Dental College
-
సహచరుల లైంగిక వేధింపులకు డెంటల్ విద్యార్థి బలవన్మరణం
తాడిపత్రి రూరల్: నెల్లూరులోని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి నారాయణకు చెందిన డెంటల్ కళాశాలలో బీడీఎస్ రెండో సంవత్సరం చదువుతున్న అనంతపురం జిల్లా తాడిపత్రికి చెందిన విద్యార్థి ప్రదీప్ కుమార్(19) సోమవారం అర్ధరాత్రి ఆత్మహత్య చేసుకున్నాడు. వైద్య విద్యార్థుల లైంగిక వేధింపులు భరించలేక కళాశాల భవనంపై నుంచి దూకి బలవన్మరణానికి పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం... నెల్లూరుకు చెందిన నారాయణ ఉపాధి కోసం కుటుంబ సభ్యులతో కలిసి తాడిపత్రికి వలస వచ్చారు. పట్టణ సమీపంలోని గన్నెవారిపల్లి కాలనీలో నివాసం ఉంటూ రింగ్‌లు తయారుచేసి విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నారు. నారాయణకు అఖిల్‌కుమార్, ప్రదీప్‌కుమార్ కుమారులు. పెద్ద కుమారుడు «అఖిల్‌కుమార్ సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నారు. చిన్న కుమారుడు ప్రదీప్‌కుమార్ నెల్లూరులోని నారాయణ డెంటల్ కళాశాలలో బీడీఎస్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. ప్రదీప్‌కుమార్ కళాశాల భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడని పెద్ద కుమారుడు అఖిల్‌కుమార్ సోమవారం అర్ధరాత్రి ఫోన్ చేసి చెప్పడంతో తల్లిదండ్రులు ప్రమీల, నారాయణ నిర్ఘాంతపోయారు. వెంటనే స్నేహితులతో కలిసి వాహనంలో నెల్లూరు బయలుదేరి వెళ్లారు. స్వస్థలం నెల్లూరు కావడంతో అక్కడే మంగళవారం ప్రదీప్‌కుమార్ అంత్యక్రియలు పూర్తిచేశారు.లైంగిక వేధింపులు భరించలేకే నా తమ్ముడు ఆత్మహత్యవైద్య విద్య చదువుతున్న రాహుల్ అనే విద్యారి్థతోపాటు మరో ఇద్దరు కలిసి గత ఏడాది సెపె్టంబర్ నుంచి లైంగికంగా వేధిస్తున్నారని, వారి ఆగడాలు భరించలేక ఆత్మహత్య చేసుకుంటున్నానని నా తమ్ముడు ప్రదీప్‌కుమార్ సోమవారం అర్ధరాత్రి నా సెల్‌ఫోన్‌కు మెసేజ్ పంపాడు. వెంటనే తాడిపత్రిలోని తల్లిదండ్రులకు, నెల్లూరులోని కళాశాలకు ఫోన్ చేశా. అప్పటికే కళాశాల భవనంపై నుంచి దూకి చనిపోయాడు. – మృతుడి అన్న అఖిల్‌కుమార్ -
దంతవైద్య విద్యార్థిని బలవన్మరణం
బళ్లారి రూరల్: విమ్స్ ఆవరణలోని ప్రభుత్వ దంతవైద్య కళాశాల విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడిన ఘటన శుక్రవారం వెలుగు చూసింది. కౌల్‌బజార్ పోలీసులు తెలిపిన వివరాలు... బెంగళూరుకు చెందిన పద్మావతి(23) బళ్లారిలోని విమ్స్ ఆవరణలోని ప్రభుత్వ దంతవైద్య కళాశాలలో ఫైనలియర్ చదువుతూ హాస్టల్లో ఉంటోంది. బుధవారం ముగిసిన ఫైనలియర్ పరీక్షలు కూడా రాసింది. ప్రాక్టికల్ పరీక్షలు జరగాల్సి ఉంది. ఫైనలియర్ పాసైతే హౌస్‌సర్జన్‌గా ప్రవేశం పొందవచ్చు. ఈ నేపథ్యంలో శుక్రవారం రాత్రి హాస్టల్ కొత్తభవనం పైనుంచి కిందకు దూకి ఆత్మహత్య చేసుకొంది. అయితే పద్మావతి కొంతకాలంగా మానసిక అస్వస్థతతో బాధపడుతోందని పోలీసులు తెలిపారు. పద్మావతికి తోడుగా తల్లి కూడా హాస్టల్లో ఉంటోంది. తల్లిని కొబ్బరిబొండాం తెమ్మని చెప్పి పంపి ఆమె ఆత్మహత్యకు పాల్పడింది. కొబ్బరి బొండాం తెచ్చిన తల్లి కూతురు కోసం హాస్టల్ అంతా గాలించింది. చివరికి భవనం కింద పద్మావతి మృతదేహాన్ని కనుగొన్నారు. తమకు అందిన సమాచారంతో పోలీసులు వెళ్లి పరిశీలించి కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. దంత వైద్యవిద్యార్థులు, అధ్యాపకులు, సిబ్బంది పద్మావతి మృతదేహాన్ని చూసి భోరున విలపించారు. ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com -
వైద్య విద్య యూజీ కోర్సుల ఫీజుల ఖరారు
సాక్షి, అమరావతి: 2023–24 విద్యా సంవత్సరానికి రాష్ట్రంలోని ప్రైవేట్ వైద్య, డెంటల్ కళాశాలల్లో ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సులకు ఫీజులు ఖరారు చేస్తూ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు మంగళవారం ఉత్తర్వులిచ్చారు. హైకోర్టు తుది తీర్పునకు లోబడి ఫీజుల అమలు ఉంటుందని పేర్కొన్నారు. 2022–23లో అమలైన ఫీజులపై 10% మేర పెంపుదల చేసి కొత్త ఫీజులను ఖరారు చేశారు. ఎంబీబీఎస్ కన్వనర్ కోటా ఫీజును రూ.16,500గా నిర్ణయించారు. బీ కేటగిరికి రూ.13.20 లక్షలు, సీ కేటగిరి (ఎన్ఆర్ఐ కోటా)కు రూ.39.60 లక్షలు చొప్పున ఫీజులు ఉన్నాయి. బీడీఎస్ కన్వనర్ కోటాకి రూ.14.300..బీ కేటగిరీకి రూ.4.40 లక్షలు, ఎన్ఆర్ఐ కోటాకి రూ.13.20 లక్షలు చొప్పున ఫీజు ఖరారు చేశారు. 2020లో ఖరారు చేసిన ఫీజుల ప్రకారం 2022–23 విద్యా సంవత్సరం వరకు ప్రవేశాలు చేపట్టారు. నీట్ యూజీ–2023లో ఏపీలో 42,836 మంది విద్యార్థులు అర్హత సాధించారు. ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశాలకు డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్య వర్సిటీ ఇటీవల నోటిఫికేషన్ ఇచ్చింది. నీట్ యూజీ అర్హత సాధించినవారు దరఖాస్తు చేసుకుంటున్నారు. వ్యాయామ కళాశాలల్లో కోర్సులకు ఇలా.. ప్రైవేట్, అన్–ఎయిడెడ్ వ్యాయామ కళాశాలల్లో డీపీఈడీ, బీపీఈడీ, ఎంపీఈడీ కోర్సులకు ఉన్నత విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ సిఫారసుల మేరకు 2023–26 విద్యా సంవ్సతరానికి ఫీజులను ప్రభుత్వం ఖరారు చేసింది. కన్వనర్ కోటా కింద రెండేళ్ల కోర్సుల్లో భాగంగా డిప్లొమో (డీపీఈడీ)కు రూ.14 వేల నుంచి రూ.16 వేలు, బ్యాచ్‌లర్ (బీపీఈడీ)కు రూ.15 వేల నుంచి రూ.24,500, మాస్టర్స్ (ఎంపీఈడీ)కు రూ.25 వేల నుంచి రూ.35 వేల మధ్య ఆయా కళాశాలల్లోని వసతులు, విద్యా బోధనను బట్టి ఫీజులను నిర్ణయించింది. ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకోని ఒక కళాశాలతో పాటు, గత అడ్మిషన్లలో 25% కంటే తక్కువ నమోదైన 5 కళాశాలలకు అడ్మిషన్లను 2023–26 విద్యా సంవత్సరానికి బ్లాక్ చేసినట్లు ఉన్నత విద్య ముఖ్య కార్యదర్శి శ్యామలరావు ఉత్తర్వులిచ్చారు. -
జాతీయ ర్యాంకుల్లో పడిపోయిన రాష్ట్ర యూనివర్సిటీలు.. కారణం అదేనా!
సాక్షి, హైదరాబాద్: అధ్యాపకుల కొరత రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలపై తీవ్ర ప్రభావం చూపుతున్నట్లు మరోసారి రుజువైంది. తాజాగా నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్ (ఎన్ఐఆర్ఎఫ్–2023) నివేదికలో దశాబ్దాల చరిత్ర ఉన్న ఉస్మానియాతోపాటు జేఎన్టీయూహెచ్ ర్యాంకులు కూడా తగ్గాయి. జాతీయ ఓవరాల్ ర్యాంకుల్లోనే కాదు.. పరిశోధన, యూనివర్సిటీ స్థాయి ప్రమాణాల్లోనూ విశ్వవిద్యాలయాలు వెనుకంజలో ఉన్నాయి. అన్నింటికన్నా ఐఐటీ–హైదరాబాద్ అన్ని విభాగాల్లోనూ దూసుకుపోవడం విశేషం. గత మూడేళ్ల విద్యా ప్రమాణాల ఆధారంగా ఎన్ఐఆర్ఎఫ్ ఏటా ర్యాంకులు ఇస్తుంది. ఐఐటీ–హైదరాబాద్ దూకుడు.. ఓయూ వెనక్కు జాతీయస్థాయిలో వంద యూనివర్సిటీల్లో ఐఐటీ–హైదరాబాద్ గత ఏడాది మాదిరిగానే 14వ స్థానంలో నిలిచింది. ఈ సంస్థలో 2019లో 144 మంది రూ.17 లక్షల వార్షిక ప్యాకేజీతో ఉపాధి పొందారు. 2020–21లో 185 మంది రూ.16 లక్షలకుపైగా, 2021–22లో 237 మంది రూ.20 లక్షలకుపైగా ప్యాకేజీతో ఉపాధి పొందారు. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్‌లోనూ విద్యార్థులు అత్యధికంగా రూ.40 లక్షల వార్షిక ప్యాకేజీతో ఉపాధి పొందారు. నిట్ వరంగల్‌లో అత్యధికంగా యూజీ విద్యార్థులు ఉపాధి అవకాశాలు సొంతం చేసుకున్నారు. స్కిల్ డెవలప్మెంట్లో ఈ సంస్థ మంచి ప్రమాణాలు నెలకొల్పినట్టు నివేదిక పేర్కొంది. అయినప్పటికీ ఈ సంస్థలో అధ్యాపకుల కొరత వల్ల రీసెర్చ్‌లో వెనుకబడింది. ఫలితంగా నిట్ వరంగల్ జాతీయర్యాంకు 2022లో 45 ఉండగా, ఈసారి 53కు చేరింది. ఉస్మానియా వర్సిటీ ఓవరాల్ ర్యాంకులో గత ఏడాది 46 ఉంటే, ఈసారి 64 దక్కింది. ఇక్కడా పరిశోధనల్లో నెలకొన్న మందకొడితనమే జాతీయ ర్యాంకుపై ప్రభావం చూపింది. ఈసారి యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్‌కు ఓవరాల్ ర్యాంకులో గతంలో మాదిరిగానే 20వ ర్యాంకు వచ్చింది. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ 10 ర్యాంకుతో నిలకడగా ఉంది. హైదరాబాద్ ట్రిపుల్ఐటీ జాతీయస్థాయిలో 84వ ర్యాంకు పొందింది. చదవండి: విద్యాసంస్థల ర్యాంకింగ్స్ విడుదల.. టాప్ 10లో హైదరాబాద్‌కు దక్కని చోటు ఇంజనీరింగ్‌లో వెనుకబాటుతనం ఇంజనీరింగ్ విభాగంలో ఐఐటీ–హైదరాబాద్ సరికొత్త బోధన విధానాలతో 9లో ఉన్న ర్యాంకును 8కి తేగలిగింది. ఎక్కువ ఇంజనీరింగ్ అనుబంధ కాలేజీలున్న జేఎన్టీయూ–హెచ్ 76 నుంచి 98కి పడిపోయింది. నిట్ వరంగల్ 21వ ర్యాంకుతో నిలిచింది. ఈసారి సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజీ జాతీయస్థాయి కాలేజీల విభాగంలో 98 ర్యాంకును సాధించింది. పరిశోధన విభాగంలో ట్రిపుల్ఐటీ హైదరా బాద్ ర్యాంకు 12 నుంచి 14కు చేరింది. అధ్యాపకుల కొరతే కారణం: ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకుల్లో వెనుకబడటానికి ప్రధాన కారణం అధ్యాపకుల కొరత. కొన్నేళ్లుగా నియామకాలు లేకపోవడం వల్ల పరిశోధనలో వెనుకబడిపోతున్నాం. అయినప్పటికీ బోధనలో ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తున్నాం. -ప్రొ.డి.రవీందర్, ఉస్మానియా వర్సిటీ వీసీ ర్యాంకు సాధించని వ్యవసాయ వర్సిటీ దేశంలో టాప్–40 వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, సంస్థల్లో రాష్ట్రానికి చెందిన ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయానికి చోటు దక్కలేదు. ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్స్‌లో వ్యవసాయ వర్సిటీ లేకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. దీనిపై వర్సిటీ వర్గాలను ఆరా తీయగా, సమాధానం లభించలేదు. వర్సిటీ ప్రమాణాలు తగ్గుతున్నాయన్న చర్చ జరుగుతోంది. అడ్రస్ లేని మెడికల్ కాలేజీలు ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్‌లో దేశంలో టాప్ 50లో చోటు దక్కని వైనం సాక్షి, హైదరాబాద్: ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ చేసిన దేశంలోని టాప్–50 మెడికల్ కాలేజీల్లో రాష్ట్రానికి చెందిన ఏ ఒక్క మెడికల్ కాలేజీ చోటు దక్కించుకోలేకపోయింది. రాష్ట్రం నుంచి నాలుగు కాలేజీలు... ఈఎస్ఐ మెడికల్ కాలేజీ, కరీంనగర్‌లోని చలిమెడ ఆనందరావు మెడికల్ కాలేజీ, హైదరాబాద్‌కు చెందిన మల్లారెడ్డి, అపోలో మెడికల్ కాలేజీలు దరఖాస్తు చేసుకున్నాయి. మిగిలిన కాలేజీలకు కనీసం దరఖాస్తు చేసుకునే స్థాయి కూడా లేదని వైద్య నిపుణులు చెబుతున్నారు. టాప్–50 ర్యాంకింగ్స్‌లో ఢిల్లీ ఎయిమ్స్ మొదటి ర్యాంకు, చండీగఢ్‌లోని పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ రెండో ర్యాంకు, తమిళనాడులోని వెల్లూరుకు చెందిన క్రిస్టియన్ మెడికల్ కాలేజీ మూడో ర్యాంకు, బెంగళూరుకు చెందిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్సెస్ నాలుగో ర్యాంకు, పుదుచ్చేరిలోని జవహర్లాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ఐదో ర్యాంకు సాధించాయి. డెంటల్ ర్యాంకుల్లో మాత్రం తెలంగాణకు ఊరట కలిగింది. సికింద్రాబాద్‌లోని ఆర్మీ కాలేజీ ఆఫ్ డెంటల్ సైన్సెస్‌కు 33 ర్యాంకు దక్కింది. 176 మెడికల్ కాలేజీలు, 155 డెంటల్ కాలేజీలు దరఖాస్తు చేసుకున్నాయి. రాష్ట్రంలో వైద్య పరిశోధన దాదాపు ఎక్కడా లేదని, అలాగే, విద్యార్థులు–అధ్యాపకుల నిష్పత్తి కూడా దారుణంగా ఉందన్న విమర్శలున్నాయి. -
విజయవాడ ప్రభుత్వ దంతవైద్య కళాశాలకు 15 పీజీ సీట్లు
లబ్బీపేట (విజయవాడతూర్పు): విజయవాడలోని ప్రభుత్వ దంతవైద్య కళాశాలకు ఐదు విభాగాల్లో 15 పోస్టు గ్రాడ్యుయేషన్ (పీజీ) సీట్లు మంజూరయ్యాయి. దశాబ్దం కిందట మూడు విభాగాల్లో తొమ్మిది పీజీ సీట్లు రాగా, తాజాగా డెంటల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (డీసీఐ) ఐదు విభాగాల్లో 15 సీట్లు మంజూరు చేసింది. కొత్తగా మంజూరైన సీట్లుకు 2023–24 విద్యా సంవత్సరంలో అడ్మిషన్లకు అనుమతి ఇచ్చింది. దీంతో దంత వైద్యంలో పోస్టు గ్రాడ్యుయేషన్ కోసం ఇతర రాష్ట్రాలకువెళ్లకుండా ఇక్కడే అందుబాటులోకి వచ్చినట్లయింది. కొత్తగా మంజూరైన పీజీ సీట్లు మెరిట్ విద్యార్థులకు ఎంతో ప్రయోజనకరమని దంత వైద్యులు పేర్కొంటున్నారు. రాష్ట్రంలో రెండు (విజయవాడ, కడప) ప్రభుత్వ దంతవైద్య కళాశాలలున్నాయి. దంత వైద్యంలో పీజీ చేసేందుకు ఇక్కడ సీట్లు అందుబాటులో ఉండేవి కాదు. దీంతో రాష్ట్రంలోని ప్రైవేటు దంతవైద్య కళాశాలల్లో చేరాల్సి వచ్చేది. లేదంటే ఇతర రాష్ట్రాలకు వెళ్లాల్సి వచ్చేది. ప్రస్తుతం విజయవాడలోని ప్రభుత్వ దంతవైద్య కళాశాలలో ఇప్పటికే ఉన్న తొమ్మిది పీజీ సీట్లుకు అదనంగా మరో 15 సీట్లు మంజూరు కావడంతో ఏటా 24 మంది పీజీ చదివే అవకాశం లభించింది. అంతేగాకుండా రోగులకు మెరుగైన సేవలు అందనున్నాయి. సౌకర్యాల కల్పనతో.. ప్రభుత్వ దంతవైద్య కళాశాలకు రోజూ 250 నుంచి 300 మంది వరకు రోగులు చికిత్సకు వస్తుంటారు. వారికి నాణ్యమైన దంతవైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం సౌకర్యాలు కల్పించింది. కొత్తగా డెంటల్ చైర్స్ ఏర్పాటు చేయడంతోపాటు, అత్యాధునిక పరికరాలను సమకూర్చారు. అన్ని విభాగాల్లో పూర్తిస్థాయిలో వైద్యులను నియమించారు. గత ఏడాది సెప్టెంబర్‌లో తనిఖీలు చేసిన డెంటల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా బృందం ఇక్కడి సౌకర్యాలపై సంతృప్తి వ్యక్తం చేసింది. ఆ బృందం నివేదిక ఆధారంగా ఐదు విభాగాల్లో 15 పీజీ సీట్లు మంజూరు చేస్తూ 2023–24 విద్యా సంవత్సరం నుంచి అడ్మిషన్లకు అనుమతిస్తూ డీసీఐ ఉత్తర్వులు జారీచేసింది. -
దంత కళాశాలలో కీచక వైద్యుల లీలలు!
లబ్బీపేట(విజయవాడతూర్పు): దంత వైద్య వృత్తిలో విద్యార్థినులకు నైపుణ్యాలను నేర్పాల్సిన వైద్యులు కీచకులుగా మారుతున్నారు. అసోసియేట్ ప్రొఫెసర్ లైంగిక వేధింపులపై ఒక విద్యార్థిని చేసిన ఫిర్యాదుపై విచారణ చేపట్టగా అనేక అరాచకాలు వెలుగు చూస్తున్నాయి. పది మందికిపైగా విద్యార్థినులు, మహిళా సిబ్బంది తమను కూడా లైంగికంగా వేధించారంటూ ఇద్దరు వైద్యులపై విచారణ కమిటీ ఎదుట పేర్కొనడం చర్చనీయాంశంగా మారింది. దీంతో మరింత లోతుగా విచారణ జరిపేందుకు వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ యుగంధర్ ఆదేశాలు జారీ చేశారు. అసలేం జరిగిందంటే... ప్రభుత్వ దంత వైద్య కళాశాలలో బీడీఎస్ చదువుతున్న ఒక విద్యార్థినిని కొంత కాలంగా ఓ అసోసియేట్ ప్రొఫెసర్ వేధింపులకు గురిచేస్తున్నారు. ఈ విషయం ఆమె స్నేహితుల ద్వారా తండ్రి, సోదరుడికి తెలిసింది. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతుండగా, తాను విచారణ చేసి చర్యలు తీసుకుంటానని ప్రిన్సిపాల్ హామీ ఇచ్చారు. ఈ మేరకు కళాశాలలోని ఉమెన్ గ్రీవెన్స్ సెల్ సభ్యులను విచారణ చేపట్టాలని ఆదేశించారు. మరిన్ని అరాచకాలు.. దంత వైద్య కళాశాలలో ఉమెన్ గ్రీవెన్స్ సెల్ సభ్యులు విద్యార్థినులను, మహిళా ఉద్యోగినులను పిలిచి విచారిస్తున్నారు. ఈ విచారణలో పది మందికిపైగా తమను ఇద్దరు వైద్యులు లైంగికంగా వేధించినట్లు పేర్కొన్నారు. వారిలో ఇద్దరు ముగ్గురు రాతపూర్వకంగా ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. మిగిలిన వారంతా మౌఖికంగా చెప్పినప్పటికీ, రాత పూర్వకంగా రాసేందుకు భయపడుతున్నట్లు సమాచారం. గతంలోనూ ఆరోపణలు.. ప్రస్తుతం లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరు అసోసియేట్ ప్రొఫెసర్లపై గతంలోనూ లైంగిక వేధింపుల ఆరోపణలు ఉన్నట్లు తెలుస్తోంది. అప్పట్లో ఒక విద్యార్థినిని వేధింపులకు గురిచేయగా, ఒక మహిళా ప్రొఫెసర్ అతనిపై ప్రభుత్వానికి లేఖ రాసింది. కానీ నాటి ప్రిన్సిపాల్ ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి మద్దతుగా నిలవడంతో అప్పట్లో ఏ చర్యలు తీసుకోకుండానే మాఫీ చేశారు. విచారణ చేస్తున్నాం.. విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నట్లు వచ్చిన ఆరోపణలపై కళాశాల ఉమెన్ గ్రీవె న్స్ సెల్ సభ్యులు విచారణ చేస్తు న్నారు. ప్రస్తుతం ఆరోపణలు ఎదుర్కొంటున్న వైద్యునితో పా టు, మరొకరు కూడా వేధింపులకు పాల్పడినట్లు విద్యార్థినులు చెబుతున్నారు. పూర్తిస్థాయిలో విచారణ జరిపి డీఎంఈకి నివేదిస్తాం. – డాక్టర్ యుగంధర్, ప్రిన్సిపాల్,ప్రభుత్వ దంత వైద్య కళాశాల చదవండి: అమెరికాను మేము ఓడించగలం అనడానికి ఇదే గుర్తు: తాలిబన్లు -
డెంటల్ విద్యార్థులకు గుడ్‌న్యూస్
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా దంత వైద్య కళాశాలల్లో 7,085 సీట్ల భర్తీకి సుప్రీంకోర్టు అనుమతించింది. ఈ నెల 18 వరకు కౌన్సెలింగ్ గడువు పొడిగిస్తున్నట్లు తెలిపింది. దంత వైద్య కళాశాలల్లో మిగిలిన సీట్ల భర్తీకి సంబంధించి నీట్ యూజీ-2020 కనీస మార్కులు తగ్గించాలని, కౌన్సెలింగ్ గడువు పెంచాలని ఏపీ, గుజరాత్, మధ్యప్రదేశ్, కర్ణాటక వైద్య కళాశాలల అసోసియేషన్లు, 20 ప్రైవేటు కళాశాలలు, కొందరు అభ్యర్థులు సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్లు దాఖలు చేశారు. అసోసియేషన్ల తరఫున సీనియర్ న్యాయవాది మణీందర్‌సింగ్, న్యాయవాది రమేశ్ అల్లంకి, కేంద్రం తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ ఐశ్వర్య భాటి వాదనలు వినిపించారు. జనవరి 31 నాటికి కౌన్సెలింగ్ గడువు ముగిసిన తర్వాత కూడా 9 వేల సీట్లకు పైగా భర్తీ కావాల్సి ఉందని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు తెలిపారు. ఏపీలో 421, తెలంగాణలో 415 సీట్లు భర్తీ కావాల్సి ఉందని వివరించారు. వాదనలు విన్న కోర్టు ఈనెల ne4న తీర్పు రిజర్వు చేసింది. జస్టిస్ లావు నాగేశ్వరరావు, జస్టిస్ కృష్ణమురారిలతో కూడిన ధర్మాసనం సోమవారం తీర్పు వెలువరించింది. కేంద్రం వాదన సరిగా లేదు.. 2020-21లో దంత వైద్య కళాశాలల్లో ప్రవేశాలకు కనీస మార్కులు తగ్గించేది లేదని గత డిసెంబర్ 30న నిర్ణయం తీసుకున్నట్లు అదనపు సొలిసిటర్ జనరల్ ఐశ్వర్య భాటి విచారణలో తెలిపారు. దేశంలో ప్రతీ 6,080 మందికి ఒక దంత వైద్యుడున్నట్లు కూడా పేర్కొన్నారు. దీనిపై కోర్టు స్పందిస్తూ.. ‘నీట్ ప్రవేశాల్లో ఆయా వర్గాల్లో తగిన సంఖ్యలో అభ్యర్థులు కనీస మార్కులు సాధించడంలో విఫలమైనప్పుడు.. డెంటల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాతో సంప్రదించి బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశానికి అవసరమైన కనీస మార్కులను తగ్గించే విచక్షణ కేంద్రానికి ఉందని నిబంధనలు చెబుతున్నాయి. పర్సంటైల్ మార్కులు తగ్గించాలని గత డిసెంబర్ 28న డెంటల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కోరింది. ప్రొఫెషనల్ కోర్సుల్లో సీట్లు ఖాళీగా ఉంటే దేశానికి నష్టమని కేంద్రం దృష్టికి తీసుకెళ్లింది. అయితే కేంద్రం పర్సంటైల్ మార్కులు తగ్గించడానికి అంగీకరించలేదు. కనీస మార్కులు తగ్గించడం, మొదటి సంఖ్యలో ప్రవేశాలకు పర్సంటైల్ తగ్గించడం అనేది విద్యా ప్రమాణాలను తగ్గించడం కాదన్న పిటిషనర్ల తరఫు న్యాయవాది వాదనతో ఏకీభవిస్తున్నాం.. కేంద్రం వాదన సరిగా లేదు. ఖాళీగా ఉన్న 7 వేల సీట్లలో 265 మాత్రమే ప్రభుత్వ సీట్లు.. మిగిలినవన్నీ ప్రైవేటు కళాశాలల్లోనివే.. విద్యార్థులను ప్రోత్సహించడానికి ప్రవేశ రుసుము తగ్గించుకోవడానికి ప్రైవేటు దంత వైద్య కళాశాలలు అంగీకరించాయి. కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని పక్కనపెడుతూ.. నీట్-యూజీ కోర్సుల్లో 2020- 2021 ప్రవేశాలకు పర్సంటైల్ మార్కులు 10 శాతం తగ్గిస్తూ ఖాళీలు భర్తీ చేయాలని ఆదేశిస్తున్నాం. జనరల్ కేటగిరీలో 40, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల్లో 30, దివ్యాంగులు 35 పర్సంటైల్ తెచ్చుకున్న వారిని బీడీఎస్ తొలి సంవత్సరం ప్రవేశానికి పరిగణనలోకి తీసుకోవాలి. మెరిట్ ఆధారంగా ఈ నెల 18 నాటికి కౌన్సెలింగ్ పూర్తి చేయాలి. కనీస మార్కులు తగ్గకుండా, ప్రవేశాల్లో పాల్గొనడానికి అర్హత సాధించిన ఇతర అభ్యర్థులు కూడా బీడీఎస్ కోర్సు ప్రవేశాలకు పరిగణనలోకి తీసుకోవాలి..’అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. 2 లక్షల మందికి చాన్స్.. కోర్టు తీర్పు నేపథ్యంలో దేశవ్యాప్తంగా 2 లక్షలకు పైగా మందికి అవకాశం దొరికిందని ఏపీ ప్రైవేటు మెడికల్, డెంటల్ కాలేజ్ మేనేజ్మెంట్స్ అసోసియేషన్ ప్రతినిధులు గన్ని భాస్కరరావు, ఎల్.కృష్ణప్రసాద్ తెలిపారు. పర్సంటైల్ మార్కులు తగ్గితే సీట్లు వృథా పోవని గుర్తించి సుప్రీంకోర్టును ఆశ్రయించామని, తర్వాత ఇతర రాష్ట్రాల అసోసియేషన్లు కూడా ముందుకురావడంతో కేసుకు ప్రాధాన్యం పెరిగిందని తెలిపారు. దంత వైద్యుల కొరత దృష్టిలో ఉంచుకొని మార్కులు లేదా పర్సంటైల్ తగ్గించాలని, నిబంధనలు సడలించాలని కోర్టును ఆశ్రయించామని గన్ని భాస్కరరావు పేర్కొన్నారు. -
ఫీజులపై దరఖాస్తు గడువు పెంపు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రైవేట్ మెడికల్, డెంటల్, ఆయుష్, నర్సింగ్, పారామెడికల్, అగ్రికల్చర్, హార్టికల్చర్ విద్యాసంస్థల్లో ఫీజుల నిర్ణయానికి దరఖాస్తు గడువును మరో 2వారాలు పొడిగించారు. ఈ మేరకు ఏపీ ఉన్నత విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ (ఏపీహెచ్ఈఆర్ఎంసీ) సభ్య కార్యదర్శి డాక్టర్ ఎన్.రాజశేఖర్‌రెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రైవేట్ మెడికల్, డెంటల్ కాలేజీల యాజమాన్యాల అసోసియేషన్ విజ్ఞప్తి మేరకు మార్చి 14వ తేదీ వరకు గడువును పొడిగిస్తున్నట్టు తెలిపారు. మెడికల్‌లో యూజీ, పీజీ, సూపర్ స్పెషాల్టీ, డెంటల్‌లో యూజీ, పీజీ, ఆయుష్, నర్సింగ్‌లో యూజీ, పీజీ, డిప్లొమో, పారామెడికల్, అగ్రికల్చర్, హార్టికల్చర్ ప్రోగ్రాములు నిర్వహించే ప్రైవేట్ అన్ ఎయిడెడ్ ప్రొఫెషనల్ విద్యాసంస్థలు ఈ గడువులోగా తమ సమాచారాన్ని aphermc.ap.gov.in వెబ్సైట్లో అప్లోడ్ చేయాలని రాజశేఖర్‌రెడ్డి సూచించారు. -
షాకింగ్ : అమ్మాయి శవంలో అబ్బాయి డీఎన్ఏ
లాహోర్ : సాధారణంగా ప్రతీ ఒక్కరి శరీరంలో జన్యు కణాలను గుర్తించేందుకు డీఎన్ఏ ప్రముఖ పాత్ర పోషిస్తాయన్న సంగతి మనందరికి తెలిసిందే. కానీ పాకిస్తాన్లో మాత్రం వింత ఘటన చోటుచేసుకుంది. చనిపోయిన యువతి మృతదేహంలో యువకుడికి సంబంధించిన డీఎన్ఏ కణాలను గుర్తించినట్లు పాకిస్తానీ ఇన్వెస్టిగేషన్ టీమ్ వెల్లడించింది. వివరాల్లోకి వెళితే.. పాకిస్తాన్‌లోని సింధ్ ప్రావిన్స్‌లోని లర్ఖానా జిల్లాలోని బీబీ ఆసిఫా డెంటల్ కాలేజీలో నిమృత కుమారి ఫైనల్ ఇయర్ చదువుతుంది. సామాజిక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనే నిమృత ఈ ఏడాది సెప్టెంబర్ 16న తన గదిలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది. డీఎన్ఏ పరీక్షల కోసం సెప్టెంబర్ 17న నిమృతా మృతదేహం, ఆమె వేసుకున్న బట్టలపై పడిన రక్త నమూనాను జంషోరూ ఫోరెన్సిక్ ల్యాబొరేటరీకి పంపించారు. పరీక్షల నిర్వహణ సమయంలో పలు ఆసక్తికర విషయాలు బయటపడినట్లు పోలీస్ అధికారి మసూద్ బంగాశ్ వెల్లడించారు. 'నిమృతా దేహం నుంచి సేకరించిన రక్త నమూనాలకు డీఎన్ఏ పరీక్షలు నిర్వహించాము. అయితే ఆ నివేదికలో మాత్రం అబ్బాయికి సంబంధించిన డీఎన్ఏ వివరాలు రావడం మమ్మల్ని ఆశ్చర్యపరిచిందని' మసూద్ తెలిపారు. ఇన్నాళ్లు మేం నిమృతా ఆత్మహత్య చేసుకుందన్న కోణంలో భావించాము. కానీ ఎప్పుడైతే డీఎన్ఏలో వేరొకరికి సంబంధించిన వివరాలు రావడంతో ఈ కేసు కీలక మలుపు తిరిగిందని ఆయన పేర్కొన్నారు. దీంతో విషయం తెలుసుకున్న నిమృత కుటుంబసభ్యులు ఆమెని ఎవరో హత్య చేశారని ఆరోపణలతో సింద్ హైకోర్టును ఆశ్రయించారు. కేసుకు సంబంధించిన వివరాలను పరిశీలించిన సింధ్ న్యాయస్థానం... నిమృత కేసులో జ్యుడీషియల్ ఎంక్వైరీ వేయాలని ఉత్తర్వులు జారీ చేసిందని తెలిపారు. నిమృతది హత్యా? ఆత్మహత్య అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. కాగా సెప్టెంబర్‌లో కాలేజ్‌లో హిందూ, మైనారిటీకి సంబంధించి ప్రిన్సిపాల్‌తో జరిగిన గొడవలో నిమృత ప్రత్యక్ష సాక్షిగా ఉన్నారు. అయితే ఈ కేసుకు సంబంధించి 32 మందితో పాటు మృతురాలి కాల్‌డేటా ఆధారంగా తోటి విద్యార్థులైన మెహ్రాన్ అబ్రో, అలీ షాన్ మెమన్లను అనుమానితులుగా భావించి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు విషయమై కాలేజీలో విచారించగా నిమృత తన హాస్టల్ గదిలోనే సీలింగ్ ఫ్యాన్‌కు ఉరి వేసుకొని చనిపోయిందని కాలేజీ యాజమాన్యం తెలిపింది. ఇదే విషయమై నిమృతా సోదరుడు విశాల్ స్పందిస్తూ.. నా సోదరిది ముమ్మాటికి హత్యేనని, ఆమె మెడకు కేబుల్ వైర్‌తో బిగించిన గుర్తులు ఉన్నాయని, అంతేగాక ఆమె చేతులను ఎవరో బలవంతంగా పట్టుకున్న గుర్తులు కూడా ఉన్నట్లు స్పష్టం చేశారు. అయితే పోలీసులు మాత్రం మెహ్రన్ అబ్రో, నిమృతాలు కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారని, శారీరకంగా కూడా దగ్గరయ్యారని చెబుతున్నారు. నిమృతా పెళ్లి ప్రస్తావన తీసుకురావడంతో అబ్రో ఈ అఘాయిత్యానికి ఏమైనా ఒడిగట్టాడా అన్న కోణంలో విచారణ జరుపుతున్నారు. Young Medical student Nimirta Kumari's dead body found in Chandika medical college hostel larkana, Further couldn't get Reasons behind it .... She was final year student RIP... pic.twitter.com/WSrOJlhF8D — Sanjay Soni (@sanjaysindhi65) September 16, 2019 -
డాక్టర్ ఫీజుల మోత!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రైవేటు మెడికల్, డెంటల్ కాలేజీల్లో ఫీజుల పెంపునకు రంగం సిద్ధమైంది. ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో బీ కేటగిరీ, సీ కేటగిరీ (ఎన్ఆర్ఐ) కోటా సీట్లల్లో 5 శాతం ఫీజులు పెంచుకునేందుకు అవకాశం కల్పించాలని ప్రైవేటు మెడికల్ కాలేజీల సంఘం రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. గతేడాది ఐదు శాతం ఫీజు పెంచినా ఆ ఏడాదికే పరిమితం చేశారని, కాబట్టి ఈ ఏడాది మరో ఐదు శాతం ఫీజు పెంచుకునేందుకు అవకాశం కల్పించాలని లేఖ రాసినట్లు ప్రైవేటు మెడికల్ కాలేజీల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మీనర్సింహారావు ‘సాక్షి’కి తెలిపారు. పెంపుపై అనుమతి కోసం ఎదురుచూస్తున్నామని తెలిపారు. ఏటా ఐదు శాతం ఫీజులు పెంచుకోవడానికి అవకాశం కల్పిస్తూ గతంలోనే ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినందున ఆ మేరకు ఈసారి కూడా ఫీజులు పెరుగుతాయని కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం వర్గాలు కూడా స్పష్టం చేశాయి. ఏడాదికి బీ కేటగిరీకి రూ. 57 వేలు, ఎన్ఆర్ఐ రూ. 1.15 లక్షలు అదనం... రాష్ట్రంలో 21 ప్రైవేటు మెడికల్ కాలేజీలు ఉండగా అందులో నాలుగు మైనారిటీ మెడికల్ కాలేజీలున్నాయి. మైనారిటీ మెడికల్ కాలేజీలకు ఏడాదికి 5 శాతం పెంపు నిబంధన వర్తించదు. కాబట్టి మిగిలిన 17 మెడికల్ కాలేజీల్లోని ఎంబీబీఎస్ సీట్లకు ఫీజుల పెంపు ఉత్తర్వులు వర్తిస్తాయి. ఇవిగాక ప్రైవేటు డెంటల్ కాలేజీల్లోనూ 5 శాతం ఫీజుల పెంచుకునే నిబంధన వర్తిస్తుంది. ప్రైవేటు మెడికల్ కాలేజీల్లోని వైద్య సీట్లలో 50 శాతం కన్వీనర్ కోటా సీట్లు ఉంటాయి. ఇక 35 శాతం బీ కేటగిరీ సీట్లు ఉంటాయి. మరో 15 శాతం సీట్లను సీ కేటగిరీ కింద భర్తీ చేసుకునే వీలుంది. ఇప్పుడు బీ, సీ కేటగిరీ సీట్లకు ఫీజు పెంచేందుకు రంగం సిద్ధమైంది. ప్రస్తుతం ఎంబీబీఎస్ బీ కేటగిరీ ఫీజు ఏడాదికి రూ. 11.55 లక్షలుగా ఉంది. ఐదు శాతం పెంచితే రూ. 57,750 మేర పెరగనుంది. అంటే మొత్తం ఎంబీబీఎస్ బీ కేటగిరీ ఫీజు ఏడాదికి రూ. 12,12,750 కానుంది. ఇక సీ కేటగిరీ ఫీజు ప్రస్తుతం ఏడాదికి రూ. 23.10 లక్షలుంది. ఐదు శాతం పెంచితే అదనంగా రూ. 1,15,500 కానుంది. అంటే మొత్తం ఎంబీబీఎస్ సీ కేటగిరీ ఫీజు రూ. 24,25,500 కానుంది. అలాగే డెంటల్ కోర్సులకూ ఐదు శాతం మేర ఫీజు పెరగనుంది. ఐదేళ్లకు కలిపి చూస్తే పెంచిన ఫీజుల భారం విద్యార్థులపై అధికం కానుంది. కన్వీనర్ కోటా సీట్లలో మొదటి విడత ప్రవేశాలకు రాష్ట్రంలో మెడికల్ కౌన్సెలింగ్ ప్రా రంభమైంది. ప్రస్తుతం సర్టిఫికెట్ల పరిశీలన జరుగుతోంది. ఆ తర్వాత సీట్ల ఎంపిక పూర్తి చేస్తారు. అనంతరం రెండో విడత కన్వీనర్ కోటాకు నోటిఫికేషన్ విడుదల చేస్తారు. ఆ సమయంలోనే బీ కేటగిరీ సీట్లకు కూడా నోటిఫికేషన్ జారీ చేస్తారు. ఆలోగా ఫీజుల పెంపుపై స్పష్టత ఇవ్వాలని ప్రైవేటు మెడికల్ కాలేజీల యాజమాన్యాలు ప్రభుత్వాన్ని కోరాయి. బీ, సీ కేటగిరీ ఎంబీబీఎస్ సీట్లు 1250... ప్రభుత్వ, ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో 2019–20లో మొత్తంగా 4,600 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులో ఉన్నాయి. 10 ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 1,500 ఎంబీబీఎస్ సీట్లు, 21 ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో 3,100 ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయి. 4 మైనారిటీ కాలేజీల సీట్లు పోను మిగిలిన ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో 2,500 సీట్లున్నాయి. కన్వీనర్ కోటా సీట్లు 1,250 పోను మిగిలినవి బీ, సీ కేటగిరీకి చెందినవి ఉన్నాయి. బీ కేటగిరీ ఎంబీబీఎస్ సీట్లు 875 కాగా, ఎన్ఆర్ఐ కోటా ఎంబీబీఎస్ సీట్లు 375 ఉన్నాయి. ఈ 1,250 సీట్లకు ఫీజులను పెంచేందుకు ప్రైవేటు మెడికల్ కాలేజీల యాజమాన్యాలు రంగం సిద్ధం చేశాయి. ఇక 11 ప్రైవేటు డెంటల్ కాలేజీల్లోనూ 1,140 బీడీఎస్ సీట్లున్నాయి. సగం బీ, సీ కేటగిరీ సీట్లుకాగా వాటికి కూడా 5 శాతం మేర ఫీజులు పెరగనున్నాయి. -
‘నీట్’ రాష్ట్ర స్థాయి ర్యాంకులు విడుదల
సాక్షి, హైదరాబాద్: వైద్య, దంత కళాశాలల్లో ప్రవేశాలకు సంబంధించి జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష (నీట్) రాష్ట్ర స్థాయి ర్యాంకులను కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం శనివారం విడుదల చేసింది. కేటగిరీల వారీగా కటాఫ్ మార్కుల ఆధారంగా రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 33,936 మంది రాష్ట్రం నుంచి నీట్–2019లో అర్హత సాధించారు. ఎంబీబీఎస్, దంత వైద్య కళాశాలల్లో ప్రవేశాల కోసం ఈ ఏడాది మే 5న జాతీయ స్థాయిలో నీట్ అర్హత పరీక్షను నిర్వహించగా, జూన్ 5న జాతీయ స్థాయిలో ఫలితాలు ప్రకటించారు. జాతీయ స్థాయిలో ఏడో ర్యాంకు, మహిళ విభాగంలో ఒకటో ర్యాంకు సాధించిన జి.మాధురిరెడ్డి.. 720 మార్కులకు గాను 695 మార్కులతో తెలంగాణ టాపర్‌గా నిలిచింది. తాజాగా ప్రకటించిన రాష్ట్రస్థాయి ర్యాంకుల్లో మొదటి వేయి ర్యాంకుల్లో 43 మంది తెలంగాణకు చెందిన విద్యార్థులు ఉన్నారు. కాగా శనివారం విడుదల చేసిన రాష్ట్ర స్థాయి ర్యాంకుల వివరాలను అభ్యర్థుల వారీగా కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం వెబ్సైట్లో పెట్టినట్లు వర్సిటీ వర్గాలు వెల్లడించాయి. రాష్ట్రంలోని మెడికల్, డెంటల్ కాలేజీల్లో ప్రవేశాలకు వీలుగా అభ్యర్థులు తమ పేర్లను నమోదు చేసేందుకు త్వరలో నోటిఫికేషన్ విడుదల చేస్తామని ప్రకటించింది. అన్‌రిజర్వుడు కోటా కింది ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు అర్హులని.. ప్రస్తుత ర్యాంకుల జాబితాలో వారు కూడా చేరితే.. ర్యాంకుల్లో మార్పు ఉంటుందని తెలిపింది. అభ్యర్థుల ఒరిజినల్ సర్టిఫికెట్ల పరిశీలన అనంతరం మెరిట్ జాబితాపై పూర్తి స్పష్టత వస్తుందని ప్రకటించింది. ర్యాంకులిలా.. శనివారం విడుదల చేసిన రాష్ట్ర స్థాయి ర్యాంకుల్లో.. మొదటి వేయి ర్యాంకుల లోపు తెలంగాణకు చెందిన 43 మంది విద్యార్థులు ఉన్నారు. 2 వేల ర్యాంకుల్లోపు 69, 5 వేల ర్యాంకుల్లోపు 149, 10 వేల ర్యాంకుల్లోపు 289, 20 వేల ర్యాంకుల్లోపు 600, 25 వేల ర్యాంకుల్లోపు 793, 30 వేల ర్యాంకుల్లోపు 967, 35 వేల ర్యాంకుల్లోపు 4,148 మంది అభ్యర్థులు తెలంగాణకు చెందిన వారు ఉన్నారు. ఇదిలా ఉంటే 720 మార్కులకు గాను 107 మార్కులను ఈ ఏడాది నీట్ కటాఫ్‌గా నిర్ణయించిన విషయం తెలిసిందే. జనరల్ కేటగిరీలో 134 మార్కులు, దివ్యాంగులకు 120, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ కేటగిరీ విద్యార్థులకు 107 మార్కులు కటాఫ్‌గా నిర్ణయించి ర్యాంకులు ప్రకటించారు. -
తెలుగు వైద్యుడికి అరుదైన గౌరవం
సాక్షి, అమరావతి: హైదరాబాద్‌కు చెందిన దంత వైద్య నిపుణులు డా. వికాస్‌గౌడ్‌కు అరుదైన గౌరవం దక్కింది. ఇటలీలోని ‘యూనివర్సిటీ డెగ్లి స్టడీ ది జెనోవా’ తొలిసారిగా తమ సంస్థకు డైరెక్టర్‌గా నియమించింది. భారతీయ వైద్యుడిని డైరెక్టర్‌గా నియమించడం ఇదే తొలిసారి. దంతవైద్యంలో ఇంప్లాంటాలజీలో అనుభవం గడించిన ఈయనను విద్యాబోధనకు గాను అక్కడ డైరెక్టర్ హోదా కల్పించినట్టు యూనివర్సిటీ తెలిపింది. దంత వైద్యంలో అత్యంత ఆధునిక ఇంప్లాంటాలజీలో కోర్సుల నిర్వహణ, విద్యాబోధనలో చురుకైన పాత్ర పోషించగలరని ఆశిస్తున్న ట్టు డా. వికాస్‌గౌడ్‌కు పంపిన లేఖలో పేర్కొన్నారు. ఇప్పటికే పలు అంతర్జాతీయ సమావేశాల్లో ద డెంటల్ ఇంప్లాంటాలజీపై పరిశోధనా పత్రాలు సమర్పించడమే కాకుండా, పలువురు విద్యార్థులకు ఆయన ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. ఇటలీకి చెందిన ఈ సంస్థ తనకు డైరెక్టర్ పదవి ఇవ్వడం ఆనందంగా ఉందని డా. వికాస్ పేర్కొన్నారు. -
హారికను హత్య చేసి, ఆత్మహత్యగా చిత్రీకరణ
-
డెంటల్ విద్యార్థిని అనుమానాస్పద మృతి
-
నీట్–2017కు రంగం సిద్ధం..విజయానికిదే మార్గం
జాతీయ స్థాయిలో ప్రభుత్వ, ప్రైవేట్ మెడికల్, డెంటల్ కళాశాలల్లో ప్రవేశాలకు ఉద్దేశించిన.. నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్)–2017కు రంగం సిద్ధమైంది. పరీక్ష తేదీ సైతం వెల్లడైంది. ఈ పరీక్ష ద్వారా 2017–18లో జాతీయ స్థాయిలో అందుబాటులో ఉన్న ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్ల భర్తీ చేపట్టనున్నారు. ఒకట్రెండు రోజుల్లో నీట్ – 2017 పూర్తి ప్రకటన విడుదలకు సీబీఎస్ఈ కసరత్తు చేస్తోంది. ఈ నేపథ్యంలో నీట్–2017లో విజయానికి అనుసరించాల్సిన వ్యూహాలపై విశ్లేషణ.. నీట్‌ను 2013లో తొలిసారి.. 2016లో పూర్తి స్థాయిలో మరోసారి నిర్వహించినా.. అప్పటికే పలు రాష్ట్రాల్లో ప్రత్యేక ఎంట్రన్స్‌లు ముగియడంతో విద్యార్థులకు 2016లో నీట్ నుంచి ఉపశమనం లభించింది. అయితే.. 2017 నుంచి ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశించాలంటే నీట్లో ఉత్తీర్ణతను తప్పనిసరి చేశారు. నీట్ విషయంలో గతంలో ఎదురైన వ్యతిరేకతకు ప్రధాన కారణాల్లో పరీక్ష మాధ్యమం కూడా ఒకటి. ఈ నేపథ్యంలో నీట్–2017 ను ఇంగ్లిష్, హిందీతోపాటు తెలుగులో కూడా రాసుకునే అవకాశం కల్పిస్తున్నారు. ఆందోళన వీడి.. నీట్‌కు సంబంధించి పరీక్ష స్వరూపం, సిలబస్ విషయంలో తెలుగు విద్యార్థుల్లో ఆందోళన నెలకొంది. అయితే విద్యార్థులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని నిపుణులు అంటున్నారు. కారణం.. మారిన ఇంటర్మీడియెట్ బోర్డ్ సిలబస్ ప్రకారం.. నీట్లో పేర్కొన్న అంశాలను సులువుగా అధిగమించే అవకాశం ఉంది. అదే విధంగా పరీక్షలోనూ ఎంసెట్‌తో పోల్చితే అదనంగా ఇరవై ప్రశ్నలు ఉంటాయి. మూడు గంటల్లో సమాధానాలు రాయాలి. ఈ నేపథ్యంలో విద్యార్థులు ఇప్పటి నుంచే విజయం దిశగా అడుగులు వేయాలి. ఏఐపీఎంటీ పరీక్ష మాదిరిగానే.. నీట్‌కు సన్నద్ధమయ్యే క్రమంలో విద్యార్థులు ముందుగా గత ఆల్ ఇండియా ప్రీ మెడికల్ ఎంట్రన్స్ టెస్ట్ (ఏఐపీఎంటీ) పరీక్షలు, వాటిలో అడిగిన ప్రశ్నలు, వెయిటేజీ లాంటి అంశాలను పరిశీలించాలి. కారణం.. నీట్‌ను కూడా ఏఐపీఎంటీ విధానంలోనే నిర్వహిస్తారు. ఇక నీట్ సిలబస్, పరీక్షలో వెయిటేజీ అంశాలను పరిగణనలోకి తీసుకుంటే గతేడాది నీట్–2లో ఇంటర్మీడియెట్ రెండేళ్ల టాపిక్స్‌కు సంబంధించి సమాన వెయిటేజీ కల్పించారు. బోటనీ, జువాలజీలతో సంయుక్తంగా పేర్కొనే బయాలజీ నుంచి బోటనీకి కొంత ఎక్కువ ప్రాధాన్యం లభించింది. ఒకవైపు ఇంటర్మీడియెట్ పరీక్షలు.. మరోవైపు నీట్ నేపథ్యంలో ఈ రెండు పరీక్షలకు ఉమ్మడిగా ప్రిపరేషన్ సాగించాలి. ప్రాక్టీస్‌కు ప్రాధాన్యం..ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీల్లో ప్రాక్టీస్ బేస్డ్ లెర్నింగ్‌కు ప్రాధాన్యం ఇవ్వాలి. అప్లికేషన్ ఓరియెంటేషన్, కాన్సెప్ట్ బేస్డ్ అప్రోచ్‌తో ప్రిపరేషన్ సాగించాలి. ఫిజిక్స్‌లో ఎలక్ట్రో మాగ్నటిజం, ఏసీ సర్క్యూట్స్, రే ఆప్టిక్స్, మోడ్రన్ ఫిజిక్స్, కరెంట్ ఎలక్ట్రిసిటీ అంశాలకు ప్రాధాన్యం ఇవ్వాలి. కెమిస్ట్రీకి సంబంధించి కెమిస్ట్రీ ఇన్ ఎవ్రీ డే లైఫ్, ఈథర్స్ అండ్ నార్మన్క్లేచర్, క్లీనింగ్ ఏజెంట్స్, క్లీనింగ్ యాక్షన్స్, బయలాజికల్ ఇంపార్టెన్స్ ఆఫ్ మెగ్నీషియం అండ్ కాల్షియం, ఎస్–బ్లాక్ ఎలిమెంట్స్‌పై పట్టు సాధించాలి. బయాలజీలో.. హ్యూమన్ ఫిజియాలజీ, మైక్రోబ్స్ ఇన్ హ్యూమన్ ఫిజియాలజీ, హ్యూమన్ ఇన్సులిన్ అండ్ వ్యాక్సిన్ ప్రొడక్షన్, ట్యాక్సానమీ, నెర్వస్ సిస్టమ్, క్లాసిఫికేషన్ ఆఫ్ ప్లాంట్స్, ప్లాంట్ ఫిజియాలజీ, బయోటెక్నాలజీ అప్లికేషన్స్, ఎకలాజికల్ సక్సెషన్, ఎకలాజికల్/ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్‌పై పట్టు సాధించాలి. నీట్–2017 పరీక్ష విధానం అర్హత: ఇంటర్మీడియెట్ బైపీసీలో గ్రూప్ సబ్జెక్టుల్లో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత. వయోపరిమితి: డిసెంబర్ 31 నాటికి 17 –25 ఏళ్లు ఉండాలి. పరీక్ష విధానం: ఇందులో మొత్తం నాలుగు విభాగాలుంటాయి. అవి.. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ (బోటనీ + జువాలజీ). మొత్తం ప్రశ్నల సంఖ్య – 180 (ఒక్కో విభాగం నుంచి 45 ప్రశ్నలు). ప్రతి ప్రశ్నకు నాలుగు మార్కుల చొప్పున మొత్తం 720 మార్కులుంటాయి. నెగెటివ్ మార్కింగ్ కూడా అమల్లో ఉంది. తప్పు సమాధానానికి ఒక మార్కు కోత విధిస్తారు. పరీక్ష వ్యవధి: మూడు గంటలు. పరీక్ష తేది: మే 7, 2017 ఫిజిక్స్ ప్రశ్నలను న్యూమరికల్ అప్రోచ్‌తో ప్రాక్టీస్ చేయాలి. కొన్ని ప్రశ్నలు గణాంక సహిత సమాచారం ఆధారంగా పరిష్కరించేలా ఉంటాయి. వీటి విషయంలో న్యూమరికల్ అప్రోచ్ కలిసొస్తుంది. అదేవిధంగా కాన్సెప్ట్స్, బేసిక్ ఫార్ములాలపై పట్టు సాధించి అప్లికేషన్ ఓరియెంటేషన్‌తో ప్రిపరేషన్ సాగించడం వల్ల మరిన్ని మార్కులు సొంతం చేసుకోవచ్చు. – డా. సీహెచ్ రామకృష్ణ, ఆర్కేస్ ఫ్రేమ్స్ ఆఫ్ ఫిజిక్స్ -
సాయి డెంటర్ కాలేజీ విద్యార్థుల ధర్నా
పాత శ్రీకాకుళం: మండలంలోని జాతీయ రహదారి పాత్రునివలస ప్రాంత పరిధిలో గల సాయిడెంటల్ కళాశాల విద్యార్థులు మంగళవారం మూకుమ్మడిగా ధర్నా చేశారు. భోజన వసతులు బాగు లేవంటూ క్లాస్‌లు బహిష్కరించి కాలేజ్ ఆవరణలో ఆందోళనకు దిగారు. 40 మంది విద్యార్థులకు ఒకే బాత్రూమ్ ఉందని, తాగడానికి మినరల్ వాటర్ కూడా లేదని తెలిపారు. రూ.70 వేలు ఫీజు చెల్లిస్తుంటే రూ.10వేలు విలువ చేసే సదుపాయాలు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. ధర్నా విషయం తెలుసుకున్న యాజమాన్యం వెంటనే విద్యార్థుల వద్దకు దిగి వచ్చింది. భోజన కమిటీతో మాట్లాడి సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చింది. అయితే కచ్చితమైన హామీ ఇస్తేనే ధర్నా విరమిస్తామని విద్యార్థులు తెగేసి చెప్పడంతో చివరికి ఆ కళాశాల చైర్మన్ కమల్‌విలేకర్ సంఘటనా స్థలానికి చేరుకుని విద్యార్థులతో మాట్లాడారు. సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటానని కరస్పాండెంట్ సూర్యచంద్రరావు, ప్రిన్సిపాల్ సీతారాం సమక్షంలో ఆయన విద్యార్థులకు హామీ ఇచ్చారు. -
జోసెఫ్ దంతవైద్య కళాశాల స్నాతకోత్సవం
దుగ్గిరాల(పెదవేగి రూరల్) : సెయింట్ జోసఫ్ దంత వైద్య కళాశాల పదో స్నాతకోత్సవాన్ని సోమవారం నిర్వహించారు. దుగ్గిరాలలోని దంత కళాశాలలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో డెంటల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(న్యూ ఢిల్లీ) మెంబర్ ప్రొఫెసర్ డాక్టర్ పి.రేవతి విద్యార్థులకు పట్టాలు ప్రదానం చేశారు. కళాశాల చైర్మన్ రెవరెండ్ బిషప్ పొలిమేర జయరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో 2011–16 విద్యా సంవత్సరం అండర్ గ్రాడ్యుయేషన్ విద్యార్థులకు, 2013–16 విద్యా సంవత్సరం పోస్ట్ గ్రాడ్యుయేషన్ విద్యార్థులకు పట్టాలు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ముఖ్యఅతిథిగా విచ్చేసిన రెవరెండ్ ఫాదర్ తోట గాబ్రియోల్, వ్యవస్థాపక కరస్పాండెంట్ సెక్రటరీ ఫాదర్ పి.బాల ప్రత్యేక ఆహ్వానితులుగా హాజరయ్యారు. ప్రిన్సిపాల్ ఎన్ స్లీవరాజ్, అన్ని విభాగాల హెచ్‌ఒడిలు, అడ్మినిస్టేటర్ ఫాదర్ కె.బల్తజర్, నర్సింగ్ కళాఇశాల కరస్పాండెంట్ ఫాదర్ కె.అమృతరాÐŒ , సిబ్బంది పాల్గొన్నారు. -
పెరిగిన పీజీ వైద్య సీట్లు
♦ నిమ్స్‌లో 7, ఉస్మానియాలో 10 డెంటల్ పీజీ సీట్లు ♦ నిమ్స్ సీట్లలో కోటా కోరుతున్న ఏపీ... తెలంగాణ ససేమిరా సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పీజీ వైద్య సీట్లు పెరిగాయి. నిమ్స్‌లో రేడియాలజీ పీజీలో 5, డిప్లొమాలో 2 సీట్లు పెరిగాయి. ఉస్మానియా మెడికల్ కాలేజీలోనూ 10 డెంటల్ వైద్య సీట్లు పెంచుతూ భారత వైద్య మండలి (ఎంసీఐ) నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది నుంచి ఇవి అందుబాటులోకి వస్తాయి. నిమ్స్‌లో పెరిగిన వైద్య పీజీ సీట్లలో తమకు 64 శాతం వాటా కావాలని ఏపీ ప్రభుత్వం కోరుతోంది. దీనిపై ఏపీ తరపున ఎన్టీఆర్ ఆరోగ్య వర్సిటీ వీసీ రవిరాజు, తెలంగాణ తరపున కాళోజీ నారాయణరావు ఆరోగ్య వర్సిటీ వీసీ కరుణాకర్‌రెడ్డి, నిమ్స్ డెరైక్టర్ మనోహర్ సోమవారం సమావేశమయ్యారు. ఏపీకి 64 శాతం, తెలంగాణకు 36 శాతం సీట్ల కేటాయింపన్నది విభజన చట్టం ప్రకారం 2014 జూన్‌కు ముందు న్న సీట్లకే వర్తిస్తుంది తప్ప ఆ తర్వాత కొత్తగా వచ్చే సీట్లకు కాదని తెలంగాణ స్పష్టం చేసింది. ఈ మేరకు గతంలోనే తాము స్పష్టంగా మెమో జారీ చేశామని పేర్కొంది. అయితే దీనిపై ఏపీ విద్యార్థులు ఆందోళన చేసే అవకాశముందని సమాచారం. పాలమూరులో ఎంసీఐ బృందం ఈ ఏడాది నుంచి అందుబాటులోకి రానున్న మహబూబ్‌నగర్ ప్రభుత్వ మెడికల్ కాలేజీ మౌలిక వసతులు తదితరాలను పరిశీలించేందుకు ఎంసీఐ బృందం సోమవారం అక్కడ పర్యటించింది. కాలేజీ నిర్మాణానికి చేపడుతున్న చర్యలను, వసతులను తనిఖీ చేసింది. ఇదే తుది తనిఖీ అని ఎంసీఐ అధికారులు పేర్కొన్నారు. 150 ఎంబీబీఎస్ సీట్లుండే ఈ కాలేజీలో ఈ ఏడాది నుంచే అడ్మిషన్లు మొదలవుతాయి. -
డెంటల్ విద్యార్థినిపై జూనియర్ అత్యాచార యత్నం
-
డెంటల్ విద్యార్థినిపై జూనియర్ అత్యాచార యత్నం
విజయవాడ: విజయవాడ నగరంలోని ప్రభుత్వ డెంటల్ కాలేజీలో ఫైనలియర్ చదువుతున్న విద్యార్థినిపై థర్డీయర్ విద్యార్థి శ్రీధర్ లైంగికదాడికి యత్నించారు. ఈ సంఘటన శనివారం అర్థరాత్రి చోటు చేసుకుంది. సదరు విద్యార్థిని తన స్నేహితురాలితో కలసి శ్రీనివాసనగర్ బ్యాంక్ కాలనీలో ఉంటోంది. అయితే శ్రీధర్ గత రాత్రి బాగా మద్యం సేవించి విద్యార్థిని ఉంటున్న గదికి వచ్చి తలుపు కొట్టాడు. తలుపు తీసిన ఆమెపై పడి... అమాంతంగా అత్యాచారం చేయడోయాడు. అతడి నుంచి ఆమె ఎలాగోలా తప్పించుకుని బయటపడి... పటమట పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అందులోభాగంగా శ్రీధర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్‌కి తరలించారు. -
‘బీ కేటగిరీ’లో స్కామ్!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రైవేటు మెడికల్, డెంటల్ కాలేజీ యాజమాన్యాలు బీ కేటగిరీ సీట్ల కేటాయింపులో భారీ కుంభకోణానికి తెరలేపాయి! ఈ సీట్లను ప్రత్యేక ప్రవేశ పరీక్షకు ముందే కోట్ల రూపాయలకు అమ్ముకున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నా పట్టించుకోని యాజమాన్యాలు ఆ సీట్లను ‘కొనుగోలు’ చేసిన వారికే కట్టబెట్టేందుకు వీలుగా ఎన్నారై కోటాలోకి మార్చుకునేందుకు కుట్రకు రంగం సిద్ధం చేశాయి!! కౌన్సిలింగ్లో ప్రతిభ ఆధారంగా ఎంబీబీఎస్ సీట్లు పొందిన విద్యార్థులను సైతం తప్పించేందుకు తెగించాయి. ఏదైనా కారణంతో కాలేజీ యాజమాన్యం సీటు కోల్పోతే ఆ సీటును ఎన్నారై కోటాలోకి మార్చుకోవచ్చన్న ప్రభుత్వ ఉత్తర్వును అనుకూలంగా మలచుకునేందుకు యత్నిస్తున్నాయి. ఎక్కువ మంది మధ్య తరగతి విద్యార్థులే ఉన్నప్పటికీ వారి స్తోమతకు మించి ఎంబీబీఎస్‌కు మొదటి ఏడాది ఫీజు రూ. 9 లక్షలతోపాటు నాలుగేళ్ల బ్యాంకు గ్యారంటీ చూపాలని ఒత్తిడి తెస్తున్నాయి. పన్నురెండ్రోజుల క్రితం ప్రభుత్వం నాలుగేళ్ల బ్యాంకు గ్యారంటీని ఏడాదికి కుదిస్తూ జీవో జారీచేసినా అమలు చేయడానికి నిరాకరిస్తున్నాయి. ఈ నెలాఖరుకే గ్యారంటీ గడువు ముగుస్తుండటంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వ జీవో ఉన్నప్పటికీ విద్యార్థులు ఎంబీబీఎస్ సీటు కోల్పోయే ప్రమాదం ఏర్పడింది. నాలుగేళ్ల బ్యాంకు గ్యారంటీ చూపింది కొందరే... రాష్ట్రంలోని ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో బీ కేటగిరీ కింద ఉన్న 505 ఎంబీబీఎస్ సీట్లు, 350 బీడీఎస్ సీట్లకు ఇటీవల ప్రత్యేక కౌన్సిలింగ్ నిర్వహించగా అందులో ఎంబీబీఎస్ సీట్లన్నీ నిండిపోయాయి. కానీ బీడీఎస్‌లో మాత్రం 200కుపైగా సీట్లు మిగిలిపోయాయి. విద్యార్థులు సీటు సాధించినప్పటికీ బ్యాంకు గ్యారంటీ వారికి అడ్డుగా మారింది. ఈ నెలాఖరు నాటికి నాలుగేళ్ల బ్యాంకు గ్యారంటీ ఇస్తేనే సీటు ఉంటుందని లేకుంటే వదులు కోవాల్సిందేనని యాజమాన్యాలు తెగేసి చెబుతున్నాయి. ప్రభుత్వం జారీచేసిన ‘ఏడాదికి బ్యాంకు గ్యారంటీ’ జీవోతో తమకు సంబంధం లేదని వాదిస్తున్నాయి. దీంతో 505 ఎంబీబీఎస్ సీట్లల్లో చేరిన విద్యార్థుల్లో శుక్రవారం నాటికి కేవలం 10 శాతం మంది విద్యార్థులు మాత్రమే నాలుగేళ్ల బ్యాంకు గ్యారంటీ చూపినట్లు తెలిసింది. యాజమాన్యాల నిబంధన వల్ల కనీసం 300 ఎంబీబీఎస్ సీట్లకు చెందిన విద్యార్థులు నాలుగేళ్ల బ్యాంకు చూపని పరిస్థితి ఏర్పడుతుందని అంటున్నారు. వీటిని ఎన్నారై కోటా కింద మార్చుకోవాలన్న కుట్రలో ప్రైవేటు మెడికల్ యాజమాన్నాలు ఉన్నాయి. కానీ ఇంత జరుగుతున్నా ప్రభుత్వ వర్గాలు మాత్రం చోద్యం చూస్తున్నాయి. బ్యాంకు గ్యారంటీకి వచ్చే నెల 4 వరకు అవకాశం ఉంటుందని వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు చెబుతున్నా బహిరంగ ప్రకటన ఇవ్వడానికి నిరాకరిస్తున్నాయి. సవరణ జీవో ఏకపక్షం రాష్ట్ర ప్రభుత్వంపై ప్రైవేటు వైద్య కళాశాలల యాజమాన్యాలు హైకోర్టుకెక్కాయి. యాజమాన్య కోటా కింద ప్రవేశం పొందే తేదీ లోపు మొదటి ఏడాది ఫీజుతోపాటు మిగిలిన నాలుగేళ్ల కోర్సుకు బ్యాంకు గ్యారంటీ తీసుకునేందుకు తమకు అనుమతినిస్తూ జారీ చేసిన జీవోను సర్కారు సవరించడాన్ని సవాల్‌చేస్తూ శుక్రవారం హైకోర్టును ఆశ్రయించాయి. ప్రభుత్వ నిర్ణయం ఏకపక్షమని ఆరోపించాయి. తమ పిటిషన్‌ను అత్యవసరంగా లంచ్‌మోషన్ రూపంలో విచారించాలని కోరాయి. అయితే ఇందుకు హైకోర్టు నిరాకరించింది. సాధారణ పద్దతిలోనే పిటిషన్ విచారణకు వచ్చినప్పుడు వాదనలు వింటామని స్పష్టం చేసింది. కాగా, సవరణ జీవో మేరకు ఓ ఏడాదికి బ్యాంకు గ్యారంటీ సమర్పించేందుకు తమకూ గడువునివ్వాలంటూ పలువురు విద్యార్థులు శుక్రవారం హైకోర్టును ఆశ్రయించగా న్యాయస్థానం వారికి వారం గడువునిచ్చింది. -
బీ కేటగిరీ సీట్లకు ‘బ్యాంక్ గ్యారంటీ ఏడాదే’
నాలుగేళ్ల నుంచి ఏడాదికికుదిస్తూ సర్కారు ఉత్తర్వులు సాక్షి, హైదరాబాద్: ప్రైవేటు మెడికల్, డెంటల్ కాలేజీల్లో బీ కేటగిరీ వైద్య సీట్లు పొందిన విద్యార్థులకు ఊరట లభించింది. మొదటి ఏడాది ఫీజుతోపాటు ఎంబీబీఎస్‌కు నాలుగేళ్లు, బీడీఎస్‌కు మూడేళ్లు బ్యాంకు గ్యారంటీ చూపాలని ప్రైవేటు మెడికల్ కళాశాల యాజమాన్యాలకు అనుగుణంగా గతంలో జారీ చేసిన జీవోను సవరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం మరో జీవో జారీ చేసింది. ఒక ఏడాదికి మాత్రమే గ్యారంటీ చూపితే సరిపోతుందని తాజా జీవోలో స్పష్టం చేసింది. నాలుగేళ్ల బ్యాంకు గ్యారంటీపై విద్యార్థులు, వారి తల్లిదండ్రుల నుంచి వ్యతిరేకత రావడం తెలిసిందే. దీంతో ఈ విషయంపై వైద్య మంత్రి లక్ష్మారెడ్డి ఉన్నతాధికారులతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి ప్రభుత్వం వైపు నుంచి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. బీ కేటగిరీ సీట్ల భర్తీ సందర్భంగా గతంలో విడుదల చేసిన జీవోలో మార్పులు చేయాల్సిన అవసరముందని అధికారులు తెలపడంతో ఈ విషయాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై సీఎం సానుకూలంగా స్పందించి అత్యవసరంగా ‘ఏడాదికే బ్యాంకు గ్యారంటీ’ని కుదిస్తూ సవరింపు ఉత్తర్వులు ఇవ్వాల్సిందిగా ఆదేశాలు జారీచేశారు. దీంతో బుధవారం రాత్రి ‘ప్రతి ఏడూ వచ్చే ఏడాది ట్యూషన్ ఫీజును వైద్య కళాశాలలు బ్యాంకు గ్యారంటీగా స్వీకరించొచ్చు’ అని సవరిస్తూ ఉత్తర్వులు విడుదల చేశారు. తెలంగాణలోని ప్రైవేటు మెడికల్, డెంటల్ కాలేజీల్లో 35 శాతం బీ కేటగిరీ సీట్లకు ప్రైవేటు యాజమాన్యాల నేతృత్వంలో కౌన్సెలింగ్ జరిగిన విషయం తెలిసిందే. ఈ నెలాఖరు నాటికి బ్యాంకు గ్యారంటీ ఇవ్వ డానికి గడువు విధించడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళనలో మునిగిపోయారు. ప్రభుత్వ తాజా నిర్ణయంతో వారంతా ఊపిరిపీల్చుకున్నారు. మరోవైపు ఈ నెలాఖరు నాటికి బ్యాంకు గ్యారంటీకి పెట్టిన గడువు తేదీని పెంచాలని విద్యార్థులు కోరుతున్నారు. ఈ వారంలో సెలవులు ఉండటంతో బ్యాంకు గ్యారంటీ తీసుకోవడం కష్టమని అంటున్నారు. దీనిపై మంత్రి స్పందిస్తూ ప్రైవేటు మెడికల్ కాలేజీ యాజమాన్యాలతో మాట్లాడతానని చెప్పారు. -
ఎంబీబీఎస్.. ఏ ర్యాంకుతో ఎక్కడ సీటు?
ఎంబీబీఎస్.. బీడీఎస్.. లక్షల మంది విద్యార్థుల కల..! కానీ, సీట్లు మాత్రం పది వేల లోపే! అందుకే విద్యార్థుల్లో ఆందోళన. ఏ ర్యాంకు వరకు సీటు వస్తుందా అని! ముఖ్యంగా గతేడాది వరకు ప్రైవేటు-బీ కేటగిరీలో కౌన్సెలింగ్ ద్వారా అందుబాటులో ఉండే పది శాతం సీట్లను ఈ ఏడాది నుంచి ఆయా ప్రైవేటు కళాశాలల మేనేజ్మెంట్లే భర్తీ చేసుకోవచ్చనే ప్రభుత్వాల ఉత్తర్వులతో మరికొన్ని సీట్లలో కోత పడనుంది. రెండు తెలుగు రాష్ట్రాలలో అందుబాటులో ఉన్న మెడికల్ సీట్లు, కౌన్సెలింగ్ ద్వారా భర్తీ అయ్యే సీట్లు, మేనేజ్మెంట్ కోటాలో భర్తీ అయ్యే సీట్లు.. గత ఏడాది కటాఫ్‌ల అంచనాలతో విశ్లేషణ.. ఎంబీబీఎస్, డెంటల్ కళాశాలలు, అందుబాటులో ఉన్న సీట్ల వివరాలు.. తెలంగాణ రాష్ట్రంు కళాశాలల్లో 2,000 సీట్లు అంటే మొత్తం 2,850 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో రెండు మైనారిటీ కళాశాల సీట్లు (300) కౌన్సెలింగ్ పరిధిలోకి రావు.బీడీఎస్ కోర్సులో పది ప్రైవేటు కళాశాలల్లో వెయ్యి సీట్లు, ఒక ప్రభుత్వ కళాశాలలో (గవర్నమెంట్ డెంటల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ - హైదరాబాద్)లో 100 సీట్లు మొత్తం 1100 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో ఎంబీబీఎస్ కోర్సులో ఆంధ్రప్రదేశ్‌లో 12 ప్రభుత్వ కళాశాలల్లో (స్టేట్ వైడ్ ఇన్స్టిట్యూట్గా పేర్కొనే సిద్ధార్ధ మెడికల్ కాలేజ్ విజయవాడ సహా) 1900 సీట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో తిరుపతిలోని శ్రీ పద్మావతి మెడికల్ కాలేజ్ ఫర్ ఉమెన్లోని 150 సీట్లు కేవలం మహిళలకే. 12 ప్రైవేటు మెడికల్ కళాశాలల్లో 1900 సీట్లు అందుబాటులో ఉన్నాయి.బీడీఎస్ కోర్సులో రెండు ప్రభుత్వ కళాశాల్లో 140 సీట్లు; ప్రైవేటు డెంటల్ కళాశాలల్లో 1060 సీట్లు అందుబాటులో ఉన్నాయి. భర్తీ ఇలా: ప్రభుత్వ కళాశాలల్లోని మొత్తం సీట్లను, ప్రైవేటు కళాశాలల్లోని మొత్తం సీట్లలో 50 శాతం సీట్లను కౌన్సెలింగ్ ద్వారా మెరిట్ ఆధారంగా భర్తీ చేయనున్నారు.ప్రైవేటు మెడికల్ కళాశాలల్లోని మిగతా 50 శాతం సీట్లను రెండు రాష్ట్రాల్లోనూ ఆయా కళాశాలల మేనేజ్మెంట్లు ఒక కన్సార్షియంగా ఏర్పడి ప్రత్యేక ఎంట్రెన్స్, అందులో మెరిట్ ఆధారంగా భర్తీ చేయనున్నారు. తగ్గిన ప్రైవేటు ‘కౌన్సెలింగ్’ సీట్లు.. పెరిగిన మేనేజ్మెంట్ కోటా: గత ఏడాది వరకు ప్రైవేట్ మెడికల్ కళాశాలల్లోని మొత్తం సీట్లలో 50 శాతం సీట్లను ప్రైవేట్-ఎ పేరిట, మరో పది శాతం సీట్లను ప్రైవేట్-బి పేరిట కౌన్సెలింగ్ ద్వారా మెరిట్ ఆధారంగా భర్తీ చేశారు. అంటే మొత్తం 60 శాతం సీట్లు కౌన్సెలింగ్ ద్వారా లభించేవి. కానీ ఈ ఏడాది నుంచి ప్రైవేట్-బి పరిధిలోని 10 శాతం సీట్లను కూడా మేనేజ్మెంట్లు సొంతగా భర్తీ చేసుకునే అవకాశం ప్రభుత్వాలు కల్పించాయి. ఈ కారణంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రైవేట్-బి పరిధిలోకి వచ్చే 200 సీట్లు; ఆంధ్రప్రదేశ్‌లో 190 సీట్లు తగ్గనున్నాయి. ఈ సీట్లు పొందాలంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ మెడికల్ కళాశాలల సంఘాలు వేర్వేరుగా నిర్వహించిన ప్రైవేట్ ఎంట్రన్స్‌లో ఉత్తీర్ణత తప్పనిసరి. 35 శాతానికి చేరిన మేనేజ్మెంట్ సీట్లు: ఈ ఏడాది రెండు ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయంతో మెడికల్ కౌన్సెలింగ్‌లో కేవలం యాభై శాతం సీట్లు మాత్రమే అభ్యర్థులకు కౌన్సెలింగ్‌లో అందుబాటులో ఉండనున్నా యి. మిగతా సీట్లను రెండు కేటగిరీలుగా మేనేజ్మెంట్లు భర్తీ చేసుకునే అవకాశం ఏర్పడింది. గత ఏడాది వరకు ప్రైవేట్-బి పేరుతో కౌన్సెలింగ్‌లో ఉండే 10 శాతం సీట్లతోపాటు ప్రైవేట్ సి కేటగిరీలో సి1 పేరుతో ఉండే 25 శాతం సీట్లు మొత్తం కలిపి 35 శాతం సీట్లు మేనేజ్మెంట్లే భర్తీ చేసుకోనున్నాయి. ప్రైవేట్-సి కేటగిరీలోనే సి-2 పేరుతో ఎన్ఆర్ఐల కోసం ఉద్దేశించిన 15 శాతం సీట్లపై అధికారం యాజమాన్యాలదే. అంటే.. స్థూలంగా విద్యార్థులకు అందుబాటులో ఉండే ప్రైవేటు సీట్లు యాభై శాతం మాత్రమే. ఫీజుల వివరాలుతెలంగాణ రాష్ట్రంలో: ఎంబీబీఎస్:ప్రభుత్వ కళాశాలల ఫీజు: రూ. 10 వేలు ప్రైవేట్- బి కేటగిరీ ఫీజు: రూ. 9 లక్షలు ప్రైవేట్ సి2 (ఎన్ఆర్ఐ) ఫీజు: రూ. 15 లక్షలు బీడీఎస్:ప్రభుత్వ కళాశాలల ఫీజు: రూ. 9 వేలు ప్రైవేట్ - ఎ కేటగిరీ ఫీజు: రూ. 45 వేలు ప్రైవేట్ -బి కేటగిరీ ఫీజు: రూ. 2.7లక్షలు ప్రైవేట్- సి2 (ఎన్ఆర్ఐ)ఫీజు: రూ. 2.7 లక్షలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరింత పెరిగిన బి కేటగిరీ ఫీజులుమేనేజ్మెంట్ కోటా ఫీజులు తెలంగాణ కంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరింత పెరిగాయి.ఎంబీబీఎస్‌లో ప్రైవేట్ - బి కేటగిరీ ఫీజు సంవత్సరానికి రూ. 11లక్షలుగా నిర్ణయించారు. ప్రైవేట్ సి(ఎన్ఆర్ఐ) కోటా దాదాపు 55 లక్షలు కానుం ది. (బి-కేటగిరీ ఫీజుకు అయిదు రెట్ల కంటే ఎక్కువ ఉండరాదు అని జీఓలో పేర్కొన్నారు. ఆ లెక్క మేరకు ఎన్ఆర్ఐ కోటా సీటు ఫీజు రూ. 55 లక్షలు కానుంది)బీడీఎస్‌లో బి-కేటగిరీ ఫీజు సంవత్సరానికి 4.5 లక్షలుగా నిర్ణయించారు.బీడీఎస్‌లో ఎన్ఆర్ఐ కోటా ఫీజు రూ.22 లక్షలు కానుంది. (ఈ కోర్సు విషయంలోనూ బి-కేటగిరీ ఫీజుకు అయిదు రెట్ల కంటే ఎక్కువ ఉండకూడదు అని జీఓలో పేర్కొన్నారు.) ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ద్వారానే కౌన్సెలింగ్! తెలుగు రాష్ట్రాలు రెండుగా అయినప్పటికీ ఈ ఏడాదికి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ద్వారానే కౌన్సెలింగ్ చేపట్టాలని నిర్ణయించారు. అయితే సీట్ల భర్తీ పరంగా లోకల్, నాన్ లోకల్ విధానాలపై మరికొద్ది రోజుల్లో స్పష్టమైన విధి విధానాలు ఖరారు కానున్నాయి. ఈ లోపు అభ్యర్థులు గత ఏడాది ఆయా రీజియన్ల వారీగా చివరి ర్యాంకుల వివరాలు తెలుసుకుని.. ప్రస్తుతం తమ ర్యాంకుకు సీటు వచ్చే అవకాశం ఉన్న కళాశాలలపై అవగాహన ఏర్పరచుకోవాలి. ప్రాంతాల వారీగా ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం- ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్ల వివరాలు.. ఎంబీబీఎస్ తెలంగాణ (ఉస్మానియా యూనివర్సిటీ రీజియన్ కళాశాలలు: 14; సీట్లు: 2000 ఆంధ్రప్రదేశ్ (ఏయూ రీజియన్) ప్రభుత్వ కళాశాలలు: 6; సీట్లు: 950 ప్రైవేటు కళాశాలలు: 8; సీట్లు: 1250 ఆంధ్రప్రదేశ్ (ఎస్వీయూ రీజియన్) ప్రభుత్వ కళాశాలలు: 6; సీట్లు: 950 ప్రైవేటు కళాశాలలు: 4; సీట్లు: 650 బీడీఎస్ తెలంగాణ (ఉస్మానియా యూనివర్సిటీ రీజియన్) ప్రభుత్వ కళాశాలలు: 1: సీట్లు: 100 ప్రైవేటు కళాశాలలు: 10: సీట్లు: 1000 ఆంధ్రప్రదేశ్ (ఏయూ రీజియన్) ప్రభుత్వ కళాశాలలు: 1; సీట్లు: 40 ప్రైవేటు కళాశాలలు: 9; సీట్లు: 850 ఆంధ్రప్రదేశ్ (ఎస్వీయూ రీజియన్) ప్రభుత్వ కళాశాలలు: 1; సీట్లు: 100 ప్రైవేటు కళాశాలలు: 3; సీట్లు: 250 -
డెంటల్ కౌన్సెలింగ్
నాకు ఆర్నెల్ల క్రితం పంటి నొప్పి వచ్చింది. దాంతో డెంటిస్ట్ పై వరసలో పళ్లలో, కింది వరస పళ్లలో రెండు కొత్త క్యాప్స్ పెట్టారు. మళ్లీ రెండు నెలలకు నొప్పి, చిగురువాపు వచ్చాయి. అప్పుడు డెంటిస్ట్ క్యాప్స్ తొలగించి క్లీన్ చేసి మళ్లీ వాటిని తిరిగి అమర్చారు. కొంతకాలంలోనే ఇలా రెండుమూడుసార్లు చేయాల్సి వచ్చింది. నొప్పి నివారణ మందులు వాడుతున్నప్పుడు బాగానే ఉన్నా మళ్లీ మళ్లీ నొప్పి వస్తోంది. నా సమస్యకు సరైన పరిష్కారం చెప్పండి. - బాలయ్య, విశాఖపట్నం ఇన్నిసార్లు చికిత్స జరిగాక కూడా మీరు చెప్పిన విధంగా మాటిమాటికీ పంటి నొప్పి, చిగురు వాపు రావడం పంటి ఆరోగ్యానికి సరైన సూచన కాదు. మాటిమాటికీ క్యాప్‌ను తీసి మళ్లీ అమర్చడం వల్ల మీకు ఉన్న సమస్య తీరదు. నొప్పి నివారణ మందుల్ని మాటిమాటికీ వాడటంతో డ్రగ్ రెసిస్టెన్స్ వచ్చి మళ్లీ అదో సమస్య కావచ్చు. మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే వ్యాధినిర్ధారణలోగాని, చికిత్సలో ఏదో లోపం ఉన్నట్లుగా అనిపిస్తోంది. మీకు నొప్పి వచ్చినప్పుడు మందులు వాడుతూ ఉండటం కంటే... సమస్య పూర్తిగా పరిష్కారమయ్యేలా అవసరాన్ని బట్టి సరైన చికిత్స చేయించాల్సి ఉంటుంది. మీరు మరో డెంటిస్ట్‌ను కలిసి వారి అభిప్రాయం తీసుకోండి. - డాక్టర్ నరేంద్రనాథ్ రెడ్డి ఆర్థోడాంటిస్ట్ స్మైల్ మేకర్స్ డెంటల్ హాస్పిటల్స్, మూసారంబాగ్, హైదరాబాద్ -
డెంటల్ కౌన్సెలింగ్
మా అబ్బాయి వయసు నాలుగేళ్లు. వాడి పాలపళ్లన్నీ ఇప్పటికే పిప్పిపళ్లయ్యాయి. ఎందుకిలా జరిగింది? తర్వాత వచ్చే శాశ్వత దంతాలపై దీని దుష్ర్పభావం ఉంటుందా? - ఎమ్. రాజేశ్వరరావు, కరీంనగర్ పిల్లల్లో పాలపళ్లు చాలా ప్రధానమైనవి. ఆహారం నమలడానికి, మాట్లాడటానికి, ఆకర్షణీయంగా కనిపించడానికి ఈ దంతాలు చాలా దోహదపడతాయి. పాలపళ్లు సరిగా ఉంటే భవిష్యత్తుల్లో శాశ్వత దంతాలు సక్రమంగా రావడానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. పాలపళ్లు ఊడకముందే శాశ్వత దంతాలు వస్తే పళ్లు ఎగుడుదిగుడుగా ఉండేందుకు అవకాశం ఉంది. సాధారణంగా ఆర్నెల్ల వయసులో వచ్చే పాలపళ్లు వచ్చినప్పటి నుంచీ అవి పాడయ్యే అవకాశాలు ఉంటాయి. తీపిపదార్థాలు, చక్కెర ఉన్న పానీయాలు ఎక్కువగా తాగడం, పిల్లలు ఏడ్వకుండా ఉండటానికి పాలపీకను నోట్లో ఉంచేయడం వంటి అలవాట్లతో పళ్లు పాడవుతాయి. పళ్లన్నీ పిప్పిపళ్లుగా మారితే- పాడైన వాటినన్నింటినీ తొలగించాలి, ఇలా పళ్లు పాడయ్యే ప్రమాదాన్ని చాలామట్టుకు నివారించవచ్చు. ఆ స్థానంలో కొత్త పళ్లను అమర్చాల్సి రావచ్చు. మా పాపకు తొమ్మిదేళ్లు. ఆమె పై పళ్ల వరుసలో ఒక చిన్న సందు ఏర్పడింది. అది క్రమంగా పెరుగుతోంది. ఇది ఇలానే కొనసాగితే పెద్దయ్యాక అసహ్యంగా ఉంటుందని మా ఆందోళన. దీనికి సరైన చికిత్సను సూచించగలరు. - వంశీమోహన్, సికింద్రాబాద్ ఎదిగే పిల్లల్లో అంటే 9-10 సంవత్సరాల మధ్య వయసులో పళ్ల వరుసలో సందులు ఏర్పడటమనేది చాలా సాధారణమైనదీ, సహజమైనదీ. ఈ దశను అగ్లీ డక్లింగ్ స్టేజ్ అంటారు. దీనికి ఏ విధమైన చికిత్సా అవసరం లేదు. 11-12 సంవత్సరాలు వచ్చేసరికి సందులు వాటంతట అవే పూడుకుపోతాయి. ఒకవేళ అప్పటికీ పళ్ల మధ్య సందులు అదేవిధంగానే ఉంటే గనుక అప్పుడు మీరు దంతవైద్యులను కలసి వారి సలహా మేరకు చికిత్స తీసుకోవచ్చు. కాబట్టి దీని గురించి మీరేమీ ఆందోళన పడనవసరం లేదు. డాక్టర్ నరేంద్రనాథ్ రెడ్డి,ఆర్థోడాంటిస్ట్ స్మైల్ మేకర్స్ డెంటల్ హాస్పిటల్స్, మూసారంబాగ్, హైదరాబాద్ మీకు ఎదురయే రకరకాల అనారోగ్య సమస్యలకు నిపుణులైన వైద్యుల బృందం ద్వారా తగిన వైద్య సలహాలు పొందండి. ఇందుకు మీరు చేయవలసిందల్లా మీ సమస్యలను వైద్యసలహా కోసం, సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్, రోడ్ నంబర్ 1, బంజారా హిల్స్, హైదరాబాద్ -34కు రాయండి. ఈ మెయిల్: asksakshidoctor@gmail.com -
పోలీస్ కస్టడీకి హర్షవర్దన్ బృందం
ఏలూరు (ఫైర్‌స్టేషన్ సెంటర్) : పెదవేగి మండలం దుగ్గిరాలలోని డెంటల్ కళాశాల కరస్పాండెంట్ ఫాదర్ బాలను బ్లాక్మెయిల్ చేసిన కేసులో రిమాండ్ ఖైదీలుగా ఉన్న టీవీ యూంకర్ యండ్రపాటి హర్షవర్దన్, అతని బృందాన్ని విచారణ నిమిత్తం ఏలూరు పోలీసులు మంగళవారం తమ కస్టడీలోకి తీసుకున్నారు. కోర్టు ఆదేశాల మేరకు వారిని జైలు నుంచి టూటౌన్ పోలీసులు తీసుకెళ్లారు. ఈనెల 7న ఫాదర్ బాలను బెదిరించి, రూ. 5 కోట్లు డిమాండ్ చేసిన కేసులో హర్షవర్దన్, నల్లజర్లకు చెందిన లూక్‌బాబు, హేలాపురి న్యూస్ విలేకరులు బోడా విజయకుమార్, దిరిసిపాముల విజయరత్నం, ఏలూరుకు చెందిన కారు విడిభాగాల వ్యాపారి అధినేత వీరంకి చిరంజీవి అనే వారిని అరెస్ట్ చేసిన విషయం విదితమే. వారిని కోర్టులో హాజరుపర్చగా 15 రోజులు రిమాండ్ విధించారు. ఆ తరువాత తన ఫొటోను ఒక యువతి ఫొటోతో మార్ఫింగ్ చేసి తననుంచి రూ.13 లక్షల వసూలు చేశారంటూ విజయవాడలో రైల్వే ఇంజినీర్‌గా పనిచేస్తున్న నాతా హరినాథ్‌బాబు ఏలూరు టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసు విచారణ ని మిత్తం హర్షవర్దన్, అతని బృంద సభ్యులను తమ కస్టడీకి అప్పగించాలంటూ టూటౌన్ సీఐ వై.సత్యకిషోర్ కోర్టుకు విజ్ఞప్తి చేశారు. కోర్టు సూచన మేరకు సబ్‌జైలు నుంచి పోలీసులు తీసుకెళ్లారు. -
యాంకర్ హర్షవర్ధన్ అరెస్ట్
డెంటల్ కళాశాల నుంచి రూ.5 కోట్లు డిమాండ్ వలపన్ని పట్టుకున్న పోలీసులు ఏలూరు: ‘క్రైమ్ వాచ్’ పేరిట టీవీలో కార్యక్రమాలు చేస్తూ గుర్తింపు పొందిన ఓ యాంకర్ నేరస్తుడిగా మారాడు. హర్షవర్దన్ పశ్చిమగోదావరి జిల్లా పెదవేగి మండలం దుగ్గిరాలలోని సెరుుంట్ జోసెఫ్ డెంటల్ కళాశాల కరస్పాండెంట్ ఫాదర్ పి.బాల నుంచి రూ.5 కోట్లు డిమాండ్ చేసి పోలీసులకు చిక్కాడు. ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. యండ్రపాటి హర్షవర్ధన్ స్వగ్రామం జిల్లాలోని భీమడోలు మండలం తండ్రగుంట. అతను హైదరాబాద్‌లో స్థిరపడినా జిల్లాతో అనుబంధం కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో సెరుుంట్ జోసెఫ్ డెంటల్ కళాశాల కరస్పాండెంట్ ఫాదర్ బాలను బ్లాక్మెయిల్ చేయాలని పథకం వేశాడు. నల్లజర్లకు చెందిన ఫాదర్ లూక్బాబును మధ్యవర్తిగా ఉపయోగించుకున్నాడు. అతని ద్వారా ఫాదర్ బాలకు ఫోన్‌చేసి రూ.5 కోట్లు ఇవ్వాలని, లేదంటే కళాశాలకు వ్యతిరేకంగా వార్తలు ప్రసారం చేస్తామని బెదిరించారు. బాధితుడు ఎస్పీ రఘురామిరెడ్డిని ఆశ్రయించారు. ఎస్పీ ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. ముందుగా ఫాదర్ లూక్బాబును అదుపులోకి తీసుకున్నారు. హర్షవర్ధన్ విజయవాడలో ఉన్నట్టు పసిగట్టి శనివారం రాత్రి అరెస్ట్ చేశారు. -
ఎంబీబీఎస్, డెంటల్కు పాత ఫీజులే
సాక్షి, హైదరాబాద్: ఈ ఏడాది ఎంబీబీఎస్, దంత వైద్య సీట్లకు పాత ఫీజులే వసూలు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు మంగళవారం వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం ఉత్తర్వులు జారీ చేశారు. మైనార్టీ, నాన్‌మైనార్టీ కళాశాలల్లో ఎంబీబీఎస్, బీడీఎస్ ప్రవేశాల్లో కన్వీనర్, బి కేటగిరీ, యాజమాన్య కోటా సీట్లకు పాత ఫీజులే ఉంటాయని స్పష్టం చేశారు. ప్రైవేటు కళాశాలల్లో యాజమాన్యకోటా సీట్ల భర్తీకి ఎంపిక కమిటీని నియమిస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇదిలా ఉండగా ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం యాజమాన్య, ఎన్ఆర్ఐ కోటా సీట్లను భారీగా పెంచుతూ నిర్ణయించింది. దీన్నిబట్టి ఆంధ్రప్రదేశ్‌లోని యాజమాన్య కోటా సీట్లకు భారీ గిరాకీ ఏర్పడనుంది. యాజమాన్య కోటా మేమే భర్తీచేస్తాం తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి సాక్షి, హైదరాబాద్: రాటిఫికేషన్ (ధృవీకరణ) ఇచ్చి తెలంగాణలోని వృత్తి విద్యా కాలేజీల్లో యాజమాన్య కోటా సీట్లను తామే భర్తీ చేస్తామని తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి తె లిపారు. మంగళవారం తన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ ఏపీ ఉన్నత విద్యా మండలి తెలంగాణలో ఇంకా అధికారం చెలాయించేందుకు ప్రయత్నిస్తోందని అన్నారు. ఇటీవల తెలంగాణ జిల్లాల్లోని ఇంజనీరింగ్ కాలేజీల్లోని యాజమాన్య కోటా సీట్ల భర్తీకి ఏపీ ఉన్నత విద్యామండలి నోటిఫికేషన్ ఎలా ఇస్తుందని ప్రశ్నించారు. తెలంగాణ ఉన్నత విద్యామండలి నేతృత్వంలోనే ఈ ప్రక్రియ అంతా కొనసాగుతుందని వెల్లడించారు. -
పీజీ డెంటల్ కౌన్సెలింగ్ గందరగోళం
ఆపాలని కొంతమంది.. కొనసాగించాలని మరికొంతమంది విద్యార్థుల్లో టెన్షన్..టెన్షన్ ఎట్టకేలకు మూడు గంటలు ఆలస్యంగా ప్రారంభ ం విజయవాడ : డెంటల్ పోస్టుగ్రాడ్యుయేషన్ కౌన్సెలింగ్‌ను రద్దు చేసి మరలా నిర్వహించాలని కొందరు.. కౌన్సెలింగ్ నిర్వహించేందుకు చివరి రోజు కావడంతో ఏమి జరుగుతుందోననే ఆందోళనలో మరికొందరు విద్యార్థులతో సిద్ధార్థ వైద్య కళాశాల ప్రాంగణంలో గురువారం గందరగోళ వాతావరణం నెలకొంది. డెంటల్ పీజీ ప్రవేశ పరీక్ష ‘కీ’లో ఏడు ప్రశ్నలకు తప్పుడు సమాధానాలు ఇచ్చారని, డాక్టర్ శ్రీకాంత్‌రెడ్డితో పాటు మరో ఆరుగురు హైకోర్టును ఆశ్రయించడంతో, కౌన్సెలింగ్‌ను నిలిపివేసి, ప్రశ్నాపత్రాలు పరిశీలించాలని డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వ విద్యాలయం అధికారులకు కోర్టు ఆదేశాలిచ్చింది. దీంతో ఉదయం 9 గంటలకు ప్రారంభం కావాల్సిన కౌన్సెలింగ్ నిలిచిపోయింది. అప్పటికే పెద్ద సంఖ్యలో హాజరైన విద్యార్థుల్లో ఆందోళన ప్రారంభమైంది. హైకోర్టు నుంచిస్టే వచ్చిందని ప్రచారం జరగడం, డెంటల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారం గురువారం నాటికి కౌన్సెలింగ్ పూర్తి చేయాల్సి ఉన్నందున్న కౌన్సెలింగ్ జరగకపోతే తమ పరిస్థితి ఏమిటనే ఆందోళనకు గురయ్యారు. అదే సమయంలో కోర్టును ఆశ్రయించిన విద్యార్థులు సైతం ప్రవేశ పరీక్ష కీలో తప్పుగా సమాధానాలు ఇచ్చారని, దీంతో ర్యాంకులు తారుమారయ్యాయంటూ ఆందోళన ప్రారంభించారు. కాగా హైకోర్టు ఆదేశాల మేరకు వ ర్సిటీ అధికారులు హైదరాబాద్, విజయవాడ డెంటల్ కళాశాలల ప్రిన్సిపాళ్లు డాక్టర్ బాలిరెడ్డి, డాక్టర్ టి.మురళీమోహన్‌లతోకూడిన ఎక్స్పర్ట్ కమిటీ ప్రశ్నాపత్రాలు, జవాబు పత్రాలు పరిశీలించి నివేదిక ఇచ్చిన అనంతరం 12 గంటలకు కౌన్సెలింగ్‌ను తిరిగి ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. దీంతో కోర్టును ఆశ్రయించిన విద్యార్థులు కౌన్సెలింగ్ నిర్వహిస్తున్న డాక్టర్ శశాంక్ వద్దకు వెళ్లి కోర్టు ఇచ్చినకాపీలను అందజేశారు. ఈ విషయంలో తామేమి చేయలేమని, వర్సిటీ అధికారులను కలిస్తే వివరణ ఇస్తారని వారు విద్యార్థులకు సూచించారు. దీంతో వారు వెనుదిరగడంతో అనంతరం కౌన్సెలింగ్‌ను కొనసాగించారు. -
కారు బోల్తా: ఇద్దరు మెడికోలు మృతి
కారు ప్రమాదంలో ఇద్దరు వైద్య విద్యార్థులు అక్కడికక్కడే మరణించగా, మరో ఏడుగురు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. ఆ ఘటన తమిళనాడులోని తంజావూర్ సమీపంలో పుదుక్కుడిలో గురువారం చోటు చేసుకుంది. మృతులు మహ్మమద్ నియాజ్ (21), దివ్య భారతి (20)గా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. క్షతగాత్రులను తిరుచినాపల్లిలోని ఆసుపత్రికి తరలించినట్లు వెల్లడించారు. కారులో ప్రయాణిస్తున్నవారంతా చెన్నైలోని ఓ ప్రైవేట్ మెడికల్ కళాశాలలో డెంటల్ కోర్స్ అభ్యసిస్తున్నారని చెప్పారు. వైద్య విద్యార్థులంతా పట్టుకొటాయి నుంచి తిరిగి వస్తుండగా ఆ ప్రమాదం జరిగిందని పోలీసులు పేర్కొన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. -
నెలాఖరులో పీజీ డెంటల్ కౌన్సెలింగ్
విజయవాడ, మెడికల్, డెంటల్ పీజీ, డిప్లమో కోర్సుల్లో 2014-15 సంవత్సరం అడ్మిషన్లకుగాను కౌన్సెలింగ్ నిర్వహించేందుకు స్థానిక ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఈ నెల చివరి వారంలో పీజీ డెంటల్, జూన్ మొదటి వారంలో పీజీ మెడికల్ కౌన్సెలింగ్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. జూన్‌లోనే మెడికల్ పీజీకి సంబంధించి రెండో విడత, అవసరమైతే మూడో విడత కౌన్సెలింగ్ నిర్వహించాలని భావిస్తున్నారు. -
డెంటల్ విద్యార్థి ఆత్మహత్య
అధ్యాపకుల వేధింపులే కారణమంటూ విద్యార్థుల ఆందోళన కడప, న్యూస్‌లైన్: కడప రిమ్స్‌లో డెంటల్ కాలేజీలో బీడీఎస్ మూడో సంవత్సరం చదువుతున్న కృష్ణచైతన్య మంగళవారం ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల కథనం ప్రకారం.. సాయంత్రం నాలుగుగంటలకు చైతన్య రూమ్మేట్ హాస్టలుకు వెళ్లి తలుపుతట్టాడు. ఎంతకూ తెరవకపోవడంతో కిటికీలోంచి చూశాడు. కృష్ణ చైతన్య ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఉండటం చూసి కేకలు వేశాడు. దీంతో తోటి విద్యార్థులు తలుపు పగల గొట్టి చైతన్యను కిందకు దింపారు. వెంటనే రిమ్స్ ఆస్పత్రికి తరలించగా.. అతను అప్పటికే చనిపోయారని వైద్యులు ధ్రువీకరించారు. దీంతో అధ్యాపకుల వేధింపులే కారణమంటూ మృతదేహంతో వందలాది మంది విద్యార్థులు ర్యాలీగా కలెక్టర్ బంగ్లాకు చేరుకుని ఆందోళన చేపట్టారు. అర్థరాత్రి వరకు అక్కడ నుంచి కదల్లేదు. తమకు న్యాయం చేసేవరకు కదిలేది లేదని భీష్మించుకు కూర్చున్నారు. కృష్ణచైతన్యది వైఎస్సార్ జిల్లా నందలూరు. చైతన్య తండ్రి లెక్చరర్‌గా పనిచేస్తున్నారు. -
బ్యాడ్ హ్యాబిట్స్‌కు బై బై...! గుడ్హ్యాబిట్స్కు గుడ్‌మార్నింగ్!!
మనం రోజూ ఎన్నో పనులు మనకు తెలియకుండానే చేస్తుంటాం. ఎదుటివారు తెలియ చెప్పేవరకూ, ఎత్తిచూపేవరకూ మనకు ఓ దురలవాటు ఉందనే స్పృహే లేకుండా వ్యవహరిస్తుంటాం. ఉదాహరణకు రాస్తూ, రాస్తూ మధ్యమధ్య మీ పెన్ క్యాప్నో, పెన్సిల్ చివరనో నోట్లో పెట్టుకుంటారా? చల్లటి నీళ్లు తాగుతూ ఆ ‘చిల్ల’టి ద్రవంలో చాలాసేపు మీ పళ్లు మునిగి ఉండేలా చప్పరిస్తుంటారా? ఇలాంటి అనేక అలవాట్లను చక్కబరచుకుంటే కేవలం పళ్లనే కాదు... భవిష్యత్తులో నోటి నుంచి పంటికీ, పంటి నుంచి ఒంటికి పాకే ఎన్నో వ్యాధులను నివారించుకోవచ్చు. గుడ్హ్యాబిట్స్కు గుడ్‌మార్నింగ్ చెప్పండిలా... దురలవాట్లలో జగమొండి... చిరుతిండి కొందరు అదేపనిగా ఏదో ఒక చిరుతిండిని నములుతూ ఉంటారు. దీనివల్ల పళ్లు ఎప్పుడూ పిండి పదార్థాల్లో, చక్కెరలో ముంచి ఉంచినట్లే అవుతుంటాయి. అలా ముంచి ఉంచిన ఫలితం వల్ల దంతాలు చాలా త్వరగా దెబ్బతింటాయి. అధిగమించడం ఇలా: చిరుతిండ్లు తినే అలవాటును మానుకోండి. ఒకవేళ మానలేకపోతే చిరుతిండ్లకు బదులుగా ఎప్పుడూ క్యారట్ ముక్కను నములుతూ ఉండండి. సిగరెట్లు.. హెల్త్ హాజార్డ్స్ ఎన్నో రెట్లు!! సిగరెట్ వల్ల కేవలం పళ్లకు మాత్రమే కాదు... పూర్తి శరీర ఆరోగ్యానికి వచ్చే ముప్పు చాలా ఎక్కువ. నోటి దుర్వాసన అనే దుష్ఫలితం అదనంగా మరో అవాంఛిత బోనస్. పొగాకు వల్ల చిగుర్లకూ ఎన్నో వ్యాధులు రావచ్చు. ఇక వాటితో పాటు నోటి, పెదవుల, నాలుక క్యాన్సర్ల ప్రమాదాలు మరీ ఎక్కువ. అనేక అంతర్గత అవయవాల రాచకురుపులకూ (క్యాన్సర్) ఈ అలవాటే రాచమార్గం. అధిగమించడం ఇలా: ఈ దురలవాటును తక్షణం మానేయాలి. తమంతట తాము మానలేకపోతే డాక్టర్‌ను సంప్రదించి మానేందుకు వీలుగా చూయింగ్ గమ్స్ వాడాలి. చిప్స్ కరకర... పళ్లకు కటకట... కరకరలాడే చిప్స్ రుచికి సరేగానీ... పళ్లకు మాత్రం ప్రమాదకారి. చిప్స్‌లో పిండిపదార్థాలు (స్టార్చ్) ఎక్కువ. పైగా పళ్ల మధ్య చిక్కుకునే చిప్స్ అవశేషాలు దీర్ఘకాలంలో దంతక్షయానికి కారకాలు. అధిగమించడం ఇలా: చిప్స్‌ను వీలైనంత తక్కువగా తినాలి. ఒకవేళ రుచి కోసం తిన్నా... వీలైనంత త్వరగా నోరు కడుక్కోవడం, వీలైతే ఫ్లాసింగ్ చేసుకోవడం అవసరం. పళ్లు ఓపెనర్స్ కావన్న సంగతి... ఐ-ఓపెనర్ కావాలి చాలామంది సీసా మూత తీయడానికి పళ్లను వాడుతుంటారు. కుట్టుపని చేసేవారు చాలా మంది సూదిని పళ్లతో పట్టుకుంటుంటారు. కొందరు ప్రతిసారీ దారాన్ని పళ్లతోనే తెంపుతుంటారు. కొందరు షాంపూ షాషేలను చింపడానికి పళ్లను ఉపయోగిస్తుంటారు. మీ పళ్లు ఓపెనర్స్ కావు. కత్తెరకు ప్రత్యామ్నాయం కూడా కాదు. ఇలా చేసే చాలా సమయాల్లో పళ్ల ఎనామిల్ దెబ్బతింటుంది. పళ్ల నుంచి చిన్న ముక్క ఊడిపోవచ్చు కూడా. అధిగమించడం ఇలా : సీసా మూత తీయాలంటే ఓపెనర్ వాడండి. షాషే చింపాలంటే కత్తెర వాడండి. వాటికి ప్రత్యామ్నాయంగా పళ్లను ఉపయోగించకండి. కాఫీ, టీ... తాగితే తప్పేం‘టీ’? కొందరు కాఫీలు, టీలు అదేపనిగా తాగేస్తుంటారు. కాస్తలో కాస్త టీ బెటర్గానీ... కాఫీ అయితే అందులోని అసిడిక్ గుణం వల్ల తెల్లటి పలువరసను పచ్చబారేలా చేస్తుంది. మితిమీరి తాగుతుంటే దీర్ఘకాలంలో పళ్లను మెరుపుకోల్పోయేలా చేస్తాయా పానీయాలు. కాఫీ, టీ లో ఉన్న వేడికి చిగుర్లు, నాలుకపైన ఉంటే టేస్ట్ బడ్స్ దెబ్బతినే అవకాశాలు చాలా ఎక్కువ. కాఫీ, టీలలో ఉండే చక్కెర పంటికి అంటుకుపోవడం వల్ల పిప్పిపళ్లు వచ్చే అవకాశాలు కూడా ఎక్కువ. అధిగమించడం ఇలా : కాఫీ, టీలు పరిమితంగా తాగండి. ఒకవేళ ఇప్పటికే పళ్లు పచ్చబారి ఉంటే బ్లీచింగ్‌తో వాటిని బాగుచేసుకోండి. పెన్సిల్ కొరుక్కుంటున్నారా? రాస్తూ రాస్తూ పెన్సిన్ను, పెన్ను పళ్ల మధ్య కొరుకుతున్నారా? అలా చేయకండి. పళ్లను దెబ్బతీసే ఈ అలవాటు చాలా తప్పు. పైగా పెన్సిల్ మధ్యన ఉండే లెడ్ చాలా ప్రమాదకారి. అధిగమించండిలా : మీరు రాస్తున్నప్పుడు, చదువుతున్నప్పుడు పళ్లమధ్యకు పెన్నూ, పెన్సిల్ వెళ్లకుండా బబుల్గమ్ నమలండి. క్రమంగా పై అలవాటు తప్పుతుంది. నోట్లో లాలాజలం పెరగడంతో కొన్ని అనారోగ్యాలూ తప్పుతాయి. దగ్గు తగ్గించే మందు... దంతక్షయాన్ని పెంచే మందు దగ్గు మందు ఓ ఔషధమే కదా అని అనుకుంటారు చాలామంది. అందుకే అది తాగాక నోరు కడుక్కోరు. కానీ దగ్గు మందులో ఉండే చక్కెర పాళ్లు దంతాల ఆరోగ్యాన్ని పాడు చేస్తాయి. అధిగమించడం ఇలా: దగ్గు మందు గొంతులో పోసుకోగానే కలిగే ఉపశమనాన్ని అనుభవిస్తుండగానే... నోరు శుభ్రంగా కడుక్కోవాలి. దగ్గుమందు తాగిన ప్రతిసారీ నోరు కడుక్కోవాలి. తప్పుడు బ్రష్షింగ్‌తో ముప్పు తప్పదు... తాము అనుసరిస్తున్న విధానం తప్పని తెలిసేదాకా ప్రతివారూ తాము చాలా బాగా బ్రష్ చేసుకుంటున్నామనే అనుకుంటారు. కానీ బ్రష్షింగ్లో పొరబాటు చేసేవారు చాలా ఎక్కువ. అధిగమించడం ఇలా: మృదువైన బ్రిజిల్స్ ఉన్న టూత్‌బ్రష్‌ను ఎంచుకోవాలి. అధిక ఒత్తిడితో బ్రష్షింగ్ చేయకూడదు. బ్రష్షింగ్ చేసే సమయంలో పంటికి అడ్డంగా కాకుండా నిలువుగా బ్రష్ చేసేలా టూత్‌బ్రష్‌ను కదిలించాలి. సున్నాలు చుడుతున్నట్లుగా (సర్క్యులర్గా) కదిలిస్తూ బ్రష్ చేసుకోవడం సరైన పద్ధతి. ‘రెడ్’వైన్... పళ్లకు ఎర్రటి డేంజర్ గుర్తు! గుండెపోటును నిరోధిస్తుందనీ, గుండెకు ఆరోగ్యం సమకూరుతుందంటూ కొందరు రెడ్‌వైన్ అదేపనిగా తాగేస్తుంటారు. అయితే రెడ్వైన్లో క్రోమోజెన్ ట్యానిన్స్ అనే రంగునిచ్చే పదార్థాలు (పిగ్నెంట్స్) పంటి ఎనామిల్‌ను దెబ్బతీసి పళ్లు మిలమిలను కోల్పోయేలా చేస్తాయి. అధిగమించడం ఇలా: రెడ్‌వైన్ అయినా సరే... అది కూడా మద్యమే కాబట్టి మానుకుంటేనే మంచిది. పండ్లా... పళ్లా... ఏవి ముఖ్యం? ఫ్రూట్ జ్యూస్‌లతో ఆరోగ్యం సమకూరుతుంటుందని చాలామంది పళ్లరసాలు ఎక్కువగా తాగేస్తుంటారు. అందులో ఆరోగ్యంతో పాటు కొన్ని అనారోగ్య కారకాలూ ఉంటాయి. ఉదాహరణకు అందులోని చక్కెర, యాసిడ్ మోతాదులు. వీటివల్ల పళ్లు దెబ్బతింటాయి. ఉదాహరణకు మామూలుగా నారింజ కొరికి తిన్నదానికంటే చక్కెర కలిపిన ఆరెంజ్ పండ్లరసంతో పళ్లు పాడయ్యే అవకాశం ఎక్కువ. అధిగమించడం ఇలా: పండ్లను జ్యూస్‌గా తాగడం కంటే కొరికి తినడం మంచిది. ఒకవేళ జ్యూస్‌గా తాగినా చక్కెర కలుపుకోవద్దు. జ్యూస్ తాగిన వెంటనే నోరు కడుక్కోండి. కొరుకుతూ ఉంటే ... అరుగుతూ ఉండటం ఖాయం కొందరికి మాటిమాటికీ పళ్లు కొరికే అలవాటు ఉంటుంది. మరికొందరు ‘బ్రక్సిజం’ అనే జబ్బు వల్ల పదే పదే పళ్లు కొరుకుతూ ఉంటారు. ఇంకొందరు రోజువారీ ఒత్తిడుల వల్ల నిద్రలో తమకు తెలియకుండానే పళ్లు కొరుక్కుంటూ ఉంటారు. కారణం ఏదైనా... అదేపనిగా పళ్లు కొరుకుతూ ఉండేవారిలో పళ్లు అరుగుతుండటం తప్పనిసరి. అధిగమించడం ఇలా: ఈ అలవాటు ఉన్నవారు కారణాన్ని తెలుసుకుని, అలవాటును మానుకోవాలి. బ్రక్సిజం ఉంటే చికిత్స తీసుకోవడం, ఒత్తిడి ఉన్నవారు దాన్ని తగ్గించుకునే రిలాక్సేషన్ టెక్నిక్స్, ధాన్యం అలవరచుకోవడం అవసరం. పళ్లకు చుట్టుకుపోతాయి...ఆరోగ్యాన్ని పట్టుకుపోతాయి కొన్ని చాక్లెట్లు రుచిగా ఉంటాయి. కానీ పళ్లకు చుట్టుకుపోతూ ఉంటాయి. అప్పుడవి చక్కెరను చాలాసేపు పంటిపై అంటిపెట్టుకునే ఉండేలా చేస్తాయి. దాంతో ఎనామిల్‌పై రంధ్రాలు (క్యావిటీలు) పడే అవకాశం ఎక్కువ. దాంతో పిప్పిపళ్లు వచ్చే అవకాశాలు ఎక్కువ. ఫలితంగా దంతాలు చాలా త్వరగా దెబ్బతింటాయి. అధిగమించడం ఇలా: పంటిని చుట్టుకుపోయే చాక్లెట్లు, క్యాండీలు కాకుండా జిగురు తక్కువగా ఉండే వాటినే తినండి. ఒకవేళ వాటినే తినాల్సి వస్తే వెంటనే వేలితో జిగురు ఊడిపోయేలా నోరు శుభ్రం చేసుకోండి. సోడా... బీడా... రెండూ బ్యాడే!! కొందరు కడుపులో కాస్త ఉపశమనం కోసం సోడా తాగేస్తుంటారు. మరికొందరు పాన్ అలవాటుతో ఆకులు నమిలేస్తూ ఉంటారు. సోడాలో పదకొండు టీస్పూన్ల చక్కెర ఉంటుంది. అందులోని ఫాస్ఫారిక్ యాసిడ్ ఎనామిల్‌ను దెబ్బతీస్తుంది. ఇక పాన్‌బీడా తినేవాళ్ల పళ్ల గార వాళ్లకా అలవాటు ఉందని పట్టించేస్తుంది. అధిగమించడం ఇలా: సోడా, బీడా... అలవాట్లను వెంటనే మానేయాల్సిందే. ‘ఐస్’సీ... ఇది చెడ్డ అలవాటా!? ఇటీవల బర్గరో, పఫ్ఫో తిన్న తర్వాత ఓ కూల్‌డ్రింక్ ఆర్డర్ ఇవ్వడం పరిపాటి. ఆ డ్రింకును కూల్‌గా ఉంచడం కోసం అందులో ఐస్‌గడ్డలు వేసి మరీ ఇస్తుంటారు రెస్టరెంట్లవాళ్లు. ఆ గడ్డల్ని నములుతూ ఆనందిస్తారు కొందరు. మరి ఇంకొందరైతే ఐస్‌ఫ్రూట్‌ను చప్పరించకుండానే నమిలి తినేస్తుంటారు. కొందరు ఆటగాళ్లు పళ్లు దెబ్బతినకుండా పళ్ల మధ్య ఐస్ గడ్డలను పెట్టుకుని ఆటలాడుతుంటారు. ఆ టైమ్‌లో వాళ్లూ ఐస్ కొరుకుతూ ఉంటారు. అధిగమించడం ఇలా: అందుకే... ఐస్‌ఫ్రూట్ కొన్నా, ఐస్‌క్యాండీ తిన్నా ఐస్‌ను నమలకండి. ఐస్ పళ్లకు తగలకుండా జాగ్రత్త తీసుకోండి. ఆటగాళ్లు పళ్ల రక్షణ కోసం మౌత్గార్డ్నే వాడాలి. ఐస్‌ని కాదు. స్పోర్ట్స్డ్రింక్స్... ఒంటికి హాయి!.. మరి పంటికి? స్పోర్ట్స్ డ్రింక్ తాగాక చాలా హాయిగా ఉంటుంది. ఒంటికి హాయి సరే... మరి పంటి మాటేమిటి? వాటి ఆరోగ్యాన్నీ చూడాలి కదా. స్పోర్ట్స్ డ్రింక్స్‌లో, జ్యూసుల్లో ఉండే చక్కెర పళ్లకు తగులుతున్న కొద్దీ దంతక్షయం పెరుగుతుంది. అధిగమించడం ఇలా: చక్కెర ఎక్కువగా ఉండే పానీయాలు తక్కువ తాగండి. తాగాక నోరు కడుక్కోండి. నాలుకకు గాటు...నోటికి చేటు కొందరిప్పుడు చెవులకు లాగే నాలుకకూ స్టడ్ అలంకరించుకుంటున్నారు. మరికొందరు పెదవులకూ రింగ్స్ పెట్టుకుంటున్నారు. ఈ విపరీత ఫ్యాషన్ నోటి ఆరోగ్యానికి చేటు. పలువరసకూ తేలిగ్గా ఇన్ఫెక్షన్ తెచ్చిపెట్టగలదు. అధిగమించడం ఇలా: ఈ ఫ్యాషన్‌ను అనుసరించకూడదు. ఈ ఫ్యాషన్ ఒక్కోసారి ప్రాణాలకూ ముప్పు తెచ్చిపెట్టగలదని గ్రహించండి. గోళ్లు కొరికితే...పళ్లు దెబ్బతింటాయి... టెన్షన్ వల్ల కొందరు అదేపనిగా గోళ్లు కొరుక్కుంటుంటారు. ఈ అలవాటుతో పళ్లు దెబ్బతింటాయి. గోళ్ల ద్వారా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ నోటి ద్వారా కడుపులోకి వెళ్లి ఆరోగ్యం దెబ్బతినవచ్చు. అధిగమించడం ఇలా: నిజంగానే గోళ్లు తొలగించుకోవాలనుకుంటే నెయిల్ కట్టర్‌నే వాడాలి. టెన్షన్ వల్ల ఈ అలవాటు వస్తే... రిలాక్సేషన్ టెక్నిక్స్‌తో ఒత్తిడి తగ్గించుకోవాలి. వేలు చీకడం మాన్పండి... ఎత్తుపళ్లను నివారించండి... చిన్న పిల్లల్లో వేలు చీకడం (థంబ్ సకింగ్) అనే అలవాటు ఎక్కువ. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా దాన్ని మాన్పించడం మంచిది. ఎందుకంటే అది ముందు పళ్లను ఎత్తుగా చేసి, పిల్లల అందాన్ని తగ్గిస్తుంది. భవిష్యత్తులో ముందు పళ్ల మధ్య సందులు ఏర్పడవచ్చు. అధిగమించడం ఇలా... పిల్లల్లో వేలు చీకే అలవాటును వెంటనే మాన్పించాలి. ఒకవేళ పిల్లలు తమంతట తామే మానకపోతే దంతవైద్యులను సంప్రదించి, అప్లయన్స్ల సహాయంతో మాన్పవచ్చు. బాటిల్‌తో బ్యాటిల్ చేసి... రాత్రి దూరం పెట్టండి కొందరు పిల్లలు రాత్రంతా పాలసీసా పళ్ల మధ్య పెట్టుకుని నిద్రపోతుంటారు. పిల్లలు అల్లరి చేయకుండా ఉండటానికి చాలామంది తల్లులే ఎప్పుడూ బాటిల్‌ను పిల్లల నోటిలో ఉంచేస్తుంటారు. ఈ దురలవాటు వల్ల పిల్లలకు ‘మిల్క్బాటిల్ కేరిస్’ అనే తరహా పిప్పిపళ్లు వచ్చి పళ్లన్నీ దెబ్బతింటాయి. పాలలో ఉండే చక్కెరవల్ల కూడా పళ్లు పుచ్చిపోతాయి. అధిగమించడం ఇలా: రాత్రివేళల్లో పిల్లల నోటికి పాలసీసా ఇవ్వవద్దు. పిల్లలకు పాలు పట్టించడానికి సీసా వాడకూడదు. గ్లాసు / స్పూన్ వాడాలి. పాలు తాగించిన వెంటనే బ్రష్ చేయించాలి. బ్రషింగ్ వీలుకాకపోతే కనీసం ఒక గ్లాసు నీళ్లయినా తాగించాలి. పళ్లు కుట్టుకోకండి... గ్యాప్స్ పెంచుకోకండి ఏదైనా తినగానే పళ్లల్లో చిక్కుకున్న ఆహారాన్ని తీయడానికి టూత్‌పిక్స్‌తో పళ్లు కుట్టుకుంటారు. ఈ అలవాటు వల్ల పళ్ల మధ్య సందులు మరింత పెరుగుతాయి. దాంతో మరింత ఆహారం అక్కడ చిక్కుబడటం, బ్యాక్టీరియా పెరగడం పళ్లు మరింత వదులు కావడం జరుగుతాయి. అధిగమించడం ఇలా: పళ్లు కుట్టుకునే అలవాటు మానేయాలి. వీలైతే ఫ్లాసింగ్ చేసుకోవాలి. - నిర్వహణ: యాసీన్ - మంజులారెడ్డి డాక్టర్ ప్రత్యూష దంత వైద్య నిపుణులు, ప్రొఫెసర్, ఓరల్ మెడిసిన్ అండ్ రేడియాలజీ, కిమ్స్ హాస్పిటల్, సికింద్రాబాద్. -
నొప్పి లేని దంత వైద్యం లేజర్ ద్వారా సాధ్యం
దంత అనారోగ్యమే కాదు... వాటి చికిత్స కూడా బాధాకరం అనే అభిప్రాయం మనలోని చాలామందిలో ఉంటుంది. దంతాలకు సంబంధించిన దాదాపు అన్ని సమస్యలకూ, లేజర్ చక్కటి పరిష్కారం. నొప్పిలేకుండా చాలా త్వరగా ఉపశమనం కలిగించే ఆధునాతన చికిత్స లేజర్. లేజర్: లేజర్ అనే కాంతి తక్కువ సమయంలో శరీరంలోని ఏ భాగానికైనా ఎటువంచి నొప్పిని కలిగించకుండా, ఇన్ఫెక్షన్ను తగ్గించి, చాలా తొందరగా ఉపశమనం కలిగిస్తుంది. దంత చికిత్సలో లేజర్ వల్ల ఉపయోగాలు: నొప్పి కలగకుండా చికిత్స ఎటువంటి మత్తు అవసరం ఉండదు చికిత్స సమయంలో ఎటువంటి రక్తస్రావమూ ఉండదు. వైద్యులకు, రోగికి కూడా అనుకూలం ఇన్ఫెక్షన్ వ్యాపించదు తక్కువ సమయంలో నొప్పిని, వ్యాధిని ఉపసంహరిస్తుంది చక్కెర వ్యాధి, రక్తపోటు, గుండె జబ్బులతో పాటు ఇతర వ్యాధి గ్రస్తులకు చాలా అనుకూలం లేజర్ చికిత్స తర్వాత, ఉపయోగించే మందులు కూడా తక్కువ. దంత చికిత్సలో లేజర్ : చిగుళ్ళ చికిత్స : చిగుళ్ళ వాపులు, చిగుళ్ళ నుండి రక్తం కారడం వంటి వ్యాధుల్లో (జింజెవైటిస్, పెరియోడాంటైటిస్) లేజర్‌తో చికిత్స చేయడం చాలా సులువు. డయాబెటిక్ వ్యాధి గ్రస్తులలో ఇది చాలా ఉపయోగం రూట్ కెనాల్ చికిత్స: లేజర్ కాంతిని కెనాల్లో ప్రవేశపెట్టడం ద్వారా, బ్యాక్టీరియా పూర్తిగా నాశనం అయి, sterils ఎన్విరాన్మెంట్ ఏర్పడి మరలా రీఇన్ఫెక్షన్ అవ్వకుండా ఉంటుంది. పిప్పిపళ్ళ చికిత్స: పంటిని డ్రిల్ చేసేటప్పుడు, పేషెంట్ అనవసరమైన ఆందోళనకు గురికాకుండా, సెన్సిటివిటీ లేకుండా ఉండేందుకు లేజర్ ఎంతగానో ఉపయోగపడుతుంది. నోటిలోని అల్సర్లను, గడ్డలను తగ్గించుటకు నోటి కేన్సర్‌ను గుర్తించడానికి దంతాలు తెల్లగా కనిపించడానికి ఇతర సర్జికల్ పద్ధతులలో కూడా లేజర్ ఉపయోగం ఉంటుంది. ఇప్పుడు లేజర్ టెక్నాలజీ అందరికీ అందుబాటులో ఉంది. మీ దంత సంరక్షణ మీ చేతుల్లోనే ఉంది. దంతాల మెరుగైన చికిత్స కోసం, లేజర్ ప్రక్రియ ఒక మెరుగైన పరిష్కారం. -
వేర్వేరు ప్రమాదాల్లో నలుగురి మృతి
శ్రీకాకుళం క్రైం, న్యూస్‌లైన్: జిల్లాలో వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన ప్రమాదాల్లో నలుగురు మృతి చెందారు. శ్రీకాకుళం రూరల్ మండలంలోని డెంటల్ కళాశాల సమీపంలో జాతీయ రహదారిపై మంగళవారం రాత్రి గుర్తు తెలియని వాహనం ఢీకొని ప్రసాద్ అనే వ్యక్తి మృతి చెందాడని పోలీసులు తెలిపారు. శ్రీకాకుళం పట్టణం ఏపీహెచ్‌బీ కాలనీకి చెందిన ప్రసాద్, వజ్రాపు వెంకట శ్రీధర్ ద్విచక్రవాహనంపై డెంటల్ కాలేజీ నుంచి వస్తున్నారు. ద్విచక్రవాహనాన్ని గుర్తు తెలియని వాహనం డీకొనడంతో ప్రసాద్ అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్ర గాయాల పాలైన శ్రీధర్ పూర్తి వివరాలు వెల్లడించే పరిస్థితిలో లేకపోవడంతో మృతుడి సమాచారం తెలియలేదు. ఔట్‌పోస్టు పోలీసులు వివరాలను సేకరించారు. ఆటో ఢీకొని ఒకరు... వజ్రపుకొత్తూరు : ఆటో బోల్తాపడడంతో మండలం తర్లాగడివూరు గ్రామానికి చెందిన కోనేరు శ్యామ్ (25) మృతి చెందాడు. వజ్రపుకొత్తూరు ఎస్ఐ ఎస్.తాతారావు, శ్యామ్ కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. విజయదశమి సందర్భంగా సోమవారం శ్యామ్ మిత్రులతో కలిసి ఆటోలకు పూజలు చేశారు. తర్వాత చినవంకులూరు గ్రామానికి వెళ్లి వస్తుండగా వారు ప్రయాణిస్తున్న ఆటో వంకులూరు రోడ్డుపక్కన బోల్తాపడింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన శ్యామ్‌ను 108 అంబులెన్స్‌లో పలాస ప్రభుత్వాస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తాతారావు తెలిపారు. సైక్లిస్టును తప్పించబోయి ఒకరు... పూండి : వజ్రపుకొత్తూరు మండలం పూండిలో సోమవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో గోవిందపురం గ్రామానికి చెందిన పుచ్చ వెంకటరావు తీవ్ర గాయాలపాలై మృతి చెందాడు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వెంకటరావు పూండి బస్టాండ్ రోడ్డులో ఫాస్ట్‌ఫుడ్ దుకాణం నిర్వహిస్తున్నాడు. సోమవారం సాయంత్రం స్థానిక పెట్రోల్ బంక్‌లో తన బైక్‌కు పెట్రోల్ పోసుకుని రోడ్డు దాటుతుండగా అడ్డంగా వచ్చిన సైక్లిస్టును తప్పించబోగా ఈ ప్రమాదం జరిగింది. తీవ్రంగా గాయపడిన అతనిని విశాఖపట్నం తరళిలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు చెప్పారు. మృతునికి భార్య దాలమ్మ , ఇద్దరు కుమారులు ఉన్నారు. మృతుడి భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు వజ్రపుకొత్తూరు హెడ్ కానిస్టేబుల్ ప్రకాశరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృత దేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం పలాస ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ద్విచక్రవాహనం ఢీకొనడంతో... సోంపేట : రాణిగాం గ్రామం వద్ద జాతీయ రహదారిపై మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... రాణిగాం గ్రామానికి చెందిన ఎన్.గున్నయ్య (40) సైకిల్‌పై వెళుతుండగా పలాస మండలం బంటుకొత్తూరు గ్రామానికి చెందిన వ్యక్తులు ద్విచక్రవాహనం ఢీకొన్నారు. గున్నయ్యను హరిపురం ఆస్పత్రికి తీసుకెళుతుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. మృతుడికి భార్య లక్ష్మి ఉన్నారు. రోడ్డు ప్రమాదంలో ఒకరికి గాయాలు పలాస రూరల్ : పలాస-కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న నెమలినారాయణపురం జాతీయ రహదారిపై మంగళవారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో అదే గ్రామానికి చెందిన రామకృష్ణ తీవ్ర గాయాలపాలయ్యాడు. ప్రమాదానికి కారణం తెలియాల్సి ఉంది. ఆటో డ్రైవింగ్ నేర్చుకుంటుండగా ప్రమాదం జరిగిందని కొందరు, రెండు వాహనాలు ఢీకొనడంతో ప్రమాదం జరిగిందని మరికొందరు చెబుతున్నారు. బాధితుడిని కాశీబుగ్గ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ద్విచక్రవాహనం ఢీకొనడంతో ఇద్దరికి.. నరసన్నపేట రూరల్ : జాతీయ రహదారిపై శ్రీరాంపురం వద్ద మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. రోడ్డు దాటుతున్న మహిళ ముద్దపు సూరోడును కొటబొమ్మాళి నుంచి శ్రీకాకుళం వెళ్తున్న మోటార్ సైకిల్ ఢీకొంది. ఈ ఘటనలో మహిళతో పాటు ద్విచక్రవాహనం నడుపుతున్న సకలాబత్తుల శ్రీధర్ గాయపడ్డారు. క్షతగాత్రులను ఎన్‌హెచ్ అంబులెన్స్‌లో నరసన్నపేట ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.