
సాక్షి, శ్రీసత్యసాయి జిల్లా: హిందూపురం నియోజకవర్గంలో దారుణం జరిగింది. తెల్లవారుజామున ఇంట్లోకి ప్రవేశించిన దుండగులు.. తండ్రి, కొడుకులను కత్తులతో బెదిరించి అత్త, కోడలిపై లైంగికదాడికి పాల్పడ్డారు. చిలమత్తూరు మండలం బొమ్మనపల్లిలో ఘటన చోటుచేసుకుంది. పేపర్ మిల్లులో వాచ్‌మెన్ కుటుంబంపై దాడి చేసి ఇద్దరు మహిళలపై అత్యాచారానికి పాల్పడ్డారు.
కర్ణాటక రాష్ట్రంలోని బళ్లారికి చెందిన ఓ కుటుంబం ఉపాధి కోసం సత్యసాయి జిల్లాకు వలస వచ్చారు. శనివారం తెల్లవారుజామున గుర్తు తెలియని నలుగురు వ్యక్తులు రెండు బైక్‌లపై వారి నివాసానికి వచ్చి దారుణానికి పాల్పడ్డారు. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సమగ్ర విచారణ చేపట్టారు. ఘటనాస్థలిని ఎస్పీ రత్న పరిశీలించారు.
ఇదీ చదవండి: వామ్మో ఇన్ని ట్విస్టులా.. పోలీసులే అవాక్కయ్యారు!
Comments
Please login to add a commentAdd a comment