సాక్షి,ముంబై: ప్రభుత్వ రంగ బ్యాంకు ఇండియన్ బ్యాంకు నిరుత్సాహకర ఫలితాలను ప్రకటించింది. క్యూ4(జనవరి-మార్చి)లో ఇండియన్ బ్యాంక్ నికర లాభం 59 శాతం క్షీణించి రూ. 1,259 కోట్లకు పరిమితమైంది. గత ఏడాది 1405 రూపాయల నికర లాభాలను సాధించింది. మొత్తం ఆదాయం19,520కోట్లుగా నమోదు చేసింది. మార్చి 31, 2018 నాటికి ఇండియన్ బ్యాంక్ స్థూల స్థూల మొండిబకాయిలు(ఎన్‌పీఏలు) 6.27 శాతం నుంచి 7.37 శాతానికి పెరిగి11,990 కోట్ల రూపాయలుగా ఉంది. నికర ఎన్‌పీఏలు సైతం 3.3 శాతం నుంచి 3.81 శాతం పెరిగి 5,960.57 కోట్ల రూపాయలుగా ఉంది. నికర వడ్డీ ఆదాయం(ఎన్‌ఐఐ) మాత్రం 18 శాతం పెరిగి రూ. 1638 కోట్లకు చేరింది. మొండి రుణాలకుగాను రూ. 1770 కోట్ల మేర ప్రొవిజన్లు చేపట్టింది. మరోవైపు రూ .10 ముఖ విలువ కలిగిన ఈక్విటీ షేరుకు రూ .6 డివిడెండ్ చెల్లించేందుకు బోర్డ్ ప్రతిపాదించింది.
Comments
Please login to add a commentAdd a comment