
హైదరాబాద్, సాక్షి: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఒక రోజు పర్యటన నిమిత్తం నగరానికి వచ్చారు. శనివారం ఉదయం బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న రాష్ట్రపతికి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్, అధికారులు తదితరులు ఘన స్వాగతం పలికారు.

అక్కడి నుంచి.. మేడ్చల్ జిల్లాలోని శామీర్‌పేట్‌లో నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయాలనికి వెళ్లారు. అక్కడ యూనివర్సిటీ 21వ స్నాతకోత్సవానికి రాష్ట్రపతి ముర్ము ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ కార్యక్రమం తర్వాత బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి బయల్దేరారు. అక్కడ భారతీయ కళా మహోత్సవాన్ని ప్రారంభిస్తారు.