cng bike
-
వరల్డ్ ఫస్ట్ సీఎన్జీ బైక్ వచ్చేసింది.. ధర ఎంతో తెలుసా?
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వరల్డ్ ఫస్ట్ సీఎన్జీ బైక్ దేశీయ విఫణిలో లాంచ్ అయింది. బజాజ్ ఫ్రీడమ్ 125 పేరుతో భారతీయ మార్కెట్లో లాంచ్ అయిన ఈ బైక్ ప్రతిభ ధర రూ. 95000 (ఎక్స్ షోరూమ్). ఈ బైక్ మూడు వేరియంట్లలో లభిస్థుంది. కంపెనీ ఇప్పటికే ఈ బైక్ కోసం బుకింగ్స్ స్వీకరించడం కూడా ప్రారంభించింది. డెలివరీలు త్వరలోనే ప్రారంభమవుతాయి.కొత్త బజాజ్ ఫ్రీడమ్ 125 బైకులో 2 కేజీల కెపాసిటీ కలిగిన సీఎన్జీ ట్యాంక్, అదే పరిమాణంలో పెట్రోల్ ట్యాంక్ ఉంటారు. పెట్రోల్, సీఎన్జీ సామర్థ్యాలను పరిగణలోకి తీసుకుంటే బైక్ మైలేజ్ 330 కిమీ వరకు ఉంటుంది. ఈ బైకులోని 125 సీసీ ఇంజిన్ 8000 rpm వద్ద 9.5 Bhp పవర్, 6000 rpm వద్ద 9.7 Nm టార్క్ అందిస్తుంది. ఇది 5 స్పీడ్ గేర్‌బాక్స్‌తో లభిస్తుంది.బజాజ్ ఫ్రీడమ్ 125 బైక్ డిజైన్.. మార్కెట్లోని ఇతర కమ్యూటర్ మోటార్‌సైకిళ్ల కంటే భిన్నంగా ఉంటుంది. ఇందులో ఎల్ఈడీ హెడ్‌లైట్, డర్ట్ బైక్ స్టైల్ ఫ్యూయల్ ట్యాంక్, పొడవైన సింగిల్ పీస్ సీటు వంటివి ఉన్నాయి. బ్లూటూత్ కనెక్టివిటీతో కూడిన డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ వంటి అప్డేటెడ్ ఫీచర్స్ ఇందులో ఉన్నాయి.World‘s first #CNG motorcycle has been launched! Meet the Bajaj #Freedom125. 🏍️That’s a good looker, eh? Kinda has to be for the kind of premium over a regular petrol 125cc bike. Initially launching only in Maha/Guj; phased pan India launch to follow. Prices: ₹ 95-110k. SVP pic.twitter.com/9V9KGKLxrZ— Siddharth Vinayak Patankar (@sidpatankar) July 5, 2024 -
సీఎన్జీ బైక్ రేపే విడుదల.. పేరు తెలిసిపోయింది!!
దేశంలో మొట్టమొదటి సీఎన్జీ బైక్ శుక్రవారం విడుదలవుతోంది. బజాజ్ ఆటో లిమిటెడ్ తన మొట్టమొదటి సీఎన్జీ, పెట్రోల్ హైబ్రిడ్ మోటార్‌సైకిల్‌ను 'ఫ్రీడమ్ 125' పేరుతో విడుదల చేసే అవకాశం ఉంది.బజాజ్ సీఎన్జీ బైక్ పేరు 'బ్రూజర్' అని ఇంతకుముందు వార్తలు వచ్చాయి. అయితే తాజాగా బజాజ్ ఆటో వెబ్సైట్లో పేరు లీక్ అయింది. 'ఫ్రీడమ్ 125'ని రెండు వేరియంట్లలో ఒకటి సాధారణ మోడల్, మరొకటి ప్రీమియం మోడల్లో విడుదల చేయాలని బజాజ్ ఆటో భావిస్తోంది. ఇందులో మరిన్ని కలర్ ఆప్షన్స్, ఫీచర్లు ఉండనున్నాయి.బజాజ్ ఆటో నుంచి వస్తున్న ఈ డ్యూయల్ ఫ్యూయల్ మోటార్‌సైకిల్‌లో పెట్రోల్ నుంచి సీఎన్జీకి అలాగే సీఎన్జీ నుంచి పెట్రోల్‌కు ఎప్పుడైనా మారేందుకు కంట్రోల్ బటన్ ఉంటుంది. ఇతర అంశాలలో రౌండ్ ఎల్ఈడీ హెడ్‌లైట్, మరింత ప్రాక్టికాలిటీని అందించే ఫ్లాట్ సీటు ఉన్నాయి.ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన 'బజాజ్ బియాండ్' ఈవెంట్ సందర్భంగా, ఈ మోటార్‌సైకిల్ ధర రూ. 80,000 నుంచి రూ. 90,000 మధ్య ఉంటుందని కంపెనీ వెల్లడించింది. ఇది ఎంట్రీ-లెవల్ మోటార్‌సైకిల్ సెగ్మెంట్లో పోటీ ఎంపికగా మారింది. తమ రాబోయే ఉత్పత్తుల కోసం బజాజ్ ఇంతకుముందు గ్లైడర్, మారథాన్, ట్రెక్కర్, ఫ్రీడమ్ అని నాలుగు వేర్వేరు పేర్లను ట్రేడ్‌మార్క్ చేసింది. -
వరల్డ్ ఫస్ట్ సీఎన్జీ బైక్.. లాంచ్ ఎప్పుడంటే?
బజాజ్ కంపెనీ లాంచ్ చేయనున్న సీఎన్జీ బైక్ ఈ నెల 18న లాంచ్ అవుతుందని గతంలో వెల్లడైంది. అయితే ఈ డేట్ ఇప్పుడు జూలై 5కి మారింది. ఇప్పటి వరకు ప్రపంచ మార్కెట్లో సీఎన్జీ బైక్ లేదు.బజాజ్ లాంచ్ చేయనున్న ఈ కొత్త సీఎన్జీ 125 సీసీ విభాగంలో లాంచ్ అవుతుంది. కంపెనీ లాంచ్ చేయనున్న ఈ బైక్ పేరు 'బ్రూజర్' అని తెలుస్తోంది. ఈ బైక్ సీఎన్జీ, పెట్రోల్‌తో నడిచే ప్రపంచంలోనే మొదటి ప్రొడక్షన్ స్పెక్ మోటార్‌సైకిల్. ఇది చూడటానికి సింపుల్ డిజైన్ కలిగి ఉన్నప్పటికీ.. వాహన వినియోగదారులకు కావాల్సిన అన్ని ఫీచర్స్ అందుబాటులో ఉంటాయి.భారతదేశంలో ఇంధన ధరలు రోజు రోజుకి పెరుగుతున్నాయి. పెట్రోల్ ధరలతో పోలిస్తే.. సీఎన్జీ ధరలు తక్కువ. కాబట్టి దేశీయ మార్కెట్లో సీఎన్జీ బైక్ లాంచ్ అనేది ఆటోమొబైల్ చరిత్రలో ఓ సంచలనం సృష్టిస్తుందనే చెప్పాలి. ఈ బైకుకు సంబంధించిన మరిన్ని వివరాలు జూలై 5న వెల్లడయ్యే అవకాశం ఉంది. -
ప్రపంచంలో మొదటి సీఎన్జీ బైక్ ఇదే.. ఆటోమొబైల్ చరిత్రలో నవశకం
దశాబ్దాల క్రితం డీజిల్ బైకులు వినియోగంలో ఉండేవి. ఆ తరువాత పెట్రోల్ బైకులు వచ్చాయి. ఇప్పుడు ఎలక్ట్రిక్ బైకులు అందుబాటులో ఉన్నాయి. కాగా.. త్వరలో సీఎన్జీ బైక్ లాంచ్ అవ్వడానికి సిద్ధమైంది.ప్రస్తుతం భారతీయ విఫణిలో సీఎన్జీతో నడిచే వాహనాల జాబితాలో కార్లు, ఆటో రిక్షాలు మాత్రమే ఉన్నాయి. ఇప్పటి వరకు సీఎన్జీ బైకులు ప్రపంచ మార్కెట్లో అడుగుపెట్టలేదు. కాబట్టి బజాజ్ ఆటో సీఎన్జీ బైక్ లాంచ్ చేసి.. నవ శకానికి నాంది పలకడానికి సన్నద్ధమవుతోంది. కంపెనీ లాంచ్ చేయనున్న కొత్త సీఎన్జీ బైక్ కోసం ఇప్పటికే ట్రేడ్‌మార్క్‌ను కూడా దాఖలు చేసింది.బజాజ్ కంపెనీ లాంచ్ చేయనున్న సీఎన్జీ బైకును ఈ నెల (జూన్ 18) అధికారికంగా పరిచయం చేయనుంది. లాంచ్‌కు సిద్దమవుతున్న ఈ బైక్‌కు 'ఫైటర్' అని నామకరణం చేశారు. బజాజ్ కంపెనీ గత కొంత కాలంగా ఈ సీఎన్జీ బైక్ మీద పనిచేస్తోంది. త్వరలో దీనిని అధికారికంగా ఆవిష్కరించడానికి సిద్ధమైంది.ఇప్పటికే అనేక సార్లు టెస్టింగ్ దశలో కనిపించిన బజాజ్ సీఎన్జీ బైక్ హాలోజన్ టర్న్ ఇండికేటర్లు, టెలిస్కోపిక్ ఫోర్క్‌లు, సస్పెన్షన్ డ్యూటీల కోసం మోనోషాక్ యూనిట్ వంటి వాటితోపాటు మల్టీ స్పోక్ అల్లాయ్ వీల్స్, సింగిల్ పీస్ సీటు, డిస్క్ & డ్రమ్ బ్రేక్ యూనిట్ పొందనున్నట్లు సమాచారం. -
విడుదలకు సిద్దమవుతున్న ఫస్ట్ సీఎన్జీ బైక్ - వివరాలు
భారతీయ మార్కెట్లో ఇప్పటి వరకు పెట్రోల్ బైకులు మాత్రమే వినియోగంలో ఉన్నాయి. పెట్రోల్ ధరలు రోజు రోజుకి పెరుగుతున్న తరుణంలో ప్రముఖ బైక్ తయారీ సంస్థ బజాజ్ సీఎన్జీ విభాగంలో బైకుని విడుదల చేయడానికి సన్నద్ధమవుతోంది. బ్రుజెర్ ఈ101 (Bruzer E101) కోడ్‌నేమ్‌తో రానున్న ఈ కొత్త సీఎన్జీ బైకుని ఔరంగాబాద్ ఫ్యాక్టరీలో తయారు చేస్తున్నట్లు, ప్రస్తుతం దాదాపు చివరి దశకు చేరుకుందని సమాచారం. కాబట్టి వచ్చే ఏడాది ఈ బైక్ అధికారికంగా మార్కెట్లో ప్లాటినా పేరుతో విడుదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. బజాజ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాకేష్ శర్మ ఈ బైక్ గురించి మాట్లాడుతూ.. గత కొన్ని సంవత్సరాలుగా దిగుమతులను, కాలుష్యాన్ని తగ్గించడంలో దేశం ఎదుర్కొంటున్న సవాళ్లను కంపెనీ గుర్తించిందని, దీనిని దృష్టిలో ఉంచుకుని సీఎన్జీ బైకుని తీసుకురావడానికి సంకల్పించినట్లు వెల్లడించాడు. సంవత్సరానికి సుమారు ఒక లక్ష నుంచి 1.2 లక్షల సీఎన్జీ బైకులను ఉత్పత్తి చేయాలనుకున్నట్లు, ఇది రెండు లక్షల యూనిట్లకు చేరుకునే అవకాశం ఉందని చెబుతున్నారు. మార్కెట్లో డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని ఉత్పత్తి మరింత పెరిగే అవకాశం ఉంటుంది. ఇదీ చదవండి: కొత్త హంగులతో మెరిసిపోతున్న 'ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్' - ఫోటోలు చూశారా? పెట్రోల్ ధరలతో పోలిస్తే సీఎన్జీ ధరలు తక్కువ. ఇది మాత్రమే కాకుండా పెట్రోల్ వాహనాల కంటే సీఎన్జీ వాహనాల మైలేజ్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి సీఎన్జీ బైక్ మైలేజ్ దాని మునుపటి మోడల్స్ కంటే ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఖచ్చితమైన గణాంకాలు, ఇతర వివరాలు లాంచ్ సమయంలో తెలుస్తాయి. -
సిటీ కుర్రాళ్ల సృష్టి సీఎన్జీ బైక్...
పెట్రోల్ రేట్ ఎక్కువైపోయి ఇంధనానికి ధనం నీళ్లలా ఖర్చవుతుంటే ఏం చేస్తాం? పబ్లిక్ ట్రాన్స్పోర్ట్, వెహికిల్ షేరింగ్ వంటి ప్రత్యామ్నాయాలు వెదుకుతాం. ఇంట్లో ఇచ్చిన పాకెట్ మనీనంతా బైక్ పెట్రోల్ రూపంలో తాగేస్తుంటే గాబరాపడ్డ ఆ విద్యార్థులు నూతన ప్రయోగం చేశారు. ఫలితం సీఎన్జీతో నడిచే బైక్ ఆవిష్కృతమైంది. ఆ ఎనిమిది మంది పరిచయం, ఆ ప్రయోగం వివరాలు... లార్డ్స్ కాలేజీలో ఇంజనీరింగ్ రెండో సంవత్సరం చదువుతున్న మహ్మద్ అహ్మద్ లంగర్‌హౌస్ నివాసి. రోజూ ఇంటి నుంచి కాలేజ్‌కి తన 200సీసీ బైక్‌పై వెళతాడు. హైదరాబాద్ టవర్ కన్స్ట్రక్షన్ కంపెనీలో కో-ఆర్డినేటర్‌గా పనిచేసే వాళ్లమ్మ మల్హేగినా... పాకెట్ మనీగా తనకు ఇచ్చే డబ్బులో ఎక్కువ భాగం ఇంధనానికే ఖర్చే అయ్యేది. దీంతో ఆ భారాన్ని తగ్గించుకోవాలని ఆలోచించాడు. తన ఆలోచనను ఫ్రెండ్స్‌తో పంచుకున్నాడు. తన మిత్రులు మహ్మద్ షారుఖ్, వైనతేయ, సైఫ్ బిన్ అబ్దుల్లా, అబూబాకర్ పాషా, మహమ్మద్ మునావర్, మహ్మద్ ముజఫర్, మహ్మద్ ఆలీ జునైద్‌తో కలిసి 20 రోజుల్లో తన ద్విచక్ర వాహన రూపురేఖలు మార్చాడు. ఖర్చు తక్కువ, మైలేజ్ ఎక్కువ ప్రణాళికతో రూపొందించిన ఈ బైక్ సీఎన్జీతో నడుస్తుంది. వాయుకాలుష్యం, ఫ్యూయల్ రేట్స్ పెరుగుదలే తమను ఈ సీఎన్జీ వాహన తయారీకి పురికొల్పుదంటున్నాడు మహ్మద్ అహ్మద్. ప్రత్యేక ఇంధన ట్యాంకు... ట్యాంకు సామర్థ్యం, పరిమాణాన్ని లెక్కగట్టి ఇంధన ట్యాంకు రూపురేఖల్ని మార్చారు. కచ్చితత్వాన్ని లెక్కగట్టకుంటే గ్యాస్ ఒత్తిడి కారణంగా ట్యాంక్ పేలే అవకాశాలు ఉంటాయి కాబట్టి... ట్యాంక్‌లో సీఎన్జీ వెపరైజర్ను ఏర్పాటు చేశారు. ‘ట్యాంక్‌ను మార్చడానికి దాదాపు 15 రోజుల వరకు సమయం పట్టింది. ప్రస్తుతం మార్కెట్లో లభ్యమవుతున్న ద్విచక్రవాహనాల కంటే ఆరు కిలోమీటర్ల మైలేజీ అదనంగా ఇస్తోంది. పెట్రోల్ ధర లీటర్‌కు రూ.77 ఉంటే, మేం తయారుచేసిన బైక్‌కు వాడే సీఎన్జీ ధర రూ.50. అంటే ఇంధన ఖర్చూ తక్కువే. ఈ వాహనాన్ని తయారుచేసి మూడు నెలలు కావస్తున్నా... ప్రతిరోజు పరీక్షిస్తాం. పేటేంట్ హక్కుల కోసం ప్రయత్నిస్తున్నాం. నగరంలో పొల్యూషన్‌ని తగ్గించడం మా లక్ష్యం’ అంటున్నాడు మహ్మద్ అహ్మద్! శతానీక్