అంచనాలు బీట్ : జంప్ చేసిన ట్రాక్టర్ల దిగ్గజం
అంచనాలు బీట్ : జంప్ చేసిన ట్రాక్టర్ల దిగ్గజం
Published Tue, May 30 2017 4:54 PM | Last Updated on Tue, Sep 5 2017 12:22 PM
న్యూఢిల్లీ: ట్రాక్టర్ల నిర్మాణంలో అగ్రగామిగా ఉన్న దేశీయ వాహన నిర్మాణ కంపెనీ మహింద్రా అండ్ మహింద్రా అంచనాలను అధిగమించింది. మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికంలో కన్సాలిడేటెడ్ నికర లాభాలు ఏడాది ఏడాదికి 26.30 శాతం జంప్ అయి, రూ.874 కోట్లగా రికార్డయ్యాయి. కన్సాలిడేటెడ్ స్థూల రాబడి, ఇతర ఆదాయాలు కూడా కంపెనీవి 5.2 శాతం పెరిగి, రూ.12,889 కోట్లగా ఉన్నాయి. ఈ త్రైమాసికంలో దేశీయ మార్కెట్లో 46,583 ట్రాక్టర్లను విక్రయించినట్టు కంపెనీ ప్రకటించింది. ఏడాది ఏడాది బేసిస్ లో ఇది 13.30 శాతం వృద్ధి. ఎగుమతులు 10,831 యూనిట్లుగా ఉన్నట్టు కంపెనీ పేర్కొంది.
మంగళవారం ప్రకటించిన ఫలితాల సందర్భంగా ఫేస్ వాల్యు 5 రూపాయలు కలిగిన ఒక్కో షేరుకు రూ.13 డివిడెండ్ ను బోర్డు ఆఫ్ డైరెక్టర్లు ప్రతిపాదించినట్టు తెలిపింది. వరుసగా రెండో ఏడాదికూడా రుతుపవనాలు సాధారణంగా ఉంటాయని అంచనాలు వస్తుండటంతో, డిమాండ్ మంచిగా రికవరీ అవుతుందని మహింద్రా అండ్ మహింద్రా పేర్కొంటోంది. మంగళవారం ట్రేడింగ్ లో కంపెనీ షేర్లు 0.82 శాతం పెరిగి రూ.1362గా నమోదయ్యాయి.
Advertisement
Advertisement