ఇండిగో లాభాలు ఢమాల్.. భారీ డివిడెండ్
ఇండిగో లాభాలు ఢమాల్.. భారీ డివిడెండ్
Published Tue, May 9 2017 7:12 PM | Last Updated on Thu, Jul 11 2019 8:56 PM
న్యూఢిల్లీ: మార్కెట్ వాటా పరంగా దేశీయంగా అతిపెద్ద ఎయిర్లైన్ ఇండిగో లాభాల్లో ఢమాల్ అంది. ఇండిగో పేరెంటల్ కంపెనీ ఇంటర్ గ్లోబ్ ఏవియేషన్ క్యూ4 లో నిరాశాజనక ఫలితాలను నమోదు చేసింది. మంగళవారం ప్రకకటించిన ఈ ఫలితాల్లో లాభాలు 25శాతం క్షీణించాయి. 2017 మార్చితో ముగిసిన నాలుగవ త్రైమాసికంలో 440.31 కోట్ల రూపాయలు ఆర్జించింది. కాగా గత ఏడాది ఇదే కాలంలోరూ. 583.78 కోట్ల లాభాలను సాధించింది. ఆదాయం కూడా గత ఏడాది రూ.1986 కోట్లతో పోలిస్తే 16.5 శాతం క్షీణించి 1659 కోట్లను సాదించింది ఇంధన వ్యయం పెరగడంతో గత ఆర్థిక సంవత్సరం నాలుగవ త్రైమాసికంలో సంస్థ మొత్తం ఖర్చులు దాదాపు 31 శాతం పెరిగి 4,523.04 కోట్లుగా నమోదు చేసింది. సంవత్సరం క్రితం ఇదే కాలంలో మొత్తం ఖర్చు 3,458.20 కోట్లు. గత ఏడాది ఇదే కాలంలోరూ. 4,090.68 కోట్లుగా ఉంది.
నాలుగో త్రైమాసికంలో ఇంధన వ్యయం 71 శాతం పెరిగి రూ. 1,750.51 కోట్లుగా నమోదైంది. గత త్రైమాసికంలో ఇంధన ధరలు 38 శాతం పెరిగినప్పటికీ పన్నుల తర్వాత 4.4 బిలియన్ డాలర్ల లాభాన్ని నమోదు చేశామని ఇండిగో అధ్యక్షుడు, హోల్ టైమ్ డైరెక్టర్ ఆదిత్య ఘోష్ ఫలితాల ప్రకటన సందర్భంగా చెప్పారు. అలాగే 2017 ఆర్థిక సంవత్సరానికి ప్రతి ఈక్విటీ షేరుకు రూ.34 డివిడెండ్ చెల్లించేందుకు బోర్డు ప్రతిపాదించినట్టు ఆదిత్య ప్రకటించారు. కాగా ప్రాంతీయ ఎయిర్ కనెక్టివిటీ పుష్‌లో భాగంగా 70 మందికి సీటింగ్ సామర్ధ్యం ఉన్న 50 ఎటిఆర్ 72-600 విమానాలను కొనుగోలు చేసేందుకు ఇందిగో ఇటీవల ఒక ఒప్పందం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే.
Advertisement
Advertisement