నల్సార్ యూనివర్సిటీ స్నాతకోత్సవంలో ప్రణబ్ ముఖర్జీ ప్రసంగం
హైదరాబాద్: దేశంలో సామాన్యులకు సైతం న్యాయవిద్య అందాలని రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ ఆకాంక్షించారు. నిష్పక్షపాతంగా ప్రజలకు సేవలు అందించాలని రాష్ట్రపతి పిలుపునిచ్చారు. హైదరాబాద్‌లోని నల్సార్ యూనివర్సిటీ 12వ స్నాతకోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కీలక ఉపన్యాసం చేసిన ఆయన విద్యారంగంలో పరిశోధనలను ప్రోత్సహించాలని సూచించారు.
ఉన్నత విద్యలో సంస్కరణలు అవసరమన్నారు. ప్రతి ఒక్కరికీ నాణ్యమైన విద్యనందించేందుకు కృషి చేయాలన్నారు. న్యాయవృత్తిలో ఉన్నవాళ్లు వృత్తి నైపుణ్యం పెంచుకోవాలని ఉద్బోధించారు. అనంతరం ఆయన బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి ఢిల్లీ బయల్దేరి వెళ్లారు.