2న నల్సార్‌కు ప్రణబ్ | Pranab mukharjee comes on second august to nalsar university of law | Sakshi
Sakshi News home page

2న నల్సార్‌కు ప్రణబ్

Jul 19 2014 11:36 PM | Updated on Aug 24 2018 2:01 PM

2న నల్సార్‌కు ప్రణబ్ - Sakshi

2న నల్సార్‌కు ప్రణబ్

వచ్చే నెల 2న నల్సార్ లా యూనివర్సిటీస్నాతకోత్సవానికి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో హెలీప్యాడ్ ఏర్పాటుకు మండల కేంద్రంలోని మినీస్టేడియంను కలెక్టర్ శ్రీధర్ శనివారం పరిశీలించారు.

శామీర్‌పేట్ రూరల్: వచ్చే నెల 2న నల్సార్ లా యూనివర్సిటీస్నాతకోత్సవానికి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో హెలీప్యాడ్ ఏర్పాటుకు మండల కేంద్రంలోని మినీస్టేడియంను కలెక్టర్ శ్రీధర్ శనివారం పరిశీలించారు. మూడు హెలీప్యాడ్ లు అవసరమవుతాయని భావించి ఆ మేరకు వాటిని మినీస్టేడియంలో ఏర్పాటుకు అధికారులతో చర్చించారు. అనంతరం అక్కడినుంచి నల్సా ర్ లా యునివర్సిటీకి వెళ్లి స్నాతకోత్సవం వివరాలను తెలుసుకున్నారు. స్థానిక ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్‌రెడ్డి, ఆర్డీఓ ప్రభాకర్‌రెడ్డి, ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ ఆశారాణి, ఈఈ ఆనంద్‌కుమార్, తహసీల్దార్ రాజేశ్వర్, డీసీపీ శ్రీనివాస్, సీఐ బాబ్జీ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement