
ఇండియన్ బ్యాంక్ ఎండీగా కిశోర్ ఖారత్
హైదరాబాద్: ప్రభుత్వ రంగ ఇండియన్ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈవోగా కిశోర్ ఖారత్ బాధ్యతలు స్వీకరించారు. ఇంతకుముందు ఈయన ఐడీబీఐ బ్యాంక్ ఎండీగా, సీఈవోగా బాధ్యతలు నిర్వహించారు. ఖారత్ ఇదివరకు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా కూడా పనిచేశారు. కాగా ఈయన తన బ్యాంకింగ్ కెరీర్‌ను బ్యాంక్ ఆఫ్ బరోడాలో ప్రారంభించారు. కిశోర్ ప్రస్తుతం ఐబీఏ స్టాండింగ్ కమిటీ ప్రత్యామ్నాయ చైర్మన్‌గా, సీఐఐ నేషనల్ కమిటీలో సభ్యుడిగా కొనసాగుతున్నారు.