విదేశాల్లో కొడుకు కోడలిపై మామ.. | Uncle Molestation on Daughter in Law Kamareddy | Sakshi
Sakshi News home page

కోడలిపై కన్నేసిన మామ

Aug 17 2020 8:38 AM | Updated on Aug 17 2020 8:42 AM

Uncle Molestation on Daughter in Law Kamareddy - Sakshi

కామారెడ్డిక్రైం:  తండ్రిలా చూసుకోవాల్సిన మామ కోడలిపై కన్నేశాడు. అతని వేధింపులు భరించలేక కోడలు ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. వివరాలు.. కామారెడ్డి మండలం లింగాపూర్‌కు చెందిన 60 ఏళ్ల మల్లేశంకు కుమారుడు ఉన్నాడు. అతడు విదేశాల్లో ఉండడంతో కోడలు ఇంటి వద్దే ఉంటుంది. ఇదే అదనుగా కోడలిపై కన్నేశాడు మల్లేశం. లైంగిక వేధింపులకు యత్నించడంతో ఇటీవలే ఆమె ఆత్మహత్య యత్నానికి సైతం ఒడిగట్టినట్లు తెలిసింది. మామ బుద్ధి మారక పోవడంతో సమీప బంధువులకు చెప్పుకుని అంతా కలిసి ఆదివారం నిలదీశారు. అనంతరం దేవునిపల్లి ఠాణాలో ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు మల్లేశంపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.  (చిన్నారులను అందంగా అలంకరించి..)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement