నెల్లూరులోని మంత్రి నారాయణ డెంటల్ కాలేజీలో విద్యార్థి ఆత్మహత్య
ఏడాది నుంచి యువకుడిని
లైంగికంగా వేధిస్తున్న ముగ్గురు వైద్య విద్యార్థులు!
తాడిపత్రి రూరల్: నెల్లూరులోని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి నారాయణకు చెందిన డెంటల్ కళాశాలలో బీడీఎస్ రెండో సంవత్సరం చదువుతున్న అనంతపురం జిల్లా తాడిపత్రికి చెందిన విద్యార్థి ప్రదీప్ కుమార్(19) సోమవారం అర్ధరాత్రి ఆత్మహత్య చేసుకున్నాడు. వైద్య విద్యార్థుల లైంగిక వేధింపులు భరించలేక కళాశాల భవనంపై నుంచి దూకి బలవన్మరణానికి పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం...
నెల్లూరుకు చెందిన నారాయణ ఉపాధి కోసం కుటుంబ సభ్యులతో కలిసి తాడిపత్రికి వలస వచ్చారు. పట్టణ సమీపంలోని గన్నెవారిపల్లి కాలనీలో నివాసం ఉంటూ రింగ్‌లు తయారుచేసి విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నారు. నారాయణకు అఖిల్‌కుమార్, ప్రదీప్‌కుమార్ కుమారులు. పెద్ద కుమారుడు «అఖిల్‌కుమార్ సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నారు. చిన్న కుమారుడు ప్రదీప్‌కుమార్ నెల్లూరులోని నారాయణ డెంటల్ కళాశాలలో బీడీఎస్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు.
ప్రదీప్‌కుమార్ కళాశాల భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడని పెద్ద కుమారుడు అఖిల్‌కుమార్ సోమవారం అర్ధరాత్రి ఫోన్ చేసి చెప్పడంతో తల్లిదండ్రులు ప్రమీల, నారాయణ నిర్ఘాంతపోయారు. వెంటనే స్నేహితులతో కలిసి వాహనంలో నెల్లూరు బయలుదేరి వెళ్లారు. స్వస్థలం నెల్లూరు కావడంతో అక్కడే మంగళవారం ప్రదీప్‌కుమార్ అంత్యక్రియలు పూర్తిచేశారు.
లైంగిక వేధింపులు భరించలేకే నా తమ్ముడు ఆత్మహత్య
వైద్య విద్య చదువుతున్న రాహుల్ అనే విద్యారి్థతోపాటు మరో ఇద్దరు కలిసి గత ఏడాది సెపె్టంబర్ నుంచి లైంగికంగా వేధిస్తున్నారని, వారి ఆగడాలు భరించలేక ఆత్మహత్య చేసుకుంటున్నానని నా తమ్ముడు ప్రదీప్‌కుమార్ సోమవారం అర్ధరాత్రి నా సెల్‌ఫోన్‌కు మెసేజ్ పంపాడు. వెంటనే తాడిపత్రిలోని తల్లిదండ్రులకు, నెల్లూరులోని కళాశాలకు ఫోన్ చేశా. అప్పటికే కళాశాల భవనంపై నుంచి దూకి చనిపోయాడు.
– మృతుడి అన్న అఖిల్‌కుమార్
Comments
Please login to add a commentAdd a comment