Q4 Profit
-
డీమార్ట్ లాభాలు ఎంత పెరిగాయో తెలుసా?
సాక్షి, ముంబై: డీమార్ట్ సూపర్‌మార్కెట్ చెయిన్ అవెన్యూ సూపర్‌మార్ట్స్ లాభాలతో అదరగొట్టింది. మార్చితో ముగిసిన మూడు నెలల కాలానికిగాను సంస్థ రూ.413.87 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని ఆర్జించింది. గత ఏడాది(2020) ఇదే కాలంలో వచ్చిన రూ.271.28 కోట్ల లాభంతో పోలిస్తే ఇది 52.56 శాతం అధికం. అవెన్యూ సూపర్‌మార్ట్ లిమిటెడ్‌కు చెందిన డీ-మార్ట్‌కు గత త్రైమాసికానికిగాను రూ.7,411.68 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. 2019-20 ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో ఆర్జించిన రూ.6,255. 93 కోట్ల ఆదాయంతో పోలిస్తే 18.47 శాతం అధికమైంది. వార్షికంగా మార్జిన్ ఆధాయం 8.3 శాతం పెరిగి రూ.613 కోట్లకు చేరుకున్నాయి. చదవండి: వాట్సాప్‌లో ఆర్డర్ చేస్తే ఇంటి వద్దకే ఫుడ్ డెలివరీ! -
కార్డుల్ని మించిన యూపీఐ
న్యూఢిల్లీ: ఏకీకృత చెల్లింపు విధానం (యూపీఐ) ద్వారా లావాదేవీలు క్రమంగా పుంజుకుంటున్నాయి. గతేడాది మార్చి నుంచి ఈ ఏడాది మార్చి మధ్య కాలంలో నెలవారీ లావాదేవీల సంఖ్య 4.5 రెట్లు పెరిగి.. 79.95 కోట్ల స్థాయికి చేరింది. ఈ క్రమంలో క్రెడిట్, డెబిట్ కార్డు లావాదేవీలను కూడా మించి యూపీఐ చెల్లింపులు నమోదవుతున్నాయి. ఈ ఏడాది జనవరిలో యూపీఐ లావాదేవీల విలువ రూ.1.09 లక్షల కోట్లుగా ఉండగా, కార్డు లావాదేవీల విలువ రూ.1.05 లక్షల కోట్లకు పరిమితమైంది. ఇక ఫిబ్రవరిలో యూపీఐ లావాదేవీల విలువ రు. 1.07 లక్షల కోట్లు కాగా.. కార్డుల విలువ రూ.93,998 కోట్లుగా నమోదైంది. మార్చిలో రెండు విధానాల్లోనూ చెల్లింపులు రూ.1 లక్ష కోట్లు దాటాయి. యూపీఐ ద్వారా రూ. 1.33 లక్షల కోట్లు, కార్డుల ద్వారా రూ.1.11 లక్షల కోట్ల విలువ చేసే లావాదేవీలు జరిగాయి. యూజర్లను ఆకర్షించేందుకు యూపీఐ యాప్స్.. డిస్కౌంట్లు, స్క్రా^Œ కార్డులు, క్యాష్‌బ్యాక్ ఆఫర్లు వంటివి అందిస్తుండటం కూడా ఈ విధానం ఆదరణ పొందడానికి కారణంగా ఉంటోందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. 2020 నాటికి 80 శాతం .. ఏడాది క్రితం పేమెంట్ గేట్వేస్ పరిమాణంలో యూపీఐ వాటా కేవలం 2 శాతమే ఉండగా.. ప్రస్తుతం 20 శాతానికి పెరిగిందని రేజర్‌పే సంస్థ సహ వ్యవస్థాపకుడు, సీఈవో హర్షిల్ మాథుర్ పేర్కొన్నారు. ఇదే తీరు కొనసాగితే పాత తరం డిజిటల్ పేమెంట్స్ విధానాల మార్కెట్‌ను యూపీఐ మరింతగా ఆక్రమించే అవకాశం ఉందని కన్సల్టెన్సీ సంస్థ పీడబ్ల్యూసీ ఇండియా అభిప్రాయపడింది. 2020 నాటికల్లా కార్డుల ద్వారా జరిగే లావాదేవీల్లో దాదాపు 80 శాతం లావాదేవీలు యూపీఐకి మారే అవకాశం ఉందని పేర్కొంది. డిజిటల్‌దే అగ్రభాగం: ఆర్బీఐ తక్కువ స్థాయిలో నగదు వినియోగించే సొసైటీగా భారత్‌ను మార్చే ‘పేమెంట్ అండ్ సెటిల్మెంట్ సిస్టమ్స్ ఇన్ ఇండియా: విజన్ 2019– 2021ను ఆర్బీఐ ఆవిష్కరించింది. దీని ప్రకారం 2018 డిసెంబర్ నాటికి డిజిటల్ లావాదేవీలు 2,069 కోట్లు కాగా, 2021 నాటికి నాలుగురెట్లు పెరిగి 8,707 కోట్లకు చేరుతాయి. డిజిటల్ చెల్లింపుల విషయంలో కస్టమర్ల నుంచి వసూలు చేసే చార్జీల విషయంలో ఆర్బీఐ జోక్యం పరిమితంగానే ఉంటుంది. -
ఎస్బీఐ లాభం 838 కోట్లు
న్యూఢిల్లీ: దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) గత ఆర్థిక సంవత్సరం(2018–19) నాలుగో త్రైమాసిక కాలంలో రూ.838 కోట్ల నికర లాభం(స్టాండ్అలోన్) సాధించింది. మొండి బకాయిలు తగ్గడం, వడ్డీ వ్యయాలు కూడా ఒక శాతం తగ్గడంతో ఈ స్థాయిలో నికర లాభం వచ్చిందని ఎస్బీఐ చైర్మన్ రజనీశ్ కుమార్ పేర్కొన్నారు. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం(2017–18) ఇదే క్వార్టర్లో రూ.7,719 కోట్ల నికర నష్టాలు వచ్చాయని వివరించారు. మొత్తం ఆదాయం రూ.68,436 కోట్ల నుంచి 11 శాతం వృద్ధితో రూ.75,671 కోట్లకు పెరిగిందని పేర్కొన్నారు. నికర వడ్డీ మార్జిన్ 2.95 శాతంగా నమోదైందని వివరించారు. రానున్నదంతా మంచి కాలమేనన్న ఆశాభావం ఆయన వ్యక్తం చేశారు. లాభాల్లో నడుస్తున్న తమ అనుబంధ కంపెనీలు, ఎస్బీఐ కార్డ్, ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్‌లను త్వరలో స్టాక్ మార్కెట్లో లిస్ట్ చేస్తామని చెప్పారు. ఏడాది లాభం రూ.6,547 కోట్లు... ఇక పూర్తి ఏడాది పరంగా చూస్తే, 2017–18లో రూ.6,547 కోట్ల నికర నష్టాలు రాగా(స్టాండ్అలోన్), గత ఆర్థిక సంవత్సరంలో రూ.862 కోట్ల నికర లాభం(కన్సాలిడేటెడ్) వచ్చిందని రజనీశ్ చెప్పారు. కీలకమైన కొన్ని ఒత్తిడి ఖాతాలకు వంద శాతం కేటాయింపుల కారణంగా నికర లాభం తగ్గిందని వివరించారు. కన్సాలిడేటెడ్ పరంగా చూస్తే, 2017–18లో రూ.4,187 కోట్ల నికర నష్టాలు రాగా, గత ఆర్థిక సంవత్సరంలో రూ.3,069 కోట్ల నికర లాభం వచ్చిందని చెప్పారు. ఆదాయం రూ.3.01 లక్షల కోట్ల నుంచి రూ.3.30 లక్షల కోట్లకు పెరిగిందని పేర్కొన్నారు. అంతర్జాతీయంగా రుణాల వృద్ధి అంతంతమాత్రంగానే ఉన్నా, దేశీయ రుణాలు 14 శాతం పెరగడంతో మొత్తం రుణ వృద్ధి 12 శాతంగా నమోదైందని తెలిపారు. మెరుగుపడిన రుణ నాణ్యత ఎస్బీఐ రుణ నాణ్యత మెరుగుపడింది. గత ఏడాది మార్చి నాటికి 10.91 శాతంగా ఉన్న స్థూల మొండి బకాయిలు ఈ ఏడాది మార్చినాటికి 7.53 శాతానికి తగ్గాయని రజనీశ్ కుమార్ తెలిపారు. అలాగే నికర మొండి బకాయిలు 5.73 శాతం నుంచి 3.01 శాతానికి పడిపోయాయని పేర్కొన్నారు. విలువ పరంగా చూస్తే, స్థూల మొండి బకాయిలు రూ.2,23,427 కోట్ల నుంచి రూ.1,72,750 కోట్లకు, నికర మొండి బకాయిలు రూ.1,10,855 కోట్ల నుంచి రూ.65,895 కోట్లకు తగ్గాయని తెలిపారు. గత ఆర్థిక సంవత్సరంలో రూ.37,000 కోట్ల రికవరీ జరిగిందని, బ్యాంక్ చరిత్రలో ఇదే అత్యధికమని చెప్పారు. తాజా మొండి బకాయిలు గత క్యూ4లో రూ.7,505 కోట్లకు, గత ఆర్థిక సంవత్సరం మొత్తంలో రూ.32,738 కోట్లకు చేరాయని తెలిపారు. తాజా మొండి బకాయిలు తక్కువగా ఉండటం, రికవరీలు పెరగడం, కేటాయింపులు పెరగడం వల్ల స్థూల, నికర మొండి బకాయిలు తగ్గాయని వివరించారు. 79 శాతానికి పీసీఆర్.. ప్రొవిజన్ కవరేజ్ రేషియో 12.6 శాతం పెరిగి 79 శాతానికి చేరింది. సీక్వెన్షియల్‌గా చూస్తే 4.1 శాతం మెరుగుపడింది. ఎస్సార్ స్టీల్, భూషణ్ పవర్ అండ్ స్టీల్, అలోక్ ఇండస్ట్రీస్ కంపెనీల దివాలా ప్రక్రియ తుది దశలో ఉందని, వీటికి సంబంధించిన రూ.16,000 కోట్ల బకాయిలు వసూలు కాగలవని పేర్కొన్నారు. ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌కు రూ.3,487 కోట్ల రుణాలిచ్చామని, వీటిల్లో 1,125 కోట్ల రుణాలు మొండి పద్దులుగా మారాయని వివరించారు. కాగా మార్చి చివరి నాటికి బ్యాంక్ టైర్ వన్ మూలధనం 9.62 శాతంగానే ఉంది. దీంతో క్యూఐపీ విధానంలో ఈ బ్యాంక్ నిధులు సమీకరించే అవకాశాలున్నాయని నిపుణులంటున్నారు. ఆర్థిక ఫలితాలు బావుండటంతో బీఎస్ఈలో ఎస్బీఐ షేర్ 3 శాతం ఎగసి రూ.308 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో బాగా లాభపడిన షేర్ ఇదే. స్వల్పంగా తగ్గిన ఎస్బీఐ రుణ రేటు న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం– స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) రుణ రేటు (ఎంసీఎల్ఆర్) స్వల్పంగా తగ్గింది. ఎంసీఎల్ఆర్కు అనుసంధానమైన అన్ని కాలపరిమితుల రుణాలపై ఐదు బేసిస్ పాయింట్ల (100 బేసిస్ పాయింట్లు ఒక శాతం) రుణ రేటు తగ్గినట్లు ఎస్బీఐ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది. తక్షణం తాజా రేట్లు అమల్లోకి వస్తాయని పేర్కొంది. ముఖ్యాంశాలు చూస్తే... ►ఏడాది ఎంసీఎల్ఆర్ 8.5 శాతం నుంచి8.45 శాతానికి తగ్గింది. ► గడచిన నెల రోజుల్లో ఎస్బీఐ రుణ రేటును తగ్గించడం ఇది రెండవసారి. ఆర్బీఐ పాలసీ రేటు ఏప్రిల్‌లో తగ్గించిన తరువాత, వెంటనే ఈ బ్యాంకింగ్ దిగ్గజం ఐదు బేసిస్ పాయింట్ల రుణ రేటును తగ్గించింది. ►ఏప్రిల్ 10 నుంచి గృహ రుణ రేట్లు 15 బేసిస్ పాయింట్లు తగ్గించినట్లు బ్యాంక్ ప్రకటన పేర్కొంది. ఆర్బీఐ పాలసీ రేట్ల ప్రయోజనాన్ని మరింతగా కస్టమర్లకు అందించడంలో భాగంగా మే 1వ తేదీ నుంచి లక్షపైన క్యాష్ క్రెడిట్, ఓవర్ డ్రాఫ్ట్ వడ్డీరేట్లను రెపోరేటుకు అనుసంధానించడం జరిగిందని ఎస్బీఐ పేర్కొంది. అంతా శుభమే అన్ని అంశాల్లో మంచి పనితీరు కనబరిచాం. టర్న్ అరౌండ్ సాధించాం. రుణ నాణ్యత మెరుగుపడింది. స్థూల, నికర మొండి బకాయిలు తగ్గాయి. భవిష్యత్తులో ఎలాంటి భారాన్ని మోయాల్సిన అవసరం లేదు. వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి అంతా శుభమే. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 10–12 శాతం రుణ వృద్ధి సాధించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నాం. రజనీష్ కుమార్, ఎస్బీఐ చైర్మన్ -
ఎయిర్టెల్ లాభం 29 శాతం అప్
న్యూఢిల్లీ: టెలికం దిగ్గజం భారతీ ఎయిర్టెల్ నికర లాభం గత ఆర్థిక సంవత్సరం (2018–19) జనవరి–మార్చి క్వార్టర్లో 29 శాతం ఎగసి రూ.107 కోట్లకు చేరింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం (2017–18) ఇదే క్వార్టర్లో ఈ కంపెనీకి రూ.83 కోట్ల నికర లాభం వచ్చింది. నష్టాలను ప్రకటించగలదన్న విశ్లేషకుల అంచనాలను తల్లకిందులు చేస్తూ ఈ కంపెనీ లాభాన్ని ప్రకటించడం విశేషం. భారత మొబైల్ సర్వీసుల వ్యాపారంలో నష్టాలు వచ్చినా, ఆఫ్రికా వ్యాపారం పుంజుకోవడం, అసాధారణ ఆదాయ లాభాల కారణంగా ఈ స్థాయి నికర లాభాన్ని ఈ కంపెనీ సాధించింది. చాలా క్వార్టర్ల తర్వాత నికర లాభంలో పెరుగుదల నమోదు కావడం ఇదే మొదటిసారి. సీక్వెన్షియల్‌గా చూస్తే, నికర లాభం 24 శాతం ఎగసింది. ఇక ఆదాయం 6 శాతం ఎగసి రూ.20,602 కోట్లకు పెరిగింది. గత క్యూ4లో రూ.2,022 కోట్ల మేర అసాధారణ ఆదాయ లాభాలు (నెట్వర్క్ రీ–ఫార్మింగ్, అప్‌గ్రెడేషన్ ప్రోగ్రామ్‌కు సంబంధించిన చార్జీలు, లెవీల పున:మదింపుకు సంబంధించిన మొత్తం) వచ్చాయని కంపెనీ పేర్కొంది. రూ.25,000 కోట్ల రైట్స్ ఇష్యూ ప్రస్తుతం నడుస్తోంది. ఈ నెల 17న ఈ రైట్స్ ఇష్యూ ముగియనున్నది. రెట్టింపైన ‘భారత’ నష్టాలు... ఈ కంపెనీ భారత వ్యాపారంలో అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం నాలుగో క్వార్టర్లో రూ.482 కోట్ల నష్టాలు వచ్చాయి. ఇక గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్లో ఈ నష్టాలు దాదాపు రెట్టింపై రూ.1,378 కోట్లకు పెరిగాయి. ఇదే కాలంలో ఆఫ్రికా మొబైల్ సర్వీసుల్లో లాభం రూ.1,129 కోట్ల నుంచి 1,317 కోట్లకు పెరిగింది. ఇక పూర్తి ఆర్థిక సంవత్సరం పరంగా చూస్తే, 2017–18 ఆర్థిక సంవత్సరంలో రూ.1,099 కోట్లుగా ఉన్న నికర లాభం గత ఆర్థిక సంవత్సరంలో దాదాపు సగం తగ్గి రూ.410 కోట్లకు పడిపోయింది. ఆదాయం కూడా రూ.82,639 కోట్ల నుంచి 2 శాతం తగ్గి రూ.80,780 కోట్లకు తగ్గింది. ముకేష్ అంబానీ రిలయన్స్ జియో నుంచి ఎదురవుతున్న పోటీ తట్టుకోవడానికి టెలికం కంపెనీలు టారిఫ్‌లను భారీగా తగ్గించాయి. ఫలితంగా ఆ కంపెనీల లాభదాయకతపై తీవ్రమైన ప్రభావం పడుతోంది. వాయిస్, డేటా వినియోగం రికార్డ్ స్థాయిల్లో ఉన్నా, టెలికం కంపెనీలకు పెద్దగా లాభాలు రావడం లేదని మరోసారి ఎయిర్టెల్ ఫలితాలు రుజువు చేశాయని నిపుణులంటున్నారు. మార్కెట్ ముగిసిన తర్వాత ఎయిర్టెల్ ఫలితాలు వెలువడ్డాయి. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో భారతీ ఎయిర్టెల్ షేర్ 0.6 శాతం లాభంతో రూ.333 వద్ద ముగిసింది. -
విజయా బ్యాంకు ఫలితాలు ఒకే!
సాక్షి, ముంబై: విజయ బ్యాంకు క్యూ4లో నష్టాలనుంచి కోలుకుని మెరుగైన ఫలితాలను నమోదు చేసింది. గతేడాది(2017-18) చివరి త్రైమాసికంలో విజయా బ్యాంకు నికర లాభం స్వల్పంగా 1.6శాతం పుంజుకుని రూ. 207 కోట్లకు చేరింది. ఈ త్రైమాసికంలో మొత్తం ఆదాయం 3,728 కోట్లకు పెరింగిందని రెగ్యులేటరీ ఫైలింగ్‌లో విజయా బ్యాంకు వెల్లడించింది. గత ఏడాది ఇది 3504 కోట్ల రూపాయలుగా ఉంది. నికర వడ్డీ ఆదాయం(ఎన్ఐఐ) కూడా 21 శాతం పుంజుకుని రూ. 1196 కోట్లకు చేరింది. ప్రొవిజన్లు రూ. 345 కోట్ల నుంచి రూ. 553 కోట్లకు ఎగశాయి. స్థూల మొండిబకాయిలు(ఎన్పీఏలు) 6.17 శాతం నుంచి 6.34 శాతానికి స్వల్పంగా పెరిగాయి. నికర ఎన్పీఏలు సైతం 3.99 శాతం నుంచి 4.32 శాతానికి పెరిగాయి. మరోవైపు ప్రతి ఈక్విటీ షేరుకు 1.20 రూపాయల డివిడెండ్ చెల్లించాలని బోర్డు ఆఫ్ డైరెక్టర్లు ప్రతిపాదించారని కంపెనీ వెల్లడించింది. ఈ ఫలితాల నేపథ్యంలో విజయా బ్యాంకు షేరు 2శాతం లాభపడి 61 రూపాయల వద్ద ముగిసింది. -
అంచనాలు బీట్ : జంప్ చేసిన ట్రాక్టర్ల దిగ్గజం
న్యూఢిల్లీ: ట్రాక్టర్ల నిర్మాణంలో అగ్రగామిగా ఉన్న దేశీయ వాహన నిర్మాణ కంపెనీ మహింద్రా అండ్ మహింద్రా అంచనాలను అధిగమించింది. మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికంలో కన్సాలిడేటెడ్ నికర లాభాలు ఏడాది ఏడాదికి 26.30 శాతం జంప్ అయి, రూ.874 కోట్లగా రికార్డయ్యాయి. కన్సాలిడేటెడ్ స్థూల రాబడి, ఇతర ఆదాయాలు కూడా కంపెనీవి 5.2 శాతం పెరిగి, రూ.12,889 కోట్లగా ఉన్నాయి. ఈ త్రైమాసికంలో దేశీయ మార్కెట్లో 46,583 ట్రాక్టర్లను విక్రయించినట్టు కంపెనీ ప్రకటించింది. ఏడాది ఏడాది బేసిస్ లో ఇది 13.30 శాతం వృద్ధి. ఎగుమతులు 10,831 యూనిట్లుగా ఉన్నట్టు కంపెనీ పేర్కొంది. మంగళవారం ప్రకటించిన ఫలితాల సందర్భంగా ఫేస్ వాల్యు 5 రూపాయలు కలిగిన ఒక్కో షేరుకు రూ.13 డివిడెండ్ ను బోర్డు ఆఫ్ డైరెక్టర్లు ప్రతిపాదించినట్టు తెలిపింది. వరుసగా రెండో ఏడాదికూడా రుతుపవనాలు సాధారణంగా ఉంటాయని అంచనాలు వస్తుండటంతో, డిమాండ్ మంచిగా రికవరీ అవుతుందని మహింద్రా అండ్ మహింద్రా పేర్కొంటోంది. మంగళవారం ట్రేడింగ్ లో కంపెనీ షేర్లు 0.82 శాతం పెరిగి రూ.1362గా నమోదయ్యాయి. -
అంచనాలు మిస్ చేసిన టెక్ మహీంద్రా
దేశంలో నాలుగో అతిపెద్ద టెక్ దిగ్గజం టెక్ మహీంద్రా అంచనాలను మిస్ చేసింది. అంచనావేసిన దానికంటే తక్కువ లాభాలను ప్రకటించింది. శుక్రవారం వెల్లడించిన మార్చితో ముగిసిన నాలుగో క్వార్టర్ ఫలితాల్లో ఈ కంపెనీ నికర లాభాలు 30.2 శాతం పడిపోయి, రూ.589.6 కోట్లగా నమోదయ్యాయి. ముందటేడాది ఇదే క్వార్టర్ లో కంపెనీకి రూ.876 కోట్ల లాభాలున్నాయి. ఈ మార్చి క్వార్టర్ లో టెక్ మహింద్రా రూ.783 కోట్ల కన్సాలిడేటెడ్ లాభాలను ఆర్జిస్తుందని థామ్సన్ రాయిటర్స్ సర్వేలో విశ్లేషకులు అంచనావేశారు. ఈ క్వార్టర్ లో రెవెన్యూలు స్వల్పంగా 0.8 శాతం పడిపోయి రూ.7,495కోట్లగా ఉన్నాయి. కానీ ఏడాది ఏడాదికి బేసిస్ లో ఇవి రూ.8.9 శాతం పెరిగాయి. ఈబీఐటీడీఏలు కూడా ఈ క్వార్టర్ లో ఏడాది ఏడాదికి 21.9 శాతం తగ్గి రూ.899కోట్లగా నమోదయ్యాయి. మార్జిన్లు 12 శాతం పైకి ఎగిశాయి. క్వార్టర్ ఫలితాలతో పాటు టెక్ మహీంద్రా 2017 వార్షిక ఫలితాలను కూడా ప్రకటించింది. ఈ ఏడాదిలో కంపెనీ నికర లాభాలు 6 శాతం పడిపోయి, రూ.2813 కోట్లగా రికార్డైనట్టు పేర్కొంది. రెవెన్యూలు 10 శాతం పెరిగి రూ.29,141 కోట్లుగా ఉన్నట్టు వెల్లడించింది. ఈబీఐటీడీఏలు వార్షికంగా 2శాతం డౌనయ్యాయి. ఈ ఫలితాల ప్రకటన సందర్భంగానే ఒక్కో షేరుకు 9 రూపాయలు డివిడెంట్ ను బోర్డు ఆమోదించినట్టు తెలిపింది. క్లయింట్స్ వద్ద నుంచి మారుతున్న డిమాండ్లు, టెక్నాలజీ మార్పులు, అవసరమైన నైపుణ్యాలను ప్రస్తుతం ఇండస్ట్రి ఎదుర్కొంటుందని టెక్ మహీంద్రా సీఈవో, మేనేజింగ్ డైరెక్టర్ సీపీ గుర్నాని తెలిపారు. అవసరమైన మేరకు తమ వర్క్ ఫోర్స్ కు రీస్కిలింగ్, రీట్రైనింగ్ చేపడతామని తెలిపారు. వినూత్నావిష్కరణలను ప్రోత్సహిస్తామన్నారు. -
పంజాబ్ నేషనల్ బ్యాంక్ లాభం రూ.262కోట్లు
ముంబై: ప్రభుత్వ రంగ దిగ్గజం పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్బీ) 2016-17 సంవత్సరానికి ఆశాజనక ఫలితాలను ప్రకటించింది. క్యూ4(జనవరి-మార్చి)లో రూ. 262 కోట్ల నికర లాభాలను నమోదు చేసింది. గత ఏడాది ఇదే క్వార్టర్ తో రూ. 12,669.21 కోట్లతో పోలిస్తే మొత్తం ఆదాయం రూ. 14,989.33గా నమోదుచేసింది. బ్యాడ్ లోన్లు తగ్గడం, వడ్డీ సంబంధ ఆదాయంలో పురోగతి ఫలితంగా ఈ లాభాలనుసాధించినట్టు పీఎన్బీ ప్రకటించింది. నికరవడ్డీ ఆదాయం(ఎన్ఐఐ) 33 శాతం ఎగసి రూ. రూ. 3683 కోట్లను తాకింది. స్థూల మొండిబకాయిలు(ఎన్పీఏలు) 13.7 శాతం నుంచి 12.53 శాతానికి బలహీనపడ్డాయని కొత్తగా నియమితులైన బ్యాంక్ డైరెక్టర్ సునీల్ మెహతా తెలిపారు. తన బ్యాలెన్స్ షీట్‌ను మెరుగుపరిచేందుకు తన ఆస్తులను విక్రయించాలని యోచిస్తున్నచెప్పారు. రుతుపవనాలపై ఐఎండీ మంచి అంచనాలతో గ్రామీణ ఆదాయం బావుంటుందని అంచనావేశారు. ప్రభుత్వం ప్రకటించిన పథకాల వల్ల గ్రామీణ గృహ రంగంలో వృద్ధి ఉంటుందని మేము భావిస్తున్నామని మెహతా అన్నారు. రిటైల్, ఎంఎస్ఎంఈ, వ్యవసాయ రంగాల నుంచి లభిస్తున్న మంచి గిరాకీని చూస్తూ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో బ్యాంకు 10-12 శాతం వృద్ధిని అంచనా వేస్తున్నామని చెప్పారు. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన 2016-17లో గత ఏడాది 3,690వేలకోట్ల నష్టంతో పోలిస్తేనికర లాభం 1187వేలకోట్లుగా ఉంది. రూ. 57,225కోట్ల ఆదాయం సాధించింది. గత ఏడాది ఇది రూ. 56,903 కోట్లుగా ఉంది. అలాగే నికర ఎన్పీఏలు సైతం 8.61 శాతం నుంచి 7.81 శాతానికి దిగి వచ్చాయి. ప్రొవిజన్లు రూ. 9878 కోట్ల నుంచి తగ్గి రూ. 5753 కోట్లకు పరిమితమయ్యాయి. ఇతర ఆదాయం 68 శాతం జంప్‌చేసి రూ. 3102 కోట్లకు చేరింది. ఈ ఫలితాల నేపథ్యంలో పీఎన్బీ షేరు 4.55 శాతం లాభంతో ముగిసింది. -
అంచనాలను అధిగమించిన టెక్ దిగ్గజం
దేశంలో నాలుగో అతిపెద్ద సాఫ్ట్ వేర్ సర్వీసుల సంస్థ హెచ్‌సీఎల్ అంచనాలను అధిగమించింది. అంచనావేసిన దానికంటే మెరుగ్గా నాలుగో క్వార్టర్ కన్సాలిడేటెడ్ లాభాల్లో 28 శాతం పైకి ఎగిసింది. మార్చితో ముగిసిన క్వార్టర్ లో రూ.2,475 కోట్ల లాభాలను నమోదుచేసింది. ముందటి ఆర్థిక సంవత్సరంలో ఇదే క్వార్టర్ లో ఈ లాభాలు రూ.1,939 కోట్లగా ఉన్నాయి. థామ్సన్ రాయిటర్స్ డేటా ప్రకారం ఈ టెక్ దిగ్గజం రూ.2,091 కోట్ల లాభాలను నమోదుచేస్తుందని అనాలిస్టులు అంచనావేశారు. లాభాలు ఆశించిన దానికంటే మెరుగ్గా ఉండటంతో కంపెనీ మధ్యంతర డివిడెండ్ ను ప్రకటించింది. 2017-18 సంవత్సరానికి గాను రెండు రూపాయలు కలిగి ఉన్న ఒక్కో ఈక్విటీ షేరుకు ఆరు రూపాయల మధ్యంతర డివిడెండ్ ను బోర్డు ఆఫ్ డైరెక్టర్లు ఆమోదించినట్టు కంపెనీ పేర్కొంది. కంపెనీ మొత్తం ఆదాయం కూడా 20 శాతం పైగా పెరిగి, రూ.13,183 కోట్లగా రికార్డైనట్టు క్వార్టర్ రివ్యూలో తెలిసింది. ముందటి ఆర్థిక సంవత్సరంలో ఈ ఆదాయం రూ.10,925 కోట్లగా ఉంది. 2016-17 ఆర్థిక సంవత్సరానికి గాను, కంపెనీ నికర లాభాలు 53 శాతం పైగా పెరిగి రూ.8606.47 కోట్లగా, మొత్తం ఆదాయం 52 శాతం పెరిగి రూ.48,640.85 కోట్లగా రికార్డయ్యాయి. స్థిరమైన కరెన్సీ విలువల్లో 2018 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ రెవెన్యూలు 10.5-12.5 శాతం పెరుగుతుందని కంపెనీ అంచనావేస్తోంది. ఆపరేటింగ్ మార్జిన్లు కూడా 19.5-20.5 శాతం రేంజ్ లో ఉంటాయని పేర్కొంది. 2017 మార్చి క్వార్టర్ ముగింపుకు కంపెనీలో 1,15,973 ఉద్యోగులున్నారు. తమ ఐటీ సర్వీసుల అట్రిక్షన్ 12 నెలల కాలంలో 16.9 శాతంగా ఉన్నట్టు కంపెనీ తెలిపింది. ఇది ముందటి ఏడాది కంటే తక్కువనేని పేర్కొంది. -
ఇండిగో లాభాలు ఢమాల్.. భారీ డివిడెండ్
న్యూఢిల్లీ: మార్కెట్ వాటా పరంగా దేశీయంగా అతిపెద్ద ఎయిర్‌లైన్ ఇండిగో లాభాల్లో ఢమాల్ అంది. ఇండిగో పేరెంటల్ కంపెనీ ఇంటర్ గ్లోబ్ ఏవియేషన్ క్యూ4 లో నిరాశాజనక ఫలితాలను నమోదు చేసింది. మంగళవారం ప్రకకటించిన ఈ ఫలితాల్లో లాభాలు 25శాతం క్షీణించాయి. 2017 మార్చితో ముగిసిన నాలుగవ త్రైమాసికంలో 440.31 కోట్ల రూపాయలు ఆర్జించింది. కాగా గత ఏడాది ఇదే కాలంలోరూ. 583.78 కోట్ల లాభాలను సాధించింది. ఆదాయం కూడా గత ఏడాది రూ.1986 కోట్లతో పోలిస్తే 16.5 శాతం క్షీణించి 1659 కోట్లను సాదించింది ఇంధన వ్యయం పెరగడంతో గత ఆర్థిక సంవత్సరం నాలుగవ త్రైమాసికంలో సంస్థ మొత్తం ఖర్చులు దాదాపు 31 శాతం పెరిగి 4,523.04 కోట్లుగా నమోదు చేసింది. సంవత్సరం క్రితం ఇదే కాలంలో మొత్తం ఖర్చు 3,458.20 కోట్లు. గత ఏడాది ఇదే కాలంలోరూ. 4,090.68 కోట్లుగా ఉంది. నాలుగో త్రైమాసికంలో ఇంధన వ్యయం 71 శాతం పెరిగి రూ. 1,750.51 కోట్లుగా నమోదైంది. గత త్రైమాసికంలో ఇంధన ధరలు 38 శాతం పెరిగినప్పటికీ పన్నుల తర్వాత 4.4 బిలియన్ డాలర్ల లాభాన్ని నమోదు చేశామని ఇండిగో అధ్యక్షుడు, హోల్ టైమ్ డైరెక్టర్ ఆదిత్య ఘోష్ ఫలితాల ప్రకటన సందర్భంగా చెప్పారు. అలాగే 2017 ఆర్థిక సంవత్సరానికి ప్రతి ఈక్విటీ షేరుకు రూ.34 డివిడెండ్ చెల్లించేందుకు బోర్డు ప్రతిపాదించినట్టు ఆదిత్య ప్రకటించారు. కాగా ప్రాంతీయ ఎయిర్ కనెక్టివిటీ పుష్లో భాగంగా 70 మందికి సీటింగ్ సామర్ధ్యం ఉన్న 50 ఎటిఆర్ 72-600 విమానాలను కొనుగోలు చేసేందుకు ఇందిగో ఇటీవల ఒక ఒప్పందం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. -
పడిపోయిన ప్రైవేట్ రంగ దిగ్గజం యాక్సిస్
ముంబై : ప్రైవేట్ రంగ బ్యాంకుల్లో మూడో అతిపెద్ద దిగ్గజం యాక్సిస్ బ్యాంకు లాభాల్లో పడిపోయింది. బుధవారం ప్రకటించిన 2017 క్యూ4 ఫలితాల్లో ఏడాది ఏడాదికి బ్యాంకు నికర లాభాలు 43 శాతం క్షీణించి, రూ.1,225.1 కోట్లగా నమోదైనట్టు వెల్లడైంది. ఎక్కువ ప్రొవిజన్లు, తక్కువ ఆపరేటింగ్ ఇన్కమ్ తో బ్యాంకు లాభాల్లో పడిపోయినట్టు తెలిసింది. అయితే పన్నుల లాభాల్లో విశ్లేషకులు అంచనాలను బ్యాంకు అధిగమించింది. ఈ క్వార్టర్లో పన్నుల అనంతరం బ్యాంకు లాభాలు కేవలం రూ.919 కోట్లగానే ఉంటాయని ఈటీనౌ పోల్ లో విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. క్వార్టర్ క్వార్టర్ బేసిస్ తోనే బ్యాంకు లాభాలు 111 శాతం పెరిగాయని వెల్లడైంది. డిసెంబర్ క్వార్టర్లో బ్యాంకు లాభాలు రూ.579.57 కోట్లగానే ఉన్నాయి. గ్రాస్ ఎన్పీఏ లెవల్స్ ను బ్యాంకు స్వల్పంగా తగ్గించుకుంది. డిసెంబర్ క్వార్టర్ లో 5.22 శాతంగా ఉన్న ఎన్పీఏ లెవల్స్ ను, ఈ క్వార్టర్ లో 5.04 శాతంకు తగ్గించుకుని రూ.21,280కోట్లగా నమోదుచేసింది. మొత్తం రైటాఫ్ లు రూ.1,194కోట్లగా ఉన్నాయని యాక్సిస్ బ్యాంకు తెలిపింది. నికర ఎన్పీఏలను కూడా 2.18 శాతం నుంచి 2.11 శాతం తగ్గించుకుంది. మార్కెట్ అవర్స్ తర్వాత బ్యాంకు తన నాలుగో క్వార్టర్ ఫలితాలను ప్రకటించింది. నాలుగో క్వార్టర్ ఫలితాల నేపథ్యంలో బ్యాంకు షేరు ధర 0.42 శాతం పెరిగి, 517.30 రూపాయలుగా ముగిసింది. -
టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్ బిగ్ బొనాంజ
ముంబై : నాలుగో త్రైమాసిక ఫలితాల సీజన్ కు టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్ బోణి కొట్టింది. జనవరి-మార్చి త్రైమాసిక ఫలితాలను నేడు ప్రకటించింది. నేడు విడుదల చేసిన ఈ క్యూ4 ఫలితాల్లో ఇన్ఫోసిస్ 2.8 శాతం పడిపోయి, రూ.3603 కోట్ల లాభాలను నమోదుచేసినట్టు ప్రకటించింది. గత క్వార్టర్ కంటే ఇది 2.8 శాతం తక్కువని వెల్లడైంది. లాభాలుపడిపోయినప్పటికీ ఇన్ఫీ తన షేర్ హోల్డర్స్ కు బిగ్ బొనాంజ ప్రకటించింది. 2017 మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి కంపెనీ ఒక్కో షేరుకు 14.75 డివిడెండ్ ఇస్తున్నట్టు వెల్లడించింది. అదనంగా మరో 13వేల కోట్ల రూపాయలను షేరు బై బ్యాక్ లేదా డివిడెంట్ రూపంలో ఇవ్వనున్నట్టు షేరు హోల్డర్స్ కు తెలిపింది. లాభాలతో పాటు కంపెనీ రెవెన్యూలను కోల్పోవాల్సి వచ్చింది. సీఎన్‌బీసీ-టీవీ18 అంచనా ప్రకారం రూ.3570 కోట్ల లాభానార్జిస్తుందని తెలిసింది. వారి అంచనాల కంటే కాస్త ఎక్కువగానే కంపెనీ లాభాలను నమోదుచేసింది. స్థిరమైన కరెన్సీ విలువల పరంగా రెవెన్యూ వద్ధి 6.5 శాతం నుంచి 8.5 శాతం వరకు ఉంటుందని కంపెనీ పేర్కొంది. అయితే ఈ వద్ధి మాత్రం విశ్లేషకుల అంచనాలను తప్పాయి. ఈ ఫలితాల సందర్భంగా కంపెనీ కో-చైర్మన్ గా, స్వతంత్ర డైరెక్టర్ గా రవి వెంకటేశన్ ను నియమిస్తున్నట్టు పేర్కొంది. ఫలితాల ప్రకటనాంతరం కంపెనీ షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. 2.35 శాతం నష్టాల్లో 947.90 వద్ద కంపెనీ షేర్లు నడుస్తున్నాయి. -
శాంసంగ్ ఆపరేటింగ్ లాభాల్లో భారీ వృద్ధి
సియోల్: ప్రముఖ ఎలక్ట్రానిక్స్ దిగ్గజం శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ కో లిమిటెడ్ ఆర్థిక ఫలితాల్లోఅదరగొట్టింది. నాలుగో త్రైమాసికంలో నిర్వహణ లాభంలో భారీ వృద్ధిని నమోదుచేసింది. చిప్స్ వ్యాపారంలో రికార్డు ఆదాయాలతో ఆపరేటింగ్ లాభాల్లో 50 శాతం జంప్ చేసింది గతమూడు సంవత్సరాల్లో అత్యధిక పెరుగుదలను సాధించినట్టు శాంసంగ్ ప్రకటించింది. గెలాక్సీ నోట్ 7 పేలుళ్లతో ఇబ్బందులనెదుర్కొన్న దక్షిణ కొరియా దిగ్గజం రికార్డ్ లాభాలను ప్రకటించింది. అక్టోబర్- డిసెంబర్ కాలానికి 9.22 ట్రిలియ్లను (7.9 బిలియన్ డాలర్ల) ఆపరేటింగ్ లాభాలను ఆర్జించింది. అలాగే స్థిరమైన ఆదాయాన్ని ఆర్జించి... 0.6 శాతం పెరిగి 201.9 ట్రిలియన్లను నమోదు చేసింది. నోట్ 7 రీకాల్ సంక్షోభంలో కూడా సాలిడ్ ఫలితాలను సాధించినట్టు కంపెనీ చెప్పింది. బాగా వృద్ధి చెందిన డాలర్ ఆదాయం కూడా ఈ లాభాలకు తోడ్పడినట్టు తెలిపిందిదీంతో అతిపెద్ద రీకాల్ సంక్షోభం నుంచి కోలుకున్న సంస్థ 9.3 ట్రిలియన్ల షేర్లను తిరిగి కొనుగోలు చేసేందుకు యోచిస్తున్నట్టు శాంసంగ్ ఒక ప్రకటనలో తెలిపింది. కాగా గెలాక్సీ నోట్ 7 కష్టాలకు తోడు గత వారం దేశంలోని అతిపెద్ద స్కాంలో శాంసంగ్ అధిపతి లీ జే-యాంగ్ ఇరుక్కున్నారు. దేశ అధ్యక్షురాలు పార్లమెంటులో అభిశంసనకు గురైన ఈ అవినీతి కుంభకోణంలో ఆయన ప్రమేయంపై దర్యాప్తు కొనసాగుతోంది. అయితే లీ తృటిలోఅరెస్ట్ ప్రమాదంనుంచి తప్పించుకున్న సంగతి తెలిసిందే. -
బ్రిటానియాకు పతంజలి దెబ్బ
ముంబై : అతిపెద్ద ఆహార ఉత్పత్తుల కంపెనీ బ్రిటానియా ఇండస్ట్రీస్ స్వల్ప లాభాలాను నమోదు చేసినప్పటికీ, మార్కెట్లో ఈ కంపెనీ షేరు కుదేలయ్యింది. ముఖ్యంగా పతంజలి నుంచి ఎదుర్కొంటున్న పోటీ తమ వ్యాపారం పై ప్రభావం చూపిందని కంపెనీ చెబుతోంది. అటు విశ్లేషకుల అంచనాలకుగుణంగా సంస్థ లాభాలు పెరగడకపోవడంతో మార్కెట్లో బ్రిటానియా 8 శాతం మేర నష్టపోయింది. ఈ ఏడాది మార్చి త్రైమాసిక ఫలితాల్లో అంచనాలకు తక్కువగా ఆదాయాన్ని నమోదుచేయడం ఇన్వెస్టర్లను నిరాశపర్చింది. బెంగళూరుకు చెందిన బ్రిటానియా ఇండస్ట్రీస్ నికర లాభాలు 14శాతం పెరిగి రూ.190 కోట్లగా చూపించాయి. 8శాతం మేరే అమ్మకాలు పెరిగి రూ.2,190 కోట్లగా నమోదయ్యాయి. 46శాతం పన్ను చెల్లింపులు పెరగడంతో పాటు, 14శాతం కంపెనీకి వచ్చే ఇతరత్రా ఆదాయాలు పడిపోయాయి. దీంతో బ్రిటానియా నికర లాభాలు కొంతమేర చేజారి, మార్కెట్ విశ్లేషకుల అంచనాలు తలకిందులు కావడంతో అమ్మకాల ఒత్తిడి నెలకొంది. ఎక్సైజ్ డ్యూటీ ప్రోత్సహకాలను దశల వారీగా ప్రభుత్వం తొలగించడంతో, ఈ త్రైమాసికంలో రాబడులపై 100 పాయింట్ల ప్రభావం చూపాయని బ్రిటానియా తెలిపింది. అదేవిధంగా పతంజలి నుంచి ఎదుర్కొంటున్న గట్టి పోటీ, కంపెనీ మార్కెట్ షేరుపై ప్రభావం చూపిందని క్రిస్ట్ వెల్త్ మేనేజ్ మెంట్ సీఈవో లాన్సేలట్ డి కన్హా చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా వ్యవసాయ ఉత్పత్తుల ధరలు పడిపోవడం బ్రిటానియా లాభాలపై ప్రభావం చూపాయని మార్కెట్ విశ్లేషకులు పేర్కొన్నారు. బ్రిటానియా లాభాలు మార్కెట్ అంచనాలను తాకలేకపోవడంతో, మార్కెట్లో ఈ షేర్లు 8శాతం మేర నష్టపోయాయి. -
యాక్సిస్ బ్యాంక్ క్యూ4 లాభం రూ.2,154 కోట్లు
ముంబై: ప్రైవేటు రంగ యాక్సిస్ బ్యాంక్ ఆర్థిక ఫలితాలు ఇన్వెస్టర్లను నిరుత్సాహపర్చాయి. ఎన్పీఏ కేటాయింపులకు సంబంధించి కొన్ని కంపెనీలను రిజర్వుబ్యాంక్ మినహాయించడంతో ఈ దఫా బ్యాంకుల ఫలితాలు బావుంటాయన్న అంచనాలు మార్కెట్లో ఉన్నాయి. ఇందుకు భిన్నంగా యాక్సిస్ బ్యాంక్ నికరలాభం మార్చితో ముగిసిన క్యూ4లో క్షీణించి రూ. 2,154 కోట్లకు దిగింది. అధిక కేటాయింపులకు తోడు భవిష్యత్తులో ఏర్పడే మొండి బకాయిల కోసం కొంత మొత్తాన్ని పక్కనపెట్టడంతో లాభాలు తగ్గినట్లు బ్యాంక్ పేర్కొంది. పూర్తి ఆర్థిక సంవత్సరానికి మాత్రం బ్యాంకు నికరలాభం 12 శాతం పెరుగుదలతో 8,349 కోట్లకు చేరింది. తాజా త్రైమాసికంలో నికర వడ్డీ ఆదాయం 20% ఎగిసి రూ. 4,553 కోట్లకు పెరిగింది. ఇతర ఆదాయం మాత్రం స్వల్ప పెరుగుదలతో రూ. 2,694 కోట్లకు చేరింది. కొత్త ఎన్పీఏలు తగ్గాయ్..: క్యూ4లో కొత్తగా రూ. 1,474 కోట్ల మొండి బకాయిలు యాడ్ అయ్యాయని, దాంతో పూర్తి ఆర్థిక సంవత్సరంలో జతైన మొండి బకాయిలు రూ. 7,345 కోట్లకు చేరినట్లు బ్యాంక్ పేర్కొంది. క్యూ3లో 2,082 కోట్ల కొత్త ఎన్పీఏలతో పోలిస్తే, తాజా త్రైమాసికంలో తగ్గాయి. గత త్రైమాసికంతో పోలిస్తే క్యూ4లో తమ ఆస్తుల నాణ్యత స్థిరంగా వుందని, అయితే భవిష్యత్తులో సవాళ్లు ఎదురుకావొచ్చని బ్యాంక్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ జైరామ్ శ్రీధర్ చెప్పారు. బీఎస్ఈలో మంగళవారం యాక్సిస్ బ్యాంక్ షేరు ధర 2.2 శాతం లాభపడి రూ.480 వద్ద ముగిసింది.