ఫైల్ ఫోటో
సాక్షి, ముంబై: ప్రముఖ ఐటీ సేవల సంస్థ హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ క్యూ4లో మెరుగైన ఫలితాలను సాధించింది. మార్చి 2020తో ముగిసిన త్రైమాసికంలో ఏకీకృత నికర లాభం రూ. 3154 కోట్లగా వుంది. త్రైమాసిక పరంగా 3.8 శాతం వృద్ధిని కంపెనీ నమోదు చేయగా, వార్షిక ప్రాతిపదికన నికర లాభం 22.8 శాతం పెరిగింది.
సీక్వెన్షియల్ ప్రాతిపదికన ఆదాయం 2.5 శాతం పెరిగి రూ .18,590 కోట్లకు చేరుకుంది. స్థిరమైన కరెన్సీ పరంగా ఆదాయం 0.8 శాతం పెరిగింది. వడ్డీ పన్నులకు ముందు ఆదాయాలు (ఇబిఐటి) 3,881 కోట్ల రూపాయలుగా ఉండగా, అంతకుముందు ఏడాది త్రైమాసికంతో పోలిస్తే ఇది 5.8 శాతం పెరిగింది, ఈ త్రైమాసికంలో ఇబిఐటి మార్జిన్ 20.9 శాతంగా ఉంది. అలాగే 19.6 శాతంగా ఉన్న ఇబిఐటి మార్జిన్ గైడెడ్ పరిధి 19.0 శాతం నుంచి 19.5 శాతానికి పెరిగింది. దీంతొపాటు 2019-20 ఆర్థిక సంవత్సరానికి ఈక్విటీ షేరుకు రూ .2 చొప్పున తుది డివిడెండ్‌ను డైరెక్టర్ల బోర్డు సిఫార్సు చేసింది. డివిడెండ్ చెల్లింపులో ఇది వరుసగా 69వ త్రైమాసికమని కంపెనీ పేర్కొంది. నాల్గవ త్రైమాసికంలో హెచ్‌సిఎల్ 1,250 మంది ఉద్యోగులను చేర్చకోగా, మొత్తం పూర్తికాల ఉద్యోగుల సంఖ్య 1,50,423 కు చేరింది. (రుణాలపై వడ్డీరేట్లు తగ్గించిన ఎస్‌బీఐ)
హెచ్‌సీఎల్ టెక్ లాభం, ఆదాయం విశ్లేషకుల అంచనాల కంటే మెరుగ్గా ఉన్నాయి. ఎమ్కే గ్లోబల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సంస్థ నికర అమ్మకాలు సంవత్సరానికి 16 శాతం పెరిగి రూ. 18,553 కోట్లగాను నికర లాభం (పన్ను తరువాత లాభం) రూ .1931 కోట్లుగా ఉంటుందని అంచనా వేసింది. ఎడెల్వీస్ సెక్యూరిటీస్ రూపాయి పరంగా ఆదాయం రూ .18,557 కోట్లకు పెరుగుతుందని అంచనా వేసింది. వార్షిక ప్రాతికపదికన 8 శాతం వృద్ధితో నికర లాభం రూ .2,784 కోట్లుగా అంచనా వేసింది.
2020 ఆర్థిక సంవత్సరం తమకొక ఒక మైలురాయి లాంటిదని ఫలితాల సందర్భంగా సంస్థ ప్రకటించింది. ఇటీవలి సంవత్సరాలలో పోలిస్తే ఈ ఏడాది అత్యధిక వృద్ధిని సాధించింది. అలాగే వరుసగా నాలుగవ సంవత్సరం మెరుగైన పనితీరును కనబర్చినట్టు చెప్పింది. మార్జిన్ గైడెన్స్ టాప్-ఎండ్‌ను మించిపోయిందని హెచ్‌సిఎల్ టెక్నాలజీస్ ప్రెసిడెంట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సీ విజయకుమార్ ప్రకటించారు. (కోవిడ్-19 : కోటక్ మహీంద్ర వేతనాల కోత)
Comments
Please login to add a commentAdd a comment