
సాక్షి, హైదరాబాద్ : నల్సార్ యూనివర్శిటీకి చెందిన ఐదుగురు విద్యార్ధులకు స్వైన్ ఫ్లూ సోకింది. స్వైన్ ఫ్లూ లక్షణాలతో బాధపడుతున్న ఐదుగురు విద్యార్ధులను గాంధీ ఆసుపత్రికి తరలించగా వైద్య పరీక్షలు చేసిన డాక్టర్లు స్వైన్ ఫ్లూ సోకినట్లు నిర్ధారించారు. ప్రస్తుతం ఐదుగురు విద్యార్ధులు గాంధీ ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నారు. కాగా ఈ ఒక్కరోజే మొత్తం తొమ్మిది మంది స్వైన్ ఫ్లూతో ఆసుపత్రిలో చేరినట్లు వైద్యులు తెలిపారు.
వీరందరిని ప్రత్యేక వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు. వాతావరణంలో చోటుచేసుకున్న మార్పుల కారణంగానే స్వైన్ ఫ్లూ వేగంగా విస్తరిస్తున్నట్లు వైద్యులు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment