
దేశీయ వాహన తయారీ దిగ్గజం మహీంద్రా & మహీంద్రా 2025 మార్చి నెలలో మొత్తం అమ్మకాలను వెల్లడించింది. కంపెనీ గత నెలలో మొత్తం 83894 యూనిట్ల వాహనాలను విక్రయించింది. ఈ సంఖ్య 2024 మార్చి (68413 యూనిట్లు) కంటే 23 శాతం ఎక్కువ.
కంపెనీ మొత్తం అమ్మకాలలో ప్యాసింజర్ వెహికల్ సేల్స్ 48,048 యూనిట్లు, కమర్షియల్ వాహనాల సేల్స్ 31,703 యూనిట్లుగా ఉన్నాయి. ఎగుమతులు 4143 యూనిట్లతో 163 శాతం వృద్ధిని నమోదు చేసింది. యుటిలిటీ వెహికల్స్ విభాగంలో, మహీంద్రా దేశీయ మార్కెట్లో 48048 వాహనాలను విక్రయించింది. 50835 వాహనాలను ఎగుమతి చేసింది.
ఇదీ చదవండి: ఈ రూల్ అతిక్రమిస్తే.. డ్రైవింగ్ లైసెన్స్ సస్పెండ్!: నితిన్ గడ్కరీ
కార్ల విక్రయాలు మాత్రమే కాకుండా.. ట్రాక్టర్ అమ్మకాల సంఖ్యను కూడా ప్రకటించింది. మార్చి 2025లో దేశీయ అమ్మకాలు 32,582 యూనిట్లుగా ఉన్నాయి. ఈ అమ్మకాలు మార్చి 2024లో 24,276 యూనిట్లుగా ఉన్నాయి. మొత్తం మీద మహీంద్రా కంపెనీ అమ్మకాలు 2024 మార్చి కంటే కూడా 2025 మార్చిలో గణనీయంగా పెరిగాయి.