shameerpet
-
శామీర్‌పేట ఘటన: అందమైన అమ్మాయిలకు ట్రాప్!
క్రైమ్: శామీర్‌పేట కాల్పుల ఘటన కేసును దర్యాప్తు చేపట్టిన పోలీసులకు.. మరో కొత్త విషయం తెలిసింది. మనోజ్, స్మితా గ్రంథిలు కలిసి పలు మోసాలకు పాల్పడ్డారు. యాక్టింగ్ పేరుతో అందమైన అమ్మాయిలను ట్రాప్ చేశారు. స్మిత ఇటీవలే ఓ సంపన్న యువతిని ట్రాప్ చేయగా.. ఇద్దరూ కలిసి సదరు యువతి నుంచి నుంచి రూ.50 లక్షలు వసూలు చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఒరాకిల్‌లో పని చేస్తూనే.. స్మిత మోసాలకు దిగింది. మనోజ్‌తో కలిసి బంజారాహిల్స్‌లో డెన్ ఏర్పాటు చేసింది. షాకన్యోరా సొల్యూషన్స్ పేరిట షెల్ కంపెనీలు ఏర్పాటు చేశారు. నిత్యం పార్టీలతో వీళ్లిద్దరూ బిజీ బిజీగా గడిపేవారు. అక్కడి నుంచి తారసపడిన అందమైన అమ్మాయిలకు అవకాశాల పేరిట వల వేయడం ప్రారంభించారు. ఈ తరుణంలో ఇప్పుడు కాల్పలు ఘటన తర్వాత వీళ్ల మోసాలు వెలుగు చూశాయి. దీంతో.. వీళిద్దరి అక్రమాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. స్మితా బాధితుల్లో ప్రముఖులు సైతం ఉన్నట్లు సమాచారం. మనోజ్ తండ్రి హల్ చల్ మనోజ్-స్మితల నడుమ వివాహేతర సంబంధం ఉందంటూ వస్తున్న కథనాలపై మనోజ్ తండ్రి మీడియాతో దురుసుగా స్పందించారు. అలాంటిదేం లేదని.. స్మితా గ్రంధి కేవలం ఎంప్లాయి మాత్రమేనని అంటున్నాడు. ఒకేచోట.. ఇద్దరూ సన్నిహితంగా ఉన్నంత మాత్రానా సంబంధం అంటగట్టడం సరికాదని.. పైగా స్మిత మనోజ్ కంటే వయసులో పెద్దదని ఆయన అంటున్నాడు. ఈ ఘటనపై న్యాయపోరాటం చేసి తీరతామని అంటున్నాడాయన. ఈ క్రమంలో శామీర్‌పేట పోలీస్ స్టేషన్ వద్ద హల్ చల్ చేశాడాయన. జరిగిన కథ.. శామీర్‌పేట్ సెలబ్రిటీ రిసార్ట్‌లోని విల్లాలో సిద్ధార్థ దాస్‌పై జరిగిన కాల్పుల కేసులో పోలీసులు దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసులో అసలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. మూడేళ్లుగా సిద్ధార్ధ్‌దాస్ భార్యతో మనోజ్ సహజీవనం చేస్తున్నాడు. 2019లో భర్త సిద్ధార్ధ్ దాస్‌తో విడిపోయిన శ్వేతతో మనోజ్ వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. విడాకుల కోసం స్మిత కూకట్పల్లి కోర్టులో దరఖాస్తు చేసింది. దాంతో పాటు తాను నివాసం ఉంటున్న వైపు భర్త రాకుండా ఇంజక్షన్ ఆర్డర్ కూడా స్మిత తెచ్చుకుంది. మనోజ్‌తో కలిసి ఒక సాఫ్ట్వేర్ కంపెనీని ఏర్పాటు చేసిన స్మిత.. సెలబ్రిటీ రిసార్ట్స్‌లోని తాముంటున్న ఇంట్లోనే ఆఫీస్ ఏర్పాటు చేశారు. పిల్లలతో పాటు స్మిత, మనోజ్ కలిసి అక్కడే నివాసం ఉంటున్నారు. జులై 12న స్మిత కుమారుడు 17 ఏళ్ల బాలుడిని మనోజ్ కొట్టాడు. దీంతో ఆ బాలుడు అల్వాల్ సీడబ్ల్యుూసీలో ఫిర్యాదు చేశాడు. దీంతో 17 ఏళ్ల బాలుడిని సీడబ్ల్యూసీ తమ సంరక్షణలో ఉంచుకుంది. తనతో పాటు తన చెల్లెలును కూడా మనోజ్ వేధిస్తున్నారని సీడబ్ల్యుసీకి స్మిత కుమారుడు ఫిర్యాదు చేశాడు. దీంతో జులై 18న తమ ముందు పాపతో పాటు హాజరుకావాలని స్మితకు సీడబ్ల్యూసీ నోటీసులు జారీ చేసింది. అలాగే.. మనోజ్ చిత్రహింసల గురించి తండ్రి సిద్ధార్థ్‌కు కుమారుడు చెప్పాడు. దీంతో పాపను తీసుకెళ్లడానికి ఈ రోజు(శనివారం) ఉదయం సిద్ధార్థ్ దాస్ విల్లాకు చేరుకున్నాడు. సిద్ధార్థ వెంట పాపని పంపడం ఇష్టం లేక స్మిత అతడితో గొడవకు దిగింది. దీంతో ముగ్గురికి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అనంతరం మనోజ్ ఎయిర్ గన్ తీసుకొని కాల్పులు జరిపాడు. సిద్ధార్థ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఆమ్స్ ఆక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఎయిర్ గన్ను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. దాన్ని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించారు. గన్‌లో మంద గుండు సామాగ్రి ఉందా అన్నది నిర్ధారించుకోవడానికి ఫోరెన్సిక్ ల్యాబ్ గన్ను పంపించారు. ఇదీ చదవండి: పతీ.. పత్నీ ఔర్ వో.. హైప్రొఫైల్ స్టోరీ ఇది -
తెలంగాణ బీజేపీ నేతలకు శిక్షణ తరగతులు ప్రారంభం
-
Hyderabad: రెస్టారెంట్ ఇన్ ఫ్లైట్.. పాత విమానాన్ని కొనుగోలు చేసి మరీ..
సాక్షి, హైదరాబాద్: గగన వీధుల్లో.. లోహ విహంగంలో కూర్చుని ఇష్టమైన ఆహారం భుజించడం ఎవరికైనా ఇష్టమే. అసలు విమాన ప్రయాణమే చేయనివారికైతే మరింత మధురానుభూతి. ఇలాంటి వారి కోసమే మన హైదరాబాదీలు సరికొత్త ఆలోచన చేశారు. ఆతిథ్య రంగంలో కొత్త ఆవిష్కరణలకు తెరలేపారు. ఆకాశంలో చుక్కల నడుమ రాకపోకలు సాగించే విమానాన్ని నేలమీద పెట్టి.. దీనినే ‘స్టార్’ హోటల్‌గా మార్చాలని నిర్ణయించారు. అనుకున్నదే తడవుగా షెడ్డుకు వెళ్లిన విమానాన్ని కొనుగోలు చేశారు. ఈ లైవ్ ఫ్లైట్ లోపలిభాగంలో మార్పులు, చేర్పులు చేసి.. రెస్టారెంట్‌గా మలచనున్నారు. ఆహార ప్రియులకు సరికొత్త ఆనుభూతిని మిగిల్చేలా.. దేశీయ, విదేశీ వంటకాలను వడ్డించనున్నారు. ఇప్పటివరకు కేవలం ఢిల్లీకి పరిమితమైన లైవ్ ఫ్లెయిన్ రెస్టారెంట్ త్వరలో సిటీజనులకు అందుబాటులోకి రానుంది. ఇప్పటికే నగరవాసులకు హైదరాబాద్ స్టైల్ వంటకాల్లో పేరొందిన ‘పిస్తా హౌస్’ యాజమాన్యం.. ఈ రెస్టారెంట్‌ను త్వరలోనే నగర శివార్లలోని శామీర్‌పేట్‌లో ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. న్యూ ఇయర్ కానుకగా దీన్ని ప్రారంభించే అకాశముంది. కలల విమానంలో కడుపారా.. సామాన్యులకు విమానం అంటేనే పెద్ద వింత. దానిలో ప్రయాణించాలని చాలామంది కలలు కంటుంటారు. భోజనం చేసే అవకాశం దొరికితే ఎగిరి గంతేస్తారు. నిజమే విమానంలో కూర్చొని బిర్యానీ తింటూ.. విండో నుంచి ప్రకృతి అందాలను ఆస్వాదిస్తుంటే ఆ కిక్కే వేరు. ఇక శామీర్‌పేట చెరువు అందాలను వీక్షిస్తూ.. నచ్చిన ఫుడ్‌ను లొట్టలేసుకొని తింటుంటే ఈ మజానే వేరు. త్రివేండ్రంలో కొనుగోలు హోటల్రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా వినూత్న ప్రయోగాలు చేసే పిస్తా హౌస్ యజమాని మహ్మద్ అబ్దుల్ మజీద్ మదికి విమాన రెస్టారెంట్ ఆలోచన తట్టింది. ఇప్పటికే లైవ్ ఫ్లైట్ కాకుండా.. మోడల్ విమానాల్లో రెస్టారెంట్లు నడుస్తున్నా ఆయన ఆలోచన లైవ్ ఫ్లెయిన్పైనే పడింది. దీంతో చెడిపోయిన, ఫిట్నెస్ లేని విమానాల కోసం ఆయన విమానయాన సంస్థలను సంప్రదించారు. ఈ క్రమంలోనే కేరళ త్రివేండ్రంలో ఎయిర్ ఇండియా వద్ద ఎ– 320 ఉందని తెలిసింది. దీన్ని వేలం ద్వారా కొనుగోలు చేసి.. ఇక్కడకు చేరుస్తున్నారు. ఇప్పటికే మార్గమధ్యలో ఉన్న ఈ లోహ విహంగం ఈ వారాంతానికి నగరానికి చేరుకోనుంది. ఈ విమానం కొనుగోలు, తరలింపు ఖర్చు రూ.కోటి. ఈ ఫ్లైట్‌ను సమూలంగా మార్చి లోపలిభాగంలో అధునాతన సీటింగ్, విమానంలోకి ప్రవేశించేందుకు ఎస్కలేటర్, విమానం ఆగిన ప్రదేశాన్ని రన్‌వే తరహాలో తీర్చిదిద్దనున్నారు. -
అంతర్జాతీయ వాణిజ్య, వ్యాపార న్యాయ కేంద్రం ప్రారంభం
శామీర్‌పేట్: శామీర్‌పేటలోని నల్సార్ విశ్వ విద్యాలయంలో అంతర్జాతీయ వాణిజ్య వ్యాపార న్యాయ కేంద్రాన్ని తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భూయాన్, సుప్రీంకోర్డు మాజీ న్యాయమూర్తి బీపీ జీవన్‌రెడ్డి శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అంతర్జాతీయ వాణిజ్యం, వ్యాపార చట్టాల్లో సమకాలీన సమస్యలకు సంబంధించిన బోధనకు ఈ కేంద్రం దోహదం చేస్తుందని అన్నారు. అనంతరం అంతర్జాతీయ న్యాయ పరిశోధన కార్యాలయ వెబ్‌సైట్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నల్సార్ ప్రొఫెసర్లు వెంకట్, డాక్టర్ కేవీకే శాంతి, మల్లిఖార్జున్, రాజేశ్‌కపూర్ పాల్గొన్నారు. -
అమ్మా భయమేస్తోంది.. నువ్వేక్కడున్నావ్
అమ్మా అమ్మా నీ పసిదాన్నమ్మా.. నీవే లేక వసివాడనమ్మా మాటే లేకుండా నువ్వే మాయం కన్నీరవుతోంది ఎదలో గాయం అయ్యో వెళ్లిపోయావే నన్నొదిలేసి ఎటుపోయావే... అంటూ తల్లడిల్లిపోతోంది శామీర్‌పేట డీర్–పార్క్‌లోని పసి దుప్పి. శామీర్‌పేట్: ముద్దులొలికే ఈ చిన్నారి జంకకు సీత కష్టాలు వచ్చాయి. తల్లి తన వద్దకు ఎప్పుడు వస్తుందోనని వేయి కళ్లతో.. కోటి ఆశలతో వేచి చూస్తోంది. చిన్నచిన్నగా గెంతుతూ ఎంతో అందంగా ఉన్న ఆ దుప్పి తల్లి కనిపించక విలవిలలాడిపోతోంది. శామీర్‌పేట డీర్ పార్కులో నెలన్నర క్రితం పార్కు ఫెన్సింగ్‌లో తల ఇరుక్కుని ఉన్న సుమారు రెండు రోజుల వయస్సు ఉన్న జింకపిల్లను సిబ్బంది గమనించారు. దానికి చికిత్స చేసి అప్పటి నుంచి ఆవు పాలు తాగిపిస్తూ పెంచుతున్నారు. మరి అప్పటి నుంచి తల్లి జింకను ఎందుకు పట్టుకోలేకపోయారు.? ఎక్కడ ఉంది అనే దానిపై విచారణ చేపట్టారా? తల్లీబిడ్డను ఇప్పటి వరకు ఎందుకు కలుపలేకపోయారు? అనే ప్రశ్నలు ప్రతి ఒక్కరిలో వ్యక్తమవుతున్నాయి. మరి దీనిపై అటవీశాఖ అధికారులు ఏమి సమాధానం చెబుతారో వేచి చూద్దాం. తరలించిన జింకలలో ఉందా.? ఫిబ్రవరి చివరి వారంలో శామీర్‌పేట డీర్‌పార్కు నుంచి కాగజ్‌నగర్‌కు 27 జింకలను తరలించామని అధికారులు తెలిపారు. అదే సమయంలో ఈ దుప్పి జన్మించింది. ఈ దుప్పి తల్లి కాగజ్‌నగర్‌కు తరలించిన జింకలలో ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనపై ఫారెస్ట్ సెక్షన్ అధికారిని వివరణ కోరగా పొంతనలేని సమాధానాలు చెప్పడం కొసమెరుపు. దీనిపైన సమగ్ర దర్యాప్తు జరిపి దుప్పిని తల్లి వద్దకు చేర్చాలని జంతుప్రేమికులు డిమాండ్ చేస్తున్నారు. చదవండి: టైమ్‌సెన్స్ లేక నెలకు కోటి రూపాయల భారం! -
ధాన్యం మద్దతు ధర పొందాలంటే..
పంటను కంటికి రెప్పలా కాపాడుకుని వరి పండించడం ఒక ఎత్తు. దానికి మద్దతు ధర పొందటం మరో ఎత్తు. ఈ నేపథ్యంలో రైతులు తగిన జాగ్రత్తలు పాటిస్తేనే మద్దతు ధర లభిస్తుందని మేడ్చల్ జిల్లా శామీర్‌పేట మండల వ్యవసాయ అధికారి రమేష్ పేర్కొంటున్నారు. మరి అవేంటో చూద్దాం. సాక్షి, శామీర్‌పేట్: రైతులు తాము పండించిన వరి గింజలపై తీసుకునే జాగ్రత్తల మేరకు మద్దతు ధర లభిస్తుంది. రైతులు పండించిన ధాన్యాన్ని సేకరించేందుకు తెలంగాణ ప్రభుత్వం మండలాల్లో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తోంది. సాధారణ ధాన్యం రకం కనీసం మద్దతు ధర క్వింటాకు రూ.1940, ఎ–గ్రేడ్ రకం రూ.1960 రూపాయలుగా ప్రభుత్వం ప్రకటించింది. రైతులు తమ పంట తాలుకు వరి ధాన్యాన్ని దిగువ ఇచ్చిన సలహాలు, సూచనలు పాటించి వాటిని ఆచరిస్తే మద్దతు ధర పొందవచ్చని వ్యవసాయ అధికారి సూచిస్తున్నారు. (చదవండి: ధాన్యం కొనుగోలులో కేంద్రం విఫలం) నాణ్యతాప్రమాణాలు... ► మట్టి, రాళ్లు, ఇసుక వంటి వ్యర్థాలు ఉండకూడదు. ► గడ్డి, చెత్త, తప్ప, కలుపు, విత్తనాలు ఒక్క శాతం మించకూడదు. ► చెడిపోయిన, రంగుమారిన, మొలకెత్తిన, పురుగుపట్టిన ధాన్యపు గింజలు 5శాతం మించకూడదు. ► వరిపక్వం గాని, ముడుచుకుపోయిన, వంకర తిరిగిన ధాన్యపు గింజలు 3శాతంలోపే ఉండాలి. ► తక్కువ శ్రేణి ధాన్యపు గింజలు లేక కేళీలు ఎ–గ్రేడ్ రకంలో 6శాతం మించకూడదు. ► తేమ లేక నిమ్ము 17 శాతం మించితే కొనుగోలు చేయరు. రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు... ► ఒక రకం ధాన్యాన్ని మరోక రకం ధాన్యంతో కలపరాదు. ► పంట కోసిన తర్వాత ఆరబెట్టక పోతే గింజలు రంగుమారి నాణ్యత కోల్పోతాయి. పూర్తిగా ఆరబెట్టిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి తీసుకురావాలి. ► నూర్చేటప్పుడు ధాన్యంలో రాళ్లు, మట్టి గడ్డలు కలపకుండా నేల మీద పరదాలు లేదా టార్పాలిన్లు వేసి, వాటిపై నూర్పిడి చేయాలి. ► పంటలో తాలు, తప్ప, పొల్లు, చెత్తాచెదారం పోయేటట్టు తూర్పారబట్టాలి. ► ధాన్యం ముక్కిపోయి రంగుమారి నాణ్యత పడిపోకుండా తేమ బాగా తగ్గాకే బస్తాల్లో నింపి లాటు కట్టాలి. ► నిల్వ ఉంచిన ధాన్యాన్ని ఎలుకలు నాశనం చేయకుండా బస్తాల మధ్యన జింకు సల్ఫేట్ మాత్రలు, పురుగు నివారణకు లీటరు నీటికి 5 మిల్లీ లీటర్లు మలాథియాన్ మందును బస్తాలపై పిచికారి చేయాలి. ► రైతులు ధాన్యపు పంట నుంచి సుమారు కిలో ధాన్యం మచ్చు (శాంపిల్) కింద ప్రాథమిక పరిశీలన కోసం కొనుగోలు కేంద్రానికి ముందుగా తీసుకొచ్చి నాణ్యత పరీక్ష అధికారికి చూపించి తగు సలహ పొందాలి. ► ధాన్యం కొనుగోలు కేంద్రంలో శాంపిల్ తీసుకున్న అధికారి ధాన్యం నాణ్యతకు ఆమోదం తెలిపిన తర్వాత మాత్రమే సరుకు కొనుగోలు కేంద్రానికి తెచ్చుకోవాలి. ► మొదట తెచ్చిన ధాన్యం శాంపిల్ మాదిరిగానే మొత్తం సరుకు ఉండేలా జాగ్రత్త తీసుకోవాలి. ► సదరు ధాన్యం కోనుగోలు కేంద్రాలను ఉచిత నాణ్యత, తేమ పరీక్ష కేంద్రంగా కూడా రైతులకు ఉపయోగపడుతుంది. ► రైతు తనే పంట పండించిన భూమి సర్వే నంబర్ విస్తీర్ణ వివరాలు తెలియజేస్తూ అధికారి నుంచి గుర్తింపు పత్రం తీసుకుని ధాన్యం కోనుగోలు కేంద్రానికి దాఖలు చేయాలి. ► దళారులు, మధ్యవర్తులు, కమీషన్ ఏజెంట్లు చొరబాటు లేకుండా నివారించేందుకు నేరుగా పంట పండించిన రైతులకే ప్రభుత్వం గిట్టుబాటు ధర వర్తింపజేసేందుకే ఈ నిబంధనలు పాటించాలి. ► రైతులకు నాణ్యత ప్రమాణాలపై ఏమైనా సందేహాలుంటే సంబంధిత ఏఓ లేక ఏఈఓలను సంప్రదించాలి. దళారులను నమ్మొద్దు కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తరలించే రైతులు ఏమైనా సందేహాలుంటే ఏఈఓలను సంప్రదించండి. అధికారుల సూచనలను పాటిస్తూ, తగు జాగ్రత్తలు తీసుకోవాలి. దళారులు, మధ్యవర్తులు, కమీషన్ ఏజెంట్ల ప్రమేయం నివారించేందుకే ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తోంది. నేరుగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యాన్ని అమ్మాలి. – రమేష్, శామీర్‌పేట వ్యవసాయ అధికారి -
పెళ్లి రద్దయిందని యువతి ఆత్మహత్య
సాక్షి, శామీర్‌పేట్: పెళ్లి రద్దయిందని మనస్థాపంతో ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. శామీర్‌పేట్ పోలీసులు తెలిపిన మేరకు.. అలియాబాద్‌కు చెందిన లక్ష్మణ్ కూతురు అనూష(22) మూడుచింతలపల్లికి చెందిన వ్యక్తితో వివాహం నిశ్చయమైంది. అయితే కొన్ని కారణాల వల్ల ఇటీవల వివాహం రద్దయింది. దీంతో అనూష మనస్థాపానికి గురై గురువారం ఇంట్లో ఫ్యాన్‌కు చీరతో ఉరివేసుకుకొని మృతిచెందింది. ఘటనా స్థలానికి శామీర్‌పేట పోలీసులు చేరుకొని పంచానామ నిర్వహించారు. తల్లి కృష్ణవేణి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. చదవండి: లైంగికదాడి వీడియో: దొరికిన కామ పిశాచాలు -
మల్లన్నా.. ఏందన్నా ఇది?
శామీర్‌పేట్: రైతు వేదికలను ప్రారంభించేందుకు గాను రాష్ట్ర కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి శుక్రవారం మేడ్చల్ జిల్లా శామీర్‌పేట మండలంలో పర్యటించారు. ఈ విషయం తెలుసుకున్న బీజేపీ నాయకులు రామ మందిరం నిర్మాణంపై కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్ చేసిన వ్యాఖ్యలకు ఖండిస్తూ మజీద్‌పూర్ వద్ద మంత్రి మల్లారెడ్డి కాన్వాయ్‌ని ఆపి నిరసన తెలిపేందుకు రాజీవ్‌రహదారిపై బైఠాయించారు. దీనిపై సమాచారం అందడంతో మంత్రి కాన్వాయ్ అలియాబాద్ చౌరస్తా వరకు రాజీవ్ రహదారిలో రాంగ్ రూట్లో అక్కడి నుంచి వెళ్లి పోయారు. రాంగ్ రూట్ లో వెళ్లిన మంత్రి వాహనాలకు ట్రాఫిక్ పోలీసులు చలాన్లు విధిస్తారా లేదా అని స్థానికులు చర్చించుకుంటున్నారు. -
డెత్ గేమ్.. ఆపై కిడ్నాప్ డ్రామా
సాక్షి, హైదరాబాద్/శామీర్‌పేట్: మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో చిన్నారి దీక్షిత్‌రెడ్డి హత్యో దంతం మరువకముందే నగర శివా ర్లలో మరో ఘోరం.. కిక్ జంపింగ్స్ వీడియో చిత్రీకరణలో గాయపడిన బాలుడిని.. భయంతో హత మార్చాడు బిహార్‌కు చెందిన మైనర్. మృతదేహాన్ని మూటగట్టి ఔటర్ రింగ్‌రోడ్ సమీ పంలో పడేశాడు. ఆపై కిడ్నాప్ డ్రామా ఆడుతూ డబ్బు డిమాండ్ చేశాడు. ఈ దారుణానికి ఒడి గట్టిన మైనర్‌ను శామీర్‌పేట పోలీసులు అదుపు లోకి తీసుకున్నారు. పేట్ బషీరాబాద్ ఏసీపీ ఏవీ ఆర్ నర్సింహారావు, స్థానికుల కథనం ప్రకారం.. శామీర్‌పేట్‌కు చెందిన ఆటోడ్రైవర్ సయ్యద్ యూసుఫ్.. భార్య గౌసియా బేగం, పిల్లలు అదిభీ, రహాన్, ఫర్హాన్, అథియాన్ (5)తో కలిసి చాంద్ పాషాకు చెందిన ఇంటి కింది పోర్షన్లో నివసిస్తున్నాడు. పై పోర్షన్లో బిహార్‌కు చెందిన మైనర్ (17).. రాజు అనే స్నేహితుడితో కలిసి అద్దెకు ఉంటున్నాడు. కింది పోర్షన్లో ఉండే అథియాన్‌తో పరిచయం పెంచు కున్నాడు. షేర్‌చాట్ యాప్‌లో వీడియోలు అప్లోడ్ చేసే అలవాటున్న బిహారీ మైనర్.. అ«థియాన్తో ఒక వీడియో రూపొందించాలని భావించాడు. ఇదీ జరిగిన ఘోరం.. ఈ నెల 15న ఉదయం 10 గంటలకు తన రూమ్మేట్ బయటకు వెళ్లిపోగా, 10.40 ప్రాంతం లో ఇంటి బయట ఆడుకుంటున్న అథి యాన్‌ను బిహారీ మైనర్ పైకి తీసుకెళ్లాడు. గాల్లోకి ఎగిరి చేసే కిక్ జంపింగ్స్ గురించి అథియాన్‌కు వివరించి.. అలా చేయాలని, తాను వీడియో తీసి షేర్‌చాట్‌లో పెడతానని చెప్పాడు. ఈ ప్రయ త్నంలో గాల్లోకి ఎగిరిన అథియాన్ అదుపుతప్పి కిందపడ్డాడు. తలకు బలమైన గాయమై స్పృహ కోల్పోయాడు. ఇది తెలిస్తే అతడి తల్లిదండ్రులు తనకు కొడతారని భయపడిన బిహారీ మైనర్.. గుట్టు రట్టుకాకుండా ఉండేందుకు అథియాన్ నోరు, ముక్కు మూసి ఊపిరాడకుండా చేసి చంపేశాడు. గదిలో ఉన్న సెల్లో టేపుతో అథియాన్ కాళ్లు, చేతులు దగ్గరగా చేసి అతికించేశాడు. మృతదేహాన్ని ముందుకు వంచుతూ మధ్యలోకి మడతపెట్టి తన గదిలోని లగేజ్ బ్యాగ్‌లో కుక్కేశాడు. ఉదయం 11.30 సమయంలో బ్యాగ్‌తో నేరుగా శామీర్‌పేట్ చౌరస్తాకు చేరుకున్నాడు. అక్కడి నుంచి షేర్ ఆటోలో ఓఆర్ఆర్ వరకు వెళ్లి, దొంగలమైసమ్మ చౌరస్తా సమీపంలోని ఔటర్ సర్వీసు రోడ్డులో ఉన్న చెట్ల పొదల్లో రాళ్ల మధ్య అథియాన్ మృతదేహాన్ని పడేశాడు. తిరిగొస్తూ తన స్నేహితుడి వద్ద రూ.200 అప్పుగా తీసుకుని గజ్వేల్ చేరుకున్నాడు. అక్కడ పని కోసం ప్రయత్నించి విఫలమై తిరిగి తన గదికి వచ్చేశాడు. యజమాని మాటలతో దుర్బుద్ధి పుట్టి... ఆడుకుంటానని వెళ్లిన అథియాన్ కనిపించకపోవడంతో అతడి కుటుంబీకులు పలుచోట్ల గాలించారు. శామీర్‌పేట పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. ఆ సమయంలో భారీ వర్షాలకు నాలాలు, చెరువులు పొంగి పొర్లుతున్నాయి. ఏదైనా నాలాలో అథియాన్ పడి ఉండొచ్చనే కోణంలోనూ పోలీసులు గాలింపు చేపట్టారు. మరోపక్క బిహారీ మైనర్ ఏం తెలియనట్టు అథియాన్ కుటుంబీకులతో సన్నిహితంగా మెలిగాడు. ఈనెల 20న అథియాన్ ఇంటి వద్ద గాలింపు చర్యల్లో పాల్గొంటున్న వారంతా కూర్చున్నారు. అథియాన్ ఫొటోతో పోస్టర్లు ముద్రించి సోషల్ మీడియాలో, ఇతరత్రా ప్రచారం చేద్దామని, ఆచూకీ చెప్పిన వారికి రూ.10 వేలు బహుమతి ప్రకటిద్దామని ఒకరు సలహానిచ్చారు. దీనిపై స్పందించిన ఇంటి యజమాని చాంద్ పాషా.. ఆచూకీ చెప్పిన వారికి రూ.10 వేలు కాదని, లక్ష రూపాయలు తానే ఇస్తానని చెప్పాడు. ఈ మాటలు విన్న బిహారీ మైనర్‌కు దుర్బుద్ధి పుట్టింది. రూమ్మేట్ సెల్‌ఫోన్ అపహరించి.. అదే సందర్భంలో మానుకోటలో జరిగిన దీక్షిత్‌రెడ్డి హత్యోదంతమూ తీవ్ర చర్చనీయాంశమైంది. ఆ ఘటనలో మాదిరే డబ్బు కోసం బాలుడిని కిడ్నాప్ చేసినట్లు కొత్త నాటకానికి తెరలేపి, అందినకాడికి దండుకోవాలని, ఆ డబ్బుతో స్వరాష్ట్రానికి పారిపోవాలని బిహారీ మైనర్ పథకం వేశాడు. తన ఫోన్ వాడితే చిక్కుతాననే ఉద్దేశంతో ఈ నెల 21న తన రూమ్మేట్ సిమ్‌కార్డు, సెల్‌ఫోన్ వేర్వేరుగా చోరీ చేశాడు. దాంతో ఈనెల 24న చాంద్‌పాషాకు ఫోన్‌చేసిన బిహారీ మైనర్.. బాలుడిని తామే కిడ్నాప్ చేశామని, రూ.15 లక్షలిస్తే వదిలిపెడతామని బెదిరించాడు. అప్రమత్తమైన చాంద్‌పాషా, అథియాన్ కుటుంబీకులు శామీర్‌పేట పోలీసులకు చెప్పారు. ఫోన్ నంబర్ ఆధారంగా ఆరాతీసిన అధికారులు సోమవారం ఓఆర్ఆర్ సమీపంలోని దాబాలో పనిచేస్తున్న రాజును పట్టుకున్నారు. అతడిచ్చిన సమాచారంతో బిహారీ మైనర్‌ను అదుపులోకి తీసుకుని విచారించారు. హత్యతో రాజుకు సంబంధం లేదంటూ జరిగినదంతా బయటపెట్టిన అతగాడు నేరాన్ని అంగీకరించాడు. బాలుడి మృతదేహం పడేసిన ప్రాంతానికి బిహారీ మైనర్‌ను తీసుకెళ్లిన పోలీసులు పూర్తిగా కుళ్లిపోయి, అస్తిపంజరంగా మారుతున్న స్థితిలో ఉన్న శవాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఉస్మానియా ఆసుపత్రి ఫోరెన్సిక్ ౖవైద్యులతో అక్కడే పోస్టుమార్టం పూర్తిచేయించి కుటుంబీకులకు అప్పగించారు. గట్టి బందోబస్తు నడుమ అంత్యక్రియలు నిర్వహించారు. బిహారీ మైనర్‌ను అరెస్టుచేసి జువైనల్ కోర్టుకు తరలించారు. -
గ్రీనరీ.. సీనరీ.. చూసి రావాలి మరి!
సాక్షి, హైదరాబాద్ : కాంక్రీట్ జంగిల్‌గా మారిన నగరం నుంచి సిద్దిపేట వైపు ఉన్న శామీర్‌పేటకు వెళ్తే చాలు.. భూమికి పచ్చని రంగేసినట్టు కనిపించే గ్రీనరీ.. పెద్ద చెరువు అందాల సీనరీ.. రిసార్టుల్లో విడిది.. కట్టమైసమ్మ తల్లి సన్నిధి.. ఇలా ఎన్నెన్నో అందాలు కట్టిపడేస్తాయి.. పల్లె ముచ్చట్లు ఆలోచనల్లో ముంచెత్తుతాయి.. రుచులు ఆహా అనిపిస్తాయి.. స్టార్ రిసార్టులు పట్నం వాసులను రారమ్మంటున్నాయి. శామీర్‌పేట్: శామీర్‌పేట పెద్దచెరువును పాలకులు అందంగా ముస్తాబు చేస్తున్నారు. పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు సీఎం కేసీఆర్ రూ.25 కోట్లను కేటాయించగా పనులు జోరుగా సాగుతున్నాయి. దీంతో హైదరాబాద్ మహానగరానికి అతిచేరువలో ఉన్న శామీర్‌పేట పర్యాటక ప్రాంతంగా మారనుంది. అంతేగాక చెరువు సమీపంలో పచ్చని పంటపొలాలు, ఆహ్లాదకర వాతావరణం ఉండటంతో శని, ఆది వారాల్లో కుటుంబసమేతంగా ఇక్కడికి వచ్చి సంతోషంగా గడిపి వెళ్తున్నారు పట్టణ ప్రజలు. ప్రత్యేక ఆకర్షణగా.. ► శామీర్‌పేట పెద్దచెరువులో ’బంగారు తెలంగాణ’ అని తెలుగు అక్షరాలతో ఏర్పాటు చేసిన లోగో అందరినీ ఆకర్షిస్తోంది. అంతేగాకుండా పెద్దచెరువు పరిసరాల్లో పర్యాటకులు ► కూర్చొనేందుకు వివిధ పండ్ల ఆకారాల్లో కుర్చీలు, గజబోసులు ► పర్యాటకుల్లో ఉత్సాహం నింపుతున్నాయి. వీటిని రంగులతో సుందరంగా ► తీర్చిదిద్దుతున్నారు. చెరువు పరిసరాల్లో ఏర్పాటు చేసిన గజబోసులపై ► రకారకాల బొమ్మలతో సుందరంగా అలంకరిస్తున్నారు. -
మూఢనమ్మకం మసి చేసింది
మేడ్చల్/శామీర్‌పేట్: చేతబడి అనుమానమే ఓ అమాయకుడిని బలిగొంది.. ఆ మూఢనమ్మకమే ఆ యువకుడిని సజీవ దహనం చేసింది.. బతికుండగానే చితిలో పడేసి కాల్చేసేలా పురిగొల్పింది.. మానవత్వాన్ని మంటల్లో కాల్చేసిన ఈ ఘటన.. మేడ్చల్ జిల్లా మూడు చింతలపల్లి మండలం అద్రాస్‌పల్లిలో బుధవారం చోటు చేసుకుంది. అటుగా వెళ్లడమే పాపమైంది.. అద్రాస్‌పల్లికి చెందిన గ్యారలక్ష్మి (45)అనే మహిళ గత ఐదేళ్లుగా కిడ్నీ వ్యాధితో బాధపడుతోంది. ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మరణించింది. గ్రామంలో బుధవారం అంత్యక్రియలు నిర్వహించారు. చేతబడి చేయడంతోనే లక్ష్మి చని పోయిందని బంధువులు అనుమానించారు. అదే నిజమైతే చేతబడి చేసిన వారు.. చితి కాలిపోయే లోపు అక్కడికి వస్తారనే నమ్మకంతో.. రాత్రి లక్ష్మి బంధువులు బలరాం, కిష్టయ్య లు చితికి సమీపంలోనే కాపు కాస్తూ ఉన్నారు. అదే సమయంలో శ్మశాన వాటిక సమీపంలో ఉన్న కెనాల్ కాలువ వద్దకు అదే గ్రామానికి చెందిన బోయిని ఆంజనేయులు (29) రోజూ మాదిరిగానే రాత్రి 8.30 గంటలకు బహిరంగ మలవిసర్జన కోసం రావడంతో అతడిని అనుమానించారు. ఆంజనేయులు తండ్రి కిష్టయ్య మంత్రాలు చేస్తాడనే ప్రచారం ఉండటంతో వారి అనుమానం బలపడింది. నగ్నంగా.. చితిలోకి నెట్టేసి.. ఆంజనేయులును గమనించిన బలరాం, కిష్టయ్యలు వెంటనే అతడిపై రాళ్లు, గొడ్డళ్లు, కర్రలతో దాడి చేశారు. ఆ తర్వాత ఆంజనేయులు శరీరంపై ఉన్న దుస్తులు తీసేసి.. కాలుతున్న లక్ష్మి చితిలో అతడిని పడేశారు. దీంతో అతడు అక్కడికక్కడే సజీవ దహనమయ్యాడు. ఈ విషయం ఊరంతా పాకడంతో రాత్రి 9 గంటల ప్రాంతంలో శామీర్ పేట పోలీసులు అక్కడికి చేరుకున్నారు. నిందితులు గ్యార బలరాం, గ్యార కిష్టయ్య, గ్యార నర్సింహతోపాటు మరో వ్యక్తి బండల శ్రీరాములును గురువారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. లక్ష్మి, అంజనేయులు అస్థికలను సేకరించి ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపారు. ఆ కుటుంబం ఏకాకి.. పదో తరగతి వరకు చదువుకున్న ఆంజనేయులు కొంతకాలంగా ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. కిష్టయ్య క్షుద్రపూజలు చేస్తాడని ఆరోపణలు ఉండటంతో గ్రామస్తులంతా ఆ కుటుంబానికి దూరంగా ఉంటున్నారు. గతేడాది కిష్టయ్య చనిపోయినప్పుడు కూడా అంత్యక్రియలకు గ్రామస్తులు ఎవరూ వెళ్లలేదు. అన్ని కోణాల్లో దర్యాప్తు: పద్మజారెడ్డి ఈ కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నాం. గ్రామంలోని రెండువర్గాల వారు వేర్వేరు వాదనలు వినిపించారు. క్షుద్రపూజల నెపంతోనే అంజనేయులును చితిలో పడేశారా లేదా అనేది తెలుసుకుంటున్నాం. చితిలో నుంచి అస్తికలు సేకరించి ల్యాబ్‌కు పంపాం. నివేదిక వచ్చిన తర్వాత కొంత స్పష్టత వస్తుంది. ఘటనాస్థలి వద్ద రక్తపు మరకలు, చేతి రుమాలు లభ్యమయ్యాయి. -
విధి చిదిమేసింది!
శామీర్‌పేట: పిల్లలతో సహా పెళ్లిరోజు వేడుకలను సంతోషంగా జరుపుకుని వస్తున్న ఓ కుటుంబంపై విధికి కన్నుకుట్టింది. రోడ్డు ప్రమాదం రూపంలో ఆ కుటుంబాన్ని చిదిమేసింది. కరీంనగర్–హైదరాబాద్ రహదారి శామీర్‌పేటలో సోమవారం మధ్యాహ్నం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్కడిక్కడే మృతిచెందగా ఆ కుటుంబంలోని ఓ బాలుడితోపాటు ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. శామీర్‌పేట సీఐ నవీన్‌రెడ్డి ప్రమాదం జరిగిన తీరును వెల్లడించారు. హైదరాబాద్‌లోని నాగోల్.. బండ్లగూడకు చెందిన కోసూరి కిశోర్ చారి (55), భార్య భారతి (45), వీరి ఇద్దరు కుమారులు సుధాంశ్ (15), తనిష్‌లు ఫోర్డ్ ఎకోస్పోర్ట్ (టీఎస్08ఎఫ్‌వీ3005) కారులో సిద్దిపేట జిల్లా, వర్గల్ దేవాలయంలో దర్శనం చేసుకుని నగరానికి వస్తున్నారు. ఈ క్రమంలో శామీర్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలోని పెద్దచెరువు (రాజీవ్ రహదారిపై) సమీపంలో వీరి కారు వేగంగా వెళ్తూ.. డివైడర్‌ను ఢీ కొట్టింది. వేగం ఎక్కువగా ఉండడంతో గాల్లోకి ఎగిరి అవతలి రోడ్డులో (హైదరాబాద్–కరీంనగర్) గజ్వేల్‌కు వెళ్తున్న మారుతి సుజుకీ ఎర్టిగా (టీఎస్ 36ఈ 7111) కారును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఎకోస్పోర్ట్ వాహనంలోని కిశోర్ చారి, ఆయన భార్య భారతి, పెద్దకుమారుడు సుధాంశ్‌లు అక్కడిక్కడే మృతి చెందగా, చిన్న కుమారుడు తనిష్‌తో పాటు ఎదురుగా వస్తున్న ఎర్టిగా కారులో ప్రయాణిస్తున్న రాజు, మహేష్‌లకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను 108 వాహనంలో నగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. రెండు కార్లు ధ్వంసమయ్యాయి మృతదేహాలు కారులోనే ఉండటంతో స్థానికుల సాయంతో వీటిని బయటకు తీశారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించామని, ఈ మేరకు కేసు దర్యాప్తులో ఉన్నట్లు సీఐ నవీన్‌రెడ్డి తెలిపారు. పెళ్లి రోజు జరుపుకునేందుకు వెళ్లి.. నాగోలు డివిజన్ పరిధిలోని వెంకట్‌రెడ్డి నగర్‌కు చెందిన బీజేపీ నాయకుడు, ఓబీసీ సెల్ డివిజన్ అధ్యక్షుడు కోసూరి కిశోర్‌చారి దంపతులతో పాటు వారి కుమారుడు సోమవారం సాయంత్రం శామీర్ పెట్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందడంతో స్థానికంగా విషాదఛాయలు అలుముకున్నాయి. కిశోర్, భారతిల వివాహ వార్షికోత్సవం సందర్భంగా వీరి కారులో బీదర్ లక్ష్మీనర్సింహ స్వామిని దర్శించుకుని.. అక్కడినుంచి వేములవాడకు చేరుకుని రాజరాజేశ్వరుడి దర్శనం తర్వాత నగరానికి తిరుగుపయనమయ్యారు. సోమవారం మధ్యాహ్నం శామీర్‌పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో వీరి కారు ప్రమాదానికి గురైంది. సుధాంశ్ నాగోల్‌లోని ఎస్ఆర్ డీజీ స్కూల్లో టెన్త్ చదువుతున్నట్లు తెలిసింది. కిశోర్ చారి మృతితో నాగోలు డివిజన్లో బీజేపీ చురుకైన కార్యకర్తను కోల్పోయిందని బీజేపీ నేతలు కందికంటి కన్నాగౌడ్, శ్రీకాంత్, తదితరులు విచారం వ్యక్తం చేశారు. ప్రమాదానికి సంబంధించిన సీసీకెమెరా ఫుటేజీని హైదరాబాద్ పోలీసులు ట్విటర్లో షేర్ చేశారు. డివైడర్‌ను ఢీకొని యువకుడి మృతి హైదరాబాద్: అతివేగం ఓ యువకుడి ప్రాణాలు తీసింది. బైక్‌పై వేగంగా వస్తున్న యువకుడు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. హైదరాబాద్ గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం ఈ ఘటన చోటు చేసుకుంది. వరంగల్ జిల్లా హన్మకొండకు చెందిన ద్రుపద్(22) ఖాజాగూడలోని వెంకటేశ్వర పీజీ హాస్టల్లో ఉంటూ మాదాపూర్‌లోని ఐకాన్ డిజిటల్ ఇన్స్టిట్యూట్లో డిజిటల్ మార్కెటింగ్ కోర్సు చదువుతున్నాడు. సోమవారం తన స్నేహితుడు కృష్ణ చైతన్యను గౌలిదొడ్డిలోని హాస్టల్లో దింపి విప్రో సర్కిల్ వైపు వస్తుండగా బైక్ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ద్రుపద్.. అక్కడికక్కడే మృతి చెందాడు. కాగా, మృతుడు మాజీ మంత్రి, పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య సోదరి మనవడు. దీంతో ఈ ఘటనపై పొన్నాల లక్ష్మయ్య గచ్చిబౌలి పోలీసులను ఆరా తీశారు. -
పర్యాటక కేంద్రంగా శామీర్‌పేట
సాక్షి, హైదరాబాద్ : హైదరాబాద్–కరీంనగర్ రాజీవ్ రహదారిని ఆనుకుని ఉన్న శామీర్‌పేట చెరువు, దాని పరిసర ప్రాంతాలను పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దాలని సోమవారం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు. షామీర్పేట చెరువు ఏడాది పొడవునా నీటితో నిండి ఉండేలా చర్యలు తీసుకోవాలని.. పర్యాటకుల ఆహ్లాదం, ఆనందం కోసం అన్ని ఏర్పాట్లు చేయాలని చెప్పారు. నెలరోజుల్లోగా దీనిపై ప్రణాళికను రూపొందించి, పూర్తి నివేదిక అందజేయాలన్నారు.సీఎం కేసీఆర్ షామీర్పేట చెరువు ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా మార్చే అంశంపై ప్రగతిభవన్‌లో టూరిజం డెవలప్మెంట్ ఎండీ మనోహర్, సీఎంవో ప్రత్యేక కార్యదర్శి భూపాల్‌రెడ్డి తదితరులతో చర్చించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించే కొండ పోచమ్మ రిజర్వాయర్ ద్వారా షామీర్పేట చెరువుకు.. అక్కడి నుంచి కాలువ ద్వారా బస్వాపూర్ రిజర్వాయర్‌కు నీళ్లు అందుతాయని చెప్పారు. అటు షామీర్పేట చెరువు, ఇటు కాలువలు నిత్యం నీటితో నిండి ఉంటాయని, దీన్ని పర్యాటకశాఖ మంచి అవకాశంగా మలుచుకోవాలని సూచించారు. హైదరాబాద్‌కు అతి సమీపంలో ఈ ప్రాంతం ఉన్నందున పర్యాటకులు ఎక్కువగా వస్తారన్నారు. పర్యాటకుల కోసం కాటేజీలు, పిల్లలు ఆడుకోవడానికి ప్లే ఏరియా, చెరువు, కాలువల వెంట పూల చెట్లు పెంచాలని తెలిపారు. ప్రధాన రహదారి, చెరువు కట్ట మధ్యనున్న ప్రాంతాన్ని కూడా సుందరంగా తీర్చిదిద్దాలని ఆదేశించారు. -
శామీర్‌పేటలో ఘోర రోడ్డు ప్రమాదం
మేడ్చల్ జిల్లా : శామీర్ పేట మండలం తుర్కపల్లి గ్రామ సమీపంలో రాజీవ్ రహదారి పై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కరీంనగర్ జిల్లా ధర్మపురి నుంచి శంషాబాదు ఎయిర్ పోర్టుకు వెళ్తున్న సమయంలో ఆగి ఉన్న లారీని వెనుక నుంచి కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న సత్తవ్వ(35) , శ్రావణ్(10) , షాలిని(12)తో డ్రైవర్ రాజ్‌కుమార్ అక్కడికక్కడే మృతిచెందారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందిన వారు. సత్తవ్వ భర్త ఖతార్ నుంచి ఇండియాకు వస్తుండటంతో ఆయనకు కుటుంబసభ్యులు స్వదేశీ ఆహ్వానం పలికేందుకు ఎయిర్ పోర్టుకు బయలు దేరారు. అంతలోనే ఈ ప్రమాదం జరిగిందని కుటుంబ సభ్యులు తెలిపారు. అందరూ చనిపోవడంతో బంధువులు శోక సంద్రంలో మునిగిపోయారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
శామీర్‌పేటలో రోడ్డు ప్రమాదం
-
హైదరాబాద్‌లో అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం
-
ఎస్బీఐలో దోపిడీకి విశ్వప్రయత్నం!
సాక్షి, హైదరాబాద్: షామీర్‌పేట్‌లోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ)లో శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత దోపిడీయత్నం జరిగింది. బ్యాంకులోకి ప్రవేశించి దోచుకునేందుకు దొంగలు విశ్వప్రయత్నం చేశారు. సరిగ్గా అదే సమయంలో పోలీసులు రావడంతో దొంగల ప్రయత్నం విఫలమైంది. పోలీసుల రాకను పసిగట్టి దొంగలు పరారయ్యారు. వారిని పట్టుకునేందుకు పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నారు. అలాగే సీసీకెమెరా దృశ్యాల ఆధారంగా దొంగలను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. -
మీసేవా కేంద్రం సీజ్
షామీర్పేట్(మెడ్చల్): వినియోగదారుల నుంచి అధిక డబ్బులు వసూలు చేయడంతో పాటు ధ్రువీకరణ పత్రాలు ఇవ్వడంలో జాప్యం చేస్తున్న మీసేవా కేంద్రాన్ని రెవెన్యూ అధికారులు సీజ్ చేశారు. మెడ్చల్ జిల్లా షామీర్పేట్ మండల కేంద్రంలోని శ్రీ భువనేశ్వరి కమ్యూనికేషన్స్ పేరిట నడుపుతున్న మీసేవా కేంద్రంలో అధిక డబ్బులు వసూలు చేస్తున్నారని ఫిర్యాదులు అందడంతో.. షామీర్పేట్ తహశీల్దార్ రవీందర్‌రెడ్డి శుక్రవారం మీసేవా కేంద్రాన్ని సీజ్ చేశారు. -
గణేషుడి లడ్డూలకు భలే డిమాండ్
శామీర్‌పేట్: మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన వినాయకుడి మండపం వద్ద శనివారం రాత్రి లడ్డూ వేలం నిర్వహించారు. బీజేవైఎం మండల అధ్యక్షుడు పవన్‌గౌడ్ రూ.42,000 స్వామివారి లడ్డూను కైవసం చేసుకున్నారు. శామీర్‌పేట్ విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద ఏర్పాటు చేసిన వినాయకుడి చేతిలోని లడ్డూను జేఎల్ఎం ప్రశాంత్‌రెడ్డి రూ.20,100 వేలంలో దక్కించుకున్నాడు. -
జాతీయ క్రీడాదినోత్సవ ర్యాలీ
శామీర్‌పేట్/ మేడ్చల్: జాతీయ క్రీడాదినోత్సవం సందర్భంగా శామీర్‌పేట్, మేడ్చల్ మండలాల్లోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ఆయా గ్రామాల్లోని పురువీధుల్లో సోమవారం ర్యాలీలు తీశారు. ఈ సందర్భంగా క్రీడాదినోత్సవ ఆవశ్యకతను వివరించారురు. శామీర్‌పేటలో ఫిజికల్ డైరెక్టర్ (పీ.డీ) మురళీకృష్ణ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ప్ల కార్డులు పట్టుకుని ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు చెన్నయ్య, నాగిరెడ్డి విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. -
పరుపుల ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం
రంగారెడ్డి జిల్లా: షామీర్పేట్ మండలం మలక్‌పేట్ గ్రామ పరిధిలోని ఓ పరుపుల ఫ్యాక్టరీలో బుధవారం రాత్రి అగ్నిప్రమాదం సంభవించింది. శ్రీబాలాజీ ఫోమ్స్ కంపెనీలోని స్పాంజి తయారీలో వాడే రసాయనాలు ప్రమాదవశాత్తు అంటుకుని మండాయి. అగ్నికీలలు పక్కనే ఉన్న కార్మికుల క్వార్టర్లలోకి కూడా వ్యాపించాయి. మంటలు వ్యాపించి ఫ్యాక్టరీలో ఉంచిన స్పాంజి మొత్తం ఆహుతయింది. యంత్రాలు మాత్రమే మిగిలాయి. నష్టం వివరాలు తెలియాల్సి ఉంది. దీంతో అక్కడి కార్మికుల కుటుంబాలు ఆందోళన చెందుతున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకున్నట్టు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
బోర్డు మాత్రమే మిగిలింది
శామీర్‌పేట్: గుర్తుతెలియని వ్యక్తులు ఓ హోటల్‌కు నిప్పంటించారు. ఈ సంఘటన శామీర్‌పేట్ మండలపరిధిలోని పెద్దచెరువు శివారులో సోమవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. బాధితుడి కథనం ప్రకారం.. శామీర్‌పేట్‌కు చెందిన ఎం. శ్రీనివాస్ కొన్నేళ్లుగా మేడ్చల్ మండల పరిధిలోని మెడిసిటీ సమీపంలో (శామీర్‌పేట్ పెద్ద చెరువు శివారులో) ఓ గది అద్దెకు తీసుకొని చిన్నపాటి హోటల్ నిర్వహిస్తున్నాడు. ఎప్పటిమాదిరిగా ఆదివారం రాత్రి ఆయన కొట్టు మూసివేసి ఇంటికి వ చ్చాడు. సోమవారం తెల్లవారుజామున గుర్తుతెలియని వ్యక్తులు ఆయన హోటల్‌కు నిప్పంటించారు. స్థానికుల సమాచారంతో శ్రీనివాస్ అక్కడికి వెళ్లేసరికి హోటల్ పూర్తిగా కాలిపోయి కేవలం బోర్డు మాత్రమే మిగిలి ఉంది. తన బతుకు రోడ్డున పడిందని, రూ.50 వేలు విలువైన ఆస్తినష్టం జరిగిందని బాధితుడు కన్నీటిపర్యంతమైంది. ఈమేరకు శ్రీనివాస్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. -
ఎస్బీహెచ్లో దోపిడికి విఫలయత్నం
హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లా శామీర్‌పేటలోని ఎస్బీహెచ్ బ్రాంచ్‌లో చోరీకి దుండగులు మంగళవారం అర్థరాత్రి యత్నించారు. ఆ క్రమంలో బ్యాంక్ గ్రిల్స్ తొలగించేందుకు వారు ప్రయత్నిస్తున్నారు. అయితే గస్తీ తిరుగుతున్న పోలీసులు ఆ విషయాన్ని గమనించి... దుండగులను పట్టుకునేందుకు ప్రయత్నించారు. దాంతో దుండగులు అక్కడి నుంచి పరారైయ్యారు. దీంతో పోలీసులు అప్రమత్తమై... దుండగుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఆ క్రమంలో పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నారు. -
జనపథం-శామీర్‌పేట
-
రిసార్ట్స్‌పై దాడి, యువతీ యువకుల అరెస్ట్
-
రిసార్ట్స్‌పై దాడి: 23 మంది యువతీ యువకుల అరెస్ట్
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా శామీర్‌పేటలోని ఓ రిసార్ట్స్‌పై ఎస్వోటీ పోలీసులు శనివారం అర్థరాత్రి దాడి చేశారు. అర్థనగ్నంగా నృత్యాలు చేస్తున్న దాదాపు 23 మంది విదేశీ యువతి, యువకులను అరెస్ట్ చేశారు. అనంతరం వారిని పోలీసు స్టేషన్‌కు తరలించారు. వారిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పట్టుబడిన యువతియువకులంతా సొమాలియా, మంగోలియాకు చెందిన వారని పోలీసులు వెల్లడించారు. అరెస్ట్ అయిన వారిలో 8 మంది మహిళలు ఉన్నారని పోలీసులు చెప్పారు. -
మిశ్రమ పంటలపై రైతుల ఆసక్తి
శామీర్‌పేట్: మండలంలోని రైతులు మిశ్రమ పంటలపై దృష్టి సారిస్తున్నారు. ఒకే సీజన్లో రెండు పంటలను సాగు చేసి రెట్టింపు ఆదాయాన్ని పొందుతున్నారు. మండలంలో భూగర్భజలాలు అంతంత మాత్రమే. ఐదు సంవత్సరాలుగా వరి సాగు చివరిరోజుల్లో కరెంట్ కోతలు, అయితే అతివృష్టి, లేకుంటే అనావృష్టితో నష్టాలు చవి చూస్తున్నారు. రైతులు మిశ్రమ పంటలపై దృష్టి సారిస్తున్నారు. వీరికి వ్యవసాయ శాఖ అధికారులు తగు సూచనలు ఇస్తుండంతోై రెతులు అటువైపు అడుగులు వేస్తున్నారు. టేకు చెట్ల మధ్య డెకరేషన్‌కు పనికి వచ్చే ఆస్పరాగస్ గడ్డితోపాటు పూలు, కాకర తోటల్లో టమాటా, మామిడిలో మొక్కజొన్న, పశుగ్రాసం, వేరుశనగ, కంది, రాగి, బీన్స్, వంకాయ, చిక్కుడు తదితర తీగజాతి పంటలు, బొప్పాయిలో బంతి పూలు, మొక్కజొన్నలో కంది పంటలు సాగు చేస్తున్నారు. ఉన్నంత వరకు భూమిని పూర్తిగా ఉపయోగించుకుని ఇలా ఒకే సీజన్లో రెండు పంటలతో ఆదాయం పొందుతున్నారు. శామీర్‌పేట్ మండలంలోని పొన్నాల్, బాబాగూడ, పోతారం, నారాయణపూర్, అనంతారం, కొల్తూర్, ఉద్దెమర్రి, పోతాయిపల్లి, తూంకుంట తదితర ప్రాంతాల్లోని రైతులు సుమారు వెయ్యి ఎకరాల్లో మిశ్రమ పంటలు పండిస్తున్నారు. రాబోయే కాలంలో మరింత ఎక్కువ విస్తీర్ణంలో మిశ్రమ పంటలు సాగయ్యే సూచనలు కనిపిస్తున్నాయని వ్యవసాయ శాఖ అధికారులు తెలియజేస్తున్నారు. మిశ్రమ పంటలకు డ్రిప్ మల్చింగ్ విధానం మరింత సౌలభ్యాన్ని కల్గిస్తున్నాయని రైతులు పేర్కొంటున్నారు. -
హైదరాబాద్‌లో మరిన్ని ఎయిర్‌పోర్టులు సాధ్యమేనా?
హైదరాబాద్: వేగంగా విస్తరిస్తున్న హైదరాబాద్ భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని మరిన్ని విమానాశ్రయాలు ఏర్పాటు చేయాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ అభిప్రాయంపై తీవ్ర చర్చ మొదలైంది. ప్రస్తుత శంషాబాద్ విమానాశ్రయం తరహాలో నగరంలోని మరో రెండుదిక్కుల్లో కూడా అంతర్జాతీయ స్థాయి ఎయిర్‌పోర్టులు అవసరమని సీఎం ఇటీవలి సమావేశంలో అధికారులతో పేర్కొన్న సంగతి తెలిసిందే. అయితే శంషాబాద్ విమానాశ్రయాన్ని నిర్మించిన జీఎంఆర్‌తో కుదుర్చుకున్న ‘రాయితీల ఒప్పందం’ మేరకైతే నగరంలో కొత్త ఎయిర్‌పోర్టుల నిర్మాణం సాధ్యం కాదన్న వాదన వినిపిస్తోం ది. రాష్ట్ర ప్రభుత్వం, ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఏఏఐ), జీఎంఆర్ మధ్య త్రిపక్ష ఒప్పందం కుదిరింది. దీని ప్రకారం శంషాబాద్ విమానాశ్రయం నుంచి చుట్టూ 150 కిలోమీటర్ల పరిధిలో మరో విమానాశ్రయాన్ని ఏర్పాటు చేయాలంటే జీఎంఆర్ నుంచి ఎన్వోసీ పొందాల్సి ఉంటుంది. లేనిపక్షంలో కొత్త వాటి నిర్మాణం కుదరదు. శామీర్‌పేట, ఘట్కేసర్ వద్ద రెండు విమానాశ్రయాలను ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందించాలని అధికారులకు సీఎం కేసీఆర్ సూచించారు. అయితే, ఈ రెండు విమానాశ్రయాల ఏర్పాటుకు జీఎంఆర్ నిరభ్యంతర పత్రం జారీ చేయడం కష్టమే. -
రూబిక్స్ క్యూబుల రజనీకాంత్
రూబిక్ క్యూబ్ కీ సూపర్ స్టార్ రజనీకాంత్ కీ ఏమిటి సంబంధం? రూబిక్ క్యూబ్ లాగానే రజనీ స్టయిలిష్ గా ఉంటాడు. కానీ సాల్వ్ చేయడమే కఠినం. బహుశః అందుకేనేమో హైదరాబాద్ లోని బిట్స్ పిలానీ విద్యార్థులు రజనీకాంత్ బొమ్మను రూబిక్ క్యూబ్ లతో తయారు చేసి రికార్డు సృష్టించారు. తమ కాలేజీ యువజనోత్సవం పెర్ల్ - 14 లో అంతర్భాగంగా షామీర్ పేట్ లోని బిట్స్ పిలానీ విద్యార్థులు 14160 రూబిక్ క్యూబ్ లతో రజనీకాంత్ బొమ్మను తయారు చేశారు. తమాషా ఏమిటంటే రజనీ లేటెస్ట్ సినిమా కోచ్చడయాన్ ఒక వైపు రిలీజ్ కి ముందే సంచలనం సృష్టిస్తున్నా, బిట్స్ పిలానీ టెకీలకు మాత్రం రోబో చిత్రంలోని వశీ మాత్రమే నచ్చాడు. అందుకే ప్రొఫెసర్ వశీ బొమ్మను తయారు చేశారు. మొత్తానికి రజనీ మానియా బిట్స్ పిలానీ విద్యార్థుల దాకా పాకింది. నీల్ నితిన్ ముకేశ్, అలోక్ నాథ్ జోక్ లకన్నా చాలా ముందే రజనీ జోక్స్ యూత్ మధ్య హల్చల్ చేస్తూ ఉన్నాయి. -
నెట్‌బాల్ విజేత హైదరాబాద్
శామీర్‌పేట్ రూరల్, న్యూస్‌లైన్: రాష్ట్రస్థాయి సబ్ జూనియర్ నెట్‌బాల్ చాంపియన్‌షిప్‌లో హైదరాబాద్ బాలుర జట్టు సత్తా చాటింది. శామీర్‌పేట్‌లోని మినీ స్టేడియంలో జరిగిన ఈ ఈవెంట్లో నగరానికి చెందిన బాలుర జట్టు విజేతగా నిలిచింది. ఖమ్మం జట్టు రన్నరప్‌తో సరిపెట్టుకుంది. వరంగల్, కృష్ణా జిల్లా జట్లు సంయుక్తంగా మూడోస్థానం పొందాయి. బాలికల విభాగంలో ఖమ్మం చాంపియన్‌షిప్ సాధించగా, రంగారెడ్డి జట్టు రన్నరప్‌గా నిలిచింది. మెదక్, కృష్ణా జిల్లా జట్లు ఉమ్మడిగా తృతీయ స్థానం పొందాయి. ఈ టోర్నమెంట్లో 17 జిల్లాలకు చెందిన జట్లు పాల్గొన్నాయి. అనంతరం జరిగిన బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమానికి మేడ్చల్ ఎమ్మెల్యే కె.లక్ష్మారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ట్రోఫీలు అందజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నెట్‌బాల్ సంఘం అధ్యక్షుడు తీగల కృపాకర్ రెడ్డి, రాష్ట్ర ఒలింపిక్ సంఘం కార్యదర్శి కె.జగదీశ్వర్ యాదవ్, స్థానిక సర్పంచ్ కిశోర్ యాదవ్, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు మనోరంజిత, టోర్నమెంట్ కన్వీనర్ వి.దానయ్య తదితరులు పాల్గొన్నారు. -
నత్తనడకన వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణ పనులు
సాక్షి, రంగారెడ్డి జిల్లా: జిల్లాలో ఐహెచ్హెచ్ఎల్లో భాగంగా 26,769 మరుగుదొడ్లను ప్రభుత్వం మంజూరు చేసింది. ఒక్కో మరుగుదొడ్డి నిర్మాణానికి ప్రభుత్వం రూ.9,100 చెల్లిస్తుండగా మిగిలిన రూ.900లను లబ్ధిదారుడు భరించాల్సి ఉంటుంది. అయితే జిల్లా వ్యాప్తంగా లబ్ధిదారులను ఎంపిక చేసిన గ్రామీణ నీటి సరఫరా యాజమాన్యం.. వారితో నిర్మాణాలు ప్రారంభించేందుకు చర్యలకు ఉపక్రమించింది. అయితే ఇప్పటివరకు జిల్లాలో 8,172 నిర్మాణాలు మాత్రమే పూర్తయ్యాయి. మరో 6,530 నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నట్లు అధికారుల నివేదికలు చెబుతున్నాయి. ఇదిలాఉండగా 12,067 పనులు ఇప్పటికీ ప్రారంభానికి నోచుకోలేదు. జిల్లాలోని 33 గ్రామీణ మండలాలకు ఈ మరుగుదొడ్లు మంజూరు చేయగా.. శామీర్‌పేట, ఘట్కేసర్, పరిగి, కీసర, యాలాల, గండేడ్ మండలాల్లో కనీసం 20శాతం లక్ష్యాలు కూడా సాధించకపోవడం గమనార్హం. పాతవారికి రద్దు.. కొత్త వారికి మంజూరు స్థల సమస్య కారణంగా మరుగుదొడ్ల నిర్మాణాలు చేపట్టలేని వారికిచ్చిన మంజూరును రద్దు చేయాలని జిల్లా యంత్రాంగం తాజాగా నిర్ణయించింది. స్థలం ఉండి నిర్మించుకునేందుకు ముందుకు వచ్చే వారికి వెంటనే మంజూరు చేయనుంది. ఈ మేరకు ఇటీవల జిల్లా యంత్రాంగం మండల పరిషత్ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఈ సారైనా అసలైన లబ్ధిదారులను ఎంపికచేస్తే నిర్మాణ పనులు పుంజుకునే అవకాశముంది . ఎంపిక.. లోపభూయిష్టం.. మరుగుదొడ్ల నిర్మాణం పనులు ప్రారంభం కాకపోవడంపై జిల్లా యంత్రాంగం ఇటీవల ప్రత్యేకంగా సర్వే చేపట్టింది.అధికారులు స్వయంగా లబ్ధిదారులను కలిసి నిర్మాణాలు ప్రారంభించకపోవడంపై ఆరా తీశారు. దీంతో అసలు వాస్తవాలు వెలుగు చూశాయి. ఎంపిక ప్రక్రియే లోపభూయిష్టంగా ఉన్నట్టు అధికారులు గుర్తించారు. నిర్మాణ స్థలం సరిపడాలేని వారిని లబ్ధిదారులుగా ఎంపిక చేశారని, దీంతో చాలావరకు నిర్మాణాలు మొదలు కాలేదని ఓ ఉన్నతాధికారి ‘సాక్షి’తో అభిప్రాయపడ్డారు. లబ్ధిదారులకు అవగాహన కల్పించడంలో, నిర్మాణ ప్రక్రియలో గుంతలు తీయడంలో జరిగిన తప్పిదాల వల్ల కూడా కొన్ని నిర్మాణాలు మధ్యలోనే ఆగిపోయినట్లు పేర్కొన్నారు.