
ఆమె పరీక్ష రాస్తే ఉద్యోగమే..
ఇండియన్ బ్యాంకు పీవోగా ఎంపికైన నేహ
జైనథ్ : చాలా మంది యువతీయువకులు ప్రభుత్వ ఉద్యోగాలు లేవని, చదివినా రావని నిరాశ చెందుతారు. కానీ మనసు పెట్టి చదివితే ఏ శాఖలోనై ఉద్యోగం సాధించవచ్చ ని చాలా మంది నిరూపించారు. ఆ కోవకి చెందిందే ఈ అమ్మాయి. పేరు డి.నేహ. జైనథ్ ఎంపీడీవో డి.రామకృష్ణ కూతురు. ఆదిలాబాద్‌కు చెందిన ఈమె బీఎస్సీ బయోటెక్నాలజీ చదివింది. ఆ రంగంలో ఇంకా పెద్దగా ప్రభుత్వ ఉద్యోగాలు లేకపోవడంతో బ్యాంకింగ్ వైపు వెళ్లింది.
గత రెండు సంవత్సరాల్లో మొత్తం నాలుగు బ్యాంకుల్లో ఉద్యో గం సాధించింది. మొదట ఆర్‌ఆర్‌బీ రీజనల్ రూరల్ బ్యాంకులో, తర్వాత పంజాబ్ నేషనల్ బ్యాంకులో క్లర్క్‌గా ఎంపికైంది. ప్రస్తుతం నేహ మహారాష్ట్రలోని ఎస్‌బీహెచ్ పర్బానీ శాఖలో క్లర్కుగా పనిచేస్తోంది. దీంతో ఆమె తన ప్రిపరేషన్ ఆపకుండా ప్రొబేషనరీ ఆఫీసర్ కావాలనే లక్ష్యంతో ఓ వైపు ఉద్యోగం చేస్తూనే మరో వైపు ఐబీపీఎస్ పీవో పరీక్ష సిద్ధమైంది. ఈ మధ్యనే విడుదలైన పరీక్ష ఫలితాల్లో ఇండియన్ బ్యాంకు పీవోగా ఎంపికైంది. తమ కూతురు చిన్ననాటి నుంచే చదువులో ముందుండేదని, క్లర్క్‌గా ఉద్యోగం చేస్తూనే పీవోకు ఎంపిక కావడం సంతోషంగా ఉందని ఎంపీడీవో దంపతులు ఉబ్బితబ్చిపోయూరు.