దశాబ్దాల క్రితం డీజిల్ బైకులు వినియోగంలో ఉండేవి. ఆ తరువాత పెట్రోల్ బైకులు వచ్చాయి. ఇప్పుడు ఎలక్ట్రిక్ బైకులు అందుబాటులో ఉన్నాయి. కాగా.. త్వరలో సీఎన్‌జీ బైక్ లాంచ్ అవ్వడానికి సిద్ధమైంది.
ప్రస్తుతం భారతీయ విఫణిలో సీఎన్‌జీతో నడిచే వాహనాల జాబితాలో కార్లు, ఆటో రిక్షాలు మాత్రమే ఉన్నాయి. ఇప్పటి వరకు సీఎన్‌జీ బైకులు ప్రపంచ మార్కెట్లో అడుగుపెట్టలేదు. కాబట్టి బజాజ్ ఆటో సీఎన్‌జీ బైక్ లాంచ్ చేసి.. నవ శకానికి నాంది పలకడానికి సన్నద్ధమవుతోంది. కంపెనీ లాంచ్ చేయనున్న కొత్త సీఎన్‌జీ బైక్ కోసం ఇప్పటికే ట్రేడ్‌మార్క్‌ను కూడా దాఖలు చేసింది.
బజాజ్ కంపెనీ లాంచ్ చేయనున్న సీఎన్‌జీ బైకును ఈ నెల (జూన్ 18) అధికారికంగా పరిచయం చేయనుంది. లాంచ్‌కు సిద్దమవుతున్న ఈ బైక్‌కు 'ఫైటర్' అని నామకరణం చేశారు. బజాజ్ కంపెనీ గత కొంత కాలంగా ఈ సీఎన్‌జీ బైక్ మీద పనిచేస్తోంది. త్వరలో దీనిని అధికారికంగా ఆవిష్కరించడానికి సిద్ధమైంది.
ఇప్పటికే అనేక సార్లు టెస్టింగ్ దశలో కనిపించిన బజాజ్ సీఎన్‌జీ బైక్ హాలోజన్ టర్న్ ఇండికేటర్‌లు, టెలిస్కోపిక్ ఫోర్క్‌లు, సస్పెన్షన్ డ్యూటీల కోసం మోనోషాక్ యూనిట్ వంటి వాటితోపాటు మల్టీ స్పోక్ అల్లాయ్ వీల్స్, సింగిల్ పీస్ సీటు, డిస్క్ & డ్రమ్ బ్రేక్ యూనిట్ పొందనున్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment