divedend
-
ప్రభుత్వానికి దన్ను: ఓఎన్జీసీ భారీ డివిడెండ్
న్యూఢిల్లీ: ఇంధన రంగ పీఎస్‌యూ దిగ్గజం ఓఎన్జీసీ నుంచి ప్రభుత్వానికి డివిడెండ్ రూపేణా రూ. 5,001 కోట్లు లభించింది. వెరసి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ(సీపీఎస్ఈ)ల నుంచి ఈ ఆర్థిక సంవత్సరం(2022–23)లో ఇప్పటివరకూ ప్రభుత్వం డివిడెండ్ల ద్వారా దాదాపు రూ. 23,797 కోట్లు అందుకుంది. ఈ విషయాలను దీపమ్ కార్యదర్శి తుహిన్ కాంతా పాండే తాజాగా ట్వీట్ ద్వారా వెల్లడించారు. 2020లో నిలకడైన డివిడెండ్ల చెల్లింపు విధానాలను అవలంబించమంటూ సీపీఎస్ఈలకు దీపమ్ సూచించిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా లాభదాయకత, పెట్టుబడి అవసరాలు, నగదు నిల్వలు, నెట్‌వర్త్ వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుంటూనే అధిక డివిడెండ్ చెల్లింపులకు ఆదేశించింది. ప్రభు త్వ మార్గదర్శకాల ప్రకారం సీపీఎస్ఈలు వార్షికంగా నికర లాభాల నుంచి కనీసం 30% లేదా నెట్‌వర్త్‌లో 5% డివిడెండ్లుగా ప్రకటించవలసి ఉంటుంది. -
అదరగొట్టిన ఐటీ దిగ్గజం : డివిడెండ్
సాక్షి, ముంబై: ప్రముఖ ఐటీ సేవల సంస్థ హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ క్యూ4లో మెరుగైన ఫలితాలను సాధించింది. మార్చి 2020తో ముగిసిన త్రైమాసికంలో ఏకీకృత నికర లాభం రూ. 3154 కోట్లగా వుంది. త్రైమాసిక పరంగా 3.8 శాతం వృద్ధిని కంపెనీ నమోదు చేయగా, వార్షిక ప్రాతిపదికన నికర లాభం 22.8 శాతం పెరిగింది. సీక్వెన్షియల్ ప్రాతిపదికన ఆదాయం 2.5 శాతం పెరిగి రూ .18,590 కోట్లకు చేరుకుంది. స్థిరమైన కరెన్సీ పరంగా ఆదాయం 0.8 శాతం పెరిగింది. వడ్డీ పన్నులకు ముందు ఆదాయాలు (ఇబిఐటి) 3,881 కోట్ల రూపాయలుగా ఉండగా, అంతకుముందు ఏడాది త్రైమాసికంతో పోలిస్తే ఇది 5.8 శాతం పెరిగింది, ఈ త్రైమాసికంలో ఇబిఐటి మార్జిన్ 20.9 శాతంగా ఉంది. అలాగే 19.6 శాతంగా ఉన్న ఇబిఐటి మార్జిన్ గైడెడ్ పరిధి 19.0 శాతం నుంచి 19.5 శాతానికి పెరిగింది. దీంతొపాటు 2019-20 ఆర్థిక సంవత్సరానికి ఈక్విటీ షేరుకు రూ .2 చొప్పున తుది డివిడెండ్‌ను డైరెక్టర్ల బోర్డు సిఫార్సు చేసింది. డివిడెండ్ చెల్లింపులో ఇది వరుసగా 69వ త్రైమాసికమని కంపెనీ పేర్కొంది. నాల్గవ త్రైమాసికంలో హెచ్‌సిఎల్ 1,250 మంది ఉద్యోగులను చేర్చకోగా, మొత్తం పూర్తికాల ఉద్యోగుల సంఖ్య 1,50,423 కు చేరింది. (రుణాలపై వడ్డీరేట్లు తగ్గించిన ఎస్బీఐ) హెచ్‌సీఎల్ టెక్ లాభం, ఆదాయం విశ్లేషకుల అంచనాల కంటే మెరుగ్గా ఉన్నాయి. ఎమ్కే గ్లోబల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సంస్థ నికర అమ్మకాలు సంవత్సరానికి 16 శాతం పెరిగి రూ. 18,553 కోట్లగాను నికర లాభం (పన్ను తరువాత లాభం) రూ .1931 కోట్లుగా ఉంటుందని అంచనా వేసింది. ఎడెల్వీస్ సెక్యూరిటీస్ రూపాయి పరంగా ఆదాయం రూ .18,557 కోట్లకు పెరుగుతుందని అంచనా వేసింది. వార్షిక ప్రాతికపదికన 8 శాతం వృద్ధితో నికర లాభం రూ .2,784 కోట్లుగా అంచనా వేసింది. 2020 ఆర్థిక సంవత్సరం తమకొక ఒక మైలురాయి లాంటిదని ఫలితాల సందర్భంగా సంస్థ ప్రకటించింది. ఇటీవలి సంవత్సరాలలో పోలిస్తే ఈ ఏడాది అత్యధిక వృద్ధిని సాధించింది. అలాగే వరుసగా నాలుగవ సంవత్సరం మెరుగైన పనితీరును కనబర్చినట్టు చెప్పింది. మార్జిన్ గైడెన్స్ టాప్-ఎండ్‌ను మించిపోయిందని హెచ్‌సిఎల్ టెక్నాలజీస్ ప్రెసిడెంట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సీ విజయకుమార్ ప్రకటించారు. (కోవిడ్-19 : కోటక్ మహీంద్ర వేతనాల కోత) -
కేంద్రానికి ఆర్బీఐ భారీ డివిడెండ్..?
సాక్షి, ముంబై: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చే డివిడెండ్ పెద్దమొత్తంలో రానుందని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఆర్బీఐ నుంచి తాత్కాలిక డివిడెండ్‌గా రూ .10,000 కోట్లు (1.5 బిలియన్ డాలర్లు) అందుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. ఆర్బీఐ డివిడెండ్ చెల్లింపులు ఐదు సంవత్సరాల కనిష్ట స్థాయికి పడిపోయిన తరువాత, కేంద్రం ఈ భారీ అంచనా వేస్తోంది. 2017-18 తొలి ఆరు నెలల కాలానికి రిజర్వ్ బ్యాంక్ నుంచి రూ.10 వేల కోట్ల డివిడెండ్‌ను కేంద్రం ఆశిస్తోంది. ఈ మొత్తాన్ని ఈ మార్చి నెలలోనే విడుదల చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రతీ ఏటా కేంద్ర ప్రభుత్వానికి డివిడెండ్‌ను చెల్లిస్తూ ఉంటుంది. ఆర్బీఐ ఆర్థిక సంవత్సరం జూలై నుంచి జూన్ వరకు లెక్కిస్తారు. గతంతో పోల్చితే ఇప్పుడు ఆర్బీఐ చెల్లించే డివిడెండ్లు బాగా తగ్గిపోయాయి. ముఖ్యంగా ఐదు సంవత్సరాల కనిష్ట స్థాయికి చేరడంతో..అదనపు చెల్లింపులు చేయాలంటూ కేంద్రం అభ్యర్ధించినా.. ఆర్బీఐ మాత్రం తిరస్కరించింది. అయితే తాజాగా కేంద్రం ఆశించిన స్థాయిలోనే డివిడెండ్ చెల్లింపులు ఉంటాయని.. దాదాపు రూ. 10 వేల కోట్ల మధ్యంతర డివిడెండ్ రూపంలో కేంద్రానికి త్వరలోనే చెల్లించే అవకాశాలు ఉన్నాయని సమాచారం. అయితే ఈ వార్తలపై అటు ఆర్బీఐ , ఇటు ఆర్థికమంత్రిత్వ శాఖ అధికారులనుంచి గానీ అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. -
ఇండిగో లాభాలు ఢమాల్.. భారీ డివిడెండ్
న్యూఢిల్లీ: మార్కెట్ వాటా పరంగా దేశీయంగా అతిపెద్ద ఎయిర్‌లైన్ ఇండిగో లాభాల్లో ఢమాల్ అంది. ఇండిగో పేరెంటల్ కంపెనీ ఇంటర్ గ్లోబ్ ఏవియేషన్ క్యూ4 లో నిరాశాజనక ఫలితాలను నమోదు చేసింది. మంగళవారం ప్రకకటించిన ఈ ఫలితాల్లో లాభాలు 25శాతం క్షీణించాయి. 2017 మార్చితో ముగిసిన నాలుగవ త్రైమాసికంలో 440.31 కోట్ల రూపాయలు ఆర్జించింది. కాగా గత ఏడాది ఇదే కాలంలోరూ. 583.78 కోట్ల లాభాలను సాధించింది. ఆదాయం కూడా గత ఏడాది రూ.1986 కోట్లతో పోలిస్తే 16.5 శాతం క్షీణించి 1659 కోట్లను సాదించింది ఇంధన వ్యయం పెరగడంతో గత ఆర్థిక సంవత్సరం నాలుగవ త్రైమాసికంలో సంస్థ మొత్తం ఖర్చులు దాదాపు 31 శాతం పెరిగి 4,523.04 కోట్లుగా నమోదు చేసింది. సంవత్సరం క్రితం ఇదే కాలంలో మొత్తం ఖర్చు 3,458.20 కోట్లు. గత ఏడాది ఇదే కాలంలోరూ. 4,090.68 కోట్లుగా ఉంది. నాలుగో త్రైమాసికంలో ఇంధన వ్యయం 71 శాతం పెరిగి రూ. 1,750.51 కోట్లుగా నమోదైంది. గత త్రైమాసికంలో ఇంధన ధరలు 38 శాతం పెరిగినప్పటికీ పన్నుల తర్వాత 4.4 బిలియన్ డాలర్ల లాభాన్ని నమోదు చేశామని ఇండిగో అధ్యక్షుడు, హోల్ టైమ్ డైరెక్టర్ ఆదిత్య ఘోష్ ఫలితాల ప్రకటన సందర్భంగా చెప్పారు. అలాగే 2017 ఆర్థిక సంవత్సరానికి ప్రతి ఈక్విటీ షేరుకు రూ.34 డివిడెండ్ చెల్లించేందుకు బోర్డు ప్రతిపాదించినట్టు ఆదిత్య ప్రకటించారు. కాగా ప్రాంతీయ ఎయిర్ కనెక్టివిటీ పుష్లో భాగంగా 70 మందికి సీటింగ్ సామర్ధ్యం ఉన్న 50 ఎటిఆర్ 72-600 విమానాలను కొనుగోలు చేసేందుకు ఇందిగో ఇటీవల ఒక ఒప్పందం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే.