bank robbery
-
నిజామాబాద్ జిల్లాలో దోపిడీ దొంగల బీభత్సం
-
Viral Video: దొంగలతో మహిళా కానిస్టేబుళ్ల వీరోచిత పోరాటం
బ్యాంక్‌ను కొల్లగొట్టేందుకు ప్రయత్నించిన దుండగులతో వీరోచితంగా పోరాడారు ఇద్దరు మహిళా పోలీస్ కానిస్టేబుళ్లు.. దొంగల పట్ల మహిళలు చూపిన ధైర్యం, తెగువను పలువురు ప్రశంసిస్తున్నారు. ఈ ఘటన బిహార్ రాష్ట్రంలోని హాజీపూర్‌లో చోటుచేసుకుంది. వివరాలు.. సదర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సెందూరి చౌక్‌లో ఉన్న ఉత్తర్ బిహార్ గ్రామీణ బ్యాంక్ వద్ద బ్యాంక్ వద్ద జుహీ కుమారీ, శాంతీ కుమారీ అనే ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లు సెక్యూరిటీగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ క్రమంలో ఓ రోజు ముగ్గురు వ్యక్తులు బ్యాంక్‌లోకి ప్రవేశించడానికి ప్రయత్నించారు. వాళ్ల ప్రవర్తన అనుమానంగా కనిపించడంతో ఏ పనిమీద వచ్చారని జుహీ ప్రశ్నించింది. దీనికి వారు బ్యాంక్‌లో పని ఉందని చెప్పగా.. పాస్‌బుక్ చూపించమని అడిగింది. దీంతో ముగ్గురిలో ఓ వ్యక్తి రివాల్వర్ బయటకు తీశాడు. వెంటనే అప్రమత్తమైన ఇద్దరు కానిస్టేబుళ్లు తమ తుపాకులతో వారిని నిలవురించారు. కానిస్టేబుళ్ల వద్ద ఉన్న తుపాకులను లాక్కోవడానికి దొంగల విఫల ప్రయత్నం చేశారు. దొంగల చేతిలో గన్ ఉన్నప్పటికీ ఏమాత్రం భయపడలేదు. మహిళలిద్దరూ ముగ్గురు దుండగులపై సాహోసోపేతంగా పోరాడారు. అప్పటికే బ్యాంకులో దొంగతనం చేయడం కుదిరేలా లేదని భయపడ్డ దొంగలు అక్కడి నుంచి పరారయ్యారు. ఇదంతా బ్యాంకులో అమర్చిన సీసీటీవీ కెమెరాలలో రికార్డ్ అయ్యింది. పారిపోయిన దొంగలను పట్టుకునే ప్రయత్నంలో పోలీసులు ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారింది. దొంగలను ధైర్యంగా ఎదుర్కొని, తరిమికొట్టిన మహిళా కానిస్టేబుళ్లను బ్యాంకు సిబ్బందితో పాటు పోలీసు ఉన్నతాధికారులు ప్రశంసలు కురిపించారు. ప్రస్తుతం ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని బ్యాంక్ దోపిడికి ప్రయత్నించిన నిందితుల కోసం గాలిస్తున్నారు. సెందూరి వద్ద ఉదయం 11 గంటల సమయంలో ముగ్గురు వ్యక్తులు బ్యాంకును దోచుకోవడానికి ప్రయత్నించారని.. తమ మహిళా కానిస్టేబుళ్లు అసాధారణమైన ధైర్యాన్ని ప్రదర్శించి వారిని భయపెట్టగలిగారని సీనియర్ పోలీసు అధికారి ఓం ప్రకాష్ తెలిపారు.. ఈ ఘటనలో ఎలాంటి కాల్పులు జరగలేదని.. కానిస్టేబుళ్లకు రివార్డ్ అందిస్తామని పేర్కొన్నారు. చదవండి: దారుణం.. బైకర్‌ను ఢీకొట్టి 1.5 కిమీ ఈడ్చుకెళ్లిన ఆటో డ్రైవర్.. అరుస్తున్నా ఆపకుండా.. The Gallant act of two lady constables of Bihar Police is laudable. Their bravery thwarted an attempt of Bank Robbery in Vaishali.#Bihar_Police_Action_against_Criminal pic.twitter.com/M3Nn9w33Xw — Sawant Suman ساونت سمن 🇮🇳💙 (@SumanSawant) January 19, 2023 -
ఏం తెలివిరా నాయనా.. బ్యాంకులో కోటి విలువ చేసే బంగారం చోరి!
దొంగలు దొంగతనం చేసేందుకు తమ రూట్ మార్చుకుంటున్నారు. దొంగతనం కోసం క్రేజీగా థింక్ చేస్తున్నారు. తాజాగా అలాంటి ఘటనే ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. కేటుగాళ్లు ఏకంగా బ్యాంక్‌ను టార్గెట్ చేసి రూ.కోటి విలువ చేసే 1.8కేజీల బంగారం దొంగిలించారు. వారు దొంగతనం చేసి ప్లాన్ చూసి పోలీసులు ఖంగుతిన్నారు. వివరాల ప్రకారం.. కాన్పూర్‌లోని ఎస్బీఐ భనుతి శాఖలో భారీ దొంగతనం జరిగింది. దొంగతనం జరిగిన విషయంలో ఉద్యోగులు ఆఫీసుకు వచ్చిన తర్వాత వారికి ఈ విషయం బోధపడింది. అయితే, దొంగతనం కోసం దొంగలు మాస్టర్ ప్లాన్ వేసి స్కెచ్ గీసుకున్నారు. ప్లాన్ ప్రకారం.. ఆఫీసు పక్కనే ఉన్న ఖాళీ స్థలం నుంచి బ్యాంకులోని స్ట్రాంగ్‌రూంలోకి 10 అడుగుల సొరంగం తవ్వి బ్యాంక్‌లోకి చేరుకున్నారు. అనంతరం.. లాకర్‌ను పగలగొట్టి అందులో ఉన్న రూ.కోటి విలువ చేసే 1.8కేజీల బంగారం చోరీ చేశారు. ఉదయం బ్యాంక్‌కు వచ్చిన ఉద్యోగులకు ఈ విషయం తెలిసి షాకయ్యారు. ఈ క్రమంలో ఎంత సొమ్ము దొంగతనం చేశారో తెలుసుకునేందు బ్యాంకు అధికారుల తల ప్రాణం తోకకు వచ్చింది. కొన్ని గంటల తర్వాత ఎంత సొమ్ము చోరీకి గురైందో అంచనా వచ్చారు. దీంతో, వెంటనే బ్యాంకు అధికారులు ఈ విషయాన్ని పోలీసులకు చెప్పడంతో రంగంలో దిగిన టీమ్.. ఫింగర్ ప్రింట్స్, ఇతర ఆధారాల ద్వారా దొంగల కోసం గాలింపు ప్రక్రియ చేపటినట్టు తెలిపారు. అయితే, బ్యాంకు గురించి బాగా తెలిసిన వ్యక్తులే ఈ దోపిడీకి పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. #Kanpur में सचेंडी स्थित #SBI बैंक की शाखा में चोरों ने रात के समय सुरंग बनाकर गोल्ड रूम का दरवाजा तोड़ा और अंदर जितना भी सोना रखा था, सब चुरा कर ले गए। सुबह जब बैंक कर्मचारी शाखा पहुंचे और उन्हें इसका पता लगा तो तुरंत पुलिस को सूचना दी गई।#UPPolice pic.twitter.com/9171dEY2zi — UP Tak (@UPTakOfficial) December 24, 2022 -
ఉబర్‌లో కారు బుక్ చేసుకొని వెళ్లి బ్యాంకు దోచేశాడు.. కానీ చివరకు..
వాషింగ్టన్: అమెరికాలో ఓ దొంగ సినీఫక్కీలో చోరీ చేశాడు. దర్జాగా ఉబర్‌లో కారు బుక్ చేసుకుని వెళ్లి బ్యాంకు దోపిడీకి పాల్పడ్డాడు. అనంతరం అదే కారులో ఇంటికి తిరిగివెళ్లాడు. ఇంత జరిగినా డ్రైవర్‌కు దొంగతనం గురించి అసలు తెలియకపోవడం గమనార్హం. పోలీసులు వచ్చాకే అతనికి అసలు విషయం తెలిసి కంగుతిన్నాడు. అమెరికా మిచిగాన్ సౌత్‌ఫీల్డ్‌లో నవంబర్ 16న ఈ ఘటన జరిగింది. చోరీకి పాల్పడిన వ్యక్తి పేరు జెసన్ క్రిస్ట్మస్(42). ప్లాన్ ప్రకారం కారు బుక్ చేసుకున్న ఇతడు బ్యాంకులో పని ఉందని డ్రైవర్‌ను హంటింగ్టన్ బ్యాంకు వద్దకు తీసుకెళ్లాడు. తాను తిరిగి వచ్చే వరకు వెయిట్ చేయాలని చెప్పాడు. దీంతో డ్రైవర్ బ్యాంకు బయటే ఉన్నాడు. అనంతరం తుపాకీతో బ్యాంకు లోపలికి వెళ్లిన జేసన్.. అధికారులను బెదిరించి డబ్బు తీసుకున్నాడు. తర్వాత హుందాగా తిరిగి కారు వద్దకు వచ్చాడు. మళ్లీ ఇంటికి తీసుకెళ్లమని డ్రైవర్‌కు చెప్పాడు. దీంతో అతడు జేసన్‌న తిరిగి తన ఫ్లాట్‌లో డ్రాప్ చేశాడు. వెంటనే పట్టుకున్న పోలీసులు.. అయితే సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే జేసన్ ఫ్లాట్‌కు వెళ్లారు. అతడికి బేడీలు వేసి అదుపులోకి తీసుకున్నారు. కానీ దొంగ దస్తులపై ఎరుపు రంగు కన్పించడంతో ఎవరైనా షూట్ చేశారా? అని పోలీసులు అడిగారు. అలాంటిదేం లేదని, అది రంగు అని.. బ్యాంకు నుంచే తీసుకువచ్చినట్లు నిందితుడు చెప్పాడు. మరోవైపు డ్రైవర్‌ను కూడా అరెస్టు చేసేందుకు వెళ్లిన పోలీసులను చూసి అతడు షాక్ అయ్యాడు. తనకు ఈ దొంగతనం గురించి ఏమీ తెలియదని వాపోయాడు. పోలీసులు కూడా అతనికి నిజంగానే సంబంధం లేదని నిర్ధరించుకున్నారు. ప్యాసెంజర్ గురించి వివరాలు తెలుసుకోకుండా రైడ్‌కెలా తీసుకెళ్లావని ప్రశ్నించారు. మరోసారి ఎవరైనా అనుమానంగా కన్పిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. ఈ తరహా దొంగతనాలు నగరంలో జరగలేదని పోలీసులు చెప్పారు. క్యాబ్ బుక్ చేసుకుని వెళ్లి దోపిడీలు చేసిన దాఖలాలు లేవని పేర్కొన్నారు. పండగ సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని బంధువులు, కుటుంబసభ్యులకు ఖరీదైన బహుమతులు, వస్తువులు ఇవ్వడానికే జేసన్ క్రిస్టియన్ ఈ దోపిడీ చేసి ఉంటాడని అనుమానిస్తున్నారు. అతడి నుంచి నగదు స్వాధీనం చేసుకున్నారు. ఆ నోట్లకు కూడా ఎర్ర రంగు అంటుకొని ఉంది. చదవండి: ఖరీదైన రెస్టారెంట్.. బిల్లుచూసి కళ్లు తేలేసిన నెటిజన్లు.. ఏకంగా రూ.1.3 కోట్లు! -
ఇంటి దొంగ గుట్టురట్టు.. అసలు సూత్రధారి బ్యాంకు మేనేజరే!
శ్రీకాళహస్తి: గత నెల 26న శ్రీకాళహస్తిలోని ఫిన్‌కేర్ బ్యాంకు దోపిడీ కేసులో బ్యాంకు మేనేజర్ స్రవంతితో సహా ఎనిమిది మందిని అరెస్టు చేసినట్లు తిరుపతి ఎస్పీ పరమేశ్వరరెడ్డి తెలిపారు. గురువారం 1వ పట్టణ పోలీసుస్టేషన్లో ఆయన నిందితుల అరెస్టును మీడియాకు చూపారు. బ్యాంకు దోపిడీ కేసులో మేనేజర్ స్రవంతిదే కీలకపాత్రని వెల్లడించారు. పట్టణంలో ముత్యాలమ్మ గుడి వీధిలోని ఓ అపార్ట్మెంట్లో నివసిస్తున్న స్రవంతి ఐదేళ్లుగా ఫిన్‌కేర్ బ్యాంకులో మేనేజర్‌గా పనిచేస్తోంది. అదే వీధికి చెందిన జనసేన నేత విజయకుమార్‌తో సన్నిహితంగా ఉంటోంది. అలాగే అదే ప్రాంతానికి చెందిన నవీన్, సుల్తాన్లతోనూ స్రవంతికి స్నేహం ఉంది. నవీన్, సుల్తాన్లు కారు డ్రైవర్లుగా పనిచేస్తున్నారు. కొంత కాలం క్రితం నుంచి స్రవంతి బ్యాంకులో పలు అవకతవకలకు పాల్పడింది. తన స్నేహితులు, తెలిసినవారి పేర్లతో పెద్ద ఎత్తున నకిలీ బంగారాన్ని తాకట్టు పెట్టి రుణం పొందింది. ఆడిటింగ్‌లో దొరక్కుండా జాగ్రత్త పడింది. ఎప్పటికీ దొరకకుండా ఉండేందుకు తన మిత్రులు ముగ్గురితో కలిసి డ్రామాకు తెరలేపింది. ఇందులో భాగంగా విజయకుమార్, సుల్తాన్, నవీన్, చెన్నైకు చెందిన హుస్సేన్, గురురాజ్, ఆంటోనీరాజ్, అరుణ్‌తో కలిసి పథకం వేశారు. గత నెల 26 అర్ధరాత్రి స్రవంతి బ్యాంకులో ఒంటరిగా ఉన్నట్లు సమాచారం ఇచ్చింది. దీంతో ఆమె స్నేహితులు బ్యాంకులోకి ప్రవేశించారు. బ్యాంకులో ఉన్న నగలు, నగదును బ్యాగులో వేసుకుని వెళ్లిపోయారు. సీసీ కెమెరాలు ధ్వంసం చేసి హార్డ్‌డిస్కులను తీసుకెళ్లిపోయారు. అయితే స్రవంతి దోపిడీకి ముందే బ్యాంకులో కొంత బంగారాన్ని ఇంట్లోనే దాచేసింది. పోలీసుల విచారణలో దోపిడీలో స్రవంతిని కీలక సూత్రధారిగా నిర్ధారించారు. ఆమె ఇచ్చిన సమాచారంతో మిగిలిన నిందితులను అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి సుమారు రూ.3.50 లక్షల నగదు, 1274 గ్రాముల నగలు, 874 గ్రాముల నకిలీ బంగారం స్వాధీనం చేసుకున్నారు. అసలు బంగారు ఆభరణాలను తీసుకువెళ్లిన స్రవంతి వాటిని పలు ప్రైవేటు బ్యాంకుల్లో తనఖా పెట్టినట్లు గుర్తించారు. -
Srikalahasti: ఫిన్‌కేర్ బ్యాంక్ దోపిడీ కేసులో కొత్తకోణం
-
శ్రీకాళహస్తి ఫిన్‌కేర్ బ్యాంక్ దోపిడి కేసులో కొత్త కోణం
సాక్షి, తిరుపతి: శ్రీకాళహస్తి ఫిన్‌కేర్ బ్యాంక్ దోపిడి కేసులో కొత్త కోణం వెలుగు చూసింది. బ్యాంకు మేనేజర్ స్రవంతిని పోలీసులు విచారించగా వెలుగులోకి ఆసక్తికర అంశాలు బయటపడ్డాయి. ఫిన్ కేర్ బ్యాంకులో కస్టమర్లు తాకట్టు పెట్టిన కిలోకు పైగా బంగారాన్ని ముత్తూట్ ఫైనాన్స్‌లో తాకట్టు పెట్టి క్యాష్ చేస్తుకుంది మేనేజర్ స్రవంతి. ఈ వ్యవహారమంతా వేరే వ్యక్తుల పేర్లతో నడపింది. ఎవరీ అనుమానం రాకుండా బయట వ్యక్తులతో బేరం కుదర్చుకని ఫిన్‌కేర్ కస్టమర్ల బంగారాన్ని మూత్తూట్లో తాకట్టు పెట్టింది. కానీ బ్యాంక్ ఉన్నతాధికారుల ఫిర్యాదులో నిజాలు వెలుగులోకి మేనేజర్ స్రవంతి నిర్వాకం బయటపడింది. కాగా.. బ్యాంకులో దొంగలు పడి దోచుకెళ్లారని ఖాతాదారులను, పోలీసులను బురిడీ కొట్టించే ప్రయత్నం చేసిన మేనజర్ స్రవంతి అడ్డంగా దొరికిపోయింది. ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడేందుకు బ్యాంక్‌కు కన్నం వేసినట్లు స్రవంతి తెలిపింది. మేనేజర్ నుంచి దోపిడి సొత్తు రికవరీ చేసే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. కాగా స్రవంతి గత నాలుగేళ్లుగా ఫిన్‌కేర్ బ్యాంక్‌లో బ్రాంచ్ మేనేజర్‌గా అప్రైజర్‌గా కొనసాగుతోంది.\ చదవండి: ఇంటర్ స్టూడెంట్ పాడుపని.. బాలికను ఇంటికి తీసుకెళ్లి.. -
శ్రీకాళహస్తి ఫిన్‌కేర్ బ్యాంక్ చోరీ కేసులో భారీ ట్విస్ట్
-
శ్రీకాళహస్తి ఫిన్‌కేర్ బ్యాంక్ చోరీ కేసులో భారీ ట్విస్ట్
సాక్షి, తిరుపతి: శ్రీకాళహస్తి ఫిన్‌కేర్ బ్యాంక్ చోరీ కేసులో భారీ ట్విస్ట్ చోటుచేసుకుంది. దోపిడీపై పిర్యాదు ఇచ్చిన బ్యాంక్ మేనేజర్ స్రవంతినే అసలు దొంగగా పోలీసులు నిర్ధారించారు. కేసుపై దర్యాప్తు ప్రారంభించిన పోలీసులకు ముందు నుంచే ఇంటి దొంగల ప్రాతపై అనుమానం కలిగింది. స్రవంతి బ్యాంకులో గిల్టు నగలు తాకట్టు పెట్టి డబ్బు కాజేసినట్లు పోలీసులు గుర్తించారు. అయితే ఆడిట్లో వ్యవహారం బయటపడుతందని దొంగతనం డ్రామా ఆడినట్లు తేల్చారు. ఇందుకు చెన్నైకి చెందిన ముగ్గురు యువకులతో కాంట్రాక్టు కుదుర్చుకొని బ్యాంకు దోపిడికి ప్లాన్ వేసినట్లు తెలిపారు. స్రవంతి ప్లాన్ ప్రకారం దుండగులు బ్యాంక్ లాకర్ నుంచి 67 ప్యాకెట్లలోని దాదాపు రెండు కేజీల బంగారం, 5 క్షల రుపాలయు నగదు ఎత్తుకెళ్లారు. తన చేతులు కట్టేసి అరవకుండా నోటిలో గుడ్డనొక్కి కత్తితో బెదిరించి చోరీ చేశారని స్రవంతి పోలీసులకు ఫిర్యాదు ఇచ్చింది. అయితే ముందు నుంచే స్రవంతిపై అనుమానపడ్డ పోలీసులు ఆమె నుంచే అసలు నిజాన్ని రాబట్టారు. బ్యాంకులో దొంగలు పడి దోచుకెళ్లారని ఖాతాదారులను, పోలీసులను బురిడీ కొట్టించే ప్రయత్నం చేసి అడ్డంగా దొరికిపోయింది. ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడేందుకు స్రవంతి బ్యాంక్‌కు కన్నం వేసినట్లు పోలీసులు తెలిపారు. స్రవంతి నుంచి దోపిడి సొత్తు రికవరీ చేసే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. కాగా స్రవంతి గత నాలుగేళ్లుగా ఫిన్‌కేర్ బ్యాంక్‌లో బ్రాంచ్ మేనేజర్‌గా అప్రైజర్‌గా కొనసాగుతోంది. సోమవారం స్రవంతితో పాటు చోరీకి పాల్పడ్డ దుండగులను అరెస్టు చేసి మీడియా ముందు హాజరుపరచనున్నారు. చదవండి: ఏం జరిగిందో.. స్నేహితుడి గదికి వెళ్లి.. తెల్లారే సరికి.. -
బ్యాంక్‌కు షాకిచ్చిన క్యాషియర్.. ఐపీఎల్ బెట్టింగ్‌లో..
సాక్షి, హైదరాబాద్: వనస్థలీపురం బ్యాంక్ చోరీ కేసులో కొత్తకోణం వెలుగులోకి వచ్చింది. బెట్టింగ్‌లో నష్టపోయి చోరీ చేశానంటూ క్యాషియర్ ప్రవీణ్.. బ్యాంక్ మేనేజర్‌కి మెసేజ్ చేశాడు. బెట్టింగ్‌లో వచ్చేస్తే తిరిగిస్తానని లేకపోతే ఆత్మహత్య చేసుకుంటానని కూడా బ్యాంకు ఉద్యోగులకు సమాచారమిచ్చినట్లుగా తెలుస్తోంది. కాగా, రెండ్రోజుల కిత్రం బ్యాంకులో 22 లక్షల 53వేలతో క్యాషియర్ ప్రవీణ్ పరారయ్యాడు. బ్యాంక్ మేనేజర్ ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రవీణ్ కోసం మూడు ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. చదవండి: (పెళ్లింట పెనువిషాదం: జీలకర్ర బెల్లం సమయానికి కుప్పకూలిన వధువు) -
తుపాకితో బెదిరించి బ్యాంక్ దోపిడీ
కశింకోట: గుర్తు తెలియని ఆగంతకుడు బ్యాంక్‌లోకి ప్రవేశించి.. తుపాకితో బెదిరించి రూ.3.31 లక్షలను దోచుకెళ్లాడు. అనకాపల్లి జిల్లా కశింకోట మండలం నరసింగబిల్లిలోని ఏపీ గ్రామీణ వికాస బ్యాంక్ శాఖలో శనివారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. జాతీయ రహదారిని ఆనుకుని జనసమ్మర్దం గల ప్రాంతంలో ఈ దోపీడీ జరగడంతో ప్రజలు ఉలిక్కిపడ్డారు. భోజన విరామ సమయంలో సుమారు 30 ఏళ్ల వయసు గల ఓ వ్యక్తి ముఖానికి మాస్కు, తలకు హెల్మెట్ ధరించి బ్యాంక్‌లోకి ప్రవేశించాడు. ఆ సమయంలో క్యాషియర్ వి.ప్రతాపరెడ్డి ఒక్కరే ఉండగా.. అతడి వద్దకు వెళ్లిన ఆగంతకుడు తుపాకి చూపుతూ బెదిరించాడు. బ్యాంక్ సేఫ్ లాకర్ తెరవమని గదమాయించాడు. మేనేజర్ ఉంటే తప్ప డబుల్ లాకర్ తెరవలేమని బదులిచ్చిన క్యాషియర్ భయంతో లాకర్ గదిలోకి వెళ్లి తలుపులు మూసి దాక్కున్నారు. ఆగంతకుడు చేసేది లేక క్యాష్ కౌంటర్లో ఉన్న రూ.3.31 లక్షల నగదును తీసుకుని దర్జాగా వెళ్లిపోయాడు. ఆ సమయంలో బ్యాంక్ ఇన్చార్జి మేనేజర్, మెసెంజర్ భోజనానికి వెళ్లారు. ఖాతాదారులెవరూ లేరు. ఇంతలో భోజనానికి వెళ్లిన సిబ్బంది రావడంతో లాకర్ గది నుంచి క్యాషియర్ బయటకు వచ్చి దోపిడీ జరిగిన విషయాన్ని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్పీ గౌతం సాలి బ్యాంక్‌ను సందర్శించి వివరాలు సేకరించారు. ట్రైనీ ఏఎస్పీ సునిల్ సెహవాన్, అనకాపల్లి డీఎస్పీ సునిల్ విచారణ చేపట్టారు. క్లూస్ టీమ్ వచ్చి వేలిముద్రలు సేకరించింది. -
రూ.1.26 కోట్లతో పరారైన దొంగలు దొరికారు
నెల్లూరు (క్రైమ్): బ్యాంకులో జమ చేయాల్సిన నగదుతో పరారైన నిందితులు దొరికారు. వారి వద్ద నుంచి రూ.1,11,20,000 నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నెల్లూరు ఉమేష్‌చంద్ర మెమోరియల్ కాన్ఫరెన్స్ హాలులో జిల్లా ఎస్పీ సీహెచ్ విజయారావు కేసు పూర్వాపరాలను విలేకరులకు వెల్లడించారు. నెల్లూరు సారాయంగడి సెంటర్‌కు చెందిన షేక్ రబ్బాని మూడేళ్లుగా బాలాజీనగర్‌లోని రైటర్స్ సేఫ్ గార్డ్స్ సంస్థలో కస్టోడియన్‌గా పనిచేస్తున్నాడు. సంస్థ నిర్దేశిత షాపింగ్‌మాళ్లు, హాస్పిటళ్లు తదితర సంస్థల వద్ద రోజువారీ కలెక్షన్ సేకరించి ఆ వ్యాపార సంస్థలకు చెందిన బ్యాంకు ఖాతాల్లో జమచేస్తుంటాడు. ఈ క్రమంలో ఆగస్టు 31న రబ్బాని, అతని సహచర ఇద్దరు కస్టోడియన్లు రోజువారీ కలెక్షన్ రూ.1,26,08,450 నగదును సేకరించారు. దాన్ని బ్యాంకులో జమచేయాలని వారు రబ్బానికి ఇచ్చారు. రబ్బాని తన స్నేహితులైన సారాయంగడి సెంటర్‌కు చెందిన పాతనేరస్తుడు షేక్ రఫీ అలియాస్ గాంధీ, నెల్లూరు రూరల్ మండలం దేవరపాలెంకు చెందిన షేక్ మస్తాన్ అలియాస్ దూద్కలతో కలిసి నగదుతో ఉడాయించాడు. కొంత నగదును తెలిసిన వారివద్ద పెట్టి మిగిలిన నగదును తమవెంట తీసుకెళ్లారు. ఈ ఘటనపై సంస్థ రూట్ లీడర్ తిరుపతిరావు ఈనెల 1న చిన్నబజారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నగర, సీసీఎస్ డీఎస్పీలు జె.శ్రీనివాసులరెడ్డి, శివాజీరాజా తమ సిబ్బందితో 8 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నిందితుల కోసం గాలింపు చేపట్టారు. పోలీసులు సాంకేతికతను వినియోగించుకుని నిందితుల ఆచూకీ కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు. నిందితులు పోలీసులకు చిక్కకుండా ఉత్తరప్రదేశ్, రాజస్తాన్, మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాల్లో తిరుగుతూ జల్సాలు చేయసాగారు. తీసుకెళ్లిన నగదు ఖర్చు అయిపోవడంతో మిగిలిన నగదును తీసుకెళ్లేందుకు సోమవారం నెల్లూరుకు వచ్చారు. నవబాల దుర్గాదేవి గుడి సమీపంలోని చెరువుకట్ట వద్ద ఉండగా సమాచారం అందుకున్న పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని విచారించారు. వారి వద్ద నుంచి రూ.1,11,20,000 నగదును స్వాధీనం చేసుకుని అరెస్ట్ చేశారు. -
బ్యాంకులో రూ. 2.23 కోట్ల బంగారం చోరీ
బాపట్ల: గుంటూరు జిల్లా బాపట్లలోని బ్యాంక్ ఆఫ్ బరోడా (బీవోబీ)లో రూ.2.23 కోట్ల విలువైన 5 కిలోలకుపైగా బంగారం మాయమైంది. ఈ బంగారాన్ని కాజేసినవారు ఒక ప్రైవేటు ఫైనాన్స్ కంపెనీలో తాకట్టుపెట్టి రూ.60 లక్షలు తీసుకున్నారు. బ్యాంకు తాత్కాలిక ఉద్యోగి ప్యార్లీ సుమంత్‌రాజ్ పరారీలో ఉన్నాడు. దీనికి సంబంధించి ఇద్దరు అనుమానితుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బ్యాంకులో తాము కుదువపెట్టిన బంగారం మాయం కావడంతో ఖాతాదారులు సోమవారం బ్యాంకు వద్ద ఆందోళన వ్యక్తం చేశారు. బ్యాంకు తాత్కాలిక ఉద్యోగి సుమంత్‌రాజ్ సూత్రధారిగా ఈ చోరీ జరిగినట్లు డీఎస్పీ ఎ.శ్రీనివాసరావు సోమవారం స్థానిక టౌన్ పోలీసు స్టేషన్లో విలేకరులతో చెప్పారు. తమ బ్యాంకులో ఖాతాదారులు కుదువ పెట్టుకున్న రూ.2.23 కోట్ల విలువ చేసే బంగారు ఆభరణాలు చోరీకి గురయ్యాయని బ్యాంక్ ఆఫ్ బరోడా రీజనల్ మేనేజర్ విద్యాసాగర్ ఆదివారం రాత్రి ఫిర్యాదు చేశారని తెలిపారు. పరారీలో ఉన్న సుమంత్‌రాజ్ కోసం ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నామని, ఈ వ్యవహారంలో ఇంకా ఎవరి పాత్ర ఉందనే విషయాన్ని దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. చోరీచేసిన 5 కిలోల 8 గ్రాముల బంగారంలో 80 శాతాన్ని ఓ ఫైనాన్స్ కంపెనీలో తాకట్టు పెట్టి రూ.60 లక్షలు తీసుకున్నట్లు గుర్తించారు. తాకట్టు పెట్టేందుకు సహకరించారనే అనుమానంతో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. సీఐలు పి.కృష్ణయ్య, కడప శ్రీనివాసరెడ్డి, ఎస్.ఐ.లు మహ్మద్‌రఫీ, వెంకటప్రసాద్ తదితరులు దర్యాప్తు చేస్తున్నారు. చోరీ బయటపడింది ఇలా.. విశ్వసనీయ సమాచారం మేరకు ఈ చోరీ గురించి నిందితుడే బయటపెట్టాడు. సాధారణంగా బ్యాంకులో బంగారు ఆభరణాలపై ఏడాదిలో రెండు, మూడుసార్లు శాఖాపరమైన ఆడిట్ నిర్వహిస్తారు. బాపట్ల బీవోబీలో ఆభరణాలను తనిఖీ చేసేందుకు అధికారులు వస్తున్నట్లు ఈనెల ఒకటో తేదీన ప్రకటించారు. ఈ నేపథ్యంలో సుమంత్‌రాజ్ ఒకటి, రెండో తేదీల్లో విధులకు హాజరుకాలేదు. తన విషయం బయటపడి ఉంటుందని భావించిన అతడు మూడోతేదీన బ్యాంకు ఉద్యోగి ఒకరికి.. తాను తన తల్లికి ఆపరేషన్ చేయించేందుకు బంగారు ఆభరణాలు తీసుకున్నానని వాట్సాప్ ద్వారా సమాచారం ఇచ్చాడు. ఆ ఆభరణాలను ప్రైవేటు ఫైనాన్స్ కంపెనీలో తాకట్టు పెట్టేందుకు సహకరించిన ఇద్దరి పేర్లను మరో మెసేజ్‌లో తెలిపినట్లు సమాచారం. దీంతో బ్యాంకు అధికారులు రీజనల్ మేనేజర్‌కు సమాచారం ఇచ్చి శాఖాపరమైన విచారణ చేపట్టారు. మొత్తం రూ.2.23 కోట్ల విలువైన ఆభరణాలు చోరీ అయినట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
ముసలోడు మామూలోడు కాదు.. ఆ చీటీలో ఏం రాశాడంటే..
2021, మార్చి 18 ఇంగ్లాండ్, హ్యాస్టింగ్స్లోని సేయింట్ లియోనార్డ్స్కు చెందిన 67 ఏళ్ల అలన్ స్టాటరీ ఈస్ట్బోర్న్లోని ఓ బ్యాంకులోకి ప్రవేశించాడు. నేరుగా క్యాషియర్ దగ్గరకు వెళ్లి అతడి చేతిలో ఓ చీటీ పెట్టాడు. రెండు ప్యాంట్స్ జేబుల్లో చేతులు పెట్టుకుని నిలబడ్డాడు. ఆ చీటీని చదవటానికి ప్రయత్నించి విఫలమయ్యాడు క్యాషియర్. అందులో ఏముందో అర్థంకాక దాన్ని పక్కన పెట్టేసి తన పనిలో మునిగిపోయాడు. ఆ క్యాషియర్ వైపు ఓ సారి ఎగాదిగా చూసి అక్కడినుంచి వెళ్లిపోయాడు స్లాటరీ. కొద్దిసేపటి తర్వాత ఆ చీటి బిల్డింగ్ సిబ్బంది ఒకరి దగ్గరకు చేరింది. దాన్ని చదివిన ఆ సిబ్బంది ఆ ముసలాయన ఏం రాశాడో అర్థమై ఒక్కసారిగా షాక్ తిన్నాడు. ఆ వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సీసీ టీవీ ఆధారంగా స్లాటరీ కోసం అన్వేషణ ప్రారంభించారు. 2021, మార్చి 26 స్లాటరీ ఈ సారి అదే బ్యాంకుకు చెందిన మరో బ్రాంచీకి వెళ్లాడు. క్యాషియర్ దగ్గరకు వెళ్లి మునుపటి లాగే ఓ చీటీ అతడి చేతిలో పెట్టాడు. అది చదివిన క్యాషియర్ భయపడిపోయాడు. వెంటనే 2,400 స్టెర్లింగ్ పౌండ్లు(దాదాపు రెండున్నర లక్షలు) అతడి చేతిలో పెట్టాడు. ముసలాయన డబ్బుతో బ్యాంకు బయటకు వచ్చాడు. కొన్ని గంటల తర్వాత నాట్వెస్ట్లోని మరో బ్యాంకుకు వెళ్లాడు. అక్కడ కూడా ఓ చీటీని క్యాషియర్ చేతిలో పెట్టాడు. చీటీని చదివిన సదరు క్యాషియర్ స్లాటరీపై సీరియస్ అవ్వటంతో చేసేదేమీ లేక అక్కడినుంచి బయటకు వచ్చేశాడు. ఈ మూడు బ్యాంకుల సీసీ టీవీ కెమెరాల్లో రికార్డయిన స్లాటరీ ఫుటేజీలను పోలీసులు సేకరించారు. స్టాటరీని అతడి ఇంటివద్ద అరెస్ట్ చేశారు. తాజాగా ఈ కేసుపై విచారణ జరిపిన కోర్టు అతడికి ఆరు సంవత్సరాల జైలు శిక్ష విధించింది. ఇంతకీ ఆ చీటిలో ఏముందంటే.. ‘‘ నా దగ్గర ఉన్న దాన్ని(పిస్టల్‌ను ఉద్దేశిస్తూ) మీ సీసీ కెమెరాలు బంధించక మానవు. మిగిలిన కస్టమర్ల గురించి కూడా ఓ సారి ఆలోచించు. మర్యాదగా నేనడిగిన డబ్బు(10s.. 20s) ఇవ్వు’’ అని రాసి ఉంది. -
గోడను బద్దలు కొట్టి.. రూ.55 లక్షలు దోపిడీ
న్యూఢిల్లీ: ఓ దొంగల ముఠా ఢిల్లీలోని షాహదారాలో ఓ బ్యాంకులో రూ.55 లక్షలు దోచుకెళ్లినట్లు పోలీసులు సోమవారం వెల్లడించారు. నిర్మాణంలో ఉన్న భవనంలోని ఓ గోడను పగలగొట్టి దొంగలు బ్యాంకులోకి ప్రవేశించినట్లు తెలిపారు. దొంగలు డ్రిల్‌తో సహా అవసరమైన అన్ని పరికరాలతో వచ్చినట్లు పేర్కొన్నారు. నగదు లాకర్లను పగులగొట్టి డబ్బులు దొంగిలించడానికి ఏడు నుంచి ఎనిమిది గంటల సమయం పడుతుందని అన్నారు. కాగా, డబ్బును ఖజానాలోని ఓ గదిలో ఉంచినట్లు సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. ఇక ఇతర భాగాలలో ఉంచిన అన్ని లాకర్లలోని నగదు, ఆభరణాలు సురక్షితంగా ఉన్నట్లు పేర్కొన్నారు. కాగా ఈ ఘటనపై ఫార్ష్ బజార్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. చదవండి: Guinness World Record: బతికే ఛాన్స్ జీరో.. బర్త్ డే వేడుకలు.. -
బ్యాంకుకే కన్నమేశారు..
మంథని: పెద్దపల్లి జిల్లా మంథని మండలం గుంజపడుగు గ్రామంలోని ఎస్బీఐ బ్రాంచ్‌కు దొంగలు కన్నమేశారు. రోడ్డు పక్కనే భవనం.. ఎప్పుడూ వాహనాల రద్దీ అయినా పక్కా ప్రణాళికతో బ్యాంకులోకి చొరబడిన దుండగులు గ్యాస్‌కట్టర్‌తో లాకర్‌ను కట్ చేసి సుమారు రూ.3కోట్ల విలువైన సొత్తుతో ఉడాయించారు. సినిమా ఫక్కీలో సాగిన ఈ చోరీలో ఏ ఒక్క ఆధారం వదలకుండా పోలీసులకు సవాల్ విసిరారు. దొంగలు వదిలి వెళ్లి గ్యాస్ సిలిండర్ ఒక్కటే పోలీసులకు దొరికింది. బుధవారం అర్ధరాత్రి, గురువారం వేకువజాము మధ్య సమయంలో జరిగిన ఈ సంఘటన సంచలనం సృష్టించింది. బ్యాంకు భవనం వెనుక కిటికీ కార్డ్‌బోర్డు పగులగొట్టి.. ఇనుప గ్రిల్స్ తొలగించి దుండగులు లోనికి చొరబడ్డారు. సుమారు 60 కిలోల బరువు ఉండే గ్యాస్ సిలిండర్ తెచ్చుకున్నారు. గ్యాస్ కట్టర్ సహాయంతో నగదు, బంగారం ఉంచిన స్ట్రాంగ్ రూం డోర్ కట్‌చేశారు. లాకర్‌ను కూడా గ్యాస్ కట్టర్‌తో కట్‌చేసి ఆరు కిలోల బంగారు ఆభరణాలు, రూ.18.46 లక్షల నగదు ఎత్తుకెళ్లారు. బ్యాంకు వెనక భాగంలో కన్నం వేసిన కిటికీ అక్కడే నిచ్చెన తయారీ.. దొంగలు బ్యాంకు వెనుకవైపు ఎత్తయిన ప్రహరీ దూకేందుకు అక్కడే ఉన్న తుమ్మచెట్ల కొమ్మలు నరికి నిచ్చెన తయారు చేసుకున్నారు. దాని సహాయంతో గోడ దూకిన దొంగలు గ్యాస్ సిలిండర్, ఇతర సామగ్రి గోడ దాటించారు. పని ముగించుకున్నాక నిచ్చెన, గ్యాస్ సిలిండర్ మాత్రం అక్కడే వదిలి వెళ్లారు. అలారం,సీసీ కెమెరాలు, కంప్యూటర్ ధ్వంసం.. అలారం మోగకుండా దొంగలు వైర్లు కత్తిరించారు. బ్యాంకులోని సీసీ కెమెరాలను కూడా ధ్వంసం చేశారు. గతం రికార్డులు కూడా దొరకకుండా కంప్యూటర్ను పగులగొట్టారు. సీసీ కెమెరాల ద్వారా రికార్డు అయ్యే డీవీఆర్ ఎత్తుకెళ్లారు. స్వీపర్ సమాచారంతో.. గురువారం ఉదయం బ్యాంకు శుభ్రం చేసేందుకు వచ్చిన స్వీపర్ మహిళ తాళం తీసి చూడగా లోపల సామగ్రి చిందరవందరగా పడిఉంది. బ్యాంకు మేనేజర్ ప్రహ్లాద్ సింగ్వా సూచన మేరకు గ్రామంలోనే ఉండే బ్యాంకు ఉద్యోగి వెళ్లి పరిశీలించారు. స్ట్రాంగ్ రూం, లాకర్ కట్‌చేసి ఉండడంతో చోరీ జరిగిందని నిర్ధారణకొచ్చారు. మంథని పోలీసులు బ్యాంకు వద్దకు చేరుకుని పరిశీలించారు. డాగ్‌స్క్వాడ్, ఫింగర్‌ప్రింట్ బృందాలను రప్పించారు. ఇంత భారీ చోరీ జరిగినా దొంగలు ఒక్క ఆధారం కూడా అక్కడ వదిలి వెళ్లకపోవడంతో ప్రొఫెషనల్ దొంగలు అయి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. కిటికీతోపాటు లాకర్ రూం, లాకర్, ఇతర వస్తువులపై వేలిముద్రలు లభించకపోవడం గమనార్హం. చెరువు కట్ట వరకు వెళ్లిన డాగ్ స్క్వాడ్.. డాగ్ స్క్వాడ్ దొంగల వాసనను పసిగట్టలేకపోయాయి. బ్యాంకులో, బయట ఆవరణలో తిరిగిన డాగ్స్, వెనుక సుమారు 100 మీటర్ల దూరంలో ఉన్న చెరువు కట్ట వరకు వెళ్లి ఆగిపోయాయి. దీని ఆధారంగా దొంగలు వారి వాహనాన్ని చెరువు కట్ట వద్ద వదిలి బ్యాంకు వరకు నడుచుకుంటూ వచ్చి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. కాగా, రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో జరిగిన దొంగతనాల్లో ఇదే అతిపెద్దదని సీపీ సత్యనారాయణ ప్రకటించారు. ఐదు రోజుల క్రితమే పికెట్ ఎత్తివేత.. గ్రామానికి చెందిన హైకోర్టు న్యాయవాద దంపతులు గట్టు వామన్‌రావు, నాగమణి దంపతులను ఫిబ్రవరి 17న కల్వచర్ల వద్ద గ్రామానికి చెందిన కుంట శ్రీను, చిరంజీవి దారుణంగా హత్య చేశారు. దీంతో గ్రామంలో సుమారు నెల రోజులుగా పోలీస్ పికెట్ కొనసాగుతుంది. ఈ కేసులో ఏడో నిందితుడు గ్రామానికి చెందిన వెల్ది వసంతరావును వారం క్రితమే అరెస్ట్ చేశారు. కేసు విచారణ కొలిక్కి రావడం, గ్రామంలో సాధారణ పరిస్థితులు నెలకొంటున్న నేపథ్యంలో ఐదు రోజుల క్రితం పికెట్ ఎత్తివేశారు. ఈ విషయాన్ని కూడా దొంగలు గమనించి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. పోలీసులకు చాలెంజ్.. బ్యాంకు చోరీ ఘటనను పోలీసులు చాలెంజ్‌గా తీసుకున్నారు. సీపీ సత్యనారాయణ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ఎలాంటి క్లూ దొరక్కపోయినా.. దొంగలను త్వరలోనే పట్టుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. దొంగలు 5 నుంచి 10 మంది వరకు ఉంటారని, వీరిని పట్టుకునేందుకు 8 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. దొంగలు ముందస్తుగా రెక్కీ నిర్వహించే చోరీకి పాల్పడి ఉంటారని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. కానరాని కనీస భద్రత చర్యలు.. ఎస్బీఐ గుంజపడుగు బ్రాంచ్‌లో గ్రామంతోపాటు సమీప గ్రామాల రైతులు ఎక్కువగా రుణాలు తీసుకుంటారు. వ్యవసాయ రుణాలతోపాటు బంగారం తాకట్టుపెట్టి రుణం పొందుతారు. చోరీకి గురైన బంగారంలో ఎక్కువ మొత్తం రైతులకు సబంధించిందే అని సమాచారం. కాగా, కొందరు రైతులు బుధవారం రుణాలు చెల్లించి బంగారం తీసుకున్నట్లు తెలిసింది. రూ.3 కోట్లకుపైగా విలువైన బంగారు ఆభరణాలు బ్యాంకులో ఉన్నా.. బ్యాంకు వద్ద కనీస భద్రత చర్యలు లేకపోవడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఒక సెక్యూరిటీ గార్డును నియమించకపోవడం నిర్లక్ష్యాన్ని ఎత్తిచూపుతోంది. మరోవైపు కిటికీ వద్ద శాశ్వత గోడ కట్టించాల్సిన అధికారులు కార్డ్బోర్డ్ కొట్టి వదిలేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కొన్నేళ్ల క్రితం గుర్తుతెలియని వ్యక్తులు బ్యాంకు అద్దాలు పగులగొట్టి చోరీకి యత్నించినట్లు స్థానికులు పేర్కొన్నారు. అయినా భద్రత విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. -
సొంత బ్యాంకుకే కన్నం వేసిన క్యాషియర్
-
సొంత బ్యాంకుకే కన్నం వేసిన క్యాషియర్
సాక్షి, కృష్ణా: నూజివీడు పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో బుధవారం ఘరానా మోసం బట్టబయలైంది. హెడ్ క్యాషియర్‌గా పనిచేస్తున్న గుండ్ర రవితేజ కోట్ల రూపాయలను ఖాచేసి సొంత బ్యాంకుకే కన్నం వేశాడు. రూ. 1,56,56,897 కోట్ల ఖాతాదారుల నగదును బ్యాంక్ నుంచి కాచేసి చేతి వాటం చూపించాడు. దీనిపై బ్యాంక్ చీఫ్ మేనేజర్ మాట్లాడుతూ.. రవీతేజ 2017లో నుంచి బ్యాంక్‌లో పనిచేస్తున్నాడని చెప్పాడు. కాగా ఖాతాదారుల నగదును, ఫిక్సిడ్ డిపాజిట్లను తన అకౌంట్‌కు బదిలీ చేసుకున్నట్లు క్యాష్ తనిఖీలో వెల్లడైందని ఆయన తెలిపారు. వెంటనే నూజివీడు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఆయన పేర్కొన్నాడు. కాగా రవీతేజకు ఆన్లైన్లో రమ్మీ, కాసినో ఆటలకు అలవాడు పడి ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసుల విచారణతో తెలింది. బ్యాంక్ చీఫ్ మేనేజర్ ఫిర్యాదు మేరకు రవీతేజపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. -
హాలీవుడ్ సినిమా చూసి..
లక్నో: సినిమాలు అతిగా చూసే వారిపై ఆ ప్రభావం ఎంతో కొంత పడుతుంది. పలనా సినిమా నుంచి స్ఫూర్తి పొందానంటూ కూడా కొందరు చెబుతూ ఉంటారు. తాజాగా ఉత్తరప్రదేశ్‌లో జరిగిన సంఘటన కూడా ఇలాంటిదే. ఓ వ్యక్తి హాలీవుడ్ సినిమా చూసి ఏకంగా బ్యాంకుకే కన్నంవేశాడు. ఈ విషయాన్ని స్వయంగా అతనే పోలీసుల విచారణలో తెలిపాడు. వివరాలు యూపీలోని కొద్వార్ ప్రాంతానికి చెందిన వికుల్ రాతి స్థానిక కోపరేటీవ్ బ్యాంకులో ఇటీవల దోపిడీకి పాల్పడ్డాడు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు దగ్గరలోని సీసీ కెమెరాలను పరిశీలించగా.. వికుల్ అని తేలింది. దీంతో అతన్ని అరెస్ట్ చేశారు. వారి విచారణలో దోపిడీకి పాల్పడ్డ వ్యక్తి అన్ని వివరాలను వెల్లడించారు. తాను ఇటీవల ఓ హాలీవుడ్ సినిమా చూశానని, అందులో బ్యాంకులు సునాయాశంగా దోచుకున్నారని తెలిపాడు. తాను కూడా వారు అనుసరించిన విధంగానే ప్రయత్నించి దోపిడీకి పాల్పడినట్లు తెలిపాడు. అయితే వారం వ్యవధిలోనే అతను మూడుసార్లు దోపిడీకి ప్రయత్నించినట్లు ఒప్పుకున్నాడు. అయితే తాను మరో బ్యాంకు నుంచి రూ. 20లక్షల అప్పు తీసుకున్నానని, దానిని తీర్చేందుకు ఇలా రాబరీ చేశానని వివరించాడు. దీంతో అతని వద్ద నుంచి కొంత నగదు, ఇసుప వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. -
పంజాబ్ నేషనల్ బ్యాంకులో భారీ చోరీ
సాక్షి, చెన్నై: తమిళనాడు తిరుచ్చి జిల్లాలోని సమయపురం పంజాబ్ నేషనల్ బ్యాంకులో భారీ చోరీ జరిగింది. బ్యాంకులోని 10 కోట్ల రూపాయల నగదు, 5 కేజీల బంగారాన్ని దుండగులు అపహరించారు. జాతీయ రహదారి పక్కనే ఉండే సమయపురంలో ఇంతటి భారీ దోపిడీ జరగడం జిల్లాలో కలకలం రేపుతుంది. వివరాల్లోకి వెళ్తే.. 26, 27 తేదీలు బ్యాంకుకు సెలవు దినాలు కావడంతో సోమవారం ఉదయం సిబ్బంది బ్యాంకు తెరిచారు. అనంతరం బ్యాంకు లోపలికి వెళ్లి చూడగా చోరీ విషయం బయటపడింది. గోడకు కన్నం పెట్టిన దుండగులు బ్యాంకు స్ట్రాంగ్ రూమ్‌లోని ప్రవేశించినట్టుగా తెలుస్తోంది బ్యాంకు సిబ్బంది ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బ్యాంకు వెనక భాగంలో వెల్డింగ్ మిషన్‌తోపాటు పలు పరికరాలను పోలీసులు గుర్తించారు. అక్కడ లభ్యమైన ఆధారాలను బట్టి ముగ్గురు వ్యక్తులు ఈ దోపిడీలో పాల్గొన్నట్టు వారు అనుమానిస్తున్నారు. బ్యాంకు సీసీటీవీల్లో రికార్డైన దృశ్యాలను సేకరిస్తున్నారు. ఈ కేసు దర్యాప్తునకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్టు జిల్లా ఎస్పీ తెలిపారు. -
బ్యాంకుల దోపిడీకి విఫలయత్నం
రియో డీ జనీరో: బ్రెజిల్లో బ్యాంకుల లూటీకి దొంగల ముఠా చేసిన యత్నం విఫలమయింది. ఈ సందర్భంగా ముఠా, పోలీసుల మధ్య∙కాల్పుల్లో ముఠా వద్ద బందీలుగా ఉన్నావారుసహా 12 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు చిన్నారులు సహా ఐదుగురు ఉన్నారు. బ్రెజిల్‌లోని మిలగ్రెస్ సిటీలో శుక్రవారం వేకువజామున ఈ ఘటన జరిగింది. సుమారు 30 మంది ఉన్న సాయుధ దొంగల ముఠా సభ్యులు రెండు బ్యాంకులున్న వీధికి అడ్డంగా ట్రక్కును ఆపారు. విషయం తెల్సుకున్న పోలీసులు రంగంలోకి దిగి కాల్పులు జరిపారు. దొంగలకు, పోలీసులకు మధ్య కాల్పులు మొదలయ్యాయి. అదే సమయంలో అటువైపుగా వచ్చిన కారును దుండగులు అడ్డగించారు. అందులోని వారిని బందీలుగా ఉంచుకున్నారు. ఇరవై నిమిషాల పాటు కొనసాగిన ఎదురు కాల్పుల్లో బందీలుగా ఉన్న ఇద్దరు చిన్నారులు సహా ఐదుగురూ చనిపోయారు. దుండగుల్లో ఆరుగురు ప్రాణాలు కోల్పోగా మిగతా వారు పరారయ్యారు. బందీల మృతికి కారణం పోలీసులా లేక దుండగులా అన్నది విచారణలో తేలుతుందని సియారా రాష్ట్ర గవర్నర్ తెలిపారు. -
బొమ్మ తుపాకీ చూపించి.. బ్యాంక్‌లో దోపిడీ
గచ్చిబౌలి: బురఖా ధరించిన ఓ వ్యక్తి బ్యాంక్ లోపలికి వెళ్లి బొమ్మ తుపాకీతో లాకర్ తెరవాలంటూ బ్యాంక్ మేనేజర్‌ను బెదిరించాడు. భయపడిన సిబ్బంది చేతులు పైకెత్తి వరుసగా నిలబడ్డారు. కౌంటర్లోని క్యాష్ తీసుకొని గన్ చూపిస్తూ పారిపోయాడు. దీనిని గుర్తించిన స్థానికులు రాళ్లతో దాడి చేసి, నిందితుడిని పట్టుకుని నగదుతో సహా బ్యాంక్ సిబ్బందికి అప్పగించారు. బ్యాంక్ సిబ్బంది రాయదుర్గం పోలీసులకు అప్పగించారు. సినిమా సీన్‌ను తలపించేలా ఉన్న ఈ సంఘటన మణికొండలోని కరూర్ వైశ్య బ్యాంక్‌లో సోమవారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. రాయదుర్గం సీఐ రాంబాబు, బ్యాంక్ మేనేజర్ కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. వైజాగ్, మహరిణిపేటకు చెందిన ప్రవీణ్ డేవిడ్ ఓయూ కాలనీలో ఉంటున్నాడు. సోమవారం మధ్యాహ్నం అతను బురఖా ధరించి, బొమ్మ తుపాకీ, యాసిడ్ బాటిల్, కత్తితో హుడాకాలనీలోని కరూర్ వైశ్యాబ్యాంక్‌లోకి ప్రవేశించాడు. మెయిన్‌డోర్ పక్కనే ఉన్న మేనేజర్ మహేందర్ కుమార్ క్యాబిన్‌లోని వెళ్లి బొమ్మ తుపాకీ చూపించి లాకర్ తెరవాలంటూ బెదిరించారు. దీంతో ఆందోళనకు గురైన మేనేజర్ సిబ్బంది వద్దకు పరుగు తీశాడు. నిందితుడు లే డౌన్ అంటూ తుపాకీ చూపించడంతో మేనేజర్‌తో పాటు సిబ్బంది ఒక వైపునకు వెళ్లి చేతులు పైకెత్తి వరుసగా నిలబడ్డారు. క్యాష్ కౌంటర్లోకి ప్రవేశించి నిందితుడు క్యారీ బ్యాగ్‌లో నగదు తీసుకొని బయటికి వెళుతూ రోడ్డుపై ఉన్న వారికి తుపాకీ చూపించి బెదిరించాడు. కొద్ది దూరం వెళ్లగానే స్థానికులు అతడిపై రాళ్లతో దాడి చేయడంతో తల కు తీవ్ర గాయాలైన అతడిని పట్టుకొని బ్యాంక్ సి బ్బందికి అప్పగించారు. నగదు తీసుకున్న బ్యాంక్ సిబ్బంది నిందితుడిని రాయదుర్గం పోలీసులకు అప్పగించారు. నిందితుడికి అదే బ్యాంక్‌లో ఖాతా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుడి నుంచి బొమ్మ తుపాకీ, కత్తి, యాసిడ్ బాటిల్ స్వాధీనం చేసుకున్నారు. ఘటనా స్థలాన్ని మాదాపూర్ ఏసీపీ శ్యామ్ ప్రసాద్ రావు పరిశీలించారు. తుపాకీ అనుకుని బయపడ్డాం: మేనేజర్ నిందితుడి చేతిలో ఉన్నది తుపాకీ నిజమైన తుపాకీ అనుకొని బయపడ్డామని బ్యాంక్ మేనేజర్ మహేందర్ కుమార్ తెలిపారు. అతను తమను బెదిరించి క్యాష్ కౌంటర్లోని నగదు తీసుకొని పరారయ్యాడని. స్థానికులు అతడిని పట్టుకుని తమకు అప్పగించారన్నాడు. ఆర్థిక ఇబ్బందుల కారణంగానే.... బికాం వరకు చదువుకుని 2016లో విప్రోలో అసిస్టెంట్ మేనేజర్‌గా పని చేశానని నిందితుడు ప్రవీణ్ డేవిడ్ తెలిపాడు. కొన్నాళ్లుగా ఉద్యోగం లేక పోవడంతో భార్య, పిల్లలకు దూరంగా ఉంటున్నట్లు తెలిపాడు. రెండు రోజుల క్రితం సమీపంలోని కరూర్ వైశ్యా బ్యాంక్‌లో దోపిడీ చేస్తే ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కవచ్చని భావించినట్లు తెలిపాడు. ఈ క్రమంలో టోలీచౌకీలో బురఖా, బొమ్మ తుపాకీ కొనుగోలు చేసినట్లు తెలిపాడు. -
పట్టపగలే బ్యాంక్ దోపిడి
న్యూఢిల్లీ : దేశ రాజధానిలో దారుణం చోటుచేసుకుంది. మాస్క్‌లతో వచ్చిన గుర్తు తెలియని అగంతకులు పట్టపగలు, అందరూ చూస్తుండగానే ఓ బ్యాంక్‌ను దోపిడి చేశారు. వారిని అడ్డుకున్న క్యాషియర్‌ను తుపాకితో కాల్చి చంపారు. సినీ ఫక్కీలో జరిగిన ఈ దోపిడీ చావ్లా సమీపంలోని కైరా గ్రామ కార్పోరేషన్ బ్యాంకులో శుక్రవారం చోటుచేసుకుంది. మృతి చెందిన క్యాషియర్ సంతోష్‌కుమార్ (45) ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రిటైర్డ్ ఉద్యోగని పోలీసులు తెలిపారు. ఉద్యోగ విరమణ తర్వాత సంతోష్ కార్పోరేషన్ బ్యాంకులో క్యాషియర్‌గా పనిచేస్తున్నారని పేర్కొన్నారు. ఈ దోపిడీలో మొత్తం ఆరుగురు పాల్గొన్నారని, ముఖాలకు మాస్క్‌లు ధరించి, తుపాకులతో దాడి చేశారన్నారు. వారిని అడ్డుకునే ప్రయత్నం చేసిన సంతోష్‌ను షూట్ చేశారన్నారు. బుల్లెట్ అతని చాతిలోకి దూసుకెళ్లిందని, తము సంఘటనాస్థలికి వచ్చేలోపే అగంతకులు తప్పించుకున్నారని, రక్తపుమడుగులో ఉన్న సంతోష్‌ను వెంటనే ఆసుపత్రికి తరలించామని కానీ అప్పటికే అతను ప్రాణాలు కోల్పోయాడని పోలీసులు మీడియాకు తెలిపారు. ఈ ఘటన జరిగిన సమయంలో బ్యాంకులో ఆరుగురు ఉద్యోగులు, 8 మంది బ్యాంకు వినియోగదారులున్నారని, నిందితులు ఎవరిని కాల్చమని చెప్పారని, ఇంతలో సంతోష్ ప్రతిఘటించడంతో అతనిపై కాల్పులు జరిపారన్నారు. సంతోష్‌కు ఓ భార్య ఇద్దరు పిల్లలున్నట్లు పేర్కొన్నారు. రూ.2 లక్షలు ఎత్తికెళ్లినట్లు బ్యాంకు ఉద్యోగులు తమకు తెలిపారని, అగంతకులు చేసిన దోపిడిగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించామన్నారు. ఇక ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో హల్చల్ చేస్తోంది. -
అందరూ చూస్తుండగానే బ్యాంక్ దోపిడి
-
దొంగతనం జరిగినట్టు ఫోన్ కాల్ : వెళ్లి చూస్తే అవాక్కు
లండన్ : బ్యాంక్‌లో దొంగతనం జరిగినట్లు పోలీసులకు ఫోన్ వచ్చింది. సిబ్బందిని తీసుకుని హాడావుడిగా వెళ్లిన పోలీసులకు అక్కడ జరుగుతున్న తంతు చూసి ఆశ్చర్యంతో నోట మాట రాలేదు. కారణం దొంగతనం జరిగిందని భావించిన పోలీసులకు బ్యాంక్ సిబ్బంది దొంగాపోలీస్(హైడ్ అండ్ సీక్) ఆట ఆడుతూ కనిపించి షాక్ ఇచ్చారు. ఈ సంఘటన బర్మింగ్‌హామ్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నాట్‌వెస్ట్ బ్యాంక్ అధికారులు సిబ్బందిలో ఉత్సాహం పెంచడం కోసం సరదగా దొంగాపోలీస్ ఆట ఆడిపించారు. ఆటలో భాగంగా సిబ్బంది కాస్తా అలారమ్ మోగించారు. ఇది విన్న ఓ స్థానికుడు బ్యాంక్‌లో దొంగతనం జరిగిందని భావించి పోలీసులకు ఫోన్ చేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఆదరబాదరగా బ్యాంక్ వద్దకు వచ్చారు. దొంగతనం గురించి ఆరా తీయగా అసలు విషయం బయటకు వచ్చింది. ఈ సంఘటన గురించి పోలీసు అధికారి ఒకరు తన ట్విటర్లో తెలియజేశారు. అంతేకాక తమకు ఫోన్ చేసిన వ్యక్తికి కృతజ్ఞతలు కూడా తెలిపారు. -
స్ట్రాంగ్ రూమ్‌లో దూరి.. రూ.1.35 కోట్లు చోరి
రాజ్‌కోట్: చిన్న సందు దొరికితే చాలు దొంగలు దూరిపోతున్నారు. తాజాగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ)కు చెందిన ఓ బ్రాంచ్‌లో చోరబడిన దుండగులు ఏకంగా కోటి 35 లక్షల రూపాయలు దోచుకెళ్లారు. ఈ ఘటన గుజరాత్‌లోని అమ్రేలి జిల్లా ఎస్బీఐ ప్రధాన బ్రాంచ్‌లో జరిగింది. శనివారం రాత్రి దొంగలు తొలుత బ్యాంక్ పక్కనే ఖాళీగా ఉన్న భవనంలోకి చేరుకున్నారు. ఆ తర్వాత బ్యాంక్ స్ట్రాంగ్ రూమ్‌కు ఉన్న వెంటిలేటర్ ఇనుప గ్రిల్స్‌ను తొలగించారు. ఆ చిన్న సందులో నుంచి ఓ వ్యక్తి బ్యాంక్ స్ట్రాంగ్ రూమ్‌లోకి ప్రవేశించాడు. ఆ తర్వాత నగదుతో అదే వెంటిలేటర్ నుంచి ఉడాయించారు. కాగా శనివారమే చోరి జరిగినప్పటికీ ఆదివారం, సోమవారం(కృష్ణాష్టమి) రెండు రోజులు బ్యాంక్‌కు సెలవు కావడంతో.. మంగళవారం బ్యాంక్ తెరవడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అదే రోజు సాయంత్రం బ్యాంక్ అధికారులు అమ్రేలి పోలీసులను ఆశ్రయించారు. ఎంత నగదు చోరికి గురైందో తెలుసుకోవడానికి అధికారులు రికార్డులను పరిశీలించారు. 1.35 కోట్ల రూపాయలకు పైగా దొంగిలించబడినట్టు నిర్ధారణకు వచ్చారు. ఇదే విషయాన్ని పోలీసులకు తెలిపారు. ఈ ఘటనపై పోలీసు అధికారులు స్పందిస్తూ.. బ్యాంక్ అధికారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టామని తెలిపారు. బ్యాంక్ సీసీటీవీ ఫుటేజ్ పరిశీలిస్తున్నామని తెలిపారు. దొంగలు వెనుక వైపు నుంచి రావడంతో వారు స్ట్రాంగ్ రూమ్ డోర్లను తాకలేదని.. అందువల్ల అలారమ్ మోగలేదన్నారు. దొంగలు ప్రవేశించిన పాత బిల్డింగ్‌ను గతంలో సెంట్రల్ ఎక్సైజ్ శాఖ వారు వినియోగించుకున్నారని.. ప్రస్తుతం అది ఖాళీగా ఉందని పేర్కొన్నారు. ఈ చోరిలో ఎంతమంది పాల్గొన్నారనే దానిపై స్పష్టత లేదాన్నారు. -
ఖాకీలను పరుగులు పెట్టించిన ఎలుకలు..
లక్నో : బ్యాంకులో దోపిడీ జరుగుతోందంటూ అలారం మోగిందని సమాచారం రావడంతో పోలీస్ స్టేషన్ నుంచి హుటాహుటిన తరలివెళ్లిన ఖాకీలకు ఎలుకలు కనిపించడంతో విస్తుపోయారు. బ్యాంకులో దోపిడీ జరిగినట్టు గానీ తాళాలు పగులగొట్టిన ఆనవాళ్లు లేకపోగా ఎలుకలు అటూఇటూ తిరుగుతూ కనిపించాయి. నగరంలోని ఓ ఇండియన్ బ్యాంక్ బ్రాంచ్‌లో అలారం మోగిన శబ్ధం వినిపించిందంటూ స్ధానికులు, బ్రాంచ్ మేనేజర్ పోలీసులకు సమాచారం అందించారు. అయితే అక్కడ దోపిడీ జరిగిన తీరుతెన్నులు లేకపోవడం, కొద్ది సంఖ్యలో ఎలుకలు అలారం వద్ద పోగవడంతో అలారం మోగించింది ఎలుకలే అంటూ పోలీసులు తేల్చేశారు. ఎలుకలు చేసిన పనికే సైరెన్ మోగిందని ఖాకీలు చెప్పారు. కృష్ణాష్టమి కావడంతో బ్యాంకు అధికారులెవరూ బ్రాంచ్‌లో లేరని పోలీసులు చెప్పారు. కాగా అసోంలో ఇటీవల ఏటీఎం యంత్రంలోని రూ 12 లక్షల నగదును ఎలుకలు కొరికి తినేసిన ఘటనను ప్రస్తావిస్తూ అదృష్టవశాత్తూ బ్యాంకులో ఇలాంటి ఘటన చోటుచేసుకోలేదని స్ధానికులు పేర్కొన్నారు. -
మాస్క్‌లతో వచ్చి రూ 45 లక్షలు మాయం..
సాక్షి, రూర్కెలా : పట్టపగలు దోపిడీ ముఠా రెచ్చిపోయింది. ఒడిషాలోని రూర్కెలా ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ (ఐఓబీ)లోకి మంగళవారం ఉదయం దూసుకొచ్చిన దుండగులు బ్యాంకు సిబ్బందిని తుపాకీలతో బెదిరించి రూ 45 లక్షలు లూటీ చేశారు. హెల్మెట్లు, మాస్క్‌లు ధరించిన ఏడెనిమిది మంది దుండగులు పట్టణంలోని ఐఓబీ బజార్ బ్రాంచ్‌లోకి వచ్చారని, ఉద్యోగులను తుపాకీతో బెదిరించి సొమ్ముతో ఉడాయించారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. దోపిడీ ఘటన సమాచారం అందుకున్న రూర్కెలా ఎస్పీ, డీఐజీలు హుటాహుటిన బ్యాంక్‌కు చేరుకున్నారు. బ్యాంకు లూటీపై దర్యాప్తునకు ఆదేశించారు. దోపిడీ ముఠాను పట్టుకునేందుకు పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. పట్టణంలోకి వచ్చే దారులన్నింటినీ మూసివేశారు. పొరుగు రాష్ట్రం జార్ఖండ్ నుంచి దోపిడీ ముఠా ఈ లూటీకి తెగబడిందని అనుమానిస్తున్నారు. -
మామిడి తోటలో నకిలీ తాళం చెవి తయారీ
బ్యాంకు చోరీ ఉదంతంలో నకిలీ కీ తయారీపై ప్రత్యేక దృష్టి పెట్టి పోలీసులు చేపట్టిన విచారణ ఫలితాన్ని ఇచ్చింది. 24 గంటల వ్యవధిలోనే చోరీకి పాల్పడిన బ్యాంకు సిబ్బందితో పాటు మరో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేసి ఇంట్లో దాచిన 32.70 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. తిరువళ్లూరు: పోలీసులు ఊహించినట్టే నకిలీ తాళం చెవితోనే బంగారం చోరీ చేసినట్టు నిర్ధారణ అయ్యింది. దీంతో నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఓ ఉద్యోగి ఇంట్లో ఉంచిన బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఎస్పీ శిబిచక్రవర్తి మంగళవారం రాత్రి మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. తిరువళ్లూరు జేఎన్ రోడ్డులోని బ్యాంక్ ఆఫ్ ఇండియాలో సినిమా ఫక్కీలో జరిగిన చోరీ సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించింది. ఈ చోరీలో ఖాతాదారులు తమ అవసరాల కోసం బ్యాంకులో తాకట్టు పెట్టిన 32.70 కిలోల బంగారం చోరీ జరిగినట్టు పోలీసులు నిర్ధారించారు. బ్యాంకులో ఉంచిన నగలు చోరీకి గురైనట్టు తెలియడంతో ఖాతాదారుల ఆందోళనలు, పోలీసుల మోహరింపు తదితర సంఘటనలతో సోమవారం అర్ధరాత్రి వరకు బ్యాంకు వద్ద ఉద్రిక్తత నెలకొంది. అయితే చోరీ జరిగిన తీరుపై పోలీసులకు ఏర్పడిన అనుమానంతో బ్యాంకు సిబ్బందిపైనే ఫోకస్ పెట్టారు. తాళాలు పగులగొట్టకుండా చోరీ ఎలా చేసి ఉంటారని పలు కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఎస్పీ శిబిచక్రవర్తి ఐదు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టారు. సీసీ కెమెరా పుటేజీలను పరిశీలించిన పోలీసులకు కొన్ని కీలకమైన ఆధారాలు లభించడంతో వాటి ఆధారంగా బ్యాంకు సిబ్బందికి ఉచ్చుబిగించి విచారణ చేపట్టారు. మేనేజర్ శేఖర్, డిప్యూటీ మేనేజర్లు రంజన్, భాను, ఆఫీస్ అసిస్టెంట్ విశ్వనాథన్‌ను వేర్వేరుగా విచారించారు. విచారణలో విశ్వనాథన్ కీలక నిందితుడిగా గుర్తించారు. నకిలీ తాళాలు తయారీ శుక్రవారం బ్యాంకు ముగిసిన తరువాత కావాలనే తాళాలు వేయకుండా వదలిపెట్టారా లేదా నకలి కీ తయారు చేసి చోరీ చేశారా అనే కోణంలో పోలీసులు విచారణ సాగించారు. మొదట దశలో నకిలీ కీ తయారుచేసి ఉంటారనే కోణంలో విశ్వనాథన్‌ను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. విశ్వనాథన్ పొంతన లేని సమాధానాలు చెప్పడంతో తమదైన శైలిలో విచారించారు. దీంతో అతను పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించినట్టు తెలిసింది. బ్యాంకు కాంప్లెక్స్‌లో ఉన్న నీల్ గ్రీస్ సంస్థలో పనిచేసే జయగణేష్, అదే కాంప్లెక్స్‌లో ప్లంబర్‌గా పనిచేసే గౌతమ్ స్నేహితులని వారితో కలసి బ్యాంకులో చోరీకి పథకం వేసినట్టు ఒప్పుకున్నాడు. సెవ్వాపేట సమీపంలోని మామిడితోటలో వారం రోజుల పాటు శ్రమించి నకిలీ తాళం చెవి తయారు చేసినట్టు విశ్వనాథన్ ఒప్పుకున్నాడని పోలీసు అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. దీంతో నిందితులు ముగ్గురినీ అదుపులోకి తీసుకుని మరింత లోతైన విచారణ చేస్తున్నామన్నారు. నగలు స్వాధీనం నిందితులను అదుపులోకి తీసుకున్న అనంతరం విశ్వనాథ్ ఇంట్లో దాచి ఉంచిన నగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బ్యాంకు సిబ్బందితో కలసి లెక్కింపు పనులను వేగంగా నిర్వహిస్తున్నారు. మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించిన బ్యాంకు చోరీ వ్యవçహారం 24 గంటల వ్యవధిలోనే కొలిక్కి రావడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. కాగా చోరీ చేసిన బంగారు నగలు రూ.9 కోట్ల విలువ చేస్తాయని నిర్ధారించారు. -
ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకులో చోరీ
సాక్షి, కర్నూలు: జిల్లాలోని దేవనకొండ ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకులో శుక్రవారం రాత్రి చోరీ జరిగింది. గుర్తుతెలియని దుండగులు బ్యాంకు తలుపులు పగలగొట్టి లోనికి ప్రవేశించారు. శనివారం ఉదయం ఇది గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. పెద్ద మొత్తంలో నగదు పోయినట్లు పోలీసులు భావిస్తున్నారు. బ్యాంకు అధికారులు వచ్చిన తర్వాత నగదు ఎంత పోయిందా తెలిసే అవకాశాలు ఉన్నాయి. -
సినీ ఫక్కీలో చోరీయత్నం.. ఎన్నో ట్విస్టులు!
కాలిఫోర్నియా: చోరీకి యత్నించిన మహిళ ఏం చేయాలో పాలుపోక బ్యాంకు నుంచి పరారయింది. చివరికి ఆమెని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన కాలిఫోర్నియాలోని వెస్ట్ డాన్ విల్లేలో గత మంగళవారం చోటుచేసుకుంది. అయితే ఇందులో కొన్ని ఆసక్తికర ట్విస్టులు ఉన్నాయి. చోరీకి యత్నించిన మహిళ పేరు జెన్నిఫర్ రే మెక్ క్లారీ(36). ఆమె రెండు రోజుల కిందట వెస్ట్ డాన్ విల్లేలోని బ్యాంకులో చోరీకి యత్నించింది. మహిళగా వెళ్తే తనను ఎవరూ లెక్కచేయరని భావించి, పురుషుడిగా కనిపించడానికి తనకు గెడ్డం ఉన్నట్లు కనిపించాలని నలుపురంగు రుద్దుకుంది. బ్లాక్ టీ షర్ట్, బ్లాక్ ప్యాంటు ధరించిన ఆ మహిళ బ్లాక్ కళ్లద్దాలు, క్యాప్ తో బ్యాంకులో ప్రవేశించింది. ఓ ఉద్యోగి వద్దకు వెళ్లి ఎలాంటి ఆయుధం చూపించకుండానే డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేసింది. ఆమెను మహిళ అని గుర్తించారనుకుని భయపడి బ్యాంకు నుంచి వెంటనే కాలికి బుద్దిచెప్పింది. బ్యాంకు నుంచి సమాచారం అందుకున్న డాన్ విల్లే పోలీసులు సీసీటీవీ ఫుటేజీ పరిశీలించారు. డబ్ల్యూ ఈఐ పింటాడో రోడ్-డయాబ్లో రోడ్ జంక్షన్లో అనుమానాస్పదంగా కనిపించిన వ్యక్తిని అరెస్ట్ చేశామని, విచారణ చేయగా ఆమె మహిళ అని వెల్లడైందన్నారు. డబ్బు కోసం బ్యాంకుకు వెళ్లి చోరీకి యత్నించినట్లు విచారణలో ఒప్పుకుంది. కేసు నమోదు చేసిన పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నారు. గతంలో పోలీసు జాబ్ కు ఎంపికైన జెన్నిఫర్ 18 నెలల ప్రొబేషనరీ టైమ్ తర్వాత 2010లో ఆమె ఫర్మార్మెన్స్ బాగాలేదని ఉద్యోగం నుంచి తొలగించారు. అప్పటినుంచీ ఇలా ఏదోఒక తరహాలో ఆమె చోరీలకు పాల్పడుతున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే గతంలో డిపార్ట్ మెంట్ తో సంబంధం ఉన్న మహిళ ఇలా చేయడంపై షాక్ కు గురయ్యామని చెప్పారు. -
రెండుగంటల్లోనే రెండు బ్యాంకులు లూటీ!
న్యూఢిల్లీ: తీవ్ర కల్లోలంగా ఉన్న కశ్మీర్లో రెండు గంటల వ్యవధిలోనే రెండు బ్యాంకులు లూటీకి గురయ్యాయి. గడిచిన 24 గంటల్లో ఉగ్రవాదులు మొత్తంగా మూడు బ్యాంకులను కొల్లగొట్టడం గమనార్హం. దక్షిణ కశ్మీర్ పుల్వామా జిల్లాలోని కాకపూరలోని ఓ బ్యాంకును గుర్తు తెలియని సాయుధులు దోచుకున్నారు. జమ్మూకశ్మీర్ నిహామా శాఖలో ఈ దోపిడీ జరిగింది. ఆయుధాలతో వచ్చిన దుండగులు భయభ్రాంతులకు బ్యాంకులోని వారిని గురిచేస్తూ డబ్బును ఎత్తుకెళ్లారని, వెంటనే సంఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు పరారైన దొంగలను అరెస్టుచేసేందుకు ప్రయత్నిస్తున్నారని పోలీసులు తెలిపారు. అంతకుముందు రెండు గంటల కిందటే పుల్వామా జిల్లాలోని వాహిబాగ్ గ్రామంలో ఉన్న ఎల్లాక్వై దేహాతి బ్యాంకులోనూ దోపిడి జరిగింది. మంగళవారం యారిపూర బ్యాంకులోనూ సాయుధులు బీభత్సం సృష్టించి దోచుకెళ్లిన సంగతి తెలిసిందే. -
భోపాల్ ఎన్‌కౌంటర్‌తో కరీంనగర్లో కలకలం
-
భార్యకు దూరంగా ఉండాలని..
ఆయన వయస్సు 70 ఏళ్లు. భార్యతో చాలా పెద్దగా గొడవ పడ్డాడు. ఇక భార్యను చూడొద్దు అనుకున్నాడు. 'జైలుకైనా వెళుతాను కానీ, ఇంటికి రాను' అని శపథం చేశాడు. భార్యకు దూరంగా ఉండాలంటే విడాకులో, బ్రేకప్ చేసుకోవాలి. చాలా పెద్ద ప్రాసెస్.. అందుకే ఆయన దగ్గరి మార్గాన్ని ఎన్నుకున్నాడు. తన ఇంటికి సమీపంలో ఉన్న బ్యాంకుకు వెళ్లాడు. తన దగ్గర తుపాకీ ఉందని, కాబట్టి మర్యాదగా తనకు డబ్బు ఇవ్వాలని క్యాషియర్ ను భయపెట్టాడు. ఆ వృద్ధుడికి భయపడ్డ క్యాషియర్ మూడువేల డాలర్లు అతని చేతిలో పెట్టాడు. అయినా, ఆ మొండిఘటం అక్కడినుంచి కదల్లేదు. తీరా పోలీసులు రంగ ప్రవేశం చేశారు. ఆ పెద్దాయనను అరెస్టు చేశారు. యాహూ.. నా కల నెరవేరిందంటూ ఆ వృద్ధుడు ఎగిరి గంతేశాడు. అమెరికాలోని కాన్సస్ నగరంలో ఈ ఘటన జరిగింది. 70 ఏళ్ల లారెన్స్ రిపిల్ తన భార్య రెమిడియోస్ తో గొడవ పడ్డాడు. ఇక భార్యను చూడొద్దు అనుకున్న ఆయన కాన్సస్ సిటీ బ్యాంకులో దోపిడికి పాల్పడ్డాడు. తన వద్ద తుపాకీ ఉందంటూ బెదిరించి డబ్బులు దోపిడి చేసిన ఆయన.. పోలీసులు వచ్చేవరకు వేచి ఉండి వారికి లొంగిపోయాడు. గయ్యాళీ సూర్యకాంతం లాంటి భార్య ఉన్న ఇంటికంటే తన కొత్త లొగిలి అయిన జైలే బాగుందని, ఇక్కడ మంచి సహచర ఖైదీలు, టైమ్ కు తిండి, నిద్ర, సరైన వైద్య చికిత్స లభిస్తున్నాయని పెద్దాయన లారెన్స్ రిపిల్ ఇప్పుడు ఆనందపడిపోతున్నాడు. -
ఒకటిన్నర నిమిషాల్లో బ్యాంకు దోపిడీ పూర్తి!
కేవలం నలుగురంటే నలుగురే ముసుగు వ్యక్తులు.. వాళ్లు తీసుకున్న సమయం సరిగ్గా 90 సెకండ్లు. ఈలోపే మొత్తం పని పూర్తిచేసేశారు. పంజాబ్‌లోని లూథియానాలో గల పంజాబ్ నేషనల్ బ్యాంకు శాఖలో రూ. 15 లక్షలు దోచేశారు. ఈ ఘటన సోమవారం మిట్ట మధ్యాహ్నం జరిగింది. ఆ బ్రాంచి కూడా కోచర్ మార్కెట్ పోలీసు పోస్టుకు సరిగ్గా 200 మీటర్ల దూరంలోనే ఉంది. దొంగలు బ్యాంకులోకి ప్రవేశించే సమయానికి బ్యాంకులో ఒక కస్టమర్, ఆరుగురు ఉద్యోగులు మాత్రమే ఉన్నారు. కనీసం సెక్యూరిటీ గార్డు కూడా లేడు. దొంగలు గాల్లోకి కాల్పులు జరుపుతూ లోపలకు ప్రవేశించారు. డబ్బు డిపాజిట్ చేసేందుకు వచ్చిన అంకుశ్ చౌదరి అనే కస్టమర్‌ను కొట్టారు. ఇద్దరు దొంగలు లాబీలోనే ఉన్నారు. వాళ్లలో ఒకడు కౌంటర్ లోంచి క్యాషియర్ తలకు తుపాకి గురిపెట్టాడు. మూడో దొంగ మేనేజర్‌ను బంధించగా నాలుగో వ్యక్తి క్యాషియర్ వెనక్కి వెళ్లి, కొద్ది నిమిషాల క్రితమే కస్టమర్ డిపాజిట్ చేసిన రూ. 15 లక్షలు తీసుకున్నాడు. అదే సమయానికి బ్యాంకు లోపలకు వస్తున్న ఓ మహిళ.. లోపల జరుగుతున్న విషయాన్ని చూసి వెంటనే వెనక్కి వెళ్లిపోయారు. అందరికీ విషయం చెప్పారు. కానీ చుట్టుపక్కల వాళ్లు స్పందించేలోపే దొంగలు అక్కడి నుంచి పారిపోయారు. అయితే ఈ నేరంలో బ్యాంకు ఉద్యోగుల పాత్ర సైతం ఉండే అవకాశం లేకపోలేదని పోలీసులు అంటున్నారు. ఈ బ్యాంకులో ఓ గార్డును పెట్టుకోవాలని ఎప్పటినుంచో చెబుతున్నా ఎవరూ పట్టించుకోలేదు. -
బ్యాంకు దోపిడీకి విఫలయత్నం
మొయినాబాద్: అర్ధరాత్రి దుండగులు బ్యాంకు దోపిడీకి విఫలయత్నం చేశారు. తాళాలు పగులగొట్టి తలుపులు తెరిచే సమయంలో ఇద్దరు యువకులు గమనించి పట్టుకునే ప్రయత్నం చేయడంతో కాల్పులు జరుపుతూ పారిపోయారు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం అజీజ్‌నగర్‌లో మంగళవారం రాత్రి 1.20 గంటల సమయం లో ఈ ఘటన చోటుచేసుకుంది. అజీజ్‌నగర్‌లోని తెలంగాణ గ్రామీణ బ్యాంకు సిబ్బంది మంగళవారం పనివేళలు ముగిసిన తర్వాత తాళాలు వేసి వెళ్లిపోయారు. సెక్యూరిటీ సిబ్బంది లేకపోవడంతో దుండగులు అర్ధరాత్రి బ్యాంకు వద్దకు చేరుకుని తాళాలు పగులగొట్టారు. అదే సమయంలో గండిపేటలోని గోల్కొండ రిసార్ట్స్‌లో విధులు ముగించుకుని బైక్‌పై ఇంటికి వస్తున్న శ్రీనాథ్‌రెడ్డి, శ్రీనివాస్ బ్యాంకు తాళాలు పగులగొడుతున్న ఇద్దరిని గమనించి కేకలు వేశారు. దీంతో దుండగులు పారిపోతుండగా యువకులు బైక్‌పై వెం బడించారు. ఈ క్రమంలో దుండగులు కొంతదూరం పరుగెత్తి గాల్లోకి రెండు రౌండ్లు కాల్పులు జరిపారు. దీంతో భయపడిన యువకులు వెనక్కి తగ్గారు. బ్యాంకుకు కొంత దూరంలో ఉన్న మరో దుండగుడు సైతం గ్రామంలోకి పరుగు తీశాడు. దుండగులు గ్రామం పక్కనే ఉన్న ఓ వెంచర్ ప్రహరీ గోడ దూకి పారిపోయారు. యువకులు 100 కు డయల్ చేసి సమాచారం ఇవ్వడంతో మొబైల్ పార్టీ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిసరాలను పరిశీలించారు. కాల్పులు జరిపిన ప్రాంతంలో లభ్యమైన బుల్లెట్ షెల్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దుండగులను పట్టుకోవడానికి సాహసం చేసి వెంబడించిన యువకులను డీసీపీ కార్తికేయ అభినందించారు. -
బ్యాంక్ దోపిడీకి యత్నం..
-
పేపర్ ముక్కతో 14 లక్షలు కొట్టేశాడు!
సింగపూర్: ఎటువంటి ఆయుధం ఉపయోగించకుండా బ్యాంకు నుంచి దాదాపు రూ.14 లక్షలు (22 వేల డాలర్లు) ఎత్తుకుపోయిన దొంగను పట్టుకునేందుకు సింగపూర్ పోలీసులు గాలింపు జరుపుతున్నారు. కేవలం ఒక పేపర్ ముక్కతో బ్యాంకును బురిడీ కొట్టించిన మోసగాడిని ఆస్ట్రేలియన్ గా పోలీసులు గుర్తించారు. మధ్యాహ్నం భోజన సమయంలో స్టాండర్డ్ ఛార్టెడ్ బ్యాంకు వచ్చిన నిందితుడు తన డిమాండ్లను ఒక కాగితంపై రాసి బ్యాంకు సిబ్బందికి ఇచ్చాడు. కొద్ది నిమిషాల తర్వాత 22 వేల డాలర్ల సొమ్ముతో బ్యాంకు నుంచి బయటకు వెళ్లిపోయాడని దర్యాప్తు సంస్థ సన్నిహిత వర్గాలు వెల్లడించినట్టు స్థానిక మీడియా పేర్కొంది. దుండగుడు ఎటువంటి ఆయుధం ఉపయోగించకుండా ఎలా దొంగతనం చేశాడనే దానిపై దర్యాప్తు చేపట్టామని పోలీసులు తెలిపారు. ఆసియాలో సురక్షితమైన దేశంగా పేరుగాంచిన సింగపూర్ లో బ్యాంకు చోరీలు చాలా అరుదు. నేరస్తుల పట్ల, తుపాకీ సంస్కృతి పట్ల కఠినంగా వ్యవహరిస్తుండడంతో సింగపూర్ లో నేరాలు తక్కుగా నమోదవుతుంటాయి. 2008, నవంబర్ లో ఓ వ్యక్తి బ్యాంకు దొంగతనానికి విఫలయత్నం చేశాడు. -
ది గ్రేట్ రాబరీ
ఆ నేడు 16 నవంబర్, 1976 ప్రపంచంలోనే అతి పెద్ద బ్యాంక్ దోపిడీ చేసిన దొంగలకు వందేళ్ల శిక్షను విధించింది ఈ రోజే! ఏడుమంది ఉన్న దొంగల గ్యాంగ్ ఒకటి 1975లో లండన్‌లోని బ్యాంక్ ఆఫ్ అమెరికాకు కన్నం వేసి ఎనభైలక్షల పౌండ్స్‌ను బ్యాగ్‌లో సర్దుకుంది. ఈ ఏడుగురులో ఒకడు .. ఆ బ్యాంక్ ఆనుపానులన్నీ తెలిసిన స్టాట్ బక్లీ! బక్లీ అదే బ్యాంక్‌లో ఎలక్ట్రీషియన్‌గా పనిచేసేవాడు. ఆ పనితో వచ్చే పదీపరక సరిపోక.. ఏకంగా బ్యాంక్ లాకర్స్ సీక్రెట్ కోడ్‌కే కీ తిప్పాలనే ప్లాన్ వేశాడు. అప్పటికే రాబరీలో అనుభవం ఉన్న తన స్నేహితులను కలిశాడు. బ్యాంక్‌ను బద్దలు కొట్టి బ్రహ్మాండంగా బయటపడ్డారు కూడా. తర్వాతే చిక్కొచ్చింది పంచుకునే లెక్కల దగ్గర. బ్యాంక్‌కి సంబంధించిన ప్లస్, మైనస్ పాయింట్స్ అన్నీ చెప్పి రాబరీ ప్లాన్‌ను ఈజీ చేసింది తనే కాబట్టి తనకు వాటా ఎక్కువ కావాలని వాదించాడు. మిగిలిన వాళ్లు ససేమిరా అన్నారు. దాంతో తనకు ఒక పెన్నీ కూడా ఎక్కువరాని మనీ మిగిలిన వాళ్లకూ దక్కడానికి వీల్లేదని బక్లీ వెళ్లి ఎంచక్కా పోలీసులకు అప్రూవర్‌గా మారిపోయాడు. కొసమెరుపు ఏంటంటే ఏడుగురు దొంగల్లో ఎక్కువ శిక్ష పడింది బక్లీకే. ఈ బృందానికంతటికీ వందేళ్ల శిక్షతోపాటు యాభై లక్షల పౌండ్ల జరిమానానూ విధించాడు జడ్జి అలెన్కింగ్ హామిల్టన్. -
ఎస్బీహెచ్లో దోపిడికి విఫలయత్నం
హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లా శామీర్‌పేటలోని ఎస్బీహెచ్ బ్రాంచ్‌లో చోరీకి దుండగులు మంగళవారం అర్థరాత్రి యత్నించారు. ఆ క్రమంలో బ్యాంక్ గ్రిల్స్ తొలగించేందుకు వారు ప్రయత్నిస్తున్నారు. అయితే గస్తీ తిరుగుతున్న పోలీసులు ఆ విషయాన్ని గమనించి... దుండగులను పట్టుకునేందుకు ప్రయత్నించారు. దాంతో దుండగులు అక్కడి నుంచి పరారైయ్యారు. దీంతో పోలీసులు అప్రమత్తమై... దుండగుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఆ క్రమంలో పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నారు. -
కారులో రూ. కోటిన్నర
-
కారులో రూ. కోటిన్నర
సూర్యాపేటలో అనుమానాస్పదంగా ఫోర్డ్ కారు * ఎస్పీ ఆదేశానుసారం డిక్కీని పగలగొట్టిన పోలీసులు * గన్నీ బ్యాగ్ నుంచి కరెన్సీ కట్టలు బయటపడిన వైనం * కారు, డబ్బును వదిలివెళ్లిన గుర్తుతెలియని దుండగులు * కర్ణాటక బీజాపూర్‌లోని ఐసీఐసీఐ బ్యాంకు డబ్బుగా అనుమానం సూర్యాపేట: ఉదయం నుంచి అక్కడో ఫోర్డ్ కారు నిలిపి ఉంది. దాన్ని పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు. అయితే సాయంత్రం పోలీసులకు అనుమానమొచ్చి డిక్కీ పగలగొట్టి చూడగా... కరెన్సీ కట్టలు బయటపడ్డాయి. రూ.లక్ష కాదు.. రూ.రెండు లక్షలు కాదు.. ఏకంగా కోటిన్నర రూపాయలు.. మొత్తం రూ.500, రూ.1000 నోట్ల కట్టలే. వాటిని చూసి పోలీసులే అవాక్కయ్యారు. సంచలనం సృష్టించిన ఈ ఘటన నల్లగొండ జిల్లా సూర్యాపేట హైటెక్ బస్టాండ్‌లో చోటుచేసుకుంది. ఇది రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. సూర్యాపేట హైటెక్ బస్టాండ్ వద్ద గురువారం ఉదయం గుర్తుతెలియని వ్యక్తులు ఫోర్డ్ కారును వదిలివెళ్లారు. జిల్లా ఎస్పీ దుగ్గల్ ఆదేశానుసారం సూర్యాపేట డీఎస్పీ ఎంఏ రషీద్ వెంటనే సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకున్నారు. కారు లాక్ చేసి ఉండటంతో డిక్కీని పగలగొట్టి తనిఖీచేయగా డబ్బుల సంచి (గన్నీబ్యాగ్), ఒక పెట్టె బయటపడ్డాయి. వాటిలో రూ.కోటి 50 లక్షలు ఉండడంతో సూర్యాపేట పట్టణ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. తమకు అందిన సమాచారం మేరకు కారును తనిఖీ చేయగా రూ.కోటి 50 లక్షలు స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ ఎంఏ రషీద్ విలేకరులకు తెలిపారు. దీనికి సంబంధించి ఓ వ్యక్తిని కర్ణాటకలోని బీజాపూర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. డీఎస్పీ వెంట రూరల్ సీఐ నర్సింహారెడ్డి, ఎస్ఐలు సంతోష్‌కుమార్, శ్రీనివాస్, ఇతర సిబ్బంది ఉన్నారు. కారు ఎక్కడిదీ? ఇక్కడే ఎందుకు ఆపారు? కర్ణాటక రిజిస్ట్రేషన్‌తో ఉన్న ఈ కారు ఎక్కడి నుంచి వచ్చిందో.. తెలియదు. కానీ సూర్యాపేట హైటెక్ బస్టాండ్‌లో చెట్ల కింద ఉదయం నుంచి ఉందని స్థానికులు చెబుతున్నారు. కర్ణాటకలోని బీజాపూర్‌కు చెందిన ఐసీఐసీఐ బ్యాంకుకు సంబంధించిన డబ్బు రవాణా అవుతున్నట్టు అక్కడి పోలీసులు జిల్లా పోలీసులకు సమాచారం ఇచ్చినట్లు తెలిసింది. ఈ డబ్బు చోరీకి గురైందా? లేక బ్యాంకులో పనిచేసే ఉద్యోగులే ఈ ఉదంతానికి పాల్పడ్డారా? అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. కర్ణాటక నుంచి వచ్చిన ఈ కారు సూర్యాపేటలో నిలపడానికి గల కారణం తెలియాల్సి ఉంది. కారు ఇక్కడ నిలిపిన వారి కోసం గాలింపు ముమ్మరం చేశామని పోలీసులు చెప్పారు. కర్ణాటక పోలీసులు వస్తే పూర్తి సమాచారం తెలిసే అవకాశముంది. -
సూర్యాపేటలో రూ. 2 కోట్ల కరెన్సీ పట్టివేత
నల్లగొండ జిల్లా సూర్యాపేటలో 2 కోట్ల రూపాయల సొమ్మును పోలీసులు పట్టుకున్నారు. ఈ సొమ్ము కర్ణాటకలోని ఓ బ్యాంకులో చోరీ చేసి ఉంటారని అనుమానిస్తున్నారు. సూర్యాపేట హైటెక్ బస్టాండు సమీపంలో కారులో అనుమానాస్పదంగా తిరుగుతున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకుని తనిఖీ చేయగా.. వారి వద్ద ఏకంగా రూ. 2 కోట్ల కరెన్సీ పట్టుబడింది. వాళ్లు వాడిన కారు నెంబరు కేఏ 28 ఎన్ 9119గా గుర్తించారు. దాంతో వెంటనే వాళ్లను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కాగా, కర్ణాటకలోని ఒక బ్యాంకులో ఇటీవల భారీ దోపిడీ జరిగింది. బహుశా ఈ సొమ్ము అంతా అక్కడిదే అయి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు ఇంకా అందాల్సి ఉంది. -
చిత్తూరు జిల్లాలో దోపిడి దొంగల బీభత్సం!
-
48 కిలోల బంగారం చోరీ
చెన్నై : తమిళనాడులోని కృష్ణగిరి జిల్లా కుందారపల్లి రోడ్డు రామాపురంలోని బ్యాంక్ ఆఫ్ బరోడా శాఖ నుంచి శనివారం తెల్లవారుజామున దుండగులు 48 కిలోల బంగారు ఆభరణాలు లూటీ చేశారు. ఈ ఆభరణాల విలువ 12 కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా. బ్యాంకు వెనుక ఉన్న తలుపులు పగులగొట్టి లోపలకు ప్రవేశించిన దుండగులు లాకర్లను బద్ధలుగొట్టి నగలు దొంగిలించారు. శనివారం ఉదయం ఉద్యోగులు బ్యాంకుకు వచ్చిన తరువాత విషయం తెలిసింది. సమాచారం అందుకున్న జిల్లా పోలీసు యంత్రాంగం హుటాహుటిన అక్కడకు చేరుకుని విచారణ చేపట్టింది. దాదాపు 1500 మంది ఖాతాదారులు ఈ బ్యాంకులో విలువైన బంగారు నగలను తాకట్టు పెట్టారు. ఇక్కడ మేనేజర్‌గా పని చేస్తున్న తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఉదయ భాస్కర్ శుక్రవారం సాయంత్రం బ్యాంకు సమయం ముగిసిన తర్వాత తాళాలు వేసుకొని వెళ్లారు. శనివారం ఉదయం వచ్చి చూస్తే బ్యాంకు లోపల వస్తువులు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. వెంటనే కురుబరపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. బ్యాంకు వెనుక ఖాళీ ప్రదేశం ఉంది. బ్యాంకు చుట్టూ ముళ్ల కంచెను ఏర్పాటు చేశారు. దొంగలు ముళ్లకంచెను తొలగించుకొని బ్యాంకు వెనుక భాగంలో తలుపులు పగులగొట్టి, అత్యవసర సైరన్ వైర్లను కత్తిరించి లోనికెళ్లారు. బ్యాంకులో ఏర్పాటు చేసిన 8 సీసీ కెమెరాల వైర్లను కూడా కత్తిరించారు. ఒక సీసీ కెమెరాలో వేకువజామున 3.30 గంటల ప్రాంతంలో ముగ్గురు ముసుగులు ధరించిన దుండగులు లాకర్‌ను పగులగొడుతున్న దశ్యం రికార్డు అయిందని పోలీసులు తెలిపారు. వారిని ఉత్తర భారతదేశానికి చెందిన వారుగా అనుమానిస్తున్నారు. -
శివమొగ్గ డీసీసీ బ్యాంకులో లూటీ యత్నం
పోలీసులను చూసి పారిపోయిన ఆగంతకులు శివమొగ్గ : స్థానిక శంకరమఠం బీహెచ్ రోడ్డులో ఉన్న డీసీసీ బ్యాంక్‌లో ఆదివారం రాత్రి కొందరు ఆగంతకులు చొరబడి లూటీకి విఫలయత్నం చేశారు. పోలీసుల సమాచారం మేరకు... రాత్రి సుమారు ఒంటి గంట సమయంలో ఇద్దరు పోలీసులు గస్తీ తిరుగుతూ బ్యాంక్ సమీపంలోకి చేరుకున్నారు. ఆ సమయంలో వారిని గమనించిన కొందరు ఆగంతకులు డీసీసీ బ్యాంక్ షట్టర్‌ను తొలగించేందుకు చేస్తున్న ప్రయత్నాన్ని విరమించుకుని పారిపోయారు. విషయాన్ని వెంటనే ఉన్నతాధికారులకు కానిస్టేబులుళ్లు చేరవేయడంతో ఇన్స్పెక్టర్ దీపక్, సబ్ఇన్స్పెక్టర్ చెన్పప్ప ఇతర సిబ్బంది అక్కడకు చేరుకుని పరిశీలించారు. దుండగులు అక్కడే వదిలేసిన గ్యాస్ సిలిండర్, గ్యాస్ కట్టర్‌ను స్వాధీనం చేసుకున్నారు. దుండగులకు పట్టుకునేందుకు కానిస్టేబుళ్లు వెంబడించినా ఫలితం లేకుండా పోయింది. ఘటనా స్థలాన్ని పరిశీలించిన ఎస్పీ కౌశలేంద్రకుమార్ మాట్లాడుతూ.. బ్యాంక్ దోపిడీకి ముందు నుంచి కాకుండా బ్యాంక్ వెనుక ఉన్న పెన్షన్ మొహల్లా మార్గంలో వచ్చి సమీపంలో ఉన్న భవనం మీదుగా చేరుకుని గ్యాస్ కట్టర్ సాయంతో షట్టర్‌ను కట్ చేయబోయారని వివరించారు. ఘటనపై కోటె పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా, బ్యాంక్ లాకర్లో రూ. 2 కోట్ల విలువైన బంగారు ఆభరణాలు ఉన్నట్లు సమాచారం. -
దోచుకున్నోడే దొర!
జిల్లాలో బ్యాంకు చోరీలు.. దారి దోపిడీ కేసులను ఛేదించడంలో పోలీసులు ఘోరంగా విఫలమవుతున్నారు. వరుస సంఘటనల్లో లక్షలాది రూపాయలు.. కిలోలకొద్ది బంగారు, వెండి ఆభరణాలు చోరీకి గురైనా.. ఇప్పటికీ ఏ ఒక్క నిందితుడినీ గుర్తించలేకపోయారు. ఇక్కడ చోరీ చేసిన వారు ఇతర జిల్లాల పోలీసులకు చిక్కడం.. మన పోలీసుల సమర్థతను ప్రశ్నార్థకంగా మారుస్తోంది. ఫలితంగా ‘దోచుకున్నోడే.. దొర’ అనే చందం గా మారింది. అసలు ఎందుకిలా జరుగుతోంది.. మన పోలీసుల్లో సత్తా లేదా..? అని సగటు మనిషి మదిని తొలుస్తున్న ప్రశ్న. - సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి * పురోగతి లేని బ్యాంకు చోరీ కేసులు * ఒక్కరినీ పట్టుకోలేకపోయిన జిల్లా పోలీసులు * డిపార్ట్మెంట్ పనితీరుపై ప్రజల్లో అనుమానం వరంగల్ జిల్లా భూపాల్పల్లి గ్రామీణ వికాస బ్యాంకులో జరిగిన దోపిడీని అక్కడి పోలీసులు వారం రోజుల్లో ఛేదించారు. కరీంనగర్ జిల్లా కాటారంలో దొంగను పట్టుకుని కోర్టు బోనులో నిలబెట్టారు. చోరీకి గురైన సొత్తును బ్యాంకుకు అప్పగించారు. మరి మన జిల్లా పోలీసులకు ఏమైంది..? దొంగలు తెగబడి బ్యాంకు దోపిడీలు చేస్తున్నారు. ముత్తూట్ ఫైనాన్స్..గ్రామీణ వికాస బ్యాంకు.. కెనరా బ్యాంకు.. ఇలా ఒక్కొక్కటి లూటీ చేశారు. తాజాగా ఝరాసంగం సిండికేట్ బ్యాంకు దోపిడీకి విఫలయత్నం చేశారు. అయినా మన పోలీసుల్లో చలనం లేదు. నెలలు గడుస్తున్నా దొంగల ఆచూకీ దొరకటం లేదు. ఎందుకీ నిర్లిప్తత? వరంగల్ పోలీసులకున్న సత్తా మన వాళ్లలో లేదా? నేర పరిశోధనలో మన పోలీసులకు అంత సీన్ లేదా..? లేకుంటే జిల్లా పోలీసు బాసే.. ఇప్పుడో.. రేపో అన్నట్టు ఉండగా..! నాలుగు కాసులు వెనకేసుకోక ఈ కేసుల గొడవలు ఎందుకు అనుకుంటున్నారా? అనేది సగటు మనిషి మదిని తొలుస్తున్న ప్రశ్నలు. ఒక్క బ్యాంకులే కాదు, ఇళ్ల మీద పడి దొంగలు స్వైర విహారం చేస్తున్నారు. జహీరాబాద్ ప్రాంతంలో... 2014 ఫిబ్రవరి 2వ తేదీ రాత్రి జహీరాబాద్‌లోని ముత్తూట్ ఫైనాన్స్‌లో దోపిడీ జరిగింది. రూ.13.45 లక్షల నగదుతో పాటు సుమారు 7 కిలోలకు పైగా బంగారం చోరీకి గురైంది. అయితే దుండగులను పట్టుకోవడంలో మన పోలీసులు చేతులెత్తేశారు. అదే దొంగలు హైదరాబాద్‌లో దొంగతనం చేస్తూ దొరికిపోయి అక్కడి పోలీసుల విచారణలో తామే ముత్తూట్ ఫైనాన్స్‌లో దొంగతనం చేసినట్లు ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. * సెప్టెంబర్ 9న జహీరాబాద్ పట్టణంలోని రఫీ జ్యూవెలర్స్ దుకాణంలో దొంగలు చొరబడి అర కిలో బంగారం, 20 కిలోల వెండిని దొంగిలించారు. వీరు ఇంకా దొరకలేదు. * 2013 మార్చి 18న కొత్తూర్(బి) గ్రామంలో గల సిండికేట్ బ్యాంకులో చోరీకి పాల్పడి రూ.3.75 లక్షల నగదును ఎత్తుకెళ్లారు. మార్చి 28న కోహీర్ మండలం కవేలి గ్రామంలో గల సిండికేట్ బ్యాంకును దోపిడీ చేసేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు. ఈ సందర్భంగా దొంగలు జరిపిన కాల్పుల్లో ఎస్ఐ వెంకటేష్ గాయపడ్డాడు. * వెల్దుర్తి మండలంలోని మాసాయిపేటలోని కెనరా బ్యాంకు దోపిడీ జరిగి రెండు నెలలు గడుస్తున్నా ఇప్పటికీ నేరస్తుల ఆచూకీ తెలుసుకోలేకపోయారు. దొంగలు 5కిలోల బంగారు ఆభరణాలు, 15 లక్షల నగదును ఎత్తుకె ళ్లినా ఆ బ్యాంకు లూటీ అయ్యిందనే విషయాన్ని పోలీసులు పసిగట్టలేకపోయారు. దొంగలను పట్టుకోవడంలో పూర్తిగా విఫలమయ్యారు. ఈ నేపథ్యంలో బ్యాంకులో నగదు, నగలు దాచుకున్న వారి ఆందోళనకు గురవుతున్నారు. * శివ్వంపేట మండలం గోమారంలోని ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకులో సంవత్సరం క్రితం దొంగలు చోరీకి పాల్పడ్డారు. గ్రామంలో అద్దె భవనంలో బ్యాంకు కొనసాగుతోంది. దొంగలు లోపలికి చొరబడి లాకర్లు ధ్వంసం చేసేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు. ఈఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ఇప్పటి వరకు దొంగలను గుర్తించలేదు. అల్లాదుర్గం పట్టణంలోని భారతీయ స్టేట్ బ్యాంకులో నవంబర్ 3న దొంగలు చోరీకి యత్నించారు. బ్యాంకులో చొరబడి సీసీ కెమెరాను ఎత్తుకుపోయారు. కంప్యూటర్ మానిటర్‌ను ధ్వంసం చేశారు. దొంగలకు లాకర్ తెరుచుకోకపోవడంతో నగలు, నగదు చోరీ కాకున్నా.. బ్యాంకులోని వస్తువులు ధ్వంసం కావడంతో ఆస్తి నష్టం జరిగింది. పొలీసులు కేసు నమోదు చేసినా దొంగలను పట్టుకోలేదు. సీసీ కెమెరాలోని దొంగ ఫొటోలను స్వాధీనం చేసుకున్న పోలీసులు విచారణను మాత్రం ముమ్మరం చేయలేదనే ఆరోపణలున్నాయి. -
బ్యాంకు దోపిడీ కేసులో ఇంటిదొంగల పాత్ర
మల్కాజ్గిరి సెంట్రల్ బ్యాంకు దోపిడీ కేసు విచారణ ఓ కొలిక్కి వచ్చింది. ఈ దోపిడీలో బ్యాంకు సిబ్బంది ప్రమేయం ఉన్నట్లు పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. తాళం చెవులతోనే లాకర్లను ఓపెన్ చేసినట్లు గుర్తించారు. గతంలో బ్యాంకులో పనిచేసిన సిబ్బంది.. లేదా ప్రస్తుతం పనిచేస్తున్న వాళ్ల హస్తం ఇందులో ఉండొచ్చని భావిస్తున్నారు. బంగారు నగలు తాకట్టు పెట్టుకుని రుణాలు ఇచ్చే బ్యాంకులో తెల్లవారుజామున చోరీ జరిగింది. తాళాలతో బ్యాంకు షట్టర్ తెరచిన గుర్తుతెలియని వ్యక్తి.. కిలో బంగారం, లక్షా 25 వేల నగదు ఎత్తుకెళ్లారు. పోలీసులు సీసీ కెమెరా ఫుటేజి ఆధారంగా చూస్తే.. తాళాలు తీసుకుని దర్జాగా లోపలికి వెళ్లినట్లు తేలింది. సీసీ కెమెరా ఫుటేజ్‌లో చోరీ చేసిన వ్యక్తి ఆచూకీ తెలుస్తోంది. త్వరలోనే అతన్ని పట్టుకుంటామని పోలీసులు చెబుతున్నారు. మరోవైపు బ్యాంకు దోపిడీ గురించి తెలుసుకున్న ఖాతాదారులు బ్యాంకు దగ్గరకు చేరుకుని ఆందోళన వ్యక్తం చేశారు. -
రమేష్ కోసం గాలింపు ముమ్మరం
భూపాలపల్లి : బ్యాంకు దోపిడీలో ప్రధాన నిందితుడు రమేష్ ఆచూకీ నేటికీ లభించలేదు. చోరీ జరిగి పది రోజులు గడిచినా పోలీసులకు చిక్కకుండా తప్పించుకు తిరుగుతున్నాడు. ఈనెల 15న పట్టణంలోని ఏపీజీవీబీ భూపాలపల్లి, ఆజంనగర్ బ్రాంచిల్లో అటెండర్ రమేష్ చోరీకి పాల్పడి లాకర్లలోని బంగారం, డబ్బు దోచుకెళ్లిన విషయం తెలిసిందే. కాగా, నిందితు డి భార్య రమాదేవి ఈనెల 22న పట్టుబడగా.. బంగా రం, రూ.2లక్షల నగదును పోలీసులు రికవరీ చేశారు. అయితే బంగారం పూర్తిస్థాయిలో రికవరీ చేసినప్పటి కీ అసలు నిందితుడి జాడ దొరకక పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. రమేష్ మహారాష్ట్రలోని గోదావరి సరిహద్దు గ్రామాల్లో తిరుగుతున్నట్లు సమాచారం. గతంలో తునికాకు కల్లాల్లో పని చేసినందున, ఆ పరిచయాలతో ఆయా గ్రామాల్లో తల దాచుకుంటున్నట్లు తెలుస్తోంది. అయితే గోదావరి సరిహద్దు గ్రామా ల్లో మావోయిస్టుల కదలికలు ఎక్కువగా ఉన్నాయని పోలీసులు గుర్తించినట్లు తెలిసింది. ఈ మేరకు ఉన్నతాధికారులు సైతం గోదావరి పరీవాహక సరిహద్దు గ్రామాల్లోకి వెళ్లవద్దని సూచించినట్లు సమాచారం. గ్రామాల్లోకి వెళ్లే వీలు లేనప్పటికీ ఇరు రాష్ట్రాల సరిహద్దులో గల ముఖ్య పట్టణాలు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలో నిందితుడి కోసం పోలీసు బృందాలు అలుపెరుగకుండా గాలింపు చేపడుతూనే ఉన్నాయి. -
బ్యాంకు దోపిడీ ఛేదించిన పోలీసులు
* అటెండర్ పనే.. * నిందితుడు రమేష్ భార్య అరెస్ట్ * 34 కిలోల బంగారం.. రూ.2 లక్షలు స్వాధీనం వరంగల్ క్రైం/భూపాలపల్లి : భూపాలపల్లిలోని రెండు ఏపీజీవీబీ శాఖల్లో దోపిడీ ఇంటి దొంగల పనేనని తేలింది. భూపాలపల్లి శాఖలో అటెండర్‌గా పనిచేస్తున్న రమేష్ సూత్రధారి, పాత్రధారి అని బహిర్గతమైంది. నిందితుడికి సహకరించింది ఆయన భార్య రమాదేవి అని తేటతెల్లమైంది. ఆమెను పోలీసులు శుక్రవారం రాత్రి హసన్‌పర్తి బస్టాండ్ ప్రాంతంలో పట్టుకోగా... దోపిడీ ఘట్టం బట్టబయలైంది. ఈ మేరకు హన్మకొండ హెడ్‌క్వార్టర్స్‌లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వరంగల్ రేంజ్ డీఐజీ మల్లారెడ్డి వివరాలు వెల్లడించారు. భూపాలపల్లిలోని రెడ్డికాలనీలో వెలుమ రాజేంద్రప్రసాద్ అలియాస్ రమేష్‌తోపాటు ఆయన భార్య రమాదేవి నివసిస్తున్నారు. రమేష్ ఏపీజీవీ బ్యాంకులో తాత్కాలిక మెసెంజర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఈనెల 15వ తేదీన మధ్యాహ్నం 3 నుంచి 5 గంటల సమయంలో భూపాలపల్లి, ఆజంనగర్ బ్యాంకు శాఖల్లోని డబ్బు, నగదును దోచుకున్నాడు. ఇంటికి వచ్చి భార్యతో బయటకు వెళ్లాలని చెప్పాడు. రమేష్‌కు పరిచయం ఉన్న తవేరా డ్రైవర్ అంకుశవాలితో శ్రీశైలం, బాసరకు కిరాయి మాట్లాడుకున్నాడు. 15వ తేదీ రాత్రి 11 గంటల సమయంలో రమేష్, అతని భార్య రమాదేవి, కుమారుడు, కూతురు కలిసి భూపాలపల్లి నుంచి హైదరాబాద్ మీదుగా శ్రీశైలం వెళ్లారు. 16న దైవదర్శనం చేసుకుని తిరిగి అదేరోజు హైదరాబాద్ చేరుకున్నారు. ఓ లాడ్జిలో బసచేసి 17వ తేదీన బాసరకు చేరుకున్నారు. షిరిడికి వెళ్దామంటే డ్రైవర్ సహకరించకపోవడంతో రూ.20 వేలు ఇచ్చి అతడిని అక్కడి నుంచి పంపించాడు. ఆ తర్వాత నిజామాబాద్ బస్టాండ్‌కు చేరుకుని, ఆ రోజు అక్కడే గడిపారు. 18న బస్సులో మహారాష్ర్ట లో బళ్లార్షాకు వెళ్లారు. గద్చిరౌలి జిల్లా సిరొంచ గ్రామంలోని బంధువుల ఇంట్లో ఆ రాత్రి గడిపారు. 19న రమేష్.. తన భార్య, కూతురుతో కలిసి మహారాష్ట్రలోని వడడం నుంచి పడవలో గోదావరి దాటి కరీంనగర్ జిల్లా మహదేవపూర్ మండలం అంబటిపల్లి గ్రామానికి చేరుకున్నాడు, అక్కడ తనకు పరిచయం ఉన్న లావణ్య ఇంటికి వచ్చాడు. కొంత సేపటి తర్వాత తాను తీసుకువచ్చిన బ్యాగుల్లో బట్టలు ఉన్నాయని, ఇవి ఇక్కడే పెడుతున్నామని... హన్మకొండలోని బంధువుల వద్దకు వెళ్లి వస్తానని చెప్పి వారు బయటపడ్డారు. మహదేవపూర్ బస్టాండుకు వచ్చి రమాదేవి, కూతురును బస్సు ఎక్కించి... తాను త్వరలోనే వస్తానని చెప్పి వెళ్లిపోయాడు. ఈ క్రమంలో నిందితుల కదలికలపై నిఘా పెట్టిన ప్రత్యేక పోలీసులు బృందాలు పక్కా సమాచారం మేరకు రమేష్ భార్య రమాదేవినిహసన్పర్తి బస్టాండ్ ప్రాంతంలో అదుపులోకి తీసుకున్నారు. విచారణలో ఆమె చెప్పిన ప్రకారం... అంబటిపల్లిలోని లావణ్య ఇంటిలో సోదా చేయగా... 1154 బ్యాగుల్లో ఉన్న రూ.9.50 కోట్ల విలువైన 34 కిలోల బంగారు నగలు, దొంగిలించిన రూ.21 లక్షల్లో రూ. 2 లక్షలు దొరికారుు. పోలీస్ సిబ్బందికి డీఐజీ అభినందనలు రాష్ట్రంలోనే సంచలనం రేపిన భూపాలపల్లి ఘట నను జిల్లా పోలీస్ యంత్రాంగం సీరియస్‌గా తీసుకుంది. వరంగల్ రేంజ్ డీఐజీ బి.మల్లారెడ్డి, ఎస్పీ అంబర్ కిషోర్ ఝా ప్రత్యేక దృష్టి సారించి చర్యలు చేపట్టారు. వారం రోజుల్లోనే నిందితులను గుర్తించడంతోపాటు బ్యాంకుల్లో దోపిడీలకు గురైన బంగా రు ఆభరణాలను స్వాధీనం చేసుకోవడంలో వరంగల్ రేంజ్ డీఐజీ బి.మల్లారెడ్డి, ఎస్పీ అంబర్ కిషోర్ఝాలు ఈ కేసు పరిష్కరించడం కోసం ప్రత్యేక దృష్టి సారించారు. రూరల్ క్రైం అదనపు ఎస్పీ జాన్‌వెస్లీ పర్యవేక్షణలో పరకాల, ములుగు, మహబూబాబాద్ డీఎస్పీలు సంజీవ్‌రావు, శోభన్‌కుమార్, మురళీధర్‌తోపాటు భూపాలపల్లి,పరకాల,చిట్యాల, ములు గు, కేయూసీ ఇన్స్పెక్టర్లు రఘునందన్‌రావు, వెంకటేశ్వర్లు, రవీందర్, శ్రీధర్‌రావు, దేవేందర్‌రెడ్డి నిందితు ల ఆచూకీ కోసం శ్రమించారు. శుక్రవారం రాత్రి క్రైం అదనపు ఎస్పీకి అందిన పక్కా సమాచారం ప్రకారం డీఎస్పీ సంజీవ్‌రావు ఆధ్వర్యంలో రమాదేవిని హసన్‌పర్తి బస్టాండ్ ప్రాంతంలో అదుపులోకి తీసుకున్నారు. నిందితులను గుర్తించడంతోపాటు దోపిడీకి గురైన ఆభరణాలను స్వాధీనం చేసుకోవడంలో ప్రతిభ కనబరిచిన క్రైం అదనపు ఎస్పీ, డీఎస్పీలు, ఇన్స్పెక్టర్లతో పాటు రూరల్ సీసీఎస్ ఎస్సైలు కిషన్, గౌస్, హెడ్ కానిస్టేబుళ్లు సంజీవరెడ్డి, ప్రసాద్, కానిస్టేబుల్ సీహెచ్.వేణుగోపాల్‌ను డీఐజీ ప్రత్యేకంగా అభినందించారు. విలేకరుల సమావేశంలో డీఐజీ మల్లారెడ్డితోపాటు వరంగల్, కరీంనగర్ ఎస్పీలు అంబర్ కిషోర్ ఝా, శివకుమార్, అదనపు ఎస్పీ (క్రైం విభాగం) జాన్‌వెస్లీ పాల్గొన్నారు. -
బ్యాంకు దోపిడీలకు కళ్లెం వేయొచ్చు
పవన్ సెక్యూరిటీ సిస్టమ్‌లో అడ్వాన్స్డ్ టెక్నాలజీ పలమనేరు: జిల్లాలో కొన్నాళ్లుగా జరుగుతున్న బ్యాంకు దోపిడీలను పరిశీలిస్తే దొంగలు నూతన టెక్నాలజీ వాడుతున్నట్లు అర్థమవుతోంది. అదే రీతిలో బ్యాంకుల వద్ద అడ్వాన్స్డ్ టెక్నాలజీని వాడకపోవడం బ్యాంకర్ల తప్పిదమే అని చెప్పుకోవచ్చు. సెక్యూరిటీ సిస్టంను ఏర్పాటు చేసుకోవాలంటే బ్యాంకు ఉన్నతాధికారుల నుంచి అనుమతులు రావడం లేదన్న ఆరోపణలున్నాయి. మరికొన్ని బ్యాంకులు తమ బ్యాంకుకు ఇన్సూరెన్స్ ఉందంటూ భద్రత గురించి బెంగపడడం లేదు. కనీసం రాత్రిపూట వాచ్మెన్ సైతం లేని బ్యాంకులు జిల్లాలో 90 శాతం దాకా ఉన్నాయంటే భద్రత ఎంత పటిష్టంగా ఉందో తెలుసుకోవచ్చు. జులాయి సినిమాలో లాగే.. మూడ్రోజుల క్రితం వరదయ్యపాళెం సప్తగిరి గ్రామీణ బ్యాంకులో జరిగిన దోపిడీ జులాయి సినిమాలో సన్నివేశాన్ని తలపిస్తోంది. గుర్తు తెలియని వ్యక్తులు సీసీ కెమెరా వైర్లను కట్ చేయడం, గ్యాస్ కటర్లను ఉపయోగించి లాకర్లు తెరవడం, ఆపై ఆధారాలు లభించకుండా కారంపొడి చల్లడం, ముఖాలకు మాస్క్‌లు ధరించడం చేశారు. ఇలా దొంగలు అన్ని విధాలా సాంకేతికంగా ముందుకెళుతున్నారు. ఇదే రీతిలో ప్రజలు లేదా బ్యాంకులు మరింత అడ్వాన్స్ టెక్నాల జీని ఉపయోగించాల్సిన పరిస్థితి నెలకొంది. పవన్ సెక్యూరిటీ సిస్టమ్ ఉన్నట్లయితే.. పలమనేరు మండలం మొరం గ్రామానికి చెందిన పవన్ అనే గ్రామీణ శాస్త్రవేత్త దొంగలను పట్టేందుకు తయారు చేసిన సెక్యూరిటి సిస్టమ్ ఎంతో అడ్సాన్స్డ్గా ఉంది. ఇందులో దొంగ లోపలికి వెళ్లగానే సెన్సార్ ఆధారంగా అలారం రావడం, అనంతరం ఫ్లాష్ వచ్చి కెమెరా ఫొటోలు తీయడం, యజమాని సెల్‌ఫోన్‌తో పాటు మరో ఐదుగురికి కాల్ వెల్లడం, 100 నెంబర్‌కు ఎస్ఎంఎస్ వెళ్లడం తదితర సౌకర్యాలున్నాయి. ఒకవేళ దొంగలు సీసీ కెమెరా వైర్లను కట్ చేసినా సెన్సార్లు పనిచేస్తాయి కాబట్టి ఫొటో, బెల్, కాల్ అలెర్ట్ తదితరాలతో ఆ దొంగల వివరాలు తెలుస్తాయి. అందుకే పోలీసులు సైతం సంబంధిత బ్యాం కర్లను పిలిపించి బ్యాంకుల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరిస్తున్నారు. ఇకనైనా బ్యాంకుల వద్ద మరింత గట్టి నిఘా ఏర్పాటు చేయాల్సిన అవసరమెంతైనా ఉంది. -
టార్గెట్ శనివారమే!
సాక్షి, హైదరాబాద్: సోమవారం వచ్చిందంటే చాలు ఏ మూలన ఏ బ్యాంకు దొంగతనం వ్యవహారం వెలుగులోకి వస్తుందా అని చూడాల్సిన పరిస్థితి ప్రస్తుతం పోలీసు విభాగంలో నెలకొంది. బ్యాంకుల్లో ఉన్న లోపాలకు తోడు.. దొంగలు అనుసరిస్తున్న పంథానే దీనికి కారణం. తీరిగ్గా తమ పని పూర్తి చేసుకోవడంతోపాటు విషయం బయటకు పొక్కేలోపే సురక్షితమైన ప్రాంతానికి చేరుకోవడం కోసం దొంగలు ‘టార్గెట్ శనివారం’ ప్లాన్ అమలు చేస్తున్నారు. ఇలాగే, రెండు తెలుగు రాష్ట్రాల్లో శనివారం జరిగిన మూడు బ్యాంకు దొంగతనాలు సోమవారం బయటపడ్డాయి. చిత్తూరు జిల్లాలోని సత్యవేడు నియోజకవర్గం వరదయ్యపాళెంలో ఉన్న సప్తగిరి గ్రామీణ బ్యాంకును శనివారం రాత్రి దొంగలు కొల్లగొట్టారు. అలాగే వరంగల్ జిల్లా భూపాలపల్లి, ఆజాంనగర్ ఏపీజీవీబీ బ్యాంకుల్లోనూ దొంగతనాలు జరిగాయి. అలాగే ఈ ఏడాది జనవరిలో మెదక్ జిల్లా జహీరాబాద్‌లో ముత్తూట్ ఫైనాన్స్, ఆగస్టులో మహబూబ్‌నగర్ జిల్లా బాలానగర్‌లోని గ్రామీణ వికాశ్ బ్యాంకుల్లో జరిగిన భారీ చోరీలు శనివారమే చోటు చేసుకున్నాయి. ఇవే కాకుండా పలు ప్రాంతాల్లో చోటు చేసుకున్న బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థల్లో చోరీ యత్నాలు కూడా శనివారమే జరిగి సోమవారం వెలుగులోకి వచ్చాయి. పొరుగు రాష్ట్రాలతో పాటు ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, బీహార్‌లకు చెందిన అనేక ముఠాలు బ్యాంకులు, భారీ ఫైనాన్స్ సంస్థల్నే టార్గెట్‌గా చేసుకుని పంజా విసురుతున్నాయని ఇప్పటికే నిర్ధారణైంది. ఏదైనా నేరం జరిగిన తరవాత విషయం ఎంత త్వరగా పోలీసులకు తెలిస్తే.. దొంగల్ని పట్టుకోవడానికి అంత ఎక్కువ అవకాశం ఉంటుంది. అయితే శనివారం చోరీ చేస్తే మరుసటి రోజు సెలవు కావడంతో బ్యాంకు సిబ్బంది సహా ఎవ్వరూ దాన్ని గుర్తించే అవకాశం ఉండదు. సోమవారం ఉదయం వరకు ఈ విషయం వెలుగులోకి రాదు. ఇలా తమ చేతిలో ఉంటున్న 24 గంటలకు పైగా కాలాన్ని వినియోగించుకుంటున్న పొరుగు రాష్ట్రాల ముఠాలు క్షేమంగా తప్పించుకుంటున్నాయి. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకున్న పోలీ సు విభాగం బ్యాంకుల్ని అప్రమత్తం చేయాలని భావిస్తోంది. సెలవు దినాల్లో సైతం ఓ బాధ్యతగల ఉద్యోగి వచ్చి బ్యాంకును పరిశీలించి వెళ్లేలా చర్యలు తీసుకోవాలని కోరనుంది. -
డి ఫర్ దోపిడీ..
బ్యాంకులో దోపిడీకి ప్లాన్.. ఇందుకోసం బ్యాంకు సమీపంలో నిర్మానుష్యంగా ఉన్న భవనం నుంచి బ్యాంకు లోపలికి 125 అడుగుల మేర సొరంగం తవ్వడం.. దాంట్లోంచి వెళ్లి బ్యాంకులోని నగదును, లాకర్లను కొల్లగొట్టడం.. వినడానికి సినిమా స్టోరీలా ఉన్నా.. హర్యానాలోని గొహానా పట్టణంలో ఇది నిజంగానే జరిగింది. అక్కడి పంజాబ్ నేషనల్ బ్యాంకులో మొత్తం 350 లాకర్లు ఉండగా.. దొంగలు గ్యాస్ కట్టర్లు ఉపయోగించి అందులో 89 లాకర్లను తెరిచి.. రూ.కోట్ల విలువైన సొత్తును కొల్లగొట్టుకుపోయారు. దానికి సంబంధించిన చిత్రాలే ఇవి.. 7 అడుగుల ఎత్తు, 2.5 అడుగుల వెడల్పులో ఈ సొరంగాన్ని తవ్వారు. వారాంతపు సెలవుల అనంతరం సోమవారం బ్యాంకును తెరిచినప్పుడు ఈ విషయం బయటపడింది. శనివారం లేదా ఆదివారం రాత్రి దోపిడీ జరిగి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. కాగా, తమ విలువైన సొత్తును భద్రపరచడంలో బ్యాంకు నిర్లక్ష్యం వహించిందని ఆరోపిస్తూ.. ఖాతాదారులు బ్యాంకుపై కేసు వేయాలని యోచిస్తున్నారు. -
కెనరా బ్యాంకులో భారీ చోరీ
వెల్దుర్తి, తూప్రాన్: దాచుకున్న సొమ్ములు దోచుకెళ్లిండ్రు... కాయకష్టం చేసుకుని పైసాపైస కుడబెట్టి దొంగల భయంతో నగదు, బంగారాన్ని బ్యాంకుల్లో దాచుకున్నా చోరీకి గురయ్యాయని బాధితులు విలపించారు. మంగళవారం వెల్దుర్తి మండలం 44వ జాతీయ రహదారి పక్కనే మాసాయిపేట కెనరా బ్యాంకులో చోరీ విషయం తెలిసి బాధితులంతా పరుగుపరుగున సంఘటాన స్థలానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తమ సొమ్మును బ్యాంకులోని లాకర్లలో దాచుకునేందుకు ఏడా దికి రూ.1,400 చెల్లిస్తున్నామని తెలిపారు. ఆభరణాలు, నగదు... సినీఫక్కీలో దోపిడీకి పాల్పడిన దొంగల ముఠా సభ్యులు బ్యాంకుకు కన్నం వేసి బీరువాలో దాచి ఉంచిన రూ.15 లక్షల నగదు, వ్యవసాయ రుణాలు పొందేందుకు రైతులు తాకట్టు పెట్టిన సుమారు ఐదు కిలోల బంగారు ఆభరణాలు దోచుకెళ్లారు. బ్యాంకు లోపలి గదిలో లాకర్లలో ఖాతాదారులు దాచి ఉంచిన ఆరు లాకర్లను ధ్వంసం చేసి నగదు, బంగారు, వెండి ఆభరణాలను అపహరించుకుపోయారు. దోపిడీకి పాల్పడింది ఇలా... బ్యాంకు దోపిడీ చేసేందుకు ముందుగానే పతకం పన్నినట్లు దొంగతనం చేసిన తీరును పరిశీలిస్తే స్పష్టమవుతోంది. అర్ధరాత్రి సమయంలో 44వ జాతీయ రహదారికి పక్కనే ఉన్న బ్యాంకును చోరీ కోసం ఎంచుకున్నారు. ఈ క్రమంలోనే బ్యాంకుకు రహదారి వైపు ఉన్న దుకాణాల వెనుక కిటికీని ఎంచుకుని కన్నం వేశారు. అనంతరం లోపలికి ప్రవేశించి సీసీ కెమెరాలను ధ్వంసం చేసి స్ట్రాంగ్‌రూంకు రంధ్రం చేసి లాకర్లను పగులగొట్టి నగదు, బంగారు ఆభరణాలు దోచుకెళ్లారు. అనంతరం బ్యాంకు పక్కనే ఉన్న తన ఇంటి తాళం పగులగొట్టి రూ.1,500 దోచుకెళ్లినట్లు బాధితుడు నరేందర్ తెలిపాడు. విషయం తెలిసిందిలా... ఉదయం బ్యాంకు సిబ్బంది బాషా, గోపాల్‌లు బ్యాంకును తెరిచేందుకు వెళ్లారు. దోపిడీ జరిగినట్లు గుర్తించి వెంటనే బీఎం ఇసాక్‌కు, బ్యాంకు అధికారులకు విషయం తెలిపారు. ఉదయం 10గంటలకు స్థానిక బ్యాంకు అధికారులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. దోపిడీ విషయం తెలుసుకున్న ఖాతాదారులు, పెద్ద సంఖ్యలో అక్కడకు చేరారు. అప్పటికే తూప్రాన్ డీఎస్పీ వెంకటేశ్వర్లు, సీఐ సంజాయ్కుమార్, రామయంపేట సీఐ నందీశ్వర్, ఎస్ఐ ప్రవీణ్‌రెడ్డి, చేగుంట ఎస్ఐ శ్రీనివాస్‌రెడ్డిలు పోలీసు బలగాలతో సంఘటన స్థలానికి చేరుకున్నారు. బ్యాంకు లోపల చెల్లాచెదురుగా పడి ఉన్న వస్తువులు, దోపిడీ జరిగిన తీరును గమనించి వెంటనే క్లూస్‌టీం, డాగ్‌స్క్వాడ్‌కు సమాచారం ఇచ్చారు. వారు మధ్యాహ్నం 12.45 నిమిషాలకు సంఘటన స్థలానికి చేరకున్నారు. వేలిముద్రలను సేకరించారు. డాగ్‌స్క్వాడ్ మాత్రం బ్యాంకు ఆవరణలో కలియ తిరిగి అనంతరం బ్యాంకు సమీపంలోని వ్యవసాయ పొలాల్లోంచి రైల్వే స్టేషన్ వరకు నిలిచిపోయింది. త్వరలోనే పట్టుకుంటాం... బ్యాంకు దోపిడీకి పాల్పడింది అంతరాష్ట్ర ముఠా సభ్యులుగా భావిస్తున్నట్లు తూప్రాన్ డీఎస్పీ వెంకటేశ్వర్లు వెల్లడించారు. బీహార్, గుల్బార్గా ముఠా సభ్యులు మాత్రమే ఇలాంటి దోపిడీలకు పాల్పడుతారని తెలిపారు. చేగుంట, రామయంపేట ఎస్ఐల ఆధ్వర్యంలో రెండు ప్రత్యేక పోలీస్ బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. హైదరాబాద్, సైబరాబాద్‌లలో ఉన్న పాత నేరస్తులను విచారించి త్వరలోనే వారిని పట్టుకుంటామని తెలిపారు. గతంలోనే బ్యాంకు అధికారులకు సెక్యూరిటీ ఏర్పాటు చేసుకోవాలని నోటీసులు ఇచ్చినట్లు తెలిపారు. -
హాలీవుడ్ తరహాలో బ్యాంకు దోపిడీ
హర్యానాలోని ఓ బ్యాంకులో దోపిడీకి దొంగలు హాలీవుడ్ సినిమా తరహా టెక్నిక్ ఉపయోగించారు. అక్కడి గొహానా పట్టణంలో ఉన్న పంజాబ్ నేషనల్ బ్యాంకు స్ట్రాంగ్ రూంలోకి దూరం నుంచి ఒక సొరంగం తవ్వి, అందులో ఉన్న నగదుతో పాటు కోట్లాది రూపాయల విలువ చేసే సొత్తు దోచుకెళ్లిపోయారు. రోడ్డుకు అవతలివైపున ఉన్న ఓ పాత భవనం లోంచి 2.5 అడుగుల వెడల్పున్న సొరంగాన్ని దొంగలు తవ్వారు. దేశంలో ఇటీవలి కాలంలో జరిగిన బ్యాంకు దోపిడీలలో ఇది అతిపెద్దదని చెబుతున్నారు. దోపిడీ దొంగలు చాలా కాలం క్రితం నుంచే ఈ సొరంగం తవ్వుతున్నా.. ఎవరికీ ఎందుకు తెలియలేదన్న విషయాన్ని పోలీసు అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ సొరంగం నేరుగా స్ట్రాంగ్ రూంలోకి వెళ్లింది. ఆ రూంలో మొత్తం 360 లాకర్లుండగా, వాటిలో 90 లాకర్లను దొంగలు పగలగొట్టారు. -
బీ అలర్ట్
* దోపిడీకి గ్యాస్కట్టర్ల వినియోగం * మొన్న హాలియాలో.. తాజాగా చౌటుప్పల్‌లో.. మొన్న హాలియాలో బ్యాంకు దోపిడీకి.. తాజాగా చౌటుప్పల్‌లోని ఏటీఎంలో చోరీకి యత్నం సంఘటనల నేపథ్యంలో జిల్లాలో తమిళ నాడుకు చెందిన దొంగల ముఠా సంచరిస్తున్నట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. హాలియాలో బ్యాంకు దోపిడీకి దొంగలు గ్యాస్ కట్టర్ ఉపయోగించడం, చౌటుప్పల్‌లోని ఇండియన్ బ్యాంకు ఏటీఎంలో కూడా ఇదే తరహాలో చోరీకి యత్నించడం చూస్తుంటే ఇది పక్కా ప్రొఫెషనల్స్ పనేనని భావిస్తున్నారు. దీంతో ఎస్పీ ప్రభాకర్‌రావు రంగంలోకి దిగి జిల్లా పోలీసు యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. చౌటుప్పల్ మొన్న హాలియాలో బ్యాంకు దోపిడీకి.. నిన్న చౌటుప్పల్‌లో ఏటీఎంలో చోరీకి యత్నం సంఘటనల నేపథ్యంలో ఎస్పీ టి.ప్రభాకర్‌రావు అప్రమత్తమయ్యారు. హాలియాలో బ్యాంకు దోపిడీకి దొంగలు గ్యాస్ కట్టర్ ఉపయోగించడం, చౌటుప్పల్‌లో ఇండియన్ బ్యాంకు ఏటీఎం చోరీలో కూడా గ్యాస్ కట్టర్‌నే వాడడంతో, అక్కడ, ఇక్కడ చోరీలకు పాల్పడుతున్నది ఒకే ముఠాకు చెందిన ప్రొఫెషనల్స్ అని పోలీసులు భావిస్తున్నారు. పోలీసులతో సమీక్ష భువనగిరి సబ్‌డివిజన్‌లోని సీఐలతో ఆదివారం ఎస్పీ చౌటుప్పల్‌లో సమావేశమయ్యారు. దొంగతనాల నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సమీక్షించా రు. దొంగతనాలన్నీ అర్ధరాత్రి ఒంటి గం ట నుంచి తెల్లవారుజామున 4గంటల మధ్య జరుగుతాయని, ఈ సమయంలో పోలీసులతో తప్పనిసరిగా బీట్లు నిర్వహించాలని సూచించారు. ప్రతి బ్యాం కు, ఏటీఎంల వద్ద నోట్‌పుస్తకాలను ఏర్పాటు చేయించి, బీట్‌కు వెళ్లిన కానిస్టేబుల్ తప్పనిసరిగా సంతకం చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. అర్ధరాత్రి ఎవరైనా కనిపిస్తే అనుమానితులుగా అదుపులోకి తీసుకోవాలని సూచించా రు. తమిళనాడుకు చెందిన ప్రొఫెషనల్స్ రాష్ట్రంలోకి ప్రవేశించి, బ్యాంకులు, ఏటీఎంలలో చోరీలకు పాల్పడుతున్నట్టు భా విస్తున్నారు. ఆయన వెంట భువనగిరి డీఎస్పీ శ్రీనివాస్, సీఐలు గట్టుమల్లు, బాలగంగిరెడ్డి, శివరాంరెడ్డి, సతీష్‌రెడ్డి, నరేందర్, శంకర్‌లున్నారు. అసలు మన ఏటీఎంలకు భద్రత ఎంత..? బ్యాంకులు 24 గంటలు ప్రజలకు డబ్బును అందుబాటులో ఉంచేందుకు ఎక్కడపడితే అక్కడ ఏటీఎంలను ఏర్పాటు చేస్తున్నాయి. భవిష్యతులో గ్రామీణ పల్లెలకు కూడా ఏటీఎంలు రానున్నాయి. ఏటీఎంల ఏర్పాటుకు ప్రాధాన్యమిస్తున్న బ్యాంకులు, భద్రతను ఏమాత్రం పట్టించుకోవడం లేదు. అవుట్సోర్సింగ్ ద్వారా ఎక్కువ సంఖ్యలో ఏటీఎంలను ఏర్పాటు చేస్తున్నారు. అవుట్సోర్సింగ్ సిబ్బంది ఏటీఎంలను ఏమాత్రం పర్యవేక్షించడం లేదు. ఏటీఎంలలో డబ్బులు అయిపోతే, పనిచేయనప్పుడు మాత్రమే మెసేజ్ అలర్ట్‌తో వచ్చి,పోతున్నారు. అవుట్సోర్సింగ్ ఏటీఎంలంటూ స్థానికంగా ఉండే బ్యాంకులు తమకేం సంబంధం లేదంటున్నారు. ఎక్కడా సెక్యూరిటీగార్డులను కూడా నియమించడం లేదు. అలారంపనిచేయడం లేదు. సీసీ కెమెరాలది అదే తీరు. ఒకవేళ పనిచేసినా, మనుషులను గుర్తించే పరిస్థితి లేదు. 3:30గంటల పాటు విఫలయత్నం.. చౌటుప్పల్‌లోని ఇండియన్ బ్యాంకు ఏటీఎంలో ఆదివారం తెల్లవారుజామున చోరీకి 3:30గంటల పాటు విఫలయత్నం జరిగింది. పోలీసులు సీసీ కెమెరాలోని ఫుటేజీని విశ్లేషిస్తున్నారు. మాస్క్, జర్కిన్ ధరించిన దొంగ శనివారం అర్ధరాత్రి దాటాక 12గంటల సమయంలో ఏటీఎం షెట్టర్ మూసివేశాడు. 2గంటల సమయంలో గ్యాస్ కట్టర్‌తో ఏటీఎం మిషన్ కింది భాగం తొలగించాడు. అక్కడ నంబరులాక్ ఉండడంతో తెలియక, తెల్లవారుజామున 5:30గంటల పాటు విఫలయత్నం చేసి వెనుదిరిగాడు. ఉదయం స్థానికులు చోరీ జరిగిన విషయాన్ని గుర్తించి, పోలీసులకు సమాచారమివ్వడంతో సీఐ గట్టుమల్లు ఏటీఎంను పరిశీలించారు. టీసీఎస్ ఇన్చార్జి దెయ్యాల పరమేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చౌటుప్పల్లోనే సరిగ్గా నెల రోజుల క్రితం ఎస్బీఐ ఏటీఎంలో చోరీకి యత్నించి విఫలమయ్యారు. ఏడాది క్రితం ఎస్బీహెచ్ ఏటీఎంలో కూడా చోరీకి యత్నించారు. -
బ్యాంకు దోపిడీకి విఫలయత్నం
మునగపాక ఎస్బీఐలో ఘటన లాకర్లలో ఆభరణాలు, నగదు సురక్షితం క్లూస్ టీమ్ వివరాల సేకరణ కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు మునగపాక : స్థానిక స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్‌లో ఇద్దరు యువకులు చోరీకి విఫలయత్నం చేశారు. బ్యాంక్‌లో చోరీ జరిగిందన్న ప్రచారంతో ఖాతాదారులు ఆందోళనకు గురయ్యారు. బ్యాంక్ అధికారులు, పోలీసులు క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం ఆభరణాలు గాని నగదుకాని చోరీ జరగలేదని ప్రకటించారు. వివరాలివి... మునగపాక మెయిన్ రోడ్డు పక్కనే ఎస్బీఐ బ్రాంచి ఉంది. ఈ నెల 28న రాత్రి 7 గంటల సమయంలో బ్రాంచ్ మేనేజర్ సుబ్రహ్మణ్యంతోపాటు సిబ్బంది బ్యాంక్‌కు తాళాలు వేసి ఇళ్లకు వెళ్లిపోయారు. 29న వినాయక చవితి సెలవు కావడంతో తెరవలేదు. 30న ఉదయం 9.15 గంటలకు బీఎంతో పాటు అకౌంటెంట్ ఉమామణి మెయిన్‌గేటు తెరిచి లోపలికి వెళ్లారు. లోపల ఉన్న సర్వర్‌ను ఆన్‌చేసి వస్తుండగా లాకర్లు ఉన్న గది తెరిచి ఉండడాన్ని గమనించి ఒక్కసారిగా బీఎం ఆందోళనకు గురయ్యారు. అకౌంటెంట్‌ను పిలిచి ముందురోజు లాకర్ గదికి తాళాలు వేయడం మరిచారా అని వాకబు చేశారు. ఆమె తాళాలు వేశామని చెప్పడంతో చోరీ జరిగిందని భావించి హుటాహుటీన స్థానిక పోలీసు స్టేషన్‌కు చేరుకొని ఎస్ఐ రవికుమార్‌కు ఫిర్యాదు చేశారు. ఎస్ఐ తన సిబ్బందితో బ్యాంక్‌కు చేరుకున్నారు. లాకర్ గది తాళాలు తీసి కింద పడేసిన విషయాన్ని గమనించి దొంగలు ప్రవేశించారని నిర్ధారించారు. పోలీసుల సమక్షంలో బ్యాంక్ సిబ్బంది అన్ని లాకర్లు తెరిచి చూడగా నగదు, బంగారు ఆభరణాలు చోరీకి గురికాలేదని నిర్ధారించుకున్నారు. సీసీ పుటేజ్ ఆధారంగా వివరాలు... ఎస్బీఐలో చోరీకి ప్రయత్నించిన ఇద్దరు వ్యక్తులు బ్యాంకుకు దక్షిణ దిశలో ఉన్న కిటికీని గునపాంతో పెకిలించి లోపలికుప్రవేశించారు. క్యాషియర్ రూమ్‌లో ఉన్న ఆలారం కనెక్షన్ తొలగించారు. అనంతరం లాకర్లు ఉన్న గది గేటుకున్న తాళం కప్పలను గునపంతో పెకిలించివేశారు. అదే సమయంలో ఓ దుండగుడు సీపీ కెమెరాను విరగ్గొట్టాడు. దీంతో ఆ తరువాతం ఏం జరిగిందన్న విషయం సీసీ పుటేజీలో కానరాలేదు. అనుభవం ఉన్న దొంగలపనే... ఇది చోరీల్లో అనుభవం ఉన్న వ్యక్తుల పనేనని క్లూస్‌టీమ్ ఇన్స్పెక్టర్ శ్రీనగేష్ తెలిపారు. ఎటువంటి అనవాళ్లు తెలియకుండా ఇద్దరు వ్యక్తులు ముఖాలకు గుడ్డలు కప్పుకొని, కాళ్ల కు సాక్సులు ధరించి బ్యాంకులోకి ప్రవేశిం చినట్టు గుర్తులు ఉన్నాయని చెప్పారు. ఆ ఇద్దరి వయస్సు 32 నుంచి 35 ఏళ్లు ఉండవచ్చన్నారు. 27న అర్ధరాత్రి దాటిన తరువాత 1.40 గంటలకు దొంగలు బ్యాంకులో చోరీకి యత్నించారని సీసీ పుటేజీలో గుర్తించామన్నారు. ఖాతాదారులు ఆందోళన వద్దు.. బ్యాంక్‌లో చోరీ జరిగిందన్న విషయం తెలియడంతో పెద్ద సంఖ్యలో ఖాతాదారులు శనివారం బ్యాంక్‌కు చేరుకున్నారు. తమ ఆభరణాలు జాగ్రత్తగా ఉన్నాయా లేదా అని తెలుసుకునేందుకు ప్రయత్నించారు. దీనిపై బ్రాంచ్ మేనేజర్ మాట్లాడుతూ ఖాతాదారులెవరూ ఆందోళన చెందవద్దని, నగదు, ఆభరణాలు లాకర్లలో భద్రంగా ఉన్నాయని చెప్పారు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. చోరీ విషయం తెలుసుకున్న అనకాపల్లి రూరల్ సీఐ భూషణం నాయుడు మునగపాక ఎస్బీఐకు చేరుకొని వివరాలు తెలుసుకున్నారు. చోరీకి యత్నించిన వ్యక్తులను వదిలేదిలేదన్నారు. పోలీస్ సైరన్ వల్లే దొంగల పరారీ... దొంగలు బ్యాంకులో చోరీకి ప్రయత్నిస్తున్న సమయంలో గస్తీ నిర్వహిస్తున్న పోలీస్ సిబ్బంది వాహనం సైరన్ మోగించుకుంటూ వెళ్లడం వల్లే దొంగలు భయపడి పరారై ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. -
భద్రత డొల్ల
- బ్యాంకులో చోరీపై దర్యాప్తు ముమ్మరం - నేరస్తులకోసం ఐదు బృందాల వేట - గతంలో జరిగిన ఘటనలపై ఆరా - పాత నేరస్తుల కదలికలపై నిఘా సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్ : బాలానగర్ గ్రామీణ వికాస్ బ్యాంకులో సోమవారం వెలుగుచూసిన భారీ చోరీ ఘటనపై పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. ఘటన జరిగిన తీరును సమీక్షించిన పోలీసులు ఐదు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. బ్యాంకులో భద్రతా లోపాల వల్లే పెద్ద మొత్తం చోరీకి గురైందని అంచనాకు వచ్చారు. పొరుగు జిల్లాల్లో గతంలో జరిగిన బ్యాంకు దోపిడీ ఘటనల వివరాలు సేకరించారు. 2013లో మెదక్ జిల్లా కవేలీలోని ఓ బ్యాంకు కొల్లగొట్టే ప్రయత్నంలో దొంగలు ఎస్ఐపై కాల్పులు జరిపి పారిపోయారు. ఈ యేడాది ఫిబ్రవరిలో జహీరాబాద్‌లోని ముత్తూట్ ఫైనాన్స్‌లోనూ భారీ దోపిడీ జరిగింది. ఈ ఘటన జరిగిన 24 గంటల వ్యవధిలోనే పోలీసులు హైదరాబాద్‌లో జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన ఓ నిందితుడిని అరెస్టు చేశారు. అతనివద్ద నుంచి ఏడుకిలోల బంగారం, రూ.13.42లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. బాలానగర్ గ్రామీణ వికాస్ బ్యాంకు చోరీ ఘటన నేపథ్యంలో ఈ రెండు ఘటనలు జరిగిన తీరుపై పోలీసులు దృష్టి సారించారు. గతంలో అరెస్టయిన నిందితులు జైల్లో ఉన్నారా, బెయిల్‌పై బయటకు వెళ్లారా, వారి కదలికలు ఎక్కడున్నాయి అనే కోణంలో షాద్‌నగర్ డీఎస్పీ ద్రోణాచార్యులు, సీఐ గంగాధర్ పర్యవేక్షణలో బాలానగర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. జహీరాబాద్, స్టేట్ క్రైం రికార్డ్సు బ్యూరోతో పాటు ఇతర రాష్ట్రాలకు కూడా ప్రత్యేక పోలీసు బృందాలు బయలుదేరి వెళ్లినట్లు సమాచారం. భద్రతా లోపాల వల్లే! బ్యాంకులో భద్రతా లోపాల వల్లే భారీ మొత్తంలో బంగారం, నగదు చోరీకి గురైందని పోలీసు అధికారులు భావిస్తున్నారు. స్ట్రాంగు రూం, సెక్యూరిటీ ఏర్పాట్లు, సీసీ కెమెరాల ఫుటేజీ భద్ర పరిచే సిస్టమ్‌కు రక్షణ లేకపోవడం వంటి కారణాల వల్లే నేరస్తులు సులువుగా పెద్ద మొత్తాన్ని చేజిక్కించుకున్నట్లు ఘటన క్రమం వెల్లడిస్తోంది. బ్యాంకుల వద్ద సెక్యూరిటీ ఏర్పాటు చేసుకోవాలని రెండు నెలల క్రితమే నోటీసులు ఇచ్చినట్లు పోలీసులు చెబుతున్నారు. జిల్లాలో 31 బ్యాంకులకు చెందిన 349 బ్రాంచీల్లో కొన్నిచోట్ల మాత్రమే సెక్యూరిటీ ఏర్పాట్లు కనిపిస్తున్నాయి. బాలానగర్ మండల కేంద్రంలో ఎస్బీహెచ్, ఏపీజీవీవీ శాఖలున్నా సెక్యూరిటీ ఏర్పాట్లు లేవు. గతంలో బాలానగర్ ఎస్బీహెచ్ ఏటీఎంలో చోరీ యత్నం జరిగినా సీసీ కెమెరా లేకపోవడంతో నిందితుడిని గుర్తించలేకపోయారు. ప్రస్తుతం ఘటనా స్థలంలో వేలిముద్రలు లేకపోవడం, సీసీ ఫుటేజీ చోరీకి గురి కావడంతో దర్యాప్తు క్లిష్టతరంగా మారింది. నేరస్తులు వదిలి వెళ్లిన గ్యాస్ సిలిండర్, ఇతర పరికరాలు ఎక్కడ నుంచి తెచ్చారనే కోణంలోనూ దర్యాప్తు సాగుతోంది. షాద్‌నగర్ రూరల్ సీఐ గంగాధర్‌తో కలిసి డీఎస్పీ ద్రోణాచార్యులు మంగళవారం మరోమారు ఘటన స్థలాన్ని సందర్శించి మరిన్ని వివరాలు సేకరించారు. కొంత ఆలస్యమైనా చోరీ కేసును ఛేదిస్తామనే ధీమా పోలీసువర్గాల్లో కనిపిస్తోంది. -
ముచ్చటగా మూడోసారి..!
తాండూరు/పెద్దేముల్: విజయా బ్యాంకులో దోపీడీ యత్నం నిర్లక్ష్యానికి నిదర్శనంగా కనబడుతోంది. ఈ ఘటనలో అటు పోలీసులతో పాటు ఇటు బ్యాంకు అధికారుల ఉదాసీన వైఖరి తేటాతెల్లమవుతోంది. పోలీస్ స్టేషన్‌కు కూతవేటు దూరంలో ఉన్న ఈ బ్యాంకులో దోపిడీకి ప్రయత్నించడం గత రెండేళ్లలో ఇది మూడోసారి. పెద్దేముల్ పోలీసుస్టేషన్‌కు అతిదగ్గరలోనే విజయబ్యాంకు ఉంది. ఇద్దరు దొంగలు రాత్రి తాపీగా బ్యాంకుకు కన్నం వేసి దోపిడీకి యత్నిస్తున్న విషయాన్ని పోలీసులు పసిగట్టలేకపోవడం గమనార్హం. మండల కేంద్రంలో.. అందునా పీఎస్‌కు అతి సమీపంలోనే గస్తీ ఇలా ఉంటే ఇక గ్రామాల రక్షణ పరిస్థితి ఏంటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. మండల కేంద్రానికి చెందిన మోసీన్, మునీర్లు అనే యువకులు బ్యాంకు నుంచి శబ్దం వస్తుండటాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించారు. ఒకవేళ వారి ద్దరూ ఆ సమయంలో అటువైపుగా వెళ్లకుంటే కచ్చితంగా బ్యాంకులో దోపీడీ జరిగేదని స్థాని కులు చెబుతున్నారు. రాత్రిపూట పోలీసులు గస్తీ నిర్వహిస్తున్నా.. అది నామామాత్రంగా మారడంతోనే ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. గతంలో తాండూరు-జహీరాబాద్ మా ర్గంలో దారిదోపిడీ జరిగింది. ఏకంగా రోడ్డుకు అడ్డుగా చెట్టు పెట్టి దుండగులు పెళ్లి బృందాన్ని దోచుకున్నారు. గత ఏడాది ద్విచక్రవాహనంపై వెళుతున్న దంపతులపై అడ్డగించి దోపిడీకి పాల్పడ్డారు. గతంలో విజయాబ్యాంకులో జరిగిన రెండు చోరీ యత్నాల కేసుల్లోనూ పోలీసులు ఎలాంటి పురోగతి సాధించలేదు. బ్యాంకు అధికారుల నిర్లక్ష్య వైఖరి.. ఇక విజయబ్యాంకు అధికారులు బ్యాంకు భద్రతపై ఊదాసీనంగా వ్యవహరిస్తున్నట్టు స్పష్టమవుతోంది. ఇప్పటికే రెండుసార్లు ఈ బ్యాంకులో దోపిడీ యత్నాలు జరిగినా కనీసం సెక్యురిటీ గార్డును కూడా ఏర్పాటుచేయకపోవడం బ్యాంకు అధికారుల పనితీరుకు అద్దం పడుతున్నది. రోజు లక్షల్లో లావాదేవీలు కొనసాగించే ఈ బ్యాంకు వద్ద భద్రత చర్యలు శూన్యమనే చెప్పాలి. రెండేళ్ల క్రితం కిటికీల ఇనుప చువ్వలు తొలగించి బ్యాంకులో దోపిడీకి ప్రయత్నించారు. అలాగే మూడు నెలల క్రితమే బ్యాంకుకు కన్నం వేసి దోపిడీ యత్నం జరిగింది. బ్యాంకులోని ఏటీఎంను దొంగలు ధ్వంసం చేశారు. కానీ డబ్బులు పోలేదు. బ్యాంకు తీసే వరకు పోలీసులకు, బ్యాంకు అధికారులు ఈ దోపిడీ యత్నం జరిగిన విషయం తెలియరాలేదు. బ్యాంకులో ఉన్న ఒకే ఒక్క సీసీ కెమెరా కూడా 24 గంటలపాటు పనిచేయదు. కేవలం బ్యాంకు పని వేళల్లోనే అది పని చేస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. గతంలోనే రెండు సార్లు దోపిడీ యత్నాలు జరిగినా ఎందుకు తగిన సెక్యూరిటీని ఏర్పాటు చేయలేదని మంగళవారం బ్యాంకును పరిశీలించిన జిల్లా ఎస్పీ రాజకుమారి బ్యాంకు సిబ్బందిని ప్రశ్నించడం గమనార్హం. ఇకమీదనైనా పటిష్ట భద్రత ఏర్పాట్లు చేయాలని బ్యాంకు అధికారులకు ఎస్పీ సూచించారు. ఇకపై మరింత పకడ్బందీగా గస్తీ.. పెద్దేముల్: రాత్రి గస్తీని మరింత పకడ్బందీగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ రాజకుమారి పేర్కొన్నారు. మంగళవారం తెల్లవారుజామున ఎస్పీ దోపిడీ యత్నం జరిగిన విజయ బ్యాంకును సందర్శించారు. ఎస్పీ మాట్లాడుతూ కర్ణాటక సరిహద్దులో పెద్దేముల్ మండలం ఉన్నందున గస్తీని ముమ్మరం చేయనున్నట్లు చెప్పారు. అనుమానిత వ్యక్తుల సమాచారం ఇచ్చి ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు. స్థానిక యువకుల సమాచారంతోనే బ్యాంకు దోపిడీ యత్నానికి పాల్పడిన దొంగలను పట్టుకున్నామన్నారు. పటిష్ట రక్షణ చర్యలు తీసుకుంటాం పెద్దేముల్‌లోని విజయబ్యాంక్లో వెంటనే సీసీ కెమెరాలు, నైట్ వాచ్‌మన్‌ను ఏర్పాటు చేస్తామని విజయబ్యాంక్ డీజీఎం వినోద్‌కుమార్‌రెడ్డి అన్నారు. బ్యాంకులో డోపిడీ యత్నం జరిగిన విషయాన్ని తెలుసుకున్న డీజీఎం విజయబ్యాంక్‌ను సందర్శించారు. దోపిడియత్నం గురించి స్థానిక బ్యాంక్ మేనేజర్‌తో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. బ్యాంక్‌లో అన్ని సౌకర్యాలు ఉన్నాయని లబ్ధిదారులు భయపడాల్సిన అవసరం లేదన్నారు.