Q4 results
-
జీ ఎంటర్టైన్మెంట్ లాభం రూ. 13 కోట్లు
న్యూఢిల్లీ: జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్ (జీల్) నాలుగో త్రైమాసిక నికర లాభం కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన రూ. 13.35 కోట్లకు పరిమితమైంది. అంతక్రితం క్యూ4లో రూ. 196 కోట్ల నష్టం నమోదైంది. సమీక్షాకాలంలో మొత్తం ఆదాయం రూ. 2,126 కోట్ల నుంచి రూ. 2,185 కోట్లకు పెరిగింది. మొత్తం వ్యయాలు రూ. 2,083 కోట్ల నుంచి రూ. 2,044 కోట్లకు తగ్గాయి. షేరు ఒక్కింటికి రూ. 1 చొప్పున కంపెనీ డైరెక్టర్ల బోర్డు సిఫార్సు చేసింది. మరోవైపు, పూర్తి ఆర్థిక సంవత్సరానికి లాభం రూ. 48 కోట్ల నుంచి రూ. 141 కోట్లకు పెరగ్గా, ఆదాయం రూ. 8,168 కోట్ల నుంచి రూ. 8,766 కోట్లకు చేరింది. సబ్ర్స్కిప్షన్ ఆదాయం, ఇతరత్రా సేల్స్, సర్వీస్‌ల ద్వారా ఆదాయం వృద్ధి చెందినట్లు జీల్ వెల్లడించింది. కొత్త ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో వన్–టైమ్ ప్రాతిపదికన కొన్ని కేటాయింపులు జరపాల్సి రావచ్చని, దీంతో మార్జిన్లపై కొంత ప్రభావం పడొచ్చని పేర్కొంది. అయితే, రెండో త్రైమాసికం నుంచి మార్జిన్ క్రమంగా మెరుగుపడగలదని వివరించింది. -
ఎస్బీఐ లాభం రికార్డ్
ముంబై: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ) గత ఆర్థిక సంవత్సరం(2023–24) చివరి త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు సాధించింది. జనవరి–మార్చి (క్యూ4)లో కన్సాలిడేటెడ్ నికర లాభం 18 శాతం ఎగసి రూ. 21,384 కోట్లను అధిగమించింది. అంతక్రితం ఏడాది(2022–23) క్యూ4లో రూ. 18,094 కోట్లు మాత్రమే ఆర్జించింది. స్టాండెలోన్ లాభం సైతం రూ. 16,695 కోట్ల నుంచి రూ. 20,698 కోట్లకు దూసుకెళ్లింది. మొత్తం ఆదాయం రూ. 1.06 లక్షల కోట్ల నుంచి రూ. 1.28 లక్షల కోట్లకు బలపడింది. నిర్వహణ వ్యయాలు రూ. 29,732 కోట్ల నుంచి రూ. 30,276 కోట్లకు పెరిగాయి. మొత్తం ప్రొవిజన్లు రూ. 3,315 కోట్ల నుంచి సగానికి తగ్గి రూ. 1,609 కోట్లకు పరిమిత మయ్యాయి. స్థూల మొండిబకాయిలు(ఎన్పీఏలు) 2.78 శాతం నుంచి 2.24 శాతానికి తగ్గాయి. పూర్తి ఏడాదికి సైతం.. ఇక పూర్తి ఏడాదికి ఎస్బీఐ నికర లాభం కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన 21 శాతం జంప్‌చేసింది. రూ. 67,085 కోట్లకు చేరింది. 2022–23లో రూ. 55,648 కోట్లు ఆర్జించింది. వెరసి అటు క్యూ4, ఇటు పూర్తి ఏడాదికి రెండు శతాబ్దాల బ్యాంక్ చరిత్రలోనే అత్యధిక లాభాలు ఆర్జించినట్లు ఎస్బీఐ చైర్మన్ దినేష్ కుమార్ ఖారా పేర్కొన్నారు. క్యూ4లో నికర వడ్డీ ఆదాయం 3 శాతం బలపడి రూ. 41,655 కోట్లను తాకింది. 3.46 శాతం నికర వడ్డీ మార్జిన్లు సాధించింది. మొత్తం ప్రొవిజన్లు రూ. 8,049 కోట్ల నుంచి రూ. 7,927 కోట్లకు తగ్గాయి. స్లిప్పేజీలు రూ. 3,185 కోట్ల నుంచి రూ. 3,867 కోట్లకు పెరిగాయి. స్థూల మొండిబకాయిలు 2.78 శాతం నుంచి 2.42 శాతానికి దిగివచ్చాయి. వడ్డీయేతర ఆదాయం 24 శాతం జంప్‌చేసి రూ. 17,369 కోట్లకు చేరింది. గత నాలుగేళ్లలో 27,000 మంది ఉద్యోగులు తగ్గినప్పటికీ రిటైర్ అవుతున్న సిబ్బందిలో 75 శాతంమందిని విధుల్లోకి తీసుకుంటున్నట్లు ఖారా వెల్లడించారు. టెక్నాలజీ, ఏఐలపై భారీగా ఇన్వెస్ట్ చేస్తున్నట్లు తెలియజేశారు. -
ఫండ్స్ పెట్టుబడుల జోరు..
ముంబై: స్టాక్ ఎక్సే్ఛంజీ దిగ్గజం ఎన్ఎస్ఈ లిస్టెడ్ కంపెనీలలో మ్యూచువల్ ఫండ్స్(ఎంఎఫ్‌లు) పెట్టుబడులు చరిత్రాత్మక గరిష్టానికి చేరాయి. మార్చితో ముగిసిన గతేడాది(2023–24) చివరి త్రైమాసికంలో లిస్టెడ్ కంపెనీలలో ఎంఎఫ్‌ల వాటా 9 శాతానికి ఎగసింది. ఇందుకు ఈ కాలంలో తరలివచి్చన రూ. 81,539 కోట్ల నికర పెట్టుబడులు దోహదపడ్డాయి. ప్రైమ్ డేటాబేస్ గ్రూప్ వివరాల ప్రకారం 2023 డిసెంబర్ చివరికల్లా ఈ వాటా 8.8 శాతంగా నమోదైంది. ఈ కాలంలో దేశీయంగా అతిపెద్ద సంస్థాగత ఇన్వెస్టర్ అయిన ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం ఎల్ఐసీ వాటా 3.64 శాతం నుంచి 3.75 శాతానికి బలపడింది. ఎల్ఐసీకి 280 లిస్టెడ్ కంపెనీలలో 1 శాతానికిపైగా వాటా ఉంది. వెరసి ఎంఎఫ్‌లు, బీమా కంపెనీలు, బ్యాంకులు, ఫైనాన్షియల్ సంస్థలు, పెన్షన్ ఫండ్స్‌తోకూడిన దేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల(డీఐఐలు) వాటా మొత్తంగా 15.96 శాతం నుంచి 16.05 శాతానికి మెరుగుపడింది. ఇందుకు భారీగా తరలివచి్చన రూ. 1.08 లక్షల కోట్ల పెట్టుబడులు తోడ్పాటునిచ్చాయి.విదేశీ ఇన్వెస్ట్మెంట్.. 11ఏళ్ల కనిష్టం 2024 మార్చికల్లా విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల(ఎఫ్‌పీఐలు) పెట్టుబడుల వాటా 17.68 శాతానికి నీరసించింది. ఇది గత 11ఏళ్లలోనే కనిష్టంకాగా.. 2023 డిసెంబర్‌కల్లా 18.19 శాతంగా నమోదైంది. ఫలితంగా ఎన్ఎస్ఈ లిస్టెడ్ కంపెనీలలో డీఐఐలు, ఎఫ్‌పీఐల హోల్డింగ్(వాటాలు) మధ్య అంతరం చరిత్రాత్మక కనిష్టానికి చేరింది. ఎఫ్‌పీఐలు డీఐఐల మధ్య వాటాల అంతరం 9.23 శాతానికి తగ్గింది. గతంలో 2015 మార్చిలో ఎఫ్‌పీఐలు, డీఐఐల మధ్య వాటాల అంతరం అత్యధికంగా 49.82 శాతంగా నమోదైంది. ఇది ఎన్ఎస్ఈలో లిస్టయిన 1,989 కంపెనీలలో 1,956 కంపెనీలను లెక్కలోకి తీసుకుని చేసిన మదింపు. -
Q4 results: బజాజ్ ఆటో లాభం హైజంప్
న్యూఢిల్లీ: ద్విచక్ర, త్రిచక్ర వాహన దిగ్గజం బజాజ్ ఆటో గత ఆర్థిక సంవత్సరం(2023–24) చివరి త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. జనవరి–మార్చి(క్యూ4)లో స్టాండెలోన్ నికర లాభం 35 శాతం జంప్‌చేసింది. రూ. 1,936 కోట్లను తాకింది. 2022–23 ఇదే కాలంలో రూ. 1,433 కోట్లు మాత్రమే ఆర్జించింది. మొత్తం ఆదా యం సైతం 29% వృద్ధితో రూ. 11,485 కోట్లకు చేరింది. మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి నికర లాభం 33 శాతం ఎగసి రూ. 7,479 కోట్లయ్యింది. 2022–23లో కేవలం రూ. 5,628 కోట్లు ఆర్జించింది. మొత్తం టర్నోవర్ రూ. 36,248 కోట్ల నుంచి రూ. 44,685 కోట్లకు వృద్ధి చెందింది. వాటాదారులకు షేరుకి రూ. 80 చొప్పున తుది డివిడెండ్ ప్రకటించింది. వాహన విక్రయాలు జూమ్ క్యూ4లో బజాజ్ ఆటో మొత్తం వాహన విక్రయాలు 24 శాతం పెరిగి 10,68,576 యూనిట్లకు చేరాయి. వీటిలో ద్విచక్ర వాహనాలు 26 శాతం పుంజుకుని 9,16,817ను తాకగా.. 13 శాతం అధికంగా 1,51,759 వాణిజ్య వాహనాలు విక్రయించింది. బజాజ్ ఆటో షేరు బీఎస్ఈలో 1.1 శాతం లాభంతో రూ. 9,018 వద్ద ముగిసింది. -
ఇన్ఫోసిస్ ఓకే
న్యూఢిల్లీ: సాఫ్ట్వేర్ సేవల దిగ్గజం ఇన్ఫోసిస్ లిమిటెడ్ గత ఆర్థిక సంవత్సరం(2023–24) చివరి త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు సాధించింది. జనవరి–మార్చి(క్యూ4)లో కన్సాలిడేటెడ్ నికర లాభం వార్షికంగా 30 శాతం జంప్ చేసింది. రూ. 7,969 కోట్లను తాకింది. అంతక్రితం ఏడాది(2022–23) ఇదే కాలంలో రూ. 6,128 కోట్లు మాత్రమే ఆర్జించింది. మొత్తం ఆదాయం మాత్రం నామమాత్ర(1 శాతం) వృద్ధితో రూ. 37,923 కోట్లకు చేరింది. అంతక్రితం క్యూ4లో రూ. 37,441 కోట్ల టర్నోవర్ నమోదైంది. తయారీ రంగ సేవలు నెమ్మదించగా.. 20.1 శాతం నిర్వహణ మార్జిన్లను అందుకుంది. క్యూ4లో 84.8 కోట్ల డాలర్ల ఫ్రీక్యాష్ ఫ్లో సాధించింది. గత 11 త్రైమాసికాలలోనే ఇది అత్యధికం. 1–3 శాతం వృద్ధి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024–25)లో ఇన్ఫోసిస్ ఆదాయంలో 1–3 శాతం వృద్ధిని అంచనా(గైడెన్స్) వేసింది. 20–22 శాతం నిర్వహణ లాభ మార్జిన్లను ఆశిస్తోంది. అయితే గతేడాది ప్రకటించిన 4–7 శాతం వృద్ధితో పోలిస్తే తాజాగా బలహీన గైడెన్స్‌ను వెలువరించింది. గతేడాది సాధించిన ఫలితాలతో పోలిస్తే ఈ ఆర్థిక సంవత్సరంలో ఆదాయ వృద్ధి అంచనాలు(గైడెన్స్) అధికమేనని సీఈవో పరేఖ్ పేర్కొన్నారు. విభాగాలవారీగా చూస్తే గతేడాదికంటే రానున్న 12 నెలల్లో ఫైనాన్షియల్ సరీ్వసుల్లో ఉత్తమ పనితీరు చూపేందుకు అవకాశమున్నట్లు తెలియజేశారు. విచక్షణా వ్యయాల తీరు, కన్సాలిడేషన్, వ్యయ నియంత్రణపై దృష్టి ద్వారా గైడెన్స్‌ను ప్రకటించినట్లు వెల్లడించారు. కాగా.. మార్చితో ముగిసిన గతేడాదికి 20.7 శాతం నిర్వహణ మార్జిన్లు సాధించింది. ఈ కాలంలో నికర లాభం 9% ఎగసి రూ. 26,233 కోట్లను తాకింది. మొత్తం ఆదాయం 4.7% బలపడి రూ. 1,53,670 కోట్లయ్యింది. 2022–23లో రూ. 24,095 కోట్ల నికర లాభం, రూ. 1,46,767 కోట్ల టర్నోవర్ నమోదైంది. వ్యూహాత్మక, నిర్వహణ సంబంధ నగదు అవసరాలను పరిగణించాక రానున్న ఐదేళ్ల కాలానికి పెట్టుబడుల కేటాయింపుల విధానాన్ని బోర్డు సమీక్షించడంతోపాటు, అనుమతించినట్లు సీఎఫ్‌వో జయే‹Ù.ఎస్ పేర్కొన్నారు. ఈ కాలంలో వాటాదారులకు వార్షికంగా డివిడెండ్‌ను పెంచడం ద్వారా 85 శాతం కేటాయింపుల(రిటర్నులు)కు వీలున్నట్లు అంచనా వేశారు. ఇతర విశేషాలు.. ► పూర్తి ఏడాది(2023–24)కి కంపెనీ చరిత్రలోనే అత్యధికంగా 17.7 బిలియన్ డాలర్ల విలువైన భారీ కాంట్రాక్టులు(టీసీవీ) కుదుర్చుకుంది. వీటిలో 52 శాతం కొత్త ఆర్డర్లు. ► షేరుకి రూ. 28 తుది డివిడెండ్ ప్రకటించింది. దీనిలో రూ. 8 ప్రత్యేక డివిడెండ్ కలసి ఉంది. ► పూర్తి ఏడాదిలో 25,994 మంది ఉద్యోగులు తగ్గారు. దీంతో 2001 తదుపరి మొత్తం ఉద్యోగుల సంఖ్య(7.5%) క్షీణించింది. 3,17,240కు పరిమితమైంది. 2022–23లో సిబ్బంది సంఖ్య 3,43,234గా నమోదైంది. ► ఉద్యోగ వలసల (అట్రిషన్) రేటు 12.6% గా నమోదైంది. రూ. 4,000 కోట్లతో.. జర్మనీ సంస్థ ఇన్‌టెక్‌లో 100 శాతం వాటాను పూర్తి నగదు చెల్లింపు ద్వారా కొనుగోలు చేయనున్నట్లు ఇన్ఫోసిస్ వెల్లడించింది. ఇందుకు 45 కోట్ల యూరోలు(రూ. 4,000 కోట్లు) వెచి్చంచనుంది. ఈమొబిలిటీ, కనెక్టెడ్, అటానమస్ డ్రైవింగ్, ఈవీలు, ఆఫ్‌రోడ్ వాహనాల విభాగంలో కంపెనీ సొల్యూషన్లను అభివృద్ధి చేస్తున్నట్లు ఇన్ఫోసిస్ పేర్కొంది. ఈ కొనుగోలుతో జర్మన్ ఓఈఎం క్లయింట్లను పొందడంతోపాటు 2,200 మంది సుశిక్షిత సిబ్బందిని సొంతం చేసుకోనున్నట్లు తెలియజేసింది. ఈ ఏడాది తొలి అర్ధభాగానికల్లా డీల్ పూర్తికాగలదని అంచనా వేస్తోంది. డీల్స్‌లో రికార్డ్ గతేడాది భారీ డీల్స్‌లో కొత్త రికార్డు సాధించాం. ఇది కంపెనీపట్ల క్లయింట్లకున్న విశ్వాసాన్ని ప్రతిబింబిస్తోంది. జనరేటివ్ ఏఐలో సిబ్బంది సామర్థ్యాల విస్తరణ కొనసాగుతుంది. క్లయింట్ల ప్రోగ్రామ్‌లు, విభిన్న లాంగ్వేజీలపై పనిచేయడం, కస్టమర్ సపోర్ట్, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ప్రాసెస్ వినిమయం తదితరాలకు ప్రాధాన్యత ఇస్తున్నాం. – సలీల్ పరేఖ్, ఎండీ, సీఈవో, ఇన్ఫోసిస్ లిమిటెడ్ -
Q4: కార్పొరేట్ ఫలితాల సీజన్
న్యూఢిల్లీ: ఐటీ సేవల నంబర్‌వన్ కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్) చివరి త్రైమాసిక(జనవరి–మార్చి) ఫలితాల సీజన్‌కు శ్రీకారం చుడుతోంది. నేడు (శుక్రవారం) క్యూ4తోపాటు.. మార్చితో ముగిసిన గత పూర్తిఏడాది(2023–24)కి సైతం పనితీరు వెల్లడించనుంది. అయితే క్యూ4సహా.. గతేడాదికి ఐటీ కంపెనీలు నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించే అవకాశమున్నట్లు మార్కెట్ విశ్లేషకులు పేర్కొంటున్నారు. వెరసి సాఫ్ట్వేర్ రంగ కంపెనీల క్యూ4, పూర్తి ఏడాది పనితీరు వెల్లడికానుండగా.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి(2024–25) ఆదాయ అంచనాలు(గైడెన్స్) సైతం ప్రకటించనున్నాయి. అయితే పలు కంపెనీలు నిరుత్సాహకర ఫలితాలనే ప్రకటించనున్నట్లు పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. ఇందుకు బలహీన ప్రపంచ ఆర్థిక పరిస్థితులు, ఐటీ వ్యయాలు తగ్గడం తదితర అంశాలు ప్రభావం చూపనున్నట్లు పేర్కొంటున్నాయి. ఆర్థిక అనిశి్చతుల కారణంగా టెక్నాలజీ సేవలకు డిమాండ్ మందగించడం, ఐటీపై క్లయింట్ల వ్యయాలు తగ్గడం ఈ ఏడాది అంచనాలను సైతం దెబ్బతీసే వీలున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. వెరసి ఐటీ కంపెనీలు అప్రమత్తతతో కూడిన గైడెన్స్‌ను ప్రకటించనున్నట్లు తెలియజేశాయి. బ్రోకింగ్ వర్గాల అంచనాలు నేడు(12న) ఐటీ సేవల నంబర్‌వన్ కంపెనీ టీసీసీఎస్ క్యూ4సహా.. 2023–24 ఫలితాలను విడుదల చేయనుంది. ఈ బాటలో సాఫ్ట్వేర్ దిగ్గజాలు ఇన్ఫోసిస్ 18న, విప్రో 19న, టెక్ మహీంద్రా 25న, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ 26న క్యూ4, గతేడాదికి పనితీరును వెల్లడించనున్నాయి. దేశీ ఐటీ కంపెనీలు క్యూ4లో అంతంతమాత్ర ఫలితాలను సాధించనున్నట్లు బ్రోకింగ్ సంస్థ ఎమ్కే ఇటీవల అంచనా వేసింది. ఈ ఏడాది ద్వితీయార్ధం(అక్టోబర్–మార్చి)లో మాత్రమే రికవరీ ఆశలనుపెట్టుకోవచ్చునంటూ పేర్కొంది. అయితే క్యూ3(అక్టోబర్–డిసెంబర్)లో సాధించిన నిరాశామయ పనితీరుతో పోలిస్తే క్యూ4లో త్రైమాసికవారీగా కాస్తమెరుగైన ఫలితాలు సాధించవచ్చని బ్రోకింగ్ సంస్థ మోతీలాల్ ఓస్వాల్ అభిప్రాయపడింది. ప్రపంచ ఆర్థిక అనిశ్చితుల రీత్యా ఐటీ సరీ్వసులకు డిమాండ్ మందగించినట్లు పేర్కొంది. వెరసి కరోనా మహమ్మారి తలెత్తిన 2019–20ను మినహాయిస్తే వార్షికంగా 2008–09 తదుపరి బలహీన ఫలితాలు విడుదలయ్యే వీలున్నట్లు తెలియజేసింది. వ్యయాలు తగ్గడం ప్రభావం చూపనున్నట్లు పేర్కొంది. ఐచి్చక వ్యయాలు తగ్గడంతో ఐటీ పరిశ్రమలో ప్రస్తావించదగ్గ మార్పులకు అవకాశంతక్కువేనని అభిప్రాయపడింది. కాగా.. యూఎస్ ఫెడ్ సానుకూల ధృక్పథం, పూర్తి చేయవలసిన భారీ ఆర్డర్లు వంటి అంశాలు ఈ ఏడాది(2024–25)లో ప్రోత్సాహక ఫలితాలకు దారిచూపవచ్చని అంచనా వేసింది. క్యూ4లో డీల్స్ ద్వారా సాధించే మొత్తం కాంట్రాక్టుల విలువ(టీసీవీ) సానుకూలంగానే కనిపిస్తున్నప్పటికీ ఆదాయంపై స్థూల ఆర్థిక పరిస్థితుల కారణంగా ఒత్తిడి కనిపించవచ్చని వివరించింది. ఐటీ సేవలకు ప్రధానమైన బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సరీ్వసులు, ఇన్సూరెన్స్(బీఎఫ్ఎస్ఐ)తోపాటు, రిటైల్, హైటెక్, కమ్యూనికేషన్స్ విభాగాలతోపాటు.. ప్రాంతాలవారీగా కూడా బలహీనతలు కనిపిస్తున్నట్లు ఐటీ విశ్లేషకులు పేర్కొన్నారు. గ్లోబల్ దిగ్గజాలు సైతం గ్లోబల్ దిగ్గజాలు యాక్సెంచర్, కాగి్నజెంట్ టెక్నాలజీ, క్యాప్‌జెమిని సైతం ఈ క్యాలండర్ ఏడాది(2024) ఓమాదిరి పనితీరును ఊహిస్తున్నాయి. ఫలితంగా తొలి అర్ధభాగం(జనవరి–జూన్)లో అంతంతమాత్ర వృద్ధిని అంచనా వేశాయి. అయితే ద్వితీయార్ధం(జూలై–డిసెంబర్)లో రికవరీకి వీలున్నట్లు అభిప్రాయపడ్డాయి. కాగా.. దేశీ ఐటీ దిగ్గజాలలో హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ రక్షణాత్మక బిజినెస్ మిక్స్ ద్వారా లబ్ది పొందే వీలున్నట్లు మోతీలాల్ ఓస్వాల్ పేర్కొంది. ఇక డిజిటల్, బిజినెస్ ట్రాన్స్ఫార్మేషన్ విభాగాల కారణంగా టీసీఎస్, ఇన్ఫోసిస్ కీలక పురోగతిని సాధించవచ్చని అభిప్రాయపడింది. -
ఆర్‌క్యాప్ నష్టాలు తగ్గాయ్
న్యూఢిల్లీ: ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుని రుణ పరిష్కార ప్రణాళికలకు చేరిన అనిల్ అంబానీ కంపెనీ రిలయన్స్ క్యాపిటల్(ఆర్‌క్యాప్) గత ఆర్థిక సంవత్సరం(2022–23) చివరి త్రైమాసికంలో ఆసక్తికర ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన జనవరి–మార్చి(క్యూ4)లో నష్టాలను భారీగా తగ్గించుకుంది. రూ. 1,488 కోట్ల నికర నష్టం ప్రకటించింది. అంతక్రితం ఏడాది(2021–22) ఇదే కాలంలో రూ. 4,249 కోట్ల నికర నష్టం నమోదైంది. మొత్తం ఆదాయం రూ. 4,770 కోట్ల నుంచి రూ. 4,436 కోట్లకు క్షీణించింది. అయితే మొత్తం వ్యయాలు సైతం రూ. 8,982 కోట్ల నుంచి రూ. 5,949 కోట్లకు దిగివచ్చాయి. 2021 నవంబర్ 29న కంపెనీ దివాలా ప్రక్రియకు చేరిన సంగతి తెలిసిందే. ఇక స్టాండెలోన్ నష్టం భారీగా పెరిగి రూ. 1,389 కోట్లను తాకింది. అంతక్రితం కేవలం రూ. 25 కోట్ల నష్టం ప్రకటించింది. మొత్తం ఆదాయం రూ. 5 కోట్ల నుంచి రూ. 3 కోట్లకు తగ్గింది. -
ఇండియా సిమెంట్స్ నష్టాలు పెరిగాయ్, ఆస్తుల అమ్మకానికి ప్లాన్స్
చెన్నై: ప్రయివేట్ రంగ కంపెనీ ఇండియా సిమెంట్స్ గత ఆర్థిక సంవత్సరం(2022-23) చివరి త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించింది. జనవరి-మార్చి(క్యూ4)లో స్టాండెలోన్ నికర నష్టం పెరిగి రూ. 218 కోట్లకు చేరింది. అంతక్రితం ఏడాది(2021-22) ఇదే కాలంలో కేవలం రూ. 24 కోట్ల నష్టం నమోదైంది. ఇంధనం, విద్యుత్ వ్యయాలు భారీగా పెరగడం లాభాలను దెబ్బతీసింది. మొత్తం ఆదాయం మాత్రం రూ. 1,397 కోట్ల నుంచి రూ. 1,479 కోట్లకు ఎగసింది. పెట్టుబడి నష్టాలు, రైటాఫ్‌లను నమోదు చేయడంతో క్యూ4 ఫలితాలను పోల్చి చూడతగదని కంపెనీ పేర్కొంది. ఇక మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి కంపెనీ రూ. 189 కోట్ల నికర నష్టం ప్రకటించింది. 2021–22లో రూ. 39 కోట్ల నికర లాభం ఆర్జించింది. అయితే మొత్తం ఆదాయం రూ. 4,730 కోట్ల నుంచి రూ. 5,415 కోట్లకు జంప్ చేసింది. కాగా.. గతేడాది క్యూ1లో రూ. 76 కోట్ల లాభం, క్యూ2లో రూ. 138 కోట్ల నష్టం, క్యూ3లో రూ. 91 కోట్ల లాభం ప్రకటించడంతో పూర్తి ఏడాదికి రూ. 218 కోట్ల నష్టం నమోదైనట్లు కంపెనీ వివరించింది. క్యూ3లో ఆస్తుల విక్రయం ద్వారా రూ. 294 కోట్లు ఆర్జించడంతో లాభాలు ప్రకటించినట్లు వెల్లడించింది. ఇదీ చదవండి: వామ్మో! ఏటీఎం నుంచి విషపూరిత పాము పిల్లలు: షాకింగ్ వీడియో ఆస్తుల మానిటైజేషన్ తమిళనాడులోని ఆస్తుల మానిటైజేషన్ ప్రక్రియ చివరి దశకు చేరుకున్నట్లు ఇండియా సిమెంట్స్ వైస్‌చైర్మన్, ఎండీ ఎన్.శ్రీనివాసన్ పేర్కొన్నారు. ఆసక్తిగల పార్టీలతో చర్చలు తుది దశకు చేరుకున్నట్లు వెల్లడించారు. కంపెనీకిగల మొత్తం 26,000 ఎకరాలలో 1,000 ఎకరాల భూమిని మానిటైజ్ చేయనున్నట్లు తెలియజేశారు. తద్వారా మొత్తం రూ. 500 కోట్లమేర రుణ భారాన్ని తగ్గించుకోనున్నట్లు వివరించారు. కంపెనీకి మొత్తం రూ. 2,900 కోట్ల రుణాలున్నట్లు వెల్లడించారు. (విప్రో చైర్మన్ కీలక నిర్ణయం, సగం జీతం కట్) డోంట్ మిస్ టూ క్లిక్ హియర్: సాక్షిబిజినెస్ -
గత ఏడాదితో పోలిస్తే.. జొమాటోకు భారీగా తగ్గిన నష్టాలు!
న్యూఢిల్లీ: ఆన్లైన్ ఫుడ్ డెలివరీ దిగ్గజం జొమాటో గత ఆర్థిక సంవత్సరం(2022–23) చివరి త్రైమాసికంలో ఆసక్తికర ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన జనవరి–మార్చి(క్యూ4)లో నికర నష్టం దాదాపు సగానికి తగ్గి రూ. 188 కోట్లకు పరిమితమైంది. అంతక్రితం ఏడాది(2021–22) ఇదే కాలంలో రూ. 360 కోట్ల నష్టం నమోదైంది. మొత్తం ఆదాయం సైతం రూ. 1,212 కోట్ల నుంచి రూ. 2,056 కోట్లకు జంప్‌చేసింది. అయితే మొత్తం వ్యయాలు రూ. 1,702 కోట్ల నుంచి భారీగా పెరిగి రూ. 2,431 కోట్లను తాకాయి. ఇక మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి కన్సాలిడేటెడ్ నికర నష్టం రూ. 1,226 కోట్ల నుంచి తగ్గి రూ. 971 కోట్లకు పరిమితమైంది. మొత్తం ఆదాయం రూ. 7,079 కోట్లకు జంప్‌చేసింది. 2021–22లో రూ. 4,192 కోట్ల ఆదాయం నమోదైంది. ఫుడ్ డెలివరీ బిజినెస్ సీఈవోగా రాకేష్ రంజన్, సీవోవోగా రిన్షుల్ చంద్రను ఎంపిక చేసినట్లు జొమాటో పేర్కొంది. జొమాటో హైపర్‌ప్యూర్ సీఈవోగా రిషి అరోరాను నియమించినట్లు తెలియజేసింది. -
లాభాల్లోకి టాటా మోటార్స్
న్యూఢిల్లీ: ఆటో రంగ దేశీ దిగ్గజం టాటా మోటార్స్ గత ఆర్థిక సంవత్సరం(2022–23) చివరి త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన జనవరి–మార్చి(క్యూ4)లో నష్టాలను వీడి రూ. 5,408 కోట్ల నికర లాభం ప్రకటించింది. అంతక్రితం ఏడాది(2021–22) ఇదే కాలంలో రూ. 1,033 కోట్ల నికర నష్టం నమోదైంది. మొత్తం ఆదాయం సైతం రూ. 78,439 కోట్ల నుంచి రూ. 1,05,932 కోట్లకు ఎగసింది. ఇక ఇదే కాలంలో స్టాండెలోన్ నికర లాభం రూ. 413 కోట్ల నుంచి రూ. 2,696 కోట్లకు జంప్‌చేసింది. కాగా.. మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి సైతం టర్న్అరౌండ్ సాధించింది. రూ. 2,414 కోట్ల కన్సాలిడేటెడ్ నికరలాభం ఆర్జించింది. 2021–22లో రూ. 11,441 కోట్ల నికర నష్టం ప్రకటించింది. మొత్తం ఆదాయం సైతం రూ. 2,78,454 కోట్ల నుంచి రూ. 3,45,967 కోట్లకు ఎగసింది. వాటాదారులకు షేరుకి రూ. 2 డివిడెండ్ ప్రకటించింది. డీవీఆర్కు రూ. 2.1 చెల్లించనుంది. భారీ పెట్టుబడులు: గతేడాది క్యూ4లో బ్రిటిష్ లగ్జరీ కార్ల అనుబంధ సంస్థ జాగ్వార్ ల్యాండ్‌రోవర్(జేఎల్ఆర్) ఆదాయం 49 శాతం జంప్‌చేసి 7.1 బిలియన్ డాలర్లకు చేరింది. పూర్తి ఏడాదికి 25 శాతం అధికంగా 22.8 బిలియన్ డాలర్ల టర్నోవర్ సాధించింది. క్యూ4లో 24 శాతం వృద్ధితో 94,649 జేఎల్ఆర్ వాహనాలు విక్రయమైనట్లు సంస్థ తాత్కాలిక సీఈవో ఆడ్రియన్ మార్డెల్ తెలియజేశారు. పూర్తి ఏడాదికి 9% అధికంగా 3,21,362 యూనిట్ల హోల్‌సేల్ అమ్మకాలు నమోదైనట్లు వెల్లడించారు. ఇక దేశీయంగా ప్యాసింజర్ వాహన హోల్‌సేల్ విక్రయాలు 45 శాతం ఎగసి 5.38 లక్షలను తాకినట్లు టాటా మోటార్స్ పీవీ ఎండీ శైలేష్ చంద్ర పేర్కొన్నారు. 2023–24లో రూ. 38,000 కోట్ల పెట్టుబడి ప్రణాళికలున్నట్లు టాటా మోటార్స్ గ్రూప్ సీఎఫ్‌వో పీబీ బాలాజీ వెల్లడించారు. ఫలితాల నేపథ్యంలో టాటా మోటార్స్ షేరు 0.8 శాతం బలపడి రూ. 516 వద్ద ముగిసింది. -
వేదాంతా లాభం క్షీణత
న్యూఢిల్లీ: డైవర్సిఫైడ్ దిగ్గజం వేదాంతా లిమిటెడ్ గత ఆర్థిక సంవత్సరం(2022–23) చివరి త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన జనవరి–మార్చి(క్యూ4)లో నికర లాభం 57 శాతం క్షీణించి రూ. 3,132 కోట్లకు పరిమితమైంది. అంతక్రితం ఏడాది(2021–22) ఇదే కాలంలో రూ. 7,261 కోట్లు ఆర్జించింది. అల్యూమినియం బిజినెస్ తగ్గడం, రైటాఫ్‌లు లాభాలను దెబ్బతీశాయి. అయితే త్రైమాసికవారీగా(క్యూ3) చూస్తే నికర లాభం(రూ. 3,092 కోట్లు) 1 శాతం బలపడింది. అయితే మొత్తం ఆదాయం 5 శాతం క్షీణించి రూ. 37,225 కోట్లను తాకింది. అంతక్రితం క్యూ4లో రూ. 39,342 కోట్ల టర్నోవర్ సాధించింది. జింక్ నుంచి ముడిఇనుము వరకూ కమోడిటీ ధరలు తగ్గడం ఫలితాలను ప్రభావితం చేసింది. వీటికితోడు చమురు, గ్యాస్ బిజినెస్ నుంచి రూ. 1,336 కోట్లమేర అనుకోని నష్టం వాటిల్లినట్లు కంపెనీ వెల్లడించింది. ఇక గతేడాది కంపెనీ చరిత్రలోనే అత్యధికంగా రూ. 1,45,404 కోట్ల టర్నోవర్ అందుకుంది. పెట్టుబడులకు సై గ్రూప్ వ్యవస్థాపకుడు, చైర్మన్ అనిల్ అగర్వాల్ సోదరుడు నవీన్ అగర్వాల్, కుమార్తె ప్రియా అగర్వాల్‌లను బోర్డు ఐదేళ్లపాటు డైరెక్టర్లుగా తిరిగి నియమించినట్లు వేదాంతా పేర్కొంది. చమురు, గ్యాస్ అన్వేషణకు 29.6 కోట్ల డాలర్ల పెట్టుబడి వ్యయాలకూ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు తెలియజేసింది. ఈ ఆర్థిక సంవత్సరం(2023–24) 1.7 బిలియన్ డాలర్ల పెట్టుబడి ప్రణాళికలున్నట్లు వెల్లడించింది. ఫలితాల నేపథ్యంలో వేదాంతా షేరు 2.3 శాతం నీరసించి రూ. 275 వద్ద ముగిసింది. -
బాష్‌కు రూ.399 కోట్ల లాభం
న్యూఢిల్లీ: ఆటో, గృహోపకరణాల సంస్థ బాష్ లిమిటెడ్ గత ఆర్థిక సంవత్సరం మార్చితో ముగిసిన చివరి త్రైమాసికంలో లాభాల్లో 14 శాతం వృద్ధిని చూపించింది. రూ.399 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. ఇది అంతక్రితం ఏడాది ఇదే కాలంలో రూ.350 కోట్లుగా ఉంది. ఆదాయం రూ.3,311 కోట్ల నుంచి రూ.4,063 కోట్లకు వృద్ధి చెందింది. ఇక 2022–23 పూర్తి ఆర్థిక సంవత్సరానికి రూ.1,424 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని బాష్ ప్రకటించింది. ఇది అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో రూ.1,217 కోట్లుగా ఉండడం గమనార్హం. ఆదాయం పూర్తి ఆర్థిక సంవత్సరానికి రూ.11,781 కోట్ల నుంచి రూ.14,929 కోట్లకు పెరిగింది. ‘‘2022 సంవత్సరాన్ని భారత్‌లో శతాబ్ది సంవత్సరంగా జరుపుకున్నాం. అదే ఏడాది మార్కెట్లో ఎన్నో సవాళ్లను చవిచూశాం. ఎన్నో అవరోధాలు ఉన్నా బలమైన వృద్ధితో సానుకూలంగా ముగించాం’’ అని బాష్ లిమిటెడ్ ఎండీ సౌమిత్రా భట్టాచార్య తెలిపారు. (చదవండి: అయ్యయ్యో! ఐకానిక్ స్టార్, ప్రిన్స్ మహేష్, డార్లింగ్ ప్రభాస్? ఎందుకిలా?) ఎన్నో సవాళ్లు ఉన్నా కానీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనూ ఆటోమోటివ్ మార్కెట్ పట్ల ఆశావహ అంచనాలతో ఉన్నట్టు చెప్పారు. ఒక్కో షేరుకు తుది డివిడెండ్ కింద రూ.280 చెల్లించాలని కంపెనీ నిర్ణయించింది. దీంతో గత ఆర్థిక సంవత్సరానికి మొత్తంగా ఒక్కో షేరుకు రూ.480 డివిడెండ్ ప్రకటించినట్టు అవుతుంది. ఇదీ చదవండి: సగానికి పైగా అవే కొంపముంచుతున్నాయి: సంచలన సర్వే -
ఎల్అండ్టీ రూ.24 డివిడెండ్
న్యూఢిల్లీ: ఇంజనీరింగ్, నిర్మాణ రంగ దిగ్గజం ఎల్అండ్టీ మార్చి త్రైమాసికానికి నికర లాభంలో 10 శాతం వృద్ధిని నమోదు చేసింది. క్రితం ఏడాది ఇదే కాలంలో ఉన్న రూ.3,621 కోట్ల నుంచి రూ.3,987 కోట్లకు చేరింది. ఆదాయం రూ.52,851 కోట్ల నుంచి రూ.58,335 కోట్లకు వృద్ధి చెందింది. ఒక్కో షేరుకు రూ.24 చొప్పున డివిడెండ్ ఇవ్వాలని కంపెనీ బోర్డు నిర్ణయం తీసుకుంది. కంపెనీ గడిచిన ఆర్థిక సంవత్సరంలో 19 శాతం అధికంగా రూ.2,30,528 కోట్ల విలువైన ఆర్డర్లను సొంతం చేసుకుంది. ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.2 లక్షల కోట్లకు పైగా ఆర్డర్లను పొందడం ఇదే మొదటిసారి అని ఎల్అండ్టీ సీఈవో ఎస్ఎన్ సుబ్రమణ్యం తెలిపారు. మొత్తం ఆర్డర్ల పుస్తకం మార్చి చివరికి రూ.4 లక్షల కోట్లుగా ఉన్నట్టు చెప్పారు. ఎల్అండ్టీ కన్సాలిడేటెడ్ ఆదాయం 2022–23లో 17 శాతం వృద్ధితో రూ.1.83 లక్షల కోట్లకు చేరుకోగా, లాభం 21 శాతం పెరిగి రూ.10,471 కోట్లుగా నమోదైంది. చైర్మన్‌గా తప్పుకోనున్న ఏఎం నాయక్ ఎల్అండ్టీ నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా ఏఎం నాయక్ 2023 సెప్టెంబర్ 30 నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నారు. దీంతో ప్రస్తుతం సీఈవో, ఎండీగా ఉన్న ఎస్ఎన్ సుబ్రమణ్యం చైర్మన్, ఎండీగా 2023 అక్టోబర్ 1 నుంచి సేవలు అందించనున్నట్టు ఎల్అండ్టీ ప్రకటించింది. గౌరవ చైర్మన్‌గా నాయక్ కొనసాగుతారని తెలిపింది. -
యూపీఎల్ లాభాలకు గండి
ముంబై: సస్య సంరక్షణ ఉత్పత్తులను అందించే యూపీఎల్ మార్చి త్రైమాసికానికి నిరుత్సాహకర ఫలితాలను ప్రకటించింది. కన్సాలిడేటెడ్ (అనుబంధ సంస్థలు కలిపి) నికర లాభం క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 43 శాతం తగ్గి రూ.792 కోట్లకు పరిమితమైంది. అంతక్రితం ఏడాది ఇదే కాలానికి లాభం రూ.1,379 కోట్లుగా ఉండడం గమనార్హం. ఆదాయం 5 శాతం పెరిగి క్రితం ఏడాది ఇదే కాలంలో ఉన్న రూ.15,861 కోట్ల నుంచి రూ.16,569 కోట్లకు వృద్ధి చెందింది. 2022–23 పూర్తి ఆర్థిక సంవత్సరానికి కన్సాలిడేటెడ్ ఆదాయం 16 శాతం పెరిగి రూ.53,576 కోట్లుగా నమోదైంది. నికర లాభం పెద్దగా వృద్ధి లేకుండా రూ.4,437 కోట్ల నుంచి రూ.4414 కోట్లకు చేరింది. ఒక్కో షేరుకు రూ.10 చొప్పున డివిడెండ్‌ను కంపెనీ బోర్డ్ సిఫారసు చేసింది. గత త్రైమాసికంలో తాము ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నట్టు యూపీఎల్ సీఈవో మైక్ ఫ్రాంక్ తెలిపారు. ఉత్పత్తుల ధరలు గణనీయంగా తగ్గడం, సాగు సీజన్ ఆలస్యం కావడం లాభాలపై ప్రభావం చూపించినట్టు చెప్పారు. స్థూల రుణ భారం 600 మిలియన్ డాలర్లు మేర, నికర రుణ భారం 440 మిలియన్ డాలర్ల మేర తగ్గించుకున్నట్టు ప్రకటించారు. 2023–24లో మార్కెట్ అవరోధాలను అధిగమించి, లాభాల్లో మెరుగైన వృద్ధి నమోదు చేస్తామని పేర్కొన్నారు. -
ఫలితాలు, గ్లోబల్ ట్రెండ్ కీలకం
న్యూఢిల్లీ: దేశీ స్టాక్ మార్కెట్ల నడకను ఈ వారం పలు అంశాలు ప్రభావితం చేయనున్నాయి. ప్రస్తుతం కార్పొరేట్ ఫలితాల సీజన్ ఊపందుకుంది. జనవరి–మార్చి(క్యూ4) ఫలితాలతోపాటు పూర్తి ఏడాది(2022–23)కి లిస్టెడ్ కంపెనీలు పనితీరును వెల్లడిస్తున్నాయి. వీటికితోడు విదేశీ స్టాక్ మార్కెట్లలో నెలకొనే పరిస్థితులు సైతం దేశీయంగా ట్రెండ్‌ను నిర్దేశించనున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. ఈ వారం పలు దిగ్గజాలు ఆర్థిక ఫలితాలు ప్రకటించనున్నాయి. జాబితాలో ఏషియన్ పెయింట్స్, అపోలో టైర్స్ సిప్లా, ఐషర్ మోటార్స్, ఎల్అండ్టీ, యూపీఎల్, టాటా మోటార్స్ తదితరాలున్నాయి. కోల్ ఇండియా వీక్ వారాంతాన యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కోల్ ఇండియా క్యూ4 ఫలితాలు ప్రకటించాయి. యూనియన్ బ్యాంక్ లాభం 81 శాతం జంప్‌చేయగా.. కోల్ ఇండియా లాభం 18 శాతం క్షీణించింది. దీంతో నేడు(సోమవారం) ఈ కౌంటర్లపై ఫలితాల ప్రభావం కనిపించనున్నట్లు స్టాక్ నిపుణులు భావిస్తున్నారు. ఈ బాటలో కెనరా బ్యాంక్, యూపీఎల్(8న), లుపిన్(9న), బాష్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్, ఎల్అండ్టీ(10న), ఏషియన్ పెయింట్స్, సీమెన్స్(11న), సిప్లా, హెచ్‌పీసీఎల్, టాటా మోటార్స్(12న) పనితీరు వెల్లడించనున్నాయి. ఆర్థిక గణాంకాలు మార్చి నెలకు పారిశ్రామికోత్పత్తి(ఐఐపీ), తయారీ రంగ గణాంకాలతోపాటు, రిటైల్ ధరల ద్రవ్యోల్బణం(సీపీఐ) వివరాలు 12న విడుదలకానున్నాయి. ఏప్రిల్ నెలకు 10న యూఎస్, 11న చైనా ద్రవ్యోల్బణ గణాంకాలు తెలియరానున్నాయి. కాగా.. 10న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఫలితాలు 13న వెలువడనున్నాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీసహా పలు ప్రధాన పార్టీలు పోటీపడుతుండటంతో ఫలితాలకు ప్రాధాన్యమున్నట్లు విశ్లేషకులు తెలియజేశారు. ఆటుపోట్ల మధ్య గత వారం దేశీ స్టాక్ మార్కెట్లు అక్కడక్కడే అన్నట్లుగా ముగిశాయి. సెన్సెక్స్ స్వల్పంగా 58 పాయింట్లు నీరసించి 61,112 వద్ద నిలవగా.. నిఫ్టీ 4 పాయింట్ల నామమాత్ర లాభంతో 18,069 వద్ద ముగిసింది. అయితే చిన్న షేర్లకు డిమాండ్ పుట్టడంతో బీఎస్ఈ మిడ్, స్మాల్ క్యాప్ ఇండెక్సులు 1.3 శాత చొప్పున బలపడ్డాయి. ఇతర అంశాలు ఇటీవల విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) దేశీ స్టాక్స్‌పట్ల ఆసక్తిని చూపుతున్నారు. ఏప్రిల్ 26– మే 5 మధ్య కాలంలో ఎఫ్‌పీఐలు రూ. 11,700 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేసినట్లు జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ నిపుణులు వీకే విజయకుమార్ తెలియజేశారు. దీంతో ఎఫ్‌పీఐల పెట్టుబడులు ఇకపై కీలకంగా నిలవనున్నట్లు అభిప్రాయపడ్డారు. వీటికితోడు ముడిచమురు ధరలు, డాలరుతో మారకంలో రూపాయి కదలికలు సైతం సెంటిమెంటును ప్రభావితంచేయనున్నట్లు స్వస్తికా ఇన్వెస్ట్‌మార్ట్ సీనియర్ విశ్లేషకులు ప్రవేశ్ గౌర్ పేర్కొన్నారు. -
లాభాల్లో అదానీ పవర్ సూపర్ - గతం కంటే రెట్టింపు వృద్ధితో పరుగులు..
భారతదేశంలో విద్యుత్ ఉత్పత్తి చేసే అతిపెద్ద సంస్థల్లో ఒకటైన 'అదానీ పవర్ లిమిటెడ్' (Adani Power Ltd) 2023 ఆర్థిక సంవత్సరం (FY23) క్యూ4లో భారీ లాభాలను ఆర్జించింది. నికర లాభం 12.9 శాతం పెరిగి రూ. 5242.48 కోట్లకు చేరింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. కంపెనీ ఆదాయం పెరగటానికి మెరుగైన టారిఫ్ రియలైజేషన్, హయ్యర్ వన్ టైమ్ రికగ్నైజేషన్ వంటివి మాత్రమే కాకుండా అధిక బొగ్గు దిగుమతి కూడా కారణమని తెలుస్తోంది. నివేదికల ప్రకారం.. FY23లో అదానీ పవర్ నికర లాభం రూ.10,726 కోట్లకు పెరిగింది. అయితే అంతకు ముందు సంవత్సరం ఈ ఆదాయం రూ. 4,911.5 కోట్లు కావడం గమనార్హం. ఆంటే మునుపటికంటే ఈ సారి ఆదాయం రెండు రెట్లు కంటే ఎక్కువని స్పష్టమవుతోంది. ఇక త్రైమాసికం వారీగా పరిశీలిస్తే.. నాల్గవ త్రైమాసికంలో కంపెనీ ఆదాయం రూ. 10,795 కోట్లు కాగా, అంతకు ముందు సంవత్సరం త్రైమాసికంలో ఈ ఆదాయం రూ. 13,308 కోట్లు. FY22లో కంటే FY23 ఆదాయం 35.8 శాతం పెరిగి రూ. 43,041 కోట్లకు చేరింది. ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాల కోసం భారతదేశంలో పెరుగుతున్న డిమాండ్ దాని ఆర్ధిక వృద్ధికి మాత్రమే కాకుండా తరువాత దశకు స్ప్రింగ్‌బోర్డ్‌గా పనిచేస్తుందని ఈ సందర్భంగా అదానీ గ్రూప్ చైర్మన్ 'గౌతమ్ ఆదానీ' అన్నారు. అంతే కాకుండా దేశం మౌలిక సదుపాయాల సమ్మేళనంగా నిలబడటానికి అదానీ గ్రూప్ స్థిరంగా కట్టుబడి ఉంటుందని పేర్కొన్నారు. (ఇదీ చదవండి: ఆ బ్యాంకు క్రెడిట్, డెబిట్ కార్డులు వాడుతున్నారా? కొత్త రూల్స్ వచ్చేశాయ్.. చూసారా!) ఎర్నింగ్ బిఫోర్ ఇంట్రస్ట్, టాక్స్, డిప్రెషియేట్ అండ్ అమోర్టైజేషన్ (EBITDA) ముందు కంపెనీ ఆదాయం (FY22లో) రూ. 13,789 కోట్లు నుంచి రూ. 14,312 కోట్లు పెరిగింది. బొగ్గు ఆధారిత థర్మల్ విద్యుత్ ఉత్పత్తి ఏడాది ప్రాతిపదికన 12.1 శాతం పెరిగి, గ్యాస్ ఉత్పత్తి కూడా క్యూ4లో స్వల్పంగా మెరుగుపడింది. మొత్తం మీద ఆదానీ కంపెనీ భారీ లాభాలతో ముందుకు దూసుకెళుతోంది. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవడానికి సాక్షి బిజినెస్ చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను, సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. -
విప్రో లాభం ఫ్లాట్
న్యూఢిల్లీ: ఐటీ సేవల దిగ్గజం విప్రో లిమిటెడ్ గత ఆర్థిక సంవత్సరం (2022–23) చివరి త్రైమాసికంలో ఆసక్తికర ఫలితాలు ప్రకటించింది. జనవరి–మార్చి (క్యూ4)లో నికర లాభం నామమాత్ర వెనకడుగుతో రూ. 3,075 కోట్లకు చేరింది. అంతక్రితం ఏడాది (2021–22) ఇదే కాలంలో రూ. 3,087 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం మాత్రం 11 శాతం వృద్ధితో రూ. 23,190 కోట్లను అధిగమించింది. కాగా.. మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి సైతం విప్రో నికర లాభం 7 శాతం క్షీణించి రూ. 11,350 కోట్లకు పరిమితమైంది. అయితే మొత్తం ఆదాయం 14 శాతం పైగా ఎగసి రూ. 90,488 కోట్లను తాకింది. క్యూ4లో 1,823 మంది ఉద్యోగులు తగ్గడంతో మొత్తం సిబ్బంది సంఖ్య 2,56,921కు పరిమితమైంది. అంచనాలు వీక్..: 2023–24 తొలి త్రైమాసికం(ఏప్రిల్–జూన్)లో ఐఎస్ఆర్ఈ సహా.. ఐటీ సర్వీసుల బిజినెస్ నుంచి ఆదాయం త్రైమాసికవారీగా 3–1% మధ్య క్షీణించవచ్చని విప్రో తాజాగా అంచనా వేసింది. వెరసి 275.3–281.1 కోట్ల డాలర్ల మధ్య ఆదాయం సాధించవచ్చని గైడెన్స్ ప్రకటించింది. బీఎఫ్ఎస్ఐ, రిటైల్‌లో మందగమన పరిస్థితులున్నా, డీల్ పైప్‌లైన్ పటిష్టంగా ఉన్నట్లు విప్రో సీఈవో, ఎండీ థియరీ డెలాపోర్ట్ పేర్కొన్నారు. షేర్ల బైబ్యాక్‌కు సై: సొంత ఈక్విటీ షేర్ల కొనుగోలు(బైబ్యాక్)కు బోర్డు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు విప్రో తాజాగా వెల్లడించింది. దీనిలో భాగంగా షేరుకి రూ. 445 ధర మించకుండా 26,96,62,921 షేర్లను బైబ్యాక్ చేయనున్నట్లు తెలియజేసింది. ఇవి కంపెనీ ఈక్విటీలో 4.91 శాతం వాటాకు సమానంకాగా..ఇందుకు రూ. 12,000 కోట్లవరకూ వెచ్చించనున్నట్లు వెల్లడించింది. ఫలితాల నేపథ్యంలో విప్రో షేరు ఎన్ఎస్ఈలో యథాతథంగా రూ. 375 వద్ద ముగిసింది. -
ఆర్థిక ఫలితాలు, ఎఫ్‌అండ్‌వో ఎఫెక్ట్!
న్యూఢిల్లీ: దేశీ స్టాక్ మార్కెట్లపై ఈ వారం ప్రధానంగా రెండు అంశాలు ప్రభావం చూపనున్నట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఏప్రిల్ నెల డెరివేటివ్ సిరీస్ గడువు గురువారం(27న) ముగియనుంది. అంటే ఏప్రిల్ నెల ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ కాంట్రాక్టుల గడువు తీరనుంది. దీంతో ట్రేడర్లు తమ పొజిషన్లను మే నెలకు రోలోవర్ చేసుకునే అవకాశముంది. మరోపక్క ఇప్పటికే ప్రారంభమైన క్యూ4(జనవరి–మార్చి) త్రైమాసిక ఫలితాల సీజన్ ఊపందుకోనుంది. గత ఆర్థిక సంవత్సరం(2022–23) చివరి త్రైమాసిక ఫలితాలతోపాటు.. పూర్తి ఏడాది పనితీరును సైతం దేశీ కార్పొరేట్ దిగ్గజాలు వరుస గా వెల్లడిస్తున్నాయి. ఇప్పటికే ఐటీ దిగ్గజాలు టీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ ఫలితాలు ప్రకటించగా.. డైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్, ప్రయివేట్ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంక్, యస్ బ్యాంక్ వారాంతాన పనితీరును వెల్లడించాయి. దీంతో సోమవారం(24న) రిలయ న్స్ ఇండస్ట్రీస్, ఐసీఐసీఐ బ్యాంక్ కౌంటర్లపై ఫలి తాల ప్రభావం కనిపించనున్నట్లు మార్కెట్ నిపుణు లు తెలియజేశారు. వెరసి మార్కెట్లు ఆటుపోట్లను చవిచూసే వీలున్నట్లు నిపుణులు భావిస్తున్నారు. ఫలితాల జోరు ఈ వారం మరిన్ని కంపెనీలు గతేడాది చివరి త్రైమాసిక ఫలితాలను ప్రకటించనున్నాయి. ఇండస్ఇండ్ బ్యాంక్, పెర్సిస్టెంట్ సిస్టమ్స్ ఈ నెల 24న, బజాజ్ ఆటో, నెస్లే ఇండియా, టాటా కన్జూమర్ ప్రొడక్టŠస్ 25న, బజాజ్ ఫైనాన్స్, హెచ్డీఎఫ్సీ లైఫ్ ఇన్సూరెన్స్, ఇండస్ టవర్స్, ఎల్అండ్టీ టెక్నాలజీ సర్వీసెస్, మారుతీ సుజుకీ, ఒరాకిల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సాఫ్ట్వేర్, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ 26న ఫలితాలు వెల్లడించనున్నాయి. ఈ బాటలో ఇతర దిగ్గజాలు ఏసీసీ, యాక్సిస్ బ్యాంక్, బజాజ్ ఫిన్సర్వ్, బజాజ్ హోల్డింగ్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్, హిందుస్తాన్ యూనిలీవర్, ఎల్టీఐ మైండ్‌ట్రీ, టెక్ మహీంద్రా, విప్రో 27న, ఎల్అండ్టీ ఫైనాన్స్ హోల్డింగ్స్, ఎంఅండ్ఎం ఫైనాన్షియల్ సర్వీసెస్, అల్ట్రాటెక్ సిమెంట్ 28న క్యూ4తోపాటు.. పూర్తి ఏడాదికి పనితీరును తెలియజేయనున్నాయి. ఇతర అంశాలూ కీలకమే నెలల తరబడి రష్యా– ఉక్రెయిన్ మధ్య యుద్ధం కొ నసాగుతుండటం, అమెరికా, యూరప్‌లలో బ్యాంకింగ్ ఆందోళనలు, ఆర్థిక మాంద్యంపై ఆందోళనలు వంటి అంశాల నేపథ్యంలో ప్రపంచ స్టాక్ మార్కెట్లలో నెలకొనే ట్రెండ్ దేశీయంగానూ ప్రభావం చూపనుంది. దీనికితోడు ఇటీవల డాలరుకు పోటీ గా చైనా యువాన్ తదితర కరెన్సీలపై పలు దేశాలు దృష్టి సారిస్తున్నాయి. ఇటీవల డాలరుతో మారకంలో రూపాయి కొంతమేర రికవరీ సాధించినప్పటికీ తీవ్ర ఆటుపోట్లను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. మరోవైపు ముడిచమురు ధరలకు సైతం ప్రాధాన్యత ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు. విదేశీ అంశాలకూ ప్రాధాన్యం దేశీయంగా సెంటిమెంటును ప్రభావితం చేయగల విదేశీ అంశాల విషయానికి వస్తే.. మార్చి నెలకు మన్నికైన వస్తువుల ఆర్డర్ల గణాంకాలను ఈ నెల 26న యూఎస్ విడుదల చేయనుంది. మార్చి నెలకు చైనా పారిశ్రామికోత్పత్తి గణాంకాలు ఈ నెల 27న వెల్లడికానున్నాయి. బ్యాంక్ ఆఫ్ జపాన్(బీవోజే) వడ్డీ రేట్లపై నిర్ణయాలను 28న ప్రకటించనుంది. ఇప్పటికే అనుసరిస్తున్న సరళతర విధానాలనే బీవోజే మరోసారి అవలంబించే వీలున్నట్లు బ్యాంకింగ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. గత వారమిలా.. ఆటుపోట్ల మధ్య దేశీ స్టాక్ మార్కెట్లు గత వారం స్వల్ప నష్టాలతో ముగిశాయి. అయితే బీఎస్ఈ మిడ్, స్మాల్ క్యాప్ ఇండెక్సులు నామమాత్రంగా బలపడ్డాయి. గత వారం సెన్సెక్స్ 776 పాయింట్లు క్షీణించి 59,655 వద్ద స్థిరపడగా.. నిఫ్టీ 204 పాయింట్లు తక్కువగా 17,624 వద్ద ముగిసింది. బీఎస్ఈ మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.5 శాతం లాభంతో 24,845 వద్ద, స్మాల్ క్యాప్ 0.3 శాతం పుంజుకుని 28,234 వద్ద నిలిచాయి. ఎఫ్‌పీఐల పెట్టుబడులు దేశీ మార్కెట్లను ప్రభావితం చేయగల విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) కొత్త ఆర్థిక సంవత్సరం(2023–24) తొలి నెల(ఏప్రిల్)లో ఇప్పటివరకూ నికరంగా రూ. 8,643 కోట్లు ఇన్వెస్ట్ చేశారు. గత నెల(మార్చి)లోనూ ఎఫ్‌పీఐలు నికరంగా రూ. 7,936 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేసిన విషయం విదితమే. ఇందుకు ప్రధానంగా అదానీ గ్రూప్ కంపెనీలలో యూఎస్ సంస్థ జీక్యూజీ పార్ట్నర్స్ రూ. 7,936 కోట్లు ఇన్వెస్ట్ చేయడం దోహదపడింది. ఈ నెల తొలి రెండు వారాలలో ఎఫ్‌పీఐలు ఫైనాన్షియల్ రంగ స్టాక్స్‌లో రూ. 4,410 కోట్లు ఇన్వెస్ట్ చేయడం గమనార్హం! అయితే గతేడాది(2022–23) ఎఫ్‌పీఐలు దేశీ స్టాక్ మార్కెట్ల నుంచి నికరంగా రూ. 37,631 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్న సంగతి తెలిసిందే. ఇందుకు ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల పెంపు, రష్యా– ఉక్రెయిన్ యుద్ధ భయాలు, ఆర్థిక అనిశ్చితులు వంటి అంశాలు ప్రభావం చూపాయి. -
హింద్ జింక్ లాభం క్షీణత
న్యూఢిల్లీ: హిందుస్తాన్ జింక్ గత ఆర్థిక సంవత్సరం(2022–23) చివరి త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన జనవరి–మార్చి (క్యూ4) లో నికర లాభం 12 శాతం క్షీణించి రూ. 2,583 కోట్లకు పరిమితమైంది. పెరిగిన వ్యయాలు ప్రభావం చూపాయి. అంతక్రితం ఏడాది(2021–22) క్యూ4లో రూ. 2,928 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం రూ. 9,074 కోట్ల నుంచి రూ. 8,863 కోట్లకు నీరసించింది. కాగా.. మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి నికర లాభం రూ. 10,511 కోట్లకు ఎగసింది. -
జియో లాభం జూమ్
న్యూఢిల్లీ: ఆర్ఐఎల్ అనుబంధ సంస్థ, డిజిటల్ సర్వీసుల దిగ్గజం జియో ప్లాట్‌ఫామ్స్ గత ఆర్థిక సంవత్సరం(2022–23) చివరి త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన జనవరి–మార్చి(క్యూ4)లో నికర లాభం 16 శాతం బలపడి రూ. 4,984 కోట్లను తాకింది. అంతక్రితం ఏడాది(2021–22) క్యూ4లో రూ. 4,313 కోట్లు మాత్రమే ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం 14 శాతం పుంజుకుని రూ. 25,465 కోట్లను తాకింది. అంతక్రితం క్యూ4లో రూ. 22,261 కోట్ల ఆదాయం నమోదైంది. ఒక్కో వినియోగదారునిపై సగటు ఆదాయం (ఏఆర్పీయూ) 6.7 శాతం మెరుగై రూ. 178.8కు చేరింది. కాగా.. మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి నికర లాభం 23 శాతం జంప్‌చేసి రూ. 19,124 కోట్లయ్యింది. 2021–22లో రూ. 15,487 కోట్లు మాత్రమే ఆర్జించింది. మొత్తం ఆదాయం 20 శాతం ఎగసి రూ. 1,15,099 కోట్లకు చేరింది. క్యూ4లో 2.9 కోట్లమంది జత కలవడంతో మొత్తం కస్టమర్ల సంఖ్య 7 శాతం పెరిగి 43.93 కోట్లను తాకింది. -
రిలయన్స్ లాభాల రికార్డ్!
న్యూఢిల్లీ: డైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్ఐఎల్) గత ఆర్థిక సంవత్సరం(2022–23) చివరి త్రైమాసికంలో సరికొత్త రికార్డును సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన జనవరి–మార్చి(క్యూ4)లో నికర లాభం 19 శాతం ఎగసి రూ. 19,299 కోట్లను తాకింది. ఒక త్రైమాసికానికి కంపెనీ చరిత్రలోనే ఇది అత్యధికంకాగా.. అంతక్రితం ఏడాది(2021–22) క్యూ4లో రూ. 16,203 కోట్లు మాత్రమే ఆర్జించింది. రిటైల్, టెలికం విభాగాలతోపాటు చమురు, పెట్రోకెమికల్స్ బిజినెస్ వృద్ధి ఇందుకు దోహదం చేసింది. మొత్తం ఆదాయం సైతం రూ. 2.14 లక్షల కోట్ల నుంచి రూ. 2.19 లక్షల కోట్లకు బలపడింది. ఇక మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి రూ. 66,702 కోట్ల నికర లాభం ఆర్జించింది. ఇది కూడా సరికొత్త రికార్డుకాగా.. 2021–22లో రూ. కేవలం 60,705 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం దాదాపు రూ. 10 లక్షల కోట్లకు చేరింది. 2021–22లో రూ. 7.36 లక్షల కోట్ల ఆదాయం మాత్రమే అందుకుంది. పూర్తి ఏడాదికి ఆర్ఐఎల్ నిర్వహణ లాభం(ఇబిటా) తొలిసారి రూ. 1,54,691 కోట్లను తాకింది. ఇది 23 శాతం వృద్ధి. ఈ కాలంలో పెట్టుబడి వ్యయాలు రూ. 1,41,809 కోట్లుకాగా.. కంపెనీవద్దగల రూ. 1,93,282 కోట్ల నగదు బ్యాలెన్స్‌ను మినహాయిస్తే నికర రుణ భారం వార్షిక ఇబిటాకంటే తక్కువగా రూ. 1,10,218 కోట్లుగా నమోదైంది. అన్ని విభాగాల జోరు: క్యూ4లో ఆర్ఐఎల్ ఇబిటా 22 శాతం జంప్‌చేసి రూ. 41,389 కోట్లను తాకింది. రిఫైనింగ్, పెట్రోకెమికల్స్(ఓటూసీ) ఇబిటా 14 శాతంపైగా ఎగసి రూ. 16,293 కోట్లకు, టెలికంసహా డిజిటల్ సర్వీసులు 17 శాతం మెరుగుపడి రూ. 12,767 కోట్లకు, రిటైల్ విభాగం 33 శాతం దూసుకెళ్లి రూ. 4,769 కోట్లకు, ఆయిల్, గ్యాస్ ఇబిటా రెట్టింపై రూ. 3,801 కోట్లకు చేరాయి. డీజిల్, ఏటీఎఫ్ ఎగుమతులపై విండ్‌ఫాల్ ట్యాక్స్ లాభాలపై రూ. 711 కోట్లమేర ప్రభావం చూపినట్లు ఆర్ఐఎల్ పేర్కొంది. అంతక్రితం క్యూ4లో రూ. 1,898 కోట్లమేర ప్రభావం పడినట్లు ప్రస్తావించింది. ఆర్ఐఎల్ షేరు స్వల్ప వృద్ధితో 2,351 వద్ద క్లోజైంది. మార్కెట్ ముగిశాక ఫలితాలు వెలువడ్డాయి. రిలయన్స్ రిటైల్ భళా గతేడాది(2022–23) క్యూ4(జనవరి–మార్చి)లో రిలయన్స్ రిటైల్ నికర లాభం 13 శాతం వృద్ధితో రూ. 2,415 కోట్లను తాకింది. 2021–22 క్యూ4లో రూ. 2,139 కోట్లు మాత్రమే ఆర్జించింది. మొత్తం ఆదాయం మరింత అధికంగా 21 శాతం ఎగసి రూ. 61,559 కోట్లకు చేరింది. అంతక్రితం క్యూ4లో రూ. 50,834 కోట్ల అమ్మకాలు సాధించింది. ఆదాయంలో డిజిటల్, న్యూ కామర్స్ బిజినెస్ వాటా 17 శాతానికి చేరింది. ఇక మొత్తం స్టోర్ల సంఖ్య 18,040కు చేరింది. క్యూ4లో 2,844 స్టోర్లను జత చేసుకుంది. సర్వీసులతో కలిపి క్యూ4లో ఆదాయం రూ. 69,267 కోట్లను తాకగా.. ఇబిటా 33 శాతం వృద్ధితో రూ. 4,914 కోట్లకు చేరింది. మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి మొత్తం ఆదాయం 32 శాతం జంప్‌చేసి రూ. 2,30,931 కోట్లను తాకింది. నికర లాభం 30 శాతం ఎగసి రూ. 9,181 కోట్లయ్యింది. సర్వీసులతో కలిపి స్థూల ఆదాయం రూ. 2,60,364 కోట్లుగా నమోదైంది. దేశీయంగా రిటైల్ రంగంలో రిలయన్స్ అత్యుత్తమ వృద్ధిని చూపుతున్నట్లు కంపెనీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఈషా ఎం.అంబానీ పేర్కొన్నారు. ఆర్థిక వృద్ధిలో భాగం డిజిటల్ కనెక్టివిటీ, ఆర్గనైజ్డ్ రిటైల్ విభాగాలలో కంపెనీ కార్యకలాపాలు వ్యవస్థాగత సామర్థ్యాలకు బలాన్నిస్తున్నాయి. తద్వారా ప్రపంచంలోనే వేగవంత వృద్ధిని సాధిస్తున్న ఆర్థిక వ్యవస్థలో భాగమవుతున్నాయి. ఫైనాన్షియల్ సర్వీసుల విభాగాన్ని విడదీసి జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ పేరుతో లిస్ట్ చేయనున్నాం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2023–24)లో ఎంజే ఫీల్డ్, ఆర్క్లస్టర్ తదితరాలతో కలిపి కేజీ–డీ6 బ్లాకులో గ్యాస్ ఉత్పత్తి రోజుకి 3 కోట్ల ప్రామాణిక ఘనపుమీటర్లకు చేరే వీలుంది. –ముకేశ్ అంబానీ, రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్, ఎండీ -
అదరగొట్టిన రిలయన్స్ జియో
సాక్షి,ముంబై: రిలయన్స్ ఇండస్ట్రీస్ (RIL) టెలికాం విభాగం రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ మార్చి త్రైమాసిక ఫలితాల్లో అదర గొట్టింది. నికర లాభంతో 13 శాతం జంప్‌చేయగా, ఆదాయం 11.9 శాతం ఎగిసింది. కార్యకలాపాల ద్వారా ఆదాయం రూ. 23,394 కోట్లుగా ఉంది, గత ఏడాది ఇదే త్రైమాసికంలో రూ. 20,901 కోట్లతో పోలిస్తే 12 శాతం పెరిగిందని రిలయన్స్ జియో తెలిపింది. ఈ ఫలితాలు విశ్లేషకుల అంచనాలకు అనుగుణంగానే వచ్చినప్పటికీ, ఐదు త్రైమాసికాల్లో లాభం, రాబడి వృద్ధి మందగించడం గమనార్హం. దీనికి ఇటీవలి కాలంలో జియో టారిఫ్ పెంపు లేకపోవడం, అధిక ఖర్చులు కారణంగా మార్కెట్‌వర్గాలు భావిస్తున్నాయి. (నీకో నమస్కారం సామీ..బ్లూటిక్ తిరిగిచ్చేయ్! బిగ్‌బీ ఫన్నీ ట్వీట్ వైరల్) గత ఏడాది ఇదే త్రైమాసికంలో రూ. 4,173 కోట్లతో పోలిస్తే నికర లాభం సంవత్సరానికి 13 శాతం (YoY) పెరిగి రూ. 4,716 కోట్లకు చేరుకుంది. సీక్వెన్షియల్ ప్రాతిపదికన, డిసెంబర్ త్రైమాసికంలో రూ.4,638 కోట్ల లాభంతో పోలిస్తే లాభం 1.7 శాతం పెరిగింది. అలాగే ఈ త్రైమాసికంలో రూ.23,394 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. ఆదాయం క్వార్టర్ ఆన్ క్వార్టర్ ప్రాతిపదికన 1.7 శాతం పుంజుకుంది. ఈ త్రైమాసికంలో ఎబిటా రూ. 12,210 కోట్లుగాను, ఎబిటా మార్జిన్ 52.19 శాతంగా ఉంది. (నెట్‌ఫ్లిక్స్ స్కాం 2023 కలకలం: ఈ జాగ్రత్తలు తెలుసుకోండి!) -
హెచ్‌సీఎల్ టెక్ లాభం ప్లస్
న్యూఢిల్లీ: ఐటీ సేవల దేశీ దిగ్గజం హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ గత ఆర్థిక సంవత్సరం(2022–23) చివరి త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన జనవరి–మార్చి(క్యూ4)లో నికర లాభం 11 శాతం బలపడి రూ. 3,983 కోట్లను తాకింది. అంతక్రితం ఏడాది(2021–22) క్యూ4లో రూ. 3,599 కోట్లు ఆర్జించింది. అయితే త్రైమాసికవారీగా అంటే గతేడాది క్యూ3(అక్టోబర్–డిసెంబర్)లో సాధించిన రూ. 4,096 కోట్లతో పోలిస్తే నికర లాభం 3 శాతం తగ్గింది. కాగా.. ఈ క్యూ4లో మొత్తం ఆదాయం 18 శాతం ఎగసి రూ. 26,606 కోట్లకు చేరింది. అంతక్రితం ఏడాది క్యూ4లో రూ. 22,597 కోట్ల ఆదాయం నమోదైంది. ఇక మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి నికర లాభం 10 శాతం మెరుగై రూ. 14,845 కోట్లను తాకింది. 2021–22లో రూ. 13,499 కోట్లు మాత్రమే ఆర్జించింది. మొత్తం ఆదాయం రూ. లక్ష కోట్లను దాటి రూ. 1,01,456 కోట్లకు చేరింది! అంతక్రితం ఏడాది రూ. 85,651 కోట్ల ఆదాయం అందుకుంది. భారీ డీల్స్ అప్ క్యూ4లో హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ 13 భారీ డీల్స్ గెలుచుకుంది. వీటి విలువ 207.4 కోట్ల డాలర్లుకాగా.. వార్షికంగా 18 శాతం క్షీణించింది. ఈ కాలంలో కంపెనీ 3,674 మంది ఉద్యోగులను కొత్తగా నియమించుకుంది. దీంతో మొత్తం సిబ్బంది సంఖ్య 2,25,944కు చేరింది. ఉద్యోగ వలసల(అట్రిషన్) రేటు 19.5 శాతంగా నమోదైంది. డీల్ పైప్‌లైన్ దాదాపు కంపెనీ చరిత్రలోనే గరిష్టస్థాయికి చేరినట్లు కంపెనీ సీఈవో విజయ్‌కుమార్ పేర్కొన్నారు. గైడెన్స్ గుడ్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2023–24)లో ఆదాయం 6–8 శాతం వృద్ధి చెందగలదని హెచ్‌సీఎల్ టెక్ తాజాగా అంచనా(గైడెన్స్) వేసింది. వాటాదారులకు షేరుకి రూ. 18 చొప్పున డివిడెండును ప్రకటించింది. వరుసగా 81వ త్రైమాసికంలోనూ డివిడెండును చెల్లిస్తున్నట్లు తెలియజేసింది. ఫలితాల నేపథ్యంలో హెచ్‌సీఎల్ టెక్ షేరు నామమాత్ర నష్టంతో రూ. 1,037 వద్ద ముగిసింది. -
HDFC Bank Q4 Results: లాభాలతో అదరగొట్టిన హెచ్డీఎఫ్సీ బ్యాంక్..
ముంబై: ప్రయివేట్ రంగ దిగ్గజం హెచ్డీఎఫ్సీ బ్యాంక్ గత ఆర్థిక సంవత్సరం(2022–23) చివరి త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన జనవరి–మార్చి (క్యూ4)లో నికర లాభం 21 శాతం ఎగసి రూ. 12,595 కోట్లకు చేరింది. మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి సైతం నికర లాభం ఇదే స్థాయిలో బలపడి రూ. 45,997 కోట్లను అధిగమించింది. వాటాదారులకు షేరుకి రూ. 19 చొప్పున డివిడెండు ప్రకటించింది. మొత్తం బ్రాంచీల సంఖ్య 7,821కు చేరింది. క్యూ4లో 6,000 మందికి ఉపాధి కల్పించింది. మొత్తం సిబ్బంది సంఖ్య 1,73,222ను తాకింది. స్టాండెలోన్ సైతం క్యూ4లో స్టాండెలోన్ హెచ్డీఎఫ్సీ బ్యాంక్ నికర లాభం 20 శాతం పుంజుకుని రూ. 12,048 కోట్లకు చేరగా.. నికర వడ్డీ ఆదాయం 24 శాతం జంప్‌చేసి రూ. 23,352 కోట్లను తాకింది. నికర వడ్డీ మార్జిన్లు 4.1 శాతంగా నమోదుకాగా.. 17 శాతం రుణ వృద్ధిని సాధించింది. ఇతర ఆదాయం రూ. 7,637 కోట్ల నుంచి రూ. 8,731 కోట్లకు పెరిగింది. మొత్తం ప్రొవిజన్లు రూ. 3,312 కోట్ల నుంచి రూ. 2,685 కోట్లకు తగ్గాయి. కనీస మూలధన నిష్పత్తి 0.4 శాతం బలపడి 19.3 శాతాన్ని తాకింది. అనుబంధ సంస్థలలో బ్రోకింగ్ విభాగం లాభం రూ. 236 కోట్ల నుంచి రూ. 194 కోట్లకు నీరసించగా.. హెచ్డీబీ ఫైనాన్షియల్ సర్వీసెస్ లాభం 28 శాతం ఎగసి రూ. 545 కోట్లను దాటింది. -
ఎల్ఐసీ ఫలితాలు.. ప్చ్!
న్యూఢిల్లీ: ఇటీవలే ఐపీవోకు వచ్చిన ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం ఎల్ఐసీ జనవరి– మార్చిలో నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించింది. గతేడాది(2021–22) చివరి త్రైమాసికంలో స్టాండెలోన్ నికర లాభం 18 శాతం క్షీణించి రూ. 2,372 కోట్లకు పరిమితమైంది. అంతక్రితం ఏడాది(2020–21) ఇదే కాలంలో రూ. 2,893 కోట్లు ఆర్జించింది. అయితే నికర ప్రీమియం ఆదాయం రూ. 1.22 లక్షల కోట్ల నుంచి రూ. 1.44 లక్షల కోట్లకు ఎగసింది. ఇది 18 శాతం వృద్ధికాగా.. తొలిసారి వాటాదారులకు డివిడెండ్ ప్రకటించింది. షేరుకి రూ. 1.50 చొప్పున చెల్లించనుంది. కాగా.. క్యూ4లో కన్సాలిడేటెడ్ నికర లాభం సైతం 17 శాతం నీరసించి రూ. 2,409 కోట్లకు చేరింది. 2020–21 క్యూ4లో రూ. 2,917 కోట్లు ఆర్జించింది. మార్చికల్లా కంపెనీ సాల్వెన్సీ రేషియో 1.76 శాతం నుంచి 1.85 శాతానికి మెరుగుపడింది. కంపెనీ స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్టయిన తదుపరి తొలిసారి త్రైమాసిక ఫలితాలు విడుదల చేసింది. ఫలితాల నేపథ్యంలో ఎల్ఐసీ షేరు 2 శాతం బలపడి రూ. 837 వద్ద ముగిసింది. -
నష్టాల్లోకి సన్ ఫార్మా
న్యూఢిల్లీ: హెల్త్‌కేర్ రంగ దేశీ దిగ్గజం సన్ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్ గతేడాది(2021–22) చివరి త్రైమాసికంలో లాభాలను వీడి నష్టాలలోకి ప్రవేశించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన క్యూ4(జనవరి–మార్చి)లో రూ. 2,277 కోట్ల నికర నష్టం ప్రకటించింది. అంతక్రితం ఏడాది(2020–21) ఇదే కాలంలో రూ. 894 కోట్ల నికర లాభం ఆర్జించింది. ఇందుకు అనుకోని నష్టం ప్రభావం చూపగా.. మొత్తం ఆదాయం మాత్రం రూ. 8,464 కోట్ల నుంచి రూ. 9,386 కోట్లకు ఎగసింది. వాటాదారులకు షేరుకి రూ. 3 చొప్పున తుది డివిడెండ్ ప్రకటించింది. ఇక మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి రూ. 3,273 కోట్ల లాభం ఆర్జించింది. 2020–21లో రూ. 2,904 కోట్ల లాభం మాత్రమే నమోదైంది. క్యూ4లో మొత్తం రూ. 3,936 కోట్లమేర అనుకోని నష్టాలు వాటిల్లినట్లు సన్ ఫార్మా పేర్కొంది. ఫలితాల నేపథ్యంలో సన్ ఫార్మా షేరు దాదాపు 2 శాతం క్షీణించి రూ. 888 వద్ద ముగిసింది. -
నాట్కో ఫార్మాకు నష్టాలు
న్యూఢిల్లీ: హెల్త్‌కేర్ రంగ కంపెనీ నాట్కో ఫార్మా గతేడాది(2021–22) చివరి త్రైమాసికంలో నిరుత్సాహకర పనితీరు ప్రదర్శించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన క్యూ4(జనవరి–మార్చి)లో రూ. 50.5 కోట్ల నికర నష్ట్రం ప్రకటించింది. అంతక్రితం ఏడాది(2020–21) ఇదే కాలంలో రూ. 53 కోట్ల నికర లాభం ఆర్జించింది. మొత్తం ఆదాయం మాత్రం రూ. 331 కోట్ల నుంచి రూ. 597 కోట్లకు జంప్ చేసింది. అయితే నిల్వల విలువలో రైటాఫ్తోపాటు.. క్రెడిట్ నష్టాల అంచనాలకు అనుగుణంగా కేటాయింపులు చేపట్టడం ప్రధానంగా క్యూ4లో నష్టాలకు కారణమైనట్లు కంపెనీ వివరించింది. మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి నాట్కో ఫార్మా నికర లాభం దాదాపు 62 శాతం క్షీణించి రూ. 170 కోట్లకు పరిమితమైంది. 2020–21లో రూ. 442 కోట్లకుపైగా ఆర్జించింది. ఫలితాల నేపథ్యంలో నాట్కో ఫార్మా షేరు 3.2 శాతం పతనమై రూ. 658 వద్ద ముగిసింది. -
లాభాల్లో రిలయన్స్ తర్వాత అతిపెద్ద కంపెనీ ఇదే.. టాటాలకు షాక్?
ప్రైవేటీకరణ యత్నాలు జోరుగా సాగుతున్న కొన్ని ప్రభుత్వ రంగ సంస్థలు ఇప్పటికీ లాభాలు సాధించడంలో జోరు చూపుతున్నాయి. మార్కెట్లో ఉన్న ఒడిదుడుకులను తట్టుకుంటూ ప్రైవేటు కంపెనీలకు ధీటుగా ఫలితాలు సాధిస్తున్నాయి. లాభాల్లో రికార్డు ఆర్థిక సంవత్సరం 2021-22 నాలుగో త్రైమాసికానికి సంబంధించిన ఫలితాల్లో ప్రభుత్వ రంగ సంస్థ ఆయిల్ అండ్ నాచురల్ గ్యాస్ కార్పోరేషన్ (ఓఎన్జీసీ) దుమ్మురేపింది. తాజాగా ప్రకటించిన ఫలితాల్లో క్యూ 4లో రూ.40,305 కోట్ల లాభాలను సాధించినట్టు ఓఎన్జీసీ సంస్థ ప్రకటించింది. ప్రభుత్వ రంగ సంస్థల్లో ఇదే అత్యధికం. మిగిలిన మహారత్న, నవరత్న, మినీరత్నాలన్నీ ఓఎన్జీసీ తర్వాతే నిలిచాయి. టాటా వెనక్కి ఇక ప్రభుత్వ, ప్రైవేటు కంపెనీలకు సంబంధించిన ఫలితాలను పరిశీలించినా ఓఎన్జీసీ అదిరిపోయేలా ఫలితాలు సాధించింది. ఓఎన్జీసీ కంటే కేవలం రిలయన్స్ ఇండస్ట్రీస్ మాత్రమే అధిక లాభాలు గడిచింది. ఇప్పటి వరకు లాభాల్లో అగ్రభాగాన కొనసాగుతూ వస్తోన్న టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, టాటా స్టీల్, హెచ్డీఎఫ్సీ బ్యాంకు వంటి వాటిని వెనక్కి నెట్టింది. యుద్ధం ఎఫెక్ట్ ఉక్రెయిన్ రష్యాల మధ్య తలెత్తిన యుద్ధంతో ప్రపంచ వ్యాప్తంగా క్రూడ్ ఆయిల్ సంక్షోభం తలెత్తింది. దీంతో ఒక్కసారిగా ఆయిల్ ధరలు ఎగిసిపడ్డాయి. ఫలితంగా ఓఎన్జీసీ లాభాలు కూడా చివరి త్రైమానికంలో ఆకాశాన్ని తాకాయి. ఇండియాలో అత్యధిక ఆయిల్ ఉత్పత్తి సామర్థ్యం ఓఎన్‌జీసీకే ఉంది. చదవండి: మాయదారి ట్విటర్..కరిగిపోతున్న మస్క్ సంపద! -
హిందాల్కో లాభం రెట్టింపు
న్యూఢిల్లీ: ఆదిత్య బిర్లా గ్రూప్ మెటల్ దిగ్గజం హిందాల్కో ఇండస్ట్రీస్ గతేడాది(2021–22) చివరి త్రైమాసికంలో ఆకర్షణీయ ఫలితాలు సాధించింది. క్యూ4(జనవరి–మార్చి)లో కన్సాలిడేటెడ్ నికర లాభం రెట్టింపై రూ. 3,851 కోట్లను తాకింది. అంతక్రితం ఏడాది(2020–21) ఇదే కాలంలో కేవలం రూ. 1,928 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం రూ. 40,507 కోట్ల నుంచి రూ. 55,764 కోట్లకు జంప్ చేసింది. పటిష్ట సామర్థ్య నిర్వహణ, వినియోగం తదితరాలు సహాయంతో క్యూ4లో కంపెనీ చరిత్రలోనే అత్యధిక లాభాలు ఆర్జించినట్లు హిందాల్కో ఎండీ సతీష్ పాయ్ పేర్కొన్నారు. వెరసి ప్రపంచంలోనే చౌకగా అల్యూమినియం తయారీ, అత్యధిక నిర్వహణ లాభ మార్జిన్లు ఆర్జిస్తున్న కంపెనీగా కొనసాగుతున్నట్లు తెలిపారు. -
కోల్ ఇండియా లాభం జూమ్
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ ఇంధన దిగ్గజం కోల్ ఇండియా గతేడాది(2021–22) చివరి త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన క్యూ4(జనవరి–మార్చి)లో నికర లాభం 46 శాతం జంప్‌చేసి రూ. 6,693 కోట్లను తాకింది. అంతక్రితం ఏడాది(2020–21) ఇదే కాలంలో కేవలం రూ. 4,587 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం రూ. 26,700 కోట్ల నుంచి రూ. 32,707 కోట్లకు ఎగసింది. అయితే మొత్తం వ్యయాలు రూ. 21,516 కోట్ల నుంచి రూ. 25,161 కోట్లకు పెరిగాయి. వాటాదారులకు షేరుకి రూ. 3 చొప్పున తుది డివిడెండు ప్రకటించింది. ఈ కాలంలో బొగ్గు ఉత్పత్తి 203.4 మిలియన్ టన్నుల నుంచి 209 ఎంటీకి పుంజుకుంది. విక్రయాలు 165 ఎంటీ నుంచి 180 ఎంటీకి ఎగశాయి. కాగా.. మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి ఉత్పత్తి 596.22 ఎంటీ నుంచి 622.63 ఎంటీకి పురోగమించింది. ఫలితాల నేపథ్యంలో కోల్ ఇండియా షేరు 1% క్షీణించి రూ. 181 వద్ద ముగిసింది. -
2022లో ఐటీ షేర్లకు ఏమైంది? ఎందుకింత నష్టం
సాక్షి, ముంబై: భారతీయ ఐటీ కంపెనీల షేర్లు ఈ ఏడాది ప్రధాన రంగాల నష్టాల్లో నిలిచాయి. సాధారణంగా రేసుగుర్రాల్లా దూసుకుపోయే ఐటీ కంపెనీలకు 2022లో ఎదురు దెబ్బ తగిలింది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, క్యూ4 ఆదాయాల సీజన్లో ప్రతికూల సెంటిమెంట్, ఎఫ్ఐఐల నిరంతర విక్రయాలు మార్కెట్లో ఐటీ షేర్లను అశనిపాతంలా చుట్టుకుంది. బిజినెస్ టుడే కథనం ప్రకారం బీఎస్ఈ ఐటీ ఇండెక్స్ 2022లో 25 శాతం లేదా 9,524 పాయింట్లను కోల్పోయింది. ఈ కాలంలో సెన్సెక్స్ 7.44 శాతం లేదా 4,336 పాయింట్లు క్షీణించింది. అలాగే, నిఫ్టీ ఐటి ఇండెక్స్ 37,071 స్థాయినుంచి 27,708కి పడిపోయింది. వార్షిక ప్రాతి పదికన 9,363 పాయింట్లు లేదా 25.25 శాతం నష్టపోయింది. అలాగే ఎఫ్ఐఐలు ఈ ఏడాది భారత మార్కెట్లో రూ. 1.60 లక్షల కోట్ల విలువైన ఈక్విటీలను విక్రయించడంతో ఐటీ స్టాక్‌ల సెంటిమెంట్ బలహీనపడింది. టెక్ మహీంద్ర, విప్రో, సియంట్, హెచ్‌సీఎల్, ఇన్ఫోసిస్, ఒరాకిల్, జస్ట్ డయల్, టీ సీఎస్ ప్రధానంగా నష్టపోయిన ఐటీ షేర్లు ఇక ఆదాయాల విషయంలో మెజారిటీ ఐటీ కంపెనీలు వృద్ధి అంచనాలను అందుకో లేకపోయాయి. క్యూ4లో దిగ్గజ ఐటీ కంపెనీల మార్జిన్ ఔట్లుక్ మితంగా ఉండడం కూడా ఈ నష్టాలకుఒక కారణమని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. కాగా బుధవారం నాటి స్టాక్‌మార్కెట్ ముగింపులో సెన్సెక్స్ 303 పాయింట్ల నష్టంతో 54 వేల దిగువకు చేరింది. అటు నిఫ్టీ 99 పాయంట్లను కోల్పోయి 16025 వద్ద ముగిసింది. ముఖ్యంగా ఐటీ షేర్ల నష్టాలతో వరుసగా మూడో రోజు కూడా ఈక్విటీ మార్కెట్ నెగిటివ్‌గా ముగిసింది. -
జ్యోతి ల్యాబ్స్ లాభం ప్లస్
న్యూఢిల్లీ: గత ఆర్థిక సంవత్సరం(2021–22) చివరి త్రైమాసికంలో ఎఫ్ఎంసీజీ కంపెనీ జ్యోతి ల్యాబ్స్ పటిష్ట ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన క్యూ4(జనవరి–మార్చి)లో నికర లాభం 35 శాతం జంప్‌చేసి రూ. 37 కోట్లను తాకింది. అంతక్రితం ఏడాది (2020–21) ఇదే కాలంలో రూ. 27 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం 10 శాతం ఎగసి రూ. 547 కోట్లకు చేరింది. అయితే మొత్తం వ్యయాలు 15 శాతం పెరిగి రూ. 508 కోట్లను తాకాయి. వాటాదారులకు షేరుకి రూ. 2.5 చొప్పున డివిడెండు ప్రకటించింది. కాగా.. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన పూర్తి ఏడాదికి జ్యోతి ల్యాబ్స్ నికర లాభం 17 శాతం క్షీణించి రూ. 159 కోట్లకు పరిమితమైంది. 2020–21లో రూ. 191 కోట్లు ఆర్జించింది. మొత్తం అమ్మకాలు మాత్రం 15 శాతంపైగా వృద్ధితో రూ. 2,196 కోట్లను అధిగమించాయి. ఫలితాల నేపథ్యంలో జ్యోతి ల్యాబ్స్ షేరు బీఎస్ఈలో 1.5 శాతం బలపడి రూ. 150 వద్ద ముగిసింది. -
సెయిల్ డివిడెండ్ రూ. 2.25
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ మెటల్ దిగ్గజం సెయిల్ లిమిటెడ్ గత ఆర్థిక సంవత్సరం(2021–22) చివరి త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన క్యూ4(జనవరి–మార్చి)లో నికర లాభం 28 శాతం క్షీణించి రూ. 2,479 కోట్లకు పరిమితమైంది. అంతక్రితం ఏడాది(2020–21) ఇదే కాలంలో రూ. 3,450 కోట్లు ఆర్జించింది. ఇందుకు పెరిగిన వ్యయాలు ప్రభావం చూపాయి. వాటాదారులకు షేరుకి రూ. 2.25 చొప్పున తుది డివిడెండును ప్రకటించింది. కాగా.. క్యూ4లో మొత్తం ఆదాయం రూ. 23,533 కోట్ల నుంచి రూ. 31,175 కోట్లకు ఎగసింది. అయితే మొత్తం వ్యయాలు సైతం రూ. 18,829 కోట్ల నుంచి రూ. 28,005 కోట్లకు భారీగా పెరిగాయి. మార్చికల్లా రుణ భారం రూ. 13,400 కోట్లుగా నమోదైనట్లు సెయిల్ వెల్లడించింది. తాజా సమీక్షా కాలంలో 4.6 మిలియన్ టన్నుల స్టీల్‌ను ఉత్పత్తి చేయగా.. 4.71 ఎంటీ అమ్మకాలను సాధించింది. 2020–21 క్యూ4లో స్టీల్ ఉత్పత్తి 4.56 ఎంటీకాగా.. 3.43 ఎంటీ విక్రయాలు నమోదయ్యాయి. కోకింగ్ కోల్ తదితర ముడివ్యయాల పెరుగుదల ఫలితాలపై ప్రభావం చూపినట్లు కంపెనీ పేర్కొంది. దీంతో వ్యయాల అదుపునకు పలు చర్యలు తీసుకుంటున్నట్లు తెలియజేసింది. ఫలితాల నేపథ్యంలో సెయిల్ షేరు ఎన్ఎస్ఈలో యథాతథంగా రూ. 74 వద్ద ముగిసింది. -
గ్రాసిమ్ ఇండస్ట్రీస్ లాభం జూమ్
న్యూఢిల్లీ: గత ఆర్థిక సంవత్సరం(2021–22) చివరి త్రైమాసికంలో ఆదిత్య బిర్లా గ్రూప్ డైవర్సిఫైడ్ దిగ్గజం గ్రాసిమ్ ఇండస్ట్రీస్ ఆకర్షణీయ ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన క్యూ4(జనవరి–మార్చి)లో నికర లాభం 56 శాతం జంప్‌చేసి రూ. 4,070 కోట్లను అధిగమించింది. అంతక్రితం ఏడాది(2020–21) ఇదే కాలంలో రూ. 2,617 కోట్లు మాత్రమే ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం 18 శాతం ఎగసి రూ. 28,811 కోట్లను తాకింది. అయితే మొత్తం వ్యయాలు 23 శాతం అధికమై రూ. 25,786 కోట్లను దాటాయి. వాటాదారులకు రూ. 5 ప్రత్యేక డివిడెండుతో కలిపి షేరుకి మొత్తం రూ. 10 చొప్పున చెల్లించనుంది. పూర్తి ఏడాదికి కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన పూర్తి ఏడాదికి గ్రాసిమ్ నికర లాభం 60 శాతం దూసుకెళ్లి రూ. 11,206 కోట్లను అధిగమించింది. 2020–21లో కేవలం రూ. 6,987 కోట్లు ఆర్జించింది. మొత్తం అమ్మకాలు 25 శాతంపైగా వృద్ధితో రూ. 76,404 కోట్లను తాకాయి. కాగా.. క్యూ4 ఆదాయంలో విస్కోస్ పల్ప్, స్టేపుల్ ఫైబర్, ఫిలమెంట్ యార్న్ విభాగం వాటా 46 శాతం ఎగసి రూ. 3,766 కోట్లకు చేరింది. సిమెంట్ రంగ అనుబంధ సంస్థ అల్ట్రాటెక్ టర్నోవర్ 9 శాతం పుంజుకుని రూ. 15,767 కోట్లను దాటింది. కెమికల్స్ విభాగం నుంచి 69 శాతం అధికంగా రూ. 2,487 కోట్లు సమకూరింది. ఫైనాన్షియల్ సర్వీసుల ఆదాయం 19 శాతం పుంజుకుని రూ. 6,622 కోట్లయ్యింది. ఇతర విభాగాల ఆదాయం 29 శాతం బలపడి రూ. 705 కోట్లను తాకింది. ఫలితాల నేపథ్యంలో గ్రాసిమ్ ఇండస్ట్రీస్ షేరు బీఎస్ఈలో దాదాపు 4 శాతం నష్టంతో రూ. 1,403 వద్ద ముగిసింది. -
బీవోఐ హైజంప్
న్యూఢిల్లీ: పీఎస్‌యూ సంస్థ బ్యాంక్ ఆఫ్ ఇండియా(బీవోఐ) గత ఆర్థిక సంవత్సరం(2021–22) చివరి త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. క్యూ4(జనవరి–మార్చి)లో స్టాండెలోన్ నికర లాభం 142 శాతంపైగా జంప్ చేసి రూ. 606 కోట్లను తాకింది. అంతక్రితం ఏడాది(2020–21) ఇదే కాలంలో కేవలం రూ. 250 కోట్లు ఆర్జించింది. అధిక వడ్డీ ఆదాయం, రుణాల నాణ్యత మెరుగుపడటం ఇందుకు సహకరించింది. ఇక మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి బ్యాంక్ స్టాండెలోన్ నికర లాభం 58 శాతం ఎగసి రూ. 3,405 కోట్లను తాకింది. 2020–21లో రూ. 2,160 కోట్లు మాత్రమే ఆర్జించింది. వాటాదారులకు షేరుకి రూ.2 చొప్పున డివిడెండ్ ప్రకటించింది. సీఆర్ఏఆర్ 17 శాతాన్ని అధిగమించగా.. ఈ ఏడాది(2022–23) రూ. 2,500 కోట్ల పెట్టుబడులను సమీకరించనున్నట్లు బ్యాంక్ తెలియజేసింది. మార్జిన్లు ప్లస్ ప్రస్తుత సమీక్షా కాలం(క్యూ4)లో బీవోఐ నికర వడ్డీ ఆదాయం 36 శాతం పుంజుకుని రూ. 3,986 కోట్లకు చేరింది. నికర వడ్డీ మార్జిన్లు 2.01 శాతం నుంచి 2.58 శాతానికి మెరుగుపడ్డాయి. మార్చికల్లా స్థూల మొండిబకాయిలు(ఎన్పీఏలు) 13.77 శాతం నుంచి 9.98 శాతానికి భారీగా తగ్గాయి. నికర ఎన్పీఏలు సైతం 3.35 శాతం నుంచి 2.34 శాతానికి నీరసించాయి. కాగా.. రూ. 1,045 కోట్ల ఫ్యూచర్ గ్రూప్ రుణాలకు 100 శాతం కేటాయింపులు చేపట్టినట్లు బ్యాంక్ వెల్లడించింది. ఈ బాటలో రూ. 963 కోట్ల శ్రేఈ గ్రూప్ రుణాలకుగాను 50% ప్రొవిజన్లు చేపట్టినట్లు పేర్కొంది. -
జొమాటోకుషాక్, షేర్లు జంప్, కొనుక్కోవచ్చా?
సాక్షి, ముంబై: ఆన్లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ జొమాటోకు వరుస నష్టాల షాక్ తగిలింది. గత ఆర్థిక సంవత్సరం(2021-22) చివరి త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన క్యూ4(జనవరి-మార్చి)లో నికర నష్టం భారీగా మూడురెట్లు పెరిగి రూ. 360 కోట్లకు చేరింది. అంతక్రితం ఏడాది(2020-21) ఇదే కాలంలో రూ. 134 కోట్ల నష్టం నమోదైంది. మొత్తం ఆదాయం మాత్రం రూ. 692 కోట్ల నుంచి రూ. 1,212 కోట్లకు జంప్ చేసింది. అయితే మొత్తం వ్యయాలు రూ. 885 కోట్ల నుంచి రూ. 1,702 కోట్లకు పెరిగాయి. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి జొమాటో నికర నష్టం భారీగా పెరిగి రూ. 1,225 కోట్లను దాటింది. 202021లో రూ. 816 కోట్ల నష్టం నమోదైంది. అయితే మొత్తం ఆదాయం రూ. 1,994 కోట్ల నుంచి రూ. 4,192 కోట్లకు ఎగసింది. కంపెనీ తిరిగి వృద్ధి బాట పట్టినట్లు జొమాటో వ్యవస్థాపకుడు, సీఈవో దీపిందర్ గోయల్ ఫలితాల విడుదల సందర్భంగా అభిప్రాయపడ్డారు. కోవిడ్ తదుపరి సవాళ్లు బిజినెస్ వృద్ధిపై ఎలాంటి ప్రతికూలతలూ చూపించబోవని అంచనా వేశారు. వృద్ధిని కొనసాగించడం, నష్టాలను తగ్గించుకోవడం తదితర దీర్ఘకాలిక వ్యూహాలతో ముందుకు సాగుతున్నట్లు తెలియజేశారు. ఫలితాల నేపథ్యంలో సోమవారం జొమాటో షేరు 2.2 శాతం క్షీణించి రూ. 57 వద్ద ముగిసింది. అయితే మంగళవారం ట్రేడింగ్ ఆరంభంలోనే ఏకంగా 17 శాతం ఎగిసింది. ప్రస్తుతం 8శాతం లాభాలతో కొనసాగుతోంది. ట్రేడ్పండితులు టార్గెట్ ధరను రూ.100గా నిర్ణయించడంతో పేర్కొనడంతో కొనుగోళ్ల జోరు నెలకొంది. -
లాభాల్లోకి బీహెచ్ఈఎల్, క్యూ4లో రూ.916 కోట్లు!
ప్రభుత్వ రంగ దిగ్గజం భారత్ హెవీ ఎలక్ట్రికల్స్(బీహెచ్ఈఎల్) గత ఆర్థిక సంవత్సరం(2021–22) చివరి త్రైమాసికంలో టర్న్అరౌండ్ ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన క్యూ4(జనవరి–మార్చి)లో రూ.916 కోట్ల నికర లాభం ఆర్జించింది. అంతక్రితం ఏడాది(2020–21) ఇదే కాలంలో రూ.1,036 కోట్ల నికర నష్టం ప్రకటించింది. కంపెనీ బోర్డు వాటాదారులకు షేరుకి రూ.0.40 చొప్పున తుది డివిడెండును ప్రకటించింది. కాగా.. క్యూ4లో మొత్తం ఆదాయం సైతం రూ.7,245 కోట్ల నుంచి రూ.8,182 కోట్లకు బలపడింది. ఇక మొత్తం వ్యయాలు రూ.8,644 కోట్ల నుంచి రూ.7,091 కోట్లకు వెనకడుగు వేశాయి. కోవిడ్ ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మందగమన పరిస్థితులను కల్పించినట్లు కంపెనీ ఫలితాల విడుదల సందర్భంగా పేర్కొంది. అయితే ప్రస్తుతం పరిస్థితులు మెరుగుపడుతున్నట్లు తెలియజేసింది. -
హెచ్‌పీసీఎల్ డివిడెండ్ రూ. 14
న్యూఢిల్లీ: ఇంధన రంగ పీఎస్‌యూ దిగ్గజం గత ఆర్థిక సంవత్సరం(2021–22) చివరి త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించింది. క్యూ4(జనవరి–మార్చి)లో నికర లాభం 40 శాతం రూ. 1,795 కోట్లకు పరిమితమైంది. గత ఆర్థిక సంవత్సరం(2020–21) ఇదే కాలంలో రూ. 3,018 కోట్లు ఆర్జించింది. క్యూ4లో స్థూల రిఫైనింగ్ మార్జిన్లు(జీఆర్ఎం) 12.44 డాలర్లకు బలపడినట్లు కంపెనీ చైర్మన్, ఎండీ పుష్ప కుమార్ జోషి పేర్కొన్నారు. 2021 క్యూ4లో 8.11 డాలర్ల జీఆర్ఎం మాత్రమే లభించింది. అయితే చౌకగా కొనుగోలు చేసిన నిల్వల లాభాలను మినహాయిస్తే ఒక్కో బ్యారల్ చమురు శుద్ధిపై 6.42 డాలర్ల మార్జిన్లు సాధించినట్లు జోషి వెల్లడించారు. కాగా.. పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ అమ్మకపు నష్టాలు మార్జిన్ల లాభాలను దెబ్బతీసినట్లు పేర్కొన్నారు. చమురు ధరలు 14ఏళ్ల గరిష్టానికి చేరినప్పటికీ మార్చి 22 నుంచి మాత్రమే వీటి ధరలను పెంచడం ప్రభావం చూపినట్లు వివరించారు. వాటాదారులకు కంపెనీ బోర్డు షేరుకి రూ. 14 చొప్పున తుది డివిడెండ్ ప్రకటించింది. పూర్తి ఏడాదికి మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి రూ. 3.72 లక్షల కోట్ల ఆదాయం, రూ. 6,383 కోట్ల నికర లాభం సాధించినట్లు జోషి తెలియజేశారు. 2020–21లో హెచ్‌పీసీఎల్ రూ. 2.69 లక్షల కోట్ల టర్నోవర్ సాధించగా.. రూ. 10,664 కోట్ల నికర లాభం ఆర్జించింది. క్యూ4లో దేశీయంగా 10.26 మిలియన్ టన్నులను విక్రయించగా.. అంతక్రితం 3.83 ఎంటీ అమ్మకాలు నమోదయ్యాయి. వెరసి 4 శాతం వృద్ధి సాధించింది. ఇక పూర్తి ఏడాదిలో 6 శాతం అధికంగా 37.65 ఎంటీ అమ్మకాలు నమోదయ్యాయి. ఇదే కాలంలో ఎల్పీజీ అమ్మకాలు 4.4 శాతం పుంజుకుని 7.7 ఎంటీకి చేరాయి. ఫలితాల నేపథ్యంలో హెచ్‌పీసీఎల్ షేరు ఎన్ఎస్ఈలో 1.5% నీరసించి రూ. 240 వద్ద ముగిసింది. -
మణప్పురం లాభం పతనం
న్యూఢిల్లీ: మణప్పురం ఫైనాన్స్ మార్చి త్రైమాసికం పనితీరు విషయంలో ఇన్వెస్టర్లను ఉసూరుమనిపించింది. నికర లాభం 44 శాతం తరిగి రూ.261 కోట్లకు పరిమితమైంది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో లాభం రూ.468 కోట్లుగా ఉంది. అధిక ఈల్డ్ బంగారం రుణాలను, తక్కువ ఈల్డ్లోకి మార్చడం వల్ల లాభాలపై ప్రభావం పడినట్టు సంస్థ తెలిపింది. నిర్వహణ వ్యయాలను తగ్గించుకున్నట్టు పేర్కొంది. సూక్ష్మ రుణాల విభాగంలో నాణ్యమైన వృద్ధిపై, రుణ వసూళ్లపై, బంగారం రుణాల పోర్ట్‌ఫోలియో బలోపేతంపై తాము దృష్టి సారిస్తామని తెలిపింది. నికర వడ్డీ ఆదాయం సైతం 10 శాతం తగ్గిపోయి రూ.986 కోట్లకు పరిమితమైంది. కానీ, డిసెంబర్ త్రైమాసికంలో ఉన్న రూ.953 కోట్లతో పోలిస్తే 3 శాతానికి పైగా పెరిగింది. కార్యకలాపాల ద్వారా ఆదాయం 9 శాతం తగ్గి రూ.1,481 కోట్లుగా ఉంది. ప్రస్తుతం బంగారం రుణాల్లో రూ.2లక్షలకు పైన టికెట్ సైజువి 33 శాతంగా ఉంటాయని సంస్థ తెలిపింది. 2021–22 సంవత్సరానికి సంస్థ నికర లాభం 23 శాతం తగ్గి రూ.1,320 కోట్లుగా ఉంది. ఆదాయం 5 శాతం క్షీణించి రూ.6,061 కోట్లుగా నమోదైంది. -
ఈక్విటీల్లో తగ్గుతున్న ఎఫ్‌పీఐల వాటా
న్యూఢిల్లీ: భారత ఈక్విటీల్లో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల భాగస్వామ్యం మార్చి త్రైమాసికంలో పలుచబడింది. ఈక్విటీల్లో ఎఫ్‌పీఐలు కలిగి ఉన్న వాటాల విలువ మార్చి త్రైమాసికం చివరికి 612 బిలియన్ డాలర్లకు (రూ.47.12 లక్షల కోట్లు) పరిమితమైంది. 2021 డిసెంబర్ చివరికి ఉన్న ఎఫ్‌పీఐల ఈక్విటీ పెట్టుబడుల విలువ 654 బిలియన్ డాలర్లతో పోల్చి చూస్తే 6 శాతం తగ్గినట్టు మార్నింగ్ స్టార్ నివేదిక వెల్లడించింది. విదేశీ ఇన్వెస్టర్లు భారత ఈక్విటీల్లో నిరాటంకంగా విక్రయాలు చేస్తుండడం తెలిసిందే. వారి వాటాల విలువ తగ్గిపోవడానికి ఇదే ప్రధాన కారణం. ఇక 2021 మార్చి నాటికి ఎఫ్‌పీఐల పెట్టుబడుల విలువ 552 బిలియన్ డాలర్లుగా ఉంది. ఈక్విటీ మార్కెట్ క్యాపిటలైజేషన్ (మొత్తం విలువ)లో ఎఫ్‌పీఐల వాటా విలువ పరంగా 18.3 శాతం నుంచి 17.8 శాతానికి తగ్గింది. మన దేశ ఈక్విటీల్లో ఎఫ్‌పీఐలు ఎక్కువగా ఆఫ్‌షోర్ మ్యూచువల్ ఫండ్స్ రూపంలో పెట్టుబడులను హోల్డ్ చేస్తున్నారు. ఆ తర్వాత ఆఫ్‌షోర్ ఇన్సూరెన్స్ కంపెనీలు, హెడ్జ్ ఫండ్స్, సావరీన్ వెల్త్ ఫండ్స్ రూపంలో ఎఫ్‌పీఐలు భారత ఈక్విటీల్లో పెట్టుబడులు కలిగి ఉన్నారు. విక్రయాలు.. మార్నింగ్‌స్టార్ నివేదిక పరిశీలిస్తే.. 2022 జనవరి–మార్చి త్రైమాసికంలో ఎఫ్‌పీఐలు ఈక్విటీల్లో నికర అమ్మకందారులుగా ఉన్నారు. 14.59 బిలియన్ డాలర్ల మేర (రూ.1.13 లక్షల కోట్లు) అమ్మకాలు చేశారు. జనవరిలో 4.46 బిలియన్ డాలర్లు, ఫిబ్రవరిలో 4.74 బిలియన్ డాలర్లు, మార్చిలో 5.38 బిలియన్ డాలర్ల చొప్పున విక్రయాలు చేసినట్టు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. దేశీయంగా, అంతర్జాతీయంగా పరిస్థితులు మారిపోవడంతో విదేశీ ఇన్వెస్టర్ల ధోరణిలో మార్పు వచ్చింది. ఈక్విటీల్లో రిస్క్ తీసుకునే ధోరణి తగ్గడంతో మార్కెట్లలో అమ్మకాల ఒత్తిడి నెలకొందని మార్నింగ్ స్టార్ నివేదిక తెలిపింది. ‘‘త్వరలోనే వడ్డీ రేట్లు పెంచుతానంటూ యూఎస్ ఫెడ్ చేసిన ప్రకటనతో మార్చి త్రైమాసికం ఆరంభంలోనే సెంటిమెంట్ దెబ్బతిన్నది. దీంతో ఖరీదైన వ్యాల్యూషన్ల వద్ద ట్రేడవుతున్న మార్కెట్ల నుంచి పెట్టుబడులు వెనక్కి తీసుకోవడాన్ని విదేశీ ఇన్వెస్టర్లు వేగవంతం చేశారు’’ అని మార్నింగ్ స్టార్ పేర్కొంది. ఆదుకున్న ఫండ్స్.. దేశీయంగా వృద్ధి ఆధారిత బడ్జెట్, కరోనా మూడో విడత సాధారణంగా ఉండడం కొంత ఉపశమనాన్ని ఇచ్చినట్టు మార్నింగ్ స్టార్ నివేదిక తెలియజేసింది. విక్రయాల ఒత్తిడి కొద్దిగా తగ్గేలా సాయపడ్డాయి. దేశీయంగా మ్యూచువల్ ఫండ్స్, ఇతర ఇనిస్టిట్యూషన్స్ కొనుగోళ్ల ఈక్విటీ మార్కెట్లను చాలా వరకు ఆదుకున్నాయి. సిప్ రూపంలో ప్రతీ నెలా రూ.11వేల కోట్లకుపైనే పెట్టుబడులు వస్తుండడంతో.. విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలతో ఆకర్షణీయ వ్యాల్యూషన్లకు దిగొస్తున్న కంపెనీల్లో ఫండ్స్ ఇన్వెస్ట్ చేయడానికి మొగ్గు చూపిస్తుండడం గమనార్హం. ప్రతికూలంగా మారిన పరిస్థితులు చమురు ధరలు గణనీయంగా పెరిగిపోవడం, అమెరికాలో అధిక ద్రవ్యోల్బణం పరిస్థితులు విదేశీ ఇన్వెస్టర్లను ఆందోళనకు గురిచేశాయి. అమెరికాలో ఈ పరిస్థితులే రేట్ల పెంపునకు దారితీయడం తెలిసిందే. దీంతో ఎఫ్‌ఫీఐలు భారత ఈక్విటీల్లో పెద్ద మొత్తంలో విక్రయాలు కొనసాగిస్తున్నారు. ప్రధానంగా ఉక్రెయిన్‌పై రష్యా ఫిబ్రవరి చివర్లో యుద్ధం మొదలు పెట్టగా.. రష్యాపై పలు దేశాల ఆంక్షలను చూసి ఇన్వెస్టర్లు అమ్మకాలను మరింత పెంచారు. అప్పటి నుంచి అస్సలు కొనుగోళ్ల వైపే వారు ఉండడం లేదు. 2018 తర్వాత ఫెడ్ మొదటిసారి రేట్లను పెంచడం కూడా ప్రతికూల సెంటిమెంట్‌కు దారితీసింది. మరిన్ని విడతలుగా రేట్లను పెంచనున్నట్ట కూడా ఫెడ్ స్పష్టం చేసింది. దీంతో విదేశీ ఇన్వెస్టర్లు కొంత పెట్టుబడులను తరలించుకుపోతున్నారు. 2022లో ఇప్పటి వరకు వారు చేసిన విక్రయాలు 18 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. సమీప కాలంలోనూ ఎఫ్‌పీఐలు భారత ఈక్విటీల్లో అమ్మకాలు కొనసాగించొచ్చని మార్నింగ్ స్టార్ నివేదిక అంచనా వేసింది. -
ఐటీసీ డివిడెండ్ రూ. 6.25
న్యూఢిల్లీ: ఎఫ్ఎంసీజీ దిగ్గజం ఐటీసీ లిమిటెడ్ గత ఆర్థిక సంవత్సరం (2021–22) చివరి త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన క్యూ4 (జనవరి–మార్చి)లో నికర లాభం 12% వృద్ధితో రూ. 4,260 కోట్లకు చేరింది. అంతక్రితం ఏడాది (2020–21) ఇదే కాలంలో రూ. 3,817 కోట్లు మాత్రమే ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం 15% పైగా బలపడి రూ. 17,754 కోట్లను అధిగమించింది. అయితే మొత్తం వ్యయాలు రూ. 15% పెరిగి రూ. 12,632 కోట్లను దాటాయి. వాటాదారులకు షేరుకి రూ. 6.25 చొప్పున తుది డివిడెండ్‌ను ప్రకటించింది. ఇందుకు ఈ నెల 28 రికార్డ్ డేట్‌కాగా.. జులై 22–26 మధ్య డివిడెండ్‌ను చెల్లించనున్నట్లు ఐటీసీ వెల్లడించింది. కంపెనీ ఫిబ్రవరిలోనూ షేరుకి రూ. 5.25 చొప్పున మధ్యంతర డివిడెండ్‌ను చెల్లించడం తెలిసిందే. విభాగాల వారీగా: ఐటీసీ క్యూ4 ఆదాయంలో సిగరెట్ల విభాగం నుంచి 10 శాతం అధికంగా రూ. 7,177 కోట్లు లభించగా.. ఎఫ్ఎంసీజీ విభాగం నుంచి రూ. 4,149 కోట్లు సమకూరింది. ఇది 12 శాతం వృద్ధి. ఇక వ్యవసాయ సంబంధ బిజినెస్ మరింత అధికంగా 30 శాతం జంప్‌చేసి రూ. 4,375 కోట్లను తాకింది. ఈ బాటలో హోటళ్ల ఆదాయం రూ. 105 కోట్లు జమ చేసుకుని రూ. 407 కోట్లను అధిగమించింది. పేపర్ బోర్డ్ అమ్మకాలు రూ. 1,656 కోట్ల నుంచి రూ. 2,183 కోట్లకు ఎగసింది. కాగా.. మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి ఐటీసీ నికర లాభం 16 శాతం పురోగమించి రూ. 15,243 కోట్లయ్యింది. 2020–21లో రూ. 13,161 కోట్లు మాత్రమే ఆర్జించింది. మొత్తం ఆదాయం 23 శాతం జంప్‌చేసి రూ. 65,205 కోట్లకు చేరింది. ఫలితాల నేపథ్యంలో ఐటీసీ షేరు ఎన్ఎస్ఈలో 0.75 శాతం బలపడి రూ. 267 వద్ద ముగిసింది. -
ఎయిర్టెల్ లాభాల ట్యూన్
న్యూఢిల్లీ: దేశీ మొబైల్ టెలికం దిగ్గజం భారతీ ఎయిర్టెల్ గతేడాది(2021–22) చివరి త్రైమాసికంలో ఆకర్షణీయ పనితీరు ప్రదర్శించింది. క్యూ4(జనవరి–మార్చి)లో కన్సాలిడేటెడ్ నికర లాభం రెండున్నర రెట్లు ఎగసి రూ. 2,008 కోట్లను తాకింది. అంతక్రితం ఏడాది(2020–21) ఇదే కాలంలో రూ. 759 కోట్లు మాత్రమే ఆర్జించింది. తాజా క్వార్టర్లో అనుకోని లాభాన్ని పక్కనపెడితే రూ. 1,860 కోట్ల నికర లాభం సాధించినట్లు ఎయిర్టెల్ వెల్లడించింది. క్యూ4లో మొత్తం ఆదాయం 22 శాతం వృద్ధితో రూ. 31,500 కోట్లకు చేరింది. దేశీ ఆదాయం 23 శాతం జంప్‌చేసి రూ. 22,500 కోట్లను తాకింది. ఒక్కో వినియోగదారుడిపై సగటు ఆదాయం(ఏఆర్పీయూ) రూ. 145 నుంచి రూ. 178కు ఎగసింది. టారిఫ్‌లు పెంచడం, 4జీ కస్టమర్లు జత కలవడం ఇందుకు సహకరించింది. వాటాదారులకు ఎయిర్టెల్ బోర్డు షేరుకి రూ. 3 చొప్పున డివిడెండు ప్రకటించింది. పూర్తి ఏడాదికి మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి ఎయిర్టెల్ రూ. 4,255 కోట్ల నికర లాభం ఆర్జించింది. 2020–21లో రూ. 15,084 కోట్ల నికర నష్టం ప్రకటించింది. మొత్తం టర్నోవర్ 16 శాతం పుంజుకుని రూ. 1,16,547 కోట్లకు చేరింది. 4జీ కస్టమర్ల మొత్తం సంఖ్య 20 కోట్లను దాటగా.. గతేడాది 21.5 మిలియన్లమంది కొత్తగా జత కలిశారు. సగటు డేటా వినియోగం నెలకు 18.8 జీబీకు చేరినట్లు కంపెనీ వెల్లడించింది. మార్చికల్లా లీజు చెల్లింపులను మినహాయిస్తే నికరంగా కన్సాలిడేటెడ్ రుణ భారం రూ. 1,23,544 కోట్లుగా నమోదైంది. మార్కెట్లు ముగిశాక ఫలితాలు విడుదల చేసింది. చదవండి: నేను చెప్తున్నాగా! ఎయిర్టెల్ భవిష్యత్తు బ్రహ్మాండం! -
తగ్గిన జీఎంఆర్ ఇన్ఫ్రా నష్టాలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మౌలిక రంగ కంపెనీ జీఎంఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మార్చి త్రైమాసికం కన్సాలిడేటెడ్ ఫలితాల్లో రూ.129 కోట్ల నష్టం చవిచూసింది. అంత క్రితం ఏడాది ఇదే కాలంలో కంపెనీ రూ.723 కోట్ల నష్టాలను మూటగట్టుకుంది. టర్నోవర్ రూ.1,698 కోట్ల నుంచి రూ.1,387 కోట్లకు వచ్చి చేరింది. మొత్తం వ్యయాలు రూ.1,361 కోట్ల నుంచి రూ.1,537 కోట్లకు ఎగశాయి. క్రితం ముగింపుతో పోలిస్తే జీఎంఆర్ ఇన్ఫ్రా షేరు ధర బీఎస్ఈలో మంగళవారం 4.59 శాతం ఎగసి రూ.36.45 వద్ద స్థిరపడింది. చదవండి: ఎల్ఐసీ లిస్టింగ్.. ప్చ్! -
భారత్ ఫోర్జ్ లాభం అప్
న్యూఢిల్లీ: ఆటో విడిభాగాల దిగ్గజం భారత్ ఫోర్జ్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2021–22) చివరి త్రైమాసికంలో ఆసక్తికర ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన క్యూ4(జనవరి–మార్చి)లో నికర లాభం 9 శాతం పుంజుకుని రూ. 232 కోట్లకు చేరింది. అంతక్రితం ఏడాది(2020–21) ఇదే కాలంలో రూ. 212 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం రూ. 2,083 కోట్ల నుంచి రూ. 3,573 కోట్లకు ఎగసింది. మొత్తం వ్యయాలు రూ. 1,841 కోట్ల నుంచి రూ. 3,296 కోట్లకు పెరిగాయి. వాటాదారులకు షేరుకి రూ. 5.50 చొప్పున తుది డివిడెండు ప్రకటించింది. కొత్త ఆర్డర్లు ప్లస్: మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి భారత్ ఫోర్జ్ టర్న్అరౌండ్ ఫలితాలు ప్రకటించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన రూ. 1,077 కోట్ల నికర లాభం సాధించింది. 2020–21లో రూ. 127 కోట్ల నికర నష్టం నమోదైంది. ఇక మొత్తం ఆదాయం సైతం రూ. 6,336 కోట్ల నుంచి రూ. 10,461 కోట్లకు జంప్ చేసింది. దేశీ కార్యకలాపాల నుంచి రూ. 1,000 కోట్ల విలువైన కొత్త ఆర్డర్లను సాధించినట్లు కంపెనీ చైర్మన్, ఎండీ బీఎన్ కళ్యాణి వెల్లడించారు. ఆటోమోటివ్, ఇండస్ట్రియల్ అప్లికేషన్స్ నుంచి ఇవి లభించినట్లు పేర్కొన్నారు. ఈ బాటలో ఉత్తర అమెరికా నుంచి స్టీల్, అల్యూమినియం ఫోర్జింగ్ కార్యకలాపాల ద్వారా 15 కోట్ల డాలర్ల విలువైన తాజా కాంట్రాక్టులను పొందినట్లు తెలియజేశారు. ఫలితాల నేపథ్యంలో భారత్ ఫోర్జ్ షేరు ఎన్ఎస్ఈలో 5.5% జంప్‌చేసి రూ. 663 వద్ద ముగిసింది. -
డీమార్ట్.. అదిరిపోయే లాభాలు
డీమార్ట్ స్టోర్ల రిటైల్ దిగ్గజం ఎవెన్యూ సూపర్‌మార్ట్స్ గత ఆర్థిక సంవత్సరం(2021–22) చివరి త్రైమాసికంలో ఆసక్తికర ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన క్యూ4(జనవరి–మార్చి)లో నికర లాభం స్వల్పంగా 3 శాతం బలపడి రూ. 427 కోట్లకు చేరింది. అంతక్రితం ఏడా ది(2020–21) ఇదే కాలంలో రూ. 414 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం మాత్రం మరింత అధికం గా 19 శాతం వృద్ధితో రూ. 8,786 కోట్లను అధిగమించింది. మొత్తం వ్యయాలు 19 శాతం పెరిగి రూ. 8,210 కోట్లయ్యాయి. పూర్తి ఏడాదికి మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి డీమార్ట్ నికర లాభం 36 శాతం జంప్‌చేసి రూ. 1,492 కోట్లను అధిగమించింది. 2020 –21లో రూ. 1,099 కోట్లు మాత్రమే ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం 28 శాతం ఎగసి రూ. 30,976 కోట్లను తాకింది. కరోనా సవాళ్ల లోనూ క్యూ4లో పటిష్ట ఫలితాలు సాధించగలిగినట్లు కంపెనీ సీఈవో, ఎండీ నెవెల్లీ నోరోన్హా పేర్కొన్నారు. ఒడిదొడుకులను సమర్థవంతంగా ఎదుర్కోవడంతోపాటు స్వల్ప కాలానికి రికవరీ సాధించగలమన్న విశ్వాసం పెరిగినట్లు తెలియజేశారు. గతేడాది 50 అదనపు స్టోర్లను ఏర్పాటు చేయడం ద్వారా వీటి సంఖ్య 284కు చేరినట్లు వెల్లడించారు. చదవండి: స్టాక్ మార్కెట్లో హర్షద్ మెహతాని ఢీ కొట్టిన దమ్ము డీమార్ట్ దమానీదే -
ఆర్బీఎల్ బ్యాంకు లాభం రూ.197 కోట్లు
ముంబై: ఆర్బీఎల్ బ్యాంకు మార్చి త్రైమాసికానికి రూ.197 కోట్ల లాభాన్ని ప్రకటించింది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో ఉన్న లాభం రూ.75 కోట్లుగా ఉంది. నికర వడ్డీ ఆదాయం 25 శాతం పెరిగి రూ.1,131 కోట్లకు చేరింది. రుణాల్లో వృద్ధి 2 శాతమే నమోదైంది. నికర వడ్డీ మార్జిన్ 5.04 శాతానికి చేరింది. ఇతర ఆదాయం 7 శాతం క్షీణించి రూ.511 కోట్లకు పరిమితమైంది. బ్యాంకు బ్యాలన్స్ షీట్ 20 శాతం స్థాయిలో వృద్ధి చెందుతుందని అంచనా వేస్తున్నట్టు ఆర్బీఎల్ బ్యాంకు తాత్కాలిక సీఈవో, ఎండీ రాజీవ్ అహుజా తెలిపారు. స్థూల మొండి బకాయిలు (ఎన్పీఏలు) 2021 డిసెంబర్ త్రైమాసికం నాటికి ఉన్న 4.84 శాతం నుంచి 2022 మార్చి చివరికి 4.40 శాతానికి దిగొచ్చాయి. ఎన్పీఏల కోసం రూ.401 కోట్లను పక్కన పెట్టింది. క్యాపిటల్ అడెక్వెసీ రేషియో 16.82 శాతానికి చేరింది. ఇక 2021–22 ఆర్థిక సంవత్సరానికి ఆర్బీఎల్ బ్యాంకు రూ.75 కోట్ల నష్టాన్ని ప్రకటించింది. 2020–21లో బ్యాంకు రూ.508 కోట్ల లాభాన్ని నమోదు చేయడం గమనార్హం. చదవండి: సాఫ్ట్‌బ్యాంక్‌కు భారీ నష్టాలు -
నష్టాల్లో స్పెన్సర్స్.. ఈ ఏడాది ఎంతంటే?
న్యూఢిల్లీ: ఆర్పీ సంజీవ్ గోయెంకా గ్రూపు సంస్థ స్పెన్సర్స్ రిటైల్ నష్టాలు కొనసాగుతూనే ఉన్నాయి. మార్చితో ముగిసిన త్రైమాసికానికి రూ.42 కోట్ల నష్టాన్ని ఈ సంస్థ మూటగట్టుకుంది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో నష్టం రూ.34.53 కోట్లతో పోలిస్తే మరింత పెరిగినట్టు తెలుస్తోంది. ఇక 2021–22 ఆర్థిక సంవత్సరానికి స్పెన్సర్స్ రిటైల్ కన్సాలిడేటెడ్ నష్టం రూ.121 కోట్లకు తగ్గింది. అంతక్రితం ఆర్థిక సంవత్సరంలో నష్టం రూ.164 కోట్లుగా ఉండడం గమనించాలి. ఆదాయం 5 శాతం తగ్గి రూ.2,300 కోట్లకు పరిమితమైంది. విక్రయాల్లో వృద్ధి, వ్యయాల నియంత్రణ, నెట్వర్క్ విస్తరణపై తమ దృష్టి కొనసాగుతుందని సంస్థ ప్రకటించింది. చదవండి: మెప్పించని ఎల్అండ్టీ.... -
మెప్పించని ఎల్అండ్టీ....
న్యూఢిల్లీ: లార్సెన్ అండ్ టుబ్రో (ఎల్అండ్టీ) మార్చితో ముగిసిన త్రైమాసికంలో మోస్తరు పనితీరు నమోదు చేసింది. కన్సాలిడేటెడ్ నికర లాభం 10 శాతం వృద్ధితో రూ.3,620 కోట్లుగా నమోదైంది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో నికర లాభం రూ.3,293 కోట్లుగా ఉండడం గమనించాలి. ఆదాయం మాత్రం క్రితం ఏడాది ఇదే కాలంలో ఉన్న రూ.49,116 కోట్ల నుంచి రూ.53,366 కోట్లకు వృద్ధి చెందింది. ఒక్కో షేరుకు రూ.22 చొప్పున డివిడెండ్ ఇవ్వాలని కంపెనీ బోర్డు సిఫారసు చేసింది. మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో రూ.1,92,997 కోట్ల విలువ చేసే ఆర్డర్లను సంపాదించినట్టు సంస్థ తెలిసింది. అంతకుముందు ఏడాదితో పోలిస్తే 10 శాతం అధికం. -
వందల కోట్లే..ఎస్బీఐ కార్డ్స్‌కు పెరిగిన లాభం!
ఎస్బీఐ అనుబంధ సంస్థ ఎస్బీఐ కార్డ్స్ అండ్ పేమెంట్ సర్వీసెస్ మార్చి త్రైమాసికానికి ఆకర్షణీయమైన ఫలితాలను ప్రకటించింది. నికర లాభం మూడు రెట్లు వృద్ధితో రూ.581 కోట్లకు చేరింది. అంతక్రితం ఏడాది ఇదే కాలానికి నికర లాభం రూ.175 కోట్లుగానే ఉంది. మొత్తం ఆదాయం అంతక్రితం ఏడాది ఇదే కాలంలో ఉన్న రూ.2,468 కోట్ల నుంచి రూ.3,016 కోట్లకు వృద్ధి చెందింది. వడ్డీ ఆదాయం మార్చి త్రైమాసికానికి రూ.1,266 కోట్లుగా ఉంది. ఇది అంతక్రితం ఏడాది ఇదే కాలంలో రూ.1,082 కోట్లుగా ఉండడం గమనార్హం. ఫీజులు, కమీషన్ల రూపంలో వచ్చిన ఆదాయం రూ.1,114 కోట్ల నుంచి రూ.1,426 కోట్లకు వృద్ధి చెందింది. ఇక 2021–22 పూర్తి ఆర్థిక సంవత్సరానికి ఎస్బీఐ కార్డ్స్ అండ్ పేమెంట్ సర్వీసెస్ నికర లాభం 64 శాతం వృద్ధి చెంది రూ.1,616 కోట్లుగా నమోదైంది. ఇది అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో రూ.984 కోట్లుగా ఉంది. పూర్తి ఆర్థిక సంవత్సరానికి ఆదాయం 17 శాతం మేర పెరిగి రూ.11,301 కోట్లుగా ఉంది. మొండి బకాయిల విషయంలోనూ ఎస్బీఐ కార్డ్స్ పనితీరు మెరుగుపడింది. స్థూల ఎన్పీఏలు 2.22 శాతం, నికర ఎన్పీఏలు 0.78 శాతానికి తగ్గాయి. అంతకుముందు ఆర్థిక సంవత్సరం చివరికి ఇవి 4.99 శా తం, 1.15 శాతం చొప్పున ఉండడం గమనార్హం. ఒక్కో షేరుకు రూ.2.50 చొప్పున మధ్యంతర డివిడెండ్‌ను కంపెనీ బోర్డు సిఫారసు చేసింది. -
అంచనాలకు మించి అదరగొట్టిన ఐసీఐసీఐ బ్యాంకు..!
ప్రముఖ ప్రైవేట్ బ్యాంకింగ్ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంక్ గత ఆర్థికసంవత్సరం నాలుగో త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. అంచనాలకు మించి ఐసీఐసీఐ బ్యాంకు నికర లాభాలు భారీగా పెరిగాయి. గత ఆర్థిక సంవత్సరంలో 59.4 శాతం మేర నికర లాభాన్ని ఐసీఐసీఐ బ్యాంకు ఆర్జించింది. సుమారు రూ. 7,018.7 కోట్లను ఐసీఐసీఐ బ్యాంకు గడించింది. అంతకుమందు ఏడాదిలో ఐసీఐసీఐ బ్యాంకు నికర లాభాలు రూ. 4403 కోట్లు. నికర వడ్డీ ఆదాయం కూడా 21 శాతం మేర పెరిగి రూ. 12,605 కోట్ల రూపాయలుగా నమోదైంది. తగ్గిన ఎన్పీఏ ఆస్తుల విలువ..! నిరర్థక ఆస్తులు(నాన్ పర్ఫర్మింగ్ ఆసెట్స్(ఎన్పీఏ)) విలువ స్వల్పంగా క్షీణించింది. 53 బేసిస్ పాయింట్లు అంటే 3.6 శాతం మేర తగ్గింది. నికర నిరర్థక ఆస్తుల విలువ సైతం తగ్గింది. 0.76 శాతంతో తొమ్మిది బేసిస్ పాయింట్ల మేర క్షీణత కనిపించింది. నాలుగో త్రైమాసికంలో గ్రాస్ ఎన్పీఏ 4,204 కోట్ల రూపాయలుగా రికార్డయింది. అక్టోబర్-నవంబర్-డిసెంబర్ మధ్యకాలంలో ఈ మొత్తం 4,018 కోట్ల రూపాయలు. బ్యాంక్ అడ్వాన్సులు భారీగా పెరిగాయి. 17 శాతం మేర వృద్ధి నమోదు చేశాయి. గ్రామీణ ప్రాంతాలకు ఇచ్చిన రుణాలను మినహాయించి- రిటైల్ లోన్ పోర్ట్‌ఫోలియోలో 20 శాతం పెరుగుదలను నమోదు చేసింది. ఐసీఐసీఐ బ్యాంక్ డిపాజిట్లు 14 శాతం మేర పెరిగాయి. వీటి విలువ 10.64 లక్షల కోట్లుగా ఉంది. మొత్తం టర్మ్ డిపాజిట్లల్లో తొమ్మిది శాతం మేర పెరుగుదల నమోదైంది.గత ఆర్థిక సంవత్సరంలో ఐసీఐసీఐ బ్యాంక్ మంచి పురోగతిని రికార్డు చేసింది. అంతేకాకుండా షేర్ హోల్డర్లకు ఒక్కో షేర్‌పై అయిదు రూపాయల డివిడెండ్‌ను ప్రకటించింది. చదవండి: నెగ్గిన అమెజాన్ పంతం..! రూ. 24 వేల కోట్ల డీల్‌ను రద్దు చేసుకున్న రిలయన్స్..! -
షాకింగ్..రిలయన్స్‌కు గట్టి దెబ్బ..!
న్యూఢిల్లీ: రిలయన్స్ గ్రూప్ కంపెనీ ఆర్‌ఐఐఎల్ గతేడాది (2021–22) చివరి త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన క్యూ4 (జనవరి–మార్చి)లో నికర లాభం 65 శాతం క్షీణించి రూ. 1.06 కోట్లకు పరిమితమైంది. అంతక్రితం ఏడాది (2020–21) ఇదే కాలంలో రూ. 3 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం మాత్రం రూ. 19 కోట్ల నుంచి రూ. 20 కోట్లకు పెరిగింది. వాటాదారులకు షేరుకి రూ. 3 చొప్పున డివిడెండ్ చెల్లించేందుకు కంపెనీ బోర్డు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. రిలయన్స్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ (ఆర్‌ఐఐఎల్)గా పేర్కొనే కంపెనీ ప్రధాన కార్యకలాపాలు పారిశ్రామిక మౌలికసదుపాయాల కల్పన కాగా.. పెట్రోలియం ప్రొడక్టుల రవాణాతోపాటు.. పైపులైన్ల ద్వారా నీరు, అద్దెకు కన్స్ట్రక్షన్ మెషినరీ, ఇతర ఇన్ఫ్రా సపోర్ట్ సర్వీసులను సైతం అందిస్తోంది. ముంబై సహా మహారాష్ట్ర, గుజరాత్‌లోని సూరత్, జామ్‌నగర్ బెల్టులలో కార్యకలాపాలు కేంద్రీకరించింది. చదవండి: లాభాల్లో టాటా ఎలక్సీ జోరు..ఇన్వెస్టర్లకు భారీ నజరానా..! -
అదరగొట్టిన ఎల్అండ్టీ ఇన్ఫోటెక్..మైండ్‌ట్రీతో విలీనంపై కీలక వ్యాఖ్యలు..!
న్యూఢిల్లీ: సాఫ్ట్వేర్ సేవల మధ్యస్థాయి కంపెనీ ఎల్అండ్టీ ఇన్ఫోటెక్ గత ఆర్థిక సంవత్సరం(2021–22) చివరి త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన క్యూ4(జనవరి–మార్చి)లో నికర లాభం 17 శాతం వృద్ధితో దాదాపు రూ. 638 కోట్లకు చేరింది. అంతక్రితం ఏడాది(2021) ఇదే కాలంలో రూ. 545 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం మరింత అధికంగా 32 శాతం వరకూ ఎగసి రూ. 4,302 కోట్లకు చేరింది. అంతక్రితం క్యూ4లో రూ. 3,269 కోట్ల టర్నోవర్ ప్రకటించింది. కాగా.. మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి కంపెనీ నికర లాభం 19 శాతం పుంజుకుని రూ.2,297 కోట్లయ్యింది. 2020–21లో రూ. 1,936 కోట్లు మాత్రమే ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం 27 శాతం అధికమై రూ. 15,669 కోట్లను తాకింది. అంతక్రితం ఏడాది కేవలం రూ. 12,370 కోట్ల టర్నోవర్ నమోదైంది. విలీనం ఊహాజనితం గ్రూప్ కంపెనీ మైండ్‌ట్రీతో విలీనంపై ఎల్అండ్టీ ఇన్ఫోటెక్ యాజమాన్యం ఊహాజనితమంటూ స్పందించింది. ఊహాగానాలపై వ్యాఖ్యానించబోమంటూ క్యూ4 ఫలితాల విడుదల సందర్భంగా కంపెనీ సీఈవో, ఎండీ సంజయ్ జలోనా స్పష్టం చేశారు. మైండ్‌ట్రీతో విలీనంపై ఎలాంటి వివరాలూ అందుబాటులో లేవని, మీడియా అంచనాలపై వ్యాఖ్యానించబోమని ఎక్సే్ఛంజీలకు తెలిపారు. 6,000 మందికి ఉద్యోగాలు... వాటాదారులకు షేరుకి రూ. 30 చొప్పున డివిడెండును ఎల్అండ్టీ ఇన్ఫో ప్రకటించింది. ఈ ఆర్థిక సంవత్సరం(2022–23)లో 6,000 మంది ఫ్రెషర్స్‌కు ఉద్యోగాలివ్వనున్నట్లు పేర్కొంది. గతేడాది 6,200 మందికి ఉపాధి కల్పించినట్లు ప్రస్తావించింది. ప్రస్తుతం కంపెనీ సిబ్బంది సంఖ్య 46,648కు చేరినట్లు వెల్లడించింది. ఎట్రిషన్ రేటు 24 శాతంగా నమోదైంది. ఫలితాల నేపథ్యంలో ఎల్అండ్టీ ఇన్ఫో షేరు 8.3% పతనమై రూ. 5,385 వద్ద ముగిసింది. చదవండి: ఎల్అండ్టీ ఇన్ఫో, మైండ్‌ట్రీ విలీనం! -
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ లాభం 23% అప్
న్యూఢిల్లీ: ఈ ఆర్థిక సంవత్సరం (2021–22) చివరి త్రైమాసికంలో ప్రయివేట్ రంగ దిగ్గజం హెచ్డీఎఫ్సీ బ్యాంక్ పటిష్ట ఫలితాలు సాధించింది. క్యూ4 (జనవరి–మార్చి)లో స్టాండెలోన్ నికర లాభం 23 శాతం ఎగసి రూ. 10,055 కోట్లను అధిగమించింది. ఇందుకు అన్ని విభాగాల్లోనూ రుణాలకు డిమాండ్ బలపడటం, మొండిరుణాలకు కేటాయింపులు తగ్గడం సహకరించింది. మొత్తం ఆదాయం 8 శాతం పుంజుకుని రూ. 41,086 కోట్లకు చేరింది. రుణాలు 20.8 శాతం పెరిగి రూ. 13,68,821 కోట్లను తాకాయి. రుణాలలో రిటైల్ 15.2 శాతం, గ్రామీణ బ్యాంకింగ్ విభాగం 30.4 శాతం, హోల్‌సేల్ విభాగం 17.4 శాతం చొప్పున వృద్ధి సాధించాయి. నికర వడ్డీ ఆదాయం 10.2 శాతం బలపడి రూ. 18,873 కోట్లకు చేరింది. బ్రాంచీలు ప్లస్... క్యూ4లో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 563 బ్రాంచీలు తెరవగా 7,167 మంది ఉద్యోగులను జత చేసుకుంది. పూర్తి ఏడాదిలో 734 బ్రాంచీలు ఏర్పాటు చేయగా.. అదనంగా 21,486 మంది ఉద్యోగులు చేరారు. కాగా.. సమీక్షా కాలంలో స్థూల మొండిబకాయిలు(ఎన్పీఏలు) 1.26 శాతం నుంచి 1.17 శాతానికి, నికర ఎన్పీఏలు 0.4 శాతం నుంచి 0.32 శాతానికి తగ్గాయి. ప్రొవిజన్లు, కంటింజెన్సీలు రూ. 4,694 కోట్ల నుంచి రూ. 3,312 కోట్లకు దిగివచ్చాయి. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన క్యూ4లో బ్యాంక్ నికర లాభం 23.8 శాతం ఎగసి రూ. 10,443 కోట్లయ్యింది. పూర్తి ఏడాదికి 19.5 శాతం వృద్ధితో రూ. 38,053 కోట్లను తాకింది. కనీస పెట్టుబడుల నిష్పత్తి (సీఏఆర్) 18.9 శాతంగా నమోదైంది. 2021–22లో స్టాండెలోన్ నికర లాభం 19 శాతం అధికమై రూ. 36,961 కోట్లను అధిగమించగా.. మొత్తం ఆదాయం రూ. 1,57,263 కోట్లకు చేరింది. ఇది 7.7 శాతం వృద్ధి. ఈ నెల 23న సమావేశంకానున్న బోర్డు డివిడెండును ప్రకటించనున్నట్లు బ్యాంక్ పేర్కొంది. బాండ్ల ద్వారా రూ.50,000 కోట్ల సమీకరణ! బాండ్ల జారీ ద్వారా రూ. 50,000 కోట్ల వరకూ సమీకరించాలని బోర్డు నిర్ణయించినట్లు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ పేర్కొంది. నిధులను ప్రధానంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్, అందుబాటు ధరల గృహాలకు రుణాలకు వినియోగించనున్నట్లు తెలియజేసింది. రానున్న 12 నెలల్లోగా బాండ్ల జారీని చేపట్టనున్నట్లు పేర్కొంది. ఈ ఏడాది(2022) సెప్టెంబర్ 3 నుంచి అమల్లోకి వచ్చే విధంగా రేణు కర్నాడ్‌ను తిరిగి నాన్‌ఎగ్జిక్యూటివ్ డైరెక్టరుగా ఎంపిక చేసినట్లు వెల్లడించింది. బ్యాంకులో హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ విలీనంకానున్న నేపథ్యంలో ఐదేళ్లపాటు బాధ్యతలు నిర్వహించనున్నట్లు తెలియజేసింది. -
ఇన్ఫీ లాభం రూ.5,686 కోట్లు
న్యూఢిల్లీ: దేశంలో రెండో అతిపెద్ద సాఫ్ట్వేర్ దిగ్గజం ఇన్ఫోసిస్ గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికం (2021–22, క్యూ4)లో రూ. 5,686 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని ఆర్జించింది. క్రితం ఏడాది ఇదే కాలంలో లాభం రూ. 5,076 కోట్లతో పోలిస్తే 12 శాతం వృద్ధి చెందింది. మొత్తం ఆదాయం 22.7 శాతం ఎగబాకి రూ.32,276 కోట్లుగా నమోదైంది. అంతక్రితం క్యూ4లో ఆదాయం రూ.26,311 కోట్లుగా ఉంది. త్రైమాసికంగా తగ్గుదల... 2021–22 క్యూ3 (అక్టోబర్–డిసెంబర్ క్వార్టర్)లో నమోదైన లాభం (రూ.5,809 కోట్లు)తో పోలిస్తే క్యూ4లో లాభం 2.1 శాతం తగ్గింది. ఇక మొత్తం ఆదాయం మాత్రం క్యూ3 (రూ.31,867 కోట్లు)తో పోలిస్తే స్వల్పంగా 1.3 శాతం పెరిగింది. పూర్తి ఏడాదికి ఇలా... 2021–22 పూర్తి ఆర్థిక సంవత్సరంలో ఇన్ఫీ నికర లాభం రూ.22,110 కోట్లకు ఎగబాకింది. అంతక్రితం ఏడాది లాభం రూ.19,351 కోట్లతో పోలిస్తే 14.3 శాతం వృద్ధి చెందింది. మొత్తం ఆదాయం కూడా 21 శాతం ఎగసి రూ.1,00,472 కోట్ల నుంచి రూ.1,21,641 కోట్లకు పెరిగింది. కాగా, ప్రస్తుత 2022–23 ఆర్థిక సంవత్సరానికి ఆదాయం 13–15 శాతం వృద్ధి చెందవచ్చని ఇన్ఫీ అంచనా వేసింది. పటిష్టమైన డిమాండ్ పరిస్థితులు, భారీ స్థాయిలో దక్కించుకుంటున్న డీల్స్ ఇందుకు దోహదం చేస్తాయని కంపెనీ వెల్లడించింది. కాగా, 2021–22 ఆర్థిక సంవత్సరం ఆరంభంలో పూర్తి ఏడాది ఆదాయ అంచనాలను 12–14 శాతంగా పేర్కొన్న ఇన్ఫీ, 2022 జనవరిలో దీన్ని 19.5–20 శాతానికి పెంచడం గమనార్హం. పటిష్టమైన డిమాండ్ నేపథ్యంలో అమ్మకాలు, డెలివరీ ఇంకా నవకల్పనల్లో సామర్థ్యాలను పెంచుకోవడం కోసం తగిన దీర్ఘకాలిక పెట్టుబడులు పెడుతున్నామని ఇన్ఫోసిస్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (సీఎఫ్ఓ) నిరంజన్ రాయ్ పేర్కొన్నారు. ఫలితాల్లో ఇతర ముఖ్యంశాలు... ► గత ఆర్థిక సంవత్సరం క్యూ4లో ఇన్ఫీ దక్కించుకున్న కాంట్రాక్టుల మొత్తం విలువ (టీసీవీ) 2.3 బిలియన్ డాలర్లు. పూర్తి ఏడాదికి టీసీవీ 9.5 బిలియన్ డాలర్లుగా ఉంది. క్యూ4లో స్థూలంగా 110 కొత్త క్లయింట్లు జతయ్యారు. ► క్యూ4లో కంపెనీ నిర్వహణ మార్జిన్ 3 శాతం మేర దిగజారి 21.5 శాతానికి చేరింది. ఇక పూర్తి ఏడాదికి కూడా 3 శాతం తగ్గుదలతో 23 శాతంగా నమోదైంది. ► ఇన్ఫీ డైరెక్టర్ల బోర్డు 2021–22 ఏడాదికి గాను రూ.5 ముఖ విలువ గల ఒక్కో షేరుకు రూ.16 చొప్పున తుది డివిడెండ్‌ను సిఫార్సు చేసింది. తద్వారా పూర్తి ఏడాదికి ఇన్వెస్టర్లకు మొత్తం రూ.31 డివిడెండ్ (రూ.13,000 కోట్లు) లభించినట్లవుతుంది. 2020–21తో పోలిస్తే డివిడెండ్ 14.8 శాతం పెరిగినట్లు లెక్క. ► ప్రస్తుతం రష్యాకు చెందిన క్లయింట్లతో ఎలాంటి కాంట్రాక్టులు లేవని, రాబోయే కాలంలో కూడా సంబంధిత ప్రణాళికలు ఏవీ ఉండబోవని కంపెనీ స్పష్టం చేసింది. రష్యాలో ఉన్న నామమాత్ర వ్యాపారాన్ని తరలిస్తున్నట్లు కూడా వెల్లడించింది. ► ఈ ఏడాది కనీసం 50,000 మంది ఫ్రెషర్లను నియమించుకోనున్నట్లు కంపెనీ తెలిపింది. గతేడాది అంచనాలను మించి 85,000 మంది ఫ్రెషర్లకు ప్రపంచవ్యాప్తంగా, భారత్‌లో ఉద్యోగాలు ఇచ్చినట్లు వెల్లడించింది. కాగా, 2022 మార్చి 31 నాటికి కంపెనీ మొత్తం ఉద్యోగుల సంఖ్య 3,14,015కు చేరింది. వెరసి 2021 మార్చి చివరి నాటితో పోలిస్తే నికరంగా 54,396 మంది ఉద్యోగులు జతయ్యారు. ఐటీ రంగంలో నిపుణులకు భారీ డిమాండ్ నేపథ్యంలో ఇన్ఫీలో ఉద్యోగుల వలసల (అట్రిషన్) రేటు 2021–22 క్యూ4లో 27.7 శాతానికి ఎగబాకింది, క్యూ3లో ఇది 25.5 శాతంగా ఉంది. 2020–21 క్యూ4లో అట్రిషన్ రేటు 10.9 శాతం మాత్రమే కావడం గమనార్హం. ► ఆర్థిక ఫలితాలు మార్కెట్లు ముగిసిన తర్వాత వెలువడ్డాయి. ఇన్ఫోసిస్ షేరు బుధవారం స్వల్పంగా 0.5 శాతం మేర లాభంతో రూ.1,749 వద్ద స్థిరపడింది. కాగా, విశ్లేషకుల అంచనాల మేరకు క్యూ4 ఫలితాలు లేకపోవడం, మార్జిన్లు దిగజారడం, అట్రిషన్ భారీగా ఎగబాకవడంతో ఇన్ఫీ ఏడీఆర్ బుధవారం నాస్డాక్లో ఒక దశలో 5 శాతం పైగా నష్టపోయింది. భారీ డీల్స్ దన్ను... 2021–22లో సుస్థిర వ్యాపార జోరు, భారీ స్థాయి డీల్స్‌ను చేజిక్కించుకోవడం, మరిన్ని పెద్ద డీల్స్ కూడా వరుసలో ఉండటం మాకు కలిసొచ్చింది. డిజిటల్ రంగంలో విజయవంతంగా నిలదొక్కుకోగలమన్న విశ్వాసాన్ని మా క్లయింట్లలో కల్పించడం ద్వారా మా మార్కెట్ వాటా వృద్ధి కొనసాగనుంది. 2022–23లో 13–15 శాతం ఆదాయ వృద్ధిని సాధించగలమని మేము విశ్వసిస్తున్నాం. గతేడాది కంపెనీ అన్ని వ్యాపార విభాగాలు, భౌగోళిక ప్రాంతాల వ్యాప్తంగా విస్తృత స్థాయిలో వృద్ధిని నమోదు చేసింది. – సలీల్ పరేఖ్, ఇన్ఫీ సీఈఓ–ఎండీ -
బ్యాంక్ ఆఫ్ ఇండియా టర్న్అరౌండ్
న్యూఢిల్లీ: పీఎస్‌యూ బ్యాంక్ ఆఫ్ ఇండియా గతేడాది(2020–21) చివరి క్వార్టర్లో టర్న్అరౌండ్ ఫలితాలు సాధించింది. క్యూ4(జనవరి–మార్చి)లో రూ. 250 కోట్ల నికర లాభం ఆర్జించింది. అంతక్రితం ఏడాది(2019–20) ఇదే కాలంలో రూ. 3,571 కోట్లకుపైగా నికర నష్టాలు ప్రకటించింది. స్టాండెలోన్ ఫలితాలివి. అయితే మొత్తం ఆదాయం రూ. 12,216 కోట్ల నుంచి రూ. 11,380 కోట్లకు క్షీణించింది. మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి సైతం లాభాల్లోకి ప్రవేశించింది. రూ. 2,160 కోట్ల స్టాండెలోన్ లాభం ఆర్జించింది. 2019–20లో రూ. 2,957 కోట్ల నికర నష్టం నమోదైంది. మొత్తం ఆదాయం మాత్రం రూ. 49,066 కోట్ల నుంచి రూ. 48,041 కోట్లకు వెనకడుగు వేసింది. క్యూ4లో తాజా స్లిప్పేజెస్ రూ. 7,368 కోట్లను తాకగా.. మొత్తం ప్రొవిజన్లు 70 శాతం తక్కువగా రూ. 1,844 కోట్లకు పరిమితమయ్యాయి. మార్జిన్లు డీలా మార్చికల్లా బ్యాంక్ ఆఫ్ ఇండియా స్థూల మొండి బకాయిలు(ఎన్పీఏలు) 14.78 శాతం నుంచి 13.77 శాతానికి తగ్గాయి. నికర ఎన్పీఏలు సైతం 3.88 శాతం నుంచి 3.35 శాతానికి దిగివచ్చినట్లు బ్యాంక్ ఎండీ, సీఈవో ఏకే దాస్ పేర్కొన్నారు. ఈ ఏడాది స్థూల ఎన్పీఏలను 2.5 శాతంవరకూ తగ్గించుకోనున్నట్లు చెప్పారు. అయితే దేశీయంగా నికర వడ్డీ మార్జిన్లు 3.18 శాతం నుంచి 2.16 శాతానికి నీరసించాయి. ఈ ఏడాది మార్జిన్లను 2.5 శాతానికి మెరుగుపరచుకోనున్నట్లు దాస్ తెలియజేశారు. కనీస మూలధన పెట్టుబడుల నిష్పత్తి(సీఏఆర్) 13.1 శాతం నుంచి 14.93 శాతానికి బలపడింది. ఫలితాల నేపథ్యంలో బ్యాంక్ ఆఫ్ ఇండియా షేరు ఎన్ఎస్ఈలో దాదాపు 3 శాతం జంప్‌చేసి రూ. 82.3 వద్ద ముగిసింది. ఈ కౌంటర్లో రెండు ఎక్సే్చంజీలలోనూ కలిపి దాదాపు 5 కోట్ల షేర్లు చేతులు మారడం గమనార్హం! -
పీవీఆర్‌కు పెరిగిన నష్టాలు
న్యూఢిల్లీ: మల్టీప్లెక్స్ దిగ్గజం పీవీఆర్ లిమిటెడ్ గతేడాది(2020–21) చివరి త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన నికర నష్టం రూ. 289 కోట్లకు పెరిగింది. అంతక్రితం ఏడాది(2019–20) ఇదే కాలంలో రూ. 74.5 కోట్ల నష్టమే నమోదైంది. మొత్తం ఆదాయం సైతం రూ. 662 కోట్ల నుంచి రూ. 263 కోట్లకు క్షీణించింది. కాగా.. కోవిడ్–19 కట్టడికి లాక్డౌన్ల అమలు, సామాజిక దూరం, కంటెంట్ తగ్గడం వంటి పలు ప్రతికూల అంశాలు పనితీరుపై తీవ్ర ప్రభావం చూపినట్లు పీవీఆర్ పేర్కొంది. వెరసి ఫలితాలను అంతక్రితం ఏడాది పనితీరుతో పోల్చి చూడతగదని తెలియజేసింది. మల్టీప్లెక్స్ పరిశ్రమకు గత ఆర్థిక సంవత్సరం అత్యంత గడ్డుకాలమని వ్యాఖ్యానించింది. అయితే ఫిక్స్డ్ వ్యయాల తగ్గింపు, తగినంత లిక్విడిటీ వంటి చర్యలు చేపడుతున్నట్లు తెలియజేసింది. క్యూ4లో హాలీవుడ్, బాలీవుడ్ నుంచి ప్రాధాన్యతగల సినిమాలు విడుదలకాలేదని ప్రస్తావించింది. దక్షిణాదిలో కీలక సినిమాల కారణంగా రికవరీ కనిపించినట్లు పేర్కొంది. ఫలితాల నేపథ్యంలో పీవీఆర్ షేరు ఎన్ఎస్ఈలో 1 శాతం బలపడి రూ. 1,319 వద్ద ముగిసింది. -
అరబిందో లాభం డౌన్
న్యూఢిల్లీ: హెల్త్‌కేర్ రంగ కంపెనీ అరబిందో ఫార్మా గతేడాది(2020–21) చివరి త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన క్యూ4(జనవరి–మార్చి)లో రూ. 801 కోట్ల నికర లాభం ఆర్జించింది. అంతక్రితం ఏడాది(2019–20) ఇదే కాలంలో రూ. 863 కోట్ల లాభం సాధించింది. మొత్తం ఆదాయం సైతం రూ. 6,158 కోట్ల నుంచి రూ. 6,001 కోట్లకు నీరసించింది. నాట్రోల్ విక్రయం నేపథ్యంలో ఫలితాలు పోల్చి చూడతగదని అరబిందో పేర్కొంది. కాగా.. మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి అరబిందో నికర లాభం రూ. 5,334 కోట్లకు చేరింది. 2019–20లో రూ. 2,844 కోట్లుగా నమోదైంది. మొత్తం ఆదాయం రూ. 23,098 కోట్ల నుంచి రూ. 24,775 కోట్లకు ఎగసింది. బోర్డు ఓకే..: పూర్తి అనుబంధ సంస్థ ఔరా క్యూర్ ప్రైవేట్లోగల మొత్తం ఈక్విటీ షేర్లను మరో సొంత అనుబంధ సంస్థ యూజియా ఫార్మా స్పెషాలిటీస్‌కు బదిలీ చేసేందుకు బోర్డు అనుమతించినట్లు అరబిందో వెల్లడించింది. ఈ బాటలో యూనిట్–16తో కూడిన బిజినెస్‌ను స్టెప్‌డౌన్ అనుబంధ సంస్థ వైటెల్స్ ఫార్మాకు బదిలీ చేసేందుకు సైతం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు పేర్కొంది. కీలక విభాగాలు భేష్ కోవిడ్–19 మహమ్మారి నేపథ్యంలోనూ గతేడాది కీలక విభాగాలలో నిలకడైన వృద్ధిని చూపినట్లు అరబిందో ఫార్మా ఎండీ ఎన్.గోవిందరాజన్ పేర్కొన్నారు. విభిన్నమైన, సంక్షిష్టమైన జనరిక్ అవకాశాలపై మరింత దృష్టిపెట్టడం ద్వారా కంపెనీ చెప్పుకోదగ్గ పురోగతిని సాధించగలిగినట్లు తెలియజేశారు. తద్వారా గతేడాది ప్రధాన మైలురాళ్లను చేరుకున్నట్లు వివరించారు. ఫలితాల నేపథ్యంలో అరబిందో ఫార్మా షేరు ఎన్ఎస్ఈలో 3% క్షీణించి రూ. 993 వద్ద ముగిసింది. -
40 ఏళ్ల కనిష్టానికి...జీడీపీ
న్యూఢిల్లీ: కరోనా కల్లోలంతో దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలైంది. గత ఆర్థిక సంవత్సరంలో స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) 7.3% క్షీణించి 40 ఏళ్ల కనిష్టానికి జారిపోయింది. అయితే, కరోనా సెకండ్ వేవ్ ప్రారంభానికి ముందు త్రైమాసికం (క్యూ4)లో ఎకానమీ కొంత పురోగతి సాధించింది. 2020–21 ఆర్థిక సంవత్సరం చివరి ఆరు నెలల్లో వరుసగా రెండవ క్వార్టర్లోనూ వృద్ధి బాటన నడిచింది. మార్చి త్రైమాసికంలో స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు 1.6 శాతంగా నమోదయ్యింది. అక్టోబర్–డిసెంబర్ త్రైమాసికంలోనూ భారత్ ఎకానమీ 0.5% వృద్ధిని నమోదుచేసుకున్న సంగతి తెలిసిందే. కరోనా కట్టడికి దేశ వ్యాప్త కఠిన లాక్డౌన్ నేపథ్యంలో 2020–21 తొలి జూన్ త్రైమాసికంలో ఎకానమీ 24.4 శాతం క్షీణతను నమోదుచేసుకుంది. తదుపరి జూలై– సెప్టెంబర్ త్రైమాసికంలో క్షీణత 7.4 శాతానికి పరిమితమైంది. ఇక మొత్తం 2020–21 ఆర్థిక సంవత్సరంలో జీడీపీ క్షీణత 7.3 శాతానికి పరిమితమైంది. నిజానికి 7.5 శాతం నుంచి 8 శాతం వరకూ క్షీణ అంచనాలు నమోదయ్యాయి. మహమ్మారి నేపథ్యంలో 2020 మార్చి 25 మే 31వ తేదీ వరకూ నాలుగు దశల్లో (మార్చి 25– ఏప్రిల్ 14, ఏప్రిల్ 15– మే 3, మే 4– మే 17, మే 18–మే 31) దేశ వ్యాప్త కఠిన లాక్డౌన్ అమలు జరిగిన సంగతి తెలిసిందే. జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్ఎస్ఓ) సోమవారం ఆర్థిక సంవత్సరం తాజా గణాంకాలను ఆవిష్కరించింది. విలువలు ఇలా... 2011–21 ఆర్థిక సంవత్సరం స్థిర ధరల ప్రకారం (బేస్ ఇయర్ ప్రాతిపదికన ద్రవ్యోల్బణాన్ని సర్దుబాటు చేసుకుంటూ వచ్చిన గణాంకాలు) 2019 ఏప్రిల్–2020 మార్చి మధ్య భారత స్థూల దేశీయోత్పత్తి విలువ రూ.145.69 లక్షల కోట్లు. కరోనా తీవ్ర పరిస్థితుల నేపథ్యంలో ఈ విలువ 2020 ఏప్రిల్–2021 మార్చి మధ్య రూ.135.13 లక్షల కోట్లకు ఎకానమీ విలువ పడిపోయింది. వెరసి 7.3 శాతం క్షీణత నమోదయ్యింది. ఇక మార్చి త్రైమాసికంలో విలువలు పరిశీలిస్తే, 38.33 లక్షల కోట్ల నుంచి రూ.38.96 లక్షల కోట్లకు ఎగసింది. అంటే 1.6 శాతం వృద్ధి అన్నమాట. 2019–20 ఆర్థిక సంవత్సరంలో జీడీపీ 4 శాతం వృద్ధి నమోదయిన సంగతి తెలిసిందే. 2019–20 మార్చి త్రైమాసికంలో వృద్ధి రేటు 3 శాతం. కాగా, ఉత్పత్తి దశ వరకూ సంబంధించి గ్రాస్ వ్యాల్యూ యాడెడ్ (జీవీఏ) వృద్ధి 2020–21 మార్చి త్రైమాసికంలో 3.7 శాతంగా నమోదయితే, ఆర్థిక సంవత్సరంలో 6.2 శాతం క్షీణత నమోదుచేసుకుంది. కీలక రంగాల తీరు ఇలా... ► వ్యవసాయం: మూడవ త్రైమాసికంలో 4.5 శాతం వృద్ధి సాధిస్తే, నాల్గవ త్రైమాసికంలో ఇది 3.1 శాతానికి పరిమితమైంది. మొత్తం ఆర్థిక సంవత్సరంలో 3.6 శాతం పురోగమించింది. జీడీపీలో వ్యవసాయ రంగం వాటా దాదాపు 15 శాతం. ► మైనింగ్: డిసెంబర్, మార్చి వరుస త్రైమాసికాల్లో క్షీణత 4.4 శాతం నుంచి 5.7 శాతానికి పెరిగింది. వార్షికంగా చూస్తే క్షీణ రేటు 8.5 శాతం. ► తయారీ: డిసెంబర్ త్రైమాసికంలో 1.7 శాతం వృద్ధిని నమోదుచేసుకుంటే, ఇది నాల్గవ త్రైమాసికంలో 6.9 శాతానికి పెరిగింది. మొత్తం ఆర్థిక సంవత్సరంలో 7.2 శాతం క్షీణించింది. ► నిర్మాణం: డిసెంబర్, మార్చి త్రైమాసికాల్లో వృద్ధి రేటు వరుసగా 6.5%, 14.5 శాతాలుగా ఉన్నాయి. ఆర్థిక సంవత్సరం మొత్తంలో 8.6% క్షీణించింది. ► ట్రేడ్, హోటల్, రవాణా, కమ్యూనికేషన్లు: డిసెంబర్ త్రైమాసికంలో క్షీణత 7.9 శాతం అయితే, క్షీణత నాల్గవ త్రైమాసికంలో 2.3 శాతానికి పరిమితమైంది. 2020–21లో క్షీణ రేటు 18.2 శాతం. ► ఫైనాన్షియల్, రియల్టీ, ప్రొఫెషనల్ సేవలు: డిసెంబర్ త్రైమాసికంలో వృద్ధి 6.7 శాతం అయితే, మార్చి త్రైమాసికంలో ఈ రేటు 5.4 శాతం. ఆర్థిక సంవత్సరంలో 1.5 శాతం క్షీణత. ► విద్యుత్, గ్యాస్, నీటి సరఫరా, ఇతర యుటిలిటీ సేవలు: నాల్గవ త్రైమాసికంలో వృద్ధి 9.1 శాతం. ► పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, రక్షణ, ఇతర సేవలు: నాల్గవ త్రైమాసికంలో వృద్ధి 2.3 శాతం. మరిన్ని అంశాలు.. ► 1979–80 ఆర్థిక సంవత్సరం తర్వాత అంటే దాదాపు నాలుగు దశాబ్దాల తర్వాత ఒక పూర్తి ఆర్థిక సంవత్సరంలో క్షీణ రేటు నమోదుకావడం ఇదే తొలిసారి. అప్పట్లో క్షీణత 5.2 శాతం. ► 1950–51 జీడీపీ డేటా అందుబాటులో ఉన్న నాటి నుంచి ఐదుసార్లు – 1958, 1966, 1967, 1973, 1980 ఆర్థిక సంవత్సరాల్లోనూ మైనస్ వృద్ధి నమోదైంది. వర్షాలు సరిగ్గా లేక వ్యవసాయ రంగం దెబ్బతినడం ఇందుకు ప్రధాన కారణం. ఇప్పుడు ఆరవసారి క్షీణత నమోదయ్యింది. ► భారత్ ఎకానమీ మళ్లీ రూ.145 లక్షల కోట్ల స్థాయిని చేరుకోవాలంటే 2021–22 ఆర్థిక సంవత్సరంలో జీడీపీ 10 నుంచి 11 శాతం పురోగమించాలి. నిజానికి ఈ స్థాయిలో వృద్ధి ఉంటుందని తొలుత భావించినప్పటికీ, దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఈ అంచనాలకు దెబ్బకొట్టింది. వృద్ధి రెండంకెల లోపే ఉంటుందని రేటింగ్, ఆర్థిక విశ్లేషణా సంస్థల తాజా అంచనాలు. ప్రధాన ఆర్థిక సలహాదారు కేవీ సుబ్రమణియన్ స్వయంగా ఈ తరహా సందేహాలు వ్యక్తం చేయడం గమనించాల్సిన మరో ముఖ్యాంశం. ► ఎకానమీలో 55 శాతం వాటా ఉన్న వినియోగ డిమాండ్, నిరుద్యోగం ఇప్పుడు దేశం ముందు ఉన్న తీవ్ర సవాళ్లని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇంకా వ్యాక్సినేషన్ ప్రక్రియ నత్తనడక నడుస్తుండడం మరో ప్రతికూల అంశం. ► ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వెలువడినవి తొలి అంచనాలు మాత్రమే. మరింత సమగ్రంగా తదుపరి రెండు విడతల్లో సవరణలు, తుది ఫలితాలు వెలువడతాయి. ► 2020–21 తలసరి ఆదాయం రూ.1,28,829గా నమోదయ్యింది. దాదాపు 2018–19 నాటి రూ.1,25,883 స్థాయికి పడిపోయింది. ద్రవ్యలోటు రూ.18,21,461 కోట్లు 2020–21 జీడీపీలో 9.3 శాతం ప్రభుత్వ ఆదాయాలు–వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం– ద్రవ్యలోటు 2020–21 ఆర్థిక సంవత్సరం రూ.18,21,461 కోట్లుగా నమోదయ్యింది. స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) విలువతో పోల్చితే ఇది 9.3 శాతం. కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ (సీజీఏ) సోమవారం తాజా గణాంకాలను విడుదల చేసింది. ఆర్థిక శాఖ సవరిత అంచనాలు 9.5% కన్నా ఇది తక్కువ కావడం గమనార్హం. మరిన్ని అంశాలను పరిశీలిస్తే, 2020–21 ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యలోటు జీడీపీలో 3.5 శాతం ఉండాలని (రూ.7.96 లక్షల కోట్లు) 2020 ఫిబ్రవరిలో ప్రవేశపెట్టిన బడ్జెట్ నిర్దేశించింది. అయితే కరోనా కష్టాల నేపథ్యంలో ఆదాయాలు భారీగా పడిపోయాయి. దీనితో ద్రవ్యలోటు అంచనాలను 9.5%కి (రూ.18,48,655 కోట్లు) పెంచుతున్నట్లు 2021–22 బడ్జెట్ పేర్కొం ది. సవరిత అంచనాలకన్నా 20 బేసిస్ పాయింట్లు తక్కువగా 9.3%గా ద్రవ్యలోటు తాజాగా నమోదయ్యింది. ఆదాయ– వ్యయాలు ఇలా... ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం ఆదాయాలు రూ.16,89,720 కోట్లు. ఇందులో రూ.14,24,035 కోట్లు పన్నులు, రూ.2,08,059 కోట్ల పన్ను రహిత ఆదాయాలుకాగా, రూ. 57,626 కోట్లు రుణ రికవరీ, పెట్టుబడుల ఉపసంహరణలకు సంబంధించి వసూలయిన నాన్–డెట్ క్యాపిటల్ ఆదాయాలు. ఇక ప్రభుత్వ వ్యయాల మొత్తం రూ. 35,11,181 కోట్లు. ఇందులో రూ.30,86,360 కోట్లు రెవెన్యూ అకౌంట్ నుంచి వ్యయమవగా, రూ.4,24,821 కోట్లు క్యాపిటల్ అకౌంట్ నుంచి ఖర్చయ్యాయి. వెరసి రూ.18,21,461 కోట్ల ద్రవ్యలోటు నమోదయ్యిందన్నమాట. 2021 ఏప్రిల్‌లో ఇలా..: కాగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021–22) తొలి నెల– ఏప్రిల్ ద్రవ్యలోటు పరిస్థితిని మరో ప్రకటనలో సీజీఏ వివరించింది. బడ్జెట్ అంచనాల్లో ఇది ఏప్రిల్‌లో 5.2 శాతానికి చేరింది. విలువలో రూ.78,699 కోట్లు. 2021–22లో 6.8% లక్ష్యాన్ని కేంద్రం నిర్దేశించుకుంది. విలువలో రూ.15,06,812 కోట్లు. 2019–20లో ద్రవ్యలోటు జీడీపీలో 4.6 శాతంకావడం గమనార్హం. అప్పటికి ఇదే ఏడేళ్ల గరిష్టం. ఎకానమీలో అనిశ్చితి కరోనా మహమ్మారి సవాళ్లు తొలగకపోవడంతో ఆర్థిక వ్యవస్థలో అనిశ్చితి కొనసాగనుంది. 2021–22 ఆర్థిక సంవత్సరంలో సెకండ్ వేవ్ ప్రభావం తీవ్రంగా ఉండకపోయినప్పటికీ, వృద్ధి రేటు రెండంకెల్లో నమోదుకావడం కష్టం – కేవీ సుబ్రమణియన్, ప్రధాన ఆర్థిక సలహాదారు -
Stock Market: మార్కెట్లో మళ్లీ బుల్ సందడి...
ముంబై: గడిచిన రెండురోజుల పాటు నష్టాల బాటలో నడిచిన బుల్స్.., ఆర్థిక, బ్యాంకింగ్ రంగ షేర్ల ర్యాలీతో శుక్రవారం మళ్లీ లాభాల గాడిలో పడ్డాయి. దేశీయ అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంక్ ఎస్బీఐ మార్చి క్వార్టర్ ఫలితాలు మార్కెట్ వర్గాలను మెప్పించాయి. కోవిడ్ సంక్షోభంలో కేంద్ర ఆర్థిక అవసరాలకు ఆర్బీఐ రూ.99,122 కోట్ల మిగులు నిధులను డివిడెంట్ రూపంలో చెల్లించేందుకు ముందుకు రావడం ఇన్వెస్టర్లకు ఉత్సాహాన్నిచ్చింది. వీటికి తోడు ఫారెక్స్ మార్కెట్లో రూపాయి బలమైన రికవరీ, దేశంలో కరోనా రోజూవారీ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతుండటం, ప్రపంచ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందడం తదితర అంశాలు సెంటిమెంట్‌ను బలపరిచాయి. ఫలితంగా అన్ని రంగాల షేర్లకు సంపూర్ణ కొనుగోళ్ల మద్దతు లభించడంతో సెన్సెక్స్, నిఫ్టీలు మార్చి 30 తేది తర్వాత ఒకరోజులో అతిపెద్ద లాభాన్ని గడించాయి. సెన్సెక్స్ 976 పాయింట్లు లాభపడి తిరిగి 50వేల స్థాయి పైన 50,540 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 269 పాయింట్లు పెరిగి 15 వేల స్థాయి ఎగువున 15,175 వద్ద నిలిచింది. మార్కెట్ భారీ ర్యాలీతో సూచీలు గడిచిన రెండు రోజుల్లో కోల్పోయిన లాభాలన్నీ రికవరీ అయ్యాయి. ఎస్బీఐ మెరుగైన ఆర్థిక ఫలితాలు వెల్లడించడంతో అధిక వెయిటేజీ బ్యాంకింగ్, ఆర్థిక రంగాల షేర్లు జోరుగా ర్యాలీ చేశాయి. అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ బ్రెంట్ క్రూడ్ ధర 65 డాలర్లకు దిగిరావడం హెచ్‌పీసీఎల్, బీపీసీఎల్ వంటి ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల షేర్లకు కలిసొచ్చింది. సెన్సెక్స్ సూచీలోని 30 షేర్లలో పవర్ గ్రిడ్, డాక్టర్ రెడ్డీస్ షేర్లు మాత్రమే నష్టపోయాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 1026 పాయింట్లు, నిఫ్టీ 284 పాయింట్ల మేర లాభపడ్డాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.510.16 కోట్లను ఈక్విటీ షేర్లను, సంస్థాగత పెట్టుబడిదారులు రూ.649 కోట్ల షేర్లను కొన్నారు. కరోనా కేసుల సంఖ్య తగ్గుదల కారణంగా లాక్డౌన్ ఆంక్షలను తొలగించవచ్చనే ఆశలతో పాటు వ్యాక్సినేషన్ వేగవంతం, కార్పొరేట్లు ఆశాజనక మార్చి క్వార్టర్ ఫలితాల ప్రకటనతో ఈ వారంలో సెన్సెక్స్ 1,808 పాయింట్లు, నిఫ్టీ 498 పాయింట్లు లాభపడ్డాయి. ‘‘వ్యాక్సినేషన్ వేగవంతంతో కంపెనీల ప్రస్తుత ఆర్థిక సంవత్సరపు ఆదాయాలు వృద్ధి చెందవచ్చనే ఆర్థికవేత్తలు అంచనాలు వేస్తున్నారు. ఇటీవల ఆర్బీఐ ఉద్దీపన చర్యల ప్రకటనకు తోడు తాజాగా కేంద్రానికి మిగులు నిధుల మళ్లింపు అంశాలు బుల్స్‌కు జోష్‌నిచ్చాయి. రానున్న రోజుల్లో నిఫ్టీ 15,050 స్థాయిని నిలుపుకుంటే 15,300 స్థాయికి చేరుకోగలదు. ర్యాలీ కొనసాగితే ఆల్‌టైం 15,431 స్థాయిని సైతం అందుకోవచ్చు. ఒకవేళ లాభాల స్వీకరణ లేదా మరేఇతరేత వల్ల మార్కెట్ పతనం జరిగితే దిగువ స్థాయిలో 15,000 వద్ద మద్దతు స్థాయిని కలిగి ఉంది’’ ఎల్కేపీ సెక్యూరిటీస్ రీసెర్చ్ హెచ్ ఎస్ రంగనాథన్ తెలిపారు. ఆల్‌టైం హైకి బీఎస్ఈ మార్కెట్ క్యాప్... సూచీలు దాదాపు రెండు శాతం ర్యాలీ చేయడంతో ఒక్కరోజులోనే రూ.2.41 లక్షల కోట్ల సంపద ఇన్వెస్టర్ల సొంతమైంది. దీంతో ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈ నమోదిత కంపెనీల మొత్తం మార్కెట్ విలువ శుక్రవారం తొలిసారి 3 ట్రిలియన్ డాలర్లను (రూ.218 లక్షల కోట్లు) తాకింది. కంపెనీల మార్కెట్ క్యాప్‌నకు సంబంధించి ఇది సరికొత్త రికార్డు అని బీఎస్ఈ గణాంకాలు తెలిపాయి. -
డాక్టర్ రెడ్డీస్ లాభం రూ. 557 కోట్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో ఫార్మా దిగ్గజం డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ (డీఆర్ఎల్) నికర లాభం 29% క్షీణించి రూ. 557 కోట్లకు పరిమితమైంది. అంతక్రితం ఆర్థిక సంవత్సరం క్యూ4లో ఇది రూ.781 కోట్లు. మరోవైపు, ఆదాయం రూ. 4,336 కోట్ల నుంచి రూ. 4,608 కోట్లకు పెరిగింది. పూర్తి ఆర్థిక సంవత్సరానికి గాను కంపెనీ నికర లా భం (కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన) రూ. 2,026 కోట్ల నుంచి రూ. 1,952 కోట్లకు తగ్గింది. అయితే, నికర అమ్మకాలు మాత్రం రూ. 16,357 కోట్ల నుంచి రూ. 18,420 కోట్లకు పెరిగాయి. 2020–21 పూర్తి ఆర్థిక సంవత్సరానికి రూ. 5 ముఖ విలువ గల షేరు ఒక్కింటిపై రూ. 25 మేర తుది డివిడెండ్ ఇవ్వాలని బోర్డు నిర్ణయించినట్లు కంపెనీ తెలిపింది. కొత్త ఉత్పత్తులపై మరింత దృష్టి.. ఉత్పాదకతను పెంచుకోవడం, కొంగొత్త ఉత్పత్తుల ఆవిష్కరణపై మరింతగా దృష్టి పెడుతున్నట్లు సంస్థ కో–చైర్మన్, ఎండీ జీవీ ప్రసాద్ తెలిపారు. కోవిడ్–19కి సంబంధించి స్పుత్నిక్–వి టీకాను దేశవ్యాప్తంగా పూర్తి స్థాయిలో అందుబాటులోకి తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నామని, అలాగే కోవిడ్–19 చికిత్సలో తోడ్పడే పలు ఔషధాలను అభివృద్ధి చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. అమెరికా అవినీతి నిరోధక చట్టాలకు విరుద్ధంగా పలు దేశాల్లో తమ కంపెనీ తరఫున హెల్త్‌కేర్ నిపుణులకు చెల్లింపులు జరిపినట్లు వచ్చిన ఆరోపణల మీద స్వయంగా విచారణ చేపట్టినట్లు కంపెనీ వెల్లడించింది. ఇదే విషయాన్ని అటు అమెరికాలోని సెక్యూరిటీస్ అండ్ ఎక్సే్చంజ్ కమిషన్‌కి, న్యాయ శాఖకు, ఇటు సెబీకి తెలిపింది. గ్లోబల్ జనరిక్స్ 6 శాతం అప్.. క్యూ4లో గ్లోబల్ జనరిక్స్ విభాగం ఆదాయం 6 శాతం పెరిగి రూ. 3,639 కోట్ల నుంచి రూ. 3,873 కోట్లకు చేరింది. కీలకమైన ఉత్తర అమెరికా మార్కెట్లో ఔషధాల ధరల తగ్గుదల కారణంగా ఆదాయం 3 శాతం క్షీణించి రూ. 1,750 కోట్లకు పరిమితమైంది. సమీక్షాకాలంలో ఉత్తర అమెరికా మార్కెట్లో డీఆర్ఎల్ 6 కొత్త ఔషధాలు ప్రవేశపెట్టింది. మరోవైపు, యూరప్ మార్కెట్లో ఆదాయాలు 15 శాతం పెరగ్గా, భారత్‌లో 23 శాతం పెరిగాయి. అటు వర్ధమాన మార్కెట్లలో ఆదాయం 10 శాతం వృద్ధి చెందింది. ఇక ఫార్మా సర్వీసులు, యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ (పీఎస్‌ఏఐ) విభాగం ఆదాయాలు క్యూ4లో వార్షికంగా 10 శాతం వృద్ధితో రూ. 790 కోట్లుగా నమోదయ్యాయి. ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో డాక్టర్ రెడ్డీస్ షేరు 2% క్షీణించి రూ. 5,196 వద్ద ముగిసింది. -
హెచ్డీఎఫ్సీ పనితీరు భళా
ముంబై: ప్రయివేట్ రంగ మార్టిగేజ్ దిగ్గజం హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ గతేడాది(2020–21) చివరి త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. క్యూ4(జనవరి–మార్చి)లో నికర లాభం 31 శాతం ఎగసి రూ. 5,669 కోట్లను తాకింది. అంతక్రితం ఏడాది(2019–20) ఇదే కాలంలో రూ. 4,342 కోట్లు ఆర్జించింది. ఇక క్యూ4లో స్టాండెలోన్ నికర లాభం 42 శాతం జంప్‌చేసి రూ. 3,180 కోట్లకు చేరింది. వాటాదారులకు షేరుకి రూ. 23 చొప్పున తుది డివిడెండును హెచ్డీఎఫ్సీ బోర్డు ప్రకటించింది. ఇందుకు జూన్ 1 రికార్డ్ డేట్‌గా తెలియజేసింది. పూర్తి ఏడాదికి మార్చితో ముగిసిన పూర్తిఏడాదికి హెచ్డీఎఫ్సీ స్టాండెలోన్ నికర లాభం రూ. 17,770 కోట్ల నుంచి రూ. 12,027 కోట్లకు వెనకడుగు వేసింది. ఈ కాలంలో రూ. 2,788 కోట్లమేర పన్ను చెల్లింపులను చేపట్టింది. కాగా.. బంధన్ బ్యాంకుతో గృహ ఫైనాన్స్ విలీనం కారణంగా లాభాలను పోల్చతగదని హెచ్డీఎఫ్సీ పేర్కొంది. గతేడాది తొలి అర్ధభాగంలో వ్యక్తిగత రుణ విభాగం మందగించినట్లు కంపెనీ వైస్‌చైర్మన్, సీఈవో కేకి మిస్త్రీ పేర్కొన్నారు. అయితే ద్వితీయార్ధంలో పటిష్ట రికవరీ నమోదైనట్లు తెలియజేశారు. దీంతో అక్టోబర్–డిసెంబర్ మధ్య వ్యక్తిగత రుణ మంజూరీ 42 శాతం పెరిగినట్లు వెల్లడించారు. ఇది క్యూ4లో మరింత అధికమై 60 శాతాన్ని తాకినట్లు తెలియజేశారు. కాగా.. బోర్డు ఎంపికమేరకు 2021 మే 7 నుంచి మిస్త్రీ మరో మూడేళ్లపాటు ఎండీగా బాధ్యతలు నిర్వహించనున్నారు. మార్జిన్లు 3.5 శాతం మార్చికల్లా హెచ్డీఎఫ్సీ నికర వడ్డీ మార్జిన్లు 3.5 శాతంగా నమోదయ్యాయి. కనీస మూలధన నిష్పత్తి(సీఏఆర్) 22.2 శాతాన్ని తాకింది. స్థూల మొండిబకాయిలు(ఎన్పీఏలు) 1.99 శాతం నుంచి 1.98 శాతానికి స్వల్పంగా తగ్గాయి. ప్రొవిజన్లు రూ. 13,025 కోట్లకు చేరాయి. వ్యక్తిగత పోర్ట్‌ఫోలియో ఎన్పీఏలు 0.99 శాతంకాగా, వ్యక్తిగతేతర రుణ విభాగంలో 4.77 శాతంగా నమోదయ్యాయి. కోవిడ్–19 నేపథ్యంలో మార్గదర్శకాలకు మించి రూ. 7,534 కోట్లమేర అదనపు ప్రొవిజన్లు చేపట్టినట్లు మిస్త్రీ వెల్లడించారు. షేరు అప్: షేరు ఎన్ఎస్ఈలో 2.5 శాతం బలపడి రూ. 2,491 వద్ద ముగిసింది. తొలుత రూ. 2,507 వరకూ జంప్‌చేసింది. ఎన్ఎస్ఈ, బీఎస్ఈలో కలిపి సుమారు 50.54 లక్షల షేర్లు ట్రేడయ్యాయి. -
Coforge Q4 Results: కోఫోర్జ్ లాభం 17% అప్
న్యూఢిల్లీ: గతంలో ఎన్ఐఐటీ టెక్నాలజీస్‌గా ఐటీ సేవలందించిన కంపెనీ కోఫోర్జ్ లిమిటెడ్ 2020–21 చివరి క్వార్టర్ ఫలితాలు ప్రకటించింది. క్యూ4(జనవరి–మార్చి)లో నికర లాభం 17 శాతం ఎగసి రూ. 133 కోట్లను తాకింది. అంతక్రితం ఆర్థిక సంవత్సరం(2019–20) ఇదే కాలంలో రూ. 114 కోట్లు ఆర్జించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన మొత్తం ఆదాయం సైతం 14 శాతం పుంజుకుని రూ. 1,261 కోట్లను అధిగమించింది. వాటాదారులకు షేరుకి రూ. 13 చొప్పున మధ్యంతర డివిడెండును ప్రకటించింది. ఇందుకు ఈ నెల 19 రికార్డ్ డేట్‌గా నిర్ణయించింది. నిర్వహణ లాభ మార్జిన్లు 18 శాతంగా నమోదయ్యాయి. ప్రొడక్ట్ ఇంజినీరింగ్, ఆటోమేషన్, క్లౌడ్ సర్వీసెస్‌లో మాకున్న సామర్థ్యాలు, భాగస్వామ్యాలు, ప్లాట్‌ఫామ్స్ కంపెనీని వృద్ధి బాటలో నిలుపుతున్నట్లు కోఫోర్జ్ సీఈవో సుధీర్ సింగ్ పేర్కొన్నారు. తద్వారా ట్రాన్స్‌ఫార్మేషన్‌కు దారిచూపుతున్నట్లు తెలియజేశారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2021–22)లో నిలకడైన కరెన్సీ ప్రాతిపదికన ఆదాయంలో కనీసం 17 శాతం వృద్ధిని సాధించగలమంటూ కోఫోర్జ్ తాజాగా అంచనా వేసింది. ఈ బాటలో గతేడాదితో పోలిస్తే 1 శాతం అధికంగా 19 శాతం ఇబిటా మార్జిన్లు నమోదుకావచ్చని పేర్కొంది. డాలర్ల రూపేణా క్యూ4లో 7.1 శాతం త్రైమాసిక వృద్ధిని సాధించడం ద్వారా ఈ ఏడాది పటిష్ట ఫలితాలు సాధించే బాటలో సాగుతున్నట్లు అభిప్రాయపడింది. మెరుగైన టర్నోవర్, మార్జిన్లను అందుకోనున్నట్లు తెలియజేసింది. గతేడాది 78.1 కోట్ల డాలర్ల ఆర్డర్లను పొందినట్లు వెల్లడించింది. 2021 మార్చికల్లా ఉద్యోగుల సంఖ్య 12,391కు చేరగా.. క్యూ4లో 967 మంది ఉద్యోగులు జత కలసినట్లు వివరించింది. ఎన్ఎస్ఈలో 17 శాతం దూసుకెళ్లింది. రూ. 3,387 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో రూ. 3,449 వద్ద 52 వారాల గరిష్టాన్ని తాకింది. ఒక దశలో రూ. 2,822 దిగువన కనిష్టాన్ని సైతం చూసింది. -
RIL Q4 Results: ఆర్ఐఎల్ ఫలితాలు భేష్
న్యూఢిల్లీ: డైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్ఐఎల్) గతేడాది(2020–21) చివరి త్రైమాసికంలో ఆకర్షణీయ ఫలితాలు సాధించింది. క్యూ4(జనవరి–మార్చి)లో నికర లాభం రెట్టింపునకుపైగా ఎగసి రూ. 13,227 కోట్లకు చేరింది. దీనిలో యూఎస్ షేల్ ఆస్తుల విక్రయం ద్వారా లభించిన రూ. 737 కోట్ల అనుకోని లాభం కలసి ఉన్నట్లు కంపెనీ పేర్కొంది. అంతక్రితం ఏడాది(2019–20) ఇదే కాలంలో రూ. 6,348 కోట్లు మాత్రమే ఆర్జించింది. కాగా.. 2019–20 క్యూ4లో రూ. 4,267 కోట్లమేర అసాధారణ నష్టం నమోదుకాగా.. తాజా(2020–21) త్రైమాసికంలో రూ. 787 కోట్లమేర ఆస్తుల విక్రయ లాభం జత కలసింది. వీటిని మినహాయిస్తే.. నికర లాభం 17 శాతం వృద్ధి సాధించినట్లని విశ్లేషకులు తెలియజేశారు. కాగా, కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన మొత్తం ఆదాయం 14 శాతం ఎగసి రూ. 1,72,095 కోట్లను తాకింది. త్రైమాసికవారీగా చూస్తే ఆయిల్ టు కెమికల్(ఓటూసీ) బిజినెస్ మెరుగుపడినట్లు కంపెనీ తెలియజేసింది. కంపెనీ ఆర్జనలో టెలికం, రిటైల్ విభాగాల వాటా 33 శాతం నుంచి 45 శాతానికి ఎగసినట్లు ఆర్ఐఎల్ పేర్కొంది. వాటాదారులకు షేరుకి రూ. 7 డివిడెండ్ ప్రకటించింది. జియో జూమ్: క్యూ4లో టెలికం విభాగం జియో నికర లాభం 47 శాతంపైగా జంప్‌చేసి రూ. 3,508 కోట్లయ్యింది. ఆదాయం 19 శాతం పెరిగి రూ. 18,278 కోట్లకు చేరింది. 1.54 కోట్లమంది సబ్స్క్రయిబర్లను జత చేసుకుంది. అయితే ఇంటర్ కనెక్ట్ యూసేజీ చార్జీల విధానాలలో చేపట్టిన మార్పుల కారణంగా సగటు వినియోగదారు ఆదాయం రూ. 151 నుంచి రూ. 138కు తగ్గింది. 2021 మార్చికల్లా 42.62 కోట్లమంది సబ్స్క్రయిబర్లను కలిగి ఉంది. మార్చిలో జియో ఫోన్ ఆఫర్ కారణంగా వినియోగదారులు పెరిగినట్లు తెలుస్తోంది. ఇక రిటైల్ బిజినెస్‌లో గ్రోసరీ, కన్జూమర్ ఎలక్ట్రానిక్స్ నుంచి రికార్డ్ ఆదాయం సమకూరడంతో నిర్వహణ లాభం 41 శాతం ఎగసింది. రూ. 3,623 కోట్లకు చేరింది. కాగా.. తొలిసారి జియో పూర్తి ఏడాది కార్యకలాపాల నేపథ్యంలో ఫలితాలు విడుదల చేసింది. వెరసి 2020–21లో రూ. 73,503 కోట్ల ఆదాయం, రూ. 12,537 కోట్ల నికర లాభం ఆర్జించింది. ఓటూసీ, గ్యాస్ విభాగాలు పెట్రోకెమికల్ మార్జిన్లలో రికవరీ కొనసాగినప్పటికీ కోవిడ్–19 కారణంగా రిఫైనరీలు తక్కువ సామర్థ్యంతో పనిచేసినట్లు ఆర్ఐఎల్ తెలియజేసింది. దీంతో ఓటూసీ ఇబిటా 4.6 శాతం నీరసించి రూ. 11,407 కోట్లకు పరిమితమైంది. తూర్పుతీర ప్రాంతంలోని కేజీ–డీ6 బ్లాకులో కొత్త డిస్కవరీలలో గ్యాస్ ఉత్పత్తి ప్రారంభంకావడంతో కొన్నేళ్ల తదుపరి వరుసగా రెండో క్వార్టర్లో పన్నుకుముందు లాభాలు నమోదయ్యాయి. కాగా.. పూర్తి ఏడాదికి(2020–21) నికర లాభం 35 శాతం పుంజుకుని రూ. 53,739 కోట్లకు చేరింది. టర్నోవర్ మాత్రం 18 శాతం క్షీణించి రూ. 5,39,238 కోట్లను తాకింది. ఆర్ఐఎల్ షేరు ఎన్ఎస్ఈలో 1.4 శాతం నీరసించి రూ. 1,996 వద్ద ముగిసింది. మార్కెట్ ముగిసిన తర్వాత ఫలితాలు వెలువడ్డాయి. ఓటూసీ విభాగంలో పటిష్ట రికవరీని సాధించాం. టెలికం, జియోలతో కూడిన డిజిటల్ సర్వీసుల బిజినెస్‌లోనూ ప్రస్తావించదగ్గ వృద్ధిని చూపాం. అధికస్థాయిలకు చేరిన సైట్ల వినియోగ రేటు, డౌన్‌స్ట్రీమ్ ప్రొడక్టులు మెరుగుపడటం, ఇంధన రవాణా మార్జిన్లు వంటి అంశాలు ఓటూసీ బిజినెస్‌కు జోష్‌నిచ్చాయి. ప్రస్తుత సమస్యాత్మక పరిస్థితులలో కన్జూమర్ విభాగం దేశానికి డిజిటల్, ఫిజికల్ లైఫ్‌లైన్‌గా వినియోగపడింది. కోవిడ్–19 ప్రజల జీవితాలను విచ్చిన్నం చేస్తున్న నేపథ్యంలోనూ 75,000 మందికి ఉపాధి కల్పించాం. – ముకేశ్ అంబానీ, రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ -
అదరగొట్టిన రిలయన్స్
సాక్షి,ముంబై: దేశీయ కార్పొరేట్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్ఐఎల్) రికార్డు స్థాయిలో లాభాలను సాధించింది. ముఖేశ్ అంబానీ నేతృత్వంలోని సంస్థ నికర లాభాల్లో 2020 సంవత్సరం క్యూ 4లో భారీ వృద్ధిని సాధించింది. శుక్రవారం మార్కెట్ ముగిసిన తరువాత ప్రకటించిన క్యూ 4 ఫలితాల్లో ఆర్ఐఎల్ రూ.13,227 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో 6,348 కోట్ల రూపాయలు. ఏకీకృత ఆదాయం 11 శాతం ఎగిసి 154,896 కోట్లుగా ఉంది. గత ఏడాది కంపెనీ ఆదాయం 139,535 కోట్ల రూపాయలని రిలయన్స్ తెలిపింది. రిలయన్స్ ఆయిల్-టు కెమికల్ వ్యాపారం 20.6శాతం వృద్ధితో , రూ.1,01,080కోట్ల ఆదాయం ఆర్జించగా, ఎబిటా రూ.11407కోట్లుగా ఉంది. ఇది క్వార్టర్ ఆన్ క్వార్టర్ పద్దతిలో 16.9శాతం ఎక్కువ. గత ఏడాది 4,267 కోట్ల భారీ వన్‌టైం నష్టాలను నమోదు చేసిన రిలయన్స్ ఈ ఏడాది 797 కోట్ల లాభాలను గడించడం విశేషం. అలాగే మార్చి 31, 2021 తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి ఒక్కో ఈక్విటీ షేరుకు 7రూపాయల డివిడెండ్‌ను బోర్డు సిఫారసు చేసింది. ముఖ్యంగా ఆర్ఐఎల్కు చెందిన టెలికాం విభాగం రిలయన్స్ జియో నాలుగో త్రైమాసికంలో నికర లాభంలో 47.5 శాతం వృద్ధిని నమోదు చేసి 3,508 కోట్ల రూపాయలు సాధించింది. గత ఏడాది ఇదే కాలంలో 2,379 కోట్ల రూపాయలు. కార్యకలాపాల నుండి ఏకీకృత ఆదాయం దాదాపు 19శాతం పెరిగి 18,278 కోట్ల రూపాయలకు చేరుకుంది, ఇది సంవత్సరానికి 15,373 కోట్ల రూపాయలు అని జియో ఒక ప్రకటనలో తెలిపింది. 426 మిలియన్ల కస్టమర్లు జియో సొంతమని, ప్రస్తుత కస్టమర్లకు మాత్రమే కాకుండా, దేశవ్యాప్తంగా ప్రజలందరికీ, గృహ,సంస్థలకు డిజిటల్ అనుభవాలను అందించడానికి తాము కట్టబడి ఉన్నామని రిలయన్స్ చైర్మన్ , మేనేజింగ్ డైరెక్టర్ ముఖేశ్ అంబానీ వ్యాఖ్యానించారు. గత రెండు సంవత్సరాలుగా సేవలందిస్తున్న జియో.. ఇండియాను ఒక ప్రధాన డిజిటల్ సమాజంగా మార్చే కృషిని కొనసాగిస్తుందన్నారు. చదవండి : వెయ్యి పడకలతో కోవిడ్ ఆసుపత్రి: రిలయన్స్ -
మారుతికి కోవిడ్ దెబ్బ: లాభాలు ఢమాల్
సాక్షి, ముంబై: కోవిడ్-19 మహమ్మారి బెడద దేశీయ అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకిని పట్టి పీడిస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరంలో కరోనా మహమ్మారి కారణంగా అమ్మకాలతో భారీగా దెబ్బతిన్నాయి. దీంతో క్యు4 లో ఫలితాలు మార్కెట్ అంచనాలను అందుకోలేకపోయాయి. 2021 ఆర్ధిక సంవత్సరంలో 25.1 శాతం క్షీణితతో నికర లాభం రూ .4,229.7 కోట్లుగా ఉందని కంపెనీ మంగళవారం వెల్లడించింది. అలాగే ఆదాయం 7.2శాతం క్షీణించి రూ.66562 కోట్లకి పరిమితమైంది. మరోవైపు కంపెనీ బోర్డు ఒక్కో షేరుకు రూ .45 మధ్యంతర డివిడెండ్ ప్రకటించింది. (ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్‌సేల్: భారీ ఆఫర్లు) జనవరి-మార్చి త్రైమాసికంలో కంపెనీ నికర లాభం ఏకంగా 10శాతం క్షీణత నమోదు చేసింది. 9.7 శాతం తగ్గి1,166.10 కోట్లకు చేరుకోగా, నికర అమ్మకాలు 33.6 శాతం పెరిగి రూ .22,958 కోట్లకు చేరుకున్నాయి. వాహన విడిభాగాల ధరలు పెరగడం, రూపాయి మారకపు విలువ, నిర్వహణేతర ఆదాయం తగ్గిపోవడం వంటి కారణాలతో ఈ క్షీణత నమోదైనట్లు కంపెనీ చెప్పింది. కరోనా, సంబంధిత ఆంక్షల నేపథ్యంలో అమ్మకాలు 6.7 శాతం క్షీణించి 14,57,861 వాహనాలకు చేరుకున్నాయి. 2018-19 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే అమ్మకాలు 21.7 శాతం తగ్గాయి. దేశీయ అమ్మకాలు 6.8 శాతం క్షీణించి 13,61,722 యూనిట్లకు చేరుకోగా, ఎగుమతులు 5.9 శాతం తగ్గి 96,139 యూనిట్లకు చేరుకున్నాయి. నికర అమ్మకాలు ఈ ఏడాదిలో 66,562.10 కోట్ల రూపాయలుగా ఉండగా, అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే 7.2 శాతం తక్కువ. (కరోనా రెండో దశ : స్వల్పంగా తగ్గిన పాజిటివ్ కేసులు) చదవండి : సుజుకి హయాబుసా క్రేజ్: ఆ వేరియంట్ ఔట్ ఆఫ్ స్టాక్! -
టెక్ మహీంద్రా లాభం హైజంప్
ముంబై: ఐటీ సేవల దిగ్గజం టెక్ మహీంద్రా గత ఆర్థిక సంవత్సరం(2020–21) చివరి త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన క్యూ4(జనవరి–మార్చి)లో నికర లాభం 35 శాతం ఎగసి రూ. 1,081 కోట్లను అధిగమించింది. అంతక్రితం ఏడాది(2019–20) ఇదే కాలంలో రూ. 804 కోట్లు మాత్రమే ఆర్జించింది. మొత్తం ఆదాయం స్వల్పం గా 2.5 శాతం పుంజుకుని రూ. 9,730 కోట్లకు చేరింది. మార్చితో ముగిసిన పూర్తిఏడాదికి నికర లాభం 10 శాతం పురోగమించి రూ. 4,428 కోట్లను తాకింది. మొత్తం ఆదాయం 2.7 శాతం వృద్ధితో రూ. 37,855 కోట్లయ్యింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2021–22)లో ఆదాయం రెండంకెల స్థాయిలో పుంజుకునే వీలున్నట్లు కంపెనీ తాజాగా అంచనా వేసింది. ఆగస్ట్ 11న డివిడెండ్... టెక్ మహీంద్రా బోర్డు వాటాదారులకు షేరుకి రూ. 30 చొప్పున తుది డివిడెండును సిఫారసు చేసింది. దీనిలో రూ. 15 ప్రత్యేక డివిడెండు కలసి ఉంది. ఆగస్ట్ 11కల్లా డివిడెండును చెల్లించనున్నట్లు కంపెనీ వెల్లడించింది. దీంతో కలిపి గతేడాదికి కంపెనీ మొత్తం రూ. 45 డివిడెండును చెల్లించినట్లవుతుంది. క్యూ4లో 847 మంది ఉద్యోగులు వైదొలగడంతో 2021 మార్చికల్లా కంపెనీ సిబ్బంది సంఖ్య 1,21,054కు పరిమితమైంది. ఈ ఏప్రిల్ నుంచీ ఉద్యోగులకు వేతన పెంపును చేపడుతున్నట్లు కంపెనీ సీఎఫ్‌వో మిలింద్ కులకర్ణి వెల్లడించారు. గతేడాది మార్జిన్లు 2.6 శాతం బలపడి 18.1 శాతానికి చేరటంతోపాటు.. క్యాష్‌ఫ్లో మెరుగుపడినట్లు పేర్కొన్నారు. ఒక ఆసుపత్రితో ఒప్పందం ద్వారా నోయిడాలోని క్యాంపస్‌లో 50 పడకల కోవిడ్ కేర్ సౌకర్యాన్ని ఏర్పాటు చేసినట్లు సీఈవో గుర్నానీ వెల్లడించారు. బీపీఎస్‌లో పట్టు కన్సల్టింగ్, టెక్నాలజీ సర్వీసులందించే యూఎస్ కంపెనీ ఎవెంటస్ సొల్యూషన్స్ గ్రూప్‌ను సొంతం చేసుకున్నట్లు టెక్ మహీంద్రా పేర్కొంది. అయితే డీల్ విలువను వెల్లడించలేదు. ఈ కొనుగోలుతో కస్టమర్ ఎక్స్పీరియన్స్, కస్టమర్ మేనేజ్మెంట్ విభాగాల్లో కంపెనీ మరింత పట్టుసాధించనున్నట్లు తెలియజేసింది. బిజినెస్ ప్రాసెస్ సర్వీస్(బీపీఎస్) విభాగంలో మరింత సమర్థవంత సేవలందించనున్నట్లు పేర్కొంది. ఫలితాల నేపథ్యంలో టెక్ మహీంద్రా షేరు ఎన్ఎస్ఈలో 2% ఎగసి రూ. 970 వద్ద ముగిసింది. అత్యున్నత సాంకేతికతలపై ప్రత్యేక దృష్టితో క్లయింట్లను ఆకట్టుకుంటున్నాం. దీంతో క్యూ4లో భారీ డీల్స్ దక్కాయి. ఇవి రెట్టింపునకు ఎగసి 100 కోట్ల డాలర్లకు చేరాయి. ఇకపై వృద్ధి బాటలో సాగనున్నాం. ఐటీ సేవలకు పటిష్ట డిమాండ్ కనిపిస్తోంది. వచ్చే రెండు త్రైమాసికాలలో 8–10% మేర ఉద్యోగ కల్పన చేపట్టనున్నాం. 5జీ, క్లౌడ్ తదితర విభాగాలలో అధిక వృద్ధికి వీలుంది. – సీపీ గుర్నానీ, టెక్ మహీంద్రా సీఈవో -
హెచ్‌సీఎల్ టెక్ లాభం 2,962 కోట్లు
న్యూఢిల్లీ: సాఫ్ట్వేర్ సేవల దేశీ దిగ్గజం హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ గత ఆర్థిక సంవత్సరం(2020–21) చివరి త్రైమాసికంలో రూ. 2,962 కోట్ల నికర లాభం ఆర్జించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన ఇది 6 శాతం తక్కువకాగా.. అంతక్రితం ఏడాది క్యూ4(జనవరి–మార్చి)లో రూ. 3,154 కోట్లు ఆర్జించింది. యూఎస్ అకౌంటింగ్ ప్రమాణాల ప్రకారం ఆదాయం దాదాపు 6 శాతం పుంజుకుని 19,642 కోట్లను తాకింది. ఇక డాలర్ల రూపేణా నికర లాభం 5 శాతం క్షీణించి 41 కోట్ల డాలర్లకు పరిమితంకాగా.. ఆదాయం 6 శాతం పెరిగి 270 కోట్ల డాలర్లకు చేరింది. రికార్డ్: మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి హెచ్‌సీఎల్ టెక్ నికర లాభం 17.6% పుంజుకుని రూ. 13,011 కోట్లను తాకింది. మొత్తం ఆదాయం 6.7 శాతం బలపడి రూ. 75,379 కోట్లకు చేరింది. డాలర్ల రూపేణా నికర లాభం 13% పెరిగి 176 కోట్ల డాలర్లను తాకగా.. ఆదాయం 1,017.5 కోట్ల డాలర్లకు చేరింది. వాటాదారులకు షేరుకి రూ. 6 డివిడెండును ప్రకటించింది. దీనికి జతగా.. ఆదాయం తొలిసారి 10 బిలియన్ డాలర్ల మైలురాయిని అధిగమించడంతో మరో రూ. 10ను ప్రత్యేక మధ్యంతర డివిడెండుగా ప్రకటించింది. వెరసి వాటాదారులకు షేరుకి రూ. 16 చొప్పున చెల్లించనుంది. దీంతో గతేడాదికి మొత్తం రూ. 26 డివిడెండ్ చెల్లించినట్లయ్యింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2021–22)లో ఆదాయం రెండంకెల వృద్ధిని సాధించే వీలున్నట్లు కంపెనీ అంచనా వేస్తోంది. షేరు ఫ్లాట్: మార్కెట్లు ముగిశాక హెచ్‌సీఎల్ టెక్ ఫలితాలు విడుదల చేసింది. ఎన్ఎస్ఈలో షేరు 0.6% నీరసించి రూ. 957 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో రూ.975–950 మధ్య ఊగిసలాడింది. త్రైమాసిక ప్రాతిపదికన క్యూ4లో ఆదాయం 2.5 శాతం పుంజుకుంది. కంపెనీ చరిత్రలోనే అత్యధికంగా 3.1 బిలియన్ డాలర్ల విలువైన డీల్స్ లభించాయి. విభిన్న విభాగాల నుంచి మొత్తం 19 భారీ డీల్స్‌ను కుదుర్చుకున్నాం. తద్వారా కొత్త ఏడాదిలోకి ఉత్సాహంగా అడుగుపెట్టాం. – సి.విజయ్‌కుమార్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, ప్రెసిడెంట్, సీఈవో -
విప్రో లాభం 28% జూమ్
న్యూఢిల్లీ: సాఫ్ట్వేర్ సేవల దేశీ దిగ్గజం విప్రో లిమిటెడ్ గత ఆర్థిక సంవత్సరం (2020–21) చివరి త్రైమాసికంలో ప్రోత్సాహకర పనితీరు చూపింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన క్యూ4 (జనవరి-మార్చి)లో నికర లాభం 28 శాతం జంప్‌చేసి రూ.2,972 కోట్లను తాకింది. అంతక్రితం క్యూ4లో రూ. 2,326 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం 3.4 శాతం పుంజుకుని రూ. 16,245 కోట్లను అధిగమించింది. అంతకుముందు ఏడాది ఇదే కాలంలో రూ.15,711 కోట్ల టర్నోవర్ సాధించింది. డాలర్ల రూపేణా 215.24 కోట్ల డాలర్ల ఆదాయం నమోదైంది. ఇది 3.9 శాతం వృద్ధి. కాగా.. మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి నికర లాభం 11 శాతం ఎగసి రూ.10,796 కోట్లు దాటింది. మొత్తం ఆదాయం నామమాత్రంగా 1.5 శాతం పెరిగి రూ. 61,943 కోట్లకు చేరింది. మార్జిన్లు భేష్...: క్యూ4లో విప్రో ఐటీ సర్వీసుల నిర్వహణ లాభం(ఇబిట్) 29.5 శాతం జంప్‌చేసి రూ. 3,417 కోట్లను తాకింది. ఈ బాటలో ఇబిట్ మార్జిన్లు 3.44 శాతం బలపడి 21 శాతానికి చేరాయి. వేతన పెంపు చేపట్టినప్పటికీ మార్జిన్లను మెరుగుపరచుకున్నట్లు విప్రో సీఎఫ్‌వో జతిన్ దలాల్ తెలియజేశారు. క్యూ4లో ఐటీ ప్రొడక్టుల ఆదాయం రూ. 210 కోట్లకు చేరగా, పూర్తి ఏడాదికి రూ. 770 కోట్లను తాకింది. కాగా.. ఈ ఆర్థిక సంవత్సరం(2021–22)తొలి క్వార్టర్ (ఏప్రిల్–జూన్)లో 129.5–223.8 కోట్ల డాలర్ల ఆదాయాన్ని అం చనా వేస్తోంది. ఇది క్యూ4తో పోలిస్తే 2-4% వృది ్ధకాగా.. వార్షిక ప్రాతిపదికన చూస్తే 11–13% అధికం! అయితే ఇటీవల కొనుగోలు చేసిన క్యాప్కో, యాంపియన్‌లను పరిగణనలోకి తీసుకోకుండా వేసిన అంచనాలుగా కంపెనీ తెలిపింది. వలసలు 12.1 శాతం... ఇటీవల చేపట్టిన బైబ్యాక్ ద్వారా 1.3 బిలియన్ డాలర్లను వాటాదారులకు అందించినట్లు జతిన్ పేర్కొన్నారు. ఈ జనవరి 1కల్లా 80 శాతం మంది ఉద్యోగులకు వేతన పెంపు, ప్రమోషన్లు వంటివి చేపట్టినట్లు సీఈవో డెలాపోర్ట్ చెప్పారు. మార్చికల్లా విప్రో సిబ్బంది సంఖ్య 1,97,712కు చేరింది. ఉద్యోగ వలసల రేటు 12.1%గా నమోదైంది. మార్కెట్లు ముగిశాక విప్రో ఫలితాలు విడుదల చేసింది. ఈ నేపథ్యంలో విప్రో షేరు ఎన్ఎస్ఈలో 3.5 శాతం జంప్‌చేసి రూ. 434 వద్ద ముగిసింది. -
ఇన్ఫీ లాభం రూ. 5,076 కోట్లు
న్యూఢిల్లీ: ఐటీ సేవల దేశీ దిగ్గజం ఇన్ఫోసిస్ టెక్నాలజీస్ గతేడాది చివరి త్రైమాసికంలో ఆకర్షణీయ ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన క్యూ4(జనవరి–మార్చి)లో నికర లాభం 17.5 శాతం పెరిగి రూ. 5,076 కోట్లను తాకింది. అంతక్రితం ఏడాది క్యూ4లో రూ. 4,321 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం 13 శాతంపైగా ఎగసి రూ. 26,311 కోట్లకు చేరింది. గత క్యూ4లో రూ. 23,267 కోట్ల టర్నోవర్ సాధించింది. డాలర్ల రూపేణా ఆదాయం 13 శాతం వృద్ధితో 361.3 కోట్ల డాలర్లుగా నమోదైంది. వాటాదారులకు షేరుకి రూ. 15 చొప్పున తుది డివిడెండ్‌ను ప్రకటించింది. మార్చితో ముగిసిన పూర్తి ఏడాది(2020–21)లో ఇన్ఫోసిస్ నికర లాభం 16.6 శాతం పురోగమించి రూ. 19,351 కోట్లకు చేరింది. ఇక మొత్తం ఆదాయం దాదాపు 11 శాతం పుంజుకుని రూ. 1,00,472 కోట్లను తాకింది. కాగా.. ఇప్పటికే చెల్లించిన రూ. 12తో కలిపి గతేడాదికి 54 శాతం అధికంగా రూ. 27 డివిడెండ్‌ను చెల్లించినట్లయ్యింది. బైబ్యాక్‌కు రెడీ సొంత ఈక్విటీ షేర్ల కొనుగోలుకి ఇన్ఫోసిస్ బోర్డు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఒక్కో షేరుకీ రూ. 1,750 ధర మించకుండా 5.25 కోట్లకుపైగా షేర్లను బైబ్యాక్ చేయనున్నట్లు వెల్లడించింది. 1.23 శాతం వాటాకు సమానమైన వీటి కొనుగోలుకి రూ. 9,200 కోట్ల వరకూ వెచ్చించనుంది. ఫలితాలపై అంచనాల నేపథ్యంలో మంగళవారం ఇన్ఫోసిస్ షేరు ఎన్ఎస్ఈలో 1.6% క్షీణించి రూ. 1,403 వద్ద ముగిసింది. ఈ ధరతో పోలిస్తే బైబ్యాక్‌కు 25 శాతం ప్రీమియంను ప్రకటించడం గమనార్హం! ఇన్ఫీ అంతక్రితం 2019 ఆగస్ట్‌లో 11.05 కోట్ల ఈక్విటీ షేర్లను బైబ్యాక్ చేసింది. ఇందుకు రూ. 8,260 కోట్లు వెచ్చించింది. 2017 డిసెంబర్లో తొలిసారి షేరుకి రూ. 1,150 ధరలో బైబ్యాక్‌ను చేపట్టింది. తద్వారా 11.3 కోట్ల షేర్లను తిరిగి కొనుగోలు చేసింది. గైడెన్స్ భేష్..: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2021–22)లో ఆదాయం 12–14 శాతం స్థాయిలో బలపడే వీలున్నట్లు ఇన్ఫోసిస్ తాజాగా అంచనా వేసింది. ఇది స్థిర కరెన్సీ ప్రాతిపదికన ఇచ్చిన గైడెన్స్‌కాగా.. డివిడెండ్(రూ. 6,400 కోట్లు), బైబ్యాక్‌తో కలిపి వాటాదారులకు రూ. 15,600 కోట్లను తిరిగి చెల్లించనున్నట్లు తెలియజేసింది. తద్వారా వాటాదారులకు క్యాష్‌ఫ్లోలలో 85 శాతం వరకూ చెల్లించే విధానాలను పాటిస్తున్నట్లు కంపెనీ సీఎఫ్‌వో నీలాంజన్ రాయ్ వివరించారు. ఆర్డర్ బుక్ రికార్డు 2020–21లో భారీ డీల్స్ ఆర్డర్ల విలువ 57 శాతం జంప్‌చేసి 14.1 బిలియన్ డాలర్లను తాకినట్లు ఇన్ఫోసిస్ వెల్లడించింది. ఇది కంపెనీ చరిత్రలోనే అత్యధికంకాగా.. వీటిలో 66 శాతం డీల్స్‌ను కొత్తగా కుదుర్చుకున్నట్లు తెలియజేసింది. డిసెంబర్లో కొత్త రికార్డును నెలకొల్పుతూ దైమ్లర్ ఏజీ నుంచి 3.2 బిలియన్ డాలర్ల(అంచనా) ఆర్డర్‌ను పొందింది. గతేడాది ఆగస్ట్‌లో వ్యాన్‌గార్డ్ నుంచి సంపాదించిన 1.5 బిలియన్ డాలర్ల కాంట్రాక్టుతో పోలిస్తే ఇది రెట్టింపు విలువకావడం విశేషం! క్యూ4లో సైతం 2.1 బిలియన్ డాలర్ల కాంట్రాక్టులు కుదుర్చుకుంది. 25,000 మంది ఫ్రెషర్స్‌కు చాన్స్ గతేడాదిలో 36,500 మందిని ఇన్ఫోసిస్ కొత్తగా నియమించు కుంది. వీరిలో క్యాంపస్ నియామకాల ద్వారా 21,000 మందికి ఉపాధి కల్పించినట్లు సీవోవో యూబీ ప్రవీణ్ రావు పేర్కొన్నారు. ఈ బాటలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 25,000 మంది ఫ్రెషర్స్‌ను ఎంపిక చేసుకోనున్నట్లు తెలియజేశారు. వీరిలో 1,000 మందిని విదేశీ క్యాంపస్‌ల ద్వారా నియమించుకోనున్నట్లు వివరించారు. క్యూ3లో 10.1 శాతంగా నమోదైన ఉద్యోగ వలస రేటు క్యూ4లో 15.2 శాతానికి ఎగసింది. మార్చికల్లా కంపెనీ మొత్తం సిబ్బంది సంఖ్య 2,59,619కు చేరింది. రూ. లక్ష కోట్లకు.. గతేడాది ఆదాయంలో రూ. లక్ష కోట్ల మైలురాయిని అధిగమించాం. క్లయింట్లకు అధిక ప్రాధాన్యతనిస్తున్నాం. కోబాల్ట్ టీఎం తదితర నైపుణ్యాల ద్వారా డిజిటల్ పోర్ట్‌ఫోలియోను పెంచుకుంటున్నాం. ఉద్యోగులకు అధికారాలు ఇవ్వడం ద్వారా గ్లోబల్ స్థాయిలో క్లయింట్లను ఆకట్టుకుంటున్నాం. భాగస్వామి ఎంపికలో క్లయింట్ల నుంచి ప్రాధాన్యతను సాధిస్తున్నాం. – ఇన్ఫోసిస్ సీఈవో, ఎండీ సలీల్ పరేఖ్ -
అదరగొట్టిన టీసీఎస్
సాక్షి, న్యూఢిల్లీ: ఐటీ సేవల దేశీ దిగ్గజం టీసీఎస్ గతేడాది చివరి క్వార్టర్లో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. క్యూ4(జనవరి–మార్చి)లో కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన నికర లాభం దాదాపు 15 శాతం ఎగసి రూ. 9,246 కోట్లను తాకింది. అంతక్రితం ఏడాది క్యూ4లో రూ. 8,049 కోట్లు నమోదైంది. మొత్తం ఆదాయం 9.4 శాతం పెరిగి రూ. 43,705 కోట్లకు చేరింది. గత క్యూ4లో రూ. 39,946 కోట్ల టర్నోవర్ సాధించింది. వాటాదారులకు షేరుకి రూ. 15 చొప్పున తుది డివిడెండ్‌ను ప్రకటించింది. పూర్తి ఏడాదికి మార్చితో ముగిసిన పూర్తి ఏడాది(2020–21)లో టీసీఎస్ నికర లాభం రూ. 32,340 కోట్ల నుంచి రూ. 33,388 కోట్లకు బలపడింది. ఇది న్యాయపరమైన క్లెయిముల ప్రొవిజన్లు మినహాయించి ప్రకటించిన నికర లాభంకాగా.. నికరంగా చూస్తే రూ. 32,430 కోట్లు ఆర్జించింది. ఎపిక్ సిస్టమ్స్ కార్పొరేషన్‌కు సంబంధించిన న్యాయవివాదానికి కంపెనీ రూ. 1,218 కోట్లు(16.5 కోట్ల డాలర్లు) కేటాయించింది. ఇక మొత్తం ఆదాయం 4.6 శాతం పుంజుకుని రూ. 1,64,717 కోట్లయ్యింది. అంతక్రితం ఏడాది రూ. 1,56,949 కోట్ల టర్నోవర్‌ను సాధించింది. ఆర్డర్‌బుక్ జోరు క్యూ4లో ఆర్డర్‌బుక్ 9.2 బిలియన్ డాలర్లకు చేరినట్లు టీసీఎస్ వెల్లడించింది. ఇది కంపెనీ చరిత్రలో ఒక త్రైమాసికంలోనే అత్యధికంకాగా.. 2021 మార్చికల్లా మొత్తం ఆర్డర్ బుక్ విలువ 17.1 శాతం వృద్ధితో 31.6 బిలియన్ డాలర్లను తాకినట్లు తెలియజేసింది. క్యూ4లో కొత్తగా 19,388 మంది ఉద్యోగులను జత చేసుకుంది. దీంతో మొత్తం సిబ్బంది సంఖ్య 4,88,649కు చేరింది. ఐటీ సర్వీసులలో వలసల రేటు 7.2 శాతంగా నమోదైనట్లు టీసీఎస్ తెలియజేసింది. కోవిడ్–19.. గత మూడు త్రైమాసికాలుగా కోవిడ్–19 నేపథ్యంలోనూ పటిష్ట ఫలితాలను సాధించడం ద్వారా గత ఆర్థిక సంవత్సరాన్ని ప్రోత్సాహకరంగా ముగించినట్లు టీసీఎస్ సీఎఫ్‌వో వి.రామకృష్ణన్ పేర్కొన్నారు. మెగా డీల్స్, పరిశ్రమను మించిన వృద్ధి, సిబ్బంది, కొత్త సామర్థ్యాలపై పెట్టుబడులు తదితరాలకు క్యూ4లో సాధించిన మార్జిన్లు విలువను చేకూర్చినట్లు వ్యాఖ్యానించారు. కంపెనీ మార్కెట్లు ముగిశాక ఫలితాలు విడుదల చేసింది. ఈ నేపథ్యంలో టీసీఎస్ షేరు ఎన్ఎస్ఈలో 2.2 శాతం క్షీణించి రూ. 3,250 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో రూ. 3,338 వద్ద గరిష్టాన్ని, రూ. 3,213 వద్ద కనిష్టాన్ని తాకింది. కొత్త ఏడాదిలోనూ.. గత దశాబ్దంలో కొత్త సామర్థ్యాలపై పెట్టుబడులు, పరిశోధన, నవీకరణ వంటి అంశాలు భవిష్యత్‌లోనూ సాంకేతిక సేవలలో భారీ అవకాశాలకు దారి చూపనున్నాయి. వృద్ధి, ట్రాన్స్ఫార్మేషన్లలో మరింత వాటాను సాధించనున్నాం. కొత్త ఏడాది(2021–22)లో క్లయింట్ల పురోగతి ప్రణాళికలకు సరికొత్త ఆవిష్కరణలు, సాంకేతికతల ద్వారా మద్దతివ్వడంలో దృష్టిపెట్టనున్నాం. – టీసీఎస్ సీఈవో, ఎండీ రాజేష్ గోపీనాథన్ -
ఆపిల్ రికార్డు సేల్స్ : 8 లక్షల ఐఫోన్లు
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో తన తొలి ఆన్లైన్ స్టోర్ ప్రారంభించిన టెక్ దిగ్గజం ఆపిల్ కు బాగా కలిసి వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా ఐఫోన్ అమ్మకాలు క్షీణించినా, దేశీయంగా గణనీయమైన అమ్మకాలను నమోదు చేసింది. భారతీయ స్మార్ట్ ఫోన్ విభాగంలో ఈ ఏడాది సెప్టెంబర్ త్రైమాసిక అమ్మకాల్లో రికార్డు సృష్టించింది. అమెరికా, యూరప్ ఆసియా పసిఫిక్ దేశాలతోపాటు ఇండియాలో ఈ త్రైమాసికంలో రికార్డు అమ్మకాలను సాధించామని ఫలితాల వెల్లడి సందర్భంగా ఆపిల్ సీఈఓ టిమ్ కుక్ వెల్లడించారు. భారతదేశంలో సెప్టెంబర్ 23న తమ ఆన్లైన్ స్టోర్ ప్రారంభించిన నేపథ్యంలో మంచి ఆదరణ లభించిందని ప్రకటించారు. ఇందుకు యూజర్లకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. (యాపిల్ ఆన్లైన్ స్టోర్ వచ్చేసింది : విశేషాలు) (ఐఫోన్ 12, 12 ప్రో సేల్ షురూ, డిస్కౌంట్స్) నిన్న (అక్టోబరు 29) క్యూ4 ఫలితాలను ఆపిల్ ప్రకటించింది. ఈ త్రైమాసికంలో కంపెనీ మొత్తం ఆదాయం స్వల్పంగా పుంజుకుని 64.7 బిలియన్ డాలర్లుగా ఉంది. లాభం 7 శాతం తగ్గి 12.7 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ఐఫోన్ గ్లోబల్ అమ్మకాలు 20 శాతం క్షీణించాయి. మార్కెట్ పరిశోధన సంస్థ కెనాలిస్ జూలై-సెప్టెంబర్ కాలంలో ఇండియాకు ఆపిల్ 8 లక్షలకు పైగా ఐఫోన్లను రవాణా చేసింది. తద్వారా రెండంకెల వృద్ధిని నమోదు చేసిందని నివేదించింది. ధరల పరంగా మార్కెట్‌ను ఆపిల్ పూర్తిగా అర్థం చేసుకుంటోందనీ, ఐఫోన్ ఎస్ఈ 2020, ఐఫోన్ 11వంటి హాట్-సెల్లింగ్ ఫోన్లు, ఆకర్షణీయమైన ఆఫర్లతో భారతీయ ప్రీమియం స్మార్ట్‌ఫోన్ విభాగంలో నెమ్మదిగా, స్థిరంగా ప్రవేశిస్తోందని కౌంటర్ పాయింట్ అసోసియేట్ డైరెక్టర్ తరుణ్ పాథక్ వ్యాఖ్యానించారు. ఐఫోన్12తో రాబోయే త్రైమాసికంలో తన స్థానాన్ని ఆపిల్ మరింత పటిష్టం చేసుకుంటుందన్నారు. (ఐఫోన్స్ ప్రీబుకింగ్‌పై ‘సంగీత’ భారీ ఆఫర్లు) ఆపిల్ తన కొత్త ఆన్లైన్ స్టోర్‌తో ఉత్సాహాన్ని పుంజుకుందనీ, ప్రీ-ఆర్డర్ల పరంగా ఐఫోన్ 12 సిరీస్‌కు మంచి ఆదరణ లభించిందని సీఎంఆర్ హెడ్ ఇండస్ట్రీ ఇంటెలిజెన్స్ గ్రూప్ (ఐఐజి) ప్రభు రామ్ తెలిపారు. మరోవైపు అక్టోబర్ 23 న ప్రారంభించిన కొత్త ఐఫోన్లకు మంచి ఆదరణ లభిస్తోందని వ్యాపార వర్గాలు పేర్కొంటున్నాయి. ఐఫోన్ 12, 12 ప్రోలకు అద్భుతమైన ప్రీ-ఆర్డర్లను స్వీకరిస్తున్నామంటూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. -
ఫలితాలు, భౌగోళిక పరిణామాలదే కీలక పాత్ర
న్యూఢిల్లీ/బెంగళూరు: దేశీయ ఈక్విటీ మార్కెట్లను ఈ వారంలో కంపెనీల జూన్ త్రైమాసిక ఫలితాల ధోరణి, భౌగోళిక రాజకీయ పరిణామాలు ప్రభావితం చేయనున్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండడంతో అమెరికా–చైనా మధ్య ఉద్రిక్తతలు అంతకంతకూ పెరుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఈ పరిణామాలతో అంతర్జాతీయంగా ఇన్వెస్టర్లు గత వారం అప్రమత్త ధోరణితో వ్యవహరించినట్టు.. వీటికితోడు దేశీయంగా కరోనా వైరస్ కేసుల తీవ్రత పెరుగుతూనే ఉన్న విషయాన్ని విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు. ఇప్పటికే కనిష్టాల నుంచి గణనీయంగా ర్యాలీ చేసిన నేపథ్యంలో స్థిరీకరణ చెందొచ్చని భావిస్తున్నారు. మరోవైపు ఈ వారంలో కోటక్ మహీంద్రా బ్యాంకు, టెక్ మహీంద్రా, హెచ్డీఎఫ్సీ, రిలయన్స్ ఇండస్ట్రీస్ తదితర ముఖ్యమైన కంపెనీల ఆర్థిక ఫలితాలు వెలువడనున్నాయి. ఆయా అంశాలు మార్కెట్ గమనాన్ని నిర్దేశిస్తాయి. గత వారం సెన్సెక్స్ నికరంగా 1,109 పాయింట్లు, నిఫ్టీ 292 పాయింట్లు లాభపడడం గమనార్హం. ఇన్ఫోసిస్‌లో శిభూలాల్ వాటాల విక్రయం ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుల్లో ఒకరైన ఎస్డీ శిభూలాల్ కుటుంబ సభ్యులు కంపెనీలో 85 లక్షల షేర్లను ఈ నెల 22–24 తేదీల మధ్య విక్రయించినట్టు స్టాక్ ఎక్సే్ఛంజ్‌ల డేటా తెలియజేస్తోంది. వీటి విలువ రూ.777 కోట్లు. దాతృత్వ కార్యక్రమాలు, పెట్టుబడుల కోసం ఈ నిధులను వినియోగించనున్నట్టు వారు తెలిపారు. -
ఐఆర్సీటీసీ ఆర్థిక ఫలితాలు అదుర్స్
ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం అండ్ కార్పోరేషన్(ఐఆర్సీటీసీ) ఆర్థిక ఫలితాలు మార్కెట్ వర్గాలను మెప్పించాయి. కంపెనీ శుక్రవారం 2019-20 ఆర్థిక సంవత్సరపు నాలుగో త్రైమాసిక ఫలితాలను విడుదల చేసింది. వార్షిక ప్రాతిపదికన కంపెనీ నికర లాభం 79.3శాతం వృద్ధి చెందింది. అంతకు ముందు ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్లో రూ.84కోట్లుగా నమోదైన నికరలాభం ఈసారి రూ.150.6కోట్లకు చేరుకున్నట్లు కంపెనీ తెలిపింది. అయితే క్వార్టర్-టు-క్వార్టర్ ప్రాతిపదికన నికరలాభం 26.9శాతం క్షీణించింది. కరోనా కట్టడి దేశవ్యాప్తంగా విధించిన లాక్డౌన్ నికరలాభాల్ని హరించివేసినట్లు కంపెనీ చెప్పుకొచ్చింది. ఇది మార్చి త్రైమాసికంలో కంపెనీ నిర్వహణ ఆదాయం 17.9శాతం పెరిగి రూ.586.89 కోట్లకు చేరుకుంది. అంతకు ముందు నిర్వహణ ఆదాయం రూ.497 కోట్లుగా ఉంది. గడిచిన ఆర్థిక సంవత్సరానికిగాను ప్రతిషేరుకు రూ.2.50 తుది డివిడెండ్‌ను ప్రకటించింది. ఈ కంపెనీ షేర్లు ఎక్చ్సేంజ్‌లో గతేడాది(2019) అక్టోబర్ 14న లిస్ట్ అయ్యాయి. అప్పటి నుంచి కంపెనీ 3సార్లు ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. ఫలితాల ప్రకటన నేపథ్యంలో శుక్రవారం మార్కెట్ ముగిసే సరికి బీఎస్ఈలో షేరు 1.14శాతం లాభంతో రూ.1401.15 వద్ద స్థిరపడింది. -
భారత్ డైనమిక్స్- టాటా స్టీల్ మెరుపులు
గత ఆర్థిక సంవత్సరం(2019-20) చివరి త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించడంతో ఓవైపు పీఎస్‌యూ భారత్ డైనమిక్స్ లిమిటెడ్ కౌంటర్ వెలుగులోకిరాగా.. మరోపక్క నికర నష్టాలు ప్రకటించినప్పటికీ మెటల్ దిగ్గజం టాటా స్టీల్ కౌంటర్‌కూ డిమాండ్ కనిపిస్తోంది. ప్రపంచ మార్కెట్ల ప్రోత్సాహంతో దేశీ స్టాక్ మార్కెట్లు సైతం హుషారుగా కదులుతున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 167 పాయింట్లు బలపడి 35,129కు చేరగా.. నిఫ్టీ 70 పాయింట్లు పుంజుకుని 10,382 వద్ద ట్రేడవుతోంది. కాగా.. ఫలితాల నేపథ్యంలో భారత్ డైనమిక్స్, టాటా స్టీల్ భారీ లాభాలతో సందడి చేస్తున్నాయి. వివరాలు చూద్దాం భారత్ డైనమిక్స్ గతేడాది క్యూ4(జనవరి-మార్చి)లో ప్రభుత్వ రంగ సంస్థ భారత్ డైనమిక్స్ నికర లాభందాదాపు 150 శాతం దూసుకెళ్లి రూ. 310 కోట్లకు చేరింది. మొత్తం ఆదాయం సైతం 57 శాతం పెరిగి రూ. 1468 కోట్లను తాకింది. వాటాదారులకు షేరుకి రూ. 2.55 చొప్పున తుది డివిడెండ్‌ను ప్రకటించింది. ఈ నేపథ్యంలో భారత్ డైనమిక్స్ షేరు ఎన్ఎస్ఈలో ప్రస్తుతం 15 శాతం జంప్‌చేసింది. రూ. 348 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 354 వరకూ ఎగసింది. టాటా స్టీల్ గతేడాది క్యూ4(జనవరి-మార్చి)లో ప్రయివేట్ రంగ దిగ్గజం టాటా స్టీల్ రూ. 1096 కోట్ల నికర నష్టం ప్రకటించింది. అంతక్రితం ఏడాది(2018-19) క్యూ4లో రూ. 2431 కోట్ల నికర లాభంఆర్జించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన మొత్తం ఆదాయం సైతం 20 శాతం క్షీణించి రూ. 33,770 కోట్లను తాకింది. ఇబిటా 38 శాతం వెనకడుగుతో రూ. 4647 కోట్లకు చేరింది. ఈ నేపథ్యంలో టాటా స్టీల్ షేరు ఎన్ఎస్ఈలో ప్రస్తుతం 4.5 శాతం జంప్‌చేసింది. రూ. 336 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 338 వరకూ ఎగసింది. -
ఐటీసీ ఫలితాలు వచ్చాయ్... కొనాలా? అమ్మాలా?
ఐటీసీ కంపెనీ శనివారం గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికపు ఫలితాలను ప్రకటించింది. ఈ క్యూ4లో స్టాండ్అలోన్ ప్రాతిపదికన కంపెనీ రూ.3,797 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. అంత క్రితం ఆర్థిక సంవతర్సంలో కంపెనీ ఆర్జించిన నికర లాభంతో పోలిస్తే ఇది 6.5శాతం అధికం. మార్చి చివరి వారంలో విధించి లాక్డౌన్ కారణంగా నిర్వహణ ఆదాయం 6.4శాతం క్షీణంచి రూ.11,420 కోట్లకు పరిమితమైంది. ఇదే క్వార్టర్లో ఈబీఐటీడీఏ 8.9శాతం క్షీణించి రూ.4,163.5 కోట్లుగా నమోదైంది. మార్చి క్వార్టర్ ఫలితాల ప్రకటన తర్వాత సోమవారం ఇంట్రాడేలో ఈ షేరు 4శాతం లాభపడి, చివరికి 1శాతం లాభంతో రూ.197 వద్ద సిర్థపడింది. ఈ నేపథ్యంలో వివిధ బ్రోకరేజ్ సంస్థలు ఐటీసీపై అభిప్రాయాలను వెలువరిచాయి. 1.బ్రోకరేజ్ సంస్థ: జెఫ్పారీస్ రేటింగ్: బై టార్గెట్ ధర: రూ.240 విశ్లేషణ: కరోనా ప్రేరేపిత లాక్డౌన్ విధింపు ప్రభావంతో వార్షిక ప్రాతిపదికన సిగరెట్ అమ్మకాల వ్యాల్యూమ్స్ 10శాతం క్షీణతను చవిచూశాయి. అయితే ప్యాకేజ్డ్ ఫుడ్స్ సింగిల్ డిజిట్ వృద్ధిని నమోదు చేయడం విశేషం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక ఫలితాలు మరింత దారుణంగా ఉండొచ్చు. ఏది ఏమైనా కంపెనీ డివిడెండ్ ఈల్డ్ 5శాతం ఉండటం షేరును ఆకర్షణీయంగా మార్చింది. 2. బ్రోకరేజ్ సంస్థ: మెక్వ్యెరీ రేటింగ్: అవుట్‌ఫెర్‌ఫామ్ టార్గెట్ ధర: రూ.232 విశ్లేషణ: కోవిడ్-19 తొలి దశ అమ్మకాలతో పోలిస్తే ఈ జూన్‌లో సిగరెట్ అమ్మకాల రికవరీ 85-90శాతంగా ఉండొచ్చు. తన ప్రత్యర్థి కంపెనీలతో పోలిస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఎఫ్ఎంసీజీ వ్యాపారంలో అత్యుత్తమంగా రాణించవచ్చు. కంపెనీ డివిండ్ ఈల్డ్ 5శాతం ఉండటం షేరును ఆకర్షణీయంగా మరింత మార్చింది. 3. బ్రోకరేజ్ సంస్థ: సీఎల్ఎస్ఏ రేటింగ్: అవుట్‌ఫెర్‌ఫామ్ టార్గెట్ ధర: రూ.220 విశ్లేషణ: స్వల్ప కాలం పాటు కఠినమైన పరిస్థితులు ఎదుర్కోంటుంది. ఆర్థిక సంవత్సరం 2020లో ఒక్కొక్క షేరుకు డివిడెండ్ చెల్లింపు 88శాతానికి పెరగడం షేరు తదుపరి ర్యాలీకి ఉత్సాహాన్నిచ్చే అంశం. 4.బ్రోకరేజ్ సంస్థ: మోతీలాల్ ఓస్వాల్ సర్వీసెస్ రేటింగ్: న్యూట్రల్ టార్గెట్ ధర: రూ.190 విశ్లేషణ: ఆర్థిక సంవత్సరం 2020 నాలుగో త్రైమాసిక ఫలితాలు అంచనాల కన్నా తక్కువగానే ఉన్నాయి. లాక్‌డౌన్‌తో సమయంతో పోలిస్తే ప్రస్తుత సిగరెట్ అమ్మకాల వాల్యూమ్స్ సాధారణ స్థితికి వచ్చాయి. అయితే రాబోయే కొద్ది నెలల్లో మరింత జీఎస్టీ పెరిగే అవకాశం చాలా ఎక్కువ. 1. ఐటీసీ మొత్తం లాభదాయకత కేవలం సిగరెట్లపై ఆధారపడి ఉంది. 2. జీఎస్టీ పెరుగుదల భయాలతో ఇప్పటికే ఎఫ్వై 20-22లో బలహీనమైన ఆదాయ వృద్ధి అంచనాల ప్రమాదం నెలకొంది. ఈ కారణాలతో షేరుకు న్యూట్రల్ రేటింగ్‌ను కేటాయించడమైంది. -
హడ్కో హైజంప్- ఇమామీ బోర్లా
గత ఆర్థిక సంవత్సరం(2019-20) చివరి త్రైమాసిక ఫలితాలు ప్రకటించిన నేపథ్యంలో ఓవైపు పీఎస్‌యూ దిగ్గజం హౌసింగ్ & అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్(హడ్కో) లిమిటెడ్ కౌంటర్‌కు భారీ డిమాండ్ నెలకొంది. మరోవైపు ఎఫ్ఎంసీజీ దిగ్గజం ఇమామీ లిమిటెడ్ కౌంటర్లో ఇన్వెస్టర్లు అమ్మకాలకు తెరతీశారు. వెరసి హడ్కో భారీ లాభాలతో సందడి చేస్తోంటే.. ఇమామీ నష్టాలతో కళ తప్పింది. వివరాలు చూద్దాం.. హడ్కో లిమిటెడ్ గతేడాది క్యూ4(జనవరి-మార్చి)లో హడ్కో లిమిటెడ్ నికర లాభం 87 శాతం జంప్‌చేసి రూ. 441 కోట్లకు చేరింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన మొత్తం ఆదాయం 27 శాతం పెరిగి రూ. 1900 కోట్లను తాకింది. పన్నుకు ముందు లాభం సైతం 33 శాతం అధికమై రూ. 545 కోట్లకు చేరింది. ఫలితాల నేపథ్యంలో ప్రస్తుతం ఎన్ఎస్ఈలో హడ్కో షేరు 20 శాతం అప్పర్ సర్క్యూట్ తాకింది. కొనేవాళ్లు అధికంకాగా.. అమ్మేవాళ్లు కరువుకావడంతో రూ. 5.6 ఎగసి రూ. 33.5 వద్ద ఫ్రీజయ్యింది. ఇమామీ లిమిటెడ్ గతేడాది క్యూ4(జనవరి-మార్చి)లో ఇమామీ లిమిటెడ్ నికర లాభం సగానికిపైగా క్షీణించి రూ. 23.3 కోట్లకు పరిమితమైంది. మొత్తం ఆదాయం 19 శాతం నీరసించి రూ. 523 కోట్లను తాకింది. పన్నుకు ముందు లాభం సైతం 70 శాతం పడిపోయి రూ. 25 కోట్లకు చేరింది. ఇబిటా మార్జిన్లు 5.6 శాతం బలహీనపడి 18.8 శాతానికి జారాయి. ఫలితాల నేపథ్యంలో ప్రస్తుతం ఎన్ఎస్ఈలో ఇమామీ షేరు 6 శాతం పతనమై రూ. 208 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 205 దిగువకూ చేరింది. -
కెనరా బ్యాంక్ నష్టం 6 రెట్లు జంప్
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ కెనరా బ్యాంక్‌కు గత ఆర్థిక సంవత్సరం (2019–20) మార్చి క్వార్టర్లో రూ.3,259 కోట్ల నికర నష్టాలు వచ్చాయి. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్లో రూ.552 కోట్ల నికర నష్టాలు వచ్చాయని, 6 రెట్లు పెరిగాయని కెనరా బ్యాంక్ తెలిపింది. ఆదాయం మాత్రం రూ.14,000 కోట్ల నుంచి రూ.14,222 కోట్లకు పెరిగిందని పేర్కొంది. ► గత క్యూ4లో రూ.5,375 కోట్ల మేర కేటాయింపులు జరిపింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్లో కేటాయింపులు రూ.5,524 కోట్లు. ► 2018–19లో రూ.347 కోట్ల నికర లాభం రాగా, గత ఆర్థిక సంవత్సరంలో రూ.2,236 కోట్ల నికర నష్టాలు వచ్చాయి. ► గత ఏడాది మార్చి నాటికి 8.83 శాతంగా ఉన్న స్థూల మొండి బకాయిలు ఈ ఏడాది మార్చి నాటికి 8.21 శాతానికి తగ్గాయి. నికర మొండి బకాయిలు 5.37 శాతం నుంచి 4.22 శాతానికి తగ్గాయి. ► విలువ పరంగా చూస్తే, స్థూల మొండి బకాయిలు రూ.39,224 కోట్ల నుంచి రూ.37,041 కోట్లకు, నికర మొండి బకాయిలు 22,955 కోట్ల నుంచి రూ.18,251 కోట్లకు తగ్గాయి. ► ప్రొవిజన్ కవరేజ్ రేషియో 68.13 శాతం నుంచి 70.97 శాతానికి పెరిగింది. ► ఈ ఏడాది ఏప్రిల్ 1న కెనరా బ్యాంక్‌లో సిండికేట్ బ్యాంక్ విలీనమైంది. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో కెనరా బ్యాంక్ షేర్ 4% నష్టంతో రూ.109 వద్ద ముగిసింది. -
నవీన్ ఫ్లోరిన్- హెచ్‌పీసీఎల్ జోరు
గత ఆర్థిక సంవత్సరం(2019-20) చివరి త్రైమాసికం(జనవరి-మార్చి)లో ప్రోత్సాహకర ఫలితాలు సాధించడంతో స్పెషాలిటీ కెమికల్స్ కంపెనీ నవీన్ ఫ్లోరిన్ ఇంటర్నేషనల్ కౌంటర్ వెలుగులోకి వచ్చింది. మరోపక్క గత ఆర్థిక సంవత్సర పూర్తి ఫలితాలు నిరాశపరచినప్పటికీ పెట్టుబడుల బాటలో సాగనున్నట్లు తెలియజేయడంతో పీఎస్‌యూ దిగ్గజం హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్(హెచ్‌పీసీఎల్) కౌంటర్ సైతం జోరందుకుంది. వెరసి ఆటుపోట్ల మార్కెట్లోనూ ఈ రెండు కౌంటర్లూ లాభాలతో సందడి చేస్తున్నాయి. వివరాలు చూద్దాం.. నవీన్ ఫ్లోరిన్ ఇంటర్నేషనల్ గతేడాది క్యూ4(జనవరి-మార్చి)లో నవీన్ ఫ్లోరిన్ ఇంటర్నేషనల్ నికర లాభం 705 శాతం దూసుకెళ్లి రూ. 270 కోట్లను తాకింది. రూ. 88 కోట్లమేర కనీస ప్రత్యామ్నాయ పన్ను(మ్యాట్)లభించడంతో లాభాలు హైజంప్ చేసినట్లు నిపుణులు పేర్కొన్నారు. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన నికర అమ్మకాలు 9 శాతం పెరిగి రూ. 277 కోట్లకు చేరాయి. ఇక ఇబిటా మార్జిన్లు 20 శాతం నుంచి దాదాపు 25 శాతానికి మెరుగుపడ్డాయి. వాటాదారులకు షేరుకి రూ. 3 డివిడెండ్ చెల్లించనుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం నవీన్ ఫ్లోరిన్ షేరు ఎన్ఎస్ఈలో 3.5 శాతం పుంజుకుని రూ. 1615 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 1655 వరకూ జంప్‌చేసింది. హిందుస్తాన్ పెట్రోలియం ఇంధన రంగ దిగ్గజం హెచ్‌పీసీఎల్ ఈ ఆర్థిక సంవత్సరం(2020-21)లో రూ. 12,000 కోట్లమేర పెట్టుబడి వ్యయాల ప్రణాళికలను అమలు చేయనున్నట్లు తాజాగా తెలియజేసింది. ముంబై, వైజాగ్‌లలోని రిఫైనరీ విస్తరణ ప్రాజెక్టులు తుది దశకు చేరుకున్నట్లు కంపెనీ చైర్మన్ ముకేశ్ కుమార్ పేర్కొన్నారు. ఇతర పనుల కారణంగా బార్మర్ అభివృద్ధి ప్రాజెక్టుపై పెట్టుబడులను తదుపరి దశలో చేపట్టనున్నట్లు తెలియజేశారు. కాగా.. గతేడాది(2019-20)కి హెచ్‌పీసీఎల్ 50 శాతం తక్కువగా రూ. 2637 కోట్ల నికర లాభం ఆర్జించింది. అంతక్రితం రూ. 6029 కోట్ల నికర లాభం నమోదైంది. తాజా ఫలితాలలో చమురు నిల్వలపై ఏర్పడిన నష్టాలు, ఫారెక్స్ హెచ్చుతగ్గులు లాభాలను ప్రభావితం చేసినట్లు కంపెనీ వెల్లడించింది. స్థూల అమ్మకాలు రూ. 2,95,713 కోట్ల నుంచి రూ. 2,86,250 కోట్లకు క్షీణించాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం హెచ్‌పీసీఎల్ షేరు ఎన్ఎస్ఈలో 4 శాతం జంప్‌చేసి రూ. 218 వద్ద ట్రేడవుతోంది. -
క్యాప్లిన్ పాయింట్- ధనూకా అగ్రి జోరు
అమెరికా ఆర్థిక వ్యవస్థ మాంద్యంలోకి జారనున్న అంచనాలతో ప్రపంచ స్టాక్ మార్కెట్లు పతన బాట పట్టాయి. దేశీ స్టాక్ మార్కెట్లు సైతం అమ్మకాలతో డీలాపడ్డాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 492 పాయింట్లు పతనమై 33,046కు చేరగా.. నిఫ్టీ 141 పాయింట్లు క్షీణించి 9,761 వద్ద ట్రేడవుతోంది. ఈ నేపథ్యంలో విభిన్న వార్తల కారణంగా హెల్త్‌కేర్ రంగ కంపెనీ క్యాప్లిన్ పాయింట్, అగ్రి కెమికల్స్ కంపెనీ ధనూకా అగ్రిటెక్ కౌంటర్లు ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటున్నాయి. ఫలితంగా నష్టాల మార్కెట్లోనూ లాభాలతో సందడి చేస్తున్నాయి. వివరాలు చూద్దాం.. క్యాప్లిన్ పాయింట్ ల్యాబ్ ఫినైల్ఫ్రైన్ హైడ్రోక్లోరైడ్ ఇంజక్షన్‌కు యూఎస్ఎఫ్డీఏ నుంచి తుది అనుమతి లభించినట్లు హెల్త్‌కేర్ కంపెనీ క్యాప్లిన్ పాయింట్ ల్యాబ్ పేర్కొంది. ఏడాది కాలంలో ఈ ఔషధానికి 4.5 కోట్ల డాలర్ల మార్కెట్ నమోదైనట్లు తెలుస్తోంది. అనుబంధ సంస్థ క్యాప్లిన్ స్టెరైల్స్ ద్వారా క్యాప్లిన్ పాయింట్ 17 ఏఎన్‌డీఏలకు దరఖాస్తు చేసుకుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎన్ఎస్ఈలో క్యాప్లిన్ పాయింట్ షేరు దాదాపు 6 శాతం జంప్‌చేసి రూ. 371 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 383 వరకూ ఎగసింది. ధనూకా అగ్రిటెక్ గత ఆర్థిక సంవత్సరం(2019-20) చివరి త్రైమాసికంలో ఆకర్షణీయ ఫలితాలు సాధించడంతో అగ్రికెమికల్స్ కంపెనీ ధనూకా అగ్రిటెక్ కౌంటర్ ర్యాలీ బాటలో సాగుతోంది. ఎన్ఎస్ఈలో తొలుత ఈ షేరు 4 శాతం జంప్‌చేసి రూ. 667ను తాకింది. ఇది సరికొత్త గరిష్టంకాగా.. ప్రస్తుతం 2 శాతం లాభంతో రూ. 652 వద్ద ట్రేడవుతోంది. గత నాలుగు రోజుల్లోనూ ఈ షేరు 15 శాతం లాభపడింది. క్యూ4(జనవరి-మార్చి)లో ధనూకా నిర్వహణ లాభం(ఇబిటా) 39 శాతం ఎగసి రూ. 46 కోట్లకు చేరగా.. మార్జిన్లు 17.14 శాతం నుంచి 20.11 శాతానికి బలపడ్డాయి. మొత్తం ఆదాయం సైతం 18 శాతం పెరిగి రూ. 228 కోట్లకు చేరింది. -
జెన్ టెక్ భళా- ఎక్సైడ్ బోర్లా
గత ఆర్థిక సంవత్సరం(2019-20) చివరి త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించడంతో డిఫెన్స్ శిక్షణా సొల్యూషన్స్ అందించే జెన్ టెక్నాలజీస్ కౌంటర్‌కు డిమాండ్ పెరిగింది. మరోవైపు ఇదే కాలంలో నిరుత్సాహకర పనితీరు ప్రదర్శించడంతో ఆటోమోటివ్ బ్యాటరీల దిగ్గజం ఎక్సైడ్ ఇండస్ట్రీస్ కౌంటర్లో అమ్మకాలు ఊపందుకున్నాయి. వెరసి ఒడిదొడుకుల మార్కెట్లో జెన్ టెక్నాలజీస్ కౌంటర్ భారీ లాభాలతో సందడి చేస్తుంటే.. ఎక్సైడ్ ఇండస్ట్రీస్ నష్టాలతో కళ తప్పింది. వివరాలు చూద్దాం.. జెన్ టెక్నాలజీస్ కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన గతేడాది క్యూ4(జనవరి-మార్చి)లో జెన్ టెక్నాలజీస్ నికర లాభం 46 శాతం ఎగసి రూ. 18.5 కోట్లకు చేరింది. మూడో త్రైమాసికంతో పోలిస్తే ఇది 81 శాతం వృద్ధికాగా.. మొత్తం ఆదాయం మాత్రం 56 శాతం క్షీణించి రూ. 20 కోట్లకు పరిమితమైంది. కాగా.. సీఎఫ్‌వోగా అశోక్ అట్లూరి ఎంపికకు బోర్డ్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు కంపెనీ పేర్కొంది. ఈ నేపథ్యంలో జెన్ టెక్నాలజీస్ షేరు ఎన్ఎస్ఈలో 20 శాతం అప్పర్ సర్క్యూట్‌ను తాకింది. రూ. 50.7 వద్ద ఫ్రీజయ్యింది. ఎక్సైడ్ ఇండస్ట్రీస్ గతేడాది క్యూ4(జనవరి-మార్చి)లో ఆటో బ్యాటరీల దిగ్గజం ఎక్సైడ్ ఇండస్ట్రీస్ నికర లాభం 20 శాతం నీరసించి రూ. 168 కోట్లకు పరిమితమైంది. నికర టర్నోవర్ సైతం రూ. 2599 కోట్ల నుంచి రూ. 2055 కోట్లకు క్షీణించింది. పూర్తిఏడాదికి(2019-20) సైతం ఎక్సైడ్ నికర లాభం రూ. 844 కోట్ల నుంచి రూ. 826 కోట్లకు వెనకడుగు వేయగా.. మొత్తం ఆదాయం రూ. 10588 కోట్ల నుంచి రూ. 9857 కోట్లకు తగ్గింది. ఈ నేపథ్యంలో ఎక్సైడ్ ఇండస్ట్రీస్ షేరు ఎన్ఎస్ఈలో 8 శాతం పతనమై రూ. 159కు చేరింది. -
అరబిందో లాభం 45% జంప్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మార్చి త్రైమాసికంలో అరబిందో ఫార్మా ఉత్తమ పనితీరు కనబరిచింది. కన్సాలిడేటెడ్ ఫలితాల్లో నికర లాభం క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 45.2% వృద్ధితో రూ.850 కోట్లకు చేరింది. టర్నోవర్ 16.4% వృద్ధితో రూ.5,292 కోట్ల నుంచి రూ.6,158 కోట్లకు ఎగసింది. యూఎస్ ఫార్ములేషన్ అమ్మకాలు 20.5% పెరిగి రూ.2,990 కోట్లు, యూరప్ ఫార్ములేషన్ విక్రయాలు 26% హెచ్చి రూ.1,652 కోట్లు, వృద్ధి మార్కెట్లు 30% పెరిగి రూ.376 కోట్లు సాధించాయి. ఏపీఐల అమ్మకాలు రూ.917 కోట్ల నుంచి రూ.755 కోట్లకు దిగొ చ్చాయి. పరిశోధన, అభివృద్ధికి రూ.239 కోట్లు వ్యయం చేశారు. ఏఎన్‌డీఏల విషయంలో యూఎస్ఎఫ్డీఏ నుంచి ఈ త్రైమాసికంలో ఆరు తుది, రెండు తాత్కాలిక అనుమతులను కంపెనీ దక్కించుకుంది. టర్నోవర్ రూ.23 వేల కోట్లు.. 2019–20 ఆర్థిక సంవత్సరంలో అరబిందో ఫార్మా నికరలాభం అంత క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 19.7% పెరిగి రూ.2,831 కోట్లు సాధించింది. టర్నోవర్ 18 శాతం అధికమై రూ.23,098 కోట్లకు ఎగసింది. ఈపీఎస్ రూ.48.32 నమోదైంది. యూఎస్ ఫార్ములేషన్ అమ్మకాలు 27% హెచ్చి రూ.11,483 కోట్లు, యూరప్ ఫార్ములేషన్ విక్రయాలు 19.4% పెరిగి రూ.5,922 కోట్లు, వృద్ధి మార్కెట్లు 13.5% అధికమై రూ.1,355 కోట్లు నమోదయ్యాయి. పరిశోధన, అభివృద్ధికి ఆదాయంలో 4.1% (రూ.958 కోట్లు) వెచ్చించారు. విభిన్న ఉత్పత్తుల కారణంగా యూఎస్ఏ, యూరప్ మార్కెట్లలో వృద్ధిని కొనసాగించామని అరబిందో ఫార్మా ఎండీ ఎన్.గోవిందరాజన్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. ప్రస్తుత వ్యాపారాలను పటిష్టం చేయడం, వినూత్న, ప్రత్యేక ఉత్పత్తుల అభివృద్ధి, నిబంధనలకు లోబడి పనిచేయడంపై దృష్టిసారించామని చెప్పారు. -
లాభాలు అన్‌లాక్
అన్‌లాక్ (లాక్డౌన్ సడలింపులు) నిబంధనలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌కు జోష్‌నివ్వడంతో సోమవారం స్టాక్‌మార్కెట్ భారీగా లాభపడింది. గత ఆర్థిక సంవత్సరం క్యూ4లో జీడీపీ 11 ఏళ్ల కనిష్టానికి పడిపోయినా, మే నెల తయారీ రంగం అంతంతమాత్రంగానే ఉన్నా, మార్కెట్ ముందుకే దూసుకుపోయింది. అంతర్జాతీయ సంకేతాలు సానుకూలంగా ఉండటం, నైరుతి రుతుపవనాలు సకాలంలోనే వస్తాయని, ఈ ఏడాది వర్షాలు విస్తారంగా కురుస్తాయన్న తీపికబురు సానుకూల ప్రభావం చూపించాయి. సెన్సెక్స్ 33,000 పాయింట్లు, నిఫ్టీ 9,800 పాయింట్ల ఎగువకు ఎగబాకాయి. ఇంట్రాడేలో 1,250 పాయింట్ల మేర ఎగసిన బీఎస్ఈ సెన్సెక్స్ చివరకు 879 పాయింట్ల లాభంతో 33,304 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక ఎన్ఎస్ఈ నిఫ్టీ 246 పాయింట్ల లాభంతో 9,826 పాయింట్ల వద్దకు చేరింది. ఈ రెండు సూచీలు చెరో 2.5 శాతం మేర పెరిగాయి. స్టాక్ సూచీలు వరుసగా నాలుగో ట్రేడింగ్ సెషన్లోనూ లాభపడ్డాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 1,250 పాయింట్లు, నిఫ్టీ 352 పాయింట్ల మేర పెరిగాయి. ఆర్థిక, ఎఫ్ఎమ్సీజీ, ఇంధన రంగ షేర్లలో జోరుగా కొనుగోళ్లు జరిగాయి. అన్ని రంగాల సూచీలు లాభపడ్డాయి. మరిన్ని విశేషాలు... ► బజాజ్ ఫైనాన్స్ 11 శాతం లాభంతో రూ.2,160 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో బాగా లాభపడిన షేరు ఇదే. ► సెన్సెక్స్‌లో ఐదు షేర్లు మినహా మిగిలిన 25 షేర్లు లాభాలు సాధించాయి. ఎల్ అండ్ టీ, హీరో మోటొకార్ప్, సన్ ఫార్మా, నెస్లే ఇండియా, ఆల్ట్రాటెక్ సిమెంట్ షేర్లు నష్టపోయాయి. ► దాదాపు 50కు పైగా షేర్లు ఏడాది గరిష్ట స్థాయిలకు ఎగబాకాయి. దివీస్ ల్యాబ్స్, బయోకాన్, సిప్లా, ఎస్కార్ట్స్, అదానీ గ్రీన్ తదితర షేర్లు ఈ జాబితాలో ఉన్నాయి. ► మే నెల అమ్మకాలు అంతంతమాత్రంగానే ఉన్నా, వాహన షేర్లు దూసుకుపోయాయి. ► ఈ నెల 8 నుంచి హోటళ్లు, రెస్టారెంట్లతోపాటు, షాపింగ్ మాల్స్‌ను తెరవడానికి కేంద్రం అనుమతిచ్చింది. దీంతో హోటళ్ల షేర్లు 20% వరకూ పెరిగాయి. చాలెట్ హోటల్స్, ఇండియన్‌హోటల్స్, ఈఐహెచ్, ఈఐహెచ్ వంటివి వీటిలో ఉన్నాయి. రూ. 3 లక్షల కోట్లు ఎగసిన సంపద మార్కెట్ జోరుతో ఇన్వెస్టర్ల సంపద రూ. 3 లక్షల కోట్లు ఎగసింది. ఇన్వెస్టర్ల సంపదగా పరిగణించే బీఎస్ఈలో నమోదైన కంపెనీల మొత్తం మార్కెట్ క్యాప్ రూ. 3 లక్షల కోట్లు ఎగసి రూ.130.10 లక్షల కోట్లకు పెరిగింది. లాభాలు ఎందుకంటే... ► అన్‌లాక్ 1.0 కంటైన్మెంట్ జోన్లు మినహా మిగిలిన అన్ని చోట్లా అన్ని కార్యకలాపాలను దశలవారీగా ఆరంభించడానికి కేంద్రం పచ్చజెండా ఊపడంతో స్టాక్ మార్కెట్లో కొనుగోళ్ల సునామీ నెలకొంది. లాక్డౌన్ 5.0 జూన్ 30 వరకూ పొడిగించినా, చెప్పుకోదగ్గ సడలింపులను కేంద్రం ఇచ్చింది. దాదాపు 2 నెలల లాక్డౌన్ తర్వాత ఆర్థిక వ్యవస్థలో కార్యకలాపాలు పుంజుకోనుండటం.. ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌కు జోష్‌నిచ్చింది. ► విస్తారంగా వర్షాలు... ఈ ఏడాది భారత్‌లో వర్షాలు విస్తారంగా కురుస్తాయని భారత వాతావరణ విభాగం వెల్లడించింది. కరోనా వైరస్ కల్లోలంతో ఆర్థిక వ్యవస్థ కుదేలైనప్పటికీ, విస్తారమైన వర్షాలతో వ్యవసాయ దిగుబడులు భారీగా రాగలవన్న అంచనాలతో మార్కెట్ కళకళలాడింది. ► చైనాలో పుంజుకున్న రికవరీ.. చైనాలో రికవరీ పుంజుకుందని గణాంకాలు వెల్ల డించడం సానుకూలత చూపించింది. ► చైనాపై కొత్త ఆంక్షలు లేవ్... హాంకాంగ్‌పై మరింత పట్టు బిగించేందుకు జాతీయ భద్రతా చట్టాన్ని చైనా తెచ్చిన నేపథ్యంలో చైనాపై మరిన్ని ఆంక్షలను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధిస్తారనే అంచనాలున్నాయి. ఈ అంచనాలకు భిన్నంగా కొత్త ఆంక్షలను ట్రంప్ విధించలేదు. ► బలపడిన రూపాయి రూపాయి విలువ 8 పైసలు పుంజుకుంది. ► త్వరలోనే వ్యాక్సిన్.. కరోనా వైరస్ కట్టడికి త్వరలోనే వ్యాక్సిన్ అందుబాటులోకి రాగలదన్న ఆశలు నెలకొన్నాయి. -
ఆర్థికాంశాలు, అంతర్జాతీయ పరిణామాలే దిక్సూచి
ముంబై: గతవారాంతాన వెల్లడైన పదకొండేళ్ల కనిష్టస్థాయి స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు, ద్రవ్య లోటు తీవ్రత వంటి ఆర్థికాంశాలతో పాటు లాక్‌డౌన్‌ను క్రమేపి సడలించడం వంటి ప్రభుత్వ సానుకూల నిర్ణయాలు ఈ వారంలో దేశీ స్టాక్ మార్కెట్‌కు దిశా నిర్దేశం చేయనున్నాయని దలాల్ స్ట్రీట్ వర్గాలు భావిస్తున్నాయి. వీటితోపాటు సోమవారం వెల్లడికానున్న భారత పీఎంఐ తయారీ రంగ డేటా కూడా మార్కెట్ దిశపై ప్రభావం చూపనుందని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ ఎనలిస్ట్ దీపక్ జసాని అభిప్రాయపడ్డారు. నైరుతి రుతుపవనాలు జూన్ 1 నుంచే కేరళను తాకనున్నాయనేది మార్కెట్‌కు సానుకూల అంశంగా పేర్కొన్నారు. అమెరికా–చైనాల మధ్య ముదురుతోన్న ప్రచ్ఛన్నయుద్ధ అంశంపై మార్కెట్ వర్గాలు దృష్టిసారించాయని నిపుణుల విశ్లేషణ. కాగా, ఈ వారంలో ఎస్బీఐ, ఇండిగో, బీపీసీఎల్ సహా 75 కంపెనీల ఫలితాలు వెల్లడికానుండడం కీలకాంశం. కాగా, లాక్డౌన్ ప్రకటించిన మార్చి చివరి వారంలో ఈక్విటీల్లో మ్యూచువల్ ఫండ్స్ నికరంగా రూ.1,230 కోట్లు ఇన్వెస్ట్ చేయగా, ఏప్రిల్ నెలలో రూ.7,965 కోట్ల మేర ఈక్విటీ పెట్టుబడులను విక్రయించాయి. తిరిగి మే నెలలో ఫండ్స్ రూ.2,832 కోట్లు ఇన్వెస్ట్ చేసినట్టు సెబీ డేటా తెలియజేస్తోంది. -
మౌలిక పరిశ్రమలు మునక...
న్యూఢిల్లీ: మౌలిక రంగానికి సంబంధించి ఎనిమిది పారిశ్రామిక విభాగాల గ్రూప్ ఏప్రిల్‌లో దారుణ ఫలితాన్ని చూసింది. ఈ గ్రూప్‌లోని పరిశ్రమల ఉత్పత్తిలో (2019 ఏప్రిల్ ఉత్పత్తితో పోల్చి) అసలు వృద్ధిలేకపోగా –38.1 శాతం క్షీణత నమోదయ్యింది. నిజానికి మార్చిలోనే ఈ గ్రూప్ –9 శాతం క్షీణతను నమోదుచేసుకుంది. కరోనా నేపథ్యంలో దేశం మొత్తం ఏప్రిల్‌లో పూర్తి లాక్డౌన్లో ఉన్న సంగతి తెలిసిందే. దీనితో ఏప్రిల్‌లో ‘మైనస్’ ఫలితం మరింత తీవ్రమైంది. 2019 ఏప్రిల్‌లో ఈ గ్రూప్ 5.2 శాతం వృద్ధి రేటును నమోదుచేసుకుంది. వాణిజ్య, పారిశ్రామిక మంత్రిత్వశాఖ శుక్రవారం ఈ గణాంకాలను విడుదల చేస్తూ, ‘‘లాక్డౌన్ నేపథ్యంలో బొగ్గు (–15.5 శాతం), సిమెంట్ (–86 శాతం) , స్టీల్ (–83.9 శాతం), సహజ వాయువు (–19.9 శాతం), రిఫైనరీ (–24.2 శాతం), క్రూడ్‌ఆయిల్ (– 6.4 శాతం) వంటి రంగాల్లో ఉత్పత్తి భారీగా దెబ్బతింది’’ అని పేర్కొంది. ఈ రంగాలు కాకుండా ఇంకా విద్యుత్ (–22.8%), ఎరువుల (–4.5 శాతం) రంగాలు ఈ గ్రూప్‌లో ఉన్నాయి. మొత్తం పారిశ్రామిక ఉత్పత్తి (ఐఐపీ) సూచీలో ఈ ఎనిమిది పరిశ్రమల వాటా 40.27 శాతం. ఐఐపీ ఏప్రిల్ గణాంకాలు జూన్ రెండవ వారంలో వెలువడతాయి. తాజా ఇన్ఫ్రా ఫలితాల ప్రతికూల ప్రభావం మొత్తం ఐఐపీ ఏప్రిల్ గణాంకాలపై తీవ్రంగా పడనుంది. -
రెయిన్ ఇండస్ట్రీస్- కేపీఐటీ టెక్.. స్పీడ్
స్వల్ప హెచ్చుతగ్గుల మధ్య దేశీ స్టాక్ మార్కెట్లు అటూఇటుగా కదులుతున్నాయి. ఈ నేపథ్యంలో విభిన్న వార్తల కారణంగా కాల్సైన్డ్ పెట్రోలియం కోక్ తయారీ కంపెనీ రెయిన్ ఇండస్ట్రీస్, సాఫ్ట్వేర్ సొల్యూషన్ల సంస్థ కేపీఐటీ టెక్నాలజీస్ కౌంటర్లు ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటున్నాయి. ఫలితంగా ఒడిదొడుకుల మార్కెట్లోనూ భారీ లాభాలతో సందడి చేస్తున్నాయి. వివరాలు చూద్దాం.. రెయిన్ ఇండస్ట్రీస్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2020) తొలి త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించడంతో రెయిన్ ఇండస్ట్రీస్ కౌంటర్ వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఎన్ఎస్ఈలో ఈ షేరు 13 శాతం దూసుకెళ్లింది. రూ. 79 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 81ను అధిగమించింది. క్యూ1(జనవరి-మార్చి)లో రెయిన్ నికర లాభం 55 శాతం జంప్‌చేసి రూ. 106 కోట్లను దాటింది. అయితే అమ్మకాలు 9 శాతం క్షీణించి రూ. 2898 కోట్లకు పరిమితమయ్యాయి. ఇబిటా 24 శాతం ఎగసి రూ. 460 కోట్లను తాకింది. కంపెనీ జనవరి-డిసెంబర్ కాలాన్ని ఆర్థిక సంవత్సరంగా పరిగణిస్తుంది. గత వారం రోజులుగా ఈ కౌంటర్ నిలకడను చూపుతున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. నేటి ట్రేడింగ్‌లో తొలి అర్ధగంటలోనే 3 లక్షల షేర్లు చేతులు మారినట్లు తెలియజేశారు. గత ఐదు రోజుల సగటు ట్రేడింగ్ పరిమాణం 57,000 షేర్లేకావడం గమనార్హం! కేపీఐటీ టెక్నాలజీస్ సీఎల్ఎస్ ఇన్వెస్ట్మెంట్స్ తాజాగా కంపెనీకి చెందిన దాదాపు 20 లక్షల షేర్లను కొనుగోలు చేసినట్లు కేపీఐటీ టెక్నాలజీస్ పేర్కొంది. షేరుకి రూ. 46.91 ధరలో వీటిని సొంతం చేసుకున్నట్లు తెలియజేసింది. ఈ నేపథ్యంలో అమ్మకందారులు కరువుకావడంతో ప్రస్తుతం ఎన్ఎస్ఈలో కేపీఐటీ టెక్ షేరు 5 శాతం అప్పర్ సర్క్యూట్‌ను తాకింది. రూ. 49.25 వద్ద ఫ్రీజయ్యింది. గత ఐదు రోజుల్లోనూ 20 శాతం ర్యాలీ చేసింది. కాగా.. గతేడాది క్యూ4లో కేపీఐటీ టెక్నాలజీస్ నికర లాభం 23 శాతం ఎగసి రూ. 38 కోట్లను అధిగమించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన మొత్తం ఆదాయం సైతం 11 శాతం వృద్ధితో రూ. 501 కోట్లను తాకింది. -
హెచ్డీఎఫ్సీ లాభం 4,342 కోట్లు 10 శాతం డౌన్
న్యూఢిల్లీ: హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ హెచ్డీఎఫ్సీ నికర లాభం గత ఆర్థిక సంవత్సరం(2019–20) నాలుగో త్రైమాసిక కాలంలో 10 శాతం తగ్గింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం (2018–19) క్యూ4లో రూ.4,811 కోట్లుగా ఉన్న నికర లాభం(కన్సాలిడేటెడ్) గత ఆర్థిక సంవత్సరం క్యూ4లో రూ.4,342 కోట్లకు తగ్గింది. రూ. 2 ముఖ విలువ గల ఒక్కో ఈక్విటీ షేర్‌కు రూ.21 డివిడెండ్‌ను ఇవ్వనున్నామని కంపెనీ వైస్ చైర్మన్, సీఈఓ కేకి మిస్త్రీ తెలిపారు. కరోనా కోసం కేటాయింపులు, ఇంకా ఇతర కారణాల రీత్యా గతం, ఇప్పటి ఆర్థిక ఫలితాలను పోల్చడానికి లేదని వివరించారు. ఆర్థిక ఫలితాలకు సంబంధించి మరిన్ని వివరాలు... ► స్టాండ్అలోన్ పరంగా చూస్తే, నికర లాభం రూ.2,862 కోట్ల నుంచి 22 శాతం క్షీణించి రూ.2,233 కోట్లకు చేరింది. ► నికర వడ్డీ ఆదాయం రూ.3,161 కోట్ల నుంచి 17 శాతం వృద్ధితో రూ.3,780 కోట్లకు పెరిగింది. నికర వడ్డీ మార్జిన్ 3.3 శాతం నుంచి 3.4 శాతానికి పెరిగింది. ► డివిడెండ్ ఆదాయం రూ.537 కోట్ల నుంచి రూ.2 కోట్లకు, ఇన్వెస్ట్‌మెంట్స్‌పై లాభాలు రూ.321 కోట్ల నుంచి రూ.2 కోట్లకు తగ్గాయి. ► పూర్తి ఆర్థిక సంవత్సరం పరంగా చూస్తే, స్టాండ్అలోన్ నికర లాభం దాదాపు రెట్టింపైంది. 2018–19లో రూ.9,632 కోట్లుగా ఉన్న నికర లాభం గత ఆర్థిక సంవత్సరంలో రూ.17,770 కోట్లకు ఎగసింది. ► నగదు నిల్వలు రూ.6,000 కోట్ల నుంచి రూ.30,000 కోట్లకు పెరిగాయి. కరోనా కల్లోలంతో ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమవుతుండటంతో ఈ కంపెనీ లిక్విడిటీకి అధిక ప్రాధాన్యం ఇస్తోంది. అందుకే నగదు నిల్వలు భారీగా పెంచుకుంది. ► కేటాయింపులు రూ.935 కోట్ల నుంచి రూ.5,913 కోట్లకు ఎగిశాయి. ► ఈఏడాది మార్చి నాటికి స్థూల మొండి బకాయిలు రూ.8,908 కోట్లు(1.99 శాతం)గా ఉన్నాయి. దీంట్లో వ్యక్తిగత రుణాలు 0.95 శాతంగా, వ్యక్తిగతేతర రుణాలు 4.71 శాతంగా ఉన్నాయి. ► ఈ ఏడాది మార్చి నాటికి మొత్తం రుణాలు 11% వృద్ధితో రూ.4.50 లక్షల కోట్లకు పెరిగాయి. -
మార్కెట్‌కు ఒడిదుడుకుల వారం!
ముంబై: అంతర్జాతీయ పరిణామాలు, దేశీ కంపెనీల క్యూ4 ఫలితాలు, కోవిడ్–19 పాజిటివ్ కేసుల ప్రకటనల వంటి కీలక అంశాలు ఈ వారంలో స్టాక్ మార్కెట్ దిశను నిర్దేశించనున్నాయని దలాల్ స్ట్రీట్ వర్గాలు చెబుతున్నాయి. వైరస్ వ్యాప్తి విషయంలో అమెరికా–చైనాల మధ్య వాణిజ్య యుద్ధం ముదిరితే మాత్రం భారీ పతనం తప్పదని కోటక్ మహీంద్రా అసెట్ మేనేజ్మెంట్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్, ఫండ్ మేనేజర్, ఈక్విటీ రీసెర్చ్ హెడ్ షిబాని సిర్కార్ కురియన్ అన్నారు. ఆర్థిక వ్యవస్థ వృద్ధికి సంబంధించి ఎటువంటి ప్రతికూల వార్తలు వెలువడినా మార్కెట్‌కు ప్రతికూలంగా మారే అవకాశం ఉందని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ అన్నారు. బ్యాంకింగ్, ఫైనాన్స్ రంగాల్లో ఇప్పటికే ఓవర్‌సోల్డ్ అధికంగా ఉన్న కారణంగా రిబౌండ్కు అవకాశం ఉందని తాను భావిస్తున్నట్లు రెలిగేర్ బ్రోకింగ్ రీసెర్చ్ వీపీ అజిత్ మిశ్రా విశ్లేషించారు. అయితే, ఇది అధికస్థాయిలో నిలవలేకపోవచ్చని, ఒడిదుడుకులకు ఈవారంలో ఆస్కారం ఉందని భావిస్తున్నట్లు చెప్పారు. రంజాన్ పర్వదినం నేపథ్యంలో ఈ వారంలో ట్రేడింగ్ నాలుగు రోజులే జరగనుంది. కాగా గురువారం (28న) మే నెల ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్(ఎఫ్ అండ్ ఓ) సిరీస్ ముగియనుంది. మరోవైపు.. హెచ్డీఎఫ్సీ, సన్‌ఫార్మా, లుపిన్, డాబర్, టీవీఎస్ మోటార్, యునైటెడ్ స్పిరిట్స్, వోల్టాస్, ఉజ్జీవన్ ఫైనాన్షియల్, మాక్స్ ఫైనాన్షియల్, టోరెంట్ ఫార్మా, వీఐపీ ఇండస్ట్రీస్, కేపీఐటీ టెక్నాలజీస్, ఈక్విటాస్ హోల్డింగ్స్, అంబర్ ఎంటర్ప్రైజెస్, ఉషా మార్టిన్ కంపెనీలు తమ ఫలితాలను ఈవారంలోనే ప్రకటించనున్నాయి. రూ. 9,089 కోట్ల పెట్టుబడి భారత ఈక్విటీ మార్కెట్లో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐ) మే 1–22 మధ్య కాలంలో రూ. 9,089 కోట్లను పెట్టుబడి పెట్టినట్లు డిపాజిటరీల డేటా ద్వారా వెల్లడైంది. ఏప్రిల్‌లో రూ. 6,883 కోట్లు, మార్చిలో రూ. 61,973 కోట్లను వెనక్కు తీసుకున్న విషయం తెలిసిందే. నేడు మార్కెట్ సెలవు రంజాన్ పర్వదినం సందర్భంగా సోమవారం (మే25న) దేశీ స్టాక్ ఎక్సే్ఛంజీలకు సెలవు. మంగళవారం (26న) మార్కెట్ యథావిధిగా పని చేస్తుంది. -
జేకే లక్ష్మీ సిమెంట్ జోరు- చెన్నై పెట్రో పతనం
ప్రోత్సాహకర విదేశీ సంకేతాలతో వరుసగా రెండో రోజు దేశీ స్టాక్ మార్కెట్లు సానుకూలంగా ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 137 పాయింట్లు ఎగసి 30,956కు చేరగా.. నిఫ్టీ 38 పాయింట్లు పుంజుకుని 9,105 వద్ద ట్రేడవుతోంది. కాగా.. గత ఆర్థిక సంవత్సరం(2019-20) చివరి త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించడంతో జేకే లక్ష్మీ సిమెంట్ కౌంటర్‌కు డిమాండ్ కనిపిస్తోంది. మరోపక్క ఇదే కాలంలో నిరుత్సాహకర పనితీరు ప్రదర్శించడంతో చెన్నై పెట్రోలియం కౌంటర్లో అమ్మకాలు ఊపందుకున్నాయి. వెరసి జేకే లక్ష్మీ సిమెంట్ కౌంటర్ లాభాలతో సందడి చేస్తుంటే.. చెన్నై పెట్రోలియం షేరు డీలా పడింది. వివరాలు చూద్దాం.. జేకే లక్ష్మీ సిమెంట్ గతేడాది క్యూ4(జనవరి-మార్చి)లో జేకే లక్ష్మీ సిమెంట్ రూ. 99 కోట్ల నికర లాభం ఆర్జించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన ఇది 143 శాతం అధికంకాగా..మొత్తం ఆదాయం మాత్రం 10 శాతం క్షీణించి రూ. 1157 కోట్లకు పరిమితమైంది. ఇబిటా రూ. 148 కోట్ల నుంచి రూ. 224 కోట్లకు ఎగసింది. లాజిస్టిక్ వ్యయాలు తగ్గడం, ప్రీమియం ప్రొడక్టుల విక్రయాలు పుంజుకోవడం తదితరాలు లాభదాయకత మెరుగుకు దోహదపడినట్లు కంపెనీ పేర్కొంది. ఈ నేపథ్యంలో ఎన్ఎస్ఈలో జేకే లక్ష్మీ సిమెంట్ షేరు 6 శాతం జంప్‌చేసి రూ. 211 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 218 వరకూ ఎగసింది. బుధవారం సైతం ఈ షేరు 2.5 శాతం పెరిగి రూ. 200 సమీపంలో ముగిసింది. చెన్నై పెట్రోలియం గతేడాది క్యూ4(జనవరి-మార్చి)లో చెన్నై పెట్రోలియం నికర నష్టం భారీగా పెరిగింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన నష్టం రూ. 25 కోట్ల నుంచి రూ. 1625 కోట్లకు ఎగసింది. మొత్తం అమ్మకాలు సైతం 14 శాతం క్షీణించి రూ. 8585 కోట్లకు పరిమితమయ్యాయి. చమురు బ్యారల్‌పై సగటు స్థూల రిఫైనింగ్ మార్జిన్లు 3.7 డాలర్ల నుంచి 1.2 డాలర్లకు నీరసించాయి. చమురు ధరల పతనంకారణంగా నిల్వలపై నష్టాలు ఏర్పడినట్లు కంపెనీ పేర్కొంది. ఇది మార్జిన్లను ప్రభావితం చేసినట్లు తెలియజేసింది. ఈ నేపథ్యంలో ఎన్ఎస్ఈలో చెన్నై పెట్రోలియం షేరు 5 శాతం పతనమై రూ. 51 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 50 వద్ద 52 వారాల కనిష్టానికి చేరింది. -
క్యూ4 ఫలితాలే దిక్సూచి
ముంబై: కోవిడ్–19పై యుద్ధంలో భాగంగా కేంద్రప్రభుత్వం ఆదివారం లాక్డౌన్ 4.0ను ప్రకటించింది. మే 31 వరకూ లాక్‌డౌన్‌ను పొడిగిస్తూ మార్గదర్శకాలను జారీ చేసింది. ఈ అంశాలకు తోడు అంతర్జాతీయ పరిణామాల ఆధారంగా ఈవారం మార్కెట్ గమనం ఉండనుందని మోతిలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఎనలిస్ట్ సిద్థార్ధఖేమ్కా విశ్లేషించారు. మంగళవారం జపాన్ పారిశ్రామికోత్పత్తి వెల్లడికానుండగా.. గురువారం అమెరికా తయారీ, సేవల రంగాల పీఎంఐ వెలువడనున్నాయి. ఈ నేపథ్యంలో ప్రపంచ పరిణామాలు మార్కెట్‌ను నడిపించనున్నాయని సామ్కో సెక్యూరిటీస్ సీఈఓ జిమిత్ మోడీ అన్నారు. ఈవారంలోనే 80 కంపెనీల ఫలితాలు.. భారతి ఎయిర్టెల్, బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఆటో, యూపీఎల్, బాష్, అల్ట్రాటెక్ సిమెంట్, అవెన్యూ సూపర్‌మార్ట్స్ (డి–మార్ట్), జూబిలెంట్ ఫుడ్‌వర్క్స్, టాటా పవర్, జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీ, కోల్గేట్ పామోలివ్, బజాజ్ ఫిన్సర్వ్, అపోలో టైర్స్, టొరంట్ పవర్ ఫలితాలు ఈవారంలోనే వెల్లడికానున్నాయి. ఫార్మా రంగంలో డాక్టర్ రెడ్డీస్, అలెంబిక్ ఫార్మా, డాక్టర్ లాల్ పాత్ ల్యాబ్స్, గ్లాక్సో స్మిత్‌క్లైన్ ఫార్మా, ఆస్ట్రాజెనెకా ఫార్మా కంపెనీలు తమ క్యూ4 ఫలితాలను వెల్లడించనున్నాయి. ఇక బ్యాంకింగ్ రంగంలో ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్, ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్, డీసీబీ బ్యాంక్ ఫలితాలు వెల్లడికానున్నాయి. -
అదరగొట్టిన ఐటీ దిగ్గజం : డివిడెండ్
సాక్షి, ముంబై: ప్రముఖ ఐటీ సేవల సంస్థ హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ క్యూ4లో మెరుగైన ఫలితాలను సాధించింది. మార్చి 2020తో ముగిసిన త్రైమాసికంలో ఏకీకృత నికర లాభం రూ. 3154 కోట్లగా వుంది. త్రైమాసిక పరంగా 3.8 శాతం వృద్ధిని కంపెనీ నమోదు చేయగా, వార్షిక ప్రాతిపదికన నికర లాభం 22.8 శాతం పెరిగింది. సీక్వెన్షియల్ ప్రాతిపదికన ఆదాయం 2.5 శాతం పెరిగి రూ .18,590 కోట్లకు చేరుకుంది. స్థిరమైన కరెన్సీ పరంగా ఆదాయం 0.8 శాతం పెరిగింది. వడ్డీ పన్నులకు ముందు ఆదాయాలు (ఇబిఐటి) 3,881 కోట్ల రూపాయలుగా ఉండగా, అంతకుముందు ఏడాది త్రైమాసికంతో పోలిస్తే ఇది 5.8 శాతం పెరిగింది, ఈ త్రైమాసికంలో ఇబిఐటి మార్జిన్ 20.9 శాతంగా ఉంది. అలాగే 19.6 శాతంగా ఉన్న ఇబిఐటి మార్జిన్ గైడెడ్ పరిధి 19.0 శాతం నుంచి 19.5 శాతానికి పెరిగింది. దీంతొపాటు 2019-20 ఆర్థిక సంవత్సరానికి ఈక్విటీ షేరుకు రూ .2 చొప్పున తుది డివిడెండ్‌ను డైరెక్టర్ల బోర్డు సిఫార్సు చేసింది. డివిడెండ్ చెల్లింపులో ఇది వరుసగా 69వ త్రైమాసికమని కంపెనీ పేర్కొంది. నాల్గవ త్రైమాసికంలో హెచ్‌సిఎల్ 1,250 మంది ఉద్యోగులను చేర్చకోగా, మొత్తం పూర్తికాల ఉద్యోగుల సంఖ్య 1,50,423 కు చేరింది. (రుణాలపై వడ్డీరేట్లు తగ్గించిన ఎస్బీఐ) హెచ్‌సీఎల్ టెక్ లాభం, ఆదాయం విశ్లేషకుల అంచనాల కంటే మెరుగ్గా ఉన్నాయి. ఎమ్కే గ్లోబల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సంస్థ నికర అమ్మకాలు సంవత్సరానికి 16 శాతం పెరిగి రూ. 18,553 కోట్లగాను నికర లాభం (పన్ను తరువాత లాభం) రూ .1931 కోట్లుగా ఉంటుందని అంచనా వేసింది. ఎడెల్వీస్ సెక్యూరిటీస్ రూపాయి పరంగా ఆదాయం రూ .18,557 కోట్లకు పెరుగుతుందని అంచనా వేసింది. వార్షిక ప్రాతికపదికన 8 శాతం వృద్ధితో నికర లాభం రూ .2,784 కోట్లుగా అంచనా వేసింది. 2020 ఆర్థిక సంవత్సరం తమకొక ఒక మైలురాయి లాంటిదని ఫలితాల సందర్భంగా సంస్థ ప్రకటించింది. ఇటీవలి సంవత్సరాలలో పోలిస్తే ఈ ఏడాది అత్యధిక వృద్ధిని సాధించింది. అలాగే వరుసగా నాలుగవ సంవత్సరం మెరుగైన పనితీరును కనబర్చినట్టు చెప్పింది. మార్జిన్ గైడెన్స్ టాప్-ఎండ్‌ను మించిపోయిందని హెచ్‌సిఎల్ టెక్నాలజీస్ ప్రెసిడెంట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సీ విజయకుమార్ ప్రకటించారు. (కోవిడ్-19 : కోటక్ మహీంద్ర వేతనాల కోత) -
ఆశ్చర్యపర్చిన యస్ బ్యాంకు ఫలితాలు
సాక్షి, ముంబై : వివాదాల సంక్షోభం, మూలధన సమస్యల్లో ఇరుక్కున్న ప్రైవేటు రంగ బ్యాంకు యస్ బ్యాంకు మార్చి 31 తో ముగిసిన త్రైమాసికంలో మెరుగైన ఫలితాలతో అటు ఇన్వెస్టర్లను, ఇటు ట్రేడర్లను ఆశ్చర్య పర్చింది. దీంతో గురువారం నాటి నష్టాల మార్కెట్లో బ్యాంకు షేరు లాభాలతో దూసుకపోతోంది. రూ .2,629 కోట్ల నికర లాభాన్ని నమోదు చేయడంతో యస్ బ్యాంకు షేర్లు నష్టాల మార్కెట్లో భారీగా లాభపడుతున్నాయి. రూ. 31.60 వద్ద షేర్ ధర ఈరోజు 20 శాతం పుంజుకుంది. ఎన్ఎస్ఇ, బీఎస్‌ఇలలో 39.39 మిలియన్ షేర్లు చేతులు మారాయి. (నష్టాల్లో మార్కెట్ : యస్ బ్యాంకు జంప్) ఎస్ బ్యాంకు పునరుద్ధరణలో ఆర్బీఐ గైడెడ్ బెయిలౌట్ సహాయంతో ఇప్పుడు కోలుకుంటున్ బ్యాంకు, ఈ పరిణామాల తరువాత తన మొదటి ఫలితాలను ప్రకటించింది. అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలోరూ. 18,560 కోట్ల నష్టాన్ని, జనవరి-మార్చి త్రైమాసికంలో రూ .1,506 కోట్ల నష్టాన్ని నమోదు చేసింది. నికర వడ్డీ ఆదాయం దాదాపు సగం తగ్గి రూ.1,274 కోట్లకు పరిమితమైంది. పూర్తి ఆర్థిక సంవత్సరానికి రూ.16,418 కోట్ల నికర నష్టాలు వచ్చాయి. అంతకుముందు ఏడాది ఇదే కాలంతో పోల్చితే తక్కువ జారడం వల్ల వరుసగా 19.6 శాతం వృద్ధి. రూ .32,878 కోట్ల స్థూల నిరర్ధక ఆస్తులను (స్థూల ఎన్‌పిఎ), నికర నిరర్ధక ఆస్తులను (నెట్ ఎన్‌పిఎ) 862,37 కోట్ల రూపాయలుగా నివేదించింది. డిసెంబర్ త్రైమాసికంలో మొత్తం ప్రొవిజన్లు రూ .24,766 కోట్లతో పోలిస్తే రూ .4,872 కోట్లకు తగ్గాయి. చాలా మంది విశ్లేషకులు ఊ హించిన దాని కంటే ఆదాయాలు మెరుగ్గా ఉండం విశేషం. కోటక్ సెక్యూరిటీస్ రూ .4,404 కోట్ల నికర నష్టాన్ని అంచనా వేసింది, (యస్ బ్యాంక్‌కు ఆర్బీఐ 60 వేల కోట్లు) యస్ బ్యాంకు వివాదంతో జోక్యం చేసుకున్న ఆర్బీఐ మారటోరియం, నగదు విత్‌డ్రాపై ఆంక్షలకు దిగింది. బోర్డును రద్దు చేసి, 30 రోజుల తాత్కాలిక నిషేధాన్ని విధించింది. ఆ తరువాత బ్యాంకు బోర్డును పునరుద్ధరించిన అనంతరం 2020 మార్చి18 నుండి అన్ని బ్యాంకింగ్ సేవలను తిరిగి ప్రారంభించింది. అలాగే బ్యాంకు పునరుద్దరణ చర్యల్లో భాగంగా ఎస్ బీఐ, హెచ్డీఎఫ్ సీ, ఐసీఐసీఐ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్ లాంటి ఏడు ప్రైవేట్ బ్యాంకుల నుండి 10,000 కోట్ల రూపాయల ఈక్విటీ మూలధనాన్ని సమీకరించిన సంగతి తెలిసిందే. (యస్పై మారటోరియం ఎత్తివేత) -
కరోనా కాటుపై సుంకాల పోటు!
అమెరికా–చైనాల మధ్య మళ్లీ వాణిజ్య ఉద్రిక్తతలు తలెత్తనుండటంతో సోమవారం ప్రపంచ మార్కెట్లతో పాటే మన మార్కెట్ కూడా భారీగా నష్టపోయింది. దీంతో స్టాక్ మార్కెట్ నాలుగు రోజుల లాభాలకు బ్రేక్ పడింది. లాక్‌డౌన్‌ను మరో రెండు వారాల పాటు పొడిగించడం, గత నెలలో తయారీ రంగ పీఎమ్ఐ జీవిత కాల కనిష్ట స్థాయికి పడిపోవడంతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ దెబ్బతిన్నది. సెన్సెక్స్ 32,000 పాయింట్లు, నిఫ్టీ 9,300 పాయింట్ల దిగువకు పడిపోయాయి. కంపెనీల క్యూ4 ఫలితాలు ప్రోత్సాహకరంగా లేకపోవడం, గత వారంలో స్టాక్ సూచీలు 7 శాతం మేర లాభపడిన నేపథ్యంలో లాభాల స్వీకరణ చోటు చేసుకోవడం ప్రతికూల ప్రభావం చూపించాయి. సెన్సెక్స్ 2,002 పాయింట్ల పతనంతో 31,715 పాయింట్ల వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 566 పాయింట్లు నష్టపోయి 9,294 పాయింట్ల వద్ద ముగిశాయి. శాతం పరంగా చూస్తే, సెన్సెక్స్ 5.9%, నిఫ్టీ 5.7% క్షీణించాయి. సెన్సెక్స్‌కు ఇది నాలుగో అతి పెద్ద పతనం. భారీ నష్టాలతో... సెన్సెక్స్, నిఫ్టీలు భారీ నష్టాల్లో మొదలయ్యాయి. సెన్సెక్స్ 970 పాయింట్లు, నిఫ్టీ 326 పాయింట్ల నష్టాలతో ట్రేడింగ్‌ను ఆరంభించాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 2,086 పాయింట్లు, నిఫ్టీ 593 పాయింట్ల మేర పతనమయ్యాయి. ఫార్మా, టెలికం రంగ సూచీలు మినహా మిగిలిన అన్ని రంగాల సూచీలు నష్టాల్లోనే ముగిశాయి. ఫైనాన్స్, బ్యాంక్, లోహ, కన్సూమర్ డ్యూరబుల్స్, రియల్టీ షేర్లు బాగా పతనమయ్యాయి. మరిన్ని విశేషాలు... ► ఐసీఐసీఐ బ్యాంక్‌షేర్ 11% నష్టంతో రూ.338 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో బాగా నష్టపోయిన షేర్ ఇదే. నేడు ఈ బ్యాంక్ ఫలితాలు వెల్లడి కానున్నాయి. ► గత క్యూ4లో లాభం తగ్గడంతో రిలయన్స్ షేర్ 2% నష్టంతో రూ.1,435 వద్ద ముగిసింది. ► 30 సెన్సెక్స్ షేర్లలో భారతీ ఎయిర్టెల్, సన్ ఫార్మా ఈ రెండు షేర్లు మాత్రమే లాభపడ్డాయి. మిగిలిన 28 షేర్లు నష్టాల్లో ముగిశాయి. ► గత నెలలో దేశీయంగా ఎలాంటి వాహన విక్రయాలు చోటు చేసుకోకపోవడంతో వాహన షేర్లు 12 శాతం మేర నష్టపోయాయి. రూ.5.8 లక్షల కోట్ల సంపద ఆవిరి స్టాక్ మార్కెట్ భారీ నష్టాల కారణంగా ఇన్వెస్టర్ల సంపద రూ.5.82 లక్షల కోట్ల మేర ఆవిరైంది. బీఎస్ఈలో లిస్టైన మొత్తం కంపెనీల మార్కెట్ క్యాప్ రూ.5,82,696 కోట్లు ఆవిరై రూ.123.58 లక్షల కోట్లకు పడిపోయింది. నష్టాలకు కారణాలివే.. ► మళ్లీ వాణిజ్య ఉద్రిక్తతలు...: కరోనా వైరస్ చైనా సృష్టేనని, దీనికి ప్రతిగా చైనా వస్తువుల దిగుమతులపై వాణిజ్య ఆంక్షలు విధిస్తామని అమెరికా హెచ్చరించింది. చైనా ల్యాబ్ నుంచే కరోనా వైరస్ లీక్ అయిందనడానికి సాక్ష్యాలున్నాయని అమెరికా వెల్లడించింది. దీంతో ఇరు దేశాల మధ్య మళ్లీ వాణిజ్య ఉద్రిక్తతలు చెలరేగుతాయనే ఆందోళన నెలకొన్నది. ► లాక్డౌన్ 3.0...: లాక్డౌన్ మరో రెండు వారాలు కొనసాగించడం ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడానికి చాలా కాలం పడుతుంద న్న భయాలతో అమ్మకాలు వెల్లువెత్తాయి. ► తయారీ రంగం ఢమాల్... తయారీ రంగం దారుణంగా దెబ్బతింది. మార్చిలో 51.8గా ఉన్న మాన్యుఫాక్చరింగ్ పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్(పీఎమ్ఐ) ఏప్రిల్‌లో 27.4కు పడిపోయింది. ► ప్రపంచ మార్కెట్ల పతనం...: అమెరికా, చైనాల మధ్య మళ్లీ వాణిజ్య యుద్ధం చోటు చేసుకుంటుందేమోనన్న భయాలతో ప్రపంచ మార్కెట్లు పతనమయ్యాయి. హాంగ్‌కాంగ్, సియోల్ సూచీలు 4% మేర నష్టపోయాయి. యూరప్ మార్కెట్లు భారీ నష్టాల్లో ఆరంభమయ్యాయి. చివరకు 4% నష్టాల్లో ముగిశాయి. సెలవుల కారణంగా చైనా, జపాన్ మార్కెట్లు పనిచేయలేదు. ► రూపాయి పతనం..: డాలర్‌తో రూపాయి మారకం విలువ 64 పైసలు నష్టపోయి 75.73ను తాకింది. ► నిరాశపరిచిన ఫలితాలు...: ఇప్పటివరకూ వెల్లడైన కంపెనీల ఆర్థిక ఫలితాలు నిరాశపరిచాయి. రిలయన్స్, టెక్ మహీంద్రా, హెచ్‌యూఎల్ ఫలితాలు అంచనాలను అందుకోలేకపోయాయి. ► లాభాల స్వీకరణ... గత నాలుగు ట్రేడింగ్ సెషన్లలో సెన్సెక్స్, నిఫ్టీలు చెరో 8 శాతం మేర లాభపడిన నేపథ్యంలో లాభాల స్వీకరణ చోటు చేసుకుం దని కొందరు నిపుణులంటున్నారు. ► జీరో అమ్మకాలు గత నెలలో దేశీయంగా ఎలాంటి వాహన విక్రయాలు చోటు చేసుకోలేదు. దేశ చరిత్రలో ఇలాంటి పరిస్థితి ఇదే మొదటిసారి. ► కొనసాగుతున్న కరోనా కల్లోలం... అంతర్జాతీయంగా, దేశీయంగా కరోనా కల్లోలం కొనసాగుతోంది. భారత్‌లో కరో నా బాధితుల సంఖ్య పెరుగుతూనే ఉంది. -
యాక్సిస్ బ్యాంక్ నష్టాలు రూ.1,388 కోట్లు
న్యూఢిల్లీ: ప్రైవేట్ రంగ యాక్సిస్ బ్యాంక్‌కు గత ఆర్థిక సంవత్సరం(2019–20) నాలుగో త్రైమాసిక కాలంలో రూ.1,388 కోట్ల నికర నష్టాలు(స్టాండ్అలోన్) వచ్చాయి. మొండి బకాయిలు, ఇతర అనిశ్చిత అంశాలకు కేటాయింపులు పెరగడంతో ఈ స్థాయి నష్టాలు వచ్చాయని యాక్సిస్ బ్యాంక్ తెలిపింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్‌కు రూ.1,505 కోట్ల నికర లాభం ఆర్జించామని పేర్కొంది. ఆదాయం రూ.18,324 కోట్ల నుంచి రూ.20,220 కోట్లకు పెరిగింది. ► అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం క్యూ4లో రూ.2,711 కోట్లుగా ఉన్న కేటాయింపులు గత ఆర్థిక సంవత్సరం క్యూ4లో రూ.7,730 కోట్లకు పెరిగాయి. కరోనా అనిశ్చితిని తట్టుకోవడానికి రూ.3,000 కోట్ల కేటాయింపులు దీంట్లో ఉన్నాయి. ► కన్సాలిడేటెడ్ పరంగా చూస్తే, అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం క్యూ4లో 1,678 కోట్ల నికర లాభం రాగా, గత ఆర్థిక సంవత్సరం క్యూ4లో రూ.1,250 కోట్ల నికర నష్టాలు వచ్చాయి. ► స్థూల మొండి బకాయిలు 5.26 శాతం నుంచి 4.86 శాతానికి, నికర మొండి బకాయిలు 2.06 శాతం నుంచి1.56 శాతానికి తగ్గాయి. ► గత క్యూ4లో నిర్వహణ లాభం 17 శాతం వృద్ధితో రూ.5,851 కోట్లకు పెరిగింది. నికర వడ్డీ ఆదాయం 19 శాతం పెరిగి రూ.6,808 కోట్లకు చేరింది. నికర వడ్డీ మార్జిన్ 3.55 శాతంగా ఉంది. ► రిటైల్ రుణాలు 24 శాతం, కార్పొరేట్ రుణాలు11 శాతం పెరిగాయి. మొత్తం మీద రుణవృద్ధి 15 శాతంగా ఉంది. ► రిటైల్ రుణాలు 24%, కార్పొరేట్ రుణాలు11% పెరిగాయి. మొత్తం మీద రుణవృద్ధి 15%గా ఉంది. మార్కెట్ ముగిసిన తర్వాత çఫలితాలు వెలువడ్డాయి. మంగళవారం బ్యాంక్ షేర్ 6.6 శాతం లాభంతో రూ.455 వద్ద ముగిసింది. చదవండి: 49 రోజుల తర్వాత లాక్డౌన్ పూర్తిగా.. -
యాక్సిస్ బ్యాంకునకు కరోనా షాక్
సాక్షి, ముంబై : దేశంలోని మూడవ అతిపెద్ద ప్రైవేట్ రంగ రుణదాత యాక్సిస్ బ్యాంక్ లిమిటెడ్ కు కోవిడ్-19 షాక్ తగిలింది. మార్చి 31తో ముగిసిన నాల్గవ త్రైమాసికంలో రూ. 1,388 కోట్ల నష్టాన్ని చవి చూసింది. అంతకు ముందు సంవత్సరం 1,505 కోట్ల రూపాయల లాభాన్ని సాధించింది. తాజా ఫలితాలతో విశ్లేషకులు అంచనాలను బ్యాంకు తారుమారు చేసింది. విశ్లేషకులు 1,556 కోట్ల రూపాయల లాభాలను అంచనా వేశారు. మంగళవారం మార్కెట్ ముగిసిన తరువాత బ్యాంకు తన ఫలితాలను ప్రకటించింది. మరోవైపు నికర వడ్డీ ఆదాయం సంవత్సరానికి 16 శాతం పెరిగి రూ. 25,206 కోట్లకు చేరుకుంది. గత సంవత్సరంతో పోలిస్తే దాదాపు మూడు రెట్లు అధికంగా ప్రొవిజన్లు నమోదయ్యాయి. గత ఏడాది 3,000 కోట్లు తో పోలిస్తే ఈ త్రైమాసికంలో 7,730 కోట్లుగా ఉన్నాయని రెగ్యులేటరీ ఫైలింగ్‌లో యాక్సిస్ బ్యాంకు వెల్లడించింది. అయితే స్థూల బ్యాడ్ లోన్ల బెడద 4.86 శాతానికి తగ్గింది. మార్చిలో ముగిసిన త్రైమాసికంలో నికర ఎన్‌పిఎలు 1.56 శాతానికి తగ్గాయి. మరోవైపు యాక్సిస్ బ్యాంక్, మ్యాక్స్ ఫైనాన్షియల్ సర్వీస్‌లో 29 శాతం వాటాను కొనుగోలు ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. యాక్సిస్ బ్యాంక్, మ్యాక్స్ లైఫ్ మధ్య వ్యూహాత్మ భాగస్వామ్యంతో బ్యాంక్ వాటా 30 శాతానికి చేరి, అతి పెద్ద వాటాదారుగా నిలవనుంది. ఎక్స్ఛేంజీలకు అందించిన సమాచారం ప్రకారం, మాక్స్ ఫైనాన్షియల్ సర్వీసెస్ (ఎంఎఫ్ఎస్)ను మాక్స్ లైఫ్‌లో విలీనం కావడమే భాగస్వామ్యం యొక్క దీర్ఘకాలిక ఉద్దేశం. మ్యాక్స్ ఫైనాన్షియల్ సర్వీసెస్, యాక్సిస్ బ్యాంక్ మధ్య 70:30 జాయింట్ వెంచర్ ఏర్పాటుకానుంది. లావాదేవీ పూర్తి కావడానికి ఆరు నుండి తొమ్మిది నెలల కాలం పట్టునుందని, తద్వారా తమ వాటాదారులకు దీర్ఘకాలిక విలువను సృష్టించాలని భావిస్తున్నట్టు యాక్సిస్ బ్యాంక్, ఎంఎఫ్ఎస్ఎల్ ఒక ప్రకటనలో తెలిపాయి. ఈ ఒప్పందానికి ఇన్సూరెన్స్ రెగ్యులేటర్ ఐఆర్డీఏఐ, రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ), సీసీఐ ఆమోదం లభించాల్సి వుంది. -
ప్యాకేజీపై మార్కెట్ దృష్టి
దేశీయ స్టాక్ మార్కెట్‌కు ఈవారంలో జరిగే పరిణామాలు కీలకం. లాక్డౌన్ వల్ల ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయే ప్రమాదం ఉన్నందున ఈ విషమ పరిస్థితుల్లో భారీ ఆర్థిక ప్యాకేజీని మోదీ సర్కార్ ప్రకటిస్తుందనే అంచనాలు బలంగా ఉన్నాయి. ఈ వారంలో ట్రేడింగ్ నాలుగు రోజులే.. మహారాష్ట్ర దినోత్సవం సందర్భంగా శుక్రవారం (మే1) దేశీ స్టాక్ ఎక్సే్ఛంజీలకు సెలవు. దీంతో ఈ వారంలో ట్రేడింగ్ నాలుగు రోజులకే పరిమితమైంది. ఏప్రిల్ సిరీస్ ముగింపు ఈవారంలోనే.. గురువారం (30న) ఏప్రిల్ నెల ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్(ఎఫ్ అండ్ ఓ) సిరీస్ ముగియనుంది. బుధవారం సమావేశంకానున్న అమెరికా ఫెడ్.. వడ్డీ రేట్లపై కీలక నిర్ణయాన్ని వెల్లడించనుంది. మరోవైపు, యాక్సిస్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ లైఫ్, ఐసీఐసీఐ లాంబార్డ్, ఇండస్ఇండ్ బ్యాంక్, హెచ్‌యూఎల్, హెక్సావేర్ టెక్నాలజీస్, టెక్ మహీంద్రా, అంబుజా సిమెంట్స్, అదానీ పవర్ ఫలితాలను ఈవారంలోనే ప్రకటించనున్నాయి. -
ఇన్ఫోసిస్ లాభం 4,335 కోట్లు
న్యూఢిల్లీ: ఐటీ దిగ్గజం, ఇన్ఫోసిస్ నికర లాభం గత ఆర్థిక సంవత్సరం (2019–20) నాలుగో త్రైమాసిక కాలంలో 6 శాతం పెరిగింది. కరోనా వైరస్ కల్లోలం కారణంగా వ్యాపార అనిశ్చిత పరిస్థితులు నెలకొనడంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి(2020–21) ఆదాయ, మార్జిన్ల అంచనాలను వెల్లడించడం లేదని ఇన్ఫోసిస్ పేర్కొంది. పరిస్థితులు మెరుగుపడ్డాక ఈ అంచనాలను వెల్లడిస్తామని వివరించింది. కాగా గత ఆర్థిక సంవత్సరానికి ఆదాయ అంచనాలను ఈ కంపెనీ అందుకోలేకపోయింది. ఇక ఒక్కో ఈక్విటీ షేర్‌కు రూ.9.50 తుది డివిడెండ్‌ను ప్రకటించింది. మరిన్ని వివరాలు... ► అంతకుముందటి ఆర్థిక సంవత్సరం(2018–19) క్యూ4లో రూ.4,078 కోట్లుగా ఉన్న నికర లాభం గత ఆర్థిక సంవత్సరం (2019–20) క్యూ4లో రూ.4,335 కోట్లకు పెరిగింది. అయితే గత క్యూ3 నికర లాభంతో పోల్చితే 3 శాతం క్షీణత నమోదైంది. ఇతర ఆదాయం 26 శాతం తగ్గడం, అంతకు ముందటి క్వార్టర్లో పన్ను రాయితీలు లభించడంతో నికర లాభం ఈ క్యూ4లో ఈ స్థాయికే పరిమితమైంది. ► ఆదాయం రూ.21,539 కోట్ల నుంచి 8 శాతం వృద్ధితో రూ.23,267 కోట్లకు చేరింది. ► డాలర్ల పరంగా చూస్తే, గత క్యూ4లో (సీక్వెన్షియల్‌గా)నికర లాభం 6 శాతం తగ్గి 59 కోట్ల డాలర్లకు, ఆదాయం 1.4 శాతం తగ్గి 320 కోట్ల డాలర్లకు తగ్గింది. ► గత క్యూ4లో 165 కోట్ల డాలర్ల విలువైన ఒప్పందాలను కుదుర్చుకుంది. దీంతో మొత్తం డీల్స్ విలువ పూర్తి ఆర్థిక సంవత్సరానికి 900 కోట్ల డాలర్లకు చేరాయి. ► ఇక పూర్తి ఏడాది పరంగా చూస్తే, 2019–20లో నికర లాభం 8% వృద్ధితో రూ.16,639 కోట్లకు, ఆదాయం 9.8 శాతం పెరిగి రూ.90,791 కోట్లకు చేరాయి. ఆదాయం 10–10.5% రేంజ్లో పెరగగలదన్న అంచనాలను కంపెనీ అందుకోలేకపోయింది. ► ఈ ఏడాది మార్చి చివరికి నగదు, నగదు సమానమైన నిల్వలు రూ.27,276 కోట్లుగా ఉన్నాయి. ఎలాంటి రుణ భారం లేదు. ► ఈ ఏడాది మార్చి నాటికి కంపెనీలో మొత్తం ఉద్యోగుల సంఖ్య 2,42,371కు చేరింది. గత క్యూ4లో ఉద్యోగుల వలస(అట్రిషన్ రేటు) 21 శాతంగా ఉంది. ► ప్రపంచవ్యాప్తంగా కొంతమంది ఉద్యోగులకు కరోనా వైరస్ సోకిందని ఇన్ఫోసిస్ తెలిపింది. వారు కోలుకోవడానికి తగిన తోడ్పాటునందిస్తామని పేర్కొంది. జాబ్ ఆఫర్లు ఇచ్చిన వారందరికీ కొలువులు ఇస్తామని భరోసా ఇచ్చింది. అయితే, వేతనాల పెంపు, అలాగే ప్రమోషన్లు కూడా ఉండవని తెలిపింది. ► మార్కెట్ ముగిసిన తర్వాత కంపెనీ ఫలితాలను వెల్లడించింది. ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో ఇన్ఫోసిస్ షేర్ 3.7 శాతం లాభంతో రూ.653 వద్ద ముగిసింది. కాగా అమెరికా స్టాక్ మార్కెట్లో లిస్టైన ఇన్ఫోసిస్ ఏడీఆర్ మాత్రం 1 శాతం లాభంతో 8.68 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. సమస్యల నుంచి గట్టెక్కుతాం... గత ఆర్థిక సంవత్సరంలో ఆదాయం 10 శాతం వృద్ధి, 21.3 శాతం నిర్వహణ లాభ మార్జిన్ సాధించాం. సమీప భవిష్యత్తులో మా వ్యాపారంపై ప్రభావం ఉంటుంది. రికవరీ ఎప్పుడు మొదలవుతుందో చెప్పలేం. నాణ్యమైన సేవలందించగలగడం, పుష్కలంగా నిధుల దన్నుతో సమస్యలను అధిగమించగలం. –సలిల్ పరేఖ్, సీఈఓ, ఎమ్డీ, ఇన్ఫోసిస్ ఫలితాలు సంతృప్తికరం... వివిధ విభాగాల్లో, దేశాల్లో మంచి వృద్ధిని సాధించాం. భారీ డీల్స్ పెరిగాయి. మొత్తం మీద గత ఆర్థిక సంవత్సరం సంతృప్తికరమైన ఫలితాలిచ్చింది. –ప్రవీణ్ రావ్, సీఓఓ, ఇన్ఫోసిస్ -
కరోనా, క్యూ4 ఫలితాలు కీలకం
న్యూఢిల్లీ: కరోనా కేసులు, కంపెనీల క్యూ4 ఫలితాలు ఈ వారం మార్కెట్‌పై ప్రభావం చూపే కీలకాంశాలని విశ్లేషకులు భావిస్తున్నారు. కరోనా వైరస్ కల్లోలంతో కుదేలైన ఆర్థిక వ్యవస్థను ఆదుకోవడానికి కేంద్రం మరో ఉద్దీపన ప్యాకేజీని సిద్ధం చేస్తోందన్న ఆశలు ఉన్నాయి. మరోవైపు నేటి నుంచి లాక్డౌన్ దశలవారీగా లాక్‌డౌన్‌ను సడలించే అవకాశాలున్నాయని, ఆర్థిక కార్యకలాపాలు మెల్లమెల్లగా ఆరంభమవుతాయనే అంచనాలు మార్కెట్లో సెంటిమెంట్‌కు జోష్‌నివ్వవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రపంచ మార్కెట్ల పోకడ, డాలర్‌తో రూపాయి మారకం విలువ గమనం, ముడి చమురు ధరల కదలికలు, విదేశీ, స్వదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల సరళి.. ఈ అంశాలు కూడా మార్కెట్‌పై ప్రభావం చూపుతాయి. ఇక ఈ వారంలో ఇన్ఫోసిస్, ఏసీసీ, భారతీ ఇన్ఫ్రాటెల్, అలెంబిక్ ఫార్మా, మైండ్‌ట్రీ తదితర కంపెనీలు తమ ఆర్థిక ఫలితాలను వెల్లడించనున్నాయి. కాగా, కరోనా వైరస్ ప్రభావం తమ వ్యాపారాలపై ఎలా ఉండనున్నదనే విషయమై కంపెనీలు వెల్లడించే అంచనాలపైననే ఇన్వెస్టర్లు ప్రధానంగా దృష్టి సారిస్తారన్న విశ్లేషణలు ఉన్నాయి. బోర్డ్ మీటింగ్స్ ఇన్ఫోసిస్, టాటా ఎలెక్సీ, ఆదిత్య బిర్లా మనీ, లిండే ఇండియా 2 గంటల్లో సెటిల్ చేయండి ఆరోగ్య బీమా క్లెయిమ్‌లపై ఐఆర్డీఏఐ ఆదేశం న్యూఢిల్లీ: ఆరోగ్య బీమా క్లెయిమ్‌ల విషయంలో రెండు గంటల్లో నిర్ణయం తీసుకోవాలని బీమా కంపెనీలను బీమా నియంత్రణ, అభివృద్ధి సంస్థ, ఐఆర్డీఏఐ ఆదేశించింది. కరోనా వైరస్ కల్లోలం అంతకంతకూ పెరిగిపోతుండటంతో ఐఆర్డీఏఐ ఈ నిర్ణయం తీసుకుంది. అన్ని ఆరోగ్య బీమా క్లెయిమ్‌లను వీలైనంత త్వరగా సెటిల్ చేయాలని బీమా సంస్ధలకు ఐఆర్డీఏఐ ఆదేశాలు జారీ చేసింది. ఆథరైజేషన్ రిక్వెస్ట్ అందిన రెండు గంటలలోపు సంబంధిత(నెట్వర్క్) హాస్పిటల్‌కు క్యాష్‌లెస్ ట్రీట్మెంట్కు ఆమోదం తెలుపుతూ సమాచారమివ్వాలని ఐఆర్డీఏఐ పేర్కొంది. -
క్యూ4లో అదరగొట్టిన హెచ్డీఎఫ్సీ
సాక్షి, ముంబై : 2020 మార్చి 31తో ముగిసిన త్రైమాసికంలో ప్రైవేటు రంగ బ్యాంకింగ్ దిగ్గజం హెచ్డీఎఫ్సీ అదరగొట్టింది. శనివారం విడుదల చేసిన త్రైమాసిక ఫలితాల్లో నికర లాభం 17.7 శాతం పుంజుకుని 6,928 కోట్ల రూపాయలకు చేరింది. అంతకుముందు ఏడాది కాలంలో ఇది 5,885 కోట్ల రూపాయలు. ఏకీకృత మొత్తం ఆదాయం, 38,287 కోట్లకు పెరిగింది. గత ఏడాది ఇదే కాలంలో ఇది రూ. 33,260 కోట్లగా వుంది. బ్యాంక్ నికర వడ్డీ ఆదాయం (ఎన్ఐఐ) 16.2 శాతం పెరిగి రూ .15,204 కోట్లకు చేరుకుంది. బ్యాంక్ స్థూల నిరర్థక ఆస్తులు (ఎన్‌పిఎ) రూ .12,650 కోట్లకు, నికర ఎన్‌పిఎలు 3,542 కోట్ల రూపాయలుగా ఉన్నాయి. అయితే కరోనా వైరస్ సంక్షోభంతో ప్రొవిజన్లు గత ఏడాదితో పోలిస్తే (1,889 కోట్లు) రూ. 3,784.5 కోట్లకు పెరిగాయి. మునుపటి త్రైమాసికంలో రూ. 3,043.6 కోట్లు. (హెచ్‌డీఎఫ్‌సీలో చైనా బ్యాంక్ వాటాలు పెంపు) కోవిడ్-19వల్ల ఏర్పడిన అనిశ్చితి వాతావరణంలో డివిడెండ్ చెల్లింపులపై శుక్రవారం ప్రకటించిన ఆర్బీఐ ఆదేశాల మేరకు 2019-20కి సంబంధించి డివిడెండ్ చెల్లింపులు చేయబోమని బ్యాంక్ తెలిపింది. లిక్విడిటీ ప్రొఫైల్‌తో పాటు బలమైన వ్యాపారాన్ని కలిగి వున్న నేపథ్యంలో ఎస్ అండ్ పి హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ స్థిరమైన రేటింగ్‌ను ప్రకటించింది. సగటు ఆదాయానికి మించి బలమైన ఆదాయాలు, సాధారణ మూలధన సేకరణ, మెరుగైన రిస్క్ మేనేజ్మెంట్, పోర్ట్‌ఫోలియో వైవిధ్యం, మంచి ఎసెట్ క్వాలిటీ మద్దతుతో బ్యాంకు క్యాపిటలైజేషన్ భారతీయ బ్యాంకింగ్ రంగం సగటు కంటే గణనీయంగా బలంగా ఉందనీ, భారతీయ బ్యాంకింగ్ పరిశ్రమలో అత్యుత్తమంగా ఉందని హెచ్డీఎఫ్సీ ఎస్ అండ్ పి వ్యాఖ్యానించింది. -
కరోనా సంక్షోభం : టీసీఎస్ కీలక నిర్ణయం
సాక్షి, ముంబై : దేశీయ అతిపెద్ద ఐటీ సేవల సంస్థ క్యూ4 ఫలితాల సందర్భంగా కీలక విషయాన్ని వెల్లడించింది. కరోనా సంక్షోభ సమయంలో దాదాపు 4.5 లక్షల తమ ఉద్యోగుల్లో ఎవర్నీ తీసివేయడం లేదని వెల్లడించింది. అయితే జీతాల పెంపు ఉండబోదని స్పష్టం చేసింది. ఈ మేరకు బోర్డు నిర్ణయం తీసుకున్నట్టు టాటా గ్రూప్ సంస్థ తెలిపింది. అయితే కొత్త నియామకాలపై ఎలాంటి ప్రభావం ఉందని స్పష్టం చేసింది. ముందుగా ఆఫర్లు ఇచ్చిన సుమారు 40వేల మంది నియామకాల్లో ఎలాంటి మార్పు ఉండదని స్పష్టం చేశారు. (రివర్స్ రెపో రేటు పావు శాతం కోత) మార్చి త్రైమాసికంలో టీసీఎస్ ఆరోగ్యకరమైన లాభాలను నివేదించింది. క్యూ 4లో నికర లాభం 0.8 శాతం తగ్గి రూ .8,049 కోట్లకు చేరుకుంది. అలాగే ప్రతి షేరుకు రూ .6 తుది డివిడెండ్ కూడా ప్రకటించింది. మార్చి క్వార్టర్ మొదట్లో చాలా వ్యాపార విభాగాలు శుభారంభం చేశాయి, కొన్ని భారీ డీల్స్ ఉన్నప్పటికీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి రెండు త్రైమాసికాలలో కోవిడ్-19 సంక్షోభం కారణంగా ఆదాయ క్షీణించే అవకాశం ఉందని టీసీఎస్ సీఎండీ రాజేష్ గోపీనాథన్ తెలిపారు. ప్రస్తుత కరోనా సంక్షోభ సమయంలో కంపెనీ పట్ల ఉద్యోగులు చూపించిన నిబద్ధతను గోపీనాథన్ ప్రశంసించారు. ప్రస్తుతం భారతదేశంలో 355,000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారని, వారిలో 90 శాతం మంది ఖాతాదారుల అవసరాలను తీర్చడానికి సురక్షితమైన కార్యాలయాలతో అనుసంధానించబడ్డారని కంపెనీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ ఎన్ గణపతి సుబ్రమణ్యం తెలిపారు. మెరుగైన ఫలితాలతో శుక్రవారం నాటి మార్కెట్లో టీసీఎస్ షేరు టాప్ గెయినర్ గా వుంది. (7.4 శాతం వృద్ధిని సాధిస్తాం) చదవండి : రూపాయికి ఆర్బీఐ 'శక్తి' -
విప్రో లాభం రూ.2,345 కోట్లు
న్యూఢిల్లీ: ఐటీ దిగ్గజం విప్రో కంపెనీ గత ఆర్థిక సంవత్సరం (2019–20) నాలుగో త్రైమాసిక కాలంలో రూ.2,345 కోట్ల నికర లాభాన్ని (కన్సాలిడేటెడ్) ఆర్జించింది. అంతకుముందటి ఆర్థిక సంవత్సరం (2018–19) క్యూ4లో ఆర్జించిన నికర లాభం రూ.2,494 కోట్లతో పోలిస్తే 4 శాతం క్షీణించిందని పేర్కొంది. ఆదాయం మాత్రం రూ.15,600 కోట్ల నుంచి 5 శాతం వృద్ధితో రూ.15,711 కోట్లకు పెరిగింది. ఇక పూర్తి ఆర్థిక సంవత్సరం పరంగా చూస్తే, గత ఆర్థిక సంవత్సరంలో నికర లాభం 8 శాతం వృద్ధితో రూ.9.772 కోట్లకు, ఆదాయం 4 శాతం వృద్ధితో రూ.61,023 కోట్లకు పెరిగిందని కంపెనీ వెల్లడించింది. కరోనా వైరస్ కల్లోలం నేపథ్యంలో వ్యాపార పరిస్థితుల్లో అనిశ్చితి నెలకొందని, అందుకే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక ఆదాయ అంచనాలను వెల్లడించడం లేదని విప్రో పేర్కొంది. వ్యాపార స్థితిగతుల స్పష్టత మెరుగుపడ్డాక ఆదాయ అంచనాలను వెల్లడిస్తామని వివరించింది. ఈ కంపెనీ గత ఆర్థిక సంవత్సరానికి ఎలాంటి తుది డివిడెండ్‌ను ప్రకటించలేదు. జనవరిలో ప్రకటించిన రూ. 1 మధ్యంతర డివిడెండ్... తుది డివిడెండ్ కానున్నది. మొత్తం మీద గత ఆర్థిక సంవత్సరం మొత్తానికి ఈ కంపెనీ రూ. 1 డివిడెండ్‌ను ఇచ్చినట్లు లెక్క. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో విప్రో షేర్ 1.5 శాతం నష్టంతో రూ. 186 వద్ద ముగిసింది. వ్యయ నియంత్రణ చర్యలు.. కష్టకాలంలో వ్యయాలను నియంత్రణలో ఉంచుకునేందుకు ’అన్ని అవకాశాలు’ పరిశీలిస్తున్నట్లు విప్రో సీఎఫ్‌వో జతిన్ దలాల్ తెలిపారు. కార్యకలాపాలు నిలిచిపోవడం వల్ల గత 15 రోజుల్లోనే వ్యాపారం 0.7–0.8% దెబ్బతిన్నట్లు వివరించారు. కొందరు సిబ్బందికి సెలవులు లేదా ఫర్లోపై పంపడం(వేతనం లేని సెలవులు) వంటి అంశాలు పరిశీలించవచ్చని పేర్కొన్నారు. మరిన్ని ఆర్డర్లు సాధిస్తాం.. ప్రస్తుత పరిస్థితులు కనీవిని ఎరుగనివి. ప్రాజెక్ట్‌లు అమలు చేయగల సత్తా, విస్తృతమైన ఐటీ సర్వీసుల కారణంగా మరిన్ని ఆర్డర్లు సాధించగల సత్తా మాకుంది. –అబిదాలీ నీముచ్వాలా, విప్రో సీఈఓ -
ఒడిదుడుకులుంటాయ్...!
న్యూఢిల్లీ: స్టాక్ మార్కెట్లో ఈ వారం తీవ్ర ఒడిదుడుకులు ఉండొచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. కరోనా వైరస్ సంబంధిత పరిణామాలే ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను నిర్దేశిస్తాయని వారంటున్నారు. ప్రపంచ మార్కెట్ల పోకడ, అంతర్జాతీయ సంకేతాలు కూడా కీలకమేనని నిపుణులంటున్నారు. ఈ నెల 14(మంగళవారం) అంబేడ్కర్ జయంతి సందర్భంగా సెలవు కావడంతో ఈ వారంలో ట్రేడింగ్ నాలుగు రోజులకే పరిమితం కానున్నది. నేడు రిటైల్ ద్రవ్యోల్బణ గణాంకాలు.... మార్చి నెల రిటైల్ ద్రవ్యోల్బణ గణాంకాలు నేడు (సోమవారం), టోకు ధరల ద్రవ్యోల్బణ గణాం కాలు మంగళవారం(ఏప్రిల్ 14న) వెలువడుతాయి. ఇక ఈవారం నుంచే క్యూ4 ఫలితాల సీజన్ మొద లవుతోంది. బుధవారం(ఈ నెల 15న) విప్రో, ఈ నెల 16న(గురువారం) టీసీఎస్, ఈ నెల 18న (శనివారం) హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఫలితాలు వస్తాయి. లాక్‌డౌన్‌కు, మార్కెట్‌కు లింక్! దశలవారీగానైనా లాక్‌డౌన్‌ను తొలగిస్తే, ఆర్థిక కార్యకలాపాలు పాక్షికంగానైనా పుంజుకుంటాయనే అంచనాలతో ఇటీవల మార్కెట్ భారీగా పెరిగింది. అయితే లాక్డౌన్ పొడిగింపు సూచనలే కనిపిస్తుండటం.. మార్కెట్‌పై బాగానే ప్రభావం చూపుతుందని అంచనా. అయితే జనాలే కాదు, జీవనోపాధి కూడా ముఖ్యమేనని ప్రధాని వ్యాఖ్యానించడంతో లాక్డౌన్ నుంచి ఒకింత ఊరట లభించవచ్చని కొందరు విశ్లేషకులు భావిస్తున్నారు. కొనసాగుతున్న ‘విదేశీ’ విక్రయాలు విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల ఉపసంహరణ కొనసాగుతోంది. కరోనా కేసులు పెరుగుతుండటంతో సురక్షిత మదుపు సాధనాలైన పుత్తడి, డాలర్ సెక్యూరిటీల్లో ఇన్వెస్ట్ చేయడానికే విదేశీ ఇన్వెస్టర్లు ప్రాధాన్యత ఇస్తున్నారు. అందుకే భారత్ లాంటి వర్ధమాన దేశాల నుంచి పెట్టుబడులను ఉపసంహరించుకుంటున్నారు. కాగా ఈ నెలలో ఇప్పటివరకూ విదేశీ ఇన్వెస్టర్లు ఈక్విటీల నుంచి రూ.2,951 కోట్లు, డెట్ మార్కెట్ నుంచి రూ.6,152 కోట్లు.. వెరసి మన క్యాపిటల్ మార్కెట్ నుంచి రూ.9,103 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. గత నెలలో రికార్డ్ స్థాయిలో రూ.1.1 లక్షల కోట్ల పెట్టుబడులు ఉపసంహరించుకున్నారు. -
కుప్పకూలుతున్న అడాగ్ షేర్లు
సాక్షి, ముంబై: అనిల్అంబానీ నేతృత్వంలోని అనిల్ ధీరూభాయ్ అంబానీ గ్రూప్ అడాగ్ గ్రూపు షేర్లు మరోసారి భారీగా నష్టపోతున్నాయి. గ్రూపులోని కీలకమైన రిలయన్స్ఇన్ఫ్రా 2018-19 క్యు4 ఫలితాలను శుక్రవారం ప్రకటించింది. ఈ ఫలితాల్లో ఏకంగా రూ.3,301కోట్ల నష్టాలను సంస్థ ప్రకటించింది. దీంతో సోమవారం రిలయన్స్ గ్రూప్‌నకు చెందిన పలు కంపెనీల షేర్లు భారీ నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ముఖ్యంగా రిలయన్స్ ఇన్ఫ్రా 11శాతం కుప్పకూలింది. ఇతర సంస్థలు రిలయన్స్ క్యాపిటల్ షేరు 7శాతం, రిలయన్స్ పవర్ కౌంటర్ 3 శాతం, రిలయన్స్ కమ్యూనికేషన్స్ 5శాతానిపైగా నష్టపోతున్నాయి. మరోవైపు బిజినెస్ నిర్వహణలో కంపెనీ సామర్థ్యంపై తాజాగా ఆడిటర్లు సందేహాల నేపథ్యంలో రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కౌంటర్లో అమ్మకాలు ఊపందుకున్నాయి. అంతేకాదు అనుబంధ సంస్థ ముంబై మెట్రో.. గ్రూప్‌లోని మరో కంపెనీ రిలయన్స్ నావల్ అండ్ ఇంజినీరింగ్, తదితర అనుబంధ సంస్థలపైనా ఆడిటర్లు ఆందోళన వెలిబుచ్చినట్లు వార్తలు వెలువడ్డాయి. ప్రధాన సంస్థ రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నష్టాలు నమోదు చేస్తున్నందున కంపెనీ గ్యారంటర్‌గా ఉన్న రుణాల విషయంలోనూ సందేహాలున్నట్లు ఆడిటర్లు పేర్కొన్నారు. -
కొత్త శిఖరాలకు సెన్సెక్స్, నిఫ్టీలు
గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక వృద్ధిరేటు ఐదేళ్ల కనిష్టానికి పడిపోయింది. నిరుద్యోగం 45 ఏళ్ల గరిష్ట స్థాయికి చేరింది. మే నెల వాహన విక్రయాలు నిరాశపరిచాయి. కంపెనీల క్యూ4 ఫలితాలు అంతంతమాత్రంగానే ఉన్నాయి. అంతర్జాతీయ సంకేతాలు బలహీనంగా ఉన్నాయి. ఇన్ని ప్రతికూలతల మధ్య మన స్టాక్ మార్కెట్ కూడా పడిపోవాలి. కానీ దీనికి భిన్నంగా సోమవారం స్టాక్ మార్కెట్ భారీగా లాభపడింది. అన్ని రంగాల షేర్లలో కొనుగోళ్ల సునామీ వెల్లువెత్తింది. కీలక రేట్లను ఆర్బీఐ తగ్గించగలదన్న అంచనాలకు సంస్కరణలు కొనసాగుతాయనే ఆశలు కూడా జత కావడంతో సెన్సెక్స్, నిఫ్టీలు ఇంట్రాడేలోనూ, ముగింపులోనూ కొత్త రికార్డ్లను నెలకొల్పాయి. సెన్సెక్స్ 40 వేల పాయింట్లు, నిఫ్టీ 12 వేల పాయింట్లపైకి ఎగబాకాయి. ప్రపంచ మార్కెట్లు నష్టపోయినా, ముడి చమురు ధరలు భారీగా పతనం కావడం, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు కొనసాగుతుండటం, రూపాయి బలపడటం సానుకూల ప్రభావం చూపించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 553 పాయింట్ల లాభంతో 40,268 పాయింట్ల వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 166 పాయింట్లు పెరిగి 12,089 పాయింట్ల వద్ద ముగిశాయి. సెన్సెక్స్ 40 వేల పాయింట్ల ఎగువున ముగియడం ఇదే మొదటిసారి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 40,309 పాయింట్ల వద్ద, నిఫ్టీ 12,103 పాయింట్ల వద్ద జీవిత కాల గరిష్ట స్థాయిలను తాకాయి. మార్కెట్ పరుగు సంబరాల్లో బీఎస్ఈ ఎండీ, సీఈఓ ఆశిష్‌కుమార్ చౌహాన్ తదితరులు రూ.1.76 లక్షల కోట్లు పెరిగిన ఇన్వెస్టర్ల సంపద స్టాక్ మార్కెట్ భారీగా లాభపడటంతో ఇన్వెస్టర్ల సంపద రూ.1.76 లక్షల కోట్లు పెరిగింది. ఇన్వెస్టర్ల సంపదగా పరిగణించే బీఎస్ఈలో లిస్టైన కంపెనీల మొత్తం మార్కెట్ విలువ రూ.1,76,402 కోట్ల నుంచి రూ.1,56,14,417 కోట్లకు ఎగసింది. లాభాలు ఎందుకంటే..! 1. రేట్ల కోత అంచనాలు గత ఆర్థిక సంవత్సరం చివరి క్వార్టర్లో జీడీపీ ఐదేళ్ల కనిష్టానికి, 5.8 శాతానికి చేరిందని కేంద్ర గణాంకాల సంస్థ(సీఎస్ఓ) శుక్రవారం వెల్లడించింది. మార్చి క్వార్టర్లో జీడీపీ తగ్గడంతో ఈ వారంలో జరిగే మోనేటరీ పాలసీ కమిటీ(ఎంపీసీ)సమావేశంలో ఆర్బీఐ కీలక రేట్లను తగ్గిస్తుందనే అంచనాలు బలం పుంజుకున్నాయి. దీంతో అన్ని రంగాల షేర్లలో కొనుగోళ్లు జోరుగా సాగాయని నిపుణులంటున్నారు. 2. ప్యాకేజీ, సంస్కరణలపై ఆశలు.... గత క్యూ4 జీడీపీ ఐదేళ్ల కనిష్టానికి పడిపోవడంతో వినియోగం జోరును పెంచే సంస్కరణలు కేంద్ర ప్రభుత్వం తెస్తుందనే ఆశలు పెరిగాయి. శుక్రవారం జరిగిన తొలి కేబినెట్ భేటీలో రైతులు, చిన్న వ్యాపారులకు కేంద్రం సానుకూల నిర్ణయాలు తీసుకోవడం కలిసి వచ్చింది. 3. భారీగా చమురు ధరల పతనం ఈ ఏడాది ఏప్రిల్ 30 నుంచి చూస్తే, ముడి చమురు ధరలు 15 శాతం మేర పతనమయ్యాయి. గత శుక్రవారం నాడే 2 శాతం క్షీణించగా, సోమవారం 1 శాతం పతనమయ్యాయి. 4. విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు గత నెల మొదటి మూడు వారాల వరకూ నికర అమ్మకందారులుగా ఉన్న విదేశీ ఇన్వెస్టర్లు ఎన్నికల ఫలితాల కారణంగా నికర కొనుగోలుదారులుగా మారారు. మొత్తం మే నెలలో రూ.9,031 కోట్లు నికర పెట్టుబడులు పెట్టిన విదేశీ ఇన్వెస్టర్లు ఒక్క సోమవారం రోజే రూ.3,069 కోట్ల మేర మ న స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టడం విశేషం. 5. పుంజుకున్న రూపాయి డాలర్‌తో రూపాయి మారకం విలువ 44 పైసలు పుంజుకుని 69.26కు చేరింది. 6. జూన్ రోల్ ఓవర్ల జోరు జూన్ సిరీస్ నిఫ్టీ ఫ్యూచర్స్ రోల్ ఓవర్స్ 72 శాతంగా ఉన్నాయి. ఈ రోల్ ఓవర్స్ మూడు నెలల సగటు 69 శాతమే. మూడు నెలల సగటు కన్నా అధికంగా ఉండటం మార్కెట్ షార్ట్‌టర్మ్ ట్రెండింగ్ పీరియడ్‌లోకి ప్రవేశించడాన్ని సూచిస్తోందని టెక్నికల్ ఎనలిస్ట్‌లు అంటున్నారు. 7. హెవీ వెయిట్స్ ర్యాలీ సూచీలో హెవీ వెయిట్స్‌ను చూస్తే, సెన్సెక్స్ మొత్తం 553 పాయంట్ల లాభంలో ఒక్క రిలయన్స్ ఇండస్ట్రీస్ వాటాయే 91 పాయింట్లుగా ఉంది. హెచ్డీఎఫ్సీ వాటా 76 పాయింట్లుగా, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ వాటా 63 పాయింట్లుగా, టీసీఎస్ వాటా 45 పాయింట్లు, హెచ్‌యూఎల్ వాటా 36 పాయింట్లుగా ఉంది. మొత్తం మీద ఈ ఐదు షేర్ల వాటాయే 311 పాయింట్లుగా ఉంది. మరిన్ని విశేషాలు... ► 31 సెన్సెక్స్ షేర్లలో మూడు షేర్లు –ఐసీఐసీఐ బ్యాంక్, ఎన్టీపీసీ, ఐటీసీలు నష్టపోయాయి. మిగిలిన 28 షేర్లు లాభపడ్డాయి. ► బీఎస్ఈలో 19 రంగాల సూచీలు లాభాల్లో ముగిశాయి. ► నిఫ్టీ 50లో 44 షేర్లు లాభపడగా, ఆరు షేర్లు నష్టపోయాయి. ► మే నెలలో వాహన విక్రయాలు 13 శాతం పెరగడంతో హీరో మోటొకార్ప్ షేర్ 6 శాతం లాభంతో రూ.2,843 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో బాగా లాభపడిన షేర్ ఇదే. ► గత వారం ముడి చమురు ధరలు బాగా పతనం కావడంతో పెయింట్, ప్రభుత్వ రంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు, టైర్, విమానయాన సంస్థల షేర్లు లాభపడ్డాయి. ► విమానయాన ఇంధనం ధరలు తగ్గడంతో విమానయాన రంగ షేర్లు జోరుగా పెరిగాయి. ఇంట్రాడేలో ఆల్‌టైమ్‌హై, రూ.157ను తాకిన స్పైస్‌జెట్ చివరకు 4 శాతం లాభంతో రూ.152 వద్ద ముగిసింది. ► నికర లాభం దాదాపు రెట్టింపు కావడంతో అపోలో హాస్పిటల్స్ ఎంటర్ప్రైజెస్ షేర్ 10 శాతం పెరిగి రూ.1,360 వద్ద ముగిసింది. ► గత క్యూ4 ఆర్థిక ఫలితాలు అంచనాలను మించడంతోఅదానీ గ్యాస్‌సహా గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీల షేర్లు ఇంట్రాడేలో ఆల్‌టైమ్ హైలను తాకాయి. ► స్టాక్ మార్కెట్ దుమ్మురేపుతున్నా, హెరిటేజ్ ఫుడ్స్ షేర్ సోమవారం 5 శాతం పతనమై, 30 నెలల కనిష్ట స్థాయి, రూ.388ని తాకింది. చివరకు 5.3 శాతం నష్టంతో రూ.391 వద్ద ముగిసింది. కంపెనీ ప్రమోటరైన చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్‌లో ఘోర పరాజయం పాలవడంతో గత ఏడు రోజుల్లో ఈ షేర్ 20 శాతం మేర పతనమైంది. ► ముడి చమురు ధరలు తగ్గడం, రేట్ల కోత అంచనాలు బలం పుంజుకోవడంతో ప్రభుత్వ బాండ్ల రాబడులు పడిపోయాయి. పదేళ్ల బాండ్ల రాబడులు 6.998 శాతానికి చేరాయి. 2017, నవంబర్ తర్వాత బాండ్ల రాబడులు 7 శాతం దిగువకు పడిపోవడం ఇదే మొదటిసారి. ► సెన్సెక్స్, నిఫ్టీలతో పాటే ఇంట్రాడేలో పలు షేర్లు ఆల్‌టైమ్ హైలను తాకాయి. బజాజ్ ఫిన్సర్వ్, టైటాన్, హెచ్డీఎఫ్సీ, అదానీ గ్యాస్, గుజరాత్ గ్యాస్, ఇంద్రప్రస్థ గ్యాస్ తదితర షేర్లు ఈ జాబితాలో ఉన్నాయి -
జీఎంఆర్‌కు భారీ నష్టాలు
న్యూఢిల్లీ/హైదరాబాద్: విద్యుత్, మౌలికరంగం, విమానయానం వంటి వివిధ రంగాల్లో ఉన్న జీఎంఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంస్థ 2018–19 4వ త్రైమాసికంలో భారీ నష్టాలు ప్రకటించింది. కన్సాలిడేటెడ్ ఖాతాల ప్రకారం ఏకంగా రూ.2,341 కోట్ల నష్టాన్ని నమోదు చేసింది. కొన్ని విద్యుత్ ఆస్తుల విలువ క్షీణించడం వల్ల ఈ స్థాయి నష్టాలను ఎదుర్కొన్నట్టు కంపెనీ తెలియజేసింది. జీఎంఆర్ ఎనర్జీ లిమిటెడ్ (జీసీఈఎల్), దీని సబ్సిడరీలు, జాయింట్ వెంచర్లలో కంపెనీ పెట్టుబడుల విలువ క్షీణించడం వల్ల రూ.1,242 కోట్ల మేర నష్టాలు వచ్చినట్టు వెల్లడించింది. జీఎంఆర్ ఛత్తీస్‌గఢ్ ఎనర్జీ లిమిటెడ్‌కు సంబంధించి రూ.969 కోట్ల నష్టం కూడా తోడైంది. దీంతో మొత్తం పెట్టుబడుల విలువ క్షీణత రూపంలో రూ.2,212 కోట్ల నష్టాన్ని చవిచూసింది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో కంపెనీకి రూ.5 కోట్ల లాభం రావడం గమనార్హం. ఇక మార్చి క్వార్టర్‌కు మొత్తం ఆదాయం రూ.2,293 కోట్లుగా నమోదయింది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో ఆదాయం రూ.2,234 కోట్లుగా ఉంది. జీఎంఆర్ ఎయిర్పోర్ట్ విభాగం మాత్రం రూ.1,357 కోట్ల ఆదాయంపై రూ.271 కోట్ల లాభాన్ని నమోదు చేసింది. ఢిల్లీ విమానాశ్రయ ప్రయాణికుల ట్రాఫిక్ 2018–19లో 5 శాతం పెరిగి 69.2 మిలియన్లుగా ఉంది. హైదరాబాద్ ఎయిర్పోర్ట్ ప్రయాణికుల ట్రాఫిక్ 16 శాతం పెరిగి 21.4 మిలియన్లుగా నమోదైంది. ఇంధన విభాగంలో తాజా పెట్టుబడుల్లేవు ‘‘ఇంధన విభాగంలో మా వాటాదారుల పెట్టుబడి విలువ గణనీయంగా తగ్గిపోయింది. అయినప్పటికీ ప్రస్తుతమున్న ఇంధన ఆస్తుల సమర్థతను పెంచేందుకు కట్టుబడి ఉన్నాం. ప్రారంభ పెట్టుబడిని మాఫీ చేశాం. నియంత్రణ పరిస్థితులు మరింత స్పష్టంగా మారి, మరింత అనుకూల పరిస్థితులు ఏర్పడే వరకూ ఈ దశలో ఇంధన విభాగంలో కొత్తగా పెట్టుబడులు పెట్టబోవడం లేదు. సరైన సమయంలో పెట్టుబడులపై బోర్డు నిర్ణయం తీసుకుంటుంది’’అని జీఎంఆర్ ఇన్ఫ్రా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సురేష్ చావ్లా తెలిపారు. ఇటీవల టాటా గ్రూపు, జీఐసీ సింగపూర్, ఎస్ఎస్జీ క్యాపిటల్ మేనేజ్మెంట్తో రూ.8,000 కోట్ల పెట్టుబడికి సంబంధించి చేసుకున్న ఒప్పందంతో జీఎంఆర్ ఇన్ఫ్రా రుణభారం గణనీయంగా తగ్గిపోవడమే కాకుండా, ఎయిర్పోర్ట్ వ్యాపారం డీమెర్జింగ్‌కు మార్గం సుగమం అవుతుందని జీఎంఆర్ గ్రూపు సీఎఫ్‌వో సురేష్ బాగ్రోడియా చెప్పారు. రుణభారం ప్రస్తుత రూ.24,000 కోట్ల నుంచి ఆరోగ్యకరమైన స్థితికి తగ్గిపోతుందన్నారు. విమానాశ్రయాల్లో సామర్థ్యం పరంగా ఇబ్బందులు ఎదురవుతుండడంతో విస్తరించాల్సిన అవసరం ఏర్పడిందన్నారు. -
క్యూ4లో పీఎన్బీ నష్టం రూ.4750కోట్లు
సాక్షి, ముంబై : ప్రభుత్వ రంగ దిగ్గజ బ్యాంకు పంజాబ్ నేషనల్ బ్యాంకు ( పీఎన్బీ) క్యూ4లో భారీ నష్టాలను నమోదు చేసింది. మంగళవారం ప్రకటించిన మార్చి ముగిసిన నాలుగవ త్రైమాసిక ఫలితాల్లో రూ. 4750 కోట్ల నికర నష్టాలను నమోదు చేసింది. అయితే స్థూల నిరర్ధక ఆస్తులు గత త్రైమాసికంలో 16.33 శాతం నుంచి 15.5 శాతానికి తగ్గాయి. ప్రొవిజన్లు కూడా రూ.12,970కోట్ల నుంచి రూ. 7,611 స్థాయికి దిగి వచ్చాయి. ఈ ఫలితాలపై ఎనలిస్టులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అయితే గత ఏడాది ఇదే త్రైమాసికం లో రూ.13,417 కోట్ల నష్టాలతో పోలిస్తే గణనీయంగా కోలుకుంది. వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీ కుంభకోణం బ్యాంకును భారీగా నష్టపర్చింది. మరోవైపు ఈ ఫలితాల నేపథ్యంలో పీఎన్బీ షేరు నష్టాల్లో కొనసాగుతోంది. -
ఇండిగో ఫలితాలు భేష్
సాక్షి, ముంబై : బడ్జెట్ క్యారియర్ ఇండిగో సంస్థ క్యూ4 ఫలితాల్లో అదరగొట్టింది. మార్చితో ముగిసిన నాలుగవ త్రైమాసికంలో ఇంటర్ గ్లోబ్ ఏవియేషన్,రూ. 589.6 కోట్ల లాభాలు ఆర్జించింది. గత ఏడాది ఇదే క్వార్టర్‌తో పోలిస్తే అయిదు రెట్ల లాభాలను ఆర్ఝించింది. ఈ క్వార్టర్లో 12 శాతం పెరిగాయి. జనవరి - మార్చి మధ్య సీటుకు కిలోమీటర్‌కు ఆదాయం 5.9 శాతం పెరిగి రూ.3.63గా ఉంది. ఈ త్రైమాసికంలో ఆదాయం 35.9 శాతం పెరిగి రూ .7,883.3 కోట్లకు చేరింది. ఎబిటా మార్జిన్లు 93.7 శాతం పెరిగి 2,192.6 కోట్లకు పెరిగాయి, మార్జిన్ గత ఏడాది ఇదే కాలానికి పోలిస్తే 830 బేసిస్ 27.8 శాతానికి పెరిగింది. చమురు ధరలు బారీగా పెరగడంతో వార్షిక ప్రాతిపదికన లాభాలు గణనీయంగా పడిపోయాయి. అధిక ద్రవ్యోల్బణం, బలహీనమైన రూపాయి, తీవ్రమైన పోటీతత్వ వాతావరణం కారణాల రీత్యా దేశీయంగా విమానయాన పరిశ్రమ 2019 ఆర్థిక సంవత్సరం చాలా కఠినమైన సంవత్సరమని ఇండిగో సీఈవో రనున్జోయ్ దత్తా తెలిపారు. అయితే ఇండిగో సంస్థ పుంజుకుంటోందని, భవిష్యత్ బుల్లిష్‌గా ఉంటుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. 2020 సంవత్సరానికి గాను సీటుకు కిలోమీటర్‌కు 30 శాతం పెరుగదల ఉంటుందని ఇండిగో అంచనా వేస్తోంది. డివిడెండ్ : ఈక్విటీ షేరుకు రూ. 5చొప్పున డివిడెండ్ చెల్లించనుంది. కాగా ఆర్థిక సంక్షోభం కారణంగా జెట్ ఎయిర్వేస్ కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేసింది. జెట్ వాటాల కొనుగోలు విషయం ఇంకా కొలిక్కి రాని సంగతి తెలిసిందే. ఈ పరిణామాలు ఇండిగోతోపాటు, స్పైస్ జెట్ లాంటి సంస్థలకు లాభించింది. -
37 శాతం తగ్గిన హిందాల్కో లాభం
న్యూఢిల్లీ: ఆదిత్య బిర్లా గ్రూప్‌నకు చెందిన ప్రధాన కంపెనీ, హిందాల్కో ఇండస్ట్రీస్ నికర లాభం (స్టాండ్ అలోన్) గత ఆర్థిక సంవత్సరం (2018–19) నాలుగో త్రైమాసిక కాలంలో 37 శాతం తగ్గింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం (2017–18) క్యూ4లో రూ.377 కోట్లుగా ఉన్న నికర లాభం గత క్యూ4లో రూ.236 కోట్లకు తగ్గిందని హిందాల్కో తెలిపింది. ఆదాయం మాత్రం రూ.11,892 కోట్ల నుంచి రూ.12,733 కోట్లకు పెరిగిందని కంపెనీ ఎమ్డీ సతీశ్ పాయ్ చెప్పారు. . ఉత్పత్తి వ్యయాలు పెరగడం, ఆర్థిక స్థితిగతులు బలహీనంగా ఉండటం వల్ల నికర లాభం తగ్గిందని వివరించారు. ఒక్కో షేర్‌కు రూ.1.20 డివిడెండ్(120 శాతం)ను ఇవ్వనున్నామని తెలిపారు. వ్యాపార పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పటికీ, మంచి ఫలితాలు సాధించామని సతీష్ సంతృప్తి వ్యక్తం చేశారు. -
టీసీఎస్ సీఈఓకు రూ. 16 కోట్ల వేతనం
న్యూఢిల్లీ: టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రాజేష్ గోపీనాథన్ వేతనం 28 శాతం పెరిగింది. ఏడాది జీతం రూ.16 కోట్లు దాటింది. రాజేష్ గోపీనాథన్‌కు గతేడాదిలో ఈ మొత్తాన్ని వేతనంగా చెల్లించినట్లు సంస్థ తన వార్షిక నివేదికలో వెల్లడించింది. చెల్లింపుల వివరాల్లోకి వెళితే.. జీతం రూ.1.15 కోట్లు, అదనపు ప్రయోజనం రూ.1.26 కోట్లు, కమీషన్ రూ.13 కోట్లు, అలవెన్సులు రూ.60 లక్షలు కలిపి మొత్తంగా 16.02 కోట్ల రూపాయిలు చెల్లించింది. 2017–18లో ఈయనకు చెల్లించిన మొత్తం రూ.12.49 కోట్లతో పోల్చితే గతేడాది వేతనం 28 శాతం పెరిగింది. ఇక సీఓఓ ఎన్ గణపతి సుబ్రహ్మణ్యం వేతనం రూ.11.61 కోట్లు (24.9 శాతం పెంపు), సీఎఫ్ఓ రామకృష్ణన్ వేతనం రూ.4.13 కోట్లుగా వెల్లడించింది. ఉద్యోగుల జీతాల్లో 2 నుంచి 5 శాతం పెంపు ఉన్నట్లు ప్రకటించింది. -
కార్డుల్ని మించిన యూపీఐ
న్యూఢిల్లీ: ఏకీకృత చెల్లింపు విధానం (యూపీఐ) ద్వారా లావాదేవీలు క్రమంగా పుంజుకుంటున్నాయి. గతేడాది మార్చి నుంచి ఈ ఏడాది మార్చి మధ్య కాలంలో నెలవారీ లావాదేవీల సంఖ్య 4.5 రెట్లు పెరిగి.. 79.95 కోట్ల స్థాయికి చేరింది. ఈ క్రమంలో క్రెడిట్, డెబిట్ కార్డు లావాదేవీలను కూడా మించి యూపీఐ చెల్లింపులు నమోదవుతున్నాయి. ఈ ఏడాది జనవరిలో యూపీఐ లావాదేవీల విలువ రూ.1.09 లక్షల కోట్లుగా ఉండగా, కార్డు లావాదేవీల విలువ రూ.1.05 లక్షల కోట్లకు పరిమితమైంది. ఇక ఫిబ్రవరిలో యూపీఐ లావాదేవీల విలువ రు. 1.07 లక్షల కోట్లు కాగా.. కార్డుల విలువ రూ.93,998 కోట్లుగా నమోదైంది. మార్చిలో రెండు విధానాల్లోనూ చెల్లింపులు రూ.1 లక్ష కోట్లు దాటాయి. యూపీఐ ద్వారా రూ. 1.33 లక్షల కోట్లు, కార్డుల ద్వారా రూ.1.11 లక్షల కోట్ల విలువ చేసే లావాదేవీలు జరిగాయి. యూజర్లను ఆకర్షించేందుకు యూపీఐ యాప్స్.. డిస్కౌంట్లు, స్క్రా^Œ కార్డులు, క్యాష్‌బ్యాక్ ఆఫర్లు వంటివి అందిస్తుండటం కూడా ఈ విధానం ఆదరణ పొందడానికి కారణంగా ఉంటోందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. 2020 నాటికి 80 శాతం .. ఏడాది క్రితం పేమెంట్ గేట్వేస్ పరిమాణంలో యూపీఐ వాటా కేవలం 2 శాతమే ఉండగా.. ప్రస్తుతం 20 శాతానికి పెరిగిందని రేజర్‌పే సంస్థ సహ వ్యవస్థాపకుడు, సీఈవో హర్షిల్ మాథుర్ పేర్కొన్నారు. ఇదే తీరు కొనసాగితే పాత తరం డిజిటల్ పేమెంట్స్ విధానాల మార్కెట్‌ను యూపీఐ మరింతగా ఆక్రమించే అవకాశం ఉందని కన్సల్టెన్సీ సంస్థ పీడబ్ల్యూసీ ఇండియా అభిప్రాయపడింది. 2020 నాటికల్లా కార్డుల ద్వారా జరిగే లావాదేవీల్లో దాదాపు 80 శాతం లావాదేవీలు యూపీఐకి మారే అవకాశం ఉందని పేర్కొంది. డిజిటల్‌దే అగ్రభాగం: ఆర్బీఐ తక్కువ స్థాయిలో నగదు వినియోగించే సొసైటీగా భారత్‌ను మార్చే ‘పేమెంట్ అండ్ సెటిల్మెంట్ సిస్టమ్స్ ఇన్ ఇండియా: విజన్ 2019– 2021ను ఆర్బీఐ ఆవిష్కరించింది. దీని ప్రకారం 2018 డిసెంబర్ నాటికి డిజిటల్ లావాదేవీలు 2,069 కోట్లు కాగా, 2021 నాటికి నాలుగురెట్లు పెరిగి 8,707 కోట్లకు చేరుతాయి. డిజిటల్ చెల్లింపుల విషయంలో కస్టమర్ల నుంచి వసూలు చేసే చార్జీల విషయంలో ఆర్బీఐ జోక్యం పరిమితంగానే ఉంటుంది. -
సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫలితాలు : షేరు ఢమాల్
సాక్షి, ముంబై: ప్రభుత్వ రంగ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్యూ4లో మరింత కుదేలైంది. గత ఆర్థిక సంవత్సరం (2018-19) జనవరి-మార్చి క్వార్టర్లో మరింతగా పెరిగాయి. గత ఆర్థిక సంవత్సరం క్యూ4లో రూ.2,477 కోట్లుగా నమోదయ్యాయి. అంతకు ముందు ఆర్థిక సంవత్సరం (2017 18) క్యూ4లో రూ. 2,114 కోట్లుగా ఉన్నాయి. మొండి బకాయిలకు అధికంగా కేటాయింపులు జరపడం వల్ల క్యూ4లో నికర నష్టాలు భారీగా పెరిగాయని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫలితాల ప్రకటన సందర్భంగా తెలిపింది. మొత్తం ఆదాయం మాత్రం రూ.6,301 కోట్ల నుంచి రూ.6,621 కోట్లకు పెరిగిందని పేర్కొంది. ఈ ఫలితాల నేపథ్యం బ్యాంకు షేరు 52 వారాల కనిష్టాన్ని తాకింది. -
నిరాశపర్చిన ఎస్బీఐ ఫలితాలు
సాక్షి, ముంబై: దేశీయ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా క్యూ4 లో విశ్లేషకుల అచనాలను అందుకోలేకపోయింది. క్వార్టర్ ఆన్ క్వార్టర్ ఆన్ ప్రొవిజన్లు భారీగా పుంజుకున్నాయి. నికర లాభం గణనీయంగా తగ్గి నిరాశజనక ఫలితాలను ప్రకటించింది. అయితే అసెట్ నాణ్యత పరంగా బ్యాంకు మెరుగుపడింది. త్రైమాసిక ప్రాతిపదికన స్థూల స్లిప్పేజెస్ రూ. 6541 కోట్ల నుంచి రూ. 7961 కోట్లకు ఎగశాయి. మార్చి31తో ముగిసిన 4వ త్రైమాసిక ఆర్థిక ఫలితాలను శుక్రవారం ప్రకటించింది. ఎస్బీఐ నికర లాభం రూ.838.4 కోట్లుగా నమోదైంది. గత క్వార్టర్లో రూ.3,955కోట్ల నికర లాభాలను ప్రకటించింది. 4,890 కోట్ల నికర లాభాలను ఆర్జింస్తుందని ఎనలిస్టులు అంచనా వేశారు. అయితే గత ఏడాది ఇదే క్వార్టర్లో 7,718 కోట్ల నష్టాన్ని ప్రకటించింది. బ్యాంకు ఆర్థిక ఫలితాల్లో నికర వడ్డీ ఆదాయం రూ.22,954 కోట్లుగా ఉంది. 3.95 శాతం నుంచి 3.05 శాతానికి తగ్గిన నికర ఎన్పీఏ లు రూ.65,895 కోట్లుగా నమోదయ్యాయి. అలాగే ప్రొవిజన్లు రూ.16వేల కోట్లగాను, నిర్వహణ లాభం రూ.16,933 కోట్లగాను ఉంది. ఏవియేషన్ స్లిపేజెస్ 12,220 వేల కోట్ల రూపాయలు. ఫలితాలపై మేసేజ్‌మెంట్ వివరణతో ఎస్బీఐ బ్యాంకు కౌంటర్ పుంజుకుంది. స్వల్ప నష్టాలనుంచి తేరుకుని 3 శాతం లాభాల్లోకి మళ్లింది. -
నిరాశపర్చిన ఐసీఐసీఐ ఫలితాలు
సాక్షి: ముంబై: ప్రయివేటు బ్యాంకింగ్ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంకు 2019 మార్చి 31తో ముగిసిన నాల్గవ త్రైమాసికంలో నష్టాల షాక్ తగిలింది. విశ్లేషకుల అంచనాలను అందుకోలేని బ్యాంకు ఆర్థిక ఫలితాలు నిరాశపర్చాయి. బ్యాంకులాభం 5 శాతం తగ్గి 969 కోట్లకు చేరింది. గత ఏడాది ఇదే కాలంలో బ్యాంకు నికర లాభం రూ. 1,020 కోట్లగా ఉంది. ఈ క్వార్టర్లో 2,129 కోట్ల లాభం ఉండొచ్చని విశ్లేషకుల అంచనా వేశారు. మొత్తం ఖర్చులు 18.1 పెరిగి 14,680 కోట్లకు చేరుకున్నాయి. నాల్గవ త్రైమాసికంలో నికర వడ్డీ ఆదాయం 27శాతం పెరిగిం రూ.7620 కోట్లుగా నమోదైంది. ఇతర ఆదాయం రూ.3261 కోట్లుగా నమోదు. అలాగే గత త్రైమాసికంతో పోలిస్తే మార్జిన్లు 3.40 శాతం నుంచి 3.72 శాతాని చేరాయి. -
ఫలితాల్లో అదరగొట్టిన కోటక్ మహీంద్ర
సాక్షి, ముంబై: కోటక్ మహీంద్ర బ్యాంకు 2018-19 సంవత్సరంలోని క్యూ4 ఫలితాల్లో అదరగొట్టింది. మార్చి 31తో ముగిసిన నాలుగవ త్రైమాసికంలో రూ.1408కోట్ల నికర లాభాలను ఆర్జించింది. గత ఏడాది ఇదే క్వార్టర్‌తో పోలిస్తే 25.24 శాతం లాభాలు పుంజుకున్నాయి. ఆదాయం కూడా 19శాతం ఎగిసి రూ.7672కోట్లను సాధించింది. మరోవైపు ప్రతీ ఈక్వీటీ షేరుకు 80పైసల డివిడెండ్‌ను చెల్లించేందుకు బ్యాంకు బోర్డు ప్రతిపాదించింది. ఈ ఫలితాల ప్రకటన నేపథ్యంలో కోటక్ బ్యాంకు షేరు స్వల్పంగా లాభపడుతోంది. -
ఫలితాల దెబ్బ : ఎస్‌బ్యాంకు షేరు పతనం
సాక్షి,ముంబై: ప్రయివేటు రంగ బ్యాంకు ఎస్ బ్యాంకునకు ఫలితాల సెగ భారీగా తాకింది. మార్చి30తో ముగిసిన గత ఏడాది నాలుగవ త్రైమాసిక ఫలితాలు ప్రకటనతో ఎస్ బ్యాంకు కౌంటర్లో అమ్మకాల వెల్లువెత్తింది. దీంతో ఏకంగా షేరు 30శాతం కుప్పకూలింది. 2005 తర్వాత ఎస్ బ్యాంక్ ఈ స్థాయిలో నష్టపోవడం ఇదే తొలిసారి. బ్యాడ్లోన్ల బెడదతో త్రైమాసికంలో 1506 కోట్ల రూపాయలను నికర నష్టాలను చవి చూసింది. అయితే గత ఏడాదితో పోలిస్తే ఆదాయం 16.29శాతం పుంజుకుని రూ. 2505 కోట్లు సాధించింది. ప్రొవిజన్లు 9 రెట్లు ఎగబాకి రూ.3661 కోట్లగా ఉన్నాయి. గత ఏడాది ఇదే క్వార్టర్లో ఇది రూ.399 కోట్లు మాత్రమే. -
ఫెడ్ నిర్ణయం, క్యూ4పై మార్కెట్ దృష్టి
ముంబై: లోక్‌సభకు మొత్తం ఏడు దశల్లో ఎన్నికలు జరుగుతుండగా.. ఈ క్రమంలో సోమవారం నాలుగో దశ ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇప్పటికే మూడు దశలు పూర్తవగా.. నేడు జరిగే పోలింగ్...ఎన్నికల చివరి అంకానికి దగ్గర చేస్తుందనే అంశం మార్కెట్లో కీలకంగా ఉందని ఎపిక్ రీసెర్చ్ సీఈఓ ముస్తఫా నదీమ్ అన్నారు. ‘ఫలితాల వెల్లడి తేదీ దగ్గర పడుతున్న కొద్దీ.. తరువాత ప్రభుత్వాన్ని ఎవరు ఏర్పాటుచేయనున్నాయనే ఉత్కంఠ మార్కెట్లో పెరుగుతోంది. ఈ నేపథ్యంలో మే 23 వరకు ఒడిదుడుకులు కూడా మరింత పెరుగుతాయి’ అని అన్నారయన. కొనసాగుతున్న పోలింగ్, కార్పొరేట్ కంపెనీల తొలిత్రైమాసిక ఫలితాలు ఈవారంలో మార్కెట్‌కు దిశా నిర్దేశం చేయనున్నాయని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ పరిశోధన విభాగం హెడ్ వినోద్ నాయర్ అన్నారు. ‘ఇప్పటివరకు వెల్లడైన కంపెనీల ఫలితాలు మార్కెట్ అంచనాలకు అనుగుణంగానే ఉన్నాయి. ఇకపై వెల్లడికానున్న కంపెనీల ఫలితాలు ఆశాజనకంగా ఉండి.. ఇదే సమయంలో ఆర్బీఐ వడ్డీ రేట్లను తగ్గిస్తే మాత్రం సమీపకాలంలోనే మన మార్కెట్లు అవుట్పెర్ఫార్మ్ చేస్తాయి’ అని వ్యాఖ్యానించారు. ఎఫ్ఎంసీజీ దిగ్గజ ఫలితాల వెల్లడి అంబుజా సిమెంట్స్, కొటక్ మహీంద్రా బ్యాంక్, కెన్ ఫిన్ హోమ్స్, టీవీఎస్ మోటార్ కంపెనీలు గత ఆర్థిక సంవత్సర(2018–19) చివరి త్రైమాసిక ఫలితాలను మంగళవారం (30న) ప్రకటించనున్నాయి. ఎఫ్ఎంసీజీ దిగ్గజాలైన బ్రిటానియా (బుధవారం), డాబర్ (గురు), హిందూస్తాన్ యూనిలివర్ (శుక్ర) ఫలితాలను వెల్లడించనున్నాయి. ఇక ఇదేవారంలో రిజల్స్ ప్రకటించనున్న ఇతర ప్రధాన కంపెనీల్లో.. టాటా కెమికల్స్, టాటా పవర్, ఫెడరల్ బ్యాంక్, గోద్రేజ్ ప్రాపర్టీస్, అజంతా ఫార్మా, ఎల్ఐసి హౌసింగ్ ఫైనా¯Œ్స, రేమండ్, బంధన్ బ్యాంక్, ఎక్సైడ్ ఇండస్ట్రీస్‌లు ఉన్నాయి. ఈ ఫలితాలు మార్కెట్ ట్రెండ్‌కు అత్యంత కీలకంకానున్నాయని ఎడెల్వీజ్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజిస్ట్ సాహిల్ కపూర్ అన్నారు. ఫెడ్ సమావేశంపై మార్కెట్ ఫోకస్ వడ్డీ రేట్లను సమీక్షించేందుకు అమెరికా ఫెడరల్ రిజర్వ్ ఈవారంలోనే సమావేశంకానుంది. మంగళ, బుధవారాల్లో ఫెడరల్ ఓపె¯Œ మార్కెట్ కమిటీ ఈ అంశంపై చర్చించనుండగా.. ఈ సమావేశానికి సంబంధించిన తుది నిర్ణయాన్ని ఫెడరల్ చైర్మన్ జెరోమ్ పావెల్ బుధవారం ప్రకటించనున్నారు. భారీ ఒడిదుడుకుల మధ్య క్రూడాయిల్ గతవారంలో 75 డాలర్లకు సమీపించి మార్కెట్‌కు ప్రతికూలంగా మారిన బ్యారెల్ బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్.. వారాంతాన దిగొచ్చింది. శుక్రవారం 71.63 డాలర్ల వద్ద ముగిసింది. ఈ అంశం ఆధారంగా డాలరుతో రూపాయి మారకం విలువ 69.50–70.30 శ్రేణిలో ఉండేందుకు అవకాశం ఉందని ఎడిల్వీస్ సెక్యూరిటీస్ ఫారెక్స్ హెడ్ సజల్ గుప్తా విశ్లేషించారు. ఈ వారంలో ట్రేడింగ్ 3 రోజులే.. ముంబైలో సార్వత్రిక ఎన్నికలు పోలింగ్ ఉన్న కారణంగా సోమవారం(29న) స్టాక్ ఎక్సే్ఛంజీలు సెలవు ప్రకటించాయి. ఆ తరువాత రోజైన మంగళవారం యథావిధిగా మార్కెట్ కొనసాగనుంది. అయితే, మళ్లీ బుధవారం(1న) మహారాష్ట్ర దినోత్సవం సందర్భంగా బీఎస్ఈ, ఎ¯Œ ఎస్ఈలకు సెలవు ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో మొత్తంగా ఈ వారంలో మార్కెట్లో ట్రేడింగ్ మూడు రోజులకే పరిమితంకానుంది కొనసాగుతున్న విదేశీ నిధుల వెల్లువ భారత్ క్యాపిటల్ మార్కెట్లో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల(ఎఫ్‌పీఐ) పెట్టుబడుల పరంపర కొనసాగుతోంది. ఫిబ్రవరి, మార్చి నెలల్లో భారీగా పెట్టుబడులు చేసిన విదేశీ ఇన్వెస్టర్లు ఏప్రిల్ 1–26 కాలంలోనూ రూ.17,219 కోట్లను పెట్టుబడిపెట్టినట్లు డిపాజిటరీ డేటా ద్వారా వెల్లడయింది. -
క్షీణించిన మారుతి లాభాలు
సాక్షి, ముంబై : దేశీయ అతిపెద్ద ప్యాసింజర్ వాహన తయారీ సంస్థ మారుతి సుజుకి ఇండియా క్యూ4 ఫలితాల్లో నిరాశపర్చింది. విశ్లేషకులు అంచనావేసినట్టుగా మార్చి 30తో ముగిసిన త్రైమాసిక ఫలితాల్లో 5శాతం (4.6 శాతం)పడిపోయాయి. వార్షిక ప్రాతిపదికన అమ్మకాలు 0.7 శాతం క్షీణించాయి. ఈ త్రైమాసికంలో నికర లాభం రూ .1,795.6 కోట్లకు తగ్గింది. గత ఏడాది ఇదే కాలంలో రూ .1,882.1 కోట్లు.స్టాండలోన్ ఆదాయం 1 శాతం పుంచుకుని 21,459. కోట్లుగా నమోదైంది. ఈ కాలంలో 25 శాతం తక్కువగా రూ. 2263 కోట్ల నిర్వహణ లాభం(ఇబిటా) ఆర్జించింది. కాగా.. ఇబిటా మార్జిన్లు 14.22 శాతం నుంచి 10.55 శాతానికి బలహీనపడ్డాయి. ఈ నేపథ్యంలో మారుతీ షేరు ఎన్ఎస్ఈలో ప్రస్తుతం 1.8 శాతం నష్టంతో రూ. 6880 వద్ద ట్రేడవుతోంది. ప్రతికూల విదేశీ మారక ద్రవ్యం, వస్తువుల ధరలు, లాభాలను ప్రభావితం చేశాయని ఫలితాల వెల్లడి సందర్భంగా కంపెనీ పేర్కొంది.. 2018-19 ఆర్థిక సంవత్సరానికి 80 రూపాయల డివిడెండ్ ను చెల్లించనుంది. -
క్యూ4 ఫలితాలతో దిశానిర్దేశం
ముంబై: సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా దేశవ్యాప్తంగా 116 నియోజకవర్గాల్లో ఏప్రిల్ 23న (మంగళవారం) 3వ దశ పోలింగ్ జరగనుంది. కొనసాగుతున్న సాధారణ ఎన్నికల వేడి, కంపెనీలు ప్రకటించనున్న క్యూ4 (జనవరి–మార్చి) ఫలితాలు ఈ వారంలో దేశీ మార్కెట్‌కు దిశానిర్దేశం చేయనున్నట్లు దలాల్ స్ట్రీట్ వర్గాలు చెబుతున్నాయి. ఎర్నింగ్స్ సీజన్లో భాగంగా రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ శుక్రవారం ఫలితాలను ప్రకటించగా.. ఆరోజు గుడ్‌ఫ్రైడే కారణంగా మార్కెట్‌కు సెలవు అయినందున ఈ ప్రభావం సోమవారం ట్రేడింగ్‌పై స్పష్టంగా కనిపించనుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. చమురు శుద్ధి, పెట్రో కెమికల్ విభాగాల్లో బలహీనంగా ఉన్నప్పటికీ.. రిటైల్, టెలికం విభాగాల జోరు కారణంగా ఆర్ఐఎల్ రికార్డ్ స్థాయి లాభాలను ఆర్జించగా.. గత ఏడాది క్యూ4తో పోలిస్తే, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ నికర లాభాల్లో 22.63 శాతం వృద్ధి కనబర్చింది. ఈ దిగ్గజాల ఫలితాల ప్రభావంతో పాటు.. ఇక నుంచి వెల్లడికానున్న ఎర్నింగ్స్ ప్రస్తుత వారంలో మార్కెట్‌కు కీలకంకానున్నాయని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ పరిశోధనా విభాగం చీఫ్ వినోద్ నాయర్ వ్యాఖ్యానించారు. ‘స్వల్పకాలానికి ఇన్వెస్టర్లు క్యూ4 ఫలితాలపై దృష్టిసారించారు. నిఫ్టీ 50 కంపెనీల ఎర్నింగ్స్ ఏడాది ప్రాతిపదికన 20 శాతం మేర వృద్ధిని సాధించేందుకు అవకాశం ఉంది. అంతక్రితం ఏడాది ఇదేకాలంలో బ్యాంకింగ్ రంగ లోబేస్ కారణంగా ఈ అంచనాను తీసుకున్నాం. ఇక ఈవారంలో కార్పొరేట్ బ్యాంకింగ్ రంగాన్ని కలుపుకుని ఇండెక్స్ హెవీవెయిట్స్ ఫలితాల సీజన్ ట్రెండ్‌కు అద్దంపట్టనున్నాయి.’ అని విశ్లేషించారు. ఎన్నికల వేడి నేపథ్యంలో ఒడిదుడుకులకు ఆస్కారం అధికంగా ఉందన్నారు. ఆర్థిక సేవల రంగంపై దృష్టి అధిక శాతం ఆర్థిక సేవల కంపెనీలు ఈవారంలోనే నాల్గవ త్రైమాసిక ఫలితాలను ప్రకటించనున్నాయి. ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ (సోమవారం).. ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్, ఎం అండ్ ఎం ఫైనాన్షియల్ (బుధవారం) ఫలితాలను వెల్లడించనున్నాయి. యాక్సిస్ బ్యాంక్, ఎస్బీఐ లైఫ్ (గురువారం).. యస్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ లైఫ్, హెచ్డీఎఫ్సీ ఏఎంసీ (శుక్రవారం) ఫలితాలను ప్రకటించనున్నాయి. వాహన దిగ్గజాల్లో మారుతీ(గురువారం), హీరో మోటోకార్ప్(శుక్రవారం) ఫలితాలను ప్రకటించనుండగా.. ఇతర రంగాల దిగ్గజాల్లో ఏసీసీ (మంగళవారం), ఆల్ట్రాటెక్ సిమెంట్, భారతీ ఇన్ఫ్రాటెల్(బుధవారం) టాటా స్టీల్ (గురువారం) వెల్లడించనున్నాయి. అమెరికా–చైనా వాణిజ్య చర్చలు సైతం సూచీలకు సంకేతాలను ఇవ్వనున్నాయని ఎస్ఎమ్సీ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ అడ్వైజర్స్ చైర్మన్ డీ కే అగర్వాల్ అన్నారు. ఏప్రిల్ ఎఫ్ అండ్ ఓ ముగింపు ఈవారంలోనే ఉన్నందున లార్జ్‌క్యాప్ షేర్ల కదలికలు ఈ అంశంపైనే ఆధారపడి ఉన్నట్లు ఎడిల్వీస్ ఇన్వెస్ట్మెంట్ రీసెర్చ్ చీఫ్ మార్కెట్ స్ట్రాటజిస్ట్ సాహిల్ కపూర్ విశ్లేషించారు. ముడిచమురు ధరల ప్రభావం.. గతవారంలో బ్యారెల్ బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ మరింత పెరిగి 72 డాలర్ల స్థాయికి చేరింది. శుక్రవారం 71.95 వద్ద ముగిసింది. ఈ ప్రధాన అంశం ఆధారంగా డాలర్‌తో రూపాయి మారకం విలువ 68.90–69.80 శ్రేణిలో కదలాడవచ్చని ఎడిల్వీస్ సెక్యూరిటీస్ ఫారెక్స్ హెడ్ సజల్ గుప్తా విశ్లేషించారు. మరోవైపు ఏప్రిల్ 19తో అంతమయ్యే వారానికి విదేశీ మారక నిల్వల డేటాతో పాటు ఏప్రిల్ 12 నాటికి డిపాజిట్లు, బ్యాంకు రుణ పెరుగుదల గణాంకాలు శుక్రవారం వెల్లడికానున్నాయి. కొనసాగుతున్న విదేశీ నిధుల వెల్లువ దేశీ మార్కెట్లో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల(ఎఫ్‌పీఐ) పెట్టుబడుల జోరు కొనసాగుతోంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో రూ.11,182 కోట్లు, మార్చిలో రూ.45,981 కోట్లు పెట్టుబడి పెట్టిన వీరు ఏప్రిల్‌లోనూ ఇదే ఉత్సాహాన్ని కొనసాగిస్తున్నారు. గడిచిన రెండు నెలల్లో నికర కొనుగోలుదారులుగా నిలిచిన ఎఫ్‌పీఐలు.. ఈ నెలలో ఇప్పటివరకు (ఏప్రిల్ 1–16 కాలంలో) నికరంగా రూ.11,012 కోట్లు ఇన్వెస్ట్ చేసినట్లు డిపాజిటరీ డేటా ద్వారా వెల్లడయింది. ఈకాలంలో మొత్తంగా రూ.14,300 కోట్లు పెట్టుబడి పెట్టిన వీరు.. డెట్ మార్కెట్ నుంచి రూ.3,288 కోట్లను ఉపసంహరించుకున్నారు. నికరంగా రూ.11,012 కోట్లు ఇన్వెస్ట్ చేసినట్లు నమోదైంది. సెంట్రల్ బ్యాంకుల ద్రవ్య విధాన దృక్పథంమారడం, అంతర్జాతీయంగా ద్రవ్య లభ్యత మెరుగుదలతో ఫిబ్రవరి నుంచి విదేశీ నిధుల వెల్లువ కొనసాగుతుందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ‘భారత్‌లో సుస్థిర ప్రభుత్వం ఏర్పాటుకానుందన్న సానుకూలత కారణంగా పెట్టుబడులు కొనసాగుతున్నాయి’ అని గ్రో సీఈఓ హర్‡్ష జైన్ అన్నారు. ఇతర ఎమర్జింగ్ మార్కెట్లతో పోల్చితే భారత్ మరింత ఆకర్షణీయంగా ఉన్నందున పెట్టుబడులు పెరుగుతున్నాయని మార్నింగ్‌స్టార్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ ఇండియా సీనియర్ అనలిస్ట్ హిమంషు శ్రీవాత్సవ వివరించారు. -
ఫలితాలు, గణాంకాలే దిక్సూచి..!
ముంబై: ఐటీ దిగ్గజాలైన టీసీఎస్, ఇన్ఫోసిస్ ఫలితాల ప్రకటనతో గతేడాది క్యూ4 (జనవరి–మార్చి) సీజన్ ప్రారంభమైంది. శుక్రవారం వెల్లడైన ఈ సంస్థల ఫలితాలు ప్రోత్సాహకరంగా వున్న నేపథ్యంలో.. ఇక మీదట ఫలితాలను ప్రకటించనున్న కంపెనీలపై మార్కెట్ వర్గాలు దృష్టిసారించాయి. ఇదే పాజిటివ్ ట్రెండ్ కొనసాగితే.. వచ్చే కొన్ని రోజుల్లోనే నూతన శిఖరాలను చేరవచ్చని దలాల్ స్ట్రీట్ వర్గాలు భావిస్తున్నాయి. ఇక ఈవారంలో మార్కెట్ కదలికలు ఏవిధంగా ఉండవచ్చనే అంశంపై స్పందించిన ఎడిల్వీస్ ఇన్వెస్ట్మెంట్ రీసెర్చ్ చీఫ్ మార్కెట్ స్ట్రాటజిస్ట్ సాహిల్ కపూర్.. ‘సాధారణ ఎన్నికల కారణంగా భారత వీఐఎక్స్ (వొలటాలిటీ ఇండెక్స్) 20 స్థాయిని అధిగమించింది. ఇది రానున్న రోజుల్లో మార్కెట్ ఒడిదుడుకుల్లో ఉంటుందనేందుకు సంకేతం’ అని విశ్లేషించారు. ప్రస్తుతం దేశ ఆర్థిక వ్యవస్థ బాటమింగ్ అవుట్ అవుతోంది. మెరుగైన ఆర్థిక నిర్వహణతో కూడిన ద్రవ్య పరపతి విధాన సమీక్ష సత్ఫలితాలను ఇవ్వనుందని భావిస్తున్నాం. ఈ కారణంగా మార్కెట్ పడిన ప్రతిసారీ కొనుగోళ్ళు జరపడం మంచి స్ట్రాటజీగా సూచిస్తున్నట్లు చెప్పారాయన. ‘సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఈనెల 18న రెండో దశ పోలింగ్ ప్రారంభంకానుంది. ప్రస్తుత ఎన్నికల వేడిలో... అధికార పార్టీనే మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుందనే అంచనాలు బలంగా కొనసాగుతున్నందున మార్కెట్ మరింత ఉత్సాహంతో ముందుకు వెళ్లనుందని అంచనావేస్తున్నాం’ అని ఎస్ఎమ్సీ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ అడ్వైజర్స్ చైర్మన్ డీ కే అగర్వాల్ అన్నారు. అయితే, ఒడిదుడుకులు మాత్రం కొనసాగుతాయని అంచనావేశారు. మరోవైపు ఈవారంలో ట్రేడింగ్ కేవలం మూడు రోజులకే పరిమితమైంది. మహావీర్ జయంతి సందర్భంగా 17న (బుధవారం) మార్కెట్లకు సెలవు కాగా, 19న (శుక్రవారం) గుడ్ ఫ్రైడే సెలవు ఉన్నట్లు ఎక్సే్ఛంజీలు ప్రకటించాయి. ఆర్ఐఎల్ ఫలితాలు ఈవారంలోనే.. మార్కెట్ విలువ పరంగా దేశీ అతిపెద్ద కంపెనీగా ఎదిగిన రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్ఐఎల్) ఈవారంలోనే క్యూ4 ఫలితాలను ప్రకటించనుంది. ఆయిల్ రిటైల్ నుంచి విభిన్న రంగాల్లో వ్యాపారం కొనసాగిస్తున్న ఈ సంస్థ.. జియో పేరుతో టెలికం రంగంలో దూసుకుపోతోంది. 18న (గురువారం) ఫలితాలను వెల్లడించనుంది. రిఫైనరీ, పెట్రోకెమికల్ విభాగాలు ఫ్లాట్‌గా ఉండేందుకు అవకాశం ఉన్నప్పటికీ.. టెలికం, రిటైల్ విభాగాలు ఎర్నింగ్స్‌కు ఊతం ఇవ్వనున్నాయని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ఇక ఈవారం ఫలితాలను ప్రకటించనున్న దిగ్గజ కంపెనీలను పరిశీలిస్తే.. విప్రో (మంగళవారం), మైండ్‌ట్రీ, క్రిసిల్ (బుధవారం).. ఐసీఐసీఐ లాంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్, ఆర్బీఎల్ బ్యాంక్ (గురువారం), హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (శుక్రవారం) ఫలితాలను ఇవ్వనున్నాయి. ఫలితాల సీజన్ మార్కెట్‌కు దిశా నిర్దేశం చేయనున్నాయని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ పరిశోధన విభాగం హెడ్ వినోద్ నాయర్ అన్నారు. తక్కువ బేస్ ఎఫెక్ట్, కార్పొరేట్ లెండింగ్ బ్యాంకుల లాభదాయకత, ఎనర్జీ రంగ కంపెనీల ఆరోగ్యకర వృద్ధి ప్రధాన సూచీలను నడిపించనున్నాయని షేర్‌ఖాన్ అడ్వైజరీ హెడ్ హేమంగ్ జానీ అన్నారు. స్థూల ఆర్థిక అంశాలపై మార్కెట్ దృష్టి ఈ ఏడాది మార్చి నెల టోకు ధరల సూచీ(డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం, బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ డేటాలను ప్రభుత్వం సోమవారం ప్రకటించనుంది. గురువారం మానిటరీ పాలసీ మినిట్స్, శుక్రవారం విదేశీ మారక నిల్వల డేటా వెల్లడికానున్నాయి. ఇక అంతర్జాతీయ అంశాల పరంగా.. అమెరికా వాణిజ్య గణాంకాలు బుధవారం వెల్లడికానుండగా.. రిటైల్ అమ్మకాల సమాచారం గురువారం వెల్లడికానుంది. జపాన్ సీపీఐ ద్రవ్యోల్బణం శుక్రవారం విడుదలకానుంది. ముడిచమురు ధరల ప్రభావం అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ శుక్రవారం 0.69 శాతం పెరిగింది. 71.52 డాలర్ల వద్ద ముగిసింది. క్రమంగా పెరుగుతూ 70 డాలర్ల స్థాయిని అధిగమించిన క్రూడ్ ధర మరింత పెరిగితే సూచీల ప్రయాణానికి ప్రతికూల అంశంగా మారుతుందని ఎడిల్వీస్ సెక్యూరిటీస్ ఫారెక్స్ హెడ్ సజల్ గుప్తా అన్నారు. కొనసాగుతున్న విదేశీ నిధుల వెల్లువ విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల(ఎఫ్‌పీఐ) పెట్టుబడుల పరంపరా కొనసాగుతోంది. ఫిబ్రవరిలో రూ.11,182 కోట్లు, మార్చిలో రూ.45,981 కోట్లను దేశీ మార్కెట్లలో పెట్టుబడిపెట్టిన వీరు.. ఏప్రిల్‌లో కూడా ఇదే ట్రెండ్‌ను కొనసాగించారు. ఏప్రిల్‌లో ఇప్పటివరకు రూ.11,096 కోట్లను నికరంగా ఇన్వెస్ట్‌చేసినట్లు డిపాజిటరీ డేటా ద్వారా వెల్లడయింది. ఈనెల 1–12 కాలంలో ఈమేరకు పెట్టుబడి పెట్టినట్లు వెల్లడైంది. -
టీసీఎస్ లాభాలు18 శాతం జంప్
సాక్షి, ముంబై : దేశీయ అతిపెద్ద ఐటీసేవల సంస్థ టీసీఎస్ క్యూ4 ఫలితాలను శుక్రవారం ప్రకటించింది. నికర లాభాలు 18 శాతం జంప్ చేశాయి. దీంతో త్రైమాసికంలో రూ. 8126 కోట్ల నికర లాభాలను సాధించింది. గత ఏడాది ఇదే క్వార్టర్లో రూ.6904 కోట్ల నికర లాభాలను నమోదు చేసింది. తద్వారా రూ.7981 కోట్లను సాధించనుందనే విశ్లషకుల అంచనాలను అధిగమించింది. ఆదాయం 38,010 కోట్లుగా ఉంది. అయితే ఆపరేటింగ్ మార్జిన్లు, ఎబిటా మార్జిన్లు(25.1 శాతం) స్వల్పంగా తగ్గాయి. గత 15ఏళ్లలో ఇదే బలమైన క్వార్టర్ అని టీసీఎఎస్ సీఎండీ రాజేష గోపీనాథన్ తెలిపారు. ఆదాయం 38,010 కోట్లుగా ఉంది. డివిడెండ్ ఈక్విటీ షేరుకు 18 రూపాయల చొప్పున తుది డివిడెండ్ చెల్లించేందుకు టీసీఎస్ బోర్డు ఆమోదం తెలిపింది. -
క్యూ4లో అదరగొట్టిన ఇన్ఫీ : కొత్త సీఎఫ్‌వో
సాక్షి,ముంబై : ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ క్యూ4 ఫలితాల్లో అదరగొట్టింది. వార్షిక ప్రాతిపదికన 11శాతం వృద్ధిని నమోదు చేసింది. విశ్లేషకుల అంచనాలను బీట్ చేస్తూ ఈ క్వార్టర్లో 3,857 కోట్ల నికర లాభాలను నమోదు చేసింది. గత ఏడాది ఇదే క్వార్టర్లో రూ.3690 కోట్లను సాధించింది. అయితే గైడెన్స్ విషయంలో నిరాశపర్చింది. శుక్రవారం మార్కెట్ ముగిసిన అనంతరం ప్రకటించిన క్యూ4 ఫలితాల్లో కాన్సిలిడేటెడ్ ప్రాతిపదికన రూ. 4078 కోట్లను నికర లాభాలను ఇన్ఫీ ప్రకటించిది. ఆదాయం రూ. 21,539 కోట్లను సాధించింది. అలాగే కొత్త సీఎఫ్‌వోగా నిలంజన్ రాయ్ నియామకానికి ఇన్ఫీ బోర్డు ఆమోదం తెలిపింది. మార్చి 1, 2019నుంచి ఆయన నియామకం అమల్లో ఉన్నట్టుగా పరిగణిస్తామని బీస్‌ఈ ఫైలింగ్‌లో సంస్థ వెల్లడించింది. ట్రాన్స్ఫర్మేషన్ ప్రయాణంలో మొదటి సంవత్సరం పూర్తి చేశామని ఇన్ఫీ సీఈవో సలీల్ పరేఖ్ పేర్కొన్నారు. డివిడెండ్ షేరుకు 10.50 చొప్పున ప్రతి ఈక్విటీ షేరుకు డివిడెండ్‌ను దేశీయ రెండవ అతిపెద్ద ఐటీ సంస్థ ఇన్ఫోసిస్ ప్రకటించింది. -
సెన్సెక్స్ తక్షణ నిరోధశ్రేణి 39,120–39,270
వెల్లువలా వచ్చిపడుతున్న విదేశీ ఇన్వెస్టర్ల నిధుల కారణంగా వారం రోజుల క్రితమే సెన్సెక్స్ కొత్త రికార్డును నెలకొల్పగా, గతవారం నిఫ్టీ కూడా అదే ఫీట్‌ను సాధించింది. కేవలం నెలరోజుల్లో భారత్ సూచీలు 10 శాతం ర్యాలీ జరపడం విశేషం. ఈ ట్రెండ్ భారత్‌కే పరిమితం కాలేదు. దాదాపు ఇదేస్థాయిలో అమెరికా, జర్మనీ సూచీలు సైతం పెరిగాయి. ఆసియాలో హాంకాంగ్, చైనా ఇండెక్స్‌లు కూడా 5 శాతంపైగానే జంప్‌చేశాయి. అమెరికా కేంద్రబ్యాంక్ ఫెడరల్ రిజర్వ్...వడ్డీ రేట్లపెంపునకు, బాండ్ల కొనుగోళ్ల కార్యక్రమానికి స్వస్తిచెప్పడం... ప్రపంచవ్యాప్తంగా ఈక్విటీల ర్యాలీకి కారణం కావొచ్చు. కానీ, లోక్‌సభ ఎన్నికల పోలింగ్ త్వరలో ప్రారంభం కానుండడం, కార్పొరేట్ క్యూ4 ఫలితాలు వెల్లడి కానుండడం వంటి అంశాల నేపథ్యంలో భారత మార్కెట్ మరింత ముందుకు వెళ్లగలుగుతుందా లేదా అన్న సంశయం ప్రస్తుతం విశ్లేషకుల్లో నెలకొని ఉంది. ఇక మన సూచీల సాంకేతిక అంశాల విషయానికొస్తే... సెన్సెక్స్ సాంకేతికాలు... ఏప్రిల్ 5తో ముగిసిన వారంలో బీఎస్ఈ సెన్సెక్స్ 39,270 పాయింట్ల వద్ద మరో కొత్త రికార్డుస్థాయిని నమోదుచేసిన అనంతరం చివరకు అంతక్రితంవారంతో పోలిస్తే 190 పాయింట్లు పెరిగి 38,862 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ వారం మార్కెట్ పెరిగితే తొలుత 39,120–39,270 పాయింట్ల శ్రేణి నిరోధించవచ్చు. అటుపైన ముగిస్తే వేగంగా 39,500 పాయింట్ల స్థాయిని అందుకోవొచ్చు. ఈ స్థాయిని సైతం అధిగమిస్తే క్రమేపీ 39,850 పాయింట్ల వరకూ ర్యాలీ కొనసాగే ఛాన్స్ వుంది. ఈ వారం తొలి నిరోధశ్రేణిని దాటలేకపోతే 38,700 పాయింట్ల వద్ద తక్షణ మద్దతు లభిస్తున్నది. ఈ స్థాయిని కోల్పోతే వేగంగా 38,580 పాయింట్ల వద్దకు క్షీణించవచ్చు. ఈ స్థాయిని సైతం వదులుకుంటే 38,150 పాయింట్ల వరకు తగ్గొచ్చు. నిఫ్టీ అవరోధశ్రేణి 11,730–11,760 ఎన్ఎస్ఈ నిఫ్టీ 11,761 పాయింట్ల వద్ద కొత్త రికార్డును నెలకొల్పినప్పటికీ, ఆ స్థాయి వద్ద జరిగిన భారీ లాభాల స్వీకరణ కారణంగా 11,559 పాయింట్ల స్థాయికి తగ్గింది. చివరకు అంతక్రితం వారంతో పోలిస్తే 43 పాయింట్ల లాభంతో 11,666 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ వారం మార్కెట్ అప్‌ట్రెండ్ కొనసాగితే తొలుత 11,730–760 పాయింట్ల శ్రేణి నిరోధించవచ్చు. డబుల్టాప్గా పరిణమించిన ఈ శ్రేణిని దాటితేనే తదుపరి అప్‌ట్రెండ్ సాధ్యపడుతుంది. ఆ సందర్బంలో వేగంగా 11,810 పాయింట్ల స్థాయిని అందుకోవొచ్చు. ఈ స్థాయిని కూడా ఛేదిస్తే క్రమేపీ 11,890 పాయింట్ల వరకూ ర్యాలీ కొనసాగవచ్చు. ఈ వారం తొలి అవరోధశ్రేణిని దాటలేకపోతే 11,610 పాయింట్ల వద్ద తక్షణ మద్దతు లభించవచ్చు. ఈ స్థాయిని కోల్పోతే 11,560 పాయింట్ల వద్దకు తగ్గవచ్చు. ఈ స్థాయిని ముగింపులో వదులుకుంటే 11,450 పాయింట్ల వరకు క్షీణించొచ్చు. -
టీవీఎస్ మోటార్ మెరుగైన ఫలితాలు
2018-19 ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో ద్విచక్ర వాహన దిగ్గజం టీవీఎస్ మోటార్ మెరుగైన ఫలితాలను ప్రకటించింది. విశ్లేషకులు అంచనాలను బీట్ చేస్తూ నికర లాభాలను నమోదు చేసింది. ఈ ఏడాది క్యూ3(అక్టోబర్-డిసెంబర్)లో టీవీఎస్ మోటార్ నికర లాభం 15 శాతం ఎగసి రూ. 178 కోట్లను తాకింది. మొత్తం ఆదాయం సైతం 26 శాతం పుంజుకుని రూ. 4664 కోట్లకు చేరింది. ఇబిటా 25 శాతం జంప్‌చేసి రూ. 376 కోట్లకు చేరింది. ఫలితాల నేపథ్యంలో టీవీఎస్ మోటార్ షేరు 3 శాతం పెరిగి రూ. 555 వద్ద ముగిసింది. తమ లేటెస్ట్ వాహనాలను మంచి ఆదరణ లభించిందని కంపెనీ ఫలితాల సందర్భంగా ప్రకటించింది. ఫలితంగా క్యూ3 పోలిస్తే క్యూ4లో మంచి లాభాలనార్జించినట్టు పేర్కొంది. -
అంచనాలను మించిన ఎం అండ్ ఎం
సాక్షి,ముంబై: దేశీయ ఆటో రంగ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా(ఎంఅండ్ఎం) మార్చి త్రైమాసికంలో అంచనాలను మించి ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. గత ఆర్థిక సంవత్సరం(2017-18) చివరి త్రైమాసికంలో 50 శాతం వృద్ధితో రూ. 1,155 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. కాగా నికర లాభం 1,037 కోట్ల రూపాయలుగా ఉండనుందని విశ్లేషకులు అంచనా అంచనా వేశారు. మొత్తం ఆదాయం 26 శాతం పెరిగి రూ. 13,189 కోట్లకు నమోదైంది. నిర్వహణ లాభం మరింత అధికంగా 70 శాతం ఎగసి రూ. 1995 కోట్లను తాకింది. ఇబిటా మార్జిన్లు 15.1 శాతంగా నమోదుకాగా.. ఆటో విభాగం ఆదాయం 20 శాతం పుంజుకుని రూ. 9105 కోట్లకు చేరింది. -
బ్యాంకు ఆఫ్ ఇండియా మరోసారి కుదేలు
సాక్షి, ముంబై: బ్యాంకు ఆఫ్ ఇండియా క్యూ4 ఫలితాల్లో మరోసారి చతికిలబడింది. విశ్లేషకులు అంచనాలను దరిదాపుల్లోకి కూడా రాలేక భారీ నష్టాలను చవి చూసింది. గత ఏడాది నష్టాలకు కొనసాగింపుగా మార్చి 31తో ముగిసిన త్రైమాసికంలో రూ.3969 కోట్ల భారీ నికర నష్టాలను నమోదు చేసింది. గత ఏడాది1045కోట్ల రూపాయల నష్టాలను సాధించింది. కాగా 1187కోట్ల రూపాయల నష్టాలను రిపోర్ట్ చేసే అవకాశం ఉందని ఎనలిస్టులు అంచనా వేశారు. బ్యాడ్ లోన్ల బెడద బ్యాంక్ ఆఫ్ ఇండియాను భారీగా దెబ్బ తీసింది. స్థూల ఎన్పీఏలు మార్చి చివరి నాటికి 16.58 శాతంగా నమోదయ్యాయి, అంతకు ముందు త్రైమాసికంలో 16.93శాతంగా ఉండగా , ఏడాది క్రితం ఇది 13.22శాతంగా ఉన్నాయి. బ్యాడ్ లోన్ల కేటాయింపులు 41 శాతం పెరిగి రూ .6,674 కోట్లకు చేరుకున్నాయి. -
టాటా మెటార్స్, జెట్ ఎయిర్వేస్కు ఫలితాల సెగ
సాక్షి, ముంబై: దేశీ ఆటో దిగ్గజం టాటా మోటార్స్ కు ఫలితాల షాక్ తగిలింది. ఈక్విటీ మార్కెట్లు సెంచరీ లాభాలతో ఊత్సాహకరంగా సాగుతుండగా, టాటా మోటార్స్ భారీగా నష్టాలను మూటగట్టుకుంటోంది. ముఖ్యంగా గత ఏడాది క్యూ4లో నికర లాభాలు 50శాతం క్షీణించడంతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ దెబ్బతింది. భారీ అమ్మకాల ఒత్తిడితో టాటా మోటార్స్ కౌంటర్ 7శాతానికి పతనమై టాప్ లూజర్‌గా నిలిచింది. 52 వారాల కనిష్టం వద్ద ఉంది. విమానయాన సంస్థ జెట్ ఎయిర్వేస్కు ఫలితాల సెగ తాకింది. 6 శాతానికి పైగా పతనమైన జెట్‌ఎయిర్‌వేస్ షేరు 52 వారాల కనిష్టాన్ని తాకింది. గత ఆర్థిక సంవత్సరం(2017-18) చివరి త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించింది. క్యూ4(జనవరి-మార్చి)లో కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన నికర లాభం 50 శాతం క్షీణించి రూ. 2175 కోట్లకు పరిమితమైంది. మొత్తం ఆదాయం మాత్రం 18 శాతం పెరిగి రూ. 91,279 కోట్లను తాకింది. ఇబిటా 4 శాతం పుంజుకుని 11,250 కోట్లకు చేరింది. స్టాండెలోన్ ప్రాతిపదికన టాటా మోటార్స్ నికర నష్టం రూ. 806 కోట్ల నుంచి రూ. 500 కోట్లకు తగ్గింది. అటు జెట్ ఎయిర్‌వేస స్టాండ్‌లోన్ ప్రాతిపదికన 1030కోట్ల రూపాయల నష్టాన్నిప్రకటించింది. మొత్తం ఆదాయం సైతం 3.44 శాతం తగ్గి రూ.6,271 కోట్ల నుంచి రూ.6,055 కోట్లకు పరిమితమైంది. -
కుంభకోణం ఎఫెక్ట్ : ‘పీఎన్బీ’కి భారీ నష్టాలు
ముంబై : ప్రభుత్వ రంగ పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో చోటు చేసుకున్న నీరవ్ మోదీ కుంభకోణం ఆ బ్యాంకును భారీ నష్టాల్లో ముంచెత్తింది. నేడు బ్యాంకు ప్రకటించిన 2017-18 ఆర్థిక సంవత్సరపు మార్చి క్వార్టర్ ఫలితాల్లో దాదాపు రూ.13,416.91 కోట్ల నికర నష్టాన్ని నమోదుచేసింది. అంతకుముందు సంవత్సరం క్యూ4లో బ్యాంకు రూ.261.9 కోట్ల నికర లాభాన్ని ఆర్జించిన సంగతి తెలిసిందే. వజ్రాల వ్యాపారి నీరవ్‌మోదీ, మెహుల్ చౌక్సీ చేసిన 13వేల కోట్ల రూపాయల భారీ స్కాం మూలంగానే ఈ క్వార్టర్లో పీఎన్బీ ఇంత పెద్ద మొత్తంలో నష్టాలను నమోదు చేసిందని అధికారులు తెలిపారు. పీఎన్బీ స్కాం వల్ల గతేడాది క్వార్టర్లో నమోదైన 5,753.3 కోట్ల రూపాయల నష్టం కంటే ఇది మూడు రెట్లు ఎక్కువ. మొండి బకాయిల కేటాయింపులు దాదాపు మూడు రెట్లు పెరిగాయని పీఎన్బీ తన రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది. ఈ కేటాయింపులు రూ.3,908.3 కోట్ల నుంచి రూ.10,080.9 కోట్లకు చేరాయని తెలిపింది. ఫలితంగా మొత్తం ఆదాయం రూ.12,889 కోట్ల నుంచి రూ.11,555 కోట్లకు తగ్గిందని వివరించింది. అలానే మొత్తం రుణాల్లో ఎన్పీఏల వాటా కూడా అధికంగా ఉన్నట్లు తెలిపింది. 2017, డిసెంబర్ నాటికి 12.11 శాతం, 2017 మార్చి చివరి నాటికి 12.5 శాతంగా ఉన్న ఎన్పీఏలు, 2018, మార్చి చివరి నాటికి మొత్తం రుణాల్లో 18.38 శాతానికి పెరిగినట్లు వెల్లడించింది. అంతేకాక ఎన్పీఏల నిష్పత్తి గత క్వార్టర్లో 7.55 శాతం, అంతకుముందు ఏడాది క్వార్టర్లో 7.81 శాతం ఉండగా, ఈ క్వార్టర్లో ఎన్పీఏల నిష్పత్తి 11.24 శాతానికి పెరిగింది. నికర వడ్డీ ఆదాయం, ఇతర ఆదాయాలు... అంతకుముందు ఏడాది ఇదే క్వార్టర్‌కు రూ.3,683.5కోట్లుగా ఉన్న నికర వడ్డీ ఆదాయం ఈ క్వార్టర్లో 16.8శాతం తగ్గి రూ.3,06335కోట్లకు చేరింది. రాయిటర్స్ పోల్ ప్రకారం నికర వడ్డీ ఆదాయం 7శాతం పెరిగి రూ.3,939.7కోట్లు పెరిగిందని అంచనా. -
ఇండియన్ బ్యాంకు ఫలితాలు..ప్చ్..
సాక్షి,ముంబై: ప్రభుత్వ రంగ బ్యాంకు ఇండియన్ బ్యాంకు నిరుత్సాహకర ఫలితాలను ప్రకటించింది. క్యూ4(జనవరి-మార్చి)లో ఇండియన్ బ్యాంక్ నికర లాభం 59 శాతం క్షీణించి రూ. 1,259 కోట్లకు పరిమితమైంది. గత ఏడాది 1405 రూపాయల నికర లాభాలను సాధించింది. మొత్తం ఆదాయం19,520కోట్లుగా నమోదు చేసింది. మార్చి 31, 2018 నాటికి ఇండియన్ బ్యాంక్ స్థూల స్థూల మొండిబకాయిలు(ఎన్పీఏలు) 6.27 శాతం నుంచి 7.37 శాతానికి పెరిగి11,990 కోట్ల రూపాయలుగా ఉంది. నికర ఎన్పీఏలు సైతం 3.3 శాతం నుంచి 3.81 శాతం పెరిగి 5,960.57 కోట్ల రూపాయలుగా ఉంది. నికర వడ్డీ ఆదాయం(ఎన్ఐఐ) మాత్రం 18 శాతం పెరిగి రూ. 1638 కోట్లకు చేరింది. మొండి రుణాలకుగాను రూ. 1770 కోట్ల మేర ప్రొవిజన్లు చేపట్టింది. మరోవైపు రూ .10 ముఖ విలువ కలిగిన ఈక్విటీ షేరుకు రూ .6 డివిడెండ్ చెల్లించేందుకు బోర్డ్ ప్రతిపాదించింది. -
ఐసీఐసీఐ బ్యాంకు లాభాలు ఢమాల్
సాక్షి, ముంబై: వీడియోకాన్ రుణవివాదంలో ఇరుక్కున్న ప్రయివేటు బ్యాంకు దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంకు క్యూ 4 ఫలితాల్లో ఢమాల్ అంది. బ్యాడ్ లోన్ల బెడదతో అతిపెద్ద ప్రైవేటు బ్యాంకు నాలుగో త్రైమాసికంలో నికర లాభాలు సగానికి పడిపోయాయి. విశ్లేషకులు అంచనాలను అందుకోలేని బ్యాంకు క్యూ 4 నికర లాభం రూ. 1,020 కోట్లుగా నమోదైంది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో ఆర్జించిన నికర లాభం రూ.2,025 కోట్లు. నెట్ వడ్డీ ఆదాయం సంవత్సరానికి 1 శాతం పెరిగి 6,022 కోట్లుగా ఉంది. నికర వడ్డీ మార్జిన్ 3.24 శాతం పెరిగింది. గత త్రైమాసికంలోని 7.82 శాతంతో పోలీస్తే ఈక్వార్టర్లో మొత్తం రుణాలు 8.84శాతంగా ఉన్నాయి. అంతకుముందు ఏడాది ఇది 7.89 శాతంగా నమోదైంది. సోమవారం మార్కెట్ ముగిసిన తరువాత ప్రకటించిన ఫలితాల్లో బ్యాంకు వాటాదారులకు 2 ముఖ విలువ కలిగిన ఈక్విటీ షేరుకు 1.50రూపాయలుచొప్పున డివిడెండ్చెల్లించేందకు ప్రతిపాదించినట్టు వెల్లడించింది. ఆగస్టు 10న తుది నిర్ణయం ఉంటుందని తెలిపింది. ఇది ఇలా ఉంటే వీడియోకాన్ వివాదం తరువాత మొదటిసారి ఐసీఐసీఐ బ్యాంకు సీఈవో చందా కొచర్ ఫలితాల సందర్భంగా తొలిసారి మీడియాముందుకు వచ్చారు. ఈ వివాదంలో బోర్డు తనవైఖరిని వెల్లడించిందని,దర్యాప్తులో విచారణ సంస్థలకు పూర్తిగా సహకరిస్తున్నట్టు ఆమె వెల్లడించారు. -
దెబ్బ మీద దెబ్బ: ఇండిగో భారీ పతనం
సాక్షి, ముంబై: దేశీయ విమానయాన సేవల సంస్థ ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్‌కు అటు అధ్యక్షుడు రాజీనామా, ఇటు ఫలితాల షాక్ భారీగా తగిలింది. గత ఆర్థిక సంవత్సరం(2017-18) చివరి త్రైమాసికంలో సాధించిన ఫలితాలు ఇన్వెస్టర్లను నిరాశపరచడంతో ఈ కౌంటర్లో అమ్మకాలకు తెరలేచింది. దీంతో ఇండిగో షేరు 18 శాతానికి పైగా కుప్పకూలింది. 2016 జనవరి తరువాత ఇదే అదపెద్ద పతనమని మార్కెట్ వర్గాలు విశ్లేషించాయి. ముఖ్యంగా ఇండిగో అధ్యక్షుడు ఆదిత్య ఘోష్ రాజీనామా తర్వాత షేర్లు 26 ఏప్రిల్ నుంచి తగ్గుముఖం పట్టాయి. 26శాతం క్షీణించి దాదాపు రూ. 13650 కోట్ల విలువైన మార్కెట్ విలువ కోల్పోయింది. క్యూ4 ఫలితాల దెబ్బ క్యూ4(జనవరి-మార్చి)లో ఇండిగో నికర లాభం 75 శాతం పతనమై 118 కోట్ల రూపాయలను నమోదు చేసింది. నిర్వహణ, ఇంధన వ్యయాలు పెరగడం దీనికి కారణంమని ఇండిగో మార్కెట్ ఫైలింగ్‌లో పేర్కొంది. మొత్తం ఆదాయం మాత్రం 18 శాతం ఎగసి రూ. 6057 కోట్లకు చేరింది. ఇంధన వ్యయాలు రూ. 1751 కోట్ల నుంచి 2338 కోట్లకు పెరిగినట్లు కంపెనీ వెల్లడించింది. అయితే గత ఏడాది ఇదే త్రైమాసికంలో రెవెన్యూ 17.8 శాతం పెరిగి రూ .5,141.99 కోట్లనుంచి రూ .656.84 కోట్లను ఆర్జించింది. ఈ త్రైమాసికంలో ఇంధన వ్యయం రూ .2,338 కోట్లు పెరిగి రూ .1,751 కోట్లకు చేరుకుంది. -
భారీగా కుప్పకూలిన ఐడియా
న్యూఢిల్లీ : ఆదిత్య బిర్లాకు చెందిన ఐడియా సెల్యులార్ కంపెనీ మరోసారి భారీగా కుప్పకూలింది. కంపెనీ కన్సాలిడేట్ నికర నష్టాలు మూడింతలు మేర ఎగిశాయి. నేడు ప్రకటించిన మార్చి క్వార్టర్ ఫలితాల్లో కంపెనీ కన్సాలిడేటెడ్ నికర నష్టాలు రూ.962.20 కోట్లగా ఉన్నట్టు ప్రకటించింది. గతేడాది ఇదే క్వార్టర్లో కంపెనీ నికర నష్టాలు రూ.327.70 కోట్లగా ఉన్న సంగతి తెలిసిందే. గతేడాది కంటే ఈ ఏడాది ఐడియాకు నష్టాలు మరింతగా పెరిగాయి. క్వార్టర్ సమీక్షలో కంపెనీ మొత్తం ఆదాయం ఏడాది ఏడాదికి 22 శాతం తగ్గి రూ.6387.70 కోట్లగా రికార్డైంది. గతేడాది ఇది రూ.8,194.50 కోట్లగా ఉంది. ఏడాది వ్యాప్తంగా కంపెనీ నష్టాలు రూ.4168.20 కోట్లగా ఉన్నట్టు ఐడియా ప్రకటించింది. ఐడియా ఆర్పూ(యావరేజ్ రెవెన్యూ ఫర్ యూజర్) కూడా 114 రూపాయల నుంచి 105 రూపాయలకు తగ్గింది. ఇతర టెలికాం కంపెనీల ఆర్పూలతో పోలిస్తే ఐడియాదే తక్కువ. జియో ఆర్పూ 137 రూపాయలుండగా.. భారతీ ఎయిర్టెల్ ఆర్పూ 116 రూపాయలుగా ఉంది. ఐడియా సెల్యులార్ ఇలా నష్టాలు ప్రకటించడం వరుసగా ఇది ఆరోసారి. దేశీయంగా, అంతర్జాతీయంగా ఎంటీసీ సెటిల్మెంట్ రేటు భారీగా తగ్గడం, ఎక్కువ ఆర్పూ అందించే కన్జ్యూమర్లు, తక్కువ ధర కలిగిన అపరిమిత వాయిస్ డేటా ప్లాన్ల వైపు తరలివెళ్లడం ఐడియా స్థూల రెవెన్యూలపై ప్రభావం చూపినట్టు కంపెనీ ప్రకటించింది. కాగ, టెలికాం మార్కెట్లో నెలకొన్న తీవ్ర పోటీకర వాతావరణ నేపథ్యంలో ఐడియా, వొడాఫోన్లు జత కట్టబోతున్న సంగతి తెలిసిందే. ఈ రెండు కంపెనీలు ఈ ఏడాది ప్రథమార్థంలో ఒకటి కాబోతున్నాయి. ఫలితాల ప్రకటన నేపథ్యంలో ఐడియా కంపెనీ స్టాక్ 0.66 శాతం పెరిగి రూ.68.80 వద్ద ముగిసింది. -
ఫలితాలు, క్రూడ్ ధర కీలకం..
న్యూఢిల్లీ: ఈ వారంలో వెలువడే రిలయన్స్ ఇండస్ట్రీస్, భారతీ ఎయిర్టెల్, విప్రో వంటి దిగ్గజ కంపెనీల క్యూ4 ఫలితాలు మార్కెట్‌కు కీలకమని నిపుణులంటున్నారు. వీటితో పాటు అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల గమనం, ప్రపంచ మార్కెట్ల పోకడ, దేశీ, విదేశీ ఇన్వెస్టర్ల కొనుగోళ్ల సరళి, డాలర్‌తో రూపాయి మారకం తదితర అంశాలు కూడా మార్కెట్‌పై ప్రభావం చూపుతాయని వారంటున్నారు. ఈ నెల డెరివేటివ్స్ కాంట్రాక్టులు ఈ గురువారం ముగుస్తున్నందున మార్కెట్లో ఒడిదుడుకులు చోటు చేసుకోవచ్చని విశ్లేషకులంటున్నారు. క్యూ4 ఫలితాలు.. ఈ వారంలో మొత్తం 120కంపెనీలు ఆర్థిక ఫలితాలను వెల్లడిస్తున్నాయి. నేడు (సోమవారం) భారతీ ఇన్ఫ్రాటెల్, ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్, రిలయన్స్ ఇన్ఫ్రా తమ క్యూ4 ఫలితాలను వెల్లడిస్తాయి. రేపు(మంగళవారం–ఈ నెల 24న) భారతీ ఎయిర్టెల్, ఐడీఎఫ్సీ బ్యాంక్, బుధవారం (ఈ నెల 25న) విప్రో, ఆల్ట్రాటెక్ సిమెంట్, ఈ నెల 26న(గురువారం) యాక్సిస్ బ్యాంక్, బయోకాన్, యస్‌బ్యాంక్‌లు, ఈ శుక్రవారం(ఈ నెల 27న) రిలయన్స్ మారుతీ, ఐడీఎఫ్‌సీలు క్యూ4 ఫలితాలను వెల్లడిస్తాయి. పరిమిత శ్రేణిలో మార్కెట్... రానున్న ఎన్నికల షెడ్యూల్‌పై మార్కెట్‌పై దృష్టి ఉంటుందని కోటక్ సెక్యూరిటీస్ రీసెర్చ్ వైస్–ప్రెసిడెంట్ టీనా వీర్మాణి చెప్పారు. కంపెనీల క్యూ4 ఫలితాలు, బాండ్ల రాబడులు, ముడి చమురు ధరల గమనం కూడా మార్కెట్‌కు ముఖ్యమైన అంశాలేనని పేర్కొన్నారు. పెరుగుతున్న ముడి చమురు ధరలు కేంద్ర ప్రభుత్వ ద్రవ్య, కరంట్ అకౌంట్ లోటు అంచనాలను కకావికలం చేస్తాయని వివరించారు. ఈ వారంలో షేర్ వారీ కదలికలు ఉంటాయని ఎపిక్ రీసెర్చ్ సీఈఓ ముస్తఫా నదీమ్ చెప్పారు. చాలా కంపెనీలు క్యూ4 ఫలితాలను వెల్లడించనున్నాయని, ఈ ఫలితాలను బట్టి షేర్ల ధరలు అడ్జస్ట్ అవుతాయని పేర్కొన్నారు. ఏప్రిల్ సిరీస్ ఫ్యూచర్స్, ఆప్షన్ల కాంట్రాక్టులు ఈ గురువారం ముగియనుండడం, పలు కంపెనీలు తమ వార్షిక ఫలితాలను వెల్లడిస్తుండటంతో మార్కెట్లో ఒడిదుడుకులు చోటు చేసుకుంటాయని రిలయన్స్ సెక్యూరిటీస్ సీనియర్ ఎనలిస్ట్ వికాస్ జైన్ పేర్కొన్నారు. సిరియాపై అమెరికా దాడుల వంటి అంతర్జాతీయ ఉద్రిక్తతలు, రూపాయి పతనం, కర్నాటక ఎన్ని కలు సమీపిస్తుండడం వంటి కారణాల వల్ల మార్కెట్ పరిమిత శ్రేణిలోనే చలిస్తుందని శామ్కో సెక్యూరిటీస్ సీఈఓ జిమిత్ మోదీ అంచనా వేస్తున్నారు. -
ఇన్ఫీ బోణీ బాగుంది!
బెంగళూరు: దేశంలో రెండో అతిపెద్ద ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్... మెరుగైన ఫలితాలతో బోణీ చేసింది. గడిచిన ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికం(2017–18, క్యూ4)లో రూ.3,690 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని ఆర్జించింది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో లాభం రూ.3,603 కోట్ల తో పోలిస్తే లాభం 2.4 శాతం వృద్ధి చెందింది. ఇక కంపెనీ మొత్తం ఆదాయం కూడా 5.6 శాతం వృద్ధితో రూ.17,120 కోట్ల నుంచి రూ.18,083 కోట్లకు ఎగబాకింది. మార్కెట్ విశ్లేషకులు క్యూ4లో కంపెనీ రూ.3,670 కోట్ల నికర లాభాన్ని నమోదు చేయొచ్చని అంచనా వేశారు. దీనికి అనుగుణంగానే ఫలితాలు వెలువడ్డాయి. కొత్త సీఈఓ సలీల్ పరేఖ్ నేతృత్వంలో తొలిసారిగా పూర్తిస్థాయి త్రైమాసిక ఫలితాలను కంపెనీ ప్రకటించింది. శుక్రవారం బీఎస్ఈలో ఇన్ఫోసిస్ షేరు 0.58% లాభంతో రూ.1,169 వద్ద ముగిసింది. మార్కెట్ ముగిసిన తర్వాత ఫలితాలు వెల్లడయ్యాయి. సీక్వెన్షియల్‌గా... 2017–18 ఏడాది మూడో త్రైమాసికంతో పోలిస్తే (రూ.5,129 కోట్లు) సీక్వెన్షియల్ ప్రాతిపదికన క్యూ4లో ఇన్ఫీ నికర లాభం 28 శాతం తగ్గింది. దీనికి ప్రధానంగా క్యూ3లో అమెరికాలో పన్ను ప్రయోజనం 22.5 కోట్ల డాలర్ల మేర లభించడమే కారణం. ఇక మొత్తం ఆదాయం సీక్వెన్షియల్‌గా 1.6 శాతం వృద్ధి చెందింది. క్యూ3లో ఆదాయం 17,794 కోట్లుగా నమోదైంది. పూర్తి ఏడాదికి... 2017–18 పూర్తి ఆర్థిక సంవత్సరంలో ఇన్ఫోసిస్ కన్సాలిడేటెడ్ నికర లాభం రూ.16,029 కోట్లకు ఎగబాకింది. 2016–17లో లాభం రూ.14,353 కోట్లతో పోలిస్తే 11.7 శాతం పెరిగింది. మొత్తం ఆదాయం గడిచిన ఆర్థిక సంవత్సరంలో 3 శాతం వృద్ధితో రూ.70,522 కోట్లుగా నమోదైంది. 2016–17లో ఆదాయం రూ.68,684 కోట్లు. గైడెన్స్ ఇలా... ప్రస్తుత 2018–19 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ ఆదాయం(స్థిర కరెన్సీ ప్రాతిపదికన) 6–8 శాతం వృద్ధి చెందవచ్చని ఇన్ఫోసిస్ గైడెన్స్ ఇచ్చింది. ఇక డాలరు రూపేణా ఆదాయం 7–9 శాతం పెరుగుతుందని లెక్కగట్టింది. డివిడెండ్ బొనాంజా... గడిచిన ఆర్థిక సంవత్సరానికి(2017–18) గాను రూ.5 ముఖ విలువ గల ఒక్కో షేరుపై రూ.20.5 చొప్పున తుది డివిడెండ్‌ను, అదేవిధంగా రూ.10 చొప్పున ప్రత్యేక డివిడెండ్‌ను కంపెనీ డైరెక్టర్ల బోర్డు సిఫార్సు చేసింది. ప్రతి ఏటా వచ్చే లాభాల్లో(ఫ్రీ క్యాష్ ఫ్లో) 70 శాతాన్ని ఇన్వెస్టర్లకు పంచాలన్న ప్రస్తుత పాలసీని కొనసాగించాలని నిర్ణయించింది. దీంతోపాటు నగదు నిల్వల్లో రూ.13,000 కోట్ల వరకూ మొత్తాన్ని వాటాదారులకు చెల్లించాలని నిర్ణయించింది. దీనిలో రూ.2,600 కోట్లను ఈ ఏడాది(2018) జూన్‌లో రూ.10 ప్రత్యేక డివిడెండ్ రూపంలో ఇవ్వనుంది. మిగతా రూ.10,400 కోట్లను ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2018–19)లో బోర్డు నిర్ణయించిన విధానంలో వాటాదారులకు చెల్లించనున్నారు. క్యూ4లో ఆదాయ వృద్ధి, లాభదాయకత, నగదు ప్రవాహం విషయంలో కంపెనీ మంచి పురోగతిని సాధించింది. క్లయింట్లతో పటిష్టమైన సంబంధాలు, మా ఉద్యోగుల నిబద్ధతే ఈ మెరుగైన పనితీరుకు దోహదం చేసింది. డిజిటల్ వ్యాపారాన్ని మరింత పెంచడం; ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)–ఆటోమేషన్ ద్వారా క్లయింట్లకు సాంకేతికంగా తోడ్పాటు; ఉద్యోగుల నైపుణ్యాలను సానబట్టడం; అమెరికా, యూరప్, ఆస్ట్రేలియా వంటి మార్కెట్లలో స్థానికతను విస్తరించడం వంటి నాలుగు కీలక అంశాలతో కంపెనీ వ్యూహాత్మకంగా ముందుకెళ్తుంది. – సలీల్ పరేఖ్, ఇన్ఫోసిస్ సీఈఓ–ఎండీ ఏప్రిల్ 1 నుంచి జీతాలు పెంపు... ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి అమలయ్యే విధంగా దాదాపు సిబ్బంది అందరికీ(85 శాతం వరకూ) ఓ మోస్తరు నుంచి మెరుగ్గానే(హై సింగిల్ డిజిట్) వేతనాలను పెంచనున్నామని ఇన్ఫోసిస్ సీఓఓ ప్రవీణ్ రావు పేర్కొన్నారు. మిగిలిన ఉద్యోగులకు ముఖ్యంగా మధ్యస్థాయి, సీనియర్ మేనేజ్మెంట్కు జూలై 1 నుంచి జీతాల పెంపు ఉంటుందని చెప్పారు. ఆన్సైట్, ఆఫ్‌షోర్ సిబ్బంది అందరికీ ఇది వర్తిస్తుందన్నారు. ఈ ఏడాది మార్చి నాటికి కంపెనీలో ఉద్యోగుల సంఖ్య 2,04,107కు చేరింది. క్యూ4లో స్థూలంగా 12,329 మంది, నికరంగా 2,416 మంది ఉద్యోగులు జతయ్యారు. కిరణ్ మజుందార్ షాను ప్రధాన ఇండిపెండెంట్ డైరెక్టర్‌గా కంపెనీ నియమించింది. క్యూ4లో డిజిటల్ సేవల విభాగం ఆదాయం 26.8 శాతం వృద్ధి చెందింది. 90.5 కోట్ల డాలర్ల విలువైన 10 పెద్ద కాంట్రాక్టులను దక్కించుకున్నట్లు రావు తెలిపారు. 2017–18లో మొత్తం కొత్త కాంట్రాక్టుల విలువ 3 బిలియన్ డాలర్లుగా నమోదైందని వివరించారు. పనయా, స్కవా విక్రయం... కంపెనీ అనుబంధ సంస్థలైన స్కవా, పనయాలను విక్రయించాలని ఇన్ఫోసిస్ నిర్ణయించింది. తగిన కొనుగోలుదారులను గుర్తించేపనిలోపడింది. ఈ అమ్మకాన్ని ఈ 2019 మార్చికల్లా పూర్తిచేయాలని భావిస్తోంది. ఈ రెండింటికీ కలిపి రూ.2,060 కోట్ల ఆస్తులు, రూ.324 కోట్ల రుణాలు ఉన్నాయి. కాగా, ఇజ్రాయెల్‌కు చెందిన పనయా కొనుగోలులో(20 కోట్ల డాలర్ల మొత్తానికి) అవకతవకలు చోటుచేసుకున్నాయంటూ వెలుగులోకి రావడంతో ప్రమోటర్లు అప్పటి కంపెనీ యాజమాన్యంపై తీవ్ర ఆరోపణలు, అసంతృప్తి వ్యక్తం చేయడం తెలిసిందే. కార్పొరేట్ గవర్నెన్స్ లోపాలకు సంబంధించి ప్రమోటర్లతో విభేదాల కారణంగా విశాల్ సిక్కా గతేడాది ఆగస్టులో కంపెనీకి అర్ధంతరంగా గుడ్‌బై చెప్పడంతో ఆ స్థానంలో సలీల్ పరేఖ్‌ను కొత్త సీఈఓగా నియమించారు. సిక్కా, పరేఖ్ ఇద్దరూ ఇన్ఫోసిస్‌కు ప్రమోటర్‌యేతర సీఈఓలే కావడం గమనార్హం. అమెరికా కంపెనీ కొనుగోలు... ఆమెరికాకు చెందిన డిజిటల్ సేవల కంపెనీ ‘వాంగ్డూడీ’ని కొనుగోలు చేయనున్నట్లు ఇన్ఫీ ప్రకటించింది. ఈ డీల్ విలువ దాదాపు 7.5 కోట్ల డాలర్లు(సుమారు రూ.490 కోట్లు) ఉంటుందని, ఈ మేరకు ఇరు కంపెనీల మధ్య శుక్రవారం ఒప్పందం కుదిరినట్లు వెల్లడించింది. ఈ కొనుగోలుతో తమ సృజనాత్మక, బ్రాండింగ్, కస్టమర్ సేవల సామర్థ్యాలు మరింత పటిష్టం అవుతాయని... ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో డీల్ పూర్తయ్యే అవకాశం ఉన్నట్లు ఇన్ఫీ తెలిపింది. -
అదరగొట్టిన ఇన్ఫీ : భారీ డివిడెండ్
సాక్షి, ముంబై: సాఫ్ట్వేర్ సేవల దేశీ దిగ్గజం ఇన్ఫోసిస్ టెక్నాలజీస్ క్యూ4 ఫలితాల్లో అంచనాలను మించిన ఫలితాలను నమోదు చేసింది. మార్చితో ముగిసిన గతేడాది(2017-18) చివరి త్రైమాసిక ఫలితాలను శుక్రవారం ప్రకటించింది. క్యూ4(జనవరి-మార్చి)లో ఇన్ఫోసిస్ ఏకీకృత నికర లాభం రూ. 3690 కోట్లను సాధించింది. ఆదాయం 5.6 శాతం పెరిగి రూ .18,083 కోట్లకు చేరింది. క్యూ3 ఆదాయం రూ. 17794 కోట్లతో పోల్చితే 1.6 శాతం పెరుగుదలను నమోదు చేసింది. ఎబిటా మార్జిన్లు 24.3శాతంగా ఉన్నాయి. డాలర్ ఆదాయం 2805 కోట్లుగాను, రూపాయి ఆదాయం రూ. 18,083 కోట్లుగాను ఉంది. ఇన్ఫోసిస్ సీఈవోగా సలీల్ పరీఖ్ తన తొలి త్రైమాసిక ఫలితాలను ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మార్చి 2019 నాటికి స్కావా, పనయాల విక్రయాల పూర్తి చేయాలని భావిస్తోందని వెల్లడించారు. అలాగే రెవెన్యూ గైడెన్స్‌ను కూడా7-9 శాతంగా నిర్ణయించినట్టు చెప్పారు. మరోవైపు ఈక్విటీ షేరుకు 20.50 చొప్పున తుది డివిడెండ్ ప్రకటించింది. గత ఏడాదితో పోలిస్తే ఈ ఆర్థిక సంవత్సరం డివిడెండ్ 30శాతం ఎక్కువని ఇన్ఫీ తెలిపింది. కాగా ఇవాల్టి మార్కెట్ ముగింపులో ఇన్ఫోసిస్ షేరు స్వల్ప లాభాలతో రూ. 1168 వద్ద ముగిసింది. -
కార్పొరేట్లకు క్యూ4 కిక్!!
ముంబై: నిఫ్టీ 50 కంపెనీల గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక ఆర్థిక ఫలితాలు ఆశావహంగానే ఉండొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ కంపెనీల నికర లాభాలు వరుసగా మూడో క్వార్టర్లోనూ రెండంకెల వృద్ధి సాధించవచ్చని వారంటున్నారు. వచ్చే వారం నుంచి గత ఆర్థిక సంవత్సరానికి చెందిన చివరి క్వార్టర్(మార్చి క్వార్టర్–క్యూ4) ఫలితాలు వెల్లడి కానున్న నేపథ్యంలో నిఫ్టీ 50 కంపెనీల ఫలితాలపై విశ్లేషకుల అంచనా. పెద్ద కరెన్సీ నోట్ల రద్దు కారణంగా అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో కంపెనీల ఆర్థిక ఫలితాలు అంతంతమాత్రంగానే ఉన్నాయి. ఈ లో బేస్ ఎఫెక్ట్ కారణంగా గత ఆర్థిక సంవత్సరం క్యూ4 ఫలితాలు బాగా ఉండొచ్చు. ముఖ్యంగా వాహన, బ్యాంక్, ఫైనాన్స్, కన్సూమర్, లోహ రంగాలు మంచి ఫలితాలను ప్రకటించవచ్చు. గత ఆర్థిక సంవత్సరం క్యూ2, క్యూ3 ఫలితాలతో పోల్చితే క్యూ4 ఫలితాల్లో లాభాల వృద్ధి అధికంగానే ఉంటుంది. ఇక నికర అమ్మకాలు 8%, నిర్వహణ లాభం 16% మేర పెరిగే అవకాశాలున్నాయి. గత ఆర్థిక సంవత్సరం క్యూ2, క్యూ3ల్లో ఉన్నట్లుగానే నిర్వహణ మార్జిన్ కూడా 20% రేంజ్లో ఉండొచ్చు. మొత్తం మీద ఫలితాలు బాగా ఉంటాయి. వాహన, కన్సూమర్ గూడ్స్, రిటైల్ రుణాలు అధికంగా ఇచ్చిన బ్యాంక్‌లు, ఆర్థిక సేవల కంపెనీలు, లోహ షేర్ల కంపెనీల ఫలితాలు అంచనాలను మించుతాయి. మరోవైపు ప్రభుత్వ రంగ బ్యాంకులు, కార్పొరేట్ రుణాలు అధికంగా ఇచ్చిన బ్యాంక్‌లు, ఆర్థిక సంస్థల ఐటీ, ఫార్మా, టెలికం రంగ కంపెనీలు బలహీన ఫలితాలను వెల్లడించవచ్చు. రంగాల వారీగా చూస్తే... వాహన రంగం: రీప్లేస్మెంట్ డిమాండ్ పుంజుకోవడం, వినియోగదారుల సెంటిమెంట్ మెరుగుపడటంతో క్యూ4లో వాహన కంపెనీల అమ్మకాలు 13–15% పెరిగాయి. కొన్ని కంపెనీలు వాహన ధరలను పెంచడంతో ఆదాయ వృద్ధి పటిష్టంగానే ఉండొచ్చు. ముడి పదార్థాల ధరలు పెరగడంతో మార్జిన్ ఒకింత తగ్గవచ్చు. క్యాపిటల్ గూడ్స్: ఆగిపోయిన ప్రాజెక్ట్‌లు మళ్లీ పట్టాలకెక్కడం క్యాపిటల్ గూడ్స్ కంపెనీలకు ప్రయోజనం కలిగించే అంశమే. ప్రాజెక్ట్‌ల అమలు బాగా ఉండడం, కొత్త ఆర్డర్లు రావడంతో దేశంలోనే అతి పెద్ద మౌలిక రంగ కంపెనీ ఎల్ అండ్ టీ ఫలితాలు అంచనాలను మించవచ్చు. ప్రారంభించిన ప్రాజెక్ట్‌లు అధికంగా ఉండడం, మూలధన వ్యయం కూడా చెప్పుకోదగిన స్థాయిలో ఉండటం వల్ల పవర్ గ్రిడ్ కార్పొరేషన్ కూడా మంచి ఫలితాలనే ప్రకటించవచ్చు. ఎఫ్ఎమ్సీజీ: పెద్ద కరెన్సీ నోట్ల రద్దు అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం క్యూ4లో ఎఫ్ఎమ్సీజీ కంపెనీలపై తీవ్రమైన ప్రతికూల ప్రభావం చూపించింది. ఈ లో బేస్ ఎఫెక్ట్‌కు తోడు జీఎస్టీ అమలు కారణంగా అసంఘటిత రంగం నుంచి సంఘటిత రంగం కంపెనీలకు మార్కెట్ వాటా బదిలీ కావడం కూడా తోడవడంతో మార్చి క్వార్టర్లో ఎఫ్ఎమ్సీజీ కంపెనీలకు అనుకూలించనున్నది. ఫలితంగా ఎఫ్ఎమ్సీజీ కంపెనీల నికర అమ్మకాలు రెండంకెల వృద్ధిని సాధించవచ్చు. మార్జిన్లు కూడా మరింతగా పెరుగుతాయి. ఐటీసీ విషయానికొస్తే, సిగరెట్ల అమ్మకాలు తగ్గిన ప్రభావాన్ని ధరలు సగటున 12 శాతం మేర పెరగడం భర్తీ చేయవచ్చు. లోహ, మైనింగ్: ఈ ఏడాది మార్చి క్వార్టర్లో స్టీల్‌కు దేశీయంగా డిమాండ్ జోరుగా ఉంది. ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరి నెలల్లో వినియోగం 7% పెరిగింది. దీనికి తోడు కంపెనీలు ధరలు పెంచడం కూడా కలసి రావడంతో కంపెనీల ఆదాయం రెండంకెల వృద్ధి చెందే అవకాశాలున్నాయి. ధరలు 10% పెరగడంతో అల్యూమినియమ్ కంపెనీలు కూడా మంచి ఫలితాలనే ప్రకటించవచ్చు. బ్యాంకింగ్, ఫైనాన్స్: కార్పొరేట్ రుణాల కంటే రిటైల్ రుణాలకే ప్రాధాన్యత ఇచ్చే బ్యాంక్‌లు, ఫైనాన్స్ కంపెనీలు ఫలితాలు బాగా ఉంటాయి. ఇక కార్పొరేట్ రుణాలు అధికంగా ఇచ్చిన బ్యాంక్‌ల మొండి బకాయిలు ఒకింత తగ్గే అవకాశాలు ఉన్నాయి. సిమెంట్: గత ఆర్థిక సంవత్సరం మార్చి క్వార్టర్లో సిమెంట్ ధరలు 1% పెరిగాయి. ఇసుక కొరత కారణంగా ఉత్తరాదిన డిమాండ్ బలహీనంగా ఉంది. మహారాష్ట్ర, ఉత్తర ప్రదేశ్, బిహార్, తమిళనాడుల్లో డిమాండ్ అధికంగా ఉంది. దేశంలోనే అతి పెద్ద సిమెంట్ కంపెనీ, దేశవ్యాప్తంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న కంపెనీ.. నిఫ్టీ సూచీలో సిమెంట్ రంగానికి చెందిన ఏకైక కంపెనీ అల్ట్రాటెక్ సిమెంట్ కంపెనీ ఆదాయం దాదాపు రెట్టింపయ్యే అవకాశం ఉంది. విద్యుత్తు: మార్చి క్వార్టర్లో విద్యుదుత్పత్తి 4% పెరిగింది. బొగ్గు కొరత ఉన్నప్పటికీ, బొగ్గు ఆధారిత విద్యుదుత్పత్తి 5% వృద్ధి చెందింది. బొగ్గు, విద్యుత్తుతో సంబంధమున్న కోల్ ఇండియా, ఎన్టీపీసీ ల ఆదాయం, లాభాలు ఒక అంకె స్థాయిలోనే పెరగవచ్చు. ఐటీ: సాధారణంగా మార్చి క్వార్టర్ ఐటీ కంపెనీలకు బలహీనంగా ఉంటుంది. ప్రతి ఏడాది మార్చి క్వార్టర్లలోనే క్లయింట్లు ఐటీ బడ్జెట్లను పునర్వ్యవస్థీకరిస్తారు. డాలర్లలో ఆదాయం సీక్వెన్షియల్‌గా 2 శాతం తగ్గొచ్చు. డాలర్, పౌండ్ వంటి ప్రధాన కరెన్సీలతో పోల్చితే రూపాయి బలహీనత నిర్వహణ మార్జిన్లను సపోర్ట్ చేయవచ్చు. ఫార్మా: ఫార్మా రంగానికి గత ఆర్థిక సంవత్సరం క్యూ4 కూడా పీడకలేనని చెప్పవచ్చు. అమెరికా వ్యాపారంపై ఆధారపడిన పలు ఫార్మా కంపెనీల ఫలితాలు అంతంత మాత్రంగానే ఉండొచ్చు. ఆదాయ వృద్ధి ఉంటే, గింటే ఒక అంకె రేంజ్‌లోనే ఉంటుంది. టెలికం: మార్చి క్వార్టర్లో బలహీన ఫలితాలనే వెల్లడిస్తాయి. ఈ రంగంలో విలీనాలు చోటుచేసుకుంటున్నప్పటికీ, ఆ ఫలాలు టెల్కోల లాభాల్లో ప్రతిఫలించడానికి మరికొంత కాలం పడుతుంది. మరోవైపు జియోతో తీవ్రమైన పోరు కారణంగా టెలికం కంపెనీలు ఆదాయాలు, లాభాలపై ఒత్తిడి ఈ క్వార్టర్లోనూ కొనసాగుతుంది. -
జీడీపీ డేటా, ఫలితాలు కీలకం...
⇔ చివరి దశ క్యూ4 ఫలితాలు ⇔ రుతుపవనాల పురోగతి ⇔ ఈ వారం మార్కెట్ పభావిత అంశాలు ఈ వారంలో వెలువడే జీడీపీ, తయారీ రంగ పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్(పీఎంఐ) గణాంకాలు, కంపెనీల ఆర్థిక ఫలితాలు ఈ వారం మార్కెట్ గమనాన్ని నిర్దేశిస్తాయని నిపుణులంటున్నారు. నైరుతి రుతుపవనాల పురోగతి కూడా ప్రభావం చూపుతుందని వారంటున్నారు. విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల పోకడ, ప్రపంచ మార్కెట్ల గమనం, డాలర్‌తో రూపాయి కదలికలు, అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు తదితర అంశాలు కూడా కీలకమేనని మార్కెట్ విశ్లేషకులంటున్నారు. 31న జీడీపీ డేటా... నేడు(సోమవారం–ఈ నెల 29) బీపీసీఎల్, కోల్ ఇండియా, ఎన్టీపీసీ, ఎల్ అండ్ టీ, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్, పవర్ గ్రిడ్లు ఆర్థిక ఫలితాలను వెల్ల డించనున్నాయి. మంగళవారం (ఈ నెల 30న) హిందాల్కో, మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీలు తమ ఫలితాలను ప్రకటిస్తాయి. ఇక బుధవారం (ఈ నెల 31న) గత ఆర్థిక సంవత్సరం క్యూ4 జీడీపీ గణాంకాలను ప్రభుత్వం వెల్లడించనున్నది. గురువారం (వచ్చే నెల 1న) మార్కెట్ ఎకనామిక్స్ సంస్థ తయారీ రంగానికి సంబంధించిన పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్(పీఎంఐ) గణాంకాలు వస్తాయి. మే నెల వాహన విక్రయ గణాంకాలు గురువారం వెలువడనుండటంతో వాహన షేర్లు వెలుగులోకి రావచ్చు. ఇంధన ధరల సవరణ కారణంగా ప్రభుత్వ రంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు, విమానయాన కంపెనీల షేర్లపై ఇన్వెస్టర్ల దృష్టి ఉంటుంది. మార్కెట్ ముందుకే.. మార్కెట్ ఇప్పటికే రికార్డ్ స్థాయికి చేరనందున ఈ వారం ఒడిదుడుకులకు ఆస్కారం ఉందని అమ్రపాలి ఆధ్య ట్రేడింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ డైరెక్టర్ అభ్నిష్ కుమార్ సుధాంశు చెప్పారు. సకాలంలో రుతుపవనాలు రావడం, జీడీపీ గణాంకాలు బావుండడం సంభవిస్తే మార్కెట్ మరింత ముందుకు దూసుకుపోతుందని ఆయన అంచనా వేస్తున్నారు. కంపెనీల ఫలితాల వెల్లడి చివరి దశకు వచ్చినందున ఇక ఇప్పుడు అందరి కళ్లు జీఎస్టీ అమలుపై ఉంటాయని ట్రేడ్ స్మార్ట్ ఆన్లైన్ డైరెక్టర్ విజయ్ సింఘానియా చెప్పారు. కంపెనీల ఫలితాలు మెరుగుపడుతుండడం, విదేశీ పెట్టుబడులు జోరుగా వస్తుండడంతో మార్కెట్ ర్యాలీ కొనసాగుతోందని పేర్కొన్నారు. -
9,300 పాయింట్లను దాటిన నిఫ్టీ
ఇంట్రాడేలోనూ, ముగింపులోనూ నిఫ్టీ రికార్డ్‌లు ∙ బ్యాంక్ నిఫ్టీదీ ఇదే జోరు సానుకూలంగా అంతర్జాతీయ సంకేతాలు ∙ జోష్‌నిస్తున్న క్యూ4 ఫలితాలు ఎన్ఎస్ఈ నిఫ్టీ మంగళవారం మెరుపులు మెరిపించింది. తొలిసారిగా 9,300 పాయింట్లను దాటింది. ఇంట్రాడేలోనూ, ముగింపులోనూ కొత్త రికార్డ్లను సృష్టించింది. నిఫ్టీతో పాటు బ్యాంక్ నిఫ్టీ, బీఎస్ఈ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ ఇండెక్స్‌లు కూడా రికార్డ్‌లు బద్దలు కొట్టాయి. నిఫ్టీ బ్యాంక్ సూచీ 22వేల పాయింట్లపైన ముగిసింది. ఇక బీఎస్ఈ సెన్సెక్స్ 30వేల పాయింట్లకు చేరువలో ముగిసింది. రిలయన్స్ ఇండస్ట్రీస్, ఇతర బ్లూ చిప్ కంపెనీల క్యూ4 ఫలితాలు బాగుండటం, సానుకూల అంతర్జాతీయ సంకేతాల దన్నుతో స్టాక్ మార్కెట్ మంగళవారం లాభాల పంట పండించింది. స్టాక్ సూచీలు వరుసగా రెండో రోజూ లాభాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్ 287 పాయింట్లు లాభపడి 29,943 పాయింట్ల వద్ద, నిఫ్టీ 89 పాయింట్లు లాభపడి 9,307 పాయింట్ల వద్ద ముగిశాయి. సెన్సెక్స్‌కు ఇది 3 వారాల గరిష్ట స్థాయి. అన్ని రంగాల సూచీలు లాభాల్లో ముగిశాయి. నిఫ్టీ కొత్త శిఖరాలకు... ఈ నెల 5నాటి 9,274 పాయింట్ల జీవిత కాల గరిష్ట స్థాయి నిఫ్టీ రికార్డ్ మంగళవారం బద్దలైంది. 9,273 పాయింట్ల వద్ద ప్రారంభమైన నిఫ్టీ జోరు రోజంతా కొనసాగింది. ఇంట్రాడేలో 9,309 పాయింట్ల గరిష్ట స్థాయిని తాకిన నిఫ్టీ చివరకు 9,307 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ ఏడాది ఇప్పటివరకూ నిఫ్టీ 14 శాతం వరకూ లాభపడింది. ఇక సెన్సెక్స్ 29,962–29,781 పాయింట్ల గరిష్ట, కనిష్ట స్థాయిల మధ్య కదలాడింది. ఎందుకు ఈ పరుగు.. ప్రపంచ మార్కెట్ల జోరు: ఫ్రాన్స్ అధ్యక్ష ఎన్నికల మొదటి రౌండ్లో యూరోపియన్ యూనియన్‌లో ఉండేందుకే మొగ్గు చూపే సెంట్రిస్ట్ అభ్యర్థి ఇమాన్యుయేల్ మాక్రాన్ నెగ్గడంతో ప్రపంచవ్యాప్తంగా రిలీఫ్ ర్యాలీ చోటు చేసుకుంది. ఆర్థిక ఫలితాల జోష్: ఇప్పటివరకూ అంతంతమాత్రంగానే కంపెనీల క్యూ4 ఆర్థిక ఫలితాలు సోమవారం నుంచి అంచనాలను మించడం స్టాక్ మార్కెట్‌ను పరుగులు పెట్టిస్తోంది. రూపాయి పరుగులు: డాలర్‌తో రూపాయి మారకం ఇంట్రాడేలో 64.21 స్థాయికి బలపడడం సెంటిమెంట్‌కు మరింత జోష్‌నిచ్చింది. నేడు చివరకు రూపాయి 65.26 వద్ద ముగిసింది. షార్ట్ కవరింగ్: ఏప్రిల్ సిరీస్ డెరివేటివ్ కాంట్రాక్టులు మరో 2 రోజుల్లో ముగుస్తుండడంతో ఇన్వెస్టర్లు షార్ట్ కవరింగ్‌కు దిగారు. అధిక వెయిటేజ్ షేర్ల పరుగు: సూచీల్లో అధిక వెయిటేజీ ఉన్న రిలయన్స్, హెచ్డీఎఫ్సీ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ తదితర షేర్లు పెరుగుతుండటంతో మార్కెట్ జోరుగా దూసుకుపోతోందని నిపుణులంటున్నారు. మరిన్ని ముఖ్యాంశాలు చూస్తే.. బీఎస్ఈలో మొత్తం 293 షేర్లు ఏడాది గరిష్ట స్థాయిలను తాకాయి. క్యూ4 ఫలితాలు అంచనాలను మించడంతో రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ ధర 1.2 శాతం లాభపడి రూ.1,433కు చేరింది. రూ.125 లక్షల కోట్లకు ఇన్వెస్టర్ల సంపద ఇన్వెస్టర్ల సంపదగా పరిగణించే బీఎస్ఈలో లిస్టైన అన్ని కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ జీవిత కాల గరిష్ట స్థాయి, రూ.125 లక్షల కోట్లకు చేరింది. సోమవారం రూ.124 లక్షల కోట్లుగా ఉన్న ఇన్వెస్టర్ల సంపద మంగళవారం రూ.1.11 లక్షల కోట్లు పెరిగి రూ.1,25,53,561 లక్షల కోట్లకు చేరింది. 6,000 పాయింట్లను దాటిన నాస్డాక్ అమెరికా షేర్లు దూసుకుపోతున్నాయి. అమెరికా స్టాక్ సూచీల్లో ఒకటైన నాస్డాక్ తొలిసారిగా 6,000 పాయింట్లను దాటింది. ఫ్రాన్స్ ఎన్నికల సానుకూల ఫలితాలు, అమెరికా బ్లూచిప్ కంపెనీల ఆర్థిక ఫలితాలు బాగా ఉండటం, అమెరికా అధ్యక్షుడు పన్ను సంస్కరణల హామీతో స్టాక్ సూచీలు మంచి లాభాలను సాధిస్తున్నాయి. కార్పొరేట్ ఇన్కమ్ ట్యాక్స్‌ను 35 శాతం నుంచి 15 శాతానికి తగ్గించవచ్చన్న అంచనాలు ఉన్నాయి. -
భౌగోళిక ఉద్రిక్తతలతో... మార్కెట్ డైలమా
కీలకంగా క్యూ4 ఫలితాలు విశ్లేషకుల అభిప్రాయం న్యూఢిల్లీ: భౌగోళిక–రాజకీయ ఉద్రిక్తతలు చెలరేగుతున్న నేపథ్యంలో ప్రపంచ మార్కెట్ల పోకడ ఈ వారం మార్కెట్‌కు కీలకం కానున్నదని విశ్లేషకులంటున్నారు. దీంతో పాటు ఈ వారంలో వెలువడే వివిధ కంపెనీల గత ఆర్థిక సంవత్సరపు నాలుగో త్రైమాసిక ఆర్థిక ఫలితాలు కూడా మార్కెట్ గమనాన్ని నిర్దేశిస్తాయని వారంటున్నారు. వీటితో పాటు డాలర్‌తో రూపాయి మారకం, అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల గమనం, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల సరళి.. తదితర అంశాలు ఈ వారం మార్కెట్ గమనాన్ని నిర్దేశిస్తాయని నిపుణులంటున్నారు. ఉత్తర కొరియా.. ఆందోళనకరం ప్రపంచవ్యాప్తంగా ఇన్వెస్టర్లు ఉత్తర కొరియా పరిస్థితుల పట్ల అందోళనకరంగా ఉన్నారని ట్రేడ్ స్మార్ట్ ఆన్లైన్ డైరెక్టర్ విజయ్ సింఘానియా చెప్పారు. ఈ ఉద్రిక్త పరిస్థితుల్లో ఎలాంటి కీలక ఘటన జరిగినా, అది అంతర్జాతీయంగా మార్కెట్ సెంటిమెంట్‌ను ప్రభావితం చేస్తుందని, ప్రపంచమార్కెట్లతో పాటే భారత మార్కెట్ కూడా ప్రతిస్పందిస్తుందని పేర్కొన్నారు. అలాగే ప్రస్తుతం స్టాక్ మార్కెట్.. కంపెనీల క్యూ4 ఆర్థిక ఫలితాలపై దృష్టి కేంద్రీకరించిందని, ఈ ఫలితాలు అంచనాలకు అనుగుణంగా ఉండటం కానీ, అంచనాలను మించడం కానీ జరిగితేనే మార్కెట్ జోరు కొనసాగుతుందని వివరించారు. నేడు (సోమవారం) వెలువడే టోకు ధరల ద్రవ్యోల్బణ గణాంకాలు ముఖ్యమైనవేనని అమ్రపాలి ఆధ్య ట్రేడింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ డైరెక్టర్ అభ్నిశ్ కుమార్ సుధాంశు పేర్కొన్నారు. భవిష్యత్ మార్కెట్ గమనాన్ని కంపెనీల క్యూ4 ఆర్థిక ఫలితాలు నిర్దేశిస్తాయని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ చెప్పారు. ఆర్థిక ఫలితాలు వెల్లడించేటప్పుడు ఆయా కంపెనీల యాజమాన్యాలు పేర్కొనే భవిష్యత్ అంచనాలు కీలకమని కోటక్ సెక్యూరిటీస్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ దీపేన్ షా పేర్కొన్నారు. టీసీఎస్ ఫలితాలు ఈ వారమే ఈ వారంలో టీసీఎస్, హెచ్‌డీఎఫ్‌సీతో పాటు పలు లార్జ్ క్యాప్ కంపెనీలు తమ క్యూ4 ఫలితాలను వెల్ల డించనున్నాయి. ఈ మంగళవారం(ఈ నెల 18న) టీసీఎస్, బుధవారం(19న )యస్‌బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్, గురువారం (ఈ నెల 20న) హిందుస్తాన్ జింక్, మైండ్ ట్రీ, క్రిసిల్, శుక్రవారం(ఈ నెల 21న)హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఏసీసీలు క్యూ4 ఫలితాలు ప్రకటించనున్నాయి. కాగా గత వారంలో సెన్సెక్స్ 245 పాయింట్లు, నిఫ్టీ 48 పాయింట్లు చొప్పున నష్టపోయాయి. ఇక అంతర్జాతీయ అంశాల పరంగా చూస్తే నేడు (సోమవారం) చైనా క్యూ1 జీడీపీ, ఫిబ్రవరి పారిశ్రామికోత్పత్తి గణాంకాలు వెలువడుతాయి. మంగళవారం(ఈ నెల 18) అమెరికా మార్చి నెల పారిశ్రామికోత్పత్తి గణాంకాలు వస్తాయి. ఇక శుక్రవారం(ఈ నెల 21) నాడు యూరోజోన్, అమెరికా తయారీ, సేవల రంగాల పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్(పీఎంఐ) గణాంకాలు, జపాన్ తయారీ రంగ పీఎంఐ గణాంకాలు వెలువడుతాయి. జోరుగా విదేశీ పెట్టుబడులు భారత క్యాపిటల్ మార్కెట్లో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు ఈ నెలలో ఇప్పటిదాకా రూ.16,529 కోట్ల పెట్టుబడులు పెట్టారు. భారత తయారీ రంగం గత నెలలో పెరగడంతో సెంటిమెంట్ మెరుగుపడి ఈ స్థాయిలో విదేశీ పెట్టుబడులు వచ్చాయి. డిపాజిటరీల గణాంకాల ప్రకారం., ఎఫ్‌పీఐలు ఈ నెల 3–13 కాలానికి మన స్టాక్ మార్కెట్లో రూ.2,997 కోట్లు, డెట్ మార్కెట్లో రూ.13,531 కోట్లు చొప్పున వెరశి మన క్యాపిటల్ మార్కెట్లో రూ.16,529 కోట్ల పెట్టుబడులు పెట్టారు. దీంతో ఈ ఏడాది ఇప్పటివరకూ విదేశీ పోర్ట్‌ఫోలియో పెట్టుబడులు మన క్యాపిటల్ మార్కెట్లో రూ.85,156 కోట్ల(1,300 కోట్ల డాలర్లు)కు చేరాయి. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించడంతో మరింత వేగంగా సంస్కరణలు వస్తాయనే అంచనాలతో గత నెలలో ఎఫ్‌పీఐలు రూ.56,944 కోట్ల పెట్టుబడులు పెట్టారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో మన ఈక్విటీ, డెట్ మార్కెట్లలో విదేశీ పెట్టుబడులు రూ.15,862 కోట్లుగా ఉన్నాయి. -
ఒడిదుడుకుల వారం!
డెరివేటివ్ కాంట్రాక్టుల ముగింపు నేపథ్యం * ఎస్బీఐ, కోల్ ఇండియా దిగ్గజ కంపెనీల క్యూ4 ఫలితాలు * రుతుపవన అంచనాలూ కీలకమే ! * విశ్లేషకుల అభిప్రాయం న్యూఢిల్లీ: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ), ఎల్ అండ్ టీ, కోల్ ఇండియా వంటి బ్లూ చిప్ కంపెనీల ఆర్థిక ఫలితాలు, రుతుపవనాల గమనం తదితర అంశాలు ఈ వారం స్టాక్ మార్కెట్‌పై ప్రభావం చూపుతాయని మార్కెట్ విశ్లేషకులంటున్నారు. మే నెల డెరివేటివ్స్ కాంట్రాక్టుల ముగింపు కారణంగా ఒడిదుడుకులు తప్పవని వారంటున్నారు. విదేశీ ఇన్వెస్టర్ల ట్రేడింగ్ సరళి, ముడి చమురు ధరల, రూపాయి కదలికలు, రుతుపవనాల గమనంపై ప్రకటనలు. తదితర అంశాలూ మార్కెట్ గమనంపై ప్రభావం చూపుతాయని నిపుణుల ఉవాచ. మరింత బలహీనంగా మార్కెట్.. అంతర్జాతీయ మార్కెట్ల సెంటిమెంట్, రుతుపవనాల రాక, కంపెనీల గత ఆర్థిక సంవత్సరం క్యూ4 ఫలితాలు స్టాక్ మార్కెట్‌పై ప్రభావం చూపుతాయని ట్రేడ్ స్మార్ట్ ఆన్లైన్ వ్యవస్థాపకుడు విజయ్ సింఘానియా చెప్పారు. మే నెల డెరివేటివ్స్ కాంట్రాక్టులు ఈ గురువారం ఎక్స్పైర్ అవుతాయని, ట్రేడర్ల పొజిషన్ల రోల్ ఓవర్ కారణంగా మార్కెట్లో ఒడిదుడుకులు తీవ్రంగానే ఉంటాయని వివరించారు. ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ మే నెల కాంట్రాక్టుల ముగింపు సందర్భంగా స్టాక్ మార్కెట్లో ఒడిదుడుకులు చోటు చేసుకుంటాయని, స్టాక్ సూచీలు మరింత బలహీనపడవచ్చని యస్ సెక్యూరిటీస్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ నటాషా శంకర్ అంచనా వేస్తున్నారు. వడ్డీరేట్లకు సంబంధించి భవిష్యత్ అంచనాల కారణంగా ప్రపంచ మార్కెట్లు గత వారంలో దాదాపు రెండు నెలల కనిష్టానికి పతనమయ్యాయని ట్రేడ్‌బుల్స్ సీఓఓ ధ్రువ్ దేశాయ్ చెప్పారు. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్లను పెంచుతుందనే అంచనాల మధ్య విదేశీ నిధులు భారీగా తరలిపోతాయనే భయాలు నెలకొన్నాయని ఏంజెల్ బ్రోకింగ్ రీసెర్చ్ హెడ్ వైభవ్ అగర్వాల్ చెప్పారు కీలక కంపెనీల ఫలితాలు..., టాటా పవర్, బీపీసీఎల్ కంపెనీలు ఫలితాలను ఈ నెల 23న (సోమవారం) వెల్లడించనున్నాయి. టెక్ మహీంద్రా, సిప్లా, కోల్గేట్ పామోలివ్ (ఇండియా), లు ఈ నెల 24న(మంగళవారం), బజాజ్ ఆటో, గెయిల్, టాటా స్టీల్, ఎల్ అండ్ టీలు ఈ నెల 25(బుధవారం), ఎస్బీఐ, భెల్ ఈనెల 27న(శుక్రవారం), కోల్ ఇండియా ఈ నెల 28న(శనివారం)తమ ఫలితాలను వెల్లడిస్తాయి. ఇవే కాకుండా ఓఎన్జీసీ, ఐఓసీ, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్, అశోక్ లేలాండ్, ఇండియా సిమెంట్స్, క్రాంప్టన్ గ్రీవ్స్, అబాట్ ఇండియా, అబాట్ ఇండియా, జీఎస్కే ఫార్మా వంటి కంపెనీలు నాలుగో క్వార్టర్ ఫలితాలను ప్రకటించనున్నాయి. అంతా వరుణుడి దయ... వర్షాలు ఎలా కురుస్తాయనేది రానున్న వారాల్లో ఆర్థిక వ్యవస్థకే కాకుండా, స్టాక్ మార్కెట్‌కు కూడా కీలకమని నిపుణులంటున్నారు. రానున్న 4-6 వారాల్లో రుతుపవనాలపై అంచనాలేనని స్టాక్ మార్కెట్‌కు కీలకమని ఈక్విరస్ సెక్యూరిటీస్ హెడ్(ఈక్విటీస్) పంకజ్ శర్మ చెప్పారు. గత వారంలో బీఎస్ఈ సెన్సెక్స్ 188 పాయింట్లు(0.73%) క్షీణించి, 25,302 పాయింట్ల వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 65(0.83 శాతం) పాయింట్లు క్షీణించి 7,750 పాయింట్ల వద్ద ముగిశాయి. విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు.. గత వారంలో విదేశీ ఇన్వెస్టర్లు రూ.2,064 కోట్ల విలువైన షేర్లను అమ్మేశారని ఎక్స్ఛేంజ్ గణాంకాలు వెల్లడించాయి. కాగా విదేశీ ఇన్వెస్టర్లు ఈ నెలలో ఇప్పటివరకూ రూ.1,795 కోట్లు ఈక్విటీ మార్కెట్లో నికరంగా ఇన్వెస్ట్ చేయగా, రూ.3,496 కోట్ల పెట్టుబడులను డెట్ మార్కెట్ నుంచి ఉపసంహరించుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడైన గురువారం రోజు విదేశీ ఇన్వెస్టర్లు రూ.341 కోట్లు ఇన్వెస్ట్ చేశారు. బీజేపీ అస్సాంలో అధికారంలోకి రావడం, పశ్చిమ బెంగాల్, కేరళలో ఆ పార్టీ పరిస్థితి మెరుగుపడడంతో సంస్కరణల్ని కేంద్ర ప్రభుత్వం మరింత వేగవంతం చేస్తుందని బీఎన్పీ పారిబా ఎంఎఫ్ ఫండ్ మేనేజర్ శ్రేయాశ్ దేవాల్కర్ అంచనా వేస్తున్నారు. మార్చి, ఏప్రిల్ నెలల్లో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు రూ.29,558 కోట్లు పెట్టుబడులు పెట్టారు. ఇక ఈ ఏడాది ఇప్పటివరకూ ఎఫ్‌పీఐలు ఈక్విటీల్లో రూ.14,706 కోట్ల పెట్టుబడులు పెట్టగా, డెట్ మార్కెట్ నుంచి రూ.4,436 కోట్లు ఉపసంహరించుకున్నారు. -
ఇన్ఫీ బంపర్ బోణీ..!
అంచనాలు మించిన క్యూ4 ఫలితాలు ♦ నికర లాభం రూ. 3,597 కోట్లు; 16.2% వృద్ధి ♦ ఆదాయం 23.4 శాతం అప్; రూ.16,550 కోట్లు ♦ కలిసొచ్చిన రూపాయి క్షీణత... ♦ 285 శాతం తుది డివిడెండ్; షేరుకి రూ. 14.25 ♦ పరిశ్రమ అంచనాలను మించి ఈ ఏడాది గెడైన్స్... ♦ ఆదాయంలో 11.5-13.5% వృద్ధి ఉండొచ్చు.. దేశంలో రెండో అతిపెద్ద సాఫ్ట్వేర్ కంపెనీ ఇన్ఫోసిస్.. క్యూ4 ఫలితాల సీజన్‌ను అంచనాలను మించిన పనితీరుతో బోణీ చేసింది. అంతేకాకుండా ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికిగాను ఐటీ పరిశ్రమకు మించిన ఆదాయ వృద్ధి అంచనా(గెడైన్స్)తో విశ్లేషకులను ఆశ్చర్యపరిచింది. మరోపక్క, 285 శాతం తుది డివిడెండ్‌ను కూడా ప్రకటించి ఇన్వెస్టర్లను సైతం మెప్పించింది. మొత్తంమీద కంపెనీ రానున్న రోజుల్లో మరింత వృద్ధి పథంలో పయనిస్తుందన్న భరోసాను కల్పించడంలో ఇన్ఫీ సీఈఓ విశాల్ సిక్కా మంచి మార్కులే కొట్టారని పరిశ్రమ నిపుణులు పేర్కొంటున్నారు. బెంగళూరు: ఇన్ఫోసిస్ మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికం(2015-16, క్యూ4)లో కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన రూ.3,597 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. అంతక్రితం ఏడాది ఇదేకాలంలో లాభం రూ. 3,097 కోట్లతో పోలిస్తే 16.2 శాతం ఎగిసింది. మొత్తం ఆదాయం రూ. 13,411 కోట్ల నుంచి రూ.16,550 కోట్లకు పెరిగింది. 23.4 శాతం వృద్ధిని సాధించింది. ప్రధానంగా క్యూ4లో డాలరుతో రూపాయి మారకం విలువ భారీగా క్షీణించడం, నిర్వహణ పనితీరు పుంజుకోవడం, ముఖ్యమైన క్లయింట్ల ఐటీ వ్యయాలు కూడా పెరగడం తదితర అంశాలు ఇన్ఫీకి మార్చి క్వార్టర్లో కలిసొచ్చిన అంశాలు. క్యూ4లో ఇన్ఫోసిస్ రూ. 3,502 కోట్ల నికర లాభాన్ని, రూ. 16,545 కోట్ల ఆదాయాన్ని నమోదుచేయవచ్చని పరిశ్రమ విశ్లేషకులు అంచనా వేశారు. సీక్వెన్షియల్‌గా ఇలా... డిసెంబర్ క్వార్టర్(క్యూ3)లో నమోదైన రూ. 3,465 కోట్ల నికర లాభంతో పోలిస్తే(సీక్వెన్షియల్‌గా) మార్చి క్వార్టర్(క్యూ4) లాభం 3.8 శాతం పెరిగింది. ఇక ఆదాయం కూడా క్యూ4లో సీక్వెన్షియల్ ప్రాతిపదికన 4.1 శాతం వృద్ధి చెందింది. డిసెంబర్ క్వార్టర్లో కంపెనీ మొత్తం ఆదాయం రూ. 15,902 కోట్లుగా ఉంది. కాగా, డాలర్ల రూపంలో ఆదాయం క్యూ4లో 2,446 మిలియన్లకు ఎగిసింది. సీక్వెన్షియల్‌గా 1.6 శాతం, వార్షిక ప్రాతిపదికన 13.3 శాతం చొప్పన పెరిగింది. నికర లాభం కూడా 533 మిలియన్ డాలర్లకు ఎగిసింది. సీక్వెన్షియల్‌గా 1.7 శాతం, వార్షికంగా 7 శాతం చొప్పున ఎగబాకింది. పూర్తి ఏడాదికి... గడిచిన ఆర్థిక సంవత్సరం(2015-16) మొత్తానికి చూస్తే ఇన్ఫీ నికర లాభం రూ. 13,491 కోట్లకు ఎగబాకింది. అంతక్రితం ఏడాది(2014-15) నికర లాభం రూ. 12,329 కోట్లతో పోలిస్తే 9.4 శాతం వృద్ధి చెందింది. ఇక మొత్తం ఆదాయం రూ. 53,319 కోట్ల నుంచి రూ. 62,441 కోట్లకు దూసుకెళ్లింది. 17.1 శాతం పెరుగుదల నమోదైంది. గెడైన్స్ భేష్... ప్రస్తుత 2016-17 ఆర్థిక సంవత్సరంలో ఇన్ఫీ ఆదాయం వృద్ధి అంచనా(గెడైన్స్) భారీగా పెరిగింది. స్థిర కరెన్సీ ప్రాతిపదికన గెడైన్స్ 11.5-13.5 శాతం, డాలర్ల రూపంలో(మార్చి 31 నాటికి ఉన్న కరెన్సీ విలువలతో చూస్తే) గెడైన్స్ 11.8-13.8%గా ఉండొచ్చని కంపెనీ తెలిపింది. దేశీ ఐటీ పరిశ్రమ చాంబర్ నాస్కామ్ ఈ ఏడాది సాఫ్ట్వేర్ రంగం వృద్ధి అంచనా 10-12% కంటే ఇన్ఫోసిస్ గెడైన్స్ చాలా మెరుగ్గా ఉండటం గమనార్హం. కంపెనీ పనితీరుకు గర్విస్తున్నా... ఇన్ఫీ సారథిగా తొలి ఆర్థిక సంవత్సరంలో కంపెనీ సాధించిన విజయాలు, పురోగతికి గర్వపడుతున్నా. ఇన్ఫోసిస్ ఇప్పుడు విభిన్నమైన తరహాలో ముందుకెళ్తోంది. ముఖ్యంగా డిజిటల్ టెక్నాలజీతో కంపెనీ సరికొత్త రూపాన్ని సంతరించుకుంటోంది. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, ఓపెన్-క్లౌడ్ ప్లాట్‌ఫామ్స్ వంటి అధునాతన పరిజ్ఞానాలతో వ్యాపార పరంగా మా క్లయింట్లకు మరింత విలువను చేకూర్చేందుకు కట్టుబడిఉన్నాం. అయితే, ఈ ప్రయాణంలో ఇప్పుడు ఇంకా మేం ప్రారంభస్థాయిలోనే ఉన్నాం. - విశాల్ సిక్కా, ఇన్ఫోసిస్ సీఈఓ, ఎండీ ఫలితాల్లో ఇతర ముఖ్యాంశాలివీ.. ♦ ఇన్ఫీ మార్చి క్వార్టర్లో స్థూలంగా 89, పూర్తి ఆర్థిక సంవత్సరంలో 325 కొత్త క్లయింట్లను సంపాదించింది. ♦ 2015-16 పూర్తి ఏడాదికిగాను కంపెనీ రూ. 5 ముఖ విలువ గల ఒక్కో షేరుపై రూ.14.25 (285 శాతం) తుది డివిడెండ్‌ను ప్రకటించింది. అంతక్రితం తొలి ఆరు నెలలకు రూ.10 మధ్యంతర డివిడెండ్‌ను ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో మొత్తం డివిడెండ్ రూ.24.25(485 శాతం)కు చేరింది. ♦ కీలకమైన ఉత్తర అమెరికా ప్రాంతానికి సంబంధించిన వ్యాపారం క్యూ4లో సీక్వెన్షియల్‌గా 0.5 శాతం ఎగిసింది. యూరప్ వ్యాపారం 2.4 శాతం, భారత్‌లో వ్యాపారం 9.1 శాతం వృద్ధి చెందింది. ♦ మార్చినాటికి కంపెనీ వద్ద నగదు నిల్వలు రూ.34,468 కోట్లకు పెరిగాయి. డిసెంబర్ నాటికి ఈ మొత్తం రూ.31,526 కోట్లు. ♦ క్యూ4లో ఇన్ఫీ స్థూలంగా 9,034 మంది ఉద్యోగులను నియమించుకుంది. ఇక 8,373 మంది వలసపోవడం(అట్రిషన్)తో నికరంగా 661 మంది మాత్రమే జతయ్యారు. అట్రిషన్ రేటు స్వల్పంగా 18.3 శాతం నుంచి 17.3 శాతానికి తగ్గింది. దీంతో కంపెనీ మొత్తం ఉద్యోగుల సంఖ్య మార్చి చివరినాటికి 1,94,044కు చేరింది. కాగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2016-17) 20,000 మంది ఫ్రెషర్స్ కోసం వివిధ యూనివర్సిటీలు, విద్యా సంస్థల నుంచి విద్యార్థులకు క్యాంపస్ ఆఫర్లు ఇచ్చినట్లు కంపెనీ సీఓఓ యూబీ ప్రవీణ్ రావు చెప్పారు. ♦ శుక్రవారం స్టాక్ మార్కెట్లకు సెలవు కావడంతో ఇన్ఫీ షేరుపై సోమవారం ఫలితాల ప్రభావం ఉంటుంది. బుధవారం కంపెనీ షేరు ముగింపు ధర రూ.1,172. కాగా, అమెరికా మార్కెట్లో(నాస్డాక్) శుక్రవారం ఇన్ఫీ షేరు(ఏడీఆర్) 10% లాభాలతో ఆరంభమైంది. -
హీరో మోటొకార్ప్ నికర లాభం రూ.477 కోట్లు
⇒ 14 శాతం క్షీణత ⇒ రూ.155 కోట్ల ఇంపెయిర్మెంట్ నష్టంతో తగ్గిన లాభం ⇒ క్యూ4 ఫలితాలు వెల్లడించిన కంపెనీ ⇒ ఒక్కో షేర్‌కు రూ.30 డివిడెండ్ న్యూఢిల్లీ: టూ వీలర్ దిగ్గజం హీరో మోటొకార్ప్ నికర లాభం గత ఏడాది నాలుగో త్రైమాసిక కాలంలో 14 శాతం తగ్గింది. 2013-14 క్యూ4లో రూ.544 కోట్లుగా ఉన్న నికర లాభం గత ఆర్థిక సంవత్సరం క్యూ4లో రూ.477 కోట్లకు తగ్గిందని కంపెనీ తెలిపింది. తాము అమెరికా కంపెనీ ఇరిక్ బ్యూయల్ రేసింగ్‌లో... రూ.155 కోట్లు ఇన్వెస్ట్ చేశామని, అయితే ఆ సంస్థ దివాళా పిటీషన్ దాఖలు చేయడంతో ఈ మేరకు నష్టం వాటిల్లిందని, అందుకే నికర లాభం క్షీణించిందని కంపెనీ వైస్ చైర్మన్, సీఈఓ, ఎండీ పవన్ ముంజాల్ చెప్పారు. నికర అమ్మకాలు రూ.6,513 కోట్ల నుంచి 4 శాతం వృద్ధితో రూ.6,794 కోట్లకు పెరిగాయని వివరించారు. ఒక్కో షేర్‌కు రూ.30 డివిడెండ్‌ను చెల్లించనున్నామని చెప్పారు. గత ఆగస్టులో రూ. 30 మధ్యంతర డివిడెండ్‌ను చెల్లించామని, మొత్తం మీద గత ఆర్థిక సంవ్సరంలో తమ డివిడెండ్ ఒక్కో షేర్‌కు రూ.60కు చేరుతుందని వివరించారు. ఇక విక్రయించిన వాహనాల సంఖ్య 15,89,462 నుంచి 15,75,501కు తగ్గిందని పేర్కొన్నారు. పూర్తి ఆర్థిక సంవత్సరం ఫలితాల విషయానికొస్తే, నికర లాభం రూ.2,109 కోట్ల నుంచి 13 శాతం వృద్ధితో రూ.2,386 కోట్లకు పెరిగిందని తెలిపారు. నికర అమ్మకాలు రూ.25,275 కోట్ల నుంచి 9 శాతం వృద్ధితో రూ.27,585 కోట్లకు, విక్రయించిన వాహనాల సంఖ్య 62,45,960 నుంచి 6 శాతం వృద్ధితో 66,31,826కు పెరిగాయని పేర్కొన్నారు. -
బీహెచ్ఈఎల్ లాభం 1,845 కోట్లు
న్యూఢిల్లీ: విద్యుత్ పరికరాల ప్రభుత్వ రంగ దిగ్గజం బీహెచ్ఈఎల్ గతేడాది(2013-14) క్యూ4లో రూ. 1,845 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. అంతక్రితం ఏడాది(2012-13) ఇదే కాలంలో రూ. 3,233 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. అయితే బీహెచ్‌పీవీని విలీనం చేసుకున్నందున ఫలితాలను పోల్చి చూడతగదని కంపెనీ పేర్కొంది. బీహెచ్‌పీవీని విలీనం చేసుకునేందుకు క్యాబినెట్ ఫిబ్రవరిలో ఆమోదముద్ర వేసిందని, దీంతో 2013 ఆగస్ట్ నుంచి విలీనం అమల్లోకి వచ్చిందని వెల్లడించింది. కాగా, రూ. 14,755 కోట్ల నికర అమ్మకాలు నమోదయ్యాయి. గతంలో రూ. 18,850 కోట్ల అమ్మకాల ను సాధించింది. విద్యుత్ రంగ విభాగం నుంచి రూ. 12,211 కోట్ల ఆదాయం లభించింది. గతంలో ఈ ఆదాయం రూ. 15,525 కోట్లుగా ఉంది. పూర్తి ఏడాదికి(2013-14) నికర లాభం 3,503 కోట్లకు చేరగా, గతంలో రూ. 6,693 కోట్లు నమోదైంది. ఇక ఆదాయం కూడా రూ. 50,045 కోట్ల నుంచి రూ. 41,192 కోట్లకు క్షీణించాయి. ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో షేరు 2.2% నష్టంతో రూ. 243 వద్ద ముగిసింది. -
హెచ్‌పీసీఎల్ లాభం రూ. 4,609 కోట్లు
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ హిందుస్తాన్ పెట్రోలియం(హెచ్‌పీసీఎల్) గతేడాది(2013-14) జనవరి-మార్చి(క్యూ4)కాలంలో రూ. 4,609 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. ఇందుకు అధిక స్థాయిలో అందిన ఇంధన సబ్సిడీలు కారణమైనప్పటికీ, అంతక్రితం ఏడాది(2012-13) ఇదే కాలంలో ఆర్జించిన రూ. 7,679 కోట్లతో పోలిస్తే 40% తక్కువే. అయితే గత ఫలితాలతో వీటిని పోల్చలేమని కంపెనీ చైర్మన్ ఎన్.వాసుదేవ చెప్పారు. గతంలో బ్యాక్లాగ్ సబ్సిడీలను ప్రభుత్వం విడుదల చేసిందన్నారు. డీజిల్, వంటగ్యాస్ విక్రయాలపై వాటిల్లే ఆదాయ నష్టాలకుగాను ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు ప్రభుత్వంతోపాటు, ఆయిల్ ఉత్పాదక సంస్థల నుంచి సబ్సిడీలు లభించే సంగతి తెలిసిందే. కాగా, క్యూ4లో డీజిల్, వంటగ్యాస్ విక్రయాలపై రూ. 9,183 కోట్ల ఆదాయ నష్టాలు నమోదయ్యాయి. ఇందుకుగాను ప్రభుత్వం నుంచి రూ. 6,938 కోట్లు, ఆయిల్ ఉత్పత్తి సంస్థల నుంచి రూ. 5,671 కోట్లు లభించాయి. పూర్తి ఏడాదికి లాభం రెట్టింపై రూ. 1,734 కోట్లకు చేరగా, అమ్మకాలు 8% ఎగసి రూ. 2,32,188 కోట్లను తాకాయి. 4% అధికంగా 30.26 మిలియన్ టన్నుల పెట్రోలియం ఉత్పత్తులను విక్రయించినట్లు వాసుదేవ వెల్లడించారు. ఇవి కంపెనీ చరిత్రలోనే అత్యధికమని చెప్పారు. విస్తరణపై రూ. 17,000 కోట్లు: ముంబై, వైజాగ్ రిఫైనరీల సామర్థ్యాన్ని విస్తరించేందుకు రూ. 17,000 కోట్ల కంపెనీ వెచ్చించనుంది. 2018కల్లా ముంబై రిఫైనరీ సామర్థ్యాన్ని ప్రస్తుత 6.5 మిలియన్ టన్నుల నుంచి 10 మిలియన్ టన్నులకు, వైజాగ్ రిఫైనరీ సామర్థ్యాన్ని 8.33 మిలియన్ టన్నుల నుంచి 15 మిలియన్ టన్నులకు పెంచనున్నట్లు కంపెనీ రిఫైనరీస్ డెరైక్టర్ బీకే నామ్‌దేవ్ చెప్పారు. ముంబై రిఫైనరీపై రూ. 2,000 కోట్లు, వైజాగ్ రిఫైనరీపై రూ. 15,000 కోట్లు వెచ్చిస్తున్నట్లు తెలిపారు. -
ఐటీసీ నికర లాభం 18% అప్
న్యూఢిల్లీ: డైవర్సిఫైడ్ దిగ్గజం ఐటీసీ జనవరి-మార్చి(క్యూ4) కాలానికి రూ. 2,278 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. అంతక్రితం ఏడాది(2012-13) ఇదే కాలంలో ఆర్జించిన రూ. 1,928 కోట్లతో పోలిస్తే ఇది 18%పైగా వృద్ధి. ఇక నికర అమ్మకాలు సైతం దాదాపు 12% పెరిగి రూ. 9,145 కోట్లను దాటాయి. గతంలో రూ. 8,180 కోట్ల ఆదాయం నమోదైంది. స్టాండెలోన్ ఫలితాలివి. మొత్తం వ్యయాలు 8%పైగా తగ్గి రూ. 5,273 కోట్లకు పరిమితమైనట్లు కంపెనీ తెలిపింది. సమస్యాత్మక బిజినెస్ వాతావరణంలోనూ మంచి ఫలితాలను సాధించగలిగినట్లు వ్యాఖ్యానించింది. కాగా, సిగరెట్లు తదితర ఎఫ్ఎంసీజీ బిజినెస్ ఆదాయం దాదాపు 13% ఎగసి రూ. 4,079 కోట్లకు చే రగా, సిగరెట్లేతర విభాగం నుంచి 14% అధికంగా రూ. 2,315 కోట్లు లభించింది. పూర్తి ఏడాదికి(2013-14) నికర లాభం 17% పుంజుకుని రూ. 8,891 కోట్లను అధిగమించింది. ఇక నికర అమ్మకాలు దాదాపు 12% ఎగసి రూ. 34,985 కోట్లకు చేరాయి. ఫలితాల నేపథ్యంలో కంపెనీ షేరు బీఎస్ఈలో 0.8% నష్టపోయి రూ. 342 వద్ద ముగిసింది. -
లాభం తగ్గింది షేరు ఎగసింది
న్యూఢిల్లీ: దేశీ బ్యాంకింగ్ అగ్రగామి స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) గతేడాది ఆఖరి త్రైమాసికం(2013-14, క్యూ4)లో స్టాండెలోన్ ప్రాతిపదికన రూ.3,041 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. అంతక్రితం ఏడాది ఇదే కాలానికి నమోదు చేసిన రూ.3,299 కోట్లతో పోలిస్తే లాభం 7.83 శాతం తగ్గింది. ప్రధానంగా మొండిబకాయిలపై ప్రొవిజనింగ్ కేటాయింపులు పెరగడం, రానున్న వేతన సవరణ కోసం కొంతమొత్తాన్ని పక్కనబెట్టడం వంటివి లాభాల తగ్గుదలకు దారితీసినట్లు బ్యాంక్ పేర్కొంది. ఇక క్యూ4లో మొత్తం ఆదాయం రూ.36,331 కోట్ల నుంచి రూ. 42,443 కోట్లకు ఎగబాకింది. 17 శాతం వృద్ధి చెందింది. కాగా, బ్యాంక్ నికర వడ్డీ ఆదాయం(ఎన్ఐఐ) జనవరి-మార్చి క్వార్టర్లో 16.4 శాతం వృద్ధితో రూ.12,903 కోట్లకు ఎగసింది. పెరిగిన మొండిబకాయిలు... బ్యాంక్ మొత్తం రుణాల్లో స్థూల మొండిబకాయిలు(ఎన్పీఏ) మార్చి క్వార్టర్ చివరికి 4.95 శాతానికి(రూ.61,605 కోట్లు) పెరిగాయి. అంతక్రితం ఏడాది ఇదే క్వార్టర్లో ఈ పరిమాణం 4.75 శాతం(రూ.51,189 కోట్లు)గా ఉంది. అంటే 20.3 శాతం ఎగబాకాయి. నికర ఎన్పీఏలు కూడా 2.10 శాతం(రూ.21,956 కోట్లు) నుంచి 2.57 శాతానికి(రూ.31,096 కోట్లు) ఎగబాకాయి. ఏకంగా 41.6 శాతం అధికమయ్యాయి. ఇదిలావుండగా.. 2013-14 క్యూ4లో మొండిబకాయిలపై ప్రొవిజనింగ్ కేటాయింపులు రూ.5,884 కోట్లకు పెరిగాయి. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో ఈ మొత్తం రూ.3,974 కోట్లు మాత్రమే. అంటే 40.05 శాతం పెరిగినట్లు లెక్క. ఇక 2013-14 పూర్తి ఏడాదికి బ్యాంక్ మొత్తం ప్రొవిజనింగ్ కేటాయింపులు రూ.7,587 కోట్లుగా నమోదైంది. అంతక్రితం ఏడాది రూ.4,461 కోట్లతో పోలిస్తే 70.06 శాతం పెరగడం గమనార్హం. కాగా, క్యూ4లో బ్యాంక్ రూ.1,397 కోట్ల బకాయిలను రికవరీ చేసుకోగా, రూ.1,148 కోట్ల రుణాలను మాఫీ చేసింది. ఇక క్యూ4లో తాజాగా రూ.13,766 కోట్ల రుణాలు మొండిబకాయిలుగా మారాయి. పూర్తి ఏడాదికి ఇలా... 2013-14 పూర్తి ఆర్థిక సంవత్సరంలో బ్యాంక్ స్టాండెలోన్ నికర లాభం 23 శాతం దిగజారి రూ.10,891 కోట్లుగా నమోదైంది. అంతక్రితం ఏడాదిలో నికర లాభం రూ.14,105 కోట్లుగా ఉంది. ఇక మొత్తం ఆదాయం మాత్రం రూ.1,19,655 కోట్ల నుంచి రూ.1,36,351 కోట్లకు పెరిగింది. 14 శాతం వృద్ధి నమోదైంది. ఇక కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన కూడా బ్యాంక్ గతేడాది నికర లాభం 21 శాతం క్షీణించింది. రూ.17,916 కోట్ల నుంచి రూ.14,174 కోట్లకు తగ్గింది. ఇతర ముఖ్యాంశాలివీ... పూర్త ఏడాదికి బ్యాంక్ రూ.10 ముఖ విలువగల ఒక్కో షేరుపై రూ.30 చొప్పున(గతంలో ఇచ్చిన రూ.15 మధ్యంతర డివిడెండ్‌తో కలిపి) తుది డివిడెండ్‌ను ప్రకటించింది. మార్చి చివరినాటికి నికర వడ్డీ మార్జిన్(ఎన్ఐఎం) 3.17 శాతంగా నమోదైంది. క్రితం ఏడాది ఇదే నెలాఖరుకు ఎన్ఐఎం 3.34 శాతంగా ఉంది. క్యూ4లో ఫీజుల రూపంలో ఆదాయం 15.34 శాతం వృద్ధితో రూ.4,467 కోట్లకు పెరిగింది. వడ్డీయేతర ఆదాయం 18.73 శాతం ఎగసి రూ.6,586 కోట్లకు చేరింది. గతేడాది క్యాపిటల్ అడిక్వసీ రేషియో 12.44 శాతం కాగా, ఇందులో టైర్-1 క్యాపిటల్ 9.72 శాతంగా ఉంది. మొత్తం వ్యాపారం(డిపాజిట్లు-రుణాలు) 2013-14లో రూ.26,39,531 కోట్లకు పెరిగింది. 2012-13లో రూ.22,81,297 కోట్లతో పోలిస్తే 3,58,234 కోట్లు ఎగసింది. గడిచిన ఏడాది కాలంలో కొత్తగా 1,053 బ్రాంచ్‌లను ఎస్బీఐ ఏర్పాట చేసింది. దీంతో మార్చినాటికి మొత్తం శాఖల సంఖ్య 15,869కి చేరింది. దూసుకెళ్లిన షేరు... ఫలితాలు విశ్లేషకుల అంచనాల కంటే మెరుగ్గా ఉండటంతో షేరు ధర దూసుకెళ్లింది. బ్రోకరేజి నిపుణులు క్యూ4లో బ్యాంక్ నికర లాభం రూ.2,824 కోట్లుగా అంచనావేశారు. అంతేకాకుండా క్యూ3తో పోలిస్తే క్యూ4లో(సీక్వెన్షియల్‌గా మొండిబకాయిలు మెరుగుపడటం కూడా మార్కెట్ వర్గాలను మెప్పించింది. ఈ పరిణామాల నేపథ్యంలో బ్యాంక్ షేరు ధర శుక్రవారం బీఎస్ఈలో ఒకానొకదశలో 10 శాతంపైగా ఎగబాకింది. రూ.2,775 గరిష్టాన్ని తాకింది. చివరకు 9.69 శాతం(రూ.243) లాభంతో రూ.2,755 వద్ద స్థిరపడింది. ఎగవేతదారుగా కింగ్‌ఫిషర్ విజయ్ మాల్యా! కావాలనే రుణాన్ని ఎగ్గొట్టిన ఎగవేతదారుగా కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ ప్రమోటరు విజయ్ మాల్యా పేరును ప్రకటించడంపై ఎస్బీఐ దృష్టి సారించింది. ఇందులో భాగంగా తమ వాదనలు పటిష్టంగా ఉండేలా వివిధ అంశాలను పరిశీలిస్తున్నట్లు ఎస్బీఐ వర్గాలు తెలిపాయి. ఆర్బీఐ నిబంధనల ప్రకారం బ్యాంకు నుంచి తీసుకున్న అప్పును రుణ గ్రహీత దారి మళ్లించారని, చె ల్లించే సామర్థ్యం ఉన్నా చెల్లించడం లేదని నిరూపించాల్సి ఉంటుంది. ఈ రెండు విషయాలను రుజువు చేయగలిగితే.. మాల్యాను ఎగవేతదారుగా ప్రకటించడానికి వీలు చిక్కుతుందని ఎస్బీఐ వర్గాలు చెప్పాయి. మరోవైపు, మాల్యా వ్యక్తిగత ఆస్తులను కూడా జప్తు చేసుకునే విషయాన్ని బ్యాంక్ పరిశీలిస్తోన్నట్లు వివరించాయి. ఎగవేతదారుగా బ్యాంకు డిక్లేర్ చేసిన వ్యక్తి... వివిధ కంపెనీల్లో తనకున్న డెరైక్టర్ హోదాలను కోల్పోతారు. అలాగే, భవిష్యత్‌లో మళ్లీ రుణం తీసుకోవడానికి అవకాశం ఉండదు. కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్‌కి ఎస్బీఐ రూ. 1,600 కోట్ల మేర రుణం ఇచ్చిన సంగతి తెలిసిందే. -
కోరమాండల్ ఆదాయం @ 10 వేల కోట్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎరువులు, సస్యరక్షణ ఉత్పత్తుల తయారీలో ఉన్న కోరమాండల్ ఇంటర్నేషనల్ రూ.10 వేల కోట్ల మార్కును దాటింది. 2013-14 ఆర్థిక సంవత్సరం కన్సాలిడేటెడ్ ఫలితాల్లో రూ.10,053 కోట్ల టర్నోవర్ నమోదు చేసింది. అంత క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే టర్నోవరు రూ.9,034 కోట్లుంది. నికర లాభం 17 శాతం తగ్గి రూ.432 కోట్ల నుంచి రూ.356 కోట్లకు పడిపోయింది. మార్చి త్రైమాసికంలో నికర లాభం ఏకంగా రూ.12 కోట్ల నుంచి రూ.81 కోట్లకు ఎగబాకింది. టర్నోవరు రూ.2,079 కోట్ల నుంచి రూ.2,182 కోట్లను తాకింది. 2013-14కుగాను రూ.1 ముఖ విలువగల ఒక్కో షేరుపై రూ.4.50 డివిడెండు చెల్లించాలని బోర్డు ప్రతిపాదించింది. ఫాస్పేటేతర ఎరువులు, కొత్త విభాగాలతో నాల్గవ తైమాసికంలో లాభం ఏడింతలైందని కోరమాండల్ ఎండీ కపిల్ మెహన్ మంగళవారమిక్కడ మీడియాకు తెలిపారు. మొత్తంగా చూస్తే అధిక పన్నులు, వడ్డీల మూలంగా 2013-14లో లాభం తగ్గిందన్నారు. రెండేళ్లలో ప్లాంటు.. వ్యవసాయ పనిముట్ల తయారీలో ఉన్న యాన్మర్ అండ్ కో అనే జపాన్ కంపెనీతో ఇటీవలే కోరమాండల్ సంయుక్త భాగస్వామ్యం కుదుర్చుకుంది. భాగస్వామ్య కంపెనీ దక్షిణాదిన ప్లాంటును ఏర్పాటు చేస్తోంది. ఇందుకోసం రూ.40 కోట్లు వెచ్చిస్తున్నారు. కోరమాండల్ వాటా రూ.16 కోట్లు. ప్లాంటులో వరి నాటే యంత్రాలు, కోత యంత్రాలను తొలుత అసెంబ్లింగ్ చేస్తారు. రానున్న రోజుల్లో దేశీయంగా తయారీ చేపడతారు. రెండేళ్లలో ప్లాంటులో అసెంబ్లింగ్ కార్యకలాపాలు ప్రారంభమవుతాయి. నౌకాశ్రయం సమీపంలో ప్లాంటు స్థాపిస్తామని, ఇంకా ఎక్కడ ఏర్పాటు చేసేది నిర్ణయించలేదని కంపెనీ తెలిపింది. కంపెనీ రిటైల్ విభాగమైన మన గ్రోమోర్ ఔట్లెట్లను ఫ్రాంచైజీ విధానంలోనూ పరిచయం చేయనున్నట్టు కంపెనీ సీఎఫ్‌వో శంకర సుబ్రమణియన్ పేర్కొన్నారు. వ్యవసాయం సవాలే.. వచ్చే 10 ఏళ్లలో భారత్‌లో వ్యవసాయం పెద్ద సవాల్‌గా మారనుందని కపిల్ మెహన్ అన్నారు. ‘కార్మికులు వ్యవసాయం వదిలి కొత్త అవకాశాలు వెతుక్కుంటున్నారు. వ్యవసాయేతర రంగాల్లో ఉపాధి క్రమంగా అవకాశాలు పెరుగుతున్నాయి. పారిశ్రామిక కారిడార్లు వస్తున్నాయి. సమస్య నుంచి బయటపడాలంటే వ్యవసాయంలో యాంత్రికీకరణ తప్పదు. యాంత్రికీకరణతో 10-15 శాతం అధిక ఉత్పాదకత నమోదవుతోంది’ అని కపిల్ మెహన్ స్పష్టం చేశారు. ఎల్‌నినో ప్రభావం 5 శాతం లోపే ఉండొచ్చని ఆయన పేర్కొన్నారు. -
16% తగ్గిన డాక్టర్ రెడ్డీస్ లాభం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: రాష్ట్రానికి చెందిన ఫార్మా దిగ్గజం డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ మార్చితో ముగిసిన త్రైమాసిక నికరలాభం 16% క్షీణించింది. 2012-13 చివరి త్రైమాసికంలో రూ. 571 కోట్లుగా ఉన్న నికరలాభం ఇప్పుడు రూ. 482 కోట్లకు పడిపోయింది. అభివృద్ధి, పరిశోధన రంగానికి కేటాయింపులు పెంచడమే లాభాలు తగ్గడానికి కారణంగా డాక్టర్ రెడ్డీస్ చైర్మన్ కె.సతీష్ రెడ్డి తెలిపారు. ఆర్థిక ఫలితాలు వెల్లడించడానికి మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గతేడాదితో పోలిస్తే ఈ త్రైమాసికంలో ఆర్ అండ్ డీ కేటాయింపులు రూ. 233 కోట్ల నుంచి రూ. 398 కోట్లకు పెంచడంతో ఆ మేరకు లాభాలు తగ్గాయన్నారు. సమీక్షా కాలంలో ఆదాయం 4% పెరిగి రూ. 3,340 కోట్ల నుంచి రూ. 3,481 కోట్లకు పెరిగింది. ఏడాది మొత్తం మీద చూస్తే డాక్టర్ రెడ్డీస్ నికరలాభం రూ. 1,678 కోట్ల నుంచి రూ. 2,151 కోట్లకు పెరగ్గా, ఆదాయం రూ. 11,626 కోట్ల నుంచి రూ.13,217 కోట్లకు వృద్ధి చెందింది. గడచిన ఏడాది ఆర్అండ్డీ కేటాయింపులను ఆదాయంలో 6.6 శాతం (రూ.757 కోట్లు) నుంచి 9.4 శాతానికి (రూ.1,240 కోట్లు) పెంచామని, ఈ మొత్తాన్ని ఈ ఏడాది 11 శాతం వరకు పెంచనున్నట్లు సతీష్ తెలిపారు. అంతర్జాతీయంగా ముఖ్యంగా ఉక్రెయిన్, సీఎస్ఐ దేశాల్లో తలెత్తిన రాజకీయ సంక్షోభాలు వ్యాపారంపై ప్రతికూల ప్రభావాన్ని చూపాయని, కానీ ఈ ఏడాది ప్రారంభం నుంచి మంచి సంకేతాలు ఉండటంతో వ్యాపారంలో వృద్ధి బాగుంటుందన్న ఆశాభావాన్ని సతీష్ వ్యక్తం చేశారు. ఈ త్రైమాసికంలో కొత్తగా మూడు ఉత్పత్తులను మార్కెట్లోకి విడుదల చేయనున్నట్లు డాక్టర్ రెడ్డీస్ తెలిపింది. రూ. 5 ముఖ విలువ కలిగిన షేరుకు రూ.18 డివిడెండ్‌ను ప్రకటించింది. రాయితీల తర్వాతే పెట్టుబడులు ఈ ఏడాది విస్తరణ కోసం రూ. 1,500 కోట్లు వ్యయం చేయనున్నట్లు డాక్టర్ రెడ్డీస్ తెలిపింది. రాష్ట్ర విభజన పూర్తయ్యి, కొత్త ప్రభుత్వాలు ఏర్పడి రాయితీలు ప్రకటించిన తర్వాత ఏ ప్రాంతంలో పెట్టుబడులు పెట్టేది నిర్ణయిస్తామని సతీష్ తెలిపారు. గతేడాది వ్యాపార విస్తరణ కోసం రూ.1,020 కోట్లు వ్యయం చేసింది. చైర్మన్‌గా సతీష్ రెడ్డి డాక్టర్ రెడ్డీస్ యాజమాన్యంలో కీలక మార్పులు జరిగాయి. డాక్టర్ రెడ్డీస్ వ్యవస్థాపకుడు డాక్టర్ అంజిరెడ్డి కుమారుడు సతీష్ రెడ్డిని చైర్మన్‌గా నియమిస్తూ బోర్డు నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు సతీష్ రెడ్డి కంపెనీలో వైస్ చైర్మన్, మేనేజింగ్ డెరైక్టర్, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్‌గా బాధ్యతలు నిర్వహించేవారు. అలాగే ఇప్పటి వరకు చైర్మన్‌గా ఉన్న అంజిరెడ్డి అల్లుడు జి.వి.ప్రసాద్ ఇక నుంచి సీఈవో, వైస్ చైర్మన్, మేనేజింగ్ డెరైక్టర్‌గా బాధ్యతలను నిర్వహించనున్నారు. ఈ మార్పులపై సతీష్ స్పందిస్తూ ఇవి కేవలం కంపెనీ నిర్వహణ సౌలభ్యం కోసమేనన్నారు. కంపెనీ నిర్వహించే సామాజిక సేవలు, ఫార్మా రంగ అసోసియేషన్లతో తాను కలిసి పనిచేయాల్సి ఉండటంతో రోజువారీ కార్యకలాపాలను ప్రసాద్‌కు అప్పచెప్పినట్లు సతీష్ తెలిపారు. -
ఫస్ట్ సోర్స్ లాభం 46 శాతం అప్
న్యూఢిల్లీ: బీపీవో సర్వీసుల దిగ్గజం ఫస్ట్‌సోర్స్ సొల్యూషన్స్ సంస్థ కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన 2013-14 నాలుగో ఆర్థిక సంవత్సరంలో రూ. 58.8 కోట్ల నికర లాభం ఆర్జించింది. అంతక్రితం ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో లాభం రూ. 40.2 కోట్లతో పోలిస్తే ఇది సుమారు 46 శాతం అధికం. మరోవైపు, ఆదాయం 11 శాతం పెరిగి రూ. 796 కోట్లుగా నమోదైంది. మార్చి త్రైమాసికంలో కంపెనీ ఉద్యోగుల సంఖ్యను 2,280 మేర తగ్గించుకుంది. దీంతో మొత్తం ఉద్యోగుల సంఖ్య 27,666కి పరిమితమైంది. పూర్తి ఆర్థిక సంవత్సరంలో ఉద్యోగుల సంఖ్య 4,200 మేర తగ్గింది. మరోవైపు, ఆదాయం 10% పెరిగి రూ. 3,105 కోట్లకు, లాభం 31 శాతం పెరిగి రూ. 193 కోట్లకు చేరింది. 2013-14 సంవత్సరం లాభదాయకంగా సాగిందని, క్రితం సంవత్సరంతో పోలిస్తే నికర లాభం 31 శాతం మేర పెరిగిందని ఫస్ట్‌సోర్స్ సొల్యూషన్స్ చైర్మన్ సంజీవ్ గోయెంకా తెలిపారు.ఫిలిప్పీన్స్‌లో కొత్తగా రెండో డెలివరీ సెంటర్‌ని ఏర్పాటు చేశామని, దీంతో మొత్తం మీద 46 సెంటర్స్ ఉన్నట్లవుతుందని ఆయన వివరించారు. కంపెనీ ఆదాయాల్లో టెలికం అండ్ మీడియా వాటా 43 శాతంగా, హెల్త్‌కేర్ 34 శాతంగా, బీఎఫ్ఎస్ఐ వాటా 22 శాతంగా ఉంది. -
క్యూ4 అంతంతే: టీసీఎస్
న్యూఢిల్లీ: ఈ ఆర్థిక సంవత్సరం చివరి క్వార్టర్(జనవరి-మార్చి’14)లో ఫలితాలు అంత ప్రోత్సాహకరంగా ఉండబోవని సాఫ్ట్వేర్ సేవల దేశీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్) తెలిపింది. మరో సాఫ్ట్వేర్ దిగ్గజం ఇన్ఫోసిస్ సైతం క్యూ4 ఫలితాలకు సంబంధించి ఇప్పటికే ఇదే విధంగా స్పందించిన విషయం తెలిసిందే. తాజా వ్యాఖ్యలతో బీఎస్ఈలో టీసీఎస్ షేరు దాదాపు 4% పతనమై రూ. 2,041 వద్ద ముగిసింది. ఒక దశలో 5%పైగా దిగజారి రూ. 2,015కు కూడా చేరింది. ఇది మూడు నెలల కనిష్టంకాగా, కంపెనీ మార్కెట్ విలువలో రూ. 16,000 కోట్లు ఆవిరైంది. కంపెనీ మొత్తం మార్కెట్ విలువ రూ. 3.99 లక్షల కోట్లకు పరిమితమైంది. ఈ బాటలో ఇన్ఫోసిస్ షేరు సైతం 2.3% క్షీణించి రూ. 3,271 వద్ద ముగిసింది. సాధారణమే... అక్టోబర్-డిసెంబర్(క్యూ3) కాలంతో పోలిస్తే ప్రస్తుతం నడుస్తున్న క్యూ4లో ఫలితాలు బలహీనంగా ఉండవచ్చునని టీసీఎస్ యాజమాన్యం వెల్లడించింది. ఇందుకు అధిక సెలవులు కారణంకాగా, సహజంగానే సాఫ్ట్వేర్ కంపెనీల నాలుగో క్వార్టర్ ఫలితాలు అంత ప్రోత్సాహకరంగా ఉండవని వ్యాఖ్యానించింది. యూరప్‌లో మంచి వృద్ధిని సాధిస్తున్నప్పటికీ అమెరికా, యూకే మార్కెట్లలో సగటు వృద్ధి నమోదవుతున్నట్లు వివరించింది. ఇక దేశీయ మార్కెట్లలో మందగమనం కొనసాగుతున్నదని, క్షీణత నమోదుకావచ్చునని వెల్లడించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన క్యూ3లో కంపెనీ నికర లాభం 50%పైగా ఎగసి రూ. 5,333 కోట్లకు చేరిన విషయం విదితమే. ఇదే కాలంలో ఆదాయం కూడా 32.5% జంప్ చేసి రూ. 21,294 కోట్లను తాకింది. కాగా, ప్రాజెక్ట్‌లు రద్దుకావడం, డిమాండ్ మందగించడం వంటి కారణాల వల్ల సమీప కాలానికి పనితీరు బలహీనపడే అవకాశమున్నదని ఇన్ఫోసిస్ సీఈవో ఎస్డీ సిబూలాల్ గత వారమే పేర్కొన్నారు. దీంతో ఇన్ఫోసిస్ షేరు 9% పడింది కూడా. అయితే వచ్చే ఆర్థిక సంవత్సరానికి(2014-15) ప్రోత్సాహకర ఫలితాలను సాధించగలమంటూ టీసీఎస్ యాజమాన్యం నమ్మకాన్ని వ్యక్తం చేయడం గమనార్హం. ఇందుకు క్లయింట్ల వ్యయాలు పెరుగుతుండటం దోహదపడగలదని తెలిపింది. మీడియా, లైఫ్‌సైన్స్ విభాగాలకు పటిష్ట డిమాండ్ కనిపిస్తుండగా, బీఎఫ్ఎస్ఐ, రిటైల్, తయారీ, టెలికం సైతం సగటు వృద్ధిని సాధించగలవని అంచనా వేస్తున్నట్లు తెలిపింది. ఇక కరెన్సీకి సంబంధించి పెద్ద ప్రభావం ఉండబోదని అభిప్రాయపడింది. ఇటీవల సాఫ్ట్వేర్ షేర్లలో వచ్చిన పటిష్టమైన ర్యాలీ కారణంగా ఇన్వెస్టర్లు అమ్మకాలు చేపడుతున్నారని విశ్లేషకులు పేర్కొన్నారు. మార్చి ముగియనుండటంతో లాభాల స్వీకరణ ధ్యేయంతో అమ్మకాలు పెరుగుతున్నాయని తెలిపారు.