ప్రపంచంలోనే మొట్ట మొదటి సీఎన్‌జీ (CNG) బైక్ లాంచ్ చేసిన బజాజ్ ఆటో (Bajaj Auto) ఉత్తమ అమ్మకాలను పొందుతోంది. 'ఫ్రీడమ్ 125' బైకును ఆరు నెలల్లో.. 40,000 కంటే ఎక్కువ మంది కొనుగోలు చేసినట్లు సమాచారం. ఈ విషయాన్ని కంపెనీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాకేష్ శర్మ వెల్లడించారు.
బజాజ్ సీఎన్‌జీ బైక్.. అతి తక్కువ కాలంలోనే ఎక్కువమంది వాహన వినియోగదారులకు ఆకర్శించింది. మేము దాదాపు 40,000 బైక్‌లను రిటైల్ చేసాము. ఇది 300 కిమీ కంటే ఎక్కువ రేంజ్ అందిస్తుండంతో.. రోజువారీ వినియోగానికి కూడా దీనిని ఎక్కువమంది కొనుగోలు చేస్తున్నారని రాకేష్ శర్మ (Rakesh Sharma) పేర్కొన్నారు.
బజాజ్ సీఎన్‌జీ బైకును ప్రజలకు చేరువ చేయాలనే ఉద్దేశ్యంతో.. ఇప్పటికి సుమారు 350 పట్టణాలకు విస్తరించినట్లు రాకేష్ శర్మ వెల్లడించారు. రాబోయే రోజుల్లో మరిన్ని ప్రధాన నగరాలలో ఈ బైకును ప్రదర్శించడానికి, అక్కడ విక్రయాలను కొనసాగించడానికి కావలసిన ఏర్పాట్లను చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు.
బజాజ్ ఫ్రీడమ్ 125
బజాజ్ ఫ్రీడమ్ 125 పేరుతో మార్కెట్లో లాంచ్ అయిన సీఎన్‌జీ బైక్ ధర రూ. 95000 (ఎక్స్ షోరూమ్). ఈ బైక్ మూడు వేరియంట్లలో లభిస్థుంది. ఇది చూడటానికి సింపుల్ డిజైన్ కలిగి ఉన్నప్పటికీ.. రైడర్లకు మంచి రైడింగ్ అనుభూతిని అందిస్తుంది.
బజాజ్ ఫ్రీడమ్ 125 బైకులో 2 కేజీల కెపాసిటీ కలిగిన సీఎన్‌జీ ట్యాంక్, అదే పరిమాణంలో పెట్రోల్ ట్యాంక్ ఉంటారు. పెట్రోల్, సీఎన్‌జీ సామర్థ్యాలను పరిగణలోకి తీసుకుంటే బైక్ మైలేజ్ 330 కిమీ వరకు ఉంటుంది. ఈ బైకులోని 125 సీసీ ఇంజిన్ 8000 rpm వద్ద 9.5 Bhp పవర్, 6000 rpm వద్ద 9.7 Nm టార్క్ అందిస్తుంది. ఇది 5 స్పీడ్ గేర్‌బాక్స్ ఆప్షన్ పొందుతుంది.
ఫ్రీడమ్ 125 బైక్ డిజైన్.. మార్కెట్లోని ఇతర కమ్యూటర్ మోటార్‌సైకిళ్ల కంటే భిన్నంగా ఉంటుంది. ఇందులో ఎల్ఈడీ హెడ్‌లైట్, డర్ట్ బైక్ స్టైల్ ఫ్యూయల్ ట్యాంక్, పొడవైన సింగిల్ పీస్ సీటు వంటివి ఉన్నాయి. బ్లూటూత్ కనెక్టివిటీతో కూడిన డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ వంటి అప్డేటెడ్ ఫీచర్స్ ఇందులో ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment