nalsar university of law
-
నల్సార్ స్నాతకోత్సవానికి హాజరైన రాష్ట్రపతి ముర్ము
హైదరాబాద్, సాక్షి: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఒక రోజు పర్యటన నిమిత్తం నగరానికి వచ్చారు. శనివారం ఉదయం బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న రాష్ట్రపతికి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్, అధికారులు తదితరులు ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి.. మేడ్చల్ జిల్లాలోని శామీర్‌పేట్‌లో నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయాలనికి వెళ్లారు. అక్కడ యూనివర్సిటీ 21వ స్నాతకోత్సవానికి రాష్ట్రపతి ముర్ము ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ కార్యక్రమం తర్వాత బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి బయల్దేరారు. అక్కడ భారతీయ కళా మహోత్సవాన్ని ప్రారంభిస్తారు. -
వివక్షతోనే ఆత్మహత్యలు: సుప్రీం సీజే డీవై చంద్రచూడ్
‘‘ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల మార్కులను, ఆంగ్ల ప్రావీణ్యాన్ని అపహాస్యం చేయడం వంటి ఘటనలు ఉన్నత విద్యా సంస్థల్లో కొనసాగుతున్నాయి. ఆంగ్లం రాని వారిని అంటరానివారిగా వివక్షతో చూడటం, అసమర్థులుగా ముద్ర వేయడం వంటి విధానాలకు స్వస్తి పలకాలి. ఇలాంటివాటి వల్ల అణగారిన వర్గాల విద్యార్థుల ఆత్మహత్యల ఘటనలు పెరుగుతున్నాయి. ఈ బలవన్మరణాల్లో గ్రామీణ ప్రాంతాల వారు, ముఖ్యంగా దళిత, ఆదివాసీ వర్గాల విద్యార్థులే ఎక్కువని పరిశీలనల్లో తేలింది. గ్రామీణ ప్రాంతాల నుంచి వచి్చన వారిలో ఒత్తిడిని దూరం చేసి, సానుభూతితో వ్యవహరిస్తే.. ఇలాంటి ఘటనలు జరగకుండా వ్యవహరించవచ్చు. ఎదుటివారిని అర్థం చేసుకునే విధానంతో కూడిన విద్యను ఉన్నత విద్యాసంస్థల్లో అందించడం అవసరం’’ అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ ధనుంజయ వై.చంద్రచూడ్ వ్యాఖ్యానించారు. సుప్రీం చీఫ్ జస్టిస్‌గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత రాష్ట్రానికి తొలిసారి వచ్చిన జస్టిస్ చంద్రచూడ్ శనివారం నల్సార్ యూనివర్సిటీ 19వ స్నాతకోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. హైకోర్టు చీఫ్ జస్టిస్, నల్సార్ వర్సిటీ చాన్సలర్ జస్టిస్ ఉజ్జల్ భూయాన్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో.. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ వి.రామసుబ్రమణ్యన్, జస్టిస్ పీఎస్ నరసింహతోపాటు పలువురు హైకోర్టు న్యాయమూర్తులు పాల్గొన్నారు. ముందుగా వర్సిటీ సంప్రదాయం ప్రకారం స్నాతకోత్సవ ఊరేగింపుతో రిజిస్టార్ కె.విద్యుల్లతారెడ్డి సీజేఐకి స్వాగతం పలికారు. వర్సిటీ వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ శ్రీకృష్ణదేవరావు స్వాగతోపన్యాసం చేశారు. అనంతరం సీజేసీ ప్రసంగించారు. వివరాలు ఆయన మాటల్లోనే.. ‘‘తమకు చదువు చెప్పినవారినే కాదు.. చదువుకున్న సంస్థ అభివృద్ధికి పాటుపడిన సిబ్బంది, కార్మికుల శ్రమను కూడా విద్యార్థులు గుర్తించాలి. న్యాయశాస్త్ర విద్యార్థులు.. లా సబ్జెక్టులతోపాటు సాహిత్యం తదితర అంశాలపైనా అవగాహన పెంపొందించుకోవాలి. నేను చదువుకున్న రోజులతో పోలిస్తే ప్రస్తుత తరం విద్యార్థులకు సమాచారం, విజ్ఞానం పొందేందుకు అవకాశాలు చాలా విస్తృతంగా ఉన్నాయి. విద్యార్థులకు ఉన్నత విద్య అభ్యసించడమే కాదు. సమాజంపై బాధ్యత కూడా ఉంటుంది. సానుభూతి దయాగుణం అవసరం ఉన్నత–నిమ్న, ధనిక–పేద అనే తేడా లేకుండా అందరినీ న్యాయస్థానాలు సమానంగా చూస్తాయి. ఇదే విధానాన్ని అన్నింటా పాటించాలి. చట్టం అమలు, న్యాయం అందించడంలో సానుభూతి, దయాగుణం, తాతి్వకత అనేది చాలా ముఖ్యమైన అంశం. ఇది అన్యాయమైన స్థితి నుంచి న్యాయమైన సమాజ నిర్మాణానికి బాటలు వేస్తుంది. పెద్ద సంఖ్యలో మోటార్ ప్రమాద కేసులను పరిష్కరించేటప్పుడు సాంకేతిక అంశాలతో మానవీయ కోణాన్ని సమతూకం వేస్తూ సుప్రీంకోర్టు ఎన్నో తీర్పులు ఇచ్చింది. ఒత్తిడితో కూడిన విద్య మంచిది కాదు మనం విద్యను కూడా సానుభూతి కోణం నుంచే చూడాలి. చదువులో, వృత్తిలో రాణిస్తేనే మన జీవితాలు మెరుగ్గా ఉంటాయని విద్యా సంస్థల్లో మెదళ్లకు ఎక్కిస్తున్నారు. అలాగే విద్యార్థుల మధ్య తీవ్ర పోటీతత్వం, మార్కులు, ర్యాంకుల ఆధారిత విద్య వారిని మరింత ఒత్తిడికి గురిచేస్తుంది. పట్టణాలు, గ్రామాల్లోని విద్యార్థుల సామర్థ్యం ఒకేలా ఉండదన్న విషయం గ్రహించాలి. విద్య నేర్పడంలోనూ సానుభూతి, కరుణ, స్నేహభావం ఉన్నప్పుడే అది సంపూర్ణమవుతుంది. నైతికతతో కూడిన విద్యా విధానం అవసరం. ఆ మేరకు ప్రమాణాలు మారాలి. ఒత్తిడికి సంబంధించిన విద్యా విధానం మంచిది కాదు. 75 ఏళ్ల స్వాతంత్య్రంలో ఎన్నో ప్రముఖ విద్యాసంస్థలను ఏర్పాటు చేసుకున్నాం. కానీ ఎదుటి వారికి సాయం చేయాలనే దృక్పథంతో కూడిన విద్యా విధానం లేకపోవడం గమనించాల్సిన విషయం. న్యాయవిద్యలోనూ క్లినికల్ విధానం అవసరం. విద్యా సంస్థలు, బార్ కౌన్సిల్ దీని కోసం ప్రయత్నించాలి. ఆ ఆత్మహత్యలు కలచివేశాయి ముంబై ఐఐటీలో దళిత విద్యారి్థ, ఒడిశా న్యాయ విశ్వవిద్యాలయంలో ఆదివాసీ విద్యార్థుల ఆత్మహత్యలు కలిచివేశాయి. అట్టడుగు వర్గాలకు చెందిన విద్యార్థుల ఆత్మహత్యల ఘటనలపై ఆందోళన వ్యక్తం చేస్తూనే.. సామాజిక మార్పు కోసం సమాజంతో చర్చలు జరపడంలో న్యాయమూర్తులు కీలకపాత్ర పోషించాలి. న్యాయ, పరిపాలన వివాదాల పరిష్కారంతోపాటు సమాజం ఎదుర్కొంటున్న నిర్మాణాత్మక సమస్యలను పరిష్కరించేందుకు కూడా సుప్రీంకోర్టు ప్రయత్నిస్తోంది. సీజేఐగా విద్యార్థులు చదువుకునేందుకు ఆరు దశాబ్దాలకు సంబంధించిన తీర్పులన్నింటినీ అందుబాటులో ఉంచాం. ఆటో ఇంటెలిజెన్స్ ద్వారా కోర్టు విచారణను రికార్డు చేస్తున్నాం. దీంతో విద్యార్థులు విచారణ తీరును తెలుసుకోవచ్చు’’ అని జస్టిస్ చంద్రచూడ్ వివరించారు. ఈ కార్యక్రమంలో నల్సార్ యూనివర్సిటీ వ్యవస్థాపక వైస్ చాన్సలర్ రణబీర్ సింగ్, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తులు జస్టిస్ ఎస్ఎస్ఎం ఖాద్రీ, జస్టిస్ పీవీ రెడ్డి, రాష్ట్ర అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్, హెచ్‌సీఏఏ చైర్మన్ రఘునాథ్, కార్యదర్శులు మల్లారెడ్డి, నరేందర్ తదితరులు పాల్గొన్నారు. స్నాతకోత్సవం సందర్భంగా పీహెచ్డీ (బ్లాక్ గౌన్–రెడ్‌క్యాప్), ఎల్ఎల్ఎం (బ్లాక్ గౌన్–ఎల్లో క్యాప్), ఎంబీఏ (బ్లాక్ గౌన్–ఎల్లో క్యాప్), బీఏ ఎల్ఎల్బీ (ఆనర్స్) (బ్లాక్ గౌన్–మెరున్ క్యాప్)తో పాటు పలు విభాగాల విద్యార్థులకు డిగ్రీ పట్టాలను ప్రదానం చేశారు. ఆ ఇద్దరికి పతకాల పంట.. నల్సార్ స్నాతకోత్సవంలో బీఏ ఎల్ఎల్బీ (ఆనర్స్) విద్యార్థి తన్వీ ఆప్టేకు ఏకంగా పదకొండు పసిడి పతకాలు లభించాయి. మరో రెండు పసిడి పతకాలను ఉమ్మడిగా పొందారు. ‘‘ఇన్ని గోల్డ్ మెడల్స్ రావడం చాలా ఆనందంగా ఉంది. నా తల్లిదండ్రుల కృషి మూలంగానే నేను ఈ పతకాలు సాధించగలిగాను. వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా’’ అని తన్వీ పేర్కొన్నారు. ఇక బీఏ ఎల్ఎల్బీ (ఆనర్స్) విద్యార్థి మంజరి సింగ్‌కు 10 పసిడి పతకాలు లభించాయి. మొత్తంగా స్నాతకోత్సవంలో 58 గోల్డ్ మెడల్స్ పంపిణీ చేశారు. -
25న రాష్ట్రానికి సుప్రీం ప్రధాన న్యాయమూర్తి
సాక్షి, హైదరాబాద్: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ ఈ నెల 25న రాష్ట్రానికి రానున్నారు. ఆయన హైదరాబాద్‌లోని నల్సార్ యూనివర్సిటీలో శనివారం ఉదయం 11 గంటలకు జరిగే 19వ కాన్వొకేషన్ కార్యక్రమంలో పాల్గొంటారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ పీఎస్ నరసింహా, జస్టిస్ వి.రామసుబ్రహ్మణ్యన్, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (వర్సిటీ చాన్స్‌లర్) జస్టిస్ ఉజ్జల్ భూయాన్, రాష్ట్ర న్యాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి తదితరులు కార్యక్రమంలో పాల్గొంటారు. -
సకాలంలో సత్యాన్ని వెలికితీయాలి
సాక్షి, హైదరాబాద్: నేరాలు జరిగినప్పుడు సకాలంలో సత్యాన్ని వెలికితీయడం కత్తిమీద సాము లాంటిదని, దీనిలో ఫోరెన్సిక్ సైన్స్ ప్రధాన భూమిక పోషిస్తుందని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ యు.యు. లలిత్ అన్నారు. ట్రూత్ ల్యాబ్ 15వ వార్షికోత్సవం సందర్భంగా ఫోరెన్సిక్ సైన్స్ వినియోగంపై నల్సార్ యూనివర్సిటీ శనివారం ఇక్కడ నిర్వహించిన జాతీయ సదస్సులో ఆయన మాట్లాడారు. క్రిమినల్ కేసుల్లోనే కాదు, సివిల్ కేసుల్లోనూ ఫోరెన్సిక్ సైన్స్ సేవలు అందించాలని సూచించారు. పరిశోధనకు కొత్త మార్గాలను అనుసరించడంతోపాటు సైన్స్ అండ్ టెక్నాలజీని ఏకీకృతం చేయాల్సిన అవసరం ఉందని మరో మాజీ సీజేఐ జస్టిస్ ఎంఎన్ వెంకటాచలయ్య అభిప్రాయపడ్డారు. శాస్త్రీయంగా సాక్ష్యాన్ని సమర్థవంతంగా రూపొందించడంలో ఫోరెన్సిక్ పాత్ర కీలకమైనదని అన్నారు. ఆధారాలను వెలికితీయడంలో... న్యాయ రంగంలో ఫోరెన్సిక్ సైన్స్ సహకారం అవసరమని, తద్వారా క్రిమినల్ కేసులను త్వరితగతిన పరిష్కరించే వీలు కలుగుతుందని తమిళనాడు మాజీ గవర్నర్ రాంమోహన్‌రావు అన్నారు. క్రిమినల్ కేసులు, మానవ అక్రమ రవాణా వంటి నేరాల్లో ఆధారాలను వెలికితీసేందుకు ఫోరెన్సిక్ సైన్స్ తోడ్పడుతుందని తెలంగాణ హైకోర్టు సీజే, నల్సార్ వర్సిటీ చాన్స్‌లర్ జస్టిస్ ఉజ్జల్ భూయాన్ వ్యాఖ్యానించారు. ఫోరెన్సిక్ సైన్స్ రంగంలో ప్రభుత్వ పెట్టుబడులను పెంచాలని మాజీ ఐఏఎస్ అధికారి డాక్టర్ జయప్రకాష్ నారాయణ్ సూచించారు. రాంమోహన్‌రావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జాతీయ మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ అరుణ్‌మిశ్రా, లా కమిషన్ ఆఫ్ ఇండియా మాజీ చైర్మన్ జస్టిస్ ఎం.జగన్నాథరావు, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ పీవీ రెడ్డి తదితరులు మాట్లాడారు. డీజీపీ అంజనీకుమార్, మాజీ న్యాయమూర్తులు జస్టిస్ భవానీ ప్రసాద్, జస్టిస్ రఘురామ్, వర్సిటీ వైస్ చాన్స్‌లర్ కృష్ణదేవరావు, డా.గాంధీ పీసీ కాజా, పలువురు ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు. -
దేశ నిర్మాణంలో మానవ వనరుల పాత్ర కీలకం
శామీర్‌పేట్: దేశ నిర్మాణంలో మానవ వనరుల పాత్ర కీలకమైందని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. శామీర్‌పేట్‌లోని నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయంలో నల్సార్ డిపార్ట్మెంట్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్(డీవోఎంఎస్), సొసైటీ ఫర్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ హైదరాబాద్(ఎస్‌హెచ్‌ఆర్‌డీ) సంయుక్తంగా లీగల్ ఆక్యూమెన్ ఫర్ హెచ్ఆర్ లీడర్స్ పేరుతో నిర్వహించిన సదస్సులో గవర్నర్ ప్రసంగించారు. ఈ సందర్భంగా నిర్వహించిన వర్క్‌షాప్‌లో పాల్గొన్నవారికి సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. తమిళిసై మాట్లాడుతూ సమాజం మొత్తం ఆనందంగా ఉండాలంటే సానుకూల మనసు, ఆరోగ్యం అవసరమని అన్నారు. ప్రపంచానికి నిరంతర అభ్యాసం, అభివృద్ధి అవసరమని, అందుకు మానవ వనరులే ముఖ్యమని పేర్కొన్నారు. ఈ క్లిష్టమైన ప్రక్రియను సులభతరం చేయడంలో హెచ్ఆర్ లీడర్లు ముఖ్యపాత్ర పోషిస్తారని అన్నారు. నల్సార్ వైస్ చాన్స్‌లర్, రిజిస్ట్రార్ బాలకృష్ణారెడ్డి మాట్లాడుతూ వర్క్‌షాప్‌లో 200 మంది హెచ్ఆర్ లీడర్లు పాల్గొన్నారని చెప్పారు. ఈ సందర్భంగా హెచ్ఆర్ లీడర్లు నిర్వహించే పని గురించి వివరించారు. కార్యక్రమంలో డిపార్ట్మెంట్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్ అధిపతి విద్యాలతారెడ్డి, ఎస్‌హెచ్‌ఆర్‌డీ కో ఫౌండర్ రమేశ్ మంతన, హిందు మాధవి, హెచ్ఆర్ లీడర్స్, విద్యార్థులు పాల్గొన్నారు. -
అంతర్జాతీయ వాణిజ్య, వ్యాపార న్యాయ కేంద్రం ప్రారంభం
శామీర్‌పేట్: శామీర్‌పేటలోని నల్సార్ విశ్వ విద్యాలయంలో అంతర్జాతీయ వాణిజ్య వ్యాపార న్యాయ కేంద్రాన్ని తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భూయాన్, సుప్రీంకోర్డు మాజీ న్యాయమూర్తి బీపీ జీవన్‌రెడ్డి శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అంతర్జాతీయ వాణిజ్యం, వ్యాపార చట్టాల్లో సమకాలీన సమస్యలకు సంబంధించిన బోధనకు ఈ కేంద్రం దోహదం చేస్తుందని అన్నారు. అనంతరం అంతర్జాతీయ న్యాయ పరిశోధన కార్యాలయ వెబ్‌సైట్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నల్సార్ ప్రొఫెసర్లు వెంకట్, డాక్టర్ కేవీకే శాంతి, మల్లిఖార్జున్, రాజేశ్‌కపూర్ పాల్గొన్నారు. -
నల్సార్ సాహసోపేతమైన నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: ఎల్జీబీటీక్యూ+ (లెస్బియన్, గే, ద్విలింగ, ట్రాన్స్‌జెండర్, క్వీర్ ప్లస్ ) విద్యార్థుల సమస్యలను పరిష్కరించడంలో ఒకడుగు ముందుండే నేషనల్ అకాడమీ ఆఫ్ లీగల్ స్టడీస్ అండ్ రీసెర్చ్ (నల్సార్) మరో సాహసోపేతమైన నిర్ణయాన్ని తీసుకుంది. లింగ గుర్తింపు లేనివారి కోసం హాస్టల్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. లేడీస్ హాస్టల్–6లో ఏర్పాట్లు.. నల్సార్‌లో బాలికల హాస్టల్–6 భవనంలోని గ్రౌండ్ ఫ్లోర్‌ను పూర్తిగా లింగ గుర్తింపు లేని (జెండర్ న్యూట్రల్)వారికోసం కేటాయించారు. అకడమిక్ బ్లాక్‌లో గ్రౌండ్ ఫ్లోర్లో లింగ గుర్తింపు లేనివారి కోసం వాష్‌రూమ్స్‌ను ఏర్పాటు చేశామని నల్సార్ వైస్ చాన్స్‌లర్ ఫైజాన్ ముస్తఫా ఆదివారం ట్విట్టర్లో తెలిపారు. ఇక ‘జెండర్, సెక్సువల్ మైనారిటీ’అంశాలపై సమగ్ర విద్యా విధానం కోసం యూనివర్సిటీ ట్రాన్స్ పాలసీ కమిటీ ముసాయిదా విధానాన్ని త్వరలో అమలు చేయనుంది. 2015 జూన్‌లో నల్సార్‌లోని ఓ 22 ఏళ్ల బీఏ ఎల్ఎల్బీ విద్యార్థి తన గ్రాడ్యుయేషన్ సర్టిఫికెట్లో జెండర్ గుర్తింపు వద్దని వర్సిటీ ప్రతినిధులను అభ్యర్థించగా.. ఆ అభ్యర్థనను ఆమోదించి.. సదరు స్టూడెంట్ గ్రాడ్యుయేషన్ సర్టిఫికెట్లో జెండర్ కాలమ్‌లో మిస్టర్, మిస్కి బదులుగా ‘ఎంఎక్స్’గా పేర్కొంటూ సర్టిఫికెట్‌ను జారీ చేసింది. నల్సార్ వర్సిటీకి రూ.1.50 కోట్ల విరాళం శామీర్‌పేట్: నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయంలో సెంటర్ ఫర్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఆండ్ బిజినెస్ లా(జేఆర్‌సీఐటీబీఎల్) అంతర్జాతీయ వాణిజ్య, వ్యాపార న్యాయ కేంద్రం ఏర్పాటుకు దాత జస్టిస్ బీపీ. జీవన్‌రెడ్డి రూ. కోటి 50 లక్షల చెక్కును నగరంలోని ఆయన నివాసంలో ఆదివారం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... అంతర్జాతీయ వాణిజ్య, వ్యాపారకేంద్రం ఏర్పాటుతో చట్టాల్లో సమకాలిన సమస్యలకు సంబంధించిన బోధన, పరిశోధన చేపట్టే లక్ష్యాలు అయిన సెమినార్లు, ఉపన్యాసాలు, స్వల్పకాలిక శిక్షణా కార్యక్రమాలను నిర్వహిస్తామన్నారు. నల్సార్ అండర్ గ్రాడ్యూయేట్, పోస్ట్ గ్రాడ్యూయేట్, డాక్టోరల్ స్థాయిలో కోర్సులను ప్రారంభించడం, బలోపేతం చేయడం, పరిశోధన, ప్రచురించడానికి విధాన రూపకర్తలతో సహకరించడానికి ఐఎంఎఫ్, ఐబీఆర్‌వో, డబ్ల్యూటీవీ. సీఐఐ, ఎఫ్ఐసీసీఐ మొదలైన వివిధ అంతర్జాతీయ, జాతీయ సంస్థలతో ఇంటర్నషిప్‌లను పొందడంలో సహాయం చేయడానికి అధ్యాపక బృందం కృషిచేసిందన్నారు. సుప్రీంకోర్డు మాజీ న్యాయమూర్తి పివి రెడ్డి, జస్టిస్ ఎస్ఎస్ఎం కాద్రీ, జస్టిస్ బి. సుదర్శన్‌రెడ్డి, సుప్రీకోర్డు న్యాయమూర్తి సుభాష్‌రెడ్డి, పాట్నా హై కోర్డు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎల్. నర్సింహారెడ్డి, తెంలగాణ హై కోర్డు న్యాయమూర్తులు ఉజ్వల్‌భూయాన్, రాజశేఖర్‌రెడ్డి, పి.నవీన్‌రావు, బార్ కౌన్సిల్ చైర్మెన్ జస్టిస్ నర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
సమాన న్యాయంతోనే సార్థకత
సాక్షి, మేడ్చల్ జిల్లా/శామీర్‌పేట్: న్యాయ సమానత్వం కోసం న్యాయవాదులు కృషిచేయాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ పిలుపునిచ్చారు. హక్కులు, న్యాయం కోసం పోరాడేందుకు యువత ముందుకు రావాలని, యువత తమ శక్తిని పూర్తిగా వినియోగించుకున్నపుడే మెరుగైన భవిష్యత్తు ఏర్పడుతుందని చెప్పారు. ఆదివారం శామీర్‌పేటలోని నల్సార్ విశ్వవిద్యాలయంలో జరిగిన 18వ స్నాతకోత్సవంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. న్యాయ విద్యార్థులు క్షేత్రస్థాయిలో నేరుగా ప్రజలతో మాట్లాడి సమస్యలను తెలుసుకోవాలని, భాష ఏదైనా సమాచార సేకరణ సమర్థవంతగా ఉండాలన్నారు. న్యాయ విద్యా ర్థులు ఉన్నతస్థాయికి వెళ్లేందుకు ముందుగా విచారణ అనుభవాన్ని పొందాలని సూచించారు. విశ్వవిద్యాలయాల కంటే ప్రజలతో ప్రత్యక్షంగా నేర్చుకున్న పాఠాలే మేధోసంపత్తి ఎదుగుదలకు దోహదపడతాయని జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. అంతకుముందు వర్సిటీలో విద్యార్థుల హాస్టళ్ల భవనాలతోపాటు డైనింగ్ హాలును హైకోర్టు ప్రధానన్యాయమూర్తి, నల్సార్ చాన్స్‌లర్ జస్టిస్ సతీష్ చంద్రశర్మ, న్యాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. గోల్డ్ మెడల్స్ అందజేత 2020, 2021 సంవత్సరాల్లో గోల్డ్‌మెడల్స్ సాధించిన 104 మంది విద్యార్థులకు జస్టిస్ రమణ గోల్డ్ మెడల్స్ అందజేశారు. అలాగే వివిధ కోర్సుల్లో ఉత్తీర్ణత సాధించిన వారికి పట్టాలను అందజేసి అభినందించారు. అనంతరం నల్సార్ వర్సిటీ రూపొందించిన పలు రివ్యూ డాక్యుమెంటరీలను ఆవిష్కరించారు. కార్యక్రమంలో సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తులు జస్టిస్ ఎస్ఎస్ఎం ఖాద్రీ, జస్టిస్ పి.వెంకటరమణా రెడ్డి, కార్మిక మంత్రి మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
కోర్టు వెలుపలే వివాదాల పరిష్కారం..!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రత్యామ్నాయ వివాద పరిష్కార అంతర్జాతీయ కేంద్రం ఏర్పాటుకు ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ చాంబర్స్ ఆఫ్ కామ ర్స్ అండ్ ఇండస్ట్రీ (ఎఫ్‌టీసీసీఐ), నల్సార్ యూని వర్సిటీ ఆఫ్ లా ఒక అవగాహన ఒప్పందం చేసుకున్నాయి. ఇరు కంపెనీలు, ఇతరుల మధ్య తలెత్తిన వివాదాలను కోర్టు వెలుపల పరిష్కరించేందుకు ఈ కేంద్రం దోహదం చేస్తుంది. ఎఫ్‌టీసీసీఐ ప్రెసిడెంట్ కరునేంద్ర ఎస్ జాస్తి, నల్సార్ వీసీ ఫైజన్ ముస్తఫా సమక్షంలో ఒప్పందం జరిగింది. -
మళ్లీ స్వైన్‌ఫ్లూ విజృంభణ
దేశంలోని వివిధ ప్రాంతాల్లో మరోసారి స్వైన్ ఫ్లూ స్వైరవిహారం చేస్తోంది. ఈ వ్యాధితో గత నెల రోజుల్లో 169మంది మరణించగా, 4,571మందికి వైరస్ సోకిందని గణాంకాలు చెబుతున్నాయి. రాజస్తాన్, గుజరాత్, ఢిల్లీ, పంజాబ్, హర్యానా, మహారాష్ట్రల్లో ఇది అధికంగా ఉండగా, ఇతర రాష్ట్రాల్లో అక్కడక్కడ ఈ కేసులు బయటపడుతున్నాయి. తెలంగాణలో, ప్రత్యేకించి హైదరాబాద్‌లో స్వైన్‌ఫ్లూ కేసుల నమోదు పెరిగింది. ఈ నెలలోనే 150మంది దీని వాత పడ్డారు. ఈ మహమ్మారి మన దేశంలో మొదటిసారి బయటపడి పదేళ్లవుతోంది. కానీ పదే పదే ఇది విజృంభించడాన్ని చూస్తుంటే ఈ వ్యాధి విషయంలో మనం నేర్చుకున్నదేమీ లేదని అర్ధమవుతుంది. వాతావరణంలో ఉష్ణోగ్రతలు తగ్గే వర్షాకాలం, శీతాకాలాల్లో ఈ వైరస్ విజృంభిస్తుందని తెలియనిదేమీ కాదు. మరీ ముఖ్యంగా ఈసారి ఉష్ణోగ్రతలు ఎన్నడూలేని స్థాయిలో బాగా తగ్గాయి. రెండు తెలుగు రాష్ట్రా ల్లోనూ చాలాచోట్ల రాత్రి ఉష్ణోగ్రతలు 19 డిగ్రీల సెల్సియస్ వరకూ వచ్చాయి. కానీ ముందస్తు చర్యల్లో, వ్యాధి ప్రబలుతున్నదని అర్ధమయ్యాక చేపట్టవలసిన చర్యల్లో అధికార యంత్రాంగాలు విఫలమవుతున్నాయి. కొంచెం హెచ్చుతగ్గులతో అన్ని రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి ఉండటం ఆందో ళన కలిగిస్తుంది. ఈ నిర్లక్ష్యం కారణంగా దేశవ్యాప్తంగా వేలాదిమంది మృత్యువాత పడుతున్నారు. నిరుడు వివిధ రాష్ట్రాల్లో 14,992 కేసులు బయటపడగా, 1,103మంది మరణించారు. జాతీయ వ్యాధుల నియంత్రణ కేంద్రం(ఎన్సీడీసీ) గణంకాల ప్రకారం దేశంలో ఈ నెల రోజుల్లో బయటపడిన 4,571 స్వైన్‌ఫ్లూ కేసుల్లో 40 శాతం... అంటే 1,856 కేసులు రాజస్తాన్వే. మరణాలు కూడా అక్కడే అధికం. ఇంతవరకూ దేశవ్యాప్తంగా స్వైన్‌ఫ్లూ బారినపడి మరణించిన 169 మందిలో 72 మంది ఆ రాష్ట్రంవారే. ఢిల్లీలోనూ వైరస్ వ్యాప్తి తీవ్రంగానే ఉంది. అక్కడ 11 మంది చనిపోయారు. ఈ వైరస్ జాడ కనబడిన తర్వాత తక్షణం నియంత్రణ చర్యలు తీసుకోవా లని, లేనట్టయితే అది శరవేగంగా విస్తరించడం ప్రారంభమవుతుందని నిపుణులు చెబుతున్నారు. ఈ విస్తరణకు దారితీసే అంశాలేమిటో, అది సోకకుండా ఉండటానికి తీసుకోవాల్సిన ముందస్తు చర్యలేమిటో విస్తృతంగా ప్రచారం చేస్తే తప్ప ప్రజానీకంలో అవగాహన కలగదు. గతంలో ఇది విజృంభించినప్పుడు ప్రభుత్వాలు చురుగ్గా వ్యవహరించాయి. అప్పట్లో వివిధ మార్గాల్లో అప్రమ త్తత పెంచారు. కానీ అది సరిపోదు. ప్రతియేటా వర్షాకాలం ప్రారంభమైంది మొదలుకొని వేసవి సమీపించేవరకూ ఈ విషయంలో ప్రభుత్వాలు చర్యలు తీసుకోక తప్పదు. స్వైన్ ఫ్లూను మూడు కేటగిరిలుగా విభజించారు. ఇందులో ఏ, బీ వైరస్ల వల్ల రోగికి తక్షణ ప్రమాదం ఉండదు. మూడో కేటగిరి వైరస్ సోకినవారికి మాత్రం అత్యవసర చికిత్స అవసర మవుతుందని, వెంటనే వెంటిలేటర్ పెట్టాల్సి ఉంటుందని వైద్య నిపుణులు అంటున్నారు. వ్యాధి తీవ్రత ఉన్నదని ప్రకటించిన ప్రాంతాల్లో ఎక్కువ జనసమ్మర్థం ఉండేచోటకు వెళ్లరాదని కూడా వారి సలహా. అసలు పారిశుద్ధ్యం సక్రమంగా ఉంటే వ్యాధుల విస్తరణ ఇంతగా ఉండదు. అది కొరవ డినప్పుడే విషజ్వరాలైనా, మరే ఇతర అంటువ్యాధులైనా కాటేస్తాయి. ఆ విషయంలో కూడా చర్యలు అవసరమని గుర్తించాలి. స్వైన్‌ఫ్లూ అయినా, మరేవిధమైన ప్రమాదకర అంటువ్యాధి అయినా ప్రబలడం మొదలైందంటే దాని నష్టం బహుముఖంగా ఉంటుంది. వెనువెంటనే కనబడే ప్రాణనష్టం మాత్రమే కాదు... సామాజికంగా, ఆర్థికంగా కూడా వాటి ప్రభావం ఉంటుంది. సకాలంలో చర్యలు తీసుకోనట్టయితే ప్రభుత్వాలు ఆసుపత్రి సౌకర్యాల కోసం, ఔషధాల కోసం భారీ మొత్తంలో వ్యయం చేయాల్సి ఉంటుంది. వ్యాధిగ్రస్తుల సంఖ్య పెరిగేకొద్దీ ఉత్పాదకత ఆమేరకు కుంటుబడుతుంది. విదేశీ యాత్రీ కుల రాక, వారివల్ల వచ్చే రాబడి తగ్గుతుంది. కనుక ఈ విషయంలో శాశ్వత ప్రాతిపదికన చర్యలు తప్పనిసరి. అంటువ్యాధులు ప్రబలినప్పుడు పైనుంచి కిందివరకూ ఎవరికి ఏఏ బాధ్యతలుం టాయో తెలియజెప్పే మాన్యువల్ రూపొందాలి. మన దేశంలో సాంక్రమిక వ్యాధుల చట్టం, పశు సంపద దిగుమతి చట్టం వంటివి బ్రిటిష్ పాలకులు తీసుకొచ్చిన చట్టాలు. వాటి స్థానంలో వర్త మాన అవసరాలకు తగ్గట్టు సమర్ధవంతమైన కొత్త చట్టాలు రూపొందించాల్సిన అవసరాన్ని మన పాలకులు ఇంకా గుర్తించలేదు. ఒక రాష్ట్రంలో వ్యాధి సోకిందని తెలియగానే వెనువెంటనే అన్ని రాష్ట్రాలనూ అప్రమత్తం చేయడం, ఎటువంటి చర్యలు అమల్లోకి రావలసి ఉన్నదో వివరిస్తూ సూచ నలు జారీచేయడం జరగాలి. ఏ కాలంలో ఏఏ వ్యాధులు ప్రబలే అవకాశమున్నదో గుర్తించి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడం అవసరమే అయినా, అంతకుమించి బాధ్యతలను నిర్దిష్టంగా నిర్ణయిం చడం అవసరం. స్వచ్ఛంద సంస్థల సహకారం తీసుకుంటే తక్కువ వ్యవధిలో ఎక్కువమంది ప్రజ లకు సమాచారం చేరేసే వీలుంటుంది. నిజానికి నిరుడు ఆగస్టులోనే దేశంలో ఈ స్వైన్‌ఫ్లూ వైరస్ బయటపడింది. అప్పటినుంచీ ఒక్కొక్క రాష్ట్రాన్నీ తాకుతూ వస్తోంది. కానీ ప్రభుత్వాలు సకాలంలో పకడ్బందీ చర్యలు తీసు కోవడంలో విఫలమయ్యాయి. అదే జరిగి ఉంటే ఈ అంటువ్యాధి నియంత్రణ సాధ్యమయ్యేది. 2009 తర్వాత ఈ స్థాయిలో వైరస్ విజృంభించడం ఇదే మొదటిసారని ప్రపంచ ఆరోగ్య సంస్థ అప్పట్లోనే చెప్పింది. అయిదేళ్లలోపు పిల్లల్లోనూ, గర్భిణుల్లోనూ, సీనియర్ సిటిజన్లలోనూ ఈ వ్యాధి ప్రభావం ఎక్కువని వైద్య నిపుణులు చెబుతారు. మిగిలినవారికి సోకినా ప్రమాద తీవ్రత తక్కువ ఉంటుంది. జలుబు, దగ్గు, జ్వరం, ఒళ్లు నొప్పుల తీవ్రంగా ఉన్నప్పుడు వైద్యుల్ని ఆశ్రయించాలని విస్తృతంగా ప్రచారం చేస్తే ప్రజలకు దీనిపై అవగాహన ఏర్పడుతుంది. తెలంగాణలో మూడేళ్లక్రితం స్వైన్ ఫ్లూ సోకినప్పుడు వైద్య ఆరోగ్య శాఖ చురుగ్గా వ్యవహరించి వివిధ రకాల చర్యలు తీసుకుంది. కానీ ఈసారి మాత్రం చేష్టలుడిగి ఉండిపోయింది. అన్ని స్థాయిల్లోనూ జవాబుదారీతనాన్ని స్పష్టంగా నిర్ణయించిప్పుడే ఇలాంటి నిర్లక్ష్యం విరగడవుతుంది. -
స్వైన్‌ఫ్లూ పంజా
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంపై మళ్లీ స్వైన్‌ఫ్లూ పంజా విసురుతోంది. చలితీవ్రత పెరగడం, రెండ్రోజులుగా కురుస్తున్న చిరుజల్లుల కారణంగా హెచ్1ఎన్1 వైరస్ మరింత బలపడుతోంది. ఈ పరిణామాలపై ప్రజల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ఒక్క జనవరిలోనే ఇప్పటి వరకు 150 మందికిపైగా ఫ్లూ బారిన పడ్డారు. రెండ్రోజుల్లోనే 25 మందికి పాజిటివ్‌గా తేలగా.. ఒక్క సోమవారమే 14 కేసులు నమోద వడం ముంచుకొస్తున్న ప్రమాదాన్ని సూచిస్తోంది. గాంధీలో జ్వరం కోసం చికిత్స పొందుతున్న 9 మందికి ఫ్లూ పాజిటివ్‌గా నిర్ధారణైంది. మరో నలుగురు అనుమానితులు చికిత్స పొందుతున్నారు. నల్సార్ యూనివర్సిటీ విద్యార్థులు నలుగురు (అర్జున్ ప్రసాద్ కోయిరాల, మనీష్‌సింగ్, సత్యేంద్ర పర్వారీ, రమేష్‌చంద్ మీనా) ఫీవర్ ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు. దీంతో యూనివర్సిటీ అధికారులు అప్రమత్తమయ్యారు. ఉస్మానియా జనరల్ ఆస్పత్రిలోనూ ఒక పాజిటివ్ కేసుతో పాటు మరో నలుగురు అనుమానితులు చికిత్స పొందుతున్నారు. ఓవైపు హెచ్1ఎన్1 వైరస్ రోజురోజుకూ విజృంభిస్తున్నప్పటికీ.. ప్రభుత్వ యంత్రాంగం మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. పరిస్థితిని ముందే ఊహించి అప్రమత్తం కావాల్సిన వైద్య ఆరోగ్య శాఖ.. తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడంతో పరిస్థితి మరింత అధ్వానంగా మారింది. నమోదవుతున్న కేసుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ.. అధికారులు కనీస సమీక్ష నిర్వహించడం లేదు. అసలు.. ఫ్లూ నియంత్రణ, రోజువారీ పర్యవేక్షణ ఎవరు చేస్తున్నారో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. మూడేళ్ల క్రితం ఇదే తరహాలో స్వైన్‌ఫ్లూ విజృంభించినపుడు.. వైద్య ఆరోగ్యశాఖ కరపత్రాలు, స్లైడ్లు, ఫ్లెక్సీలు, మీడియా ప్రకటనలు తదితర పద్దతుల్లో విస్త్రృత ప్రచారం నిర్వహించింది. దీంతో పిల్లలు, పెద్దలు మాస్క్‌లు ధరించి బయటకు వచ్చేవారు. తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. కానీ ఈసారి మాత్రం కనీస ప్రచారం, అప్రమత్తత లేకపోవడంతో.. స్వైన్‌ఫ్లూ వచ్చే వరకు కూడా ప్రజలు గుర్తించలేకపోతున్నారు. మంత్రిలేక.. ఇష్టారీతిన కొత్త ప్రభుత్వం ఏర్పడి నెలన్నర పూర్తవుతున్నా.. వైద్య ఆరోగ్యశాఖకు మంత్రి లేకపోవడంతో అధికారులకు అడ్డూఅదుపూ లేకుండా పోయింది. హైదరాబాద్ కోఠిలోని ఆరోగ్య కుటుంబ సంక్షేమ కార్యాలయంలో అధికారులు స్వైన్‌ఫ్లూకు సంబంధించిన కనీస సమాచారం ఇవ్వడం, ప్రజల్లో చైతన్యం తీసుకురావడంపై పూర్తిగా విఫలమయ్యారు. చాలాచోట్ల వైద్యాధికారులు అందుబాటులో కూడా ఉండటంలేదు. సెక్రటేరియట్లో ఏదో సమావేశం ఉందని.. కిందిస్థాయి సిబ్బందికి చెప్పి. సెక్రటేరియట్‌కు వెళ్లకుండా సొంత పనులు చూసుకుంటున్నారన్న ఆరోపణలున్నాయి. ఎవరేం చేస్తున్నారో కూడా అర్థంకాని పరిస్థితి. ప్రజలకు, సిబ్బందికి అందుబాటులో ఉండటంలేదన్న ఆరోపణలున్నాయి. పైపెచ్చు స్వైన్‌ఫ్లూపై ఏం చేయాలో సిబ్బందికి సూచించడం లేదు. ఈ నిర్లక్ష్య ధోరణే.. స్వైన్‌ఫ్లూ విజృంభణకు కారణంగా కనిపిస్తోందని కిందిస్థాయి వైద్య సిబ్బంది విమర్శిస్తున్నారు. ఈ ఒక్క నెలలోనే 150 మందికి శీతాకాలంలో స్వైన్‌ఫ్లూ విజృంభిస్తుంది. రాత్రితోపాటు పగటి ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోవడంతో ఫ్లూ కేసులు అధికంగా నమోదవుతున్నాయి. ఈ జనవరి నెలలోనే ఏకంగా 150 వరకు కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అందులో కేవలం 12 రోజుల వ్యవధిలోనే 131 కేసులు నమోదవడం ప్రమాద తీవ్రతను సూచిస్తోంది. అంతేకాదు. ఈ నెల ఒకటో తేదీ నుంచి పదో తేదీ వరకు 483 మందిని పరీక్షిస్తే, అందులో 83 మందికి స్వైన్‌ఫ్లూ ఉన్నట్లు తేలింది. ఇవిగాక కొందరు బాధితులు నేరుగా ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లడంతో అవి రికార్డుల్లోకి రావడం లేదు. అటు ప్రైవేటు ఆసుపత్రులు స్వైన్‌ఫ్లూ భయం పెట్టి వేలకు వేలు గుంజుతున్నారు. చివరకు అక్కడ తగ్గకపోవడంతో కొన్ని కేసులు ప్రైవేటు ఆసుపత్రుల నుంచి గాంధీ, ఫీవర్ (కోరంటి) ఆసుపత్రికి వస్తున్నట్లు వైద్యాధికారులు చెబుతున్నారు. దీంతో శాంపిళ్లను పరీక్షించేందుకు ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ (ఐపీఎం)లో మూడు షిఫ్ట్‌ల్లో వైద్య సిబ్బంది పనిచేయాల్సి వస్తోందని అధికారులు చెబుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు 12 నుంచి 15 డిగ్రీల నమోదు కావడం, కొన్ని ప్రాంతాల్లో 10 డిగ్రీల వరకు పడిపోవడం స్వైన్‌ఫ్లూ విజృంభిస్తోందంటున్నారు. హైదరాబాద్‌లోని ఫీవర్ ఆసుపత్రికి సాధారణంగా 500–600 మంది రోజూ ఔట్ పేషెంట్ రోగులు వస్తుంటారు. అలాంటిది 3,4 రోజులుగా రోజూ వెయ్యి మంది రోగులు వస్తున్నట్లు వైద్యులు చెబుతున్నారు. ఐదేళ్ల తర్వాత ఇంత భారీ స్థాయిలో కేసులు నమోదు కావడం ఇదే తొలిసారిగా చెబుతున్నారు. స్వైన్‌ఫ్లూ లక్షణాలు... తీవ్రమైన జ్వరం, దగ్గు, జలుబు, ఒళ్లు నొప్పులు ఉంటాయి. జ్వరం ఒక్కోసారి అధికంగా ఉంటుంది. తీవ్రమైన తలనొప్పి ఉంటుంది. పిల్లల్లోనైతే కొన్ని సందర్భాల్లో తీవ్రమైన శ్వాస సమస్య ఎదురువుతుంది. ఒక్కోసారి చర్మం బ్లూ లేదా గ్రే కలర్లోకి మారుతుంది. దద్దుర్లు వస్తాయి. కొన్ని సందర్భాల్లో వాంతులు అవుతాయి. ఒక్కోసారి నడవడమే కష్టమవుతుంది. పెద్దల్లోనైతే కొన్ని సందర్భాల్లో శ్వాస తీసుకోవడం కష్టంగా మారుతుంది. ఛాతీ నొప్పి, కడుపునొప్పి ఉంటుంది. ఆగకుండా వాంతులు అవుతాయి. తీసుకోవాల్సిన జాగ్రత్తలు: జనాలు ఎక్కువగా ఉన్న చోట తిరగకుండా చూసుకోవాలి. గుంపుల్లో తిరిగితే ఒకరి నుంచి మరొకరికి స్వైన్‌ఫ్లూ వైరస్ సోకే ప్రమాదముంది. చేతులను ఎప్పటికప్పుడు శుభ్రం చేసకోవాలి. అవకాశముంటే రక్షణ కవచంగా గ్లౌవ్స్ తొడుక్కోవాలి. దగ్గు, జలుబు, ఒళ్లు నొప్పులు, అధిక జ్వరం ఉండి, స్వైన్‌ఫ్లూ అనుమానం వస్తే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి. రక్తపోటు, స్థూలకాయం, మధుమేహం, ఊపిరితిత్తుల సమస్యలున్న వారికి స్వైన్‌ఫ్లూ త్వరగా సోకడానికి అవకాశముంది. కాబట్టి అలాంటి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. -
నల్సార్ యూనివర్శిటీ విద్యార్ధులకు స్వైన్ ఫ్లూ
సాక్షి, హైదరాబాద్ : నల్సార్ యూనివర్శిటీకి చెందిన ఐదుగురు విద్యార్ధులకు స్వైన్ ఫ్లూ సోకింది. స్వైన్ ఫ్లూ లక్షణాలతో బాధపడుతున్న ఐదుగురు విద్యార్ధులను గాంధీ ఆసుపత్రికి తరలించగా వైద్య పరీక్షలు చేసిన డాక్టర్లు స్వైన్ ఫ్లూ సోకినట్లు నిర్ధారించారు. ప్రస్తుతం ఐదుగురు విద్యార్ధులు గాంధీ ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నారు. కాగా ఈ ఒక్కరోజే మొత్తం తొమ్మిది మంది స్వైన్ ఫ్లూతో ఆసుపత్రిలో చేరినట్లు వైద్యులు తెలిపారు. వీరందరిని ప్రత్యేక వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు. వాతావరణంలో చోటుచేసుకున్న మార్పుల కారణంగానే స్వైన్ ఫ్లూ వేగంగా విస్తరిస్తున్నట్లు వైద్యులు పేర్కొన్నారు. -
ఆనాడే తుపాకీ పట్టేవాడిని
సాక్షి, హైదరాబాద్: ‘అసోంలో ఐఏఎస్ అధికారిగా విధులు నిర్వహిస్తున్న నా సోదరుడిని ఆఫీసులోనే బాంబు పేల్చి పొట్టనబెట్టుకున్నారు. నాకు ధైర్యం ఉండి ఉంటే అప్పుడే తుపాకీ పట్టేవాడిని. అదే జరిగి ఉంటే ఉగ్రవాదినని నా కోసం పోలీసులు లుక్ఔట్ నోటీసు ఇచ్చి ఉండేవారు’అని తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ అన్నారు. తన సోదరుడి హత్య కేసును సీబీఐ, కోర్టులు దర్యాప్తు చేసినా నిందితులందరూ శిక్ష పడకుండానే తప్పించుకున్నారని, ఇలాంటి సందర్భాల్లోనే న్యాయం లభించినట్లు కనబడాలని, సత్వర తీర్పుల ద్వారా న్యాయం గెలిచిందనే భావన ప్రజలకు తెలియాలని చెప్పారు. సమాజ శ్రేయస్సులో న్యాయ వ్యవస్థది కీలకపాత్ర అన్నారు. శనివారం హైదరాబాద్ శివారులోని షామీర్పేట నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయం 16వ స్నాతకోత్సవానికి గవర్నర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సత్వర న్యాయం లభించడం లేదని చాలా మంది విమర్శిస్తుంటారని, వాస్తవానికి కోర్టుల్లో పని భారం ఎక్కువగా ఉందని చెప్పారు. ఖాళీగా ఉన్న జడ్జీల పోస్టుల్ని భర్తీ చేయాలన్నారు. నేటి పరిస్థితులకు అనుగుణంగా రాజ్యాంగ సవరణలకు చేయదలిస్తే.. సమాజ శ్రేయస్సును దృష్టిలో పెట్టుకోవాలని సూచించారు. కొన్ని నిర్ణయాల వల్ల కొద్ది మంది నష్టపోవచ్చని, కానీ ఇలాంటి సందర్భాల్లో విస్తృత సమాజ శ్రేయస్సు ముఖ్యమన్నారు. రాజ్యాంగానికి రక్షణ కవచం న్యాయ వ్యవస్థ లా పట్టాలు పొంది బయటకు వెళుతున్న విద్యార్థులకు అనేక సవాళ్లు ఎదురవుతాయని.. క్షేత్రస్థాయి పరిస్థితులకు అనుగుణంగా, రాగద్వేషాలకు అతీతంగా పనిచేయాలని గవర్నర్ సూచించారు. దేశ ప్రధాని (ఇందిరాగాంధీ పేరు ప్రస్తావించలేదు) హత్య జరిగినపుడు నిందితుల తరఫున ఎందుకు వాదించాలని ప్రశ్నించే వారుంటారని, వారి వాదన చెప్పుకునే హక్కు రాజ్యాంగం ఇచ్చిందని అన్నారు. ‘డబ్బున్న నిందితుడికి గుండెపోటు వస్తే ఆస్పత్రిలో చేరుస్తారని, పేదవాడికి జైలులోనే వైద్యం చేస్తారని, కొన్ని కేసుల్లో మీడియా చూపించే వార్తలు న్యాయ విచారణపై ప్రభావం చూపుతున్నాయని, ఇలా వాస్తవానికి దగ్గరగా ఉన్నట్లు ఎంతో మంది ప్రశ్నలు వేస్తారు. కానీ క్షేత్ర స్థాయిలో నిజానిజాలు బేరీజు వేసుకుని నైతిక విలువలకు కట్టుబడి పని చేయాలి’అని విద్యార్థులకు సూచించారు. రాజ్యాంగానికి రక్షణ కవచంలా న్యాయ వ్యవస్థ ఉందని.. అది దెబ్బతింటే అరాచకాలు, అన్యాయాలు పెరిగిపోతాయన్నారు. ఎక్కడ అన్యాయం జరిగినా చివరికి కోర్టుల దగ్గరకే వస్తారని, అలాంటి న్యాయ వృత్తిలోకి అడుగుపెట్టబోయే విద్యార్థులంతా నిత్య అధ్యయనం చేస్తూ ధైర్యంగా ముందడుగు వేయాలన్నారు. బంగారు పతకాల పంట కార్యక్రమంలో 409 మంది విద్యార్థులకు వివిధ న్యాయ శాస్త్ర పట్టాలను ప్రదానం చేశారు. 49 బంగారు పతకాలను ప్రదానం చేయగా ఎల్ఎల్బీ విద్యార్థిని తన్వీ తహిన 11.. కరణ్ గుప్తా, శుభ్రా త్రిపాఠి 6 చొప్పున అందుకున్నారు. దేశంలో 5వ స్థానంలో నల్సార్ దేశంలోని నాలుగు వందల వర్సిటీల్లో నల్సార్‌కు 5వ స్థానం లభించిందని నల్సార్ వైస్ చాన్స్‌లర్ పైజన్ ముస్తఫా చెప్పారు. తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు చట్టాలు చేసేటపుడు నల్సార్ తమ వంతు సహకారం అందిస్తోందని, ఎన్నికలకు సంబంధించిన అంశాలపై భారత ఎన్నికల సంఘంతో ఎంవోయూ కుదుర్చుకున్నామని వెల్లడించారు. నల్సార్ వర్సిటీ చాన్స్‌లర్, ఉమ్మడి తెలుగు రాష్ట్రాల హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టి.రాధాకృష్ణన్ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. ప్రముఖ న్యాయ కోవిదుడు ప్రొఫెసర్ ఉపేంద్ర భక్షికి కార్యక్రమంలో గౌరవ డాక్టరేట్ ప్రదానం చేశారు. భక్షి మాట్లాడుతూ.. జీవించే హక్కు గురించి రాజ్యాంగంలో చిన్నగా ఉన్నా కోర్టులు విశాల భావజాలంతో తీర్పులు ఇచ్చాయని గుర్తు చేశారు. పర్యావరణ హితంగా సాగిన జీవనం.. ఇప్పుడు మనిషి మాత్రమే ముఖ్యమనే ధోరణిలో సాగుతోందని, రానున్న కాలంలో ఎదురయ్యే ప్రధాన సమస్యల్లో పర్యావరణం ఒకటని హెచ్చరించారు. కార్యక్రమంలో రాష్ట్ర న్యాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, సుప్రీంకోర్టు రిటైర్డు న్యాయమూర్తులు జస్టిస్ ఎస్ఎస్ఎం ఖాద్రి, జస్టిస్ పి.వెంకట్రామరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఏపీలో లైంగిక వేదింపుల కేసులపై నాల్సా రీపోర్ట్
-
నేడు నల్సార్‌కు ఉపరాష్ట్రపతి
హైదరాబాద్: శామీర్‌పేట్ మండల కేంద్రంలోని నల్సార్ లా వర్సిటీ వేదికగా సెప్టెంబర్ 3 నుంచి 10 వరకు అంతర్జాతీయ న్యాయసంస్థ 78వ సమావేశాలు నిర్వహించనున్నట్లు నల్సార్ లా వర్సిటీ వీసీ ప్రొఫెసర్ ఫైజాన్ ముస్తఫా, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి శనివారం తెలిపారు. ఆదివారం సాయంత్రం నిర్వహించే సమావేశం ప్రారంభోత్సవాలకు ముఖ్యఅతిథిగా ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడుతో పాటు పలువురు ప్రముఖులు హజరవుతారన్నారు. -
ఇలా జోష్..
-
స్వతంత్రంగా లా కోర్సును ప్రారంభించండి
నల్సార్ యూనివర్సిటీని కోరిన సీఎం కేసీఆర్ మూడేళ్ల ఈ కోర్సుకు ప్రభుత్వమే పూర్తి ఆర్థిక సాయం అందిస్తుంది వర్సిటీ 15వ స్నాతకోత్సవంలో ప్రసంగించిన ముఖ్యమంత్రి సాక్షి, హైదరాబాద్: జాతీయ ఉమ్మడి ప్రవేశపరీక్ష (సీఎల్ఏటీ)తో సంబంధం లేకుండా స్వతంత్రంగా మూడేళ్ల లా కోర్సును ప్రారంభించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయాన్ని కోరారు. తద్వారా దేశంలోనే ఈ కోర్సును ప్రారంభించిన మొదటి వర్సిటీ నల్సారే అవుతుందన్నారు. ఈ మూడేళ్ల ఎల్ఎల్బీ కోర్సులో 50% సీట్లను తెలంగాణ వాసులకే కేటాయించాలన్నారు. ఈ కోర్సుకు ప్రభుత్వమే పూర్తి ఆర్థికసాయాన్ని అందిస్తుందన్నారు. శనివారం హైదరాబాద్‌కు సమీపంలోని శామీర్పేటవద్ద ఉన్న నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయం 15వ స్నాతకోత్సవానికి ముఖ్యఅతిథిగా హాజరైన సీఎం కేసీఆర్ ఈ సందర్భంగా విద్యార్థులనుద్దేశించి ప్రసంగించారు.1998లో నల్సార్ ఏర్పాటైన నాటినుంచి స్నాతకోవత్సంలో ప్రసంగించిన తొలి సీఎంగా ఘనతను కేసీఆర్ దక్కించుకున్నారు. న్యాయవాదులకూ నైపుణ్యం.. న్యాయాధికారులు, న్యాయమూర్తులు నైపుణ్యాలను పెంచుకునేందుకు జ్యుడీషియల్ అకాడమీ ఉందని, నాయ్యవాదులకు మాత్రం దేశంలో ఎక్కడా కూడా అటువంటి సదుపాయం లేదన్నారు. న్యాయవాదుల కోసం ‘బార్–ఎట్–లా’కోర్సును ప్రారంభించాలని నల్సార్‌ను కోరారు. తద్వారా న్యాయవాదులకు తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకునే అవకాశం ఉంటుందన్నారు. అకడమిక్ స్టాఫ్ కాలేజీ, హాస్టళ్లు, పరిశోధనా కేంద్రాల నిర్మాణం కోసం నల్సార్ వర్సిటీ ఎదురుగా ఉన్న 22 ఎకరాల భూమిని కేటాయిస్తామని, ఈ విషయంలో హైకోర్టుతో సంప్రదింపులు జరుపుతామన్నారు. వర్సిటీ కోసం నిధులను కేటాయించేందుకు కట్టుబడి ఉన్నామన్నారు. ఉన్నత విద్యలో జాతీయస్థాయి అత్యుత్తమ కేంద్రాలను ఏర్పాటు చేసేం దుకు తమ ప్రభుత్వం కృషి చేస్తుందని కేసీఆర్ తెలిపారు. తమది కొత్త రాష్ట్రమని, ఈ రాష్ట్రంలోని విద్యా సంస్థలపై కీలక బాధ్యతలు ఉన్నాయని అన్నారు. ల్యాండ్ క్లినిక్‌ల పనితీరు అద్భుతం... వరంగల్ జిల్లాలో నల్సార్ ఆధ్వర్యంలో జరిగిన ల్యాండ్ క్లినిక్‌లు భూ వివాదాలకు పరిష్కారం చూపడంలో అత్యద్భుత పనితీరును చూపాయని కేసీఆర్ అన్నారు. వెనుకబడిన తరగతుల కోసం ప్రభుత్వం అనేక పథకాలను ప్రారంభించిందని, ఆ వర్గాలు ఈ పథకాల ద్వారా లబ్ధి పొందడం పూర్తిస్థాయిలో జరగడం లేదన్నారు. నల్సార్ వర్సిటీ తమ ల్యాండ్ క్లినిక్‌ల ద్వారా ప్రభుత్వ పథకాల నుంచి లబ్ధి పొందేందుకు, వివాదాల పరిష్కారానికి ప్రజలకు సాయం చేయాలని కోరారు. తన బంగారు తెలంగాణ స్వప్నం సాకారం కావడంలో నల్సార్ కీలక భూమిక పోషించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి, నల్సార్ చాన్సలర్ జస్టిస్ రమేశ్ రంగనాథన్, సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తులు జస్టిస్ ఎస్.ఎం.ఖాద్రీ, జస్టిస్ పి.వెంకటరామారెడ్డి, మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యుడు మల్లారెడ్డి, ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి, నల్సార్ వైస్ చాన్స్‌లర్ ఫైజన్ ముస్తఫా, రిజిస్ట్రార్ వి.బాలకృష్ణారెడ్డి, పలువురు న్యాయమూర్తులు, బార్ కౌన్సిల్ సభ్యులు, ఎమ్మెల్సీ రాంచందర్‌రావు, మేడ్చల్ జిల్లా గ్రంథాలయాల చైర్మన్ భాస్కర్‌యాదవ్, ఎంపీపీల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖర్‌యాదవ్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వివిధ కోర్సుల్లో ప్రతిభ కనబరచిన విద్యార్థులకు సీఎం కేసీఆర్ స్వర్ణ పతకాలను అందచేశారు. అత్యుత్తమ ప్రతిభ చూపిన రాహుల్ మహంతి అనే విద్యార్థి ఏకంగా 11 బంగారు పతకాలు సాధించారు. సామాన్యులకూ విజ్ఞానం అందించండి.. న్యాయవాద వృత్తిని స్వీకరించే వృత్తి నిపుణులకే విద్యా కార్యక్రమాలను పరిమితం చేయవద్దని సీఎం కేసీఆర్ వర్సిటీని కోరారు. సామాన్యులకు సైతం న్యాయ విజ్ఞానాన్ని అందించాలని, తద్వారా వారికీ, సమాజానికీ మంచి జరుగుతుందన్నారు. హైదరాబాద్ సిటీ క్యాంపస్‌లో సివిల్ జడ్జి పోస్టులకు, ఉన్నత న్యాయ సర్వీసుల పరీక్షలకు సిద్ధమయ్యే ఔత్సాహికులకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. సిటీ క్యాంపస్ పాతబడిపోయిందని, దానికి మరమ్మతులు చేసి పునరుద్ధరించాల్సి ఉందన్నారు. సిటీ క్యాంపస్ విషయంలోనూ అవసరమైన సహా యం అందించేందుకు ప్రభుత్వం ఎప్పు డూ సిద్ధంగా ఉందన్నారు. -
నా కృషితోనే హైదరాబాద్ అభివృద్ధి
♦ ఐఎస్బీ, ఉర్దూ, నల్సార్ వర్సిటీలు ఏ ♦ ఐఎస్బీ, ఉర్దూ, నల్సార్ వర్సిటీలు ఏర్పాటు చేసింది నేనేఐఎంటీ ఐదో స్నాతకోత్సవంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సాక్షి, రంగారెడ్డి జిల్లా: తన కృషితోనే హైదరాబాద్ అభివృద్ధి చెందిందని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ సమీపంలో ఉన్న ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ టెక్నాలజీ (ఐఎంటీ) ఐదో స్నాతకోత్సవం ఆ క్యాంపస్‌లో మంగళవారం ఘనంగా జరిగింది. ఐఎంటీ అధ్యక్షుడు, కేంద్ర మాజీ మంత్రి కమల్‌నాథ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి చంద్రబాబు జ్యోతి ప్రజ్వలన చేశారు. ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు గోల్డ్ మెడల్స్, ప్రశంసా పత్రాలు అందజేశారు. ఆయన మాట్లాడుతూ ‘‘1995 ప్రాంతంలో హైదరాబాద్ అంటే జంటనగరాలు మాత్రమే. నా కృషితోనే ఈ జాబితాలో సైబరాబాద్ చేరింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి అధిక ప్రాధాన్యం ఇచ్చి హైటెక్ సిటీకి రూపకల్పన చేశా. అలాగే ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ), ఐఐఐటీ, ఉర్దూ, నల్సార్ వర్సిటీల స్థాపన జరిగింది. హైదరాబాద్ చుట్టూ ఉన్న ఔటర్ రింగు రోడ్డు కూడా నా కృషితోనే సాధ్యపడింది’ అని చంద్రబాబు అన్నారు. కొత్తగా ఆలోచిస్తే మంచి ఫలితాలు వస్తాయని.. అందుకు తాను అమలు చేసిన మూడు విషయాలను ఉదాహరణగా ప్రస్తావించారు. విశాఖపట్నంలో ఇటీవల ధ్వంసమైన సాధారణ వీధిలైట్ల స్థానంలో ఎల్ఈడీ బల్బులను బిగించినట్లు చెప్పారు. ఈ విధానానికి పైసా ఖర్చు కాకపోవడంతోపాటు 40 శాతం విద్యుత్ ఆదా అవుతోందని అన్నారు. అలాగే ఏపీ రాజధాని అమరావతి నిర్మాణం కూడా ఇదే కోవలోకి వస్తుందన్నారు. రైతుల నుంచి తీసుకున్న భూమికి బదులుగా అభివృద్ధి చేసిన స్థలాలను రైతులకు అందజేస్తున్నామని.. ఇది గతంకంటే ఐదారు రెట్లు అధిక విలువ కలిగి ఉందన్నారు. దీంతో భూములు ఇవ్వడానికి రైతులు పెద్ద ఎత్తున ఆసక్తి కనబర్చుతున్నట్లు చెప్పారు. చైనా, అమెరికాలో బంధాలన్నీ యాంత్రికమై పోయాయని.. ఇక్కడ ఆ పరిస్థితి తీసుకురావద్దని విజ్ఞప్తి చేశారు. ఏ దేశానికీ లేని గొప్ప సంస్కృతి, వారసత్వ సంపద మన సొంతమని.. దాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో ఐఎంటీ డైరెక్టర్ డాక్టర్ సతీష్ ఐలవాడి తదితరులు పాల్గొన్నారు. -
దళారీ వ్యవస్థకు మంగళం!
⇒ రాష్ట్ర కొత్త మార్కెటింగ్ చట్టంలో కీలక అంశాలు ⇒ నల్సార్ వర్సిటీ ద్వారా ముసాయిదా బిల్లు సిద్ధం ⇒ ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లోనే ప్రవేశపెట్టేందుకు కసరత్తు సాక్షి, హైదరాబాద్: వ్యవసాయ మార్కెట్ యార్డుల్లో రైతులను పీల్చి పిప్పి చేస్తున్న దళారీ వ్యవస్థకు మంగళం పాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. రైతుల పంటలకు తగిన ధర దక్కేలా, మార్కెట్లో వివిధ రకాల దోపిడీలకు చెక్ పెట్టేలా కొత్త మార్కెటింగ్ చట్టాన్ని రూపొం దిస్తోంది. నల్సార్ న్యాయ విశ్వవిద్యాల యం ఆధ్వర్యంలో రూపుదిద్దిన కొత్త చట్టంలోని అం శాలపై వ్యవసాయ మార్కెటింగ్ శాఖ అధికా రులు కసరత్తు చేస్తున్నారు. దీనికి తుది మెరు గులతో ముసాయిదా బిల్లు తయారు చేసి, ప్రస్తుత బడ్జెట్ సమావేశాల్లోనే ప్రవేశపెట్టను న్నట్లు సమాచారం. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి కొత్త చట్టం ప్రకారమే మార్కెట్లో కార్యకలా పాలు జరిగేలా చూడాలని నిర్ణ యించారు. మార్కెట్ రుసుము నుంచి రైతులకు విముక్తి ఇప్పటివరకు మార్కెట్లో వివిధ రకాల రుసుములన్నీ రైతులే చెల్లించాల్సిన పరిస్థితి ఉంది. కొత్త చట్టంతో దీనికి చరమగీతం పాడనున్నారు. రైతులు తమ ధాన్యాన్ని మార్కెట్‌కు తీసుకొచ్చే వరకు అయ్యే ఖర్చులనే భరిస్తారు. మార్కెట్లోకి ప్రవేశించాక ఎటువంటి రుసుములూ చెల్లించాల్సిన అవసరం ఉండకుండా కొత్త చట్టం అవకాశం కల్పిస్తుందని మార్కెటింగ్ అధికారులు చెబుతున్నారు. ఇక కమీషన్ ఏజెంట్లు ప్రస్తుతం రైతుల నుంచే కమీషన్ వసూలు చేస్తున్నారు. కొత్త చట్టంతో దీన్ని రద్దు చేస్తారు. వ్యాపారులే కమీషన్‌ను చెల్లించాల్సి ఉంటుంది. ఈ విధానాన్ని కర్ణాటక, మహారాష్ట్రల్లో అమలు చేస్తున్నారు. మరోవైపు కర్ణాటకలో అమల్లో ఉన్న తరహాలో రివాల్వింగ్ ఫండ్‌ను కూడా ఏర్పాటు చేయనున్నారు. రైతులకు కనీస మద్దతు ధర (ఎంఎస్పీ) లభించనప్పుడు ఈ రివాల్వింగ్ ఫండ్ రైతులకు చేయూతనిస్తుంది. అలాగే కేంద్ర మార్కెట్ ఫండ్‌కు బదులుగా రాష్ట్ర మార్కెట్ ఫండ్‌ను ఏర్పాటు చేస్తారు. మార్కెట్ యార్డుల్లోనూ, చెక్‌పోస్టుల వద్ద రైతులు తీసుకొచ్చే పండ్లు, కూరగాయలకు ప్రస్తుతం వసూలు చేస్తున్న రుసుమును కూడా రద్దు చేస్తారు. -
న్యాయవ్యవస్థలోకి రండి
న్యాయ విద్యార్థులకు సుప్రీం సీజే జస్టిస్ ఠాకూర్ పిలుపు * బహుళ జాతి సంస్థల్లో మగ్గొద్దు.. అక్కడ డబ్బున్నా సంతృప్తి ఉండదు * ఒకప్పుడు సీటు దొరక్కపోతే లా.. ఇప్పుడు బాగా డిమాండున్న కోర్సు * న్యాయవాదులు ఆర్జిస్తున్నంత డబ్బు ఎవరూ ఆర్జించడం లేదు * సవాళ్లను ఎదుర్కొని ముందుకెళ్లాలని సూచన సాక్షి, హైదరాబాద్: న్యాయవ్యవస్థ ఎదుర్కొంటున్న సవాళ్లను సమర్థంగా ఎదుర్కొని, ప్రజలకు సత్వర న్యాయం అందేందుకు న్యాయవ్యవస్థలోకి రావాలని యువ న్యాయ విద్యార్థులను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ తీరథ్ సింగ్ ఠాకూర్ కోరారు. న్యాయ విద్య పూర్తయిన తరువాత బహుళ జాతి సంస్థల్లో చేరితే ఆర్థికంగా లాభమున్నా, వృత్తిపరంగా ఆత్మ సంతృప్తి ఉండదన్నారు. హైదరాబాద్ శివార్లలోని శామీర్‌పేటలో ఉన్న నల్సార్ వర్సిటీ 14వ స్నాతకోత్సవ కార్యక్రమానికి జస్టిస్ ఠాకూర్ ముఖ్య అతిథిగా హాజ రయ్యారు. ఉమ్మడి హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్, సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తులు జస్టిస్ ఖాద్రీ, జస్టిస్ పి.వెంకటరామిరెడ్డి, పలువురు హైకోర్టు న్యాయమూర్తులు, నల్సార్ వీసీ ఫైజన్ ముస్తాఫా, రిజిస్ట్రార్ వి.బాలకిష్టారెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వివిధ కోర్సులను పూర్తి చేసిన వారికి జస్టిస్ ఠాకూర్ డిగ్రీలు ప్రదానం చేశారు. ఉత్తమ ప్రతిభ కనబరచిన వారికి బంగారు పతకాలు అందచేశారు. తాన్యా చౌదరి అనే విద్యార్థిని ఏకంగా 17 బంగారు పతకాలు సాధించారు. ప్రజలకు సేవ చేయండి డిగ్రీల ప్రదానం అనంతరం జస్టిస్ ఠాకూర్ మాట్లాడారు. ‘‘ఒకప్పుడు లా కోర్సు అంత పాపులర్ కాదు. ఇతర కోర్సుల్లో సీట్లు దొరక్కపోతే లా కోర్సులో చేరేవారు. ఇప్పుడు దేశంలో అత్యంత డిమాండ్ ఉన్న కోర్సుల్లో లా ఒకటి. దేశంలో ప్రస్తుతం విజయవంతమైన న్యాయవాదులు ఆర్జిస్తున్నంత డబ్బును ఇతర రంగాల్లో ఏ వ్యక్తీ ఆర్జించడం లేదు. న్యాయవ్యవస్థలోకి వచ్చి కొన్ని సవాళ్లను ఎదుర్కొని, కొంత కృషి చేస్తే మీరూ ఆ స్థాయికి చేరుకోగలరు. ఈ వృత్తిలో చూడాల్సింది ఎంత డబ్బు సంపాదించామని కాదు.. కేసులను వాదించడం ద్వారా, తీర్పులివ్వడం ద్వారా ఎంత ఆత్మ సంతృప్తి సాధించామన్నదే. మీరు దేవుళ్ల ప్రతినిధులు. వారు చేయాల్సిన న్యాయాన్ని మీ చేత చేయించేందుకు మీ చేత న్యాయశాస్త్రం అభ్యసింపజేశారు. జడ్జీలు తమ బాధ్యతలను తపస్సులాగా నిర్వర్తించాల్సి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఘోర తపస్సు చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం మేం అదే చేస్తున్నాం. వీటన్నింటికీ వెనుకాడకుండా ముందుకెళితే ప్రజలు మనల్ని నెత్తినపెట్టుకుని ఆరాధిస్తారు..’’ అని పేర్కొన్నారు. మనతో పాఠాలు చెప్పించుకోవాలి దేశంలో న్యాయ పాలన సక్రమంగా సాగేందుకు యువ న్యాయ విద్యార్థులు న్యాయవ్యవస్థలోకి రావాలని జస్టిస్ ఠాకూర్ పేర్కొన్నారు. మనకు ఇప్పుడు 19 న్యాయ యూనివర్సిటీలు ఉన్నాయని, అయినా ఎల్ఎల్బీ తరువాత ఉన్నత చదువుల కోసం పాశ్చాత్య దేశాల వైపు చూస్తున్నామని చెప్పారు. బోధనా రంగంలో నాణ్యత లేకపోవడమే అందుకు కారణమన్నారు. ఈ పరిస్థితిని అధిగమించి బోధనా రంగంలో ఉత్తమ ప్రమాణాలను నెలకొల్పితే మనం ఆక్స్ఫర్డ్, హార్వర్డ్ వంటి యూనివర్సిటీలకు వెళ్లి నేర్చుకోవాల్సిన అవసరం లేదని... వాళ్లే ఇక్కడికొచ్చి మన చేత పాఠాలు చెప్పించుకుంటారని చెప్పారు. న్యాయమూర్తుల కొరత ఎక్కువగా ఉంది సత్వర న్యాయం కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారని, కానీ న్యాయమూర్తుల కొరత ఎంతో ఉందని జస్టిస్ ఠాకూర్ పేర్కొన్నారు. అమెరికాలో పది లక్షల జనాభాకు 150 మంది జడ్జీలుంటే, మనదేశంలో 18 మంది మాత్రమే ఉన్నారన్నారు. దేశంలోని అన్ని కోర్టుల్లో 3 కోట్ల పెండింగ్ కేసులుంటే.. వాటిని పరిష్కరించేందుకు 18 వేల మంది జడ్జీలే ఉన్నారన్నారు. 5, 10, 20 ఏళ్ల నాటి కేసులు ఇప్పటికీ పెండింగ్‌లో ఉన్నాయని.. ఐదేళ్లకు పైబడి కొనసాగుతున్న కేసులను సున్నాకు తీసుకురావాలన్న లక్ష్యంతో తామంతా పనిచేస్తున్నామని చెప్పారు. న్యాయవ్యవస్థలోకి వచ్చిన తరువాత ఎందుకొచ్చామా అనే భావన ఉండొద్దని విద్యార్థులకు సూచించారు. ‘‘నేను మొదట ఇంజనీరింగ్‌లో చేరాను. తర్వాత మా నాన్న సూచన మేరకు లా లో చేరాను. 22 ఏళ్ల పాటు న్యాయవాదిగా, 23 ఏళ్లుగా న్యాయమూర్తిగా ఉన్నాను. ఈ 45 ఏళ్లలో ఎన్నడూ కూడా ఈ వృత్తిలోకి ఎందుకొచ్చానా అని భావించలేదు. బోధన, వైద్య వృత్తులు గొప్పవే.. వాటన్నింటి కంటే న్యాయ వృత్తి ఇంకా గొప్పది..’’ అని జస్టిస్ ఠాకూర్ పేర్కొన్నారు. -
స్నాతకోత్సవానికి నల్సార్ ముస్తాబు
శామీర్‌పేట్: నల్సార్ న్యాయవిశ్వవిద్యాలయం ప్రాంగణం లో నేటి సాయంత్రం 4గంటలకు 14వ స్నాతకోత్సవ వేడుకలను నిర్వహిస్తున్నట్లు నల్సార్ లా యూనివర్సీటీ వైస్ చాన్సలర్ ఫ్రొ.ఫైజాన్‌ముస్తఫా, రిజి్ట్రార్ బాలకిష్టారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా శుక్రవారం ఏర్పాట్లను పరిశీలించారు. నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయంలోని జస్టీస్ సిటీ ప్రాంగణంలో నిర్వహించే 14వ స్నాతకోత్సవాలను అట్టహాసంగా నిర్వహించేం దుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా చీఫ్ జస్టీస్ ఆఫ్ ఇండియా టీఎస్.ఠాకూర్, విశిష్ట అతిథిగా తెలం గాణ -ఆంధ్రప్రదేశ్ (ఉమ్మిడి) రాష్ట్రాల సంయు క్త హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, నల్సార్ చాన్సలర్ జస్టీస్ రమేశ్‌రంగనాథన్‌లతో పాటుపలువురు ప్రముఖులు విచ్చేస్తున్నట్లు తెలిపారు. -
సీజేఐకి గవర్నర్ విందు
సాక్షి, హైదరాబాద్: నల్సార్ యూనివర్సిటీ స్నాతకోత్సవంలో పాల్గొనేందుకు హైదరాబాద్ వచ్చిన భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టీఎస్ ఠాకూర్ శుక్రవారం సాయంత్రం గవర్నర్ నరసింహన్‌ను రాజ్‌భవన్‌లో కలిశారు. సీజేఐ గౌరవార్థం గవర్నర్ ఆయనకు విందు ఇచ్చారు. -
ఆధారాలు లేని అభ్యంతరాలు చెల్లవు!
- నల్సార్ లా యూనివర్సిటీ రిజిస్ట్రార్ బాలకిష్టారెడ్డి - సాదాబైనామా-క్రమబద్ధీకరణపై నల్సార్/ల్యాండెసా పుస్తకావిష్కరణ సాక్షి, హైదరాబాద్: భూమిని కొనుగోలు చేసిన రైతు పేరిట ఉన్న సాదాబైనామాలను క్రమబద్ధీకరించే విషయమై హక్కుదారులు/వారసులు తగిన ఆధారాల్లేకుండా అభ్యంతరపెట్టినా అది చెల్లదని నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ వి.బాలకిష్టారెడ్డి స్పష్టం చేశారు. సాదాబైనామా-క్రమబద్ధీకరణ ప్రక్రియకు సంబంధించిన వివిధ అంశాలతో నల్సార్ వర్సిటీ, ల్యాండెసా/ఆర్డీఐ సంయుక్తంగా రూపొందించిన పుస్తకాన్ని శుక్రవారం ఇక్కడ ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ల్యాండెసా డెరైక్టర్ సునీల్‌కుమార్ మాట్లాడుతూ రికార్డ్ ఆఫ్ రైట్స్(ఆర్వోఆర్) చట్టం మేరకు తెల్లకాగితంతోపాటు రిజిస్ట్రేషన్ కాని ఎటువంటి పత్రాలపై రాసుకున్న ఒప్పందాలనైనా క్రమబద్ధీకరించేందుకు వెసులుబాటు ఉందన్నారు. సాదాబైనామా ప్రక్రియపై రెవెన్యూ యంత్రాంగానికి, లబ్ధిదారులకు సరైన అవగాహన కల్పించడమే ఈ పుస్తకం ప్రధాన ఉద్దేశమన్నారు. ఇందులో దరఖాస్తు ప్రక్రియ నుంచి టైటిల్ డీడ్ పొందేవరకు అనుసరించాల్సిన పద్ధతులు, చెక్‌లిస్టులు, హైకోర్టు తీర్పులు, దరఖాస్తు నమూనా.. తదితర అంశాలను పొందుపరిచామన్నారు. భూమిని కొన్న వ్యక్తులు మరణించినా చట్టబద్ధమైన వారసులు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. యాజమాన్యహక్కులపై న్యాయస్థానాల్లో వివాదాలున్నట్లయితే సదరు దరఖాస్తులను అంగీకరించరని చెప్పారు. క్రమబద్ధీకరణ ప్రక్రియ ఇలా.. ► గ్రామీణ ప్రాంతాల్లో సాదాబైనామా ద్వారా జూన్ 2, 2014లోపు కొనుగోలు చేసిన వ్యవసాయ భూమిని సాగులో ఉన్న చిన్న, సన్నకారు రైతులు క్రమబద్ధీకరణ కోసం ఫారం 10లో వివరాలను నింపి మీసేవా ద్వారా తహసీల్దారుకు ఈ నెల 22లోగా దరఖాస్తు చేసుకోవాలి. ► రైతులు దరఖాస్తుతోపాటు సమర్పించిన సాదాబైనామాలోని వివరాలను తహసీల్దారు సరిచూసి, పహాణీ, ఆర్వోఆర్ 1బి, ఈసీ(ఎన్కంబరెన్స్ సర్టిఫికెట్)లను పరిశీలించాలి. విచారణ ని మిత్తం తేదీలను తెలుపుతూ సంబంధిత వ్యక్తులకు నోటీసు జా రీ చేయాలి. విచారణ రోజున దరఖాస్తులోని అంశాల ప్రకారం దరఖాస్తుదారు సాగులో ఉన్న విషయాన్ని నిర్ధారించుకోవాలి. ► క్షేత్ర పరిశీలనలో రెవెన్యూ సిబ్బంది దృష్టికి వచ్చిన అంశాలన్నింటినీ తహసీల్దారు పరిశీలించి వాటిని వెబ్సైట్లో పొందుపరచాలి. వాస్తవికతను నిర్ధారించి ఫారం 13బి జారీ చేయాలి. ఒకవేళ దరఖాస్తును తిరస్కరించినట్లైతే కారణాలను తెలుపుతూ ఎండార్స్మెంట్ ఇవ్వాలి. ► సక్రమంగా ఉన్న దరఖాస్తులకు సంబంధించి ఫారం 13సి ద్వారా సబ్ రిజిస్ట్రార్‌కు వివరాలను తెలియజేయాలి. తహసీల్దారు తెలిపిన వివరాల మేరకు సబ్‌రిజిస్ట్రార్ సంబంధిత రిజిస్టర్లో వాటిని నమోదు చేస్తారు. అనంతరం ఫారం 13బి మేరకు పాస్‌పుస్తకం, టైటిల్ డీడ్‌ను తహసీల్దారు అందజేస్తారు. తరచూ ఉత్పన్నమయ్యే ప్రశ్నలకు జవాబులిలా.. ► తెల్లకాగితం, స్టాంపు పేపరు, నోటరీ చేయించిన పత్రాలను కూడా సాదాబైనామాగానే పరిగణిస్తారు. ► సీసీఎల్ఏ ఉత్తర్వుల ప్రకారం సాదాబైనామా ఉంటేనే క్రమబద్ధీకరణ చేస్తారు. తెల్లకాగితంపై కొని గతంలో పట్టా కోసం దరఖాస్త్తు చేసుకున్నవారూ క్రమబద్ధీకరణకు తాజాగా దరఖాస్తు చేసుకోవచ్చు. ► దరఖాస్తుతోపాటు ఆధార్, సాదాబైనామా, పహాణీ, సాగు చేసుకుం టున్నట్లుగా రుజువుల నకళ్లను జతపరచాలి. బ్యాంకు రుణం పొం దినా, కరెంట్ కనెక్షన్, బోర్వెల్.. తదితర ఆధారాలు సమర్పించాలి. ► సాధారణంగా సాదాబైనామా ద్వారా భూమిని అమ్మిన వ్యక్తులు లేదా వారి వారసులు అనుమతి అవసరమే. ఒకవేళ వారు అభ్యంతరం చెప్పినట్లయితే తగిన ఆధారాలతో నిరూపించాలి. ► పహాణీలో నమోదు కాకున్నా, భూమి కొనుగోలుదారుడి అనుభవంలో ఉండి సాగు చేసుకుంటున్నట్లయితే తహ సీల్దారు గ్రామంలో విచారించి పెద్దల వాంగ్మూలంతో క్రమబద్ధీకరణ చేయవచ్చు. ► అసైన్మెంట్ భూములను అమ్మడం, కొనుగోలు చేయడం నేరం. ఆయా భూములపై ఎటువంటి లావాదేవీలు చెల్లవు. కొన్నవారికి జైలుశిక్షతో పాటు రూ.2 వేల వరకు జరిమానా కూడా విధిస్తారు. ► సాదాబైనామాలపై ఐదెకరాలకు మించి భూమిని కొన్నట్లయితే ఈ క్రమబద్ధీకరణ ప్రక్రియ వర్తించదు. ఐదెకరాల లోపు అయితే రిజిస్ట్రేషన్ ఫీజు, స్టాంప్‌డ్యూటీలను ప్రభుత్వం మినహాయించింది. ► అన్నదమ్ముల పంపకాల పత్రాన్ని సాదాబైనామాగా పరిగణించరు. -
ఉపాధికి ఇంగ్లిష్ మంత్రం?
విశ్లేషణ ఇంటి భాషలోనే వ్యక్తీకరణ సమస్యలు ఎదుర్కొనే పిల్లలు ఇంగ్లిష్‌లో నేర్పు పొందుతారనడంలో హేతువు ఏమిటి? ఇంగ్లిష్ మీడియంలోనే విద్య ముగించినవారు ఆ చదువు ద్వారా మాత్రమే పైకి ఎదుగుతున్నారా? తల్లి భాషలో కొత్త తెలివి తేటలు నేర్పే ప్రాథమిక చదువు నేర్చు కోవడం, దానిని నేర్పడం పిల్లల హక్కు, ఒక బాధ్యత. ప్రస్తుతం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రా లలో తెలుగులో చదువుకోవడం ప్రయోజనకరం కాదన్న భావన బలంగా ఏర్పడి ఉంది. ఇంగ్లిష్ మీడియంలో చదువుకోవడంవల్ల మాత్రమే తమ పిల్లలు బాగుపడతారు అని నిరుపేద తల్లిదండ్రులు కూడా భావించే స్థితి వచ్చింది. ‘కులవృత్తులు కడుపు నింపవు కనీస గౌరవాన్ని ఇవ్వవు, ప్రభుత్వ రంగంలో ఉద్యోగాలు అందరికీ రావు, సంపద సృష్టి, బతుకుదెరువుల సృష్టి ముఖ్యంగా మార్కెట్టులో జరుగుతుంది, అక్కడికి చేరుకోవా లంటే ఇంగ్ల్లిషు మాత్రమే మార్గం’ అనే తర్కం ఇంగ్లిష్ మీడియంలో చదవడం మాత్రమే నాణ్యమైన బతుకుదెరువు బాట చూపే చదువు అన్న భావనకు బలం చేకూర్చింది. ఈ తర్కంతోబాటు తెలుగులో చదువు చెప్పించేందుకు పూనుకున్న ప్రభుత్వాలు తెలుగులో చదువుకుంటున్న పిల్ల లకు అందుబాటులో ఉండే రీతిలో అనేక శాస్త్ర సంబంధ పుస్త కాలను యూరోపియన్ తదితర భాషల నుండి తెలుగులోకి అను వదించి అందుబాటులోకి తేక పోవడం. తెలుగు మీడియం స్కూళ్లలో చదువుతున్న పిల్లలకు కనీస వ్యక్తీకరణ సామర్థ్యాలను మెరుగుపరచుకునే వ్యూహం నిర్మించకపోవడం, తల్లి భాషలో నేర్పడం ద్వారా ఇంగ్లిష్ ఇతర భాషలు నేర్పడం మీద శ్రద్ధ పెట్టకపోవడం అన్న సమస్యలూ తోడైనాయి. ఇక సర్కారు బడిలో పాఠాలు చెప్పే టీచర్లు నూటికి తొంభై శాతం తమ పిల్లలను తాము చదువు చెబుతున్న సర్కారు బడిలో చది వించక పోవడం, కాస్తో కూస్తో సంపాదనా సామర్థ్యం గల ప్రతి ఒక్కరూ తెలుగు మీడియం సర్కారు బడికి తమ పిల్లలను పంపక పోవడంతో ఇంగ్లిష్ మీడియంలో చదవ డమే నాణ్యమైన చదువు అనే భావానికి పునాదిని కల్పిం చింది. మొత్తంమీద సర్కారు స్కూల్ అంటేనే నాసిరకం అన్న భావన బలంగా మారింది. ముఖ్యంగా 1990ల నుండి సర్కారు తెలుగు మీడియం బడులలో చదువుకునే విద్యార్థుల ఆర్థిక సామాజిక స్వరూపం చూస్తే అది దారిద్య్రరేఖకు దిగువన గల వారి తోనూ, కుల శ్రేణిపరంగా చూస్తే పాలనకూ అధికారానికి దగ్గరగా లేని పాలిత, వెనుకబడిన కులాల పిల్లలతో నిండి పోయింది. సామాజిక పర్యవేక్షణ, సర్కారు పర్యవేక్షణ లోపించిన స్కూళ్లలో టీచర్లు చదువుచెప్పే ప్రక్రియకు దూరం అవడమూ మొదలైంది. ఈ స్థితిలో నాణ్యమైన చదువు అంటే అది ఇంగ్లీష్ మీడియంలో మాత్రమే అందు తుంది అనే అభిప్రాయం ఒక నిశ్చితమైన రూపం తీసు కున్నది. ‘ఉత్పాదకమైన మనుషులుగా మారడం కోసం, మార్కెట్ ఆర్థిక వ్యవస్థలోకి ప్రవేశం కోసం దళితులూ ఇతర వెనుకబడిన సమూహాల పిల్లలకు ఇంగ్లిష్‌లో నేర్పడం నేటి ప్రధాన అవసరం’ అనే సులభంగా తీసిపారేయలేని వాద నను చాలా ప్రభావవంతంగా దళిత, ఇతర ఉత్పత్తి కులాల నుండి ఎదిగొచ్చిన మేధావులు ముందుకు తెచ్చారు. వీట న్నింటి ఫలితంగా అన్ని ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లిష్ మీడియం ప్రవేశ పెట్టాలని నిర్ణయం జరిగిపోయింది. కాలంతోబాటు చదువు, అవసరాలు మారుతూ ఉంటాయి. చిన్న బాలశిక్ష, పెద్ద బాల శిక్షలను దాటి, బాషలు, పరిసరాల విజ్ఞానం, సాంఘిక, భౌతిక శాస్త్రాలు, గణితంతో కూడిన విద్యలోకి ప్రవేశించడం అటువంటి మార్పే. ఈ మార్పు ఎంతో పరిశోధనల తరువాత వచ్చింది. వ్యక్తీకరణ సామర్థ్యం, సామాజిక అవగాహనా సామర్థ్యం, పదార్థ విజ్ఞాన సామర్థ్యం. గణిత సామర్థ్యం, తార్కిక సామర్థ్యం అందించే ఉద్దేశంతో ఈ సిలబస్ మార్పు జరిగింది. ఈ అంశాలను తెలుగులో నేర్పడానికి ప్రయత్నాలు జరిగి అవి కొంత మంచి ఫలితాలనే ఇచ్చాయి. తల్లిభాష కేవలం భావ ప్రసార సాధనం మాత్రమే కాదు, అది సంక్లి ష్టమైన చింతనా సామర్థ్యానికి పనికివచ్చే కీలక సాధనం. సామాజిక, ఆర్థిక ఆధిపత్యాలను, అణచివేతనూ అర్థం చేసు కునేందుకు పనికివచ్చేది కూడా భాషే. తల్లి భాష కాని వేరొక భాష నేర్చుకునేందుకు అది కీలక సాధనం కూడా. ఇంగ్లిష్‌లో ఎటువంటి నేర్పు లేని నేపథ్యం నుంచి వస్తున్న విద్యార్థులకు ఆ భాషా పాటవాలను నేర్పేందుకు కూడా తల్లిభాషలో వ్యక్తీకరణ మెరుగుదల అవసరం. ఇప్పుడు మనకు ఇది అయిపులో లేదు. లిపిలేని తల్లిభాష, లిపిగల ప్రాంతీయ భాష, లిపి విస్తరణ గల భాష (ఉదా హరణకు కోయ భాష, తెలుగు, ఇంగ్లిష్)లలో మొదటి దానికన్నా తర్వాతది చాలా గొప్ప భాష అనే గొప్పతనపు భావనను నిర్మించుకున్నాం. ఇది మనలోని వర్ణ కుల ఆధిపత్య మానసిక తత్వానికి కొనసాగింపే. ఆయా భాష లకు ఆయా స్థాయిలలో ప్రయోజనం ఉంటుందని మనం గుర్తించడం లేదు. 1990ల మొదటి నుండి సగటున ప్రతి మూడు ఏళ్లకు ఒక సారి ఒక స్థిరత్వం లేని బోధన, అభ్యసన, మూల్యాంకనా ప్రయో గాలు చేసి సర్కారు బడిలో చదువు నేర్పే పద్ధతులను అస్థిరత్వానికి గురి చేశారు పాలకులు. టీచర్ల సంఘాలు ఈ అస్థిరత్వ ప్రయోగాలను గురించి చర్చ చేసింది తక్కువే. ఇక పాల కులు వడపోత ద్వారా వివిధ సామాజిక శ్రేణుల పిల్లలను ఎంపిక చేసుకునే ప్రభుత్వ రెసిడెన్షియల్స్ మీద ఎక్కువ శ్రద్ధ పెట్టినారు. ఈ పరిణామాల వల్ల మామూలు ప్రభుత్వ స్కూలు పట్ల సామాన్యులు కూడా నమ్మకం కోల్పోయే స్థితి దాపురించింది. ప్రైవేటు ఇంగ్లిష్ మీడియం స్కూలులో చెప్పే చదువే నాణ్యమైన చదువు అనీ, అటువంటి చదువునే సర్కారు ఇప్పుడు అందిస్తుందని చెబుతున్నారు తెలుగు నేలల్లో. తద్వారా నాణ్యమైన విద్య అందించడం అంటే ఏమిటి? అనే ప్రధాన ప్రశ్నకు అత్యంత సరళమైన సమాధానంగా ‘సర్కారు స్కూళ్లలో ఇంగ్లిష్ మీడియంలో బోధన’ ముందుకు వచ్చింది. నాసిరకం చదువుకు, నాణ్యమైన చదువుకు మాధ్యమంతో సంబంధం ఉండదన్న కనీస స్థాయి ఎరుక కొరవడ్డ స్థితిలోకి మనం వచ్చేశాం. తెలుగులో అందరికీ సార్వత్రిక విద్య అనే నాలుగు దశాబ్దాల ప్రయోగపు బాగోగులను లోతైన చర్చకు పెట్టకుండా ఇంగ్లిష్ మీడియం ఫార్ములాను గొప్పది అనుకుంటు న్నాము. మనం నిజంగానే ఈ విషయంలో ముందు చూపుతో ఆలోచిస్తున్నామా? ఒక మనిషి సమగ్ర వికాసానికీ, ఒక జీవిత కాలంలోనే మంచి ఆర్థిక, సామాజిక స్థితికి ఎదుగుదలకు, ఆ రకంగా లోకానికంతా పనికివచ్చే మనుషుల ఎదుగుదలకూ, సమానతా స్వేచ్ఛల సమతూకం సాధించే వ్యవస్థ నిర్మాణా నికీ, పనికివొచ్చే సర్కారుబడిని మెరుగుపరచుకోవడం అనేది ‘ఇంగ్లిష్ మీడియంలో బోధన’ అనే ఒకే ఒక మహిమ గల తాయత్తు ద్వారా సాధ్యం అని చెబుతున్నారు. అదే ఈనాడు సామాన్య ప్రజల కోరిక అని చెప్పుతున్నారు పాలకులు. కానీ నిజంగా ఆ తాయత్తు పని చేస్తుందా? సంక్లిష్టమైన సంవాదాత్మక ప్రశ్నలకు, చర్చతో, తర్కంతో సంబంధం లేని అత్యంత సరళమైన పాపులిస్ట్ ‘తాయత్తు’ సమాధానాల చరిత్ర గొప్పగా ఉన్న దాఖలాలు తక్కువే. హెచ్ వాగీశన్ వ్యాసకర్త అసిస్టెంట్ ప్రొఫెసర్ నల్సార్ యూనివర్సిటీ ఆఫ్ లా, హైదరాబాద్ మొబైల్: 9440253089 -
న్యూ కోర్స్
నల్సార్‌లో ఎంబీఏ (స్టార్టప్ మేనేజ్మెంట్) నల్సార్ యూనివర్సిటీ ఆఫ్ లా-హైదరాబాద్.. ఎంబీఏలో స్టార్టప్ మేనేజ్మెంట్ స్పెషలైజేషన్‌ను ప్రవేశపెట్టింది. దేశంలోనే తొలిసారిగా ఈ ఏడాది నుంచి ఈ కోర్సును అందించనున్నారు. పూర్తి వివరాలకు www.cms.nalsar.ac.in చూడొచ్చు.