![Triumph transfers india sales marketing operations to bajaj auto - Sakshi](/styles/webp/s3/article_images/2023/04/10/bajaj2.jpg.webp?itok=bbMCqQVY)
ప్రముఖ వాహన తయారీ సంస్థ 'బజాజ్ ఆటో' ఇప్పుడు భారతదేశంలో ట్రయంఫ్ మోటార్‌సైకిల్స్‌కి సంబంధించి విక్రయాలు, సర్వీస్ మొదలైన వాటన్నింటిని స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. కంపెనీ కొన్ని సంవత్సరాలకు ముందు ప్రకటించిన వ్యూహాత్మక భాగస్వామ్యంలో ఇది ఒక భాగం.
బజాజ్ ఆటో ఇప్పుడు ట్రయంఫ్ భాగస్వామ్యంతో కొత్త ఎంట్రీ-లెవల్ మిడ్-కెపాసిటీ ట్రయంఫ్ మోడల్‌లను అభివృద్ధి చేయడంలో భాగంగా బజాజ్ తన చకాన్ ఫెసిలిటీలో తయారు చేస్తుంది. ఈ కార్యకలాపాలన్నీ కూడా ప్రస్తుతం సుమీత్ నారంగ్ నేతృత్వంలోని బజాజ్ ప్రోబైకింగ్ కిందికి వస్తాయి.
బజాజ్ కంపెనీ చేసిన ఈ అధికారిక ప్రకటనలో భాగంగా 2023లో మొదటి బజాజ్-ట్రయంఫ్ బైక్ విడుదలకానున్నట్లు సమాచారం. అయితే ఇందులో అది ఏ బైక్ అనేది ఖచ్చితంగా వెల్లడికాలేదు. దీనికి సంబంధించిన వివరాలు రానున్న రోజుల్లో విడుదలవుతాయి.
(ఇదీ చదవండి: చదివింది ఐఐటీ.. చేసేది పశువుల వ్యాపారం.. ఆదాయం ఎంతనుకున్నారు?)
బజాజ్-ట్రయంఫ్ నేతృత్వంలో మరింత సరసమైన ట్రయంఫ్ మోడల్‌లను అందించడానికి, కంపెనీ డీలర్ నెట్‌వర్క్ కూడా రాబోయే 2 సంవత్సరాలలో దాని నెట్‌వర్క్ పెంచడానికి తగిన ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగానే కంపెనీ దేశంలోని 120 నగరాల్లో తన షోరూమ్‌లను ప్రారంభించడానికి ఏర్పాట్లు కూడా చేసుకుంటోంది.
Comments
Please login to add a commentAdd a comment