కేంద్రానికి ఆర్‌బీఐ భారీ డివిడెండ్‌..? | Govt is poised to get Rs10,000 crore dividend from RBI | Sakshi
Sakshi News home page

కేంద్రానికి ఆర్‌బీఐ భారీ డివిడెండ్‌..?

Published Tue, Mar 6 2018 3:48 PM | Last Updated on Mon, Aug 20 2018 9:18 PM

Govt is poised to get Rs10,000 crore dividend from RBI - Sakshi

సాక్షి, ముంబై:  రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా నుంచి వచ్చే డివిడెండ్‌  పెద్దమొత్తంలో  రానుందని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఆర్‌బీఐ నుంచి తాత్కాలిక డివిడెండ్‌గా  రూ .10,000 కోట్లు (1.5 బిలియన్ డాలర్లు) అందుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది.  ఆర్‌బీఐ డివిడెండ్ చెల్లింపులు ఐదు సంవత్సరాల కనిష్ట స్థాయికి పడిపోయిన తరువాత,  కేంద్రం ఈ భారీ అంచనా  వేస్తోంది. 2017-18 తొలి ఆరు నెలల కాలానికి రిజర్వ్ బ్యాంక్ నుంచి రూ.10 వేల కోట్ల డివిడెండ్‌ను కేంద్రం ఆశిస్తోంది. ఈ మొత్తాన్ని ఈ మార్చి నెలలోనే విడుదల చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.  

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రతీ ఏటా కేంద్ర ప్రభుత్వానికి డివిడెండ్‌ను చెల్లిస్తూ ఉంటుంది.  ఆర్‌బీఐ  ఆర్థిక సంవత్సరం  జూలై నుంచి జూన్ వరకు లెక్కిస్తారు.  గతంతో పోల్చితే ఇప్పుడు ఆర్బీఐ చెల్లించే డివిడెండ్లు బాగా తగ్గిపోయాయి. ముఖ్యంగా ఐదు సంవత్సరాల కనిష్ట స్థాయికి చేరడంతో..అదనపు చెల్లింపులు చేయాలంటూ కేంద్రం అభ్యర్ధించినా.. ఆర్బీఐ మాత్రం తిరస్కరించింది. అయితే తాజాగా కేంద్రం ఆశించిన స్థాయిలోనే డివిడెండ్ చెల్లింపులు ఉంటాయని.. దాదాపు రూ. 10 వేల కోట్ల మధ్యంతర డివిడెండ్ రూపంలో కేంద్రానికి త్వరలోనే చెల్లించే అవకాశాలు ఉన్నాయని  సమాచారం. అయితే ఈ వార్తలపై అటు ఆర్‌బీఐ , ఇటు ఆర్థికమంత్రిత్వ శాఖ అధికారులనుంచి గానీ అధికారిక  ప్రకటన రావాల్సి ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement