‘నల్సార్’లో ఫిల్మ్ ఫెస్టివల్-15 షురూ.. | "Suru -15 nalsarlo Film Festival .. | Sakshi
Sakshi News home page

‘నల్సార్’లో ఫిల్మ్ ఫెస్టివల్-15 షురూ..

Published Sun, Mar 29 2015 3:15 AM | Last Updated on Tue, Oct 16 2018 8:54 PM

"Suru -15 nalsarlo Film Festival ..

శామీర్‌పేట్: నల్సార్‌లా యూనివర్సిటీలో చదువుతున్న ఎల్‌ఎల్‌బీ విద్యార్థులు శనివారం నల్సార్ ఫిల్మ్ ఫెస్టివల్-15 ని అట్టహాసంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా నల్సార్ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ అమితా దాండా హాజరై ఫిల్మ్ ఫెస్టివల్‌ను ప్రారంభించారు. రెండు రోజులపాటు కొనసాగే ఈ ఫిల్మ్ ఫెస్టివల్‌ను నల్సార్ ఆడిటోరియంలో ‘వెలైంట్ అండ్ కమ్యూనిటీ’ అనే అంశంతో రెండు లఘుచిత్రాలను ప్రదర్శించారు.

బెంగాల్‌లోని నందీ గ్రామంలో ఇద్దరు అమ్మాయిలు ఆత్మహత్యలు చేసుకున్న సంఘటనను ఆధారంగా చేసుకుని, వారి ఆత్మహత్యలకు కారణాలను వివరిస్తూ నిర్మించిన ‘ఇబాంగ్ బేవారిష్’ అనే బెంగాళి లఘుచిత్రంతోపాటు దేశంలో జనాభాతోపాటు చెత్త ఎలా పెరిగిపోతుందో వివరిస్తూ తీసిన రెండో చిత్రం ‘వేస్టింగ్’ అనే ఆంగ్ల లఘుచిత్రాలు ప్రదర్శించారు.
 
మహిళలపై జరుగుతున్న అన్యాయాలను చూపించిన తీరు, చెత్త ఎక్కడికక్కడ పేరుకుపోతుండటంతో వాటివల్ల వచ్చే నష్టాలను, చెత్తను డంపింగ్ చేసే కార్మికుల జీవన విధానాలు వివరించే ఈ చిత్రాలు ఎంతగానో ఆకర్షించాయి. జనాభాతో పాటు చెత్తవల్ల రాబోయే తరానికి ఎలాంటి పరిస్థితులకు దారి తీస్తుందో వివరించే ఇతివృత్తంగా సాగే చిత్రం వెస్టింగ్ (ఆంగ్లం) అందరినీ ఆలోచింప చేసేలా ఉంది.

రెండు రోజుల పాటు నిర్వహించే ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథులుగా లఘుచిత్రాల దర్శకులు దీబూలీనా (ఇబాంగ్ బేవరీష్ దర్శకులు), వేస్టింగ్ దర్శకులు అనిర్బిన్ దత్తా, టూపార్ట్ మూవీస్ దర్శకులు రూపేష్ కుమార్, నిర్వాహకులు ప్రతీ, దీపాంకర్, అద్రిచ, రాజు, వీణ సిద్దార్థ్, త్రీష్ తదితరులు పాల్గొన్నారు.
 
మంచి వేదిక..
మూడు సంవత్సరాలుగా ‘నల్సార్’లో లఘుచిత్రాలను ప్రదర్శిస్తున్నాం. ప్రదర్శనలతోపాటు చిత్ర దర్శకులు, నటీనటులను పరిచయం చేస్తున్నాం. సమాజంలో వస్తున్న మార్పులకు తాము ఎలాంటి వి ధులు నిర్వహించాలో? అవగాహన కల్పించేందుకు కృషిచేస్తున్నాం. ఫిల్మ్ ఫెస్టివల్ నిర్వహించడం ఆనందంగా ఉంది.
 - ప్రతీ, నల్సార్ లా యూనివర్సిటీ, ఎల్‌ఎల్‌బీ, 4వ సంవత్సరం , ఫెస్టివల్ నిర్వాహకురాలు
 
గర్వంగా ఉంది..
ఫిల్మ్ ఫెస్టివల్ అనగానే హీరో.. హీరోయి న్.. అనే నానుడికి దూరంగా సమాజంలో జరుగుతున్న మార్పులకు అద్దం పట్టేలా చిత్రప్రదర్శన జరుగుతుంది. ప్రజలు పడుతున్న కష్టాలను కళ్లకు కట్టేలా లఘుచిత్రాలు నిర్మించడం, ఎలాంటి సదుపాయాలు కల్పించాలి.. తదితర అంశాలను చర్చించే వీలుకలిగింది. దీంట్లో భాగస్వాములుగా ఉన్నందుకు గర్వంగా ఉంది.
 - అద్రిజా, నల్సార్ లా విద్యార్థి, ఎల్‌ఎల్‌బీ, 4వ సంవత్సరం
 
ఆనందంగా ఉంది..
సీనియర్లు అంటే ర్యాగింగ్ చేయడం వరకే ఉన్న ప్రస్తుత సమాజంలో ‘నల్సార్’లోని సీనియర్లు మాకు ఎంతో చేదోడు వాదోడుగా ఉంటున్నారు. ఇలాంటి కార్యక్రమాల్లో మమ్మల్ని భాగస్వాములుగా చేయడం ఆనందంగా ఉంది. సమాజంలోని మలినాలను తొలగించేందుకు మా వంతు సహకారాలు అందించేందుకు ఎల్లవేళలా ముందుంటాం.
 - సిద్ధ్దార్థ్, ఎల్‌ఎల్‌బీ, మొదటి సంవత్సరం
 
మా వంతు కృషి చేస్తున్నాం..
విద్యతోపాటు సమాజంలోని మార్పులను తెలుసుకునేందుకు  ఫిల్మ్ ఫెస్టివల్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నాం. దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఎలాంటి జీవితాలు గడుపుతున్నారు.. ప్రజల అలవాట్లు, వారు పడుతున్న కష్టాలను లఘుచిత్రాల ద్వారా తిలకించి, సమాజంలో వారికి తమవంతు సహాయం చేసేందుకు కృషిచేస్తాం.
 - దీపార్‌కర్, నల్సార్ విద్యార్థి, ఎల్‌ఎల్‌బీ, 4వ సంవత్సరం

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement