క్యూ4లో రూ. 1,936 కోట్లు
షేరుకి రూ. 80 డివిడెండ్
న్యూఢిల్లీ: ద్విచక్ర, త్రిచక్ర వాహన దిగ్గజం బజాజ్ ఆటో గత ఆర్థిక సంవత్సరం(2023–24) చివరి త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. జనవరి–మార్చి(క్యూ4)లో స్టాండెలోన్ నికర లాభం 35 శాతం జంప్‌చేసింది. రూ. 1,936 కోట్లను తాకింది. 2022–23 ఇదే కాలంలో రూ. 1,433 కోట్లు మాత్రమే ఆర్జించింది. మొత్తం ఆదా యం సైతం 29% వృద్ధితో రూ. 11,485 కోట్లకు చేరింది. మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి నికర లాభం 33 శాతం ఎగసి రూ. 7,479 కోట్లయ్యింది. 2022–23లో కేవలం రూ. 5,628 కోట్లు ఆర్జించింది. మొత్తం టర్నోవర్ రూ. 36,248 కోట్ల నుంచి రూ. 44,685 కోట్లకు వృద్ధి చెందింది. వాటాదారులకు షేరుకి రూ. 80 చొప్పున తుది డివిడెండ్ ప్రకటించింది.
వాహన విక్రయాలు జూమ్
క్యూ4లో బజాజ్ ఆటో మొత్తం వాహన విక్రయాలు 24 శాతం పెరిగి 10,68,576 యూనిట్లకు చేరాయి. వీటిలో ద్విచక్ర వాహనాలు 26 శాతం పుంజుకుని 9,16,817ను తాకగా.. 13 శాతం అధికంగా 1,51,759 వాణిజ్య వాహనాలు విక్రయించింది.
బజాజ్ ఆటో షేరు బీఎస్‌ఈలో 1.1 శాతం లాభంతో రూ. 9,018 వద్ద ముగిసింది.
Comments
Please login to add a commentAdd a comment