెంకటి, సుధాకర్, నాగరాజు, మునీర్, ఆరిఫ్, నౌసిన్ తదితరులు ఆయన ఇంటికి వెళ్లారు. కాంగ్రెస్ అభ్యర్థి షబ్బీర్అలీకి ఓటు వేయాలని కోరారు. కాంగ్రెస్ అభ్యర్థి షబ్బీర్అలీకి గతంలో కేసీఆర్ మేనమామ కమలాకర్‌రావుతో సన్నిహిత సంబంధాలు ఉండేవి. ఆయన కాంగ్రెస్ కార్యకర్తలు ఇచ్చిన కరపత్రాన్ని చూసి, వారితో మాట్లాడి పంపించారు. -
మామయ్య ప్రపంచం
నాది చాలా చిన్న ప్రపంచం. అమ్మ, నాన్న, చెల్లెలు, అమ్మమ్మ, మామయ్య. ఇదే నా ప్రపంచం. చిన్న చిన్న ప్రపంచాల్లోనే కొన్నిసార్లు చాలా పెద్ద కథలుంటాయి. మామయ్య గురించి చెప్పాలి. ఆయన ఈరోజు ఇంతలా ఎందుకు గుర్తొస్తున్నాడో చెప్పాలి. మామయ్యది ఒక పల్లెటూరు. అమ్మమ్మతో పాటు ఉండేవాడు. ఆదివారం వచ్చిందంటే మేమందరం అక్కడికి వెళ్లిపోయి సరదాగా గడిపేస్తుంటాం. ఈ ఆదివారం ఆయన ఇక్కడ లేకపోవడం, ఇంకే ఆదివారం ఉండడు అన్న ఆలోచనే ఎందుకో బాధను పెంచెస్తోంది.రాత్రిపూట ఆరుబయట ఇలా మంచం మీద పడుకొని ఉంటే గాలి కన్నా వేగంగా పరిగెడుతున్నాయి నా ఆలోచనలు. మామయ్య ఎలా ఉండేవాడు! నన్ను, చెల్లిని చిన్నప్పట్నుంచీ ఎంతో ప్రేమతో పెంచాడు. నాకు బాగా గుర్తు.. స్కూల్‌కెళ్లే తొలినాళ్లలో తనే రెడీ చేయించి మరీ స్కూల్‌కి తీసుకెళ్లేవాడు. మధ్యాహ్నం అయితే భోజనం దగ్గర గారం చేయడం నా పని. చెల్లి కూడా అచ్చం నాలాగే! అస్సలు తినేవాళ్లమే కాదు. మామయ్య పైకి చూపెట్టి, ‘‘చూడండి పిల్లలూ! ఈ ముద్ద మీరు తినకపోతే ఆ ఫ్యాన్ మీ మీద పడిపోతుంది’’ అనేవాడు. నిజానికి, అబద్ధానికి తేడా తెలియని ఆ వయసులో అది నిజమేనేమోనని భయంతో తినేసేవాళ్లం. మమ్మల్ని కూర్చోబెట్టుకొని ఎన్నెన్ని కబుర్లు చెప్పేవాడో తల్చుకుంటే, ఇప్పుడు ఆయన పక్కనలేనందుకు కూడా కోప్పడాల్సింది ఆయన్నే కదా అనిపిస్తోంది. కోపమైనా, ఇష్టమైనా మామయ్య మీదే అలా చూపించేస్తాం నేను, చెల్లి. మేం చదువుల్లో ఒక్కో తరగతీ ముందుకు వెళ్తూ ఉంటే ఆయన కళ్లలో సంతోషం కనిపించేది. కొన్నిసార్లు సమయాలు ఎలా ఎలా గడిచిపోతాయో ఆలోచిస్తే గొప్ప ఆశ్చర్యం కలుగుతుంది. ఇలా మామయ్య స్కూల్లో చేరిపించాడో లేదో, అలా పదోతరగతికి వచ్చేసినట్టు అనిపించింది.పదేళ్లలో ఈ ప్రపంచంలో, నాలో ఎన్ని మార్పులొచ్చినా మామయ్య ప్రపంచంలో ఏ మార్పూ రాలేదు. ఎప్పట్లాగే మేమే ఆయన ప్రపంచం. నా పదో తరగతి పూర్తయింది. కాలేజీలో జాయిన్ అవ్వాల్సిన రోజులవి. పదో తరగతి వరకైతే ఇంటి దగ్గరే ఉండి చదవగలిగాను కానీ, ఇంటర్లో మంచి కాలేజీలో చేరాలి. బైపీసీ తీసుకొని డాక్టర్ అవ్వాలి. అందుకు నేను విజయవాడ వెళ్లి తప్పక చదువుకోవాల్సిన పరిస్థితి.మామతో ఇదే మాట చెబితే, నా గడ్డం పట్టుకొని, ‘‘ఏరా కొడుకా! అంత దూరం పోవాలా? ఎలా ఉంటావో ఏమో మా అందర్నీ వదిలేసి!’’ అంటూ నా కళ్లకేసి చూశాడు. నాకప్పుడు అర్థం కాలేదు ఆ మాటల్లో ఎంత ప్రేమ దాగి ఉందో! ‘‘ఉంటానులే మామా! నువ్వేం దిగులుపడకు.’’ అన్నాను ఎంతో కులాసాగా.‘నువ్వుంటావేమో తల్లీ! నేను ఉండలేనే’ అన్నట్టు ఒక చిరునవ్వు నవ్వాడు.కాలేజీలో చేరి చదువుల్లో పడిపోయా. ఒక కొత్త ప్రపంచం పరిచయమైంది. నా చిన్న ప్రపంచం చిన్న చిన్నగా పెరగడం మొదలైంది. ఆ మార్పును అర్థం చేసుకుంటుండగానే ఒక సంవత్సరం గడిచిపోయింది.సెలవులిచ్చారు. అంతకుముందు ఆదివారం వచ్చిందంటే నాకొక ఉత్సాహం ఉండేది. కాలేజీలో చేరాక మళ్లీ సంవత్సరానికి అంతే ఉత్సాహంతో ఆదివారం కోసం ఎదురుచూశా.ఎప్పట్లానే ఆ ఆదివారం ఊరికి వచ్చాం. కానీ ఈసారి ఎప్పటిలా లేడు మామయ్య. బక్కచిక్కిపోయి నీరసంగా ఉన్నాడు. ఎందుకలా ఉన్నాడో ఎవ్వరూ చెప్పలేదు. మామయ్యను అంత దిగాలుగా చూడటం అదే మొదటిసారి. ఆ సాయంత్రమే తిరిగి ఇంటికెళ్లిపోయాం. ఒక రెండు రోజుల తరువాత మామ ఇంటికొచ్చాడు. ‘‘ఎప్పుడెళ్లాలి తల్లీ మళ్లీ కాలేజీకి?’’ అన్నాడు టీ తాగుతూ.‘‘రేపే’’ అన్నాను.టీ తాగడం అయ్యాక ‘‘సరే, నేను బయల్దేరుతాను’’ అంటూ పైకి లేచాడు. గడప వరకూ వెళ్లి వెనక్కి తిరిగి నా గడ్డం పట్టుకొని.. ‘‘రేపే వెళ్లిపోవాలా కొడుకా?’’ అన్నాడు దీనంగా. ఔనన్నట్లు తలూపాను. ఆ క్షణం తన కళ్లలో ప్రేమ, ఆప్యాయత, బాధ కన్నీటి చుక్కలా రాలిపడుతుంటే దాన్ని పట్టుకుని.. ప్రేమగా నుదుటిపై ముద్దుపెట్టి ‘‘సరే నాన్నా! జాగ్రత్త. అప్పుడప్పుడు అయినా ఫోన్ చెయ్యొచ్చు కదా!’’ అన్నాడు. అలాగే అన్నట్టు తలూపాను. మామయ్య మా ఫోన్ కోసం ఎంతెంత ఎదురుచూసేవాడో ఆ మాట తీరులో తెలిసిపోతుంది. కానీ అది అర్థమయ్యేసరికి ఈరోజు వస్తుందని మాత్రం నాకు తెలియదు. ఆ రోజు మామయ్య వీధి చివరికెళ్లేవరకూ అలా చూస్తూనే ఉండిపోయా. సత్తువ లేని ఆ కాళ్లతో మామయ్య అలా ఎంతో ఆయాసంగా నడిచి వెళ్తోంటే ఏడుపు తన్నుకొచ్చింది. ‘మామయ్యని వదిలేసి ఎక్కడో ఎలా ఉంటున్నా నేను?’ అనిపించింది ఆ క్షణం. ఆ వెంటనే చదువుకోసం ఇవన్నీ తప్పవు కదా అని నాకు నేనే సర్దిచెప్పుకున్నాను. చూస్తుండగానే అలాగే మరో సంవత్సరం కూడా గడిచిపోయింది. ఈసారి సెలవులకి మాత్రం మామ పరిస్థితి ఇంకా మారిపోయింది. ఒక్క అడుగు కూడా వేయలేని పరిస్థితి. పెళ్లి, పిల్లలు ఏదీ లేకుండా మేమే ప్రపంచమై బతికాడు. తనకంటూ రూపాయి కూడబెట్టుకోలేదు. చేతికి రూపాయి వచ్చినా అది మా కోసమే ఖర్చు పెట్టాడు. మామే అయినా ఒక తండ్రి కంటే ఎక్కువ ప్రేమనే చూపించాడు మా మీద. ఆస్తి అంటూ ఏమీ లేకున్నా వాటన్నింటి కంటే మించిన ప్రేమ ఉంది మామ దగ్గర. అంతగా మమ్మల్ని ప్రేమించిన మామని అలా చూడలేక, ‘‘పద నువ్వు.. హాస్పిటల్‌కి..’’ అన్నాను. ‘‘నాకేమైందని?’’ అంటూ అలానే ఉండిపోయాడు. నాకు మామయ్య మీద అరోజు కోపమొచ్చింది. ఆయన కోసమే చెప్తుంటే ఇలా మాట్లాడతాడు ఏంటని ఆయనతో మాట్లాడొద్దనుకున్నా. మూడు నెలలు అలాగే గడిచిపోయాయి. నా చదువులు కూడా బాగా సాగుతున్నాయి. కాలేజీ మారింది. ఇంకో కొత్త ప్రపంచం ఇప్పుడు. ఈ కొత్త ప్రపంచం పరిచయమైన ఒకరోజు ఫోనొచ్చింది – ‘‘రేయ్ కొడుకా! ఇదిగో ఈ ఊళ్లోనే ఉన్నా. హాస్పిటల్‌కి వచ్చా. నువ్వు రాగలవా ఇక్కడికి!’’ అని అడిగాడు మామయ్య.నేను కోపంలోనే ‘‘రాలేను నేను’’ అన్నాను.ఆ తరువాత కొన్ని రోజులకు డిశ్చార్జ్ అయ్యాడు. నాన్న మామయ్యను ఇంటికి తీసుకెళ్లిపోయాడు. అ తర్వాత నేనే ఇంటికెళ్లి చూస్తే ఆయన పరిస్థితి అర్థమై దగ్గరికెళ్లి మాట్లాడలేకపోయా. ఏమీ తినలేకపోతున్నాడు. ఏం తిన్నా, ఏం తాగినా కడుపులో నిలవట్లేదు. ఏమీ మింగలేకపోతున్నాడు. అలాంటి పరిస్థితిలో కూడా తన బాధ మాతో ఎప్పుడూ పంచుకోలేదు. కొన్ని రోజులకి మళ్లీ ఊరెళ్లిపోయాడు. ఒకరోజు అనుకోకుండా నాన్న, చెల్లి వచ్చారు. ఇంత పొద్దున్నే ఏంటా? అనుకుంటూ ఆఫీస్ రూమ్ వైపుకు నడిచాను. ఏదో తెలియని బాధ వాళ్ల కళ్లలో. ఆ బాధకి కారణాన్ని నేను అడిగేలోపే నాన్న, ‘‘మామకి సీరియస్ అంట. వెంటనే బయలుదేరు’’ అన్నాడు. అక్కడ ఏం జరిగి ఉంటుందో ఊహించగలుగుతున్నా. కానీ మనసు మాత్రం ఒప్పుకోవడం లేదు. గేటు వైపుకి అడుగులు వడివడిగా సాగాయి. ఊరు చేరేవరకూ మామ జ్ఞాపకాలే. ఇంటికి ఆమడ దూరంలో ఉండగానే అంతమంది మనుషుల్ని చూడగానే మనసు కలవరపడింది. ఆగిపోతా అంటున్న నడకని కాదంటూ అడుగు ముందుకేశా. ప్రేమే ఊపిరై బతికే మామని ఊపిరి లేకుండా అలా చూసి నోటి వెంట మాట రాలేదు, కళ్లలో నీళ్లు తప్ప.ప్రేమతో గోరుముద్దలు తినిపించిన మామకి ఒక్క పూట కూడా భోజనం పెట్టలేకపోయాననే బాధ. ‘‘రాగలవా?’’ అన్నప్పుడు ఎందుకు వెళ్లలేదు అనే కోపం నామీద నాకు. కానీ కోపం తనకెప్పుడూ లేదు నా మీద. ఎందుకంటే తనకి తెలిసింది.. ప్రేమించడం, అభిమానించడం.. అంతే. అందుకేనేమో తన జీవితంలోని చివరిరోజున కూడా అమ్మకి ఫోన్ చేసి ‘‘పిల్లలెలా ఉన్నారు? చూడాలని ఉంది.’’ అని అడిగాడు. మామయ్య మమ్మల్ని చూడాలని ఎవ్వర్నీ అడగని చూడాలనుకున్న రోజులు ఎన్ని ఉన్నాయో తల్చుకున్నప్పుడల్లా ఇప్పుడున్న బాధంతా రెట్టింపవుతుంది. ఆ బాధలోనే మామయ్య తిరిగొస్తే బాగుండు అన్న ఆశ పుట్టుకొస్తుంది, మళ్లీ రాడని తెలిసినా! - హెప్సిబ -
మామా అని పిలవకుమా!
బాలీవుడ్లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్‌గా కండల వీరుడు సల్మాన్‌ఖాన్ ఫిఫ్టీ ఏజ్ గ్రూప్‌లోకి ఎప్పుడో ఎంటరయ్యారు. సల్మాన్ ఇంకా పెళ్లి కబురు చెప్పలేదు కానీ ఆయన్ని చిన్నారులు అంకుల్ అని పిలుస్తుంటే తెగ ఫీలైపోతున్నారట. గెట్ టుగెదర్ లాంటి ప్రోగ్రామ్స్‌లో సల్మాన్ ఫ్రెండ్స్ పిల్లలు అంకుల్ అని పిలిచారట. దీంతో సల్మాన్ చిన్నారులను పిలిచి ‘అలా పిలవద్దు’ అని ముద్దుగా చెప్పారట. కానీ పిడుగుల్లాంటి పిల్లలు పిలవద్దు అంటే ఆగుతారా? పైగా ఒక పని చేయవద్దు అంటే దాన్నే పనిగా పెట్టుకుంటారు పిల్లలు. సో.. అంకుల్ అని సరదాగా పిలుస్తూనే ఉన్నారట. ‘‘మీరు నన్ను అలా పిలిస్తే మీతో మీటింగ్స్ తగ్గిస్తా’’ అని సల్మాన్ చెప్పిన తర్వాత అంకుల్ అని పిలవడాన్ని తగ్గించారట పిల్లలు. సల్మాన్ భలే షరతు పెట్టారు కదా. ఇక సినిమాల విషయానికొస్తే... అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వంలో రూపొందనున్న ‘భారత్’ సినిమాలో సల్మాన్‌ఖాన్ నటించనున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది రంజాన్‌కు విడుదల కానుంది. -
మామ లైంగిక వేధింపులు
బనశంకరి : మామ లైంగికంగా వేధింపులకు పాల్పడుతున్నాడని ఆరోపిస్తూ ఓ యువతి జేసీ.నగర పీఎస్‌లో ఫిర్యాదు చేసింది. వివరాలు... గత ఏడాది జేసీ.నగర నివాసి అబ్దుల్హాదీ అనే యువకుడితో నగరానికి చెందిన యువతితో వివాహమైంది. అబ్దుల్హాదీ ఉన్నత ఉద్యోగం చేస్తున్నట్లు నమ్మించి పెళ్లి జరిపించారు. అయితే అబ్దుల్ నిరక్షరాస్యుడని తేలింది. ఇదిలా ఉంటే అబ్దుల్ తండ్రి రెహమాన్ కోడలిని లైంగికంగా వేధిస్తుండటంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది -
నడిరోడ్డుపై అల్లుడి దారుణహత్య
కోట: ప్రేమ వివాహం పగను రాజేసింది. కన్నబిడ్డను దూరం చేశాడని కక్ష పెంచుకున్న మామ చివరకు అల్లుడిని కడతేర్చి ఘటన సోమవారం చిట్టేడులో జరిగింది. వాకాడు సీఐ ఉప్పాల సత్యనారాయణ సమాచారం మేరకు.. చిట్టేడులో ఒకే వీధిలో నివాసం ఉంటున్న బలిజ సామాజిక వర్గానికి చెందిన కొమ్మ రాజశేఖర్ (27) ముదిరాజ్ సామాజిక వర్గానికి యువతి నిరోషా ప్రేమించుకున్నారు. రెండేళ్ల క్రితం పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం చేసుకుని నాయుడుపేటలో కాపురం ఉంటున్నారు. వీరికి ఏడు నెలల కుమార్తె ఉంది. కూతురు ప్రేమ వివాహం చేసుకోవడాన్ని జీర్ణించుకోలేని తండ్రి రామయ్య పలుమార్లు ఆవేశంగా రాజశేఖర్ కుటుంబాన్ని నాశనం చేస్తానంటూ మాట్లాడినట్లు సమాచారం. సోమవారం స్నేహితుడు మృతి చెందడంతో చిట్టేడుకు వచ్చిన రాజశేఖర్ తన తల్లిని చూసేందుకు ఇంటికి వెళ్లాలని మరో స్నేహితుడి వాహనం తీసుకుని ఇంటి వద్దకు వచ్చాడు. రాజశేఖర్ వచ్చిన విషయం తెలుసుకున్న మామ రామయ్య కత్తి తీసుకుని కాపుగాశాడు. ఇంటి వద్ద బైక్ దిగిన వెంటనే రాజశేఖర్‌ను కత్తితో నరికినట్లు తెలుస్తోంది. ప్రమాదాన్ని పసిగట్టిన రాజశేఖర్ వీధిలో పరుగెత్తేందుకు ప్రయత్నించగా మరోమారు మెడపై నరకడంతో కుప్పకూలాడు. రక్తపు మడుగులో పడి ఉన్న రాజశేఖర్‌ను స్థానికులు కోట ప్రభుత్వ వైద్యశాలకు తరలించేందుకు ప్రయత్నించగా అప్పటికే మృతి చెందినట్లు తెలియడంతో మృతదేహాన్ని ఇంటికి తెచ్చారు. ఇంటి ముందే బిడ్డ దారుణ హత్యకు గురవడంతో తల్లిదండ్రులతో పాటు కుటుంబీకులు కన్నీరు.. మున్నీరుగా రోదించారు. దారుణ ఘటన గ్రామస్తులను భయభ్రాతులకు గురి చేసింది. నిందితుడు అక్కడి నుంచి పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయినట్లు సమాచారం. గూడూరు డీఎస్పీ రాంబాబు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అన్నీ కోణాల్లో విచారణ జరుపుతామని తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని బాలిరెడ్డిపాళెంకు తరలించారు. మృతుడి తండ్రి నారాయణ ఇచ్చిన సమాచారం మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. -
అంకుల్ డాన్స్..సోషల్ మీడియాలో హల్ చల్!
-
అంకుల్... ఇరగదీశావ్ పో!
ప్రస్తుతం సోషల్ మీడియాలో ఏదైనా హల్ చల్ చేస్తుందంటే చాలూ.. అది వార్తగా మారిపోతోంది. తాజాగా ఇండియన్ అంకుల్ డాన్స్ వీడియో ఒకటి చక్కర్లు కొడుతోంది. 40 ఏళ్లు పైబడిన ఓ వ్యక్తి ఏదో వేడుకలో స్టేజీపై వేసిన స్టెప్పులకు ఇప్పుడు అంతా ముగ్ధులైపోతున్నారు. జితేంద్ర, శతృఘ్నసిన్హా, గోవిందా కాంబోలో వచ్చిన ఖుద్గర్జ్(1987) చిత్రంలోని ‘ఆప్ కే ఆ జానే సే...’ పాటకు ఆ వ్యక్తి డాన్స్ చేశాడు. అచ్చం గోవిందాను ఇమిటేట్ చేస్తూ అతను చేసిన డాన్సింగ్ మూమెంట్స్ వావ్ అనిపించేలా ఉన్నాయి. పక్కన ఉన్న ఆంటీ మాత్రం పాపం ఆయన్ని అలా చూస్తూ ఉండిపోయింది. మ్యాజిక్ స్టెప్పులకు పేరున్న గోవిందనే తలదన్నెలా స్టెప్పులేశారంటూ ఆ అంకుల్‌పై అంతా ప్రశంసలు గుప్పిస్తున్నారు. సెలబ్రిటీల దగ్గరి నుంచి సామాన్యుల దాకా దాదాపు ప్రతీ ఒక్కరూ ఈ వీడియోను సర్క్యూలేట్ చేస్తున్నారు. అఫ్ కోర్స్ గత రెండు రోజులుగా వాట్సాప్, ఫేస్బుక్.. ఇలా ఏ ఫోన్లలో ఎక్కడ చూసినా ఈ అంకుల్ సందండే. కానీ, ఇది ఎక్కడ జరిగింది? అసలా అంకుల్ ఎవరు? అన్నది తెలియాల్సి ఉంది. అఫ్కోర్స్ అది బయటపడటానికి కూడా పెద్దగా సమయం పట్టకపోవచ్చు. -
వ్యభిచార వృత్తిలోకి దింపుతున్నారు
బుచ్చిరెడ్డిపాళెం: తనను తల్లి, మేనమామలు వ్యభిచార వృత్తిలోకి దింపుతున్నారని, తట్టుకోలేక బంధువుల ఇంటికి వచ్చానని నందా గౌతమి(26) అనే మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. స్థానిక పోలీస్‌స్టేషన్ ఎదుట ఆమె విలేకరులతో మాట్లాడారు. తనకు మేనమామ మూర్తి(36)తో వివాహమైందని, తన తల్లి ఈశ్వరమ్మ తనను వ్యభిచారం చేయాలని బలవంతం చేస్తోందని వాపోయింది. దీంతో బుచ్చిరెడ్డిపాళెంలో మామ వరుసైన పరంధామయ్య ఇంటికి వచ్చానన్నారు. అయితే తన తల్లి, మేనమామతోపాటు మరికొందరు మూడు రోజుల క్రితం బుచ్చిరెడ్డిపాళెంలోని మామ ఇంటికి వచ్చారని, అక్కడ మాటల నేపథ్యంలో తోపులాట జరిగిందని, అక్కడి నుంచి వెళ్లి దాడి చేసినట్లు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారని గౌతమి వాపోయింది. తనకు న్యాయం చేయాలని కోరింది. కేసు నమోదు తన కుమార్తెను తీసుకెళ్లేందుకు వచ్చిన తనతోపాటు మరికొందరిపై పరంధామయ్య మరికొందరు దాడి చేసి గాయపరిచారని ఈశ్వరమ్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపై ఎస్సై ప్రసాద్‌రెడ్డిని సంప్రదించగా గాయపడిన బాధితులు ఆస్పత్రిలో చేరారని, బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని తెలిపారు. అనంతరం గౌతమి ఫిర్యాదు చేసిందన్నారు. దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. -
మేనమామ మరణం జీర్ణించుకోలేక..
కర్నూలు: మేనమామ మరణం జీర్ణించుకోలేని ఓ బాలిక ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పోలీసుల వివరాల మేరకు.. నగరంలోని అబ్బాస్‌నగర్‌లో నివాసముంటున్న ఎడ్వర్డ్ క్రిస్టఫర్ ఇంగ్లిష్ దినపత్రికలో ఏడీవీటీ ఇన్చార్జ్గా పనిచేసేవాడు. ఈయన భార్య ఎనిమిదేళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో మృతిచెందింది. వీరికి ఒక కుమార్తె, ఒక కుమారుడు ఉన్నారు. కుమార్తె బ్లెస్సీ ఏంజలీనా (19) కర్నూలు శివారులోని ఓ కళాశాలలో బీటెక్ మొదటి సంవత్సరం చదువుతోంది. నందికొట్కూరుకు చెందిన ప్రభాకర్ (ఏంజలీనా మేనమామ) ఆకస్మికంగా మృతి చెందడంతో తండ్రితో కలసి అంత్యక్రియలకు వెళ్లి గురువారం సాయంత్రం కర్నూలుకు చేరుకున్నారు. అప్పటినుంచి తీవ్ర మనోవేదనకు గురైంది. ఈక్రమంలో శుక్రవారం మధ్యాహ్నం వంట గదిలో ఫ్యాన్‌కు ఉరి వేసుకుంది. గమనించిన సోదరుడు డేవిడ్ స్టాన్లీ వెంటనే కిందికి దించి ఆసుపత్రికి తరలించాడు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ మేరకు నాలుగో పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. -
కోడలికి అసభ్య ఎస్ఎంఎస్
సాక్షి, చెన్నై(టీ.నగర్) : కోడలికి అసభ్య ఎస్ఎంఎస్ పంపిన మామను పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. ఈ సంఘటన తురైపాక్కంలో సంచలనం రేకెత్తించింది. చెన్నై గూడువాంజేరి సమీపానగల కన్నివాక్కంకు చెందిన కపాలీశ్వరన్ (52) కుమారుడు దీపక్ (26). ఇతని భార్య సురేఖ (25). వీరికి గత రెండేళ్ల క్రితం వివాహం జరిగింది. ఈ దంపతులకు ఏడాది వయసుగల దీక్షిత అనే కుమార్తె ఉంది. ఇలావుండగా సురేఖకు ఒక యువకునితో అక్రమ సంబంధం ఉన్నట్లు, వారిరువురూ కలిసి జీవించకూడదని, సురేఖ ఆత్మహత్య చేసుకోవాలని కపాలీశ్వరన్ సెల్‌ఫోన్‌కు ఒక ఎస్ఎంఎస్ వచ్చింది. దీని గురించి అతను కుమారుడితో చెప్పాడు. దీంతో భార్యాభర్తల మధ్య గొడవలు ఏర్పడడంతో దీపక్ చెంగల్పట్టు కోర్టులో విడాకులు కోరుతూ కేసు దాఖలు చేశారు. దీంతో ఒక్కియం తురైపాక్కంలో తన పుట్టింట్లో నివశిస్తున్న సురేఖ సెల్‌ఫోన్‌కు వరుసగా అసభ్య ఎస్ఎంఎస్లు వస్తుండేవి. దీనిగురించి తురైపాక్కం కన్నగినగర్ పోలీసులకు గత రెండు రోజుల క్రితం సురేఖ ఫిర్యాదు చేశారు. దీంతో ఇన్స్పెక్టర్ శివకుమార్ కేసు నమోదు చేసి సురేఖ సెల్‌ఫోన్‌కు వచ్చిన నెంబర్ల ఆధారంగా విచారణ జరిపారు. ఇందులో మామ కపాలీశ్వరన్ వేరొక సిమ్‌కార్డు ద్వారా సురేఖకు అసభ్య ఎస్ఎంఎస్లు పంపినట్లు తేలింది. దీంతో కపాలీశ్వరన్ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ జరపగా అతను ఈ ఎస్ఎంఎస్లు పంపినట్లు ఒప్పుకున్నాడు. అక్రమ సంబంధం ఎస్ఎంఎస్లో కుమారుడికి, కోడలికి తరచుగా గొడవలు జరిగేవని, దీంతో కుమారుడు విచారంతో కనిపించేవాడని, దీంతో కోడలికి అసభ్య ఎస్ఎంఎస్ పంపినట్లు కపాలీశ్వరన్ తెలిపాడు. దీంతో పోలీసులు కపాలీశ్వరన్ను అరెస్టు చేసి ఆలందూరు కోర్టులో హాజరుపరిచి జైల్లో నిర్బంధించారు. -
టీవీ చూసేందుకు వచ్చే బాలికపై అఘాయిత్యం
సాక్షి, మెదక్ : ప్రభుత్వాలు నిర్భయలాంటి కఠిన చట్టాలను ప్రవేశపెట్టినప్పటికీ మృగాళ్ల తీరు మాత్రం మారడం లేదు. కామవాంచ తీర్చుకునేందుకు వావీ వరుసలను మరిచిపోతూ అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. ఆడపిల్లల అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకొని కామాందులు వ్యవహరిస్తున్న తీరు సభ్యసమాజాన్ని తలదించుకునేలా చేస్తోంది. బందువులే కదా అని సరదాగా టీవీ చూసేందుకు వచ్చిన ఓ మైనర్ బాలికను మాయమాటలు చెప్పి ఓ వివాహితుడు గత కొంత కాలంగా అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన మెదక్ మండలం పాతూర్ గ్రామంలో గురువారం వెలుగులోకి వచ్చింది. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. పాతూర్ గ్రామానికి చెందిన పదిహేనేళ్ల బాలికను వరుసకు మామ అయిన అదే గ్రామానికి చెందిన 25 ఏళ్ల వయస్సు ఉన్న కరుణాకర్ నాలుగు నెలలుగా అత్యాచారానికి పాల్పడుతున్నాడు. బంధువులు కదా అని టీవీ చూసేందుకు ఇంటికి వచ్చిన మైనర్ బాలికను మాయమాటలతో లోబర్చుకున్నట్లు తెలిపారు. నాలుగు నెలలుగా ఆ బాలికపై అత్యాచారం చేస్తూ పైశాచికత్వాన్ని ప్రదర్శించాడు. బతుకుదెరువు కోసం వలస వెళ్లిన ఆ బాలిక కుటుంబీకులు ఇటీవలే స్వగ్రామానికి తిరిగివచ్చినట్లు వివరించారు. చివరకు బాలిక కుటుంబీకులకు విషయం తెలియడంతో అసలు వ్యవహారం బయటకు వచ్చింది. దీంతో బాధిత కుటుంబీకులు తమకు న్యాయం చేయాలని కోరుతూ మెదక్ రూరల్ పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించారు. కరుణాకర్‌కు భార్య, పిల్లలు ఉన్నట్లు తెలిపారు. బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు రూరల్ ఎస్ఐ లింబాద్రి తెలిపారు. -
ఘాతుకం.. చావు బతుకుల్లో చిన్నారి
లక్నో : ఉత్తర ప్రదేశ్ లో దారుణం చోటు చేసుకుంది. సొంత బాబాయే ఓ పసిపాపపై ఘాతుకానికి పాల్పడ్డాడు. ఆ మృగం చేతిలో చితికిన చిన్నారి ప్రస్తుతం ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతోంది. థాకూర్గంజ్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. లక్నో నగర్ నిగమ్ ప్రాంతానికి చెందిన చిన్నారి తండ్రి కూలీ పనులు చేసుకుంటున్నాడు. భార్య, ముగ్గురు పిల్లలతో జీవిస్తున్నాడు. అతని సోదరుడు(20) హోలీ సందర్భంగా ఇంటికి వచ్చాడు. శుక్రవారం మధ్యాహ్నం ఇంటి బయట ఆడుకుంటున్న మూడేళ్ల చిన్నారిని ఆ యువకుడు తన వెంట తీసుకెళ్లాడు. ఓ పాడుబడ్డ బంగ్లాలోకి తీసుకెళ్లి చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఘటన తర్వాత పారిపోతున్న యువకుడిని గమనించిన స్థానికులు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. పాపను కింగ్ జార్జి మెడికల్ యూనివర్సిటీ(కేజీఎంయూ)లో చేర్పించి చికిత్స అందజేయిస్తున్నారు. తీవ్ర రక్తస్రావంతో శస్త్ర చికిత్స అవసరమైందని.. ప్రస్తుతం చిన్నారి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. పోక్సో చట్టం ప్రకారం నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్‌కు తరలించారు. -
కూతురు బాధ చూడలేక..
ఉయ్యాలవాడ: మద్యానికి బానిసై నిత్యం కుమార్తెను వేధిస్తున్న అల్లుడిని మామ హత్య చేసిన సంఘటన సోమవారం ఉయ్యాలవాడ మండలంలో చోటు చేసుకుంది. ఉయ్యాలవాడకు చెందిన కమతం చిన్నయ్య కుమారుడు రామకృష్ణ(45) 20 ఏళ్ల క్రితం ఆర్మీలో సైనికుడిగా చేరి దాదాపు 15 సంవత్సరాలు పలు చోట్ల విధులు నిర్వర్తించాడు. ఎనిదేళ్ల క్రితం ఉద్యోగ విరమణ పొంది స్వగ్రామం చేసుకున్నాడు. ఉద్యోగం చేస్తున్న సమయంలో వైఎస్ఆర్ జిల్లా దేవగుడి గ్రామానికి చెందిన బాలసుబ్బయ్య, అచ్చమ్మ దంపతుల కుమార్తె సావిత్రమ్మను వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు కుమార్తెలు, కుమారుడు సంతానం. ఈమె మండలంలోని పుచ్చకాయలపల్లెలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో స్వీపర్‌గా పనిచేస్తోంది. భర్త వేధింపులు అధికం కావడంతో ఆమె రెండు నెలల క్రితం నుంచి పాఠశాలలో విధులు నిర్వర్తిస్తూ అక్కడే జీవనం కొనసాగిస్తోంది. సోమవారం రామకృష్ణ భార్యను ఇంటికి తీసుకెళ్లేందుకు పుచ్చకాయలపల్లెకు చేరుకున్నాడు. కాగా తమ నాన్న చెబితే వెంట వస్తానని భార్య చెప్పడంతో ఇద్దరు కలిసి ఆటోలో మాయలూరు భారత్ పెట్రోల్ బంకులో వాచ్‌మెన్‌గా పనిచేస్తున్న బాలసుబ్బయ్య వద్దకు వెళ్లారు. తన కుమార్తెను పంపనని చెప్పడంతో మామ, అల్లుడి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో బాలసుబ్బయ్య పక్కనే ఉన్న ఇనుపరాడ్ తీసుకుని అల్లుడి తలపై గట్టిగా కొట్టడంతో తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే కుప్పకూలి మృతి చెందాడు. విషయం తెలుసుకున్న కోవెలకుంట్ల సీఐ శ్రీనివాసరెడ్డి, స్థానిక ఎస్ఐ నిరంజన్‌రెడ్డి సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. -
మరుగుదొడ్డి కట్టనీయలేదని మామపై కోడలి ఫిర్యాదు
చిత్తూరు, పూతలపట్టు : మరుగుదొడ్డి కట్టనీయకుండా మామ అడ్డుకుంటున్నాడని ఓ కోడలు ఆదివారం పోలీసులకు ఫిర్యా దు చేసింది. వివరాలిలా ఉన్నాయి.. మండలంలోని పేటఅగ్రహారం దళితవాడకు చెందిన ఎర్రయ్య కుమారుడు బాబయ్య 20 ఏళ్ల క్రితం పీలేరుకు చెందిన విజయకుమారిని ప్రేమించి వివాహం చేసుకున్నాడు. కుటుంబ కలహాలతో బాబయ్య ఇల్లు వదిలి వెళ్లిపోయాడు. అప్పటి నుంచి విజయకుమారి తన కుమార్తెతో పాటు పూరిగుడిసెలో ఉంటూ కూలి చేసుకుని జీవనం సాగి స్తోంది. ప్రస్తుతం మరుగుదొడ్డి ఉంటేనే సంక్షేమ పథకాలైన పింఛను, రేషన్ బియ్యం, ఇతర సౌకర్యాలు అందిస్తామని అధికారులు తెలిపారు. రెండు నెలలుగా పింఛను కూడా ఇవ్వడం లేదు. తీరా మరుగుదొడ్డి నిర్మించుకోబోతే మామ ఎర్రయ్య అడ్డుపడ్డాడు. దీంతో ఆమె మనోవేదనకు గురై ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. సిబ్బంది ద్వారా గ్రామంలో విచారించిన ఎస్ఐ మురళీమోహన్ ఎర్రయ్యను పోలీస్‌స్టేషన్‌కు పిలిపించారు. మరుగుదొడ్డి నిర్మించుకునేందుకు అడ్డుపడొద్దని హెచ్చరించి పంపారు. -
అల్లుడి మరణంతో ఆగిన మామ గుండె!
తన కుమార్తె జీవితానికి వెలుగు ఇస్తాడనుకున్న అల్లుడు తనకన్నా ముందే చనిపోయాడన్న మరణవార్తను విన్న ఆ మామ తనువుచాలించాడు. కిడ్నీ వ్యాధితో అల్లుడు మృతి చెందగా.. ఆ వార్త విన్న మామ తట్టుకోలేక కన్నుమూశాడు. ఒకే రోజు అల్లుడు, మామ మృతితో ఆ కుటుంబాలు పెద్ద దిక్కు కోల్పోయాయి. కుటుంబాలు రోడ్డున పడ్డాయి. గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. బొరివంక గ్రామంలో ఈ రెండు హృదయవిధారక సంఘటనలు చోటుచేసుకున్నాయి. వివరాలు ఇలావున్నాయి. ఒడిశా: కవిటి మండలంలో బొరివంక గ్రామంలో ఒకే రోజు అల్లుడు, మామ మృతి చెందారు. కిడ్నీవ్యాధితో అల్లుడు డొంబురు బిసాయి ప్రాణాలు కోల్పోగా, ఆ వార్త విని తట్టుకోలేక మామ అప్పుడు పురియా తనువుచాలించాడు. గ్రామానికి చెందిన అప్పుడు పురియా తన కుమార్తె కమల బిసాయిను అదే గ్రామానికి చెందిన డొంబురు బిసాయికి ఇచ్చి పెళ్లి చేశాడు. అయితే వీరికి ఎప్పటికీ పిల్లలు కలగకపోవడంతో ఆ కుటుంబాన్ని తీవ్రంగా కలచివేసింది. దీంతో భార్య కమల బిసాయి స్వయంగా తన భర్త జీవితంలో మరో మహిళకు సగభాగమిచ్చి రెండో పెళ్లి చేసింది. ఆ తండ్రీ కూతుళ్ల ఉదార మనస్తత్వానికి దేవుడు సైతం కరుణిస్తూ రెండో పెళ్లి చేసుకున్న డొంబురు బిసాయి భార్య హేమలతకు ఇద్దరు కొడుకులు పుట్టారు. వీరికి శివకృష్ణ, సాయికృష్ణ అని పేర్లు పెట్టారు. ఆనందంగా ఉంటున్న ఆ కాపురంలో చేదు వార్త వినాల్సి వచ్చింది. డొంబురు బిసాయికి కిడ్నీ వ్యాధి సోకింది. అతడు ఈ వ్యాధితో బాధపడుతూ ఇటీవల చికిత్స పొందుతున్నాడు. తన కష్టార్జితాన్ని కొంతమొత్తం అమ్మేసి వైద్యం పొందుతున్నాడు. ఉన్న ఫళంగా రెండు రోజుల క్రితం ఇతడు కుప్పకూలిపోయాడు. వెంటనే బల్లిపుట్టుగకు చెందిన ఉద్దానం ఫౌండేషన్ అంబులెన్స్ సాయంతో అతనిని చికిత్స నిమిత్తం విశాఖపట్నం తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం తెల్లవారుజామున డొంబురు బిసాయి కన్నుమూశాడు. ఆ మరణవార్తను తెలుసుకున్న గ్రామంలో ఉన్న మామ అప్పుడు పురియా గుండె ఆగి అక్కడికక్కడే మృతిచెందాడు. ఒకే ఇంటిలో రెండు చావుబాజాలు మోగడంతో గ్రామంలో విషాదవాతావరణం అలుముకుంది. కుటుంబ సభ్యుల రోదన మిన్నంటింది. ఇక మాకు దిక్కెవరంటూ రోదించిన తీరు గ్రామస్తులను కంటతడి పెట్టించింది. ఇంటికి పెద్ద దిక్కులుగా ఉన్న ఇద్దరూ ఒకే రోజు మృతి చెందడంతో కుటుంబాలు రోడ్డున పడ్డారు. ముందుగా మామ అప్పుడు పురియాకు గ్రామస్తుల సహాయంతో అంత్యక్రియలు జరిపారు. అనంతరం విశాఖపట్నం నుంచి తీసుకువచ్చిన డొంబురు బిసాయి మృతదేహానికి తర్వాత గ్రామస్తులంతా వెళ్లి అంత్యక్రియలు జరిపారు. -
బాలికను గర్భవతిని చేసిన మేనమామ
బుచ్చెయ్యపేట (చోడవరం): శారీరక మార్పులను చుట్టుపక్కలవారు గమనిస్తున్నారు.. కడుపు అలా ఎత్తుగా ఉందేమిటమ్మా అని బాలికను ప్రశ్నిస్తున్నారు.. ఏదో సాకు చెప్పి అమ్మ సర్దిచెప్పేది.. ఎవరికీ కనిపించకుండా ఎక్కడో దాచేసేది.. అబార్షన్ చేయించేందుకు పలు ఆస్పత్రులకు తిప్పడంతో ఈ విషయం బయటపడింది. తమకు ఫిర్యాదు రావడంతో వెంటనే స్పందించిన ఐసీడీఎస్ అధికారులు బాలికను బాలసదనానికి తరలించారు. మేనమామే బాలిక గర్భానికి బాధ్యుడు కాగా.. కుటుంబ సభ్యులు వెనకేసుకు రావడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. బుచ్చెయ్యపేట మండలం పొట్టిదొరపాలెం గ్రామంలో ఈ సంఘటన జరిగింది. ఐసీడీఎస్ అధికారులకు స్థానికులు తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన గౌరీపట్నం సోమరాజుకు ఆరేళ్ల క్రిందట వివాహమైంది. ఇద్దరు పిల్లలు కలిగాక భార్య దేవితో విభేదాలు రావడంతో ఆమెను పుట్టింటికి పంపించేసి తన అక్క, బావ మాణిక్యం, చినబాబు ఇంట్లో మూడేళ్లుగా ఉంటున్నాడు. ఎనిమిదో తరగతి చదివి ఇంట్లో ఉంటున్న మేనకోడలిని మాయమాటలతో వశపరుచుకున్నాడు. గతంలో రెండుసార్లు ఆమెకు అబార్షన్ చేయించారు. మూడోసారి గర్భం తీయించడానికి విశాఖ, అనకాపల్లి, రావికమతం, చోడవరం ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే ఎనిమిదో నెల రావడంతో వైద్య సిబ్బంది నిరాకరించారు. బాలికలో మార్పులను ఇరుగుపొరుగు వారు గుర్తించి అడగడంతో.. కడుపులో కాయ పెరుగుతోందని, అందుకే ఆసుపత్రికి తీసుకెళుతున్నామని సోమరాజుతోపాటు తల్లి మాణిక్యం గ్రామస్తుల్ని నమ్మించేవారు. బాలిక బయట ఎక్కువగా తిరగకుండా పొలాల్లో, తోటల్లో ఎక్కువగా ఉంచుతున్నారని, ఒకవేళ పురుడు అయితే పుట్టిన బిడ్డ ఎవరి కంట పడకుండా ఏర్పాట్లు చేస్తున్నట్టు గ్రామస్తులు గ్రహించి ఐసీడీఎస్ సిబ్బందికి ఫిర్యాదు చేశారు. బాధితురాలు కిశోర బాలిక కావడంతో గ్రామానికి చెందిన అంగన్వాడీ టీచర్ పౌష్టికాహారం అందించేటపుడు ఆమె కడుపు చూసి అనుమానం వ్యక్తం చేసింది. శుక్రవారం రావికమతం ఐసీడీఎస్ పీవో మంగతాయారు తమ సిబ్బందితో వచ్చి బాలిక వాడుతున్న ఆసుపత్రి మందులు, డాక్టర్లు రాసిన రిపోర్టులను పరిశీలించి ఆమెకు ఎనిమిదో నెలగా గుర్తించారు. తల్లి మాణిక్యాన్ని, మేనమావ సోమరాజును నిలదీయగా కడుపులో కాయ పెరుగుతోందని, అందుకే ఆసుపత్రికి తిప్పుతున్నామని తప్పించుకోవడానికి చూశారు. ఐసీడీఎస్ సిబ్బంది వీరిపై ఆగ్రహం వ్యక్తం చేయడంతో బాలిక జరిగినదంతా ఐసీడీఎస్ సిబ్బందికి తెలిపింది. ఆమె ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని పీవో తన కారులో పెందుర్తి చైల్డ్ వెల్ఫేర్ కేంద్రానికి తీసుకువెళ్లారు. అక్కడ చేర్చుకోవడానికి నిబంధనలు అడ్డు రావడంతో భీమిలిలోని బాలసదన్‌కు తరలించారు. పీడీ ఆదేశం మేరకు ఈ సంఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నామని, శనివారం ఉదయం తల్లిదండ్రులను పిలిపించి విచారించిన అనంతరం పీడీ తగు నిర్ణయం తీసుకుంటారని పీవో చెప్పారు. -
పాపను చంపిన బాబాయికి యావజ్జీవం
ఒంగోలు క్రైం: అభం శుభం తెలియని సంవత్సరం ఏడు నెలల పాప కుందా ఆరాధ్యను అత్యంత కిరాతకంగా హతమార్చిన నేరస్తుడికి జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎంజీ ప్రియదర్శిని మంగళవారం యావజ్జీవ శిక్ష విధించారు. స్థానిక జిల్లా కోర్టు భవనాల ప్రాంగణంలోని జిల్లా న్యాయమూర్తి కోర్టులో ఈ సంచలన తీర్పును వెలువరించారు. ఒంగోలు నగరంలోని రాజాపానగల్‌రోడ్డులో నివాసం ఉంటున్న కుందా శ్రీధర్, సాహితీల కుమార్తె ఆరాధ్యను అత్యంత కిరాతకంగా సొంత బాబాయే హత్య చేశాడు. లోకమంటే కూడా తెలియని ఆ పాప ఆరాధ్య ఉసురు నిలువునా తీశాడు. ఆరాధ్య హత్య 2014 నవంబర్ 25న ఒంగోలు మండలం సర్వేరెడ్డిపాలెం పొలాల్లో జరిగింది. కేసును పూర్తి స్థాయిలో విచారించిన జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎంజి ప్రియదర్శిని నేరస్తుడైన కొండ్రు లక్ష్మినారాయణకు యావజ్జీవ కారగార శిక్షతో పాటు రూ.5 వేలు జరిమానా కూడా విధించారు. అప్పట్లో జిల్లాలోని ఈ ముక్కుపచ్చలారని కుందా ఆరాధ్య హత్య ఉదంతం పెను సంచలనం రేపింది. అప్పట్లో ఒంగోలు వన్‌టౌన్ íసీఐ బి.రవిచంద్ర కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వివరాలలోకెళితే... రాజాపానగల్‌రోడ్డులో నివాసం ఉంటున్న వడ్డెబోయిన నాగేంద్రరావు పెద్ద కుమార్తె సాహితీ. ఆమెను శ్రీధర్‌కిచ్చి వివాహం చేశారు. ఈ దంపతులకు ఆరాధ్య గారాలపట్టీ. అయితే సాహితీ సోదరి విశ్వాస్ సింధూజ ఉంది. సింధూజను టంగుటూరు మండలం పొందూరుకు చెందిన కొండ్రు లక్ష్మినారాయణకిచ్చి వివాహం చేశారు. ఈ నూతన దంపతులు కూడా రాజాపానగల్‌రోడ్డులోని మామ వడ్డెబోయిన నాగేంద్రరావు ఇంట్లోనే నివాసం ఉంటున్నారు. అయితే అక్క కూతురు అయిన ఆరాధ్యతో పిన్ని సింధూజ అత్యంత ప్రేమగా ఉండేది. రోజులో ఎక్కువ సమయం ముద్దు ముద్దుగా ఉన్న ఆరాధ్యతో గడుపుతూ ఉండేది. దీంతో తమ దాంపత్య ఏకాంతానికి భంగం వాటిల్లితుందని సింధూజ భర్త కొండ్రు లక్ష్మినారాయణ భావిస్తుండేవాడు. అది కాస్త ఆ ముక్కుపచ్చలారని ఆరాధ్యపై అసూయ, ద్వేషాలను లోలోపల పెంచుకుంటూ వచ్చాడు. అది కాస్త పాపను హతమార్చే స్థాయికి వచ్చి 2014 నవంబర్ 25న మిట్టమధ్యాహ్నం అమలు చేశాడు. తన ద్విచక్రవాహనంపై ఆరాధ్యను ఆడించుకుంటూ బజారుకు తీసుకెళ్ళాడు. అక్కడ నుంచి నేరుగా సర్వేరెడ్డిపాలెం పొలాల్లోకి తీసుకెళ్ళి పాప గొంతు నులిమి చంపేశాడు. అనంతరం పెట్రోలుపోసి తగులబెట్టాడు. అనంతరం ఏమి ఎరగనట్లు ఇంటికొచ్చేశాడు. పాప కనపడటం లేదని లక్ష్మినారాయణ భార్య సింధూజతో పాటు పాప తల్లిదండ్రులు, బంధువులు, కుటుంబ సభ్యులందరూ వెతకడం ప్రారంభించారు. తీరా ఆరాధ్యను బండి మీద తీసుకెళ్ళడానికి గమనించిన వారు పోలీసులకు అందజేశారు. పాప కనిపించటం లేదని పాప తల్లిదండ్రులు ఫిర్యాదు చేయటానికి పోలీస్‌స్టేషన్‌కు వస్తే వాళ్ళతో పాటు హంతకుడు కూడా కలిసి వచ్చాడు. తీరా సమాచారం తెలుసుకున్న పోలీసులు లక్ష్మీనారాయణను అదుపులోనికి తీసుకొని విచారిస్తే అసలు విషయం బయటపడింది. దీంతో పోలీస్ అధికారులు పాపను హత్య చేసి తగులబెట్టిన ప్రాంతానికి నిందితునితో సహా అక్కడకు చేరుకున్నారు. మృతదేహాన్ని పరిశీలించి ఆరాధ్య మృతదేహమేనని గుర్తించారు. ఆ తర్వాత కేసు విచారణ జిల్లా కోర్టులో కొనసాగింది. ఆ తర్వాత జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎంజి ప్రియదర్శిని నేరస్తుడికి యావజ్జీవ కారగార శిక్ష విధిస్తూ తీర్పునిచ్చారు. ప్రాసిక్యూషన్ తరపున పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎస్.శివరామకృష్ణ ప్రసాద్ వాధించారు. -
బాబాయి.. బాలిక హత్య?
అమృతలూరు: కుటుంబ కలహాల నేపథ్యంలో ఐదేళ్ల బాలిక, ఆమె బాబాయి అనుమానాస్పదంగా మృతి చెందారు. ఈ ఘటన మంగళవారం సంచలనం రేకెత్తించింది. అమృతలూరు–పెదపూడి గ్రామాల మధ్య తెనాలి–చెరుకుపల్లి ఆర్అండ్బీ రహదారి పక్కనే చోటు చేసుకుంది. సేకరించిన వివరాల మేరకు.. అమృతలూరుకు చెందిన రాపర్ల సుబ్బి కృష్ణ, ఝాన్సీవల్లి దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు సురేష్ బాబుకు వివాహమై ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. రెండో కుమారుడి సతీష్ వివా హం అయి ఏడాది కూడా పూర్తి కాలేదు. సోదరులిద్దరూ గత కొన్నేళ్లుగా గ్రామ దేవత పుట్లమ్మ తల్లిగుడి పక్కనే ఉన్న షాపును అద్దెకు తీసుకొని ఎరువులు, పురుగు మందుల దుకాణ వ్యాపారం సాగిస్తున్నారు. కమ్మ సామాజిక వర్గానికి చెందిన రాపర్ల సతీష్‌కు, యలవర్రులో ఎస్సీ మాల వర్గానికి చెందిన సజనకుమారితో పెద్దల వివాహం ఈ ఏడాది మార్చి లో చేశారు. అయితే వివాహమైన కొద్ది కాలానికే కుటుంబాల మధ్య కలహాలు రావడంతో దంపతులిద్దరూ విడివిడిగా వారి గ్రామాల్లో ఉంటున్నారు. మధ్యలో భార్య తాలూకు పెద్దలు అమృతలూరులోని సతీష్ కుటుంబం వద్దకు వచ్చి మా ట్లాడినా వారి చర్చలు విఫమయ్యాయి. దీంతో వారు వేర్వేరుగా ఉంటున్నారు. ఏం జరిగింది? రాపర్ల సతీష్‌కు అన్న రెండో కుమార్తె చరితాచౌదరి అంటే ఎనలేని ప్రేమ. ఎక్కడకు వెళ్లినా వెంటబెట్టుకుపోÄయేవాడు. ఈ నేపథ్యంలో ఎరువుల షాపు కావడంతో తెనాలిలో ఆడిట్ ఉందని, దీపావళి సామగ్రిని పిల్లలకు తీసుకువస్తానని చరితాచౌదరిని మోటార్ సైకిల్‌పై ఎక్కించుకుని సోమవారం సాయంత్రం తెనాలికి పయనమయ్యాడు. రాత్రికి కూడా రాకపోవడంతో సతీష్‌కు ఫోన్ చేశారు. ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో, కుటుంబ సభ్యులు కంగారుపడ్డారు. తెనాలి వైపు రోడ్డుకు ఇరువైపులా వెతుకులాట సాగించారు. అయినా వారి జాడ కనిపించలేదు. తెల్లారైనా ఇంటికి చేరుకుంటారని ఎదురు చూస్తున్నారు. ఇంతలో పొలాల వైపు వెళ్తున్న కొందరు అమృతలూరు – పెదపూడి గ్రామాల మధ్యలో ఎత్తివేసిన వైన్ షాపు దుకాణం వద్ద బాలిక మృతదేహం, షాపు ముందు సతీష్ మృతదేహాలను గుర్తించారు. వెంటనే గ్రామమంతటా తెలియడంతో అందరూ ఘటనా స్థలికి చేరుకున్నారు. స్థానిక పోలీసులు రంగప్రవేశం చేశారు. ఒంటిపై గాయాలు.. మృతుడు సతీష్ వద్ద ఒక బ్లేడు, కొంత నగదు, సెల్‌ఫోన్ ఉన్నాయి. అతని చేతిపై బ్లేడుతో కోసిన గాట్లు ఉన్నాయి. బలవంతంగా అతనిని కట్టివేసి ఏదైనా కూల్‌డ్రింక్‌లో సైనేడ్ కలిపి తాగించారా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఎవరినైనా గుర్తు పడుతుందేమోనని ముక్కుపచ్చలారని బాలికను కర్కశంగా చంపివేసి ఉంటారని భావిస్తున్నారు. మృతులిద్దరి మెడలపై నల్లటి ఆయిల్ పూసి ఉంది. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన పలువురు ఇది హత్యేనని చెబుతున్నారు. పోస్టుమార్టం రిపోర్టులో, పోలీసుల విచారణలో వాస్తవాలు వెల్లడి కావాల్సి ఉంది. ఘటనా స్థలికి గుంటూరు నుంచి వేలిముద్రల నిపుణులు, డాగ్‌స్క్వాడ్ బృందం వచ్చి ఘటనా స్థలిలో ఉన్న ఆధారాలను సేకరించారు. ఆధారాల సేకరణ ఘటనా స్థలికి తెనాలి డీఎస్పీ ఎం.స్నేహిత, తెనాలి వన్‌టౌన్ సీఐ బెల్లం శ్రీనివాసరావు, చుండూరు ఇన్చార్జి సీఐ బత్తుల కల్యాణరాజు, అమృతలూరు, చుండూరు ఎస్సైలు ఆర్ఎస్. శ్రీనివాస్, కె.విక్టర్‌లు, ఇన్చార్జి ఆర్ఐ ఎంవీఆర్ బ్రహ్మం సందర్శించి ఆధారాలను సేకరించారు.మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తెనాలి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించారు. దహన సంస్కారాలు, చేశారు. బాలికను పూడ్చి పెట్టారు. మృతుని సోదరుడు సురేష్‌బాబు ఫిర్యాదు మేరకు అమృతలూరు ఎస్ఐ ఆర్ఎస్ శ్రీనివాస్ కేసు నమోదు చేశారు. చుండూరు ఇన్చార్జి సీఐ బత్తుల కల్యాణరాజు కేసును దర్యాప్తు చేస్తున్నారు. -
మంత్రాల నెపంతో మామను, అత్తను చంపేశాడు
జష్పూర్: ఛత్తీస్‌గఢ్ లో దారుణం జరిగింది. చేతబడులు చేస్తున్నారనే నెపంతో ఓ వ్యక్తి తన సొంత మేనమామ, అత్తలను కొట్టి చంపాడు. జష్పూర్ జిల్లా కరదరి గ్రామంలో ఈ ఘోరం వెలుగుచూసుంది. గ్రామానికి చెందిన లండ్రూ రాం భార్య గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతోంది. దీనికి కారణం.. తన మేనమామ బిషున్ రాం(60), అతని భార్య బసంతి రాయ్(48)నే అని లండ్రూ అనుమానం. దీంతో వారిద్దరినీ అంతం చేయాలని పథకం పన్నాడు. ఆదివారం సాయంత్రం ఊరి బయట ఉన్న తన ఇంటికి వారిద్దరినీ ఆహ్వానించాడు. అయితే, ఆ దంపతులకు అనుమానం వచ్చింది. కానీ, లండ్రూరాం మాయమాటలు చెప్పి రప్పించాడు. మార్గమధ్యంలోనే వారితో వాదులాటకు దిగి ఇంటి సమీపంలోకి చేరాక ఇద్దరినీ కర్రతో తీవ్రంగా కొట్టి చంపాడు. సోమవారం సాయంత్రం ఆ మృతదేహాలను గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు లండ్రూను అదుపులోకి తీసుకున్నారు. తన భార్య ఆరోగ్య సమస్యలకు వారి మంత్రాలే కారణమనే అనుమానంతో చంపేసినట్లు అంగీకరించాడు. దీంతో అతనిపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. -
అల్లుడిని చంపిన కేసులో మేనమామకు జీవితఖైదు
ఆదోని రూరల్: పెసలబండ గ్రామంలో సొంత అక్క కుమారుడిని గొంతు కోసి హత్య చేసిన కేసులో మేనమామకు కోర్టు జీవితఖైదు విధించినట్లు తాలూకా సీఐ దైవప్రసాద్ తెలిపారు. 2016 మే 12వ తేదీన వీరేష్ తన అక్క కుమారుడైన మోహన్(7)ను మాయమాటలు చెప్పి పొలానికి తీసుకెళ్లి బ్లేడుతో గొంతు కోసి హత్య చేసినట్లు అప్పట్లో కేసు నమోదైంది. వీరేష్‌కు తన అక్క అప్పుడప్పుడు ఎవరికీ తెలియకుండా డబ్బులు ఇస్తుందనే విషయాన్ని మోహన్ తన కుటుంబీకులకు చెప్పడంతో అతనిపై కక్ష పెంచుకుని చంపేసినట్లు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ మేరకు సాక్షాధారాలు రుజువు కావడంతో జిల్లా అదనపు జడ్జి శ్రీనివాసరావు మంగళవారం జీవితఖైదు శిక్షను విధించినట్లు సీఐ తెలిపారు. దర్యాప్తు అధికారిగా వ్యవహరించిన సీఐ దైవప్రసాద్‌ను ఆదోని డీఎస్పీ కొల్లి శ్రీనివాసరావు, ఎస్పీ రవికృష్ణ అభినందించారు. ఈ కేసులో బాధితుడి తరపున పబ్లిక్ ప్రాసిక్యూటర్ రఫత్ కేసును వాదించారు. -
తండ్రిలాంటే మామే కోడలిపై దారుణం
-
బాలికపై మేనమామ అత్యాచారయత్నం
సైదాబాద్: వినాయక నిమజ్జనం చూపిస్తానని తీసుకెళ్లి వరుసకు మేనమామ అయిన వ్యక్తి ఓ బాలికపై అత్యాచారయత్నం చేశాడు. ఈ సంఘటన సైదాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఈ నెల 17న జరుగగా ఆలస్యంగా మంగళవారం వెలుగు చూసింది. నేపాల్‌కు చెందిన తులసి(35) ఉపాధి నిమిత్తం నగరానికి వచ్చి సింగరేణి వాంబే కాలనీలో నివాసం ఉండేవాడు. పూట గడవడానికి ఆటో నడపడం, వాచ్‌మెన్‌గా పనిచేయడం, బ్యాండ్ మేళాలు వాయించడం వంటివి చేస్తుంటాడు. ఇతనికి భార్య, ముగ్గురు పిల్లలు ఉండగా కొంత కాలంగా తన మకాంను చర్లపల్లి మార్చాడు. సింగరేణి కాలనీలో ఉండగా పక్కనే ఉండే వరుసకు కోడలు అయ్యే నేపాల్‌కు చెందిన బాలికతో పరిచయం పెంచుకున్నాడు. కాగా ఈ నెల 17న వినాయక నిమజ్జనం చూపిస్తానని చెప్పి బాలిక(11)ను తులసి తన ఆటోలో చర్లపల్లిలోని నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి అత్యాచారయత్నం చేశాడు. అక్కడి నుంచి బాలికను తన ఆటోలోనే సింగరేణి కాలనీకి తీసుకొచ్చి వదిలేశాడు. అయితే బాలిక జరిగిన విషయాన్ని ఆలస్యంగా కుటుంబ సభ్యులకు వివరించింది. దీంతో వారు సైదాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేయగా బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. నిందితుడు పరారీలో ఉన్నట్లు తెలిసింది. -
బాలికపై లైంగికదాడి
గర్భవతిని చేసిన మేనమామ నిందితుడి కోసం పోలీసుల గాలింపు ఉప్పలగుప్తం : మేనమామ పశువాంఛకు ఓ బాలిక బలైపోయింది. అన్నెంపున్నెం తెలియని ఆమె తనపై జరిగిన అకృత్యాన్ని అటు తల్లికి కానీ, ఇటు బంధువులకు కానీ చెప్పుకోలేక నరకం అనుభవించింది. ఆరు నెలలుగా రుతుక్రమం జరగకపోవడంతో తల్లి ప్రతీ నెలా ప్రశ్నించినా ఆ బాలిక దాటవేసింది. ఆమెకు బ్లీడింగ్ జరుగుతుండడంతో తల్లి ఆస్పత్రికి తీసుకు వెళ్లగా ఆ బాలిక గర్భవతి అని వైద్యులు తేల్చి చెప్పారు. దాంతో దిమ్మెర పోయిన ఆతల్లి ఆమెను నిలదీయగా వాస్తవాలు వెలుగు చూశాయి. ఉప్పలగుప్తం ఎస్సై రుద్రరాజు భీమరాజు శుక్రవారం తెలిపిన వివరాల ప్రకారం.. ఉప్పలగుప్తం మండలం గోపవరం గ్రామానికి చెందిన నిరుపేద దంపతులకు ఇద్దరు కుమార్తెలు. స్థానిక ఉన్నత పాఠశాలలో పెద్దకుమార్తె 9వ తరగతి చదువుతుండగా చిన్నకుమార్తె 7వ తరగతి చదువుతోంది. అదే గ్రామంలో కూతవేటు దూరంలో వారి మేనమామ మస్తాన్ సాహెబ్ నివాసముంటున్నాడు. అతను కూలిపని చేస్తుంటాడు. మస్తాన్ సాహెబ్ భార్య మూడేళ్ల క్రితం చనిపోయింది. మస్తాన్‌కు ఇద్దరు కుమార్తెలు కాగా పెద్దామెకు ఇటీవలే వివాహం చేశాడు. చిన్న కుమార్తె అమ్మమ్మ వద్ద ఉంటోంది. మస్తాన్ తల్లితో కలసి గోపవరంలో ఉంటున్నాడు. భార్య చనిపోయిన మస్తాన్ సాహెబ్ కన్ను పెద్దమేనకోడలిపై పడింది. ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ విషయం తల్లిదండ్రులకు, బంధువులకు చెబితే ఏం గొడవ వస్తుందో అని భయపడిన ఆబాలిక తనకు జరిగిన అన్యాయాన్ని బయట పెట్టలేదు. బాలికకు రక్తస్రావం కావడంతో తల్లి ఆమెను గురువారం అమలాపురం ఏరియా ఆస్పత్రికి తీసుకువెళ్లింది. ఆస్పత్రి నుంచి వచ్చిన సమాచారం మేరకు ఎస్సై భీమరాజు బాలికపై జరిగిన లైంగిక దాడిపై కేసు నమోదు చేశారు. ఆమెను గర్భవతిని చేసిన మస్తాన్ కోసం గాలిస్తున్నట్టు ఎస్సై తెలిపారు. -
హత్యకేసులో ముగ్గురి అరెస్ట్
తాడేపల్లిగూడెం రూరల్ : వివాహితను హత్య చేసిన కేసులో ముగ్గురిని అరెస్ట్‌చేసినట్లు పట్టణ పోలీసులు తెలిపారు. వారి కథనం ప్రకారం.. పట్టణంలోని కొబ్బరితోటకు చెందిన ఉర్రింకల జానకి(30) ఈ నెల 20న హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఈ కేసు దర్యాప్తులో భాగంగా పట్టణ సీఐ ఎం.ఆర్.ఎల్.ఎస్.ఎస్.మూర్తి మంగళవారం మృతురాలి భర్త గంగాధరరావు, అత్తమామలు బాలయోగి, సరస్వతిని అరెస్ట్ చేశారు. -
అల్లుడు కాదు.. కిరాతకుడు..!
ఆటోలో మీటర్ రాడ్డుకు మామ మెడను నొక్కి హత్య విజయవాడ (చిట్టినగర్) : భార్యను కాపురానికి పంపమంటే పంపడం లేదని ఆగ్రహించిన అల్లుడు మామకు మద్యం తాగించి ఆటోలో మీటర్ రాడ్‌కు మామ మెడను పెట్టి నొక్కి హత్యచేశాడు. ఈ ఘటన కొత్తపేట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నైనవరం ఫ్లై ఓవర్ దిగువున ఉన్న కాళీకృష్ణ మందిరం వద్ద రోడ్డు పక్కగా నిలిపి ఉన్న ఆటోలో ఓ వ్యక్తి శవమై ఉన్నాడని పోలీసులకు సమాచారం అందింది. సీఐ దుర్గారావు, ఎస్ఐలు సుబ్బారావు, అర్జునరాజులు ఘటనాస్థలాన్ని సందర్శించి మృతదేహాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. ఫ్లైఓవర్ దిగువున ఆటోలో శవం ఉందనే విషయం తెలుసుకున్న ఆటో కార్మికులు గుంపులుగుంపులుగా వచ్చి మృతుని గుర్తించేందుకు సహాయపడ్డారు. ఈ క్రమంలో విద్యాధరపురం ప్రాంతానికి చెందిన ఓ ఆటోడ్రైవర్ మృతుని గుర్తించి కుటుంబీకుల వివరాలను పోలీసులకు తెలిపాడు. దీంతో పోలీసులు లేబర్ కాలనీకి వెళ్లి మృతుని కుటుంబీకులను వెంట పెట్టుకుని ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతుని భార్య, కుమారుడు సుబ్బారావును గుర్తించడంతో కేసు ఓ కొలిక్కి వచ్చింది. భార్యను కాపురానికి పంపడం లేదనే.... విద్యాధరపురం లేబర్ కాలనీకి చెందిన సుబ్బారావు రెండో కుమార్తె నాగబేబీని క్వారీ ప్రాంతానికి చెందిన జోగవరపు వెంకటేష్‌కు ఇచ్చి పదేళ్ల క్రితం వివాహం జరిపించారు. ఆటో నడుపుకుంటూ జీవనం సాగించే వెంకటేష్ ఇద్దరు సంతానం కలిగిన తర్వాత భార్యను వదిలి కృష్ణలంకలో ఉంటున్న తన అక్క దగ్గరకు వెళ్లిపోయాడు. అయితే అప్పుడుప్పుడు అత్త గారి ఇంటికి వచ్చి దూరంగా ఉంటూ పిల్లలను చూసుకుని వెళుతుండేవాడు. కొద్ది రోజులుగా వెంకటేష్ తమ మామను కలిసి భార్యను కాపురానికి పంపాలని, లేకుంటే మీ ఇంట్లో ఎవరో ఒకరిని చంపుతానని బెదిరించేవాడు. శుక్రవారం ఉదయం సుబ్బారావు చేతికి గాయమైంది. ఆయన స్వగ్రామం నందిగామ మండలం కోకమపాలెం గ్రామానికి వెళ్లి కట్టు కట్టించుకుని వస్తానని చెప్పి భార్య వద్ద రూ. 300 తీసుకున్నాడు. ఊరు బయలుదేరుతుండగా ఆటోపై అల్లుడు వెంకటేష్ ఇంటికి వచ్చాడు. మామ దగ్గరకు వచ్చి భార్యను కాపురానికి పంపాలని అడిగాడు. దీనిపై వీరి మధ్య వాగ్వివాదం జరిగింది. అనంతరం మందు తాగుదామని చెప్పి మామను వెంకటేష్ వెంట తీసుకెళ్లాడు. సాయంత్రం అయినా సుబ్బారావు ఇంటికి రాకపోవడంతో స్వగ్రామం కోకయపాలెం వెళ్లి ఉంటాడని కుటుంబీకులు భావించారు. అయితే ఉదయం పోలీసులు వచ్చి సుబ్బారావు హత్యకు గురయ్యాడని చెప్పడంతో విలపించారు. నిందితుడు వెంకటేష్ కోసం పోలీసులు ఆరా తీయగా అతని ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఉండడంతో కృష్ణలంకలోని అక్క, బావలను అదుపులోకి తీసుకుని ఆరా తీస్తున్నారు. మృతుని భార్య శివపార్వతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. నిందితుడిపై రౌడీషీట్ నిందితుడిగా అనుమానిస్తున్న జోగవరపు వెంకటేష్‌పై వన్‌టౌన్ పోలీస్ స్టేషన్లో కిడ్నాప్ కేసు నమోదైంది. ఈ కేసులో వెంకటేష్‌పై రౌడీషీట్‌ను కూడా పోలీసులు తెరిచారు. ఆటో నడుపుకుంటూ జీవనం సాగించే వెంకటేష్ ప్రస్తుతం విద్యాధరపురంలో ఉండడంతో షీట్‌ను భవానీపురం పీఎస్‌కు బదిలీచేశారు. అయితే కొద్ది వారాలుగా వెంకటేష్ ఆదివారం సంతకాలు చేసేందుకు కూడా స్టేషన్‌కు రావడం లేదని తెలుస్తోంది. -
లైంగికదాడి, హత్య కేసులో...
నెల్లూరు(లీగల్) : కోడలిపై మామ లైంగికదాడి చేసి హత్య చేశాడని నమోదైన కేసులో నేరం రుజువు కావడంతో నిందితుడు నెల్లూరులోని మైపాడు రోడ్డు ప్రాంతానికి చెందిన షేక్ కాలేషాకు జీవిత ఖైదుతోపాటు నూ.1500ల జరిమానా, భర్త షేక్.రహిమాన్‌కు ఏడాది జైలు శిక్షతోపాటు రూ.500లు జరిమానా విధిస్తూ మొదటి అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి శ్యామలాదేవి మంగళవారం తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ కథనం మేరకు.. వేణుగోపాల్‌నగర్‌కు చెందిన రసూలమ్మ అలియాజ్ రసూలితో అదే ప్రాంతానికి చెందిన షేక్ రహిమాన్‌కు 2008లో పెద్దల సమక్షంలో వివాహమైంది. రహిమాన్ చెడు వ్యసనాలకు బానిసై భార్యను వేధించడం, బంగారు ఆభరణాలు తాకట్టు పెట్టేసేవాడు. భర్తతోపాటు మామ కాలేషా, అత్త ఖాదర్బీలు ఆమెను మానసికంగా, శారీరకంగా వేధించి రూ.50వేలు రొక్కాన్ని తీసుకు రమ్మని వేధించారు. ఆమె విషయాన్ని తన అన్న మస్తాన్‌బాబాకు చెప్పింది. మస్తాన్‌బాబు వారికి నచ్చజెప్పి వెళ్లారు. రహిమాన్ తన కాపురాన్ని వేణుగోపాల్‌నగర్ నుంచి రాజీవ్‌గాంధీ ప్రాంతంలోకి మార్చాడు. కోడలిని మామ తన కోరిక తీర్చమని అడుగుతుండేవాడు. ఆమె నిరాకరిస్తూ ఉండేది. అదును కోసం కాచుకొని ఉన్నాడు. 22-08-2012న భర్త రహిమాన్ , మామ పనికి వెళ్లారు. వెళ్లిన గంటకే మామ తిరిగి ఉంటికి వచ్చేశాడు. అదే అదునుగా భావించి కోడలిపై అఘాయిత్యం చేయబోగా ఆమె కేకలు వేయడంతో ఒక చేత్తో నోరుమూసి రెండో చేత్తో కడుపులో గుద్ది మంచంపై పడేసి లైంగికదాడికి యత్నించాడు. ఆమె పారిపోయేందుకు ప్రయత్నించింది. ఇంతలో మంచం కోడుతో ఆమె తలపై కొట్టడంతో స్పృహ కోల్పోయింది. అనంతరం ఆమెపై అత్యాచారం చేసి చీరను మెడకు వేసి వేలాడదీసి వెళ్లాడు. అనంతరం భర్త రహిమాన్, మామ కాలేషా ఇద్దరూ సాయంత్రం 4గంటలకు ఇంటికి చేరుకున్నారు. వారి ముందు మామ ఆమెను కిందకి దింపి చీరను తొలగించి అక్కడ నుంచి వెళ్లిపోయారు. మృతురాలు సోదరుడు మస్తాన్‌బాబా ఇచ్చిన ఫిర్యాదు మేరకు 2వ నగర పోలీసులు మామ షేక్ కాలేషా, భర్త రహిమాన్, అత్త షేక్ ఖాదర్బీలపై కేసు నమోదు చేసి దర్యాప్తు అనంతరం కోర్టులో చార్జ్‌షీట్ దాఖలు చేశారు. విచారణలో మామ కాలేషాపై అత్యాచారం, హత్యానేరాల కింద నేరం రుజువుకావడంతో జీవిత ఖైదు, జరిమానా, భర్త రహిమాన్పై వేధింపుల కేసు రుజువు కావడంతో ఏడాది జైలు, జరిమానా, అత్త ఖాదర్బీపై నేరం రుజువుకాకపోవడంతో ఆమెపై కేసును కొట్టివేస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ తరపున ఏపీపీ కేబీఎస్ మణి కేసు వాదించారు. -
కోడలిపై మామ అఘాయిత్యం
♦ పెళ్లయిన 20 రోజులకే.. ♦ ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన ♦ బాధితురాలు మైనర్ కామారెడ్డి : అందమైన జీవితంపై ఎన్నో ఆశలతో ఆమె మెట్టింట్లో అడుగు పెట్టింది. కళ్లల్లో పెట్టి చూసుకునే భర్త, తండ్రిలా చూసుకునే మామ ఉన్నారనుకొని మురిసిపోయింది. కానీ, ఆమె ఆనందం ఎక్కువ కాలం నిలవలేదు. పెళ్లయి నెల రోజులు కూడా తిరగలేదు.. తండ్రిలా చూసుకోవాల్సిన మామ కట్టు తప్పాడు. కోడలిపై అఘాయిత్యానికి ఒడిగట్టాడు. పైగా విషయం బయటకు చెబితే చంపుతానని బెదిరించాడు. కామారెడ్డి మండలంలోని దేవునిపల్లిలో చోటు చేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. బాధితురాలు మైనర్ అని తెలిసింది. ఎస్సై సంతోష్‌కుమార్ కథనం ప్రకారం.. దేవునిపల్లికి చెందిన మంగలి రాములు (50) కుమారుడి వివాహం ఏప్రిల్ 2న జరిగింది. సంతోషంగా మెట్టినింట్లో అడుగు పెట్టిన కోడలిపై రాములు కన్నేశాడు. ఏప్రిల్ 27న ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు. దీంతో ఆమె ఎవరికి చెప్పుకోలేక లోలోపల కుమిలిపోయింది. అయితే, మామ వేధింపులు రోజురోజుకి ఎక్కువయ్యాయి. విసిగిపోయిన బాధితురాలు జరిగిన విషయాన్ని ఫోన్లో తన తల్లికి తెలిపింది. ఆమె గురువారం దేవునిపల్లి ఠాణాలో పిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు. -
ఆ కేసు అత్తమామలపై కూడా వేయచ్చు!
గృహహింస :: కేస్ స్టడీ శ్రీలత వివాహమై నాలుగేళ్లయింది. భర్త ఐటీ ఉద్యోగి. రెండేళ్ల బాబు. దురదృష్టవశాత్తూ అనారోగ్యంతో భర్త మరణించాడు. అప్పటిదాకా భర్త, అత్తమామలతో కలిసి ఉన్న శ్రీలత పుట్టింటికి చేరింది. పుట్టెడు దుఃఖంతో ఉండి ఏ వ్యవహారాలూ పట్టించుకోలేదు. అత్తగారింట్లో దాదాపు యాభై తులాల బంగారం ఉండిపోయింది. బీరువాలో ఉంచి అత్తగారే తాళం వేశారు. భర్తచనిపోయిన నెలవరకూ అత్తింటివాళ్లు సానుభూతి చూపారు. ఏమైందో ఏమో హఠాత్తుగా వారి ప్రవర్తనలో మార్పు వచ్చింది. శ్రీలత వల్లే తమ కుమారునికి ఆరోగ్యం దెబ్బతిందనీ, ఆమె కారణంగానే అతను మరణించాడనీ, ఆమె జాతకం బాగోలేదనీ నిందించసాగారు. లేనిపోని అభాండాలు వేస్తూ, కొడుకే తమకు కాకుండా పోయాక కోడలితో తమకిక ఏ సంబంధమూ లేదని తెగేసి చెప్పారు. శ్రీలత వారి కడుపుకోతని అర్థం చేసుకుని మిన్నకుండింది. అత్తగారింటినుండి ఏ సహాయమూ ఆశించలేదు, అందలేదు. కానీ బీరువాలో ఉన్న నగలు ఆమె పుట్టింటివారు పెట్టినవి. అవి ఆమె స్త్రీ ధనం. వాటికోసం అత్తగారిని అడిగితే ఆమె ససేమిరా అన్నారు. తమకేం తెలీదని, శ్రీలతే వాటిని తీసుకొని వెళ్లిందని గొడవ పెట్టుకున్నారు. అత్తగారు ఆ నగలను అమ్మే ప్రయత్నం చేస్తున్నారని తెలిసి శ్రీలత విస్తుపోయింది. తెలిసినవారు గృహహింస కేసు వేయమన్నారు. సాధారణంగా ఆ కేసులు భర్తలపై వేస్తారు కదా! మరి అత్తగారిపై వేయవచ్చా అనే సందేహంతో న్యాయవాదిని ఆశ్రయించింది. అత్తమామలపై ఖచ్చితంగా కే సు వేయవచ్చునని, శ్రీలతకు వారు వివాహం ద్వారా బంధువులవుతారని, అందువల్ల గృహహింస చట్టం ప్రకారం వారిపై కేసు వేయవచ్చునని న్యాయవాది తెలిపారు. నగలకు సంబంధించిన బిల్లులు, బీరువాలో అత్తగారు భద్రపరిచిన విషయం తెలిసిన సాక్షులు, కట్టుబట్టలతో పుట్టింటికి వెళ్లిన వైనం తెలిసిన శ్రేయోభిలాషులు ఉండడంతో ఊపిరి పీల్చుకొని కే సు వేసి, తన స్త్రీధనం దక్కించుకోవాలని నిర్ణయించుకుంది శ్రీలత. -
అల్లుడి కుటుంబం దాడి,మామ ఆత్మహత్య
బోడుప్పల్: పురుగుల మందు తాగిన ఓ వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందిన సంఘటన శనివారం మేడిపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్ఐ వెంకటయ్య సమాచారం మేరకు... బోడుప్పల్ యాదవబస్తీకి చెందిన కురకల వెంకటేశ్(45), రుక్కమ్మ దంపతులు. వారికి రాధిక అనే కుమార్తె ఉంది. ఆమెను రాజేశ్ అనే వ్యక్తికి ఇచ్చి నాలుగు సంవత్సరాల క్రితం వివాహం చేశారు. రాజేశ్, రాధిక మధ్య తరుచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఈనెల 24న కుమార్తె దగ్గరకు వెంకటేశ్ వెళ్లాడు. అక్కడ మాట మాట పెరిగి అల్లుడు రాజేశ్, వెంకటేశ్‌కు మధ్య గొడవ జరిగింది. ఇదే సమయంలో రాజేశ్ కుటుంబ సభ్యులు వెంకటేశ్‌పై దాడి చేశారు. దీంతో తీవ్ర మనస్థాపం చెందిన వెంకటేశ్ ఇంటికి వచ్చిన తరువాత ఈనెల 28న పురుగుల మందు తాగాడు. చికిత్స నిమిత్తం గాంధీ ఆసుపత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు. వెంకటేశ్ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు మేడిపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
మామను అంతమొందించిన అల్లుడు
క్రోసూరు: గుంటూరు జిల్లా క్రోసూరు మండలం విప్పర్ల గ్రామంలో ఘోరం చోటు చేసుకుంది. ఓ వ్యక్తి కిరాయి ముఠాతో పిల్లను ఇచ్చిన మామను హత్య చేయించాడు. ఆదివారం అర్ధరాత్రి 2.30 గంటల సమయంలో జరిగిన ఈ ఘటన వివరాలు ఎస్ఐ బ్రహ్మం కథనం మేరకు ఇలా ఉన్నాయి. సత్తెనపల్లి మండలం దొంగగామపాడు గ్రామానికి చెందిన వెంకటకృష్ణయ్య (63)కు ఐదుగురు కుమార్తెలు. నాలుగో కుమార్తెను క్రోసూరు మండలం విప్పర్ల గ్రామానికి చెందిన అంకమరావు వివాహం చేసుకున్నాడు. అయితే, వీరికి సంతానం లేకపోయేసరికి ఐదో కుమార్తెను కూడా తనకిచ్చి చేయాలని ఏడాదిగా అంకమరావు ఒత్తిడి చేస్తున్నప్పటికీ మామ ఒప్పుకోవడం లేదు. వెంకటకృష్ణయ్య కుటుంబం కూడా విప్పర్లకు వచ్చి అంకమరావుతోనే కలసి ఉంటోంది. ఈ నేపథ్యంలో అంకమరావు కిరాయిముఠాతో మామను హత్య చేయించేందుకు పథకం వేశాడు. ఈ క్రమంలో ఆదివారం అర్ధరాత్రి 12 మంది వ్యక్తులు వచ్చి కృష్ణయ్యను ఇంట్లో నుంచి బయటకు ఈడ్చి తీవ్రంగా కొట్టి చంపారు. అనంతరం అంకమరావుతోపాటు వారందరూ పరారయ్యాడు. క్రోసూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. -
కడుపుకోత
కందుకూరు/ కడ్తాల (మహబూబ్‌నగర్) : పండగకు ముందు రోజు ఓ ఇంటి తీవ్ర విషాదం అలుముకుంది. మహబూబ్‌నగర్ జిల్లాలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో కందుకూరు మండలం సాయిరెడ్డిగూడెం గ్రామానికి చెందిన ఇద్దరు చిన్నారులు, వారి మేనమామ దుర్మరణం చెం దారు. వివరాల్లోకి వెళితే.. కందుకూరు మండలం శాయిరెడ్డిగూడెంలో శ్రీలత, చిందం శ్రీశైలం దంపతులకు కూతురు శ్రీజ (8), మణికంఠ (5) ఉన్నారు. ముచ్చర్ల గేట్ సమీపంలోని అక్షరజ్యోతి పాఠశాలలో శ్రీజ 2వ తరగతి, మణికంఠ ఎల్కేజీ చదువుతున్నారు. ఇదిలా ఉండగా.. మహబూబ్‌నగర్ జిల్లా తలకొండపల్లి మండలం రావిచేడ్‌కు చెందిన నరేష్ (28) (శ్రీలత సోదరుడు) సంక్రాతి పండగకు చెల్లెలు, బావలను తీసుకెళ్దామని మంగళవారం ఉదయం బైక్‌పై సాయిరెడ్డిగూడెం వచ్చాడు. అయితే వ్యవసాయ పనులున్నందున పండగ రోజు వస్తామని వారు చెప్పడంతో మేనల్లుడు, మేనకోడలితో కలిసి స్వగ్రామానికి బయలుదేరాడు. రాత్రి 7.30 గంటలకు ఆమనగల్లు మండలం కడ్తాల గ్రామపంచాయతీ పరిధిలోని పోచమ్మగడ్డతండా గేటు వద్దకు చేరుకోగానే గుర్తుతెలియని వాహనం అతివేగంతో వచ్చి ఢీకొనడంతో మామతో పాటు మేనల్లుడు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. తీవ్ర గాయాల పాలైన శ్రీజను చుట్టుపక్కలవారు గమనించి వెంటనే చికిత్స నిమిత్తం 108 వాహనంలో ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందింది. ఈ విషయమై పోలీసులకు సమాచారమివ్వడంతో అక్కడికి చేరుకుని సీఐ వేణుగోపాల్‌రెడ్డి, ఎస్ఐలు సాయికుమార్, రాంబాబు పరిశీలించి కేసు దర్యాప్తు చే పట్టారు. కాగా, నరేష్‌కు భార్య కొమురమ్మతో పాటు కూతురు లక్కీ, కుమారుడు చింటు ఉన్నారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్తులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. అక్కడ మేనమామ, మేనల్లుడు విగత జీవులుగా పడి ఉండడం చూసి వారు కంటతడిపెట్టారు. మరికాసేపట్లో మామయ్య ఇంటికి వెళ్తామని సంతోషంగా ఉన్న ఇద్దరు చిన్నారుల మృతదేహాలను చూసి ప్రతి ఒక్కరు చలించిపోయారు. అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కల్వకుర్తి ప్రభుత్వ ఆస్పత్రిలోని మార్చురీకి తరలించారు. ఈ సంఘటనతో రావిచెడ్, శాయిరెడ్డిగూడెంలో విషాదఛాయలు అలుముకున్నాయి. -
అంకుల్ ద్రోహం..12 ఏళ్ల బాలికకు నరకం
న్యూఢిల్లీ: ఒకవైపు మహిళలపై హింసకు వ్యతిరేకంగా వారోత్సవాలు. మరోవైపు దేశ రాజధాని నడిబొడ్డులో ఓ మైనర్ బాలికపై అఘాయిత్యం. ఉద్యోగం పేరుతో తీసుకొచ్చిన ఓ బాలికను రూ. 50వేలకు అమ్మేశాడో దుర్మార్గుడు. దగ్గరి బంధువే నమ్మించి... ద్రోహం చేయడంతో 12 ఏళ్ల బాలిక అంతులేని నరకాన్ని అనుభవించింది. ఉత్తరప్రదేశ్ లోని మధురైలో ఉంటున్న ఒడిషాకు చెందిన ఓ బాలికకు ఆమె సమీప బంధువు ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించాడు. ఢిల్లీలో ఉద్యోగం ఉందని చెప్పి గుర్గావ్లోని పల్వాల్ గ్రామానికి తీసుకొచ్చాడు. నాలుగు నెలల తర్వాత తన వికృత రూపాన్ని బయటపెట్టాడు. పెళ్లి చేసుకోమని బలవంతపెట్టాడు. దీనికి బాలిక నిరాకరించడంతో మరో ఎత్తుగడ వేశాడు. 50 వేలకు ఆ బాలికను ఓ వ్యక్తికి అమ్మేశాడు. అప్పటి నుంచి ఆమెపై లైంగికదాడులు చేస్తూ నరకం చూపించాడు కొనుక్కున్న వ్యక్తి. ఆ కామాంధుడి చెర నుంచి ఎలాగోలా తప్పించుకుని పారిపోతుండగా మరోసారి దురదృష్టం ఆమెను కాటేసింది. పల్వాల్ బస్టాండ్‌లో బస్సు కోసం చూస్తూ ఉండగా.. ఆటోలో వచ్చిన ఇద్దరు దుండుగులు ఆమెను ఎత్తుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం సమీపంలోని పొలాల్లో పడేసి వెళ్లిపోయారు. అపస్మారక స్థితిలో పడి ఉన్న బాలికను గమనించిన స్థానికులు పల్వాల్ మహిళా పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో విషయం వెలుగులోకి వచ్చింది. బాలిక తెలిపిన సమాచారం ఆధారంగా కేసు నమోదుచేసిన పోలీసులు గోవర్థన్, జితేందర్ అనే ఇద్దరు నిందితులను గుర్తించారు. కిడ్నాప్, అత్యాచారం, అనంతరం పొలాల్లో వదిలేసిన ఘటనలో వారిపై వివిధ చట్టాల కింద కేసులు పెట్టారు. మరోవైపు బాలిక బంధువు, ఆమెను కొనుక్కున్న వ్యక్తి కోసం ఆరా తీస్తున్నారు. వారిపై లుక్ అవుట్ నోటీసు జారీచేశారు. వైద్య పరీక్షల అనంతరం బాలికను చైల్డ్ ప్రొటెక్షన్ కేంద్రానికి తరలించారు. విచారణ అనంతరం ఆమె తల్లిదండ్రులకు అప్పగించనున్నామని తెలిపారు. అటు ఒడిశా, ఉత్తరప్రదేశ్, హర్యానా కేంద్రాలుగా వ్యవస్థీకృతమైన అక్కమ సిండికేట్ పని చేస్తోందని అనుమానిస్తున్నారు. ఇలాంటి వ్యభిచార ముఠా తమ కార్యకలాపాలు నిర్వహిస్తున్న విషయం తమ దృష్టిలో ఉందన్నారు. దీనిపై ఆయా రాష్ట్రాల్లోని సంబంధిత శాఖల సంయుక్త ఆధ్వర్యంలో విచారణ చేపట్టనున్నామని పోలీసు ఉన్నతాధికారి వెల్లడించారు. -
ప్రేమ పేరుతో విద్యార్థినిని మోసగించిన మామ
-
నయవంచన
- ప్రేమ పేరుతో విద్యార్థినిని మోసగించిన మామ - కాళ్లావేళ్లాపడినా కనికరించని వైనం - ఆపై మూడు నెలలుగా ఇంట్లో నిర్బంధం - చుట్టుముట్టిన వ్యాధులు, మానసిక ఒత్తిళ్లు - స్థానికుల చొరవతో రుయాకు తరలింపు - చికిత్స పొందుతున్న యువతి తిరుపతి కార్పొరేషన్ : ఆ విద్యార్థిని కుటుంబం కటిక పేదరికం. అయినా సరే తల్లి ప్రోత్సాహంతో ఇంటర్లో ఎంపీసీ పూర్తి చేసి ఉన్నత చదువులు కావాలని కలలు కనింది. ఇంతలో మామ వరసయ్యే ఓ కామాంధుడు ప్రేమ పేరుతో దగ్గరయ్యాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి చనువు పెంచుకున్నాడు. ఆపై ఉడాయించడం తో కళ్ల ముందే ఆశల శౌధం కుప్పకూలింది. చదువు కొనసాగించలేక, ఉన్నత లక్ష్యం చేరుకోలేక, ప్రేమ పేరుతో వంచనకు గురైంది. ఆపై మూడు నెలలుగా గృహ నిర్భంధంలో మానసికంగా చిత్రహింసలు పడింది. ఎట్టకేలకు స్థానికుల చొరవతో తిరుపతి రుయా ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. వైద్యులు, బాధితుల కథనం మేరకు... రేణిగుంట నుంచి శ్రీకాళహస్తికి వెళ్లేమార్గంలోని మాతమ్మ గుడి ప్రాంతంలో పి.ఎం.శ్రీనివాసులు, ప్రమీలావతి కాపురం ఉంటున్నారు. వీరికి ఇద్దరు కొడుకులు, ఒక కూతురు. కాగా కూతురు దివ్యభారతి (19) రేణిగుంటలోని ఓ కళాశాలలో ఇంటర్ మీడియట్ చేరింది. ప్రథమ శ్రేణిలో పాసైంది. ప్రేమ పేరుతో కెరీర్‌కు పుల్‌స్టాప్ ఈ నేపథ్యంలో వరుసకు మామ అయ్యే మాతయ్య (31) దివ్యభారతి ఇంటికి వస్తూ పోతూ ఆమెతో పరిచయం పెంచుకున్నాడు. ప్రేమిస్తున్నానంటూ వెంటపడి చనువుగా మెలిగాడు. తన అవసరం తీరాక పెళ్లి చేసుకోలేనంటూ ఖరాకండిగా చెప్పేశాడు. పైగా ఎవరినైనా ప్రేమించి పెళ్లి చేసుకో అంటూ ఉచిత సలహా ఇచ్చి వెళ్లిపోయాడు. ప్రేమించిన వ్యక్తి మోసం చేయ డం, పెళ్లి చేసుకోలేనని చెప్పడంతో కుమిలిపోయింది. ఆమె భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారింది. మూడు నెలలుగా గృహ నిర్భంధం... ఇదే క్రమంలో తల్లి ఎలాగైనా తన కూతురుని ప్రేమ ఆలోచనల నుంచి దృష్టి మరల్చాలని ఇంట్లో నిర్భంధించింది. దీంతో మూడు నెలలపాటు బయటి ప్రపంచాన్ని చూడలేక పోయింది. మూడు నెలలుగా గృహ నిర్భంధం కావడంతో మానసిక ఒత్తిడితోపాటు చర్మపు వ్యాధి సోకింది. ఈ విషయమై రుయా ఆస్పత్రి సివిల్ అసిస్టెంట్ సర్జన్ ఆర్ఎంవో డాక్టర్ శ్రీహరిని సంప్రదించగా 15 రోజుల్లో సాధారణ స్థితికి తీసుకొస్తామన్నారు. -
వికలాంగురాలిపై మేనమామ అత్యాచారం
హోసూరు (కర్ణాటక) : వికలాంగురాలైన మేనకోడలిని బెదిరించి ఆరు మాసాలుగా అత్యాచారం చేస్తున్న మేనమామ కిరాతకం ఆలస్యంగా మంగళవారం బయటపడింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... కర్ణాటక రాష్ట్రం హోసూరు పట్టణం డెంకణీకోట తాలూక అంచెట్టి సమీపంలోని ఏ.పుదూరు గ్రామానికి చెందిన ఓ రైతుకు వికలాంగురాలైన కూతురు(17) ఉంది. గేరెట్టి గ్రామానికి చెందిన అమావాసి(40) ఆ అమ్మాయికి మేనమామ. కాగా ఆమెను బెదిరించి ఆరు నెలలుగా ఆమెపై అత్యాచారానికి పాల్పడుతున్నాడు. ఇటీవల కూతురి ఆరోగ్య పరిస్థితిపై అనుమానం వచ్చిన తల్లిదండ్రులు ఆమెను ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్ళి పరీక్షించగా గర్భవతి అని వైద్యులు తేల్చారు. దీంతో వారు విషయం తెలుసుకుని డెంకణీకోట మహిళా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని పరారీలో ఉన్న అమావాసి కోసం గాలిస్తున్నారు. -
కాపురానికి పిలవలేదని.. ఏడుగురి సజీవదహనం
-
కాపురానికి పిలవలేదని.. ఏడుగురి సజీవదహనం
చెన్నై: తమిళనాడు రాష్ట్రంలోని మధురై జిల్లాలో ఓ దారుణం వెలుగుచూసింది. ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు సజీవ దహనమయ్యారు. ఇదంతా చేసినది ఆ ఇంటి కోడలే! తన భర్త తనను చాలా కాలంగా కాపురానికి పిలవడం లేదనే కోపంతోనే ఆమె ఈ అఘాయిత్యానికి ఒడిగట్టినట్టు తెలిసింది. కుటుంబ సభ్యులు నిద్రిస్తున్న సమయంలో ఆమె తన భర్త, అత్త మామలు నివసిస్తున్న ఇంటికి నిప్పుంటించింది. దాంతో భర్త, అత్తమామలతో పాటు ఏడుగురు సజీవదహనమయ్యారు. అంతా నిద్రలోనే ప్రాణాలు కోల్పోయారు. ఈ దారుణ ఘటన అనంతరం ఆమె స్వయంగా వెళ్లి, పోలీసుల ఎదుట లొంగిపోయింది. అయితే భార్యాభర్తల మధ్య ఇంతకుముందు ఎలాంటి గొడవలు జరిగాయో, ఎందుకు ఆమె ఇంతటి దారుణానికి ఒడిగట్టిందోననే విషయాలు మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది. -
వాగులో పడి మామాఅల్లుళ్ల మృతి
ఆదిలాబాద్: ప్రమాదవశాత్తు వాగులో పడి ఇద్దరు మృతిచెందిన సంఘటన మంగళవారం ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం లక్కంపూర్ గ్రామంలో చోటుచేసుకుంది. దస్రుపటేల్గూడ గ్రామానికి చెందిన చిక్రమ్ కిషన్, రాంబాయిల కుమారుడు పవన్(9), పవన్‌కు వరసకు మామ అయిన సిడాం సూర్యభాన్ (40) జైతుపటేల్గూడ గ్రామంలో పెళ్లికి వెళ్తున్నారు. రెండు గ్రామాల మధ్య ఉన్న చిక్మన్ ప్రాజెక్టును నాటు పడవ సాయంతో దాటుతుండగా ప్రమాదవశాత్తు నీటిలో పడి మునిగిపోయారు. గ్రామస్తులు వచ్చి గాలించగా, మృతదేహాలు లభ్యమయ్యాయి. అయితే, లక్కంపూర్ గ్రామానికి రోడ్డు సౌకర్యం లేకపోవడంతో నాటు పడవను ఆశ్రయించిన మామఅల్లుళ్లు ప్రాణాలు కోల్పోయారని గ్రామస్తులు అంటున్నారు. -
వృద్ధులకు ఆరోగ్య ధీమా
వైద్య చికిత్సలకయ్యే ఖర్చు భారీగా పెరుగుతున్న తరుణంలో ఇప్పుడు ప్రతీ ఒక్కరికి ఆరోగ్య బీమా ఉండాల్సిన అవసరం ఏర్పడింది. వయసుతో పాటు ఆరోగ్య సమస్యలు పెరుగుతాయి కాబట్టి కుటుంబంలో తల్లిదండ్రులు, అత్తమామల విషయంలో మరింత ఆరోగ్య ధీమా కల్పించాల్సిన అవసరం ఉంది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఐఆర్డీఏ పెద్దవాళ్ల ఆరోగ్య బీమా విషయంలో కొన్ని కీలక సంస్కరణలు చేసింది. సాధారణంగా వయస్సు పెరిగిన తర్వాత ఆరోగ్య బీమా పాలసీల ప్రీమియం అధికంగా ఉంటుంది. కానీ కొన్ని జాగ్రత్తలు పాటించడం ద్వారా ప్రీమియం భారాన్ని సాధ్యమైనంత తగ్గించుకోవచ్చు. ఈ విషయాలపై అవగాహన కల్పించేదే ప్రాఫిట్ ముఖ్య కథనం. ఇప్పుడు అందరికీ ముఖ్యంగా వయోవృద్ధులకు కూడా ఆరోగ్య బీమా రక్షణను ఐఆర్డీఏ అందుబాటులోకి తీసుకొచ్చింది. గత కొంత కాలంగా వయసు పెరిగిన వారు ఆరోగ్య బీమా పాలసీలు తీసుకోవడంలో ఎదుర్కొంటున్న సమస్యలను ఐఆర్డీఏ పరిష్కరించింది. గతంలో 50 ఏళ్లు దాటిన వారికి పాలసీ లభించేదే కాదు. ఒకవేళ ఒకటి రెండు కంపెనీలు ఇచ్చినా ప్రీమియం అందుబాటు ధరలో ఉండేది కాదు. ఇప్పుడు ఇక ఈ సమస్య లేదు. సరైన కారణం చూపించకుండా హెల్త్ ఇన్సూరెన్స్ పథకం జారీ చేయకపోవడం, ప్రీమియం పెంచడం వంటివి చేయడానికి వీలులేదు. అలాగే చాలా బీమా కంపెనీలు 45 ఏళ్లు దాటిన తర్వాత తీసుకునే పాలసీదారులకు ముందుగానే అన్ని ఆరోగ్య పరీక్షలు జరిపించేవారు. ఈ పరీక్షల వ్యయంలో కొంత మొత్తాన్ని కొన్ని కంపెనీలు భరిస్తే మరికొన్ని కంపెనీలు ఒక్క పైసా కూడా చెల్లించేవి కావు. ఇప్పుడు ఈ విషయంలో కూడా ఐఆర్డీఏ స్పష్టమైన ఆదేశాలను జారీ చేసింది. 45 ఏళ్లు దాటిన వారికి వైద్య పరీక్షలు చేయించిన తర్వాత పాలసీ మంజూరు చేస్తే ఆ వ్యయంలో 50% బీమా కంపెనీ భరించాల్సి ఉంటుంది. అంతేకాదు వైద్య పరీక్షల తర్వాత పాలసీ మంజూరు చేశారు కాబట్టి క్లెయిమ్‌లను తిరస్కరించడానికి అవకాశం ఉండదు. అలాగే ఇప్పుడు 65 ఏళ్ళ వారి వరకు హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలు తీసుకోవచ్చు. ఈ నిబంధనలు మారిన తర్వాత చాలా కంపెనీలు వృద్ధులకు ప్రత్యేక పాలసీలను ప్రవేశపెట్టాయి. కొన్ని కంపెనీలు అయితే 70-80 ఏళ్ల వారికి కూడా పాలసీలు అందిస్తున్నాయి. వయసు పెరిగే కొద్దీ ప్రీమియం రేట్లు పెరుగుతుంటాయి. కాబట్టి సాధ్యమైనంత వరకు చిన్న వయసులోనే పాలసీ తీసుకోవడం మంచిది. ఒకవేళ వయసు పెరిగిన తర్వాత తీసుకోవాలంటే కొన్ని జాగ్రత్తలు పాటించడం ద్వారా ప్రీమియం భారం తగ్గించుకోవచ్చు. ఇంటిలోని పెద్ద వయసు వారి పేరు మీద పాలసీ తీసుకునేటప్పుడు తప్పనిసరిగా పాటించాల్సిన అంశాలను ఇప్పుడు పరిశీలిద్దాం.. వ్యక్తిగతానికి దూరం.. తల్లిదండ్రులు, అత్తమామల పేరు మీద పాలసీ తీసుకోవాలనుకుంటే వ్యక్తిగత పాలసీల కంటే గ్రూపు పాలసీలకేసే మొగ్గు చూపండి. ఈ వయ సులో వ్యక్తిగత పాలసీలు తీసుకుంటే ప్రీమియం అధికంగా చెల్లించాల్సి వస్తుంది. అదే మీరు పనిచేస్తున్న కంపెనీ ఏదైనా ఆరోగ్య బీమా పాలసీ అందిస్తుంటే అందులో వీరికి కూడా బీమా రక్షణ కల్పించే అవకాశం ఉందా లేదా అని అడిగి తెలుసుకోండి. ఒకవేళ లేకపోతే వివిధ కంపెనీలు అందిస్తున్న ఫ్యామిలీ ఫ్లోటర్ పాలసీలను తీసుకోండి. ఇప్పుడు చాలా బీమా కంపెనీలు ఒకే పాలసీ కింద ఆరు నుంచి ఎనిమిది మంది రక్త సంబంధీకులకు బీమా రక్షణ కల్పిస్తున్నాయి. అదే మ్యాక్స్‌బూపా వంటి మరికొన్ని కంపెనీలు అయితే ఏకంగా 13 మంది రక్త సంబంధీకుల వరకు కూడా బీమా కల్పిస్తున్నాయి. ఇలా కుటుంబ సభ్యులందరికీ కలిపి ఒకే పాలసీ తీసుకోవడం వల్ల అందరికీ ఆరోగ్య బీమా రక్షణతో పాటు, చెల్లించే ప్రీమియంలో 50-60% తగ్గింపు ప్రయోజనం లభిస్తుంది. కో-పేమెంట్... ఒకవేళ కుటుంబమంతా కలసి ఒకే పాలసీ తీసుకునే అవకాశం లేని వారికి ప్రీమియం తగ్గించుకోవడానికి కో-పేమెంట్ అనేది ఒక చక్కటి మార్గం. ఈ ఆప్షన్లో క్లెయిమ్ భారాన్ని ఇద్దరూ భరించాల్సి ఉంటుంది. కో-పేమెంట్ అంటే క్లెయిమ్ మొత్తం బీమా కంపెనీ చెల్లించకుండా కొంత మొత్తం మీరు చెల్లించాల్సి ఉంటుంది. సాధారణంగా కంపెనీలు 10 నుంచి 20% కో-పేమెంట్‌గా నిర్ణయిస్తాయి. ఉదాహరణకి మీరు తీసుకున్న పాలసీలో కో-పేమెంట్ 20 శాతంగా ఉందనుకుందాం. ఇప్పుడు మీ క్లెయిమ్ మొత్తం రెండు లక్షలు అయితే అందులో బీమా కంపెనీ కేవలం రూ.1.60 లక్షలే చెల్లిస్తుంది. మిగిలిన రూ.40 వేలు మీరు చెల్లించాల్సి ఉంటుంది. ఇలా కో-పేమెంట్ ఆప్షన్ ఎంచుకోవడం వలన ఆ మేరకు ప్రీమియం భారం కొంత మేర తగ్గుతుంది. అంతేకాదు కో-పేమెంట్ ఆప్షన్లో మీకు భాగస్వామ్యం ఉంటుంది కాబట్టి అనవసర చికిత్సా వ్యయాలు ఉండవన్న భావనతో బీమా కంపెనీలు ఈ ఆప్షన్‌కు పెద్ద పీట వేస్తున్నాయి. అప్పటికే వ్యాధులు ఉంటే... ఇప్పుడు చిన్న వయసులోనే బీపీ, షుగర్లు వంటి ఆర్యోగ సమస్యలు సహజం. అందులో వయసు పెరిగిన వారికి ఏదో ఒక ఆరోగ్య సమస్య ఉండటం అంతే అత్యంత సహజం. పాలసీ తీసుకునే సమయానికి ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉంటే వాటి గురించి తప్పకుండా ముందే తెలియచేయండి. దీనివల్ల క్లెయిమ్ సమయంలో ఇబ్బందులు ఉండవు. అంతే కాదు ఇప్పుడు చాలా బీమా కంపెనీలు అప్పటికే ఉన్న వ్యాధులకు వివిధ నిబంధనలతో కూడిన బీమా రక్షణను అందిస్తున్నాయి. కొన్ని బీమా కంపెనీలు అప్పటికే ఉన్న వ్యాధుల చికిత్సా వ్యయంలో సగం భారాన్ని భరిస్తుంటే, మరికొన్ని కంపెనీలు రెండు మూడేళ్ల లాకిన్ పీరియడ్ తర్వాత బీమా రక్షణ కల్పిస్తున్నాయి. ఉదాహరణకు స్టార్ హెల్త్ అందిస్తున్న రెడ్‌కార్పెట్ పాలసీ మొదటి ఏడాది నుంచే అప్పటికే ఉన్న వ్యాధులకూ బీమా రక్షణ అందిస్తోంది. అందుకే బీమా పాలసీ తీసుకునే ముందే అప్పటికే ఉన్న వ్యాధుల క్లెయిమ్ విషయంలో నిబంధనలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలించడం మర్చిపోవద్దు. క్రిటికల్ ఇల్నెస్ రైడర్ మరవద్దు కొన్ని తీవ్రమైన వ్యాధుల్లో చికిత్సా వ్యయంతో సంబంధం లేకుండా తీసుకున్న బీమా రక్షణ మొత్తాన్ని పొందవచ్చు. ఇందుకోసం మీరు కొంత అదనపు ప్రీమియం చెల్లించడం ద్వారా క్రిటికల్ ఇల్నెస్ రైడర్ తీసుకోవాల్సి ఉంటుంది. సాధారణంగా ఈ రైడర్లో ఎనిమిది నుంచి 10 తీవ్రమైన వ్యాధులకు బీమా రక్షణ లభిస్తుంది. -
లక్ష్మీప్రియ మృతదేహం వెలికితీత
తిరుమల : చిత్తూరు జిల్లా తిరుచానూరు ఈతమాకుల వీధిలో మేనమమ చేతిలో దారుణహత్యకు గురైన చిన్నారి లక్ష్మీప్రియ మృతదేహాన్ని పోలీసులు మంగళవారం బయటకు తీశారు. చిన్నారి మృతదేహాన్ని చూసి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. డబ్బులు కారణంగానే లక్ష్మీప్రియను హతమార్చడటం దారుణమని, ఇంకా రెండింతలు డబ్బులు ఇస్తామని.. తమ చిన్నారిని ప్రాణాలతో తిరిగి తెచ్చివ్వమంటూ అర్థిస్తున్నారు. కాగా లక్ష్మీప్రియను దారుణంగా హతమార్చిన శ్రీనివాసులు రెడ్డిని వెంటనే ఉరేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. -
లక్ష్మీప్రియను హతమార్చింది మేనమామే..
*ఐదేళ్ల చిన్నారి హత్య *తిరుచానూరులో విషాదం *పోలీస్‌స్టేషన్ వద్ద బాధితుల ఆందోళన అభం శుభం తెలియని ఆ చిన్నారి పాలిట మామే కాలయముడయ్యాడు. మాయమాటలు చెప్పి బైక్‌పై ఎక్కించుకుని కానరాని లోకాలకు పంపాడు. కర్కశంగా నీళ్లలో ముంచేసి ప్రాణాలు తీసేశాడు. ఈ ఘటన సోమవారం తిరుచానూరులో కలకలాన్ని సృష్టించింది. తల్లిదండ్రులకు కడుపుకోతను మిగిల్చింది. బంధువుల రోదనలు మిన్నంటాయి. బంగారంలాంటి బిడ్డ ప్రాణాలు తీసిన రాక్షసుడ్ని చంపేయాలంటూ ఆందోళనకు దిగారు.. తిరుచానూరు: ఐదేళ్ల చిన్నారి లక్ష్మీప్రియను వరుసకు మేనమామ హత్య చేయడం తిరుచానూరులో విషాదం నెలకొంది. తిరుచానూరు ఈతమాకుల వీధిలో నివాసముంటున్న పెంచల్‌రెడ్డి, మల్లీశ్వరి దంపతులకు లక్ష్మీప్రియ(5) ఒక్కటే కుమార్తె. స్థానిక వైష్ణవి విద్యాలయంలో యూకేజీ చదువుతోంది. ప్రతి రోజులానే సోమవారం సాయంత్రం 4.30 గంటల ప్రాంతంలో స్కూల్ వ్యానులో నుంచి లక్ష్మీప్రియతో పాటు ఇద్దరు పిల్లలు ఇంటి సమీపంలోని రేణిగుంట రోడ్డులో దిగారు. అదే సమయంలో అక్కడున్న ఓ వ్యక్తి అమ్మ భజనగుడివీధిలోని పెద్దమ్మ ఇంట్లో ఉందని చెప్పి ద్విచక్ర వాహనంపై తీసుకెళ్లాడు. ఆ విషయాన్ని అక్కడున్న వారు మల్లీశ్వరికి చెప్పారు. పాపను తీసుకెళ్లిన వ్యక్తి దాదాపు నలభై ఏళ్ల వయసు కలిగి, నల్లగా, పొట్టిగా ఉన్నాడని, ఎరుపు రంగు టీషర్టు ధరించి ఉన్నాడని పాపతో పాటు బస్సు దిగిన లక్ష్మీప్రియ అక్క కొడుకులు జయసూర్య, యోగానంద తెలిపారు. దీంతో పాపానాయుడుపేటలోని వరుసకు అన్న అయిన శ్రీనివాసులురెడ్డే పాపను తీసుకెళ్లాడని మల్లీశ్వరి తిరుచానూరు పోలీసులకు ఫిర్యాదు చేసింది. హుటాహుటిన ఈస్ట్ డీఎస్పీ రవిశంకర్‌రెడ్డి, సీఐ సురేంద్రనాయుడు, ఎస్ఐలు మల్లేష్‌యాదవ్, చిరంజీవి, చిన్నారులు జయసూర్య, యోగానందను వెంటబెట్టుకుని పాపానాయుడుపేటకు వెళ్లారు. మార్గమధ్యంలో వికృతమాలకు వెళ్లేదారి వద్ద శ్రీనివాసులు రెడ్డి కనిపించడంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎయిర్పోర్ట్ వెనుక వికృతమాల గ్రామానికి వెళ్లే రోడ్డులో ఉన్న నీటి గుంతలో పాపను ముంచి హత్య చేసి, గుంత తీసి పూడ్చిపెట్టినట్టు అతను అంగీకరించాడు. అప్పటికే చీకటి కావడంతో మంగళవారం ఉదయం రెవెన్యూ అధికారుల సమక్షంలో చిన్నారి మృతదేహాన్ని వెలికి తీయనున్నారు. పోలీస్‌స్టేషన్ వద్ద బంధువుల ఆందోళన సోమవారం రాత్రి లక్ష్మీప్రియ హత్య వార్త వెలుగు చూడ్డంతో ఆ చిన్నారి తల్లిదండ్రులు, బంధువులు పెద్ద ఎత్తున తిరుచానూరు పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు. నిందితుడుని చంపేయాలని డిమాండ్ చేశారు. లేదా నిందితుడి కాళ్లు చేతులు తీసేయాలని, మరొకరు ఇలాంటి దారుణానికి పాల్పడకుండా ఉంటారని చెప్పారు. నిందితుడిని తమకు అప్పగించాల్సిందే అని పట్టుబట్టారు. డీఎస్పీ సర్ది చెప్పారు. నిందితుడికి కఠిన శిక్ష పడేలా చూస్తానని హామీ ఇవ్వడంతో వారు వెనుదిరిగారు. డబ్బు తగాదాలే హత్యకు కారణం..? చిన్నారి హత్య వెనుక గల కారణాలు ఇంకా తెలియరాలేదు. గతంలో లక్ష్మీప్రియ నాన్న పెంచల్‌రెడ్డి, శ్రీనివాసులు రెడ్డి కొంత నగదు అప్పుగా ఇచ్చాడు. -
ఐదేళ్ళ చిన్నారిని చంపేసిన మేనమామ
-
కట్నం కోసం వ్యభిచారం చేయమంటున్నారు...
హెచ్ఆర్సీని ఆశ్రయించిన నవవధువు అఫ్జల్‌గంజ్: వ్యభిచారం చేసి అదనపు కట్నం తేవాలని వేధిస్తున్న భర్త, అత్తమామల నుంచి రక్షణ కల్పించాలని ఓ నవవధువు హెచ్ఆర్సీని ఆశ్రయించింది. ఈ ఘటనపై సమగ్ర విచారణ చేపట్టి 2015 జనవరి 28 లోగా నివేదిక అందించాలని మల్కాజిగిరి ఏసీపీకి హెచ్ఆర్సీ సభ్యులు మిర్యాల రామారావు ఆదేశాలు జారీ చేశారు. అనంతరం బాధితురాలు విలేకరులకు తెలిపిన వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా ఘట్కేసర్ మండలం ఫీర్జాదిగూడకు చెందిన యువతి (27), అవినాష్సింగ్లకు ఈ ఏడాది మే 24న పెళ్లైంది. రూ.4 లక్షల నగదు, 11 తులాల బంగారు నగలు, కిలో వెండి, బైక్ కానుకలుగా ఇచ్చారు. వివాహం జరిగిన కొద్ది రోజులకే అవినాష్సింగ్తో పాటు అతని తల్లిదండ్రులు రూపాఠాకూర్,అమృత్‌సింగ్ అదనపు కట్నంగా రూ.10 లక్షలు తేవాలని బాధితురాలిని వేధించడం మొదలుపెట్టారు. పెళ్లైనప్పటి నుంచీ ఒక్క రోజు కూడా భర్త తనను భార్యగా చూడలేదని, సంసారం కూడా చేయలేదని ఆమె వాపోయింది. మీ తల్లిదండ్రులు అదనపు కట్నం ఇవ్వకపోతే.. వ్యభిచారం చేసైనా నువ్వు డబ్బు తీసుకురావాలని వేధించారని, నాకు మద్దతుగా మాట్లాడిన వారితో వివాహేతర సంబంధం అంటగట్టడంతో పాటు తనకు బలవంతంగా కన్యత్వ పరీక్ష చేయించారని ఆమె వాపోయింది. పగటిపూట తన తండ్రి వద్ద, రాత్రి తన వద్ద పడుకోవాలని భర్త కొద్ది రోజులుగా బలవంతం చేస్తున్నాడని బాధితురాలు కన్నీరుపెట్టుకుంది. వారి వేధింపులు తాళలేక నవంబర్ 3న మేడిపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశానని, ఇప్పుడు హెచ్ఆర్సీని ఆశ్రయించానని బాధితురాలు తెలిపింది.