
సాక్షి, హైదరాబాద్: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ ఈ నెల 25న రాష్ట్రానికి రానున్నారు. ఆయన హైదరాబాద్‌లోని నల్సార్ యూనివర్సిటీలో శనివారం ఉదయం 11 గంటలకు జరిగే 19వ కాన్వొకేషన్ కార్యక్రమంలో పాల్గొంటారు.
సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ పీఎస్ నరసింహా, జస్టిస్ వి.రామసుబ్రహ్మణ్యన్, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (వర్సిటీ చాన్స్‌లర్) జస్టిస్ ఉజ్జల్ భూయాన్, రాష్ట్ర న్యాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి తదితరులు కార్యక్రమంలో పాల్గొంటారు.
Comments
Please login to add a commentAdd a comment