తమిళనాడులోని తిరువనూరు జిల్లా ఆమ్మవారికుప్పం గ్రామంలోని ఇండియన్ బ్యాంక్‌లో సోమవారం ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది.
ఇండియన్ బ్యాంక్‌లో అగ్నిప్రమాదం
Jul 25 2016 3:19 PM | Updated on Sep 5 2018 9:47 PM
పాలసముద్రం: తమిళనాడులోని తిరువనూరు జిల్లా ఆమ్మవారికుప్పం గ్రామంలోని ఇండియన్ బ్యాంక్‌లో సోమవారం ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ప్రమాదవశాత్తు బ్యాంక్‌లో అగ్నిప్రమాదం జరగడంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఇది గుర్తించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో.. రంగంలోకి దిగిన సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకురావడానికి తీవ్రంగా ప్రయత్నించారు. ఈ ప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం వాటిల్లినట్లు సమాచారం.
Advertisement
Advertisement