
బ్యాంకు దోపిడీకి విఫలయత్నం
అదే సమయంలో గండిపేటలోని గోల్కొండ రిసార్ట్స్‌లో విధులు ముగించుకుని బైక్‌పై ఇంటికి వస్తున్న శ్రీనాథ్‌రెడ్డి, శ్రీనివాస్ బ్యాంకు తాళాలు పగులగొడుతున్న ఇద్దరిని గమనించి కేకలు వేశారు. దీంతో దుండగులు పారిపోతుండగా యువకులు బైక్‌పై వెం బడించారు. ఈ క్రమంలో దుండగులు కొంతదూరం పరుగెత్తి గాల్లోకి రెండు రౌండ్లు కాల్పులు జరిపారు. దీంతో భయపడిన యువకులు వెనక్కి తగ్గారు. బ్యాంకుకు కొంత దూరంలో ఉన్న మరో దుండగుడు సైతం గ్రామంలోకి పరుగు తీశాడు. దుండగులు గ్రామం పక్కనే ఉన్న ఓ వెంచర్ ప్రహరీ గోడ దూకి పారిపోయారు. యువకులు 100 కు డయల్ చేసి సమాచారం ఇవ్వడంతో మొబైల్ పార్టీ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిసరాలను పరిశీలించారు. కాల్పులు జరిపిన ప్రాంతంలో లభ్యమైన బుల్లెట్ షెల్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దుండగులను పట్టుకోవడానికి సాహసం చేసి వెంబడించిన యువకులను డీసీపీ కార్తికేయ అభినందించారు.