జోసెఫ్ దంతవైద్య కళాశాల స్నాతకోత్సవం
Published Tue, Oct 25 2016 2:20 AM | Last Updated on Mon, Sep 4 2017 6:11 PM
దుగ్గిరాల(పెదవేగి రూరల్) : సెయింట్ జోసఫ్ దంత వైద్య కళాశాల పదో స్నాతకోత్సవాన్ని సోమవారం నిర్వహించారు. దుగ్గిరాలలోని దంత కళాశాలలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో డెంటల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(న్యూ ఢిల్లీ) మెంబర్ ప్రొఫెసర్ డాక్టర్ పి.రేవతి విద్యార్థులకు పట్టాలు ప్రదానం చేశారు. కళాశాల చైర్మన్ రెవరెండ్ బిషప్ పొలిమేర జయరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో 2011–16 విద్యా సంవత్సరం అండర్ గ్రాడ్యుయేషన్ విద్యార్థులకు, 2013–16 విద్యా సంవత్సరం పోస్ట్ గ్రాడ్యుయేషన్ విద్యార్థులకు పట్టాలు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ముఖ్యఅతిథిగా విచ్చేసిన రెవరెండ్ ఫాదర్ తోట గాబ్రియోల్, వ్యవస్థాపక కరస్పాండెంట్ సెక్రటరీ ఫాదర్ పి.బాల ప్రత్యేక ఆహ్వానితులుగా హాజరయ్యారు. ప్రిన్సిపాల్ ఎన్ స్లీవరాజ్, అన్ని విభాగాల హెచ్‌ఒడిలు, అడ్మినిస్టేటర్ ఫాదర్ కె.బల్‌తజర్, నర్సింగ్ కళాఇశాల కరస్పాండెంట్ ఫాదర్ కె.అమృతరాÐŒ , సిబ్బంది పాల్గొన్నారు.
Advertisement
Advertisement