Indian Bank
-
‘గంటా’ ఆస్తుల వేలం!
సాక్షి, విశాఖపట్నం: మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఆయన బంధువులు రూ.వందల కోట్ల మేర రుణాలను ఎగ్గొట్టిన కేసులో వారికి అప్పులిచ్చిన ఇండియన్ బ్యాంకు ఆస్తుల వేలానికి ఉపక్రమించింది. రుణాలను వడ్డీతో సహా వసూలు చేసుకునేందుకు వరుసగా డిమాండ్ నోటీసులు జారీచేసినా గంటా బ్యాచ్ పట్టించుకోకపోవడంతో తనఖా పెట్టిన వాటిలో పలు ఆస్తులను ఇప్పటికే స్వాధీనం చేసుకున్న బ్యాంకు వాటి వేలానికి రంగం సిద్ధంచేసి అందుకు సంబంధించిన తేదీని తాజాగా ప్రకటించింది. గంటా రుణాల ఎగవేత కేసులకు సంబంధించిన వివరాలు ఏమిటంటే..విశాఖపట్నం వన్‌టౌన్‌లోని లక్ష్మీటాకీస్ వద్ద ప్రత్యూష రిసోర్సెస్ అండ్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో మాన్యుఫ్యాక్చరింగ్, మిషనరీ అండ్ ఎక్విప్మెంట్ కార్యకలాపాల కోసం రిజిస్ట్రేషన్ నం.047165తో 2005 ఆగస్టు 18న రిజిస్ట్రర్ అయ్యింది. రూ.500 కోట్ల ఆథరైజ్డ్ క్యాపిటల్, రూ.240.671 కోట్ల పెయిడ్ అప్ కాపిటల్‌తో ఈ సంస్థ ఏర్పడింది. కంపెనీలో యాక్టివ్ డైరెక్టర్లుగా గంటా తోడల్లుడైన పరుచూరి వెంకట భాస్కరరావు, ఆయన సోదరులు రాజారావు, వెంకయ్య, ప్రభాకరరావు ఉన్నారు. ఈ కంపెనీకి భీమిలి టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుతో పాటు కొండయ్య, బాలసుబ్రహ్మణ్యం, నార్నే అమూల్యలు హామీదారులుగా ఉన్నారు. కంపెనీ విస్తరణ పేరుతో డాబా గార్డెన్స్ శారదా వీధిలో ఉన్న ఇండియన్ బ్యాంకు నుంచి రుణాలు పొందారు. ఇవి పొందినప్పటి నుంచి ఒక్క వాయిదా కూడా చెల్లించలేదు. దీంతో ఈ ఏడాది ఫిబ్రవరి 29 నాటికి ఒక దఫా తీసుకున్న రుణం తాలుకా బకాయిలు అక్షరాలా రూ.390.58 కోట్లుగా బ్యాంకు అధికారులు లెక్కగట్టారు. మరో దఫా రుణానికి సంబంధించి వడ్డీతో కలిసి రూ.141.68 కోట్లు బకాయిలుగా పేరుకుపోయాయని ఇండియన్ బ్యాంకు జారీచేసిన నోటీసుల్లో పేర్కొంది. నోటీసులిచ్చినా బేఖాతరు.. ఆస్తుల స్వాధీనం..ఈ నేపథ్యంలో.. 2016 అక్టోబరు 4 నుంచి పలు దఫాలుగా బ్యాంకు అధికారులు నోటీసులు జారీచేసి వడ్డీతో సహా కలిపి బకాయిలు చెల్లించాలని కోరారు. అయినాసరే ఒక్క రూపాయి కూడా చెల్లించకపోవడం.. మరోపక్క గడువు ముగియడంతో బ్యాంకు ఆస్తులు స్వాధీనం చేసుకోవడం మొదలుపెట్టింది. అయినప్పటికీ గంటా ముందుకు రాకపోవడం.. బకాయిలు చెల్లించకపోవడంతో మరోసారి ఏడు స్లాట్స్‌లో పూచీకత్తుగా పెట్టిన మరికొన్ని స్థలాల్ని స్వాధీనం చేసుకుంటున్నట్లు ఈ ఏడాది మార్చి 18న బ్యాంకు నోటీసులు జారీచేసింది. ప్రత్యూష కంపెనీకి చెందిన ఆస్తులు, కంపెనీ డైరెక్టర్లయిన పరుచూరి వెంకట భాస్కరరావు, రాజారావు, వెంకయ్య ప్రభాకరరావుల ఆస్తులతో పాటుగా కంపెనీకి హామీదారులుగా ఉన్న మంత్రి గంటా శ్రీనివాసరావు, కేబీ సుబ్రహ్మణ్యం, అమూల్య ఆస్తులను కూడా స్వాధీనం చేసుకోవడంతో పాటు మరికొన్ని ఆస్తుల వేలం వేస్తున్నట్లు బ్యాంకు ప్రకటన జారీచేసింది. కాగా, గతంలోనే బ్యాంకు కొన్ని ఆస్తులను వేలం వేయగా.. ఇప్పుడు రూ.390 కోట్ల రికవరీకి బ్యాంకు మరిన్ని ఆస్తుల వేలం ప్రకటన జారీచేసింది.ఆగస్టు 8న ఈ–వేలం..ఈ ప్రకటనలో.. పద్మనాభం మండలం ఐనద గ్రామం వద్ద ఉన్న సర్వేనెం.12లో వీరికి స్టార్ విలేజ్ పేరున వుడా లేఅవుట్లోని 5,326.54 చ.గజాల విస్తీర్ణంలో ఏడు స్లాట్స్‌లో ఉన్న 33 ప్లాట్లను స్వాధీనం చేసుకుంటున్నట్లు నోటీసుల్లో స్పష్టంచేసింది. వీటి విషయంలో ఎలాంటి లావాదేవీలు జరపడానికి వీల్లేదని, బ్యాంకు హెచ్చరిక జారీచేసింది. అదేవిధంగా రూ.390.58 కోట్ల బకాయిలు రాబట్టుకునేందుకు గతంలో స్వాధీనం చేసుకున్న స్థిరాస్తుల విక్రయానికి కూడా మార్చి 18న బ్యాంకు మరోసారి నోటీసులు జారీచేసింది. దీనికి సంబంధించిన వేలం ప్రక్రియ కూడా నిర్వహిస్తున్నట్లు పత్రికల్లో శనివారం ఇండియన్ బ్యాంకు ప్రకటనలిచ్చింది. మెస్సర్స్ ప్రత్యూష అసోసియేట్స్ పేరుతో నగరంలోని గంగులవారి వీధిలో ఉన్న 274.65 చ.గజాల వాణిజ్య భవనం వేలం వేస్తున్నట్లు ప్రకటించింది. దీనికి రిజర్వ్ ధరగా రూ.2.56 కోట్లుగా నిర్ణయించింది. దీంతో పాటు ద్వారకానగర్‌లోని అదే సంస్థ పేరుతో శ్రీశాంత కాంప్లెక్స్‌లో ఉన్న ప్లాట్ నం.138సీ లోని 2,500 చ.గజాల విస్తీర్ణంగల రెండు ప్లాట్లను వేలం వేస్తున్నట్లు ప్రకటించారు. వీటికి రిజర్వ్ ధరగా 1.26 కోట్లుగా నిర్ణయించారు. ఎక్కడ ఎలా ఉన్నది అక్కడ అలా.. ప్రాతిపదికన వేలంలో విక్రయిస్తామని బ్యాంకు వెల్లడించింది. ఆగస్టు 8వ తేదీన గంటా అండ్ కో ఆస్తుల ఈ–వేలం పాట జరుగుతుందని ఇండియన్ బ్యాంకు పేర్కొంది.సంస్థకు డైరెక్టర్‌గా గంటా..నిజానికి.. పోర్టులో వ్యాపార లావాదేవీల కోసం ఎమ్మెల్యే గంటా స్వయంగా తన బంధువులతో కలిసి ఈ కంపెనీ ప్రారంభించారని.. మొదట్లో గంటా కూడా డైరెక్టర్‌గా కొంతకాలం కొనసాగారని తెలుస్తోంది. ఈ కంపెనీకే జిల్లా గ్రంథాలయ సంస్థ నిర్మాణ బాధ్యతలను అప్పగించగా.. వ్యతిరేకత వ్యక్తంకావడంతో అప్పటి టీడీపీ ప్రభుత్వం వెనక్కి తగ్గింది. ఈ నేపథ్యంలో.. గంటా శ్రీనివాసరావుతో పాటు ఆయన బంధువుల ఆస్తుల్ని వేలం వేస్తున్నట్లు బ్యాంకు ప్రకటించడం చర్చనీయాంశమవుతోంది. -
ఇండియన్ బ్యాంక్ లాభం అప్
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ దిగ్గజం ఇండియన్ బ్యాంక్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2023–24) రెండో త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. జులై–సెపె్టంబర్(క్యూ2)లో నికర లాభం 62 శాతం జంప్‌చేసి రూ. 1,988 కోట్లను తాకింది. గతేడాది(2022–23) ఇదే కాలంలో రూ. 1,225 కోట్లు మాత్రమే ఆర్జించింది. వడ్డీ ఆదాయం సైతం రూ. 10,710 కోట్ల నుంచి రూ. 13,743 కోట్లకు ఎగసింది. స్థూల మొండిబకాయిలు(ఎన్పీఏలు) 7.3 శాతం నుంచి రూ. 4.97 శాతానికి దిగివచ్చాయి. ఫలితాల నేపథ్యంలో ఇండియన్ బ్యాంక్ షేరు బీఎస్ఈలో 2 శాతం బలహీనపడి రూ. 400 వద్ద ముగిసింది. -
దొంగలు బాబోయ్ దొంగలు..
-
ఎస్‌హెచ్‌జీలకు ఇండియన్ బ్యాంక్ రుణాలు
హైదరాబాద్: స్వయం సహాయక సంఘాలకు మరింత చేరువయ్యేందుకు ఇండియన్ బ్యాంక్ బుధవారం ‘మెగా ఎస్‌హెచ్‌జీ అవుట్రీస్ క్యాంప్’ నిర్వహించింది. ఇందులో భాగంగా ఆంధ్రపదేశ్‌కు రూ.870 కోట్లు, తెలంగాణాకు రూ.140 కోట్ల ఎస్‌హెచ్‌జీ రుణాలు పంపిణీ చేసింది. అలాగే చిన్న, మధ్య తరహా పారిశ్రామికవేత్తలను ప్రోత్సాహించేందుకు అదనంగా రూ.47.28 కోట్ల రుణాలు కేటాయించింది. స్వయం సేవా సంఘాల ఆర్థిక సామర్థ్యాలు మెరుగుపరిచేందుకు ఇండియన్ బ్యాంక్ గణనీయమైన కృషి చేస్తుందని బ్యాంకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఇమ్రాన్ అమిన్ సిద్ధిఖీ తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణా సెర్ప్ డైరెక్టర్ వై నరసింహా రెడ్డితో పాటు ఇతర అధికార ప్రతినిధులు పాల్గొన్నారు. -
...
నిబంధనలు పాటించని బ్యాంకులపై కొరడా ఝళిపిస్తున్న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఏకంగా మూడు ప్రభుత్వం రంగ బ్యాంకులకు భారీ పెనాల్టీ విధించింది. ఈ మేరకు సోమవారం (సెప్టెంబర్ 25) ఆర్బీఐ ఒక ప్రకటన విడుదల చేసింది. ఇందులో దేశీయ అతిపెద్ద పీఎస్బీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ఇండియన్ బ్యాంక్, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంకు ఉన్నాయి. నిబంధనలు పాటించడంలో విఫలమైనట్లు గుర్తించిన క్రమంలో వీటిపై భారీ జరిమానా విధిస్తూ ఆర్బీఐ నిర్ణయం తీసుకుంది. ఎస్బీఐ సహా మూడు బ్యాంకులకు షాక్ రుణాలు, అడ్వాన్సులు- చట్టబద్ధ ఇతర పరిమితులు, ఇంట్రా గ్రూప్ ట్రాన్సాక్షన్లు, రుణాలకు సంబంధించిన మార్గదర్శకాలు పాటించ లేదంటూ ఎస్బీఐకి రూ. 1.30 కోట్లు ద్రవ్య జరిమానా విధించింది. ఆర్బీఐ తెలిపింది. రుణాలు- అడ్వాన్సులతో పాటు కేవైసీ, 2016లో ఆర్బీఐ డిపాజిట్ల వడ్డీ రేట్లకు సంబంధించి జారీ చేసిన మార్గదర్శకాలను పాటించడంలో విఫలమైందని గుర్తించింది. దీంతో ఇండియన్ బ్యాంకుకు రూ. 1.62 కోట్ల ద్రవ్య పెనాల్టీ వేసింది.. డిపాజిటర్ ఎడ్యుకేషన్, అవేర్నెస్ ఫండ్ స్కీమ్ విషయంలో నిబంధనలు పాటించలేదన్న కారణంగా పంజాబ్ అండ్ సింధ్ బ్యాంకుకు రూ. 1 కోటి జరిమానా చెల్లించాల్సిదిగా ఆదేశించినట్టు ఆర్బీఐ తెలిపింది. దీంతోపాటు ఎన్‌బిఎఫ్‌సిలలో అక్రమాలను గుర్తించి ఆర్బీఐ ఫెడ్‌బ్యాంక్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్‌పై రూ. 8.80 లక్షల పెనాల్టీని కూడా విధించింది. రెగ్యులేటరీ నిబంధనలను పాటించనందున బ్యాంకులు మరియు ఎన్‌బిఎఫ్‌సిలపై ఈ పెనాల్టీ విధించినట్లు తెలిపింది. -
బ్యాంకులకు షాకిచ్చిన ఆర్బీఐ.. భారీగా జరిమానా
వివిధ నియంత్రణ నిబంధనలను ఉల్లంఘించినందుకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI), ఇండియన్ బ్యాంక్, పంజాబ్ & సింధ్ బ్యాంక్‌తో సహా ఓ ఎన్బీఎఫ్సీ సంస్థపై చర్యలు తీసుకున్నట్లు భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) తెలిపింది . ఏ బ్యాంకుకు ఎంత జరిమానా? 'రుణాలు, అడ్వాన్సులు: చట్టబద్ధమైన, ఇతర పరిమితులు' అలాగే 'ఇంట్రా-గ్రూప్ లావాదేవీలు, ఎక్స్పోజర్ల నిర్వహణపై మార్గదర్శకాలు' గురించి ఆర్బీఐ జారీ చేసిన నిర్దిష్ట ఆదేశాలను పాటించడంలో విఫలమైనందుకు ఎస్బీఐకి రూ. 1.3 కోట్ల జరిమానా విధించినట్లు ఆర్బీఐ ఒక ప్రకటనలో పేర్కొంది. 'రుణాలు, అడ్వాన్స్‌లు: చట్టబద్ధమైన, ఇతర పరిమితులు', కేవైసీ మార్గదర్శకాలు, 'ఆర్బీఐ (డిపాజిట్లపై వడ్డీ) మార్గదర్శకాలు-2016'ను ఉల్లంఘించినందుకు ఇండియన్ బ్యాంక్‌కి రూ. 1.62 కోట్ల జరిమానా విధించింది. ఇక డిపాజిటర్ ఎడ్యుకేషన్, అవేర్నెస్ ఫండ్ స్కీమ్‌లోని నిర్దిష్ట నిబంధనలను పాటించనందుకు గానూ పంజాబ్ & సింధ్ బ్యాంక్‌కు రూ. 1 కోటి పెనాల్టీని విధించింది. నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలలో మానిటరింగ్ మోసానికి సంబంధించిన ఆదేశాలలో పేర్కొన్న కొన్ని నిబంధనలను పాటించడంలో విఫలమైనందుకు గానూ ఫెడ్‌బ్యాంక్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్‌కు రూ. 8.80 లక్షల జరిమానాను విధించినట్లు ఆర్బీఐ తన ప్రకటనలో పేర్కొంది. -
ఈ బ్యాంక్ కస్టమర్లకు గుడ్ న్యూస్! ఇంటి వద్దకే ప్రభుత్వ బ్యాంక్ సేవలు
ప్రముఖ పబ్లిక్ సెక్టార్ ఇండియన్ బ్యాంక్ (Indian Bank) కస్టమర్ల కోసం సరికొత్త కార్యక్రమాన్ని ప్రారంభించింది. కస్టమర్లకు మెరుగైన సేవలు అందించేందుకు ‘ఐబీ సాథీ’ (IB SAATHI - సస్టైనబుల్ యాక్సెస్ అండ్ అలైనింగ్ టెక్నాలజీ ఫర్ హోలిస్టిక్ ఇన్‌క్లూజన్)ను రూపొందించింది. ‘ఐబీ సాథీ’ కస్టమర్లకు అవసరమైన ప్రాథమిక బ్యాంకింగ్ సేవలతో పాటు అదనపు సర్వీసులు అందించడాన్ని సులభతరం చేస్తుంది. ఇండియన్ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈవో ఎస్ఎల్ జైన్ చెన్నైలోని తమ కార్పొరేట్ కార్యాలయంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రాథమిక బ్యాంకింగ్ సేవలు అందించడమే లక్ష్యం ‘ఐబీ సాథీ’ కార్యక్రమం ద్వారా ఇండియన్ బ్యాంక్ తన అన్ని శాఖలలో రోజుకు కనీసం నాలుగు గంటల పాటు కస్టమర్లకు ప్రాథమిక బ్యాంకింగ్ సేవలను అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. దీంతోపాటు అదనంగా బ్యాంక్ కరస్పాండెంట్లు నేరుగా కస్టమర్ల ఇంటి వద్దకే వెళ్లి సేవలు అందిస్తారు. (కస్టమర్లకు షాకిచ్చిన ప్రముఖ ప్రైవేట్ బ్యాంక్! సెప్టెంబర్ 21 నుంచే..) ఇందు కోసం 2024 మార్చి నాటికి సుమారు 5,000 మంది బ్యాంకింగ్ కరస్పాండెంట్లను నియమించుకోవాలని ఇండియన్ బ్యాంక్ లక్ష్యంగా పెట్టుకుంది. దీని వల్ల కస్టమర్లకు మరింత చేరువ కావచ్చని భావిస్తోంది. 36 రకాల సేవలు ఇండియన్ బ్యాంక్‌కు ప్రస్తుతం 10,750 మంది బ్యాంకింగ్ కరస్పాండెంట్లు, 10 మంది కార్పొరేట్ బిజినెస్ కరస్పాండెంట్లు ఉన్నారు. విస్తరణ ప్రణాళికల్లో భాగంగా బ్యాంకింగ్ కరస్పాండెంట్ల సంఖ్యను 15,000లకు, కార్పొరేట్ బిజినెస్ కరస్పాండెంట్ల సంఖ్య 15కు పెరుగుతుందని అంచనా. ప్రస్తుతం ఇండియన్ బ్యాంక్ తన బ్యాంకింగ్ కరస్పాండెంట్ ఛానెల్ ద్వారా కస్టమర్లకు 36 రకాల సేవలు అందిస్తోంది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో 60కి పైగా సేవలు పెరగనున్నాయి. -
ఇండియన్ బ్యాంక్ లాభం డబుల్
కోల్‌కతా: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) మూడో త్రైమాసికంలో పీఎస్‌యూ సంస్థ ఇండియన్ బ్యాంక్ ఆకర్షణీయ ఫలితాలు సాధించింది. అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో రూ. 1,396 కోట్ల నికర లాభం ఆర్జించింది. గతేడాది (2021– 22) ఇదే కాలంలో సాధించిన రూ. 690 కోట్లతో పోలిస్తే ఇది 102 శాతం వృద్ధి. మొండి రుణాలు తగ్గడం, వడ్డీ ఆదాయం పుంజుకోవడం ఇందుకు సహకరించాయి. నికర వడ్డీ ఆదాయం(ఎన్ఐఐ) 25 శాతం జంప్‌చేసి రూ. 5,499 కోట్లను తాకింది. మొత్తం ఆదాయం రూ. 11,482 కోట్ల నుంచి రూ. 13,551 కోట్లకు బలపడింది. నికర వడ్డీ మార్జిన్లు 3.03 శాతం నుంచి 3.74 శాతానికి మెరుగ య్యాయి. స్థూల మొండిబకాయిలు(ఎన్పీఏలు) 9.13 శాతం నుంచి 6.53 శాతానికి దిగివచ్చాయి. నికర ఎన్పీఏలు 2.72 శాతం నుంచి 1 శాతానికి తగ్గాయి. మొండి రుణాలకు కేటాయింపులు రూ. 2,439 కోట్ల నుంచి రూ. 1,474 కోట్లకు క్షీణించాయి. కనీస మూలధన నిష్పత్తి 15.74 శాతంగా నమోదైంది. ఫలితాల నేపథ్యంలో ఇండియన్ బ్యాంక్ షేరు ఎన్ఎస్ఈలో నామమాత్ర లాభంతో రూ. 291 వద్ద ముగిసింది. -
విక్రమార్కుడు.. రత్న ప్రభాకరన్..104 సార్లు ఫెయిల్..105వ సారి శభాష్ అనిపించుకున్నాడు
సాక్షి, చెన్నై: లక్ష్యసాధనలో తడబాటు ఎదురైనా పట్టుదలతో శ్రమిస్తే విజయం సాధించవచ్చని నిరూపించాడు పొన్నేరికి చెందిన ఓ యువకుడు. ఉన్నత ఉద్యోగం సాధించాలనే పట్టుదలతో 104 సార్లు పరీక్ష రాసి ఫెయిలైనా.. ఎట్టకేలకూ 105వ సారి ఇండియన్ బ్యాంకులో ఉద్యోగం సంపాదించి శభాష్ అనిపించుకున్నాడు. వివరాలు.. తిరువళ్లూరు జిల్లా పొన్నేరి సమీపంలోని చిన్నకావనం గ్రామానికి చెందిన రత్నప్రభాకరన్(27) మెకానికల్ ఇంజినీరింగ్‌ను 2016లో పూర్తి చేశాడు. పార్ట్‌టైమ్‌గా ఎంబీఏ కోర్సు చేస్తూ.. ఉద్యోగాల వేటను సాగించాడు. పోటీ పరీక్షలు రాయడం ప్రారంభించాడు. అయితే అప్పట్లో ఆశించిన ఫలితం దక్కలేదు. అయినా పట్టువదలకుండా తన లక్ష్య సాధన కోసం మరింత తీవ్రంగా కష్టపడ్డాడు. విఫలమైన ప్రతిసారీ తన లోపాలను గుర్తించి వాటిని సరి చేసుకోవడం ప్రారంభించాడు. ఫలితంగా 105వ సారి పరీక్షల్లో విజ యం సాధించి ఇండియన్ బ్యాంకులో ఉద్యోగం సాధించాడు. ప్రస్తుతం శిక్షణ ముగించుకుని కాంచీపురం జిల్లా మానామధిలోని ఇండియన్ బ్యాంకులో విధుల్లో చేరాడు. గత కొన్నేళ్లుగా ఎప్పుడూ పుస్తకాలు చేతబట్టి.. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే రత్నప్రభాకరన్ జాబ్ సంపాదించడంతో స్థానికులు కూడా సంతోషం వ్యక్తం చేశారు. సంక్రాంతి సందర్భంగా నిర్వహించిన వేడుకల్లో అతడిని ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా రత్నప్రభాకరన్ మాట్లాడుతూ గత ఆరు సంవత్సరాల్లో తాను 65 సార్లు బ్యాంకు ఉద్యోగాల కోసం, 39సార్లు ప్రభుత్వ ఉద్యోగాల కోసం పోటీ పరీక్షలు రాసి విఫలమైనట్లు పేర్కొన్నాడు. స్నేహితులు, బంధువుల నుంచి హేళన ఎదురైనా లక్ష్యం వైపే సాగి 105వ సారి విజయవంతం అయినట్లు వెల్లడించాడు. -
కస్టమర్లకు భారీ షాక్.. ఆ రెండు బ్యాంకులు కీలక నిర్ణయం!
కరోనా దెబ్బకు ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థలు డీలా పడిన సంగతి తెలిసిందే. భారత్‌లో చూస్తే ఇందన ధరలు, నిత్యవసరాల ధరలు పెరగడంతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీనికి తోడు ద్రవ్యోల్బణం కట్టడికై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపో రేటు సవరిస్తోంది. ఈ క్రమంలో పలు బ్యాంకులు వారి వడ్డీ రేట్లను పెంచుతూ నిర్ణయం తీసుకోవడం ప్రజలపై మరింత భారంగా మారుతోంది. తాజాగా ఈ జాబితాలోకి మరో రెండు బ్యాంకులు జత చేరాయి. ప్రైవేట్ రంగానికి చెందిన ఐసీఐసీఐ బ్యాంక్, ప్రభుత్వ రంగానికి చెందిన ఇండియన్ బ్యాంక్ రుణ రేట్లు పెంచి తమ కస్టమర్లకు షాకిచ్చాయి. బాదుడే బాదడు! బ్యాంకులు వరుసపెట్టి వారి రుణ రేట్లు పెంచుతున్నాయి. దేశంలో అతిపెద్ద బ్యాంక్ ఎస్బీఐ కూడా రుణ రేట్లు పెంచింది. తాజాగా ఇండియన్ బ్యాంకు తమ రుణ రేటును (MCLR) 35 బేసిస్ పాయింట్ల, ఐసీఐసీఐ బ్యాంక్ రుణ రేటును (MCLR) 20 పాయింట్ల వరకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. ఈ నిర్ణయంతో లోన్ ఈఎంఐలు పెరగడంతో పాటు రుణాలపై వడ్డీ రేట్లు కూడా పైకి ఎగబాకుతాయి. పెంచిన వడ్డీ రేటు ప్రకారం.. ఇండియన్ బ్యాంక్ ఎంసీఎల్ఆర్ 7.4 శాతానికి చేరగా, ఐసీఐసీఐ బ్యాంక్ ఎంసీఎల్ఆర్ రేటు 8.3 శాతానికి చేరింది. కాగా ఐసీఐసీఐ బ్యాంక్ పెంపు నిర్ణయం నవంబర్ 1 నుంచే అమలులోకి రాగా, ఇండియన్ బ్యాంక్ రుణ రేటు పెంపు నవంబర్ 3 నుంచి అమలులోకి రానుంది. చదవండి: యాపిల్ కంపెనీకే షాకిచ్చాడు.. ఏకంగా రూ.140 కోట్లు కొట్టేసిన ఉద్యోగి! -
ఇండియన్ బ్యాంక్ లాభం అప్
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ దిగ్గజం ఇండియన్ బ్యాంక్ ఈ ఆర్థిక సంవత్సరం(2022–23) తొలి త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు సాధించింది. ఏప్రిల్–జూన్(క్యూ1)లో నికర లాభం 3 శాతం పుంజుకుని రూ. 1,213 కోట్లను అధిగమించింది. గతేడాది (2021–22) ఇదే కాలంలో రూ. 1,182 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం రూ. 11,444 కోట్ల నుంచి రూ. 11,758 కోట్లకు బలపడింది. వడ్డీ ఆదాయం 5.5 శాతం పురోగమించి రూ. 10,154 కోట్లకు చేరింది. ఇతర ఆదాయం 12 శాతం క్షీణించి రూ. 1,605 కోట్లకు పరిమితమైంది. మొండి రుణాలకు ప్రొవిజన్లు రూ. 2,559 కోట్ల నుంచి రూ. 2,219 కోట్లకు తగ్గాయి. స్థూల మొండిబకాయిలు (ఎన్పీఏలు) 9.69 8 శాతం నుంచి 8.13 శాతానికి వెనకడుగు వేశాయి. నికర ఎన్పీఏలు సైతం 3.47 శాతం నుంచి 2.12 శాతానికి బలహీనపడ్డాయి. కనీ స మూలధన నిష్పత్తి 16.51 శాతంగా నమోదైంది. -
ఇండియన్ బ్యాంక్ ప్లస్... క్యూ3లో రూ. 690 కోట్లు
న్యూఢిల్లీ: పీఎస్‌యూ దిగ్గజం ఇండియన్ బ్యాంక్ ఈ ఆర్థిక సంవత్సరం(2021–22) మూడో త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో స్టాండెలోన్ నికర లాభం 34 శాతం ఎగసి రూ. 690 కోట్లకు చేరింది. గతేడాది(2020–21) ఇదే కాలంలో రూ. 514 కోట్లు మాత్రమే ఆర్జించింది. మొత్తం ఆదాయం మాత్రం నామమాత్ర వృద్ధితో రూ. 11,482 కోట్లయ్యింది. అయితే స్థూల మొండిబకాయిలు(ఎన్పీఏలు) 9.04 శాతం నుంచి 9.13 శాతానికి పెరిగాయి. నికర ఎన్పీఏలు సైతం 2.35 శాతం నుంచి 2.72 శాతానికి పెరిగాయి. నికర వడ్డీ ఆదాయం స్వల్పంగా 2 శాతం బలపడి రూ. 4,395 కోట్లను తాకింది. వడ్డీయేతర ఆదాయం 36 శాతం జంప్‌చేసి రూ. 1,556 కోట్లయ్యింది. ప్రొవిజన్లు అప్ తాజా సమీక్షా కాలంలో మొత్తం ప్రొవిజన్లు 11 శాతం అధికమై రూ. 2,598 కోట్లకు చేరినట్లు ఇండియన్ బ్యాంక్ తెలియజేసింది. కనీస మూలధన నిష్పత్తి(సీఏఆర్) 15.47 శాతంగా నమోదైంది. దేశీయంగా నికర వడ్డీ మార్జిన్లు 0.1 శాతం నీరసించి 3.03 శాతానికి చేరాయి. రూ. 2,732 కోట్లమేర తాజా స్లిప్పేజీలు నమోదయ్యాయి. రూ. 5,400 కోట్ల విలువైన 34 మొండి ఖాతాలను గుర్తించినట్లు బ్యాంక్ ఈ సందర్భంగా వెల్లడించింది. వీటిలో తొలి దశకింద జాతీయ ఆస్తుల పునర్నిర్మాణ కంపెనీ(ఎన్ఏఆర్సీఎల్)కు రూ. 1,200 కోట్ల విలువగల 5 ఖాతాలను బదిలీ చేయనున్నట్లు పేర్కొంది. ఫలితాల నేపథ్యంలో ఇండియన్ బ్యాంక్ షేరు బీఎస్ఈలో 6 శాతం పతనమై రూ. 159 వద్ద ముగిసింది. -
ఇండియన్ బ్యాంకులో రూ.266 కోట్ల మోసం!
న్యూఢిల్లీ: మొండిబాకీలుగా మారిన మూడు పద్దుల్లో మోసాలపై రిజర్వ్ బ్యాంక్‌కు ఫిర్యాదు చేసినట్లు ప్రభుత్వ రంగ ఇండియన్ బ్యాంక్ తెలిపింది. ఈ ఖాతాల ద్వారా రూ. 266 కోట్ల మేర మోసం జరిగినట్లు పేర్కొంది. ఆర్బీఐ నిబంధనలకు అనుగుణంగా వీటిని ఫ్రాడ్ ఖాతాలుగా ప్రకటించినట్లు బ్యాంక్ తెలిపింది. ఎంపీ బోర్డర్ చెక్‌పోస్ట్ డెవలప్మెంట్ (బాకీ రూ. 167 కోట్లు), పుణె షోలాపూర్ రోడ్ డెవలప్మెంట్ (రూ. 73 కోట్లు), సోనాక్ (రూ. 27 కోట్లు) వీటిలో ఉన్నాయి. ఈ మూడు కేసుల్లోనూ నిధుల మళ్లింపు రూపంలో మోసం జరిగినట్లు బ్యాంకు పేర్కొంది. -
ఇండియన్ బ్యాంక్ లాభం జూమ్
న్యూఢిల్లీ: పీఎస్‌యూ సంస్థ ఇండియన్ బ్యాంక్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2021–22) తొలి త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు సాధించింది. క్యూ1(ఏప్రిల్–జూన్)లో నికర లాభం 220 శాతం దూసుకెళ్లి రూ. 1,182 కోట్లను తాకింది. గతేడాది(2020–21) ఇదే కాలంలో రూ. 369 కోట్ల స్టాండెలోన్ లాభం ఆర్జించింది. 2020 ఏప్రిల్ 1నుంచి అలహాబాద్ బ్యాంక్‌ను విలీనం చేసుకుంది. వ్యయాల నియంత్రణ, వడ్డీ, వడ్డీయేతర ఆదాయంలో వృద్ధి వంటి అంశాలు లాభదాయకతకు దోహదం చేసినట్లు బ్యాంక్ ఎండీ, సీఈవో పద్మజ చుండూరు పేర్కొన్నారు. చౌకలో నిధుల సమీకరణకు విలీనం సహకరించినట్లు తెలియజేశారు. మార్జిన్లు అప్ నికర వడ్డీ ఆదాయం 3 శాతమే పుంజుకుని రూ. 3,994 కోట్లకు చేరింది. వడ్డీయేతర ఆదాయం మాత్రం 41 శాతం ఎగసి రూ. 1,877 కోట్లను తాకింది. దేశీయంగా నికర వడ్డీ మార్జిన్లు 0.51 శాతం బలపడి 2.85 శాతానికి చేరాయి. స్థూల మొండిబకాయిలు(ఎన్పీఏలు) 10.9 శాతం నుంచి 9.69%కి మెరుగుపడ్డాయి. నికర ఎన్పీఏలు సైతం 3.76% నుంచి 3.47%కి తగ్గాయి. తాజా స్లిప్పేజెస్ రూ. 4,204 కోట్లుగా నమోదయ్యాయి. నగదు రికవరీ రూ. 657 కోట్లకు చేరగా.. ప్రొవిజన్లు, కంటింజెన్సీలు రూ. 2,290 కోట్లను తాకాయి. ఫలితాల నేపథ్యంలో ఇండియన్ బ్యాంక్ షేరు 0.6% పుంజుకుని రూ. 139 వద్ద ముగిసింది. -
ఇక చిన్న సంస్థలకూ రేటింగ్స్
న్యూఢిల్లీ: లఘు, చిన్న, మధ్య తరహా సంస్థలకు (ఎంఎస్ఎంఈ) పనితీరుకు సంబంధించి ఫైనాన్షియల్ రేటింగ్స్ ఇచ్చే వ్యవస్థను ప్రభుత్వం ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. ప్రాథమిక స్థాయిలో ఉన్న చిన్న సంస్థల రుణ పరపతి విషయంలో బ్యాంకులు సరైన నిర్ణయాలు తీసుకునేందుకు ఇది ఉపయోగపడగలదని ఆయన పేర్కొన్నారు. దీని రూపకల్పనకు తగు సూచనలు ఇవ్వాల్సిందిగా బ్యాంకర్లను కోరారు. ఎంఎస్ఎంఈల కోసం ఇండియన్ బ్యాంక్ నిర్వహిస్తున్న కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా మంత్రి ఈ విషయాలు తెలిపారు. వార్షిక టర్నోవరు, వస్తు..సేవల పన్ను రికార్డులు, ఆదాయపు పన్ను రికార్డులు, ఎగుమతులు, లాభదాయకత తదితర అంశాల ఆధారంగా రేటింగ్స్ వ్యవస్థ ఉండగలదని ఆయన పేర్కొన్నారు. చిన్న వ్యాపారాలకు అవసరమైన ప్రభుత్వ సర్వీసులన్నీ ఒకే చోట లభ్యమయ్యేలా ఎంఎస్ఎంఈ శాఖ ఒక పోర్టల్‌ను అభివృద్ధి చేసే ప్రయత్నాల్లో ఉందని గడ్కరీ చెప్పారు. వివిధ రకాల ఇంధనాలతో నడవగలిగే ఫ్లెక్సిబుల్ ఫ్యూయల్ వాహనాలు త్వరలో రాబోతున్నాయని ఆయన తెలిపారు. ఇథనాల్ ఆధారిత ’ఫ్లెక్స్ ఇంజిన్ల’ తయారీకి సంబంధించి వచ్చే 3 నెలల్లో స్కీము ప్రకటించనున్నట్లు మంత్రి చెప్పారు. -
భర్త దోపిడీ వెనుక భార్య.. ఐదుకోట్లు స్వాహా
షాద్‌నగర్ టౌన్ : తప్పుడు పత్రాలతో రుణాలు కొట్టేస్తూ, రియల్టర్లతో అగ్రిమెంట్లు కుదుర్చుకుని డబ్బు ఎగ్గొట్టే నైజం ఆ భర్తది. ఆ మోసాలకు వంతపాడే పాత్ర అతని భార్యది. ఇలా వీరిద్దరూ కలిసి రూ.5 కోట్లకు ఇండియన్ బ్యాంకుకే ఎసరుపెట్టారు. చివరకు గుట్టురట్టయి పోలీసులకు చిక్కారు. ఈ ఉదంతం వివరాలను బుధవారం షాద్‌నగర్ ఏసీపీ సురేందర్ విలేకరులకు వివరించారు. రంగారెడ్డి జిల్లా ఫరూఖ్‌నగర్ మండలం బూర్గుల గ్రామానికి చెందిన పబంతి ప్రభాకర్, సరిత దంపతులు హైదరాబాద్‌లోని టోలిచౌకిలో ఉంటున్నారు. వీరిద్దరూ ప్రొప్రెయిటర్లుగా సాయి ప్రాపర్టీ డెవలపర్స్ సంస్థను ఏర్పాటుచేసి షాద్‌నగర్, నాగోల్, బండ్లగూడ, రాజేంద్రనగర్, నార్సింగ్, ఫతుల్లాగూడ ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. భూములను కొని వాటిని వెంచర్లుగా చేసి అమ్మేవారు. అయితే ఇవి గ్రామాలకు చివరన ఉండటంతో అమ్ముడుపోక.. అప్పుల ఊబిలో కూరుకుపోయారు. మోసానికి తెరలేచిందిలా.. షాద్‌నగర్ పరిధి సోలీపూర్ గ్రామ శివారులో ప్రభాకర్ దంపతులు కొన్నేళ్ల క్రితం 25 ఎకరాల భూమిని కొని వెంచర్ వేసి, ప్లాట్లలో ఇళ్ల నిర్మాణం చేపట్టారు. ఇందుకు అవసరమైన రుణం కోసం 2015లో షాద్‌నగర్‌లోని ఇండియన్ బ్యాంక్‌ను ఆశ్రయించారు. ఇళ్లు అమ్మినట్లు బ్యాంకు వారిని తప్పుదోవ పట్టించడంతో పాటు బోగస్ వ్యక్తుల్ని, వారి ఆధార్‌కార్డులను, జీతాల ధ్రువీకరణ పత్రాల నకళ్లు సృష్టించి.. విడతలవారీగా రూ.5 కోట్లకుపైగా రుణం పొందారు. ఫతుల్లాగూడలో దివాకర్‌సింగ్‌కు చెందిన 9 ఎకరాల భూమిని కొనేందుకు అగ్రిమెంట్ చేసుకున్న వీరు అతనికి డబ్బులు సరిగా చెల్లించలేదు. అపార్ట్మెంట్ నిర్మాణదారుడు కిరణ్‌కుమార్‌రెడ్డిని కూడా మోసం చేశారు. ఇలాగే మరికొన్ని మోసాలకు పాల్పడిన వీరిపై అబ్దుల్లాపూర్‌మెట్, కేపీహెచ్‌బీ, రాజేంద్రనగర్, మాదాపూర్, నార్సింగ్ ఠాణాల్లో కేసులు నమోదయ్యాయి. మరోపక్క ప్రభాకర్ దంపతులు ఎంతకీ రుణాన్ని తిరిగి చెల్లించకపోవడంతో అనుమానం వచ్చిన బ్యాంకు అధికారులు.. రుణపత్రాలను పరిశీలించారు. మోసం చేశారని గుర్తించి గత అక్టోబర్‌లో బ్యాంకు మేనేజర్ మహేందర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదుచేసిన పోలీసులు ప్రభాకర్ దంపతులను అరెస్టు చేసేందుకు ఈనెల 17 రాత్రి టోలీచౌకిలోని వారి విల్లాకు వెళ్లారు. ప్రభాకర్ బంధువులు, సన్నిహితులు పోలీసులను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. షాద్‌నగర్ పట్టణ సీఐ శ్రీధర్‌కుమార్, సిబ్బంది చాకచక్యంగా వారిని అరెస్టుచేసి రిమాండ్‌కు తరలించారు. అడ్డుకున్న వారిపై కూడా గోల్కొండ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. కాగా, ప్రభాకర్ దంపతులు చేసిన అప్పులను తీర్చేందుకు మరికొన్ని అప్పులు చేస్తూ చిట్టీల వ్యాపారం చేసే వారని, ఇలా వచ్చిన డబ్బుతో జల్సాలు చేసేవారని ఏసీపీ సురేందర్ తెలిపారు. విలాసవంతమైన విల్లా, కార్లు, బైకులు కొన్నారని, ప్రభాకర్ చెడు వ్యసనాలకు అలవాటుపడ్డాడని చెప్పారు. -
గంటా శ్రీనివాస్ రావుకు షాక్
-
మాజీ మంత్రి ఆస్తుల వేలానికి రంగం సిద్ధం
సాక్షి, విశాఖపట్నం: బ్యాంకు రుణం ఎగవేత వ్యవహారంలో మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఆస్తుల వేలానికి రంగం సిద్ధం అయ్యింది. ఈ మేరకు ఇండియన్ బ్యాంక్ అధికారులు మరోసారి ప్రకటన జారీ చేశారు. ఏప్రిల్ 16న ఇండియన్ బ్యాంక్ ఈవేలం పద్దతిలో ఆస్తులను వేలం వేయనుంది. వేలం వేయనున్న ఆస్తుల్లో బాలయ్య శాస్త్రి లేఅవుట్లోని గంటాకు చెందిన ప్లాట్ ఉంది. వేలంలో ఆస్తులు కొనుగోలు చేయడానికి ఈ నెల 11 నుంచి 15వ తేదీ వరకు ఆన్ లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తారు. కాగా, గంటాకు చెందిన ప్రత్యూష కంపెనీ, ఇండియన్ బ్యాంక్ నుంచి రూ.141.68 కోట్ల లోన్ తీసుకుంది. అసలు, వడ్డీ కలిపి రూ.220.66 కోట్లకు రుణం చేరింది. రుణం మొత్తం ఎగవేయడంతో ఇప్పటికే ఆస్తులు స్వాధీనం చేసుకుంది. గంటాతో పాటు ప్రత్యూష కంపెనీ డైరెక్టర్ల ఆస్తులను కూడా ఇండిన్ బ్యాంక్ వేలానికి సిద్ధం చేసింది./ -
ఆ ఏటీఎమ్‌లలో రూ.2 వేల నోటు కనిపించదు
చెన్నై: రూ.2 వేల నోటు విషయంలో ప్రభుత్వ రంగ ఇండియన్ బ్యాంకు కీలక నిర్ణయం తీసుకుంది. ఇకనుంచి తన ఏటీఎమ్‌లలో పెద్ద నోటు లభ్యం కాదని స్పష్టీకరించింది. రెండువేల నోటును రద్దు చేస్తారంటూ గత కొంతకాలంగా ఊహాగానాలు వెలువడిన నేపథ్యంలో బ్యాంకు నిర్ణయం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఏటీఎమ్‌లలో రెండు వేల నోటు నింపడం ఆపివేయాలంటూ ఇండియన్ బ్యాంకు సంబంధింత బ్రాంచ్‌లకు ఆదేశాలు జారీ చేసింది. ఇకమీదట తన ఏటీఎమ్‌లలో రెండు వేల నోటు కనిపించదని, దానికి బదులుగా రూ.200 నోటును అందుబాటులో ఉంచుతామని వెల్లడించింది.(రూ. 2 వేల నోటు కనబడుటలేదు!!) వినియోగదారుల సౌకర్యార్థమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. దీంతో మార్చి 1 నుంచి ఇండియన్ బ్యాంకు ఏటీఎమ్‌లలో రూ.2 వేల నోటు అదృశ్యం కానుంది. కాగా ఇప్పటికే వినియోగదారులు సైతం ఏటీఎమ్‌లలో తీసుకుంటున్న పెద్ద నోట్లను బ్యాంకుకు వెళ్లి మార్చుకుంటున్నారు. మరోవైపు మిగతా బ్యాంకులు కూడా అదే బాటలో వెళతాయేమోనని కొందరు వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు.(రెండు వేల నోటు, మరో షాకింగ్ న్యూస్) -
బ్యాంకుల వడ్డీ రేట్ల తగ్గింపు
ముంబై: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ).. రుణాలకు సంబంధించి ఎక్స్టర్నల్ బెంచ్ మార్క్ ఆధారిత వడ్డీ రేట్లను (ఈబీఆర్) 25 బేసిస్ పాయింట్ల (పావు శాతం) మేర తగ్గించింది. ఇది జనవరి 1 నుంచి అమల్లోకి వస్తుందని ఎస్బీఐ తెలిపింది. కొత్త కస్టమర్లకు గృహ రుణాలపై వడ్డీ రేటు 7.90 శాతం నుంచి ఉంటుంది. ఇప్పటిదాకా ఇది 8.15 శాతంగా ఉంది. మరోవైపు, మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ (ఎంసీఎల్ఆర్) విధానం ఆధారిత రుణాలపై వడ్డీ రేట్లను జనవరి 3 నుంచి సవరిస్తున్నట్లు ఇండియన్ బ్యాంక్ వెల్లడించింది. వివిధ కాలావధులకు సంబంధించి వడ్డీ రేటు 0.05 శాతం మేర తగ్గనుంది. -
రూ.10 కోట్లకు టోకరా
సాక్షి, రాజానగరం: జీడిపిక్కల వ్యాపారం కోసం అప్పు ఇచ్చిన బ్యాంకు అధికారులు కొన్ని రోజుల తరువాత తనిఖీ కోసం గోడౌన్‌కు వెళ్తే జీడిపిక్కల నిల్వలు లేకుండా ఖాళీ గోడౌన్ దర్శనమిచ్చింది. దీంతో నివ్వెరపోయిన ఆ బ్యాంకు అధికారులు తరువాత తేరుకొని సంబంధిత వ్యాపారులతోపాటు తొమ్మిది మందిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సంఘటనకు సంబంధించి స్థానిక ఎస్సై శివనాగబాబు తెలిపిన వివరాలిలావున్నాయి. అనపర్తి మండలం, పేరారామచంద్రపురానికి చెందిన నలుగురు వ్యాపారులు గోడౌన్లో నిల్వ ఉంచిన జీడిపిక్కలను చూపించి, వాటిపై రాజమహేంద్రవరంలోని ఇండియన్ బ్యాంకు నుంచి రూ.10 కోట్లు అప్పు తీసుకున్నారు. ఆ తరువాత కొంత కాలానికి వారి నుంచి చెల్లించాల్సిన వాయిదాలు సక్రమంగా జమ కాకపోవడంతో అనుమానం వచ్చిన బ్యాంకు అధికారులు తనిఖీకి గోడౌన్‌కి రావడంతో జీడిపిక్కల బస్తాలు లేవు. ఖాళీ గోడౌన్ కనపడింది. దీంతో అప్పు తీసుకున్న నలుగురు వ్యాపారులు నల్లమిల్లి అరుణ, వరలక్ష్మి, రాధ, కర్రి వెంకటబులిరెడ్డితోపాటు వారికి అప్పు ఇప్పించిన ఏజెన్సీకి సంబంధించిన ముగ్గురు వ్యక్తులు కేతల భద్రావతి, కేతల సూర్రెడ్డి, ఎస్వీ వెంకట్రావు, గోడౌన్ యజమానులకు సంబంధించి ఇద్దరిపై బ్యాంకు అధికారులు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. -
గంటా ఆస్తుల వేలానికి రంగం సిద్ధం!
సాక్షి, విశాఖపట్నం: మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు మరోసారి చిక్కుల్లో పడ్డారు. బ్యాంకు రుణఎగవేత కేసులో ఆయన ఆస్తులను వేలం వేయడానికి అధికారులు సిద్ధమయ్యారు. ప్రత్యుష రిసోర్సెస్ అండ్ ఇన్ఫ్రా ఫ్రై లిమిటెడ్ పేరు మీద ఇండియన్ బ్యాంక్ నుంచి భారీగా రుణం తీసుకుని ఎగవేశారని అధికారులు చెబుతున్నారు. రుణాన్ని తిరిగి చెల్లించాలని గంటాకు అక్టోబర్ 4న బ్యాంకు అధికారులు డిమాండ్ నోటీసు కూడా పంపారు. కానీ ఆయన నుంచి ఎలాంటి స్పందన లేదు. దీంతో డిసెంబర్ 20న ఆయన వ్యక్తిగత ఆస్తులను వేలం వేయాలని అధికారులు నిర్ణయించారు. మొత్తం రుణ బకాయిలు రూ.200 కోట్లు కాగా తనాఖా పెట్టిన ఆస్తుల విలువ కేవలం రూ.35 కోట్ల 35 లక్షల 61 వేలు ఉన్నట్లు తెలిసింది. దీంతో మిగతా బకాయిల కోసం గంటా వ్యక్తిగత ఆస్తిని వేలం వేసే అధికారం తమకు ఉందని ఇండియన్ బ్యాంకు అధికారులు చెబుతున్నారు. విశాఖ ఉత్తర నియోజకవర్గంలోని 444 గజాల్లో నిర్మించిన ప్లాట్‌ను వేలం వేయనున్నట్లు సమాచారం. గంటా ఆస్తుల వేలం పాటు అంశం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. అధికారాన్ని అడ్డంపెట్టుకుని ఇలాంటి చర్యలకు పాల్పడటం ఏంటని గంటాపై పలువురు అసహనం వ్యక్తం చేశారు. కాగా ప్రభుత్వ భూములను తనఖా పెట్టి భారీగా రుణాలు తీసుకున్నారని గతంలో కూడా ఆయనపై అనేక ఆరోపణలు వినిపించిన విషయం తెలిసిందే. -
నకిలీ బంగారంతో రూ.3.77 కోట్ల టోకరా
ముంబై: కస్టమర్ల నుంచి స్వీకరించిన బంగారంతో ఓ బ్యాంకు ఉద్యోగి రూ.3.77 కోట్ల మోసానికి పాల్పడ్డాడు. ముంబైలోని ధారావి ఇండియన్ బ్యాంకు గోల్డ్‌లోన్ విభాగంలో పనిచేస్తున్న రామస్వామి నాడార్ ఆ పక్కనే ఓ జువెల్లరీ షాపు నడుపుతున్నాడు. ఇటీవల బ్యాంకు అధికారులు బంగారం దాచిన 77 పాకెట్లు ఉన్న లాకర్లను తెరిచి చూడగా అది నకిలీ బంగారం అని తేలింది. దీంతో వారు ధారావి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. గోల్డ్ లోన్ కోసం దరఖాస్తు చేసుకున్న కస్టమర్ల నుంచి బంగారాన్ని తనిఖీ చేసి వారికి సర్టిఫికెట్ జారీ చేయడం నాడార్ పని. అయితే ఆధార్, పాన్ కార్డుల ఆధారంగా అతడు 12 మంది నకిలీ కస్టమర్లను సృష్టించాడు. వీరి పేర్లతో నకిలీ బంగారాన్ని డిపాజిట్ చేసి మోసానికి పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు. -
ఇండియన్ బ్యాంక్ 75% వృద్ధి
చెన్నై: ప్రభుత్వరంగ ఇండియన్‌బ్యాంకు జూన్ త్రైమాసికంలో మెరుగైన పనితీరు చూపించింది. బ్యాంకు లాభం క్రితం ఏడాది ఇదే కాలంలో ఉన్న రూ.209 కోట్లతో పోలిస్తే 75 శాతం పెరిగి రూ.366 కోట్లకు చేరుకుంది. మొత్తం ఆదాయం కూడా రూ.5,132 కోట్ల నుంచి రూ.5,832 కోట్లకు వృద్ధి చెందింది. జూన్ త్రైమాసికంలో తాజాగా రూ.1,035 కోట్లు మొండి బకాయిలుగా మారాయి. అన్ని విభాగాల్లోనూ మెరుగైన వృద్ధి నమోదు చేసినట్టు ఇండియన్ బ్యాంకు ఎండీ, సీఈవో పద్మజ చుండూరు పేర్కొన్నారు. ‘‘తాజా ఎన్పీఏలకు కళ్లెం వేయడం వల్ల నికర లాభంలో 74.5 శాతం వృద్ధి నమోదైంది. తిరిగి గాడిలో పడ్డాం. ఒత్తిడిలోని రుణాలు ఎన్పీఏలుగా మారకుండా చర్యలు తీసుకుంటున్నాం’’ అని పద్మజ తెలిపారు. రానున్న త్రైమాసికాల్లో తాజా ఎన్పీఏలను రూ.800–900 కోట్లకు కట్టడి చేయాలని లక్ష్యం పెట్టుకున్నట్టు ఆమె తెలిపారు. ‘‘రిటైల్, వ్యవసాయం, సూక్ష్మ, చిన్న, మధ్యత తరహా విభాగాల్లో (ఎంఎస్ఎంఈ) వృద్ధి నెలకొంది. రిటైల్‌లో 25 శాతం, వ్యవసాయంలో 25 శాతం, ఎంఎస్ఎంఈ విభాగంలో 10 శాతం వృద్ధి సాధించాం. మొత్తం మీద క్యాపిటల్ అడెక్వసీ రేషియో 13.62 శాతంగా ఉంది. ఇది మాకు మరింత సౌకర్యాన్ని, నమ్మకాన్ని కలిగిస్తోంది’’ అని పద్మజ వివరించారు. మొబైల్ బ్యాంకింగ్‌లో లావాదేవీల్లో 300 శాతం వృద్ధి నమోదైనట్టు ఆమె చెప్పారు. -
ఇండియన్ బ్యాంక్‌కు ప్రొవిజనింగ్ దెబ్బ..
న్యూఢిల్లీ: మొండిబాకీలకు కేటాయింపులు పెరగడంతో.. ప్రభుత్వ రంగ ఇండియన్ బ్యాంక్ నికర లాభం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో సగానికి తగ్గి రూ. 152 కోట్లుగా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం ఇదే వ్యవధిలో బ్యాంక్ లాభం రూ. 303 కోట్లు. ఇక క్యూ3లో మొత్తం ఆదాయం రూ. 4,903 కోట్ల నుంచి రూ. 5,269 కోట్లకు పెరిగింది. స్థూల నిరర్ధక ఆస్తులు (ఎన్పీఏ) 6.27 శాతం నుంచి 7.46 శాతానికి ఎగిశాయి. నికర ఎన్పీఏలు కూడా 3.3 శాతం నుంచి 4.42 శాతానికి పెరిగాయి. పరిమాణంపరంగా స్థూల ఎన్పీఏలు రూ. 9,595 కోట్ల నుంచి రూ. 13,198 కోట్లకు, నికర ఎన్పీఏలు రూ. 4,899 కోట్ల నుంచి రూ. 7,571 కోట్లకు ఎగిశాయి. ఫలితంగా మొండిబాకీలకు కేటాయింపులు ఏకంగా మూడు రెట్లు పెరిగి రూ. 385 కోట్ల నుంచి రూ. 974 కోట్లకు చేరినట్లు ఇండియన్ బ్యాంక్ వెల్లడించింది. -
ఇండియన్ బ్యాంక్ లాభం 67 శాతం డౌన్
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ ఇండియన్ బ్యాంక్ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక కాలంలో 67 శాతం తగ్గింది. గత క్యూ2లో రూ.452 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ2లో రూ.150 కోట్లకు తగ్గిందని ఇండియన్ బ్యాంక్ తెలిపింది. మొండి బకాయిలు పెరగడంతో నికర లాభం తగ్గిందని ఇండియన్ బ్యాంక్ ఎమ్డీ, సీఈఓ పద్మజ చుండూరు పేర్కొన్నారు. మొత్తం ఆదాయం రూ.4,874 కోట్ల నుంచి రూ.5,129 కోట్లకు పెరిగిందని పేర్కొన్నారు. ఈ బ్యాంక్ రుణ నాణ్యత మరింతగా తగ్గింది. గత క్యూ2లో 6.67 శాతంగా ఉన్న స్థూల మొండి బకాయిలు ఈ క్యూ2లో 7.16 శాతానికి పెరిగాయని పద్మజ తెలిపారు. అలాగే నికర మొండి బకాయిలు 3.41 శాతం నుంచి 4.23 శాతానికి చేరాయని పేర్కొన్నారు. మొండి బకాయిలకు, అత్యవసరాలకు కేటాయింపులు ఈ క్యూ2లో రూ.1,004 కోట్లకు పెరిగాయని, గత క్యూ2లో ఇవి రూ.745 కోట్లుగా ఉన్నాయని వివరించారు. ఒక్క మొండి బకాయిలకు కేటాయింపులే రూ.633 కోట్ల నుంచి రూ.752 కోట్లకు పెరిగాయని పేర్కొన్నారు. ఎన్‌బీఎఫ్‌సీలకు రూ.20,477 కోట్లు: ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌కు పది ఖాతాల కింద రూ.1,809 కోట్ల మేర రుణాలిచ్చామని పద్మజ పేర్కొన్నారు. వీటిల్లో ఆరు ఖాతాలు స్పెషల్ పర్పస్ వెహికల్(ఎస్పీవీ)కి చెందినవని, ఇవి మంచి రుణాలేనని వివరించారు. మూడేళ్ల క్రితమే ఒక ఖాతా మొండి బకాయిగా తేలిందని, దీనికి పూర్తిగా కేటాయింపులు జరిపామని తెలిపారు. రూ.172 కోట్ల ఖాతా తాజాగా మొండి బకాయిగా మారిందని, మరో రెండు ఖాతాలకు చెందిన రూ.130 కోట్ల రుణాలు వాచ్‌లిస్ట్‌లో ఉన్నాయని వివరించారు. ఎన్‌బీఎఫ్‌సీలకు రూ.20,477 కోట్ల రుణాలిచ్చామని, ఇది మొత్తం రుణాల్లో 12 శాతానికి సమానమని వివరించారు. ఫలితాల ప్రభావంతో బీఎస్ఈలో ఇండియన్ బ్యాంక్ షేర్ భారీగా నష్టపోయింది. 12 శాతం నష్టంతో రూ.229 వద్ద ముగిసింది. -
ఇండియన్ బ్యాంక్ సీఈఓగా పద్మజ బాధ్యతలు
ప్రభుత్వ రంగ బ్యాంక్– ఇండియన్ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా పద్మజ చంద్రూ ఇటీవల బాధ్యతలు చేపట్టారు. ఇంతకుముందు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో గ్లోబల్ మార్కెట్స్ విభాగానికి డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్‌గా పనిచేసిన ఆమె... తాజాగా ఇండియన్ బ్యాంక్ సీఈఓగా పదవీ బాధ్యతలు చేపట్టారని గురువారం బ్యాంక్ ఒక అధికారిక ప్రకటనలో తెలిపింది. ఇటీవలే పది ప్రభుత్వ రంగ బ్యాంకులకు కేంద్ర ప్రభుత్వం ఎండీ, సీఈఓలను నియమించగా... ఈ జాబితాలో ఇండియన్ బ్యాంక్ సీఈఓగా పద్మజ ఉన్న విషయం తెలిసిందే. -
ఇండియన్ బ్యాంకు ఫలితాలు..ప్చ్..
సాక్షి,ముంబై: ప్రభుత్వ రంగ బ్యాంకు ఇండియన్ బ్యాంకు నిరుత్సాహకర ఫలితాలను ప్రకటించింది. క్యూ4(జనవరి-మార్చి)లో ఇండియన్ బ్యాంక్ నికర లాభం 59 శాతం క్షీణించి రూ. 1,259 కోట్లకు పరిమితమైంది. గత ఏడాది 1405 రూపాయల నికర లాభాలను సాధించింది. మొత్తం ఆదాయం19,520కోట్లుగా నమోదు చేసింది. మార్చి 31, 2018 నాటికి ఇండియన్ బ్యాంక్ స్థూల స్థూల మొండిబకాయిలు(ఎన్పీఏలు) 6.27 శాతం నుంచి 7.37 శాతానికి పెరిగి11,990 కోట్ల రూపాయలుగా ఉంది. నికర ఎన్పీఏలు సైతం 3.3 శాతం నుంచి 3.81 శాతం పెరిగి 5,960.57 కోట్ల రూపాయలుగా ఉంది. నికర వడ్డీ ఆదాయం(ఎన్ఐఐ) మాత్రం 18 శాతం పెరిగి రూ. 1638 కోట్లకు చేరింది. మొండి రుణాలకుగాను రూ. 1770 కోట్ల మేర ప్రొవిజన్లు చేపట్టింది. మరోవైపు రూ .10 ముఖ విలువ కలిగిన ఈక్విటీ షేరుకు రూ .6 డివిడెండ్ చెల్లించేందుకు బోర్డ్ ప్రతిపాదించింది. -
ఇండియన్ బ్యాంక్ మొండి బాకీలు తగ్గాయ్..
చెన్నై: ప్రభుత్వ రంగ ఇండియన్ బ్యాంక్ నికర లాభం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక కాలంలో 19 శాతం తగ్గింది. గత క్యూ3లో రూ.373 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ3లో రూ.303 కోట్లకు తగ్గిందని ఇండియన్ బ్యాంక్ తెలిపింది. పెట్టుబడులపై మార్క్ టు మార్కెట్ తరుగుదల రూ.407 కోట్లుగా ఉండడం వల్ల నికర లాభం తగ్గిందని బ్యాంక్ ఎమ్డీ, సీఈఓ కిశోర్ కారత్ తెలిపారు. ఇటీవల కాలంలో ఒక్కో క్వార్టర్లో మంచి ఫలితాలు సాధిస్తున్నామని, ఈ క్వార్టర్లో కూడా మంచి ఫలితాలు సాధించామని వివరించారు. మొత్తం ఆదాయం రూ.4,557 కోట్ల నుంచి రూ.4,903 కోట్లకు పెరిగిందని తెలిపారు. రుణ నాణ్యత మెరుగుపడిందని పేర్కొన్నారు. స్థూల మొండి బకాయిలు 7.69 శాతం నుంచి 6.27 శాతానికి, నికర మొండి బకాయిలు 4.76 శాతం నుంచి 3.3 శాతానికి తగ్గాయని తెలిపారు. ఒత్తిడి రుణాలు 12.41 శాతం నుంచి 8.88 శాతానికి తగ్గాయని పేర్కొన్నారు. నికర వడ్డీ ఆదాయం 30 శాతం వృద్ధితో రూ.1,623 కోట్లకు పెరిగిందని పేర్కొన్నారు. క్యాపిటల్ అడెక్వసీ రేషియో 12.44 శాతంగా ఉందని తెలిపారు. కాగా, ఇప్పటివరకూ క్యూ3 ఆర్థిక ఫలితాలను వెల్లడించిన ప్రభుత్వ రంగ బ్యాంక్‌ల్లో తమ బ్యాంకే అత్యుత్తమ ఫలితాలను ప్రకటించిందని కారత్ తెలిపారు. ఆర్థిక ఫలితాలు బాగా ఉండటంతో బీఎస్ఈలో ఇండియన్ బ్యాంక్ షేర్ 5 శాతం లాభంతో రూ.356 వద్ద ముగిసింది. -
ఇండియన్ బ్యాంక్ లాభం రూ.452 కోట్లు
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ ఇండియన్ బ్యాంక్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక కాలంలో రూ.452 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. గత క్యూ2లో సాధించిన నికర లాభం రూ.405 కోట్లతో పోల్చితే 11 శాతం వృద్ధి సాధించామని ఇండియన్ బ్యాంక్ తెలిపింది. గత క్యూ2లో రూ.4,579 కోట్లుగా ఉన్న మొత్తం ఆదాయం ఈ క్యూ2లో రూ.4,874 కోట్లకు పెరిగింది. మొండి బకాయిలు తగ్గడంతో బ్యాంక్ రుణ నాణ్యత మెరుగుపడింది. స్థూల మొండి బకాయిలు 7.28 శాతం నుంచి 6.67 శాతానికి, నికర మొండి బకాయిలు 4.62 శాతం నుంచి 3.41 శాతానికి తగ్గాయి. షేర్ ఆల్‌టైమ్ హై... ఆర్థిక ఫలితాలు వెలువడిన అనంతరం బీఎస్ఈలో ఈ షేర్ 9.3 శాతం ఎగసి రూ.379.50కు దూసుకుపోయింది. ఇంట్రాడేలో ఆల్‌టైమ్ హై, రూ.384ను తాకింది. గత శుక్రవారం రూ.347 వద్ద ముగిసిన ఈ షేర్ సోమవారం ఇంట్రాడేలో రూ.348, రూ.384 కనిష్ట, గరిష్ట స్థాయిలను తాకింది. చివరకు 9 శాతం లాభంతో రూ.377 వద్ద ముగిసింది. ఈ షేర్ ఏడాది కనిష్ట స్థాయి రూ.190గా ఉంది. -
ఇండియన్ బ్యాంక్ లాభాలు 11శాతం జంప్
సాక్షి, ముంబై: ప్రభుత్వరంగ సంస్థ ఇండియన్ బ్యాంక్ రెండవ త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలను ప్రకటించింది. ఈ ఆర్థిక సంవత్సరం క్యూ2 ఫలితాలను సోమవారం ప్రకటించింది. ఎనలిస్టుల అంచనాలను అధిగమించి ఆదాయంలోనూ, నికర లాభాల్లో పురోగతిని సాధించింది. జూలై-సెప్టెంబర్ 30తో ముగిసిన క్యూ 2లో నికర లాభాలు 11శాతంపైగా ఎగసి రూ. 451 కోట్లను అధిగమించాయి. నికర వడ్డీ ఆదాయం సైతం 21 శాతం పెరిగి రూ. 1,544 కోట్లకు చేరింది. దాదాపు 14 శాతం రుణ వృద్ధిని సాధించగా.. స్థూల మొండిబకాయిలు(ఎన్పీఏలు) 7.21 శాతం నుంచి 6.67 శాతానికి తగ్గాయి. నికర ఎన్పీఏలు సైతం 4.05 శాతం నుంచి 3.41శాతానికి క్షీణించాయి. రూ.5,238.6 కోట్ల నుంచి రూ .4,748.2 కోట్లకు పడిపోయింది. అయితే ప్రొవిజన్లు 56 శాతం పెరిగి రూ. 744ను కోట్లుగా నమోదయ్యాయి. ఈ ఫలితాల నేపథ్యంలో ఇండియన్బ్యాంక్ షేరు భారీ లాభాలను సాధించింది. ట్రేడర్ల కొనుగోళ్లతో 52 వారాల గరిష్టాన్ని తాకింది. -
తగ్గిన ఇండియన్ బ్యాంక్ వడ్డీ రేట్లు
చెన్నై: ప్రభుత్వ రంగ ఇండియన్ బ్యాంక్ తాజాగా ఫారిన్ కరెన్సీ నాన్ రెసిడెంట్ (బ్యాంకింగ్) (ఎఫ్సీఎన్ఆర్–బి) టర్మ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు తగ్గించింది. దీంతో ఏడాది పైబడి రెండేళ్ల దాకా ఉండే కాల వ్యవధి గల ఎఫ్సీఎన్ఆర్ (బి) డిపాజిట్లపై వడ్డీ రేటు ప్రస్తుతమున్న 2.39% నుంచి 2.36%కి తగ్గింది. అలాగే రెండేళ్లు పైబడి.. మూడేళ్ల దాకా కాలవ్యవధి గల డిపాజిట్లపై రేటు 2.58% నుంచి 2.50%కి, మూడేళ్ల నుంచి నాలుగేళ్ల కన్నా తక్కువ వ్యవధికి 2.77% నుంచి 2.70 శాతానికి వడ్డీ రేటు తగ్గింది. నాలుగేళ్లు పైబడి, అయిదేళ్ల కన్నా తక్కువ కాలవ్యవధి ఉండే డిపాజిట్లపై 2.87 శాతం నుంచి 2.82 శాతానికి, అయిదేళ్ల వ్యవధికి 2.97 శాతం నుంచి 2.89 శాతానికి రేటు తగ్గినట్లవుతుందని ఇండియన్ బ్యాంక్ తెలిపింది. ఈ మార్పులు తక్షణమే అమల్లోకి వచ్చినట్లు వివరించింది. -
ఇండియన్ బ్యాంక్ లాభం మూడింతలు
ఒక్కో షేర్‌కు రూ.6 డివిడెండ్ న్యూఢిల్లీ/చెన్నై: ప్రభుత్వ రంగ ఇండియన్ బ్యాంక్ నికర లాభం గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక కాలంలో మూడు రెట్లు పెరిగింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరంలో రూ.94 కోట్లుగా ఉన్న నికర లాభం గత ఆర్థిక సంవత్సరం క్యూ4లో రూ.320 కోట్లకు పెరిగిందని ఇండియన్ బ్యాంక్ తెలిపింది. మొత్తం ఆదాయం రూ.4,523 కోట్ల నుంచి రూ.4,602 కోట్లకు చేరిందని పేర్కొంది. స్థూల మొండి బకాయిలు రూ.8,827 కోట్ల నుంచి రూ.9,865 కోట్లకు, నికర మొండి బకాయిలు రూ.5,419 కోట్ల నుంచి రూ.5,607 కోట్లకు పెరిగాయని తెలిపింది. శాతం పరంగా చూస్తే స్థూల మొండి బకాయిలు 6.66 శాతం నుంచి 7.47 శాతానికి, నికర మొండి బకాయిలు 4.2 శాతం నుంచి 4.39 శాతానికి చేరాయని వివరించింది. మొండి బకాయిలు పెరిగినప్పటికీ, కేటాయింపులు మాత్రం రూ.968 కోట్ల నుంచి రూ.608 కోట్లకు తగ్గాయని తెలిపింది. ఒక్కో షేర్‌కు రూ.6 డివిడెండ్‌ను ఇవ్వనున్నట్లు ప్రకటించింది. త్వరలో ఎఫ్‌పీఓ... గత ఆర్థిక సంవత్సరంలో తమ బ్యాంక్ పనితీరు బాగా ఉందని ఇండియన్ బ్యాంక్ ఎండీ, సీఈఓ కిశోర్ ఖరత్ చెప్పారు. నిర్వహణ లాభాలు పెరగడం తదితర అంశాలు దీనికి కారణాలని పేర్కొన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలోనే ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్(ఎఫ్‌పీఓ)ద్వారా 82 శాతంగా ఉన్న ప్రభుత్వ వాటాను75 శాతానికి తగ్గించుకోనున్నామని వివరించారు. నికర లాభం మూడు రెట్లు పెరిగిన నేపథ్యంలో బీఎస్ఈలో ఇండియన్ బ్యాంక్ షేర్ 9 శాతం లాభపడి రూ.311 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో ఈ షేర్ ఏడాది గరిష్ట స్థాయి, రూ.319ను తాకింది. -
ఇండియన్ బ్యాంక్ ఎండీగా కిశోర్ ఖారత్
హైదరాబాద్: ప్రభుత్వ రంగ ఇండియన్ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈవోగా కిశోర్ ఖారత్ బాధ్యతలు స్వీకరించారు. ఇంతకుముందు ఈయన ఐడీబీఐ బ్యాంక్ ఎండీగా, సీఈవోగా బాధ్యతలు నిర్వహించారు. ఖారత్ ఇదివరకు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా కూడా పనిచేశారు. కాగా ఈయన తన బ్యాంకింగ్ కెరీర్‌ను బ్యాంక్ ఆఫ్ బరోడాలో ప్రారంభించారు. కిశోర్ ప్రస్తుతం ఐబీఏ స్టాండింగ్ కమిటీ ప్రత్యామ్నాయ చైర్మన్‌గా, సీఐఐ నేషనల్ కమిటీలో సభ్యుడిగా కొనసాగుతున్నారు. -
మంత్రి గంటా శ్రీనివాసరావుకు హైకోర్టు నోటీసులు
-
మంత్రి గంటా శ్రీనివాసరావుకు హైకోర్టు నోటీసులు
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మానవ వనరుల శాఖా మంత్రి గంటా శ్రీనివాసరావుకు ఉమ్మడి హైకోర్టు మంగళవారం నోటీసులు జారీ చేసింది. ప్రభుత్వ భూములు తాకట్టు పెట్టి రుణం తీసుకున్నట్లు గంటాపై ఆరోపణలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. ప్రత్యూష రిసోర్సెస్ అండ్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్హామీదారుగా ఉన్నందుకుగాను గంటాకు ఈ నోటీసులు జారీ చేసింది. ఇందుకు సంబంధించి మూడు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని న్యాయస్థానం ఆదేశించింది. ప్రభుత్వ భూమిని తనఖా పెట్టి ఆ సంస్థ ఇండియన్ బ్యాంకు నుంచి రుణం పొందిందని పేర్కొంటూ హైకోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది. రుణగ్రహీతలు, హామీదారులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ దాఖలైన ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన న్యాయస్థానం ఈ మేరకు గంటా సహా ప్రతివాదులందరికీ నోటీసులు జారీ చేసింది. మూడు వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. మరోవైపు ఇండియన్ బ్యాంకు నుంచి తీసుకున్న రుణం తిరిగి చెల్లించని కారణంగా మంత్రి గంటాతోపాటు ఆయన బంధువుల ఆస్తుల స్వాధీనం కొనసాగుతోంది. తాజాగా ‘ప్రత్యూష రిసోర్సెస్ అండ్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్’ కోసం కుదవపెట్టిన మరో రెండు విలువైన స్థిరాస్తులను ఇండియన్ బ్యాంకు స్వాధీనం చేసుకున్న విషయం విదితమే. -
మంత్రి గంటా ఆస్తులు మరిన్ని స్వాధీనం
-
మంత్రి గంటా ఆస్తులు మరిన్ని స్వాధీనం
⇒ చెన్నై, హైదరాబాద్‌లో ఆస్తులను స్వాధీనం చేసుకున్న ఇండియన్ బ్యాంక్ ⇒ రూ.203.62 కోట్లకు చేరిన రుణ బకాయిలు సాక్షి, విశాఖపట్నం: ఇండియన్ బ్యాంకు నుంచి తీసుకున్న రుణం తిరిగి చెల్లించని కారణంగా రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాస రావుతోపాటు ఆయన బంధువుల ఆస్తుల స్వాధీనం కొనసాగుతోంది. తాజాగా ‘ప్రత్యూష రిసోర్సెస్ అండ్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్’ కోసం కుదవపెట్టిన మరో రెండు విలువైన స్థిరాస్తులను ఇండియన్ బ్యాంకు స్వాధీనం చేసుకుంది. ఈ మేరకు ఇండియన్ బ్యాంక్ బుధవారం ఓ ప్రముఖ ఆంగ్ల దినపత్రికలో స్వాధీన ప్రకటన జారీ చేసింది. వరుసగా ఆస్తుల స్వాధీన ప్రకటనలు జారీ కావడం రాజకీయంగా కలకలం రేపుతోంది. 60 రోజులు గడువిచ్చినా... మంత్రి గంటా బంధువు భాస్కరరావు సోదరుల పేరిట ఉన్న ఈ కంపెనీ విశాఖప ట్నం డాబాగార్డెన్‌లోని ఇండియన్ బ్యాంకు నుంచి 2005లో దాదాపు రూ.141.68 కోట్లు రుణం తీసుకుంది. ఈ రుణాన్ని సకాలంలో తిరిగి చెల్లించని కారణంగా వడ్డీతో కలిపి రూ.196 కోట్ల మేర బకాయి పేరుకు పోయింది. దీన్ని చెల్లించాలంటూ పలుమార్లు నోటీసులు జారీచేసినా కంపెనీ నుంచి స్పందన రాలేదు. దీంతో ప్రత్యూష ఎస్టేట్ ప్రైవేట్ లిమిటెడ్, ప్రత్యూష గ్లోబల్ ట్రేడ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలకు చెందిన ఆస్తులతోపాటు ఈ రుణం కోసం మంత్రి శ్రీనివాసరావు, కంపెనీ డైరెక్టర్లు పరుచూరి రాజారావు, పరుచూరి వెంకయ్య ప్రభాకరరావు, పరుచూరి వెంకట భాస్కరరావు, కొండయ్య బాలసుబ్రహ్మణ్యం, నామి అమూల్యల ఆస్తులను గత డిసెంబర్ 21వ తేదీ నుంచి 26వ తేదీ మధ్య స్వాధీనం చేసుకున్నట్టు ఇండియన్ బ్యాంకు అధికారులు ప్రకటించారు. స్వాధీనం నోటీసు అనంతరం 60 రోజుల్లోగా బకాయిలు చెల్లించేందుకు అవకాశం ఇచ్చారు. అయితేకంపెనీతోపాటు హామీదారులెవరూ స్పందించకపోవడంతో ఆస్తులను తమ అధీనంలో తీసుకుంటున్నట్టు బుధవారం పొజిషన్ నోటీసు జారీ చేశారు. కాగా, పెరిగిన వడ్డీతో సహా రుణ బకాయిలు ప్రస్తుతం రూ.203.62 కోట్లకు చేరినట్లు బ్యాంకు తాజా ప్రకటనలో పేర్కొంది. ఈ నేపథ్యంలో ఇందులో ఎంతోకొంత రికవరీ చేసుకోవాలన్న ఉద్దేశంతో గతంలో ఆయా కంపెనీలు, హామీదారుల నుంచి స్వాధీనం చేసుకున్న ఆస్తులతోపాటు అదనంగా మరో రెండు కీలకమైన ఆస్తులను స్వాధీనం చేసుకున్నట్టుగా ప్రకటన జారీ చేసింది. తాజాగా స్వాధీనం చేసుకున్న ఆస్తులివే.. తమిళనాడులోని కాంచీపురం జిల్లా సైదాపేట తాలూకా సీషోర్ టౌన్ పరిధిలోని షోలింగనల్లూర్ గ్రామంలో సర్వే నెం.12/1, 13/1 పార్ట్, 13/2 పార్ట్‌లలో 6 వేల చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన ప్లాట్ నెం.281ఏను ఫిబ్రవరి 16న స్వాధీనం చేసుకున్నట్టుగా ప్రకటించారు. తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలం మణికొండ జాగీర్ గ్రామంలో సర్వే నెం.201లో ల్యాంకో హిల్స్ టవర్–5లో 67.92 చదరపు గజాల విస్తీర్ణం కలిగిన మొదటి, రెండో అంతస్తులను ఫిబ్రవరి 17న స్వాధీనం చేసుకున్నట్టుగా ప్రకటించారు. -
మంత్రి గంటా ఆస్తులు బ్యాంక్ స్వాధీనం
సాక్షి, అమరావతి: రుణాల ఎగవేత కేసులో రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావుకు చెందిన మరిన్ని ఆస్తులను బ్యాంక్ స్వాధీనం చేసుకున్నాయి. గంటా కుటుంబానికి చెందిన ప్రత్యూష రిసోర్సెస్ అండ్ ఇన్ఫ్రా కంపెనీ ఇండియన్ బ్యాంక్‌కు రూ.141 కోట్లు బకాయి ఉన్న సంగతి తెలిసిందే. గత కొంత కాలంగా రుణాలు చెల్లించకపోవడంతో బాకీ మొత్తం రూ. 203.62 కోట్లకు చేరింది. దీంతో ఆ కంపెనీకి చెందిన ఆస్తులతో పాటు రుణానికి హామీగా ఉన్న మంత్రి గంటా శ్రీనివాసరావుకి చెందిన ఆస్తులను బ్యాంక్ స్వాధీనం చేసుకున్నాయి. ఇప్పటికే విశాఖతో పాటు, రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో ఉన్న ఆస్తులను స్వాధీనం చేసుకున్నా బ్యాంక్ తాజాగా హైదరాబాద్, చెన్నైలోని ఆస్తులను కూడా స్వాధీనం చేసుకున్నట్లు పత్రికా ప్రకటన జారీ చేసింది. హైదరాబాద్‌లో ల్యాంకో హిల్స్‌లో కంపెనీ పేరు మీద ఉన్న రెండు ఫ్లాట్లతో పాటు, తమిళనాడులోని కాంచీపురం జిల్లా షోలింగనల్లూర్‌లో ఉన్న 6,000 చదరపు అడుగుల ఆస్తిని స్వాధీనం చేసుకున్నట్లు ఇండియన్ బ్యాంక్ ఆ ప్రకటనలో పేర్కొంది. ఈ ఆస్తులను ఫిబ్రవరి 16, 17వ తేదీల్లో స్వాధీనం చేసుకున్నామని, దీనికి సంబంధించి తమకు తెలియకుండా ఎటువంటి క్రయవిక్రయాలు జరపరాదని ఆ బహిరంగ ప్రకటనలో పేర్కొంది. -
మంత్రి గంటా ఆస్తుల స్వాధీనం!
-
మంత్రి గంటా ఆస్తుల స్వాధీనం!
- విశాఖలోని ఇండియన్ బ్యాంకుకు ’గంటా’ గ్యాంగ్ ఎగనామం - రుణ బకాయిలు చెల్లించని ప్రత్యూష కంపెనీ - వడ్డీతో కలిపి రూ.196.51 కోట్ల బకాయి - డిమాండ్ నోటీసులిచ్చినా స్పందన శూన్యం - కంపెనీతోసహా డైరెక్టర్ల ఆస్తులు, హామీదారుగా ఉన్న గంటా ఆస్తుల స్వాధీనానికి ప్రకటన సాక్షి, విశాఖపట్నం: రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు బంధువులు, వ్యాపార భాగస్వాములు రుణ ఎగవేతదారులుగా ముద్రపడ్డారు. ఇక్కడి ఇండియన్ బ్యాంకు నుంచి పెద్ద మొత్తంలో తీసుకున్న రుణాలు తిరిగి చెల్లించలేదు. దీంతో వారిని రుణ ఎగవేతదారులుగా పరిగణించిన బ్యాంకు అధికారులు ఆస్తుల స్వాధీనానికి నోటీసులు, పత్రికా ప్రకటనలు జారీ చేశారు. తీసుకున్న రుణాల్ని వడ్డీతోసహా చెల్లించాలని బ్యాంకు పలుమార్లు డిమాండ్ నోటీసులు జారీ చేసినా పట్టించుకోకపోవడంతో.. చివరి అస్త్రంగా వారు హామీగా పెట్టిన ఆస్తులను స్వాధీనం చేసుకుంటున్నట్టు బ్యాంకు బుధవారం పత్రికా ప్రకటనలు జారీ చేసింది. ఇందులో మంత్రి గంటా శ్రీనివాసరావు ఆస్తులు కూడా ఉండడం కలకలం రేపుతోంది. వడ్డీతో కలిపి రూ.196.50 కోట్లు విశాఖపట్నం వన్‌టౌన్‌లో ఉన్న ప్రత్యూష రిసోర్సెస్ అండ్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ 2005 ఆగస్టు 18న కంపెనీల చట్టం కింద రిజిస్టర్(రిజిస్ట్రేషన్ నం.047165) అయ్యింది. మాన్యుఫ్యాక్చరింగ్, మిషనరీ అండ్ ఎక్విప్మెంట్ కార్యకలాపాలకు ఉద్దేశించిన ఈ సంస్థ.. రూ.500 కోట్ల ఆథరైజ్డ్ క్యాపిటల్, రూ.240.671 కోట్ల పెయిడ్ అప్ క్యాపిటల్‌తో ఏర్పాటైంది. ఈ సంస్థకు యాక్టివ్ డైరెక్టర్లుగా రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావు తోడల్లుడు పరుచూరి వెంకట భాస్కరరావు, ఆయన సోదరులు రాజారావు, వెంకయ్య ప్రభాకరరావు వ్యవహరిస్తున్నారు. మంత్రి గంటాతోపాటు కొండయ్య, బాలసుబ్రహ్మణ్యం, నార్నె అమూల్యలతోపాటు ప్రత్యూష ఎస్టేట్స్ ప్రైవేటు లిమిటెడ్, ప్రత్యూష గ్లోబల్ ట్రేడ్ ప్రైవేటు లిమిటెడ్‌లు ప్రధాన హామీదారులుగా ఉన్నారు. సంస్థ విస్తరణ పేరుతో విశాఖలోని ఇండియన్ బ్యాంక్ డాబాగార్డెన్స్ శాఖ నుంచి రూ.141,68, 07,584 రుణం తీసుకున్నారు. అయితే ఒక్క వాయిదా కూడా చెల్లించలేదు. ఫలితంగా ఈ ఏడాది డిసెంబర్ 13 నాటికి వడ్డీతో కలిపి వారు చెల్లించాల్సిన రుణ బకాయి మొత్తం రూ.196,51,00,717గా ఇండియన్ బ్యాంకు లెక్కకట్టింది. అక్టోబర్ 4నే డిమాండ్ నోటీసులు ఈ మొత్తాన్ని చెల్లించాలంటూ గత అక్టోబర్ 4న బ్యాంకు డిమాండ్ నోటీసు జారీ చేసింది. నోటీసందిన 60 రోజుల్లోగా రుణబకాయి చెల్లించాలని, లేకుంటే కంపెనీతోపాటు డైరెక్టర్లు, హామీదారుల ఆస్తులను స్వాధీనం చేసుకుంటామని అందులో స్పష్టం చేసింది. అయినప్పటికీ సంస్థ ఒక్క రూపాయీ చెల్లించలేదు. దీంతో ఆస్తుల స్వాధీనానికి బ్యాంకు అధికారులు చర్యలు చేపట్టారు. ప్రత్యూష కంపెనీకి చెందిన ఆస్తులు, డైరెక్టర్లుగా ఉన్న పరుచూరి వెంకటభాస్కరరావు, రాజారావు, వెంకయ్య ప్రభాకరరావుల ఆస్తులతోపాటుగా హామీదారులుగా ఉన్న మంత్రి గంటా శ్రీనివాసరావు, కేబీ సుబ్రహ్మణ్యం, అమూల్యల ఆస్తులనూ స్వాధీనం చేసుకుంటున్నామంటూ బ్యాంక్ స్వాధీనత ప్రకటన జారీచేసింది. వివిధ ప్రాంతాల్లో ఉన్న వీరి ఆస్తులను ఈ నెల 21 నుంచి 26వ తేదీ మధ్య స్వాధీనం చేసుకున్నట్టుగా బ్యాంక్ అధికారులు ప్రకటించారు. విశాఖ నగరంతోపాటు గాజువాక, చినగదిలి, రుషికొండ, మధురవాడ, ఆనందపురం, అనకాపల్లి, కాకినాడల్లోని ప్రత్యూష కంపెనీ ఆస్తులను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఆస్తుల విషయంలో ఎలాంటి లావాదేవీలు జరపడానికి వీల్లేదని, లావాదేవీలు జరిపినవారు ఈ రుణ బకాయిలకు బాధ్యులవుతారని హెచ్చరికలు జారీచేసింది. ప్రత్యూష డైరెక్టర్లలో గంటా ఒకరు పోర్టులో వ్యాపార లావాదేవీల కోసం ఏర్పాటు చేసిన ఈ కంపెనీలో మంత్రి గంటా శ్రీనివాసరావు కూడా డైరెక్టర్‌గా కొంతకాలం కొనసాగారు. ఈ సంస్థకే జిల్లా గ్రంథాలయసంస్థ నిర్మాణ బాధ్యతలు అప్పగించగా.. ఎమ్మెల్సీ ఎంవీఎస్ మూర్తి చేపట్టిన ఉద్యమంతో ప్రభుత్వం వెనక్కి తగ్గడం తెలిసిందే. ఈ వివాదాన్ని పరిష్కరించేందుకే గత నెలలో కమిటీని నియమిస్తూ ప్రభుత్వం జీవో కూడా జారీ చేసింది. ఇలాంటి కంపెనీ ఇండియన్ బ్యాంకు నుంచి తీసుకున్న రుణాన్ని ఎగవేయడం, హామీదారులుగా ఉన్న గంటాతోపాటు ఆయన బంధువులైన డైరెక్టర్ల ఆస్తుల్నీ స్వాధీనం చేసుకుంటున్నట్టుగా ప్రకటన జారీకావడం సంచలనం రేకెత్తించింది. గ్యారంటీర్నే గానీ.. డిఫాల్టర్‌ను కాను ప్రత్యూష కంపెనీలో ఒకప్పుడు నేను డైరెక్టర్‌గా వ్యవహరించిన మాట వాస్తవమే. కానీ ప్రస్తుతం ఆ కంపెనీతో నాకెలాంటి వ్యాపార లావాదేవీలు లేవు. ఆ కంపెనీ ఇండియన్ బ్యాంకులో తీసుకున్న రుణాలకు గ్యారంటీర్‌గా ఉన్నాను. రుణ బకాయిలు చెల్లిం చకపోవడంతో కంపెనీ డైరెక్టర్లతోపాటు గ్యారం టర్గా ఉన్న నాకు కూడా నోటీసులిచ్చారు. రుణ బకాయిS చెల్లింపుల విషయంలో డైరెక్టర్లతో మాట్లాడతా.. బకాయిలు చెల్లించాలని కోరతా. – సాక్షితో గంటా శ్రీనివాసరావు, ఏపీ మంత్రి -
ఇండియన్ బ్యాంక్ ముందు డ్వాక్రా మహిళల ధర్నా
గొల్లపల్లి(నూజివీడురూరల్) : బ్యాంకర్ల వైఖరిని నిరసిస్తూ డ్వాక్రా మహిళలు గురువారం గొల్లపల్లిలోని ఇండియన్ బ్యాంక్ ముందు ధర్నాకు దిగారు. బ్యాంక్ గేట్లను మూసేసి సిబ్బందిని కార్యాలయంలోకి వెళ్లనీయకుండా అడ్డుకున్నారు. గొల్లపల్లిలోని ఇండియన్ బ్యాంక్ పరిధిలో గొల్లపల్లి, మీర్జాపురం, మొర్సపూడి, పోలసానిపల్లి, కొత్తపల్లి గ్రామాలున్నాయి. ఏడాదిన్నర కిందట బ్యాంక్ మేనేజర్‌గా పనిచేసిన విజయ్‌వర్దన్ డ్వాక్రా మహిళల అమాయకత్వాన్ని ఆసరా చేసుకోని 145 డ్వాక్రా గ్రూపుల వారు చెల్లించిన సొమ్మును సొంత ఖాతాకి జమచేసుకున్నారని ఆరోపించారు. రుణాలు మంజూరు చేయకుండానే ఇచ్చినట్లు చూపించి బలవంతంగా కట్టించారు. ఈ విషయాన్ని బ్యాంక్ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లగా విచారించి రూ.కోటీ 74 లక్షలు స్వాహా అయినట్లు నిర్దారించారన్నారు. ప్రస్తుతం మేనేజర్ నాగిరెడ్డి సమస్య పరిష్కరించకుండా కాలయాపన చేస్తున్నారని వాపోతున్నారు. తమ సమస్యలు పరిష్కారం అయ్యే వరకు ధర్నా విరమించేది లేదని మహిళలు భీష్మించుకున్నారు. సీపీఎం మండల కార్యదర్శి సీహెచ్ రామారావు డ్వాక్రా మహిళల ఆందోళనకు మద్దతు తెలిపారు. ఇండియన్ బ్యాంక్ జోనల్ మేనేజర్ శ్రీనివాసరావు గొల్లపల్లి విచ్చేసి ధర్నా చేస్తున్న వారితో చర్చలు జరిపారు. ఈనెల 20వ తేదీలోగా డ్వాక్రా మహిళల సమస్యలన్నింటిని పరిష్కరిస్తామని తెలిపారు. అర్హత ఉన్న ప్రతి గ్రూపునకు నూతనంగా రుణాలు మంజూరు చేస్తామని తెలపడంతో శాంతించారు. అప్పటి వరకు చెట్ల నీడలో కూర్చున్న సిబ్బంది బ్యాంక్ లోపలికి వెళ్లారు. సీపీఎం నాయకులు ఎన్ నరసింహారావు, డి.రవి తదితరులు పాల్గొన్నారు. 08ఎన్జడ్డి202 : గొల్లపల్లిలో ఇండియన్ బ్యాంక్ ముందు ధర్నా చేస్తున్న మహిళలు -
అసిస్టెంట్ బ్యాంక్ మేనేజర్ ఆత్మహత్య
పెదపాడు : అసిస్టెంట్ బ్యాంక్ మేనేజర్ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన పశ్చిమగోదావరి జిల్లాలో చోటుచేసుకుంది. పెదపాడుకు చెందిన లంకపల్లి శాంతిప్రియ(26) ఇండియన్ బ్యాంకులో అసిస్టెంట్ మేనేజర్‌గా పనిచేస్తుంది. స్థానిక విఘ్నేశ్వరస్వామి ఆలయం సమీపంలో తల్లిదండ్రులతో కలిసి ఉంటోంది. ఆమె శనివారం మధ్యాహ్నం ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆమె బలవన్మరణానికి అనారోగ్య సమస్యలే కారణమని కుటుంబసభ్యులు తెలిపారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. -
బ్యాంకు సేవలు భేష్
శ్రీకాకుళం అర్బన్: సామాన్యుడికి కూడా బ్యాంకు సేవలు అందుబాటులోకి తేవడం అభినందనీయమని సెట్‌శ్రీ సీఈవో వీవీఆర్‌ఎస్ మూర్తి అన్నారు. శ్రీకాకుళం అంబేడ్కర్ కూడలి వద్దనున్న ఇండియన్ బ్యాంకు ఆధ్వర్యంలో శనివారం మెగా హోమ్‌లోన్ మేళా నిర్వహించారు. బ్యాంకు సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఖాతాదారులను కోరారు. ఇండియన్ బ్యాంక్ చీఫ్ మేనేజర్ ఎం.సత్యసాగర్ మాట్లాడుతూ బ్యాంకు పథకాలు, రుణాల వివరాలను వెల్లడించారు. క్రెడాయ్ సంస్థ ప్రతినిధి గురుగుబెల్లి రాజు మాట్లాడుతూ బ్యాంకులు ఆధునిక టెక్నాలజీని అందిపుచ్చుకుని సామాన్య ఖాతాదారులకు సులభతర సేవలు అందజేయాలని కోరారు. ఈ సందర్భంగా ఇండియన్ బ్యాంకు శాఖ తరఫున 42 మంది లబ్ధిదారులకు రూ.8.28 కోట్ల రుణాలు అందజేశారు. కార్యక్రమంలో ఇండియన్ బ్యాంక్ జోనల్ కార్యాలయ సీనియర్ మేనేజర్ రమేష్ చంద్ర, బ్యాంకు అధికారులు ఎం.శ్రీనివాసరావు, సాంబమూర్తి, ధనుంజయ, నాగభూషణ్, వెంకటేశ్వరరావు, ప్రియదర్శిని, శాస్త్రి, భాషా, ప్రభాకర్, రమేష్, శంకరరావు తదితరులు పాల్గొన్నారు. -
ఇండియన్ బ్యాంక్ లాభం రూ. 307 కోట్లు
ఏడాది గరిష్ట స్థాయికి షేర్ ధర చెన్నై: ప్రభుత్వ రంగ ఇండియన్ బ్యాంక్ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక కాలంలో 43 శాతం పెరిగింది. గత ఆర్థిక సంవత్సరం క్యూ1లో స్టాండ్ అలోన్ ప్రాతిపదికన రూ.215 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ1లో రూ.307 కోట్లకు పెరిగిందని ఇండియన్ బ్యాంక్ తెలిపింది. మొత్తం ఆదాయం రూ.4,495 కోట్ల నుంచి రూ.4,513 కోట్లకు పెరిగినట్లు బ్యాంక్ ఎండీ, సీఈఓ మహేశ్ కుమార్ జైన్ చెప్పారు. క్యాపిటల్ అడెక్వసీ రేషియో, రుణ నాణ్యత అంశాల్లో మంచి పనితీరును కనబరిచామన్నారు. నికర మొండి బకాయిలు 2.62 శాతం నుంచి 4.48 శాతానికి పెరిగాయని, మొండి బకాయిలకు కేటాయింపులు రూ.408 కోట్ల నుంచి రూ.416 కోట్లకు పెంచామని వివరించారు. నికర వడ్డీ మార్జిన్ 2.36 శాతం నుంచి 2.47 శాతానికి పెరిగిందని తెలిపారు. ఈ ఏడాది జూన్ 30 నాటికి క్యాపిటల్ అడెక్వసీ రేషియో 13.98 శాతంగా ఉందని తెలియజేశారు. కాగా, రూ.1,000 కోట్ల వరకూ నిధులు సమీకరించనున్నామని ఇండియన్ బ్యాంక్ తెలిపింది. మంగళవారం జరిగిన డెరైక్టర్ల బోర్డ్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నామని తెఇపింది. ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో బ్యాంక్ షేర్ 20% లాభపడి ఏడాది గరిష్ట స్థాయి, రూ.186 వద్ద ముగిసింది. -
ఇండియన్ బ్యాంక్‌లో అగ్నిప్రమాదం
పాలసముద్రం: తమిళనాడులోని తిరువనూరు జిల్లా ఆమ్మవారికుప్పం గ్రామంలోని ఇండియన్ బ్యాంక్‌లో సోమవారం ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ప్రమాదవశాత్తు బ్యాంక్‌లో అగ్నిప్రమాదం జరగడంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఇది గుర్తించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో.. రంగంలోకి దిగిన సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకురావడానికి తీవ్రంగా ప్రయత్నించారు. ఈ ప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం వాటిల్లినట్లు సమాచారం. -
ఇండియన్ బ్యాంక్ రూ. 1.5 డివిడెండ్
న్యూఢిల్లీ: ఇండియన్ బ్యాంక్ గత ఆర్థిక సంవత్సరానికి ఒక్కో షేర్‌కు రూ.1.5 (15 శాతం) డివిడెండ్‌ను ఇవ్వనున్నది. ఈ మేరకు తమ డెరైక్టర్ల బోర్డ్ నిర్ణయించిందని ఇండియన్ బ్యాంక్ తెలిపింది. ఈ నెల 22న వాటాదారులకు ఈ డివిడెండ్ చెల్లిస్తామని పేర్కొంది. -
ఇండియన్ బ్యాంక్ వడ్డీరేట్లు తగ్గింపు
గృహ, వాహన రుణాలపై 0.20% కోత చెన్నై: ప్రభుత్వ రంగంలోని ఇండియన్ బ్యాంక్ గృహ, వాహన రుణాలపై వడ్డీరేట్లను 0.20 శాతం వరకూ తగ్గించింది. ఈ తగ్గింపు తక్షణం అమల్లోకి వస్తుందని ఇండియన్ బ్యాంక్ తెలి పింది. రూ.75 లక్షల గృహరుణాలపై వడ్డీరేటును 9.65 శాతం నుంచి 9.55 శాతానికి, రూ.75 లక్షలకు మించిన రుణాలపై రేటును 9.90% నుంచి 9.75%కి తగ్గించామని పేర్కొ ంది. ఇక కొత్త కార్ల కొనుగోళ్లకు ఇచ్చే రుణాలపై వడ్డీరేట్లను 10.15 శాతం నుంచి 9.95 శాతానికి తగ్గించామని ఇండియన్ బ్యాంక్ వివరించింది. -
ఇండియన్ బ్యాంక్ డిపాజిట్ల రేట్లలో మార్పులు
చెన్నై: ప్రభుత్వ రంగ ఇండియన్ బ్యాంక్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను సవరించింది. ఏడాది కాల వ్యవధి టర్మ్ డిపాజిట్లపై వడ్డీ రేటును 15 బేసిస్ పాయింట్ల మేర పెంచింది. ఇతర టర్మ్ డిపాజిట్లపై కాల వ్యవధిని బట్టి రేటును 25-50 బేసిస్ పాయింట్ల దాకా తగ్గించింది. ఇవి తక్షణం అమల్లోకి వస్తాయని బ్యాంకు తెలిపింది. -
ఆమె పరీక్ష రాస్తే ఉద్యోగమే..
ఇండియన్ బ్యాంకు పీవోగా ఎంపికైన నేహ జైనథ్ : చాలా మంది యువతీయువకులు ప్రభుత్వ ఉద్యోగాలు లేవని, చదివినా రావని నిరాశ చెందుతారు. కానీ మనసు పెట్టి చదివితే ఏ శాఖలోనై ఉద్యోగం సాధించవచ్చ ని చాలా మంది నిరూపించారు. ఆ కోవకి చెందిందే ఈ అమ్మాయి. పేరు డి.నేహ. జైనథ్ ఎంపీడీవో డి.రామకృష్ణ కూతురు. ఆదిలాబాద్‌కు చెందిన ఈమె బీఎస్సీ బయోటెక్నాలజీ చదివింది. ఆ రంగంలో ఇంకా పెద్దగా ప్రభుత్వ ఉద్యోగాలు లేకపోవడంతో బ్యాంకింగ్ వైపు వెళ్లింది. గత రెండు సంవత్సరాల్లో మొత్తం నాలుగు బ్యాంకుల్లో ఉద్యో గం సాధించింది. మొదట ఆర్ఆర్బీ రీజనల్ రూరల్ బ్యాంకులో, తర్వాత పంజాబ్ నేషనల్ బ్యాంకులో క్లర్క్‌గా ఎంపికైంది. ప్రస్తుతం నేహ మహారాష్ట్రలోని ఎస్బీహెచ్ పర్బానీ శాఖలో క్లర్కుగా పనిచేస్తోంది. దీంతో ఆమె తన ప్రిపరేషన్ ఆపకుండా ప్రొబేషనరీ ఆఫీసర్ కావాలనే లక్ష్యంతో ఓ వైపు ఉద్యోగం చేస్తూనే మరో వైపు ఐబీపీఎస్ పీవో పరీక్ష సిద్ధమైంది. ఈ మధ్యనే విడుదలైన పరీక్ష ఫలితాల్లో ఇండియన్ బ్యాంకు పీవోగా ఎంపికైంది. తమ కూతురు చిన్ననాటి నుంచే చదువులో ముందుండేదని, క్లర్క్‌గా ఉద్యోగం చేస్తూనే పీవోకు ఎంపిక కావడం సంతోషంగా ఉందని ఎంపీడీవో దంపతులు ఉబ్బితబ్చిపోయూరు. -
ప్రభుత్వ రంగ బ్యాంకులకు త్వరలో రూ.5,050 కోట్లు
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకులకు త్వరలో కేంద్రం రూ.5,050 కోట్ల అదనపు మూలధనాన్ని సమకూర్చనుంది.సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంక్, యుకో బ్యాంక్, ఓరియెంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, విజయా బ్యాంక్, యునెటైడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సిండికేట్ బ్యాంక్‌లకు తాజా మూలధనం అందే అవకాశం ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రూ.25,000 కోట్ల మూలధనం బ్యాంకింగ్‌కు అందించాలన్నది ప్రణాళిక. ఇందులో భాగంగా ఇప్పటికే కేంద్రం 13 బ్యాంకులకు రూ.19,950 కోట్ల మూలధనం అందించింది. సిండికేట్, యుకో బ్యాంక్‌లకు రూ.1,675 కోట్లు: కాగా2015-16 మూలధన ప్రణాళిక కింద ప్రభుత్వానికి ప్రిఫరెన్షియల్ ప్రాతిపదికన షేర్ల జారీ ద్వారా సిండికేట్ బ్యాంక్, యుకో బ్యాంకులు రూ.1,675 కోట్లు పొందనున్నాయి. షేర్ల జారీ ద్వారా రూ.935 కోట్లు సమీకరించుకోనున్నట్లు యుకో బ్యాంక్ పేర్కొంది. సిండికేట్ బ్యాంక్ విషయంలో ఈ మొత్తం రూ.740 కోట్లుగా ఉంది. -
ఏటీఎం చోరీకి విఫలయత్నం
శ్రీకాకుళం: శ్రీకాకుళం పట్టణంలోని అంబేద్కర్ సెంటర్ వద్ద ఉన్న ఏటీఎంలో బుధవారం అర్థరాత్రి చోరీ యత్నం జరిగింది. సెంటర్లో ఉన్న ఇండియన్ బ్యాంకు ఏటీఎంలోకి గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు ప్రవేశించి మిషన్‌ను తెరిచేందుకు యత్నించారు. వారి ప్రయత్నం ఫలించకపోవటంతో దుండగులు పరారయ్యారు. గురువారం ఉదయం గమనించిన స్థానికులు సిబ్బందికి సమాచారం అందించారు. ఈ మేరకు బ్యాంకు మేనేజర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఏటీఎంలోని సీసీఫుటేజిని పరిశీలిస్తున్నారు. -
ఇండియన్ బ్యాంకులో చోరీకి యత్నం
హళహర్వి: కర్నూలు జిల్లా హళహర్వి మండలకేంద్రంలోని ఇండియన్ బ్యాంకు శాఖలో గురువారం వేకువజామున చోరీ యత్నం జరిగింది. ముసుగు ధరించిన ముగ్గురు వ్యక్తులు షట్టర్ లేపి బ్యాంకులోకి ప్రవేశించారు. తాళాలు పగులగొట్టి రూంలోని లాకర్‌ను తెరిచేందుకు ప్రయత్నించారు. అది వీలుకాకపోవటంతో ఫర్నిచర్‌ను ధ్వంసం చేసి వెనుదిరిగారు. ఉదయం గమనించిన సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. వారు సంఘటన స్థలానికి చేరుకుని, సీసీ ఫుటేజిని పరిశీలిస్తున్నారు. -
నాలుగు పీఎస్‌యూ బ్యాంకులకు కొత్త చీఫ్‌లు...
ఆంధ్రాబ్యాంక్, ఇండియన్ బ్యాంక్ చీఫ్లుగా ఇప్పటికే బాధ్యతల స్వీకారం న్యూఢిల్లీ: ఆంధ్రాబ్యాంక్సహా నాలుగు ప్రభుత్వ రంగ బ్యాంకులకు ప్రభుత్వం మేనేజింగ్ డెరైక్టర్లను నియమించింది. వివరాల్లోకి వెళితే... ఆంధ్రాబ్యాంక్: హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ఆంధ్రాబ్యాంక్ మేనేజింగ్ డెరైక్టర్‌గా సురేష్ ఎన్ పటేల్ నియమితులయ్యారు. ఇప్పటివరకూ ఆయన ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ ఎండీగా పనిచేశారు. ఇప్పటికే ఆయన బాధ్యతలు స్వీకరించారు.యూకో బ్యాంక్: దేనా బ్యాంక్ ఈడీ ఆర్కే టాకూర్ ఇకపై కోల్‌కతా కేంద్రంగా పనిచేస్తున్న యుకో బ్యాంక్ ఎండీగా బాధ్యతలు చేపట్టనున్నారు. కార్పొరేషన్ బ్యాంక్: ఈ బ్యాంక్ ఎండీగా జేకే గార్గ్ నియమితులయ్యారు. ప్రస్తుతం సీఎండీగా బాధ్యతలు నిర్వహిస్తున్న ఎస్ఆర్ బన్సల్ జనవరిలో పదవీ విరమణ చేస్తారు. ఇండియన్ బ్యాంక్: ప్రస్తుతం బ్యాంక్ ఈడీగా పనిచేస్తున్న మహేశ్ కుమార్ జైన్ ఎండీ, సీఈఓగా పదోన్నతి పొందారు. బాధ్యతలు స్వీకరించే నాటి నుంచీ మూడేళ్లు లేదా పదవీ విరమణ లేదా తదుపరి ఉత్తర్వుల వరకూ (ఏది ముందయితే అది) ఆయన ఈ బాధ్యతలు నిర్వహిస్తారని బ్యాంక్ ఒక ప్రకటనలో తెలిపింది. నవంబర్ 2వ తేదీన ఆయన బ్యాంక్ ఎండీగా బాధ్యతలు స్వీకరించినట్లు పేర్కొంది. -
ఇండియన్ బ్యాంక్ లాభం 18% వృద్ధి
చెన్నై: ఇండియన్ బ్యాంక్ ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక కాలంలో రూ.369 కోట్ల నికర లాభం ఆర్జించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్‌కు సాధించిన నికర లాభం(రూ.314 కోట్లు)తో పోల్చితే 18 శాతం వృద్ధి సాధించామని ఇండియన్ బ్యాంక్ పేర్కొంది. గత క్యూ2లో రూ.4,340 కోట్లుగా ఉన్న మొత్తం ఆదాయం ఈ క్యూ2లో రూ.4,579 కోట్లకు పెరిగిందని వివరించింది. స్థూల మొండిబకాయిలు 4.21 శాతం నుంచి 4.61 శాతానికి, నికర మొండిబకాయిలు 2.55 శాతం నుంచి 2.6 శాతానికి పెరిగాయని పేర్కొంది. గత క్యూ2లో రూ.287 కోట్లుగా ఉన్న మొండిబకాయిలకు కేటాయింపులు ఈ క్యూ2లో రూ.137 కోట్లకు తగ్గాయని ఈ ఆర్థిక సంవత్సరం మొదటి ఆరునెలల కాలంలో రూ. 585 కోట్ల నికర లాభం ఆర్జించామని, గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలానికి నికర లాభం రూ.521 కోట్లని పేర్కొంది. మొత్తం ఆదాయం రూ.8,484 కోట్ల నుంచి రూ.9,073 కోట్లకు పెరిగిందని వివరించింది. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో ఇండియన్ బ్యాంక్ షేర్ బీఎస్ఈలో 6% లాభంతో రూ.133 వద్ద ముగిసింది. -
ఇండియన్ బ్యాంక్ గృహ, వాహన రుణమేళా
- ఈ నెల 27 నుంచి వచ్చే నెల 5 వరకూ హైదరాబాద్: ఇండియన్ బ్యాంక్ గృహ, వాహన రుణ మేళాను భారీ స్థాయిలో నిర్వహిస్తోంది. హైదరాబాద్, సికింద్రాబాద్, రంగారెడ్డిల్లోని మొత్తం 46 బ్రాంచ్‌ల్లో ఈ నెల 27 నుంచి వచ్చే నెల 11 వరకూ భారీ రుణ మేళాను నిర్వహిస్తున్నామని ఇండియన్ బ్యాంక్ ఒక ప్రకటనలో తెలిపింది. గృహ రుణాలను 9.65 శాతం వడ్డీరేటుకే ఆఫర్ చేస్తున్నామని, ఎలాంటి ప్రాసెసింగ్ చార్జీలుండవని పేర్కొంది. వాహన రుణాలను 10 శాతం రేటుకే ఇస్తున్నామని తెలిపింది. ఖాతాదారులందరు ఈ ఆఫర్లను వినియోగించుకోవాలని కోరింది. దేశావ్యాప్తంగా 2,521 బ్రాంచీలను నిర్వహిస్తున్నామని, ఇప్పటివరకూ రూ.3 లక్షల కోట్ల వ్యాపారాన్ని నిర్వహించామని ఇండియన్ బ్యాంక్ తెలిపింది. -
బూడిదగా మారిన ఏటీఎం కేంద్రం
పెదవేగి (పశ్చిమ గోదావరి) : పశ్చిమ గోదావరి జిల్లా పెదవేగి మండల కేంద్రంలో ఓ బ్యాంకు ఏటీఎం అగ్ని ప్రమాదంలో పూర్తిగా దగ్ధం అయింది. మండల తహశీల్దార్ కార్యాలయం వద్దనున్న ఇండియన్ బ్యాంకు ఏటీఎంలో గురువారం అర్ధరాత్రి 1.30 గంటలకు విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కావడంతో అగ్ని ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. మంటలకు ఏటీఎం కేంద్రంలో ఏమీ మిగలకుండా అంతా బూడిదగా మారింది. శుక్రవారం తెల్లవారుజామున గమనించిన స్థానికులు అధికారులకు సమాచారం ఇచ్చారు. బ్యాంకు మేనేజర్ చాంబర్ కూడా కొద్ది మేర దగ్ధం అయినట్టు తెలుస్తోంది. కాగా ఏటీఎం యంత్రంలో నగదు ఎంత ఉన్నదనే విషయం తెలుసుకోవడానికి బ్యాంకు సిబ్బంది ప్రయత్నం చేస్తున్నారు. -
ఇండియన్ బ్యాంక్ డిపాజిట్ రేట్లు తగ్గింపు
చెన్నై: ప్రభుత్వ రంగ ఇండియన్ బ్యాంక్ డిపాజిట్ రేట్లను 25 - 50 బేసిస్ పాయింట్ల మేర తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. కొత్త రేట్లు సెప్టెంబర్ 11 నుంచి (నేటి నుంచి) అమల్లోకి వస్తాయని తెలిపింది. దీని ప్రకారం 181 రోజుల పైబడిన కాలవ్యవధికి సంబంధించి టర్మ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పావు నుంచి అరశాతం దాకా తగ్గించినట్లు బ్యాంక్ పేర్కొంది. -
ఇండియన్ బ్యాంక్.. మొబైల్ యాప్
ప్రభుత్వ రంగంలోని ఇండియన్ బ్యాంక్ ‘ఇండ్పే’ పేరుతో ఒక మొబైల్ యాప్‌ను ఆవిష్కరించింది. కస్టమర్లు ఎక్కడి నుంచైనా బ్యాంక్ అకౌంట్లను నిర్వహించుకునేందుకు వీలుగా ఈ మొబైల్ అప్లికేషన్ సర్వీస్‌ను ప్రారంభించినట్లు ఇండియన్ బ్యాంక్ ఒక ప్రకటనలో తెలిపింది. విండోస్, ఐఓఎస్ మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్స్, ఆండ్రాయిడ్ ఆధారిత స్మార్ట్ఫోన్ల ద్వారా ఇండ్పే అప్లికేషన్‌ను నిర్వహించుకోవచ్చు. ఈక్విటీలు, మినీ స్టేట్మెంట్లు పొందడం, ఇతర అకౌంట్‌కు నిధుల బదలాయింపు వంటి సేవలను పొందే వీలున్న ఈ యాప్‌ను బ్యాంక్ ఎండీ సీఈఓ ఎంకే జైన్ ఆవిష్కరించిన్నట్లు ప్రకటన తెలిపింది. -
ఇండియన్ బ్యాంక్ నుంచి మొబైల్ యాప్
చెన్నై : తమ కస్టమర్ల సౌకర్యార్థం ఓ ప్రభుత్వ బ్యాంక్ మొబైల్ యాప్ విడుదల చేసింది. ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ సీఈఓ ఎమ్కె జైన్ ఈ యాప్‌ను ఆవిష్కరించారు. ఇండియన్ బ్యాంక్ జాతీయం చేయబడిన ఓ బ్యాంక్. ఈ మొబైల్ యాప్ ద్వారా మనం ఎక్కడినుంచైనా బ్యాంకు ఖాతాలను నిర్వహించుకునే అవకాశం ఉంది. ఐఎన్డీపే(IndPay) అనే యాప్ ను ఇండియన్ బ్యాంకు వారు ప్రారంభించారు. ఆండ్రాయిడ్, విండోస్, ఐఓఎస్ మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉన్న స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు ఈ యాప్‌ను సులభంగా ఉపయోగించుకోవచ్చని ఆసంస్థ వెల్లడించింది. సమాచారం తెలుసుకోవడానికి, మిని స్టేట్మెంట్, ఒక ఖాతా నుంచి మరో ఖాతాకు నగదు బదిలీలు వంటి సౌకర్యాలు ఈ యాప్ ద్వారా అందుబాటులోకి వచ్చాయి. -
ఫడరల్ బ్యాంక్ బేస్‌రేట్ తగ్గింపు
ఈ నెల 18 నుంచి వర్తింపు న్యూఢిల్లీ: ఫెడరల్ బ్యాంక్ బేస్‌రేటును పావు శాతం తగ్గించింది. 10.2 శాతంగా ఉన్న బేస్‌రేట్‌ను 9.95 శాతానికి తగ్గించామని ఫెడరల్ బ్యాంక్ తెలిపింది. ఈ తగ్గింపు ఈ నెల 18 నుంచి వర్తిస్తుందని పేర్కొంది. కీలక రేట్లను ఇటీవల ఆర్బీఐ పావు శాతం మేర తగ్గించిన నేపథ్యంలో పలు బ్యాంకులు బేస్‌రేట్‌ను తగ్గించాయి. ఎస్బీఐ, అలహాబాద్ బ్యాంక్, దేనా బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సిండికేట్ బ్యాంక్‌లు ఇప్పటికే బేస్‌రేట్‌ను తగ్గించిన విషయం తెలిసిందే. బేస్ రేట్ తగ్గింపు నేపథ్యంలో ఫెడరల్ బ్యాంక్ షేర్ 1.6 శాతం నష్టపోయి రూ.133 వద్ద ముగిసింది. ఇండియన్ బ్యాంక్ తగ్గింపు 30 బేసిస్ పాయింట్లు ఇండియన్ బ్యాంక్ బేస్‌రేట్‌ను, బెంచ్‌మార్క్ ప్రైమ్ లెండింగ్ రేట్(బీపీఎల్ఆర్)ను చెరో 30 బేసిస్ పాయింట్లు చొప్పున తగ్గించింది. 10.25 శాతంగా ఉన్న బేస్‌రేట్‌ను 9.95 శాతానికి, అలాగే బీపీఎల్ఆర్ను 14.50 శాతం నుంచి 14.2 శాతానికి తగ్గించామని ఇండియన్ బ్యాంక్ తెలిపింది. ఈ తగ్గింపు సోమవారం నుంచే వర్తిస్తుందని పేర్కొంది. బీఎస్ఈలో ఈ షేర్ 3.6 శాతం నష్టపోయి రూ.146 వద్ద ముగిసింది. -
ఆంధ్రాబ్యాంక్ బేస్ రేటు పావు శాతం కట్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : ఆంధ్రాబ్యాంక్ బేస్ రేటును పావు శాతం తగ్గించింది. ప్రస్తుతం 10.25 శాతంగా ఉన్న బేస్ రేటును 10 శాతానికి తగ్గించింది. ఈ తగ్గిన వడ్డీరేట్లు జూన్ 11 నుంచి అమల్లోకి వస్తాయని బ్యాంకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. ఇదేవిధంగా బీఎమ్పీఎల్ఆర్ రేటును 14.5 శాతం నుంచి 14.25 శాతానికి తగ్గించింది. ఈ మేరకు తీసుకున్న రుణాలపై ఈఎంఐ భారం తగ్గనుంది. ఇండియన్ బ్యాంక్ రుణ రేటు తగ్గింపు.. న్యూఢిల్లీ: ఇండియన్ బ్యాంక్ కనీస రుణ రేటు(బేస్ రేట్)ను 0.30 శాతం తగ్గించింది. దీనితో ఈ రేటు 10.25 శాతం నుంచి 9.95 శాతానికి తగ్గింది. కొత్త రేటు జూన్ 8 నుంచీ అమల్లోకి వస్తుంది. దీనితో బేస్‌రేటుకు అనుసంధానమయ్యే గృహ, వాహన, విద్యా, వాణిజ్య రుణ రేట్లు తగ్గే అవకాశం ఉంది. యూబీ డిపాజిట్ రేటు తగ్గింపు కాగా రుణ రేటు తగ్గింపునకు సంకేతంగా భావించే డిపాజిట్ రేటు కోత నిర్ణయాన్ని యునెటైడ్ బ్యాంక్ (యూబీ) తీసుకుంది. పలు మెచ్యూరిటీలపై డిపాజిట్ రేట్లను పావుశాతం మేర తగ్గించినట్లు బ్యాంక్ ఒక ప్రకటనలో తెలిపింది. ఏడాది డిపాజిట్ రేటును 8 శాతానికి తగ్గించింది. ఏడాది పైన డిపాజిట్ రేటును 7.75 శాతానికి కుదించింది. తాజా రేట్లు జూన్ 8 నుంచీ అమల్లోకి వస్తాయని తెలిపింది. పీఎన్బీ, యాక్సిస్ బ్యాంక్‌లు బుధవారమే డిపాజిట్ రేట్లను తగ్గించాయి. ఇదే దారిలో మరికొన్ని బ్యాంకులు... రిజర్వ్ బ్యాంక్ జూన్ 2 రెపో రేటు కోత నేపథ్యంలో పలు బ్యాంకులు డిపాజిట్ రేట్ల కోత నిర్ణయం తీసుకుంటున్నాయి. జూన్ 2నే ఐడీబీఐ బ్యాంక్ డిపాజిట్ రేట్లను తగ్గించింది. ఇక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, అలహాబాద్ బ్యాంక్, దేనాబ్యాంక్, పంజాబ్ అండ్ సింద్ బ్యాంక్‌లూ జూన్ 2నే కనీస రుణ రేటును తగ్గించాయి. పోటీ పూర్వక వాతావరణం నేపథ్యంలో మరిన్ని బ్యాంకులు సైతం రుణ, డిపాజిట్ రేట్ల తగ్గింపు దశలో నిర్ణయం తీసుకుంటాయని భావిస్తున్నారు. -
ప్రపంచ టాప్-50లో హెచ్డీఎఫ్సీ బ్యాంక్
అత్యంత విలువైన బ్యాంకుల జాబితాలో 45వ స్థానం న్యూఢిల్లీ: ప్రపంచంలోని అత్యంత విలువైన బ్యాంకుల జాబితా(2014 ఏడాదికి)లో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ చోటు దక్కించుకుంది. మార్కెట్ విలువ ఆధారంగా రెల్‌బ్యాంక్స్ ఈ టాప్-50 జాబితాను రూపొందించింది. 40.58 బిలియన్ డాలర్ల మార్కెట్ విలువతో హెచ్డీఎఫ్సీ 45వ స్థానంలో నిలిచింది. అంతేకాకుండా టాప్-50లోని ఏకైక భారతీయ బ్యాంక్ ఇదే కావడం గమనార్హం. ఇక అమెరికాకు చెందిన వెల్స్‌ఫార్గో ప్రపంచ నంబర్ వన్ ర్యాంకును చేజిక్కించుకుంది. 7 కోట్ల మందికిపైగా కస్టమర్లు, 9,000కు పైగా శాఖలు... 284 బిలియన్ డాలర్ల మార్కెట్ విలువతో ఈ బ్యాంక్ అగ్రస్థానంలో ఉంది. దీని తర్వాత ర్యాంకుల్లో ఇండస్ట్రియల్ అండ్ కమర్షియల్ బ్యాంక్ ఆఫ్ చైనా(మార్కెట్ విలువ 270 బిలియన్ డాలర్లు), జేపీ మెర్గాన్ చేజ్(234 బిలియన్ డాలర్లు) ఉన్నాయి. టాప్-10 బ్యాంకుల్లో అమెరికా, చైనాలకు చెందినవి చెరో నాలుగు బ్యాంకులు కాగా, బ్రిటన్, ఆస్ట్రేలియా నుంచి ఒక్కో బ్యాంక్ స్థానం పొందాయి. ఇక భారత్ నుంచి ఎస్బీఐ(36 బిలియన్ డాలర్లు) 51వ స్థానం, ఐసీఐసీఐ బ్యాంక్ 55వ ర్యాంకు(33 బిలియన్ డాలర్లు)ల్లో నిలిచాయి. కాగా, 2014 సెప్టెంబర్‌తో ముగిసిన రెండో త్రైమాసికంలో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ నికరలాభం 20% వృద్ధి తో 2,381.5 కోట్లకు చేరింది. వరుసగా 37 క్వార్టర్లలో 30%పైగా లాభాల్ని పెంచుకున్న ఈ బ్యాంక్ గత 5 క్వార్టర్లలో 30%లోపు వృద్ధిని నమోదు చేసింది. -
స్టాక్స్ వ్యూ
ఇండియన్ బ్యాంక్ బ్రోకరేజ్ సంస్థ: ఐసీఐసీఐ డెరైక్ట్ ప్రస్తుత మార్కెట్ ధర: రూ.210 టార్గెట్ ధర: రూ. 245 ఎందుకంటే: తమిళనాడులో అధిక శాఖలున్న దక్షిణాది ప్రభుత్వ రంగ బ్యాంక్ ఇది. అత్యధిక ప్రభుత్వ వాటా (81 శాతం) ఉన్న పీఎస్ బ్యాంక్ కూడా ఇదే. 2010-14 కాలానికి రుణాలు 19 శాతం, డిపాజిట్లు 16 శాతం చొప్పున చక్రగతిన వృద్ధి సాధించాయి. 2013-14 ఆర్థిక సంవత్సరం చివరి నాటికి మొత్తం 1,24,359 కోట్ల రుణాలిచ్చింది. వీటిలో కార్పొరేట్ రుణాలు 52 శాతం, వ్యవసాయ రుణాలు 15 శాతం, రిటైల్, ఎస్ఎంఈ రుణాలు చెరో 13 శాతంగా ఉన్నాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో రుణ వృద్ధి10-12 శాతం రేంజ్లో ఉండొచ్చని బ్యాంక్ అంచనా వేస్తోంది. దేశీయంగా ఆర్థిక పరిస్థితులు బాగా లేకపోవడంతో కార్పొరేట్ రుణాలు తగ్గించి, రిటైల్, ఎస్ఎంఈ రుణాలు ఎక్కువగా ఇవ్వాలని బ్యాంక్ నిర్ణయించింది. దేశీయ కాసా వాటా 28 శాతంగా ఉంది. దక్షిణాదిపైననే అధికంగా దృష్టి కేంద్రీకరించాలని నిర్ణయించిన ఈ బ్యాంక్ ప్రతీ ఏటా 115 కొత్త బ్యాంక్ శాఖలను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. 2008-09 ఆర్థిక సంవత్సరంలో రూ.1,245 కోట్లుగా ఉన్న నికర లాభం 2011-12 ఆర్థిక సంవత్సరంలో రూ.1,710 కోట్లకు పెరిగింది. అధిక కేటాయింపులు, డిపాజిట్లపై చెల్లించే అధిక వడ్డీరేట్ల కారణంగా ఆ తర్వాతి రెండు ఆర్థిక సంవత్సరాల్లో నికర లాభం తగ్గింది. నిధుల సమీకరణ వ్యయం తగ్గడం, ట్రేడింగ్ గెయిన్స్ కారణంగా ఈ ఆర్థిక సంవత్సరంలో మంచి నికర లాభం ఆర్జించే అవకాశాలున్నాయి. నికర వడ్డీ మార్జిన్ 3 శాతంగా ఉంది. భవిష్యత్తు వృద్ధికి తోడ్పడే మూలధన నిధులు పుష్కలంగా ఉన్నాయి. హిందుస్తాన్ మీడియా వెంచర్స్ బ్రోకరేజ్ సంస్థ: కోటక్ సెక్యూరిటీస్ ప్రస్తుత మార్కెట్ ధర: రూ.230 టార్గెట్ ధర: రూ.358 ఎందుకంటే: హిందుస్తాన్ మీడియా వెంచర్స్(హెచ్‌ఎంవీఎల్)కు చెందిన హిందుస్తాన్ హిందీ వార్తాపత్రిక భారత్‌లోనే రెండో అతి పెద్ద పత్రిక(ఐఆర్ఎస్-2013 సర్వే). 2011-14 కాలానికి హెచ్‌ఎంవీఎల్ రీడర్షిప్, నిర్వహణ లాభాలు పోటీ పత్రిక సంస్థలతో పోల్చితే పెరిగాయి. ఈ కాలంలో సంస్థ ఇబిటా 20 శాతం చొప్పున చక్రగతిన వృద్ధి సాధించింది. అతి పెద్ద హిందీ ప్రకటనల మార్కెట్ అయిన ఉత్తరప్రదేశ్‌లో చెప్పుకోదగ్గ సర్క్యులేషన్‌ను సాధించింది. ఇది సంస్థ దీర్ఘకాల వృద్ధికి ఇతోధికంగా తోడ్పడుతుంది. ఈ వార్తాపత్రిక ప్రచురిత ప్రాంతాల్లో ఉన్న రాష్ట్రాల్లో(ఢిల్లీ, బీహార్, ఉత్తరప్రదేశ్) త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ కారణంగా రీడర్షిప్ మరింతగా పెరగనున్నది. ఈ అంశాల కారణంగా పరిశ్రమ అంచనాలను మించిన వృద్ధిని హెచ్‌ఎంవీఎల్ సాధిస్తుందని భావిస్తున్నాం. 2014-16 కాలానికి లాభాల్లో వృద్ధి పోటీ సంస్థల కంటే అధికంగా ఉంటుందని అంచనా. ఏడాది కాలానికి ఇబిటా 35%, నికర లాభం 18% చొప్పున వృద్ధి సాధించవచ్చు. మీడియా షేర్లలో ప్రస్తుతం ఆకర్షణీయ ధరల్లో లభిస్తున్న షేర్ ఇదే. డిస్కౌంటెడ్ క్యాష్ ఫ్లో(డీసీఎఫ్) మదింపు ఆధారంగా టార్గెట్ ధరను నిర్ణయించాం. పత్రికా రంగంలో తీవ్ర పోటీ, ముడి పదార్ధాల ధరలు పెరుగుదల వంటివి ప్రతికూలాంశాలు. గమనిక: ఈ కాలమ్‌లో షేర్లపై ఇచ్చిన సలహాలు, సూచనలు, ఇతర వివరాలు వివిధ బ్రోకరేజి సంస్థల నిపుణులు వ్యక్తం చేసిన అభిప్రాయాలు మాత్రమే. -
జనవరిలో బ్యాంకు ఉద్యోగుల సమ్మె
చెన్నై: తమ వేతనాల పెంపుపై సత్వర పరిష్కారాన్ని కోరుతూ బ్యాంకు ఉద్యోగులు జనవరిలో ఐదు రోజుల సమ్మెకు దిగనున్నారు. జనవరి 7న ఒక రోజు సమ్మెతో నిరసన తెలియజేయాలని ఈ నెల 17న ముంబైలో జరిగిన ఉద్యోగ సంఘాల (యూఎఫ్‌బీయూ) భేటీలో నిర్ణయించినట్లు అఖిల భారత బ్యాంకు ఉద్యోగుల సంఘం (ఏఐబీఈఏ) ప్రకటించింది. జనవరి 21 నుంచి 24వ తేదీ వరకు వరుసగా నాలుగు రోజులు సమ్మె తలపెట్టామని, అప్పటికీ పరిష్కారం లభించకుంటే మార్చి 17 నుంచి నిరవధిక సమ్మెకు వెళ్లాలని నిర్ణయించినట్లు పేర్కొంది. వేతన పెంపునపై చర్చల్లో ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ కాలయాపన ధోరణిపై భేటీ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు వెల్లడించింది. -
బీ అలర్ట్
* దోపిడీకి గ్యాస్కట్టర్ల వినియోగం * మొన్న హాలియాలో.. తాజాగా చౌటుప్పల్‌లో.. మొన్న హాలియాలో బ్యాంకు దోపిడీకి.. తాజాగా చౌటుప్పల్‌లోని ఏటీఎంలో చోరీకి యత్నం సంఘటనల నేపథ్యంలో జిల్లాలో తమిళ నాడుకు చెందిన దొంగల ముఠా సంచరిస్తున్నట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. హాలియాలో బ్యాంకు దోపిడీకి దొంగలు గ్యాస్ కట్టర్ ఉపయోగించడం, చౌటుప్పల్‌లోని ఇండియన్ బ్యాంకు ఏటీఎంలో కూడా ఇదే తరహాలో చోరీకి యత్నించడం చూస్తుంటే ఇది పక్కా ప్రొఫెషనల్స్ పనేనని భావిస్తున్నారు. దీంతో ఎస్పీ ప్రభాకర్‌రావు రంగంలోకి దిగి జిల్లా పోలీసు యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. చౌటుప్పల్ మొన్న హాలియాలో బ్యాంకు దోపిడీకి.. నిన్న చౌటుప్పల్‌లో ఏటీఎంలో చోరీకి యత్నం సంఘటనల నేపథ్యంలో ఎస్పీ టి.ప్రభాకర్‌రావు అప్రమత్తమయ్యారు. హాలియాలో బ్యాంకు దోపిడీకి దొంగలు గ్యాస్ కట్టర్ ఉపయోగించడం, చౌటుప్పల్‌లో ఇండియన్ బ్యాంకు ఏటీఎం చోరీలో కూడా గ్యాస్ కట్టర్‌నే వాడడంతో, అక్కడ, ఇక్కడ చోరీలకు పాల్పడుతున్నది ఒకే ముఠాకు చెందిన ప్రొఫెషనల్స్ అని పోలీసులు భావిస్తున్నారు. పోలీసులతో సమీక్ష భువనగిరి సబ్‌డివిజన్‌లోని సీఐలతో ఆదివారం ఎస్పీ చౌటుప్పల్‌లో సమావేశమయ్యారు. దొంగతనాల నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సమీక్షించా రు. దొంగతనాలన్నీ అర్ధరాత్రి ఒంటి గం ట నుంచి తెల్లవారుజామున 4గంటల మధ్య జరుగుతాయని, ఈ సమయంలో పోలీసులతో తప్పనిసరిగా బీట్లు నిర్వహించాలని సూచించారు. ప్రతి బ్యాం కు, ఏటీఎంల వద్ద నోట్‌పుస్తకాలను ఏర్పాటు చేయించి, బీట్‌కు వెళ్లిన కానిస్టేబుల్ తప్పనిసరిగా సంతకం చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. అర్ధరాత్రి ఎవరైనా కనిపిస్తే అనుమానితులుగా అదుపులోకి తీసుకోవాలని సూచించా రు. తమిళనాడుకు చెందిన ప్రొఫెషనల్స్ రాష్ట్రంలోకి ప్రవేశించి, బ్యాంకులు, ఏటీఎంలలో చోరీలకు పాల్పడుతున్నట్టు భా విస్తున్నారు. ఆయన వెంట భువనగిరి డీఎస్పీ శ్రీనివాస్, సీఐలు గట్టుమల్లు, బాలగంగిరెడ్డి, శివరాంరెడ్డి, సతీష్‌రెడ్డి, నరేందర్, శంకర్‌లున్నారు. అసలు మన ఏటీఎంలకు భద్రత ఎంత..? బ్యాంకులు 24 గంటలు ప్రజలకు డబ్బును అందుబాటులో ఉంచేందుకు ఎక్కడపడితే అక్కడ ఏటీఎంలను ఏర్పాటు చేస్తున్నాయి. భవిష్యతులో గ్రామీణ పల్లెలకు కూడా ఏటీఎంలు రానున్నాయి. ఏటీఎంల ఏర్పాటుకు ప్రాధాన్యమిస్తున్న బ్యాంకులు, భద్రతను ఏమాత్రం పట్టించుకోవడం లేదు. అవుట్సోర్సింగ్ ద్వారా ఎక్కువ సంఖ్యలో ఏటీఎంలను ఏర్పాటు చేస్తున్నారు. అవుట్సోర్సింగ్ సిబ్బంది ఏటీఎంలను ఏమాత్రం పర్యవేక్షించడం లేదు. ఏటీఎంలలో డబ్బులు అయిపోతే, పనిచేయనప్పుడు మాత్రమే మెసేజ్ అలర్ట్‌తో వచ్చి,పోతున్నారు. అవుట్సోర్సింగ్ ఏటీఎంలంటూ స్థానికంగా ఉండే బ్యాంకులు తమకేం సంబంధం లేదంటున్నారు. ఎక్కడా సెక్యూరిటీగార్డులను కూడా నియమించడం లేదు. అలారంపనిచేయడం లేదు. సీసీ కెమెరాలది అదే తీరు. ఒకవేళ పనిచేసినా, మనుషులను గుర్తించే పరిస్థితి లేదు. 3:30గంటల పాటు విఫలయత్నం.. చౌటుప్పల్‌లోని ఇండియన్ బ్యాంకు ఏటీఎంలో ఆదివారం తెల్లవారుజామున చోరీకి 3:30గంటల పాటు విఫలయత్నం జరిగింది. పోలీసులు సీసీ కెమెరాలోని ఫుటేజీని విశ్లేషిస్తున్నారు. మాస్క్, జర్కిన్ ధరించిన దొంగ శనివారం అర్ధరాత్రి దాటాక 12గంటల సమయంలో ఏటీఎం షెట్టర్ మూసివేశాడు. 2గంటల సమయంలో గ్యాస్ కట్టర్‌తో ఏటీఎం మిషన్ కింది భాగం తొలగించాడు. అక్కడ నంబరులాక్ ఉండడంతో తెలియక, తెల్లవారుజామున 5:30గంటల పాటు విఫలయత్నం చేసి వెనుదిరిగాడు. ఉదయం స్థానికులు చోరీ జరిగిన విషయాన్ని గుర్తించి, పోలీసులకు సమాచారమివ్వడంతో సీఐ గట్టుమల్లు ఏటీఎంను పరిశీలించారు. టీసీఎస్ ఇన్చార్జి దెయ్యాల పరమేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చౌటుప్పల్లోనే సరిగ్గా నెల రోజుల క్రితం ఎస్బీఐ ఏటీఎంలో చోరీకి యత్నించి విఫలమయ్యారు. ఏడాది క్రితం ఎస్బీహెచ్ ఏటీఎంలో కూడా చోరీకి యత్నించారు. -
రుణమాఫీ జాబితాలో పేర్లు చేర్చండి
మానకొండూర్: రుణమాఫీ జాబితాలో తమ పేర్లు చేర్చాలని డిమాండ్ చేస్తూ మండలంలోని ఈదులగట్టెపల్లి, చెంజర్ల, పోచంపల్లి, ఊటూరు గ్రామాలకు చెందిన రైతులు మంగళవారం మానకొండూర్ యూనియన్ బ్యాంకు ఎదుట ఆందోళనకు దిగారు. మండలంలోని ఆయా గ్రామాలకు చెందిన రైతులు కొన్నేళ్లుగా జిల్లా కేంద్రంలోని ఇండియన్ బ్యాంకు ద్వారా పంట రుణాలను తీసుకుంటున్నారు. ప్రభుత్వం రుణమాఫీ ప్రకటించడంతో తమ రుణాలు మాఫీ అవుతాయని రైతులు భావించారు. అర్హులను ఎంపిక చేసే క్రమంలో అధికారులు ఇటీవల గ్రామాల్లో సామాజిక తనిఖీ చేపట్టారు. ఇండియన్ బ్యాంకులో రుణాలు పొందిన వారి పేర్లు లేకపోవడంతో రైతులు వెంటనే అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. రుణమాఫీ గడువు ముగిసిందని, తమకేం తెలియదని మండల కమిటీ సభ్యులు చెప్పడంతో ఆందోళన చెందిన రైతులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. రుణమాఫీ జాబితాలో సదరు రైతుల పేర్లు చేర్చాలని ఉన్నతాధికారుల ద్వారా మండల కమిటీకి ఆదేశాలు అందాయి. జాబితాలో పేర్లు చేర్చడం లేదని, తమ గోడు పట్టించుకోవడం లేదంటూ స్థానిక బ్యాంకు ఎదుట రైతులు నిరసన వ్యక్తం చేశారు. తమ పేర్లను రుణ మాఫీ జాబితాలో చేర్చాలని రైతులు డిమాండ్ చేశారు. బ్యాంకు అధికారి లేక పోవడంతో వెనుదిరిగి పోయారు. -
రైతులకు ఝలక్
వసూలుకాని లోన్లను ఏజెన్సీలకు అమ్మేసిన బ్యాంకులు! 60 శాతంతో రుణాలను కొనుగోలు చేసిన ఏఆర్సీసీ నిరర్థక ఆస్తులుగా విక్రయించిన బ్యాంకర్లు అమ్మిన రుణాల విలువ రూ.12 కోట్లకు పైమాటే ఇక రుణ వసూళ్లు ఏజెన్సీల చేతుల్లోనే ఆందోళనలో పలువురు బకాయిదారులు పలమనేరు: బ్యాంకుల్లో అప్పు తీసుకుని సకాలంలో చెల్లించక మొండి బకాయిదారులుగా మారిన వారికి ఇది పిడుగులాంటి వార్తే. ఎందుకంటే ఆ రుణాలను ప్రైవేటు ఏజెన్సీలకు బ్యాంకులు అమ్మేశాయి. రుణగ్రహీతల నుంచి రికవరీ చేసే పూచీ ఏజెన్సీల చేతుల్లోకి వెళ్లింది. మరోవైపు ఆ ఏజెన్సీలు తాకట్టులోని ఆస్తులను జప్తు చేసేందుకు అధికారం చిక్కినట్టైంది. ఈ విషయం బ్యాంకర్లు గుట్టుగానే కానిచ్చేశారు. ఈ మధ్య రుణమాఫీ హడావిడితో తమ రుణాలేమైనా మాఫీ అవుతాయేమోనని బ్యాంకులకెళ్లిన రుణగ్రహీతలకు ఈ విషయంతెలిసి లబోదిబోమంటున్నారు. నిరర్థక ఆస్తులను ఏఆర్సీసీకి అమ్మేసిన బ్యాంకులు.. పలమనేరు ప్రాంతంలోని ఇండియన్ బ్యాంక్, ఎస్బీఐతో పాటు మరికొన్ని బ్యాంకులు మొండి బకాయిలను ఎన్పీఏలు (నాన్ ఫెర్ఫార్మెన్స్ అసెట్)గా మార్చాయి. దీంతో గతం లో రుణాలు తీసుకున్న క్రాప్, టర్మ్, బిజినెస్ రుణాలు నిరర్థక ఆస్తులుగా మారిపోయాయి. సంబంధిత బ్యాంకుల నుంచి మొండిబకాయిల వివరాలను పరిశీలించిన ప్రధాన కార్యాలయాలు ఈ రుణాలను ప్రైవేటు ఏజెన్సీలకు గతంలోనే విక్రయించేసినట్లు తెలిసింది. ఎస్బీఐ, ఇండియన్ బ్యాంక్‌లకు సంబంధించి వసూలు కాని రుణాలను ఏఆర్సీఎల్ (అసెట్ రికన్స్ట్రక్షన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్)కు అమ్మేసినట్లు తెలిసింది. ఇందులో రిలయన్స్ సంస్థే భారీగా కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. వసూలు కాని రుణాలను 60 శాతం వెలకట్టి కొనుగోలు చేసినట్లు బ్యాంకర్లే చెబుతున్నారు. విక్రయించిన లోన్ల విలువ రూ.12 కోట్ల పైమాటే.. పలమనేరు ప్రాంతంలోని పలు బ్యాంకుల్లో ఎన్పీఏలుగా మారిన రుణాలను ఏజెన్సీలకు అమ్మేసిన లోన్ల విలువ రూ.12 కోట్లకు పైగా ఉంటుందని తెలిసింది. జిల్లా మొత్తం మీద ఇలాంటి మొండిబకాయిలను వంద కోట్లకు పైగా అమ్మేసినట్లు తెలుస్తోంది. ఈ విషయం తెలియని రైతులు మహా అయితే బ్యాంకుల నుంచి నోటీసులు రావడం లేదా తాకట్టు భూములపై కోర్టు కేసులు జరుగుతాయిలేనని అనుకుంటున్నారు. రుణగ్రహీతల ఆస్తులకు ఎసరే.. స్థానిక బ్యాంకుల్లో పలువురు తమ ఆస్తులను, ఇళ్లను తాకట్టుగా పెట్టి పలు రకాల రుణాలు పొందారు. వీటిని సకాలంలో కట్టలేకపోవడంతో మొండిబకాయిదారులయ్యారు. వీరి రుణాలను ప్రైవేటు ఏజెన్సీలు కొనుగోలు చేయడంతో రికవరీల బాధ్యత ఏజెన్సీలదే. దీంతో వారు రుణగ్రహీతలకు నోటీసులివ్వడం, నిర్ణీత గడువులోపు డబ్బు చెల్లించకపోతే ఆస్తుల జప్తు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ విషయమై ఇండియన్ బ్యాంక్ కో-ఆర్డినేటర్ సత్యనారాయణరావ్ను వివరణ కోరగా బ్యాంకుల్లోని ఎన్పీఏలుగా మారిన రుణాలను ఏఆర్సీఎల్కు అమ్మేసిన మాట నిజమేనన్నారు. హెడ్ ఆఫీస్ ఉత్తర్వులతో అన్ని బ్యాంకుల్లోనూ ఈ విక్రయాలు జరిగిపోయాయన్నారు. -
బ్యాంకింగ్‌లో వృత్తినైపుణ్యం పెంచుతున్నాం
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకుల యాజమాన్యాన్ని వృత్తినైపుణ్యం కలిగినవిగా తీర్చిదిద్దే చర్యలు చేపడుతున్నామని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు. గురువారం న్యూఢిల్లీలో ఇండియన్ బ్యాంక్ ఏర్పాటు చేసిన ఓ సదస్సులో ఆయన ప్రసంగించారు. ‘కొన్ని బ్యాంకుల్లో ఇటీవల చోటుచేసుకున్న పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయి. వీటి నుంచి గుణపాఠం నేర్చుకున్నాం. ఇవి పునరావృతం కావు. బ్యాంకుల్లో పటిష్టమైన రిస్క్ మేనేజ్మెంట్ వ్యవస్థ ఉండాలి. అందుకు ప్రభుత్వం సహాయం చేస్తుంది...’ అని ఆయన చెప్పారు. కంపెనీల రుణపరిమితి పెంచేందుకు రూ.50 లక్షలు లంచం తీసుకుంటూ సిండికేట్ బ్యాంక్ సీఎండీ ఎస్.కె.జైన్ ఇటీవలే అరెస్టైన సంగతి తెలిసింది. ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, దేనా బ్యాంక్‌లకు చెందిన కొందరు అధికారులు రూ.436 కోట్ల ఫిక్స్డ్ డిపాజిట్లను దుర్వినియోగం చేసినట్లు బుధవారం వెలుగులోకి వచ్చింది. ఈ ఉదంతాల నేపథ్యంలో ఆర్థిక మంత్రి వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. యాజమాన్యంలో వృత్తినైపుణ్యం పెంచితే బ్యాంకింగ్ వ్యవస్థ విశ్వసనీయత మెరుగుపడుతుందని జైట్లీ తెలిపారు. 28న జన ధన యోజన... మారుమూల పల్లెలకు సైతం బ్యాంకింగ్ సేవలను అందుబాటులోకి తీసుకురావడాన్ని (ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్) ప్రస్తావిస్తూ, ప్రధాని నరేంద్ర మోడీ ఈ నెల 28 జన ధన యోజనను ప్రారంభిస్తారని జైట్లీ చెప్పారు. ముఖ్యమంత్రులు, పార్లమెంటు సభ్యులు పార్టీలకు అతీతంగా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. ‘ప్రధానమంత్రి జన ధన యోజన’లో భాగంగా ఖాతాదారులకు డెబిట్ కార్డు, లక్ష రూపాయల బీమా సౌకర్యం కల్పిస్తారనీ, ఇప్పటివరకు బ్యాంకింగ్ సేవలకు దూరంగా ఉన్న వారికి ఈ పథకం ఎంతగానో ఉపయోగపడుతుందనీ తెలిపారు. -
ఉద్యోగాలు
ఇండియన్ బ్యాంక్ ఇండియన్ బ్యాంక్ 251 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. పోస్టుల వివరాలు.. అసిస్టెంట్ మేనేజర్ (ఇండస్ట్రీ): 67 మేనేజర్ (క్రెడిట్, రిస్క్, హెచ్ఆర్, మార్కెటింగ్): 90 మేనేజర్ (ట్రెజరీ/ ఫైనాన్షియల్ సర్వీసెస్): 40 మేనేజర్ (ప్లానింగ్ అండ్ ఎకనమిస్ట్): 18 మేనేజర్ (సెక్యూరిటీ): 11 మేనేజర్ (కాస్ట్ అకౌంటెంట్): 2 మేనేజర్ (కార్పొరేట్ కమ్యూనికేషన్స్): 2 సీనియర్ మేనేజర్ (ట్రెజరీ): 4 సీనియర్ మేనేజర్ (రిస్క్ మేనేజ్మెంట్): 3 చీఫ్ మేనేజర్ (క్రెడిట్): 10 చీఫ్ మేనేజర్ (ఎకనమిస్ట్): 2 చీఫ్ మేనేజర్ (చార్టెర్డ్ అకౌంటెంట్): 1 చీఫ్ మేనేజర్ (రిస్క్ మేనేజ్మెంట్) 1 ఎంపిక: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా. అర్హతలు తదితర పూర్తి వివరాల కోసం వెబ్సైట్ చూడవచ్చు. ఆన్లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరితేది: జూలై 30 వెబ్సైట్: www.indianbank.in ప్రవేశాలు మ్యాట్ ఆల్ ఇండియా మేనేజ్మెంట్ అసోసియేషన్ (ఏఐఎంఏ) మేనేజ్మెంట్ ఆప్టిట్యూడ్ టెస్ట్-సెప్టెంబరు 2014 నోటిఫికేషన్ విడుదల చేసింది. కోర్సులు: ఎంబీఏ, పీజీడీఎం, పీజీడీబీఏ అర్హతలు: ఏదైనా డిగ్రీ ఉండాలి. డిగ్రీ చివరి సంవత్సరం విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపిక: ఆఫ్‌లైన్/ ఆన్లైన్ టెస్ట్ ద్వారా. దరఖాస్తు: ఆఫ్‌లైన్/ ఆన్లైన్ ద్వారా. రిజిస్ట్రేషన్‌కు చివరి తేది: ఆగస్టు 23 హార్డ్ కాపీలను పంపడానికి చివరి తేది: ఆగస్టు 25 ఆఫ్‌లైన్ టెస్ట్ తేది: సెప్టెంబరు 7 ఆన్లైన్ టెస్ట్ తేది: సెప్టెంబరు 13 వెబ్సైట్: apps.aima.in కృష్ణా యూనివర్సిటీ రీసెర్చ్ సెట్ కృష్ణా యూనివర్సిటీ (కేఆర్‌యూ) మచిలీపట్నం, ఎంఫిల్, పీహెచ్డీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే రీసెర్చ్ సెట్ - 2014కు దరఖాస్తులు కోరుతోంది. రీసెర్చ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2014 కోర్సు: ఎంఫిల్, పీహెచ్డీ (ఫుల్‌టైమ్/ పార్ట్‌టైమ్) విభాగాలు: బయోటెక్నాలజీ, కెమిస్ట్రీ, ఫార్మాస్యూటికల్ సెన్సైస్, ఫిజిక్స్, మ్యాథ మెటిక్స్, కంప్యూటర్ సైన్స్, బిజినెస్ మేనేజ్ మెంట్, కామర్స్, ఇంగ్లిష్, జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్, తెలుగు, ఎడ్యుకేషన్. అర్హతలు: సంబంధిత విభాగంలో 55 శాతం మార్కులతో మాస్టర్స్ డిగ్రీ ఉండాలి. దరఖాస్తు: వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. దరఖాస్తుల స్వీకరణకు చివరితేది: ఆగస్టు 14 వెబ్సైట్: www.krishnauniversity.ac.in -
దొంగ చేతికే తాళాలు ఇవ్వనున్న బ్యాంకు!
న్యూఢిల్లీ: ఇండియన్ బ్యాంక్ అధికారులు ఓ సాహసానికి ఒడిగట్టారు. తీహార్ జైల్లో శిక్ష అనుభవిస్తూ.. మంచి ప్రవర్తన, ఆర్హతలున్న వ్యక్తికి బ్యాంకు వ్యవహారాల్ని నిర్వహించే బాధ్యతల్ని అప్పగించారు. తీహార్ జైలులో గత కొద్ది సంవత్సరాలుగా ఇండియన్ బ్యాంక్ వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తొంది. వంద కోట్లకు పైగా బ్యాంకు వ్యవహరాలు నమోదయ్యాయి. మా బ్యాంక్ లో తీహార్ ఖైదీకి ఉద్యోగం ఇవ్వాలంటూ ఓ ప్రతిపాదన వచ్చింది. బ్రాంచ్ కూడా ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. త్వరలోనే అధికారికంగా ఖైదీ బ్యాంక్ వ్యవహారాలను చూస్తాడు అని ఇండియన్ బ్యాంక్ ఎండీ టీఎం భాసిన్ తెలిపారు. సెమీ ఓపెన్ జైలులో ఖైదీల అర్హత, ప్రవర్తన, మానసిక, శారీరక పటుత్వాన్ని బట్టి ఫ్యూన్, సెక్యూరిటీ గార్డు, కంపూటర్ ఆపరేటర్ ఉద్యోగాలను ఇస్తున్నామని తీహార్ జైలు అధికారి సునీల్ గుప్తా తెలిపారు. ఖైదీల వివరాలను అధికారులకు అందిస్తామని, నియామకాలపై తుది నిర్ణయం బ్యాంకు తీసుకుంటుందని జైలు అధికారులు తెలిపారు. గత నెలలో 66 మంది ఖైదీలు తమ శిక్షాకాలాన్ని పూర్తి చేసుకున్నారని.. జైలు ఆవరణలో జరిగిన నియామకాల ప్రక్రియలో వేదాంత గ్రూప్, తాజ్ మహల్ గ్రూప్ తోపాటు వివిధ ప్రైవేట్ కంపెనీలు ఖైదీలను ఉద్యోగులుగా ఎంపిక చేసుకున్నారని అధికారులు తెలిపారు. తీహార్ జైల్లో 8 సంవత్సరాలు శిక్ష అనుభవిస్తూ.. ఇగ్రో నుంచి సోషల్ వర్క్ లో డిగ్రీ సాధించిన రాజు ప్రశాంత్ అనే ఖైదీకి నెలకు 35 వేల జీతంతో అసిస్టెంట్ బిజినెస్ డెవలప్ మెంట్ మేనేజర్ ఉద్యోగం లభించింది. Follow @sakshinews -
గృహ రుణాలపై ఐఓబీ, ఇండియన్ బ్యాంక్ ప్రత్యేక వడ్డీ ఆఫర్లు
చెన్నై: గృహ రుణాల్లో భారీ వృద్ధి నమోదుపై ఇండియన్ బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ (ఐఓబీ) ప్రత్యేకంగా దృష్టి సారించాయి. ఈ మేరకు శుక్రవారం పరిమిత కాలపు ప్రత్యేక వడ్డీరేట్ల ఆఫర్లను ప్రకటించాయి. తమ ఈ ప్రత్యేక ఆఫర్లు మార్చి 31వ తేదీ వరకూ అమల్లో ఉంటాయని ఒక ప్రకటనలో తెలిపాయి. వివరాలివీ... ఇండియన్ బ్యాంక్: 10.20 శాతం వడ్దీరేటుకు గృహ రుణాన్ని ఆఫర్ చేస్తోంది. రుణ మొత్తం, కాలవ్యవధితో సంబంధం లేకుండా ఈ వడ్డీరేటు మార్చి వరకూ అమల్లో ఉంటుంది. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్: ఇక ఐఓబీ విషయానికి వస్తే - మహిళలు లక్ష్యంగా బ్యాంక్ ప్రత్యేక పథకాన్ని ఆఫర్ చేస్తోంది. రుణ మొత్తం, కాలవ్యవధితో సంబంధం లేకుండా శుభ గృహ పథకం కింద 10.25 శాతం వడ్డీపై గృహ రుణాన్ని బ్యాంక్ ఆఫర్ చేస్తోంది. ఇతర రుణ గ్రహీతలకు సంబంధించి రూ.75 లక్షల వరకూ రుణ రేటు 10.25 శాతం వరకూ ఉంటుంది. రూ.75 లక్షలు దాటితే ఈ రేటు 10.50 శాతం. ఐఓబీ ‘కనెక్ట్ కార్డ్’ కాగా యువత లక్ష్యంగా ఐఓబీ శుక్రవారం ‘కనెక్ట్ కార్డ్’ను ఆవిష్కరించింది. ఇది ఏటీఎం వినూత్న ఏటీఎం కమ్ డెబిట్ కార్డ్. వీసా భాగస్వామ్యంతో బ్యాంక్ ఈ కార్డును ఆవిష్కరించింది. దాదాపు ఐదు లక్షల దుకాణాల్లో ఈ-కామర్స్‌కు అవకాశం కల్పించడం ఈ కార్డు ప్రత్యేకం. ఐఓబీ కస్టమర్లు అందరికీ ఈ కార్డును అందిస్తున్నప్పటికీ, 10 నుంచి 28 సంవత్సరాల మధ్య వయస్కులకు సేవలు అందజేయడం దీని ప్రధాన లక్ష్యమని బ్యాంక్ ప్రకటన తెలిపింది. ఈ-షాపింగ్, ఈ-పేమెంట్ విధానం ప్రోత్సహించడం లక్ష్యంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగింపు వరకూ (మార్చి వరకూ) ఐదుశాతం క్యాష్ బ్యాక్ ఆఫర్ సౌలభ్యాన్ని సైతం బ్యాంక్ అందిస్తోంది. కాగా ప్రత్యేకించి సప్లై చైన్ భాగస్వాముల ఫైనాన్సింగ్‌కు వీలు కల్పించే ‘చానెల్ ఫైనాన్సింగ్’ వ్యవస్థను సైతం ఐఓబీ ఆవిష్కరించింది. కార్పొరేట్, వ్యవస్థాగత, చిన్న-మధ్యతరహా రుణ కస్టమర్ల ప్రయోజనాలకు దీన్ని ఉద్దేశించారు. -
ఈక్విటీగా బ్యాంకుల ప్రిఫరెన్స్ షేర్లు
న్యూఢిల్లీ: మూడు బ్యాంకులలో ప్రభుత్వానికున్న నాన్‌క్యుమిలేటివ్ ప్రిఫరెన్స్ షేర్లను(పీఎన్‌సీపీఎస్) ఈక్విటీగా మార్పు చేసేందుకు ఆర్థిక శాఖ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. తద్వారా ఆయా ప్రభుత్వ బ్యాంకులలో కేంద్రానికి వాటా పెరగనుంది. ఇండియన్ బ్యాంక్, విజయా బ్యాంక్, యూకో బ్యాంక్‌లలో ప్రిఫరెన్స్ షేర్లను ఈక్విటీగా మార్పు చేసేందుకు ప్రభుత్వం అంగీకరించినట్లు చిదంబరం గురువారం పేర్కొన్నారు. దీంతో బాసెల్-3 నిబంధనల ప్రకారం బ్యాంకులకు పెట్టుబడులు సమకూరడంతోపాటు, ప్రభుత్వానికి పెరిగిన వాటామేరకు మరింత డివిడెండ్ లభించనుంది. ప్రిఫరెన్స్ షేర్లు ఈక్విటీగా మార్పుచెందడం ద్వారా ఇండియన్ బ్యాంక్‌లో ప్రభుత్వ వాటా ప్రస్తుత 80% నుంచి 82.22%కు పెరగనున్నట్లు చిదంబరం చెప్పారు. ఇదే విధంగా యూకో బ్యాంక్‌లో వాటా 69.26% నుంచి 77.25%కు, విజయా బ్యాంక్‌లో వాటా 55.02% నుంచి 71.85%కు పుంజుకోనున్నట్లు తెలి పారు. ఇందుకనుగుణంగా ప్రభుత్వానికి ఇండియ న్ బ్యాంక్‌లో రూ.400 కోట్లు, యూకో బ్యాం క్లో రూ.1,823 కోట్లు, విజయా బ్యాంక్‌లో రూ. 1,200 కోట్ల విలువైన ఈక్విటీ షేర్లు జారీకానున్నాయి. -
బ్యాంకు వెనుక గుంత తవ్వి..
తిరువళ్లూరు, న్యూస్‌లైన్: తిరువళ్లూరు సమీపంలోని తిరుప్పాచ్చూర్‌లో ఇండియన్ బ్యాంకు వెనుక గుర్తు తెలియని దుండగులు ఐదు అడుగుల మేర గుంతను తవ్వారు. లాకర్లో ఉన్న నగదు, నగలను అపహరించాలని మాస్టర్ ప్లాన్ వేశారు. దీనికోసం తవ్విన గుంతను ఆ గ్రామ మహిళలు గుర్తించారు. బ్యాంకు లాకర్లో రెండు కోట్లకుపైగా విలువజేసే నగదు, నగలు భద్రంగా ఉండడంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. తిరువళ్లూరు జిల్లా తిరుప్పాచ్చూర్ ప్రాంతంలో ఇండియన్ బ్యాంకు బ్రాంచి ఉంది. దీని వెనుక భాగంలో పిచ్చిమొక్కలతో పాటు ఇతర ముళ్లపొదులు విపరీతంగా పెరిగిపోయాయి. వీటిని తొలగించాలని బ్యాంకు అధికారులు నిర్ణయించారు. తిరుప్పాచ్చూర్ గ్రామంలోని మహిళలకు పిచ్చిమొక్కలను తొలగించే పనిని అప్పగించారు. పనిలో నిమగ్నమైన కూలీలు లాకర్ రూమ్ ప్రాంతంలో ఐదు అడుగుల మేరకు తవ్వకాలు జరిపినట్టు గుర్తించారు. వారు వెంటనే బ్యాంకు మేనేజర్ సుమతికి సమాచారం అందించారు. తవ్వకాలు జరిగిన ప్రాంతాన్ని పరిశీలించిన మేనేజర్ తాలుకా ఇన్స్పెక్టర్ ఏకాంబరానికి ఫిర్యాదు చేశారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీ సులు, బ్యాంకు వెనుక నుంచి లాకర్‌కు తవ్వకాలు జరిపినట్టు గుర్తించారు. అనంతరం ఇండియన్ బ్యాంకు భద్రతా అధికారి కుమరవేలు సంఘటన స్థలానికి చేరుకు పరిశీలించారు. బ్యాంకు లాకర్లో వుంచిన రెండు కోట్ల విలువ చేసే నగలు, నగదు భద్రంగా ఉండడంతో బ్యాంకు అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం బ్యాంకు భద్రతాధికారి కుమర వేలు మీడియాతో మాట్లాడుతూ, బ్యాంకులో చోరీయత్నం జరిగిన నేపథ్యంలో నైట్ వాచ్‌మన్‌ను నియమిస్తామన్నారు. దీంతో పాటు బ్యాంకు ముందు, వెనుక భాగంలో కెమెరాలను ఏర్పాటుచేస్తామని తెలిపారు.