శామీర్‌పేట్: మండలంలోని రైతులు మిశ్రమ పంటలపై దృష్టి సారిస్తున్నారు. ఒకే సీజన్‌లో రెండు పంటలను సాగు చేసి రెట్టింపు ఆదాయాన్ని పొందుతున్నారు. మండలంలో భూగర్భజలాలు అంతంత మాత్రమే. ఐదు సంవత్సరాలుగా వరి సాగు చివరిరోజుల్లో కరెంట్ కోతలు, అయితే అతివృష్టి, లేకుంటే అనావృష్టితో నష్టాలు చవి చూస్తున్నారు. రైతులు మిశ్రమ పంటలపై దృష్టి సారిస్తున్నారు.
వీరికి వ్యవసాయ శాఖ అధికారులు తగు సూచనలు ఇస్తుండంతోై రెతులు అటువైపు అడుగులు వేస్తున్నారు. టేకు చెట్ల మధ్య డెకరేషన్‌కు పనికి వచ్చే ఆస్పరాగస్ గడ్డితోపాటు పూలు, కాకర తోటల్లో టమాటా, మామిడిలో మొక్కజొన్న, పశుగ్రాసం, వేరుశనగ, కంది, రాగి, బీన్స్, వంకాయ, చిక్కుడు తదితర తీగజాతి పంటలు, బొప్పాయిలో బంతి పూలు, మొక్కజొన్నలో కంది పంటలు సాగు చేస్తున్నారు. ఉన్నంత వరకు భూమిని పూర్తిగా ఉపయోగించుకుని ఇలా ఒకే సీజన్‌లో రెండు పంటలతో ఆదాయం పొందుతున్నారు.
శామీర్‌పేట్ మండలంలోని పొన్నాల్, బాబాగూడ, పోతారం, నారాయణపూర్, అనంతారం, కొల్తూర్, ఉద్దెమర్రి, పోతాయిపల్లి, తూంకుంట తదితర ప్రాంతాల్లోని రైతులు సుమారు వెయ్యి ఎకరాల్లో మిశ్రమ పంటలు పండిస్తున్నారు. రాబోయే కాలంలో మరింత ఎక్కువ విస్తీర్ణంలో మిశ్రమ పంటలు సాగయ్యే సూచనలు కనిపిస్తున్నాయని వ్యవసాయ శాఖ అధికారులు తెలియజేస్తున్నారు. మిశ్రమ పంటలకు డ్రిప్ మల్చింగ్ విధానం మరింత సౌలభ్యాన్ని కల్గిస్తున్నాయని రైతులు పేర్కొంటున్నారు.
మిశ్రమ పంటలపై రైతుల ఆసక్తి
Published Mon, Sep 8 2014 10:29 PM | Last Updated on Mon, Oct 1 2018 2:03 PM
Advertisement