* దోపిడీకి గ్యాస్‌కట్టర్ల వినియోగం
* మొన్న హాలియాలో.. తాజాగా చౌటుప్పల్‌లో..
మొన్న హాలియాలో బ్యాంకు దోపిడీకి.. తాజాగా చౌటుప్పల్‌లోని
ఏటీఎంలో చోరీకి యత్నం సంఘటనల నేపథ్యంలో జిల్లాలో తమిళ
నాడుకు చెందిన దొంగల ముఠా సంచరిస్తున్నట్లు పోలీసులు అనుమానం
వ్యక్తం చేస్తున్నారు. హాలియాలో బ్యాంకు దోపిడీకి దొంగలు గ్యాస్ కట్టర్
ఉపయోగించడం, చౌటుప్పల్‌లోని ఇండియన్ బ్యాంకు ఏటీఎంలో కూడా
ఇదే తరహాలో చోరీకి యత్నించడం చూస్తుంటే ఇది పక్కా ప్రొఫెషనల్స్
పనేనని భావిస్తున్నారు. దీంతో ఎస్పీ ప్రభాకర్‌రావు రంగంలోకి దిగి జిల్లా
పోలీసు యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు.
చౌటుప్పల్
మొన్న హాలియాలో బ్యాంకు దోపిడీకి.. నిన్న చౌటుప్పల్‌లో ఏటీఎంలో చోరీకి యత్నం సంఘటనల నేపథ్యంలో ఎస్పీ టి.ప్రభాకర్‌రావు అప్రమత్తమయ్యారు. హాలియాలో బ్యాంకు దోపిడీకి దొంగలు గ్యాస్ కట్టర్ ఉపయోగించడం, చౌటుప్పల్‌లో ఇండియన్ బ్యాంకు ఏటీఎం చోరీలో కూడా గ్యాస్ కట్టర్‌నే వాడడంతో, అక్కడ, ఇక్కడ చోరీలకు పాల్పడుతున్నది ఒకే ముఠాకు చెందిన ప్రొఫెషనల్స్ అని పోలీసులు భావిస్తున్నారు.
పోలీసులతో సమీక్ష
భువనగిరి సబ్‌డివిజన్‌లోని సీఐలతో ఆదివారం ఎస్పీ చౌటుప్పల్‌లో సమావేశమయ్యారు. దొంగతనాల నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సమీక్షించా రు. దొంగతనాలన్నీ అర్ధరాత్రి ఒంటి గం ట నుంచి తెల్లవారుజామున 4గంటల మధ్య జరుగుతాయని, ఈ సమయంలో పోలీసులతో తప్పనిసరిగా బీట్లు నిర్వహించాలని సూచించారు. ప్రతి బ్యాం కు, ఏటీఎంల వద్ద నోట్‌పుస్తకాలను ఏర్పాటు చేయించి, బీట్‌కు వెళ్లిన కానిస్టేబుల్ తప్పనిసరిగా సంతకం చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. అర్ధరాత్రి ఎవరైనా కనిపిస్తే అనుమానితులుగా అదుపులోకి తీసుకోవాలని సూచించా రు. తమిళనాడుకు చెందిన ప్రొఫెషనల్స్ రాష్ట్రంలోకి ప్రవేశించి, బ్యాంకులు, ఏటీఎంలలో చోరీలకు పాల్పడుతున్నట్టు భా విస్తున్నారు. ఆయన వెంట భువనగిరి డీఎస్పీ శ్రీనివాస్, సీఐలు గట్టుమల్లు, బాలగంగిరెడ్డి, శివరాంరెడ్డి, సతీష్‌రెడ్డి, నరేందర్, శంకర్‌లున్నారు.
అసలు మన ఏటీఎంలకు భద్రత ఎంత..?
బ్యాంకులు 24 గంటలు ప్రజలకు డబ్బును అందుబాటులో ఉంచేందుకు ఎక్కడపడితే అక్కడ ఏటీఎంలను ఏర్పాటు చేస్తున్నాయి. భవిష్యతులో గ్రామీణ పల్లెలకు కూడా ఏటీఎంలు రానున్నాయి. ఏటీఎంల ఏర్పాటుకు ప్రాధాన్యమిస్తున్న బ్యాంకులు, భద్రతను ఏమాత్రం పట్టించుకోవడం లేదు. అవుట్‌సోర్సింగ్ ద్వారా ఎక్కువ సంఖ్యలో ఏటీఎంలను ఏర్పాటు చేస్తున్నారు. అవుట్‌సోర్సింగ్ సిబ్బంది ఏటీఎంలను ఏమాత్రం పర్యవేక్షించడం లేదు. ఏటీఎంలలో డబ్బులు అయిపోతే, పనిచేయనప్పుడు మాత్రమే మెసేజ్ అలర్ట్‌తో వచ్చి,పోతున్నారు. అవుట్‌సోర్సింగ్ ఏటీఎంలంటూ స్థానికంగా ఉండే బ్యాంకులు తమకేం సంబంధం లేదంటున్నారు. ఎక్కడా సెక్యూరిటీగార్డులను కూడా నియమించడం లేదు. అలారంపనిచేయడం లేదు. సీసీ కెమెరాలది అదే తీరు. ఒకవేళ పనిచేసినా, మనుషులను గుర్తించే పరిస్థితి లేదు.
3:30గంటల పాటు విఫలయత్నం..
చౌటుప్పల్‌లోని ఇండియన్ బ్యాంకు ఏటీఎంలో ఆదివారం తెల్లవారుజామున చోరీకి 3:30గంటల పాటు విఫలయత్నం జరిగింది. పోలీసులు సీసీ కెమెరాలోని ఫుటేజీని విశ్లేషిస్తున్నారు. మాస్క్, జర్కిన్ ధరించిన దొంగ శనివారం అర్ధరాత్రి దాటాక 12గంటల సమయంలో ఏటీఎం షెట్టర్ మూసివేశాడు. 2గంటల సమయంలో గ్యాస్ కట్టర్‌తో ఏటీఎం మిషన్ కింది భాగం తొలగించాడు. అక్కడ నంబరులాక్ ఉండడంతో తెలియక, తెల్లవారుజామున 5:30గంటల పాటు విఫలయత్నం చేసి వెనుదిరిగాడు.
ఉదయం స్థానికులు చోరీ జరిగిన విషయాన్ని గుర్తించి, పోలీసులకు సమాచారమివ్వడంతో సీఐ గట్టుమల్లు ఏటీఎంను పరిశీలించారు. టీసీఎస్ ఇన్‌చార్జి దెయ్యాల పరమేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చౌటుప్పల్‌లోనే సరిగ్గా నెల రోజుల క్రితం ఎస్‌బీఐ ఏటీఎంలో చోరీకి యత్నించి విఫలమయ్యారు. ఏడాది క్రితం ఎస్‌బీహెచ్ ఏటీఎంలో కూడా చోరీకి యత్నించారు.
బీ అలర్ట్
Published Mon, Sep 15 2014 1:53 AM | Last Updated on Sat, Sep 2 2017 1:22 PM
Advertisement
Advertisement