
న్యూఢిల్లీ: ఓ దొంగల ముఠా ఢిల్లీలోని షాహదారాలో ఓ బ్యాంకులో రూ.55 లక్షలు దోచుకెళ్లినట్లు పోలీసులు సోమవారం వెల్లడించారు. నిర్మాణంలో ఉన్న భవనంలోని ఓ గోడను పగలగొట్టి దొంగలు బ్యాంకులోకి ప్రవేశించినట్లు తెలిపారు. దొంగలు డ్రిల్‌తో సహా అవసరమైన అన్ని పరికరాలతో వచ్చినట్లు పేర్కొన్నారు. నగదు లాకర్లను పగులగొట్టి డబ్బులు దొంగిలించడానికి ఏడు నుంచి ఎనిమిది గంటల సమయం పడుతుందని అన్నారు.
కాగా, డబ్బును ఖజానాలోని ఓ గదిలో ఉంచినట్లు సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. ఇక ఇతర భాగాలలో ఉంచిన అన్ని లాకర్లలోని నగదు, ఆభరణాలు సురక్షితంగా ఉన్నట్లు పేర్కొన్నారు. కాగా ఈ ఘటనపై ఫార్ష్ బజార్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.
చదవండి: Guinness World Record: బతికే ఛాన్స్ జీరో.. బర్త్ డే వేడుకలు..
Comments
Please login to add a commentAdd a comment