హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లా శామీర్పేటలోని ఎస్బీహెచ్ బ్రాంచ్లో చోరీకి దుండగులు మంగళవారం అర్థరాత్రి యత్నించారు. ఆ క్రమంలో బ్యాంక్ గ్రిల్స్ తొలగించేందుకు వారు ప్రయత్నిస్తున్నారు. అయితే గస్తీ తిరుగుతున్న పోలీసులు ఆ విషయాన్ని గమనించి... దుండగులను పట్టుకునేందుకు ప్రయత్నించారు. దాంతో దుండగులు అక్కడి నుంచి పరారైయ్యారు. దీంతో పోలీసులు అప్రమత్తమై... దుండగుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఆ క్రమంలో పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నారు.