న్యూఢిల్లీ: మొండిబాకీలకు కేటాయింపులు పెరగడంతో.. ప్రభుత్వ రంగ ఇండియన్ బ్యాంక్ నికర లాభం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో సగానికి తగ్గి రూ. 152 కోట్లుగా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం ఇదే వ్యవధిలో బ్యాంక్ లాభం రూ. 303 కోట్లు. ఇక క్యూ3లో మొత్తం ఆదాయం రూ. 4,903 కోట్ల నుంచి రూ. 5,269 కోట్లకు పెరిగింది. స్థూల నిరర్ధక ఆస్తులు (ఎన్‌పీఏ) 6.27 శాతం నుంచి 7.46 శాతానికి ఎగిశాయి. నికర ఎన్‌పీఏలు కూడా 3.3 శాతం నుంచి 4.42 శాతానికి పెరిగాయి. పరిమాణంపరంగా స్థూల ఎన్‌పీఏలు రూ. 9,595 కోట్ల నుంచి రూ. 13,198 కోట్లకు, నికర ఎన్‌పీఏలు రూ. 4,899 కోట్ల నుంచి రూ. 7,571 కోట్లకు ఎగిశాయి. ఫలితంగా మొండిబాకీలకు కేటాయింపులు ఏకంగా మూడు రెట్లు పెరిగి రూ. 385 కోట్ల నుంచి రూ. 974 కోట్లకు చేరినట్లు ఇండియన్ బ్యాంక్ వెల్లడించింది.
Comments
Please login to add a commentAdd a comment