న్యాయ కేంద్రాన్ని ప్రారంభిస్తున్న సీజే ఉజ్జల్ భూయాన్. చిత్రంలో సుప్రీం మాజీ న్యాయమూర్తి జస్టిస్ బీపీ జీవన్‌రెడ్డి
శామీర్‌పేట్: శామీర్‌పేటలోని నల్సార్ విశ్వ విద్యాలయంలో అంతర్జాతీయ వాణిజ్య వ్యాపార న్యాయ కేంద్రాన్ని తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భూయాన్, సుప్రీంకోర్డు మాజీ న్యాయమూర్తి బీపీ జీవన్‌రెడ్డి శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అంతర్జాతీయ వాణిజ్యం, వ్యాపార చట్టాల్లో సమకాలీన సమస్యలకు సంబంధించిన బోధనకు ఈ కేంద్రం దోహదం చేస్తుందని అన్నారు. అనంతరం అంతర్జాతీయ న్యాయ పరిశోధన కార్యాలయ వెబ్‌సైట్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నల్సార్ ప్రొఫెసర్లు వెంకట్, డాక్టర్ కేవీకే శాంతి, మల్లిఖార్జున్, రాజేశ్‌కపూర్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment